business news
-
త్వరలో వాహనదారులకు ఊరట కలిగించే పాలసీ
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై అధిక టోల్ ఛార్జీల నుంచి లక్షలాది మంది వాహనదారులకు ఉపశమనం కలిగించే కొత్త టోల్ పాలసీ త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. రెండున్నర లేన్లుగా ఉన్న ఇరుకైన జాతీయ రహదారులపై యూజర్ ఫీజు రద్దు, కార్ల అపరిమిత ప్రయాణానికి రూ .3,000 వార్షిక పాస్.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ చేసిన ఈ రెండు ప్రతిపాదనలు ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి.ఈ ప్రతిపాదనలకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే వీటి వల్ల ఖజానా కొంతమేర నష్టం కలుగనున్న నేపథ్యంలో వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. వార్షిక పాసులవల్ల టోల్ ఆదాయానికి కొంతమేర గండి పడనున్నప్పటికీ, ఇరుకైన రహదారులపై యూజర్ ఫీజు వసూలును నిలిపివేయడం వల్ల మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నారు.ప్రైవేటు వాహనాలకు వార్షిక, జీవితకాల పాస్ ఆప్షన్‌ను అందించే ప్రణాళిక గురించి రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పారు. దీనిపట్ల వాహన యజమానులలో విశేష స్పందన ఉన్న నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ దీనిపై ఎక్కువ దృష్టి పెట్టింది. 2024-25లో మొత్తం టోల్ ఆదాయం రూ.61,000 కోట్లలో ప్రైవేటు కార్ల వాటా 20-21 శాతంగా ఉంది. 79-80% రుసుములో ఎక్కువ భాగం వాణిజ్య , భారీ వాహనాల నుండి వస్తోంది. -
రూ.1,000 కోట్లు టార్గెట్.. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ఉత్పత్తుల సంస్థ ‘మివి’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) రూ.1,000 ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించడం, కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యూహాల అమలు ద్వారా దీన్ని సాధించనున్నట్టు మివి సహ వ్యవస్థాపకులు మిధుల దేవభక్తుని, విశ్వనాథ్ కందుల ప్రకటించారు.ఈ సంస్థ 2024–25లో రూ.300 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 1,500 మందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి ఓ వార్తా సంస్థతో సహ వ్యవస్థాకులు వివరాలు పంచుకున్నారు. ఐవోటీ డివైజ్‌లు, స్మార్ట్ వేరబుల్స్, స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, స్పీకర్లలోని ప్రవేశించనున్నట్టు చెప్పారు. అలాగే, ప్రస్తుత ఆడియో, మొబైల్ యాక్సెసరీల కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. ఇయర్ బడ్స్‌ను విడుదల చేయడం ద్వారా తొలుత ఇయర్ఫోన్లలోకి ప్రవేశించనున్నట్టు మిధుల ప్రకటించారు.ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘మివి ఏఐ’ని కంపెనీ ఇటీవలే ఆవిష్కరించడం గమనార్హం. తన ఉత్పత్తులకు ఏఐ టెక్నాలజీని జోడించడం ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవం ఇచ్చే లక్ష్యంతో ఉంది. ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ సాయంతో తమ ఆదాయాలను రెట్టింపు చేసుకోనున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రజల నుంచి నిధులు (ఐపీవో) సమీకరించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంలో కార్యకలాపాలు...హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న తయారీ కేంద్రం జూన్ నాటికి కార్యకలాపాలు మొదలు పెడుతుందని మివి ప్రమోటర్లు ప్రకటించారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ సదుపాయం ద్వారా విడిభాగాల తయారీపై దృష్టి సారిస్తామని, అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యాలను కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. యూఎస్, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోకి విస్తరించనున్నట్టు చెప్పారు. -
బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
వరుసగా ఐదు రోజులుగా దూసుకెళ్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. దేశంలో బంగారం ధరలు (Gold Prices) నేడు (April 14) కాస్త దిగొచ్చాయి. స్వల్పంగా రూ.150-రూ.160 మేర తగ్గుదల నమోదైంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 87,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 95,510 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున తగ్గాయి.దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.95,660 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,700 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.160, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇది చదివారా? అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,510 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరల్లోనూ మార్పుదేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర కేజీకి రూ.100 క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,09,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 99,900 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
ఏప్రిల్‌లో అడుగుపెట్టామంటే రెండు ఆలోచనలు వస్తాయి. మొదటిది 2025 మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి సిద్ధమవడం. రెండోది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్ను ప్రణాళికలను తయారు చేసుకోవడం. అందరూ కొత్త విధానానికి మొగ్గుచూపుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులు/సేవింగ్స్పరంగా ప్లానింగ్‌కి తక్కువ అవకాశాలున్నాయి. అందుకని 2025 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను వేయడానికి ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకుందాం. 1. మీకున్న అన్ని బ్యాంకుల ఖాతాలకు సంబంధించి స్టేట్మెంట్లు/పాస్బుక్స్లని అప్డేట్ చేయించండి. 2. ప్రతి బ్యాంకు అకౌంట్ సేట్ట్మెంటుని తెచ్చుకొండి. 3. గత ఆర్థిక సంవత్సరం తొలి రోజు (1.4.2024) నుంచి చివరి రోజు (31.3.2025) వరకు బ్యాంకులోని జమలు పరిశీలించండి.పతి జమకు వివరణ రాసుకొండి. అంటే నగదు ద్వారా, చెక్కు ద్వారా, బదిలీ ద్వారా, గూగుల్ ద్వారా వచ్చిందా? మీరే స్వయంగా నగదు డిపాజిట్ చేసారా అని తెలుకొండి. ఆదాయమా.. అప్పు తీసుకున్నారా..? మీకు ఎవరైనా అప్పు చెల్లించారా? డివిడెండా.. వడ్డీనా .. జీతమా.. ఇంటి కిరాయా .. వ్యాపార ఆదాయమా.. షేర్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయమా? క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన ఆదాయమా.. స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమా? పీఎఫ్ విత్‌డ్రా ద్వారా వచ్చినదా.. ఎన్ఎస్సీ లేదా ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ ద్వారా వచ్చినది డిపాజిట్ చేశారా..? అలాగే చిట్‌ఫండ్ పాట ద్వారా వచ్చిందా? మన కుటుంబ సభ్యులు పంపించారా.., మన దేశం నుంచి వచ్చిందా.., విదేశాల నుంచి వచ్చిందా అనే దానిపై కచ్చితమైన అవగాహన ఉండాలి.వీటిలో కొన్నింటిపై పన్ను ఉంటుంది. కొన్ని పన్ను భారానికి గురికావు. కొన్ని ఆదాయ పరిధిలోకి వస్తాయి. కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. ఇవి నిర్ధారించాలంటే మనకు ఎవరిచ్చారో కచ్చితంగా తెలియాలి. ఇచ్చిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. దేని నిమిత్తం వచ్చిందో రాసుకోవాలి. ప్రతిదానికి రుజువులు ఉండాలి. ఇలా అన్ని అకౌంట్లలో అన్ని జమలకు వివరణ ఉండాలి. ఎందుకంటే ఈ వివరణ మీదే మీ పన్ను భారం ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ సైడు ... రెండో కాలమ్.. ఖర్చు కాలమ్. డెబిట్లోని పద్దులు/ఎంట్రీలు .. ఈ వ్యవహారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి ఖర్చులే కదా అని అశ్రద్ధ వహించకండి. ఖర్చులు/డెబిట్లు మీ ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. ఉదాహరణకు ఆదాయానికి మించిన ఖర్చులుంటే వాటికి తగిన ‘మార్గాలు’ లేకపోయినా .. లేదా మీరు ఇవ్వకపోయినా ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. ఖర్చు దేని మీద చేసారు? ఏ నిమిత్తం చేసారు అనేది మీకు డెబిట్. మరో అకౌంట్లో జమ అంటే క్రెడిట్. అది మీకు ఆదాయం కాదంటే, అటువైపు వ్యక్తికి ఆదాయం కావచ్చు/కాకపోవచ్చు. దీన్ని నిరూపించాలి.అంటే ఈ మేరకు మీరు స్వయంగా ‘కన్ఫర్మ్’ చేయాలి. అందుకని డెబిట్‌ను విశ్లేషించండి. కొన్ని చెల్లింపుల్లో ఆదాయపన్ను చట్టప్రకారం మీరే బాధ్యులుగా ఉంటారు. ఉదాహరణకు మీరు జీతం ఇస్తారనుకుందాం... టీడీఎస్ తీసేశారా (కట్ చేశారా).., కమీషన్ ఇస్తే టాక్స్ రికవరీ చేశారా.., షేర్లు కొంటే వాటి మీద డివిడెండ్ ఎంత? ఎవరికైనా అప్పు ఇస్తే వడ్డీ వచ్చిందా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ఆదాయమెంత, ఏవైనా స్థిరాస్తులు కొంటే దాని మీద ఆదాయమెంత? ఈ స్థిరాస్తి కొనేందుకు ఎంత అయ్యింది? ఎలా ఖర్చు పెట్టారు .. సోర్స్ ఏమిటి? ఇలా ప్రతి బ్యాంకు అకౌంటులో జమలు/ఖర్చులు విశ్లేషించాలి. వివరణలు రాసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
అకౌంట్లను వెంటనే ఫ్రీజ్ చేసే అధికారాలు కావాలి
న్యూఢిల్లీ: అక్రమ లావాదేవీలకు వీలు కల్పిస్తున్న మ్యూల్ ఖాతాలను వెంటనే స్తంభింపజేసేందుకు (ఫ్రీజ్) బ్యాంక్ సిబ్బందికి అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ ఆర్బీఐకి ఈ మేరకు ప్రతిపాదన చేయనున్నట్టు తెలిపింది. సైబర్ నేరస్థులు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే నిధులు తరలిస్తుంటారన్నది గమనార్హం.కొంత కమీషన్ ముట్టచెప్పి వేరే వారి ఖాతాలను లావాదేవీలకు వినియోగించుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఖాతాదారుల ప్రమేయం లేకుండా కూడా వారి ఖాతాలను వినియోగిస్తుంటారు. అంతర్గత వ్యవస్థలు ఈ తరహా లావాదేవీల గురించి హెచ్చరించిన వెంటనే ఖాతాలను నిలిపివేసే అధికారం ఇవ్వాలని కోరనున్నట్టు వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ప్రస్తుతం ఏదైనా ఖాతాను ఫ్రీజ్ చేయాలంటే కోర్టు లేదా దర్యాప్తు సంస్థల ఆదేశాలతోనే బ్యాంక్ సిబ్బంది చేయగలరు.మరోవైపు అక్రమ లావాదేవీలకు అవకాశం ఉన్న ఖాతాలను గుర్తించేందుకు బ్యాంక్‌లు సైతం తనిఖీ చేయాలన్నది మరో ప్రతిపాదన. ఓటరు గుర్తింపు కార్డుతో ఖాతాలు తెరిచిన వారి గుర్తింపు ధ్రువీకరించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం డేటాబేస్‌ను తనిఖీ చేసే అవకాశం బ్యాంక్ సిబ్బందికి కల్పించాలని కోరనున్నట్టు వర్కింగ్ గ్రూప్ తెలిపింది. -
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం! -
అప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పడుతుంది?
మ్యూచువల్ ఫండ్స్‌లో నా పెట్టుబడులను విక్రయించేందుకు గత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన 2025 మార్చి 31న ఆర్డర్ పెట్టాను. నాకు చెల్లింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో వచ్చాయి. ఇక్కడ ఆర్థిక సంవత్సరం మారిపోయింది. అప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో నా మూలధన లాభాలను పరిగణనలోకి తీసుకుంటారు? – చరణ్దాస్ఇన్వెస్టర్లలో ఆర్థిక సంవత్సరం చివర్లో సాధారణంగా కనిపించే అయోమయమే ఇది. పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన తేదీ ఆధారంగానే మూలధన లాభాలపై పన్నును పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకానీ, మీరు విక్రయ అభ్యర్థన ఎప్పుడు పెట్టారన్నది కాదు. సెబీ నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉపసంహరణకు కటాఫ్ టైమ్ పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటలు.మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థన సమర్పించినట్టయితే అదే రోజు నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) ఆధారంగా ఆ లావాదేవీ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమర్పించినట్టయితే తర్వాతి పనిదినం రోజు ఎన్ఏవీ ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. మీరు 2025 మార్చి 31న సెల్ ఆర్డర్ పెట్టారు. ఆ రోజు మార్కెట్లకు సెలవు. కనుక మీ అభ్యర్థనను ఏప్రిల్ 1న ప్రాసెస్ చేయనున్నారు. కనుక పెట్టుబడుల విక్రయంపై వచ్చిన లాభాన్ని 2025–26 ఆర్థిక సంవత్సరం మూలధన లాభాలు కింద పరిగణనలోకి తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసత్వంగా వచ్చినప్పుడు వాటిపై పన్ను ఎలా అమలవుతుంది? మూలధన లాభాల లెక్కింపునకు వాటి అసలు కొనుగోలు తేదీని పరిగణనలోకి తీసుకుంటారా లేక వారసులకు బదిలీ అయిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారా? – జె.తిరుమలరావు అసలు పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసులకు బదిలీ అయితే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడులు మరొకరి పేరిట బదిలీ అయ్యాయే కానీ, విక్రయించలేదు. ఇక మూలధన లాభాలపై పన్ను లెక్కింపునకు మొదట పెట్టుబడి పెట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. బదిలీ అయిన రోజును కాదు. ఈక్విటీ ఫండ్స్: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై (ఏడాదికి మించిన పెట్టుబడులు) పన్ను లేదు. అంతకుమించిన మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. అదే స్వల్పకాల మూలధన లాభాలపై (ఏడాదిలోపు విక్రయించినవి) 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డెట్ ఫండ్స్: 2023 ఏప్రిల్ 1 తర్వాత పెట్టుబడి పెట్టి.. విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ లేదా వారి వారసుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ అసలు పెట్టుబడిని 2023 ఏప్రిల్ 1లోపు చేసి.. వాటిని రెండేళ్లలోపు విక్రయిస్తే లాభం మొత్తం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై నికరంగా 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఉదాహరణకు 2019 జనవరి 1న ఈక్విటీ ఫండ్స్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. 2024 జనవరిలో ఇన్వెస్టర్ కాలం చేశారు. ఈ పెట్టుబడులను వారి వారసులు 2025 మార్చిలో రూ.12 లక్షలకు విక్రయించారు. ఏడాదికి మించిన పెట్టుబడి కనుక దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. అసలు పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయించగా నికర లాభం రూ.7 లక్షలు అవుతుంది. ఇందులో రూ.1.25 లక్షలపై పన్ను లేదు. రూ.5.75 లక్షలపై 12.5 శాతం ప్రకారం రూ.71,875 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్
చెన్నై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటు పావుశాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులూ ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) రెపో ఆధారిత రుణాలపై వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించినట్లు ప్రకటించింది.ఈ ఏప్రిల్ 12 (శనివారం) నుంచి రెపో ఆధారిత రుణాలపై రేటును 9.10% నుంచి 8.85 శాతానికి కుదించినట్లు బ్యాంకు తెలిపింది. ప్రతీకార సుంకాల్లో భాగంగా ట్రంప్ భారత్‌పై 26% టారిఫ్ వడ్డనతో తలెత్తిన ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో వృద్ధికి దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ రెపో రేటును 6.25% నుంచి 6 శాతానికి తగ్గించింది. -
మహిళలకు ప్రత్యేక బీమా పాలసీలు
మహిళ ఆరోగ్యం ఒక కుటుంబానికి ఎంతో అవసరం. ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సాఫీగా ముందుకునడుస్తుంది. అయితే మహిళల ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులు, గైనకాలజీ సమస్యలు, రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలు వంటి ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ఆరోగ్య బీమా ఒక కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.అందుకే దేశంలోని అనేక బీమా ప్రొవైడర్లు ఇప్పుడు ఈ అవసరాలను తీర్చే మహిళల కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఉమెన్ స్పెసిఫిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, అవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ ప్లాన్క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కూడా కవరేజీ లభించేలా మహిళల కోసం బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు ’బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ) ప్లాన్’. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ స్మార్ట్ ఉమెన్ ప్లాన్ » గర్భధారణ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుంది.» క్లిష్టమైన అనారోగ్యాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.టాటా-ఏఐజీ వెల్సూరెన్స్ ఉమెన్ పాలసీ» హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది.» క్యాన్సర్, స్ట్రోక్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేస్తుందిస్టార్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి, వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ నవ వధూవరుల కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీ ఇది.రెలిగేర్ జాయ్ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి ప్రయోజనాలు, నవజాత శిశువుల సంరక్షణపై దృష్టి పెడుతుందిన్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ» మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాన్ వారికి పూర్తి ఆరోగ్య కవరేజీని కల్పిస్తుంది.రిలయన్స్ హెల్త్ పాలసీ» అదనపు వెల్ నెస్ లక్షణాలతో సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.సరైన ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?ఉత్తమ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.కవరేజ్: పాలసీలో మీకు సంబంధించిన ప్రసూతి, క్రిటికల్ ఇల్ నెస్ కవర్ అయ్యేలా చూసుకోండి.ప్రీమియం ఖర్చు: ఖర్చు, ప్రయోజనాల ఆధారంగా విభిన్న ప్లాన్లను పోల్చి చూడండి.వెయిటింగ్ పీరియడ్: ప్రసూతి కవరేజీ, ముందుగా ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయండి.అదనపు ప్రయోజనాలు: వెల్నెస్ కార్యక్రమాలు, నివారణ సంరక్షణ, ఆసుపత్రిలో చేరిక ప్రయోజనాల కోసం చూడండి. -
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
ప్రతిఒక్కరి జీవితంలో 40వ దశకం చాలా కీలకమైంది. ఉద్యోగాలు చేస్తున్నవారికైతే అదో ముఖ్యమైన దశ. 40 ఏళ్లు దాటాయంటే ఉద్యోగాల్లో అప్పటికే ఎంతో అనుభవం సంపాదించి ఉంటారు. అధిక జీతభత్యాలు, పదోన్నతులు అందుకునే అత్యంత కీలకమైన దశ అది. అయితే లేఆఫ్స్ విస్తృతమైన నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారు.ఈ ధోరణిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్‌పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. శంతను దేశ్ పాండే వ్యాఖ్యలకు ఆన్లైన్లో మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. చాలా మంది తమ వ్యక్తిగత దృక్పథాలను పంచుకున్నారు. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు మార్జిన్లు అంతంతే..
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ సంస్థలకు 2024–25 సంవత్సరం మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. ఆదాయం సగటున 5 శాతం వృద్ధి చెందినట్టు కంపెనీలు తెలిపాయి. అదే సమయంలో మార్జిన్లలో ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గానే ఉండడం గమనార్హం. గోద్రేజ్ కన్జ్యూమర్, ఇమామీ మినహా మిగిలిన కంపెనీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఆదాయం అంచనాలను బీఎన్పీ పారిబా తగ్గించింది.ముడి చమురు ధరలు తగ్గడం, గ్రామీణ వృద్ధి కోలుకోవడం వంటి సానుకూలతలతో 2025–26లో సానుకూల బేస్ ఏర్పడుతుందని పేర్కొంది. 2024–25 క్యూ4లో (మార్చి త్రైమాసికం) అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నట్టు బీఎన్పీ పారిబా నివేదిక వెల్లడించింది. ఇది కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. పామాయిల్, టీ ధరలు మాత్రం తగ్గినట్టు తెలిపింది. స్టాపుల్స్ (నిత్యావసరాలు) విక్రయాలకు క్యూ4 బలహీన క్వార్టర్‌గా ఉంటుందని పేర్కొంది.10 ఎఫ్ఎంసీజీ కంపెనీలకు గాను 9 కంపెనీల స్థూల మార్జిన్లు బలహీనంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అగ్రి ముడి పదార్థాల ధరల ఒత్తిళ్లు వీ టిపై ఉన్నట్టు వివరించింది. టైటాన్, జుబిలెంట్ ఫు డ్స్ వంటి విచక్షణా రహిత వినియోగ ఆధారిత కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొంది. 1–8 శాతం మద్య వృద్ధి.. ‘‘2025–26 ఆర్థిక సంత్సరంలో మేము అధ్యయనానికి పరిగణనలోకి తీసుకున్న 10 కంపెనీలకు గాను 8 కంపెనీలకు ఆదాయం వృద్ధి 1–8 శాతం మధ్యే ఉంటుంది. గోద్రేజ్ కన్జ్యూమర్, ఇమామీ కంపెనీలకు వృద్ధి కాస్త మెరుగ్గా ఉండొచ్చు’’అని బీఎన్పీ పారిబా నివేదిక తెలిపింది. ఈ సంస్థ పరిగణనలోకి తీసుకున్న మిగిలిన కంపెనీల్లో హెచ్‌యూఎల్, బ్రిటానియా, డాబర్, ఐటీసీ, మారికో, నెస్లే ఇండియా, జుబిలెంట్ ఫుడ్స్, టైటాన్ ఉన్నాయి. -
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నెలవారీ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ వర్తింపునకు సంబంధించి అపార్ట్మెంట్ యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)ల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది.జీఎస్టీ విధింపుపై అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లలోని నివాసితుల్లో నెలకొన్న అయోమయంపై వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్డబ్ల్యూఏ మొత్తం టర్నోవర్ రూ.20 లక్షలు దాటకుండా అదే సమయంలో ఒక్కో సభ్యుడి మెయింటెనెన్స్ ఛార్జీల మొత్తం నెలకు రూ.7,500 దాటినా కూడా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇలా అయితేనే జీఎస్టీరెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలోని ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మెయింటెన్స్ రూ.7,500 కంటే ఎక్కువ ఉండి ఆ అసోసియేషన్ వసూలు చేసే మెయింటెన్స్ మొత్తం కూడా సంవత్సరానికి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆర్డబ్ల్యూఏ తన సభ్యుల నుండి వసూలు చేసే నెలవారీ సబ్స్క్రిప్షన్ లేదా కంట్రిబ్యూషన్‌పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇక హౌసింగ్ సొసైటీ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు కలిగి ఉన్నవారికి తమ ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు నెలకు రూ.7,500 చొప్పున పరిమితిని వేర్వేరుగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే ఒక్కో సభ్యుడికి నెలకు రూ.7,500 దాటితే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక్కో సభ్యుడికి నెలకు రూ.9,000 అయితే రూ.1,500 వ్యత్యాసంపై కాకుండా మొత్తం రూ.9,000పై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.ఆర్డబ్ల్యూఏలు, హౌసింగ్ సొసైటీలకు ప్రయోజనం చేకూర్చడానికి 2018 జనవరి 18న జీఎస్టీ కౌన్సిల్ తన 25వ సమావేశంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ .5,000 నుండి రూ .7,500 కు పెంచింది. -
అదానీ గ్రూప్‌లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చేపట్టిన బాండ్ల జారీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రూప్ 75 కోట్ల డాలర్ల(రూ. 6,500 కోట్లు) విలువైన బాండ్ల జారీని చేపట్టగా.. 25 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,165 కోట్లు)తో సబ్స్క్రయిబ్ చేసినట్లు తెలుస్తోంది.సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 3–5ఏళ్ల కాలపరిమితితో అదానీ గ్రూప్ ఈ బాండ్లు విడుదల చేసింది. కాగా.. గతేడాది నవంబర్‌లో లంచం ఆఫర్ చేసిన కేసు నమోదుకావడంతో అదానీ గ్రూప్‌పై యూఎస్ న్యాయశాఖ పరిశోధనకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ బాండ్లలో బ్లాక్‌రాక్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
జాగ్వార్ ల్యాండ్ రోవర్ రికార్డ్ సేల్స్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. 6,183 యూనిట్లను విక్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం. హోల్‌సేల్ విక్రయాలు 39 శాతం పెరిగి 6,266 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో డిఫెండర్ అమ్మకాలు అత్యధికంగా 90 శాతం, దేశీయంగా తయారు చేసిన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ విక్రయాలు వరుసగా 72 శాతం, 42 శాతం మేర పెరిగాయి. రిటైల్, హోల్‌సేల్ అమ్మకాల్లో పరిశ్రమను మించిన పనితీరును కనపర్చినట్లు జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ దీన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. -
నేపాల్‌కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో ఇన్స్టంట్ ఫుడ్ సెక్షన్లో ప్రసిద్ధ వాయ్ వాయ్ నూడుల్స్ (Wai Wai noodles) ప్యాక్‌లను చూస్తుంటాం. అయితే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నూడుల్స్ వెనుక ఎవరున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే బినోద్ కుమార్ చౌదరి (Binod Kumar Chaudhary). నేపాల్‌కు చెందిన ఈయన "నూడుల్స్ కింగ్" గా ప్రసిద్ధి చెందారు. బినోద్ కుమార్ చౌదరి ఎవరు.. భారత్‌తో ఆయనకున్న సంబంధం ఏంటి.. ఆసక్తికరమైన ఈ బిజినెస్‌మ్యాన్ కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.రాజస్థాన్ నుంచి నేపాల్‌కు..70వ ఏట అడుగుపెడుతున్న బినోద్ కుమార్ చౌదరి 1955 ఏప్రిల్ 14న నేపాల్ రాజధాని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన తాత భూరమల్ దాస్ చౌదరి భారత్‌లోని రాజస్థాన్ నుండి నేపాల్ కు వలస వచ్చి వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. బినోద్ కుమార్ చౌదరి తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి ఆ వ్యాపారాన్ని దేశంలో మొట్టమొదటి డిపార్ట్మెంటల్ స్టోర్‌గా విస్తరించారు. బినోద్ కుమార్ చౌదరికి సారిక చౌదరితో వివాహం కాగా వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు కూడా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.వ్యాపారాలుడజన్ల కొద్దీ దేశాల్లో 160కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బహుళజాతి సంస్థ చౌదరి గ్రూప్ (సీజీ కార్ప్ గ్లోబల్)కు చౌదరి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ పేరుతో 120కి పైగా బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ గ్రూప్‌నకు చెందిన వాయ్ వాయ్ బ్రాండ్ నూడుల్స్ నేపాల్, భారత్‌లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతవుతున్నాయి. బినోద్ కుమార్ చౌదరికి రియల్ ఎస్టేట్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, టెలికాం, బయోటెక్నాలజీ రంగాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి.రాజకీయాలు, దాతృత్వంబినోద్ కుమార్ చౌదరి నేపాలీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన దాతృత్వ కార్యక్రమాలు కూడా చురుగ్గా నిర్వహిస్తుంటారు. 1995లో చౌదరి ఫౌండేషన్‌ను స్థాపించిన ఆయన 2015లో నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు 10,000 ఇళ్లు, 100 పాఠశాలల పునర్నిర్మాణానికి రూ.20 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. లక్షలాది ఆహార పొట్లాలు, ఇతర సామగ్రిని అందించారు.ఏకైక నేపాలీ బిలియనీర్పలు నివేదికల ప్రకారం.. బినోద్ కుమార్ చౌదరి నెట్‌వర్త్ 2 బిలియన్ డాలర్లు (రూ .17,200 కోట్లకు పైగా). నేపాల్‌లో మొదటి, ఏకైక బిలియర్ ఈయనే కావడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బినోద్ కుమార్ చౌదరి కఠినమైన శాఖాహారి. దీంతో ఆయన ప్రసిద్ధి చెందిన తమ వాయ్ వాయ్ బ్రాండ్ చికెన్ నూడుల్స్ ఎప్పుడూ రుచి చూడలేదు. -
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున మొత్తం 3 షోరూమ్‌లను ప్రారంభించింది. వీటిలో సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి. ఒక్కో కొత్త షోరూమ్‌లో రోర్ ఈజెడ్ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 30 కస్టమర్లకు కాంప్లిమెంటరీగా బంగారు నాణెం అందిస్తున్నట్లు సీఈవో మధుమిత అగ్రవాల్ తెలిపారు.రోర్ ఈజెడ్ వాహనం ధర రూ. 89,999గా ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజి ఇస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 50 నగరాల్లో 100 పైచిలుకు షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 35 షోరూమ్‌లు ఉన్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 15 కొత్త షోరూమ్‌లను ప్రారంభించగా పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా అడుగు పెట్టింది. దీనితో పాటు ఇప్పటికే ఉన్న మార్కెట్లలో తన పరిధిని బలోపేతం చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర ప్రదేశ్లలో కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది. -
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో 7.30% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చే వివిధ ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితులపై బ్యాంక్ వడ్డీ రేట్లను విస్తృతంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.సవరించిన రేట్ల ప్రకారం 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లకు 4.25 శాతం, 180 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఏడాది మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 7.05 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందిస్తుంది.రూ .3 కోట్ల నుండి రూ .10 కోట్ల లోపు డిపాజిట్లకు సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.75%, 180 నుండి 210 రోజులకు 6.25%, 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితికి 6.50%. ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 7.05 శాతంగా, ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.70 శాతంగా ఉంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధితో రూ .3 కోట్ల లోపు డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది.మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అందించే వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలను ప్రకటనలో వెల్లడించలేదు. అయితే ఫిక్స్డ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ కోరుకునే కస్టమర్లకు బ్యాంక్ ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తూనే ఉంది. దేశంలోని రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అధిక వడ్డీ పథకాలను ఉపసంహరించుకోవడం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ మార్గదర్శకాలకు ప్రతిస్పందనగా వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది -
ఇలాంటి ఇళ్లకే డిమాండ్..
కరోనా, లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం అనివార్యమైంది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీపడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్ అండ్ ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపరీ్టలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఓ సంస్థ ఎండీ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్‌ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు గట్టిదెబ్బ.. రూ.కోటికి పైగా జరిమానా..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆన్లైన్ బీమా పంపిణీకి సంబంధించిన ఈ-కామర్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్ఐపీఎల్)కు ఐఆర్డీఏఐ రూ.1.06 కోట్ల జరిమానా విధించింది.ఫ్లిప్‌కార్ట్ పాల్పడిన ఉల్లంఘనలు ఇవే.. ఫ్లిప్‌కార్ట్ పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. పాలసీ కొనుగోలుదారులను నేరుగా బీమా కంపెనీకి కాకుండా బీమా మధ్యవర్తికి మళ్లించడం ద్వారా ఐఆర్డీఏఐ మార్గదర్శకాలను ఉల్లంఘించింది. గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీమా పాలసీలను విక్రయించడం వల్ల అదనపు జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. తగినంత నైపుణ్యం లేకపోవడం అంటే కేవలం ఒకేఒక శిక్షణ పొందిన బీమా నిపుణుడితో 70,000 కంటే ఎక్కువ బీమా పాలసీలను విక్రయించింది. ఇది వినియోగదారుల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది.పాలసీదారులపై ప్రభావంరెగ్యులేటరీ చర్య పాలసీ చెల్లుబాటు, క్లెయిమ్ సెటిల్మెంట్లు, కస్టమర్ మద్దతుపై ఆందోళనలను లేవనెత్తుతుంది. తప్పుడు అమ్మకం ప్రమాదాల కారణంగా కొనుగోలుదారులు పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో అడ్డంకులను ఎదుర్కొంటారు. అయితే రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత జారీ చేసిన పాలసీలు చట్టపరమైన అనిశ్చితులను ఎదుర్కోవచ్చు. అదనంగా, శిక్షణ పొందిన సిబ్బంది పరిమిత లభ్యత పాలసీదారు సహాయం, వివాద పరిష్కారాన్ని ప్రభావితం చేస్తుంది.కఠినంగా బీమా అమ్మకాలుజరిమానాను అంగీకరించిన ఫ్లిప్‌కార్ట్, పరిశ్రమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూ ఐఆర్డీఏఐ ఉత్తర్వులను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఈ చర్య ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బీమా అమ్మకాలను కఠినంగా అమలు చేయడానికి సంకేతం. పాలసీ కొనుగోలుదారులు ఆన్లైన్లో బీమా కొనుగోలు చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ వివరాలను ధృవీకరించడం, పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవడం, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ నుండి మార్గదర్శకత్వం పొందడం మంచిది. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత ఇంటి స్వరూపం మారిపోయింది. ఇంటిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది. రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్‌గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్‌గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.ఇంట్లో మనం లేకపోయినా ఎవరైనా అతిథులొస్తే ఫోన్లో నుంచే గుమ్మం తెరిచి స్వాగతం పలకొచ్చు. గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్, ఆఫ్ అవుతుండటం వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లోని హైఎండ్ ప్రాజెక్ట్‌లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్‌లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది. -
సూపర్ సేవర్ ప్యాక్.. 98 రోజుల కొత్త రీచార్జ్ ప్లాన్
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రీఛార్జ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాస్త పొదుపైన, 98 రోజుల సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతోపాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.జియో రూ.999 ప్లాన్జియో ప్రస్తుతం తన రూ .999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందింవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ 90 రోజులపాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను, సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు. అలాగే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.జియో రూ.1,049 ప్లాన్రూ .999 ప్లాన్‌తో పాటు, దీనికి దగ్గర ఉండే రూ .1,049 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీంతో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వినియోగదారులు 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా పొందుతారు. ఇది కమ్యూనికేషన్‌తో పాటు స్టోరేజ్ అవసరాలకు అనువుగా ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం (డిస్నీ + హాట్‌స్టార్) కు 90 రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలైవ్ యాక్సెస్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. -
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ప్రీమియం ఫోన్లలో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫోన్‌ను ఉపయోగించాలని చాలా మందికి ఉంటుంది. అయితే దాని అధిక ధర కారణంగా ఐఫోన్‌ను కొనడం అందరికీ వీలుకాదు. కానీ ఇప్పుడు అతి తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.2023లో విడుదలైనప్పటి నుండి యాపిల్ ఐఫోన్ 15.. వివిధ అమెజాన్ డీల్స్ స్థిరంగా లిస్ట్ అవుతూ వస్తోంది. సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్లు పెద్దగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించనప్పటికీ, ఇప్పటికీ ఆ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఈ సారి డీల్ విలువైన అవకాశాన్ని అందిస్తోంది.ఐఫోన్ 15 అమెజాన్ డీల్రాబోయే ఐఫోన్ 16 సిరీస్‌తో అమెజాన్ ఇప్పుడు ఐఫోన్ 15పై గణనీయమైన ధర తగ్గింపును ప్రవేశపెట్టింది. ఇది గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా ఉంది. యాపిల్ ఐఫోన్ 15 (128 జీబీ, బ్లాక్) ప్రస్తుతం అమెజాన్‌లో రూ .79,900 ప్రారంభ ధర, దానిపై 23 శాతం డిస్కౌంట్‌తో రూ.61,400 ధరకు లిస్ట్ అయింది. ఇంకా ఎక్కువ పొదుపు చేయాలనుకునేవారు అమెజాన్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.ఉదాహరణకు, ఉపయోగించిన పాత ఐఫోన్ 14 ప్లస్ (512 జీబీ) ను మంచి స్థితిలో ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ .29,500 తగ్గింపు లభిస్తుంది. ఇలా ఐఫోన్ 15 నికర ధర రూ .31,000 కు తగ్గుతుంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ .3,070 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇది తుది ధరను కేవలం రూ .28,830 కు తగ్గిస్తుంది.ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లుఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. యాపిల్ మునుపటి మోడళ్ల డిజైన్ ఉన్నప్పటికీ సాంప్రదాయ నాచ్ కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్ ను ప్రవేశపెట్టింది. ఇది ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో మంచి ఆదరణ పొందింది.ఈ మోడల్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. ఇది పగటిపూట, తక్కువ-కాంతి, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి మెరుగ్గా ఉంటుంది.ఐఫోన్ 15 "ఆల్ డే బ్యాటరీ లైఫ్" కలిగి ఉందని యాపిల్ పేర్కొంది. అయితే వాస్తవ వినియోగంలో ఇది సగటు వినియోగంతో 9 గంటలకు పైగా ఉంటుందని సూచిస్తుంది. ఇందులో యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది.ఇది యాపిల్ ఎ16 బయోనిక్ చిప్ తో పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లలో ఉపయోగించిన ఎ15 చిప్ నుండి అప్ గ్రేడ్ యఅయింది. -
గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌లో (Google) లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగం నుంచి తాజాగా వందలాది మంది ఉద్యోగులను తొలగించిందని ( layoff )ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లో పనిచేసే ఉద్యోగులు ఇందులో ఉన్నారని ‘ది ఇన్ఫర్మేషన్’ అనే వార్తా నివేదిక పేర్కొంది. అయితే ఎంత మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారన్న వివరాలు వెల్లడి కాలేదు.తొలగింపు వెనుక కారణం..కార్యకలాపాలను క్రమబద్ధీకరణ, సామర్థ్య పెంపు కోసం గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది గూగుల్ తన ఆండ్రాయిడ్, క్రోమ్ టీమ్‌లను పిక్సెల్ అండ్ డివైజెస్ గ్రూప్ కింద విలీనం చేయడంతో ప్రారంభమైన సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. జనవరిలో కంపెనీ స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ తాజా ఉద్యోగ కోతలు ఆ చొరవకు కొనసాగింపు అని సూచిస్తున్నాయి.గూగుల్ ప్రకారం.. చురుకుదనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడమే పునర్నిర్మాణం లక్ష్యం. ఇది కంపెనీ తన ప్రధాన ఉత్పత్తులు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. వందలాది ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ చర్య వ్యయ తగ్గింపు, వనరుల ఆప్టిమైజ్ కోసం మొత్తం టెక్ పరిశ్రమ అవలంభిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తోంది.ఇన్నోవేషన్ పై ప్రభావంపునర్ వ్యవస్థీకరణకు గూగుల్ తీసుకున్న నిర్ణయం ఉత్పత్తుల అభివృద్ధి, ఆవిష్కరణలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. కీలక బృందాల్లో తక్కువ మంది ఉద్యోగులతో, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పురోగతిలో గూగుల్ ఎలా ముందుకు వెళ్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియామకాలు జరుగుతున్నాయని, ఇన్నోవేషన్ పై పూర్తిగా వెనక్కి తగ్గకుండా వనరులను పునర్వినియోగం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.టెక్ పరిశ్రమలో తొలగింపులుఉద్యోగాల కోత, పునర్నిర్మాణ చర్యలను అమలు చేస్తోన్న టెక్ కంపెనీ గూగుల్ ఒక్కటే కాదు. ఆర్థిక అనిశ్చితి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వరకు కారణాలను చూపుతూ అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా పలు బడా టెక్ కంపెనీలు గత ఏడాది ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. -
హైదరాబాద్‌లో క్విక్ కామర్స్ హవా
కిరాణా సరుకులు కావాలా? 10 నిమిషాల వ్యవధిలోనే ఇంటి వద్దకే వచ్చేస్తాయి! సొంత మొబైల్లోని క్విక్ కామర్స్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన తరువాత నిమిషాలలోపే ఇంటికి అవసరమైన బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు వంటి కిరాణా సరుకులన్నీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్ ఈ కామర్స్ యాప్స్ ద్వారా క్విక్ కామర్స్ (త్వరిత వాణిజ్యం) దేశంలో ప్రస్తుతం 31.33 శాతం వార్షిక వృద్ధిరేటుతో వేగంగా విస్తరిస్తోంది. కాగా 2025–2030 మధ్య సంవత్సరానికి 44.9 శాతం వృద్ధి రేటుతో ఈ రంగం దూసుకుపోనుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో టెక్ జనం ఎక్కువ కావడంతో తెలంగాణలో క్విక్ కామర్స్ (Quick Commerce) మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బిగ్‌బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్, డంజో లాంటి సంస్థలు రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు మరిన్ని నగరాల్లో వినియోగదారుల ఇళ్లకే గ్రోసరీని తీసుకెళ్తూ ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వేర్‌హౌజ్ ఏర్పాటు చేసుకొని ఈ–కామర్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ సంస్థ ‘అమెజాన్ తేజ్’ పేరుతో క్విక్ కామర్స్ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ‘జెప్టో’ సంస్థ అత్యధిక వృద్ధిరేటుతో హైదరాబాద్ మార్కెట్‌ను ఆక్రమించుకుంటోంది. కాగా ‘అమెజాన్ తేజ్’ రంగంలోకి దిగితే పరిస్థితి ఆ సంస్థకు అనుకూలంగా మారుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కాగా రాష్ట్రంలో హైదరాబాద్‌లో మొదలైన క్విక్ కామర్స్ జోరు వరంగల్, కరీంనగర్ (Karimnagar) వంటి నగరాలకు కూడా విస్తరిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ఎక్కడికక్కడ గోడౌన్లతో...క్విక్ కామర్స్ అంటే కిరాణా సరుకులు, చిరుతిండ్లు, ఇంటి సామగ్రి కొన్ని నిమి షాల్లోనే వినియోగదారుని ఇంటికి చేర్చడ మే. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున గోడౌన్లు ఏర్పాటు చేసుకొని బిగ్‌బాస్కెట్ (బీబీ నౌ), అమెజాన్ (తేజ్), జెప్టో, స్విగ్గీ (ఇన్‌స్టా మార్ట్), బ్లింకిట్, డంజో మొదలైన సంస్థలు క్విక్ కామర్స్ రంగంలో పనిచేస్తున్నాయి. బిగ్ బాస్కెట్ సంస్థకు హైదరాబాద్‌లో దాదాపు 400 వరకు చిన్న గిడ్డంగులు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే 24 గంటల్లో సేవలు అందించేలా ఈ కామర్స్ (e Commerce) వ్యాపారంలో దూసుకుపోతుండగా, కొత్తగా హైదరాబాద్ కేంద్రంగా ‘తేజ్’ సేవలను ప్రారంభించ నుంది. తద్వారా కిరాణా, చిన్నస్థాయి విద్యుత్ సామగ్రి, పండ్లు వంటి వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. జెప్టో సంస్థ కిరాణా, చిరుతిండ్లు, సౌందర్య సామగ్రితో పాటు గృహావసరాలకు అవసరమైన అన్నింటినీ 10 నిమిషాల్లో సరఫరా చేసే హామీతో దూసుకుపోతుంది.గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్ (Banjara hills) మొదలుకొని హైదరాబాద్ లోని అడ్డగుట్ట, పాతబస్తీ వంటి వందలాది ప్రాంతాల్లో గ్రోసరీ గోడౌన్లను ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తుంది. ఇక హోటళ్ల నుంచి ఆహారాన్ని వినియోగదారులకు అందించే సేవల్లో ఉన్న స్విగ్గీ కూడా క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ పేరుతో కిరాణా, ఇంటి సామగ్రితో పాటు మెడికల్స్‌ను కూడా 15 నుంచి 20 నిమిషాల్లో సరఫరా చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్లోనూ ఈ సంస్థ విస్తరించడం గమనార్హం. గ్రోఫర్స్ పేరుతో దశాబ్దం క్రితం ప్రారంభమై పేరు మార్చుకొని ‘బ్లింకిట్’గా సేవలందిస్తున్న మరో సంస్థ కూడా హైదరాబాద్‌లో జొమాటో సహకారంతో పెద్దఎత్తున గోడౌన్లను ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు సేవలు అందిస్తోంది. డంజో అనే మరో సంస్థ కూడా క్విక్ కామర్స్ రంగంలో హైదరాబాద్‌లో సేవలు అందిస్తోంది.హైదరాబాద్‌లో క్విక్ కామర్స్ వాటా 10 శాతం 2024 చివరి నాటికి భారతదేశంలో క్విక్ కామర్స్ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. ఇది 2025 చివరి నాటి కి 6–7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో రిటైల్ మార్కెట్ (Retail Market) సుమారు రూ. 20,000 –25,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తే, క్విక్ కామర్స్ వాటా దాదాపు 8 నుంచి 10 శాతం ఉంటుంది. అంటే రూ. 8,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ వాటా యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కామర్స్ సంస్థలకు వచ్చే ఆర్డర్లు ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర వరకు ఉండొచ్చని అంచనా. వీటి విలువ రూ. 5 కోట్లకు పైనే ఉండొచ్చు. కాగా ఈ క్విక్ కామర్స్ మార్కెట్లో కూడా బిగ్ బాస్కెట్ (Big Basket) సంస్థ ప్రధాన వాటాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ఇవే30 నుంచి 40 శాతం వాటా ఈ సంస్థకే ఉండగా, ఇప్పుడు జెప్టో, బ్లింకిట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. జెప్టో 5 నుంచి 10 నిమిషాల్లో నిత్యా వసర వస్తువులు, కూరగాయలు, పండ్లతో పాటు వినియోగదారుడు కోరిన వస్తువులన్నింటినీ అందిస్తూ ఇప్పటికే 20 శాతం వాటాను సొంతం చేసుకొని మరింత వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులకు ఆఫర్లతో ఈ సంస్థ హైదరాబాద్‌లో క్విక్ కామర్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది. అమెజాన్ (Amazon) సంస్థ ‘తేజ్’ ద్వారా క్విక్ కామర్స్ రంగంలో 20 శాతం వా టాను సొంతం చేసుకునే అవకాశం ఉంది. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, బ్లింకిట్, డంజో వంటి సంస్థల వాటా మరో 20 శాతం వరకు ఉంటుంది.భవిష్యత్తులో చిన్న నగరాలకు విస్తరణతెలంగాణలో క్విక్ కామర్స్ రంగం మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి నగరాలతో పాటు హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న కొన్ని పట్టణాలకు కూడా ఈ సేవలు అందనున్నాయి. అమెజాన్ ‘తేజ్’ రాకతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. వేగం, నాణ్యత, తక్కువ ధరలు ఇచ్చే సంస్థలే ఈ రంగంలో పైచేయి సాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చేవారంలో మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. వారాంతపు సెలవులు పోనూ సాధారణంగా వారంలో ఐదు రోజులపాటు స్టాక్ మార్కెట్లు తెరచి ఉంటాయి. కానీ వచ్చే వారంలో (ఏప్రిల్ 14 నుంచి) విశిష్ట దినోత్సవాలు, పండుగల కారణంగా రెండు రోజులు అదనపు సెలవులు వచ్చాయి. దీంతో డెరివేటివ్స్, ఈక్విటీలు, ఎస్ఎల్బీలు, కరెన్సీ డెరివేటివ్స్, వడ్డీరేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ప్రముఖ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ మార్కెట్ సెలవులను ముందుగానే నోటిఫై చేసి ఏటా ప్రచురిస్తాయి. 2025 ఏప్రిల్ నెలలో మొత్తం మూడు స్టాక్ మార్కెట్ సెలవులను ఎక్స్ఛేంజీలు నోటిఫై చేశాయి. మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 10వ తేదీన ఇదివరకే స్టాక్‌మార్కెట్లు సెలవు దినంగా పాటించాయి. ఇక ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, ఏప్రిల్ 14న గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.శని, ఆదివారాలు, ఎక్స్ఛేంజీలు ముందుగానే ప్రకటించిన సెలవులు మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈక్విటీల విభాగంలో ట్రేడింగ్ జరుగుతుంది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే.. ఏప్రిల్ 18న (గుడ్ ఫ్రైడే) రెండు సెషన్లకు మూసివేసి ఉంటుంది. ఏప్రిల్ 14న ఉదయం సెషన్ (ఉదయం 09:00 - సాయంత్రం 5:00)కు మాత్రమే ఎక్స్చేంజ్ మూసివేసి సాయంత్రం సెషన్ లో (సాయంత్రం 5:00 - రాత్రి 11:30 / 11:55) ట్రేడింగ్ ను తిరిగి ప్రారంభిస్తుంది.ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్ సెలవులుఏప్రిల్ 5 - శనివారంఏప్రిల్ 6 - ఆదివారంఏప్రిల్ 10 - మహావీర్ జయంతిఏప్రిల్ 12 - శనివారంఏప్రిల్ 13 - ఆదివారంఏప్రిల్ 14 - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిఏప్రిల్ 18 - గుడ్ఫ్రైడేఏప్రిల్ 19 - శనివారంఏప్రిల్ 20 - ఆదివారంఏప్రిల్ 26 - శనివారంఏప్రిల్ 27 - ఆదివారం -
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
దేశంలో అగ్ర ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు నిరాశను కలిగించే చేదు వార్తను చెప్పింది. ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.వేతనాల పెంపును ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిశీలిస్తామని టీసీఎస్ తెలిపింది. నిర్ణయం తీసుకునే ముందు వ్యాపార వాతావరణం మరింత స్థిరంగా మారడానికి వేచి చూస్తున్నామని కంపెనీ అగ్ర నాయకత్వం వెల్లడించింది. వేతనాల పెంపు ఎప్పుడు చేయాలనేది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ప్రస్తుత చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అనిశ్చిత మార్కెట్ పరిస్థితులను ఎదుర్కొంటున్నందున కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన ప్రకటన ప్రతిబింబిస్తోంది.ఇప్పటికే చాలా మంది క్లయింట్లు తమ వ్యయాన్ని తగ్గించుకునే సంకేతాలను చూపుతున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.కృతివాసన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే విచక్షణ వ్యయంలో జాప్యం జరుగుతుందన్నారు. టారిఫ్ సంబంధిత అనిశ్చితి కారణంగా కంపెనీలు తమ బడ్జెట్లను సమీక్షిస్తున్నందున అనేక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని లేదా తగ్గిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.వార్షిక వేతన పెంపును నిలిపివేసినప్పటికీ, టీసీఎస్ త్రైమాసిక వేరియబుల్ పేను కొనసాగిస్తుంది. నాలుగో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తి అర్హత కలిగిన వేరియబుల్ వేతనం అందనుంది. మిగతా సిబ్బందికి వ్యాపార పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు.బలంగానే నియామకాలువేతనాల పెంపు ఆలస్యమైనా ఫ్రెషర్ల నియామకాలను కొనసాగిస్తామని టీసీఎస్ తెలిపింది. గత ఏడాది నియామకాల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది కాలేజీల నుంచి 42,000 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ 625 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,979కి చేరింది.మొత్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికరంగా 6,433 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అంతకుముందు సంవత్సరంలోని 13,249 క్షీణత నుంచి కోలుకుంది. నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 13.3 శాతానికి చేరింది. ఇచ్చిన హామీ మేరకు 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 42,000 మంది ఫ్రెషర్లను విజయవంతంగా ఆన్‌బోర్డ్ చేసిందని లక్కడ్ తెలిపారు.కాగా 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,434 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువ. ఈ త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 0.79 శాతం పెరిగింది. -
భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
-
ఈ యూట్యూబర్.. బిలియనీర్!
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ఆన్ లైన్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన ‘మిస్టర్ బీస్ట్’ సంపాదనలో కొందరు హాలీవుడ్ టాప్ స్టార్లనే మించిపోయాడు. ఆయన సంపాదన, సంపద గురించి వివరాలు పూర్తిగా బహిరంగంగా లేనప్పటికీ, ఫోర్బ్స్, సెలబ్రిటీ నెట్ వర్త్ వంటి అనేక పరిశ్రమ నివేదికలు మిస్టర్ బీస్ట్ తన డిజిటల్ సామ్రాజ్యం ద్వారా అపారమైన సంపదను కూడబెట్టినట్లు సూచిస్తున్నాయి.భారీ పాపులారిటీయూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ పాపులారిటీ, ఫైనాన్షియల్ సక్సెస్ మిస్టర్ బీస్ట్ అసాధారణ ఆర్థిక విజయానికి ప్రధాన చోదకాలలో ఒకటి యూట్యూబ్ లో అతని అపారమైన పాపులారిటీ. 2025 మార్చి నాటికి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానెల్‌కు 383 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీంతో ఆయన ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ భారీ ఆదరణే యాడ్ రెవిన్యూ, బ్రాండ్ సహకారాల వంటి వాటి ద్వారా భారీ సంపాదనను తెచ్చిపెట్టింది. మెయిన్స్ట్రీమ్లోని సెలబ్రిటీలకు కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదు.మిస్టర్ బీస్ట్ నెట్వర్త్ఫోర్బ్స్ (2025 మార్చి) నివేదిక ప్రకారం 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు మిస్టర్ బీస్ట్ సంపాదన 85 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.700 కోట్లు). దీన్ని చూస్తే అర్థమవుతుంది యూట్యూబ్‌లో ఆయన ఎంత భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడో. అంతేకాక, ప్రముఖుల సంపదలను అంచనా వేసే సెలబ్రిటీ నెట్ వర్త్ (2025 ఫిబ్రవరి) అయితే మిస్టర్ బీస్ట్ నెట్‌వర్త్‌ను సుమారు 1 బిలియన్ డాలర్లుగా (రూ.8,300 కోట్లు) అంచనా వేసింది. కొన్ని అంచనాలు మిస్టర్ బీస్ట్ నెలవారీ ఆదాయాన్ని సుమారు 50 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నాయి. -
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్‌లోకి..
తిరువనంతపురం: ప్రపంచంలోనే అత్యంత భారీ కంటైనర్ షిప్‌లలో ఒకటైన ఎంఎస్సీ తుర్కియే తాజాగా కేరళలోని విఝింజం ఇంటర్నేషనల్ సీపోర్టుకు వచ్చింది. భారతీయ పోర్టుకు ఇంత భారీ నౌక రావడం ఇదే ప్రథమమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఏపీసెజ్‌కి) నిర్వహిస్తోంది.మెడిటేరేనియన్ షిప్పింగ్ కంపెనీ (ఎంఎస్సీ)కి చెందిన ఈ నౌక ఒక అధునిక ఇంజినీరింగ్ అద్భుతం. 399.9 మీటర్ల పొడవు, 61.3 మీటర్ల వెడల్పు, 33.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. 24,346 టీఈయూల (ట్వెంటీ–ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) సామర్థ్యం దీని సొంతం. ఇంధనాన్ని అత్యధికంగా ఆదా చేయడం ద్వారా ఇది కర్బన ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. -
TCS Q4 results: టీసీఎస్ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..
దేశ ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (Q4FY25) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభంలో స్వల్ప క్షీణతను నివేదించింది. అయినప్పటికీ బలమైన ఒప్పంద విజయాలు, స్థిరమైన ఆదాయ వృద్ధి పథాన్ని ప్రదర్శించింది.టీసీఎస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,434 కోట్ల నుంచి 1.69 శాతం తగ్గి రూ.12,224 కోట్లుగా నమోదైంది. ఈ స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ, త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.3% పెరిగి రూ .64,479 కోట్లకు చేరుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దాని స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోంది. ఇక వాటాదారుల ఆమోదానికి లోబడి, టీసీఎస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ .30 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.పూర్తి సంవత్సరానికి పనితీరును పరిశీలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.45,908 కోట్లతో పోలిస్తే 5.76 శాతం పెరిగి రూ.48,553 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ.2,59,286 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,315 కోట్లతో పోలిస్తే 5.69 శాతం పెరిగింది.ఈ నివేదికలోని ముఖ్యమైన గణాంకాల్లో ఒకటి టీసీఎస్ డీల్ పైప్ లైన్. క్యూ3లో 10.2 బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెరిగి 12.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కంపెనీ పొందింది. ఇది దాని డిజిటల్ పరివర్తన సేవలు, క్లౌడ్ పరిష్కారాలకు బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.లాభాల తగ్గుదల కొన్ని ఆందోళనలను లేవనెత్తినప్పటికీ, టీసీఎస్ స్థిరమైన డీల్ వేగం, బలమైన ఆర్డర్ బుక్ 2026 ఆర్థిక సంవత్సరంలో ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై కంపెనీ దృష్టి పెట్టడం వృద్ధిని కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్‌గా జియో నెట్వర్క్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా క్రికెట్ ఉత్సాహం ఊరకలెత్తుతున్న తరుణంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రేమికులకు నిరవధిక డిజిటల్ అనుభవం అందించేందుకు రిలయన్స్ జియో ముందుకు వచ్చింది. ప్రతి మ్యాచ్ కు 50,000 మందికి పైగా ప్రేక్షకుల రాకను దృష్టిలో పెట్టుకుని, జియో తన 4జీ, 5జీ నెట్వర్క్ ను స్టేడియం లోపల, బయటా బలోపేతం చేసింది.మ్యాచ్ హైలైట్లు రికార్డ్ చేయడం దగ్గర నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు.. స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ను ఆస్వాదించగలుగుతున్నారు. స్టేడియంలో జియో హై-స్పీడ్ ‘జియోనెట్’ వై-ఫై సేవలను కూడా అందిస్తోంది. జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటీపీతో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ స్లైసింగ్, క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన 5జీ అనుభవాన్ని అందిస్తున్నాయి. -
హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రాకు రూ. 424 కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) నుంచి 297 బస్సుల సరఫరా, నిర్వహణకు భారీ ఆర్డరు లభించింది. కాంట్రాక్ట్ ప్రకారం లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్వోఏ) తేదీ నుంచి 11 నెలల్లో బస్సులను అందించాల్సి ఉంటుంది.ఈ డీల్ విలువ సుమారు రూ. 424.01 కోట్లని కంపెనీ వివరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో నడిపేందుకు ప్రత్యేకంగా రూపొందిన ఈ బస్సులు 30 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఉంటాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇన్ని విద్యుత్ బస్సులను నేరుగా కొనుగోలు చేయడం దేశీయంగా ఇదే తొలిసారని ఒలెక్ట్రా సీఎండీ కేవీ ప్రదీప్ చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద ఆర్డరును అందుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు. -
అమెరికాకు 600 టన్నుల ఐఫోన్లు.. అదీ చార్టెడ్ ఫ్లైట్లలో..!
విదేశీ దిగుమతులపై ప్రతీకార సుంకాల ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లో వాణిజ్య ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో అక్కడ తయారీ నిర్వహిస్తున్న కంపెనీలు ఇరుకున పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్రంప్ టారిఫ్‌ల నుంచి బయటపడేందుకు ఉపాయం ఆలోచించింది. భారత్ నుంచి 600 టన్నులు లేదా సుమారు 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు తరలించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో పాపులర్ ఐఫోన్ల తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రమైన చైనా నుంచి దిగుమతులపైనే యాపిల్ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. చైనాపై విధించే టారిఫ్ రేటు ప్రస్తుతం 125 శాతంగా ఉంది. ఇక భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ సుంకం 26 శాతం. అయితే చైనా మినహా ఇతర అన్ని దేశాలపై ఈ సుంకాల అమలును 90 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లుభారత్లోని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన సమయాన్ని 30 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించేలా విమానాశ్రయ అధికారులతో కంపెనీ లాబీయింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. "గ్రీన్ కారిడార్" పేరుతో చైనాలోని కొన్ని విమానాశ్రయాలలో చేస్తున్న ప్రత్యేక ఏర్పాటునే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ యాపిల్ చేయించినట్లు తమకు లభించిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ ఒక్కొక్కటి 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు కార్గో జెట్ విమానాలు అమెరికా వెళ్లాయని, వాటిలో ఒకటి ఈ వారంలోనే అంటే కొత్త టారిఫ్‌లు ప్రకటించాకే బయలుదేరిందని ఓ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఐఫోన్ 14, దాని ఛార్జింగ్ కేబుల్ ప్యాకేజ్డ్ బరువు సుమారు 350 గ్రాములు (12.35 ఔన్స్) ఉంటుందని, ఇలా మొత్తం 600 టన్నుల కార్గోలో సుమారు 15 లక్షల ఐఫోన్లు వెళ్లి ఉంటాయని రాయిటర్స్ అంచనా వేస్తూ రాసుకొచ్చింది. అయితే దీనిపై యాపిల్ సంస్థ గానీ, భారత విమానయాన మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు. -
రూ. 1,000 కోట్ల ల్యాప్‌టాప్ ప్లాంటు.. 5,000 ఉద్యోగాలు
చెన్నై: ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్, చెన్నైకి దగ్గర్లోని ఒరగాడంలో రూ. 1,000 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనితో ప్రాంతీయంగా 5,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ప్లాంటు నెలకొల్పడానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ప్లాంటులో ఇతర కంపెనీల కోసం ల్యాప్‌టాప్‌లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు మొదలైన వాటిని ఉత్పత్తి చేయనుంది. ఇందులో త్వరలోనే హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభమవుతుందని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా తెలిపారు.తమిళనాడు ప్రభుత్వం 100 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. డిక్సన్ టెక్నాలజీస్ 1993లో ఏర్పాటైంది. శాంసంగ్, షావోమీ, మోటరోలా, బోట్, వన్‌ప్లస్ తదితర సంస్థల కోసం కాంట్రాక్ట్ తయారీ సేవలను అందిస్తోంది. -
లాభాల్లో ఆసియా మార్కెట్లు
-
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడిన వారి కోసం తమ యాప్ ద్వారా తక్కువ ప్రీమియంలతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జెన్ఎస్ లైఫ్ ఫౌండర్ మీనాక్షీ మీనన్ తెలిపారు. సిల్వర్ ప్లాన్ కింద కేవలం రూ. 990కే రూ. 2.5 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ, ప్రమాదం బారిన పడి ఆస్పత్రిలో చేరితే రూ. 50 వేల నగదు లభిస్తుందని పేర్కొన్నారు.ప్రత్యేక రేట్లపై రూ. 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్లు, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీలను పొందవచ్చని తెలిపారు. ఇక గోల్డ్ ప్లాన్‌లో రూ. 4,900 వార్షిక ప్రీమియంకు రూ. 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, ఆస్పత్రిలో చేరితే రూ. 1 లక్ష నగదు, రూ. 5 లక్షల వరకు సైబర్ ఇన్సూరెన్స్ లభిస్తుందని మీనాక్షి వివరించారు. -
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
లింక్డ్ఇన్ 2025 టాప్ కంపెనీస్ ఇండియా లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), యాక్సెంచర్, ఇన్ఫోసిస్ తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ వార్షిక ర్యాంకింగ్ కెరీర్ వృద్ధి, నైపుణ్య అభివృద్ధి, దీర్ఘకాలిక విజయం కోసం ఉత్తమ పని ప్రదేశాలను హైలైట్ చేస్తూ ఉద్యోగార్థులు, ఉద్యోగులు తమ కెరీర్లలో ఎలా ముందుకు వెళ్లాలో మార్గదర్శనం చేస్తుంది.ముందంజలో టెక్ టైటాన్స్టీసీఎస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ల ఆధిపత్యం భారత ఉపాధి రంగంలో టెక్నాలజీ, కన్సల్టింగ్ సేవలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోంది. ఈ కంపెనీలు తమ ఉద్యోగుల కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. అప్ స్కిల్లింగ్, నాయకత్వ అభివృద్ధి, సృజనాత్మక-ఆధారిత పని వాతావరణంలో భారీగా పెట్టుబడులు పెడతాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌లో టీసీఎస్ ముందంజలో ఉంది.కన్సల్టింగ్, బిజినెస్ స్ట్రాటజీ, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో యాక్సెంచర్ పవర్ హౌజ్‌గా ఉంటూ గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌ను నడిపిస్తోంది.ఏఐ ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సస్టెయినబిలిటీ కన్సల్టింగ్‌పై ఇన్ఫోసిస్ దృష్టి సారించింది.ఎమర్జింగ్ ట్రెండ్స్.. హైరింగ్ తీరుతెన్నులులింక్డ్ఇన్ ర్యాంకింగ్ కొన్ని ఆకర్షణీయమైన ధోరణులతో భారతదేశపు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌ను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది.టాప్ ఇన్-డిమాండ్ రోల్స్: ఫ్రాడ్ అనలిస్టులు, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్టులు, ఫైనాన్షియల్ ఎనలిస్టులు వంటి ఉద్యోగాలకు కంపెనీలు చురుగ్గా నియామకాలు జరుపుతున్నాయి.డిమాండ్ ఉన్న నైపుణ్యాలు: ఏఐ ఇంజినీరింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో నైపుణ్యానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.పరిశ్రమ మార్పులు: టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, టాప్ 25 కంపెనీల్లో 19 కంపెనీలు ఈ రంగాలకు చెందినవే కావడం గమనార్హం.కొత్త కంపెనీలే: ఈ జాబితాలోని కంపెనీల్లో సగానికి పైగా మొదటిసారి ప్రవేశించినవే కావడం యజమాని ప్రాధాన్యతలు, వర్క్ ప్లేస్ అప్పీల్ లో మార్పును సూచిస్తోంది.జాబితాలో టాప్ 10 కంపెనీలు ఇవే..1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): ఐటీ సర్వీసెస్2. యాక్సెంచర్: కన్సల్టింగ్ అండ్ ఐటీ సర్వీసెస్3. ఇన్ఫోసిస్: ఐటీ సర్వీసెస్4. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్: ఫైనాన్షియల్ సర్వీసెస్5. కాగ్నిజెంట్: ఐటీ సర్వీసెస్6. ఒరాకిల్: సాఫ్ట్వేర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్7. జేపీ మోర్గాన్ ఛేజ్: ఫైనాన్షియల్ సర్వీసెస్8. అమెజాన్: ఈ-కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్9. ఆల్ఫాబెట్ ఇంక్ (గూగుల్): టెక్నాలజీ10. డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ): ఫైనాన్షియల్ సర్వీసెస్ -
మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
ఫార్మాస్యూటికల్స్‌పై త్వరలోనే భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హౌస్ రిపబ్లికన్ల కోసం ఫండ్ రైజింగ్ గాలాలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేవీ ఆయన బయటపెట్టలేదు.‘ఒకసారి మనం అలా చేస్తే (సుంకాలు విధిస్తే) వారు (ఔషధ కంపెనీలు) తిరిగి మన దేశంలోకి వస్తారు. ఎందుకంటే మనమే వాళ్లకు పెద్ద మార్కెట్" అని ట్రంప్ అన్నారు. "మనది పెద్ద మార్కెట్ కావడమే అందరి కంటే మనకు ఉన్న అవకాశం" పేర్కొన్నారు.బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం.. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి సుంకాలు విధిస్తామని ఆయన పదేపదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ఉంటాయని మార్చిలోనే ట్రంప్ సంకేతాలిచ్చారు.పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడం అమెరికా, ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఒకవేళ ఫార్మాస్యూటికల్ ఔషధాలపై సుంకాలు ప్రకటిస్తే అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అమెరికాకు భారత ఫార్మా ఎగుమతుల్లో ఎక్కువగా జనరిక్స్ లేదా పాపులర్ ఔషధాల చౌక వెర్షన్లు ఉన్నాయి. అక్కడ వీటిపై ప్రస్తుతం దాదాపు ఎలాంటి సుంకాలు లేవు. కానీ భారత ప్రభుత్వం యూఎస్ ఫార్మా దిగుమతులపై 10% పన్నును విధిస్తోందని పరిశ్రమ నిపుణులను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.ఈ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావంరాయిటర్స్ ప్రకారం, భారతదేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అమెరికాకే ఉంటున్నాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బెంగళూరుకు చెందిన బయోకాన్, ముంబైకి చెందిన లుపిన్ సంస్థలు తమ ఆదాయంలో 44 శాతం, 37 శాతం అమెరికా నుంచే ఆర్జించాయి.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 17 శాతం వాటాను ఆర్జించింది. రాయిటర్స్ ప్రకారం, భారతదేశపు అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32% యూఎస్ అమ్మకాల ద్వారానే సంపాదించింది. వీటితో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు అమెరికాకు గణనీయంగా ఎగుమతులు చేస్తున్నాయి. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ. 500 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, డిబెంచర్ల జారీ ద్వారా రూ. 500 కోట్ల వరకు సమీకరించనున్నట్లు వెల్లడించింది. వీటిపై కూపన్ రేటు వార్షికంగా 10.25 శాతం వరకు ఉంటుంది. ఈ నిధులను వ్యాపారరీత్యా క్లయింట్లకు రుణాలు ఇచ్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. ఈ ఇష్యూ ఏప్రిల్ 23న ముగుస్తుంది. 15 నెలల నుంచి 60 నెలల వరకు కాల వ్యవధులకు కంపెనీ ఈ డిబెంచర్లను జారీ చేయనుంది. శ్రీరామ్ ఏఎంసీలో వాటాకు ఓకే శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఎస్‌ఏఎంసీ)లో సంయుక్తంగా వాటా కొనుగోలు చేసేందుకు దక్షిణాఫ్రికా సంస్థ సన్లామ్‌తోపాటు శ్రీరామ్ క్రెడిట్ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఎస్‌ఏఎంసీ విస్తారిత వోటింగ్ వాటా మూలధనంలో 23 శాతానికి సమానమైన వాటాను ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా సన్లామ్ గ్రూప్‌నకు చెందిన సంస్థ సన్లామ్ ఎమర్జింగ్ మార్కెట్(మారిషస్) సొంతం చేసుకోనుంది.ఎస్‌ఏఎంసీ ఈక్విటీ షేర్లలో సబ్స్క్రిప్షన్ ద్వారా వాటా పొందనుంది. ఇదేవిధంగా ఎస్‌ఏఎంసీ పబ్లిక్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి సన్లామ్ ఎమర్జింగ్‌తోపాటు శ్రీరామ్ క్రెడిట్ కంపెనీకి సీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
ఎయిర్‌బస్ హెలికాప్టర్లో ‘మేకిన్ ఇండియా’
మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్‌పీఎల్) ఎయిర్‌బస్ నుంచి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును పొందింది. ఎయిర్‌బస్‌కు చెందిన హెచ్ 130 లైట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్ తయారీ, అసెంబుల్ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇది భారతదేశ 'మేక్ ఇన్ ఇండియా' విజన్‌కు ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో నమ్మకమైన భాగస్వామిగా మహీంద్రా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ కార్యదర్శి వుమ్లన్మాంగ్ వుల్నామ్, భారత్, దక్షిణాసియాలో ఎయిర్‌బస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్, మహీంద్రా గ్రూప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీష్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్ 130 హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్ అసెంబ్లీని మహీంద్రా ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఐరోపాలోని ఎయిర్ బస్ హెలికాప్టర్ల కేంద్రానికి రవాణా చేస్తారు. ఉత్పత్తి వెంటనే ప్రారంభం కానుంది. మొదటి క్యాబిన్ అసెంబ్లీ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది.మహీంద్రా ఇప్పటికే ఎయిర్ బస్ వాణిజ్య విమాన కార్యక్రమాల కోసం వివిధ రకాల విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్ లను సరఫరా చేస్తోంది. విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్లే కాకుండా భారీ, మరింత సంక్లిష్టమైన ఏరో స్ట్రక్చర్ తయారీ, సరఫరాకు మహీంద్రా తన సామర్థ్యాల పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్న క్రమంలో తాజా ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.ఎయిర్ బస్ కు భారత్ ప్రధాన మార్కెట్, వ్యూహాత్మక వనరుల కేంద్రంగా ఉంది. ప్రతి ఎయిర్ బస్ వాణిజ్య విమానంలోనూ భారతదేశంలో తయారైన విడిభాగాలు, సాంకేతికతలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ బస్ భారత్ నుంచి విడిభాగాలు, సేవల కొనుగోలు విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది.హెచ్ 130 అనేది ప్రయాణికుల రవాణా, పర్యాటకం, ప్రైవేట్, వ్యాపార విమానయానం, అలాగే మెడికల్ ఎయిర్ లిఫ్ట్, నిఘా మిషన్ల కోసం రూపొందించిన ఇంటర్మీడియట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో విశాలమైన, అడ్డంకులు లేని క్యాబిన్ ఉంటుంది. పైలట్, మరో ఏడుగురు ఇందులో ప్రయాణించవచ్చు. చుట్టూ పెద్ద విండ్ స్క్రీన్, వెడల్పాటి కిటికీల ద్వారా అద్భుతమైన విజిబిలిటీ ఉంటుంది. -
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (credit card) వినియోగం బాగా పెరిగింది. దీంతో ఖర్చుల మీద నియంత్రణ లేక క్రెడిట్ కార్డుల బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలా వచ్చిన భారీ మొత్తం బిల్లులను ఒకేసారి కట్టడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందు కోసమే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది.క్రెడిట్ కార్డు పెద్ద మొత్తం బిల్లుల నిర్వహరణను ‘ఎస్బీఐ కార్డ్ ఫ్లెక్సీపే’ సదుపాయం సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కార్డుదారులు పెద్ద కొనుగోళ్లను సులభమైన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోవచ్చు. తద్వారా ఒకేసారి ఏకమొత్తం చెల్లించాల్సిన ఇబ్బందిని లేకుండా చేసుకోవచ్చు. అసలేంటీ ఎస్బీఐ ఫ్లెక్సీపే ఫీచర్.. అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్బీఐ ఫ్లెక్సీపేఫ్లెక్సీపే అనేది ఎస్బీఐ కార్డ్ అందించే ఫీచర్. ఇది మీ లావాదేవీలను సులభమైన వాయిదాలుగా మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రూ.500 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఇది మూడు, ఆరు, తొమ్మిది, 12, 18, 24 నెలలు వంటి రీపేమెంట్ కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది.ఇక రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకు 36 నెలల ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫ్లెక్సీపే కోసం కనీస బుకింగ్ మొత్తం రూ .2,500, అయితే ఇది ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. అలాగే, గత 30 రోజుల్లో చేసిన లావాదేవీలను ఫ్లెక్సీగా మార్చుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐలను మార్చుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.ఈఎంఐలుగా మార్చుకోండిలా..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు తమ ఎస్బీఐ కార్డ్ ఆన్లైన్ ఖాతాలోకి లాగిన్ అయి, 'ఈఎంఐ అండ్ మోర్' విభాగానికి వెళ్లి 'ఫ్లెక్సీపే' ఎంచుకోవచ్చు. మార్చాలనుకుంటున్న లావాదేవీని, తగిన కాలపరిమితిని ఎంచుకుని అభ్యర్థనను ధృవీకరించండి.అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఎస్బీఐ కార్డ్ కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్‌కు కూడా కస్టమర్లు కాల్ చేసి కస్టమర్ సపోర్ట్ టీమ్ సహాయంతో ఈఎంఐ మార్పిడిని అభ్యర్థించవచ్చు. వాళ్లు మీకు ప్రక్రియపై మార్గనిర్దేశం చేస్తారు.అలాగే వినియోగదారులు ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోనూ ఫ్లెక్సీపే ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. అవసరమైతే లావాదేవీ మొత్తాన్ని సవరించి, కాలపరిమితిని ఎంచుకుని అప్లయి చేయవచ్చు. -
నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ముంచిన ఐటీ, బ్యాంకు షేర్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 379.93 పాయింట్లు (0.51 శాతం) క్షీణించి 73,847.15 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 136.70 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 22,399.15 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.73 శాతం, స్మాల్ క్యాప్ 1.08 శాతం చొప్పున నష్టపోయాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్ 1.11 శాతం నుంచి 2.25 శాతం మధ్య తీవ్ర నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ ప్యాక్ నుంచి 30 షేర్లలో 17 నష్టాల్లో ముగియగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్ 3.4 శాతం వరకు నష్టపోయాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతం నుండి 6 శాతానికి తగ్గించడంతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాలతో ముగిశాయి. పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితుల మధ్య ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశాన్ని సూచిస్తూ ఆరుగురు సభ్యుల ప్యానెల్ రెపో రేటు తగ్గింపునకు జైకొట్టింది. -
భారత్‌లో మళ్లీ అల్కటెల్ ఫోన్లు..
దేశీ మొబైల్ ఫోన్ల మార్కెట్లో అల్కటెల్ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు నెక్ట్స్‌సెల్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు వీలుగా తొలి దశలో 3 కోట్ల డాలర్లు(రూ. 260 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి ఏడేళ్ల తదుపరి తిరిగి దేశీయంగా అల్కటెల్ బ్రాండ్‌ను విడుదల చేయనుంది.భారత్‌తోపాటు ప్రపంచ మార్కెట్లకు అవసరమయ్యే ప్రత్యేక ఫీచర్స్‌తో స్మార్ట్ఫోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు నెక్ట్స్‌సెల్ ఇండియా వివరించింది. నోకియాతో ట్రేడ్‌మార్క్ ఒప్పందం కింద అల్కటెల్ బ్రాండ్‌ను చైనీస్ కంపెనీ టీసీఎల్ కమ్యూనికేషన్ నిర్వహిస్తోంది.దేశీయంగా అల్కటెల్ బ్రాండ్ అధీకృత హక్కులను నెక్ట్స్‌సెల్ ఇండియా కలిగి ఉంది. దీంతో అల్కటెల్ ప్రొడక్టుల సంబంధిత అన్నిరకాల కార్యకలాపాలను కంపెనీ నిర్వహించనున్నట్లు నెక్ట్స్‌సెల్ ఇండియా చీఫ్ బిజినెస్ అధికారి అతుల్ వివేక్ వెల్లడించారు. రూ. 20,000 నుంచి రూ. 25,000 ధరల శ్రేణిలో తమకు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే స్థాయిలో స్టైలస్‌తో కూడిన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో తమ బ్రాండ్ ఫోన్ల అమ్మకం కోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నట్లు వివరించారు. -
Gold Rate Update: బంగారం ధర లక్ష టచ్ అవుతుందా?
-
వరుసగా రెండోసారి రెపో రేటు తగ్గించిన RBI
-
వావ్.. తగ్గిన బంగారం ధరలు
-
బంగారం తగ్గిందోచ్! ఇప్పుడు కొంటేనే బెటర్..!
-
Global Stock Markets: మార్కెట్లు క్రాష్!
-
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలో ఉన్నాం. ఈ నెలలో అనేక స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లతో సహా వివిధ రేంజ్ ధరల్లో శాంసంగ్, ఐక్యూ, వివో, రియల్మీ వంటి బ్రాండ్ల నుంచి అద్భుత ఫీచర్లతో సరికొత్త ఫోన్లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆయా ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్న కొన్ని స్మార్ట్ఫోన్లు.. వాటి ఫీచర్ల గురించి మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.రియల్మీ నార్జో 80 ప్రో ఏప్రిల్ 9న రియల్మీ నార్జో 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. శక్తివంతమైన డైమెన్సిటీ 7400 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఎక్కువ కాలం పనిచేసే అంతరాయం లేని మల్టీటాస్కింగ్ కోరుకునే వినియోగదారులకు ఈ కాంబినేషన్ అనువైన ఎంపికగా చేస్తుంది.వివో వీ50ఈ ఏప్రిల్ 10న లాంచ్ కానున్న వీ50ఈతో కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ల సంప్రదాయాన్ని వివో కొనసాగిస్తోంది. సోనీకి చెందిన ఐఎంఎక్స్ 882 సెన్సార్ కలిగిన ఈ ఫోన్ అసాధారణ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది, షట్టర్ బగ్స్, కంటెంట్ క్రియేటర్లకు సరైనదిగా ఉంటుంది.ఐక్యూ జెడ్10 7,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్10 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11న లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో కూడిన ఈ డివైస్ గేమర్స్, హెవీ డ్యూటీ యూజర్ల కోసం రూపొందించారు.శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఏప్రిల్ 15న లాంచ్ కానుంది. సొగసైన డిజైన్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మొబైల్ టెక్నాలజీలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే.. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది. -
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.ముందస్తు ఆలోచనలతోనే.. బఫెట్ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి. -
ఐపీఓకు రెండు కంపెనీలు రెడీ
ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు రెండు కంపెనీలు సిద్ధమయ్యాయి. సాయి ఇన్ఫినియం, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు అనుమతులు కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించాయి. ఈ రెండు ఇష్యూలు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లేకుండానే జరగనున్నాయి.సాయి ఇన్ఫినియం 1.96 కోట్ల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. సమీకరించిన నిధుల్లో 17.4 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.130 కోట్లు, రోలింగ్ మిల్లు కొనుగోలుకు రూ.65 కోట్లు, కార్గో వెసెల్ కొనుగోలుకు రూ.19 కోట్లు ఉపయోగించనుంది.అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ అగ్రోకెమికల్ తయారీ కంపెనీ ‘అడ్వాన్స్ అగ్రోలైఫ్’ 1.92 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల ద్వారా నిధులు సమీకరించనుంది. అర్హులైన కంపెనీ ఉద్యోగులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. అలాంటి వారికి డిస్కౌంట్‌తో షేర్లు కేటాయించనుంది. సమీకరించిన నిధుల్లో రూ.135 కోట్లు మూలధన అవసరాలకు మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
దేశంలోని రుణగ్రహీతలకు శుభవార్త. అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ఎంసీఎల్ఆర్ (వడ్డీ రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంటుంది. సవరించిన రేట్లు ఏప్రిల్ 7 నుంచి వర్తిస్తాయి.ఎంసీఎల్ఆర్.. దాని ప్రభావంమార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆర్బీఐ 2016లో ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది.గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఈ ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణ ఈఎంఐలు లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలికంగా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ ప్రయోజనం పరిధి, సమయం రుణ ఒప్పందంలో పేర్కొన్న రీసెట్ క్లాజ్‌పై ఆధారపడి ఉంటుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ రేట్లుఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ కాలపరిమితిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ను 9.30 శాతం నుంచి 9.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఏడాది, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 9.45 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గించింది. -
ఇల్లు ఏదైనా సరే.. ఇది ఉండాల్సిందే!
1,2,3 బీహెచ్‌కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే.. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. అలాగే 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్‌కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్‌కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3బీహెచ్‌కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్‌కేలకు, 17 శాతం 1 బీహెచ్‌కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్‌కే జై కొడుతున్నారు.లగ్జరీ ఇళ్లకు డిమాండ్.. రూ.కోటిన్నర ధర ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 హెచ్–2లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2021 హెచ్–2లో ఇది కేవలం 12 శాతంగా ఉంది. రూ.45–90 లక్షల బడ్జెట్ గృహాలకు 33 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. ఇక అందుబాటు గృహాలకు డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. 2020 హెచ్–2లో 40 శాతంగా అఫర్డబుల్ హౌసింగ్ గిరాకీ.. 2021 హెచ్–2 నాటికి 25 శాతానికి, 2023 హెచ్–2లో ఏకంగా 21 శాతానికి క్షీణించింది.లాంచింగ్‌లో కొంటున్నారు.. గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2020లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి మారింది. అలాగే 2021లో శివారు ప్రాంతాలలో స్థిరాస్తుల కొనుగోలుకు జై కొట్టిన కొనుగోలుదారులు 2024 నాటికి 36 శాతానికి తగ్గారు.పెట్టుబడులకు రియలే బెటర్.. ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2024 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు. -
స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్
-
స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్
-
ఇల్లు కొనే ట్రెండ్.. కరోనాకు ముందు, తర్వాత..
కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. నివాస కొనుగోళ్ల ట్రెండ్‌ను కరోనాకు ముందు, ఆ తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ కంటే ముందు ఇల్లు కొనాలంటే మొదటి ప్రాధాన్యత బడ్జెట్ ఎంత అనే.. కానీ, కరోనా తర్వాత బడ్జెట్ అంటే లెక్కేలేదు. విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోమహమ్మారితో వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఇంటిలో గడిపే సమయం పెరిగింది. మరోవైపు ఐసొలేషన్ కారణంగా విశాలమైన, ప్రత్యేక గదుల అవసరం ఏర్పడింది. దీంతో గృహ కొనుగోలుదారులు క్రమంగా విశాలమైన ఇళ్లకు మారిపోతున్నారు. అప్పటిదాకా 2 బీహెచ్‌కే వాసులు.. క్రమంగా 3 వైపు.. 3 బీహెచ్‌కే వాసులు నాలుగు పడక గదుల్లో ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో గ్రేటర్లో ఇంటి విస్తీర్ణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా డెవలపర్లు కూడా విశాలమైన ఇళ్లనే నిర్మిస్తున్నారు. 4 బీహెచ్కేకు ఆదరణ.. స్థిరమైన ధరలు, అధిక రాబడుల కారణంగా హైదరాబాద్‌లో ప్రాపర్టీలలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద కుటుంబాలు, విలాసవంతమైన జీవనశైలి, ఆధునిక వసతులు కోరుకునేవారు ఎక్కువగా 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాలలో 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సైనిక్‌పురి, యాప్రాల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోని యూనిట్లకూ ఆదరణ బాగానే ఉంది. వీటి సగటు ధర రూ.1.78 కోట్ల నుంచి ఉన్నాయి.గ్రేటర్లో పెరిగిన విస్తీర్ణాలు.. హైదరాబాద్‌లో ఏటేటా అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2014లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,830గా ఉండగా.. 2018 నాటికి 1,600లకు తగ్గాయి. నాలుగేళ్లలో ఏకంగా ఫ్లాట్ల సైజు 13 శాతం తగ్గింది. కోవిడ్ కాలంలో ఇంట్లో గడిపే సమయం ఎక్కువైపోయింది. దీంతో ఇంటి అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లతో ఇంట్లో ప్రత్యేక గది అనివార్యమైపోయింది. దీంతో ఇంటి విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,700 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 2,200 చ.అ.లకు పెరిగింది.45 శాతం డిమాండ్.. కరోనా కంటే ముందు లగ్జరీ గృహాలైన 4 బీహెచ్‌కే ఫ్లాట్లకు 27 శాతం డిమాండ్ ఉండగా.. ఇప్పుడది ఏకంగా 45 శాతానికి పెరిగిందని అనరాక్–ఫిక్కీ హోమ్ బయ్యర్స్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు నగరాల్లో అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు 32 శాతం మేర పెరిగాయి. 2019లో సగటు ఫ్లాట్ సైజు 1,145 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది 1,513 చ.అ.లకు పెరిగింది. -
ముగ్గురు ఖాన్‌లనూ మించిన కుబేరుడు!
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 ఎడిషన్ ఇటీవల విడుదలైంది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన బిలియనీర్లు 205 మంది ఉన్నారు. వీరిలో వినోదం, మీడియా ప్రపంచానికి చెందినవారు కొంతమంది ఉండగా ఇందులో బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక బిలియనీర్ రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala). ఒకప్పుడు టూత్ బ్రష్‌లు అమ్మిన ఆయన ఇప్పుడు పరిశ్రమలోని అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడైన పారిశ్రామికవేత్త.బాలీవుడ్ అపర కుబేరుడుఫోర్బ్స్ ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ నుండి ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ఏకైక వ్యక్తి మూవీ మాగ్నెట్, పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త జాబితా ప్రకారం ఈ మీడియా మొఘల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఉన్న ఖాన్ త్రయం కంటే ధనవంతుడు. ఎలాగంటే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan) (390 మిలియన్ డాలర్లు), అమీర్ ఖాన్ (Aamir Khan) (220 మిలియన్ డాలర్లు) మొత్తం నెట్‌వర్త్ 1.38 బిలియన్ డాలర్లు కాగా ఆ ముగ్గురి సంపద కంటే రోనీ స్క్రూవాలా సంపద అధికం. రోనీ వ్యాపార ప్రస్థానం1956లో బొంబాయిలో జన్మించిన స్క్రూవాలా 70వ దశకం చివర్లో టూత్ బ్రష్ ల తయారీ ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. 80వ దశకం ప్రారంభంలో ఆసియా క్రీడల పుణ్యమా అని కలర్ టీవీ దేశంలోకి ప్రవేశించినప్పుడు అ బూమ్‌ను స్క్రూవాలా అందిపుచ్చుకున్నారు. అలా ఎంటర్టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించి 1990లో యూటీవీని స్థాపించారు. అదే తరువాత యూటీవీ మోషన్ పిక్చర్స్‌గా మారింది. తరువాతి రెండు దశాబ్దాలలో ఈ నిర్మాణ సంస్థలు స్వదేశ్, రంగ్ దే బసంతి, ఖోస్లా కా ఘోస్లా, జోధా అక్బర్, ఫ్యాషన్, ఢిల్లీ బెల్లీ, బర్ఫీమ్ వంటి ఐకానిక్ చిత్రాలను అందించాయి. అలాగే శాంతి, హిప్ హిప్ హుర్రే, షకా లకా బూమ్ బూమ్, కిచిడి, షరారత్ వంటి టీవీ షోలను అందించాయి.తర్వాత రోనీ స్క్రూవాలా 2012లో యూటీవీని డిస్నీకి బిలియన్ డాలర్ల ఒప్పందంలో అమ్మేశారు. అనంతరం ఐదు సంవత్సరాలకు ఆర్ఎస్వీపీ మూవీస్ సంస్థను స్థాపించారు. అలా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కేదార్నాథ్, ఉరీ, ది స్కై ఈజ్ పింక్, సామ్ బహదూర్ చిత్రాలను నిర్మించారు. 2024లో స్క్రూవాలా షార్క్ ట్యాంక్ ఇండియాలో షార్క్‌లలో ఒకరిగా వెండితెర అరంగేట్రం చేశారు. రోనీ స్క్రూవాలాకు సినిమాలే ఏకైక ఆదాయ వనరు కాదు. అప్ గ్రాడ్, యూనిలాజర్, యూఎస్ స్పోర్ట్స్ వంటి పలు స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా కొన్నింటిని స్థాపించారు. ఈ సంస్థల విజయం, తన సినిమా వ్యాపారం ఆయన భారీ సంపదను పోగుచేసుకోవడానికి దోహదపడ్డాయి. -
కొత్త ఇల్లు.. కొత్త ట్రెండ్..
మెట్రో నగరాల్లో గృహ కొనుగోలులో వంట గది కీలకంగా మారింది. అందుబాటు ధర, అభివృద్ధి చెందే ప్రాంతం, వసతులు మాత్రమే కాదండోయ్.. ఇంట్లోని వంట గది శైలి కూడా ఆధునికంగా ఉండాలంటున్నారు కొనుగోలుదారులు. అందుకే సాధారణ కిచెన్స్ స్థానంలో ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. లివింగ్, డైనింగ్ రూమ్‌లతో వంట గది కలిసి ఉండటమే దీని ప్రత్యేకత! – సాక్షి, సిటీబ్యూరోనగరంలోని నిర్మాణ సంస్థలు 1,000 చ.అ.పైన ఉండే ప్రతి ఫ్లాట్‌లోనూ ఓపెన్ కిచెన్ ఏర్పాటుకే ప్రాధాన్యమిస్తున్నాయి. హాలుకు అనుసంధానంగా అడ్డుగా గోడలు లేకుండా ఓపెన్ కిచెన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్‌కు కిచెన్ కలిసే ఉంటుందన్నమాట. ముచ్చటిస్తూ వంటలు.. » ఓపెన్ కిచెన్స్‌లో సానుకూల, ప్రతికూల రెండు రకాల అంశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. » వంట చేస్తూనే ఇతర గదుల్లో ఉన్నవారితో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించవచ్చు. హాల్లో ఉండే టీవీలోని కార్యక్రమాలనూ వీక్షించొచ్చు. » ఓపెన్ కిచెన్ కాబట్టి శుభ్రంగా ఉంచేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించే కసరత్తును వంట గది నుంచి మొదలుపెడతారు. » ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి. దీంతో కుటుంబ సభ్యుల మూడ్‌ను మారుస్తాయి. » ఇంట్లో చిన్నారులు ఉంటే వంట గది నుంచి కూడా వీరిపై పర్యవేక్షణకు వీలుంటుంది. » వంట పాత్రలు బయటకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది కొందరికి నచ్చకపోచ్చు. » డిష్వాషర్, మిక్సీల శబ్ధాలు ఇతర గదుల్లోకి వినిపించి అసౌకర్యంగా ఉంటుంది. » దూరపు బంధువులు, అంతగా పరిచయం లేనివారు వచ్చినప్పుడు వారి ముందు వంట చేయడం కొంత మందికి అంతగా నచ్చకపోవచ్చు.సంప్రదాయ వంటగది: » వీటిని పాత రోజుల నుంచి చూస్తున్నవే.. వంట గది ప్రత్యేకంగా ఉంటుంది. ఏకాంతంగా వంట చేయాలని కోరుకునే వారు సంప్రదాయ శైలిలో ఉండే వంటిల్లునే ఇష్టపడతారు. » గదికి అన్ని వైపులా గోడలుంటాయి. అరలు ఎక్కువ ఏర్పాటుకు వీలుండటంతో పాత్రలన్నింటినీ చక్కగా సర్దేయవచ్చు. » వంటింట్లోని శబ్ధాలు, వాసనలు బయటకు రావు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. » చుట్టూ గోడలు ఉండటంతో ఇరుగ్గా, చీకటిగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది తిరిగేందుకు వీలుండదు. » ఇల్లు డిజైన్ సమయంలోనే ఎలాంటి వంట గది కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వంట గదిని నిర్మించేశాక మళ్లీ ఓపెన్ కిచెన్‌లా మార్చాలంటే మరింత ఖర్చు అవుతుంది. -
ఫ్రీగా జియో హాట్‌స్టార్.. ఆఫర్ ప్లాన్ల పొడిగింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఐపీఎల్-2025 18వ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ ఈసారి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది.జియో ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్రత్యేక ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ టోర్నమెంట్ కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ కోసం కొత్త జియో సిమ్ కొనడం లేదా ప్రత్యేక ప్లాన్లతో ఇప్పటికే ఉన్న ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు 4కే రిజల్యూషన్ లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అభిమానులు ఈ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌ను ఇంట్లో లేదా ప్రయాణంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.ఫ్రీ జియో హాట్‌స్టార్ ప్లాన్లు ఇవే..రూ.100 ప్లాన్: ఇది డేటా యాడ్ఆన్ ప్లాన్. దీంతో 5జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీంతో 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.949 ప్లాన్: ఇది 84 రోజుల కాంప్రహెన్సివ్ ప్లాన్. దీంతో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. 84 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది. అదనంగా జియోక్లౌడ్, ఓటీటీ, ఇతర టెలికమ్ బెనిఫిట్లు ఆనందించవచ్చు. -
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 50 లక్షల లోపు ధర ఉండే అఫోర్డబుల్ గృహాల అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన నగరాల్లో విక్రయాలు 21,010 యూనిట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, సరఫరా తగ్గడం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది.నివేదిక ప్రకారం రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఖరీదు చేసే రెసిడెన్షియల్ సెగ్మెంట్లో కూడా విక్రయాలు 6 శాతం తగ్గి 26,832 యూనిట్లకు క్షీణించాయి. మార్చి త్రైమాసికంలో ఎక్కువగా ప్రీమియం కేటగిరీపైనే గృహాల కొనుగోలుదారులు దృష్టి పెట్టినట్లు రిపోర్ట్ పేర్కొంది. రూ. 1 కోటి పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు పెరగడం ఇందుకు నిదర్శనంగా వివరించింది.హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై తదితర 8 నగరాల్లో నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం..రూ. 1–2 కోట్ల రేటు ఉన్న గృహాల విక్రయాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరాయి. అలాగే రూ. 2–5 కోట్ల కేటగిరీలో 28 శాతం వృద్ధి చెంది 13,735 యూనిట్లు, రూ. 5–10 కోట్ల విభాగంలో విక్రయాలు ఏకంగా 82 శాతం పెరిగి 3,448 యూనిట్లుగా నమోదయ్యాయి.రూ. 10–20 కోట్ల కేటగిరీలో అమ్మకాలు రెట్టింపై 658 యూనిట్లకు చేరాయి. రూ. 20–50 కోట్ల విభాగంలోనూ రెండు రెట్లు పెరిగి 92 యూనిట్లుగా నమోదయ్యాయి. రూ. 50 కోట్ల పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు అనేక రెట్లు పెరిగి 169 యూనిట్లకు చేరాయి.రూ. 2 కోట్ల ధర శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరడం. -
IPO: ఎన్ఎస్డీఎల్ లిస్టింగ్‌కు గడువు పెంపు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్)కు వెసులుబాటు లభించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 2025 జులై 31వరకూ గడువు పెంచింది. ఎన్ఎస్డీఎల్ అభ్యర్ధనమేరకు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు మరింత గడువును సెబీ అనుమతించింది. దీంతో మార్కెట్ల పరిస్థితులు అనుకూలించేటంతవరకూ కంపెనీ లిస్టింగ్‌కు వెసులుబాటు లభించింది.నిజానికి 2024 సెప్టెంబర్‌లోనే ఎన్ఎస్డీఎల్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా ఎన్ఎస్డీఎల్ ప్రస్తుత వాటాదారులు ఎన్ఎస్ఈ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. దేశీయంగా తొలి సెక్యూరిటీల డిపాజిటరీగా కార్యకలాపాలు ప్రారంభించిన ఎన్ఎస్డీఎల్ 2024 సెప్టెంబర్‌కల్లా 6 ట్రిలియన్ డాలర్ల(సుమారు 500 లక్షల కోట్లు) విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. కాగా.. 2017లోనే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) ఎన్ఎస్ఈలో లిస్ట్‌కావడం గమనార్హం!టాన్బో ఇమేజింగ్ రూ. 175 కోట్ల సమీకరణ బెంగళూరు: డిఫెన్స్ టెక్నాలజీలను రూపొందించే టాన్బో ఇమేజింగ్ తాజాగా రూ. 175 కోట్లు సమీకరించింది. తమ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో భాగంగా డీ–సిరీస్ కింద ఫ్లోరిన్‌ట్రీ అడ్వైజర్స్, టెనాసిటీ వెంచర్స్, ఎగ్జిమ్ బ్యాంక్ తదితర సంస్థల నుంచి ఈ మొత్తాన్ని సేకరించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ లక్ష్మీకుమార్ తెలిపారు.ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, అత్యంత శక్తిమంతమైన మైక్రోవేవ్ టెక్నాలజీస్ మొదలైనవాటిని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్వాల్కామ్, ఆర్టిమాన్ వంటి ఇన్వెస్టర్ల నుంచి రూ. 300 కోట్లు సమకూర్చుకున్నట్లు వివరించారు. భారత రక్షణ శాఖ, నాటో, అమెరికా నేవీ సీల్స్ సహా 30 దేశాల రక్షణ బలగాలకు సేవలు అందిస్తున్నట్లు అరవింద్ చెప్పారు. -
రూ.1400 కోట్ల డీల్.. డెల్హివరీ చేతికి ఈకామ్ ఎక్స్‌ప్రెస్
ముంబై: లాజిస్టిక్స్ సర్వీసు ప్రొవైడర్ డెల్హివరీ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈకామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు సుమారు రూ.1400 కోట్లు వెచ్చించనుంది. పూర్తి నగదు రూపంలోనే చెల్లింపు చేసేలా ఒప్పందం ఖరారు చేసుకుంది. ‘‘ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము. 99.4 శాతం వాటాను రూ.1407 కోట్లకు కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది’’ అని డెల్హివరీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.గురుగ్రామ్‌కు చెందిన ఈకామర్స్ ఎక్స్‌ప్రైస్ 2012 ఆగస్టులో ప్రారంభమైంది. అప్పటి నుంచి 200 కోట్ల షిప్మెంట్లు డెలివరీ చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,607.3 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.2,548.1 కోట్లుగా ఉంది. విలీన ప్రక్రియకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంది.ఈ డీల్ ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని డెల్హివరీ అంచనా వేస్తోంది. ఈ విలీనంతో కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించే అవకాశం లభిస్తుందని కంపెనీ ఎండీ, సీఈఓ సాహిల్ బారువా తెలిపారు. డెల్హివరీతో భాగస్వామ్యం వల్ల మరింత వృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుందని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థాపకులు కే సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్‌లైన్..
పాన్ కార్డులకు (PAN Card) సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త డెడ్‌లైన్‌ను ప్రకటించింది. ఆధార్ ఎల్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డులు పొందినవారందరూ వచ్చే డిసెంబర్ 31 లోగా దానిని తమ ఒరిజినల్ ఆధార్ నంబర్‌తో భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.సీబీడీటీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 లేదా అంతకుముందు తమ ఆధార్ దరఖాస్తు నమోదు ఐడీని ఇచ్చి పాన్ కార్డులు వారందరూ తమ ఆధార్ నంబర్‌ను 2025 డిసెంబర్ 31 లోగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 3న విడుదలైంది. అయితే సదరు పాన్‌కార్డుదారులు తమ ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు ఎలా తెలియజేయాలన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.ఆధార్-పాన్ లింకింగ్ లాగేనా?నిర్దిష్ట పాన్ హోల్డర్లు ఆధార్ సంఖ్యను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడానికి పాన్-ఆధార్ లింకింగ్ పద్ధతిని ఉపయోగించవచ్చంటున్నారు ట్యాక్స్‌మన్.కామ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా. పాన్ హోల్డర్లు ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించి పాన్-ఆధార్ లింకింగ్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశిత పాన్ హోల్డర్లు పాన్-ఆధార్ లింక్ చేస్తే ఎలాంటి పెనాల్టీ వర్తించదని భావిస్తున్నారు. అయితే, దీని గురించి ఆదాయపు పన్ను శాఖ నుంచి మరింత స్పష్టత వస్తే ఇలాంటి పాన్ హోల్డర్లకు ఉపయోగపడుతుందన్నారు.మరో ప్రత్యామ్నాయ మార్గంలో పన్ను చెల్లింపుదారులు ఎన్ఎస్డీఎల్ ఈగవ్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ నిర్దేశిత పాన్ సేవా కేంద్రాన్ని సందర్శించి పాన్ కార్డు, ఆధార్ కార్డు, నిర్దేశిత రుసుము కాపీతో పాటు నిర్దేశిత ఫారాన్ని నింపవచ్చని ట్యాక్స్ కన్సల్టింగ్ సంస్థ భూటా షా అండ్ కో ఎల్ఎల్పీ పార్టనర్ స్నేహ పాధియార్ చెబుతున్నారు. సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా కూడా ఆధార్‌ను ధృవీకరించవచ్చని, పాన్, ఆధార్ డేటాలో పొంతన లేకపోతే బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి అని తెలియజేశారు.ప్రస్తుతం, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాన్-ఆధార్ లింక్ కోసం సాధారణ పాన్ హోల్డర్లకు గడువు 2023 జూన్ 30తో ముగిసింది. అందువల్ల పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని ఏ పాన్ హోల్డర్ అయినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేవలం ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డు పొందినవారు ఆ సమయంలో ఒరిజినల్ ఆధార్ నంబర్ లేదు కాబట్టి గడువులోగా రెండింటినీ లింక్ చేయలేరు. కాబట్టి, ఈ పాన్ హోల్డర్లకు ఇప్పుడు ఈ పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం నుండి మినహాయింపు ఇవ్వాలి.డిసెంబర్ 31 తర్వాత ఏమి జరుగుతుంది?పాన్ హోల్డర్లు తమ ఆధార్ నంబర్‌ను 2025 డిసెంబర్ 31 లోగా లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మరేదైనా తేదీలోగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే, పాన్ హోల్డర్లు తమ ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు అందించడంలో విఫలమైతే ఏమి జరుగుతుందో మాత్రం పేర్కొనలేదు. గడువు తేదీలోగా ఆదాయపు పన్ను శాఖకు ఆధార్ నంబర్ తెలియజేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ పనిచేయకపోవచ్చు. అయితే ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి మరింత స్పష్టత వస్తే బాగుంటుందని వాధ్వా పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్‌అండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.ఇదీ చదవండి 👉 ఈవీ ఇళ్లకు డిమాండ్.. ధరల పెరుగుదలా డబుల్!బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని జేఎల్ఎల్ ఇండియా (రెసిడెన్షియల్ సర్వీసెస్) ఎండీ శివ కృష్ణన్ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్‌ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. -
బంగారం రెండోసారి.. వెండి మూడోసారి..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ దిగొచ్చాయి. వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు నిన్నటి రోజున భారీగా తగ్గి ఉపశమనం ఇచ్చాయి. నేడు (April 5) కూడా అదే తగ్గుదలను కొనసాగించాయి.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,660 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.900, రూ.980 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.90,810 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,250 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.980, రూ.900 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనాచైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,660 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.900, రూ.980 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి భారీ పతనందేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర కేజీకి రూ.5000 క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,03,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 94,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
క్షణాల్లో ఫేక్ ఆధార్, పాన్ కార్డులు..
ఏఐ.. అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. దీని వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తోంది. వీటిలో ప్రముఖమైంది ఓపెన్ఏఐ సంస్థ సృష్టించిన చాట్‌జీపీటీ. ఇది విడుదలైనప్పటి నుండి వినియోగం ఎంత పెరిగిందో.. గోప్యతా సమస్యలనూ అంతే స్థాయిలో లేవనెత్తుతోంది.ముఖ్యంగా కంటెంట్, చిత్రాల (ఇమేజ్) సృష్టికి సంబంధించి చాట్‌జీపీటీ సామర్థ్యం కలవరపెడుతోంది. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్‌ను సృష్టించే కృత్రిమ మేధ సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తోంది.సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీవి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జీపీటీ -4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్ట్‌లను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించవచ్చని చాలా మంది ఔత్సాహిక సోషల్ మీడియా యూజర్లు ఇటీవల కనుగొన్నారు.ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "చాట్‌జీపీటీ నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాలి" అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు...?" అంటూ మరో యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk. This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025 -
ఈవీ ఇళ్లకు డిమాండ్.. ధరల పెరుగుదలా డబుల్!
ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ(రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్దస్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యువేషన్ అడ్వైజరీ హెడ్ ఏ.శంకర్ తెలిపారు.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవటమే అసలైన సవాల్. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్ ప్లేస్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం
ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతీకార చర్యలకు దిగడంతో అమెరికా మార్కెట్లు అల్లకల్లోలానికి గురయ్యాయి. 2020 తర్వాత భారీ పతనాన్ని చవిచూశాయి. ఎస్&పీ 500 సూచీ ఏకంగా 6 శాతం పడిపోయింది. ఇది మాంద్యం భయాలకు ఆజ్యం పోసింది. ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఆందోళనను తీవ్రతరం చేసింది.కోవిడ్-19 సంక్షోభం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటి పరిస్థితి తర్వాత వాల్ స్ట్రీట్ శుక్రవారం తీవ్ర తిరోగమనాన్ని ఎదుర్కొంది. ట్రంప్ టారిఫ్ పెంపునకు ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతులపై ప్రతీకార సుంకాలను ప్రకటించిడంతో ఎస్&పీ 500 సూచీ 6% పడిపోయింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన 2020 మార్చి తర్వాత ఎస్&పీ 500 సూచీ పనితీరుకు సంబంధించి అత్యంత చెత్త వారం ఇదే. ఇక డౌజోన్స్ 2,231 పాయింట్లు (5.5%) క్షీణించగా, నాస్డాక్ కూడా 5.8 శాతం పడిపోయింది.యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలు శుక్రవారం రికార్డు స్థాయిలో 26.79 బిలియన్ షేర్లను ట్రేడ్ చేశాయి. ఇది 2021 జనవరి 27 నాటి గరిష్ట స్థాయి 24.48 బిలియన్లను అధిగమించింది. నాస్డాక్ 962.82 పాయింట్లు క్షీణించి 15,587.79 వద్ద ముగిసింది. దాని డిసెంబర్ 16 నాటి రికార్డు ముగింపు గరిష్టం 20,173.89 నుండి 20 శాతానికి పైగా పడిపోయింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2,231.07 పాయింట్లు క్షీణించి 38,314.86 వద్దకు దిగజారింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఎస్&పీ 500 సూచీ 322.44 పాయింట్లు క్షీణించి 5,074.08 వద్దకు పడిపోయింది. 11 నెలల్లో ఇదే అత్యల్ప ముగింపు.అన్ని షేర్లకూ నష్టాలే..ఎస్&పీ 500 సూచీలో ఉన్న 500 కంపెనీల్లో 12 మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. ముడి చమురు ధర 2021 తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందనే ఆందోళనలతో ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలైన రాగి వంటి లోహాల ధరలు కూడా పడిపోయాయి. -
తుప్పు దరిచేరని ఉక్కు
హైదరాబాద్: ప్రముఖ ఉక్కు ఉత్పాదక సంస్థ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ఆధునాతన సాంకేతికత సాయంతో తుప్పు నిరోధక, బలీయమైన ఉక్కు ఉత్పాదనకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌లో జరిగిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్లో ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ నూతన ఉత్పత్తి ఎంఎస్ లైఫ్ 600+ సీఆర్ఎస్ (తుప్పు నిరోధక స్టీల్)ను ఆవిష్కరించింది.అలాగే రాబోయే 3–4 సంవత్సరాలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచడానికి రూ1,200 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ దేశవ్యాప్తంగా 1000కిపైగా డీలర్లతో తమ వ్యాపార పరిధిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.1200కోట్లకు పైగా పెట్టుబడులతో 1.2 మిలియన్ టీపీఎ ఉత్పత్తి చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 18–20 నెలల్లో దేశవ్యాప్తంగా 1,000+ యాక్టివ్ డీలర్లకు విస్తరించనున్నారు. విస్తరణ ద్వారా 5,000+ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. -
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాల దెబ్బకు కెనడాలో తొలి పతనం చోటుచేసుకుంది. వాహన విడిభాగాలపై విధించిన సుంకాల కారణంగా కార్ల తయారీ సంస్థ స్టెలాంటిస్ ఎన్వీ తన విండ్సర్ ఫ్యాక్టరీని రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.కెనడాలోని విండ్సర్‌లో ఉన్న స్టెలాంటిస్ ప్లాంట్‌లో సుమారు 3,600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ మినీవ్యాన్లు, డాడ్జ్ ఛార్జర్ వాహనాలు తయారు చేస్తున్నారు. ఈ కర్మాగారంలో ఏప్రిల్ 7 నుంచి ఉత్పత్తిని కంపెనీ నిలిపివేస్తోంది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఇదీ చదవండి: ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..ఆటోమోటివ్ దిగ్గజం స్టెలాంటిస్ నిర్ణయం యూఎస్ ప్రభుత్వం విధించే 25% సుంకాల వల్ల ఆటోమోటివ్ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడిని నొక్కిచెబుతుంది. ఇది యూఎస్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చర్య అయినప్పటికీ ఉత్తర అమెరికా ఉత్పత్తి గొలుసులకు అనాలోచిత పరిణామాలకు దారితీస్తుంది.టారిఫ్‌ల ప్రభావంటారిఫ్లు వాహన తయారీదారులకు ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా పెంచనున్నాయి. దీంతో పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టించాయి. విండ్సర్ ప్లాంట్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్టెలాంటిస్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ విడిభాగాలు, కార్మికులు, మార్కెట్ల నెట్‌వర్క్‌పై ఆధారపడే తయారీదారులపై ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. ఇటువంటి అంతరాయాలు వాహన డెలివరీలో జాప్యానికి దారితీస్తాయని, సరఫరాదారుల సంబంధాలు దెబ్బతింటాయని, వినియోగదారులకు సంభావ్య ధరల పెరుగుదలకు కూడా దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’.. రూ. 25,000 వరకు డిస్కౌంట్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకు కార్డులపై, పేపర్ ఫైనాన్స్ పై రూ. 25000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఏప్రిల్ 4 నుండి 20 వరకు అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, ఆన్లైన్లో సంస్థ వెబ్సైట్లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.అన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఆఫర్లు చెల్లుతాయని, సులభ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐ ఎంపికలు, వేగవంతమైన డెలివరీ, ఇన్స్టాలేషన్ వంటి సదుపాయాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. వేసవి నేపథ్యంలో ఏసీలు, విస్తృత శ్రేణి ఏయిర్ కూలర్స్ పైనా మంచి డీల్స్ ఉన్నాయి.ల్యాప్టాప్స్, సరికొత్త స్మార్ట్ ఫోన్స్, టీవీలపై భారీగా తగ్గింపులు అందిస్తోంది. ఇక యాపిల్ ఏయిర్ పాడ్స్, యాపిల్ వాచ్ వంటి ప్రీమియం గ్యాడ్జెలను తక్కువ ఈఎమ్ఐలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే గృహోపకరణాలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. -
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక కారిడార్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, సేవలకు అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు నిర్ణయించారు. దీని ప్రభావం భారత్‌లోని అనేక రంగాలపై పడనుంది. ముఖ్యంగా 280 బిలియన్ డాలర్ల విలువైన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే దీనికి యునైటెడ్ స్టేట్స్ కీలకమైన ఆదాయ వనరు.యూఎస్-ఇండియా టెక్ బంధందశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ సేవల రంగం అభివృద్ధి చెందింది. యూఎస్ కంపెనీలతో దాని భాగస్వామ్యం, డిజిటల్ పరివర్తనతో నడిచే ప్రాజెక్టుల స్థిరమైన ప్రవాహం ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమకు ఆదాయంలో దాదాపు 50% అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో యూస్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు అమెరికా-భారత్ టెక్ బంధానికి విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ టారిఫ్‌లు భారతీయ ఐటీ సేవలపై ఆధారపడిన యూఎస్ సంస్థలకు ఖర్చులను పెంచబోతున్నాాయి.తక్షణ పరిణామాలు కొత్త సుంకాలు అమెరికాకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీలు బడ్జెట్లను కఠినతరం చేయవలసి వస్తుంది. విచక్షణతో కూడిన సాంకేతిక వ్యయంలో వృద్ధి సాధించిన భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించవచ్చు. 2026 ఆర్థిక సంవత్సరానికి 6-8 శాతం అత్తెసరు వృద్ధి రేటు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇండస్ట్రీ రెస్పాన్స్..యూఎస్ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, భారతీయ ఐటీ సంస్థలు తమ భౌగోళిక పరిధి, క్లయింట్ స్థావరాలను వైవిధ్యపరచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఐరోపా, ఆసియా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషిస్తూ అమెరికా నుంచి డిమాండ్ క్షీణతను పూడ్చడమే ఈ చర్యల లక్ష్యం.కొత్త అవకాశాలూ..ఈ కల్లోలం భారత ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. యూఎస్ తయారీ, ఆటోమేషన్ రంగాలకు అనుగుణంగా సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఐటీ పరిశ్రమ అమెరికన్ మార్కెట్లో తన ప్రాముఖ్యతను తిరిగి స్థాపించడానికి మార్గాలను కనుగొనవచ్చు.ముందున్న మార్గం తక్షణ సవాళ్లు గణనీయంగా ఉన్నప్పటికీ, భారత ఐటీ సేవల పరిశ్రమ స్థితిస్థాపకతను తక్కువ అంచనా వేయలేము. గతంలో ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ మార్పుల సమయంలోనూ మన ఐటీ పరిశ్రమ నిలదొక్కుకుంది. అలాగే ప్రస్తుత తుఫానులను కూడా ఎదుర్కోవడమే కాకుండా ఆవిష్కరణ, వైవిధ్యీకరణ ద్వారా మరింత బలంగా ఎదిగే ఈ రంగం సామర్థ్యానికి రాబోయే సంవత్సరాలు పరీక్షగా నిలవనున్నాయి. -
రియల్ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 2025 జనవరి–మార్చిలో 31 శాతం జంప్ చేసినట్లు రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా పేర్కొంది. ప్రధానంగా రెసిడెన్షియల్ విభాగంలో పెట్టుబడులు పుంజుకోవడంతో 1.3 బిలియన్ డాలర్లను తాకినట్లు ఒక నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం వీటిలో 60 శాతం వాటాతో దేశీ ఇన్వెస్టర్లు ప్రధాన పాత్ర పోషించారు. వార్షికంగా 75 శాతం వృద్ధితో 0.8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల్లో ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్, ఆఫీస్ విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.హౌసింగ్ విభాగంలో నిధులు 3 రెట్లు ఎగసి 30.29 కోట్ల డాలర్లకు చేరగా.. గతేడాది ఇదే కాలంలో 10.26 కోట్ల డాలర్లు మాత్రమే లభించాయి. ఆఫీస్ కాంప్లెక్సులలో సంస్థాగత పెట్టుబడులు 23 శాతం క్షీణించి 43.42 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గత జనవరి–మార్చిలో 56.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనల తర్వాత భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో అమ్మకాలను కొనసాగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 930.67 పాయింట్లు లేదా 1.22 శాతం క్షీణించి 75,364.69 వద్ద స్థిరపడింది. సూచీ 76,258.12 నుంచి 75,240.55 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 345.65 పాయింట్లు లేదా 1.49 శాతం క్షీణించి 22,904.45 వద్ద స్థిరపడింది.టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 8.36 శాతం వరకు నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ 1.59 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 3.56 శాతం క్షీణించడంతో స్మాల్ క్యాప్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.91 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో స్థిరపడగా, మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, రియల్టీలు 2-6.5 శాతానికి పైగా నష్టపోయాయి. -
కొత్త రీచార్జ్ ప్లాన్: 2 నెలలు.. 251జీబీ..
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనింత మంది యూజర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దాని తాజా ఆఫర్లలో ఒకటైన రూ.251 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ మార్కెట్లో పోటీని రేకెత్తిస్తోంది.పరిమిత కాల ఆఫర్బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.251 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో 251 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. పెద్ద మొత్తంలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసేవారికి, ముఖ్యంగా ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను బఫరింగ్ లేకుండా ఆస్వాదించాలనుకునే క్రికెట్ అభిమానులకు ఇది అద్భుతమైన ఎంపిక. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్, కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియోగదారులు వెంటనే బీఎస్ఎన్ఎల్ యాప్ లేదా వెట్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి.ఇది చదివారా? సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్రీచార్జ్ చేసుకునేవారు ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది డేటా-ఓన్లీ ప్లాన్. అంటే ఇందులో అపరిమిత కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. మీకు ఆ సేవలు అవసరమైతే అదనపు రీఛార్జ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్ల నుండి పెరుగుతున్న డేటా ఖర్చుల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ డేటా ఎంపిక కోసం చూస్తున్నవారికి ఇది అనువైన ప్లాన్. -
టెస్లాకు మస్క్ రాజకీయాల సెగ.. అమ్మకాలు డౌన్
న్యూయార్క్: ఒకవైపు ప్రత్యర్ధి కంపెనీల నుంచి పోటీ, మరోవైపు స్వయంగా సీఈవో ఎలాన్ మస్క్ బాహాటంగా రాజకీయాల్లో మునిగి తేలుతుండటం తదితర పరిణామాలు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు సమస్యాత్మకంగా మారుతున్నాయి. దీంతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో కంపెనీ విఫలమవుతోంది.ఫలితంగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో టెస్లా కార్ల విక్రయాలు రెండంకెల స్థాయిలో 13 శాతం పడిపోయాయి. గతేడాది మార్చి క్వార్టర్లో 3,87,000 వాహనాలు విక్రయించగా, ఈసారి మార్చి క్వార్టర్లో ఈ సంఖ్య 3,36,681 యూనిట్లకు పడిపోయింది. భారీగా డిస్కౌంట్లు, ఇతరత్రా ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ ఈ పరిస్థితి నెలకొంది.వాస్తవానికి విక్రయాల సంఖ్య 4,08,000 యూనిట్లుగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. అమెరికా, చైనాతో పాటు యూరప్‌లోనూ టెస్లా కార్లకు డిమాండ్ నెమ్మదించిందని, బ్రాండ్ ప్రతిష్ట మసకబారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జనవరి– మార్చి త్రైమాసిక ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికంటే ఘోరంగా ఉండొచ్చని చెప్పారు. -
హెచ్ఎండీ నుంచి 2 మ్యూజిక్ ఫోన్లు
న్యూఢిల్లీ: హ్యూమన్ మొబైల్ డివైజెస్ (హెచ్ఎండీ) తాజాగా రెండు మ్యూజిక్ ఆధారిత ఫీచర్ ఫోన్లను (హెచ్ఎండీ 130 మ్యూజిక్, హెచ్ఎండీ 150 మ్యూజిక్) ప్రవేశపెట్టింది. వీటిలో 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 5.0, టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్, యూపీఐ పేమెంట్స్ సామర్థ్యాలు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.హెచ్ఎండీ 130 ధర రూ. 1,899గా, హెచ్ఎండీ 150 ధర రూ. 2,399గా ఉంటుంది. రిటైల్ స్టోర్స్, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలతో పాటు తమ వెబ్సైట్లో ఇవి లభిస్తాయని సంస్థ గ్లోబల్ చైర్మన్ జీన్ ఫ్రాంకోయిస్ బారిల్ తెలిపారు. త్వరలోనే ఎంట్రీ స్థాయి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.భారత్‌లో విక్రయిస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తులు దేశీయంగా తయారైనవేనని హెచ్ఎండీ ఇండియా వీపీ రవి కున్వర్ పేర్కొన్నారు. తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, వనరులపరంగా భారత్ కీలక మార్కెట్‌గా ఉంటోందని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్ 2025కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని పొడిగించుకున్నట్లు వివరించారు. -
ఐపీఓ అరంగేట్రం.. రిక్రూట్మెంట్ కంపెనీ సన్నాహాలు
రిక్రూట్మెంట్ అండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో మరింత వృద్ధిపై దృష్టి సారించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.300 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఉత్సాహంతో 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.500 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రాబోయే ఐపీఓ అరంగేట్రం కోసం కంపెనీ సన్నాహాలు చేస్తోంది.ఐపీవో సన్నాహాల్లో భాగంగా సీనియర్ లీడర్ షిప్లో కీలక మార్పులు చేసింది. గతంలో సహ వ్యవస్థాపకులు కమల్ కారంత్, అనిల్ ఎథనూర్ నిర్వహించిన బాధ్యతలను క్రమబద్ధీకరిస్తూ ఫ్రాన్సిస్ పడమడన్ను కాబోయే సీఈఓగా ప్రకటించింది. ఈ నాయకత్వ మార్పుతో కంపెనీ స్పెషలిస్ట్ సిబ్బంది, వ్యూహాత్మక గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ భాగస్వామ్యాల అభివృద్ధి, కొత్త ప్రాంతాలకు విస్తరించడంపై దృష్టి పెడుతోంది."ఎదుగుదలలో మేమిప్పడు కీలక దశలో ఉన్నాం. ఫ్రాన్సిస్ నాయకత్వంలో మా నాయకత్వ బృందం నడవడం స్పెషలిస్ట్ స్టాఫింగ్ స్పేస్‌లో ఆధిపత్య కంపెనీగా మారడానికి ఒక కీలకమైన దశ" అని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ అన్నారు.భారతదేశ 6 బిలియన్ డాలర్ల స్పెషలిస్ట్ స్టాఫింగ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏటా 40 కి పైగా కొత్త జీసీసీలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఐటీ టాలెంట్ పూల్స్ నుండి సుమారు 20,000 కొత్త నియామకాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా సాఫ్టవేర్ ఇంజనీర్లు భారత్ నుండి వలసపోతున్నారని, ఇది ప్రత్యేకమైన సిబ్బంది అవకాశాలను సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది.2017లో స్థాపించిన ఎక్స్‌ఫెనో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ. ఇది జీసీసీలు, పెద్ద సంస్థల కోసం 23,000 మందికి పైగా టెక్ నిపుణులను నియమించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ సహా ముఖ్యమైన భారతీయ నగరాలతో పాటు అంతర్జాతీయంగా యూఎస్‌లోనూ ఉనికిని కలిగి ఉంది. -
ఇక రిలయన్స్ గేమ్స్.. బ్లాస్ట్ ఈస్పోర్ట్స్‌తో జేవీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఈస్పోర్ట్స్ బిజినెస్ నిర్వహించేందుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. సొంత అనుబంధ సంస్థ రైజ్ వరల్డ్‌వైడ్ ద్వారా బ్లాస్ట్ ఈస్పోర్ట్స్‌తో ఇందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా జేవీకి తెరతీయనుంది.రిలయన్స్, బ్లాస్ట్ జత కట్టడం(జేవీ) ద్వారా దేశీయంగా అత్యున్నత ఐపీలను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో రెండు సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాకుండా అభిమానులు, క్రీడాకారులు, బ్రాండ్ల కోసం బ్లాస్ట్కున్న గ్లోబల్ ఐపీలను సైతం దేశీయంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశాయి.బ్లాస్ట్ ఏపీఎస్(డెన్మార్క్) ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టోర్నమెంట్ నిర్వాహక సంస్థలలో ఒకటికాగా.. గేమ్ పబ్లిషింగ్ గ్లోబల్ దిగ్గజాలు ఎపిక్ గేమ్స్, వాల్వ్, రియట్ గేమ్స్, క్రాఫ్టన్, యూబిసాఫ్ట్ తదితరాలతో కలసి పనిచేస్తోంది. తద్వారా గ్లోబల్ ఈస్పోర్ట్స్ ప్రాపరీ్టలను ఆవిష్కరిస్తోంది. -
ఫార్ములా ఈ రేస్ ఫ్యాన్స్‌కు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్
ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్షిప్కి సంబంధించిన టీమ్‌లు, డ్రైవర్లు, ఇతరత్రా వివరాలన్నీ అభిమానులకు సమగ్రంగా అందించేలా ’ఫార్ములా ఈ–స్టాట్స్ సెంటర్’ను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆవిష్కరించింది. తొలి ఎలక్ట్రిక్ ఎఫ్ఐఏ ప్రపంచ కాంపిటీషన్ అయిన ‘ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్’తో భాగస్వామ్యం ద్వారా కంపెనీ దీన్ని రూపొందించింది.సంక్లిష్టమైన డేటాను సరళతరంగా అందించేందుకు, అభిమానులు–చాంపియన్‌షిప్ మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ–స్టాట్స్ సెంటర్ ఉపయోగపడుతుందని ఇన్ఫీ తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత ’ఇన్ఫోసిస్ టొపాజ్’ సొల్యూషన్‌తో దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించింది. దీనితో ఫ్యాన్స్.. వివిధ సీజన్లవ్యాప్తంగా తమ అభిమాన డ్రైవర్లు, టీమ్‌ల పనితీరును ట్రాక్ చేయొచ్చని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డాడ్స్ తెలిపారు. ఆసక్తికరమైన క్యూరేటెడ్ ప్రశ్నలతో ట్రెండింగ్ బబుల్ చాట్ ఫార్మాట్‌ను ఉపయోగించి ప్రస్తుత, గత సీజన్లలో డ్రైవర్లు, జట్ల గణాంకాలను ప్రదర్శించడం ద్వారా ఇది యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్ సంక్లిష్టమైన డేటాను సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఫార్ములా ఈ సెంట్రల్ డేటా పూల్‌ను ఇన్ఫోసిస్ గూగుల్ క్లౌడ్ కు తరలించి తద్వారా ఫార్ములా ఈ మార్కెటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్రీడా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సురక్షితమైన ఏర్పాటు చేసింది. -
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్‌లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
ఐటీ షేర్లు పతనం.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలను ప్రకటించడంతో ఇండియన్ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ అన్ని యూఎస్ దిగుమతులపై బేస్‌లైన్ 10 శాతం పన్నును కలిగి ఉన్న కొత్త టారిఫ్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. వాణిజ్య మిగులు ఉన్న దేశాలపై అదనపు అధిక సుంకాలను విధించించారు. భారత్ ఇప్పుడు అమెరికా నుంచి 27 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 322.08 పాయింట్లు (0.42 శాతం) క్షీణించి 76,295.36 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 76,493.74 -75,807.55 రేంజ్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 82.25 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 23,250.10 వద్ద స్థిరపడింది.టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగియడంతో బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 18 నష్టాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ 4.57 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.58 శాతం పెరగడంతో స్మాల్ క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లను మించిపోయాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.21 శాతం నష్టపోగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, టీసీఎస్, ఎంఫాసిస్ సూచీలు నష్టపోయాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగాలు కూడా తక్కువ పనితీరు కనబరిచాయి.నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.25 శాతానికి పైగా లాభపడటంతో ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకులు, హెల్త్ కేర్, ఎఫ్ ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.94 శాతం వరకు లాభపడ్డాయి. -
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సర్వీస్ లైన్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల నియమితులయ్యారు. కంపెనీ అంతర్జాతీయ జీసీసీ ప్రణాళికల అమలుకు ఆమె తోడ్పడనున్నారు. గతంలో కాగ్నిజెంట్‌లో ఆరేళ్లు పని చేసిన శైలజ, కొద్ది విరామం తర్వాత తిరిగొచ్చారు.ఆర్థిక సేవల మార్కెట్లో ఆమెకు అపార అనుభవం ఉందని కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. నిరూపితమైన ట్రాక్ రికార్డుతో, శైలజ నాయకత్వం జీసీసీల ఏర్పాటు, అభివృద్ధిలో తమ సామర్థ్యాన్ని పెంచుతుందని, క్లయింట్లకు గొప్ప విలువను అందిస్తుందని పేర్కొన్నారు.ఈవైలో కొంతకాలం పనిచేసిన తర్వాత జోస్యుల తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు. 2018 నుంచి 2024 వరకు కాగ్నిజెంట్‌లో హైదరాబాద్ సెంటర్ హెడ్‌గా, బీఎఫ్ఎస్ఐ ఆపరేషన్స్ డెలివరీ గ్లోబల్ హెడ్‌గా సేవలందించారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె థామ్సన్ రాయిటర్స్, హెచ్ఎస్బీసీల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. -
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన నిర్మాణ రంగ మెటీరియల్స్ సొల్యూషన్స్ విభాగం బిర్లాన్యూ వచ్చే 3–4 ఏళ్లలో అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రూ. 1,200 కోట్లు – రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ అవంతి బిర్లా తెలిపారు. అలాగే, అధిక వృద్ధి సాధన దిశగా ఇతర సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు వివరించారు.పైపులు, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాల వ్యాపార విభాగాలు కీలక వృద్ధి చోదకాలుగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంటీరియర్స్ బ్రాండ్ పారాడోర్ వ్యాపారం కూడా వచ్చే మూడు, నాలుగేళ్లలో రెట్టింపు కాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ గతేడాదే పైపులు, ఫిట్టింగ్స్ తయారీ సంస్థ క్రెస్టియా పాలిటెక్‌తో పాటు దాని నాలుగు అనుబంధ సంస్థలను రూ. 265 కోట్లకు కొనుగోలు చేసింది.ఏజీఐ గ్రీన్‌ప్యాక్ రూ. 700 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటైనర్ గ్లాస్‌ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ సందీప్ సోమాని తెలిపారు. ఈ ప్లాంటు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 500 టన్నులుగా ఉంటుందని, దీనితో తమ తయారీ సామర్థ్యం సుమారు 25 శాతం పెరుగుతుందని వివరించారు. ఫార్మా, బెవరేజెస్ తదితర రంగాల కోసం ఉత్పత్తులు తయారు చేసే ఈ ప్లాంటు, 24 నెలల్లో అందుబాటులోకి రాగలదని చెప్పారు. -
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ వాట్సాప్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘ట్యాప్2ఇన్వెస్ట్’ను ప్రవేశపెట్టింది. ఈ ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్ ప్రస్తుత కేవైసీ-వెరిఫైడ్ ఇన్వెస్టర్లను వాట్సాప్‌లో క్లిక్ ఆధారిత ఇంటర్ఫేస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుందని మ్యూచువల్ ఫండ్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.టెక్ట్స్ కమాండ్లపై ఆధారపడే సాంప్రదాయ వాట్సాప్ ఆధారిత పెట్టుబడి సేవల మాదిరిగా కాకుండా, ట్యాప్ 2ఇన్వెస్ట్ వాట్సాప్‌లో యూజర్ ఫ్రెండ్లీ, యాప్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు నేరుగా వాట్సాప్ (+91-82706 82706) ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ప్రారంభించవచ్చు. లేదా పెద్ద మొత్తం పెట్టుబడులను సైతం పెట్టవచ్చు.యూపీఐ ఆటోపే, నెట్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ పేమెంట్ ఆప్షన్లకు ఈ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేస్తుందని ఫండ్ హౌస్ తెలిపింది. వాట్సాప్ వంటి సుపరిచిత ప్లాట్ఫామ్లో ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నిర్వహించడానికి ‘ట్యాప్2ఇన్వెస్ట్’ సురక్షితమైన మార్గాన్ని అందిస్తుందని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ, సీఈఓ నవనీత్ మునోత్ వివరించారు. -
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
పూర్తి అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ను విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఏబీసీఎల్) వెల్లడించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశాల మేరకు ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ను మాతృ సంస్థలో విలీనం చేయాలని గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. విలీన సంస్థకు ఎండీ, సీఈవోగా విశాఖ మూల్యే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాకేశ్ సింగ్ వ్యవహరిస్తారు. దీంతోపాటు నగేష్ పింగే, సునీల్ శ్రీవాస్తవ్ లను కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.2024 డిసెంబర్ 31 నాటికి రూ .5.03 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఏబీసీఎల్ నిర్వహణలో ఉన్నాయి. వీటిలో రూ .1.46 లక్షల కోట్లకు పైగా ఏకీకృత రుణాలు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో కంపెనీ జీవిత, ఆరోగ్య బీమా వ్యాపారాలలో రూ .16,942 కోట్ల స్థూల ప్రీమియంను ఆర్జించింది. అదే సమయంలో రూ.28,376 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని, రూ.2,468 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ అన్ని వ్యాపారాలలో 1,482 శాఖలు, 2 లక్షలకు పైగా ఏజెంట్లు / ఛానల్ భాగస్వాములతో పాటు అనేక బ్యాంక్ భాగస్వాములతో దేశవ్యాప్త ఉనికిని కలిగి ఉంది. -
బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా
అంతర్జాతీయంగా బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ధర ఇన్వెస్టర్లకు వరంగా ఉన్నా, ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం భారంగా మారింది. అయితే ఇది ఎంతో కాలం ఉండదని, త్వరలోనే బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. బంగారం ధరలు దాదాపు 40 శాతం తగ్గుతాయని కొన్ని అంచనాలు వెలువడ్డాయి.అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్స్టార్లో మార్కెట్ స్ట్రాటజిస్ట్ జాన్ మిల్స్ బంగారం ధర ఔన్స్‌కు 1,820 డాలర్లకు పడిపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం (ఏప్రిల్ 2) ఒక ఔన్స్ పసిడి ధర 3,123 డాలర్ల వద్ద ఉంది. భారత్‌లో (ఢిల్లీ) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.92,990 వద్ద, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.85,250 వద్ద ఉంది. ఇదే అంచనా నిజమైతే బంగారం ధరలు భారీగా దిగొస్తాయి.భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ ఆందోళనల కలయికతో బంగారం ఇటీవల పుంజుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులకు భయపడి ఇన్వెస్టర్లు సురక్షిత స్వర్గధామంగా బంగారం వైపు మొగ్గు చూపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనలో కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. బంగారానికి డిమాండును మరింత పెంచాయి.తగ్గేందుకు చెబుతున్న కారణాలుబంగారానికి ప్రస్తుత బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్ మన్ శాక్స్ వంటి ప్రధాన ఆర్థిక సంస్థలు బంగారంపై బుల్లిష్ గా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో బంగారం ధర ఔన్స్‌కు 3,500 డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేయగా, గోల్డ్‌మన్ శాక్స్ ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ ధర 3,300 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే ఇందుకు భిన్నంగా మిల్స్తోపాటు మరికొందరు విశ్లేషకులు బంగారం ధరలలో గణనీయమైన తగ్గుదల వస్తుందని భావిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలను పేర్కొంటున్నారు.పెరిగిన సరఫరా: ప్రపంచవ్యాప్తంగా బంగారం సరఫరా వేగంగా పెరుగుతోంది. 2024 రెండో త్రైమాసికంలో గోల్డ్ మైనింగ్ లాభాలు ఔన్స్‌కు 950 డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఉత్పత్తిని పెంచింది. ప్రపంచ బంగారు నిల్వలు 9% పెరిగి 2,16,265 టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా తన బంగారం ఉత్పత్తిని పెంచగా, పాత బంగారం రీసైక్లింగ్ కూడా పెరిగింది. ఇది మరింత సరఫరాను జోడించింది.డిమాండ్ తగ్గే సంకేతాలు: సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు దూకుడుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఈ ధోరణి కొనసాగకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది సెంట్రల్ బ్యాంకులు 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, వరుసగా మూడో ఏడాది 1,000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. అయితే 71% కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకోకూడదని భావిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే కనుగొంది.మార్కెట్ సంతృప్తత: పసిడి పరిశ్రమలో విలీనాలు, కొనుగోళ్లు పెరగడం తరచుగా మార్కెట్ గరిష్టాలను సూచిస్తుంది. 2024 లో, బంగారం రంగంలో డీల్ మేకింగ్ 32% పెరిగింది. ఇది మార్కెట్ వేడెక్కవచ్చని సూచిస్తుంది. అంతేకాకుండా, బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పెట్టుబడులలో ఇటీవలి పెరుగుదల బంగారం ధరలు పుంజుకోకముందుటి పరిస్థితులకు దగ్గర ఉండటం ధరల పతనం తక్షణమే ఉండవచ్చనే వాదనలను బలపరుస్తోంది. -
టెక్ లేఆఫ్‌లు.. ఒక్క నెలలో ఎన్ని వేల కోతలో..
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల (layoffs) జోరు తగ్గడం లేదు. గడిచిన మార్చి నెలలో కనీసం 21 కంపెనీలు 8,834 మంది ఉద్యోగులను తొలగించాయని రియల్ టైమ్‌లో టెక్ లేఆఫ్‌లను ట్రాక్ చేసే పోర్టల్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. అయితే ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో లేఆఫ్స్ కాస్త తగ్గాయి. ఈ పోర్టల్ ప్రకారం.. ఫిబ్రవరి నెలలో 46 కంపెనీలు 15,994 ఉద్యోగులను తొలగించాయి. ఇది 2025లో ఇప్పటివరకు అదే అత్యధికం.లేఆఫ్స్ కాస్త తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఎలా సమూల మార్పులకు లోనవుతోందో ఈ ధోరణి సూచిస్తుంది. మార్చిలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల పేర్లలో హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్, నార్త్‌వోల్ట్, బ్లాక్, ఓలా ఎలక్ట్రిక్, నియాంటిక్ వంటివి ప్రముఖంగా ఉన్నాయి. అన్ని రకాల పరిశ్రమలు, ప్రాంతాలు, ఉద్యోగ స్థాయిల్లో ఉద్యోగాల కోతలు పెరిగాయి.ఓలాలో ఉద్యోగాల కోతబెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తున్నట్లు మార్చి నెల ప్రారంభంలో వార్తలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను నియంత్రించుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ తొలగింపులను చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఫుల్ఫిల్మెంట్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పలు విభాగాలపై ఈ ఉద్యోగాల కోత ప్రభావం చూపతోంది. ఐదు నెలల వ్యవధిలో కంపెనీలో ఉద్యోగుల తొలగింపు ఇది రెండోసారి కావడం గమనార్హం. 2024 నవంబర్‌లో ఓలా సుమారు 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది.భారీ తొలగింపులు ఈ కంపెనీల్లోనే..మార్చిలో హ్యూలెట్ ప్యాకర్డ్ (HP) ఎంటర్ప్రైజెస్ 2,500 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. సర్వర్ వ్యాపారంలో క్షీణిస్తున్న లాభాలను భర్తీ చేసుకోవడానికి తొలగింపులను అమలు చేస్తున్నట్లు ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. మార్చి 6న ట్రేడింగ్ లో కంపెనీ షేరు 19 శాతం క్షీణించింది. ఉద్యోగుల తొలగింపుతో కూడిన వ్యయ తగ్గింపు కార్యక్రమాన్ని వచ్చే 18 నెలల్లో అమలు చేస్తామని, ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల పొదుపులో 350 మిలియన్ డాలర్లకు దారితీస్తుందని కంపెనీ తెలిపింది. 2024 అక్టోబర్ నాటికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఇందులో 61,000 మంది ఉద్యోగులు ఉన్నారు.సగానికి పైగా ఉద్యోగుల తొలగింపుస్వీడిష్ బ్యాటరీ తయారీ సంస్థ నార్త్‌వోల్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సగానికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. స్వీడన్ లో ఉన్న 4,500 మంది ఉద్యోగుల్లో 2,800 మందిని తొలగించింది. ప్రస్తుతానికి 1,200 మంది ఉద్యోగులను కంపెనీ కొనసాగించనుంది.మరోవైపు, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ 931 మంది ఉద్యోగులను తొలగించింది. పనితీరు ఆధారిత పునర్నిర్మాణమే ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ విస్తృత పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా తన డబ్లిన్ కార్యాలయం నుండి 300 ఉద్యోగాలను తగ్గించింది. -
లాభాలతో ముగిసిన మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 592.93 పాయింట్లు లేదా 0.78 శాతం పెరిగి 76,617.44 వద్ద స్థిరపడింది. సూచీ 76,680.35 - 76,064.94 రేంజ్లో ట్రేడ్ అయింది.జొమాటో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు 4.75 శాతం వరకు లాభపడటంతో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 1.36 శాతం వరకు నష్టపోయాయి.సెన్సెక్స్‌కు అద్దంపడుతూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 166.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 23,332.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 23,350 వద్ద గరిష్టాన్ని, 23,158.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.61 శాతం లాభపడటంతో మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.12 శాతం లాభంతో ముగిసింది.ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ అత్యధికంగా 3.61 శాతం లాభపడింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 2.51 శాతం వరకు లాభపడ్డాయి. -
ఎక్స్పీరియన్ హైదరాబాద్ జీఐసీ.. ఇప్పుడు డబుల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా, టెక్నాలజీ దిగ్గజం ఎక్స్పీరియన్, హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ని (జీఐసీ) మరింతగా విస్తరించింది. గతానికన్నా రెట్టింపు ఆఫీస్ స్పేస్‌తో 85,000 చ.అ. విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటైనట్లు సంస్థ సీఈవో (టెక్నాలజీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇన్నోవేషన్) అలెగ్జాండర్ లింట్నర్ తెలిపారు.ప్రపంచ స్థాయి ప్రోడక్టులు రూపొందించేందుకు, నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ప్రధానంగా ఫిన్‌టెక్, అనలిటిక్స్, మోసాల నివారణ వంటి అంశాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది.హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ జీఐసీ ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్త సాంకేతిక కార్యకలాపాలకు కీలకమైన నాడీ కేంద్రంగా రూపుదిద్దుకుంది. క్లౌడ్ మైగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పురోగతి, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రాసెస్ ఆటోమేషన్‌లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లోని బలమైన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా, ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్తంగా స్కేలబుల్, డేటా ఆధారిత పరిష్కారాలను అందించే సామర్థ్యాన్ని పెంచుతోంది. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు
-
కొత్త లోన్ రూల్.. అమల్లోకి..
ఎడాపెడా అప్పులు చేసే ధోరణిని కట్టడి చేసే కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తోంది. దేశ రుణ వితరణ వ్యవస్థను మార్చే ఈ నియమం మూడు కంటే ఎక్కువ రుణదాతల (బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు) నుండి రుణాలు తీసుకోకుండా రుణగ్రహీతలను కట్టడి చేస్తుంది. అధిక వినియోగాన్ని అరికట్టడం, బాధ్యతాయుతమైన రుణాలను ప్రోత్సహించడమే ఈ నిబంధన లక్ష్యం.ఎందుకీ నిబంధన?మైక్రోఫైనాన్స్ రంగం అణగారిన వర్గాల సాధికారతలో కీలక పాత్ర పోషించినప్పటికీ, రుణగ్రహీతలు బహుళ వనరుల నుండి రుణాలు పొందడం చూసింది. ఇది నిర్వహణకు సాధ్యంకాని రుణానికి దారితీస్తుంది. ఈ మితిమీరిన వినియోగం, కొన్ని సంస్థల దూకుడు రుణ విధానాలు వ్యవస్థలో బలహీనతలను సృష్టించాయి. రుణగ్రహీతలను మూడు రుణదాతలకు పరిమితం చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించాలని, డిఫాల్టర్ల ప్రమాదాన్ని తగ్గించాలని భావిస్తున్నారు.రుణగ్రహీతలపై తక్షణ ప్రభావంప్రస్తుతం మూడు కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకుంటున్న 45 లక్షల మంది రుణగ్రహీతలకు, ఈ నియమం సవాలుగా మారుతుంది. వీరు తరచుగా వర్కింగ్ క్యాపిటల్, అత్యవసర అవసరాలు లేదా రోజువారీ మనుగడ కోసం అతివ్యాప్త రుణాలపై ఆధారపడతారు. మూడు బ్యాంకుల పరిమితితో, రుణగ్రహీతలు లిక్విడిటీ కొరతను ఎదుర్కోవచ్చు.ఇది వారి ఆర్థిక వ్యూహాలను పునఃసమీక్షించుకునేలా, ఖర్చులను తగ్గించుకునేలా చేస్తుంది. అంతేకాదు క్రెడిట్ మదింపులు కఠినంగా మారతాయి. ముఖ్యంగా అధిక-రిస్క్ గా భావించే రుణగ్రహీతలకు రుణ తిరస్కరణలు పెరగవచ్చు. ఇది కొంతమందిని అధిక వడ్డీలు ఉండే అనధికారిక రుణ మార్గాలవైపు నెట్టవచ్చు.రుణదాతలకూ సవాళ్లు..కొత్త రూల్ రుణదాతలకూ అనేక సవాళ్లను కలిగిస్తుంది. మైక్రోఫైనాన్స్ సంస్థలు తమ పోర్ట్‌ఫోలియో వ్యూహాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో స్వల్పకాలంలో వారి కస్టమర్ బేస్ ఎంతో కొంత కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాక, సంస్థలు రుణ వితరణ విషయంలో మరింత క్షణ్ణమైన ప్రక్రియలను పెంపొందించుకోవాలి. రుణగ్రహీతలు మూడు-రుణదాతల పరిమితిని మించకుండా చూసుకోవాలి. ఇందుకోసం బలమైన వ్యవస్థలు, సమన్వయం అవసరమవుతాయి.వాస్తవానికి ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, సజావుగా జరిగేందుకు ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఈ జాప్యం వాటాదారులకు సన్నద్ధం కావడానికి సమయం అందించినప్పటికీ, రుణగ్రహీతలు, రుణదాతలు ఈ ముఖ్యమైన మార్పుకు ఎలా అలవాటు పడతారనేదే అసలైన పరీక్ష. -
కొత్త విధానంలో పీపీఎఫ్‌పై ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఒక ఇన్వెస్టర్ ఒక పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను నిలిపివేసి, ఆ పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. ఎక్స్పెన్స్ రేషియోని ఆ పెట్టుబడుల నుంచి వసూలు చేస్తూనే ఉంటారా? – అనిల్ మిశ్రామ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినంత కాలం వాటి విలువపై ఎక్స్పెన్స్ రేషియోని అమలు చేస్తుంటారు. ఎక్స్పెన్స్ రేషియో అన్నది మ్యూచువల్ ఫండ్ సంస్థ వసూలు చేసే వార్షిక చార్జీ. పెట్టుబడుల నిర్వహణ కోసం అయ్యే వ్యయాలు, ఇతర నిర్వహణ వ్యయాలను చార్జీల రూపంలో వసూలు చేసుకుంటాయి. వార్షిక చార్జీ అయినప్పటికీ.. దీన్ని ఏరోజుకారోజు పెట్టుబడుల విలువ నుంచి మినహాయించుకుంటాయి. మనకు రోజువారీగా మార్పునకు గురయ్యే ఫండ్ యూనిట్ల ఎన్ఏవీ తెలుసుకదా.చార్జీలను మినహాయించుకున్న తర్వాతే ఈ ఎన్ఏవీ ఖరారవుతుంది. సిప్ నిలిపివేశారంటే అప్పటి నుంచి ఆయా పథకంలో మీరు తాజా పెట్టుబడులు పెట్టరనే అర్థం. కానీ, అప్పటికే చేసిన పెట్టుబడులను ఆ ఫండ్ సంస్థ నిర్వహించాలి కదా. అందుకని తమ నిర్వహణలోని మొత్తం ఆస్తులపై (ఏయూఎం) ఎక్స్పెన్స్ రేషియోని వసూలు చేసుకుంటాయి. కాకపోతే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో రాబడులను మరింత వృద్ధి చేసుకోవచ్చు. నేను పన్ను ఆదా కోసం ప్రజా భవిష్యనిధి పథకంలో (పీపీఎఫ్) క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపన్నులో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలోనూ నేను పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా? ఈ ప్రయోజనం గరిష్టంగా ఎంత వరకు ఉంటుంది? – బల్లూ నాయక్ఆదాయపన్ను పాత విధానంలో పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే పెట్టుబడి గరిష్టంగా రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా వడ్డీ ఆదాయం, గడువు తీరిన తర్వాత చేతికి వచ్చే మొత్తంపైనా పన్ను లేదు. ఒకవేళ కొత్త పన్ను విధానాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్టయితే.. సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్‌లో చేసే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త ఆదాయపన్ను విధానం తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది. ఇందులో చాలా వరకు పన్ను మినహాయింపులను తొలగించేశారు.పీపీఎఫ్‌లో పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కూడా కొత్త విధానంలో లేదు. అయితే, కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక పాత విధానమా? అన్నది మీ ఆదాయం, మినహాయింపులను ఎంత మేర క్లెయిమ్ చేసుకోగలరన్న పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో పీపీఎఫ్, ఇన్సూరెన్స్, గృహ రుణం చెల్లింపులు.. ఇలా అన్ని రకాల మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అదే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కొత్త విధానం సులభతరంగా, తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది.సమాధానాలు : ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
దూసుకెళ్తున్న బంగారం.. మళ్లీ భారీగా.. కొత్త మార్క్‌కు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఆగకుండా దూసుకెళ్తున్నాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరుగుతూ పోతున్న పసిడి ధరలు నేడు (March 31) మళ్లీ భారీగా ఎగిసి కొత్త మార్క్‌ను తాకాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత నిరుత్సాహం తప్పలేదు.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 84,250 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 91,910 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు ఏకంగా రూ.650, రూ.710 చొప్పున ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.92,060 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.84,400 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.710, రూ.650 చొప్పున పెరిగాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,250 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,910 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.650, రూ.710 చొప్పున పెరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,13,000 వద్ద, ఢిల్లీలో రూ. 1,04,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భారత్ బంగారు కొండ.. HSBC సంచలన రిపోర్ట్
-
అరుదైన వ్యాధులు వస్తే.. ఇదిగో ఈ ఇన్సూరెన్స్..
హీమోఫీలియా, మర్ఫాన్ సిండ్రోమ్ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.భారత్ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే.. సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్నెస్ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.లూపస్ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు సీఐ ప్లాన్‌తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది.. అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక.. అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్ అప్ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే.. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్ డిసీజ్ లేదా రెట్ సిండ్రోమ్‌లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్.. సపోర్టివ్ కేర్‌కి, జీవక్రియ సంబంధ గౌచర్ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ -
స్టాక్ మార్కెట్ సెలవులు.. ఏప్రిల్‌లో ఈ రోజుల్లో నో ట్రేడింగ్
ఇటీవలి రోజుల్లో స్టాక్ మార్కెట్లపై జనంలో ఆసక్తి పెరిగింది. చాలా మంది మార్కెట్ పెట్టుబడుల వైపు వస్తున్నారు. దీంతో రోజువారీ ట్రేడింగ్‌ను గమనించేవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఏయే రోజులు పనిచేస్తాయి.. సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా ఈరోజు (2025 మార్చి 31 సోమవారం) భారత స్టాక్ మార్కెట్‌కు సెలవు. మూడు రోజుల వారాంతం తర్వాత 2025 ఏప్రిల్ 1 మంగళవారం ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) రెండూ ఈరోజు స్టాక్స్, డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ లోన్ (ఎస్ఎల్బీ) విభాగాల్లో ట్రేడింగ్, సెటిల్మెంట్కు తెరిచి ఉండవు.అయితే 2025 మార్చి 31న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) మాత్రం పాక్షికంగా తెరిచి ఉంటుంది. సాయంత్రం సెషన్ సాయంత్రం 5 గంటల నుండి 11:30 / 11:55 గంటల వరకు నడుస్తుంది. దీనికి విరుద్ధంగా, భారతదేశపు అతిపెద్ద వ్యవసాయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్సీడీఈఎక్స్) ఈరోజు పూర్తిగా మూసి ఉంటుంది.ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్ సెలవులుపండుగలు, విశేష దినోత్సవాలు, వారాంతపు సెలవులతో కలుపుకొని ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్లు మొత్తంగా 11 రోజులు మూసిఉంటాయి. ఆయా రోజుల్లో స్టాక్ ఎక్స్చేంజీలు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. సెలవు రోజులు ఇవే..అదనపు సెలవులుఏప్రిల్ 10 - మహావీర్ జయంతిఏప్రిల్ - 14 - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిఏప్రిల్ 18 - గుడ్ ఫ్రైడేవారాంతపు సెలవులుఏప్రిల్ 5 - శనివారంఏప్రిల్ 6 - ఆదివారంఏప్రిల్ 12 - శనివారంఏప్రిల్ 13 - ఆదివారంఏప్రిల్ 19 - శనివారంఏప్రిల్ 20 - ఆదివారంఏప్రిల్ 26 - శనివారంఏప్రిల్ 27 - ఆదివారం -
ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..
ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, వెంటనే వారితో ‘సంధి’ లేదా రాజీ చేసుకోవచ్చు. దీనికి ఎవరి రాయబారమూ అక్కర్లేదు. మీరే స్వయంగా ఒప్పందంలాంటిది చేసుకోవచ్చు. 2025 మార్చి 17న ఓ సర్క్యులర్ ద్వారా డిపార్టుమెంటు వారు సులువుగా రాజీ చేసుకోమని మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్నే ఇంగ్లీషులో COMPOUNDING అంటారు.ఎన్నో సందర్భాల్లో డిపార్టుమెంటు వారు నోటీసులు ఇస్తారు. వాటికి బదులివ్వకపోతే వారు కోర్టుకు వెళ్తారు. కొన్ని సీరియస్ కేసుల్లో జైలుకి పంపిస్తారు. అంతవరకు వెళ్లడం అవసరమా! పరువు గంగపాలై, బతుకు హాస్పిటల్ పాలై, కృష్ణ జన్మస్థానంలో గడపడమెందుకు?ఈ పథకం .. లేదా ఒప్పందం.. లేదా రాజీ మార్గం ప్రకారం.. 1 కోర్టుకు వెళ్లక్కర్లేదు. లీగల్ ప్రాసిక్యూషన్ ఉండదు. 2. టైం కలిసి వస్తుంది. 3. మానసిక ఒత్తిడి ఉండదు 4. ఆర్థిక ప్రమాదం ఉండదు 5. బ్యాంకు అకౌంటు అటాచ్మెంట్ ఉండదు 6. వ్యాపారం సజావుగా చేసుకోవచ్చు 7. నలుగురికీ తెలియకుండా గొడవ సమసిపోతుంది 8. ఇది అతి పెద్ద ఉపశమనంవివరాల్లోకి వెళ్తే.. అన్ని రకాల నేరాలకు ఇది వర్తిస్తుంది. ఎన్ని సార్లయినా ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందవచ్చు. కాల వ్యవధులు లేవు. వ్యాపార నిర్వహణలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకో ఎన్నో నేరాలు, ఇన్‌కంట్యాక్స్ చట్టం ప్రకారం జరుగుతుంటాయి. వీటన్నింటి మీద సమయం వెచ్చించలేము. కోర్టు చుట్టూ తిరగలేము. తిరిగినా జడ్జిమెంటు ఎలా ఉంటుందో చెప్పలేము.ఇన్ని కష్టాలతో, ఇబ్బందులతో వ్యాపారం చేయలేము. వ్యాపారం కుంటుపడుతుంది. బైటి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వీటన్నింటిని అధిగమించేందుకు కల్పిస్తున్న ఈ వెసులుబాటు, పాత కేసులకూ వర్తిస్తుంది. పాత కేసులను తిరస్కరించినా ఈ ఒప్పందంలో చేరి, రాజీపడొచ్చు. మరీ మోసపూరితమైన కేసుల్లో తప్ప మిగతా అన్నింటికీ ఈ ‘‘రాజీ’’లో ఉపశమనం ఉంది.చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఒక దరఖాస్తు చేసుకోగానే మార్గం సుగమం అవుతుంది. హై–ప్రొఫైల్ కేసుల్లో ముందుగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని గానీ రిలీఫ్ ఇవ్వరు. ఉదాహరణకు జైలు శిక్ష 2 సంవత్సరాలు దాటినా .. సీబీఐ, ఈడీ మొదలైన సంస్థలతో సమస్యలు ఉన్నా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పర్మిషన్ అవసరం. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. 👉 బిజినెస్ వ్యక్తులు 👉 టీడీఎస్ విషయంలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నవారు 👉 పన్నుభారాన్ని కోర్టుకు వెళ్లకుండా సెటిల్ చేసుకునే వారు 👉 గతంలో రాజీకి వెళ్లి తిరస్కరణకు గురైన వారు 👉 అనేక నేరాలు చేసి బైటికి రానివాళ్లుఎలా చేయాలి: వంద రూపాయల స్టాంపు పేపరు మీద అన్ని వివరాలను మీ సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఎంత చెల్లించాలో డిపార్టుమెంటు నిర్ణయిస్తుంది. రాజీపత్రం రాగానే ఉపశమనం వచ్చినట్లే. ప్రాసిక్యూషన్ ఆగిపోతుంది. మీరు మాత్రం అప్పీలులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.రాజీకి వెళ్లకపోతేషరా మామూలే. లీగల్ ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది. ఫైన్ పడుతుంది. జైలు శిక్ష పడొచ్చు. కోర్టు ఖర్చులు భరించాలి. రికార్డుల్లో అలాగే ఉండిపోతే ఉత్తరోత్తరా డిపార్టుమెంటు వారి దృష్టిలో చెడుగా.. అంటే డిఫాల్టరుగా ఉండిపోతారు. కాబట్టి వెంటనే రాజీమార్గంలో వెళ్లి, రాజీపడి అన్ని కష్టాల్లో నుంచి బైటపడండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
బ్యాంక్టెక్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: బ్యాంక్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు 2027 నాటికి బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8,600 కోట్లు) చేరతాయని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్’ తన అంచనాను వెల్లడించింది. 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో వృద్ధిని నడిపించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.విప్లవాత్మక టెక్నాలజీలు భారత్‌లో బ్యాంకింగ్ సేవలను సమూలంగా మార్చేస్తున్నట్టు సెడార్ ఐబీఎస్‌ఐ వ్యవస్థాపకుడు, ఎండీ సాహిల్ ఆనంద్ తెలిపారు. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల్లో 80 శాతాన్ని ప్రస్తుతం డిజిటల్‌గా నిర్వహిస్తున్నట్టు ఓ పరిశోధన వివరాలను గుర్తు చేశారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.వీటి ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోని వారికీ బ్యాంకింగ్ సేవలు అందుతున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని డిజిటల్‌గా మార్చడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలకంగా పనిచేస్తోందంటూ.. సేవల విస్తరణ, చురుకుదనం, వ్యయాల కట్టడి ప్రయోజనాలు దీంతో లభిస్తున్నట్టు వివరించారు. సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీలకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయపడుతన్నట్టు ఆనంద్ వెల్లడించారు.ముఖ్యంగా సప్లయ్ చైన్ ఫైనాన్స్, గుర్తింపు నిర్వహణలో ఇది ఎంతో మార్పును తీసుకొస్తున్నట్టు చెప్పారు. సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్ ఇప్పటికే బ్యంక్టెక్ రంగంలో రెండు లావాదేవీలతో మొత్తం రూ.240 కోట్ల పెట్టుబడులు పెట్టిందని.. తమ పోర్ట్‌ఫోలియోని 10–15 స్టార్టప్‌లకు విస్తరించనున్నట్టు ఆనంద్ ప్రకటించారు. -
ఇళ్లకు కూల్ రూఫ్ వేసుకుంటే సరి..
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇంటి లోపల వేడి, ఉక్కపోత పెరిగిపోతోంది. దీంతో బయటే కాదు ఇంట్లోనూ ఉండలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇళ్లంతా చల్లగా ఉంటే ఆ హాయి వేరే కదూ.. అయితే పైకప్పులో కూల్ రూఫ్ టైల్స్, పెయింటింగ్స్ వేసుకుంటే సరి. సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని రాకుండా నిరోధించే శక్తి ఉండటం వీటి ప్రత్యేకత. పట్టణీకరణ, కాంక్రీట్ జంగిల్ కారణంగా నగరాలలో అర్బన్ హీట్ ఐల్యాండ్ (యూహెచ్ఐ) ప్రభావం ఏర్పడుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. –సాక్షి, సిటీబ్యూరోవేసవి కాలంలో వేడి గాలులతో 32 కోట్ల మంది భారతీయులు అధిక ప్రమాదకర పరిస్థితులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చెట్ల పెంపకం, వేడి, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణీయ పద్ధతులు ఉన్నప్పటికీ ప్రపంచ నగరాలు కూల్ రూఫ్, గ్రీన్ బిల్డింగ్ వంటి వినూత్న పరిష్కార మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టొరంటో వంటి అంతర్జాతీయ నగరాలు కూల్ రూఫ్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇదే తరహాలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనూ ‘కూల్ రూఫ్ పాలసీ’ని అమలులోకి తీసుకొచ్చింది. కూల్ ఉంటేనే ఓసీ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర నివాస, వాణిజ్య భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి. 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలోని నివాస భవనాలకు కూల్ రూఫ్ ఉండాల్సిందే. అంతకంటే చిన్న ఇళ్లు స్వచ్ఛందంగా స్వీకరించవచ్చు. ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతి ప్రక్రియలో కూల్ రూఫ్ విధానాన్ని మిళితం చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ చేసేందుకు సంబంధిత అధికారులు కూల్ రూఫ్లను నిర్ధారించుకున్నాకే ఓసీ జారీ చేస్తారు. కూల్ రూఫ్ పాలసీ అమలుతో ఐదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 12 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది.ఎంత ఖర్చవుతుందంటే.. కూల్ రూఫ్ టైల్స్‌ను జిర్కోనియం సిలికేట్, జింక్ ఆక్సైడ్ల నానోమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న కణాల మిశ్రమాలను అల్యూమీనియం సిలికెట్ కణాలతో కూడిన ప్రత్యేక గ్లేజ్తో తయారు చేస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలుస్తారు. దీంతో వీటికి సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని చేరనివ్వదు. కూల్ రూఫ్ ఏర్పాటుకు రకాన్ని బట్టి చ.అ.కు రూ.120–1,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రత్యేకమైన పెయింటింగ్‌లు లేదా నిర్ధిష్ట సిరామిక్ టైల్స్‌తో తయారైన కూల్ రూఫ్‌లు ఉన్నాయి. ఏసీ వినియోగం తక్కువ.. సంప్రదాయ పైకప్పుతో పోలిస్తే కూల్ రూఫ్‌లు తక్కువ సౌరశక్తిని గ్రహిస్తాయి. ఇవి సూర్యరశ్మిని తక్కువగా గ్రహించి, ఇంట్లోకి వేడిని వెళ్లనివ్వదు. దీంతో ఇంట్లో ఏసీ, కూలర్ల వినియోగం తక్కువగా ఉంటుంది. సంప్రదాయ పైకప్పులతో పోలిస్తే కూల్ రూఫ్ పైకప్పు ఉన్న ఇంటిలోపల గది ఉష్ణోగ్రతలు 5–9 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. -
రెండున్నరేళ్లలోనే 20 లక్షల క్రెడిట్ కార్డులు..
న్యూఢిల్లీ: సుమారు రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే 20 లక్షల పైచిలుకు టాటా న్యూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. కొత్తగా జారీ అయిన కార్డుల్లో ఇవి సుమారు 13 శాతం వాటా దక్కించుకున్నట్లు టాటా న్యూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించాయి.వివిధ ఉత్పత్తులు, సేవల కొనుగోళ్ల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లన్నీ సమగ్రంగా అనుసంధానమవుతాయని పేర్కొన్నాయి. ఈ క్రెడిట్ కార్డుతో 10% వరకు ఆదా, ట్రావెల్.. ఫ్యాషన్ మొదలైన వాటి షాపింగ్‌లో ప్రత్యేక ప్రాధాన్యత తదితర ప్రయోజనాలను పొందవచ్చని టాటా డిజిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్) గౌరవ్ హజ్రతి తెలిపారు. -
UPI లాంటి మరో విప్లవం.. ఆధార్ సృష్టికర్త అంచనా
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) తరహాలో తదుపరి విప్లవాన్ని భారత ఇంధన రంగం చూస్తుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజలే విద్యుత్ ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా ఎదిగేందుకు వీలుగా ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను విస్తృతంగా అమలు చేస్తున్న విషయాన్ని పారిశ్రామికవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ వివరించారు."మనం సాధారణంగా తక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంటాం.. నిల్వ చేస్తుంటాం. మీరు ఎల్పీజీ సిలిండర్ కొంటున్నారంటే ప్యాకేజింగ్ చేసిన ఇంధనాన్ని కొంటున్నట్టు. కానీ విద్యుత్ మాత్రం గ్రిడ్ నుంచి వస్తుందని ఎప్పుడూ అనుకునేవాళ్లం. విద్యుత్ అందుబాటులో లేకపోతే జనరేటర్ కొనుక్కోవడమో, నూనె దీపాలు వెలిగించడమో చేస్తుంటాం'' అని నీలేకని చెప్పుకొచ్చారు.ఇప్పుడు ‘రూఫ్ టాప్ సోలార్ ఉండటం వల్ల ప్రతి ఇంటికి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈవీ బ్యాటరీ ఉండటం వల్ల ప్రతి ఇల్లు ఎనర్జీ స్టోర్ అవుతుంది. కాబట్టి, ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారు, అమ్మకందారు అలాగే కొనుగోలుదారు కూడా. కాబట్టి, యూపీఐ మాదిరిగా, మీరు ఇప్పుడు విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు" అన్నారాయన. ఇంధన ఉత్పత్తి, వినియోగం వికేంద్రీకరణ వల్ల లక్షలాది మంది సూక్ష్మ ఇంధన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని, ఇది ఆర్థిక ఆవిష్కరణలు, వృద్ధికి దోహదపడుతుందని నీలేకని అన్నారు.యూపీఐ విజయ ప్రస్థానందశాబ్దం క్రితం ప్రారంభించిన యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మూలస్తంభంగా మారింది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతన్నాయి. గత జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లు దాటాయి. అలాగే వాటి విలువ రూ .23.48 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లతో సహా ఏడు దేశాల్లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
సాధారణంగా మనం చూసే భవనాలన్నీ ఇసుక, సిమెంట్ కలిపిన ఆర్సీసీ కాంక్రీట్ లేదా మైవాన్ అల్యూమీనియంతో ఉంటాయి. పైకప్పు, గోడలు అన్నీ వీటితోనే నిర్మిస్తుంటారు. దీంతో ఈ ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా గోడలు, ప్లాస్టరింగ్‌లకు అయ్యే ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖనిజ జిప్సం అందుబాటులోకి వచ్చేసింది. ఇసుక, సిమెంట్ అవసరం లేకుండానే నేరుగా ఇటుకల మీదపూతలాగే పూయడమే మినరల్ జిప్సం పన్నింగ్ ప్రత్యేకత. పైగా దీనికి చుక్క నీటితో క్యూరింగ్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సం ఇళ్లలో గది ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో అపారమైన నదుల కారణంగా ఇసుక లభ్యత ఎక్కువ. దీన్ని ఆసరా చేసుకొని బ్రిటీష్ రాజులు మన దేశంలో సిమెంట్ కర్మాగారాలు నెలకొల్పి, అందుబాటులో ఉన్న ఇసుకను కలిపి నిర్మాణ రంగంలో వినియోగించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా నది ఇసుక కొరత ఏర్పడటంతో రోబో శాండ్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి పట్టుత్వం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జిప్సం వినియోగం పెరిగింది. భూగర్భంలో బంగారం, బొగ్గు, ఇనుము వంటి గనులలాగే జిప్సం కూడా ఖనిజమే. మన దేశంలో రాజస్థాన్‌లోని బికానెర్, కశ్మీర్ వ్యాలీలో మాత్రమే మినరల్ జిప్సం గనులు ఉన్నాయి. మార్కెట్లో కాంపోజిట్, మినరల్ జిప్సం అని రెండు రకాలు ఉంటాయి. సిమెంట్ పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే తెల్లటి పదార్థాన్ని కాంపోజిట్ జిప్సం అంటారు. దీన్ని ఇటుక, చాక్‌పీస్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మినరల్ జిప్సం భూగర్భంలో నుంచి వెలికితీసే గని. దీని రసాయన నామం కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ (సీఏఎస్‌ఓ4).అంతర్గత గోడలు, సీలింగ్లకే.. ఖనిజ జిప్సంకు నిరంతరం నీరు తాకితే తేమ కారణంగా పాడైపోతాయి. అందుకే దీన్ని ఇంటి లోపల అంతర్గత గోడలు, సీలింగ్‌లకు మాత్రమే వినియోగిస్తారు. బయట గోడలకు, బాత్రూమ్, టాయిలెట్స్ గోడలకు వినియోగించరు. ఆర్సీసీ కాంక్రీట్‌ను తాపీతో వేయాలి లేకపోతే చేతులు, కాళ్లకు పొక్కులు వస్తాయి. అదే మినరల్ జిప్సంను నేరుగా చేతులతో కలుపుతూ గోడలకు పూత లాగా పూస్తారు. ఈ గోడలు చాలా తేలికగా ఉండటంతో ఇంటి శ్లాబ్ మీద బరువు పెద్దగా పడదు. మినరల్ జిప్సంను నివాస, వాణిజ్య, కార్యాలయ అన్ని రకాల భవన సముదాయాల నిర్మాణంలో వినియోగిస్తారు.ఎంత ఖర్చు అవుతుందంటే.. ఆర్సీసీ కాంక్రీట్‌తో చదరపు అడుగు గోడ ప్లాస్టరింగ్ రూ.50–55 ఖర్చు అవుతుంది. అదే జిప్సం పన్నింగ్కు అయితే రూ.35–40తో అయిపోతుంది. అలాగే చ.అ. కాంక్రీట్ గోడ క్యూరింగ్‌కు 7 లీటర్ల నీళ్లు అవసరం కాగా.. కనిష్టంగా ఏడు రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక, జిప్సం గోడలకు క్యూరింగే అవసరం లేదు. ఉదాహరణకు.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అంతర్గత గోడలు నాలుగు వైపులా కలిపితే 5 వేల చ.అ. ఉంటాయి. వీటి క్యూరింగ్‌కు 25 వేల నీళ్లు అవసరం అవుతాయి. ఈలెక్కన ఖనిజ జిప్సంతో నీళ్లు, సమయం, డబ్బు ఆదా అవుతుందన్నమాట.ఇళ్లంతా చల్లగా.. మినరల్ జిప్సంకు వేడి, అగ్ని, ధ్వనిని నిరోధించే శక్తి ఉంటుంది. ఇందులోని థర్మల్ ప్రూఫ్ కారణంగా బయటితో పోలిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఖనిజ జిప్సంతో ఉండే ఇంట్లో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సంకు అగ్ని ప్రమాదాలను తట్టుకుంటాయి. నింతరంగా మూడు గంటల పాటు అగ్నిని నిరోధిస్తాయి. ఖనిజ జిప్సంతో కట్టే గోడలు చాలా మృదువుగా, పాలవలే తెల్లగా ఉంటాయి. దీంతో చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. -
ఫోన్‌పే రూ.696 క్యాష్ బ్యాక్.. నిజమేనా?
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేకి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ ప్రమోషన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫోన్‌పే రూ.696 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోందంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు ఓ పోస్ట్ పెట్టారు. అయితే దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆ పోస్టు ఫేక్ అని, ఫోన్‌పే అలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదీ ప్రకటించలేదని తేలింది.అసలేముంది ఆ పోస్ట్‌లో?ఈ ఐపీఎల్ సీజన్లో ఫోన్‌పే రూ.696 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోందని 'ఐపీఎల్-హబ్' అనే ఫేస్బుక్ యూజర్ మార్చి 22న పోస్ట్ చేశారు. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి యూజర్ల కోసం రిజిస్ట్రేషన్ లింక్‌ను కూడా పోస్ట్‌లో పొందుపరిచారు. హిందీలో రాసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. నిజమేనేమోనని చాలా మంది యూజర్లు దీన్ని షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారింది.మరి ఏం తేలింది?ఇన్విడ్ అనే టూల్ ద్వారా ఈ వైరల్ పోస్ట్‌ను పరీక్షించగా ఇలాంటివే మరికొన్ని ఫేక్ పోస్టులు కనిపించాయి. ఫోన్‌పే అటువంటి క్యాష్‌బ్యాక్ పథకాన్ని ఏమైనా ప్రారంభించిందా అని తదుపరి ధ్రువీకరణ కోసం ఫోన్‌పేకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పరిశీలించినా అటువంటి ఆఫర్ ఏదీ కనిపించలేదు. ఈ పక్రియలో ఫోన్‌పే అధికారిక వెబ్సైట్లో ఒక బ్లాగ్ కనిపించింది. క్యాష్‌బ్యాక్ మోసాల నుండి అప్రమత్తంగా ఉండండి" అంటూ పేర్కొంది. ఫోన్ కాల్స్ లేదా లింక్‌ల ద్వారా ఫోన్‌పే క్యాష్ బ్యాక్‌లు, రివార్డులను అందించదని అందులో వివరించింది. -
ఓపెన్ ప్లాటా.. అపార్ట్‌మెంటా?
ఓపెన్ ప్లాటా? అపార్ట్‌మెంటా? ఎందులో పెట్టుబడులకు ఆసక్తి ఉందనే ప్రశ్నకు సగానికి పైగా తొలిసారి ప్రాపర్టీ కొనుగోలుదారుల అభిప్రాయం ఓపెన్ ప్లాటనే సమాధానం. 58 శాతం మంది కస్టమర్లు స్థలం మీద పెట్టుబడులకు మొగ్గు చూపిస్తున్నారని మ్యాజిక్ బ్రిక్స్ సర్వేలో తేలింది. దీర్ఘకాలిక మూలధన లాభాలు, అధిక రాబడులే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని సుమారు 2,200 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. ఇందులో 17.1 శాతం మంది కస్టమర్లు పెట్టుబడులకు రెండో ప్రాధాన్యత ఆస్తిగా వాణిజ్య స్థలాలను ఎంచుకున్నారు. ఓపెన్ ప్లాట్లలో అత్యధికంగా బెంగళూరు స్థలాలకు డిమాండ్ ఉంది. 36.5 శాతంతో గ్రీన్ సిటీ అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై ప్లాట్లకు 11 శాతం, లక్నో స్థలాలకు 8.9 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. 1,000–2,000 చ.అ. మధ్య తరహా ప్లాట్లకు 46.76 శాతం డిమాండ్ ఉంది. రూ.50 లక్షల వరకూ.. రూ.50 లక్షల వరకు ధర ఉండే స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 50.83 శాతం మంది ప్లాట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్లో షాద్‌నగర్, కడ్తాల్, సదాశివపేట వంటి ప్రాంతాలలో ప్లాట్ల సరఫరా అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్లాట్ల సగటు ధర చ.అ.కు రూ.2,765గా ఉంది. లక్నోలో రూ.2,836, చెన్నైలో రూ.3,208లు పలుకుతున్నాయి. అత్యధికంగా నోయిడాలో రూ.22,523, గుర్గావ్లో రూ.21,901లతో ఖరీదైన మార్కెట్లుగా ఉన్నాయి. -
రూ. 1,460 కోట్ల షేర్లను అమ్మేసిన కేకేఆర్
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కంపెనీ ప్రమోటర్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ తాజాగా జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌లో 5.8 శాతం వాటా విక్రయించింది. బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం వీటి విలువ రూ. 1,460 కోట్లు. అనుబంధ సంస్థ టౌ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఒక్కో షేరుకి రూ. 1,625 సగటు ధరలో 89.83 లక్షలకుపైగా షేర్లను అమ్మివేసింది.ఈ లావాదేవీ తదుపరి కేకేఆర్ వాటా 53.66 శాతం నుంచి 47.88 శాతానికి క్షీణించింది. కొటక్ మహీంద్రా ఎంఎఫ్ రూ. 200 కోట్లు వెచ్చించి 0.8 శాతం వాటాకు సమానమైన 12.3 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జేబీ కెమికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.2% పతనమై రూ. 1,604 వద్ద ముగిసింది. -
రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆశ్చర్యపరిచే గణాంకాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు అందించింది. ప్రత్యక్ష పన్నుల్లో 47,674 మంది పన్ను ఎగవేతదారుల జాడ తెలియడం లేదని.. వీరు చెల్లించాల్సిన బకాయిలు రూ.5.91 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.అదే పరోక్ష పన్నుల్లో 60,853 మంది ఎగవేతదారుల ఆచూకీ లభించడం లేదని.. వీరు రూ.43,525 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఈ వివరాలు తెలియజేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తీసుకున్న చర్యలను సైతం వివరించారు.వ్యక్తిగత లావాదేవీల సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, 360 డిగ్రీల కోణంలో ప్రొఫైల్‌ను ఫీల్డ్ యూనిట్లకు పంపించి.. పన్ను చెల్లింపుదారులను గుర్తించి, పన్ను వసూలు చర్యలకు వీలు కల్పించినట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి పన్ను ఎగవేతదారుల నుంచి వసూలుకు గాను బ్యాంక్ ఖాతాల స్తంభన వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోహ్యాన్స్ లైఫ్సైన్సెస్ను తమ సంస్థలో విలీనం చేసుకునే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసినట్లు సువెన్ ఫార్మా వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యాలు మరింతగా మెరుగుపడతాయని సువెన్ ఫార్మా చైర్మన్ వివేక్ శర్మ చెప్పారు. ఉమ్మడి సామర్థ్యాల దన్నుతో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఆదాయం స్థాయికి చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందులో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్ సేవల వాటా గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఐపీవోకు హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్: ఇంజినీరింగ్ సంబంధ సేవలందించే హైదరాబాద్ కంపెనీ ఆర్డీ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లలో ఒకరైన చంద్ర శేఖర్ మోటూరు విక్రయానికి ఉంచనున్నారు.కంపెనీ సమీకృత డిజైన్, ఇంజినీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. ప్రధానంగా ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ), మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్(ఎంహెచ్ఎస్), ఇంజినీరింగ్ సర్వీసెస్ పేరుతో మూడు విభాగాలలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 280 కోట్లు తెలంగాణలో కొత్తగా రెండు తయారీ యూనిట్ల ఏర్పాటుకు, మరో రూ. 45 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడలో సమీకృత తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది.రుణ చెల్లింపులకు రూ. 65 కోట్లు వినియోగించనుంది. 2008లో ఏర్పాటైన కంపెనీ క్లయింట్లలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్), జేకే సిమెంట్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఉదయ్‌పూర్ సిమెంట్ వర్క్స్ తదితరాలున్నాయి. గతేడాది(2023–24) రూ. 620 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
బైక్ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి
దేశంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ టూవీలర్ విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ లో చేసిన ఈ ప్రకటనను ఐఎస్ఐ హెల్మెట్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని అతిపెద్ద సంస్థ టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్ఎంఏ) సంపూర్ణంగా సమర్థించింది.రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గడ్కరీ ఆదేశాలను కీలకమైన, దీర్ఘకాలిక చర్యగా భావిస్తున్నారు. ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరిగా వాడాలని ఎప్పటి నుంచో వాదిస్తున్న హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మంత్రి క్రియాశీల నాయకత్వాన్ని ప్రశంసించింది. 'ఇది కేవలం రెగ్యులేషన్ మాత్రమే కాదు. ఇది జాతీయ అవసరం. ప్రమాదాల్లో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను నివారించగలదనే ఆశను కలిగిస్తుంది" అని టీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అన్నారు.హెల్మెట్ లేకపోవడం వల్లే..దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,88,000 మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు భారతదేశ రహదారి భద్రత భయంకరమైన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. 66 శాతం ప్రమాదాలలో బాధితులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే. ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తుండగా వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల ప్రయాణాలు ఇకపై ప్రమాదకరంగా ఉండకూడదని పరిశ్రమ నొక్కి చెప్పింది. -
బ్యాంకులకు రంజాన్ సెలవు లేదా?
ముస్లింలకు పర్వదినమైన రంజాన్ మార్చి 31న వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అయితే బ్యాంకులకు మాత్రం ఆరోజు సెలవు లేదు. ఎందుకంటే ఆరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో మార్చి 31న బ్యాంకులు క్లియరింగ్ ఆపరేషన్‌లో పాల్గొనాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీల అకౌంటింగ్‌ను సులభతరం చేస్తుంది. పండుగలు, వారాంతపు సెలవులతో సంబంధం లేకుండా దేశం అంతటా ఆదాయపు పన్ను, సీజీఎస్టీ కార్యాలయాలు మార్చి 29 నుండి మార్చి 31 వరకు తెరిచి ఉంటాయి.భారతదేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాలని ఆర్బీఐ గతంలో పేర్కొంది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు, శాఖలు మార్చి 31న సాధారణ పని గంటలు ముగిసే వరకు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఓవర్ ది కౌంటర్ లావాదేవీల కోసం తెరిచి ఉండాలని అపెక్స్ బ్యాంక్ కోరింది.చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద స్టాండర్డ్ క్లియరింగ్ టైమింగ్స్ మార్చి 31న వర్తిస్తాయని ఆర్బీఐ తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను మార్చి 31 నాటికి లెక్కించడానికి వీలుగా మార్చి 31న ప్రభుత్వ చెక్కుల కోసం ప్రత్యేకంగా సీటీఎస్ కింద ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. అన్ని బ్యాంకులు ఈ ప్రత్యేక క్లియరింగ్ ఆపరేషన్లలో పాల్గొనాలని సర్క్యులర్‌లో ఆదేశించింది. -
కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి
వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరుగుతున్న ఈ కాలంలో వాటి కోసం కేవలం సొంత డబ్బుపైనే ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. ఊహించని అత్యవసర వైద్య పరిస్థితులు పొదుపు సొమ్మును హరించేస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి ఒక ముఖ్యమైన రక్షణ కవచంగా నిలుస్తుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన వైద్య సంరక్షణను అందిస్తుంది. గుర్తుంచుకోండి.. మీరు ఆరోగ్యంపై పెట్టుబడి పెడుతున్నారంటే.. మీతోపాటు కుటుంబ భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెడుతున్నారని అర్థం.సంపూర్ణ కవరేజీ ఆధునిక ఆరోగ్య బీమా ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే కాదు.. ఓపీడీ సంప్రదింపులు, టెలిమెడిసిన్, ప్రివెంటివ్ చెకప్‌లు, వెల్నెస్ కార్యక్రమాలను కూడా కవర్ చేస్తుంది. చాలా పాలసీలు ఇప్పుడు ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్యం, రీహాబిలిటేషన్ థెరపీ వంటి సేవలతో సంపూర్ణ కవరేజీ అందిస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక రక్షణ చాలా కీలకం. వ్యాధి-నిర్దిష్ట విధానాలు, క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు దీర్ఘకాలిక భద్రతను నిర్ధారిస్తాయి.పన్ను ప్రయోజనాలూ..ఇటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద గణనీయమైన పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు అటు అవసరమైన ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించే రెండు వైపులా పదునుండే కత్తిలా హెల్త్ ఇన్సూరెన్స్ పనికొస్తుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇది ఆర్థికంగా తెలివైన పెట్టుబడిగా మారుతుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు తమ ఆరోగ్య బీమా ప్రీమియంపై సంవత్సరానికి రూ .25,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ల సిటిజన్ల విషయానికి వస్తే.. వారికి వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పరిమితి రూ .50,000 వరకు ఉంటుంది.ఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో విభిన్న ప్లాన్లుఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరసమైన, సౌకర్యవంతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ పాలసీలు హాస్పిటలైజేషన్, ఓపీడీ కన్సల్టేషన్లు, ప్రసూతి ప్రయోజనాలు, క్రిటికల్ ఇల్‌నెస్‌తో సహా విస్తృతమైన కవరేజీతో పాలసీదారులరకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి.మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఆరోగ్య బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వానికి ఒక ముఖ్యమైన దశ. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఇది మీ ఆర్థిక, శారీరక శ్రేయస్సు కోసం తెలివైన పెట్టుబడి. -
హాస్టళ్లకు గిరాకీ.. అద్దెలూ పెరుగుతున్నాయ్..
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు.క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో స్టాంజా, హౌసర్, యువర్ స్పేస్, ఓలైవ్ లివింగ్ వంటి సంస్థలు విద్యార్థి వసతి గృహాల సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 1.10 కోట్ల మంది వలస విద్యార్థులు ఉండగా.. 2036 నాటికి 3.10 కోట్లకు చేరుతుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది. అయితే ఆయా విద్యార్థులకు కోసం వసతి గృహాలలో కేవలం 75 లక్షల పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత విద్యార్థి గృహాల అద్దెలు ఏటా 10–15 శాతం మేర పెరుగుతున్నాయి. -
ఉప్పునీటిలో కరిగిపోయే ప్లాస్టిక్..
సముద్ర జలాల కాలుష్యంపై పోరాటంలో భాగంగా జపాన్ కు చెందిన రికెన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ (సీఈఎంఎస్ ) శాస్త్రవేత్తలు ఉప్పునీటిలో కరిగిపోయే కొత్త రకం ప్లాస్టిక్‌ను ఆవిష్కరించారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలు, ప్రపంచ జీవవైవిధ్యానికి గణనీయమైన ముప్పును కలిగించే మైక్రోప్లాస్టిక్ కాలుష్యం సమస్యను పరిష్కరించడంలో ఈ ఆవిష్కరణ ఆశాదీపంగా కనిపిస్తోంది.రహస్యమంతా సమ్మేళనంలోనే.."సుప్రమోలిక్యులర్ ప్లాస్టిక్" అని పిలిచే ఈ వినూత్న పదార్థం సాధారణంగా ఉపయోగిస్తున్నప్పుడు మన్నికగా ఉంటుంది. అదే సముద్రపు నీటిలో కలిస్తే సురక్షితంగా అందులో విచ్ఛిన్నమవుతుంది. ఈ రహస్యమంతా దాని ఉన్న పదార్థాల సమ్మేళనంలోనే ఉంది. ఇందులో రివర్సబుల్ సాల్ట్ బ్రిడ్జ్‌లు ఉంటాయి. ఇవి ఉప్పునీటిలో ఉన్న ఎలక్ట్రోలైట్ల ద్వారా అస్థిరతకు గురవుతాయి. ఇది ప్లాస్టిక్‌ను పర్యావరణ నిరపాయమైన సమ్మేళనాలుగా విచ్ఛిన్నం చేసే రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. దీని అర్థం ఎటువంటి హానికరమైన మైక్రోప్లాస్టిక్ అనేది మిగలకుండా ఈ పదార్థం కరిగిపోవడమే కాకుండా సముద్ర జీవులతో ఆ చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థపైనా ఎలాంటి ప్రభావాన్ని చూపించదు.సాంప్రదాయ ప్లాస్టిక్‌లకు స్థిరమైన ప్రత్యామ్నాయంసాంప్రదాయ ప్లాస్టిక్ క్షీణించడానికి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కూడా పట్టవచ్చని మనకు తెలుసు. ప్లాస్టిక్ అవశేషాలు మహాసముద్రాలలో పేరుకుపోతాయి. విస్తారమైన చెత్త పాచెస్ను ఏర్పరుస్తాయి. వాటి క్రమంగా విచ్ఛిన్నం నుండి ఉత్పన్నమయ్యే మైక్రోప్లాస్టిక్స్ ఆహార గొలుసులోకి చొరబడతాయి. ఇది జలచరాలు, మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ కరిగే ప్లాస్టిక్ అభివృద్ధి ఒక స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడే పరిశ్రమలలో విప్లవాత్మకమైన మార్పును కలిగిస్తుంది.ఇటువంటి ఆవిష్కరణ అనువర్తనాలు ప్యాకేజింగ్ మెటీరియల్స్, సింగిల్-యూజ్ వస్తువుల నుండి ఫిషింగ్ వలలు, ఇతర సముద్ర పరికరాల వరకు ఉంటాయి. సంప్రదాయ ప్లాస్టిక్ లను పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంతో భర్తీ చేయడం ద్వారా, పరిశ్రమలు ప్రపంచ స్థాయిలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈ సరికొత్త ప్లాస్టిక్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగం, విచ్ఛిన్న ప్రక్రియలను పూర్తీగా మార్చేస్తుందని భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం
రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ఆకాశాన్నంటిన ప్రాపర్టీ ధరలు.. కారణాలేవైనా.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పల్టీలు కొడుతూ పతనమైపోతోంది. రెండేళ్ల క్రితం ఎన్నికలతో మొదలైన స్థిరాస్తి రంగం మందగమనం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో గ్రేటర్లో గృహ విక్రయాలు, లాంచింగ్స్ భారీగా తగ్గాయి. దేశంలోనే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్‌లో అత్యధిక క్షీణత మన నగరంలోనే ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (క్యూ1) 10,100 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2024 క్యూ1లో 19,660 సేల్ అయ్యాయి. ఏడాది కాలంలో విక్రయాలలో 49 శాతం తగ్గుదల నమోదయిందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే నగరంలో 2025 క్యూ1లో కొత్తగా 10,275 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అదే 2024 క్యూ1లో 22,960 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో లాంచింగ్స్ 55 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లలో లగ్జరీ గృహాలదే ఆధిపత్యం. గ్రేటర్లో కొత్త ఇళ్ల నిర్మాణాలలో రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇన్వెంటరీ 5 లక్షలపైనే.. ఏడు నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కాస్త తగ్గాయి. 2024 క్యూ1లో 5,80,890 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. 2025 క్యూ1 నాటికి 5,59,810కు క్షీణించాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం తగ్గింది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ కారణంగా దేశంలో గృహాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో ప్రాపర్టీ ధరలు మాత్రం 17 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా ఎన్సీఆర్లో 34 శాతం, బెంగళూరులో 20 శాతం వృద్ధి చెందాయి.దేశంలోనూ సేమ్.. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ స్థిరాస్తి రంగం తిరోగమనంలోనే ఉంది. ఈ ఏడాది క్యూ1లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 28 శాతం, లాంచింగ్స్ 10 శాతం క్షీణించాయి. 2025 క్యూ1లో 93,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గతేడాది క్యూ1లో 1,30,170 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో 7 నగరాల్లో 2025 క్యూ1లో 1,00,020 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2024లో 1,10,865 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే ఏడాదిలో 10 శాతం లాంచింగ్స్ క్షీణించాయి.లగ్జరీదే హవా.. లాంచింగ్స్‌లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలే అత్యధికం. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉన్నాయి. ఆ తర్వాత రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే ప్రీమియం యూనిట్ల వాటా 27 శాతం, రూ.40–80 లక్షల ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్స్ వాటా 12 శాతంగా ఉన్నాయి. -
అదానీతో పోటీకి వేదాంతా సై!
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జేపీ అసోసియేట్స్(జేఏఎల్)పై తాజాగా డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా దృష్టి పెట్టింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ గ్రూప్ సంస్థ జేఏఎల్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2024 జూన్ 3న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశాల ప్రకారం జేఏఎల్ దివాలా చట్ట పరిధిలోకి చేరింది. దీంతో దివాలా పరిష్కార చర్యలకు తెరలేచింది.ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ సైతం ఈవోఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. బిజినెస్‌లను విడదీయకుండా ఏకమొత్తంగా కంపెనీ(జేఏఎల్)పై దివాలా పరిష్కార ప్రక్రియను చేపట్టేందుకు ఎన్సీఎల్టీ ఈ నెల మొదట్లో ఆదేశించింది. రుణాల బదిలీ 2025 ఫిబవ్రరి 20కల్లా జేఏఎల్ చెల్లించవలసిన రుణాల విలువ రూ. 55,493 కోట్లను దాటింది. చెల్లించవలసిన రుణాలను జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్)కు రుణదాతల కన్సార్షియం బదిలీ చేసినట్లు ఇటీవల జేఏఎల్ వెల్లడించింది. రుణదాతల కన్సార్షియంలో బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యాక్సిస్, కెనరా, పీఎన్బీ, యుకో, బీవోఎం, కరూర్ వైశ్యా, బీవోఐ, ఇండస్ఇండ్, బీవోబీ, ఎగ్జిమ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి.అయితే ఎన్ఏఆర్సీఎల్కు బదిలీ చేసిన రుణాల విలువ వెల్లడికాలేదు. జేఎల్ఎల్ దివాల పరిష్కార ప్రక్రియను నిర్వహించేందుకు భువన్ మదన్ ఎంపికయ్యారు. కాగా.. జేపీ గ్రూప్ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాల ప్రక్రియ ద్వారా ఇంతక్రితం ముంబైకి చెందిన సురక్షా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. -
రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు
-
సమ్మె అయినా గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగదు
హైదరాబాద్: సదరన్ రీజియన్ బల్క్ ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన బల్క్ ఎల్పీజీ రవాణాదారుల సమ్మె నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తమ ఎల్పీజీ వినియోగదారులకు తగినంత సిలిండర్ సరఫరా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయన్నారు. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రవాణా టెండర్‌ను అన్ని ప్రాంతాల ట్రాన్స్పోర్టర్లతో విస్తృత చర్చల తర్వాత తుది రూపం ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియలో రవాణాదారుల వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేసేందుకు వివరణలు ఇచ్చారన్నారు.చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గువాహటి నగరాల్లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలను కూడా కలుపుకున్నారన్నారు. ఈ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా పారదర్శకంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పీఈఎస్ఓ, పీఎన్జీఆర్బీ, ఓఐఎస్డీ వంటి చట్టబద్ధ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందాయన్నారు. ఎల్పీజీ రవాణా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మా ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త టెండర్ నిబంధనలను తీసుకు వచ్చామన్నారు.ఈ చర్యలు తీసుకున్నప్పటికి కొంతమంది రవాణాదారులు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ప్రధానంగా భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ భద్రతా సంబంధిత చర్యలు ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, వినియోగదారులు సహా అన్ని స్టేక్హోల్డర్లకు లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. అవి మరింత భద్రతా ప్రమాణాలు కలిగిన, విశ్వసనీయమైన ఎల్పీజీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.మా స్టేక్హోల్డర్ల నుంచి బాధ్యతాయుతమైన చర్యలు, అవగాహనను ఆశిస్తున్నామన్నారు. తద్వారా అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ ఎల్పీజీ సిలిండర్ల నిరంతర సరఫరాను నిర్ధారించవచ్చన్నారు. రవాణాదారులకు సమ్మెను విరమించాలని, అత్యవసరమైన ఎల్పీజీ సరఫరా నిల్వలను ప్రభావితం చేసే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవచ్చన్నారు.ఓఎంసీలు ప్రధాన రవాణాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలుగా గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలు తీర్చేందుకు ఎల్పీజీ సరఫరాను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఏఐని ఎవరెలా వాడుతున్నారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఏఐ వేళ్ల మీద వినియోగిస్తున్నారు. ఏఐ ఇప్పుడు భారతీయ వినియోగదారుల దైనందిన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ ‘సర్వీస్ నౌ’ తన తాజా సర్వేలో వివరించింది.షాపింగ్, ఫుడ్..షాపింగ్ సిఫార్సుల కోసం 84 శాతం మంది, ఆహారం, భోజన సూచనల కోసం 82 శాతం మంది, పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ప్రతి ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. ఇది ఏఐ ఆధారిత ఆర్థిక నిర్ణయాల వైపు మళ్లడాన్ని సూచిస్తుందని సర్వే తెలిపింది.దేశంలోని 80 శాతం మంది వినియోగదారులు ఇప్పుడు ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు, ఉత్పత్తులపై సలహాల కోసం, స్వయం సహాయక మార్గదర్శకాల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరుగురిలో ఐదుగురు సందేహాల నివృత్తికి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను చురుకుగా ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.కస్టమర్ సర్వీస్‌లో మాత్రం..రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పెరుగుతున్న పాత్ర ఉన్నప్పటికీ, దాని సమయాన్ని ఆదా చేసే సామర్థ్యాలు కస్టమర్ సర్వీస్ నిరీక్షణ సమయాలను తగ్గించడంలో మాత్రం సహాయపడటం లేదు. భారతీయ వినియోగదారులు గత సంవత్సరంలో 15 బిలియన్ గంటలు వేచి ఉన్నారు అని సర్వీస్ నౌ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా వ్యాపార సంస్థలు వారానికి సగటున ఒక రోజు కంటే తక్కువ కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి, మిగిలిన నాలుగు రోజులు బృందాల ప్రతిస్పందనలు, పరిపాలనా విధులు, ప్రమోషనల్ ఆఫర్లు, శిక్షణ, విరామాల కోసం వెచ్చిస్తున్నాయని సర్వే చెబుతోంది.వ్యాపార సంస్థలకు భారీ అవకాశాలను అందించే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా భారత్ అవతరించబోతోంది. కొత్త ఏఐ టూల్స్ కస్టమర్ సర్వీస్ పై తమ అంచనాలను పెంచాయని 82 శాతం మంది వినియోగదారులు వ్యక్తం చేశారని సర్వీస్ నౌ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ తెలిపారు. 2024 నవంబర్ 1 నుంచి 15 వరకు సుమారు 5,000 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. -
భూకంపాలకు హోమ్ ఇన్సూరెన్స్ పనికొస్తుందా?
మయన్మార్, థాయ్‌ల్యాండ్ దేశాలలో ఇటీవల అధిక తీవ్రతతో సంభవించిన వినాశకరమైన భూకంపం విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి యజమానుల సన్నద్ధతపై ఆందోళనలను రేకెత్తించింది. భూకంపాలు ఊహించలేనప్పటికీ, సరైన బీమా పాలసీతో మీ ఇంటిని సురక్షితం చేసుకోవడం ఇలాంటి విపత్తుల సమయంలో ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది.హోమ్ ఇన్సూరెన్స్ భూకంపాలను కవర్ చేస్తుందా?ప్రామాణిక గృహ బీమా పాలసీలు సాధారణంగా భూకంప నష్టాన్ని కవర్ చేయవు. అయితే, చాలా బీమా సంస్థలు భూకంప బీమాను యాడ్-ఆన్ లేదా ప్రత్యేక పాలసీగా అందిస్తున్నాయి. ఈ కవరేజీ మీ ఇంటి నిర్మాణం, దాని విషయాలు రెండింటినీ భూకంప కార్యకలాపాల వల్ల కలిగే నష్టాల నుండి రక్షించగలదు.భూకంప బీమా ముఖ్య లక్షణాలుస్ట్రక్చరల్ కవరేజ్: భూకంపాల వల్ల కలిగే నష్టాల నుండి భవనాన్ని రక్షిస్తుంది.కంటెంట్ కవరేజీ: ఇంట్లోని విలువైన వస్తువులు, వస్తువులను కవర్ చేస్తుంది.అదనపు జీవన ఖర్చులు: మీ ఇల్లు నివాసం ఉండలేని విధంగా మారితే తాత్కాలిక వసతి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.భూకంప బీమా ఎందుకు ముఖ్యం?మయన్మార్, థాయ్‌ల్యాండ్‌తోపాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గతంలోనూ భూకంప ప్రమాదాలు సంభవించాయి. ఇలాంటి ప్రాంతాలలో భూకంప ప్రభావానికి ఇల్లు కూలిపోతే తరువాత పునర్నిర్మించడానికి ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భూకంప బీమా నిశ్చింతను ఇస్తుంది. ఇంటి యజమానులకు ఆర్థిక భారం లేకుండా నష్టాల నుండి కోలుకునేలా చేస్తుంది.ఇవి పరిగణనలోకి తీసుకోవాలిమినహాయింపులు: భూకంప బీమా పాలసీలు సాధారణంగా అధిక మినహాయింపులతో వస్తాయి. ఇది క్లెయిమ్ చెల్లింపులను ప్రభావితం చేస్తుంది.కవరేజ్ పరిమితులు: ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లోని వస్తువులకూ గరిష్ట కవరేజీ ఉందో లేదో సరిచూసుకోండి.పాలసీ నిబంధనలు: చేరికలు, మినహాయింపులు, అందుబాటులో ఉన్న ఏదైనా అదనపు రైడర్లను సమీక్షించండి. -
సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే..
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 54 రోజుల సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అందిస్తుంది. ఇదే వ్యాలిడిటీ ప్లాన్ల కోసం ఇతర ప్రైవేటు టెలికం కంపెనీలలో అయ్యే ఖర్చులో దాదాపు సగం ఖర్చుతోనే బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.బీఎస్ఎన్ఎల్ 54 రోజుల ప్లాన్ కీలక ఫీచర్లుబీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.347కే లభిస్తున్న ఈ ప్లాన్ లో అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉచిత నేషనల్ రోమింగ్ తో సహా భారతదేశంలోని ఏ నంబర్ కు అయినా అపరిమిత వాయిస్ కాల్స్ ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.ఈ ప్లాన్ రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 54 రోజుల వ్యాలిడిటీ కాలంలో మొత్తం 108 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు ఈ ప్లాన్‌లో బైటీవీకి (BITV) కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఉంది. ఇందులో 400కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.ఈ కొత్త ప్లాన్‌తో పాటు తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రయత్నాలతో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతోంది. తమ వినియోగదారులకు మరింత విలువ ఆధారిత సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల 75,000 కొత్త 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. రాబోయే వారాల్లో 100,000 కొత్త 4జీ టవర్ల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
నాన్న ఇచ్చిన గిఫ్ట్.. ప్రపంచంలో టాప్ 10లోకి..
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా చరిత్ర సృష్టించారు. మహిళల హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు. రూ.3.5 లక్షల కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు.నాన్న గిఫ్ట్హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, తన తండ్రి శివ్ నాడార్ నుంచి 47 శాతం వాటా బదిలీ కావడంతో ఆమె ర్యాంకింగ్స్‌లో ఎదిగారు. ఈ బదిలీతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రమోటర్ సంస్థలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (వామ ఢిల్లీ), హెచ్‌సీఎల్ కార్ప్ నియంత్రణలోకి వచ్చాయి. ఫలితంగా 12 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ దిగ్గజానికి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు రోషిణి నాడార్ మల్హోత్రా చేతిలోకి వచ్చాయి.ఈ బదిలీతో రోష్ని నాడార్ మల్హోత్రా ఇప్పుడు వామా ఢిల్లీ 44.17 శాతం వాటా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో హెచ్‌సీఎల్ కార్ప్ 0.17 శాతం వాటా, వామా ఢిల్లీ 12.94 శాతం వాటా, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌లో హెచ్‌సీఎల్ కార్ప్ 49.94 శాతం వాటాపై ఓటింగ్ హక్కులపై నియంత్రణ కలిగి ఉన్నారు.వాటాల బదిలీకి ముందు శివ్ నాడార్ కు వామా ఢిల్లీ, హెచ్ సీఎల్ కార్పొరేషన్ రెండింటిలోనూ 51 శాతం వాటా ఉండగా, రోష్ని నాడార్ మల్హోత్రాకు ఈ రెండు సంస్థల్లో 10.33 శాతం వాటా ఉండేది. 2020 జూలైలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్స్‌గా రోషిణి నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అగ్రశ్రేణి విద్యా సంస్థలను స్థాపించిన శివ్ నాడార్ ఫౌండేషన్ కు ఆమె ట్రస్టీగా కూడా ఉన్నారు. -
ఖరీదైన ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్!
ఖరీదైన ప్రీమియం ఫోన్ తక్కువ ధరకు కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. ప్రీమియం ఫోన్లలో ఒకటైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ (Samsung Galaxy S23 Ultra 5G) భారీ డిస్కౌంట్ లభిస్తోంది. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ .42,000 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.1,29,999 ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్, ఎస్ పెన్ సపోర్ట్, పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లను అందిస్తుంది.కాబట్టి తక్కువ ఖర్చుతో ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ డీల్‌ను అందుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ అసలు ధర రూ .1,19,900 కాగా ప్రస్తుతం రూ .37,190 భారీ తగ్గింపుతో రూ .81,990 కు లిస్ట్ అయింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా వినియోగదారులు 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో రూ .77,890 కంటే తక్కువకే ఖరీదైన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ.2,883 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ స్పెసిఫికేషన్లుశాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాలో 6.8 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,750 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయి. అడ్రినో 740 జీపీయూతో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ పై పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్ డేట్ కు అర్హత సాధించింది. ఐపీ 68-రేటెడ్ హ్యాండ్ సెట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 45 వాట్ వైర్డ్, 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.ఇక కెమరా విషయానికి వస్తే.. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 10 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలీఫోటో, 10 మెగాపిక్సెల్ 10ఎక్స్ పెరిస్కోప్ జూమ్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, అల్ట్రా-వైడ్‌బ్యాండ్, యూసెస్బీ 3.2 జెన్ 1 పోర్ట్ ఉన్నాయి. -
అమెరికా ఎంబసీ షాక్.. భారత్‌లో 2 వేల వీసా దరఖాస్తులు రద్దు
భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఇటీవల వేల సంఖ్యలో వీసా దరఖాస్తులను రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాలను నిరోధించే చర్యల్లో సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా కొత్త ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాన్ని చేపట్టింది. కారణం ఇదే.. వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్‌లో అవకతవకలపై యూస్ ఎంబసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా "బ్యాడ్ యాక్టర్స్" (అక్రమార్కలు) లేదా బాట్స్ (మెషీన్లు) ద్వారా అపాయింట్మెంట్ సిస్టమ్‌లో జరుగుతున్న ఉల్లంఘనల గుర్తించిన రాయబార కార్యాలయం ఆయా ఖాతాలను సస్పెండ్ చేసింది. ఇలా చేసిన సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. తక్షణమే ఈ నియామకాలను రద్దు చేస్తున్నామని, అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నామని పేర్కొంది.భారతీయులే ఎక్కువవిద్య, ఉద్యోగం, పర్యాటకం.. ఇలా వివిధ పనుల కోసం యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించే అతి ఎక్కువ మందిలో భారతీయులు ప్రముఖంగా ఉంటున్నారు. భారత్ లో అమెరికా వీసా దరఖాస్తులు గణనీయంగా బ్యాక్ లాగ్ లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బీ1, బీ2 దరఖాస్తుదారుల్లో జాప్యం ఎక్కువ ఉంటోంది. ఈ వీసాలు వ్యాపారం, పర్యాటకం కోసం ఉద్దేశించినవి. 2022-23లో దరఖాస్తు చేసుకున్నవారు 800 నుంచి 1000 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.ఇలాంటి సుదీర్ఘ నిరీక్షణ సమయాన్ని ఎదుర్కోవడానికి, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారతీయ దరఖాస్తుదారులకు అమెరికా వీసా అపాయింట్మెంట్లను తెరిచింది. వీసా వెయిటింగ్ టైమ్ గురించి భారత ప్రభుత్వం ఎప్పకప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. 2022లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో వీసా జాప్యంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అప్పటి బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇటీవల జనవరిలో వాషింగ్టన్ వెళ్లిన జైశంకర్ కొత్త విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. -
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశ్రమలను వేగంగా మార్చివేసింది. ముఖ్యంగా 2022లో చాట్‌జీపీటీ వచ్చినప్పటి నుంచి దీని విస్తృతి మరింతగా పెరిగింది. చాలా మంది తమ రోజువారీ జీవితంలో, వృత్తుల్లో జెమినీ, కోపైలట్, డీప్‌సీక్ వంటి చాట్బాట్లను వినియోగిస్తున్నారు. దీని ప్రయోజనాలు ఎలా ఉన్నా సరే.. మానవ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగేసుకుంటుందన్న ఆందోళనలు మాత్రం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఈ సరికొత్త సాంకేతిక విప్లవం నడుమ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. కనీసం కొన్ని రోజులైనా కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేషన్ నుండి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్న వృత్తులపై తన భావాలను పంచుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో గేట్స్ ప్రత్యేకమైన మానవ నైపుణ్యాలు అవసరమయ్యే మూడు కీలక రంగాలను హైలైట్ చేశారు. అవి కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ.కోడర్లు.. వీళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశం ఉంది. ఏఐ కోడ్ జనరేట్ చేయడం, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను ఆటోమేట్ చేయడంలో పురోగతి సాధించినప్పటికీ, సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఖచ్చితత్వం, లాజిక్, సమస్య పరిష్కార నైపుణ్యాలు దీనికి లేవు. డీబగ్గింగ్ చేయడానికి, రిఫైనింగ్ చేయడానికి, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరచడానికి కూడా హ్యూమన్ ప్రోగ్రామర్లు అనివార్యమని గేట్స్ అభిప్రాయపడ్డారు.ఎనర్జీ ఎక్స్పర్ట్స్శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో కూడిన ప్రపంచ ఇంధన రంగం అత్యంత సంక్లిష్టమైనది. కృత్రిమ మేధస్సు.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డిమాండ్‌ను అంచనా వేయడం, మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే ఇది ఇంధన పరిశ్రమను నిర్వచించే సంక్లిష్టమైన నియంత్రణ భూభాగాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనూహ్య మార్కెట్ హెచ్చుతగ్గులను స్వతంత్రంగా నిర్వహించలేదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సుస్థిర పరిష్కారాలను అమలు చేయడంలో, విద్యుత్ అంతరాయాలు లేదా వనరుల కొరత వంటి సంక్షోభాలకు ప్రతిస్పందించడంలో మానవ నైపుణ్యం కీలకమని గేట్స్ నొక్కి చెప్పారు.జీవశాస్త్రవేత్తలుజీవశాస్త్రంలో.. ముఖ్యంగా వైద్య పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలో మానవ అంతర్దృష్టి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన అవసరం. కృత్రిమ మేధ పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడంలో, నమూనాలను గుర్తించడంలో రాణిస్తున్నప్పటికీ, ఇది అద్భుతమైన పరికల్పనలను రూపొందించే లేదా పరిశోధనలో సహజమైన పురోగతిని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. వ్యాధుల నిర్ధారణకు, జన్యుక్రమాలను విశ్లేషించడానికి, ఔషధ ఆవిష్కరణకు మాత్రం ఏఐ సహాయపడుతుందని గేట్స్ పేర్కొన్నారు. -
కారు కొన్న కస్టమర్.. ఆనంద్ మహింద్రా ఎమోషనల్!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా.. అబ్బురపరిచే, ఆలోచింపజేసే వీడియోలను, సమాచారాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ సారి ఓ కస్టమర్ తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొన్న వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇది కేవలం వీడియో మాత్రమే కాదంటూ ఎమోషనల్ అవుతూ మూడు దాశాబ్దాల క్రితం నాటి కథను రాసుకొచ్చారు. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరు.. ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..ఆనంద్ మహీంద్రా ఇటీవల డాక్టర్ పవన్ గోయెంకా ప్రయాణంపై తన హృదయపూర్వక ఆలోచనలను పంచుకున్నారు. 1990ల ప్రారంభంలో గోయెంకా యూఎస్‌లో జనరల్ మోటార్స్‌లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాన్ని విడిచి భారత్‌కు తిరిగి వచ్చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆనంద్ మహింద్రా ఆయన్ను కంపెనీ నాసిక్ ఫెసిలిటీలో ఆర్అండ్డీ డిప్యూటీ హెడ్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం& ఎం) లో చేరేలా ఒప్పించారు.అప్పట్లో కంపెనీ ఆర్అండ్డీ విభాగం పరిస్థితిని చూసిన పవన్ గోయెంకా ఇక్కడ కొనసాగుతారా లేదా అన్న సందేహాలు ప్రారంభంలో ఉన్నప్పటికీ ఆయన కొనసాగారు. పరిశోధన, అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. ఐకానిక్ మహీంద్రా స్కార్పియో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం కంపెనీ ఉత్పత్తి శ్రేణిని రూపొందించడమే కాకుండా, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో సృజనాత్మకతను కొనసాగించే ప్రపంచ స్థాయి ఆర్ & డి కేంద్రానికి పునాది వేసింది. ఆ తర్వాత గోయెంకా ఎంఅండ్ఎం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో పదవి దాకా ఎదిగారు.గోయెంకా, ఆయన భార్య మమత ఇటీవల మహీంద్రా లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటైన ఎక్స్ఈవీ 9ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తన దృష్టిలో ఈ క్షణం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదే.. అంత కంటే ఎక్కువ. మహీంద్రా ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్ ను మార్చడంలో కీలక పాత్ర పోషించిన గోయెంకా ఇప్పుడు తాను చేసిన ఆవిష్కరణలను స్వీకరిస్తున్నారు.2021లో పదవీ విరమణ చేసిన తరువాత, పవన్ గోయెంకా భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అంతరిక్ష విభాగం సంస్థ ఇన్-స్పేస్ చైర్మన్‌గా కొత్త సవాలును స్వీకరించారు. భారతీయ పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలు ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం గోయెంకా ఐఐటీ మద్రాస్ లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్థానిక విలువ-యాడ్ అండ్ ఎక్స్ పోర్ట్స్ (స్కేల్ ) స్టీరింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.This is not just another video for me…When Pawan Goenka decided to return to India in the early ‘90s, leaving behind a job at General Motors, I managed to convince him to join @Mahindra_Auto at Nashik as Deputy Head of R&DHe often relates how when he first went to Nashik and… pic.twitter.com/auggd8gEQ9— anand mahindra (@anandmahindra) March 27, 2025 -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆటో షేర్లపై ట్రంప్ దెబ్బ
ఇండియన్ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 317.93 పాయింట్లు (0.41 శాతం) పెరిగి 77,606.43 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 77,747.46-77,082.51 రేంజ్లో ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ 50 సూచీ 105.10 పాయింట్లు (0.45 శాతం) లాభంతో 23,591.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఇంట్రాడేలో 23,646.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేయగా, ఇంట్రాడే కనిష్టాన్ని 23,412.20 వద్ద నమోదు చేసింది.బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2.85 శాతం వరకు లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అదేసమయంలో టాటా మోటార్స్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 5.38 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.15 శాతం లాభపడటంతో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 0.37 శాతం లాభంతో స్థిరపడింది. నిఫ్టీ ఆటో, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికాలో తయారు చేయని అన్ని దిగుమతి కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఆటో షేర్లు అమ్మకాలను చవిచూశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ గురువారం 1.04 శాతం నష్టంతో స్థిరపడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.50 శాతం లాభంతో స్థిరపడింది. -
ఇన్ఫోసిస్‌లో మరికొంత మందికి లేఆఫ్.. ‘కొత్త’ ఆఫర్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరికొంత మందిని తొలగించింది. అంతర్గత మదింపులో ఉత్తీర్ణలు కాలేదంటూ ఇన్ఫోసిస్ మార్చి 26న తమ మైసూరు క్యాంపస్ నుండి 30-45 మంది ట్రైనీలను తొలగించినట్లు వార్తా సంస్థ మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. అయితే తొలగింపునకు గురైన ట్రైనీలకు మరో ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన ట్రైనీలకు ప్రత్యామ్నాయ కెరీర్ మార్గంగా ఇన్ఫోసిస్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) లో ఉద్యోగాల కోసం 12 వారాల శిక్షణను అందించేందుకు ముందకు వచ్చింది. ఇదే మైసూరు క్యాంపస్‌కు చెందిన సుమారు 350 మంది ట్రైనీలను తొలగించిన రెండు నెలల తర్వాత ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీపీఎం కోర్సును ఎంచుకున్న వారికి ఈ శిక్షణను స్పాన్సర్ చేస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది."మీ ఫైనల్ అసెస్మెంట్ ఫలితాలను వెల్లడిస్తున్నాం. అదనపు ప్రిపరేషన్ సమయం, సందేహ నివృత్తి సెషన్లు, అనేక మాక్ అసెస్మెంట్ అవకాశాలు ఇచ్చినప్పటికీ మీరు 'ఫౌండేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'లో అర్హత ప్రమాణాలను చేరుకోలేకపోయారు" అని ట్రైనీలకు పంపిన మెయిల్స్‌లో కంపెనీ పేర్కొంది.ఎక్స్‌గ్రేషియాగా నెల జీతంతొలగించిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఒక నెల జీతాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తోంది. దీంతో పాటు రిలీవింగ్ లెటర్లను అందిస్తోంది. ఇక బీపీఎం మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడని వారికి మైసూరు నుంచి బెంగళూరుకు రవాణా సౌకర్యం కల్పించి, వారి స్వగ్రామానికి ప్రామాణిక ప్రయాణ భత్యం అందిస్తుంది. అవసరమైతే, ట్రైనీలు బయలుదేరే తేదీ వరకు మైసూరులోని ఎంప్లాయీ కేర్ సెంటర్లో ఉండవచ్చు. క్యాంపస్ నుంచి వెళ్లాలనుకునే ట్రైనీలు మార్చి 27లోగా తమ ప్రయాణ, వసతి ప్రాధాన్యతలను సమర్పించాలని ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్‌కు క్లీన్ చిట్మరోవైపు ట్రైనీల తొలగింపునకు సంబంధించి ఇన్ఫోసిస్ ఎలాంటి కార్మిక చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని కర్ణాటక కార్మిక శాఖ డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా క్లీన్ చిట్ ఇచ్చింది. ‘వారంతా కేవలం ట్రైనీలు మాత్రమే. కొందరు మూడు నెలల శిక్షణ మాత్రమే తీసుకున్నారు. దీనిని లేఆఫ్ అనలేం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ కార్మిక చట్టాలు వర్తించవు. రెగ్యులర్ ఉద్యోగాలకు మాత్రమే లేఆఫ్ వర్తిస్తుంది. ఇక్కడ యజమాన్యం-ఉద్యోగి సంబంధం అస్సలు ఉండదు. వారంతా ఉద్యోగులు కాదు, అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు' అని అధికారుల నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం. -
ఈపీఎఫ్ఓలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నాయా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ పథకాల ద్వారా దేశంలోని ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) కింద ఏర్పాటైన నిబంధనలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ముందస్తు క్లెయిమ్‌లు, ఫ్యామిలీ అసిస్టెన్స్ అందించడం ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయి. అసలు ఈపీఎఫ్‌లో ఎలాంటి పెన్షన్ పథకాలు ఉన్నాయి.. వాటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం.సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకాలకు ఇది మూలస్తంభం. ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉంటే 58 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హులు. ప్రయోజనాలను గరిష్టంగా పెంచుకునేందుకు సభ్యులు 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకానికి కంట్రిబ్యూషన్ కొనసాగించవచ్చు. తద్వారా అధిక పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు.ముందస్తు పెన్షన్ ఎంపికలుఅధికారిక పదవీ విరమణ వయస్సుకు ముందే ఆర్థిక సహాయం కోరుకునేవారికి, ఈపీఎస్ పథకం 50 సంవత్సరాల వయస్సు నుంచే ముందస్తు క్లెయిమ్‌లను అనుమతిస్తుంది. అయితే 58 ఏళ్ల లోపు ప్రతి ఏడాది పెన్షన్ మొత్తంలో 4 శాతం తగ్గుతుంది. ఇది ఫ్లెక్సీబిలిటీ అందిస్తున్నప్పటికీ, తగ్గిన పెన్షన్ చెల్లింపుల దీర్ఘకాలిక ప్రభావాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.వైకల్య పెన్షన్సర్వీస్ సమయంలో శాశ్వత, సంపూర్ణ వైకల్యం సంభవించినప్పుడు, ఆర్థిక భద్రతను అందించడానికి ఈపీఎఫ్ఓ వైకల్య పింఛన్లను అందిస్తుంది. దివ్యాంగులైన ఉద్యోగులు, వారి కుటుంబాల తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి 10 సంవత్సరాల కనీస సర్వీస్ పీరియడ్ అనే తప్పనిసరి నిభందనతో పని లేకుండా ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు.కుటుంబ ప్రయోజనాలుఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ సభ్యుడి అకాల మరణం సమయంలో కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రయోజనాలలో ఇవి ఉన్నాయి:వితంతు పింఛను: జీవిత భాగస్వామి నెలవారీ పింఛనుకు అర్హులు.పిల్లల పెన్షన్: ఇద్దరు పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు పెన్షన్ లభిస్తుంది.అనాథ పింఛన్: జీవిత భాగస్వామి లేకపోతే పింఛన్ ను అనాథలకు కేటాయిస్తారు.వైకల్య పిల్లల పెన్షన్: దివ్యాంగులైన పిల్లలకు, అదనపు సహాయం కోసం జీవితకాల పెన్షన్ అందిస్తారు.నామినీ పెన్షన్కుటుంబం లేని సభ్యులకు, వారు మరణిస్తే పింఛను పొందే లబ్ధిదారుడి నామినేషన్‌ను ఈ పథకం అనుమతిస్తుంది.ఉపసంహరణ ప్రయోజనాలుపెన్షన్ అర్హతకు అవసరమైన 10 సంవత్సరాలు పూర్తి చేయకుండా సర్వీసు నుండి నిష్క్రమించిన సభ్యులు ఉపసంహరణ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని ద్వారా తక్కువ సర్వీస్ పీరియడ్ ఉన్నవారు కూడా పదవీ విరమణ లేదా శ్రామిక శక్తి నుండి నిష్క్రమించినప్పుడు ఆర్థిక సహాయం లభిస్తుంది.పెన్షన్ లెక్కింపు ఫార్ములాపెన్షన్ మొత్తాన్ని నెలవారీ పెన్షన్ = (పెన్షనబుల్ శాలరీ × పెన్షనబుల్ సర్వీస్) / 70 అనే ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు. ఇక్కడ "పెన్షనబుల్ శాలరీ" అనేది గత 60 నెలల్లో సగటు నెలవారీ జీతం. -
ఏటీఎం ఛార్జీల పెంపు.. మే 1 నుంచి..
ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ .2, ఆర్థికేతర లావాదేవీలకు రూ .1 ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్వర్క్ ఉన్న చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.పెంచిన ఇంటర్‌ఛేంజ్ ఫీజులను కస్టమర్లకు బదిలీ చేయాలా వద్దా అనే దానిపై బ్యాంకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ చివరికి భారాన్ని వినియోగదారులపైనే వేస్తారన్న చర్చ సాగుతోంది. గత పదేళ్లలో ఇంటర్ చేంజ్ ఫీజులను సవరించినప్పుడల్లా బ్యాంకులు ఆ భారాన్ని కస్టమర్లపైనే వేశాయి. ఈసారి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదని, బ్యాంకులు కస్టమర్లకు ఫీజులు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇంటర్చేంజ్ ఫీజు అంటే..ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు అనేది ఏటీఎం సేవలను ఉపయోగించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. ఆర్బీఐ గతంలో 2021 జూన్‌లో ఇంటర్‌ఛేంజ్ ఫీజును సవరించింది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇంటర్‌ఛేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కి, బ్యాలెన్స్ ఎంక్వైరీలు వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఇంటర్‌ఛేంజ్ ఫీజును రూ.6 నుంచి రూ.7కు పెంచారు.ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెంపునకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మార్చి 13న బ్యాంకులు, ఇతర వాటాదారులకు తెలియజేసింది. ఇంటర్ చేంజ్ ఫీజుల పెంపును అమలు చేసేందుకు ఎన్పీసీఐ ఆర్బీఐ అనుమతి కోరింది.ప్రస్తుత ఫీజు విధానంలో కార్యకలాపాలు నడపడం ఆర్థికంగా కష్టంగా ఉన్న వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లో ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. -
ఇల్లు కొనేవాళ్లు.. ఇప్పుడేం చూస్తున్నారు..?
గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగనలోకి తీసుకున్నారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగనలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోఆరోగ్యానికి ప్రాధాన్యం.. నేటి యువతరం ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి చేరుకోవచ్చు? ఎంత దగ్గరలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆట స్థలాలు.. ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు.డే కేర్ సెంటర్.. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.ఆఫీసుకు దగ్గరలో.. ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రాధామ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు.వీకెండ్ ఎంజాయ్.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాధించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్‌హౌస్‌లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. -
బంగారం వన్స్ మోర్.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మరోసారి తగ్గాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (March 24) మళ్లీ క్షీణించాయి. భారీ ధరలతో నిరుత్సాహపడిన కొనుగోలుదారులకు వరుస తగ్గుదలలు ఊరటనిస్తున్నాయి.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 82,150, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 89,620 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున దిగొచ్చాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.89,770 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,300 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.210, రూ.150 చొప్పున తగ్గాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,620 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,000 వద్ద, ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. టారిఫ్ సంబంధిత అనిశ్చితి సెంటిమెంటును ప్రభావితం చేయడంతో మిశ్రమ ప్రపంచ మార్కెట్ కదలికల మధ్య భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 496.09 పాయింట్లు లేదా 0.65 శాతం లాతంతో 77,401.60 వద్ద, నిఫ్టీ 50 124.70 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,475.10 వద్ద ఉన్నాయి. మార్కెట్ ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ ప్రారంభం అనంతరం బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 1 శాతానికి పైగా పెరిగాయి.అంతర్జాతీయ మార్కెట్ కదలికలు, వాణిజ్య సుంకాల ఆందోళనలు, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల చర్యలతో భారత స్టాక్ మార్కెట్లు నడిచే అవకాశం ఉంది. ఈ రోజు విడుదల కానున్న మార్చి నెలకు సంబంధించిన ఇండియా మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్, కాంపోజిట్ పీఎంఐ ఫ్లాష్ గణాంకాలపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచనున్నారు.విదేశీ పెట్టుబడులు పుంజుకోవడం, ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత రూపాయి వరుసగా తొమ్మిదో సెషన్ లోనూ తన విజయ పరంపరను కొనసాగించింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. శుక్రవారం ముగింపు 85.98 తో పోలిస్తే యూఎస్ డాలర్‌తో పోలిస్తే 4 పైసలు బలపడి 85.94 వద్ద ప్రారంభమైంది. -
నిజంగానే వ్యవసాయ ఆదాయం ఉందా? లేక...
మీ అందరికీ తెలిసిందే. వ్యవసాయం మీద ఆదాయం చేతికొస్తే, ఎటువంటి పన్ను భారం లేదు. ఈ వెసులుబాటు 1961 నుంచి అమల్లో ఉంది. చట్టంలో నిర్వచించిన ప్రకారం వ్యవసాయ భూమి ఉంటే, అటువంటి భూమి మీద ఆదాయం/రాబడికి ఆదాయపు పన్ను లేదు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఎటువంటి ఏ ఇతర ఆదాయం లేకపోతే, వచ్చిన ఆదాయం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేకుండా మినహాయింపులోనే ఉంటుంది. ఎటువంటి పన్నుకి గురి కాదు. భూమి, ఆదాయం ఈ రెండూ, తూ.చా. తప్పకుండా ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించిన ప్రకారం ఉండాలి. ఎటువంటి తేడాలు ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మినహాయింపు ఇస్తారు.కొంత మందికి అటు వ్యవసాయ ఆదాయం, ఇటు వ్యవసాయేతర ఆదాయం రెండూ ఉండొచ్చు. వారు రిటర్న్ వేసేటప్పుడు రెండు ఆదాయాలను జోడించి వేయాలి. దానికి అనుగుణంగా ఆ ఆదాయాలపై పన్ను లెక్కించి, అందులో మినహాయింపులు ఇవ్వడమనేది .. ఇదంతా ఒక రూలు. దాని ప్రకారం లెక్క చెప్తే పన్నుభారం పూర్తిగా సమసిపోదు కానీ ఎక్కువ శాతం రిలీఫ్ దొరుకుతుంది. పై రెండు కారణాల వల్ల, రెండు ఉపశమనాల వల్ల ట్యాక్స్ ఎగవేసే వారు.. ఎప్పుడూ ఎలా ఎగవేయాలనే ఆలోచిస్తుంటారు. ట్యాక్స్ ప్లానింగ్‌లో ప్రతి ఒక్కరికి అనువుగా దొరికేది వ్యసాయ ఆదాయం. అక్రమంగా ఎంతో ఆర్జించి, దాని మీద ట్యాక్స్ కట్టకుండా బైటపడే మార్గంలో అందరూ ఎంచుకునే ఆయుధం ‘వ్యవసాయ ఆదాయం’. దీన్ని ఎలా చూపిస్తారంటే..👉 తమ పేరు మీదున్న పోరంబోకు జాగా, 👉 ఎందుకు పనికిరాని జాగా. 👉 వ్యవసాయ భూమి కాని జాగా 👉 సాగుబడి చేయని జాగా 👉 తమ పేరు మీద లేకపోయినా చూపెట్టడం 👉 కౌలుకి తీసుకోకపోయినా దొంగ కౌలు చూపడం 👉 కుటుంబంలో తాత, ముత్తాతల పొలాలను తమ పేరు మీద చూపెట్టుకోవడం 👉 బహుమతులు, ఇనాముల ద్వారా వచ్చిన జాగా 👉 దురాక్రమణ చేసి స్వాధీనపర్చుకోవడం మరికొందరు నేల మీదే లేని జాగాని చూపెడతారు. ఇలా చేసి ఈ జాగా.. చక్కని మాగణి అని.. బంగారం పండుతుందని బొంకుతారు. కొంత మంది సంవత్సరానికి రూ. 50,00,000 ఆదాయం వస్తుందంటే ఇంకొందరు ఎకరానికి రూ. 5,00,000 రాబడి వస్తుందని చెప్పారు. ఈ మేరకు లేని ఆదాయాన్ని చూపించి, పూర్తిగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లోకి పాకింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కొనసాగింది. హైదరాబాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల మీద లెక్కలేనంత ఆదాయం చూపించారు. అధికారులు, మామూలుగానే, వారి ఆఫీసు రూమ్‌లో అసెస్మెంట్ చేస్తేనే అసెస్సీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అధికారులు అడిగే ప్రశ్నలకు, ఆరా తీసే తీరుకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది, ఈసారి అధికారులు శాటిలైట్ చిత్రాల ద్వారా వారు చెప్పిన జాగాలకు వెళ్లారు. అబద్ధపు సర్వే నంబర్లు, లేని జాగాలు, బీడు భూములు, అడవులు, చౌడు భూములు, దొంగ పంటలు, దొంగ కౌళ్లు, లేని మనుషులు, దొంగ అగ్రిమెంట్లు.. ఇలా ఎన్నో కనిపించాయి. ఇక ఊరుకుంటారా.. వ్యసాయ ఆదాయాన్ని మామూలు ఆదాయంగా భావించి, అన్ని లెక్కలూ వేశారు. ఇరుగు–పొరుగువారు ఎన్నో పనికిమాలిన సలహాలు ఇస్తారు. వినకండి. ఫాలో అవ్వకండి. ఒకవేళ ఫాలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగవేతకు ఒక మార్గమే ఉంది. కానీ ఇప్పుడు ఎగవేతలను ఏరివేసి, సరిచేసి, పన్నులు వసూలు చేసే మార్గాలు వందలాది ఉన్నాయి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఫ్యామిలీ వెల్త్ ప్రణాళికల్లో మహిళలకు ప్రాధాన్యం
వెల్త్ మేనేజ్మెంట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో మహిళలు కుటుంబ సంపదకు కేవలం లబ్ధిదారులుగానే ఉండిపోకుండా, సంపద సృష్టి, నిర్వహణ, బదలాయింపులోను కీలకంగా మారుతున్నారు. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణి ప్రధానంగా ఫ్యామిలీ ఆఫీసులు, ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం, ప్రపంచ సంపదలో మూడో వంతు భాగాన్ని మహిళలు నిర్వహిస్తున్నారు. ఇవి అంకెలు మాత్రమే కావు. సాంస్కృతిక, ఆర్థిక అంశాల్లో చోటు చేసుకుంటున్న గణనీయమైన మార్పులను సూచిస్తున్నాయి. చాలా మంది మహిళలు సంపదను కేవలం వారసత్వంగా పొందడమే కాకుండా, దాన్ని జాగ్రత్తపర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్, పెట్టుబడులు లేదా ఫ్యామిలీ ఆఫీసులు.. ఇలా ఏ రూపంలోనైనా కావచ్చు భవిష్యత్తులో కుటుంబ సంపదపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే శక్తివంతమైన స్థాయిల్లోకి వారు చేరుకుంటున్నారు. తరతరాలుగా సంపద నిర్వహణలో వస్తున్న ఫండమెంటల్ మార్పును ఇది సూచిస్తోంది.బార్క్లేస్ ప్రకారం సంపన్న కుటుంబాలకు చెందిన ప్రతి 10 మంది మహిళల్లో ఎనిమిది మందికి, వచ్చే రెండు దశాబ్దాల్లో గణనీయమైన స్థాయిలో సంపద వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ విషయానికొస్తే వారిలో సగం మంది కూడా ఇందులో పాలుపంచుకోవడం లేదు. దీన్ని సత్వరం పరిష్కరించాల్సి ఉంది.చివరిగా.. వెల్త్ మేనేజ్మెంట్లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆఫీస్‌లు, ప్రైవేట్ వెల్త్‌లో మహిళలు మరింతగా పాలుపంచుకోవడమనేది ట్రెండ్ మాత్రమే కాదు. కుటుంబ వారసత్వం, సంపద సృష్టి, సంపద బదలాయింపును మనం చూసే దృష్టి కోణంలో వస్తున్న మార్పులను ప్రతిబింబిస్తోంది. ఫ్యామిలీ ఆఫీస్‌లలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న మహిళలు, వెల్త్ మేనేజ్మెంట్ విభాగం భవిష్యత్తును నిర్దేశించనున్నారు. సంపద సృష్టి, సంరక్షణ, దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా భవిష్యత్ తరాలకు సంపద బదలాయింపులో మార్గదర్శకత్వం వహించడం.. ఇలా కుటుంబ సంపదకు సంబంధించిన ఏ అంశంలోనైనా మహిళలు మరింత కీలక పాత్ర పోషించనున్నారు.కుటుంబ సంపద నిర్వహణ విషయంలో మహిళలు మరిన్ని బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో, మారుతున్న క్లయింట్ల అవసరాలను పరిష్కరించేలా వెల్త్ మేనేజర్లు తమను తాము మార్చుకోవాలి. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో చురుకైన పాత్ర పోషించేలా మహిళలకు సాధికారత కల్పించడమనేది ఒక వ్యూహాత్మక అవసరం కూడా.భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం..భవిష్యత్ ఆర్థిక ప్రణాళికల్లో మహిళలు కూడా పాలుపంచుకోవడం మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా సంపద బదలాయింపు, వారసత్వ ప్రణాళికల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. వారు ఆర్థిక భద్రత, భవిష్యత్ తరాలకు స్థిరత్వం కల్పించడానికి అధిక విలువనిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్లిష్టమైన ఆర్థిక కాన్సెప్టులను అర్థం చేసుకోవడంలో మహిళలకు సాధికారత కల్పించే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం నుంచి మహిళల లక్ష్యాలు, విలువలకు అనుగుణమైన కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అందించే వరకు వారి ప్రాధాన్యతలకు అనుగుణమైన సర్వీసులను వెల్త్ మేనేజర్లు అందించాల్సి ఉంటుంది.ఫ్యామిలీ ఆఫీసుల విషయానికొస్తే, సంపద సృష్టి, నిర్వహణలో మారుతున్న మహిళల పాత్రలకు అనుగుణంగా తోడ్పాటు అందించేలా వెల్త్ మేనేజ్మెంట్ రంగం మారాలి. నిర్ణయాల్లోనూ వారికి చోటు లభించేలా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. పూర్తి సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడంలో మహిళలకు అవసరమైన పరిజ్ఞానం, సాధనాలు, ఆత్మవిశ్వాసం లభించే విధంగా ఆర్థిక అంశాలపై సంప్రదింపుల్లో ఫ్యామిలీ ఆఫీసులు తప్పనిసరిగా మహిళలను కూడా భాగం చేయాలి.- అరుణిమ నయన్ హెడ్ – ఫ్యామిలీ ఆఫీస్ – ప్రైవేట్ వెల్త్, యాక్సిస్ ఏఎంసీ -
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారి కోసం.. ‘ఛోటీ సిప్’
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారి కోసం కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (కేఎంఏఎంసీ) ‘ఛోటీ సిప్’ను ప్రవేశపెట్టింది. నెలవారీగా అత్యంత తక్కువగా రూ. 250తో కూడా సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చు. దీని కింద కనీసం 60 నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడేలా ఇది గ్రోత్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. కొత్త ఇన్వెస్టర్లలో క్రమశిక్షణతో కూడుకున్న పొదుపు అలవాటును పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు.ఆదిత్య బిర్లా సన్ లైఫ్‌లోనూ..ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ కూడా తాజాగా ఛోటీ సిప్‌ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్లాంటి కొన్ని ఫండ్స్‌కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. -
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
ఇటీవలి కాలంలో మన మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది చూసి దీర్ఘకాలానికి ఈక్విటీలు బ్రహ్మాండమైన రాబడులు ఇస్తాయన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అన్న సందేహాలు కూడా కొందరు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలా? లేక డెట్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న సంశయం కూడా ఎదురుకావచ్చు. కానీ, పెట్టుబడుల ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోవాలని కోరుకునే ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాలి. అదే సమయంలో పెట్టుబడినంతా ఈక్విటీల్లోనే పెట్టేయడం సరికాదు. డెట్‌కు సైతం కొంత కేటాయింపులు అవసరం. ఈక్విటీ, డెట్ పెట్టుబడులకు వీలు కల్పించే పథకాల్లో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో రాబడి 7.30 శాతంగా ఉంది. గత ఐదు నెలలుగా మార్కెట్లు తీవ్ర కుదుపులను చూస్తున్నాయి. అలాంటి తరుణంలోనూ ఏడాది కాలంలో రాబడి సానుకూలంగా ఉండడం గమనార్హం. ఏడాది కాల పనితీరు విషయంలో ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ విభాగంలో ఈ పథకం రెండో స్థానంలో నిలిచింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో చూస్తే 21 శాతం, ఏడేళ్లలో 14 శాతం, 10 ఏళ్లలో 12.75 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంతో పోల్చి చూస్తే అన్ని కాలాల్లోనూ ఈ పథకంలోనే రాబడి అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. పెట్టుబడుల విధానం ఈ పథకం అగ్రెస్సివ్ అలోకేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వివిధ మార్కెట్ క్యాప్‌ల మధ్య తగినంత వైవిధ్యాన్ని పాటిస్తుంది. అధిక వేల్యూషన్లకు చేరితే లాభాలు స్వీకరించి, అదే సమయంలో చౌక విలువల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగంగా గుర్తించొచ్చు.ఇందుకు నిదర్శనం గత ఆరు నెలల్లో క్యాపిటల్ గూడ్స్, ఆటోల్లో అమ్మకాలు చేయగా, అదే సమయంలో టెక్నాలజీ, కెమికల్స్, ఫార్మా, హెల్త్‌కేర్‌లో ఎక్స్పోజర్ పెంచుకుంది. ఈ విధానంతో నష్టాలను పరిమితం చేసి లాభాలను పెంచుకునే వ్యూహాన్ని ఫండ్ నిర్వహణ బృందం అమలు చేసింది. ఈ తరహా విధానాలతో రిస్క్ తగ్గించి, రాబడులు పెంచుకునే విధంగా పథకం పనిచేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,324 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 73 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 25 శాతం పెట్టుబడులు పెట్టగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 0.43 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. 1.64 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే 68 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 30 శాతం ఇన్వెస్ట్ చేస్తే, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 1.92 శాతం కేటాయించింది.ఈక్విటీల్లో టెక్నాలజీరంగ కంపెనీల్లో అత్యధికంగా 18 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 15 శాతం మేర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు, 9.68 శాతం మెటీరియల్స్ కంపెనీలకు, 8 శాతం హెల్త్‌కేర్ కంపెనీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడుల్లో రిస్క్ దాదాపుగా లేని ఎస్వోవీల్లో (ప్రభుత్వ బాండ్లు) 20 శాతం ఇన్వెస్ట్ చేయగా, మెరుగైన క్రెడిట్ రేటింగ్‌కు నిదర్శనంగా ఉండే ఏఏఏ సెక్యూరిటీల్లో 3.41 శాతం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడులు శాతం1భారతీ ఎయిర్టెల్ 4.49 2హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.89 3ఇన్ఫోసిస్ 3.18 4ఫోర్టిస్ హెల్త్ 2.905అల్ట్రాటెక్ సిమెంట్ 2.88 6విప్రో 2.747ఎన్టీపీసీ 2.398పవర్‌ఫైనాన్స్ 2.259ఒరాకిల్ ఫైనాన్స్ 1.96 10ఐసీఐసీఐ బ్యాంక్ 1.89 -
పోయిన పాన్, ఆధార్ నంబర్లు తెలుసుకోండిలా..
దేశంలో నివసించే ప్రజలకు అత్యంత కీలకమైన కార్డులు రెండు ఉన్నాయి. అవి ఒకటి ఆధార్ కార్డు, రెండోది పాన్ కార్డు. ప్రతిరోజూ ఏదో ఒక పని కోసం ఈ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ రెండు డాక్యుమెంట్లు లేకపోతే అనేక పనులు నిలిచిపోతాయి.అందుకే ఈ రెండు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండటం చాలా ముఖ్యం. కొంతమంది ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లను పోగొట్టుకుంటుంటారు. వాటి నంబర్లు కూడా తెలియవు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి గురించి మీరు ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఏమిటి.. సులభమైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆధార్ నెంబర్ రీట్రీవ్ చేసుకోండిలా..యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి'రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ' ఆప్షన్ కోసం చూడండి.క్యాప్చా కోడ్‌తోపాటు మీ పూర్తి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్‌తో లింక్ చేసిన ఈ-మెయిల్ ఐడీ వివరాలను నమోదు చేయండిమీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ముందుకు సాగడం కోసం దానిని నమోదు చేయండి.విజయవంతంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత, మీ ఆధార్ నంబర్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే, సహాయం కోసం ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.పాన్ నెంబర్ పొందండిలా..ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్సైట్ సందర్శించండి'నో యువర్ పాన్'పై క్లిక్ చేయండిమీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.అథెంటికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.వెరిఫికేషన్ తర్వాత మీ పాన్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. -
IPL 2025: దూసుకెళ్తున్న కోహ్లీ.. ఈసారి ట్యాక్స్ ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్ బెంగళూరు కీలక ఆటగాడైన కోహ్లీ ఐపీఎల్లో టాప్ పెర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని ఆట, పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు కోహ్లీకి అత్యధిక ధర (కాంట్రాక్ట్ ఫీజు) చెల్లించి నిలుపుకొంది.ఈసారి రూ.21 కోట్లుఈ ఏడాది ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఆన్టైన్ టాక్స్ అండ్ బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ టాక్సాలజీ ఇండియా డేటా ప్రకారం.. 2008 నుండి 2010 వరకు విరాట్ కోహ్లీ పలికిన ధర కేవలం రూ .12 లక్షలు మాత్రమే. తన ఆకట్టుకునే ఆట, ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా 2025లో రూ .21 కోట్లకు పెరిగింది.2010 తర్వాత 2011-13 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ధర రూ.8.28 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 2017 వరకు రూ.12.5 కోట్లు, 2018 నుంచి 2021 వరకు రూ.17 కోట్లు. అయితే 2022 నుంచి 2024 వరకు ఆయన ధర రూ.15 కోట్లకు పడిపోగా, ఇప్పుడు 40 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరుకుందని టాక్సాలజీ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లీ రూ.179.70 కోట్లు అందుకున్నాడు.కట్టాల్సిన పన్ను ఎంత?2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ పేమెంట్ రూ .21 కోట్లకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కోహ్లీ ఆర్సీబీ ఉద్యోగి కాదు కానీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఫీజు అందుకుంటున్నాడు కాబట్టి, ఈ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28 కింద "వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం" గా వర్గీకరిస్తారు.పన్ను లెక్కింపురూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తాడు. అతను కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నాడనుకుంటే (ఇది అధిక ఆదాయం సంపాదించేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది) సంపాదనపై 30% పన్ను వర్తిస్తుంది.సంపాదన రూ.21 కోట్లపై 30% పన్ను అంటే రూ.6.3 కోట్లు అవుతుంది. ఆదాయం రూ.5 కోట్లకు పైగా ఉంటే పన్ను మొత్తంపై 25 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది. అలా రూ.6.3 కోట్లపై ఇది రూ.1.575 కోట్లు అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ (ట్యాక్స్ + సర్‌ఛార్జ్‌పై 4%) రూ.0.315 కోట్లు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.19 కోట్లు అవుతుందన్న మాట. అంటే పన్ను కింద పోయేది తీసేయగా విరాట్ కోహ్లీ అందుకునేది రూ.12.81 కోట్లు.ఒకవేళ వ్యాపార ఖర్చులు (ఏజెంట్ ఫీజులు, ఫిట్ నెస్ ఖర్చులు, బ్రాండ్ మేనేజ్ మెంట్ వంటివి) ఉంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ముందు సెక్షన్ 37(1) కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర ఆదాయ మార్గాలు (ఎండార్స్ మెంట్లు, పెట్టుబడులు మొదలైనవి) కూడా విడిగా పన్ను విధించబడతాయి. -
ఫోర్త్ సిటీ.. దక్షిణ హైదరాబాద్‌కి రియల్ బూమ్!
నీరు ఎత్తు నుంచి పల్లం వైపునకు పారినట్లే.. రియల్ ఎస్టేట్ అవకాశాలు, అభివృద్ధి కూడా మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతం వైపే విస్తరిన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో మొదలైన స్థిరాస్తి అభివృద్ధి ఐటీ హబ్ రాకతో గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల వైపు పరుగులు పెట్టింది. కొత్త ప్రాంతంలో అభివృద్ధి విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ వైపు దృష్టిసారించింది. విద్య, వైద్యంతో పాటు ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లతో కూడిన నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనుంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితం కానున్న ఈ కొత్త నగరంతో స్థిరాస్తి అవకాశాలు పశ్చిమం నుంచి దక్షిణ హైదరాబాద్ వైపు మళ్లనుంది. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, దక్షిణ కొరియాలో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సక్సెస్‌లను స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, ముచ్చర్ల గ్రామాల పరిధుల్లో 814 చదరపు కిలో మీటర్లు, 2,01,318 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీ విస్తరించి ఉంటుంది. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, ఆమన్‌గల్ 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి. ఈ నగరం సాకారమైతే 30–35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60–70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. నెట్‌జీరో సిటీగా నిర్మితం కానున్న ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీఎలక్ట్రానిక్స్ అండ్ సాధారణ పరిశ్రమలు: 4,774 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్: 4,207 ఎకరాలు నివాస, మిశ్రమ భవనాలు: 1,317 ఎకరాలు నివాస భవనాల జోన్: 1,013 ఎకరాలు స్పోర్ట్స్ హబ్: 761 ఎకరాలు ఎడ్యుకేషనల్ అండ్ వర్సిటీ జోన్: 454 ఎకరాలు ఎంటర్టైన్మెంట్: 470 ఎకరాలు హెల్త్ సిటీ: 370 ఎకరాలు ఫర్నీచర్ పార్క్: 309 ఎకరాలు ఏఐ సిటీ: 297 ఎకరాలునెట్జీరో సిటీగా.. చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ప్రణాళికబద్ధంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా పర్యావరణహితంగా కాలుష్యరహితంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. నెట్‌జీరో సిటీగా ఏర్పాటుకానున్న ఈ నగరానికి సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ప్రణాళికలను తయారు చేసింది. వచ్చే యాభైఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులను అనువుగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించారు.వ్యర్థాల నిర్వహణ.. పర్యావరణాన్ని కాపాడేందుకు నెట్‌జీరో సిటీలో 33 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. చెట్లు, వాణిజ్య పంటలు, రహదారుల వెంట నీడనిచ్చే వృక్షాలు ఉంటాయి. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కంటే ఇక్కడ 2–3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. వ్యర్థ జలాలను శుద్ధీకరించి మళ్లీ వినియోగించేందుకు వీలుగా మారుస్తారు. దీంతో పాటు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడేలా చూస్తారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నివాసాలు నిర్మించేటప్పుడు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్యరహిత వస్తువులను వినియోగించేలా చూస్తారు.ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్‌కు ప్రాధాన్యం..ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు రంగాలకే ఏకంగా 64 శాతం భూమిని కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్‌సైన్స్ హబ్‌కు 4,207 ఎకరాలను కేటాయించారు. కొంగరకలాన్‌లో యాపిల్ ఫోన్ విడిభాగాలను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ జోన్లో తన శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. లైఫ్‌సైన్ జోన్లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.రోడ్డు, రైలు, విమానం.. అన్నీ.. » ఫ్యూచర్ సిటీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించనున్నారు. » ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్‌కు, అలాగే ఔటర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్ఖాన్పేట్, ముచ్చర్ల వరకూ 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. » రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్‌గల్ మండలంలోని ఆకుతోటపల్లె వద్ద రీజినల్ రింగ్ రోడ్‌ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. » దీంతో పాటు రాజేంద్రనగర్‌లో రానున్న కొత్త హైకోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. -
టాటా కార్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ‘ఛావా’ హీరో
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ వెల్లడించింది. తమ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి ప్రచారానికి ఆయన తోడ్పడనున్నట్లు తెలిపింది.ఐపీఎల్ సీజన్ సందర్భంగా కొత్త టాటా కర్వ్ ప్రచార కార్యక్రమంతో ఈ భాగస్వామ్యం ప్రారంభమవుతుందని వివరించింది. ఇందుకోసం 20 సెకన్ల నిడివితో ‘టేక్ ది కర్వ్’ పేరిట ప్రకటనలు రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.ఈ నేపథ్యంలో టాటా మోటర్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో కౌశల్ కంపెనీ తాజా కారు కర్వ్‌ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ఈ పోస్ట్ లో "ఉత్తమ కథలు ట్విస్ట్ లతో నిండి ఉంటాయి.. విక్కీ కౌశల్‌తో టాటా మోటార్స్ కొత్త శకానికి స్వాగతం'' అంటూ రాసుకొచ్చింది. -
రియల్ఎస్టేట్ ఏజెంట్లకు కేంద్రమంత్రి సూచన
భారత రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి వీలుగా.. కార్యకలాపాల్లో విశ్వాసం, పారదర్శకత ఉండేలా చూడాలని ఈ రంగానికి చెందిన ఏజెంట్లకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూచించారు. 2030 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ రూ.85 లక్షల కోట్లకు చేరుకోనుందన్న అంచనాను ప్రకటించారు.నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (నార్–ఇండియా) వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలను, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని పరిశ్రమను కోరారు. నార్–ఇండియాలో 50వేల మంది ఏజెంట్లు సభ్యులుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో ఏజెంట్ల పాత్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.డెవలపర్లు, వినియోగదారుల మధ్య వీరు కీలక వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏజెంట్ల సూచలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. 2016లో రెరాను తీసుకురావడాన్ని అద్భుత సంస్కరణగా పేర్కొన్నారు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాల నివారణకు దీన్ని తీసుకొచ్చారు.అలాగే, రియల్ ఎస్టేట్‌లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, వ్యాపార సులభతర నిర్వహణకు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. 2047 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణాల్లోనే నివసించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇది 35 శాతంగా ఉంది. -
ఒక్క బెంగళూరు సెంటర్లోనే 180 మంది తొలగింపు
ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొంటోన్న అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ లేఆఫ్‌లను అమలు చేస్తోంది. గ్లోబల్ వర్క్ ఫోర్స్ తగ్గింపులో భాగంగా బెంగళూరులోని ఇంజినీరింగ్ టెక్నాలజీ సెంటర్ నుంచి 180 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విమాన తయారీ సంస్థ భారత్ లో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.బోయింగ్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగుల కోతను ప్రకటించింది. భారత్‌లో ఇటీవల 2024 డిసెంబర్ త్రైమాసికంలో జరిగిన తొలగింపులు ఇందులో భాగంగానే జరిగాయి. కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఉద్యోగ కోతలు వ్యూహాత్మకంగా ఉన్నాయని, అయితే వీటి ప్రభావం కస్టమర్లు, కార్యకలాపాలపై పెద్దగా ఉండదని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.కంపెనీలో కొన్ని ఉద్యోగాలు తగ్గినప్పటికీ అదే సమయంలో సర్వీస్, సేఫ్టీ, నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కొత్త ఉద్యోగాలను కూడా కంపెనీ సృష్టించింది. బెంగళూరు, చెన్నైలోని బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (బీఐఈటీసీ) అధునాతన ఏరోస్పేస్ పనులను నిర్వహిస్తోంది. కంపెనీ బెంగళూరు క్యాంపస్.. యూఎస్ వెలుపల అతిపెద్ద గ్లోబల్ పెట్టుబడులలో ఒకటి.ఇదిలావుండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి 2029 నాటికి జర్మనీలో 7,500 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. 2024లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు 23,382 మంది ఉద్యోగులను తొలగించగా, 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను తొలగించాయి. 2023లో అత్యధికంగా 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను తొలగించాయి. -
హైదరాబాద్‌లోనూ గ్రీన్ బిల్డింగ్స్..
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ అనుకూలమైన హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలే కాదు ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, ఇతరత్రా ఆఫీసు భవనాలు సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడంతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌరశక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు. నిత్యావసరాలకు వినియోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది. కానీ.. ఈ భవనాలలో నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు. -
కొత్త ఐపీవో.. రూ. 550 కోట్లు టార్గెట్
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ. 550 కోట్లు సమీకరించేందుకు ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 300 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 100 శాతం వాటాలు ఉన్నాయి.తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ప్లాంటు, మెషినరీ కొనుగోలు వంటి మూలధన వ్యయాల అవసరాలకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. బాటిల్స్, కంటైనర్స్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ కాంపోనెంట్లు మొదలైన వాటి డిజైనింగ్ నుంచి డెలివరీ వరకు వివిధ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌ను ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ అందిస్తోంది. పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ రూ. 397.41 కోట్ల ఆదాయంపై రూ. 15.19 కోట్ల లాభం నమోదు చేసింది. ఈ ఇష్యూకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కొత్త మైలురాయి
దేశంలోనే నంబర్ వన్ రూఫ్‌టాప్ సోలార్ ప్రొవైడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ టాటా పవర్ దేశవ్యాప్తంగా 1,50,000 రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మొత్తం సామర్థ్యం ఇప్పుడు సుమారు 3 గిగా వాట్లకు చేరింది. భారతదేశ పునరుత్పాదక విద్యుత్ పరివర్తనలో కంపెనీ పోషిస్తున్న కీలక పాత్రకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.దేశంలోని 700 పైచిలుకు నగరాల్లో కార్యకలాపాలతో టాటా పవర్ రెన్యువబల్ ఎనర్జీ లిమిటెడ్‌లో (TPREL) భాగమైన టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్, సుస్థిరమైన, విద్యుత్తును ఆదా చేసే భవిష్యత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రస్థానంలో ముందువరుసలో ఉంటోంది.కంపెనీ తమ తమిళనాడు ఫ్యాక్టరీలో ఏఎల్ఎంఎం ఆమోదిత సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తోంది.ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సహా 20 పైగా ఆర్థిక భాగస్వాముల ద్వారా టాటా పవర్ సరళతరమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. తద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి తెస్తోంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాలు, తమ ఫ్లాగ్షిప్ ‘ఘర్‌ఘర్ సోలార్’ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమల్లో కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కంపెనీకి దేశవ్యాప్తంగా 300 పైచిలుకు నగరాల్లో 575 పైగా చానల్ పార్ట్నర్లు, 400 పైగా నగరాల్లో 225 పైగా అధీకృత సర్వీస్ భాగస్వాములు ఉన్నారు. రెసిడెన్షియల్ రంగంలో 1,22,000 పైగా వినియోగదారులు సహా 1.5 లక్షలకు పైగా కస్టమర్ల బేస్‌తో కంపెనీ పటిష్టమైన స్థానాన్ని దక్కించుకుంది. -
అమెజాన్‌లో షాపింగ్.. కొత్త చార్జీలు
వస్తువు ఏదైనాఇప్పుడు చాలా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. మంచి డిస్కౌంట్లు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. అయితే ఆ డిస్కౌంట్ల మీదనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కన్ను పడింది. ‘డిస్కౌంట్లు ఊరికే రావు’ అంటోంది.సాధారణంగా చాలా ఈ-కామర్స్ సైట్లలో వస్తువుల కొనుగోలుపై వివిధ బ్యాంకులు తమ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణ తగ్గింపులు ఇస్తుంటాయి. అయితే అమెజాన్‌లో వీటిని వినియోగించుకోవాలంటే కొంత మొత్తం ఆ ఈ-కామర్స్ కంపెనీకీ ఇవ్వాలి. రూ .500 లేదా అంతకంటే ఎక్కువ ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ (ఐబీడీ) ఉపయోగించే కొనుగోళ్లకు అమెజాన్ రూ .49 ప్రాసెసింగ్ ఫీజును ప్రవేశపెట్టింది.డిస్కౌంట్ ఉపయోగించుకునేందుకు రుసుమా?అవును, మీరు విన్నది నిజమే. కొనుగోలుదారులు డిస్కౌంట్ ఉపయోగించుకునేందుకు అమెజాన్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇలాంటి రుసుమును మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే వసూలు చేస్తోంది. ఈ బ్యాంకు ఆఫర్ల నిర్వహణ, ప్రాసెసింగ్ ఖర్చును భరించడానికి ఈ రుసుము సహాయపడుతుందని అమెజాన్ తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే, ఇది మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి చిన్న సర్వీస్ ఛార్జీ వంటిది.అమెజాన్‌లో ఏదైనా ఆర్డర్‌పై మీరు రూ .500 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్‌ను వర్తింపజేస్తే, అమెజాన్ మీ మొత్తం బిల్లుకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ .49 జత చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ .5,000 విలువైన వస్తువును కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. మీ బ్యాంక్ మీకు రూ .500 తగ్గింపు ఇస్తుంది. అప్పుడు సాధారణంగా అయితే రూ.4,500 చెల్లించాలి. కానీ ఇప్పుడు, అమెజాన్ రుసుముగా రూ .49 వసూలు చేస్తోంది కాబట్టి మీరు చెల్లించాల్సిన తుది మొత్తం రూ .4,549 అవుతుంది.ఈ రుసుమును ఎవరు చెల్లించాలి?రూ.500 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ వినియోగించుకునే వారు.ప్రైమ్ సభ్యులకు కూడా మినహాయింపు లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది.డిస్కౌంట్ రూ.500 లోపు ఉంటే ఈ ఫీజు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఒకవేళ మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసినా లేదా రిటర్న్ చేసినా కూడా రూ.49 ఫీజు రీఫండ్ కాదు. -
స్విస్ వాచీల స్టోర్స్ విస్తరణ.. కొత్తగా మరో ఆరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్విస్ లగ్జరీ వాచీల దిగ్గజం బ్రైట్లింగ్ వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో కొత్తగా ఆరు బొటిక్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో వీటి సంఖ్య 10కి చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పుణె తదితర నగరాల్లో నాలుగు బొటిక్ స్టోర్స్ ఉన్నట్లు బ్రైట్లింగ్ ఇండియా ఎండీ ప్రదీప్ భానోత్ తెలిపారు.దేశీయంగా స్విస్ వాచీల మార్కెట్ సుమారు రూ. 2,500 కోట్లుగా ఉంటోందని ఆయన చెప్పారు. పరిశ్రమ ఏటా సుమారు 15 శాతం ఎదుగుతుండగా, తాము అంతకు మించి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ప్రదీప్ చెప్పారు. స్మార్ట్ వాచీలు వచ్చినప్పటికీ .. హోదాకు నిదర్శనంగా ఉండే బ్రైట్లింగ్లాంటి లగ్జరీ వాచీల ప్రాధాన్యతను గుర్తించే వారు పెరుగుతున్నారని ఆయన తెలిపారు.అలాగే వాటిపై ఖర్చు చేసే సామర్థ్యాలు పెరుగుతుండటం కూడా వ్యాపార వృద్ధికి దోహదపడనుందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టోర్‌లో సుమారు రూ. 3.11 లక్షల నుంచి సుమారు రూ. 17 లక్షల పైచిలుకు విలువ చేసే వాచీలు అందుబాటులో ఉన్నాయి. 140 ఏళ్ల బ్రైట్లింగ్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమున్న వాచీలను ఇందులో మార్చి 25 వరకు ప్రదర్శిస్తున్నారు. -
బ్యాంకుల బంద్‌పై అప్డేట్..
దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్‌కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. తమ డిమాండ్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి సంతృప్తికరమైన హామీలు రావడంతో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను విరమించాలని బ్యాంకింగ్ యూనియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నిర్ణయించింది.యూఎఫ్‌బీయూ అనేది దేశవ్యాప్తంగా తొమ్మిది యూనియన్లకు చెందిన బ్యాంకు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. యూఎఫ్‌బీయూ తొలుత మార్చి 24, 25 తేదీల్లో అంటే వచ్చే సోమ, మంగళ వారాలలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. శుక్రవారం అన్ని పార్టీలను సంప్రదింపుల సమావేశానికి పిలిచిన తర్వాత సమ్మెను వాయిదా వేయాలని చీఫ్ లేబర్ కమిషనర్ నిర్ణయించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.వార్తా ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఐబీఏ కార్మికులు లేవనెత్తిన డిమాండ్లపై చర్చిస్తామని యూనియన్‌కు హామీ ఇచ్చాయి. దీంతో వచ్చే వారం ప్రారంభంలో చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను యూనియన్ విరమించినట్లు తెలుస్తోంది.పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్‌బీయూ వ్యతిరేకిస్తోంది.ఉద్యోగుల డిమాండ్లు..ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్‌బీయూలో ఉన్నాయి.