Alluri Sitarama Raju
-
గంజాయి కేసులో పాత నేరస్తుడు అరెస్ట్
గొలుగొండ: ఏటిగైరంపేట గ్రామంలో 2021లో గంజాయి తరలిస్తున్న సమయంలో బైక్ వదిలేసి పారిపోయిన నిందితుడిని గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2021లో ఏటిగైరంపేట గ్రామంలో 36 కేజీల గంజాయి బైక్‌పై తరలిస్తుండగా.. అల్లూరి జిల్లా వాడలపాలెం గ్రామానికి చెందిన వంతల సుందర్రావు అప్పట్లో తప్పించుకుని పారిపోయాడు. వదిలేసిన బైక్ ఆధారంగా ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ, సిబ్బందిని సీఐ రేవతమ్మ, డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అరెస్ట్ -
మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు చెందిన గృహం స్వాధీనం
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న అధికారుల కోసం నిర్మించిన నివాస గృహం ఆక్రమణకు గురైంది.ప్రాజెక్టులో గతంలో పనిచేసిన ఆనందో నందో కుమారుడు అనిల్‌కుమార్ నందో ప్రాజెక్టు నివాస గృహాన్ని ఆక్రమించి,ఆధునిక హంగులతో పనులు చేయిస్తున్నాడు.ప్రాజెక్టు అధికారులు పలుమార్లు ఇంటిని ఖాళీ చేయమని,పనులు ఆపాలని చెప్పినా వినిపించుకోలేదు.దీంతో అధికారులు పోలీసులకు తెలియజేశారు.పోలీసులు సైతం చెప్పినా పనులు చేస్తూ ఉన్నాడు. దీంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.ఉన్నత అధికారులు కొరాపుట్ సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు అదనపు తహసీల్దార్ ఉదవ్ సబర్,ప్రాజెక్టు ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావులు రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి తాళాలు పగలగొట్టి గృహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి, పాడేరు: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో రెండు రోజుల క్రితం ప్రాణప్రతిష్ట జరిగిన లక్ష్మిదేవికి తొలి శుక్రవారంతో ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం లక్ష్మిదేవిని మహిళలంతా దర్శించుకుని కుంకుమార్చన పూజలు చేశారు. భజన కార్యక్రమాలతో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. నేడు ఆలయ వార్షికోత్సవం పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ తొలి వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహచలంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. శనిత్రయోదశి పురస్కరించుకుని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. వైభవ వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద పూజలు జరుగుతాయన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొవాలని కోరారు. సీలేరు: సీలేరులో మారెమ్మ ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన ఎం.కె.టి.ఎన్.వీ ప్రసాద్ , మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో సహస్రదీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయకమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఘనంగా అమ్మవారి గరగల ఊరేగింపు చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లి ఉత్సవం ఘనంగా జరుగుతోంది. వేడుకలో భాగంగా రెండోరోజు సుర్లవంశీయుల ఇంటి వద్ద కొలువుతీరిన అమ్మవారి గరగలు, పాదుకలు, ఘటాలకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భాజభజంత్రీలు, డప్పుల చప్పుళ్ల మధ్య అమ్మవారి గరగలను ఊరేగింపుగా ఽఽఽశతకంపట్టు వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఎంపీపీ కోరాబు అనూషాదేవి, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్‌కుమార్, పసుపులేటి వినాయకరావు, సభ్యులు బేతాళుడులు గరగలను ఽశతకం పట్టువద్దకు తీసుకువచ్చారు. సుర్లవంశీయులు సుర్ల అప్పారావు. తిరుపతి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కుంకుమపూజలు అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు -
డ్రోన్లను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక అడుగులు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఈఎన్సీ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాల పైలట్లకు శిక్షణ తీవ్రతరం చేశారు. వాస్తవంగా ఏడాది పొడవునా ఇక్కడ పైలట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. కానీ ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో దీన్ని మరింత చురుగ్గా కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని దాడులకు తెగబడుతున్న శత్రుదేశాల కుయుక్తుల్ని తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ ఎయిర్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఎన్ఏఐఎస్ఎస్)ను సిద్ధం చేశారు. ఎయిర్ స్టేషన్లో స్మార్ట్ ఫెన్స్‌ను అమర్చి.. సీసీకెమెరాల సాయంతో పహారా కాస్తున్నారు. స్మార్ట్ ఫెన్స్లోపలికి ఏ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాఫ్టర్, మనిషి వచ్చినా.. వెంటనే కంట్రోల్ రూమ్‌కు అప్రమత్తం చేయడంతో పాటు సెకెన్ల వ్యవధిలో మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. ఎయిర్‌స్టేషన్ చుట్టూ ఇన్ఫ్రారెడ్ డివైజ్‌లు, మోషన్ డిటెక్టర్స్, ఏ చిన్న రంధ్రం చేసి లోపలికి ఎవరు ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్ సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ముమ్మరం చేసినట్లు సమాచారం. ఎయిర్ స్టేషన్‌కు దాదాపు 2 కిలోమీటర్ల వరకూ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ వ్యాపింపజేసి.. శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టనున్నారు. అదేవిధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఎన్ఏడీఎస్)ని కూడా డేగాలో అప్రమత్తం చేశారు. భారీ డ్రోన్ల నుంచి తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకూ లేజర్ ఆథారిత కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి.. వాటిని మట్టుపెట్టేలా రూపొందించిన ఈ వ్యవస్థ సాయంతో 360 డిగ్రీల కోణంలో.. 10 కిలోమీటర్ల పరిధిలో ఏ రకమైన డ్రోన్ ఉన్నా.. పసిగట్టి నాశనం చేయగలదు. -
ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి
రంపచోడవరం/మోతుగూడెం/వై.రామవరం/గంగవరం/కూనవరం: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో మృతులకు ఘన నివాళులర్పించారు. రంపచోడవరం, మోతుగూడెం, వై.రామవరం, గంగవరం, కూనవరం ప్రాంతాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంత మొందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వెంకట్, కిరణ్, వాణిశ్రీ,, నిర్మల, రాణి, ప్రేమ్స్వరూప్, రామచంద్రనాయుడు, రామ్‌ప్రసాద్, వల్లీఖాన్ నూకరాజు, కనకరాజు, సుబ్బలక్ష్మి, శారదదేవి, సోమాలమ్మ, నాగమణి, సిద్దు, రమణ,నాగూర్, మణి, సాయి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వే వివరాలను వెంటనే అప్లోడ్ చేయండి
రంపచోడవరం: ఏజెన్సీ ఏడు మండలాల్లో భూహక్కు, భూ చట్టం ద్వారా రీ సర్వేకు సంబంధించిన వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో శుక్రవారం తహసీల్దార్లు, సర్వేయర్లతో రీ సర్వే ప్రక్రియపై వర్క్ షాప్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సర్వే చేసిన భూముల వివరాలను వీఆర్వోల లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్‌కు అప్లోడ్ చేయాలని తెలిపారు. రీ సర్వేలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఒక ఇంట్లో యజమానుల పేర్లతో ఉన్న భూములు వారసులకు మ్యుటేషన్ చేయాలని తెలిపారు. ఆర్డీడీ కేజీయా కుమారి మాట్లాడుతూ ఏజెన్సీలో 133 గ్రామాల్లో రీ సర్వే చేసినట్టు చెప్పారు. ఇంకా 268 గ్రామాల్లో చేయాల్సి ఉందన్నారు. 133 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసిన వాటికి గెజిట్ నోటిఫికేషన్ కోసం ఈ వర్క్‌షాప్ నిర్వహించినట్టు తెలిపారు -
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అనంతగిరి(అరకులోయటౌన్): క్రీడల్లో గెలుపోటములు సహజమని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ దిగువశోభ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెప్పారు. అనంతరం ఎగువశోభ సచివాలయాన్ని సందర్శించి, రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దిసరి గంగరాజు, సర్పంచ్‌లు కొర్రా సింహాద్రి, మొష్యా, వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
పాడేరు : గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం కల్పించేందుకు జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక గిరిజన గురుకుల బాలికల పాఠశాల, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, తలార్సింగి సీఏహెచ్ బాలుర పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5,6,7,8 తరగతులకు సంబంధించి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 5,6,7,8 తరగతులకు సంబంధించి 312 మంది విద్యార్థులకు గాను 176 మంది హాజరు కాగా, 136 మంది గైర్హాజరయ్యారు. ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 843 మందికి గాను 591 మంది హాజరు కాగా, 252 మంది హాజరు కాలేదు. ఈ పరీక్ష కేంద్రాలను డీఆర్వో పద్మలత, జిల్లా విద్యాశాఖా ధికారి బ్రహ్మాజీరావు, పరీక్షల అసిస్టెంట కమిషనర్ ఆర్. శశికుమార్ తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
‘వికసిత అల్లూరి జిల్లా’ లక్ష్యంతో పనిచేయాలి
సాక్షి, పాడేరు: వికసిత అల్లూరి సీతారామరాజు జిల్లా లక్ష్యంతో అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు చేరుకుని కలెక్టరేట్లో పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, జేసీఅభిషే క్గౌడ సమక్షంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులు, జల్‌జీవన్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, లాక్పతి దీదీ, గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం సూర్యఘర్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం జన్మన్, పీఎం స్వనిధి తదితర కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థంగా అమలుజేయాలన్నారు. ఉపాధిహామీ వేతనం సగటున రూ.263 ఉందని, రూ.300కు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 105 అమృత సరోవర్ పనులు సకాలంలో జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజనలో రూ.180.86 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. పీఎం ఆవాస్ యోజ నలో 17,111 గృహాలు, పీఎం జన్మన్లో 34,236 గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వదేశి దర్శన్‌లో బొర్రాగుహలలో మౌలిక సదు పాయాల కల్పన, అభివృద్ధి పనులకు రూ.29.30 కోట్లు మంజూరయ్యాయని, అరకు–లంబసింగి టూరి జం అభివృద్ధికి రూ.50 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి మాట్లాడుతూ పెదబయలు మండలంలోని తారాబు జలపాతం అభివృద్ధికి రూ.4 కోట్ల ఎంపీలాడ్ నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. బొర్రా గుహల అభివృద్ధికి రూ.29.30 కోట్లు మంజూరు అరకు–లంబసింగి టూరిజం అభివృద్ధికి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ -
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
పెదబయలు/జి.మాడుగుల: పిల్లల సరదా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పుట్టిన రోజును సరదాగా స్నేహితులతో గడుపుదామని వెళ్లి, పిట్టలబొర్ర (తారాబు)జలపాతంలో ఈతకొడుతూ గల్లంతైన కిశోర్(22), గుర్రాయి గెడ్డలో ఈత కొడుతూ గల్లంతైన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) అనే బాలుడు మరణించారు. తీవ్రంగా గాలించి వారి మృతదేహాలను పోలీసులు శుక్రవారం బయటకు తీశారు. తమ కలలు నెరవేరుస్తారనుకున్న పిల్లలు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండడం చూసి భరించలేని తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన స్నేహితులతో కలిసి ఈతకొట్టడానికి గురువారం తారాబు జలపాతంలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఐదుగంటల పాటు గాలించి, మృతదేహాన్ని వెలికి తీశారు. ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్టు స్థానిక ఎస్ఐ కె.రమణ తెలిపారు. తమకు ఒక్కడే కుమారుడని, గారాబంగా పెంచి, చదివిస్తున్నామని పుట్టిన రోజు నాడు ఇలా విగతజీవిగా మారుతాడనుకోలేదని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. గాలింపు చర్యల్లో పెదబయలు ఆర్ఐ పూర్ణయ్య, జామిగుడ సర్పంచ్ తెరవాడ అన్నమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు తెరవాడ వెంకటరావు, వీఆర్ఏ కోటిబాబు తదితరులు పాల్గొన్నారు. ● జి.మాడుగుల మండలంలో సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) ఐదుగురు స్నేహితులతో కలసి గురువారం గుర్రాయి గ్రామ సమీపంలో గల గెడ్డలో ఈతకొట్టడానికి వెళ్లి, ప్రవాహంలో గల్లంతైన విషయం తెలిసిందే. గెడ్డ ఊబిలో కూరుకుపోయి మరణించిన ప్రసాద్ వర్మ మృతదేహాన్ని శుక్రవారం బయటకుతీశారు. సంఘటన స్థలం వద్ద మృతదేహాన్ని స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు పరిశీలించి పోస్టుమార్టానికి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతైన బాలుడు, యువకుడు మృతి జలపాతం, వాగుల నుంచి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు గుండెలవిసేలా విలపించిన తల్లిదండ్రులు -
సాయమేది బాబూ!
ఖరీఫ్కుపశువులను అమ్ముకుంటున్న గిరిజన రైతులుజిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం పంట హెక్టార్లు వరి 56,792 చోడి,ఇతర చిరుధాన్యాలు 23,642 పప్పుదినుసులు 1,948 నూనెగింజలు 1,740 పత్తి 3,467 పొగాకు 200 చెరకు 82 మొత్తం 87,871 -
మలేరియా రహితసమాజం కోసం కృషి
● ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: మలేరియా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో చింతూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చింతూరు డివిజన్లో గత ఏడాది 382 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 170 కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు దో మతెరలు వినియోగించాలని, మురుగునీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఎంపీడీవో రామకృష్ణ, డాక్టర్ నిఖిల్ పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, తీవ్ర అన్యాయం చేశారు. అన్నదాత సుఖీభవ హామీని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. గత ఏడాది రైతులకు పెట్టుబడి సాయం అందజేయలేదు. ఈఏడాది కూడా పంపిణీ అనుమానంగానే ఉంది. గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితిని గమనించి సాయం అందజేయాలి. – గబ్బాడ లక్ష్మయ్య,గిరిజన రైతు, కుజ్జెలి గ్రామం, పాడేరు మండలంసాక్షి.పాడేరు: జిల్లాలో ఎక్కువ మంది రైతులు పేదలే. రెక్కాడితే గాని డొక్కాడని వారికి వ్యవసాయమే ఆధారం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉండేది. రైతుల సంక్షేమం లక్ష్యంగా అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను అమలుచేశారు. 90 శాతం సబ్సిడీపై విత్తనాలతో పాటు ప్రతి ఏడాది రైతు భరోసా పథకంలో ఆర్థిక సాయం అందించడంతో ప్రతి గిరిజన రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేశారు. గత ప్రభు త్వం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌కు ముందుగానే ఆమోదం తెలపడంతో గత ఖరీఫ్ సమయంలో వరి,ఇతర వాణిజ్య పంటల విత్తనాలు సమకూరాయి. రైతు భరోసా పథకంలో మూడు విడతలుగా ఏడాదికి రూ.13,500 చొప్పున 1,69,264 మంది రైతులు ఏటా రూ.104 కోట్లు ఆర్థిక సాయం పొందారు. ఉసూరుమంటున్న గిరిజన రైతులు జిల్లాలోని గిరిజన రైతులు వ్యవసాయానికి పెట్టుబడి సాయం లేక ఉసూరుమంటున్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు సాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత ఆ విషయం విస్మరించారు. గత ఖరీఫ్‌లో పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేలు మాత్రమే దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. దీంతో అప్పులు చేసి, పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పనులకు గిరిజన రైతులు శ్రీకారం చుట్టారు. వర్షాలు కురుస్తుండడంతో దుక్కిపనులతో పాటు మెట్ట పంటలకు విత్తనాలు జల్లుతున్నారు. అయితే ఇంతవరకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదు.అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం కోసం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖరీఫ్‌లో ప్రతి గిరిజన రైతుకు పెట్టుబడికి కనీసం రూ.15వేలు అవసరం. ఆ సొమ్ములేక చాలా మంది రైతులు తమ పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌కు దుక్కిపనులు చేస్తున్న గిరిజన రైతుగత ఏడాదీ ఇబ్బందులు పడ్డా గత ఖరీఫ్ సీజన్లోను వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బంది పడ్డాను.రైతు భరోసా ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిఏడాది రూ.13,500 సాయం అందించేది. వ్యవసాయ పెట్టుబడు లకు మంచి అదునులో ఈసొమ్ము ఉపయో గపడేది. పీఎం కిసాన్ యోజన రూ.2వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు. – బంగురు వాసుదేవ, గిరిజన రైతు, గడి కించుమండ, హుకుంపేట మండలంపశువులను అమ్ముకుంటున్నారు పేద గిరిజన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.తిండి గింజలు,ఇతర వాణిజ్య పంటలు పండించుకుని జీవించే రైతులు వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు పశువులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కూడా రెండు దుక్కి పశువులను హుకుంపేట సంతలో అమ్ముకున్నాను. – రేంగ పండన్న, గిరిజన రైతు, బొడ్డాపుట్టు, హుకుంపేట మండలం ఆర్థిక ఇబ్బందుల్లో గిరి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు గత ప్రభుత్వం హయాంలో 1,69,264 మందికి రైతు భరోసా ఏటా రూ.104 కోట్ల ఆర్థిక సాయం గత ఖరీఫ్ నుంచి కూటమి ప్రభుత్వ సాయం నిల్ ఈ ఏడాది కూడా సాయం ఊసేత్తని సర్కార్ -
పీజీఆర్ఎస్కు 104 అర్జీలు
పాడేరు : ప్రజల సమస్యలను గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేది క కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో పద్మలతతో కలిసి సబ్ కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 104 అర్జీలు స్వీకరించా రు. రహదారుల నిర్మాణ, తాగునీటి సమస్య, పింఛన్లు, అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేయాలని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ అధిక వినతులు వచ్చాయి.డీఎంహెచ్‌వో డాక్టర్ జమల్‌బాషా, టీడబ్ల్యూ ఇన్చార్జి డీడీ కమల, డీఈవో బ్రహ్మాజీరావు, డీఎస్డీవో జగన్మోహన్రావు, జిల్లా రవాణా అధికారి లీలాప్రసాద్, కార్మిక శాఖ అధికారి సుజాత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రోహిణి పాల్గొన్నారు. -
స్నేహశీలి.. చంద్రమౌళి
విశాఖపట్నం: స్నేహశీలిగా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక భావాలు గల విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి జె.ఎస్.చంద్రమౌళి మరణం ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని వేదనను మిగిలింది. విహారం కోసం కాశ్మీర్ లోని పహల్గాం వెళ్లిన ఆయన.. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. అదే రోజు తన భార్య, మరో రెండు కుటుంబాలతో కలిసి కశ్మీర్ బయలుదేరారు. ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లి దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు, విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున, వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండటంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తరచుగా సందర్శించేవారు. చంద్రమౌళి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు తగిన శిక్ష పడాలని వారంతా కోరుతున్నారు. ప్రాణాలతో బయటపడ్డాం కానీ..కశ్మీర్ పహల్గాంలో జరిగిన దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందగా.. ఆయన మిత్రులు శశిధర్, సుచిత్రలు ప్రాణాలతో బయటపడ్డారు. చంద్రమౌళి, శశిధర్, అప్పన్న కుటుంబాలు ఈ నెల 18న కాశ్మీర్ విహారయాత్రకు బయలుదేరి వెళ్లాయి. ఈ నెల 25న అందరూ విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ 22న పహల్గాం దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వారు వివరించారు. దాడి జరిగిన సమయంలో కొండపై ఉన్న క్యాంటీన్ సమీపంలో ఉన్నామని, కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో టాయిలెట్ల వెనుక దాక్కున్నామని సుచిత్ర తెలిపారు. తుపాకీతో కనిపించిన ఉగ్రవాది తమవైపు రావడం చూసి, ప్రాణ భయంతో నుదుటిన బొట్టు కూడా చెరుపుకుని, సమీపంలోని వాగులో ముఖాలు కడుక్కున్నామని చెప్పారు. భయం ఎక్కువగా ఉన్నా.. దైవనామస్మరణ చేస్తే ఆ శబ్దం విన్నా చంపేస్తారేమోననిపించి అది కూడా చేయలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. శశిధర్ మాట్లాడుతూ కాల్పులకు భయపడి తాము ఫెన్సింగ్ కింద నుంచి దూరి చెట్ల వెనుక దాక్కునే ప్రయత్నం చేశామన్నారు. తన భార్య సుచిత్ర ఫెన్సింగ్ దాటడానికి చంద్రమౌళి సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కాల్పులు జరుగుతున్నప్పుడు కళ్లముందే మనుషులు నేలకొరగడం చూశామన్నారు. చంద్రమౌళి కాల్పుల్లో మృతి చెందారని తర్వాత తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు చెప్పారు.కాశ్మీర్ వెళ్దామని రెండేళ్లుగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు వెళ్తే, తమ మిత్రుడిని కోల్పోవాల్సి వచ్చిందని శశిధర్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి ఏటా విహారయాత్రలకు వెళ్లే తమకు, ఈ పర్యటన తీరని విషాదాన్ని మిగిల్చిందని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. చంద్రమౌళి కుమార్తెలు అమెరికా నుంచి రావడంతో.. శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
ఇటుకల కోటలు
ఇటుకల పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బట్టీల యజమానులు సతమతమవుతున్నారు. ఇటుక బలంగా తయారు కావడానికి బంకమట్టి, వరిపొట్టు మిశ్రమం అవసరం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. మరో పక్క కొనుగోలుదారులు లేక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. తయారైన ఇటుకలు.. భారీ వర్షాల వల్ల పాడైపోవడంతో నష్టం ఏర్పడింది. దీంతో బట్టీలు మూతపడుతున్నాయి. కూలుతున్నముంచంగిపుట్టు: ఇటుకల వ్యాపారులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా అమ్మకాలు లేక నష్టాలను చవిచూస్తున్నారు.రోజు రోజుకు ఊక,కర్రలు వంటి ముడి సరకుల ధరలు పెరుగుతూ ఉండడంతో పాటు కూలీల వ్యయం అధికం కావడంతో బట్టీలు మూతపడుతున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలల్లో సుమారు 50 బట్టీలున్నాయి. వీటిలో అత్యధిక బట్టీల్లో రెండు నెలలుగా ఇటుకల తయారీ నిలిపివేశారు. సరిహద్దులో సుమారు 150 కుటుంబాలు ఇటుకల బట్టీల ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఒడిశా రాష్ట్రం జయపురం, కోరాపుట్, సిమిలిగూడ, మల్కన్‌గిరి,రాయపూరు వంటి పట్టణాల నుంచి ఇటుకల తయారీకి కోసం ప్రతి ఏడాది 150 కుటుంబాల వారు వస్తారు. డిసెంబర్ నుంచి మే వరకు ఆరు నెలల పాటు ఇటుకలను తయారు చేస్తూ ఉంటారు. ఒక్కో బట్టీలో వారానికి 50 వేల ఇటుకలు తయారవుతాయి. ఈ లెక్కన ఆరు నెలల్లో సుమారు 12 లక్షల ఇటుకలు తయారు చేస్తారు. ఒక్కో ఇటుక రూ.5.50 నుంచి రూ.6 చొప్పున విక్రయిస్తారు. గత ఏడాది వరకు విక్రయాలు బాగున్నాయి. సిమెంట్ ఇటుకల కారణంగా ఈ ఏడాది విక్రయాలు బాగా తగ్గిపోయాయి. సుమారు ఐదు లక్షల ఇటుకలు తయారీదారుల వద్ద ఉండిపోయాయి. సిమెంట్ ఇటుక ధర రూ.20 ఉన్నా... పని త్వరగా పూర్తవుతుండడంతో ఆ ఇటుకల వినియోగంపై ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 580 గ్రామాలకు సరఫరా సరిహద్దులోని 580 గ్రామాలకు చెందిన వారు ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల నుంచే ఇటుకలను కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారైన ఇటుకలకు నాణ్యత,సైజ్ పరంగా మంచి గుర్తింపు ఉంది. అయితే గత మూడు నెలలుగా ఇటుకల అమ్మకాలు లేకపోవడంతో నిల్వలు అధికంగా పేరుకుపోయాయి. దీనికి తోడు గత రెండు నెలలుగా సరిహద్దులో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి.తయారు చేసిన ఇటుకలు తడిసిపోయి పాడైపోతున్నాయి. దీంతో చాలా మంది ఇటుకల వ్యాపారులు నష్టాలను భరించలేక బట్టీలను తాత్కాలికంగా మూసివేశారు. పెరిగిన ముడిసరకుల ధరలు ఇటుకల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఊక ధర గత ఏడాది కిలో రూ.3 ఉంటే ప్రస్తుతం రూ.6 ఉంది.కట్టెలు ట్రాక్టర్ లోడు గత ఏడాది రూ.4వేలు ఉంటే ప్రస్తుతం రూ.6వేలకు చేరింది. బొందు ఇసుక వ్యాన్ లోడు గత ఏడాది రూ.6,500 ఉంటే ప్రస్తుతం రూ.10వేలు ఉంది. దీనికి తోడు రోజుకు వెయ్యి ఇటుకలు తయారీ చేస్తే రూ.1,300 కూలి చెల్లించాలి. వర్షం, ఇతర కారణాల వల్ల ఇటుకలు పాడైతే ఆ నష్టాన్ని బట్టీ నిర్వాహకుడే భరించాలి. రూ.4,500 ఖర్చు చేసి వెయ్యి ఇటుకలు అమ్మకానికి సిద్ధం చేస్తే మార్కెట్లో రూ.5వేలు నుంచి రూ.5,500 ధర మాత్రమే లభిస్తోంది. దుర్భర పరిస్థితుల్లో వలస కూలీలు ఈ ఏడాది మూడు నెలలకే ఇటుకల తయారీని బట్టీల నిర్వాహకులు నిలిపివేసి, కూలీలను తిరిగి ఇంటికి పంపించేశారు.దీంతో ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి వచ్చిన వందలాది మంది ఇటుకల తయారీ వలస కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. గత 10 సంవత్సరాలుగా ఏటా సరిహద్దులో ఇటుకల తయారీకి వచ్చి ఆరు నెలల పాటు ఉపాధి పొందే కూలీలు నేడు అవస్థలు పడుతున్నారు. ఇటుకల తయారీ పనినే నమ్ముకుని జీవించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది.రానున్న రోజుల్లో ఇటుకల తయారీ పనిని వదులుకుని మరేదైనా పని చేసుకుంటే తప్ప కుటుంబాలను పోషించుకోలేమని వలస కూలీలు వాపోతున్నారు.పనిలేకఇబ్బందులు పడుతున్న వలసకూలీలుమూతపడుతున్న బట్టీలునష్టాల్లో తయారీదారులు భారీగా పెరిగిన ముడిసరకుల ధరలుకొనుగోలు దారులు లేక పేరుకుపోతున్న నిల్వలు మండలం మొత్తం మూతపడినవి బట్టీలు ముంచంగిపుట్టు 20 06 పెదబయలు 14 06 జి.మాడుగుల 10 04 హుకుంపేట 07 06వర్షాలతో పాడైపోతున్న ఇటుకలు ఈ పనే మాకు ఆధారం ఇటుకలు తయారు చేసేందుకు ఒడిశాలోని జయపురం నుంచి వచ్చాను. గత ఏడాది ఆరు నెలల పాటు పని చేశాను. రూ.లక్ష వరకు ఇంటికి తీసుకు వెళ్లాను.ఈ ఏడాది మూడు నెలలు పని చేసి, రూ.20 వేలు కూడా సంపాదించలేకపోయాను.ఇటుకలకు డిమాండ్ లేక నిర్వాహకులు ఇంటికి వెళ్లి పోవాలని చెప్పారు. ఈ పని లేకపోతే కుటుంబ పోషణ చాలా కష్టంగా మారుతుంది. – హరిజన్, వలస కూలీ,జయపురం,ఒడిశా రాష్ట్రంరూ.3 లక్షల నష్టం వచ్చింది ఇటుకల బట్టీల నిర్వహణ చాలా కష్టంగా ఉంది.ప్రస్తుతం సిమెంట్ ఇటుకలకు డిమాండ్ ఉంది. కొనుగోలు దారులు లేక మట్టి ఇటుకల నిల్వలు పెరిగిపోయాయి. ఊక,కర్రలు తదితర ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. వర్షాలకు ఇటుకలు పాడైపోయాయి. ఈ ఏడాది రూ.3లక్షల వరకు నష్టం వచ్చింది. – బొరగం శ్రీనివాసరావు, ఇటుకల బట్టీ నిర్వాహకుడు, పెద్దపుట్టు గ్రామం -
పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి
పాడేరు : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ అన్నారు. మండలంలోని డి.గొందూరులో సర్పంచ్ సీదరి రాంబాబు అధ్యక్షతన గురువారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. డి.గొందూరు వికసిత్ పంచాయతీ కింద ఎంపిక కావడం పంచాయతీ ప్రజల అదృష్టమన్నారు. వికసిత్ పంచాయతీలకు అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుతాయని చెప్పారు. పంచాయతీ పరిధిలోని పాలమానుశంక గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని, మర్రిపాలెం, వాకపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ సీదరి రాంబాబు కలెక్టర్‌ను కోరారు. అనంతరం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు నిర్మాణ మంజూరు పత్రాలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ బాబు, డీఎల్పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్‌కుమార్ -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గల్లంతు
పెదబయలు/జి.మాడుగుల: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు గల్లంతయ్యారు. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పిట్టలబొర్ర జలపాతంలో బీటెక్ విద్యార్థి గొ న్నురు కిశోర్, జి.మాడుగుల మండలం గుర్రాయి గ్రామ సమీపంలో గల గుర్రాయిగెడ్డలో మహి వరప్రసాద్ అనే బాలుడు గల్లంతయ్యారు. వివరాలు...విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన పుట్టిన రోజు వేడుకలను అరకులోయలో శుక్రవారం జరుపుకోవాలని భావించాడు. ఇందుకోసం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి పెందుర్తి నుంచి రెండు బైక్‌లపై బయలుదేరాడు. రాత్రి రెండు గంటలకు గొన్నురు కిశోర్, స్నేహితులు లోకవరపు చంద్రశేఖర్, పాడి శ్యామ్యూల్,కమ్మనైని సంతోష్ అరకువేలి చేరుకుని, బసచేశారు. గురువారం ఉదయం 7.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పెదబయలు మీదుగా పిట్టలబొర్ర వెళ్లారు. నలుగురు జలపాతం వద్ద సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం ఈత కొట్టేందుకు జలపాతంలోకి దిగారు. కిశోర్(22) జలపాతంలోని సొరంగ ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతం లోతుగా ఉండడం వల్ల అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఇక్కడ లోతైన సొరంగం ఉందని చెప్పినా వారు వినిపించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.రమణ తెలిపారు. చీకటి పడడంతో శుక్రవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. కిశోర్ తల్లి,అక్క, బంధువులకు సమాచారం పంపినట్టు ఎస్ఐ తెలిపారు. కిశోర్ శుక్రవారం అరకులోయలో తన పుట్టిరోజు వేడుకలను జరుపుకోవల్సి ఉండగా...ఇంతలో ప్రమాదానికి గురయ్యాడు. గత ఏడాది మే 25తేదీన అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దొరగుడ గ్రామానికి చెందిన సమరెడ్డి అరుణ్‌కుమార్(24) అనే యువకుడు ఈ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి సుడిగుండలో మునిగి గల్లంతయ్యాడు. ఈత కోసం వెళ్లి... జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి వరప్రసాద్(14) అనే బాలుడు, తన ఐదుగురు స్నేహితులు బొర్రమామిడి గ్రామానికి చెందిన పాంగిబాబు, తీగలమెట్ట గ్రామానికి చెందిన కొర్ర చలపతి, పాంగి వంశీ, పాంగి నాగేశ్వరరావు, గుప్పవీధికి చెందిన కొర్రా కిరణ్ సాయికుమార్‌తో కలసి గుర్రాయి గెడ్డలో ఈతకొట్టడానికి గురువారం సాయంత్రం ఓ ఆటో వెళ్లాడు. ఇద్దరు బయట ఉండగా, నలుగురు గెడ్డలో దిగి ఈతకొడుతూ పెద్ద పనుకుపై నుంచి జాలువారే నీటి ప్రవాహంలో జారుతూ సరదాగా గడిపారు. ఆ సమయంలో వరప్రసాద్ గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి అక్కడున్న ఊబిలో కూరుకుపోయాడు. వరప్రసాద్ కోసం గెడ్డలో చాలా సమయం గాలించినా కనిపించలేదని స్నేహితులు తెలిపారు. సమాచారం తెలిసిన తండ్రి సత్తిబాబు, కుటుంబ సభ్యులు గెడ్డ వద్దకు వెళ్లి గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన బీటెక్ విద్యార్థి ఈతకోసం వెళ్లి గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో ఘటనలు -
గిరి రైతుల ఆర్గానిక్ఉత్పత్తులకు గిరాకీ
● ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ పాడేరు : గిరిజన రైతులు సాగు చేస్తున్న ఆర్గాని క్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఎంపీడీవోలతో గ్రామీణ పరిశ్రమల పార్క్ ఏర్పాటుపై గురువారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి.మాడుగుల మండలం సొలభంలో రూరల్ ఇండస్ట్రీయల్ పార్క్ఏర్పాటు చేసేందుకు యో చిస్తున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.రవిశంకర్, వెటర్నరీ ఏడీ నర్సింహు లు, ఎల్డీఎం మాతునాయుడు పాల్గొన్నారు. -
పీఎం జన్మన్నుసద్వినియోగం చేసుకోవాలి
● 20 సూత్రాల పథకం చైర్మన్ దినకర్ అరకులోయటౌన్: పీఎం జన్మన్ను సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అనంతగిరి మండలంలోని పైనంపాడు, కాకరపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన సాయంత్రం అరకులోయ మండలంలోని శిమిలిగుడలో పర్యటించి, పీఎం జన్మన్ గృహాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల స్థితిగతులు, సమస్యలను గుర్తించేందుకే పీవీటీజీ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. జన్మన్ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పీఎం జన్మన్ పథకంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతివృత్తుల వారికి శిక్షణ ఇచ్చి, పనిముట్లు, రుణాలు అందిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను శుక్రవారం పాడేరులో కలెక్టర్‌తో జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ తేజ, అరకులోయ తహసీల్దార్ ఎం.వి.వి.ప్రసాద్, ఎంపీడీవో అడపా లవరాజు, ఎంపీటీసీ లక్ష్మి, హౌసింగ్ ఏఈ కాంతి, ఆర్ఐ బలరామ్, వీఆర్వో ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
తొలి విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీత గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ నెల 30న వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే స్వామివారి చందనోత్సవం(నిజరూప దర్శనం) అనంతరం ఆ రోజు రాత్రి తొలివిడతగా సమర్పించాల్సిన మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమకూర్చేందుకు ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆలయ బేడా మండపంలోని భాండాగారం వద్ద తొలి చందనం చెక్కను ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. అనంతరం ఆ చందనం చెక్కతో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోశ్చరణల మధ్య బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం నోటికి వస్త్రం చుట్టుకుని తొలిచందనాన్ని అరగదీశారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు చందనాన్ని అరగదీశారు. అరగదీసిన చందనాన్ని స్వామివారి మూలవిరాట్‌కి సమర్పించారు. అనంతరం 20 మంది నాల్గవ తరగతి సిబ్బంది చందనం అరగదీతలో పాల్గొన్నారు. ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్, సూపరింటెండెంట్ త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఏయూలో శతాబ్ది ఉత్సవాల జోష్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాల జోష్ కనిపిస్తోంది. ఈ నెల 26న వర్సిటీ వందో ఏట అడుగుపెట్టనున్న సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో భాగంగా వర్సిటీ పరిపాలన భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో క్యాంపస్‌లో శతాబ్ది ఉత్సవాల శోభ వెల్లివిరుస్తోంది. ఈ వేడుకల కోసం క్యాంపస్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. గురువారం సాయంత్రం కాలేజీ విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులందరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఇస్తూ.. నృత్యాలతో అలరించారు. -
మోదకొండమ్మ తల్లి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
పాడేరు : గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను మే 11,12,13 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పాడేరు ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ మత్య్సరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. స్థానిక మోదకొండమ్మ తల్లి ఆలయంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో ఉత్సవాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గతంలో కన్నా ఎంతో భిన్నంగా అన్ని వర్గాల ప్రజలు, భక్తులను కలుపుకొని ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు కొట్టగుళ్లి సుబ్బారావు, చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్, ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కూడా సురేష్‌కుమార్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, సూర్యనారాయణ, కేజీయారాణి, రత్నబాయ్, ప్రశాంత్, మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.14 ఏళ్లుగా పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్ నాతవరం: కోర్టు వాయిదాలకు రాకుండా 14 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న గంజాయి నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశామని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తెలిపారు. గురువారం నాతవరం ఎస్ఐ సిహెచ్.భీమరాజుతో కలిసి ఆమె మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా మీనంబలంపురం గ్రామానికి చెందిన పంగలి దేవన్ గంజాయి రవాణా చేస్తుండగా నాతవరం పోలీసులకు 2011లో పట్టుబడ్డాడన్నారు. ఆయన నుంచి 450 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని అప్పట్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన అప్పటి నుంచి వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. నిందితుడి ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక దృిష్టి సారించారన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్టాల సరిహద్దులో సంచరిస్తున్న నిందితుడిని కేడీ పేట ఏఎస్ఐ వై.వెంకటరావు, నాతవరం పోలీసు కానిస్టేబుల్ కె.లోవరాజు ఈ నెల 23న చాకచాక్యంగా పట్టుకున్నారన్నారు. గురువారం అరెస్ట్ చేసి కోర్డుకు తరలించామన్నారు. ఎళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్న దేవన్‌ను పట్టుకున్న వెంకటరావు, లోవరాజులను ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారని సీఐ తెలిపారు. -
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
డుంబ్రిగుడ/చింతపల్లి/ జీకే వీధి/రంపచోడవరం/గంగవరం : జిల్లాలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ పంచాయతీల ప్రక్షాళనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పీవీటీజీలకు అందజేస్తున్న గృహల నిర్మాణాలకు మండలంలోని అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శిలు సహకారించాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ద్వారానే గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, దాని ద్వారానే నేడు పల్లెలో వెలుగులు చూడగలుగుతున్నామన్నారు. అరకులో జరిగి కార్యక్రమంలో సర్పంచ్ గగ్గుడు శారద ఆధ్వర్యంలో గృహ లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. డుంబ్రిగుడలో జెడ్పీటీసీ చటారి జానకమ్మ, ఎంపీపీ బాకా ఈశ్వరి, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, వైఎస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు, వైస్ ఎంపీపీ శారద, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో ప్రసాద్, పిఆర్ జెఇ బాలకిషోర్, గూడెంకొత్తవీధిలో దామనాపల్లి సర్పంచ్ కుందరి రామకృష్ణ, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ పాపారావు పాల్గొన్నారు. గంగవరంలోని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీడీవో వై.లక్ష్మిణరావు , సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పాల్గొన్నారు. రంపచోవరంలో సమీర్, చందు, రామకృష్ణ, సన్నీ, రవి, తేజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’
డాబాగార్డెన్స్: ‘సారంగపాణి జాతకం’లో తాను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో ప్రియదర్శి తెలిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ గురువారం నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా జగదాంబ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడారు. తాను నటించిన మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు. ఇంద్రగంటితో ఒక ఫొటో దిగితే చాలనుకునే వాడినని.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం కోసం ఇంద్రగంటే ఎక్కువ కష్టపడ్డారన్నారు. ఈ సినిమాలో ఆంధ్ర యాసలో డైలాగ్‌లు చెప్పినట్లు వివరించారు. హీరోయిన్ మాట్లాడుతూ అందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు. ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అష్టాచమ్మా చిత్రం విశాఖలో షూటింగ్ చేసి.. నానీని హీరోగా పరిచయం చేిసినట్లు చెప్పారు. మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో రూపొందించిన ఈ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. హీరో ప్రియదర్శి -
జాతరలో ముమ్మర ఏర్పాట్లు
చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి అమ్మవారి వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం ప్రాంగణంలో వైద్యశాఖ, ఐసిడిఎస్,గిరిజన సహకార సంస్థ,వ్యవసాయ,ఉద్యాన శాఖలు,పశుసంవర్ధక, ఉపాధి హామీ పథకం, వెలుగు, మరియు పంచాయితీ అద్వర్యంలో విద్యుత్ వ్యర్థాల సేకరణ స్టాల్స్‌ను ఆయా శాఖలు అధికారులు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో ముత్యాలమ్మ జాతర సందర్భంగా నీటి సమస్య తలెత్తకుండా పలుచోట్ల తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా 50 మంది అదనపు కార్మికులను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. వాహనాల దారి మళ్లింపు ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా మండల కేంద్రానికి చేరుకునే వాహనాలను దారి మళ్లించే విధంగా పోలీసు చర్యలు చేపట్టారు. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆదేశాల మేరకు సీఐ వినోద్‌బాబు ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. చింతపల్లికి నర్సీపట్నం నుంచి వచ్చే వాహనాలను స్థానిక ఏపీఆర్ కళాశాల నుంచి జీకే వీధి, కేడి పేట నుంచి వచ్చే వాహనాలను జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద, పాడేరు జెర్రెల నుంచి వచ్చే వాహనాలను డిగ్రీ కళాశాల నుంచి దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ నాలుగు రోజుల పాటు చింతపల్లి ప్రాంతమంతా పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సీఐ వినోద్‌బాబు తెలిపారు. -
గంజాయి వినియోగంతో సమాజానికి చేటు
సాక్షి,పాడేరు: గంజాయి వినియోగంతో సమాజానికి చేటు అని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలు శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు.గంజాయి సాగు చేసే రైతులు, రవాణాదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి సాగు విడిచిపెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, బ్యాంకుల రుణాలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. 15వేల ఎకరాల్లో నీడతోటలు, పండ్ల మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సాగు, రవాణా చేస్తే స్థిరచరాస్తుల జప్తు జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా చేసినా వారి స్థిర, చరాస్తులు జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గంజాయి స్మగ్లర్లను గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమన్నారు. జిల్లా వ్యాప్తంగా 221 గ్రామాల్లో గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఒక్క మార్చి నెలలోనే 782 కిలోల గంజాయిని పట్టుకుని 9మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు గంజాయి నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లును విడుదల చేశారు. జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, పాడేరు, రంపచోడవరం సబ్కలెక్టర్లు సౌర్యమన్ పటేల్, కల్పశ్రీ, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు నందు, రమేష్‌కుమార్‌రావు, డీఈవో బ్రహ్మజీరావు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్‌కుమార్ -
ఆహ్వానించి అవమానపరిచారు
రాజవొమ్మంగి: జల్‌జీవన్ మిషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించి అవమానపరచారని, మండలంలోని వాతంగి పంచాయతీ సర్పంచ్ భీంరెడ్డి శుభలక్ష్మి వాపోయారు. వాతంగి పంచాయతీ పెదగర్రంగిలో రూ.14 లక్షలతో చేపట్టనున్న జేజేఎం పథకం పనులను ఎమ్మెల్యే శిరిషాదేవి శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 4 గంటలకు హాజరుకావాలని సర్పంచ్, వైస్ ఎంపీపీలను అధికారులు ఆహ్వానించారు. ఆ గ్రామానికి మేము 3.30 నిమిషాలకే వెళ్లామని, అయితే అప్పటికే అధికారులు, ఎమ్మెల్యే కార్యక్రమాలు ముగించుకొని వెళ్లిపోయారని సర్పంచ్ శుభలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజేశ్వరి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఆహ్వానించి, తమను కించపరిచారన్నారు. దీనిపై కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
పాడేరు : గిరిజన విద్యార్థులు తమ ప్రాథమిక విద్య దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. పది ఫలితాల్లో సూపర్ ఫిప్టీ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచారని ఆయన ప్రశంసించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సూపర్ ఫిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులతో విజయోత్సవ సభ నిర్వహించారు. సూపర్ ఫిప్టీ ద్వారా గిరిజన విద్యార్థుల ప్రగతికి గత ఐటీడీఏ పీవో అభిషేక్ బాటలు వేశారని, దాన్ని తాము కూడా కొనసాగిస్తామన్నారు. సూపర్ ఫిప్టీ విద్యార్థులకు ఐటీడీఏ అండగా ఉంటుందన్నారు. కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశ పరీక్షలు రాసి సీట్లు సంపాదించుకోవాలన్నారు. బాలికలు తమ చదువులను పూర్తి చేసుకొని స్థిరపడేంత వరకు వివాహాలు చేసుకోవద్దని సూచించారు. సూపర్ పిప్టీ బ్యాచ్ విజయవంతం కావటానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, సూపర్ పిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులను ఆయన శాలువలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, రజనీ, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సీలేరు, అడ్డతీగలలో ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామస్తులు
అరకులోయ టౌన్/చింతూరు/కొయ్యూరు/పాడేరురూరల్/సీలేరు/అడ్డతీగల: జమ్మూకాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు డాడులు జరిపి వారి ప్రాణాలు తీసుకోవడం హేయమైన చర్యని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం ఉగ్రదాడికి నిరసనగా అరకులోయ ప్రధాన కూడలిలో కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన చేశారు. జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగంతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ పర్యాటకులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ముష్కర ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. -
తోటలో తమిళనాడు వాసి మృతి
రోలుగుంట: తమిళనాడు రాష్ట్రం నుంచి కనగరాజ్ రమేష్(42) వడ్డిప నుంచి అర్ల వెళ్లే అడవి మార్గంలోని ఓ ఊప్లిస్ తోటలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి గురువారం వెళ్లి పరిశీలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు మేనల్లుడు దయానిధి మండలంలో బొప్పన గ్లోబల్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో తనకు కూడా డ్రైవర్ జాబ్ చూడమని చెప్పి దయానిధి వద్దకు రమేష్ వచ్చాడు. ఆరోగ్యం సరిగా ఉండడం లేదని, వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి మృతుడికి దయానిధి కొంత డబ్బు ఇచ్చాడని ఎస్ఐ తెలిపారు. ఆ డబ్బులతో కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే పూటుగా మద్యం తాగుతూ తిరిగాడని, దీనికి తోడు సరైన ఆహారం అందకపోవడంతో తోటలో చనిపోయినట్టు భావిస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనకాపల్లి నుంచి క్లూస్ టీంను రప్పించి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. -
26 నుంచి ఏయూ శతాబ్ది ఉత్సవాలు
విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయని ఏయూ ఉపకులపతి ప్రొ.రాజశేఖర్ తెలిపారు. అకడమిక్ సెనేట్ మందిరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వందేళ్ల ఉత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలి రోజు ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకూ శతాబ్ది వాక్‌థాన్‌తో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.మధుమూర్తి, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ ప్రొ.శేషాద్రి శేఖర్ అతిథులుగా హాజరవుతారన్నారు. ఇందులో భాగంగా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా విభిన్న కార్యక్రమాలతో నిర్వహించే శతాబ్ది ఉత్సవాల వార్షిక క్యాలెండర్‌ను కూడా ఆవిష్కరిస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో నూతన భవనాలు, సెంట్రల్ ల్యాబ్ ఫెసిలిటీ, పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన జ్ఞాపికగా ప్రత్యేక ఐకానిక్ టవర్‌ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. -
ఉగ్రదాడికి నిరసనగా శాంతి ప్రదర్శన
పాడేరు: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు అతి కిరాతంగా దాడులు జరిపి, వారి ప్రాణాలను బలిగొనడం అత్యంత హేయమైన చర్య అని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా, మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ బుధవారం సాయంత్రం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకీ జై, భారత పౌరులపై ఉగ్రవాదుల దాడులను ఖండిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో భారత పౌరులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రక్షణ రంగానికి అధిక మొత్తంలో నిధులను కేటాయించి భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జీకే వీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్, వైఎస్సార్సీపీ వైద్య విభాగం జోనల్ ఇన్చార్జి నర్సింగరావు, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వత మ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్య్సకొండంనాయుడు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఊర్వశీరాణి, అధిక సంఖ్యలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ శ్రేణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
త్వరితగతిన అర్జీల పరిష్కారం
కలెక్టర్ దినేష్కుమార్చింతూరు: మారుమూల గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందించిన వ్యక్తిగత దరఖాస్తులను ఆయాశాఖల అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీవో అపూర్వభరత్తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించి 146 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఆర్అండ్ఆర్ సమస్యలకు 67 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి అర్హతలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు పోలవరం ముంపు, వలస ఆదివాసీ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీలు బుధవారం చింతూరు ఐటీడీఏ ఎదుట ఆందోళనలు చేపట్టారు. వీఆర్ పురం మండలం అన్నవరం గ్రామాన్ని 41.15 కాంటూరులో చేర్చి పోలవరం పరిహారం అందచేయాలని నినాదాలు చేస్తూ గ్రామస్తులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. అనంతరం వారు కలెక్టర్‌ను కలసి ఏటా వరదలతో ఇబ్బందులు పడుతున్నామని తమ గ్రామాన్ని ముంపులో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చింతూరు డివిజన్లోని వలన ఆదివాసీ గ్రామాల్లో విద్యుత్, రహదారి, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వలస ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, నేటికీ తమ గ్రామాలకు రహదారి, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.విద్యుత్ సౌకర్యం కల్పించాలి గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం. విషసర్పాలు గ్రామంలోకి వస్తుండడంతో భయంతో గడపాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మా గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలి. – కొవ్వాసి కోసమ్మ, బలిమెల గ్రామం, చింతూరు మండలం రహదారి సౌకర్యం లేకఇబ్బందులు గత 30 ఏళ్లుగా ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడతున్నాం. వర్షాకాలు అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులున్నాయి. – పొడియం జోగారావు, సోడేరుపాడు, వీఆర్‌పురం మండలం -
షర్మిలకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సత్కారం
సాక్షి,పాడేరు: పాడేరులోని అక్షర ప్రైవేట్ స్కూల్‌కు చెందిన జనపరెడ్డి షర్మిల 580 మార్కులతో జిల్లాలో నాల్గవ స్థానంలో నిలవడంతో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అభినందించారు.తన క్యాంపు కార్యాలయంలో షర్మిలకు దుశ్శాలువా కప్పి సత్కరించారు.అక్షర పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థిని తండ్రి జనపరెడ్డి శ్రీనులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో డి.గొందూరు సర్పంచ్ సీదరి రాంబాబు,వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్,ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణలు పాల్గొన్నారు. -
మమ్మేలు..ముత్యాలమ్మా
చింతపల్లి: మన్యం ప్రజల ఆరాధ్యదేవత చింతపల్లి ముత్యాలమ్మతల్లి జాతర గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర తరువాత జరిగే అతి పెద్ద రెండవ జాతర చింతపల్లి ముత్యాలమ్మతల్లి ఉత్సవమే. మన్యం వాసులుకోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం ముత్యాలమ్మ తల్లి జాతర గురువారం ప్రారంభమై ఆదివారం వరకు జరుగుతుంది. ఏటా గంధం అమావాస్య రోజున జరిగే పండగ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ముత్యాలమ్మ జాతరకు సుదీర్ఘ చరిత్ర ఉంది. మొదట్లో అమావాస్య రోజున ముత్యాలమ్మ తల్లి పండగను డప్పుల పండగగా ఒక్క రోజు నిర్వహించేవారు.అనంతరం 1990వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలను నాలుగు రోజులు పాటు చేయడం ప్రారంభించారు. ● 25వ తేదీ శుక్రవారం అమ్మవారి పూజారులు (సుర్ల వంశస్తులు) ఇంటినుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం,ఇత్తడి పాదాలను, గరగలను ఊరేగింపుగా అమ్మవారి సతకం పట్టువరకూ తీసుకువచ్చి తొలిరోజు కొలువు దీరుస్తారు. ● 26వ తేదీ శనివారం రోజున రాత్రి సతకం పట్టువద్ద కొలువు దీరిన అమ్మవారిని చింతపల్లిలో గల అన్ని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి, జాగార కార్యక్రమం చేపట్టి, అమ్మవారిని పూజారులు ఇంటికి చేరుస్తారు. ● 27వతేదీ ఆదివారం చివరి రోజున పెద్ద పండగ సందర్భంగా పూజారుల ఇంటినుంచి అమ్మవారి ఉత్పవ విగ్రహాన్ని, ఘటాలను భారీ ఊరేగింపుతో ఆలయం వరకూ తీసుకురావడంతో పండగ ముగుస్తుంది. ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణ ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏడాది విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.సాయిబాబా ఆలయం నుంచి జిల్లా పరిషత్ అతిథి గృహం వరకూ,మూడు రోడ్ల జంక్షన్ నుంచి సంతబయలుతో పాటు మండల కేంద్రంలోని వీధుల్లోను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేకంగా మూడు రోడ్లు జంక్షన్,కోర్టు,రంగా సెంటర్,పాత బస్ స్టాండుతో పాటు అమ్మవారి ఆలయం,వద్ద భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మందు గుండు సామగ్రిని పెద్ద ఎత్తున కాల్చనున్నారు.బస్ స్టాండులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షన గా నిలిచింది. ఉత్సవాల్లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో మూడు వందల మందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
180 కిలోల గంజాయి స్వాధీనం
చింతపల్లి: మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. సబ్‌డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. మండలంలోని అన్నవరం పోలీసులు రోజువారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం లోతుగెడ్డ వంతెన వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో వచ్చిన ఒక ఆటోను తనిఖీ చేసి, మూడు బస్తాలతో గంజాయిని తరలిస్తున్నట్టు గురించినట్టు ఏఎస్పీ తెలిపారు. ఈ గంజాయి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా రోల్లగెడ్డ గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్సరిహద్దు బలపం మీదుగా పాడేరు తరలిస్తున్నారన్నారు. బెంగళూరుకి చెందిన వ్యక్తికి అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒక ఆటోతో పాటు బైక్‌తో తరలిస్తున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపులో కుడుమసారి పంచాయితీ కోటగున్నలు గ్రామానికి చెందిన వారున్నారు. దీని విలువ రూ.5.5 లక్షలు విలువ ఉంటుందని తెలిపారు.గంజాయిని తరలిస్తున్న ఆటో,బైక్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లును సీజ్ చేసినట్టు చెప్పారు. అరెస్టు చేసిన నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్ఐ వీరబాబును అభినందించారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు తదితరులు ఉన్నారు. పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ సమీపంలోని ఏవోబీ వంతెన వద్ద బుధవారం వాహన తనిఖీలు చేస్తుండగా 65 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు. మల్కర్‌గిరి జిల్లా చిత్తరకొండ ప్రాంతం నుంచి రూడకోట మీదుగా ఒడిశా పాడువకు వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్టు చెప్పారు. గంజాయి తరలిస్తున్న కొరాపుట్టు జిల్లా నందపూర్ బ్లాక్ మర్రిపాలెం గ్రామానికి చెందిన లబో కిడంగ్, అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం బురిడి అర్జున్ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 2.50లక్షలు ఉంటుందని తెలిపారు. -
నేటి నుంచి చందనోత్సవం టికెట్ల విక్రయం
ఆన్లైన్లో కూడా అందుబాటులో... సింహాచలం: ఈనెల 30న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రూ.300, రూ.1000 దర్శన టికెట్ల విక్రయాలు గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. సింహాచలం కొండపైన దేవస్థానం పాత పీఆర్వో కార్యాలయం వద్ద, నగరంలోని పలు బ్యాంకుల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుని ఆధార్ నెంబరుతో పూర్తిచేసి టికెట్లు నేరుగా పొందవచ్చన్నారు. సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ల్లోను, అక్కయ్యపాలెం, కేజీహెచ్, మహారాణిపేటలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ల్లో టికెట్లు లభిస్తాయని తెలిపారు. అలాగే బిర్లా జంక్షన్, సాలిగ్రామపురం(అక్కయ్యపాలెం) ఎస్బీఐ బ్రాంచ్‌ల్లో టికెట్లు లభిస్తాయని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు మాత్రమే టికెట్లు విక్రయాలు జరుగుతాయన్నారు. చందనోత్సవం రోజు ఎలాంటి దర్శన టికెట్ల విక్రయాలు జరగవని పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 7 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు www. aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా టికెట్లు పొందవచ్చని తెలిపారు. -
ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్
రాజవొమ్మంగి: ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం , ఆదివాసీ జేఏసీ గిరిజన నిరుద్యోగులు , ఆదివాసీ ప్రజాప్రతినిధులు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం తక్షణం ఏజెన్సీ డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తు నినాదాలు చేశారు. నూరు శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తు బుధవారం జరుగాల్సిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తు సభను బహిష్కరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు. ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ గిరిజన సంఘం, పీసా కమిటీ సభ్యులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, వజ్రపు అప్పారావు, కోండ్ల సూరిబాబు, రామకృష్ణ, ప్రసాద్, తెడ్ల రాంబాబు, పెద్దిరాజు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరికి సభకు హాజరైన ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి, సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆందోళన కారులకు మద్దతు ప్రకటించి సభ నుంచి బయటకు వచ్చేశారు. -
అ
ట్టడుగునల్లూరి2025 48 %టెన్త్ విద్యార్థులు ● టెన్త్‌లో దారుణంగా ఫలితాలు ● గత ఏడాది 90.95 శాతంతో 9వ స్థానం ● ఈ ఏడాది 48 శాతంతో రాష్ట్రంలోనే చివరిస్థానం ● సగానికి తగ్గిన ఉత్తీర్ణత ● 11,472 మందికి 5,465 మంది మాత్రమే పాస్ ● 6007 మంది ఫెయిల్ ● ఉత్తీర్ణులైన వారిలో బాలికలే అధికం ● దిగజారిన ఫలితాలతో తల్లిదండ్రుల ఆవేదనసాక్షి,పాడేరు: జిల్లాలో టెన్త్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశ కలిగించింది. గత ఏడాది కంటే ఫలితాలు సగానికి తగ్గాయి. 48 శాతంతో రాష్ట్రంలో చిట్టచివరి 26 స్థానంలో జిల్లా నిలిచింది. దీంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఉసూరుమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 258 అన్ని యాజమాన్య పాఠశాలల పరిధిలో 11,472 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా, కేవలం 5,465 మంది మాత్రమే పాసై 48 శాతం ఉత్తీర్ణత సాధించారు. 6007మంది విదార్థులు ఫెయిలయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. 5,292 మంది బాలురకు 2,330 మంది పాస్ అయ్యారు. 6,180 మంది బాలికలకు 3,135 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 10,823 మంది పరీక్షలు రాయగా, 9,843 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.95 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 9వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఆఖరు స్థానంలో ఉండడం ఆందోళన కలిగించింది. పలు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు,ఆశ్రమ పాఠశాలలు, గుత్తులపుట్టులోని సూపర్ ఫిప్టీ,ఇతర ప్రైవేట్ పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా టాపర్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని 590 మార్కులతో కూనవరం మండలం టేకులబోరు మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన అరవ మాధవి మొదటి స్థానంలో నిలవగా, నెల్లిపాక జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కాదులూరి లాస్యంత్ 582 మార్కులతో 2వస్థానం, పాడేరులోని అక్షర పాఠశాలకు చెందిన శెట్టి నవదీపిక 580మార్కులతో 3వస్థానం, ఇదే పాఠశాలకు చెందిన జనపరెడ్డి షర్మిల 580 మార్కులతో 4వస్థానం, చింతపల్లి సెయింట్ ఆన్స్ ఇంగ్లిషు మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బి.జానకీరామరాజు 578 మార్కులతో 5వస్థానం, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాల సూపర్ ఫిప్టీ విద్యార్థిని కొట్నా గంగాభవాని 577మార్కులతో 6వస్థానం, అడ్డతీగల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన యట్ల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 576మార్కులతో 7వస్థానం, పాడేరులోని మోదమాంబ ప్రైవేట్ పాఠశాలకు చెందిన రాంశెట్టి మధుబాబు 576మార్కులతో 8వస్థానం, ఇదే పాఠశాలకు చెందిన కిముడు లక్ష్మీప్రసన్న 574 మార్కులతో 9వస్థానం, రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన చింతకాయల దుర్గాభవానీ 571 మార్కులతో 10వ స్థానంలో నిలిచారు. టాప్ టెన్‌లో నిలిచిన విద్యార్థులతో పాటు టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్, డీఈవో పి.బ్రహ్మాజీరావు,ఇతర అధికారులు అభినందించారు.2024 90.95 %ఐదు పాఠశాలల్లోసున్నా ఫలితాలు.. సాక్షి,పాడేరు: జిల్లాలో ఐదు పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ పాస్ కాలేదు. జీకే వీధి మండలంలోని దారకొండ, జర్రెల, అప్పర్ సీలేరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, డుంబ్రిగుడ కేజీబీవీ, మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్స్ సంగడ హైస్కూల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో సున్న ఫలితాలు వచ్చాయి. 2023 61.41 %అత్యల్ప ఫలితాలు..జిల్లాలో పలు పాఠశాలలు అత్యల్ప ఫలితాలతో చతికిలపడ్డాయి. నాలుగు పాఠశాల్లో ఒక్కొక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జి.మాడుగుల మండలం బందవీధి ఆశ్రమ పాఠశాలలో 66 మందికి 65 మందీ ఫెయిల్ అయ్యారు జీకే వీధి మండలంలోని పెదవలస ఆశ్రమ పాఠశాలలో 31 మందికి 30 మంది, గూడెం ఆశ్రమ పాఠశాలలో 35 మందికి 34, అరకులోయ మండలం బస్కిలో 25 మందికి 24, జి.మాడుగుల మండలం నుర్మతిలో 38 మందికి 36, జి.మాడుగుల కేజీబీవీలో 37 మందికి 35, అనంతగిరి మండలంలోని బొర్రా ఆశ్రమ పాఠశాలలో 43 మందికి 40,శివలింగపురంలో 42 మందికి 39, హుకుంపేట మండలంలోని జి.బొడ్డాపుట్టులో 29 మందికి 27, చింతపల్లి మండలంలోని లంబసింగి ఆశ్రమ పాఠశాలలో 42 మందికి 39 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. -
జిల్లా టాపర్లకు కలెక్టర్, పీవో అభినందన
కూనవరం/ఎటపాక: పదో తరగతి ఫలితాల్లో జిల్లా టాపర్లుగా నిలిచిన కూనవరం మండలం టేకులబోరు మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థిని అరవా మాధవి, నెల్లిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాదులూరి లాస్యంత్ను కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటీటీఏ పీవో అపూర్వభరత్ చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేసి, అభినందించారు. ఐఏఎస్ అవుతా... 590 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచిన అరవా మాధవి తండ్రి అరవా రాము, తల్లి ధనలక్ష్మి గృహిణి. ఇద్దరూ కూలిపని చేసుకుంటూ తమ కుమార్తెను కష్టపడి చదివిస్తున్నారు. తల్లిద్రండుల కృషికి తగ్గట్టుగా మాధవి పదో తరగతిలో అత్యధిక మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. భవిష్యత్తులో ఏమి కావాలని కోరుకుంటున్నావని కలెక్టర్ మాధవిని ప్రశ్నించగా తాను ఐఏఎస్ అవుతానని సమాధానం చెప్పింది. మెకానికల్ ఇంజినీర్ కావాలన్నది ధ్యేయం టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 587 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచిన మండలంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన నెల్లిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాదులూరి లాస్యంత్ తల్లిదండ్రులు రామ్మోహనరావు,నాగేశ్వరి. టైలర్ వృత్తి చేస్తూ కుమారుడు, కుమార్తెను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారు. కుమారుడు లాస్యంత్ నెల్లిపాక హైస్కూల్లో చదవుతుండగా, కుమార్తె హర్షిణి రేఖపల్లి కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించి మెకానికల్ ఇంజినీర్ కావాలనేది తన ధ్యేయమని లాస్యంత్ తెలిపాడు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను మంచి మార్కులు సాధించగలిగానని చెప్పాడు. పాఠశాల సెలవు రోజుల్లో తాము కుట్టుమిషన్ పనిచేస్తున్నప్పుడు మాకు సహాయంగా దుస్తులకు బటన్స్ వేయటం,ఇసీ్త్ర చేయడం తదితర పనులను లాస్యంత్ చేస్తుంటాడని తల్లిదండ్రులు తెలిపారు. -
సూపర్ ఫిప్టీలో నూరుశాతం పాస్
సాక్షి,పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలోని వివిధ పాఠశాలల్లో బాగా చదివిన 50 మంది టెన్త్ విద్యార్థులకు రెండు పాఠశాలల్లో సూపర్ ఫిప్టీ పేరిట ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన విద్యార్థినీవిద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. చదువులో ప్రతిభ కనబరిచిన 28 మంది గిరిజన బాలికలకు గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోను, 22మంది గిరిజన బాలురకు దిగుమోదాపుట్టు ఆశ్రమ పాఠశాలలోను సూపర్ ఫిప్టీ పేరుతో పాడేరు ఐటీడీఏ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందిన విద్యార్థులు గత ఏడాది వలే ఈసారి కూడా 50మందికి 50మంది ఉత్తీర్ణులయ్యారు.49 మంది ప్రథమ శ్రేణిలోను,ఒక్కరు ద్వితీయ శ్రేణిలోను పాస్ అయ్యారు. బాలికలు ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించారు. కొంటా భవానీ 577 మార్కులతో సూపర్ ఫిప్టీలో ప్రథమ స్థానంలో నిలిచింది. చంపా పావని 567, గబ్బాడ ఈశ్వరమ్మ 566, కిల్లో అరుణ 565, జనపరెడ్డి రేవతి 558, ఎస్.త్రినాథ్ 569, జి.మణికంఠ 550, జి.చరణ్ 535 మార్కులు సాధించారు. కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు 34 మంది ఎంపిక సూపర్ ఫిప్టీలో పాస్ అయిన 50 మంది విద్యార్థుల్లో 34 మంది కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇంటర్ చదువుకు ఎంపికయ్యారని జేసీ, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన 19 మంది బాలికలు మారికవలస, విసన్నపేట, 15 మంది బాలురు జోగంపేట కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలు పొందుతారని ఆయన తెలిపారు. అలాగే సూపర్ 50లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉత్తమ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన గుత్తులపుట్టు హెచ్ఎం సింహాచల, ఇతర ఉపాధ్యాయులకు పీవో అభినందనలు తెలిపారు. -
65 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
అడ్డతీగల: మండలంలోని దుప్పులపాలెంలో ఓ ఇంటిలో నిల్వ ఉంచిన 65 బస్తాల (3,372 కిలోలు) ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని బుధవారం పట్టుకున్నట్టు తహసీల్దార్ కొమరం సూర్యారావు తెలిపారు. జీడి పిక్కలు కొనుగోలు చేసే దుప్పలపాలెంకి చెందిన ఒరిస్సై అనే ఓ వ్యాపారి ప్రజల వద్ద నుంచి భారీగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, రవాణాకు సిద్ధం చేసినట్టు సమాచారంరావడంతో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. బియ్యం సీజ్ చేసి, ఆ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. స్వాఽధీనం చేసుకున్న బియ్యాన్ని అడ్డతీగలలోని మండల స్టాక్ పాయింట్‌కి తరలించినట్టు చెప్పారు. పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. -
నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ పరిహారం
కలెక్టర్ దినేష్కుమార్చింతూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ముంపులో భాగంగా ఫేజ్–1బిలో చేర్చిన 32 గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 24 గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయని మరో ఎనిమిది గ్రామాల్లో ఈ నెలాఖరుకల్లా గ్రామసభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. డ్రాఫ్ట్ అవార్డు పూర్తయిన తరువాత 32 గ్రామాలకు చెందిన 13,790 కుటుంబాలకు పరిహారం అందించడంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. గ్రామాల్లో స్థానికత కలిగి ఉన్న వ్యాపారాలు, కూలిపనులు, విద్య నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉంటే వారికి కూడా పరిహారం అందచేస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కటాఫ్ తేదీకంటే ముందుగా వచ్చి స్థిరపడిన వారికి, ఉపాధి కోల్పోతున్న కుటుంబాలకు కూడా పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. మరో మూడు నెలల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ముంపు గ్రామాల అర్హుల జాబితాలను ఎప్పటికప్పుడు ఆయా గ్రామ సచివాలయాల నోటీసుబోర్డుల్లో ఉంచుతామని ఆయన తెలిపారు. చింతూరులో ఇళ్ల పరిహారం విషయంపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇచ్చే విషయంపై గత ప్రభుత్వం జీవో జారీచేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ పాల్గొన్నారు. -
చెక్‌డ్యాంలకు గ్రహణం
వర్షాకాలం ప్రారంభానికి ఇంకా రెండు నెలలే సమయం ఉంది. తొలకరి జల్లులను ఒడిసి పడితే సాగుకు నీరందుతుంది. కానీ చాలాచోట్ల చెక్‌డ్యాంలు దెబ్బతిన్నాయి. తూములు మరమ్మతులకు గురికావడంతో చుక్కనీరు లేకుండా పోతోంది. కొన్ని చెక్‌డ్యాంల మరమ్మతులకు అధికారులు అంచనాలు తయారు చేసి, ప్రతిపాదనలు పంపారు. అయితే పనుల్లో జాప్యం నెలకొంది. చింతపల్లి: గిరిజన రైతులకు మేలు చేయాలి.. పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యాంలు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. నిర్వహణ కరువై...ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో 321 చెక్‌డ్యాంలు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు లేక నీరందడం లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాలువల్లో పూడిక తీత కూడా లేదని, దీనివల్ల నీరు సరిగా ప్రవహించడం లేదని వాపోతున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో జలవనరుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వాటిపై స్పెషల్మైనర్ ఇరిగేషన్ ఇంజినీరింగ్ (ఎస్ఎంఐ) అధికారులు దృష్టిసారించకపోవడంతో చెక్‌డ్యామ్‌లు పూడుకుపోయాయి. దీంతో సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు కురిసినప్పుడు కొండ గెడ్డలు,ఊటగెడ్డల ద్వారా చెక్ డ్యాంలు, చెరువులకు నీరు చేరుతుంది. వాటిలో నిల్వ ఉన్న నీటితో వందలాది ఎకరాల్లో రెండు పంటలు సాగు చేసేవారు. వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు,పూలు పండించేవారు. డివిజన్ పరిధిలో చాలా చెక్‌డ్యాంలు పూర్తిగా దెబ్బతినడంతో నీరంతా కొండ గెడ్డల్లో కలసిపోయి వృథాగా పోతోంది. రెండవ పంట పండించే పరిస్థితి లేకుండా పోయింది. నీరందక వందలాది ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 321 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు ఇటీవల అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిలో 148 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయగా 104 పనులు సాగుతున్నాయి. చింతపల్లి సబ్ డివిజన్ ఎత్తివేతతో రైతులకు అవస్థలు చింతపల్లి కేంద్రంగా నీటిపారుదల శాఖ సబ్‌డివిజన్ కార్యకలాపాలు నిర్వహించేవారు. చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో చింతపల్లి,జీకే వీధి,కొయ్యూరు మండలాలు ఉండేవి. చెక్ డ్యాంలు,చెరువుల నిర్మాణం, నిర్వహణ తదితర కార్యకలాపాలను చింతపల్లి కేంద్రంగానే ఇంజినీరింగ్ అధికారులు నిర్వహించేవారు. ఈ శాఖ ద్వారానే మూడు మండలాల్లో మారుమూల గ్రామాల్లో పలు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. దీంతో గిరిజన రైతాంగానికి వ్యవసాయానికి తోడ్పాటునందించినట్టయింది.ఎన్నో వందలు ఎకరాల కొండభూములు,బీడుభూములు సాగులోకి వచ్చాయి. అయితే 2006 సంవత్సరంలో సబ్ డివిజన్‌ను ఎత్తివేసి, మైదాన ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంత రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి.ఆ కార్యాలయ భవనాన్ని కొంతకాలం గిరిజన సంక్షేయ శాఖ కార్యాలయంగా ఉపయోగించారు.అనంతరం ఆ భవనం నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుకుంది. దెబ్బతిన్న చెక్‌డ్యాంలకు మరమ్మతులు కరువు వృథాగా పోతున్న సాగునీరు దృష్టి సారించని స్పెషల్మైనర్ ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు బీడువారిన వందలాది ఎకరాలు చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేపట్టాలి చింతపల్లి మండంలోని పలు ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు పూర్తిగా దెబ్బతినడంతో సాగు నీరు వృథాగా పోతోంది. పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాత చెక్‌డ్యాంలను బాగుచేయడంతో పాటు, కొత్తవాటిని నిర్మించాలి. – గెమ్మిలి అబ్బాయినాయుడు, గిరిజన రైతు,దిగువపాకలు గ్రామం 321 చెక్‌డ్యాంలు గుర్తింపు పాడేరు డివిజన్ పరిధిలో 321 చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేయాలని గుర్తించాం. ఇప్పటికే కలెక్టర్ 148 చెక్‌డ్యాంల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు.వాటిలో 104 పనులు జరుగుతున్నాయి.మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపించాం.నిధులు మంజూరు అయితే పనులు ప్రారంభిస్తాం. – నాగేశ్వరరావు, డీఈ, స్పెషల్ మైనర్ ఇరిగేషన్,చింతపల్లి -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
పాడేరు రూరల్: హామీలు అమలు చేయడంలో కూట మి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గిరిజన సంఘ ం,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు ధ్వజమెత్తారు. ఆ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ నిరుద్యోగులు సోమవారం ఐటీడీఏ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు అరకులోయలో నిర్వ హించిన బహిరంగ సభలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబునాయుడు మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నంబర్3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ మోసం చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించకుండా డీఎస్సీని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర అన్యా యం చేయడమేనని చెప్పారు. తక్షణం జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హామీలను అమలు చేయకుండా కూట మి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. గిరిజనులహక్కులు,చట్టాల జోలికివస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదివాసీ, ప్రజా సంఘాల నాయకుల ధ్వజం పాడేరు ఐటీడీఏ వద్ద నిరుద్యోగుల నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు -
దద్దరిల్లిన ఐటీడీఏ
1/70 చట్టం నిర్వీర్యం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఎల్టీఆర్ కేసులను త్వరగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలన్నారు. ఐటీడీఏలో అవినీతి రాజ్యమేలుతోందని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాడేరు మెడికల్ కళాశాలలో భర్తీ చేస్తున్న 256 సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల నియామకాల్లో గిరిజన నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతోందని, తక్షణమే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటీఫికేషన్ జారీ చేయాలని, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజన నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యం బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, హెల్త్ వలంటీర్లను నియమించాలన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు. -
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో వై.రామవరం శివారులో లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధానరహదారిలో సీఐ బి.నరసింహా మూర్తి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవ రంలో జరిగిన సంతకు వచ్చివెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న అపరిచితులు, అనుమానితులపై నిఘా పెట్టారు. రికార్డులు, డ్రైవింగు లైసెన్సులు సక్రమంగా లేని వాహనాలపై యజమానులపై కేసులు నమోదు చేశారు. -
మెగా డీఎస్సీలో ఏజెన్సీ పోస్టులు మినహాయించాలి
సాక్షి, పాడేరు: మెగా డీఎస్సీలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ఈనెల 30వతేదీ నాటికి ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటన చేయాలని, లేని పక్షంలో మన్యంలో నిరవధిక బంద్ చేపడతామని గిరిజన సంఘం జాతీయ సభ్యుడు పి.అప్పలనరస హెచ్చరించారు. గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక మోదకొండమ్మతల్లి ఆలయ సమావేశమందిరంలో ఆదివాసీ, ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ యువతకు అన్యాయం చేస్తోందన్నారు. గిరిజన సంక్షేమశాఖలో గల 881 పోస్టులకు గాను 42 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే ఆదివాసీలకు కేటాయించడం అన్యాయమన్నారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను నూరుశాతం గిరిజనులతోనే భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈనెల 26న పాడేరులో జరిగే ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కంబిడి నీలకంఠం,డీఎల్వో కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.మాణిక్యం,బీటీఏ జిల్లా అధ్యక్షుడు వల్లా వెంకటరమణ,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మానపడాల్,పలు సంఘాల నేతలు నాగేశ్వరరావు,రాజబాబు,జీవన్‌కృష్ణ,కాంతారావు తది తరులు పాల్గొన్నారు. లేని పక్షంలో నిరవధిక మన్యం బంద్ నిర్వహిస్తాం గిరిజన సంఘం జాతీయ సభ్యుడు అప్పలనర్స -
పీజీఆర్ఎస్కు 65 అర్జీలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీలు 65 అర్జీలను స్వీకరించారు. రాజవొమ్మంగి మండలం ఉర్లలాకులపాడు గ్రామంలోని బండకొండ రిజర్వాయర్ ద్వారా 600 ఎకరాలకు సాగునీరందించే చెరువుకు మరమ్మతులు చేయించాలని పలువురు కోరారు. వై.రామవరం అప్పర్ పార్ట్‌లోని మంగంపాడులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆ గ్రామ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. మంగంపాడులో 64 మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయా లని సరంకోట అబ్బాయిరెడ్డి అర్జీ అందజేశారు. పెద్దూరు గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని, గ్రామంలో పాడైయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు అర్జీలు అందజేశారు. సమావేశంలో ఎస్డీసీ అంబేడ్కర్, డీడీ రుక్మాండ య్య, ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం
జి.మాడుగుల/పాడేరు రూరల్: మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుని పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అంగనయిని ఆనంద్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయుని పోస్టులో మెగా డిఎస్సీలో చేర్చటం దారుణమన్నారు. దీని వలన గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని, ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించవచ్చని ఆశతో ఇప్పటి వరకు ఉన్నారని కూటమి ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. అరుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు జీవో నంబర్ 3ని పునరుద్దరణ చేస్తానని, ప్రత్యేక డిఎస్సీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి తీరా అధికారం వచ్చాక మొండిచేయి చూపారని ఆయన మండిపడ్డారు. తక్షణమే గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుని పోస్టులు గిరిజన అభ్యర్థులుతో భర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముంచంగిపుట్టు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఉస్సిలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య అన్నారు.మండలంలో గల బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మిలో సోమవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించడం దారుణమన్నారు.అల్లూరి జిల్లాలో ప్రకటించిన డీఎస్సిలో 400 పోస్టులలో ఎస్టీలకు కేవలం 24 పోస్టులే ఉండడం ఆదివాసీలకు నష్టం జరుగుతుందని,ఎంతో మంది గిరిజన నిరుద్యోగ యువతకు డిఎస్సిలో మోసం జరిగిందని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి స్పెషల్ డిఎస్సిను ప్రకటించాలని,లేని పక్షనా గిరిజన యువతతో ఆందోదన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నాయకులు దేవన్న,నాగరాజు తదితరులు పాల్గోన్నారు. -
లభ్యంకాని యువకుల ఆచూకీ
చింతూరు: మండలంలోని కల్లేరు వద్ద సీలేరు నదిలో గల్లంతైన యువకుల ఆచూకీ సోమవారం కూడా లభ్యంకాలేదు. ఆదివారం సరదాగా గడిపేందుకు సీలేరు నదికి వెళ్లిన ఆరుగురు యువకుల్లో నాగుల దిలీప్‌కుమార్(25), సుగ్రియ శ్రీను(25) నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు డ్రోన్, స్పీడ్‌బోట్, వలల సాయంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా యువకుల జాడ కానరాలేదు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్, ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా నదివద్ద గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నది లోతుగా ఉండడంతో పాటు, నీరు అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సోమవారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యంకాలేదని, రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశామని, తిరిగి మంగళవారం ఉదయం నుంచి గాలింపు చేపడతామని ఎస్ఐ రమేష్ తెలిపారు. -
లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్
కశింకోట: కశింకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ వేగంగా వచ్చి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో తమిళనాడు లారీ డ్రైవర్ ముత్తు స్వామి పళని కాలు విరిగి తీవ్రంగా గాయపడి లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు ఆయనను అతి కష్టం మీద బయటకు తీసి అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో నిలిచిపోయిన లారీని రెండు జేసీబీల సహాయంతో అడ్డు తొలగించారు. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. సంఘటన వల్ల నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి క్రమబద్ధీకరించారు. -
వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం బాధ్యతారాహిత్యం
● ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డాబాగార్డెన్స్: ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగం..మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అనే అంశంపై డాక్టర్ హరిప్రసాద్ స్మారక ఉపన్యాం నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావడం లేదని, ప్రైవేట్ రంగానికి వైద్యం అప్పగించడం ఆందోళనకరమన్నారు. కేరళ ఆరోగ్య రంగంలో ఆదర్శంగా ఉందని, అక్కడ మరణాల రేటు తక్కువగా, వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని, పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం సమర్థనీయం కాదన్నారు. ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్ కళాశాలల సంఖ్య ఎక్కువగా ఉండటం దారుణమన్నారు. వైద్య విద్యా మాజీ డైరెక్టర్ డాక్టర్ కె.సత్య వరప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం పరీక్షల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. ఐదు జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలు లేవని, వైద్యరంగంలో సేవా దృక్పథం తగ్గి వ్యాపార కాంక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జరిగితే ఫీజులు పెరిగిపోతాయని, రిజర్వేషన్లు తగ్గిపోతాయని, పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండదని డాక్టర్ ఎంవీ రమణయ్య అన్నారు. రాష్ట్రంలో మల్టీపర్పస్ అసిస్టెంట్ పోస్టులు, జనరల్ మెడిసిన్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ప్రతినిది, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేస్తున్నాం..
రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. దానికనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. పెరిగిన విద్యుత్ కనెక్షన్లు, వాటి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మే నెలలో మరింత ఎక్కువగా డిమాండ్ ఉండబోతోంది. దానికోసం ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకే సమయంలో అందరూ ఏసీలు, కూలర్లు ఆన్ చేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో లోడ్ పెరిగి ట్రిప్ అవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని కూడా తక్కువ సమయంలోనూ పరిష్కరిస్తున్నాం. ఎంత అవసరమైనా కోతలు లేకుండా విద్యుత్ అందించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్యామ్‌బాబు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
అరకులోయ టౌన్: అరకులోయ డిగ్రీ కళాశాలలో కోటి రూపాయలతో నిర్మించిన నూతన అదనపు భవనాన్ని సోమవారం గిరిజన సంక్షేమశాఖ,శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. మొదటగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.డిగ్రీ కళాశాల సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ప్రిన్సిపాల్ భరత్‌కుమార్ నాయక్ మంత్రిను కోరారు. దీనికి స్పందించిన మంత్రి పాత భవనాలకు మరమ్మతు చేస్తామని, లేనిపక్షంలో నూతన భవనా న్ని నిర్మిస్తామన్నారు. ఇంజనీరింగ్ అధికారులు పాత భవనాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో టీచర్ల కొరత ఉంటే ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు.పార్టీల అతీతంగా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కలెక్టర్ దినేష్‌కుమార్, జెసి, పాడేరు ఐటీడీఏ ఇన్చార్జ పివో అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఇంజనీరింగ్ ఇన్ చీప్ శ్రీనివాస,ఈఈ వేణుగోపాల్,ఏఈఈ అభిషేక్,జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్,విజయనగరం రీజన్ ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర తదితరులు పాల్గోన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని కించుమండ సంపంగి గెడ్డ వద్ద నిర్మించిన వంతెనను గిరిజన సంక్షేమశాఖ,శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి సంధ్యారాణి బుధవారం ప్రారంభించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ వంతెనుకు నిధులు మంజూరయ్యాయి. -
నకిలీ మావోయిస్టు అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలో మావోయిస్టు పేరుతో డబ్బుల కోసం ప్రముఖులను బెదిరించిన వ్యక్తిని విజయనగరం వన్‌టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా చినముషిడివాడకు చెందిన కుచ్చర్లపాటి వెంకటబంగార్రాజు పీపుల్స్ వార్ ఏఓబీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, యాక్షన్ కమిటీ కామ్రెడ్ సాయన్న అలియాస్ బిర్సా పేరుతో నగరంలోని ఇద్దరు ప్రముఖులకు బెదిరింపు లేఖలు ఇచ్చారు. ఒకరికి రూ.25లక్షలు, మరొకరికి రూ.20 లక్షలు ఇవ్వాలని లేఖల ద్వారా డిమాండ్ చేశారు. సంబంధిత వ్యక్తులు చేసిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. ఎస్పీ ఆదేశాలతో నగరంలోని అన్ని సీసీ పుటేజ్‌లను పరిశీలించి నిందితుడు వెంకట బంగార్రాజుగా గుర్తించాం. అతని కదిలికలపై నిఘా పెట్టి విజయనగరంలోని బాలాజీ కూడలి వద్ద అదుపులోకి తీసుకున్నాం. అతని నుంచి విప్లవసాహిత్యం, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేంద్రనాయుడు, హెచ్‌సీ రమణరావు, కానిస్టేబుళ్లు శివశంకర్, గౌరీశంకర్‌ను డీఎస్పీ అభినందించారు. -
గరిష్ట స్థాయికి చేరుకుంటున్న డిమాండ్
ఉమ్మడి విశాఖ సర్కిల్(అనకాపల్లి, అల్లూరి జిల్లాలు)లో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈపీడీసీఎల్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ సర్కిల్ పరిధిలో సగటు వినియోగం 24 నుంచి 25 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం 26 నుంచి 27 మిలియన్ యూనిట్లకు పైగా కరెంట్ ఖర్చవుతోంది. సరఫరాకు మించి వినియోగం ఉండటంతో అధికారులు లోటు భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లాల్లో లలితా త్రిపురసుందరీ ఫెర్రో అల్లాయిస్, అభిజిత్ ఫెర్రో అల్లాయిస్ వంటి భారీ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడంతో మూతపడ్డాయి. ఈ కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గింది లేదంటే.. 28 నుంచి 30 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
25 కిలోల గంజాయితో నలుగురి అరెస్టు
రోలుగుంట: గంజాయి వ్యాపారులపై స్థానిక ఎస్ఐ రామకృష్ణారావు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆదేశాలతో సోమవారం దిబ్బలపాలెం గ్రామంలో దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, వారి నుంచి 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. వివరాలివి. మండలంలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన చవ్వాకుల చిన్నమ్మలు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయాలు చేస్తోంది. ఇదే మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన వడ్డాది సాయి, బంగారు పవన్ అనే వ్యక్తుల సాయంతో మద్దె గరువు ప్రాంతం వెళ్లి పెదబయలు మండలం తగ్గుపాడు గ్రామానికి చెందిన కిలో తిమోతి వద్ద 25 కేజీల గంజాయి కొనుగోలు చేసి, మైదాన ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను కొంతలం కూడలి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. గంజాయితో పాటు వారు రవాణాకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు సెల్ఫోన్లు సీజ్ చేసినట్టు విలేకరులకు వివరించారు. 10 కిలోల గంజాయితో మైనర్ అరెస్టు చీడికాడ: 10 కిలోల గంజాయితో ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ముందస్తు మేరకు మండలంలోని కోనాం పంచాయతీ గుడివాడ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించగా పెదబయలు మండలం గొమంగి పంచాయతీ చావిడిమామిడికి చెందిన మైనర్ బాలుడు స్కూటీపై 10 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. ఆ బాలుడిని విచారించగా తనకు రూ.5వేలు అవసరం కాగా స్కూటీ యజమాని అయిన పెదబయలుకు చెందిన వ్యక్తిని సంప్రదించడంతో గంజాయిని అనకాపల్లి వరకు తరలించి అప్పగిస్తే ఆ నగదు ఇస్తానని చెప్పాడన్నారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
సారా స్థావరాలపై మెరుపు దాడులు
రావికమతం: అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్.సుర్జీత్ సింగ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్ ఆదేశాల మేరకు మాడుగుల ఎకై ్సజ్ పోలీసులు రావికమతం మండలం మేడివాడ గ్రామ శివారులో జీడి తోటల్లోని నాటు సారా స్థావరాలపై సోమవారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1500 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసినట్టు వి.మాడుగుల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో మేడివాడ గ్రామానికి చెందిన గేడి చిన్నా, గేడి రమణను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. -
న్యూరోసర్జరీ విభాగానికి వైద్య పరికరాల అందజేత
డాబాగార్డెన్స్: కేజీహెచ్‌లోని న్యూరో సర్జరీ విభాగానికి రూ.8 లక్షల విలువ గల వైద్య పరికరాలను డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులు సుంకర ఆదిలక్ష్మి, సుబ్బలక్ష్మి, డాక్టర్ ఎస్జే బాలపరమేశ్వరరావు(న్యూరో సర్జన్), సుంకర రాజగోపాల్ సోమవారం విరాళంగా అందజేశారు. ఈ మేరకు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్రే, ఇతర న్యూరో సర్జరీ వైద్యులు పాల్గొన్నారు. ఈ వార్డుకు గత నెల 17వ తేదీన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు న్యూరోసర్జరీ వార్డుగా నామకరణం చేసిన విషయం విదితమే. -
భానుడు భగభగ..మీటర్ గిరగిర!
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. సాధారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మార్చి మూడో వారం నుంచి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కరెంటు వినియోగం కూడా పెరుగుతుంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. అప్పటి నుంచి డిమాండ్ పీక్స్‌కు వెళ్లిపోయింది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. లోడ్ పెరుగుతుండటంతో సరఫరాలోనూ లోపాలు తలెత్తుతున్నాయి. తేదీ వినియోగం (మిలియన్ యూనిట్లలో) 15– ఏప్రిల్ 14.196 16– ఏప్రిల్ 14.464 17– ఏప్రిల్ 15.612 18– ఏప్రిల్ 15.060 19– ఏప్రిల్ 15.074 20– ఏప్రిల్ 14.454 మండుతున్న ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం విశాఖ సర్కిల్ పరిధిలో రోజూ సాధారణ వినియోగం 12 మిలియన్ యూనిట్లు ప్రస్తుతం 14–15 మిలియన్ యూనిట్లకు.. ఒక్కసారిగా లోడ్ పెరగడంతోసరఫరాలో లోపాలు 2 మిలియన్ యూనిట్లు అదనంగా... విశాఖ సర్కిల్ పరిధిలో ప్రతి రోజూ సగటున 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగుతుంది. అయితే భానుడి ప్రతాపంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది వారాలుగా సగటు విద్యుత్ వినియోగం రోజుకు 14 నుంచి 15 మిలియన్ యూనిట్లుగా మారిపోయింది. ఏప్రిల్ 1న రికార్డు స్థాయిలో 15.976 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడేశారంటే.. ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు ఎంతలా కరెంట్ వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా పరిశీలిస్తే ఏ రోజూ 14 మిలియన్ యూనిట్లకు దిగువన రీడింగ్ లేదు. -
ఇన్చార్జుల పాలన ఇంకెన్నాళ్లు?
రెగ్యులర్ పీవోలేని పాడేరు ఐటీడీఏ రెండు నెలలుగా జాయింట్ కలెక్టర్‌కు ఇన్చార్జి బాధ్యతలు గిరిజన సంక్షేమ డీడీ పోస్టుదీ అదే పరిస్థితి సాక్షి,పాడేరు: రాష్ట్రంలోని ఐటీడీఏల్లో పెద్దదైన, ఏడు లక్షల గిరిజన జనాభా కలిగిన పాడేరు ఐటీడీఏలో ప్రధాన పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పాడేరు ఐటీడీఏకు ప్రాజెక్టు అధికారిని గత రెండు నెలలుగా నియమించలేదు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీల గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనుల అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని, నిధులు ఖర్చుపెట్టాల్సిన బాధ్యత ఐటీడీఏ పీవోదే. ఇంత కీలకమైన పోస్టును జాయింట్ కలెక్టర్‌తోనే అదనపు విధుల్లో భాగంగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇక్కడ ఐటీడీఏ పీవోగా పనిచేసిన అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న బదిలీ చేసింది. అయితే ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారిని ఐటీడీఏ పీవోగా నియమించాల్సి ఉన్నప్పటికీ పాడేరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అభిషేక్‌గౌడకు ఐటీడీఏ పీవోగా ఎఫ్ఏసీ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ఆయన జేసీగాను, ఐటీడీఏ పీవోగాను విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు ఐటీడీఏ పీవో పోస్టును భర్తీ చేయకపోవడంతో ఐటీడీఏ పరంగా గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో జరిగే మీ–కోసంలో మాత్రమే ఇన్చార్జి పీవో అయిన జేసీకి సమస్యలు చెప్పుకుంటున్నామని, మిగిలిన రోజుల్లో ఇబ్బందిగా ఉంటుందని గిరిజనులు వాపోతున్నారు. పూర్తిస్థాయి పీవో లేకపోవడంతో ఐటీడీఏలో పరిపాలన పరమైన అంశాలలోను ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. పూర్తిస్థాయి పీవో లేకుండానే పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సోమవారం జరగనుంది. డాక్టర్ అభిషేక్‌గౌడ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. పాలకవర్గ సమావేశానికి ముందే ఐటీడీఏకు రెగ్యులర్ పీవో నియమిస్తారని భావించినా, కూటమి ప్రభుత్వం స్పందించలేదు. ఆరు నెలలుగా గిరిజన సంక్షేమ డీడీ పోస్టు ఖాళీ గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన కీలకమైన పాడేరు ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోస్టును ప్రభుత్వం ఆరు నెలలుగా భర్తీ చేయలేదు.గతంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన కొండలరావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30న ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు సరెండర్ చేసింది.ఆయన స్థానంలో పాడేరు సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారి(ఏటీడబ్ల్యూవో) ఎల్.రజనీని ఇన్చార్జి డీడీగా నియమించారు. పూర్తిస్థాయి డీడీ లేక గిరిజన విద్యకు సంబంధించిన పలు అంశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాడేరు ఐటీడీఏలో కీలకమైన పీవోతో పాటు గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టులను భర్తీ చేయాలని జిల్లా ఇన్చార్జి,రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కూడా వినతులు అందినాఇంతవరకు ఎలాంటి నియామకాలు జరపకపోవడం గమనార్హం.పూర్తిస్థాయి పీవో లేకుండానే ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నేడు పీవో, డీడీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి పాడేరు ఐటీడీఏలో కీలకమైన ప్రాజెక్టు అధికారి,గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి.ఏ కష్టమొచ్చిన గిరిజనులు నేరుగా ఐటీడీఏకు వెళ్లి పీవోకు సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండేది.పాత పీవో అభిషేక్ బదిలీ అయిన నాటి నుంచి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.పాత డీడీని సరెండర్ చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు మరో డీడీని నియమించకపోవడం అన్యాయం.జిల్లా ఇన్చార్జి మంత్రి వెంటనే దృష్టిపెట్టాలి. – పొద్దు బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా నేత, అరకులోయ రెగ్యులర్ పీవో లేక ఇబ్బందులు పాడేరు ఐటీడీఏకు రెగ్యులర్ పీవోను ప్రభుత్వం నియమించకపోవడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. చింతపల్లి మాక్స్‌కు కాఫీ పండ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. రైతుల ఇతర సమస్యల పరిష్కారంలోనూ ఇదే పరిస్థితి. రెగ్యులర్ పీవో అయితే నిరంతరం ఐటీడీఏలో అందుబాటులో ఉంటారు.ఇన్చార్జి పీవో అయిన జేసీకి సమస్యలు చెప్పుకున్నా... వెంటనే పరిష్కారం కావనే భావనలో రైతులు ఉన్నారు. – పాలికి లక్కు, కాఫీ రైతు సంఘం నేత, పాడేరు -
నేడు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
సాక్షి, పాడేరు: పాడేరు ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 11గంటలకు జరగనుంది.ఐటీడీఏ చైర్మన్,కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధ్యక్షతన జరిగే పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లా ఇన్చార్జి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరుకానున్నారు. సమావేశానికి హాజరుకావాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పాడేరు,అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం,ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు,గాదే శ్రీనివాసులునాయుడు,ఎంపీపీలు,జెడ్పీటీసీల కు ఆహ్వానం పంపినట్టు జేసీ,ఇన్చార్జి ఐటీడీఏ పీవో ఎం.జె.అభిషేక్‌గౌడ ఓ ప్రకటనలో తెలి పారు. అన్నిశాఖల అధికారులు తమ శాఖల సమగ్ర వివరాలతో నిర్దేఽశిత సమయానికి పాల కవర్గ సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు. -
మోదమ్మకు పోలవరం అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ పూజలు
సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లిని పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అధికారి వి.అభిషేక్ ఆదివారం తల్లిదండ్రులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆధ్వర్యంలో అభిషేక్, వారి తల్లిదండ్రు లను ఘనంగా సత్కరించారు. మోదమ్మ చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. మే 11,12,13 తేదీల్లో జరిగే మోదమ్మ ఉత్సవా లకు రావాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు.. అభిషేక్‌కు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు కూడ సురేష్‌కుమార్, కొణతాల ప్రశాంత్, కేజీయారాణి, ఆలయ కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ,రాధాకృష్ణ,చిన్న,బొనంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
పాడేరు రూరల్: మెగా డీఎస్సీతో పాటు ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తక్షణం ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటించి వంద శాతం ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుందన్నారు. దీనిపై పాడేరు ఐటీడీఏ పాలక వర్గం సమవేశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించి తీర్మా నం చేయాలన్నారు. మన్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
విదేశీ చూపు
ఏయూ వైపుగత ఆరేళ్లలో అడ్మిషన్లు ఇలా 2019–20 190 2020–21 262 2021–22 217 2022–23 333 2023–24 338 2024–25 465 ఆంధ్ర యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతకు తోడు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా తీసుకున్న చర్యలతో ఆంధ్ర యూనివర్సిటీ వైపు విదేశీ విద్యార్థులు ఆకర్షితులయ్యారు. 2019–20 విద్యా సంవత్సరంలో 190 మంది విదేశీ విద్యార్థుల చేరగా.. 2024–25 నాటికి ఆ సంఖ్య 465కు చేరింది. ఒకే ఏడాదిలో ఎక్కువ సంఖ్యలో విదేశీ ప్రవేశాలు పొందిన యూనివర్సిటీగా ఏయూ రికార్డు సొంతం చేసుకుంది. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది చదువుకునేది ఏయూలోనే కావడం గమనార్హం. ప్రత్యేక హాస్టళ్లు ఆంధ్ర యనివర్సిటీలో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఆహారం విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వర్సిటీలో ప్రవేశాలు పొందే వారిలో 70 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ హాస్టళ్లులో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరి కోసమని ప్రత్యేకంగా వర్సిటీలో ఏడు హాస్టళ్లు అందుబాటులో తీసుకొచ్చారు. వారికి నచ్చిన వంటకాలు తయారు చేసుకునేలా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎఫైర్స్ విభాగం డీన్ ఆచార్య ధనుంజయరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాల విభాగం విద్యార్థుల చదువులతో పాటు, వారి సదుపాయాలపై కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండటంతో.. వారి చదువులు సాఫీగా సాగిపోతున్నాయి. సినిమాల్లోనూ అవకాశాలు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు సినిమాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో విశాఖ నగరంతో పాటు, పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌కు ఎక్కువగా జరుగుతుండటంతో వీటిలో విదేశీ విద్యార్థులకు అవకాశాలు దక్కుతున్నాయి. ఓ సినిమాలో కంబోడియాలో చిక్కుకుపోయిన 25 మంది యువతను వైజాగ్‌కు తీసుకొచ్చే సన్నివేశా న్ని ఇక్కడి విద్యార్థులతోనే చిత్రీకరించారు.. ఇక్కడి ఆఫ్రికన్ విద్యార్థుల బృందం.. హీరో సూర్య నటించిన చిత్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం చేసే విలన్ సహచరుల పాత్రల్లో నటించింది. ఈ నెల 26 నుంచి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతుండగా.. వీటిలో విదేశీ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇదే జోష్ ఉంటుందా? కూటమి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీపై శీతకన్ను వేస్తోంది. విశాఖలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీని బలోపేతం చేసేలా పరోక్షంగా సహకారమందిస్తోంది. విశాఖలోని ఆ ప్రైవేటు యూనివర్సిటీలో చేరితేనే మేలు అన్నట్లుగా ఏయూ పాలనాధికారులతో పాటు ఓ వర్గం వ్యవహరిస్తుందనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ప్రభావం 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లపై పడుతోందని వర్సిటీ మేలు కోరే వారు అంటున్నారు. ఫలితంగా విదేశీ విద్యార్థుల జోష్ ఉంటుందా..? అనేది వేచి చూడాలి. చదువుతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలనే కోరికతో విశాఖకు వచ్చే విదేశీ విద్యార్థుల నమ్మకాన్ని నిలబెడుతూ విద్య అందిస్తున్నాం. ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి.. వారికి తోడుగా నిలిచేలా ఇంటర్నేషనల్ ఎఫైర్స్ విభాగం పని చేస్తోంది. – ఆచార్య ధనుంజయరావు, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డీన్, ఆంధ్ర యూనివర్సిటీ గ్లోబల్ విద్యార్థులతో వర్సిటీలో జోష్ 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యాభ్యాసం ఏయూకు క్రేజ్ పెంచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఖ్యాతిఆంధ్ర యూనివర్సిటీలో ఒకప్పుడు కొన్ని ప్రత్యేక కోర్సులకే పరిమితమైన విదేశీ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. కేవలం ఐదేళ్లలో ఈ సంఖ్య రెండింతలు కావడం విశేషం. దేశంలోని మరే ఇతర విశ్వవిద్యాలయంలోనూ ఇంత మంది విదేశీ విద్యార్థులు లేకపోవడం ఆంధ్ర యూనివర్సిటీని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా నిలబెడుతోంది. ప్రత్యేక హాస్టళ్లు, వారికి నచ్చిన ఆహారం, వంటి సౌకర్యాలు ఇక్కడకు మరింత మందిని ఆకర్షిస్తున్నాయి. నగరంలోని ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు కూడా తోడవడంతో ఆంధ్ర యూనివర్సిటీ.. మినీ ప్రపంచాన్ని తలపిస్తోంది. – విశాఖ విద్య కోర్సుల వారీగా విదేశీ విద్యార్థులు స్పెషలైజేషన్ యూజీ పీజీ పీహెచ్డీ మొత్తం ఆర్ట్స్ 3 44 136 183 సైన్స్ అండ్ టెక్నాలజీ 6 52 38 96 ఇంజినీరింగ్ 373 55 44 472 ఫార్మాస్యూటికల్ 146 39 20 205 ఇంటర్నేషనల్ బిజినెస్ 143 24 – 167 లా 1 5 6 ఐఏఎస్ఈ 1 1 మొత్తం 671 216 243 1,130 -
గుడివాడలో ఘనంగా బడ్డు సంబరం
సాక్షి, పాడేరు: పట్టణంలోని గుడివాడ గిరిజనులు కూడా పూర్వ సంప్రదాయ బడ్డుతాడు సంబరానికి శ్రీకారం చుట్టారు. ఇటుకల పండగలో భాగంగా ఆదివారం గుడివాడ శంకులమ్మతల్లి ఆలయం ఆవరణలో బడ్డుతాడు సంబరం వైభవంగా జరిగింది. ముందుగా గొడుగుల ఊరేగింపును పాడేరు పుర వీధుల్లో నిర్వహించారు. అనంతరం శంకులమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బడ్డుతాడుకు గ్రామ పెద్దలంతా పూజలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళల థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలు హోరెత్తాయి. గుడివాడకు చెందిన ఆడపిల్లలు, బయట నుంచి వచ్చిన వదిన, మరదళ్లు పోటాపోటీగా బడ్డుతాడును లాగారు. ఈ పోటీలో ఊరి ఆడపిల్లలే తాడును లాగుకుపోయి విజయం సాధించారు. వదిన, మరదళ్లు వంటి మహిళలు ఓడిపోయారు. గ్రామంలో పశుసంపదతో పాటు అందరూ సంతోషంగా జీవించాలని, పంటలు బాగా పండాలని కాంక్షిస్తూ ఇటుకల పండగలో భాగంగా ఈ బడ్డుతాడు సంబరంను గిరిజనులు నిర్వహించడం ఆనవాయితీ. పాత పాడేరు, గుడివాడ గ్రామాల్లో మాత్రమే పూర్వం నుంచి బడ్డుతాడు సంబరం జరుగుతుంది. మధ్యలో కొన్నేళ్లు గుడివాడలో ఈ సంబరం జరగనప్పటికీ శంకులమ్మతల్లి ఆలయం నిర్మాణం తరువాత అన్ని కుటుంబాల గిరిజనులు బడ్డుతాడు సంబరాన్ని కొనసాగిస్తున్నాయి. -
గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్.!
● అభివృద్ధికి శాపం.. కూటమి పాలన ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వంతెనలను పూర్తి చేయని వైనం ● వంతెనల అప్రోచ్ రోడ్లకు నిధుల్లేక నిలిచిపోయిన పనులు సీలేరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన పలు ప్రాజెక్టులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గిరిజనుల సౌకర్యార్థం మంజూరు చేసిన వంతెనల నిర్మాణంపై కక్ష ధోరణి ప్రదర్శిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం నుంచి గిరిజన గ్రామాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు ప్రధాన వంతెనలు మంజూరయ్యాయి. కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వంతెనలను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా గెడ్డలు, వాగుల్లో ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి కాని పిల్లి గెడ్డ వంతెన రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు సీలేరు సమీప పిల్లి గెడ్డ వద్ద ఎన్నో ఏళ్లుగా రాకపోకలు కష్టంగా ఉండేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2.34 కోట్లు మంజూరు చేసి వంతెన పనులు ప్రారంభించింది. వంతెన నిర్మాణం పూర్తయింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పూర్తి కాకుండా గడిచిన 7 నెలలుగా పనులు నిలిచిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో భారీ విపత్తు వచ్చి వర్షానికి పిల్లి గెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రెండు వైపులా వాలు కట్టేందుకు రూ.30 లక్షలతో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన అల్లూరు జిల్లా నుంచి గూడెం కొత్తవీధి మండలం దాటి దారకొండ మీదుగా ఒడిశా వెళ్లేందుకు చిన్న గంగవరం వంతెన కీలకం. 2014 ఏడాదిలో రూ.40 లక్షలతో ఈ వంతెనను నిర్మించారు. చుట్టు పక్కల అటవీ ప్రాంతం నుంచి పడిన వర్షపు నీరు అంతా ఈ వంతెన మీదుగా ప్రవహిస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో భారీ తుపాను వచ్చి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే భారీ వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇటీవల ఆ ప్రాంత గ్రామ గిరిజనులు వంతెన నిర్మించాలని పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. నెల రోజుల కిందట ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు వంతెన పరిశీలించి తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. వర్షాలు పడితే పూర్తిగా సరిహద్దుకు రాకపోకలు నిలిచిపోతాయని, నిత్యావసర సరకులు కూడా తెచ్చుకోలేమని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అస్తవ్యస్తంగా మాదిగ మల్లు అప్రోచ్ రోడ్డు జిల్లా నుంచి ధారకొండ మీదుగా తూర్పుగోదావరి, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వెళ్లేందుకు గుమ్మురేవులు రోడ్డు మార్గం మధ్యలో మాదిగ మల్లు వంతెన కీలకం. ధారాలమ్మ ఘాట్ రోడ్డులో భారీగా కురిసే వర్షపు నీరంతా ఈ వంతెన నుంచే ప్రవహిస్తోంది. దీంతో గత ప్రభుత్వం రెండు కోట్ల 40 లక్షల రూపాయలతో భారీ వంతెనను మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసింది. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం అప్రోచ్ రోడ్డును ఇప్పటికీ పూర్తి చేయలేదు. గతేడాది తొమ్మిదో నెలలో వచ్చిన భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా నిర్మించి రాకపోకలు సాగించారు. అప్పటి నుంచి అసంపూర్తిగానే వంతెన ఉంది. తరచూ కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. మూడు రోజుల కిందట ఆర్టీసీ బస్సు వర్షానికి బురదలో కూరుకుపోయింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ.1.80 కోట్లతో జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు ఎట్టకేలకు వచ్చాయి. దీంతో టెండర్లు పిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల రోజుల్లో పనులు జరగకపోతే రానున్న వర్షాకాలంలో ఈ వంతెనపై కూడా రాకపోకలు కష్టమేనని ఆ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో సప్పర్ల వంతెన సప్పర్ల నుంచి గొల్లపల్లి వెళ్లే మార్గంలో పెద్ద వాగు ఉంది. వర్షాకాలంలో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రెండు కోట్ల 80 లక్షల రూపాయలతో వంతెన మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ వంతెన పూర్తయితే అవతల ఉన్న గ్రామాల నుంచి పండించిన పంటలు తరలించడానికి సులువవుతుంది. అప్రోచ్ రోడ్లు పూర్తి చేయాలి వంతెనలకు ఇరువైపులా చేపట్టాల్సిన అప్రోచ్ రోడ్ల నిర్మాణం తక్షణం పూర్తి చేయాలి. లేకపోతే ఆందోళన చేస్తాం. వర్షా కాలం ప్రారంభమైతే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. తక్షణం నిర్మాణాలు పూర్తి చేయాలి. – కారే శ్రీనివాస్, స్థానిక నాయకుడు అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.. పిల్లిగెడ్డ, మాదిగ మల్లు, సప్పర్ల వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. మాదిగ మల్లు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డుకు కలెక్టర్ రూ.1.80 కోట్లతో అనుమతులు ఇచ్చారు. త్వరలోనే పనులు చేపడతాం. – కళ్యాణ్ కుమార్, డీఈ, ట్రైబల్ వెల్ఫేర్ -
అక్రమంగా తరలిస్తున్న బియ్యం, కందిపప్పు పట్టివేత
రంపచోడవరం: స్థానిక సినిమాహాల్ రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహం నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. వసతి గృహానికి చెందిన ఒక గోధుమ పిండి, రెండు కందిపప్పు, పది బియ్యం బస్తాలను శనివారం అర్ధరాత్రి ఆటోలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులు, ఐటీడీఏ పీవోకు సమాచారమిచ్చారు.దీంతో స్థానిక పోలీసులు హాస్టల్ వద్దకు వచ్చి సరుకులను, ఆటోను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ ఈ ఘటనకు సంబంధించి గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్ కత్తుల కృష్ణాబాయిని సస్పెండ్ చేసినట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. హాస్టల్ నుంచి బియ్యం, ఇతర సరుకుల అక్రమ తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తదుపరి చర్యలు చేపడతామన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గిరిజన సంక్షేమ హాస్టల్లో బియ్యాన్ని వ్యాపారులకు విక్రయించిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల వాణిశ్రీ డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. వసతి గృహాలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే సరుకులు అక్రమంగా తరలిపోతున్నాయని చెప్పారు. కొంత మంది అధికారుల సహకారంతోనే వార్డెన్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్ నుంచి ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు -
సీలేరు నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
చింతూరు: సరదా గడుపుదామని సీలేరు నది వద్దకు వెళ్లిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు నదిలో మునిగి గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. చింతూరుకు చెందిన మనోజ్‌కుమార్, రవి, సిద్ధార్థ, వెంకన్నబాబు, దిలీప్‌కుమార్, శ్రీనులు సరదాగా గడిపేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని చింతూరు మండలం కల్లేరు వద్దనున్న సీలేరు నది వద్దకు వెళ్లారు. కాసేపు నదివద్ద గడిపిన అనంతరం వారిలో సుగ్రీవ శ్రీను స్నానం చేసేందుకు నదిలో దిగగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో అతనిని కాపాడేందుకు స్నేహితుడైన నాగుల దిలీప్‌కుమార్ కూడా నదిలో దిగాడు. లోతు అధికంగా ఉండడంతో అతను కూడా నీటిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వారి జాడకోసం గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. అప్పటికే చీకటి పడడంతో గాలింపు చర్యలు చేపట్టడం సాధ్యపడలేదు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్, ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సోమవారం ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని ఎస్ఐ రమేష్‌కు వారు సూచించారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
రాజవొమ్మంగి: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కేంద్రంగా ఆదివారం జరిగిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతగా సాగింది. వివిధ మండలాల నుంచి 237 మంది హాజరై పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురుకులంలో 6వ తరగతిలో ప్రవేశానికి, మరి కొన్ని బ్యాగ్‌లాగ్ సీట్ల భర్తీ కోసం 309 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది గైర్హాజరయ్యారన్నారు. ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష రంపచోడవరం: రంపచోడవరంలో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలు ముగిసినట్లు డీడీ రుక్మాంగాధయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీడీ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆరో సెంటర్ల్లో పరీక్షలు నిర్వహించగా 1500 మంది విద్యార్థులకు 1193 మంది హాజరైనట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 307 మంది గైర్హాజరైనట్టు చెప్పారు. అడ్డతీగల: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు అడ్డతీగల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. ఐదో తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్లతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ నిమిత్తం ఆదివారం ప్రవేశ పరీక్షకు 355 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉందన్నారు. కానీ 268 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు అల్పాహారం, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. -
ఈదురు గాలులు... భారీ వర్షం
సాక్షి,పాడేరు: జిల్లాలో రోజూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12గంటల నుంచి గంటన్నర పాటు పాడేరులో భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో పాటు పిడుగుల శబ్దాలు మరింత భయపెట్టాయి. ఇళ్ల పైకప్పు రేకులు ధ్వంసం పెదబయలు: మండలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మారుమూల జామిగుడ పంచాయతీ పినరావెలి గ్రామంలో కిల్లో లక్ష్మి, మండి సావిత్రి ఇళ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మండి ప్రభుదాస్ ఇంటిపై కప్పు పాక్షికంగా దెబ్బతింది. దీంతో ఇంటి లోపల ఉన్న ధాన్యం, రాగులు, బియ్యం, దుస్తులు, ఇతర వంట సామగ్రి తడిసిపోయాయి. ప్రభుత్వం తమకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరారు. -
రోడ్డు కోసం భారీ ర్యాలీ
సీలేరు: అంతర్రాష్ట్ర రోడ్డును తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దారకొండ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆర్వీనగర్ నుంచి దారకొండ, సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా ఈ రోడ్డుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆందోళనకారులు తెలిపారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి ఆర్వీనగర్ నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు రోడ్డు నిర్మించేందుకు పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపట్టి, మండల బంద్‌కు పిలుపు ఇస్తామని అంతర్రాష్ట్ర రోడ్డు సాధన కమిటీ నాయకులు తెలిపారు. గంగవరం,అగ్రహారం,చోడిరాయి వద్ద గత ఏడాది కొట్టుకుపోయిన వంతెనలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని,ముంపునకు గురైన గిరిజనుల భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు, గుమ్మిరేవుల మాజీ సర్పంచ్ బాబురావు, అల్లంగి రాజు, సీలేరు మాజీ ఉప సర్పంచ్ కారె శ్రీనివాసు, పలు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధాఽర్థ్ మార్క్, మల్లుదొర, సొన్ను బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,139 పోస్టులు
● జోనల్ స్థాయిలో మరో 400 పోస్టులు ● డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ● జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు విశాఖ విద్య: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఆదివారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్‌లో ఐదు ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/ సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. రోస్టర్ పాయింట్లు ప్రకటించిన జిల్లా విద్యాశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని విద్యాలయాల్లో సబ్జెక్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది విద్యాశాఖాధికారులు ఇప్పటికే లెక్క తీశారు. మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్ మేనేజ్మెంట్ల వారీగా రోస్టర్ పాయింట్లు సైతం ప్రకటించారు. ప్రభుత్వ/జెడ్పీ/ఎంపీ/మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలో భర్తీ చేయనున్న 734 పోస్టుల్లో 290 ఓపెన్ కేటగిరీ కోసం కేటాయించారు. ఈ పోస్టులకు ఎవరైనా పోటీ పడవచ్చు. బీసీ ఏ–42, బీసీ బీ–65, బీసీ సీ–6, బీసీ డీ–44, బీసీ ఈ –26, ఎస్సీ గ్రూప్ 1–26, ఎస్సీ గ్రూప్ 2–7, ఎస్సీ గ్రూప్ 3–36, ఎస్టీ–37, ఈడబ్ల్యూఎస్–65 పోస్టులు కేటాయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు ఏఏ సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులు కేటాయించామనేది స్పష్టత ఇస్తూ.. జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. షెడ్యూల్ ఇలా.. : 2024 జూలై 1 కటాఫ్‌గా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీల వారికి మరో ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. తగిన విద్యార్హతలు ఉన్న వారు మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వారంతా కొత్తగా దరఖాస్తు ఫారాన్ని నింపి వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి. అయితే అర్హతల మేరకు మరేదైనా సబ్జెక్టు కోసం పరీక్ష రాయాలనుకుంటే.. తగిన ఫీజు చెల్లించి, మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో.. ఎస్ఏ తెలుగు 7 హిందీ 11 గణితం 7 ఫిజికల్ సైన్సు 35 సోషల్ 5 ఎస్జీటీ 335 మొత్తం 400 జువనైల్ విభాగంలో ఎస్జీటీ 4 పీఈటీ 1 జోనల్ పరిధిలో పోస్టులు ఇలా.. ఉత్తరాంధ్రలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. పీజీటీ 73 టీజీటీ 299 పీడీ 6 పీఈటీ 22 సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా.. ఎస్ఏ లాంగ్వేజీ–1 26 హిందీ 28 ఇంగ్లిష్ 55 గణితం 59 ఫిజికల్ సైన్స్ 39 బయాలజీ 58 సోషల్ 91 పీఈటీ 139 ఎస్జీటీ 239 మొత్తం 734 -
ప్రాణం తీసిన ఈత సరదా
ముంచంగిపుట్టు: ఈత సరదా ప్రాణం తీసింది. ఎండవేడిని తట్టుకోలేక స్నేహితులతో కలిసి మత్స్యగెడ్డలో ఈత కొడదామని వెళ్లిన ఓ గిరిజన యువకుడు నీటిలో మునిగి మరణించాడు. స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం ఎండ వేడి అధికంగా ఉండడంతో మండలంలోని ఏనుగురాయి పంచాయతీ నడుమూరు గ్రామానికి చెందిన సిరగం వంశీకృష్ణ(18) తన స్నేహితులు కవెర్ల భూపతిరాజు, సిరగం మణికంఠ,సిరగం సిద్ధార్థ,కవెర్ల జగదీష్ వర్మ,సిమిలియ శ్రీనులతో కలిసి కుమ్మిగూడ గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో ఈత కొడదామని వెళ్లాడు.అందరూ ఈత కొడుతుండగా వంశీకృష్ణ ప్రమాదవశాత్తూ మత్స్యగెడ్డలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వంశీకృష్ణ మునిగిపోయిన చోట గాలించారు. ఫలితం లేకపోవడంతో నడుమూరు గ్రామస్తులకు జరిగిన సంఘటనపై సమాచారం ఇచ్చారు.దీంతో నడుమూరు,ఏనుగురాయి,గాదెలబురుగు,రాతులపుట్టు,కుమ్మిగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు తరలి వచ్చి మత్స్యగెడ్డలో నాటుపడవతో గాలించారు. గంట తరువాత వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. వంశీకృష్ణ స్నేహితులతో మాట్లాడి ప్రమాదం వివరాలు సేకరించారు. తమ కుమారుడు వంశీకృష్ణను డాక్టర్ చదివిద్దామనుకున్నామని, ఇంతలో మృతి చెందాడని తల్లిదండ్రులు జానకమ్మ,నాగరాజు గుండెలు అవిసేలా రోదించడం అందరిని కలిసివేసింది. వంశీకృష్ణ వారికి రెండో కుమారుడు. ముంచంగిపుట్టు పీహెచ్సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.సంఘటన జరిగిన కుమ్మిగూడ మత్స్యగెడ్డ వద్ద ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారని,చాలా ప్రమాదకర ప్రదేశమని స్థానికులు తెలిపారు.వంశీ కృష్ణ (ఫైల్) మత్స్యగెడ్డలో మునిగి గిరిజన యువకుడి మృతి నడుమూరులో విషాదం -
అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి డీఎఫ్‌వో నర్సింహారావుచింతపల్లి: డివిజన్‌పరిధిలో అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చింతపల్లి డీఎఫ్‌వో నర్సింహారావు తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం జరిగిన డివిజన్ సమావేశంలో 2025–26కు సంబంధించి అటవీశాఖ అధికారులు అమలు చేయాల్సిన కార్యక్రమాలు, పనులపై డీఎఫ్‌వో పలు సూచనలు చేశారు. అడవుల పరిరక్షణకు సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించినట్టు చెప్పారు. అడవుల్లో విలువైన కలప అక్రమ నరికివేత, రవాణా వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలని తెలిపారు. త్వరలో చెక్‌పోస్టుల వద్ద సీసీకెమె రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రంగురాళ్ల తవ్వ కాలు జరగకుండా క్వారీల వద్ద నిరంతరం నిఘా ఉంచేందుకు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడకుండా గిరిజనులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించా రు. ఇటీవల పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పో యిన అటవీశాఖ సిబ్బందికి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు అటవీ శాఖ ఉద్యోగుల సంక్షేమ నిధినుంచి ఆర్థిక సాయం అందజేశారు. ఈకార్యక్రమంలో రేంజ్ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు. -
గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి
● ఎస్పీ అమిత్ బర్దర్ చింతపల్లి: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. మండలంలో అన్నవరం పోలీసు స్టేషన్‌ను ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాతో కలసి శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ భవనాన్ని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోగల ఈపోలీసు స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండడంతో గంజాయి రవాణాకు అవకాశం ఉందని, దానిని నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా యువ త ఎటువంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను గిరిజన రైతులు,యువత సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్ బాబు,ఎస్ఐ వీరబాబు పాల్గొన్నారు. -
టీడీపీలో అరాచకాలకు పాల్పడుతున్న నేతలకు అడ్డుకట్ట వేయాలి
ముంచంగిపుట్టు: మండలంలో తెలుగుదేశం పార్టీలో అరాచకాలకు పాల్పడుతున్న నాయకులకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు కోరారు. మండల కేంద్రం ముంచంగిపుట్టలో శనివారం టీడీపీ మండల నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కొంతమంది టీడీపీ నేతల వల్ల జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయకుండా తిరోగమన చర్యలకు పాల్పడుతున్న నాయకులపై అధిష్టానం దృష్టి పెట్టి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో అందరినీ ఏకం చేయడంలో విఫలం అవుతున్న అసమర్థులను పదవుల నుంచి నుంచి తొలగించి, పార్టీ కోసం కష్టపడిన వారికి బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్చార్జులుగా, కుటుంబ సాధికార సారథులుగా నియమించాలని, గ్రామ కమిటీల్లో స్థానం కల్పించాలన్నారు. పార్టీలో నాయకుల తీరు మారకపోతే చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్ల టీడీపీకి భారీ నష్టం తప్పదన్నారు.అసమర్థ నాయకుల స్వార్థ ప్రయోజనాలతో నిస్వార్థమైన నేతలు, కార్యకర్తలు బలైపోతున్నారని తెలిపారు. తక్షణమే పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి పార్టీలో అసమర్థులను వారి స్థానాల నుంచి తొలగించాలని,లేని పక్షాన పార్టీకి భారీ సంఖ్యలో నేతలు,కార్యకర్తలు దూరమవతారని శాస్త్రిబాబుతో పాటు టీడీపీ నేతలు,కార్యకర్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఆర్.నీలకంఠం పాత్రో, పార్టీ సీనియర్ నేతలు సుబ్రహ్మణ్యం,రఘునాఽథ్,రామదాసు,చిరంజీవి,పరుశురాం తదితరులు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అధిష్టానం దృష్టి పెట్టాలని డిమాండ్ -
విద్యుత్ వ్యర్థాలతో ఆరోగ్యానికి హాని
కలెక్టర్ దినేష్కుమార్చింతపల్లి: విద్యుత్ వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన వృథా విద్యుత్ పరికరాల సేకరణ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ గౌడతో కలసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఉన్న విద్యుత్ వ్యర్థ పరికరాలు, ప్టాస్టిక్ వస్తువుల వినియోగంతో అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ వ్యర్థాల వల్ల తాగునీరు, వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. ప్లాస్టిక్, విద్యుత్ వ్యర్థ పరికరాలతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 10వేల జనాభా దాటిన చింతపల్లి, పాడేరు, పెదలబుడు, రంపచోడవరం పంచాయతీ కేంద్రాల్లో ఈ వ్యర్థ విద్యుత్ పరికరాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్టు చెప్పారు. చింతపల్లి ఎంపీపీ,సర్పంచ్ తన దృష్టికి తీసుకువచ్చిన తాగునీరు, పారిశుధ్య స మస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాత బస్టాండ్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు నిర్వహించిన సీమంతం కార్యక్రమం, దివ్యాంగుల గుర్తింపు శిబిరంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మె ల్యే గిడ్డి ఈశ్వరి,డీఎల్పీవో కుమార్,ఉపాధి ఏపీడీ లాలం సీతయ్య,ఎంపీపీ కోరాబు అనూషదేవి,సర్పంచ్ దురియా పుష్పలత,ఎంపీడీవో శ్రీనివాసరావు ఎంఈవోలు ప్రసాద్, బోడంనాయుడు, డీటీ చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్లోగిరిజన విద్యార్థి సత్తా
● దేశవ్యాప్త ఎస్టీ కేటగిరిలో 137 ర్యాంకు సాక్షి,పాడేరు: మండలకేంద్రం పాడేరు పట్టణంలోని నీలకంఠనగర్‌కు చెందిన గిరిజన విద్యార్థి సమర్ధి నందవర్ధన్ నిహాల్ జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటి, దేశావ్యాప్త ఎస్టీ కేటగిరిలో 137 ర్యాంక్ సాధించాడు. పాడేరుకు చెందిన సమర్ధి రఘు,ఉర్వశి దంపతుల పెద్ద కుమారుడు నందవర్ధన్ నిహాల్ పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ చదవి, ఇటీవల వచ్చిన ఫలితాల్లో 959 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన నందవర్ధన్ నిహాల్‌ను పార్వతీపురంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ఘనంగా సత్కరించి, అభినందించారు. -
ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటులో ఉండాలి, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూడదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే.. కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు రావాలి, ఆ
ఎన్‌క్యూఏఎస్ బృందంగుర్తించిన అంశాలు ● ఆస్పత్రిలో ప్రత్యేకంగా మూడు వేస్ట్ డస్ట్ బిన్ల ఏర్పాటు ● పూర్తి స్థాయి పరికరాలతో లేబర్ రూమ్ ● మందుల పంపిణీకి ప్రత్యేక గది ● ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక గదిలో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ● రెండు వైద్యుల గదుల ఆధునికీకరణ ● పురుషులు, మహిళలకు వేర్వేరు వార్డులు, ప్రత్యేకంగా వాష్ రూమ్‌లు, కామన్ వాష్ రూమ్ ● లేబొరేటరీ ● బర్త్ వెయిటింగ్ రూమ్ ● రోగుల సౌకర్యార్థం ఆర్వో ప్లాంట్ ● ఆస్పత్రిలో ముఖ ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం ఆస్పత్రిలో 24 గంటలవైద్య సేవలు ● పీహెచ్సీలో 24గంటలు అందుబాటు లో ఉంటూ సేవలందిస్తున్న డాక్టర్,వైద్య సిబ్బంది. ● ఆస్పత్రి ఆవరణను రోజూమూడు సార్లు శుభ్రంచేస్తున్న పారిశుధ్య సిబ్బంది. ● పీహెచ్సీలో ప్రతి రోజు ఓపీ 75 నుంచి 80 వరకు ఉంటుంది. ● సోమవారం సంత రోజు 150కు పైగా ఓపీ ఉంటుంది. ● ప్రతి నెల పీహెచ్సీలో 15 నుంచి 20 కాన్పులు జరుగుతున్నాయి. ● మందులు పుష్కలంగా ఉన్నాయి. పీహెచ్సీలో లేని మందులు బయట నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. ● ఆస్పత్రిలో ఒక అంబులెన్స్‌తోపాటు ఒక తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది.ఆనందంగా ఉంది అనంతగిరి పీహెచ్‌సీని ఎన్‌క్యూఏఎస్ బృందం సభ్యులు గత నెల 24, 25 తేదీల్లో పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను, రోగులకు వైద్యు లు అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూశారు. వైద్య సిబ్బంది సేవలు సైతం గుర్తించారు. పీహెచ్‌సీకి గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉంది. పీహెచ్‌సీని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలుతీసుకుంటున్నాం. – జ్ఞానేశ్వరి, డాక్టర్, అనంతగిరి పీహెచ్సీ అనంతగిరి(అరకులోయటౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సమకూర్చిన సౌకర్యాలతో ప్రజారోగ్య సదుపాయల కల్పనలో రాష్ట్రంలోనే మేటి పీహెచ్సీగా అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్రంలో మూడు పీహెచ్‌సీలు.. తూర్పుగోదావరి జిల్లా సారంగధర మెట్ట, అనంతపురం జిల్లా శ్రీనివాసనగర్, అల్లూరి జిల్లా అనంతగిరి పీహెచ్‌సీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా అందులో అనంతగిరి పీహెచ్సీ 91.64 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. గత నెల 24, 25 తేదీల్లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్క్యూఏస్) బృందం ప్రతినిధులు మనీషా, షణ్మఖవేల్ పీహెచ్సీలో రోగులకు అందిస్తున్న సేవలు, ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు,పరిసరాలు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందిస్తున్నట్టు గుర్తించిన ఎన్‌క్యూఏఎస్ బృందం ఈనెల 16వ తేదీన జాతీయ స్థాయి గుర్తింపు పత్రాన్ని వాట్సప్ ద్వారా అందించారని డాక్టర్ జ్ఞానేశ్వరి తెలిపారు. గుర్తింపు ప్రక్రియ ఇలా.. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రులకు ఎన్‌క్యూఏఎస్ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతాయి. పీహెచ్‌సీల్లో ఆరు డిపార్ట్మెంట్లలో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా ఆస్పత్రుల్లో 18 అంశాలను పరిశీలిస్తారు. సంబంధింత ఆస్పత్రికి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రిలో ప్రమాణాలన్నింటినీ పరిశీలించి, అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్ పేషెంట్లు, ఇన్‌పేషెంట్లు, డయాగ్నొస్టిక్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్, రోగులకు సమకూర్చిన సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. నాడు – నేడుతోనే... చాలా ఏళ్ల పాటు శిథిలభవనంలో కొనసాగిన అనంతగిరి పీహెచ్సీ రూపురేఖలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా మారాయి. నాడు–నేడు కార్యక్రమంలో రూ.45 లక్షలతో పూర్తిగా ఆధునికీకరించడతో పాటు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే అగ్రస్థానంలో అనంతగిరి నిలవగలిగింది. నంతగిరి..నాడు–నేడు నిధులురూ. 45 లక్షలతో ఆస్పత్రి ఆధునికీకరణ, ఇతర సౌకర్యాల కల్పన రూ.3 లక్షల మండల పరిషత్, హెచ్డీఎస్నిధులతో మెట్లు,రిటైనింగ్ వాల్ నిర్మాణం సేవలు బాగున్నాయి. అనంతగిరి పీహెచ్సీలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయి. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లవలసిన పని లేదు. – పంచాడి అప్పన్న, గిరిజనుడు, షాడ గ్రామం, అనంతగిరి మండలంఈనెల 16న వాట్సప్‌ద్వారా గుర్తింపు పత్రం అందజేత పూర్తి సహకారం పీహెచ్సీలో ఎటువంటి సమస్య లేకుండా మండల పరిషత్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆస్పత్రిలో మెట్ల మార్గం, ప్రహరీ నిర్మాణానికి మండల పరిషత్ నుంచి రూ. రెండు లక్షలు, ఆస్పత్రి అభివృద్ధి నిధులు రూ.లక్ష కేటాయించాం. గిరిజన రోగులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం. – శెట్టి నీలవేణి, ఎంపీపీ, అనంతగిరి మండలం -
ఎస్టీ సర్టిఫికెట్లు పొందిన ఒడిశా వాసుల జాబితా ఇవ్వండి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయటౌన్: ఒడిశా రాష్ట్రం నుంచి అరకులోయకు బతుకు తెరువు కోసం వచ్చి, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి జాబితాను అందజేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పద్మాపుం సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం సచివాలయాన్ని ఎమ్మె ల్యే ఆకస్మికంగా సందర్శించారు. ఒడిశా నుంచి వచ్చిన వారంతా పద్మాపురం పంచాయతీ సంతో ష్నగర్లో ఎస్టీ సర్టిఫికెట్ పొంది, అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వారి వివరాలు అందజేయాలన్నారు. అనంతరం యండపల్లివలసలోని గురుకుల బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. వంటశాలకు వెళ్లి వంటకాలు పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన పదార్థాలను వండి వడ్డించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. -
ఆన్లైన్ పరీక్షల్లో జియాన్ గోల్‘మాల్’!
పెందుర్తి: పోటీ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థుల విలాపానికి.. అడ్డదారిలో కొలువు దక్కించుకున్న వారి విలాసానికి వేదికగా చినముషిడివాడలోని జియాన్ డిజిటల్ కేంద్రం ఆరోపణలు మూటగట్టుకుంది. ఇక్కడ ప్రతిభ కంటే పైసాకే ఎక్కువ ప్రాధాన్యత అని ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే నిదర్శనం. ఈ కేంద్రంలో జరిగే ప్రతి పోటీ పరీక్షలోనూ అడ్డదారుల్లో అభ్యర్థులకు సహకారం అందుతోందని బాధిత అభ్యర్థులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతూ ఈ నెల 11న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) సూపర్వైజర్ ట్రైనీ ఇంజనీర్ ఆన్లైన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ ఘటన వెలుగుజూసింది. గత నెల 25న ఇదే కేంద్రంలో జరిగిన అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పరీక్షలోనూ ఇదే తరహా మాల్ ప్రాక్టిస్ జరిగిందని కొంత మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు సంపూర్ణ సహకారం చినముషిడివాడ జియాన్ డిజిటల్స్‌లో ఏడేళ్లుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కేంద్రంలో ఆన్లైన్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కొందరు బ్రోకర్ల అవతారం ఎత్తి ఉద్యోగాన్ని బట్టి బేరం కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ పరీక్ష కేంద్రం నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని, పరీక్ష సమయానికి ఏం చేయాలనే అంశంపై ముడుపులిచ్చిన అభ్యర్థులకు ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపణ. సదరు అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ పాడవడం మొదటి ప్లాన్ అయితే, ముందుగానే జవాబు పత్రాన్ని అడ్మిట్ కార్డుపై ముద్రించడం రెండో ప్రణాళిక. ఇలా ఏదో ఒకటి అమలు చేసి డబ్బులు కట్టిన అభ్యర్థికి అధిక మార్కులు వచ్చేలా చేసి, మిగిలిన వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఒక్కో స్థాయిలో ఒక్కో వ్యవహారం వాస్తవంగా పరీక్ష కేంద్రంలో నిర్ణీత సమయంలో అభ్యర్థి తన అడ్మిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ప్రశ్నాపత్రం ప్రత్యక్షమవుతుంది. ముందుగా లీక్ అయ్యే అవకాశం ఉండదు. అయితే ఆయా ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన బృందంలోని వ్యక్తులు బయటకు ఇస్తే మాత్రం బ్రోకర్లు దాన్ని సొమ్ము చేసుకుంటారు. ఇక ఆన్లైన్ పరీక్ష పర్యవేక్షణ చేసే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని డిజిటల్ కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. టీసీఎస్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ అంతా కేంద్రానిదే. ఇక్కడి నిర్వాహకులు తమకు డబ్బులు చెల్లించిన అభ్యర్థికి కంప్యూటర్ పాడైందన్న సాకుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేని మరో కంప్యూటర్ను కేటాయిస్తారు. అక్కడ పేపర్‌ను మొబైల్లో రికార్డు చేసుకుని, వీలైనంత వేగంగా దానికి కీ రూపొందిస్తారు. ఆ కీని అభ్యర్థికి అందించి, కష్టపడి చదివిన వారికి అన్యాయం చేస్తున్నారు. జియాన్ డిజిటల్ కేంద్రంలో ఇలాంటి వ్యవహారాలు చాలా జరిగినట్లు బలమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వితేజ విచారణాధికారిగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భెల్, టీసీఎస్‌ల నివేదికలు కూడా ఈ కేసులో అత్యంత కీలకం కానున్నాయి. కాగా జియాన్ డిజిటల్ కేంద్రంలో ఆన్లైన్ పరీక్షలు జరిగే సమయంలో ఏనాడూ పోలీస్ బందోబస్తు కోసం అభ్యర్థించిన దాఖలాల్లేకపోవడం కొనమెరుపు. జియాన్ కేంద్రంగా జరిగిన పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌పై ఆరోపణలు ఉద్యోగ స్థాయిని బట్టి అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు! ‘భెల్’తో పాటు ఇతర పరీక్షల అవకతవకలపై ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు అన్ని పరీక్షల కాపీయింగ్‌పై ఉన్నతస్థాయిలో సమగ్ర విచారణ -
అండర్–23 క్రికెట్ జట్టు ఎంపికలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ నెట్స్‌లో శుక్రవారం అండర్–23 పురుషుల జట్టు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మూడేళ్లుగా వీడీసీఏ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో పాటు కొత్తగా మరికొందరు ఓపెన్ కేటగిరీలో అవకాశం దక్కడంతో.. వీరంతా ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే వీడీసీఏ బ్యాటింగ్ విభాగంలో 27 మందిని, వికెట్ కీపర్లుగా ఐదుగురిని, ఫాస్ట్ బౌలర్లుగా 14 మందిని, స్పిన్నర్లుగా మరో 13 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేసింది. అయితే ఔత్సాహిక క్రీడాకారులు తమకు అవకాశం ఇవ్వాలని కోరడంతో విశాఖ క్రికెట్ సంఘం స్పందించింది. ఓపెన్ కేటగిరీలో అవకాశం కల్పించడంతో ప్రాబబుల్స్‌తో పాటు దాదాపు ఇరవై మంది ఔత్సాహికులు ఈ ట్రయల్స్‌కు హాజరయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ శనివారం కూడా కొనసాగనుంది. సోమవారం విశాఖ జిల్లా అండర్–23 జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ జట్టు 2025–26 సీజన్లో జరిగే వన్డే, మల్టీ–డే ఫార్మాట్ మ్యాచ్‌ల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎంపిక ప్రక్రియలో వయసు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆటగాళ్లను అనుమతించారు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ నైపుణ్యాల సెలెక్టర్లు నిశితంగా పరిశీలించారు. ప్రాబబుల్స్‌తో పాటు ఔత్సాహికులకు అవకాశం -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని వెంకయ్యపాలెం–చిలకలగెడ్డ మధ్యలో శుక్రవారం జరిగిన రోడ్ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మరణించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అందజేసిన వివరాలు.. ఎన్.ఆర్.పురం పంచాయతీలో వీఆర్ఏగా పనిచేస్తున్న జన్ని మచ్చయ్య (45) కె.లచ్చయ్యతో కలసి స్కూటీపై శృంగవరపుకోట వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా అరకు నుంచి వస్తున్న వాహనం వీరిని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో మచ్చయ్య స్పాట్లోనే మరణించారు. గాయపడిన లచ్చయ్యను శృంగవరపుకోటకు స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం లచ్చయ్యను విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. సంతల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుచేయాలి డుంబ్రిగుడ: గిరిజన ప్రాంతంలోని వారపు సంతల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి మండల కేంద్రంలోని వారపు సంతలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంతల్లో తాగునీటి సదుపాయం, సామాజిక మరుగుదొడ్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుచేయాలన్నారు. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి రైతుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేయాలన్నారు. రైతుల తమ సరకులను భద్రపరుచుకునేందుకు కోల్ట్ స్టోరేజీలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సంతలో రహదారి అధ్వానంగా ఉందని, బాగు చేయాలని కోరారు. నాయకులు సుబ్బారావు, అప్పారావు, గాసి తదితరులు పాల్గొన్నారు. -
టెండర్
ఈపీడీసీఎల్‌కు● సబ్ స్టేషన్లు పంచుకుంటున్నారు ● ఈపీడీసీఎల్ పరిధిలో సబ్ స్టేషన్ల నిర్మాణంలో హస్తలాఘవం ● మూడు సంస్థలకే అన్ని ప్యాకేజీల అప్పగింత సాక్షి, విశాఖపట్నం : ఆస్తులు పంచుకున్నట్లు.. ఈపీడీసీఎల్‌లో పనులు పంచేసుకుంటున్నారు. అధికారుల అండదండలతో ఈ భాగంలో పనులు నీకు.. ఆ భాగంలో నీకు.. అంటూ వాటాలు వేసుకుంటూ మరీ.. టెండర్ల ప్యాకేజీలు అప్పనంగా అప్పగించేస్తున్నారు. సర్కిల్ ఏదైనా ఎలాంటి సబ్‌స్టేషన్ అయినా ఆ మూడు సంస్థలకే పనులు కట్టబెట్టేలా విద్యుత్ శాఖ అధికారులు హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకసారి టెండర్ ధర కంటే లెస్‌కు వేస్తే మరోసారి అధికంగా వేస్తారు. అయినా వారికే కాంట్రాక్టులు కట్టబెడతారు. ఇటీవల దాదాపు 35 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులన్నీ మూడు కాంట్రాక్టు సంస్థల జేబుల్లోకే వెళ్లిపోయాయి. గత ఏడాది కాలంలో ఈపీడీసీఎల్ పరిధిలో 35 సెమీ ఇండోర్ సబ్ స్టేషన్లు, అవుట్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచారు. ఇక్కడే విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్కనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం సర్కిల్, విశాఖపట్నం (పాతసర్కిల్) పరిధిలో 3 సెమీ ఇండోర్ సబ్స్టేషన్లు, 6 అవుట్డోర్ సబ్స్టేషన్ల నిర్మాణంతో పాటు కనెక్టింగ్ లైన్స్, ఇంటర్ లింకింగ్ లైన్స్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. అదేవిధంగా పాత తూర్పుగోదావరి సర్కిల్ పరిఽధిలో 8 అవుట్ డోర్ సబ్స్టేషన్లు, 8 ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులకు, పాత పశ్చిమ గోదావరి సర్కిల్ పరిధిలో 5 అవుట్డోర్, 5 ఇండోర్ సబ్స్టేషన్లు, ఇతర పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. మొత్తం 35 సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల్ని మూడు ప్యాకేజీలుగా సర్కిళ్ల వారీగా విభజించారు. మీరు లెస్‌కు.. మేం ఎక్సెస్‌కు.. సదరు కాంట్రాక్టు సంస్థలు కూడా ఈ పనుల విషయంలో రింగ్‌గా వ్యవహరించినట్లు ఈపీడీసీఎల్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ప్రాంతంలో టెండరు విలువ కంటే తక్కువకు కోట్ చేస్తే.. మరో ప్రాంతంలో అధిక ధరకు టెండరు దాఖలు చేశారు. వారు ఎలా టెండర్ ఫైల్ చేసినా.. ఇవ్వాలన్నదే విద్యుత్ అధికారుల అంతిమ లక్ష్యంగా వ్యవహరించారని సమాచారం. విజయనగరం, విశాఖపట్నం సర్కిళ్ల పరిధిలో రూ.21.77 కోట్లకు టెండర్లు పిలవగా సదరు సంస్థ 1.31 శాతం అధికంగా రూ.22.06 కోట్లకు టెండర్ వేసింది. అయినా సదరు కాంట్రాక్టు సంస్థకే టెండరు దక్కింది. అదేవిధంగా పాత పశ్చిమ గోదావరి సర్కిల్ పరిధిలో రూ.16.42 కోట్లకు టెండర్లు పిలిస్తే 1.35 లెస్తో రూ.16.2 కోట్లతో టెండర్లు దాఖలు చేసిన సంస్థకు అప్పగించారు. 13.6 శాతం లెస్‌కు వేస్తే నాణ్యత ఎలా.? ఇక పాత ఈస్ట్‌గోదావరి సర్కిల్ పరిధిలో విచిత్రంగా తక్కువ ధరకే పనులు చేసేస్తామంటూ సదరు సంస్థ టెండరు దాఖలు చేసింది. ఈ సర్కిల్ పరిధిలో రూ.18.58 కోట్లకు టెండర్లు పిలిచారు. అయితే అధికారుల అనుయాయ కాంట్రాక్టు సంస్థ ఏకంగా 13.6 శాతం లెస్‌కు అంటే రూ.16.06 కోట్లకు టెండర్ ఫైల్ చేసింది. విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, కనెక్టింగ్ లైన్స్, ఇంటర్‌లింకింగ్ లైన్స్‌ని పూర్తి నాణ్యతతో నిర్మించాలి. కానీ సదరు సంస్థ 13.6 శాతం లెస్‌కు వేసినప్పుడు తక్కువ సొమ్ముతో నాణ్యమైన సబ్స్టేషన్లు నిర్మాణం ఎలా సాగుతుందన్న ఆలోచన విద్యుత్ శాఖ అధికారులకు వచ్చినా వాటన్నింటినీ పక్కనపెట్టేసి పనులు కట్టబెట్టెయ్యడం గమనార్హం. కాంట్రాక్టు సంస్థలకు విద్యుత్ శాఖ అధికారులు దాసోహం అన్నట్లుగానే విద్యుత్ శాఖ అధికారులు ఈపీడీసీఎల్ పరిధిలో ఏ భారీ టెండర్ అయినా.. సదరు మూడు సంస్థలకే ప్రథమ ప్రాధాన్యమిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్‌కి ఒక కాంట్రాక్టర్ చొప్పున.. సర్కిళ్ల వారీగా పిలిచిన ఈ పనులను ఈపీడీసీఎల్‌ను శాసిస్తున్న మూడు కాంట్రాక్టు సంస్థలకు వచ్చేలా టెండర్ల నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కాంట్రాక్టు సంస్థలు తమ క్వాలిఫికేషన్లకు అనుగుణంగానే టెండర్ల నిబంధనలు దగ్గరుండి మరీ తయారు చేసినట్లు తెలుస్తోంది. వారి అడుగులకు మడుగులొత్తే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారు. తాము ముందుగా అనుకున్నట్లుగానే టెండర్లను మూడు భాగాలుగా విభజించి ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో కాంట్రాక్టర్‌కు పంచేశారు. -
తాగునీటి సమస్యపై గ్రామాల్లో ఆందోళన
ముంచంగిపుట్టు: తాగునీటి సమస్యను తీర్చాలని ఖాళీ బిందెలతో మండలంలో గల కించాయిపుట్టు పంచాయతీ గుమ్మసిరగంపుట్టు గ్రామంలో శుక్రవారం గిరిజన మహిళలు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన దిగారు. గ్రామంలో నీటి కోసం కష్టాలు పడుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం.శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. ఆర్‌డబ్ల్యూస్ ఆధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మకై బిల్లులు మాత్రం మారుస్తున్నారని, నీటి పనులు మాత్రం పూర్తి కావడం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులకు ఊటనీరే దిక్కుగా మారుతుందని ఆవేదన చెందారు. కలుషిత నీటితో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి గుమ్మసిరగంపుట్టులో తాగునీటి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో మండల కేంద్రంలో మహిళలతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఎటపాక: వలస ఆదివాసీలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపాడు గ్రామంలో దశాబ్దాల కాలంగా వలస ఆదివాసీలు నివాసముంటున్నారు. అయితే గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. సోలార్ వాటర్ ట్యాంక్ మూలకు చేరింది. దీంతో తాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ నాయకుడు సాయన్న ఆధ్వర్యంలో గతంలో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. శుక్రవారం ఖాళీ బిందెలతో సోలార్ వాటర్ ట్యాంక్ వద్ద స్థానికులు నిరసన తెలిపారు. అధికారులు స్పందించి గ్రామానికి విద్యుత్, రహదారి సౌకర్యం కల్పించి నీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. భీమరాజు, శాంతమ్మ, పాలమ్మ, కన్నమ్మ, లక్ష్మి, సునీత, పావని, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
లోయలోకి దూసుకుపోయిన కారు
ముంచంగిపుట్టు: భూసిపుట్టు పంచాయతీ తుడుమురాయి గ్రామ సమీపంలో పర్యాటకుల కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. ముగ్గురు పర్యాటకులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు పెదబయలు మండలం తారాబు జలపాతం చూసేందుకు శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. తుడుమురాయి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. స్థానికులు హూటహూటిన ప్రమాదానికి గురైన ముగ్గురు యువకులను బయటకు తీశారు. స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతరం సంఘటన స్థలం నుంచి భయంతో ముగ్గురు పరారయ్యారు. కారు మాత్రం లోయలోనే ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.ముగ్గురు పర్యాటకులకు స్వల్ప గాయాలు -
ముత్యాలమ్మ ఉత్సవానికి ముహూర్తపు రాట
చింతపల్లి: మండల కేంద్రంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ ముత్యాలమ్మ తల్లి జాతర జరగనుంది. జాతరకు సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీ అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం వద్ద ముహుర్తపు రాట వేశారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్థలతో జరిగింది. ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్‌కుమార్, పసుపులేటి వినాయకరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనూషాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, భక్తులు పాల్గొన్నారు. జాతర విజయవంతానికి అందరూ అన్ని విధాలుగా సహకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. బేతాళుడు, జోగేశ్వరరావు, రమణమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు. -
కీ బోర్డుపై క్రీస్తు గీతాలు
–ఇద్దరు బాలలకు గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ మోతుగూడెం/ముంచంగిపుట్టు: హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రీస్తు గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొని ఇద్దరు బాలలు ప్రతిభ చూపారు. గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ సొంతం చేసుకున్నారు. కీబోర్డు వాయిస్తున్న సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేసింది. ఇందులో ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ మొంజాపుట్టు గ్రామానికి చెందిన గడుతుల కామేశ్వరరావు, పుష్పకళ దంపతుల కుమారుడు జాసన్ జోయెల్ అనే బాలుడు పాల్గొన్నాడు. చింతూరు మండలం మోతుగూడెం జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న వేముల ఇజ్రాయిల్ కూడా ప్రతిభ చూపాడు. గత ఏడాది డిసెంబర్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సంగీత కచేరీలో వీరు పాల్గొన్నారు. 18 దేశాలకు చెందిన వాయిద్య కళాకారులతో కలిసి పాల్గొని గంట వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
గుర్తేడుపై పోలీస్ గురి
రంపచోడవరం: అల్లూరి మన్యంలో పట్టు కోల్పోయిన మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. వై.రామవరం మండలంలో గుర్తేడు పోలీస్ స్టేషన్ మొదటి నుంచి మారేడుమిల్లిలోనే కొనసాగుతోంది. తాజాగా గుర్తేడులోనే తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పోలీసులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. గత 20 ఏళ్లుగా మారేడుమిల్లిలోనే కొనసాగుతున్న గుర్తేడు స్టేషన్‌ను ఒక్కసారిగా గుర్తేడులో ఏర్పాటు చేయడంతో ఏజెన్సీలో చర్చ జరుగుతోంది. దండకారణ్యంలో మావోయిస్టులపై నిర్బంధకాండ కొనసాగడంతో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. దీంతో ఇక్కడ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు గుర్తేడులో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి అక్కడ గిరిజనులు, యువతతో మమేకమయ్యారు. గుర్తేడులోనే రాత్రి బస చేశారు. 40 మంది మావోయిస్టుల సంచారం! ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో మావోయిస్టు కదలికలతో అల్లూరి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ పోలీసులు గుర్తేడు, పాతకోట, సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు కీలక నేత కాకూరి పండయ్య అలియస్ జగన్ గుర్తేడు, పాతకోట గ్రామాల్లో మోటార్ బైక్‌పై తిరిగినట్లు పోలీసుల వద్ద సమాచారముంది. పండయ్య ఈ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఎందుకొచ్చాడు, మావోల వ్యూహం ఏమిటనేది తెలుసుకునేందుకు పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. 40 మంది వరకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏవోబీ దళ డిప్యూటీ కమాండర్ రవి ఆధ్వర్యంలో ఒడిశా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కీలకమైన రోడ్డు పనులు పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో నిలిచిపోయిన పాతకోట–మంగంపాడు రోడ్డు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అలాగే పాతకోట– ధారకొండ రోడ్డు, వై.రామవరం– ఉప్పర గోతుల, మఠం భీమవరం రోడ్డు పనులను పూర్తి చేసి లోతట్టు ప్రాంతంలో గ్రామాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో సెల్ టవర్లు నిర్మించి సమాచార వ్యవస్థ బలోపేతం చేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి గిరిజన యువత మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై సర్వత్రా చర్చ అడవిని జల్లెడ పడుతున్న బలగాలు మావోయిస్టు కీలక నేత సంచారంపై అప్రమత్తమైన పోలీసులు -
గ్రామగ్రామానికీ వైద్య సేవలు అందాలి.. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి.. ముఖ్యంగా పేదలకు ఏ కష్టం రాకూడదు.. ఇదీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్ ఆశయం. జిల్లాలో 135 గ్రామ పంచాయతీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నెలకొల్పి, భవనాలు నిర్మ
పూర్తయిన భవనాలనుఅప్పగిస్తాం పూర్తయిన భవనాలను అప్పగించి విలేజ్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చేలా చూస్తాము. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న భవనాల నివేదికను ఉన్నతాధికారులకు పంపించాము. నిధులు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాము. –టి.కొండయ్య పడాల్,పీఆర్ ఈఈ, పాడేరు డివిజన్ ఉత్తమ ఆశయానికి గండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో విలేజ్ క్లినిక్‌లకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరకుండా చేస్తోంది. వెంటనే క్లినిక్ భవనాలకు నిధులు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి. – సిరగం భాగ్యవతి, వైస్ ఎంపీపీ, ముంచంగిపుట్టు మండలం నిధులు విడుదల చేయని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 135 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు మంజూరు నేటికీ నిర్మాణ దశలోనే 96 భవనాలు అందుబాటులోకి వస్తే గ్రామాల చెంతకే మెరుగైన వైద్యంముంచంగిపుట్టు: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం తగదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్ అనే కాన్సెప్ట్ గ్రామీణ ప్రజలకు వరం. రాజకీయాలకు అతీతంగా ఆ ఆశయాన్ని కొనసాగిస్తే కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ చంద్రబాబు సర్కారు ఆలోచన వేరే విధంగా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేసిన ముద్రను చెరిపేయాలన్నదే వారి ఉద్దేశం. నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న 30 భవనాలను కూడా ప్రారంభించడానికి మనసు రాలేదంటే ఇంకేమనుకోవాలి. ప్రస్తుతం విలేజ్ క్లినిక్‌లు సొంత గూడు లేక సబ్ సెంటర్లు, సచివాలయాల్లో మొక్కుబడిగా నడుస్తున్నాయి. ఎక్కడి పనులు అక్కడే జిల్లాలో 135 గ్రామ పంచాయతీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులు చేపట్టేందుకు ఒక్కో భవనానికి రూ.20 లక్షల 80 వేలు కేటాయించారు. రూ.28 కోట్ల 70 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి, అప్పట్లోనే రూ.12 కోట్ల 80 లక్షలు విడుదల చేశారు. 39 భవనాలు పూర్తయ్యాయి. 96 నిర్మాణ దశలో ఉండగా ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సుమారు రూ.16 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. అది జరగకపోవడంతో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవనాలు నిర్మాణ స్థాయిలోనే నిలిచిపోయాయి. పునాదులు, గోడలకే పరిమితమయ్యాయి. అధికారంలోకి వచ్చిన మూడు నెలలోనే అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవనాలు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా వాటి ఊసే లేదు. బిల్లులు విడుదల కాక నిలిచిన నిర్మాణాలు విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన పనులు బిల్లులు విడుదల కాకపోవడంతో నిలిచిపోయాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన భవనాలకు కూటమి ప్రభుత్వం ద్వారా బిల్లులు అందుతాయన్న నమ్మకం లేక కాంట్రాక్టర్లు గత 10 నెలలుగా పనులు చేయకుండా వదిలేశారు. కొన్నిచోట్ల దాదాపు పూర్తి చేసిన భవనాలకూ నిధులు విడుదల చేయలేదు. నిధులు అందిన తరువాతే భవనాలు అప్పగిస్తామని గుత్తేదారులు భవనాలకు తాళాలు వేసి కూర్చున్నారు. అప్పుడు కేటాయించిన నిధులు సరిపోవని, అప్పటితో పోలిస్తే సామగ్రి, ఇసుక, సిమెంట్, ఐరెన్ వంటి ధరలు అమాంతం పెరిగిపోయాయని, నిధులు పెంచాలని కొంతమంది కోరుతున్నారు.కుమడలో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని విలేజ్ హెల్త్ క్లినిక్ భవనంగ్రామీణ ప్రజలకు వరంవిలేజ్ హెల్త్ క్లినిక్ కలనిజం చేయాలి జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి వ్యాధులకు 10 కిలోమీటర్ల దూరంలో లబ్బూరు పీహెచ్‌సీకి వెళ్లడం కష్టంగా ఉంటుంది. కిలోమీటర్ దూరంలో బరడ పంచాయతీ కేంద్రంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటే సత్వర వైద్యం పొందవచ్చును. ముఖ్యంగా గర్భిణుల సాధారణ పరీక్షలకు వ్యయప్రయాసలు తగ్గుతాయి. –కోడా విక్రమ్, బలియగూడ గ్రామం, బరడ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం మండలాల వారీగా విలేజ్ హెల్త్ క్లినిక్‌ల వివరాలు అడ్డతీగల–9, అనంతగిరి–14, అరకువేలి–2, కూనవరం–1, కొయ్యూరు–13, జి.మాడుగల– 10, గంగవరం–4, గూడెం కొత్తవీధి– 10, చింతపల్లి–7, చింతూరు–5, డుంబ్రిగూడ–6, దేవీపట్నం–5, పాడేరు–3, పెదబయలు–6, మారేడుమిల్లి–5, ముంచంగిపుట్టు– 10, రంపచోడవరం–6, రాజవొమ్మంగి–5, వరరామచంద్రపురం–1, వై.రామవరం–4, హుకుంపేట–9 చొప్పున మొత్తం 135 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు మంజూరయ్యాయి. విలేజ్ హెల్త్ క్లినిక్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయి. పల్లెలోనే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, చికిత్స, కుటుంబ నియంత్ర సలహాలను అందిస్తారు. సాధారణ జ్వరం, జలుబు, బీపీ, సుగర్, ఇతర సాధారణ అనారోగ్యాలకు చికిత్స అందిస్తారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, చికిత్స ప్రారంభించి, అరికట్టడం జరుగుతుంది. సీహెచ్‌వో, సచివాలయాల ఏఎన్ఎం, ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్‌లో వైద్య సేవలు అందిస్తారు. క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. -
విద్యార్థి దశ నుంచేఉన్నత లక్ష్యాలు
చింతపల్లి: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అన్నారు. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 17 వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. కశాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.విజయభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సబ్‌కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలను, అలవాట్లను నిర్దేశించుకోవాలన్నారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసపాత్రుడు, అధ్యాపకులు లీలాపావని, కెజియారాణి, సంతోషిణి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● పాడేరును కుదిపేసిన భారీ వర్షం ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు ● జిల్లాలో పలుచోట్ల స్తంభించిన జనజీవనం ● విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం పాడేరు: జిల్లా అంతటా శుక్రవారం కుంభవృష్టి కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి భారీ నష్టం జరిగింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాడేరు పరిసర ప్రాంతాల్లో ఉదయం ఎండ చుర్రుమనిపించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే భారీ వర్షం కురిసింది. గాలులకు పట్టణంలో తలారిసింగి వద్ద భారీ వృక్షం నేలమట్టమైంది. పాడేరు–చోడవరం ప్రధాన రహదారి సాయిబాబా ఆలయం సమీపంలో మరో భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో అక్కడ నిలిపి ఉన్న స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. భారీ వృక్షం విద్యుత్ స్తంభాలు, తీగలపై పడింది. పాడేరు–జి.మాడుగుల ప్రధాన రహదారిపై డి.గొందూరు సమీపంలో భారీ మామిడి చెట్టు నేలపై కూలిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్‌ఆండ్‌బీ అధికారులు, స్థానికులు కలిసి చెట్లను తొలగించడంతో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. జిల్లాలో చాలాచోట్ల రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీకు అంతరాయం ఏర్పడింది. దీంతో సోంపేట, పాడేరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. శుక్రవారంనాటి వర్షాల వల్ల మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది. రహదారులను వర్షపు నీరు ముంచెత్తింది. డుంబ్రిగుడలోని పోతంగి పంచాయతీ చంపాపట్టి గ్రామంలో ఈదురుగాలులకు పాఠశాల పైకప్పు ఎగిరిపోయింది. కొయ్యూరు మండలంలోని నడింపాలెం రహదారికి అడ్డంగా భారీ వృక్షం పడిపోయింది. దీంతో నడింపాలెం–పెదమాకవరం రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గూడెం కొత్తవీధి రంపుల ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది. -
జాతీయ వర్క్‌షాపులో అరకు జెడ్పీటీసీ
అరకులోయ టౌన్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ హర్యానాలోని రోతాక్లో నిర్వహించిన రెసిడెన్షియల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వర్క్‌షాప్‌లో అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి పాల్గొన్నారు. ఐదు రోజులపాటు జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొని తిరిగి వచ్చిన జెడ్పీటీసీ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, రవాణా, పారిశుధ్యం తదితర అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించారన్నారు. తాను రోడ్లు, విద్య అంశాలపై నివేదిక ఇచ్చానని, ఈ రంగాల్లో అభివృద్ధికి పలు సూచనలు చేశానన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన అరకులోయ మండలం గన్నెల పంచాయతీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారుల గురించి తాను సమర్పించిన పత్రంలో పేర్కొన్నానని చెప్పారు. ఏజెన్సీలో ఇంకా చాలాచోట్ల విద్య, విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని చెబుతూ.. గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరినట్టు జెడ్పీటీసీ శెట్టి రోషిణి చెప్పారు. రాష్ట్రం నుంచి తనతోపాటు తిరుపతి జిల్లా తెల్లకూర్ జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, అధికారులు హాజరైనట్టు ఆమె వివరించారు. -
పాత గంగవరం తీరంలో విద్యార్థి గల్లంతు
పెదగంట్యాడ: పాత గంగవరం తీరంలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. శ్రీనగర్, గాజువాక చైతన్య టెక్నో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, గాజువాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులు. వీరందరూ కలసి మూడు సైకిళ్లపై గురువారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో పాత గంగవరం తీరానికి వెళ్లారు. అందరూ కలసి సముద్రంలో స్నానం చేసిన తర్వాత బయట వచ్చి ఇసుకలో ఆటలాడుతుండగా.. అందులో రోహిత్, భరత్, తనూష్ మళ్లీ సముద్రంలోకి వెళ్లారు. సరదాగా గడుపుతుండగా కెరటాల ఉధృతికి నడుపూరుకు చెందిన ఒనుం తనూష్(15) సముద్రంలోకి కొట్టుకొనిపోయాడు. విద్యార్థిని రక్షించేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న గాజువాక ఏసీపీ త్రినాథ్, న్యూపోర్టు పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. విద్యార్థి ఆచూకీ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. తనూష్ తండ్రి మంగరాజు ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీస్‌స్టేషన్ సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్యదర్శిపై చర్యలకు డిమాండ్
పెదబయలు: మండలంలోని గోమంగి గోమంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోజ్కుమార్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈవోపీఆర్డీ నర్సింగరావుకు ఉప సర్పంచ్ కూడ మత్స్యకొండబాబు, వైఎస్సార్సీపీ నాయకులు సత్తిబాబు, టీడీపీ నాయకుడు పురసకారి భాస్కరరావు తదితరులు గురువారం వినతిపత్రం అందజేశారు. గత రెండు నెల నుంచి కార్యదర్శి విధులకు గైర్హాజరమవుతున్నారని అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అతని స్థానంలో మరో కార్యదర్శిని నియమించాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం కావాలి
● పెట్రోల్ బాటిల్‌తో సెల్ టవర్ ఎక్కిన ‘రెవెన్యూ’ బాధితుడు ● అన్యాయంగా తన స్థలం వేరొకరి పేరుతో రిజిస్టర్ చేశారని ఆవేదన ● పదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపణ ● రెవెన్యూ అధికారుల హామీతో శాంతించిన శంకర్రావుఅచ్యుతాపురం రూరల్: కొంతమంది ప్రభుత్వ అధికారుల స్వార్థం వల్ల ఎన్నో నిండు జీవితాలు రోడ్డున పడుతున్నాయని లంక ధర్మవరం గ్రామానికి చెందిన లంక హరినాగ శంకర్రావు ఆవేదన చెందాడు. తరతరాలుగా అదే ఇంట్లో ఉంటూ.. తమ పొలాల్లో సాగు చేసుకుంటూ జీవనం గడిపే సమయంలో ఒక్కసారిగా.. ఇది మీ భూమి కాదు, మీరు నివసిస్తున్న ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.. అనడంతో తనకు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి నెలకొందని శంకర్రావు వాపోయాడు. తన స్థలం మరొకరి పేరిట రిజిస్టర్ చేశారు, న్యాయం చేయమని పది సంవత్సరాలుగా నాయకులు, అధికారుల వద్దకు తిరిగి అలసి విసుగు చెంది తనకు న్యాయం జరగదని భావించిన శంకర్రావు గురువారం ఉదయం అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలియజేశాడు. తనతోపాటు పెట్రోల్ బాటిల్, లైటర్ తీసుకువెళ్లి కాల్చుకొని మరణిస్తానని బెదిరించాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ఫోన్ చేసి మాట్లాడగా అధికారులు ఇచ్చిన హామీ మేరకు సెల్‌ఫోన్ టవర్ దిగాడు. అనంతరం తహసీల్దార్ లంక ధర్మవరం గ్రామానికి చేరుకుని తగాదాల్లో ఉన్న భూములపై విచారణ చేపట్టారు. భూ రికార్డులు తారుమారు చేసిన అప్పటి తహసీల్దార్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కన్వీనర్ రొంగలి రాము డిమాండ్ చేశారు. ఇటువంటి అనేక భూ సమస్యలు మండలంలో కోకొల్లలుగా ఉన్నా అధికారులెవరూ పట్టించుకోవట్లేదన్నారు. -
ఐజీ శ్రీనివాస్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
ఆరిలోవ: విశాలాక్షినగర్ కేంద్రంగా ఉన్న కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) ఆరాధ్యుల శ్రీనివాస్ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ పతకం అందుకున్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన సీఆర్పీఎఫ్ 86వ వార్షికోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ఆయన ఈ పతకం స్వీకరించారు. 34 ఏళ్లుగా శ్రీనివాస్ అందిస్తున్న సేవలు, ఆయన నాయకత్వ పటిమ, నిబద్ధత, దేశ భద్రతకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. స్థానికుడైన ఐజీ శ్రీనివాస్‌కు ఈ పురస్కారం లభించడం పట్ల సీఆర్పీఎఫ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆగని మృత్యుఘోష
కై లాసపట్నం పేలుడులో గాయపడిన మరొకరు మృతి కోటవురట్ల: బాణసంచా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. కై లాసపట్నంలోని విజయలక్ష్మి గణేష్ ఫైర్ క్రాకర్స్‌లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అందులో రాట్నాలపాలేనికి చెందిన జల్లూరి నాగరాజు (50) 90 శాతం కాలిన గాయాలతో విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా మెడికవర్‌లో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి గణేష్ క్రాకర్స్ మేనేజర్ మడగల జానకీరాం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మిన్నంటిన రోదనలు నాగరాజు మృతదేహం విశాఖ నుంచి కోటవురట్ల శివారు రాట్నాలపాలేనికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంది. ఉదయమే నాగరాజు మృతి చెందిన సంగతి గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలముకున్నాయి. వివాద రహితుడు, అందరితో మంచిగా తిరిగే నాగరాజు మృతి అందరినీ కన్నీరుపెట్టించింది. భార్యా పిల్లలు గుండెలవిసేలా రోదించారు. వారిని ఆపడం ఎవరితరం కాలేదు. మృతుడు నాగరాజుకు భార్య అప్పలనర్స, కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె మౌనిక ఉన్నారు. కన్నీటి రోదనల మధ్య నాగరాజు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. -
తీర్మానాలు లేకుండా ఏ పనులు చేయకూడదు
ఎమ్మెల్సీ అనంతబాబురంపచోడవరం: తీర్మానాలు లేకుండా ఏ విధమైన పనులు చేయకూడదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. రంపచోడవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బందం శ్రీదేవి అధ్యక్షతన గురువారం జరిగింది. సమావేశంలో జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అన్ని శాఖల పనితీరుపై ఎమ్మెల్సీ సమీక్షించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రారంభోత్సవాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి జరిగే మండల పరిషత్ సమావేశానికి అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. ఈ సమవేశంలో చర్చించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ పండా కుమారి, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, తుర్రం వెంకటేశ్వర్లుదొర, కుంజం వంశీ, నర్రి పాపారావు,కృష్ణకుమారి, ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు. -
సారా బట్టీలపై దాడి–ఇద్దరి అరెస్టు
● 1600 లీటర్ల బెల్లపు పులుపు ధ్వంసం అడ్డతీగల: మండలం కిమ్మూరు సమీపాన సారా బట్టీపై గురువారం దాడులు నిర్వహించి 1600 లీటర్లు బెల్లపు పులుపుని ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సిఐ శ్రీధర్ తెలిపారు. దాడిలో సంఘటనా స్థలం నుంచి 30 లీటర్లు సారా స్వాధీనం చేసుకొని, ఇద్దరు సారా తయారీదారులను అరెస్ట్ చేశామన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించామన్నారు. సారా తయారీ, క్రయ,విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీధర్ హెచ్చరించారు. సారాపై ఎటువంటి సమాచారం ఇచ్చినా గోప్యంగా ఉంచి నిరోధానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. -
సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలా?
డాబాగార్డెన్స్: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఓ జడ్జి ఇంట్లో రూ.500 కోట్ల నల్లధనం దొరికితే చిన్న కేసు కూడా పెట్టలేని ప్రధాని మోదీ, అమిత్‌షా ఏం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు. విశాఖలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చింతా మాట్లాడుతూ మాజీ సీఎం ఇంట్లో రూ.5 లక్షలు కనిపిస్తే పట్టుకుని, జడ్జి ఇంట్లో రూ.500 కోట్లు కనిపిస్తే ఈ రోజు దాకా కేసు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఓ జడ్జిని కలిసేందుకు ఎవరు వెళ్లినా.. వాటర్ బాటిల్‌ను కూడా స్క్రీనింగ్ చేస్తారని.. అలాంటిది అంత డబ్బు జడ్జి ఇంట్లోకి ఎలా చేరిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డు ఆస్తులపై వాదనలు విన్న తర్వాత, భారత రాజ్యాంగం అంటే ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలియదనిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మామూలు వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో వర్గీకరణ విషయానికొస్తే మాల, మాదిగల గూర్చి చంద్రబాబు చాలా బాధతో ఉపన్యాసం ఇచ్చారని, మైన్స్‌లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్లో కూడా వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ కేసులు దారుణమని, దాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియాతో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ -
స్టార్ రేటెడ్తోనే ఇంధన పొదుపు, కాలుష్య నివారణ
ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ చంద్రంసాక్షి, విశాఖపట్నం : భారత ప్రమాణాల బ్యూరో(బీఈఈ) సూచించిన స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాల వినియోగంతో ఇంధన పొదుపుతో పాటు కర్బన ఉద్గారాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్) చంద్రం అన్నారు. డిస్కమ్‌ల సామర్థ్య నిర్మాణం, డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన సామర్థ్య నిర్వహణ(డీఎస్ఎం) అంశంపై నగరంలోని ఓ హోటల్లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈపీడీసీఎల్, బీఈఈ, ఐసీఎఫ్ సహకారంతో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డీఎస్ఎంకి ఉపయుక్తమయ్యే విధానాలపై చర్చించారు. బీఈఈ, ఐసీఎఫ్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం తగ్గించడమే లక్ష్యంగా గృహ విద్యుత్ పరికరాలను ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ చంద్రం మాట్లాడుతూ డీఎస్ఎం సూచించిన పరికరాలను వినియోగిస్తే విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చన్నారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఓఎస్డీ శివరామ్‌కుమార్ మాట్లాడుతూ విశాఖలో ప్రారంభించిన కార్యక్రమం ఏపీ, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లోని డిస్కమ్‌లలోనూ సాగుతుందన్నారు. గృహ విద్యుత్ రంగంలో 10 లక్షల ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 8 లక్షల బీఎల్డీసీ ఫ్యాన్ల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐసీఎఫ్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్లిమిటెడ్ ఎండీ గురుప్రీత్ చుగ్ తెలిపారు. వాణిజ్య రంగంలో 4 లక్షల ట్యూబ్‌లైట్లు, 1.6 లక్షల ఫ్యాన్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈపీడీసీఎల్ ఎనర్జీ కన్జర్వేషన్ సోలార్ ఎనర్జీ సీజీఎం శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో బీఈఈ, ఈపీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. -
అనంతగిరి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు
అనంతగిరి(అరకులోయటౌన్): అనంతగిరి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను ఈ గుర్తింపు లభించినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వరి తెలిపారు. గత నెల 24న నేషనల్ క్యాలిటీ అస్యూరెన్స్ స్టాండర్ట్స్ బృందం పీహెచ్‌సీని సందర్శించినట్టు ఆమె చెప్పారు.గత ప్రభు త్వ హయాంలో నాడు– నేడు పథకం ద్వారా పీహెచ్‌సీని ఆధునికీకరించగా, ఆస్పత్రి డెవలప్మెంట్ ఫండ్‌తోపాటు మండల పరిషత్ నిధులు కేటాయించి ఎన్‌క్యూఏఎస్ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్‌సీని తీర్చిదిద్దడంతో ఈ గుర్తిపు లభించినట్టు ఆమె తెలిపారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని, తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎంపీపీ శెట్టి నీలవేణి తెలిపారు. -
చికెన్‌తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ
అడ్డతీగల: చికెన్‌తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గిరిజన మహిళలకు హీపర్ ఇంటర్నేషనల్,నవజీవన్ సంస్థలు సంయుక్తంగా శిక్షణ ఇచ్చాయి. అడ్డతీగల మండలం రేగులపాడులో సోమన్నపాలెం,రేగులపాడు గ్రామాలకు చెందిన గిరిజన మహిళలకు హీపర్ ఇంటర్నేషనల్ రంపచోడవరం డివిజన్ ప్రాజెక్ట్ అధికారి సునీత గురువారం శిక్షణ ఇచ్చారు. చికెన్ పచ్చడి తయారీ,మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.చికెన్ పచ్చడి తయారు చేసిన తరువాత మూడు నెలల పాటు నిల్వ ఉంటుందన్నారు. సంఘంగా ఏర్పడి బయట ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తే వ్యాపారం బాగా సాగుతుందన్నారు. -
భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం
పాడేరు: జిల్లాలో భూ సమస్యలను ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సమస్యలపై గురువారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులు ఇప్పటికీ పూరిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలపై సీఎం దృష్టి సారించారని చెప్పారు. రెవెన్యూ అధికారులు గుర్తించిన సమస్యలను కేటగిరీల వారీగా విభజించి, నిబంధనల మేరకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఆర్వోఆర్, ఇనాం భూముల భూ స్థిరీకరణ, రీ సర్వే తదితర సమస్యలపై ఆన్లైన్, ఆఫ్లైన్లలో తేడాలను సరిచేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మాలత, ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం పెరగాలి పాడేరు : జిల్లా అభివృద్ధిలో లాభాపేక్షలేని సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని కలెక్టర్, జిల్లా లాభాపేక్షలేని సంస్థల ఫోరం చైర్మన్ దినేష్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా లాభాపేక్ష లేని సంస్థల ఫోరం మొదటి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం లాభాపేక్ష లేని సంస్థల సహకారం పెరగాలన్నారు. జిల్లా స్థాయి ఫోరంతో పాటు ఎంపీడీవో నోడల్ అధికారిగా వివిధ సంస్థల సహకారంతో మండల స్థాయి ఫోరాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయన లాభాపేక్ష లేని సంస్థల ప్రజెంటేషన్‌ను వీక్షించారు. సుమారు పది సంస్థలు చేస్తున్న, చేయబోతున్న కార్యకలాపాలను ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ డబ్ల్యూ ఇన్చార్జి పీఎస్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఈవో బ్రహ్మాజీరావు, డీడబ్ల్యూ డీడీ రజనీ, స్కిల్ డెవలెప్మెంట్ అధికారి రోహిణి, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డ్వామా పీడీ విద్యసాగర్, నీతి ఆయోగ్ ప్రతినిధులు నారాయణరెడ్డి, చైతన్యరెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్‌కుమార్ -
కిశోర బాలికలు క్రమశిక్షణతో మెలగాలి
గంగవరం : కిశోర బాలికలు క్రమ శిక్షణతో మెలగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో పీవో కట్టా సింహాచలం అన్నారు. సీడీపీవో సీహెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో కొత్తాడ కేజీబీవీలో కిషోర బాలికలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీవో మాట్లాడుతూ టీనేజ్‌లో గర్భం ధరించడం వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా కస్తూర్భా గాంధీబాలికా విద్యాలయంలో ఉన్న సమస్యల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సీడీపీవో లక్ష్మి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మల్లేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతి, ఇన్చార్జి హెచ్ఎం భారతి, మహిళా సంరక్షణ కార్యదర్శులు వెంకటలక్ష్మి, భద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలబాలికలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. గురువారం కొత్తాడ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీడీపీవో సీహెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో కొత్తాడ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్న పీవో ప్రీస్కూల్ పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం గర్భిణులు, తల్లులతో మాట్లాడి పోషకాహారం సక్రమంగా అందుతుందో, లేదో అడిగి తెలుసుకున్నారు. బాలసంజీవని, బాలామృతం కిట్లను పరిశీలించారు. సంతృప్తికరంగా సేలందిస్తున్న కొత్తాడ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త శిరీష పీవో అభినందించారు. సీడీపీవో లక్ష్మి, ఎంఈవో మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూపర్ వైజర్ సత్యవతి, అంగన్వాడీ కార్యకర్తలు శిరీష, జ్యోతి, సీతారామలక్ష్మి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పైసా వసూల్
అటవీ శాఖ..మారేడుమిల్లి, తులసిపాకలులో ఫారెస్ట్ చెక్ పోస్టుల ఏర్పాటు వాహనాలు, పర్యాటకుల నుంచి ఇష్టానుసారంగా డబ్బుల వసూళ్లు చార్జీల వసూలు తగదంటున్న పర్యాటకులు రంపచోడవరం: పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదం మాటున అడ్డగోలు నిబంధనలతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ వాహనచోదకులు, పర్యాటకుల నుంచి అటవీశాఖ రుసుం వసూలు చేస్తోంది. ఏజెన్సీ అందాలు చూసేందుకు వచ్చిన సందర్శకుల నుంచి నాలుగు నెలలుగా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు స్థానిక గిరిజనులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వదలిపెడుతున్నారని, వాటిని తొలగించడం కోసమే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, డబ్బులు వసూలు చేస్తున్నామని అటవీ అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల నుంచీ రుసుం వసూలు పాపికొండలు అభయారణ్యం పరిధిలో ఎన్విరాన్మెంట్ మెంటైనెన్స్ చార్జీలుకు అటవీ శాఖ అధికారులు మారేడుమిల్లి, తులసిపాకలు వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో ప్రవేశించిన వారి నుంచి ఈ చెక్‌పోస్టుల ద్వారా నగదు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల నుంచి రూ.20, భారీ వాహనాల నుంచి రూ.100, అతి భారీ వాహనాల నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. అలాగే పర్యాటకులు డిజిటల్, ప్రొఫెషనల్ కెమెరాలు వెంట తీసుకువెళితే రూ.500 చెల్లించాలి, ఎన్విరాన్మెంట్ మెంటైనెన్స్ చార్జీ జరిమానా కింద రూ.500 వసూలు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తమకు నచ్చిన విధంగా చార్జీలు నిర్ణయించారని, ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్లేందుకు మేం ఎందుకు డబ్బులు కట్టాలని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా మారేడుమిల్లి ఏజెన్సీలో అటవీశాఖ అధికారులు ఇలాంటి నిబంధనలు పెట్టడం తగదంటున్నారు. అన్నింటికీ అధిక ధరలు మారేడుమిల్లిలో అన్ని వస్తువులు బయట ప్రాంతం కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.వాటర్ బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులపై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు.ఇక పర్యాటక అతిథి గృహాలకు డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయించి, సందర్శకులను అడ్డుగోలుగా దోచుకుంటున్నారని పర్యాటకులు వాపోతున్నారు. అటవీ శాఖ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం పేరుతో పర్యాటక అతిథి గృహాలను నిర్వహిస్తోంది. అయితే ఎంతో కాలంగా సీబీఈటీలో అడిట్ నిర్వహించలేదు. వచ్చిన డబ్బులు దేనికి ఖర్చు చేస్తున్నారు, పర్యాటక అభివృద్ధికి ఏం చేస్తున్నారు వంటి వివరాలు అటవీ శాఖ వద్ద లేవు. పర్యాటకుల నుంచి వివిధ చార్జీలు, సౌకర్యాల కల్పన రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న అటవీ శాఖ ఏజెన్సీ ప్రాంభం నుంచి మారేడుమిల్లి వరకు మహిళల కోసం పబ్లిక్ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. గుడిసెకు వెళ్లే పర్యాటకుల నుంచి వసూలు చేసిన డబ్బులకు ఇప్పటికీ లెక్కాపత్రం లేదనే విమర్శలు ఉన్నాయి.డబ్బుల వసూలు అన్యాయం ఏజెన్సీప్రాంతానికి వచ్చిన పర్యాటకుల నుంచి ఎడపెడా డబ్బులు వసూలు చేస్తున్నారు. చెక్‌పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేయడం అన్యాయం. గుడిసె సందర్శ కులు, అతిథి గృహాల ద్వారా వచ్చిన డబ్బులకు నేటికీ సరైన లెక్కలు లేవు.పబ్లిక్ అడిట్ పెట్టి లెక్కలు తేల్చాలి. అటవీ శాఖ నిర్వహిస్తున్న అతిథి గృహాలను తక్కు వ ధరకు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలి. – దూడ స్మిత్, మారేడుమిల్లి ప్లాస్టిక్ ఏరివేతకుఉపయోగిస్తున్నాం పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ సీసాలు, కవర్లు ఏరివేసేందుకు చెక్‌పోస్టులు ద్వారా వచ్చిన డబ్బులు వినియోగిస్తున్నాం.సేకరించిన ప్లాస్టిక్‌ను రంపచోడవరంలోని ప్లాస్టిక్ కోనుగోలు చేసే వారికి పంపుతున్నాం. – ఏడుకొండలు, రేంజర్, మారేడుమిల్లి -
వ్యవసాయంలో గిరి మహిళల పాత్ర కీలకం
చింతపల్లి: వ్యవసాయంలో గిరి మహిళల పాత్ర చాలా కీలకమని, వ్యవసాయ పనుల ప్రారంభం నుంచి మార్కెటింగ్ వరకు వారికి భాగస్వామ్యం కల్పిస్తే మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని మండల ఉద్యానవనశాఖాధికారి కంఠా బాలకర్ణ అన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో డిజిటల్ గ్రీన్, విజయవాహిని, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)ఆధ్వర్యంలో గిరి మహిళా రైతులతో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సాగులో భాగస్వామ్యం వహిస్తున్న గిరి మహిళలను కూడా రైతులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యవసాయంలో అందిస్తున్న సాంకేతికపై గిరి మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 60మంది మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. డిజిటల్ గ్రీన్ ప్రతినిధి రేఖ,ఐఐఎంఆర్ ప్రతినిధి అప్పలరాజు పాల్గొన్నారు.మండల ఉద్యానవనశాఖాధికారి కంఠా బాలకర్ణ -
28 నుంచి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె
పెదబయలు: తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకుల (ఫీల్డ్ అసిస్టెంట్ల) సంఘం నాయకులు కూడ రాజారావు, కొండలరావు తెలిపారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఈవోపీఆర్డీ నర్సింగరావుకు వారు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2016 నుంచి 2025 సంవత్సరం వరకు 9 ఏళ్ల పాటు ఒక్క వేతనం రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కనీస వేతనాల పెంపు విషయం ప్రస్తావిస్తారని భావించామని, నిరాశే ఎదురైందని వారు చెప్పారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, భౌతికదాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, మండల యూనిట్‌గా అంతర్గత బదిలీలు చేయడం ద్వారా స్థానిక ఒత్తిడులను అధిగమించి సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, మరణ పరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలని, విద్యార్హత ఆధారంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని తెలిపారు. ఈ నెల 21న పెన్ డౌన్ చేస్తామని, 28వ తేదీ నుంచి పూర్తిగా విధులను బహిష్కరిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతా కొండలరావు, ప్రసాదరావు, సుశీల, పార్వతి, బాలన్న, తదితరులు పాల్గొన్నారు. ఈవోపీఆర్డీకి నోటీసు అందజేత వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ -
సాగునీటి వనరులపై గణన
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో రైతులకు అందుబాటులో ఉన్న సూక్ష్మ నీటిపారుదల వనరుల గణన నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉప గణాంకాల అధికారి(డీఎస్వో)రాజేశ్వరి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ రెవెన్యూ అధికారులు, అసిస్టెంట్ వీఆర్వోలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో రైతులకు వ్యవసాయానికి అందుబాటులో ఉన్న సూక్ష్మ నీటిపారుదల వనరులను గుర్తించాలన్నారు.ప్రధానంగా చెరువులు,చెక్‌డ్యాంలు, జలాశయాలు తదితర నీటిపారుదల సౌకర్యాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని తెలిపారు.ఆ ప్రణాళిక నివేదికను సకాలంలో అందజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్వో జి.రాంబాబు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు ఏ కష్టం రానివ్వం
రంపచోడవరం: నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తమదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రంపచోడవరం మండలం వెలమలకోటలో గురువారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మిర్చీకి గిట్టుధర కల్పించి, క్వింటాకు రూ.23 వేలు చెల్లిస్తే, కూటమి ప్రభుత్వం రూ.11వేలు నిర్ణయించిందని, దీంతో విలీన మండలాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు అవస్థలకు గురవుతున్నారని, కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏజెన్సీలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి,వైస్‌ఎంపీపీ పండా కుమారి, నాయకులు జల్లేపల్లి రామన్నదొర, పండా రామకృష్ణదొర,రాపాక సుదీర్‌కుమార్, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, సర్పంచ్‌లు మంగా బొజ్జయ్య, వడగల ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి -
362 కిలోల గంజాయి స్వాధీనం
● జీపు సీజ్, ఒకరి అరెస్ట్ పాడేరు : గుత్తులపుట్టు–పెదబయలు మార్గంలో పాడేరు ఎకై ్సజ్ సిబ్బంది ఓ జీపులోంచి 362 కిలోల ఎండు గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఎన్. ఆచారి తెలిపిన వివరాలిలా ఉన్నాయి...ముందస్తు సమాచారం మేరకు గుత్తులపుట్టు–పెదబయలు మార్గంలో ఎకై ్సజ్ సిబ్బంది పెట్రోలింగ్ చేశారు. ఆ సమయంలో వచ్చిన జీపును ఆపగా, అందులో ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి పరారయ్యాడు. జీపులో ఉన్న కిముడు దివాకర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, విచారించినట్టు ఎకై ్సజ్ సీఐ చెప్పారు. పరారైన వ్యక్తి పెదబయలు మండలం అరడకోట గ్రామానికి చెందిన కిముడు అనిల్ అని తెలిసిందన్నారు. భోగంపుట్టు గ్రామానికి చెందిన అల్లంగి భగవాన్ అనే వ్యక్తి నుంచి గంజాయి తీసుకొని వస్తుండగా కిముడు అనిల్ పారిపోయాడన్నారు. గంజాయి తరలించేందుకు వినియోగించిన జీపు వంతాల ప్రభాకర్దిగా తేలిందన్నారు. 362 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని జీపును సీజ్ చేశామన్నారు. ఈ గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న, పరారీలో ఉన్న వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ టాస్క్‌పోర్స్ సీఐలు బాల నరసింహ, భాను సత్యనారాయణ, సిబ్బంది తాతయ్య, రాజ్‌కుమార్, పూర్ణ చంద్రరావు, బాలమురళి పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు
ఐటీడీఏ పీవో సింహాచలంరంపచోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. విద్యాశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలన్నారు. ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టి, ఎప్పటికప్పుడు సామర్థ్యాలను పరీక్షించాలని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానంపై దృష్టి పెట్టాలన్నారు. అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రైమరీ, అక్కడ నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల జాబితా రూపొందించాలని, జాబితాలో ఉన్న విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారో వివరాలు సేకరించాలని చెప్పారు. జెడ్పీ పాఠశాలల్లో మౌలిక వసతులపై సమీక్షించారు. ఐదు, పది తరగతుల విద్యార్థులు డ్రాప్ అవుట్ పై ఆరా తీశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి వంటి వివరాలు తెలుసుకున్నారు. ఏకలవ్య,గురుకుల పాఠశాలల్లో నూరుశాతం సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్ష నిర్వహించాలన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు రాసేందుకు ప్రత్యేక శిక్షణ కోసం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఇంటర్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. సమావేశంలో డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
గంగవరం: కార్యకర్తలకు అండగా ఉంటామని, అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (బాబు), వైఎస్సార్ సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయ ఆవరణలో పార్టీ మండల కన్వీనర్ అమృత అప్పలరాజు అధ్యక్షతన బుధవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని చెప్పారు.గడిచిన ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం పేదప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమా లను అమలు చేసినా కూటమి బూటకపు హామీలను ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయలేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ పేదలు, రైతుల సంక్షే మం కోసం మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బేబీ రత్నం, వైస్ ఎంపీపీలు గంగాదేవి, రామతులసి, నియోజ కవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాష్, పార్టీ నాయకులు యెజ్జు వెంకటేశ్వరరావు, సిద్ధార్థ దొర, కామరాజు దొర ప్రసంగించారు. ఎంపీటీసీ సభ్యులు కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, పద్మావతి, కోఆప్షన్‌సభ్యుడు ప్రభాకర్, పార్టీ జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, సర్పంచ్‌లు కామరాజు, లక్ష్మి, రమణమ్మ, శివ, రామలక్ష్మి, మరడిమ్మ, వెంకటేశ్వర్లు, లీలావతి, మండల ఇన్చార్జ్ సీహెచ్.రఘునాఽథ పాల్గొన్నారు. ● వైఎస్సార్ సీపీ గంగవరం మండల అధ్యక్షుడిగా డీసీసీబీ మాజీ డైరెక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావును ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పార్టీ కండువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి -
సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
జిల్లా సేంద్రియ వ్యవసాయ శాఖ మేనేజర్ రామ్మోహనరావుముంచంగిపుట్టు: గిరిజన రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని జిల్లా సేంద్రియ వ్యవసాయ మేనేజర్ రామ్మోహనరావు అన్నారు. సేంద్రియ వ్యవసాయ విస్తరణలో భాగంగా మండలంలోని ఏనుగురాయి పంచాయతీ కొండపడలో బుధవారం రైతులతో పొలంలో నవధాన్యాలను జల్లించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం దొడిపుట్టు పంచాయతీలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయంపై గిరిజన రైతులతో అవగాహన ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా రామ్మోహనరావు మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు సేంద్రియ వ్యవసాయ మేనేజర్ భాస్కరరావు,మండల వ్యవసాయాధికారి ఎం.శ్రీనివాసబాబు, సేంద్రియ వ్యవసాయ మండల కోఆర్డినేటర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.సమతా ఎక్స్‌ప్రెస్ రద్దు తాటిచెట్లపాలెం(విశాఖ): నాగ్‌పూర్ డివిజన్ పరిధి రునిజా–కలమ్మ స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైన్ సంబంఽధిత ప్రి నాన్ ఇంటర్ లాకింగ్, నాన్–ఇంటర్ లాకింగ్ పనుల నిమత్తం ఆయా తేదీల్లో సమతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 30, మే 3, 5, 6, 8వ తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో హజరత్ నిజాముద్దీన్‌లో మే 2, 3, 5, 6, 8వ తేదీల్లో బయల్దేరే హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం (12808) సమ తా ఎక్స్‌ప్రెస్‌లు రద్దయినట్లుపేర్కొన్నారు. -
పెదబొడ్డేపల్లిలో మూడు చోరీలు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ 11వ వార్డు పెదబొడ్డేపల్లి థెరిస్సా కాలనీలోనే మంగళవారం రాత్రి ఈ మూడు చోరీలు జరగడం విశేషం. ఎం.సత్యసారథి తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఈ నెల 13న విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రి తీసుకువెళ్లాడు ఇంటి వద్ద ఎవరూ లేరని గమనించిన దొంగలు ఇంట్లో ప్రవేశించి ఏడు తులాల బంగారు ఆభరణాలు, రూ.2 వేలు నగదు పట్టుకుపోయారు. ఇంటి తలుపులు తీసి ఉండడంతో ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు సారధికి సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు కూతవేటు దూరంలోని బత్తిన రామకృష్ణ ఇంట్లో కూడా దొంగతనం చోటుచేసుకుంది. రామకృష్ణ పూడిమడక వద్ద నిర్మితమవుతున్న పోర్టులో విధులకు వెళ్లగా, అతని భార్య భవాని పాపను తీసుకుని అమ్మ గారు ఊరులో జరుగుతున్న పండగకు వెళ్లింది. దీంతో ఆ ఇంట్లో దొంగలు ప్రవేశించి రెండు తులాలు బంగారు అభరణాలు, 25 తులాలు వెండి అభరణాలు అపహరించారు. తలుపులు తీసి ఉండడంతో ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో భవాని హుటాహుటిన ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఇక్కడకు మరికొంత దూరంలో ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టులో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న అడిగర్ల శ్రీరామమ్మూర్తి ఇంట్లో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. విధి నిర్వహణలో భాగంగా శ్రీరామమ్మూర్తి భార్యతో విశాఖలో ఉంటున్నారు. ఇంటికి సీసీ కెమెరాలు పెట్టి సెల్‌కు వైపై కనెక్షన్ ఇచ్చారు. రాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించడం వైఫైలో హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు శ్రీరామమ్మూర్తికి సమాచారం అందించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంట్లోని ఆరు తులాలు వెండి అభరణాలు చోరీ అయ్యాయి. ఒకే ఏరియాలో ప్లాన్ ప్రకారం దొంగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. ఫిర్యాదులు అందుకున్న పట్టణ సీఐ గోవిందరావు, క్లూస్ టీమ్ సిబ్బందితో ఆనవాళ్లు సేకరించారు. వరుస దొంగతనాలతో థెరిస్సా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
మహారాణిపేట(విశాఖ): రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ సర్వేపై గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో ఎక్కువగా ఆర్వోఆర్, రీసర్వే, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, 22ఎ తొలగింపులు, ఇళ్ల స్థలాల మంజూరు కోసం దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ మంత్రికి వివరించారు. విశాఖలో 22ఎ లో ఇళ్లు ఎక్కువగా ఉన్నాయని, ఈ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, పరిష్కరానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు శ్రీలేఖ, సంగీత్ మహదూర్, మండల రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
పట్టపగలే చుక్కలు చూపిస్తారు..
అనకాపల్లి: సాధారణంగా రాత్రి పూట దొంగతనాలు చేస్తారు.. అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఎవరికీ కనబడకుండా పని కానిచ్చేస్తారు.. కానీ ఈ ముఠా మాత్రం ఎంచక్కా పగలే చోరీలు చేస్తారు.. గుట్టుచప్పుడు కాకుండా, పక్కింటికి కూడా తెలీకుండా ఇళ్లు దోచేస్తారు.. అదీ వారి ప్రత్యేకత. వారి పనితనం చూసి పోలీసులే విస్తుపోయారు. ఎస్పీ తుహిన్ సిన్హా తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులకు చిక్కిన ఈ ముఠా వివరాలు వెల్లడించారు. ఈ బృందంలో ఒక బాలుడితో సహా ఆరుగురు ఉన్నారు. అందరూ దగ్గరి బంధువులే. వీరు 2023 నుంచి ఇంతవరకు మొత్తం 21 దొంగతనాల్లో పాల్గొన్నారు. వీరి నుంచి 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి వస్తువులు, రూ.15 వేల నగదును కోటవురట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటవురట్ల మండలం రాజుపేట గ్రామానికి చెందిన పొలమరశెట్టి దుర్గాప్రసాద్, భీశెట్టి లోకేష్, యల్లపు భూపతి, మడుతూరి సూర్య, మునగపాక మండలం జంగాలవీధికి చెందిన దొడ్డి ఆదిబాబుతో పాటు కోటవురట్ల మండలానికి చెందిన ఒక బాలుడు ఈ ముఠాలో ఉన్నారు. ప్రధాన నిందితుడు పొలమరశెట్టి దుర్గాప్రసాద్ చిన్నతనంలో తండ్రి మరణించడంతో జల్సాలకు బానిపై ఆన్లైన్ బెట్టింగ్ చేసేవాడు. డబ్బుల కోసం చోరీలకు అలవాటు పడ్డాడు. దొంగలించిన బంగారాన్ని తన బావమరిది దొడ్డి ఆదిబాబు వద్ద భద్రపరిచేవాడు. అప్పటికే ఆదిబాబు తొమ్మిది మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో నిందితుడు. పై ఆరుగురు వ్యక్తులు రెండేళ్ల కాలంలో కోటవురట్ల మండలంలో 6, నర్సీపట్నం రూరల్‌లో 3, మాకవరపాలెంలో 3, కశింకోటలో 3, బుచ్చెయ్యపేటలో 2, యలమంచిలి టౌన్లో 1, నాతవరం మండలంలో 1, యలమంచిలి రూరల్‌లో 2 చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నామన్నారు. కశింకోట మండలంలో చోరీ మాత్రమే రాత్రి పూట చేశారని, మిగిలినవి ముందుగా పగటి వేళ రెక్కీ నిర్వహించి, ఉదయం పూట దర్జాగా చేశారని ఆయన పేర్కొన్నారు. బుధవారం నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని, బాలుడిని జువనైల్ హోమ్‌కు తరలించామన్నారు. జాగ్రత్త సుమా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రశ్నించాలని, విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని ఎస్పీ సూచించారు. గృహాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వలన చోరీలకు పాల్పడిన వ్యక్తులను తొందరగా పట్టుకోగలమన్నారు. అనంతరం పై కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసాపత్రాలతో ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, నక్కపల్లి సర్కిల్ సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్ఐలు ఎస్.రమేష్, పి.రమేష్, సీసీఎస్ ఏఎస్ఏ కేజేఐజీపీ కుమార్, విశ్వేశ్వరరావు, హెచ్‌సీ శివ తదితరులు పాల్గొన్నారు. తాళం వేసుంటే ఇట్టే దోచేస్తారు రెండేళ్లలో 21 దొంగతనం కేసులు బాలుడితో సహా ఆరుగురు ముఠా అరెస్టు నిందితుల నుంచి 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి, రూ.15 వేల నగదు స్వాధీనం -
మండల సమావేశానికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు
గంగవరం: మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు కఛ్చితంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరుకావాలని, గైర్హాజరైన వారిపై చర్యలకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ (బాబు) అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ (బాబు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి జరిగే మండల ప్రజా పరిషత్ సమావేశాలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటాకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సర్పంచ్‌లకు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలకు ప్రజా ప్రతినిధులందరికి అవమానం జరుగుతుందన్నారు తీర్మానాలు తప్పనిసరి గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మంజూరులో పంచాయతీ తీర్మానాలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో అభివృద్ధి మౌలిక సౌకర్యాలు సమస్యలపై సమావేశంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలని ప్రజా ప్రతినిధులను ఆయన సూచించారు. గ్రామాల్లో పలు సమస్యలను సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. విద్యా, ఉపాధి హామీ, వ్యవసాయం, పశుసంవర్ధక గహ నిర్మాణ, వెలుగు, ఐసిడిఎస్ శాఖలు వారి చేపట్టిన కార్యక్రమాలును ఆయా శాఖల అధికారులు వివరించారు. ఉపాధి ఏపీవో ప్రకాష్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు వివరించారు ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బేబీరత్నం, వైస్ ఎంపీపీలు రామతులసి, కె.గంగాదేవి, కో–ఆప్షన్ సభ్యుడు ప్రభాకర్ రావు, ఎంపీటీసీ సభ్యులు పండా ఆదినారాయణ, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి, పద్మావతి, సర్పంచ్‌లు అక్కమ్మ, కామరాజు, మరిడమ్మ, రమణమ్మ, లక్ష్మీ, రామలక్ష్మి, శివ, వెంకటేశ్వర్లు, రాజమ్మ, శివ తదితరులు ఆయా గ్రామ పంచాయతీల్లో సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులు కొన్నింటిని పరిష్కరించారు. తహసీల్దార్ సీహెచ్. శ్రీనివాసరావు ఎంపీడీవో వై.లక్ష్మణరావు. ఐసీడీఎస్ సీడీపీవో పీహెచ్ లక్ష్మి, ఎంఈవో మల్లేశ్వరరావు, ఏవో విశ్వనాథ్, ఏపీఎంషణ్ముఖరావు, ఏపీవో ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు -
ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు
మద్దిలపాలెం(విశాఖ): విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పైడా కౌశిక్ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన ‘రాత’నాటకం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో గుంటూరి అభినయ ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ఉత్తమ ప్రదర్శనగా ఎంపికయింది. ద్వితీయ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ వారి ‘చిగురు మేఘం’, తృతీయ ప్రదర్శనగా విజయవాడ యంగ్ థియేటర్ ఆర్ట్స్ వారి ‘27వ మైలురాయి’, చతుర్థి ప్రదర్శనగా ఉక్కునగరానికి చెందిన చైతన్య కళా స్రవంతి వారి ‘అసత్యం’నాటకాలు బహుమతులు సాధించాయి. న్యాయ నిర్ణేతలుగా విశ్రాంత ఆచార్యులు బాబీవర్ధన్, ఒ.ఎ.వేణు, సత్యప్రసాద్‌లు వ్యవహరించారు. ఇది అతని సంతకం ప్రదర్శనకు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం, 27వ మైలురాయికి ఉత్తమ నటి, ఉత్తమ రచన అవార్డులు దక్కాయి. బహుమతులుగా నగదు, జ్ఞాపికలను వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన సత్యనారాయణరాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, సాంబశివరావు, జి.పవన్‌కుమార్, ఒ.నరేష్కుమార్, వి.ధర్మేందర్ల చేతుల మీదుగా అందించారు.రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనగా ‘ఇది అతని సంతకం’ -
బండరాళ్ల లారీలో మంటలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వెంకటాపురం నుంచి యలమంచిలి వెళ్లే మార్గంలో బండరాళ్లతో వెళుతున్న లారీ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. బుధవారం మధ్యాహ్నం ఈ మార్గంలో వెళుతున్న లారీ క్యాబిన్లో ముందు పొగలు వ్యాపించి, తర్వాత మంటలు రావడంతో డ్రైవర్, క్లీనర్లు దూకేశారు. దీంతో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ఈ వాహనంలో మంటలను చూసి ఆ సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వాహన సామర్థ్యానికి మించి భారీ లోడ్‌తో బండరాళ్లతో వెళ్లడం, వేడిని నియంత్రించాల్సిన యంత్రాలు వడగాడ్పులకు మంటల వ్యాప్తికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. -
నూకాంబిక హుండీ ఆదాయం రూ.41.52 లక్షలు
హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది అనకాపల్లి టౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు ద్వారా రూ.41,51,973ల నగదు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు నెల రోజుల్లో నగదు రూపంలో ఈ మొత్తం వచ్చిందని, ఇంకా 15.5 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి వస్తువులను భక్తులు సమర్పించినట్టు తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగ శ్రీను, కమిటీ సభ్యులు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, కాండ్రేగుల రాజారావు, మజ్జి శ్రీనివాసరావు, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరావు, యూనియన్ బ్యాంకు సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
రంపచోడవరం: ఇంజినీరింగ్ పనుల్లో నాణ్యతాప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో బుధవారం వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో మంజూరు చేసిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పారు. పనులకు ఇబ్బంది లేకుండా ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నిర్మాణం జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సమా వేశంలో ఈఈలు ఐ.శ్రీనివాసరావు,రవికుమార్, సబ్బయ్య,మల్లికార్జున, ఏపీడీ జి.శ్రీనివాసరావు, డీఈ చైతన్య, వెంకటరమణ, సాయిసతీష్, సుబ్బారావు, శివ పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు
మహారాణిపేట (విశాఖ): గ్రామాలు, మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు కొంతమంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మోకాలడ్డుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి ఎక్కువగా యలమంచిలి నియోజకవర్గంలో ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. యలమంచిలి నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇతర జిల్లా పరిషత్ నిధుల వినియోగంలో జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు పూర్తి హక్కులు ఉంటాయని, కానీ ఎమ్మెల్యే చెప్పిన పనులే అధికారులు చేస్తున్నారని, తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలామని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ అన్నారు. తాము కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామని, కానీ ఇక్కడ ఆపరిస్థితి లేదని, ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయకపోతే బిల్లులు ఎలా వస్తా యో చూస్తామని బెదరించడం తగదని సభ్యులు వాపోయారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి లేదని, యలమంచిలిలో విచిత్రమైన ధోరణి ఉందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గడువు పూర్తయిన మందుల విక్రయం : మందుల షాపుల్లో గడువు పూర్తయిన మందులు విక్రయిస్తున్నారని, దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని, జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేట సభ్యుడు దొండ రాంబాబు మాట్లాడుతూ.. తాను మందుల కోసం ఔషధ నియంత్రణ ఏడీకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఒక ప్రజాప్రతినిధి ఎందుకు ఫోన్ చేస్తున్నారోనన్న కనీస ఆలోచన, స్పందన అధికారుల నుంచి లేదన్నారు. వచ్చే సమావేశానికి ఉమ్మడి జిల్లాలో ఎన్ని షాపులు ఉన్నాయో, ఎన్ని తనిఖీలు చేశారో, ఎన్నింటిపై చర్యలు తీసుకొస్తున్నారో తెలియజేయాలని చైర్పర్సన్ సుభద్ర ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ పనులు, రూరల్ వాటర్ సప్లై, ఇరిగేషన్, రోడ్లు, భవనాల శాఖ, తదితర అంశాలపై చర్చ జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగిన అనంతరం చేపడుతున్న తక్షణ సహాయ కార్యక్రమాల కంటే ప్రమాదాల నివారణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. అందరికీ ఒకే రకమైన ఎక్స్‌గ్రేషియా ముందుగా అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కై లాసపట్నంలో బాణసంచా పేలుడులో మృతి చెందిన ఎనిమిది మంది కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీలలో, ఇతర ప్రమాదాలలో ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఒకే రకమైన ఎక్స్‌గ్రేషియా అందించాలని శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అందుకు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తెలిపారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ, అల్లూరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు కె.మయూర్ అశోక్, డాక్టర్ అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, పంచకర్ల రమేష్‌బాబు,కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి.కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నారాయణమూర్తి సమావేశంలో పాల్గొన్నారు.పవన్ వ్యాఖ్యలు అవాస్తవం ఏజెన్సీలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 98 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి అన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ అరకులో పర్యటించిన సమయంలో గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పడం మంచిదన్నారు. కానీ రోడ్లకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ పనిచేయలేదని చెప్పడం సంబంధిత మంత్రిగా ఆయనకు తగదన్నారు. విశాఖ మన్యంలో గత ఐదేళ్లలో 498 కిలో మీటర్ల మేర రోడ్లు వేసినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మన్యం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. మన్యంలో అన్ని పీహెచ్‌సీలు, పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించినట్లు తెలిపారు. నాడు–నేడు పనులతో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. వీటిని చెప్పకుండా రోడ్లు బాగులేవని ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులపై జెడ్పీటీసీలు, ఎంపీపీల ధ్వజం యలమంచిలి ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అభ్యంతరం గరంగరంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం వైఎస్సార్సీపీ హయాంలోనే మన్యం అభివృద్ధి 98 కాదు.. 498 కి.మీ రోడ్లు వేశాం: అరకు ఎంపీ తనూజరాణి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, వేదికపై అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జేసీలు అభిషేక్ గౌడ, మయూర్ అశోక్ -
చట్టి, వీరాపురం గ్రామాలను 41 కాంటూర్‌లో కలపాలి
చింతూరు: పోలవరం ముంపు ప్రాంతాలైన చట్టి, వీరాపురం గ్రామాలను 41.15 కాంటూర్‌లో కలిపి పునరావాసం కల్పించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం వారు చట్టి నుంచి చింతూరు ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ ఏపీవోకు వినతి పత్రం అందజేశారు. గోదావరి వరదల సమయంలో ఈ రెండు గ్రామాలు ముంపునకు గురవుతుండడంతో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలతో కలిసి కొండలెక్కి తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేసి రెండు గ్రామాలకు న్యాయం చేస్తామని చెప్పారు. -
మలేరియా నివారణ చర్యలు చేపట్టాలి
అరకులోయటౌన్: గిరి గ్రామాల్లో మలేరియా నివారణకు చర్యలు చేపట్టాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని మాడగడ పీహెచ్సీ పరిధిలోని రవ్వలగుడలో మంగళవారం జరిగిన మొదటి విడత దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయని, దీంతో గిరిజనులు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. దోమల నివారణ మందు పిచికారీ చేయడం వల్ల దోమల బెడద తగ్గుముఖం పడుతుందన్నారు. మలేరియా అధికారులు ప్రతి గ్రామంలో మలేరియా మందు పిచికారీ చేయాలన్నారు. అనంతరం పీహెచ్సీ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి మలేరియా, డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, డాక్టర్ కమల, వైఎసా్‌స్‌ర్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం, మాజీ ఉపసర్పంచ్ పల్టాసింగి విజయ్ కుమార్, డీఎంవో తులసి రాజ్, ఏఎంవో సత్యం, కన్సల్టెంట్ శ్రీను, హెచ్‌ఈఎం భద్రం, హెచ్వీ ముత్యాలమ్మ, సిబ్బంది కుమారి, సుజాత, తుల, చిన్న, కామేష్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
2,086 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: జిల్లాలో ఎంపిక చేసిన 2,086 గ్రామాల్లో ప్రతి ఇంటి లోపల, బయట దోమల నివారణ మందును పిచికారీ చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌కు సమీపంలోని కుమ్మరిపుట్టులో మంగళవారం దోమల నివారణ మందు తొలివిడత పిచికారీ పనులను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు గృహాలను సందర్శించారు. ప్రతి ఇంటి లోపల, బయట మందును పిచికారీ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 2,086 గ్రామాల్లో దోమల నివారణ మందును పిచికారీ చేస్తున్నామన్నారు. మొదటి విడత పిచికారీ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని, రెండవ విడతను జులై 1వ తేదీ నుంచి ప్రారంభించాలన్నారు. తొలిరోజు 33 గ్రామాల్లో పిచికారీ ప్రారంభించగా 21 గ్రామాల్లో పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా,డీఎంవో తులసీ పాల్గొన్నారు. మన మిత్రపై ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వాట్సప్ గవర్నెన్స్(మన మిత్ర)పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు.మంగళవారం సాయంత్రం ఆయన జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధిపై వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమిత్ర నంబర్ 9552300009ను మొబైల్లో సేవ్ చేసుకుని హాయ్ అని పెట్టడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 161 సేవలను ఇంట్లో ఉండే పొందవచ్చన్నారు.ఈయాప్పై సచివాలయాల సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రతి మూడవ శనివారం జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఇ–వేస్టేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 7,661 మంది విభిన్న ప్రతిభావంతులు సదరం శిబిరాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పీఎం సూర్యఘర్పైన విస్తృత ప్రచారం చేయాలన్నారు. సీపీవో పట్నాయక్,ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్,జీడబ్ల్యూఎస్ నోడల్ అధికారి పి.వి.ఎస్.కుమార్,ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ఇదేం విచిత్రమో..
వీధుల్లో సగం ఇళ్లే మునుగుతున్నాయట..చింతూరు: పోలవరం ముంపు గ్రామాలపై కొందరు అధికారుల తీరు విచిత్రంగా ఉంటోంది. వారి తప్పి దాల కారణంగా ప్రజలు వీధిన పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చింతూరు మండలం ముకునూరులోని ఓ వీధిలో కుడివైపున ఉన్నప్రాంతం పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురవుతున్నట్టు తేల్చిన అధికారులు ఎడమవైపు ఉన్నప్రాంతం ముంపులో లేదని నమోదు చేశారు. దీంతో విస్తుపోయిన గ్రామస్తులు ఇదెక్కడి విడ్డూరమంటూ మండిపడుతున్నారు. ఒకే గ్రామంలో పక్కపక్కనే ఉన్న గృహాలు ఓవైపు మునిగి మరోవైపు మునిగిపోకుండా ఎలాఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ఇళ్లు ముంపులో లేవంట ముకునూరులో మొత్తం 175 గృహాలుండగా 120 గృహాలు ముంపులో ఉండగా 55 ఇళ్లు ముంపులో లేవంటూ పోలవరం అధికారులు చెబుతున్నారని. దీనిపై అధికారులను కలిసి అడిగితే సర్వేలో అలానే తేలిందని అంటున్నా రని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామస్తులందరికీ కలిపి పరిహారం ఇవ్వాలని లేకుంటే తమకు కూడా పరిహారం వద్దని తేల్చిచెప్పినట్లు వారు తెలిపారు. ఇరువైపులా ఎంతోమందికి చెందిన కుటుంబాలు నివాసముంటున్నాయని, ముంపు పేరుతో ఈ ప్రాంతాలను విడదీస్తే కుటుంబాలు చెల్లాచెదురవుతాయని గ్రామస్తులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ పీవో అపూర్వభరత్ను కలసి విజ్ఞప్తి చేయగా పరిశీలించి సర్వే చేపట్టి అధికారులను నివేదిక అందచేస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. ● ఇదేక్రమంలో ఏజీకోడేరులో కూడా గ్రామంలోని 693 గృహాలను ముంపులో చేర్చిన అధికారులు 23 ఇళ్లు ముంపులో లేవనడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ● ఉలుమూరులో 172 గృహాలుండగా 116 గృహా లు ముంపు జాబితాలో ఉండగా 56 గృహాలను ముంపు జాబితాలో చేర్చలేదు. ● చింతూరులో 1,508 గృహాలను ముంపు జాబితాలో చేర్చగా సుమారు 450 గృహాలను ముంపు జాబితాలో లేవు. మరో వైపు చింతూరును ఆనుకుని ఉన్న నిమ్మలగూడెంలో 120 గృహాలుండగా వాటిని కూడా ముంపుజాబితాలో చేర్చకపోవడంతో ఇటీవల గ్రామస్తులు ఈ విషయాన్ని పీవో అపూర్వభరత్ దృష్టికితీసుకెళ్లడంతో సర్వే చేయించి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండలంలోని మల్లెతోటలో 272 గృహాలకు గాను 39 గృహాలను ముంపు జాబితాలో చేర్చలేదు.సర్వే నివేదిక అందజేస్తాం ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది ద్వారా సర్వే చేయడం జరిగింది.ముంపు జాబితాలో లేని ప్రాంతాలపై సర్వే నివేదికను ఆర్అండ్ఆర్ అధికారికి నివేదించాం. తదుపరి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – చిరంజీవి, తహసీల్దార్, చింతూరు సర్వే నివేదికలో విచిత్రాలు, వింతలు అధికారుల నిర్వాకంపై నిర్వాసితుల ఆగ్రహంగ్రామం మొత్తం ఇళ్లు ముంపులో జాబితాలో చేర్చినవి లేనివి ముకునూరు 175 120 55 ఏజీకోడేరు 716 693 23 ఉలుమూరు 172 116 56 చింతూరు 1,958 1,508 450 నిమ్మలగూడెం 120 - - 120 మల్లెతోట 272 233 39 -
బురదలో అదుపు తప్పిన బస్సు
సీలేరు: జీకేవీధి మండలం ధారకొండ గుమ్మిరేవుల రహదారిలో నర్సీపట్నం డిపో బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం ధారాలమ్మ ఘాట్ రోడ్డులో రెండు గలటలపాటు భారీ వర్షం కురిసింది. వర్షం నీరు మాదిమళ్లు గెడ్డలో చేరడంతో వంతెన వద్ద ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో బురదమయంగా తయారైన మాదిమళ్ల వంతెన అప్రోచ్ రోడ్డును సర్సీపట్నం– గుమ్మిరేవుల బస్సు ఎక్కుతుండగా అదుపు తప్పి బురదలో వెనక్కి జారిపోయింది. బస్సును ఆపడానికి డ్రైవర్ ఎంత ప్రయత్నించినా, బ్రేకులు వేసినా ఫలితం లేకపోయింది. అప్రోచ్ రోడ్డు కింద భాగంలో తూరలు వద్ద గండి పండిన ప్రాంతంలో బస్సు ఆగింది.ఆ సమయంలో బస్సులో 10 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 8న కురిసిన భారీ వర్షాలకు మాదిగమళ్లు వంతెన అప్రోచ్‌రోడ్డు కొట్టుకుపోయింది. అధికారులు నామమాత్రంగా మట్టి పోసి మిన్నకుండిపోవడంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాదిమళ్ల వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద తప్పిన ప్రమాదం -
వైభవంగా మారెమ్మ ఉత్సవం
సీలేరు: మారెమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరగాలంకరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మారెమ్మ అమ్మవారి మాలధారులు సుమారు 60 మంది అగ్ని గుండం మీదుగా నడిచి అమ్మవారిని దర్శించు కున్నారు. తమిళ పూజారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు.అమ్మవారి మాలధారులకు కంకణాలు కట్టారు. అనంతరం సీలేరు నది ఒడ్డుకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కళ్లు మిరమిట్లు గొలిపేలా బాణ సంచా కాల్చారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్ పోలీసులు, ఎస్ఐ రవీంద్రనాథ్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
బాల్య వివాహాలపై నిఘా పెట్టాలి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలుసాక్షి,పాడేరు: పదవ తరగతి తరువాత హాస్టళ్ల నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన 18 ఏళ్ల లోపు బాలికలపై ప్రత్యేకంగా దృష్టిసారించి,బాల్య వివా హాలు జరగకుండా నిఘా పెట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా బాల్య వివాహ నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను గ్రామస్థాయిలోనే గుర్తించాలని, పరిష్కరించలేని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామ,మండల,డివిజన్ స్థాయి చైల్డ్ మేరేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్ సమర్థంగా పనిచేయాలని చెప్పారు. కిశోరి వికాసంలో సఖీ గ్రూప్స్ సమర్థంగా పనిచేస్తే బాల్య వివాహాలు,టీనేజీ ప్రెగ్నెన్సీ తగ్గుతాయన్నారు. డ్రాప్ అవుట్ అయిన పిల్లలను ఈ విద్యాసంవత్సరంలో రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించాలని, 18ఏళ్లు నిండిన బాలికలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పించాలని సూచించారు. డీఈవో,గిరిజన సంక్షేమ డీడీ, సీడీపీవోలు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి సమన్వయంతో శిక్షణ ఏర్పాటు చేయాలని తెలిపారు. టెన్త్ నుంచి ఇంటర్‌కు వెళ్లే వారిని దగ్గరలోని కళాశాలలకు టైఅప్ చేసి ఇంటర్ విద్యపై అవగాహన కల్పించి, భయం పోగొట్టాలని సూచించారు. ఈనెల 21,22,23 తేదీల్లో ఐదేళ్లు నిండిన చిన్నారులను పండగ వాతావరణంలో పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. డీసీపీవోతో సహా ముగ్గురికి షోకాజ్ నోటీసులు విఽధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యాఽశాఖకు నివేదికలు పంపని జిల్లా బాలల రక్షణ అధికారి(డీసీపీవో) టి.సద్దు, ఈ సమావేశానికి గైర్హాజరైన పాడేరు, రంపచోడవరం ప్రొబేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సంచాలకులతో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్.. పాడేరు డివిజన్‌కు అనకాపల్లి ప్రొబేషన్ అధికారిని, రంపచోడవరం డివిజన్‌కు రాజమండ్రి ప్రొబేషన్ అధికారిని ఇన్చార్జిలుగా నియమించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ఎస్తేరురాణి, డీఈవో బ్రహ్మాజీరావు, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి డాక్టర్ రోహిణి, కార్మిక శాఖ అధికారి సుజాత,ఎస్డీసీ లోకేశ్వరరావు, జీసీడీవో సూర్యకుమారి పాల్గొన్నారు. -
కనుల పండువగాశ్రీవారి కల్యాణం
రంపచోడవరం: స్థానిక రంప వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం శ్రీవారి కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణాన్ని కనులారా తిలకించారు. అనంతరం భక్తుల సహాయంతో భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్.వి.సుధాకర్, ఈవో ఎన్.వి.ఎస్.ఎస్.మూర్తి, ఏఈవో రమణరాజు, దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ఉలవల లక్ష్మి, కారుకోడి పూజ, నల్లమిల్లి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అద్దంకి వెంకటేశ్వరరావుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఇంటర్ ఫలితాల్లో కిలగాడ కేజీబీవీ రికార్డు
● జిల్లాలో మొదటి స్థానం ముంచంగిపుట్టు: మండలంలో కిలగాడ కస్తూ ర్భా గాంధీ బాలికా విద్యాలయం ఇంటర్ ఫలితాల్లో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సాధించింది. జిల్లాలో 19 కేజీబీవీలుండగా వాటిలో కిలగాడ కేజీబీవి మొదటి స్థానంలో నిలిచింది. కిలగాడ కేజీబీవీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 36 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఒక్కరూ మినహా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 37 మందికి గాను అందరూ ఉత్తీర్ణులయ్యారు.ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ ఉబ్బేటి సాయిప్రసన్న మంగళవారం విలేకరులతో మాట్లాడు తూ ఫలితాలసాధనకు ఉపాధ్యాయు లు విశేష కృషి చేశారన్నారు.విద్యార్థులు ఏకగ్ర తగా చదువుపై దృష్టి పెట్టి, ఇంటర్ ఫలితాల్లో పాఠశాలకు మంచి పేరును తీసుకువచ్చారని చెప్పారు. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. -
మృత్యు కుహరం.. ‘సరియా’
సాక్షి, పాడేరు: జిల్లాలోని సరియా జలపాతం మృత్యు జలపాతంగా పేరోందింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలో ఉన్న సరియా జలపాతం అందాలకు నిలయమైనప్పటికీ ప్రమాదాలతో మరణాలు సంభవిస్తున్నాయి. మైదాన ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సరియా జలపాతం సందర్శనకు వస్తుంటారు. గత 20 ఏళ్ల నుంచి సరియా జలపాతం వెలుగులోకి వచ్చింది. ఈ జలపాతం అందాలపై విస్తృత ప్రచారం జరగడంతో అనేక రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి అధికమైంది. దేవరాపల్లి మీదుగా సరియా ప్రాంతానికి రోడ్డు అభివృద్ధి చెందడంతో పర్యాటకులు వాహనాలతో అక్కడకు చేరుకుంటున్నారు. సరియా జలపాతం అందంగా దర్శనమిస్తున్నప్పటికీ ప్రమాదాలకు నిలయంగా మారింది.స్నానాలకు దిగిన పర్యాటకులు ఏ మాత్రం కాలుజారిన సరాసరి దిగువున ఉన్న సెలయేరులోకి జారిపోతారు.ఆ సేలయేరులో సొరంగం కూడా ఉండడంతో ఈలోతు ప్రాంతంలోకి గల్లంతవుతారు. గల్లంతైన వారు మాత్రం ప్రాణాలతో భయటపడే పరిస్థితి లేదు. మృతదేహాలు మాత్రమే వెలుగు చూస్తున్నాయి. 15ఏళ్లలో 37మంది పర్యాటకులు మృతి జిల్లాలోని అనేక జలపాతాలు ఉన్నప్పటికీ సరియా జలపాతం మాత్రం మృత్యు జలపాతంగా భయపెడుతుంది. ఆదివారం గల్లంతై మృతి చెందిన విశాఖకు చెందిన వాసు, నరసింహమూర్తిలతో కలుపుకుని గడిచిన 15ఏళ్లలో 37మంది పర్యాటకులు సరియా జలపాతంలో పడి మృతిచెందినట్టు పోలీసు రికార్డుల్లో నమోదైంది. మూడు స్టెప్‌లలో దర్శనమిస్తున్న సరియా జలపాతంలో స్నానాలు చేయడం వరకు ప్రమాదం లేనప్పటికీ దిగువకు జారిపడితే మాత్రం ప్రాణాలు పోయినట్టే. పోలీసుల హెచ్చరికలు బేఖాతర్ సరియా జలపాతంలో ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ రెండేళ్ల క్రితం అనేక చర్యలు చేపట్టింది. ప్రమాదాలు అఽధికంగా జరిగే జలపాతం మొదటి స్టెప్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే సరియా ప్రాంతానికి చెందిన 11 మంది గిరిజన యువకులను వలంటీర్లుగా నియమించడంతో వారంతా ప్రమాదాల నివారణకు కృషి చేయడంతో ప్రమాదాలు తగ్గాయి.. అయితే రెండవ స్టెప్లోని జలపాతం కూడా ప్రమాదకరంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విశాఖకు చెందిన నేవి ఉద్యోగి దిలీప్‌కుమార్, విజయనగరం బాబామెట్ట ప్రాంతానికి చెందిన సాయిలు రెండవ స్టెప్లోని జలపాతం వద్ద స్నానాలకు దిగి గల్లంతయ్యారు. ఒకరోజంతా గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు వెలుగుచూశాయి. ఈ సంఘటనతో పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది. వలంటీర్లతో భద్రత చర్యలను విస్తృతం చేసింది.అయితే ఆదివారం మరో ఇద్దరు యువకులు గల్లంతై మృత్యువాత పడడంతో మరలా సరియా జలపాతంలో మృత్యుఘోష పర్యాటకులు, స్థానికులను భయపెడుతుంది. పోలీసుల హెచ్చరికలను పర్యాటకులు కనీసం పట్టించుకోకపోవడంతో సరియా జలపాతంలో మరణాలు సంభవిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. మృతి చెందుతున్న పర్యాటకుల కుటుంబాల్లో విషాదం అలముకుంటుంది. జారితే...గల్లంతే ప్రాణాల మీదకు తెస్తున్న స్నానాల సరదా ప్రమాదకరంగా సేలయేరులో లోతు పోలీసు హెచ్చరికలు పట్టని పర్యాటకులు -
ఈదురు గాలులు వడగళ్ల వర్షం
పెదబయలు: జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో మంగళవారం భారీ వర్షం కురిసింది. పెదబయలలో ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గంట పాటు వర్షం కురవడంతో వీధుల్లోకి నీరు చేరింది. స్థానిక గ్రంథాలయం,అంగన్వాడీ కేంద్రం–2 వీధి సీసీ రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోయింది.కేంద్రానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు మోకాళ్లలోతు వర్షం నీటిలో దిగి వెళ్లారు. డ్రైనేజీ లేకపోవడంతో వర్షం పడితే నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. ఈదురుగాలుల కారణంగా రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి హైవే, కుంబిడిసింగి రోడ్లు జలమయమయ్యాయి. ద్విచక్రవాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. జి.మాడుగుల వారపుసంతలో సరుకులు తడిసిపోయాయి. దుకాణదారులు, చిల్లర వర్తకులు ఇక్కట్లకు గురయ్యారు. జి.మాడుగుల పీహెచ్సీ సమీపంలో గల షాపు పై కప్పు రేకులు ఎగిరిపోయాయి. పిడుగుపాటుకు నాలుగు పశువుల మృతి డుంబ్రిగుడ: మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అరకు, డుంబ్రిగుడ, కురిడి రైల్వే క్రాసింగ్ వద్ద రెండు గంటల పాటు ఈదురు గాలులు, ఉరుములు,మెరుపులతో కుండపోతగా వర్షం కురవరవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోతంగి పంచాయతీ పెదపాడులో పిడుగుపడి ఆ గ్రామానికి చెందిన కొర్రా హరి అనే గిరిజనుడికి చెందిన నాలుగు దుక్కి పశువుల మృతి చెందాయి. సుమారు రూ.లక్ష నష్టం వచ్చిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరాడు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కొయ్యూరు: మండలంలో భారీ వర్షం కురిసింది.రోడ్లపై నుంచి నీరు కాలువలా ప్రవహించింది. కృష్ణదేవిపేట నుంచి వచ్చే విద్యుత్ లైన్ బ్రేక్‌డౌన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మరోవైపు రాజవొమ్మంగి నుంచి వచ్చే లైన్‌కు సంబంధించి రంపచోడవరం–అడ్డతీగల మధ్యలో సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరా రాలేదు. ముంచంగిపుట్టు: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురుసింది. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు,జోలాపుట్టు ప్రధాన మార్గాలు వర్షం నీటితో నిండిపోయాయి. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. -
పక్కా ఉపాధికి పాలిటెక్నిక్
● ‘పది’తోనే ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం ● ఉమ్మడి విశాఖలో 8 ప్రభుత్వ కళాశాలలు ● 17వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగింపుమురళీనగర్(విశాఖ): పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడానికి పాలిటెక్నిక్ ఒక ముఖ్యమైన మార్గం. విద్యార్థులు మూడు లేదా మూడున్నరేళ్లలో డిప్లమో స్థాయి కోర్సులను పూర్తి చేసి, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు పొందవచ్చు. అంతే కాకుండా ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) ద్వారా నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశించవచ్చు. డిప్లమో స్థాయిలో పొందిన ప్రాక్టికల్ నైపుణ్యాలతో సొంతంగా ఒక పరిశ్రమను స్థాపించి, 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. విశాఖ ఉమ్మడి జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. కంచరపాలెంలో ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ (గైస్), ప్రభుత్వ పాలిటెక్నిక్, పెందుర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్, భీమిలిలో మహిళా పాలిటెక్నిక్, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరంలో పాలిటెక్నిక్ కళాశాలలు, పాడేరులో ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు 19 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లు పాలిటెక్నిక్‌లో 36 కంటే ఎక్కువ బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటిలో కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ వంటివి ముఖ్యమైన బ్రాంచ్‌లుగా చెప్పవచ్చు. ప్రతి బ్రాంచ్‌లో 60 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ మంచి డిమాండ్ ఉన్న కోర్సులే. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెకానికల్ మూడు సెక్షన్లు, ఈఈఈ రెండు సెక్షన్లు, సివిల్ రెండు సెక్షన్లు, మెటలర్జీ ఒక సెక్షన్ ఉన్నాయి. మెటలర్జీ కోర్సు కంచరపాలెం, విజయనగరం, విజయవాడ ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉంది. నర్సీపట్నంలో మైనింగ్ కోర్సు ఉంది. కంచరపాలెం పాలిటెక్నిక్, కెమికల్ ఇంజినీరింగ్, అనకాపల్లి కళాశాలలు ఎన్బీఏ గుర్తింపు పొందాయి. 17 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ రాష్ట్ర సాంకేతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి పాలిసెట్ దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగిసింది. తల్లిదండ్రులు, విద్యార్థుల వినతి మేరకు ఈ నెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు పొడిగించారు. కాగా.. ఈ నెల 30న ఉదయం 11 నుంచి 1 గంట వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది.కెమికల్ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు రాష్ట్రంలో నాలుగు కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు ఉన్న ఏకై క కాలేజీ మాదే. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు శతశాతం ఉద్యోగాలు పొందుతున్నారు. 2024–25లో 171 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరికి ఇటీవల జాబ్ అచీవర్స్ డే నిర్వహించి నియామక పత్రాలు అందించాం. బాలికలు అత్యధిక వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. బాలికలకు కాలేజీ ప్రాంగణంలోనే అన్ని సదుపాయాలతో వసతి గృహం నిర్వహిస్తున్నాం. – డాక్టర్ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్, గైస్, కంచరపాలెం ఉజ్వల భవిష్యత్ పాలిటెక్నిక్‌తో ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ఈ కోర్సులు చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్షణం ఉపాధి పొంది జీవితంలో స్థిరపడవచ్చు. 2024–25 సంవత్సరానికి 500 మందికి పైగా మంచి వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. ముగ్గురు ఎలక్ట్రికల్ విభాగం విద్యార్థులు రూ.9.02 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. హాస్టల్ సదుపాయం ఉంది. మంచి ర్యాంకులు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు. పాలిసెట్‌కు ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. – డాక్టర్ కె.నారాయణరావు, ప్రిన్సిపాల్, కంచరపాలెం పాలిటెక్నిక్ పారిశ్రామిక శిక్షణ డిప్లమో విద్యలో భాగంగా క్షేత్ర పరిశీలన, ప్రయోగాత్మక అనుభవం కోసం ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో కంపెనీలు నెలకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు స్టైఫండ్‌ను అందిస్తాయి. కెమికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ వంటి శాండ్విచ్ కోర్సులు (మూడున్నరేళ్ల కాలవ్యవధి) అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏడాది పాటు రెండు విడతలుగా పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. వీరికి బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అండ్ ట్రైనింగ్ నెలకు రూ.7వేలు ఉపకార వేతనం అందిస్తుంది. -
ఇక్కడే పుట్టి.. ఇపెరిగాం.. ఇప్పుడు వీడి పోవాలా ?
ఊరంటే కేవలం మట్టి కాదు..ఆ వాసనతో పెనవేసుకున్న ఇగిరిపోని బంధం. ఊరంటే ఇళ్లే కావు.. వాటితో ఉండే అనుబంధాల కాపురాలు. ఊరంటే ఇవే కాదు.. గడప గడపలో కనిపించే ఎడతెగని ఆప్యాయతలు.. వీధి వీధితో విడదీయలేని నేస్తుల అభిమానాలు.. దారి దారిలో విరబూసిన సుగంధాల పరిమళాలు.. ప్రతి కుడ్యం అందమైన చిత్రం... చెట్టూచేమ, రాయీరప్పా.. బండిపెండి, పాదు, పసిరక, ఏరుగట్టు, పైరు గాలి.. ఇలా అన్నీ అపురూపాలే.. ఊళ్లే లేకుండా పోతున్నాయక్కో.. ఈ మట్టితో బంధం తెగిపోతున్నదక్కో.. ముల్లె సదురుకుని ఎల్లిపోవాలక్కో.. అంటూ పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఈ ప్రాంతాలను వీడి పునరావాస ప్రాంతాలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్రామాలతో పెనవేసుకున్న బంధం వీడనుండడంతో నిర్వాసితుల్లో ఆందోళన ప్రారంభమైంది. పుట్టిన ఊళ్లను, పెరిగిన ఇళ్లను, సాగు భూములను వదిలి వెళ్లలేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రాంతాలను వదిలివెళ్లడం ద్వారా తమ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కానున్నాయని ప్రధానంగా గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. – చింతూరుపోలవరం ముంపు గ్రామాల్లో పరిహారం, పునరావాస ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ముందుగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన ప్రతి ముంపు గ్రామంలో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ముంపునకు గురవుతున్న గ్రామానికి సంబంధించిన నిర్వాసితుల జాబితాలను గ్రామసభల్లో వెల్లడిస్తున్నారు. దీంతో పరిహారం సొమ్ములు అందినవెంటనే గ్రామాలను ఖాళీచేయాల్సి వస్తుందని నిర్వాసితుల్లో జోరుగా చర్చ సాగుతోంది. కాగా ప్రస్తుతం గ్రామసభలు నిర్వహిస్తున్న అధికారులు నిర్వాసితుల అభిప్రాయాల మేరకు పునరావాస ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించడంతో అన్నిరకాల మౌలికసౌకర్యాలు కల్పిం చిన అనంతరం మాత్రమే వారిని ఇక్కడినుంచి తరలించాల్సి ఉంటుంది. రాళ్లు రప్పలతో నిండిన భూములను దశాబ్దాలుగా ఎంతో కష్టపడి ఇప్పుడిప్పుడే సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ భూములు ఇప్పుడు ముంపునకు గురవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస ప్రాంతంలో భూములన్నీ రాళ్లు, రప్పలతో సాగుకు అనుకూలంగా లేవని వాటిని మళ్లీ అభివృధ్థి చేసి సాగులోకి తెచ్చేందుకు ఏళ్ల సమయం పడుతుందని వారు అంటున్నారు.సంతలు కనుమరుగేనా? గిరిజనులు నిత్యావసరాల కొనుగోలుకు సంతల పై ఆధారపడతారు. చింతూరులో ప్రతి బుధవా రం పెద్ద సంత జరుగుతుంది. సంతలకు మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు అధికసంఖ్యలో వచ్చి వారానికి సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతల్లో విక్రయించి ఆదాయాన్ని పొందుతుంటారు. సంతలు కేవలం వ్యాపార స్థలాలుగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచారవ్యవహారాలకు కేంద్రాలుగా, స్నేహబంధం కొనసాగించే ప్రాంతాలుగా గిరిజనుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుతో ఆయా సంత ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పండగలకు అధిక ప్రాధాన్యత గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా పండగలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామదేవతలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తొలకరి ప్రారంభంతో పంటలు బాగా పండాలని భూమిపండగ, బీరకాయ, ఆనపకాయ తినేందుకు పచ్చపండగ, వరివిత్తనాలు నాటే సమయంలో కొత్తల్ పండగ, చిక్కుడు కాయలు తినేందుకు చిక్కుడు పండగల ను వారు నిర్వహిస్తారు. దీంతో పాటు పెళ్లిళ్ల సమయంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రతి మూడేళ్లకు కొలుపులు నిర్వహిస్తారు. భూమిపండగ ఈ ప్రాంత గిరిజను లకు ఎంతో ప్రత్యేకమైనది. పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వెళ్లి సంప్రదాయ జంతువుల వేట కొనసాగిస్తుంటారు. మహిళలు తమ గ్రామాలకు సమీపంలోని ప్రధాన రహదారులపై సంప్రదాయ గిరిజన నృత్యాలు చేస్తూ వాహనదారుల నుంచి పండగ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు.ప్రస్తుతం పోలవరం ముంపులో భాగంగా తమను మైదాన ప్రాంతాలకు తరలిస్తుండడంతో భూమి పండగ నిర్వహించే అవకాశాలు ఉండవేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.ముంపుబారిన ఆదాయాన్నిచ్చే చెట్లు గిరిజనులకు పలురకాల చెట్లు ఆదాయాన్ని అందిస్తుంటాయి. విప్ప, తాటి, చింత, మామిడిచెట్లు వీటిలో ప్రధానమైనవి. విప్పచెట్టు నుంచి విప్పపువ్వు, విప్పబద్ద, విప్పనూనె, చింతచెట్టు నుంచి చింతపండు, చింతపిక్కలు సేకరించి విక్రయించడం ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.10 వేల వరకు ఆదాయం పొందుతుంది. మామిడిచెట్టు ద్వారా ఏడాదికి రూ.20 వేలు, తాటిచెట్టు ద్వారా ఏడాదికి రూ.లక్ష వరకు, కూరగాయల సాగుద్వారా ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతుండగా ప్రాజెక్టు పూర్తయితే ఇవన్నీ ముంపుబారిన పడి గిరిజనులు ఆదాయం కోల్పోనున్నారు. గ్రామ దేవతలను కోల్పోతున్నాం పోలవరం ముంపుతో మా గ్రామదేవతలను కోల్పోతున్నాం. దేవతలను పూజిస్తే గ్రామానికి మంచి జరుగుతుందనే విశ్వాసంతో ప్రతిఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పునరావాస కేంద్రాల్లో గ్రామదేవతలను ప్రతిష్టించేందుకు చాలా సమయం పడుతుంది. – సవలం సుబ్బయ్య, గ్రామపటేల్, చూటూరు, చింతూరు మండలంఊరు వీడాలంటే భయంగా ఉంది దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుని, కూలీనాలీ చేసుకుని వచ్చిన సొమ్ములతో జీవనం సాగిస్తున్నాం. ముంపులో భాగంగా గ్రామాలను వీడాలంటే ఎంతో భయంగా ఉంది. పునరావాస ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నాం. – సవలం లచ్చమ్మ, చూటూరు, చింతూరు మండలం భవిష్యత్తు తలుచుకుంటే ఆందోళనగా ఉంది ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పిల్లల్ని చదివిస్తూ జీవనం సాగిస్తున్నాం. కొత్త ప్రాంతంలో మా భవిష్యత్తును తలుచుకుంటే ఆందోళనగా ఉంది. మరోసారి కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. – సవలం దారయ్య, మాజీ సర్పంచ్, చూటూరు, చింతూరు మండలం ఈ వ్యక్తి చింతూరు మండలం ఏజీకొడేరుకు చెందిన 80 ఏళ్ల అగరం నారాయణ. ఇతను ఇప్పటివరకు బ్యాంకు పనిమీద మండలకేంద్రం వెళ్లి రావడమే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లిందిలేదు. అలాంటిది పోలవరం ముంపులో భాగంగా గ్రామం విడిచి కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని, త్వరలోనే గ్రామంతో బంధం తెగిపోతోందని దిగులు చెందుతున్నాడు. శబరినది పక్కనే నివాసముంటున్న తాను వరదలు వస్తే గ్రామంలోనే ఏదోచోట సురక్షిత ప్రాంతానికి వెళ్లేవాడినని అలాంటిది పోలవరం ఊరును ముంచేస్తుంటే ఇక శాశ్వతంగాగ్రామాన్ని వదలాల్సివస్తోందని మదనపడుతున్నాడు. ఈ 90 ఏళ్ల వృద్ధురాలు ఏజీకొడేరుకు చెందిన బల్లెం ముత్తమ్మ. దశాబ్దాలుగా కుటుంబంతో కలసి గ్రామంలోనే నివాస ముంటోంది. ఆ రోజుకు తినేందుకు కూరలు ఏమీలేకున్నా పక్కనున్న చేలల్లోకి వెళ్లి పచ్చకూర కోసితెచ్చి వండు కుని ఆ పూటకు కడుపు నింపుకొంటామని చెబుతోంది. పోలవరం ముంపులో తమ గ్రామంతో బంధాన్ని వీడి కొత్త ప్రాంతానికి వెళ్లవలసి రావడం ఆవేదన కలగచేస్తోందని ఆమె అంటోంది. అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని, మాగ్రామం తప్ప ఎప్పుడూ కొత్త ప్రాంతాలకు వెళ్లలేదని, పునరావాసం పేరుతో ఇక్కడి నుంచి తరలిస్తుండడంతో ఈ అవసాన దశలో ఈ కష్టమేంటని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాలు, జనాభా వివరాలుగ్రామాలు 190 ప్రాధాన్యతా క్రమంలో చేర్చినవి 32 కుటుంబాలు 13,323 జనాభా 56,108 గిరిజన జనాభా 30,669 -
నెలల తరబడి విధులకు కార్యదర్శి గైర్హాజరు
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనపెదబయలు: మండలంలోని గోమంగి సచివాలయ కార్యదర్శి రెండు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదని సర్పంచ్ కొర్ర జెట్టో, ఉప సర్పంచ్ కూడ మత్స్యకొండబాబు ఆరోపించారు. విధులకు డుమ్మా కొడుతున్న పంచాయతీ కార్యదర్శి మనోజ్కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యాలయం సోమవారం ఎదుట పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్ చేస్తే సెలవులో ఉన్నానని చెప్పి, తరువాత స్విచ్ఆఫ్ చేస్తున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విధులకు రాకపోవడం వల్ల చాలా వరకు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. తాగునీటి ఎద్దడి తదితర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ఎంపీడీవో, ఈవోఆర్డీలకు ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని ఆరోపించారు. అనంతరం కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జెడ్పీటీసీ కొండబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పీసా కమిటీ సభ్యులు గల్లేలు కొండబాబు, జె.సునీల్‌కుమార్, జ్ఞానసుందర్, సిందేరి అనిల్‌కుమార్, కొర్ర మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో ఎల్.పూర్ణయ్యను వివరణ కోరగా గతంలో గోమంగి పంచాయతీ కార్యదర్శి పనితీరు బాగాలేదని ఫిర్యాదు రావడంతో మెమో జారీ చేసి, జీతం నిలుపుదల చేశామని చెప్పారు. ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గల్లంతైన యువకులు మృతి
సాక్షి,పాడేరు: అనంతగిరి మండలం మారుమూల జీనబాడు పంచాయతీలోని సరియా జలపాతంలో గల్లంతైన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. యువకులు గల్లంతైనట్టు ఫిర్యాదు అందడంతో సోమవారం ఉదయం తహసీల్దార్ మాణిక్యం, అరకు సీఐ హిమగిరి ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సరియా జలపాతానికి చేరుకున్నారు. యువకుల ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలించింది. ఉదయం 10గంటల సమయంలో విశాఖపట్నంలోని పూర్ణామార్కెట్ వద్ద పండావీధికి చెందిన ఇళ్ల వాసు(21), రెల్లివీధిలోని ఏవీఎన్ కళాశాల ప్రాంతానికి చెందిన వడ్డాది సత్య నరసింహమూర్తి(24) మృతదేహాలను బయటకు తీశారు. ఆదివారం మధ్యాహ్నం ఆరుగురు యువకులు కారులో సరియా జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. అయితే వీరిలో వాసు,నరసింహమూర్తి జలపాతంలో స్నానం చేస్తున్న సమయంలో దిగువున ఉన్న సేలయేరులోకి జారి పడి గల్లంతయ్యారు.ఈ సంఘటనపై అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.యువకుల మృతదేహాలను శవ పరీక్షకు కేజీహెచ్‌కు పంపారు. సరియా జలపాతం నుంచి మృతదేహాలు వెలికితీత -
పండగలకు అధిక ప్రాధాన్యత
గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా పండగలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామదేవతలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తొలకరి ప్రారంభంతో పంటలు బాగా పండాలని భూమిపండగ, బీరకాయ, ఆనపకాయ తినేందుకు పచ్చపండగ, వరివిత్తనాలు నాటే సమయంలో కొత్తల్ పండగ, చిక్కుడు కాయలు తినేందుకు చిక్కుడు పండగల ను వారు నిర్వహిస్తారు. దీంతో పాటు పెళ్లిళ్ల సమయంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రతి మూడేళ్లకు కొలుపులు నిర్వహిస్తారు. భూమిపండగ ఈ ప్రాంత గిరిజను లకు ఎంతో ప్రత్యేకమైనది. పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వెళ్లి సంప్రదాయ జంతువుల వేట కొనసాగిస్తుంటారు. మహిళలు తమ గ్రామాలకు సమీపంలోని ప్రధాన రహదారులపై సంప్రదాయ గిరిజన నృత్యాలు చేస్తూ వాహనదారుల నుంచి పండగ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు.ప్రస్తుతం పోలవరం ముంపులో భాగంగా తమను మైదాన ప్రాంతాలకు తరలిస్తుండడంతో భూమి పండగ నిర్వహించే అవకాశాలు ఉండవేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. -
గ్రామ దేవతలను కోల్పోతున్నాం
పోలవరం ముంపుతో మా గ్రామదేవతలను కోల్పోతున్నాం. దేవతలను పూజిస్తే గ్రామానికి మంచి జరుగుతుందనే విశ్వాసంతో ప్రతిఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పునరావాస కేంద్రాల్లో గ్రామదేవతలను ప్రతిష్టించేందుకు చాలా సమయం పడుతుంది. – సవలం సుబ్బయ్య, గ్రామపటేల్, చూటూరు, చింతూరు మండలం ఊరు వీడాలంటే భయంగా ఉంది దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుని, కూలీనాలీ చేసుకుని వచ్చిన సొమ్ములతో జీవనం సాగిస్తున్నాం. ముంపులో భాగంగా గ్రామాలను వీడాలంటే ఎంతో భయంగా ఉంది. పునరావాస ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నాం. – సవలం లచ్చమ్మ, చూటూరు, చింతూరు మండలం భవిష్యత్తు తలుచుకుంటే ఆందోళనగా ఉంది ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పిల్లల్ని చదివిస్తూ జీవనం సాగిస్తున్నాం. కొత్త ప్రాంతంలో మా భవిష్యత్తును తలుచుకుంటే ఆందోళనగా ఉంది. మరోసారి కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. – సవలం దారయ్య, మాజీ సర్పంచ్, చూటూరు, చింతూరు మండలం -
బీఎస్ఎన్ఎల్పై ఫిర్యాదు
కొయ్యూరు: బీఎస్ఎన్ఎల్ సేవలు నాసిరకంగా ఉన్నాయని, వినియోగదారుల నుంచి ఆ సంస్థ ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ మంప మాజీ ఎంపీటీసీ సభ్యులు బి.శివరామరాజు, ఎస్.భాను, బి.బాబురావు, సత్య తదితరులు సోమవారం మంప ఎస్ఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు. సంస్థ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తామని తెలిపారు. మంపలో పది సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ టవర్ సరిగా పనిచేయడం లేదని, దీంతో వినియోగదారులు నష్టపోతున్నారని తెలిపా రు. దీనిపై స్పందించిన ఎస్ఐ మాట్లాడుతూ సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి వినియోగదారుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతామన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ సాక్షి,పాడేరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. అంబేడ్కర్ 134వ జయంతిని సోమవారం స్థానిక పాతబస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఐటీడీఏ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారంగా ఏర్పడి జోహార్లు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ దినేష్‌కుమార్,అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎస్పీ అమిత్ బర్దర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్ పనిచేశారన్నారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు సామాజిక న్యాయం,సమానత్వం లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తిగా అంబేడ్కర్ అని చెప్పారు. ఆయన ఆశయం మేరకు కుల,మత వివక్షకు తావులేకుండా పనిచేద్దామని కలెక్టర్ తెలిపారు. అనంతరం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు పోలీసుశాఖ కృషి చేస్తోందని చెప్పారు. జిల్లాలో గంజాయిని జీరో స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్,ఏఎస్పీ ధీరజ్,సాంఘిక సంక్షేమశాఖ డీడీ జనార్దన్,డీఆర్డీఏ ఏపీడీ మురళి,గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ రజనీ,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మలేరియా నిర్మూలనకు సహకరించాలి
● నేటి నుంచి దోమల నివారణ మందు పిచికారీ ● కలెక్టర్ దినేష్‌కుమార్ సాక్షి, పాడేరు: జిల్లాలో మలేరియాతో పాటు కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి దోమల నివారణ మందు మొదటి విడత పిచికారీని ప్రారంభించాలని మలేరి యా, వైద్య ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 22 మండలాల్లోని 311 గ్రామ సచివాలయాల పరిధిలో 2,086 గ్రామాలను ఎంపికచేశామన్నారు.ఈ గ్రామా ల్లో 5.16లక్షల జనాభాకు దోమకాట్ల బెడద లేకుండా దోమల నివారణ మందును వారి నివాసాల్లో పిచికారీ చేస్తామని చెప్పారు. జిల్లా, మండల, పంచాయతీ స్థాయిల్లో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలు పిచికారీని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి బయట, లోపల, పరిసరాల్లో దోమల నివారణ మందును తప్పనిసరిగా పిచికారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. -
సీలేరు కాంప్లెక్స్‌లో పవర్ సెక్టార్ అధికారి సుడిగాలి పర్యటన
సీలేరు: సీలేరు కాంప్లెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ అధికారి(ఏపీపీఎస్) ఎ.వి. సాంబశివరావు సుడిగాలి పర్యటన చేశారు. సీలేరు కాంప్లెక్స్‌లో పొల్లూరు, డొంకరాయి, మాచ్‌ఖండ్, సీలేరు జల విద్యుత్ కేంద్రాలను ఆది, సోమ వారాలు రెండు రోజుల పాటు స్థానిక జెన్కో అధికారులతో కలిసి పరిశీలించారు. జల విద్యు త్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంపై ఆరా తీశారు. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 2వ దశ నిర్మాణం పనులను పరిశీలించి, పలు అంశాలపై ఆరా తీశారు. సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు చేపట్టవలసి న అంశాలపై చర్చించారు. సీలేరు వద్ద పార్వతీనగర్‌లో నూతన పవర్ ప్రాజెక్టు ప్రదేశాన్ని, డంపింగ్ యార్డు, ఇంటెక్ డ్యాములను పరిశీలించారు.ఆయన వెంట సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీరు వాసుదేవరావు, ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి,ఈఈ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు. -
క్షణక్షణం.. భయం భయం
సాక్షి, విశాఖపట్నం: మందుగుండు సామగ్రికి అనకాపల్లి జిల్లా ఎంతో ప్రసిద్ధి. పెళ్లిళ్లు, అమ్మవారి పండగలు, ఇతర ఉత్సవాలకు బ్రాండెడ్ సంస్థలు బాణసంచాను అందించలేవు. అందుకే.. లోకల్‌గా ఉన్న తయారీ కేంద్రాలపై ఆధారపడుతుంటారు. ఇక్కడ జనం కోరిన విధంగా బాణసంచా తయారుచేస్తారు. పేల్చినప్పుడు ఏ రంగు రావాలి, ఎలాంటి సౌండ్ రావాలి, ఎలా దూసుకెళ్లాలి.. ఇలాంటి స్పెషల్ క్రాకర్స్ రూపొందిస్తారు. ఒక దుకాణంలో పనిచెయ్యడం.. అక్కడ ఎలా తయారు చేస్తున్నారో అవగాహన పెంచుకొని.. వేరే చోట తయారీ కేంద్రం పెట్టడం.. ఇలా జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఉమ్మడి విశాఖతోపాటు తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలోని ప్రాంతాలవారికీ అనకాపల్లి నుంచే బాణసంచా సరఫరా చేస్తారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మొత్తం 40 కేంద్రాలున్నట్టు అంచనా. కానీ.. ఇందులో లైసెన్సులు తీసుకొని నడుపుతున్నవి మాత్రం 21 మాత్రమే. మిగిలిన 19 దుకాణాలకు లైసెన్స్ లేదని తెలిసినా.. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం.. నెలనెలా వసూళ్ల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 40 దుకాణాలున్నాయని చెబుతున్నప్పటికీ.. మరో 20 వరకూ తయారీ కేంద్రాలను గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్నారని తెలుస్తోంది. వీటి విషయంలోనూ ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. కనీస పరిశీలనలు శూన్యం.! దరఖాస్తు వచ్చిందా.. లైసెన్స్ ఇచ్చేశామా.. వదిలేశామా.. అనే రీతిలోనే బాణసంచా తయారీ దుకాణాల విషయంలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ దుకాణంలో ఏం తయారు చేస్తున్నారు.? మోతాదుకు మించిన నిల్వలున్నాయా.? గోదాముల పరిస్థితేంటి అనేది పట్టించుకున్న పాపానపోలేదు. అంతేకాదు.. లైసెన్స్‌లు మంజూరు చెయ్యాలని కొందరు దుకాణదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్ని పెండింగ్‌లో ఉంచారే తప్ప.. ఆ దుకాణాల దగ్గరకు వెళ్లి.. వాటిని పరిశీలించిన దాఖలాలూ కనిపించడం లేదు. ఇక్కడ తయారీ కేంద్రాల పరిస్థితేంటో? కై లాసపట్నంలో ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తత నటిస్తూ హడావిడి చెయ్యడం మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని తయారీ కేంద్రాల్ని పరిశీలించేందుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. ఏవైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రమాదం జరిగిన విషయం దావానలంలా వ్యాపించడంతో.. మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. రాంబిల్లి, దేవరాపల్లి, సబ్బవరం, అనకాపల్లి మండలాల్లో ఈ తరహా తయారీ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తమ వద్ద ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే ఫార్మా పరిశ్రమల్లో నెలకో ప్రమాదం సంభవిస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తాజాగా.. బాణసంచా ప్రమాదం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మందుగుండుకుఅనకాపల్లి జిల్లా ప్రసిద్ధి జిల్లాలో అధికారికంగా21 తయారీ కేంద్రాలు రెట్టింపు సంఖ్యలోగుర్తింపులేని యూనిట్లు పట్టించుకోని అగ్నిమాపక శాఖ అధికారులు ఇప్పటికే ఫార్మా ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరినిబంధనలు బేఖాతర్ బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల నిర్వహణ నిబంధనల ప్రకారం నడవాల్సి ఉంటుంది. తయారీ కేంద్రాల నిర్వహణకు కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పేలుడు పదార్థాల చట్టం 1908 ప్రకారం నిర్దిష్ట ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అత్యధిక సమయాల్లో అనుమతి లేకుండానే బాణసంచా తయారీ కోసం ప్రయత్నించడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లైసెన్స్ తీసుకున్న యూనిట్లలో కూడా ప్రమాణాలకు విరుద్ధంగా పరిమితికి మించి ఉత్పత్తి కోసం చేసే యత్నాల్లో నిబంధనలు అతిక్రమించడం మరో కారణం. బాణసంచా తయారీలో నిబంధనలను పాటించకుండా, లాభార్జనే ప్రధానంగా వ్యవహరించడం ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికార యంత్రాంగం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. భారీ పేలుడు సంభవించేందుకు ఆస్కారమున్న పదార్థాలను ప్రత్యేకంగా నిల్వ ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా భద్రత లేని చోట్ల అన్ని రకాల బాణసంచాని కలిపి ఉంచుతుంటారు. తయారీదారులు ఫైర్ ఫైటింగ్ విషయాల్లో శిక్షణ తీసుకోవాలి. బాణసంచా దుకాణం వద్ద తయారీ ప్రదేశాలలో ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా ఉండాలి. నాలుగు ఫైర్ సిలెండర్లు, నాలుగు బకెట్లు, నిమిషానికి 450 లీటర్ల కెపాసిటీ గల ఒక డీజిల్ పంపు, 25 వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకు ఉండాలి. అనుమతులకు మించి బాణసంచా సరుకులను తయారు చేయకూడదు. ప్రమాద నివారణ పరికరాలు పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పరికరాలను ఉపయోగించేందుకు నలుగురు ఆపరేటర్లు ఉండాలి. తయారీ దుకాణంలో నలుగురికన్నా ఎక్కువ పనిచేయకూడదు. కేంద్రం చుట్టూ రక్షణను ఏర్పాటు చేయాలి. 1908 ఎక్స్‌ప్లోజివ్ చట్టం ప్రకారం అన్ని నిబంధనలు పాటించాలి. తయారీ కేంద్రం దృఢంగా సిమెంటుతో నిర్మించాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి పనిచేసే వారు బట్టలకు తడి చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎన్నో నిబంధనలున్నా.. వాటిని పాటిస్తున్న తయారీ కేంద్రాలు జిల్లాలో లేవనే చెప్పొచ్చు. అయినా.. అధికారుల కళ్లకు ఇవేమీ కనిపించకపోవడం గమనార్హం. -
నాన్నా..నేను చనిపోతున్నా..!
కొమ్మాది(విశాఖ): బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ (30), భార్య, కుమార్తెతో కలిసి పీఎంపాలెంలో నివాసం ఉంటున్నారు. రెండున్నరేళ్లుగా రుషికొండ ఐటీ సెజ్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బెట్టింగులకు పాల్పడుతూ, అది కాస్తా వ్యసనంగా మారింది. బెట్టింగ్‌ల కారణంగా సుమారు రూ. 21 లక్షల అప్పు చేశాడు. స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చాల్సిందిగా.. ఒత్తిడి పెరిగింది. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాదు. కాసేపటి తర్వాత ‘నాన్నా నన్ను క్షమించు, నీకు ముఖం చూపించలేకపోతున్నా రూ. 21 లక్షలు అప్పు చేశాను. నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి. నాభార్య, కుమార్తెను బాగా చూసుకోండి.. నేను చచ్చిపోతానంటూ..’ఓ సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించాడు. అది చూసిన తండ్రి వెంటనే 112కు కాల్ చేసి విషయం చెప్పి, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. అతను పంపిన వీడియోలో.. తన కోసం వెతికితే బీచ్ రోడ్డులో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో.. ఆయన పంపిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు ఫిల్మ్‌స్టూడియో సమీపంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. సుందర్ ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పీఎంపాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయనను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ బాలకృష్ణ అభినందించారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో బెట్టింగ్‌లకు అలవాటు పడి రూ.21 లక్షలు అప్పులు కాపాడిన పోలీసులు