
మలేరియా నివారణ చర్యలు చేపట్టాలి
అరకులోయటౌన్: గిరి గ్రామాల్లో మలేరియా నివారణకు చర్యలు చేపట్టాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని మాడగడ పీహెచ్‌సీ పరిధిలోని రవ్వలగుడలో మంగళవారం జరిగిన మొదటి విడత దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయని, దీంతో గిరిజనులు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. దోమల నివారణ మందు పిచికారీ చేయడం వల్ల దోమల బెడద తగ్గుముఖం పడుతుందన్నారు. మలేరియా అధికారులు ప్రతి గ్రామంలో మలేరియా మందు పిచికారీ చేయాలన్నారు. అనంతరం పీహెచ్‌సీ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి మలేరియా, డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, డాక్టర్ కమల, వైఎసా్‌స్‌ర్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం, మాజీ ఉపసర్పంచ్ పల్టాసింగి విజయ్ కుమార్, డీఎంవో తులసి రాజ్, ఏఎంవో సత్యం, కన్సల్టెంట్ శ్రీను, హెచ్‌ఈఎం భద్రం, హెచ్‌వీ ముత్యాలమ్మ, సిబ్బంది కుమారి, సుజాత, తుల, చిన్న, కామేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం