breaking news
Alluri Sitarama Raju District Latest News
-
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్న వరాత్రి వేడుకలు వైభ వంగా జరుగు తున్నాయి. వాడవాడలా దుర్గమ్మ విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో కనకదుర్గమ్మ ఉ త్సవాలను సోమ వారం ప్రారంభించారు. పాత ఆస్పత్రి సెంటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కనకదుర్గమ్మ ప్రతిమను భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. మెయిన్‌రోడ్డు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, మండపం సెట్ ఆకట్టుకున్నాయి.సాయంత్రం సహస్ర దీపార్చన చేశారు. అక్టోబర్ 4వతేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది.ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఏరువాక వెంకటరమణ,కోటపాడు శ్రీను,వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు, వర్తక సంఘం,ఉత్సవ కమిటీ ప్రతినిధులు శివరాత్రి నాగేశ్వరరావు,ఆకాశపు సోమరాజు,వెయ్యాకుల సత్యనారాయణ,పూసర్ల గోపి,పచ్చా బుజ్జి,పచ్చా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు ముంచంగిపుట్టు: మండలంలోని వనభసింగి పంచాయతీ కేంద్రంలో సోమవారం ఆంధ్ర వనవాసీ కళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో దుర్గాష్టమి –మహిళా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్దలతో దుర్గాదేవికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబాయికి చెందిన అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ ఆశ్రమం ప్రతినిధి ఆతుల్ జోగ్ పాల్గొని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. గిరిజన గ్రామాల్లో తమ ఆశ్రమం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం, మహిళలకు దుర్గాదేవి ఫోటో, పసుపు, కుంకుమ, అందించారు. సర్పంచ్ లక్ష్మణ్,వనవాసీ ఆశ్రమం ప్రతినిధులు, సభ్యులు ఆదినారాయణ, అచ్చమ్మ, భగత్రామ్, బాలకృష్ణ, రాజు, జగన్నాథం, బలోక్దొర పాల్గోన్నారు. సీలేరు: ఊరువాడ అంగరంగ వైభవంగా దుర్గమ్మ శరన్నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు దుర్గమ్మ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సీలేరు, దారకొండ ప్రాంతాల్లో ఈ పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు దామోదర శర్మ. రామశర్మ చిన్న పిల్లలతో సరస్వతీ దేవి పూజలను చేయించారు.శివాలయం ఆలయంలో సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. దారకొండలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘనంగా బతుకమ్మ పండగ కొయ్యూరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భవానీ భక్తులు సోమవారం బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. పిల్లలు బతుకమ్మ పాట లు పాడుతూ నృత్యాలు చేశారు.మహిళలు బతుకమ్మను తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ప్రసాద్ ఇంటి సమీపంలో ఉన్న రామాలయం నుంచి బతుకమ్మను తీసుకొచ్చారు. కమిటీ సభ్యులు ఎం చక్రరావు,చిరంజీవి,నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
‘జూనియర్ అథ్లెటిక్స్’ చాంపియన్ విశాఖ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖ అథ్లెట్లు బి.ఇషానా, కె.ఆర్.వి.ఎం.కుమార్, బి.శైలజ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి వ్యక్తిగత చాంప్లుగా నిలిచారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కూడా కై వసం చేసుకుంది. సోమవారంతో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ముగిసిన ఈ పోటీలను సబ్‌జూనియర్ (అండర్–14, 16), యూత్ (అండర్–18), జూనియర్ (అండర్–20) బాలబాలికల విభాగాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో నిర్వహించారు. బాలికల అండర్–14 విభాగంలో ఇషానా, అండర్–18 విభాగంలో శైలజ, బాలుర అండర్–16 విభాగంలో కుమార్ తమ విభాగాల్లో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లు సాధించారు. అలాగే విశాఖ జిల్లా జట్టు 269 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. బాలుర చాంపియన్‌షిప్‌ను 156 పాయింట్లతో విశాఖ కై వసం చేసుకోగా, బాలికల చాంపియన్‌షిప్‌ను 113 పాయింట్లతో సాధించింది. -
వెల్లువెత్తిన అర్జీలు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజనుల ఫిర్యాదులు ● ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌కు గ్రామస్తుల వినతులు రంపచోడవరం: రంపచోడవరం మండలం పెద్దగెద్దాడ పంచాయతీ పరిధిలో 25 మంది గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు మంజూరు చేసిన భూమి సరిహద్దులు చూపలేదని సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజనులు ఫిర్యాదు చేశారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్‌రాజ్ గ్రీవెన్స్ నిర్వహించారు. పలు సమస్యల అర్జీలను పీవోకు అందజేశారు. ఈ వారం 82 మంది అర్జీలు అందజేసినట్లు పీవో తెలిపారు. పెద్దగెద్దాడ–చెరువుపాలెం గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్లు తారురోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే 400 ఎకరాలకు సాగు నీరందించే నిమ్మల కాలువ డ్యామ్‌కు మరమ్మతులు చేయించాలని, డోకుల పాడు గ్రామంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ మార్చాలని పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కడబాల ఈశ్వరరావు, అన్నిక అప్పారావు, ఉగ్గిరాల బుల్లబ్బాయి, గంగిరెడ్డి తదితరులు కోరారు. మారేడుమిల్లి మండలం ఇవ్వంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం ఏర్పాటు చేయాలని రేవల జానికిరెడ్డి, పల్లాల భూపతిరెడ్డి అర్జీ అందజేశారు. వై.రామవరం మండలం చింతలపూడి పంచాయతీలోని బొడ్డగుంట కన్నెరు వారుపై వంతెన నిర్మించాలని సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ అర్జీ అందజేశారు. తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు డీలర్లను నియమించాలని ఎస్.సింధూ, దుర్గాదేవి, మల్లేశ్వరీలు కోరారు. 2014 నుంచి 2018 వరకు మంజూరు చేసిన గృహాల పనులు పూర్తి చేయాలని కోసు లచ్చన్నదొర పీవోకు అర్జీ అందజేశారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఎస్.డి.సి. పి.అంబేడ్కర్, సబ్ డీఎఫ్‌వో అనూష, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రంపచోడవరం ఐటీడీఏ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీనిపై పీవో స్మరణ్‌రాజ్ స్పందించి వారితో మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సమస్యలతో కూడి వినతిపత్రాన్ని పీవోకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 30 ఏళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన వంట వండి పెడుతు వారి ఆరోగ్యాలను కాపాడుతూ రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారన్నారు. -
గజ్జె కట్టిన డాక్టరమ్మ
ఏయూక్యాంపస్: రోగులకు వైద్యం అందించే ఓ వైద్యురాలు నృత్య కళాకారిణిగా మారి అందరి ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ జాహ్నవి ప్రసాద్ బొడ్డేపల్లి, తాను చిన్నతనం నుంచి నేర్చుకున్న కూచిపూడి నృత్యాన్ని బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం ఆలయ కళావేదికపై ఆమె నిర్వహించిన కూచిపూడి నృత్య అరంగేట్రం ఎంతో ఘనంగా జరిగింది. గురువు లలిత గుప్తా వద్ద నృత్యాన్ని అభ్యసించిన జాహ్నవి, తన కళా ప్రతిభను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఎంతో ఒత్తిడితో కూడుకున్న వైద్య వృత్తిలో ఉంటూనే, నృత్యంపై తనకున్న ఆసక్తితో సాధన చేసి ఈ స్థాయికి చేరుకోవడం అందరికీ స్ఫూర్తినిస్తుంది. -
మెరుగు పేరుతో ఘరానా మోసం
కూర్మన్నపాలెం: పాత బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని నమ్మించి.. మహిళను మోసం చేసిన అంతర్ జిల్లా ఘరానా మోసగాడు ముదేరినవారి రమణను దువ్వాడ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 24 తులాల బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సౌత్ సబ్ డివిజన్ క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి ప్రశాంతినగర్‌లో స్టీల్‌ప్లాంట్ జనరల్ మేనేజర్ నివాసం ఉంటున్నారు. అతని భార్య వద్దకు ఈ ఏడాది జూలై 15న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. పాత బంగారు ఆభరణాలకు కొత్త మెరుపు తీసుకువస్తామని, తమ వద్ద ఉన్న నమూనాలను చూపి నమ్మించారు. వారి మాటలు విశ్వసించిన ఆమె.. తన వద్ద ఉన్న సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. నిందితులు ఆ ఆభరణాలను ఒక మట్టి కుండలో పెట్టి, ఏదో రసాయన ద్రావణంలో ముంచినట్లు నాటకమాడారు. అనంతరం ఆ కుండకు ఒక తెల్లని వస్త్రం చుట్టి.. ‘ఈ కుండను 10 రోజుల పాటు ఇంటి ఈశాన్య దిశలో సూర్యరశ్మి తగలకుండా ఉంచి, 11వ రోజున తెరవాలి’అని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. వారి సూచన మేరకు 11వ రోజున కుండను తెరిచి చూడగా, అందులో బంగారు ఆభరణాలకు బదులుగా కల్లు ఉప్పు ఉండటంతో బాధితురాలు తాను మోసపోయానని గ్రహించింది. కుటుంబ సభ్యుల సాయంతో ఆగస్టు 20వ తేదీన దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటై, దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ నెల 29న అనకాపల్లి జిల్లా మారేడుపూడి బస్టాప్ వద్ద ప్రధాన నిందితుడైన రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రమణది అన్నమయ్య జిల్లా పాతరాయచోటి. గతంలో కూడా అతను పలు ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మారేడుపూడి గ్రామానికి చెందిన చప్పిది నూకరాజు పాత్రపై విచారణ కొనసాగుతోందని సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారు హారం–1, బంగారు నెక్లెస్‌లు–2, పెద్ద బంగారు గొలుసు–1, చిన్న బంగారు గొలుసులు–3, బంగారు లాకెట్లు–2, చెవి దిద్దులు–3 జతలు, బంగారు ఉంగరాలు–10, బ్రాస్లెట్–01, పాపిడి బిళ్ల–1, రూ.5300 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. -
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్‌లో496 మందికి వైద్య పరీక్షలు
జిల్లా ఆస్పత్రిలో మెగా వైద్య శిబిరం పాడేరు : స్థానిక ప్రభుత్వ జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి ప్రారంభించారు. వైద్య శిబిరంలో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 18ఏళ్లు నిండిన యువతకు కిశోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 496 మందికి వైద్య పరీక్షలు జరిపారు. వీరిలో మెరుగైన చికిత్స కోసం 29మందిని రిఫర్ చేశారు. ఐదుగురు రోగులకు త్వరలో స్థానిక జిల్లా ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పీఏసీఎస్ చైర్మన్ బుజ్జిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగరావు పాల్గొన్నారు. -
వరద బాధితులకు అండగా ఉండాలి
కూనవరం: వరద బాధితులకు అండగా ఉండాలని, అధిక గ్రామాల ప్రజలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ ఉండవల్లి గాంధీబాబుకు సూచించారు. శబరి కొత్తగూడెంలో ఏఎస్డీఏస్ ఆధ్వర్యంలో సోమవారం 302 కుటుంబాలకు నిత్యావసర సరకుల కిట్లను ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్, ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ గాంధీబాబును పీవో అభినందించారు. అనంతరం శబరి కొత్తగూడెం గ్రామస్తులతో పీవో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావలసిన సదుపాయాలను నిర్వాసితులకు అందేలా చూస్తామన్నారు. వరదలపై భయం వద్దని, ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం అందిస్తున్నామని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వేల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, అర్హులకు ప్యాకేజీ అందజేస్తామన్నారు. అందరికీ ప్యాకేజీ అందుతుందని ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ కట్టం లక్ష్మి, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ -
పీహెచ్‌సీల్లో ఓపీ బంద్
వైద్యుల సమ్మెతో రోగులకు అవస్థలు సాక్షి,పాడేరు/ఎటపాక/కొయ్యూరు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీహెచ్‌సీల వైద్యులు సమ్మె బాటపట్టడంతో రోగులు అవస్థలకుగురయ్యారు. ఆందోళనలో భాగంగా తొలిరోజు సోమవారం ఓపీ సేవలు నిలిపివేశారు. జీవో నంబర్ 99 ద్వారా కోత విఽధించిన ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ,పదోన్నతుల కల్పన,గిరిజన అలవెన్స్, 104 సంచార చికిత్స అలవెన్స్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వ వైద్యులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలోని 64 పీహెచ్‌సీల్లో సోమవారం ఓపీ సేవలు నిలిచిపోయాయి. గ్రామాల్లో సంచార వైద్యసేవలకు వైద్యులు అందుబాటులో లేరు. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గర్భిణులు ఇబ్బందులకు గురయ్యారు. వైద్యసిబ్బంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఎటపాక మండలంలో నెల్లిపాక,గౌరిదేవిపేట,లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజూ సుమారు నాలుగు వందల మంది వైద్యసేవలు పొందుతారు. అయితే సోమవారం డాక్టర్లు విధులు బహిష్కరించడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులకు స్టాఫ్నర్స్లే అరకొర వైద్యం అందించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొందరు రోగులు ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సి వచ్చింది. కొయ్యూరు,బంగారంపేటలలో నిర్వహించిన వైద్య శిబిరాలకు వైద్యులు హాజరుకాకపోవడంతో రోగులు అవస్థలకు గురయ్యారు. ఈనెల 30వతేదీ మంగళవారం నుంచి వైద్యులు ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. జిల్లా కేంద్రం పాడేరులో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నా రు. అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించేందుకు, అక్టోబర్ 2న విజయవాడలో వైద్యుల సంఘ నేతలు రిలే దీక్షల కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఎంపీ డాక్టర్ తనూజరాణిని కలిసిన పీహెచ్సీ వైద్యులు పాడేరు : జిల్లాలో పలు పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు సోమవారం పాడేరులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణిని కలిసి తమ సమస్యలు వివరించారు. తమ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఎంపీకి తెలిపారు. తమ ఉద్యమం ప్రజలకు వ్యతిరేకం కాదని చెప్పారు. 30వ తేదీ నుంచి నిరసన ర్యాలీలు, ప్రదర్శనలతో ఉద్యమం ఉధృతం చేయనున్నట్టు, 3వ తేదీ నుంచి విజయవాడలో నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తమ న్యాయమైన ఉద్యమానికి మద్దతు తెలపాలని వారు కోరారు. వైద్యుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానని వారికి ఆమె హామీ ఇచ్చారు. -
చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో జారిపడిన మట్టి
● వాహనాల రాకపోకలకు అంతరాయం కొయ్యూరు: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో కొండలపై నుంచి మట్టి జారిపడింది. దీంతో సోమవారం ఉద యం నుంచి చాలా సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్ 516ఈ నిర్మాణంలో భాగంగా ఈరోడ్డును విస్తరించారు. అయితే ఎత్తైన కొండల వద్ద సరైన చర్యలు చేపట్టకపోవడంతో వర్షాలకు మట్టి జారిపోతోంది. రాళ్లు కూడా రోడ్డుపైకి జారిపడుతున్నాయి. మట్టి జారిపడిన సమాచారం తెలుసుకున్న ఎన్‌హెచ్ నిర్మా ణ సిబ్బంది పొక్లెయిన్‌తో దానిని తొలగించారు. -
విశాఖ– అరకు కార్వాన్ వాహనం రెడీ
● వసతులను పరిశీలించిన విశాఖ కలెక్టర్ మహారాణిపేట(విశాఖ): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నడపనున్న కార్వాన్ వాహనాన్ని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సోమవారం కలెక్టరేట్ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటకశా ఖ ఆర్డీ కల్యాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె.మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్ కలిసి కలెక్టర్‌కు కార్వాన్ వాహనం ప్రత్యేకతలను వివరించా రు. ఈ ప్రత్యేక వాహనాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. -
వరదలతో స్తంభించిన జనజీవనం
● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● పెరుగుతున్న గోదావరి ప్రవాహం చింతూరు: వరదల కారణంగా విలీనమండలాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నది ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. సోమవారం రాత్రికి 46.5 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. మరోవైపు మహారాష్ట్రలోని ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, సరస్వతి ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీటిని దిగువకు వదలడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశాలున్నాయి. దిగువనున్న కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో పలుచోట్ల వరదనీరు రహదారులపై ఉండడంతో సుమారు 60కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీ పరీవాహక గ్రామాల ప్రజలు వైద్యం, నిత్యావసర సరకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నాటు పడవల ద్వారా వరదనీటిని దాటుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు వరద రావడంతో వ్యవసాయ పనులు సకాలంలో సాగక ఈ ఏడాది పంటలు నష్టపోయే అవకాశముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరి, మిర్చి పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతూరు మండలంలో కుయిగూరు వాగు ఉధృతి కొంతమేర తగ్గడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు వరదనీటిలో రాకపోకలు కొనసాగుతున్నాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద నీరు ఇంకా చింతూరు, వీఆర్‌పురం ప్రధాన రహదారిపై నిలిచి ఉండడంతో వరుసగా నాలుగో రోజుకూడా చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని మల్లెతోట, ఉలుమూరు, ఏజీకొడేరు, తిమ్మిరిగూడెం, కొండపల్లి, పెదశీతనపల్లి, చినశీతనపల్లి, బొడ్రాయిగూడెం, రామన్నపాలెం, నర్సింగపేట, ముకునూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం పెదశీతనపల్లికి చెందిన శ్యామల రత్తమ్మ పాముకాటుకు గురవడంతో నాటుపడవ ద్వారా సోకిలేరువాగు దాటించి ఆటోలో చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు. వీఆర్‌పురం: పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో మూడు నెలల వ్యవధిలో మండలంలో ఏడు పర్యా యాలు గోదావరికి వరద వచ్చింది. వరుస వర దలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో నిత్యావసర సరుకుల కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నవరం వాగుపై గల కాజ్వే కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు, రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని శ్రీరామగిరి, తోటపల్లి, సీతంపేట, ఇప్పూరు, వడ్డిగూడెం, వడ్డిగూడెం కాలనీ, చింతరేవుపల్లి, రామవరం, రామవరంపాడు, చిన్నమట్టపల్లి, అడవి వెంకన్నగూడెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వరినాట్లు, పొగాకు నారుమడులు నీటమునిగాయి. -
ఫేజ్–2 పనులు పునఃప్రారంభించాలి
అరకులోయ టౌన్: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఫేజ్–2లో నిలిపివేసిన పనులు తిరిగి ప్రారంభించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని రవ్వలగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో సీఎం హామీ పనులపై జిల్లాలోని ఏటిడబ్ల్యూ, టీడబ్ల్యూ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫేజ్–2లో చేపట్టి, అర్ధంతరంగా ఆగిపోయిన పనుల వివరాలను తెలుసుకున్నారు. ఏ ఇంజినీరింగ్ శాఖకు ఎన్ని పనులు మంజూరయ్యాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫేజ్–1లో మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తయ్యాయని చెప్పారు. ఫేజ్–2లో పనుల స్థితిగతులపై ఆయా మండలాల ఏటీడబ్ల్యూవోలు, ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఫేజ్–2కి ఇన్పుట్ డేటా షీట్ తయారు చేయాలని, లేటెస్ట్ ఫొటోలు యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఫేజ్–2లో మొదలు కాని పనులకు ప్రతిపాదనలు అక్టోబర్ 10వ తేదీలోగా పంపాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు కలిసి తనిఖీ చేసి జిల్లాలో మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన టాయిలెట్స్ జాబితా తయారు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ఎస్ఎమ్ఐ పనుల స్థితిగతులపై ఆరా తీశారు. బేస్‌లైన్ శిక్షణకు తప్పక హాజరుకావాలి బేస్‌లైన్ శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ఎంఈవోలు, హెచ్ఎంలు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్టర్ ట్రైన్స్‌కి బేస్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిందన్నారు. రాబోయే కాలంలో కూడా పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏ పాఠశాలలో పనితీరు బాగోలేదో ఆ పాఠశాల హెచ్ఎం, ఏటీడబ్ల్యూవో, టీచర్లపై చర్యలు తప్పవన్నారు. ఐటీడీఏల వారీగా పీఎంఆర్సీలలో అకాడమిక్ మోనిటరింగ్ సెల్ ప్రారంభిస్తామని చెప్పారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు బి.స్మరణరాజ్, శుభం నోక్వాల్, సమగ్ర శిక్ష అధికారి స్వామి నాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీ, టీడబ్ల్యూ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, 22 మండలాల డీఈఈలు, ఏఈఈలు, ఎంఈవోలు, ఏటీడబ్ల్యూలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ -
గంజాయి జోలికి పోవద్దు
అరకులోయ టౌన్: గంజాయి జోలికి పోవద్దని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. సోమవారం అరకులోయలో ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మందికిపైగా ఎన్సీసీ క్యాడెట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయి జోలికి పోవద్దు, ఖైదీలుగా మారవద్దు, సే నో టు గంజాయి అంటూ ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీలో నినదించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ డ్రగ్స్‌కు అలవాటు పడకూడదని సూచించారు. గంజాయి పండించవద్దని, యువత బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దన్నారు. గంజాయిపై ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు చెప్పారు. ఉపాధికి అనేక మంచి మార్గాలు ఉన్నాయన్నారు. అరకులోయ ప్రాంత సహజ, సాంస్కృతిక గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ట్రెక్కింగ్ చేసేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన ఎన్సీసీ క్యాడెట్లు కూడా స్థానిక గిరిజన యువతనే గైడ్లుగా నియమించుకున్నారన్నారు. ర్యాలీ అనంతరం గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు వారి భాషల్లో అర్థమయ్యేటట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంప్ కమాండెంట్ నీరజ్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీలో ఎస్పీ అమిత్ బర్డర్ -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
● రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ రంపచోడవరం: మాదకద్రవ్యాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని స్థానిక ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశం హాలులో సోమవారం డీఎస్పీ సాయిప్రశాంత్, డీఎఫ్‌వో అనూష, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మాదకద్రవ్యాలు లేకుండా చూడాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎంపీడీవోలు, ఎస్ఐలు సమస్వయంతో ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. పోలీస్ శాఖ ద్వారా ఎన్ని చెక్‌పోస్టులు నిర్వ హిస్తున్నారు, పోలీస్,ఎకై ్సజ్ శాఖలు డ్రగ్స్‌కు సంబంధించి ఎన్నికేసులు నమోదు చేశారో తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ, మండల పరిషత్ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యేరో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, ఏడీఏ సావిత్రి, హెచ్‌వో ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
చింతపల్లి: మండలంలో చౌడుపల్లి సమీపంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో కుడుముసారి పంచాయతీ కోటగున్నలు గ్రామానికి చెందిన మర్రి సాగర్ (21)చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం చింతపల్లి వచ్చి పనులు చూసుకుని తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా చౌడుపల్లి సమీపంలో గల వంతెన వద్ద వాహనం జారి పోయి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన సాగర్‌ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సారా తయారీపై ఉమ్మడి రాష్ట్రాల ఎకై ్సజ్ దాడులు
పెదబయలు : ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఓండ్రుగెడ్డ, సుడుబ్ గ్రామాల్లో దాడులు చేసి 5500 లీటర్ల బెల్లం ఊటతో పాటుగా 500 లీటర్ల నాటు సారా ధ్వంసం చేసినట్టు పాడేరు ఎకై ్సజ్ సీఐ ఆచారి తెలిపారు. విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు సోమవారం ఆంధ్ర ఒడిశా ఎకై ్సజ్ అధికారుల సహాయంతో దాడులు చేయడం జరిగిందనిన్నారు. ఇక్కడ తయారు చేసిన సారా ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఎక్కువగా రవాణా చేస్తున్నారని, పెదబయలు, హుకుంపేట, పాడేరు ప్రాంతాలకు వివిధ మార్గాల ద్వారా రవాణా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాడేరు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐలు హిరన్, లక్ష్మీ, గణేష్, వీర్రాజు, ఒడిశా ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రతి , నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. ఒడిశాలో 5500 లీటర్ల బెల్లం ఊట, 500 లీటర్ల నాటు సారా ధ్వంసం సారా తయారీ, రవాణా చేస్తే కఠిన చర్యలు పాడేరు ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఆచారి -
కదం తొక్కిన ఆదివాసీలు
ఎటపాక: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ధర్మయుద్ధం బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు ఆంధ్రా, తెలంగాణ నుంచి వేలాది మంది గిరిజనులు తరలిరావడంతో భద్రాచలం పట్టణం ఆదివాసీలతో కిక్కిరిసిపోయింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ, ఆటపాటలతో భారీ ర్యాలీ చేసి కాలేజీ మైదానంలో సభ నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా అక్రమంగా ఆదివాసీల రిజర్వేషన్లు అనుభవిస్తూ విద్య, ఉద్యోగ రాజకీయ ఫలాలను దొడ్డిదారుల్లో లంబాడీలు దోచుకుంటున్నారని నేతలు ఆరోపించారు. పాలక ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సభకు ఆంధ్రా నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కృతజ్ణతలు తెలిపారు. -
వైభవంగా దేవీ శరన్నవరాత్రులు
చింతపల్లి: మండలంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ఆదివారం మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలో హైస్కూల్ జంక్షన్, అనాదీశ్వర ఆలయంతో పాటు బైలుకించంగి రోడ్డువీధి, రత్నగిరి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గమ్మతల్లి మండపాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.చింతపల్లిలో జగన్ పంతులు కుంకుమ పూజలు, అబిషేకాలు జరిపించారు. గంగవరం : మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారికి కుంకు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. మోతుగూడెం: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పొల్లూరులోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు రమేష్, రమాదేవి భవానీ దంపతులు అమ్మవారికి సారె వితరణ చేశారు. గ్రామస్తులు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని సారేను సమర్పించారు. అర్చకుడు అయినవిల్లి కుమారస్వామి శర్మ అమ్మవారికి అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. -
సమ్మోహనం కూచిపూడి నృత్య విన్యాసం
120 మందితో కూచిపూడి నృత్యంమద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నగరానికి చెందిన సిద్దేంద్ర యోగి కళానిలయం గురు సత్యభాను నృత్య కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది.ఈ వేడుకలో కూచిపూడి నృత్య విన్యాసం సమ్మోహన భరితంగా సాగింది. కళానిలయం వ్యవస్థాపకురాలు సత్యభాను ఆధ్వర్యంలో 120 మంది నృత్య కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి విద్యతో పాటు సంప్రదాయ కళలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. లెండి ఇంజినీరింగ్ కాలేజీ చైర్మన్ పి. మధుసూదన రావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కళాశాలల్లో శాసీ్త్రయ కళల గురువులను నామినేట్ చేసేందుకు ఇటీవల జీవో కూడా విడుదల చేసిందని, ఇది విద్యార్థులకు సంప్రదాయ నృత్యాలు అభ్యసించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డా. శ్రీధర్ మిత్ర, కన్నం నాయుడు, కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ గురు హరి రామమూర్తి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం
రంపచోడవరం: వైఎస్సార్సీపీ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటుందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో డిజిటల్ బుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలుకు ఎటువంటి బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొన్న డిజిటల్ బుక్‌లో ఆ వివరాలు పొందుపరచాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ సభ్యుడు వంశీ కుంజం, ఉలవల లక్ష్మి, పార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్ పండా రామకృష్ణదొర, మండల పార్టీ కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, ఉప సర్పంచ్ వి.ఎం.కన్నబాబు, చితుకులయ్యరెడ్డి, బొబ్బా శేఖర్, రత్నరాజు, కారుకోడి పూజ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి -
అసత్య ఆరోపణలు తగవు
గంగవరం: టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశ్ , వైస్ ఎంపీపీ గంగాదేవి , సర్పంచ్ కామరాజు దొర తదితరులు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు పాము అర్జున తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది మానుకోవాలని హెచ్చరించారు. అనంతరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైబడినా ప్రజా సంక్షేమాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, అరాచక పాలన సాగిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తూ, తప్పుడు ప్రచారాలను చేస్తోందన్నారు. కూటని ప్రభుత్వం నిరంకుశ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారన్నారు. వైస్ ఎంపీపీ గంగాదేవి, సర్పంచ్‌లు కామరాజు దొర, కె.లక్ష్మి , నేషం మరిడమ్మ, నాయకులు సతీష్, టి.శ్రీను, ఎం.శ్రీను, వీరబాబు, సత్తిబాబు, బాబ్జి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి మృతదేహం లభ్యం
ముంచంగిపుట్టు: మండలంలో వనుగుమ్మ పంచాయతీ దొమినిపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో గల్లంతైన కిల్లో నర్సింగ్(28) అనే గిరిజనుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. చేపల వేటకు వెళ్లిన నర్సింగ్ ఈ నెల 10న గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్థానిక గిరిజనులు నాటు పడవలపై గాలించారు. అనంతరం విశాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెండు రోజులు విస్తృతంగా రెండు కిలో మీటర్ల మేర గాలించాయి. ఫలితం లేకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. 18రోజుల తరువాత ఆదివారం గిరిజనుడి మృతదేహం లభ్యమైంది. మేకల కాపర్లకు గెడ్డలో మృతదేహం తెలుతూ కనిపించింది. దిమినిపుట్టు గ్రామస్తులకు తెలియజేయడంతో వారు చూసి నర్సింగ్ మృతదేహంగా గుర్తించారు. రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆర్ఐలు రవికుమార్,భాస్కర్లు,వీఆర్వో విజయలక్ష్మీ,మండల వైఎస్సార్సీపీ నేతలు దేవా,నీలకంఠం,రాజేంద్ర,సీఐటీయూ నేత శంకర్రావు మత్స్యగెడ్డ నుంచి నర్సింగ్ మృతదేహానికి బయటకు తీశారు.మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది.పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
రహదారిపై పశువులు.. పెరుగుతున్న ప్రమాదాలు
వాహనచోదకులకు తప్పని పాట్లు చింతపల్లి: చింతపల్లిలో జాతీయ రహదారిపై అడ్డంగా పడుకుని పశువులే స్పీడుబ్రేకర్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం గూడెం కొత్తవీధి మండలం రొంపులు నుంచి లంబసింగి వరకూ 516 జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చింది.ఈ రహదారిపై ప్రతిరోజు అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు, వ్యాన్లతో పాటు బస్సులు పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. నిత్యం పశువులు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో వాటిని తప్పించబోయి అనేకమంది వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న ప్రమాదాల నుంచి ప్రాణాప్రాయ పరిస్థితుల వరకు చోటుచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్తితి చింతపల్లి మండల కేంద్రంలోనే కాకుండా గూడెంకొత్తవీధి మండలం రొంపులు ఘాట్ రోడ్డు మొదలుకుని చాపరాతి పాలెం, పెదవలస, రింతాడ, పెంటపాడు, రింతాడ, లోతుగెడ్డ జంక్షన్ రాజుపాకలు, లంబసింగి వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పరిస్థితి లేదని పలువురు వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై పశువులు తిష్టవేయడంతో ప్రమాదాల బారినపడుతున్న వాహనచోదకుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో ఈ పశువులు మకాం ఎక్కువగా ఉండడంతో ఎప్పుడు ఏ విద్యార్థికి ఏం జరుగుతుందోనని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రోడ్లుపై పశువులను విచ్చలవిడిగా విడిచిపెట్టే పశు యజమానులపై చర్యలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని పలువురు కోరుతున్నారు. -
ఒక సార్.. ఇద్దరు బాస్‌లు
● వాల్తేరు డివిజన్లో ఇద్దరు జీఎంల హడావుడి ● దక్షిణ కోస్తా జోన్ జీఎం సందీప్ మాధుర్ వరుస రివ్యూలు ● అదే సమయంలో ఈస్ట్ కోస్ట్ జోన్ జీఎం పరమేశ్వర్ పర్యటనలు ● గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతోనే తలపోటు ● ముంబై బదిలీ కోసం డీఆర్ఎం ప్రయత్నాలు ముమ్మరం కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది.. వాల్తేరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) పరిస్థితి. ఒక సార్‌కి ఇద్దరు బాస్‌లు ఉండడంతో ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. తెలియక అయోమయంలోనూ.. అదే సమయంలో ఒత్తిడికి గురవు తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎంని ప్రకటించిన కేంద్రం.. ఇంకా గెజిట్ విడుదల చేయకపోవడంతో ఎవరికి వారే అన్న చందంగా మారింది. ఇద్దరు జీఎంల మధ్య నలిగిపోతున్న డీఆర్ఎం.. ఇదేం బాధరా భగవంతుడా అనుకుంటూ బదిలీ కోసం పాట్లు పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి ఆరేళ్లు దాటినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి’ అన్నట్లుగా ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, రైల్వే బోర్డు నిర్లక్ష్యం కారణంగా కార్యకలాపాలు మొదలు కాలేదు. మూడు నెలల క్రితం దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా నియమితులైన సందీప్ మాధుర్ నెల రోజులుగా విశాఖలోనే ఉంటూ, గెస్ట్ హౌస్ నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ముడసర్లోవ ప్రధాన కార్యాలయ పనులు పర్యవేక్షిస్తూ, డీఆర్ఎం లలిత్ బోరాతో కలిసి సమీక్షలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే జోన్ ఏర్పాటు కాగితాలకే పరిమితం కావడంతో డీఆర్ఎంపై ఒత్తిడి మొదలైంది. నాకొద్దు బాబోయ్.! ఒక సార్ రివ్యూలు చేస్తూ బయలుదేరితే, మరొక సార్ ఫోన్లో ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా, డివిజనల్ అధికారుల పరిస్థితి ఇదే. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్త జీఎం, మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం కలిసి డీఆర్ఎంతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ముందు రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ కొత్త జీఎం రివ్యూలతో, ఆ తర్వాత రోజు ప్రస్తుత జీఎం పర్యటనలతో డీఆర్ఎం క్షణం తీరిక లేకుండా ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఇటీవల ఒక జీఎం పర్యటనలో ఉన్న సమయంలోనే, మరో జీఎం ఫోన్ చేసి లైన్లు పరిశీలించేందుకు వస్తున్నానని, ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ చేశారు. సమీక్షలు కూడా ఇరు జీఎంలు పోటాపోటీగా నిర్వహిస్తుండటంతో, వారికి సమాధానం ఇవ్వడంలోనూ, ఏర్పాట్లలోనూ అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. దీంతో అధికారుల్లో కొందరు తమ ఉద్యోగాలపై విరక్తి చెందుతూ తలలు పట్టుకుంటున్నారు. ఇక డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుటుంబంతో గడిపే తీరిక కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాల్తేరులో పనిచేయడం కంటే, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం మంచిదంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ముంబైకి బదిలీ చేయాలంటూ రైల్వే బోర్డును కోరినట్లు సమాచారం. గెజిట్ లేకపోవడమే అసలు సమస్య వాల్తేరు డివిజన్లో నెలకొన్న మొత్తం ‘తలపోటు’ వ్యవహారానికి ప్రధాన కారణం.. జోన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెజిట్ వస్తేనే సందీప్ మాధుర్ జోన్‌కు అసలైన జనరల్ మేనేజర్‌గా వ్యవహరించగలరు.. అప్పుడు కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. గెజిట్‌తో పాటు కార్యాచరణ ప్రకటించిన తర్వాతే.. జీఎంతో పాటు అసిస్టెంట్ జీఎం, 10 విభాగాలు, వాటి ప్రిన్సిపల్ హెచ్వోడీలు, సిబ్బంది సహా మొత్తంగా దాదాపు 180 మంది అధికారుల నియామకం పూర్తవుతుంది. వీరి నియామకం తర్వాతే జోన్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అధికారుల నియామకాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నా, గెజిట్ రాకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వాల్తేరు అధికారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరాకు కూడా జోన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. అడకత్తెరలో పోకచెక్కలా వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితిచురుగ్గా తాత్కాలిక కార్యాలయం పనులు వీఎంఆర్డీఏ ‘ది డెక్’లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త జోన్‌కు ఇప్పటికే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఏ), ఎలక్ట్రికల్ విభాగంలో హెచ్ఏజీ అధికారి (హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్)తో సహా మరో ఇద్దరి నియామకాలు పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా టెంపరరీ ఆఫీస్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కార్యాలయంలో విధులు ప్రారంభించాలన్నా గెజిట్ విడుదల తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. దీంతో గెజిట్ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇది నా సంస్థానమంటూ..! దక్షిణకోస్తా రైల్వే జోన్‌కు కొత్త జీఎంను నియమించినా గెజిట్ విడుదల చేయకపోవడంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనే వాల్తేరు డివిజన్ కొనసాగుతోంది. జీఎం సందీప్ మాధుర్ జోన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా.. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వరన్ ఫంక్వాలా కూడా హడావుడి మొదలుపెట్టారు. ఇంకా గెజిట్ రాకపోవడంతో వాల్తేరు డివిజన్‌కు తానే జీఎంనంటూ వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారు. -
గంజాయికి దూరంగా ఉండాలి
ఎస్పీ అమిత్ బర్దర్ ముంచంగిపుట్టు: గంజాయికి దూరంగా ఉంటే గిరిజనుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. మండలంలోని అత్యంత మారుమూల లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడ, బిరిగూడ గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ మారుమూల గ్రామాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంచరించుకుంది. కాలినడక గ్రామాలకు చేరుకుని, గిరిజనుల జీవన విధా నం, స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థులకు స్టడీమెటీరియల్,పెన్నులు,పెన్సిల్స్,స్వీట్లు పంపిణీ చేశారు. పలువురు పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. విద్యార్థులు చక్కగా చదవడంతో వారిని అభినందించారు. సుత్తిగూడలో పాఠశాలకు పక్కా భవనం లేక తమ పిల్లలు చదువుకునేందుకు అవస్థలు పడుతున్నారని,పక్కా భవనం నిర్మించే విధంగా చూడాలని,గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ,తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని,లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసు నడిపేలా చూడాలని గ్రామస్తులు కోరారు. తన దివ్యాంగ కుమారుడికి పింఛన్ మంజూరు చేయాలని ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా మంజూరు కాలేదని ఓ మహిళ ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ ఎస్కె.సాబాజ్ అహ్మద్, జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు,లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాఽథ్,పాడేరు,పెదబయలు ఎస్ఐలు సురేష్,రమణలు పాల్గొన్నారు. -
కలువ పూల కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి
చెరువులో మునిగి యువకుడి మృతి డుంబ్రిగుడ: కలువ పూల కోసం చెరవులో దిగి ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అరమ పంచాయతీ డుంబ్రివలస గ్రామానికి చెందిన పాంగి సంజీవరావు(21) అనే యువకుడు కలువ పూల కోసం గ్రామానికి సమీపంలోని నందివలస చెరువులో ఆదివారం దిగి, ఊబిలో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. సంజీవరావు ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. చెరువు గట్టు మీద యువకుడి దుస్తులు కనిపించడంతో దానిలో గాలింపు చర్యలు చేపట్టి, ఊబిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానఒక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. డుంబ్రివలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. డుంబ్రిగుడ పోలీసులు కేసు నమోదు చేసి నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అరకులోయ ఆస్పత్రికి తరలించారు. -
ప్రకృతి ఒడిలో పరవశం
చింతపల్లి: జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కళకళలాడాయి. కొండలు, కోనలు, జలపాతాలు, మంచు సోయగాలను చూస్తూ పరవశించిపోయారు. సెలవు దినం కావడంతో మైదాన ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ప్రకృతి ఒడిలో మైమరిచారు. ఆంధ్రా కశ్మీర్ లంబసింగి, చాపరాయి జలపాతానికి పోటెత్తారు. లంబసింగి సమీపంలో ఉన్న చెరువులువేనం వ్యూపాయింట్ వద్ద పాలసముద్రాన్ని తలపించే మంచు అందాలను తెల్లవారుజామున ఆస్వాదించి, సెల్ఫీలు తీసుకున్నారు. తాజంగి జలాశయం వద్ద జిప్‌లైనర్ ఎక్కి ఆనందంలో తేలియాడారు. ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. డుంబ్రిగుడ: చాపరాయి జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. ఏటా సెప్టెంబర్ నుంచి అధిక సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి భారీగా వస్తారు. ఈప్రాంతంలో జైపూర్ జంక్షన్, రైల్వే గేటు, కురిడి, పంతలచింత, ఆంత్రిగుడతో పాటు అరకు పీనరీలలో దారి పొడుగున వలిసె అందాలు కనువిందు చేస్తాయి. పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలివచ్చిన సందర్శకులు -
ఇండోర్ స్టేడియంకు మోక్షం
పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో గల ఇండోర్ స్టేడియానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పట్టణంలోని తలార్సింగి పాఠశాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియాన్ని 35 ఏళ్ల కిందట నిర్మించారు. పాడేరు పట్టణంలోని క్రీడాకారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రీడాకారులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడింది. ఈ స్టేడియంలో తర్ఫీదు పొందిన ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజయం సాధించారు. అంతటి ప్రాముఖ్యమున్న స్టేడియం మరమ్మతులకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి స్పందించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఆదివారం ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనులకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తనూజరాణి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించి, త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, చింతలవీధి ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, పెదబయలు జెడ్పీటీసీ కూడా బొంజుబాబు, పెదబయలు మాజీ ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, పెదబయలు మండల సర్పంచ్ల ఫోరం అద్యక్షుడు కాతరి సురేష్‌కుమార్, వైఎస్సార్సీపీ యువనేత కొర్రా అంబేడ్కర్, వైఎస్సార్సీపీ శ్రేణులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
బొంగదారి జలపాతం అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్ పెదబయలు: మండలంలోని అరడకోట పంచా యతీ బొంగదారి జలపాతం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన కిలో మీటరు దూరం కాలినడకన వెళ్లి జలపాతాన్ని సందర్శించారు. అనంతరం బొంగదారి పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి సీసీ రోడ్డు, డ్రైనేజీలు, చెక్ డ్యాం మంజూరు చేయాలని, జలపాతం వద్దకు వెళ్లేందుకు రోడ్డు, కల్వర్టు నిర్మించాలని వైస్ ఎంపీ పీ రాజుబాబు, గ్రామస్తులు కోరారు. స్పందించి న కలెక్టర్ అన్ని పనులకు అంచనాలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా సిల్వర్ ఓక్, కాఫీ, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్. పూర్ణయ్య, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు మూల్యం చెల్లించక తప్పదు
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ అరకులోయటౌన్: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కూటమి నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ పదవుల్లో ఉన్న పార్టీ నాయకులతో కలిసి డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించి వేధిస్తోందని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిజిటల్బుక్ ఆధారంగా చట్టబద్ధంగా బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నాయకులు అక్రమ కేసులు పెట్టినా, దాడులు జరిపినా డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నారు, అధికార మదంతో అక్రమ కేసులు పెట్టిన కూటమి నాయకులు, పోలీసులు ఎక్కడన్నా చట్ట పరంగా శిక్ష విధించి, జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ, డుంబ్రిగుడ జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చటారి జానకమ్మ, అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, స్వాభి రామచందర్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, సర్పంచ్‌లు రాధిక, గుమ్మా నాగేశ్వరరావు, దురియా భాస్కర్‌రావు, పాగి అప్పారావు, సెంబి సన్యాసిరావు, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణిక్య, డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గండేరు సత్యం, మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పరశురాం, కొర్రా సూర్యనారాయణ, పార్టీ ఉపాధ్యక్షులు ధనరాజు, జి.ప్రకాష్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, గ్రీవెన్స్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సందడి కొండబాబు, కల్చరల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షురాలు బంగురు శాంతి, మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వరరావు, నాయకులు ఎల్.బి. కిరణ్, ఒలేసి కుమార్, కామేశ్వరరావు, సుందర్రావు,చందు,మదీన పాల్గొన్నారు. -
గోదారి దోబూచులాట
తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన వరద ముంపులో పలు రహదారులు అవస్థలు పడుతున్న విలీన మండలాల ప్రజలు చింతూరు: గోదావరి వరద తగ్గుతూ...పెరుగుతూ దోబూచులాడుతోంది. తగ్గినట్లే తగ్గి, తెల్లారే సరికి మళ్లీ పెరగడంతో విలీన మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండండంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఆదివారం ఉదయం భద్రాచలం వద్ద 42.1 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం తిరిగి ఏడు గంటల నుంచి క్రమంగా పెరుగుతూ 43 అడుగులు దాటడంతో అధికారులు మరోమారు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఆదివారం రాత్రి గోదావరి నీటిమట్టం 43.3 అడుగులకు చేరుకుంది. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితే గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది. వరద మళ్లీ పెరుగుతుండడంతో కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు మండలాల్లో పలు రహదారులు ముంపులో ఉండడంతో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో కుయిగూరువాగు వరద నీరు జాతీయ రహదారి పై నిలిచి ఉండడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వల్పంగా తగ్గిన శబరినది చింతూరు మండలంలో శబరినది వరద నెమ్మదిగా తగ్గుతోంది. శనివారం రాత్రికి 35 అడుగులకు చేరుకున్న శబరినది నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రికి 31.5 అడుగులకు చేరింది. కాగా రహదారులపై వరదనీరు ఇంకా నిలిచి ఉండడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగడంలేదు. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద కారణంగా చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ వరుసగా మూడోరోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే రహదారిలో చింతూరు మండలం నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, చినశీతనపల్లి, బొడ్రాయిగూడెం, కొండపల్లి, పెదశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు రాకపోకలు కొనసాగడంలేదు. కుయిగూరువాగు వరద కారణంగా కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది, కుయిగూరు గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు. మండలంలో ముంపునకు గురైన వరిపంట కుళ్లిపోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపులో కొండ్రాజుపేట రహదారి కూనవరం: భద్రాచలంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం నుంచి కూనవరం టు భద్రాచలం మార్గంలో పోలిపాక వద్ద రూట్ క్లీరైంది. దీంతో వాహనాల రాకపోకలు సాగాయి. కొండ్రాజుపేట రహదారి మూడవ రోజు కూడా వరద ముంపులోనే ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద నీరు తగ్గుతూ పెరుగుతుండడంతో భద్రాచలం టు కూనవరానికి రూటు ప్రయాణానికి అనువుగా ఉన్నదీ లేనిది తెలియక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మిర్చి రైతులకు తీవ్ర నష్టం ఎటపాక: గోదావరి వరద కారణంగా నాలుగు రోజులుగా మిర్చి తోటల్లో నీరు నిలువ ఉండడంతో మొక్కలు కుళ్లిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో 850 ఎకరాల్లో మిర్చి సాగుచేస్తున్నారు. నందిగామ,తోటపల్లి,నెల్లిపాక,మురుమూరు వాగుల పరీవాహక ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాల్లో పంట నీటి మునిగింది. దీంతో రూ.25 లక్షల వరకూ నష్టం జరిగింది. వరద ముంపు ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే అదును దాటి పోయి, మరోసారి మిర్చి నారు వేసే అవకాశం లేకుండా పోతుంది. ఈఏడాది రబీ ప్రారంభంలోనే అన్నదాతను వరద కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. వరద కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. -
బస్ సర్వీసు పునరుద్ధరణ
సీలేరు: విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా నడిచే అంతర్ రాష్ట్ర నైట్సర్వీసు బస్సును పునరుద్ధరించినట్టు విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు నిలిపివేసిన బస్సును ఆదివారం నుంచి మళ్లీ నడుపుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రతిరోజు విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి రెండు గంటలకు సీలేరు, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని చెప్పారు. అదే బస్సు సాయంత్రం 6 గంటలకు భద్రాచలంలో బయలుదేరి రాత్రి 11 గంటలకు సీలేరు, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. సీలేరు నైట్ హాల్ట్‌తో సహా అన్ని బస్సులను నడుపుతున్నామని ఆమె తెలిపారు. -
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ తగదు
డుంబ్రిగుడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని అల్లూరి జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీమోహన్ పట్నాయి అన్నారు. అరకులో ఆయన మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థుల ఉన్నత ప్రగతికి మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాడేరులో ఏర్పాటు చేశారన్నారు. ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు సాగించడం సరికాదన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పూనుకుంటే న్యాయ, ప్రజాపోరాటం సాగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే మత్స్యలింగంతో కలిసి సంయుక్త పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలు
సాక్షి, అనకాపల్లి: సోషల్ మీడియాలో మహిళలను అగౌరవపరుస్తూ అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తప్పవని డీఐజీ గోపినాథ్ జట్టి హెచ్చరించారు. శనివారం విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ పోస్టును క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. ఆయన పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యంతకర పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తరచుగా అభ్యంతకర పోస్టులు పెట్టే వారి వివరాలు సేకరించాలని, వీరికి సహకరిస్తున్న వ్యక్తులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తులపై ఇప్పటికే 134 కేసులు నమోదు చేసి, 106 మందిని అరెస్ట్ చేశామన్నారు. 57 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా 25 కేసులకు సంబంధించి విచారణ కూడా చేస్తున్నామని తెలిపారు. డీఎస్పీలు కూడా వారి పరిధిలోని పోలీస్స్టేషన్లలో నమోదైన సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి ఎస్పీ అమిత్ బర్దర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీలతో పాటు డీఎస్పీలు పాల్గొన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి -
భగత్రామ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ
సీలేరు: చింతపల్లి క్యాంపు గ్రామంలో ఈ నెల 21 హత్యకు గురైన వంతల భగత్రామ్ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అతని భార్య సోమరి, బంధువులు డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. మొదటినుంచి భగత్రామ్పై నిందితుడు కక్ష కట్టడమే కాకుండా హత్యచేస్తానని పలుసార్లు బెదిరించాడన్నారు. ఈ నేపథ్యంలో భగత్‌రామ్‌ను ఒంటరిగా రమ్మని పిలిచి హత్యచేశారన్నారు. ఈ సమయంలో వీళ్లు కొట్టేస్తున్నారని, నన్ను వీళ్లు చంపేస్తున్నారని ఫోన్లో భర్త అనడం అనుమానం కలిగిస్తోందన్నారు. నిందితుడు ఒక్కడే తన భర్తను హత్యచేయడం సాధ్యపడదన్నారు. మరికొంతమంది పాల్గొన్నట్టుగా తమకు అనుమానం ఉందన్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపి హత్యకేసును మరోసారి పూర్తిస్థాయిలో విచారణ చేయడమే కాకుండా ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిందితులు గ్రామంలోకి వస్తే శాంతిభద్రతలు సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున వారిని వేరే ప్రాంతానికి తరలించాలని చింతపల్లి క్యాంపు గ్రామానికి చెందిన రెండు వీధుల గిరిజనులు సీలేరు పోలీసులకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఇలావుండగా ఈ విషయంపై సీఐ వరప్రసాద్‌ను వివరణ కోరగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని.. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. మృతుని బంధువులు ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. భార్య సోమరి, బంధువుల డిమాండ్ -
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
● భవానీ మాలధారులతో కిక్కిరిసిన ఆలయం ● భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ సారే ఊరేగింపు సీలేరు: దుర్గమ్మ తల్లి శరన్ననరాత్రుల్లో భాగంగా వాడవాడలా భకిశ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయి. మహాలక్ష్మీ దేవి అలంకరణతో అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధారకొండ దారాలమ్మ ఆలయంలో శనివారం పెద్ద ఎత్తున భవానీ మాలధారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ధారకొండ గ్రామంలో మహిళలు అమ్మవారి సారె ఊరేగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండపంలో కుంకుమ పూజలను అర్చకుడు రామశర్మ నిర్వహించారు. సీలేరులో అమ్మవారికి లక్ష్మీ పూజను దామోదరం నిర్వహించారు. శివాలయం మారెమ్మ తల్లి, వనదుర్గ, ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. చింతపల్లి: శవన్నవరాత్రులు సందర్భంగా శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రం హైస్కూల్ జంక్షన్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మను జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య పడాల్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి చింతపల్లి కేంద్రంలో ఆనాదీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. -
వనం–మనంలో భాగస్వాములు కావాలి
రంపచోడవరం: ఏజెన్సీలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది వనం–మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని స్థానిక ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ సూచించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వనం–మనం కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఏజెన్సీలోని గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన మొక్కలపై మండల అధికారులు నివేదికలు సమ ర్పించాలన్నారు. ఉపాధిహామీ పథకం, అటవీశాఖ ద్వారా ఏ మొక్కలు రైతులు నాటుకోవచ్చు తెలుసుకోవాలని సూచించారు. ప్రతీ తల్లి పేరున ఒక మొక్క నాటేలా అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీలో నర్సరీల వివరాలను తెలుసుకున్నారు. తమ ఐటీడీఏ పరిధిలో 120 పంచాయతీల్లో 13,354 ఎకరాల్లో 12లక్షల 83వేల 851 మొక్కలను రానున్న ఐడేళ్లలో ఉపాధి హామీ పథకంలో నాటేందుకు ప్రతిపాదించామన్నారు. ఉద్యానవన, అటవీ అధికారులతో ఐదేళ్ల కార్యాచరణపై సమీక్షించారు.అన్ని మండలాల ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించిన ఆయన వనం–మనం యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. ఈ సమావేశంలో డీడీ రుక్మాండయ్య, ఏపీవో డీఎన్వీ రమణ, డీఎఫ్‌వో అనూష, డీఈవో మల్లేశ్వరరావు, ఏడీ సావిత్రి పాల్గొన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ -
సంతకు పండగ శోభ
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లోని వారపు సంతల్లో దసరా సందడి నెలకొంది. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతకు వివిధ గ్రామాల కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పండగ సమీపించడంతో మారుమూల గిరి గ్రామాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు సంతకు తరలివచ్చారు. వారికి అవసరమైన నిత్యావసర సరకులు, పండగ సామాన్లను కొనుగోలు చేశారు. పూలు, పండ్లు, కొబ్బరికాయల అమ్మకాలు భారీగా జరిగాయి. తరలివచ్చిన గిరిజనం ముంచంగిపుట్టు వారపు సంతలో దసరాతో మేకలు, నాటుకోళ్లుకు మంచి గిరాకీ ఏర్పడింది. మేకలను, కోళ్లును కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. దీంతో వాటి ధరలు అమాతం పెరిగిపోయాయి. ధరతో సంబంధం లేకుండా కొనుగోలుకు గిరిజనులు పోటీపడ్డారు. నాటుకోడి సైజును బట్టి రూ.500 నుంచి రూ.3000 వరకు ధర పలికింది. ఒక్కో మేక రూ.5000 నుంచి రూ.15 వేలకు పైగా ధరకు అమ్ముడయ్యాయి. పండుగ సంత వ్యాపారం బాగుందని అమ్మకందారులు హర్షం వ్యక్తం చేశారు.మేకలు, నాటుకోళ్లకు గిరాకీ -
రాష్ట్రంలో గాడితప్పిన పాలన
పాడేరు : రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పిందని కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు డిజిటల్ బుక్ క్యూఆర్‌కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు బకాయిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు తెగబడి అక్రమ కేసులు, అరెస్ట్‌లు చేస్తోందన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలు డిజిటల్ బుక్‌లో పేర్లు నమోదు చేసుకుని పూర్తి సమాచారం పొందుపర్చాలన్నారు. ఈ సేవలను ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు.. అరకు ఎంపీ తనూజరాణి కూటమి ప్రభుత్వానికి పాలన చేతకాక వారు చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టడం ఏమిటని అరకు ఎంపీ తనూజరాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని రెడ్‌బుక్ రాజ్యంగాన్ని అమలు చేస్తుందన్నారు. ఓ వైపు పార్టీ నాయకులకే కాకుండా మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. తగిన ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతూ భయానక పరిస్థితులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం చర్యలు కార్యకర్తలకు అండగా ఉంటాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు జిల్లా కేంద్రంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణ -
దారులన్నీ ఏరులై. .
చింతూరు: విలీన మండలాల ప్రజలను ఐదోసారి బెంబేలెత్తించిన గోదావరి ఎట్టకేలకు శాంతించింది. భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతుండడంతో విలీన మండలాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మ రోవైపు భద్రాచలం వద్ద గోదావరి తగ్గుతున్నా బ్యాక్‌వాటర్ ప్రభావంతో కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో గోదావరి, శబరినదుల వరద శనివారం రాత్రి వరకు పెరుగుతూనే ఉంది. ● వాయుగుండం వల్ల తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరిగి గోదావరి ఆదివారం నుంచి పెరిగే అవకాశముందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 6గంటలకు భద్రాచలం వద్ద గరిష్టంగా 46.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం పది గంటల వరకు నిలకడగా మారింది. అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ రాత్రికి 42.9 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ● కూనవరం వద్ద శనివారం రాత్రికి గోదావరి నీటిమట్టం 44.5 అడుగులకు చేరుకోగా చింతూరు మండలంలో శబరినది నీటిమట్టం 35 అడుగుల వద్ద నిలకడగా ఉంది. గోదావరి, శబరినదులు ఉధృతి వల్ల వరదనీరు రహదారులపై చేరడంతో చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల్లో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● చింతూరు మండలంలో కుయిగూరువాగు వరదనీరు జాతీయ రహదారి–326 పైకి చేరడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీసంఖ్యలో వాహనాలు నిమ్మలగూడెం వద్ద ఆగిపోయాయి. వరద కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయిన గ్రామాలకు నిత్యావసరాలతో పాటు తాగునీరు అందించాలని బాధితులు కోరుతున్నారు. చింతూరు మండలంలో : గోదావరి ఎగపోటుకు తోడు భారీవర్షంతో ఎగువనుంచి వస్తున్న వరదనీటితో చింతూరు మండలంలో శబరినది శనివారం మరింత పెరిగింది. దీంతో మండలంలోని జల్లివారిగూడెం, సోకిలేరు, కుయిగూరు, చంద్రవంక, చీకటివాగులు పొంగి వరదనీరు రహదారులను ముంచెత్తింది. ● జల్లివారిగూడెం, సోకిలేరు, చీకటివాగుల వరద కారణంగా వరుసగా రెండోరోజు కూడా చింతూరు నుండి వీఆర్‌పురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు మండలంలోని నర్శింగపేట, ముకునూరు, పెదశీతనపల్లి, కొండపల్లి, బొడ్రాయిగూడెం, రామన్నపాలెం, చినశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● చంద్రవంకవాగు కారణంగా కుమ్మూరుకు, కుయిగూరువాగు కారణంగా కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది, కుయిగూరు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లోకి వరదనీరు మరోవైపు గత నెలలో వరద వచ్చి తగ్గడంతో మళ్లీ వరద రాదని భావించి చాలామంది రైతులు వాగుల పరివాహక ప్రాంతాల్లో వరినాట్లు వేశారు. తిరిగి ఊహించని విధంగా వరి పొలాల్లోకి వరదనీరు చేరుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎరువులు సక్రమంగా అందకపోయినా అప్పులు చేసి మరీ ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసి పంటలకు వేశామని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కూనవరం వద్ద శబరి, గోదావరి నదులకు వరద పోటెత్తింది. శనివారం కూనవరం టు భద్రాచలం ప్రధాన రహదారిపైన పోలిపాక, ముర్మూరు మధ్యలో ఆర్అండ్బీ రోడ్డుపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం, కూనవరం నడుమ రాకపోకలు స్తంభించాయి. గత మూడు రోజుల నుంచి కొండ్రాజుపేట రహదారి వరద ముంపులో ఉన్నందున 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద బ్రిడ్జిని తాకుతూ గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.విలీన మండలాల్లో ఐదోసారి సంభవించిన గోదావరి వరద ప్రజలను కష్టాల పాల్జేసింది. గోదావరి శాంతించినా ఇప్పటికీ గ్రామీణ రహదారులు ముంపులోనే ఉన్నాయి. వీఆర్‌పురం మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 300 ఎకరాల్లో పొగాకు, మిర్చినారు, వరినాట్లు నీట మునగడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 300 ఎకరాల్లో నీటమునిగిన పంటలువీఆర్పురం: మండలంలో సుమారు 300 ఎకరాల్లో పొగాకు, మిర్చినారు, వరినాట్లు నీటమునిగాయి.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీరామగిరి గ్రామంలో వరదనీరు ఇళ్లవద్దకు చేరడంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వడ్డిగూడెం చుట్టూ వరదనీరు పొంచి ఉండటంతో గ్రామస్తుల్లో భయం నెలకొంది. చింతరేగుపల్లి, కన్నాయిగూడెం, రామవరం, తుష్టివారిగూడెం, శ్రీరామగిరి, సీతంపేట, పోచారం, ఇప్పూరు ప్రాంతాల్లో వరదనీరు రహదారులపై చేరడంతో అధికారులు నాటు పడవలను ఏర్పాటుచేశారు. 70 గ్రామాలకు రాకపోకలు బంద్ భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ విలీన మండలాల్లో తగ్గుముఖం పట్టని వరద ప్రభావం శబరి నది ఎగపోటుతో ఉప్పొంగిన వాగులు -
డొంకరాయి నుంచినీరు విడుదల
మోతుగూడెం: ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండిపోయాయని డొంకరాయి డ్యామ్ ఏఈ శివశంకర్ శనివారం తెలిపారు. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని డొంకరాయి ప్రధాన ఆనకట్ట ఏడో గేటును 2.90 అడుగుల మేర ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ఆనకట్ట గరిష్ట నీటిమట్టం 1037 అడుగులు కాగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం సాయంత్రానికి నీటిమట్టం 1035.60 అడుగులకు చేరుకుందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో మూడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నీటి మట్టం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత గేటును మూసివేస్తామని ఆయన తెలిపారు.6 నుంచి క్రీడా పోటీలు అరకులోయ టౌన్: మండల, డివిజన్ స్థాయి లో అన్ని రకాల క్రీడా పోటీలు, రాష్ట్ర స్థాయిలో కేవలం ఆర్చరీ పోటీలు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు పాంగి సూరిబాబు, కె. భవాని ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 6,7 తేదీల్లో మండల స్థాయిలో నిర్వహిస్తామ న్నారు. 8 నుంచి 11 వరకు డివిజన్ స్థాయి, 23 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.రేపు జాబ్ మేళా వై.రామవరం: రంపచోడవరంలోని భాను సప్లై భవనంలో ఈనెల 29న అంబుజా ఫౌండేషన్, హెచ్డీఎఫ్సీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు అంబుజా సెంట్రల్ మేనేజర్ బి.శ్రీకాంత్ తెలిపారు. అదేరోజు ఉదయం ఉదయం పది గంటల నుంచి 300కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుతాయన్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూస్టార్, బ్లూఓషన్ తదితర కంపెనీలు పాల్గొంటున్నట్టు తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, పాస్‌పోర్టుసైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు అంబుజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను 9494546366, 9701869742 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
‘పోలవరం’ రైతులకు ప్రత్యామ్నాయ భూములు
● భూసేకరణ ప్రక్రియ వేగవంతం ● కలెక్టర్ దినేష్‌కుమార్ సాక్షి,పాడేరు: పోలవరం ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన రైతులు, గిరిజనులకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాల్సిందేనని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి రంపచోడవరం, చింతూరు డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పునరావాస -
డాక్టర్ విజయలక్ష్మికి నేషనల్ సేవా ఐకాన్ అవార్డు
డాబాగార్డెన్స్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ, విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ యోగ అండ్ మెడిటేషన్ (సిమ్) డైరెక్టర్, అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ అధికారి డాక్టర్ వై.విజయలక్ష్మికి నేషనల్ సేవా ఐకాన్ అవార్డు అందజేశారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రెండు దశాబ్దాలుగా పర్యావరణం, యోగా, ఆరోగ్య రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డు అందజేశారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రీజినల్ డైరెక్టర్ జీవీబీ జగదీష్, జిల్లా టూరిజం అధికారి ఎం.మాధవి, డాక్టర్ హరిప్రసాద్, వాస్తు రత్నభూషణ్ డాక్టర్ పట్నాయక్ నారాయణమూర్తి, ప్రముఖ దర్శకుడు మణిభూషణ్కుమార్ చేతుల మీదుగా విజయలక్ష్మి పురస్కారం, ధ్రువపత్రం అందుకున్నారు. ఆమెను బి.రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్‌కుమార్ నాయక్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి,పాడేరు: దుర్గమ్మతల్లి నవరాత్రి ఉత్సవాలను జిల్లాలోని అన్ని దేవతామూర్తుల ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నాల్గోవ రోజు శుక్రవారం దుర్గమ్మతల్లితో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను మహాలక్ష్మిగా అలంకరించారు. భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. పాడేరులోని రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గమ్మ, మహాలక్ష్మితల్లి ఆలయాలతో పాటు అరకులోయలోని మల్లికార్జునస్వామి సమేత భ్రమరాంభిక తల్లికి కుంకుమార్చన చేశారు. జి.మాడుగుల: మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ జంక్షన్ వద్ద భవానీ పీఠంలో గురువారం మహాలక్ష్మి అవతారం అమ్మవారికి భక్తులుప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ దుర్గమ్మ అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండబాబు, దంపతులు, భక్తులతో కలిసి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బంధవీధి గ్రామంలో భారీ అన్నసమారాధ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎస్ఎఫ్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉత్సవ కమిటీ సభ్యులు స్వామినాయుడు, చంటి, సత్తిబాబు, భాస్కరరావు, శ్రీను, చిరంజీవి, నానాజీ, కొండలరావు, గణేష్, మణికంఠ, నాగేశ్వరరావు, కృష్టమూర్తి తదితరులు పర్యవేక్షించారు. సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలోభక్తులు పాల్గొన్నారు. కొయ్యూరు: మండల కేంద్రంలో భవానీ భక్తులు గురువారం రాత్రి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు పూజ జరిగింది.స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
జాబ్‌మేళాలో 40 మంది ఎంపిక
చింతపల్లి: చింతపల్లి డిగ్రీ కళాశాలలో మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాబ్ మేళాలో 40 మంది అభ్యర్థులు ఎంపికై నట్టు సాఫ్ట్వేర్ ట్రైనర్ సీహెచ్.శివమణి తెలిపారు.శుక్రవారం డిగ్రీ కళాశాలలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియు జీకేవై )సౌజన్యంతో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లబించింది.ఈ జాబ్‌మేళాలో 40 నిరుద్యోగ యువత శిక్షణకు ఎంపికయ్యారు. ఆయా అభ్యర్థులకు విశాఖపట్నం శీలా డిడియుజీకేవైలో ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 8న మరో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ప్రతినిధులు అరవింద్, నేహడాలి, గాయత్రి తదితరులు ధ్రువపత్రాలను పరిశీలించారు. కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
వాడీవేడిగా సర్వసభ్య సమావేశాలు
చింతపల్లిలోని సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనూషదేవి,పక్కన జెడ్పీటీసీ బాలయ్యపడాల్, ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఎటపాకలోని సమావేశంలో వ్యవసాయాధికారిని ప్రశ్నిస్తున్న ఎంపీటీసీ పాయం దేవిచింతపల్లి: మండలంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు సహకరించాలని ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్యపడాల్ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడీఓ సీతామహాలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ శివారు గ్రామాలకు రహదారులు సౌకర్యానికి అటవీశాఖ అనుమతులు నిరాకరించడం మంచి పరిణామం కాదన్నారు.విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు విద్యాశాఖ అధికారులు పాఠశాలలను విధిగా పర్యవేక్షించాలన్నారు. లోతుగెడ్డ వంతెన నుంచి కోరుకొండ వరకు జరుగుతున్న రహదారి పనులు నిలిపివేయడంపై ఆందోళన చేస్తామని, త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తిచేయాలన్నారు. తాజంగి బస్పు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అనూషదేవి కోరారు. బలపం–కోరుకొండ బస్ సర్వీసు సమయాన్ని మార్పుచేయాలని సర్పంచ్ కోరగా, పెద్దగెడ్డ నుండి కొండవంచులుకు బస్ పునురుద్దరించాలని ఎర్రబోమ్మలు ఎంపిటీసి సత్తిబాబు ఆర్టీసి అదికారులను కోరారు. లోతుగెడ్డలో డైరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సునిల్ కుమార్ వెలుగు ఏపీఎంను కోరారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని మంచినీటి విభాగం ఏఈని సూచించారు. వైస్ ఎంపీపీలు గోపినాయక్ శారద, వెంగళరావు, తహసీల్దార్ ఆనందరావు, ఏఎంసీ చైర్మ్న్ ఊర్మిళ,ఏఓ మదుసుదన్రావు,ఏపిఓ రాజు,ఏపీఎం ఽశ్రీనివాసరావు, ఏటీడబ్ల్యూవో నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఎటపాక: కష్ట నష్టాలతో సాగు చేస్తున్న రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..వారికి మేమేం సమాధానం చెప్పాలంటూ అధికారులను ప్రశ్నించారు ప్రజాప్రతినిధులు. శుక్రవారం ఎటపాక మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కాక కామేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులు వివిద శాఖల అధికారులను నిలదీశారు. అరకొర యూరియా తెచ్చి రైతులను క్యూలైన్లో ఉంచి ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని గొమ్ముకొత్తగూడెం ఎంపీటీసీ పాయం దేవి వ్యవసాయశాఖ తీరుపై మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ, ఇతర పథకాలు లబ్ధిదారుల ఎంపికలో కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయశాఖ ఉద్యోగులు సర్పంచ్‌లకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని రాయనపేట, టీపీవీడు సర్పంచ్‌లు అలివేలు,రాజులు చెప్పారు. తక్కువ మోతాదులో పశుదాణ పంపిణీపై పలువురు అధికారులను ప్రశ్నించారు. తక్కువగా సరఫరా జరిగినట్టు అధికారులు సమాధానమిచాచరు. గ్రామాల్లో జల్‌జీవన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని ,పలుచోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యను ఎందుకు పరిష్కరించరని నందిగామ, కృష్ణవరం సర్పంచ్‌లు బాలకృష్ణ, కృష్ణ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నిలదీశారు. తహసీల్దార్ సుబ్బారావు మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అవకతవకలు జరుగకుండా క్యూఆర్ కోడ్ ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు ఉబ్బా సుస్మిత, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ముంచంగిపుట్టు: క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి అన్నారు.మండల కేంద్రంలో సీహెచ్‌సీను శుక్రవారం ఆమె సందర్శించారు.రక్త పరీక్ష గది పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. ప్రసుత్తం నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు.అనంతరం కిలగాడ పీహెచ్సీను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపై తెలుసుకున్నారు. మలేరియా మందు పిచికారీపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని, దోమ తెరలు వినియోగించేలా చూడాలని, మలేరియా, టైఫాయిడ్ పాజిటివ్ కేసు నమోదైన వెంటనే తక్షణమే వెద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. కిలగాడ పీహెచ్సీ వైద్యాధికారి శిరీష, ఎంపీహెచ్వోలున్నారు. -
అరకు ఎంపీ చొరవతో దివ్యాంగునికి వీల్‌చైర్
పెందుర్తి: అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి చొరవతో ఓ దివ్యాంగునికి విశాఖపట్నం సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వీల్‌చైర్ సమకూర్చారు. జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం సమీపంలోని గవరపాలెం కాలనీకి చెందిన బి.శ్రీనివాసరావుకు రెండుకాళ్లు వైకల్యం ఉంది. ఈ క్రమంలో తనకు వీల్‌చైర్ సమకూర్చాలని కోరుతూ అరకు ఎంపీ తనుజారాణికి విన్నవించుకున్నారు. వెంటనే స్పందించి దివ్యాంగుడు శ్రీనివాసరావుకు వీల్‌చైర్ సమకూర్చాలని సిటిజన్ వెల్ఫేర్‌కు ఎంపీ సూచించారు. శుక్రవారం వేపగుంటలో జరిగిన కార్యక్రమంలో పెదబయలు మాజీ ఎంపీపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ చేతుల మీదుగా శ్రీనివాసరావుకు వీల్‌చైర్‌ను అందించారు. ఈ సందర్భంగా ఎంపీకి శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
దారుణ దారులు
రాజవొమ్మంగి: పరిమితికి మించి అధిక బరువుతో రాజవొమ్మంగి మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న క్వారీ, కలప లారీల వల్ల రహదారులు చిధ్రంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్లు కోతకు గురై రాళ్లు తేలడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజవొమ్మంగి మండలంలోని వయ్యేడు, అప్పలరాజుపేట, బడదనాంపల్లి గ్రామాల నుంచి బెంగుళూరు తదితర ప్రాంతాలకు తాటిచెట్లు, జామాయిల్, సర్వే కలప అధిక లోడుతో వెళుతున్న సుమారు20 టన్నుల నుంచి 30 టన్నుల వరకు లారీలు బీటీ రహదారులను ముక్కలు చేస్తున్నాయి. మరో వైపు ఏలేశ్వరం నుంచి ఈ ప్రాంతానికి చిప్స్ (నల్లమెటల్) క్వారీ బూడి దతో తిరుగుతున్న టిప్పర్లు, లారీలను అదుపు చేసేవారే లేకపోవడంతో రహదారులు చిధ్రంగా మారి పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతుల్లో పడి వాహనచోదకులు గాయాలపాలవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. వేయింగ్ మిషన్‌పై లోడును చెక్ చేసిన తరువాతనే కలప, క్వారీ లారీలకు పర్మిషన్ ఇవ్వాల్సిన అధికారులు అవేవీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరో వైపు రాత్రి వేళల్లో దొంగచాటుగా తిరుగుతున్న భారీ కలప వాహనాలను ఇటు పోలీసులు, అటు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో లారీ, టిప్పర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ భారీ వాహనాల రాకపోకలను కట్టడి చేయాలని, నిబంధనల ప్రకారం లారీలను చెక్ చేసి పంపించాలని కోరుతున్నారు. భారీ లోడ్ల లారీలతో దెబ్బతింటున్న రహదారులు రాకపోకలకు ఇక్కట్లు పెరుగుతున్న ప్రమాదాలు చోద్యం చూస్తున్న అధికారులు -
ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశంసాక్షి,పాడేరు: జిల్లాలో రహదారులు,భవన నిర్మాణాలకు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల ని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ లో శుక్రవారం పలు ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఆయ న సమీక్షించారు. నాబార్డులో మంజూరైన రోడ్డు పనులను నవంబర్‌లో ప్రారంభిస్తామని ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు కలెక్టర్‌కు నివేదించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఘాట్‌రోడ్లలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని, పాడేరు ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణానికి సంబంధించి డిజైన్ రుపోందించాలని, ముందుగా ప్రహరీ పూర్తి చేయాలని సూచించారు. పీఎం జన్మన్ భవనాలు, మల్టీపర్పస్ భవనాలు, అంగన్వాడీ, బర్త్ వెయిటింగ్ హాళ్లు, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్అండ్బీ, సీసీడీపీ పనులపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. గ్రౌండింగ్ చేయాల్సిన పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వేగవంతం చేయాలన్నారు. గోకులం షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసి డెయిరీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవోలంతా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి, పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, అపూర్వభరత్, స్మరణ్‌రాజ్, పలు ఇంజనీరింగ్‌శాఖల ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు. -
రోగిని తరలించేందుకు అష్టకష్టాలు
● మంచంపై మోసుకుని అంబులెన్సు వరకు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు ● రహదారి సౌకర్యం లేక మొక్కపుట్టు గిరిజనుల అవస్థలు ముంచంగిపుట్టు: అనారోగ్యానికి గురైన గిరిజనుడిని ఆస్పత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మాకవరం పంచాయతీ మొక్కపుట్టు గ్రామానికి చెందిన మండి మంగరాజు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం అతని అరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. రహదారి సౌకర్యం లేనందున గ్రామానికి 108 వాహనం రాలేని పరిస్థితి. దీంతో రహదారి సౌకర్యం ఉన్న లబడపుట్టు వరకు రెండు కిలోమీటర్ల మేర మొక్కపుట్టు నుంచి మంచంపై ముగ్గురు యువకులు అతనిని మోసుకుని తీసుకు వచ్చారు. అక్కడి నుంచి 108 ఎక్కించి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. తక్షణమే గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని పీసా కమిటీ కార్యదర్శి వంతాల లక్ష్మణ్, మొక్కపుట్టు గ్రామ గిరిజనులు రాజేంద్ర, పితంబరం, శ్యామలరావు, జగన్, పద్మ కోరారు. -
పది రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలి
● చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ కూనవరం: చినార్కూరు పంచాయతీ తెల్లవారి వారి గుంపు నుంచి శబరి కొత్తగూడెం వరకు వేసిన మట్టిరోడ్డు (ఫార్మేషన్ రోడ్డుపై) పది రోజుల్లో బీటీ రోడ్డు నిర్మించాలని చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని చినార్కూరు, కొత్తూరు, శబరి కొత్తగూడెం, కొండ్రాజుపేట గ్రామాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పూసుగూడెం పాఠశాల భవనాన్ని రీమోడలింగ్ చేస్తామన్నారు. కొత్తూరు నుంచి శబరి కొత్తగూడెం రచ్చబండ వరకు సీసీ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కొండ్రాజుపేట సచివాలయాన్ని ప్రారంభించే విషయంపై అధికారులతో చర్చించారు. చినార్కూరు నుంచి టేకులబోరు వరకు వరద ముంపునకు గురవుతున్న రోడ్డు మరమ్మతులు చేపడతామని చెప్పారు. శబరి కొత్తగూడెం గ్రామస్తులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి భూమికి భూమి 2వేల ఎకరాలు సేకరించామని, మిగిలిన భూమిని అడ్డతీగల, రాజవొమ్మగిలో సేకరించనున్నట్టు తెలిపారు. గిరిజన నిర్వాసితులకు స్థలాలకు బదులుగా నగదు పరిహారం అందిస్తామని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. చినార్కూరు పంచాయతీలో జెడ్, జీకి సంబంధించిన భూములు గత రెండు నెలల నుంచి వరద ముంపులో ఉన్నాయని వ్యవసాయం చేసే పరిస్థితి లేదని, వాటికి పోలవరం ప్యాకేజి ఇప్పించాలని ఎంపీపీ పాయం రంగమ్మ , సర్పంచ్‌లు సున్నం అభిరాం, కట్టం లక్ష్మి పీని కోరారు. తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య, ఐటీడీఏ ఏఈ ప్రవీణ్, మాజీ సర్పంచ్ కట్టె శ్రీను, పీసా కమిటీ చైర్మన్ కుంజా శ్రీను, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు తదితరులున్నారు. -
ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం ● పీజీఆర్ఎస్లో 121 వినతుల స్వీకరణ పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ 121 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారమవుతుందనే నమ్మకంతోనే ప్రజలు ప్రతి వారం నిర్వహించే పీజీఆర్ఎస్కు వస్తుంటారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గడువులోగా వాటిని పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం మీకోసంలో స్వీకరించిన అర్జీలను ప్రతి సోమవారం క్షుణ్ణంగా పరిశీలన చేసి త్వరిగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్బీఎస్ నందు, ఎస్డీసీ లోకేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీ, టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఐటీడీఏ ఏవో హేమలత తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీపై అవగాహన తప్పనిసరి
● కలెక్టర్ దినేష్‌కుమార్ ● పాడేరు పట్టణంలో ర్యాలీ పాడేరు : జీఎస్టీపై వర్తకులు, వ్యాపారులు, వినియోగదారులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని వారపు సంతలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా గిరిజన సమాఖ్య కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ బజారు మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ కొత్త జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులపై ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. దీంతో పేదవాడికి, సామాన్యుడికి మేలు చేకూరుతుందన్నారు. ఈనెల 22 నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొత్త ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎవరైనా తగ్గించిన జీఎస్టీ కన్నా అదనంగా జీఎస్టీ వసూలు చేసి అధిక ధరలకు అమ్మితే సంబంధిత శాఖ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్డీఏ పీడీ మురళి, జీఎస్టీ నోడల్ అధికారి పద్మజ, పలు శాఖల అధికారులు, మహిళ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. -
గోదారమ్మ ఉరకలు
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చింతూరు: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల గోదావరి నదిలో భారీగా వరదనీరు చేరుతుండటంతో పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండిపోవడంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రికి మరో రెండు అడుగులు పెరిగి 45 అడుగులకు చేరుకుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. ● గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు వరద ముంపు పొంచి ఉంది. ఇప్పటికే వరదనీరు నాలుగు మండలాల్లోని పలు ప్రాంతాల్లో రహదారులపై చేరడంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరికి ఎగపోటు దిగువనున్న గోదావరి నది క్రమేపీ పెరుగుతుండడంతో చింతూరు మండలంలో శబరినది ఎగపోటుకు గురైంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వాగులు పొంగి వరదనీరు రహదారులపై చేరుతోంది. మండలంలోని సోకిలేరువాగు పొంగి వరదనీరు వంతెన పైనుంచి ప్రవహించడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం వరకు వరదనీటిలో రాకపోకలు కొనసాగినా వరద మరింత పెరగడంతో రాత్రినుంచి పూర్తిగా స్తంభించాయి. ● మండలంలోని నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, బొడ్రాయిగూడెం, చినశీతనపల్లి, పెదశీతనపల్లి, కొండపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ● మండలంలోని చంద్రవంక, జల్లివారిగూడెం, కుయిగూరు, చీకటివాగులు క్రమేపీ పొంగుతున్నాయి. శుక్రవారం రాత్రికి చింతూరు వంతెన వద్ద శబరినది నీటిమట్టం 27 అడుగులకు చేరుకుంది. అప్రమత్తంగా ఉండాలి: చింతూరు పీవో శుభం నొఖ్వాల్ వరద పెరుగుతున్నందున నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ సూచించారు. ప్రమాదకరంగా ఉన్న వాగులు దాటవద్దని, చేపలవేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. అత్యవసరమైతే చింతూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలను సంప్రదించాలని పీవో కోరారు. గోదావరి, శబరికి ఐదోసారి.. కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, శబరి నదులకు ఈ ఏడాది ఐదోసారి సా రి వరద పోటెత్తింది. కూనవరం, టేకులబోరు నుంచి కొండ్రాజుపేట వెళ్లే రహదారిపై కొండ్రాజుపేట కాజ్వే వద్ద వరద నీరు బారీగా చేరడంతో సుమా రు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండ్రాజుపేట, వాల్ఫర్డ్‌పేట, కొత్తూరు, పూసుగు గూడెం, శబరి కొత్తగూడెం, వెంకన్నగూడెం, శ్రీరాంపురం, గొర్రొళ్లగుంపు, జిన్నెలగూడెం, బండారు గూడెం, పెదార్కూరు వాడగుంపు, రేపాక తదితర ప్రాంతాల గిరిజనులు మండల కేంద్రానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలో శబరి, గోదావరి సంగమం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు గోదావరి నీటిమట్టం 36.9 అడుగులు నమోదైంది. ఇలావుండగా గోదావరి వరదలు కారణంగా మూడు నెలల నుంచి వ్యవసాయ భూములు ముంపులోనే ఉన్నాయి. వరి, మిర్చి, పొగాకుకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ముంపులోనే పొలాలు ఉన్నందున వ్యవసాయ పనులు చేపట్టే అవకాశం లేకపోయిందని వారు వాపోతున్నారు. పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న గోదావరి నది మిర్చి రైతు గుండెల్లో వరద మంట గత మూడేళ్లుగా తీవ్ర నష్టం దిగుబడిని దెబ్బతీసిన చీడపీడలు వాగులతో ఇబ్బందులు నిరాశపరుస్తున్న ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నీటిమట్టం విలీన మండలాల్లో రహదారులపైకి వరద 50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఎటపాక: క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద...మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఈఏడాది సాగుకు కాలం కలిసి వచ్చిందని ఆశపడిన రైతులకు గోదారమ్మ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈఏడాది సుమారు 22,136 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేపట్టారు. వీటిలో 3,125 ఎకరాల్లో వరి, 5,326 ఎకరాల్లో పత్తి, 832 ఎకరాల్లో మిర్చి, 12,853 ఎకరాల్లో జామాయిల్ సాగులో ఉన్నట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. గత నెలలో భద్రాచలం వద్ద గోదావరి వరద 52 అడుగులకు చేరింది. ఆగస్టు గండం దాటిందని భావిస్తున్న తరుణంలో మిర్చి సాగు చేపట్టిన రైతును ఇప్పుడు కూడా వరద భయం వెంటాడుతూనే ఉంది. గత నాలుగేళ్లుగా మిర్చి రైతుకు కాలం కలిసిరావడంలేదు. చీడపీడలతో గత మూడేళ్లు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. గత ఏడాది దాదాపు మిర్చి సాగుకు విరామం ప్రకటించి పొగాకు సాగుచేసినప్పటికీ నష్టాలనుంచి గట్టెక్కలేకపోయారు. అయితే ఈఏడాది మళ్లీ మిర్చి వైపు మొగ్గుచూపి సాగు చేపట్టారు. ఈ తరుణంలో భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం వారిని కలవరపెడుతోంది. ముంపులో వంద ఎకరాలు.. రాయనపేట, నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగులకు వరద నీరు పోటెత్తింది. నెల్లిపాక, నందిగామ, తోటపల్లి, మురుమూరు వాగుల పరివాహక ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాల్లో మిర్చి పైరు ముంపునకు గురైంది. ముంపు పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పొలాల్లోంచి తొలగించే పనుల్లో బాధిత రైతులు నిమగ్నమయ్యారు. కొంతమంది రైతులు పొలాల్లో నీట మునుగుతున్న మిర్చి మొక్కలను సేకరించి వేరేచోట నాటుతున్నారు. -
జగన్‌మోహన్‌రెడ్డిపైఅనుచిత వ్యాఖ్యలు తగదు
● కూటమి నేతలకు గుణపాఠం తప్పదు ● అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: బాధ్యత గల పదవిలో ఉంటూ అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహరెడ్డిని సైకో అని సంబోధించడం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తగదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చట్ట సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్కారం లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే అన్నారు. -
పండగొచ్చింది
అరకు సంతకు● భారీగా తరలివచ్చిన కొనుగోలుదారులుదళారుల వల్లే అధిక ధరలు గతంలో మేకలకు డిమాండ్ ఉండేది కాదు. ప్రస్తుతం మైదాన ప్రాంత వ్యాపారులతో పాటు దళారీలు కొనుగోలు చేయడం వల్ల ధరలు భారీగా పెరిగాయి. దసరా పూజకు రూ.12 వేలతో మేకను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నా. – కిల్లో జయ్యో, గుగ్గుడు, బస్కీ పంచాయతీ, అరకులోయ మండలం డుంబ్రిగుడ: దసరా పండగ నేపథ్యంలో అరకులో శుక్రవారం జరిగిన వారపుసంత కొనుగోలుదారులతో కిటకిటలాడింది. గొర్రెలు, మేకలు, నాటుకోళ్లను పోటీపడి కొనుగోలు చేశారు. పొట్టేలు సైజును బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు లభించాయి. నాటుకోడి ధరలు భారీగా పెరిగాయి. ఒకొక్కటి రూ.2,500 నుంచి రూ.3వేలకు కొనుగోలు చేశారు. పందెం కోళ్లకు మంచి ధరలు లభించాయి. జత రూ.8వేలకు పైగా అమ్ముడుపోయాయి. పండగ సంత కావడంతో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు చెందిన చటువా, పాడువాల, బంజోలపుట్టు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. అడ్డాకులు అమ్మగా వచ్చిన డబ్బులతో దుస్తులు కొనుగోలు చేశారు. వస్త్ర, గాజుల దుకాణాలు కిటకిటలాడాయి. కొనేందుకు మేక దొరకలేదు దుర్గ పూజకోసం మేకను కొనేందుకు వారపు సంతకు వచ్చా. రూ.10 నుంచి 15 వేలు చెప్పారు. కొందామనుకునే సరికి మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు అధిక ధర చెల్లించి తీసుకుపోవడంతో కొనేందుకు అవకాశం లేకపోయింది. – పాంగి బుద్రన్న, గుమ్మగుడ, అరమ పంచాయతీ, డుంబ్రిగుడ మండలం -
‘హైడ్రో పవర్’ వద్దే వద్దు
● అనంతగిరిలో కదంతొక్కిన ఆదివాసీలు అనంతగిరి (అరకులోయ టౌన్): గిరిజన ప్రాంతంలో నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించారు. మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్ వీరభద్రాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ నేత కొర్రా సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, స్వచ్ఛంద కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ శోభ సోమేశ్వరి, గ్రీవెన్స్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సందడి కొండబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆర్.స్వామి, పార్టీ మండల అధ్యక్షుడు స్వాభి రామూర్తి, యువజన నాయకుడు రేగం చాణిక్య, సర్పంచ్‌లు పెంటమ్మ, పాగి అప్పారావు, గణేష్, రాములమ్మ, సెంబి సన్యాసిరావు, కొర్రా సింహద్రి, జన్ని సన్యాసిరావు, అన్నపూర్ణ, ఎంపీటీసీలు తవిటి నాయుడు, మదీన, అశోక్ పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తికి తీవ్రగాయాలు
అడ్డతీగల: అడవి జంతువులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మండలంలోని తుంగమడుగులకు చెందిన ఉలెం సూరిబాబు అనే గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. తుంగమడుగుల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అడవి జంతువులను వేటాడేందుకు అటవీప్రాంతంలో విద్యుత్ వైర్లు ఏర్పాటుచేశారు. పశువుల జాడకోసం అటవీప్రాంతంలోకి వెళ్లిన సూరిబాబుకు విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరాడు. అదే ప్రాంతంవైపు వెళ్తున్న గ్రామస్తులు అతనిని చూశారు. వెంటనే దుప్పులపాలెం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.అడవి జంతువుల కోసం ఏర్పాటు చేయడంతో ప్రమాదం -
మా భూముల జోలికి వస్తే అంతుచూస్తాం
పాడేరు రూరల్: మా భూముల జోలికి వస్తే అంతు చూస్తామని మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ పరిసర ప్రాంతాల గిరిజనులు హెచ్చరించారు. అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం స్థానిక సబ్ డీఎఫ్‌వో కార్యాలయాన్ని వారు ముట్టడించారు. మాడగుడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటు నేపథ్యంలో అక్కడ ఉపాధి పొందే నిమిత్తం ఏర్పాటుచేసుకున్న గుడారాలు, పర్యాటకులకోసం చేసిన ఏర్పాట్లను అటవీశాఖ అధికారులు కొద్దిరోజులక్రితం తొలగించారు. ఈ నేపథ్యంలో సబ్ డీఎఫ్‌వో కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు రిజర్వ్ ఫారెస్ట్ పరిధి అని చెప్పి తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అడవిపై సర్వహక్కులు గిరిజనులవే..: మాడగడ సర్పంచ్ జ్యోతి, పీసా కమిటీ సభ్యుడు బాలరాజు, మాజీ సర్పంచ్ అర్జున్ గిరిజన ప్రాంతంలో అడవిపై సర్వం హక్కులు గిరిజనులకే ఉందని చట్టాలు చెబుతున్నాయని మాడగడ సర్పంచ్ జ్యోతి, పీసా కమిటీ సభ్యుడు బాలరాజు, మాజీ సర్పంచ్ అర్జున్ అన్నారు. అయితే అటవీశాఖ అధికారుల తీరు మాత్రం గిరిజనులకు వ్యతిరేకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా గ్రామ సమీపంలోని సన్ రైజ్ వ్యూ పాయింట్‌ను పరిసర గ్రామాల ప్రజలు అభివృద్ధి చేస్తే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు చొరబడి గిరిజనులపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఎకో టూరిజం పేరుతో గిరిజనుల భూములు అక్రమించే ప్రయత్నం చేస్తే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఏవిధంగా భయపెట్టినా తమ భూములను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. తక్షణం ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి సర్వే నిర్వహించి సన్‌రైజ్ వ్యూ పాయింట్‌ను పంచాయతీకి తక్షణం అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తాం: సబ్ డీఎఫ్‌వో ఉమామహేశ్వరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని సబ్ డీఎఫ్‌వో ఉమామహేశ్వరి అన్నారు. ఆందోళన కారులతో ఆమె మాట్లాడుతూ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేసి స్థానికులకే ఉపాధి కల్పిస్తామన్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించి సరిహద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. న్యాయం చేయాలని వినతి సన్‌రైజ్ వ్యూ పాయింట్ భూముల విషయంపై న్యాయం చేయాలని సర్పంచ్ ఎం.జ్యోతి, సమీప గ్రామాల గిరిజనులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కోరారు. దీనిలో భాగంగా పాడేరు ఐటీడీఏలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు తమ సమస్యను వివరించారు. జాయింట్ సర్వే నిర్వహించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ పరిసర గిరిజనుల హెచ్చరిక అటవీశాఖ అధికారులు అన్యాయంగా గుడారాలు తొలగించారని ఆవేదన సబ్ డీఎఫ్‌వో కార్యాలయం ముట్టడి జాయింట్ సర్వే నిర్వహిస్తామని ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమణ -
కేజీహెచ్‌లో సీబీఐ అధికారుల విచారణ
మహారాణిపేట : విశాఖలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రీతి సాహా కేసుపై సీబీఐ ఆరా తీస్తోంది. గురువారం సీబీఐ డీఎస్పీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లో విచారణ చేశారు. అనుమానాస్పద మృతి చెందడంతో అప్పట్లో నిపుణుల కమిటీ వేసి వారి చేత పోస్టుమార్టమ్ నిర్వహించారు. అప్పుడు కమిటీ సభ్యులు డాక్టర్ మమత, డాక్టర్ హయగ్రీవరావు, డాక్టర్ సత్యప్రసాద్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రజనీకాంతరావులు పోస్టుమార్టం జరిపారు. ఇందులో ఇద్దరు వైద్యులు మమత, రజనీకాంతరావులకు ఇటీవల బదిలీ అయ్యింది. మిగిలిన ముగ్గురు వైద్యులను గురువారం దినేష్‌కుమార్ విచారించారు. రికార్డులను, అప్పటి పోస్టుమార్టమ్ నివేదికలను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థిని నీట్ శిక్షణ కోసం విశాఖలో ఆకాష్ బైజూస్ కాలేజ్‌లో చేరింది. 2023, జూలై 14న రాత్రి విశాఖ 4వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధి దొండపర్తిలో కాలేజీ నిర్వహిస్తున్న సాధన హాస్టల్ భవనం పైనుంచి పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 17న మృతి చెందింది. పోలీసులు తొలుత ఆమెది ఆత్మహత్యగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని కాలేజీకి చెందిన ఇద్దరిని, హాస్టల్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఆమె మృతిపై తండ్రి సుఖ్‌దేవ్ సాహా మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరు సక్రమంగా లేదని, కాలేజీ యాజమాన్యంతో పోలీసులు కుమ్మకై ్కపోయారని ఆరోపణలు చేశారు. అలాగే సీసీ కెమెరా పరిశీలిస్తే.. తన కుమార్తె బిల్డింగ్‌పైకి వెళ్లినపుడు ఒక కలర్ డ్రెస్ ఉందని, కింద పడిన తర్వాత మరో కలర్ డ్రెస్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అప్పట్లో విశాఖలో సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసు విషయంలో స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దర్యాప్తు కోసం బెంగాల్ సీఐడీని విశాఖకు పంపించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో మరోసారి దర్యాప్తు జరుగుతోంది. సిటీ పోలీసులకు తలనొప్పులు విద్యార్థిని మృతి కేసు విశాఖ పోలీసుల పరువు తీసినట్టయింది. ముందు ఆమెది ఆత్మహత్యగానే పేర్కొంటూ స్వయంగా అప్పటి సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు. బెంగాల్ నుంచి సీఐడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత అప్పటి కప్పుడు సెక్షన్లు మార్చారు. దర్యాప్తు అధికారిని తప్పించి ఉన్నతాధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు వేశారు. ఇపుడు మళ్లీ అప్పటి పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయన్న చర్చ పోలీస్ శాఖలోనే జరుగుతోంది. విద్యార్థిని రీతి సాహా మృతి కేసులో కోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభం హాస్టల్ బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందిన రీతి సాహా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దినేష్‌కుమార్ నేతృత్వంలో నిపుణుల కమిటీతో భేటీ -
ఈపీడీసీఎల్‌తో ఫ్లూయెంట్‌గ్రిడ్, సీసీఎఫ్ ఒప్పందాలు
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరాలో నాణ్యత, వ్యవస్థలో ఆధునికీకరణ, ఎనర్జీ ట్రాన్సిషన్ మరింత వేగవంతం చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ సరికొత్త ఒప్పందాలు చేసుకుంది. సాగర్‌నగర్‌లోని ఈసీబీసీ భవనంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (సీవోఈఈ టీ) కోసం ఫ్లూయెంట్‌గ్రిడ్, కై ్లమే ట్ కలెక్టివ్ ఫౌండేషన్ (సీసీఎఫ్) సంస్థలు ఏపీఈపీడీసీఎల్‌తో గురువారం అవగాహన ఒప్పందా లు కుదుర్చుకున్నాయి. విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ఆధునికీకరణ, కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యంగా కొత్త స్టార్టప్‌లను గుర్తించడం, ప్రోత్సహించడం ఈ ఎంవోయూల ద్వారా నిర్వహించనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో ఏర్పాటు చేయనున్న స్మార్ట్ గ్రిడ్ ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను పరీక్షించి, మెరుగులద్దనున్నారు. యునెజా, గ్రెయిల్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల సహాయంతో నాలెడ్జ్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంయుక్త పరిశోధన పత్రాల ప్రచురణకు తోడ్పడుతుంది. అదేవిధంగా విశాఖ ఎనర్జీ సమ్మిట్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లను నిర్వహిస్తూ, పరిశ్రమ నేతలు, స్టార్టప్‌లు, నిపుణుల ప్యానెల్ చర్చలు, ఉద్యోగ–నైపుణ్య మేళాలు ఈ సంస్థల సహకారంతో ఈపీడీసీఎల్ ఏర్పాటు చేస్తుంది. ఫ్లూయెంట్‌గ్రిడ్ ఎంవోయూలో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో స్మార్ట్ గ్రిడ్ కమాండ్–కంట్రోల్ సెంటర్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా స్థాపించనుంది. ఏఐ ఆధారిత యాక్టిలిజెన్స్ గ్రిడ్ మోడరనైజషన్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించి సైదీ, సైఫీ అంచనాలు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు నిర్వహణ, డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్స్ మేనేజ్మెంట్, రియల్‌టైమ్ డేటా యాక్సెస్‌కు ఏఐ అసిస్టెంట్ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శిస్తుంది. విపత్తు నిర్వహణలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల గుర్తింపు, వాటికి అనుగుణంగా నెట్‌వర్క్‌ను పటిష్టపరిచేందుకు సూచ నలు అందించనుంది. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మాట్లాడుతూ కొత్తగా కుదుర్చుకున్న ఎంవోయూలు పునరుత్పాదక ఇంధన రంగం, ఎనర్జీ ట్రాన్సిషన్‌లో జాతీయస్థాయిలో ప్రముఖ పాత్ర పోషించేందుకు తోడ్పతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఫ్లూయెంట్‌గ్రిడ్ సంస్థ ప్రతినిధులతో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్ చంద్రం, సీజీఎం సుమన్ కళ్యాణి కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ ప్రతినిధులతో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్ చంద్రం, సీజీఎం సుమన్ కళ్యాణి -
సింహగిరిపై శ్రీనృసింహ హోమం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై శ్రీ నృసింహ హోమం ఘనంగా జరిగింది. ఉదయం 7 నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి అనంతరం కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉప ప్రధానాచార్చకులు సాతులూరి నరసింహాచార్యులు ప్రధాన కలశాన్ని శిరస్సుపై పెట్టుకుని ప్రదక్షిణ చేశారు. ఆ జలాలను స్వామికి సమర్పించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా నేడు
అనంతగిరి(అరకులోయ): హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్టు ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ తెలిపారు. వారు గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేపడుతున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమానికి ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని గిరిజనుల పక్షాన పోరాడలన్నారు. కార్యక్రమానికి అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తామని నీలవేణి, సూర్యనారాయణ తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, గిరిజనులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన
చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ అటవీ అబివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ)లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. గురువారం చింతపల్లిలో ఏపీఎఫ్‌డీసీకి చెందిన అన్ని డివిజన్ల కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాఫీ యాజమాన్యానికి కార్మిక సంఘాలకు జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీల్లో కార్మికుల ఇళ్లకు కొద్దిపాటి మరమ్మతులు చేపట్టడం మినహా ఏఒక్కటి నెరవేర్చలేదన్నారు. ప్రధానంగా సంస్థ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం దుర్మార్గమన్నారు. క్షేత్ర స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి ప్లాంటేషన్ కండక్టర్లను మూడు నెలల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. కాఫీ సేకరణకు ముందు కూలి రేట్లు, కాఫీ పండ్ల సేకరణ ధరలు పెంచాలని ,26 రోజులు పని కల్పించాలని, వారంతపు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయడమే కాకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారానికి యాజమాన్యం చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు వెంకటేష్, గిరి, నాగేశ్వరరావు, నగేష్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ హెచ్చరిక -
‘హైడ్రో పవర్’కు గిరిజనుల భూములు ఎలా కేటాయిస్తారు
● పోడు భూముల పట్టాలకు ఆంక్షలా ● ప్రభుత్వాల తీరుపై సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స ధ్వజం అరకులోయ టౌన్: గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి గిరిజనుల జిరాయితీ భూములు ఎలా కేటాయిస్తుందని ఆదివాసీ గిరిజన సంఘ ప్రతినిధి, సీపీఎం జిల్లా కార్యదర్శి పాచిపెంట అప్పలనర్స ప్రశ్నించారు. ఈ నెల 22న సీలేరు నుంచి ప్రారంభించిన అరణ్య గర్జన జీపు యాత్ర గురువారం అరకులోయ మండలం లోతేరు పంచాయతీ తొరడం వలస చేరుకుంది. ఈ సందర్బంగా అప్పలనర్స మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి జారీ చేసిన జీవో నంబరు 13, 51ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రభావిత గిరిజనుల భూములను పరిశీలించారు. ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అదాని, నవయుగ కంపెనీలకు వేలాది ఎకరాల గిరిజనుల భూములు ఎలా ధారదత్తం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈనెల 27న మజ్జివలనలో జరిగే జీపు యాత్ర ముగింపు సభలో ఆదివాసీ గిరిజనులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ధర్మాన పడాల్, కొర్రా త్రినాథ్, రాజు, కిల్లో రామన్న, గెన్ను, వరహాలబాబు, సింహాద్రి, భగత్ సింగ్ పాల్గొన్నారు. -
భవానీ భక్తులకు ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భవానీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.ఎస్.ఎస్.ధీరజ్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఐదు రూటుల్లో ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. నర్సీపట్నం నుంచి విజయవాడ వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.800, అల్ట్రా పల్లె వెలుగు రూ.900, ఎక్స్‌ప్రెస్ రూ.వెయ్యి, అల్ట్రా డీలక్స్ రూ.1250గా టికెట్ ధర నిర్ణయించామన్నారు. ద్వారపూడి మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.860, అల్ట్రా పల్లె వెలుగు రూ.970, ఎక్స్‌ప్రెస్ రూ.1070, అల్ట్రా డీలక్స్ రూ.1350, ద్వారపూడి, ద్వారకా తిరుమల మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.910, అల్ట్రా పల్లె వెలుగు రూ.1030, ఎక్స్‌ప్రెస్ రూ.1140, అల్ట్రా డీలక్స్ రూ.1420 చార్జి చేస్తామన్నారు. ద్వారపూడి, గొల్లలమామిడాడ, ద్వారకా తిరుమల మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.970, అల్ట్రా పల్లె వెలుగు రూ.1090, ఎక్స్‌ప్రెస్ రూ.1210, అల్ట్రా డీలక్స్ రూ.1510, భద్రాచలం మీదుగా విజయవాడ వెళ్లి ద్వారపూడి మీదుగా తిరిగి రావడానికి పల్లె వెలుగు రూ.1190, అల్ట్రా పల్లె వెలుగు రూ.1340, ఎక్స్‌ప్రెస్ రూ.1490, అల్ట్రా డీలక్స్ రూ.1850గా రేట్లు నిర్ణయించామన్నారు. 50 మంది భవానీ భక్తులు ఉంటే నర్సీపట్నం పరిసర గ్రామాల నుంచే నేరుగా బస్సులు నడుపుతామని తెలిపారు. ఆసక్తిగల వారు 9493211969, 949811855 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ కోరారు. -
ఆక్సిజన్ పెట్టేవారు లేరు
విశాఖ సిటీ: శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. ఏటా వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న వర్సిటీ.. ఉద్యోగులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తోంది. ఏయూ పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యం అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. ఒకవైపు వందేళ్ల సంబరాలు చేసుకుంటున్న ఏయూలో డిస్పెన్సరీ ‘ఊపిరి’ తీసేస్తున్నారు. నిత్యం వందల మంది వచ్చే ఏయూ ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలతో పాటు వైద్యులు, సిబ్బంది లేకపోవడం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సదుపాయం లేని కారణంగానే ఏయూలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మణికంఠ మరణించాడని విద్యార్థుల చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన ఏయూ పాలకుల నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. 200 మంది రోగులు.. ఇద్దరే వైద్యులు ఏయూలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర, ఇతర సిబ్బంది, విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రం ఉంది. 24 గంటల పాటు ఇక్కడ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ ఉంటుంది. ఈ సమయంలో రోజుకు 200 మంది వరకు రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నది కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే. వీరిద్దరే చాలా ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు షిఫ్టులు వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రిలో కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. అలాగే ఫార్మాసిస్టులు ముగ్గురికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాగే ఒక్కో షిఫ్ట్‌లో ఒక వార్డుబాయ్ ఉంటున్నారు. వీరే మొత్తం పనిచేయాల్సి వస్తోంది. ఎవరు సెలవు పెట్టినా మిగిలిన వారిపై పనిభారం పడుతోంది. ప్రధానంగా ఆక్సిజన్ సిలిండర్లు ఆస్పత్రిలో ఒకటి, అంబులెన్సులో ఒకటి ఉన్నాయి. కానీ అంబులెన్సులో రోగిని తీసుకెళ్లడానికి సిబ్బంది వెళ్లే పరిస్థితి లేదు. రోగికి ఆక్సిజన్ పెట్టేందుకు వార్డుబాయ్ వెళితే.. ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి ఎవరూ లేకుండా పోతున్నారు. ఇదే పరిస్థితి బుధవారం ఎదురైంది. అస్వస్థతకు గురైన మణికంఠను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆక్సిజన్ పెట్టేందుకు సిబ్బంది లేరు. ఆక్సిజన్ పెట్టి ఉంటే మణికంఠ ప్రాణాలతో ఉండేవాడని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇలా ఆస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసుకొని కూర్చున్నాయి. ఇక్కడి పరిస్థితులు, అసౌకర్యాలు, సిబ్బంది లోటు వంటి విషయాలను ఏయూ పాలకుల దృష్టికి పలువురు తీసుకువెళ్లినా ఇప్పటి వరకు వాటిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. జీతాలు అరకొరే.. ఆస్పత్రిలో సిబ్బంది జీతాల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దానికి పైగా పనిచేస్తున్న నర్సుకు ఇక్కడ కేవలం రూ.10 వేలు మాత్రమే ఇస్తుండడం గమనార్హం. అలాగే ఫార్మాసిస్టులకు రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. జీతాలు పెంచాలని సిబ్బంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని, సిబ్బందిని నియమించాలని గత ఏడాది కాలంగా పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాల్లో ఏయూ.. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ను ఇటీవల కాలంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏయూ ప్రతిష్ట దిగజారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంతో ఆందోళనకు, నిరసనలకు కేంద్రంగా మారుతోంది. పాలనపై ఆరోపణలు, విద్యార్థుల వసతి సౌకర్యాలపై విమర్శలు.. పురుగుల భోజనాలతో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏయూలో పరిస్థితులపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏయూ వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతున్నారు. నిత్యం ఏదో ఒక రగడతో ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతిసారి ఆందోళనల సమయాల్లో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పా సమస్యలను పరిష్కరించడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. -
రైతులకు మొక్కల పంపిణీ
ముంచంగిపుట్టు: ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో గల దారెల పంచాయతీలో పలు గ్రామాల గిరిజన రైతులకు పెద్ద సైజు మొక్కలు పంపిణీ చేసినట్టు ఏపీవో వెంకటేశ్వర్లు తెలిపారు. దారెల పంచాయితీలో గిరిజన రైతులకు చిన్నసైజు మొక్కలు పంపిణీ చేశారని ఆరోపణలతో ఉపాధి అధికారులు స్పందించారు. ఈ నెల 7న ఢీంగూడ రైతులకు చిన్నసైజు మొక్కలు రావడంతో వాటినివెనక్కి పంపిన ఉపాధి అధికారులు పెద్ద సైజ్ మొక్కలను గురువారం రప్పించారు. ఏపీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని డి.కుమ్మరిపుట్టు, రంగలిసింగి, డొక్రిపుట్టు, దారెల, పెద్దపేట, పేటమాలిపుట్టు గ్రామాల్లో గిరిజన రైతులకు సిల్వర్‌ఓక్, మహాగని మొక్కలను పంపిణీ చేశారు.పెద్దసైజు మొక్కలు పంపిణీ చేయడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలో రైతులకు నాణ్యమైన మొక్కలు, రైతులకు ఉపయోగ పడే విధంగా పంపిణీ చేస్తున్నామన్నారు. చిన్న సైజ్, నాసిరకం మొక్కలు వస్తే రైతులు వాటిని తీసుకోవద్దని, డీంగూడ గ్రామానికి చిన్న సైజ్ మొక్కలు వచ్చినట్టు సమాచారం రావడంతో వాటిని వెనక్కి పంపించి, పెద్దసైజు మొక్కలను గిరిజనులకు అందించినట్టు ఏపీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధి హామీ పథకం అధికారులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.చిన్న సైజు మొక్కలకు బదులుగా పెద్ద సైజు మొక్కలు అందజేతకు ప్రత్యేక చర్యలు: ఏపీవో వెంకటేశ్వర్లు -
వరి సాగుపై రైతులకు సూచనలు
చింతపల్లి: గిరిజన రైతాంగం వరిలో ఆశించే తెగుళ్లను అరికట్టడానికి యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు సాదించవచ్చని వీసీఎఫ్(టాటా ట్రస్టు)వ్యవసాయ సాంకేతిక నిపుణులు డాక్టర్ కొన్ని అప్పలరాజు అన్నారు. మండలంలో కొత్తపాలెం గ్రామంలో గిరి రైతులకు వరిలో సోకే చీడ పీడల వలన నష్టాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా వరిలో సుడిదోమ వరి మొక్క మొదట్లో గుంపులు గుంపులుగా చేరి మొక్క నుంచి రసం పీల్చి పంటకు నష్టం కలిగిస్తుందన్నారు. ఈ సుడిదోమ కొన్ని రకాలైన వైరస్‌లను కూడా వ్యాప్తి చేస్తుందని, దీంతో పంట పసుపు రంగులోకి మారడం, వరి పంట సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుందన్నారు. ఈ దోమ నివారణకు పంటను వరుస పద్ధతిలో నాటుకోవాలని, సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు.పంటలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వేపాకుల కషాయం, వేప నూనె సమయానుకూలంగా పిచికారీ చేయడం వలన ఈ దోమ యొక్క వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు. క్రిమి సంహారక మందులను వ్యవసాయ నిపుణులు సలహా మేరకు వినియోగించాలని సూచించారు. -
హోంస్టే పనులు వేగవంతం చేయండి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశంసాక్షి,పాడేరు: జిల్లాలోని రంపచోడవరం, పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల్లో చేపట్టిన హోంస్టేల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. కారవాన్ టూరిజం, హోంస్టే పనుల పురోగతిపై పర్యాటక, అటవీ తదితర శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద 50సెంట్ల నుంచి ఎకరా వరకు భూములు సేకరించాలన్నారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులకు ఈ భూమిని వినియోగించాలని సూచించారు. మోడల్ హౌస్‌లకు ప్రణాళికలు సిద్ధం చే యాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడమే కాకుండా అటవీశాఖ చెక్‌పోస్టులలో తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వ భరత్, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీపీవో చంద్రశేఖర్, జిల్లా టూరిజం అధికారి దాసు, డీఎల్పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హేమతలతకు శానిటేషన్ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ ముత్యాలమ్మ మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు 2024 నవంబర్‌లో పెంచిన కొత్త వేతన జీవోను అమలు చేయాలన్నారు. డ్యూటీ చార్ట్ ఇవ్వాలని, ప్రధానంగా ఈపీఎఫ్, ఈఎస్ఐ తప్పిదాలు సరిచేయాలని, జీతంతో ముడి పెట్టిన ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రతీనెలా మొదటి వారంలో జీతాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని బకాయి వేతనాలు చెల్లించాలని, సీనియారిటీ ప్రకారం సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పెస్ట్ కంట్రోల్ ఎస్ఎంసీ, ఎన్ఆర్సీ, క్యాంటీన్, బర్త్ వెయింట్ విభాగాలలో కార్మికుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. వీటిని ప్రభుత్వం పరిష్కరించకుంటే కార్మికులతో కలసి వచ్చే నెల 15వ తేదీ తరువాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. శానిటేషన్ కార్మిక సంఘ ప్ర తినిధులు సుధారాణి, చిట్టిబాబు, సత్యనారాయణ, లక్ష్మణ్, పుణ్యవతి, కొండమ్మ, శివ పాల్గొన్నారు. -
బాలికల రక్షణ బాధ్యత అందరిది
సాక్షి,పాడేరు: బాలికలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. గురువారం ఆమె పాడేరులో పర్యటించారు. స్థానిక ఐటీడీఏ కాఫీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన నవరాత్రి 8వ రాష్ట్రీయ పోషణ మహోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించారు. గర్భిణులకు సాముహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో రక్తహీనత, శిశుమరణాలు అధికంగా ఉన్నందున వాటిని నిరోధించాలన్నారు. ప్రతీ ఆడపిల్ల చదువుకుని సమాజంలో మంచి స్థాయికి ఎదగాలన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక బాధ్యతలు కూడా పిల్లలకు నేర్పించాలన్నారు.ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ నేరాలపై బాలికలు, మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మహిళల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, మాతాశిశు ఆరోగ్య కార్యక్రమాలను వివరించారు. అనంతరం సిడ్ ఆర్గనైజేషన్ రూపొందించిన మహిళా తస్మాత్ జాగ్రత్త పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్పడాల్, డీఆర్డీఏ పీడీ మురళీ, ఐసీడీఎస్ సీడీపీవోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ -
మహిళల ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం
ముంచంగిపుట్టు: మహిళల అరోగ్యంతోనే మెరుగైన సమాజం సాధ్యమని డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు అన్నారు. మండలంలోని కిలగాడ పీహెచ్సీలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో 125 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసారు. అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటుచేసిన పోషకాహార వంటకాలు, స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళల పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారికి నిరంతర వైద్య సేవలు అందిస్తామన్నారు. ఎంపీపీ సీతమ్మ, సర్పంచ్ శివశంకర్, కిలగాడ వైద్యాధికారి శిరీష, సీహెచ్‌వో జే.శౌరి,ఆరోగ్య విస్తరణ డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు -
కీటక జనిత జ్వరాలపై నిర్లక్ష్యం తగదు
గిరిజన ప్రాంతాల్లో కీటక జనిత మలేరియా, డెంగ్యూపై ప్రభుత్వానికి ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. గిరిజనుల వద్ద దోమతెరలు చిరిగిపోవడంతో వినియోగించేందుకు వీల్లేకుండా ఉన్నాయి. గిరిజనులు మలేరియా,డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం కొత్త దోమతెరల పంపిణీపై దృష్టి పెట్టకపోవడం అన్యాయం. రెండేళ్లుగా మలేరియా తీవ్రత ఎక్కువగా ఉంది. అన్ని గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు. – గండేరు చినసత్యం, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ వైద్య విభాగం -
ఎకో టూరిజం ప్రాజెక్ట్ వద్దని వినతి
● ఎమ్మెల్యే మత్స్యలింగంను కోరినమాడగడ గిరిజనులు అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని మాడగడ పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. ఈమేరకు వారు గురువారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంకు వినతిపత్రం సమర్పించారు. వివిధ వ్యాపారాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి జీవనోపాధి పొందుతున్న గిరిజనులంతా ఎకో టూరిజం ఏర్పాటు చేయడం వల్ల నష్టపోతారని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లో అతి కొద్ది మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తారన్నారు. మిగిలిన వారంతా జీవనోపాధి కోల్పోతారని వివరించారు. పంచాయతీ పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, ఎం. గెన్ను, అప్పారావు, మోహన్‌రావు, పి. రాజులమ్మ, బాక బాలరాజు, బాబ్జి, డి. చిన్న, సుమన్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం వింగ్ ప్రధాన కార్యదర్శి నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
కుట్టించుకోవాలా?
ఏజెన్సీలో దోమలు ‘నిద్ర లేని రాత్రుల’ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నాయి. ముఖ్యంగా దోమతెరల పంపిణీలో ప్రభుత్వ ‘నిర్లక్ష్యం’ వీటికి ఒక గొప్ప ‘ఓపెన్ ఇన్విటేషన్’లా మారింది. సమస్యపై ప్రశ్నించిన ఒక గిరిజనుడికి.. అక్కడి దోమల యూనియన్ నాయకుడు ఇలా సమాధానం ఇచ్చాడట.. ‘మాకు ఉన్న ఒకే ఒక్క ‘ఉద్యోగ ధర్మం’ రక్తం తాగడం. దానికి అడ్డుగా దోమతెరలు పంపిణీ చేయకపోతే... మేం మా డ్యూటీ ఎందుకు చేయకూడదు?.. అన్నాడట.. కూటమి సర్కారు గిరిజన సంక్షేమాన్ని మరిచిపోయి నిద్ర పోయినా తాము మాత్రం రాత్రిపూట మేల్కొనే ఉన్నామని దోమలు నిరూపిస్తున్నాయి. దోమ తెరల పంపిణీని విస్మరించిన కూటమి సర్కార్ కుడితే..సాక్షి,పాడేరు: మన్యంలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నా కూటమి సర్కార్ అడ్డుకట్ట వేయలేకపోతోంది. నివారణ చర్యలు మాట ఎలా ఉన్నా కనీసం దోమ తెరలను కూడా పంపిణీ చేయలేకపోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సుమారు 6 లక్షల దోమ తెరలు పంపిణీ చేసింది. వీటికి మూడేళ్ల కాలపరిమితి పూర్తవడంతో ఉపయోగించేందుకు వీల్లేకుండా పోయాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ దోమ తెరల పంపిణీని విస్మరించింది. ఐదు లక్షల దోమ తెరలు పంపిణీ చేస్తామని ప్రకటించినా ఫలితం లేకపోయింది. అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా ఈ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ● జిల్లావ్యాప్తంగా మలేరియా జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. గత ఏడాది 3,693 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఈఏడాది జనవరి నెల నుంచి ఇంతవరకు 3119 మలేరియా కేసులు నమోదయ్యాయి. జనవరిలో 119, ఫిబ్రవరిలో 202, మార్చిలో 218, ఏప్రిల్‌లో 220, మేలో 504, జూన్‌లో 787, జూలైలో 714, ఆగస్టులో 227, సెప్టెంబర్‌లో 130 మంది మలేరియా బారిన పడ్డారు. అంతేకాకుండా ,28 మంది డెంగ్యూ జ్వరాలకు గురయ్యారు. ● మలేరియా విభాగం పరిధిలో 4,516 గిరిజన గ్రామాలు ఉండగా, వీటిలో 2086 గ్రామాలను మలేరియా పీడిత ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో దోమల నివారణ మందు పిచికారీ చేయగా మిగతా గ్రామాలపై దృష్టి పెట్టలేదు. దీంతో దోమల వ్యాప్తి, కాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నెల రోజుల్లో ఎపిడమిక్ సీజన్ ముగియనున్నా దోమ తెరలు పంపిణీకి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపాదనలకే పరిమితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోమ తెరల పంపిణీ ప్రతిపాదనలకు పరిమితమైంది. జిల్లాలోని 4,516 గ్రామాల్లో అన్ని కుటుంబాలకు 5.85 లక్షల దోమ తెరలు అవసరమని గతేడాది మలేరియా విభాగం ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కీటక జనిత వ్యాధుల నివారణ విభాగం ద్వారా ఇవి పంపిణీ కావాల్సి ఉన్నప్పటికీ ఈ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. జనవరి నుంచి మలేరియా కేసులు నమోదు అవుతున్నా దోమ తెరలను జిల్లాకు రప్పించలేకపోయిందని ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా మలేరియా అధికారి తులసిని వివరణ కోరగా జిల్లా 5.85 లక్షల దోమ తెరలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామన్నారు.ఇవి వచ్చే నెలలో జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కొత్తవి రాగానే జిల్లా అన్ని కుటుంబాలకు పంపిణీ చేస్తామన్నారు. మలేరియా నియంత్రణకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని ఆమె వివరించారు. -
పాముకాటుకు చిన్నారి బలి
ముంచంగిపుట్టు: మండలంలో గల కుమడ పంచాయతీ చీపురుగొంది గ్రామానికి చెందిన గిరిజన బాలుడు కొర్ర రంజిత్‌కుమార్(7) పాముకాటుకు మృతి చెందాడు. ఇంటిలో నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కట్లపాము కాళ్లపై కాటు వేసింది. దీంతో రంజిత్‌కుమార్ పెద్దగా కేకలు వేయడంతో పామును గమనించిన తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో హతమార్చారు. రంజిత్‌కుమార్ కాళ్లపై పాముకాటును గమనించిన వారు రూడకోట ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రంజిత్‌కుమార్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. -
అపోహ పడొద్దు
గిరిజనులకు ఎలాంటి నష్టం జరగకుండా పకడ్బందీగా వ్యూపాయింట్ వద్ద వెదురు, చెక్కలతో దుకాణాలు ఏర్పాటు చేసి మాడగడ, పకనగుడ గ్రామ గిరిజనులకు కేటాయిస్తాం. వ్యూపాయింట్ వద్ద సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ. 25 లక్షలు కేటాయించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రవేశ రుసుం వసూలు చేస్తాం. ప్రకృతికి విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. కమ్యూనిటీ బేసెడ్ ఎకో టూరిజం కమిటీ ఏర్పాటుచేస్తాం. ఉపాధి కోల్పోతామని అపోహ పడొద్దు. – బొర్రా కోటేశ్వరరావు, రేంజర్, అరకులోయ -
అడవి బిడ్డలపై పెత్తనం
అరకులోయ టౌన్: గత నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ అనతి కాలంలో ప్రాచుర్యం పొందింది. స్థానిక గిరిజనులు, మోటార్ యూనియన్ ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది.గత నాలుగేళ్లుగా పట్టించుకోని అటవీశాఖ..నాలుగేళ్లుగా పట్టించుకోని అటవీశాఖ అధికారులు ఇప్పుడు వ్యూపాయింట్ ప్రాంతం అటవీశాఖకు చెందినదిగా ప్రకటించారు. ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగించరాదని సూచనలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో స్థానిక గిరిజనులు ఏర్పాటుచేసిన ఊయల, థింసా చేసే పరిసరాల్లోని పందిరిని తొలగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటుచేయబోయే ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది.● మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌పై ఆధారపడి సుమారు 300కు పైగా కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. మాడగడ, పకనగుడ, బురిడిగుడ, ఎం.హట్టగుడ, వంతమూరు తదితర గ్రామాల గిరిజనులు ప్రతీ రోజు ఉదయం ఐదు గంటల నుంచి వ్యాపారాలు చేపట్టి ఆదాయం పొందేవారు. అల్పహారం, టీ, కాఫీ, మొక్కజొన్న పొత్తులు, జామకాయలు, ఇతర తినుబండరాలు విక్రయించి రోజూ రూ.వేలల్లో ఆదాయం ఆర్జించేవారు.● డప్పు, వాయిద్యాలతో థింసా కళాకారులు నృత్యాలు చేస్తూ పర్యాటకులను అలరించేవారు. వారు ఇచ్చే పైకంతో ఉపాధి పొందేవారు.● పర్యాటకుల్లో ఆడవారికి గిరిజన సంప్రదాయ చీర కట్టు, మగవారికి పంచికట్లు, తగపాగ, కండువా వేసి సిద్ధం చేస్తే రూ.200 చెల్లించేవారు. ఇప్పుడు ఈ ఆదాయానికి గండి పడింది.● చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, చిన్న చిన్న కార్లు, సైకిళ్లు, గుర్రపు స్వారీ ద్వారా ఆదాయం పొందేవారు.● వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను మాడగడ నుంచి సన్‌రైజ్ వ్యూపాయింట్ వరకు తీసుకువెళ్లేందుకు ఆటోలో ఒకొక్కరికి రూ.20 తీసుకునేవారు.● పర్యాటకుల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని బోసుబెడ నుంచి మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వరకు రూ. 13 కోట్లతో రహదారి నిర్మించింది.ప్రముఖ పర్యాటక కేంద్రం మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు అటవీశాఖ సన్నాహాలు చేస్తుండటంతో స్థానిక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తమ పొట్ట కొట్టొద్దని వారు వేడుకుంటున్నారు. -
కూటమికి నిరసన సెగ
● రోడ్డెక్కిన వివిధ శాఖల ఉద్యోగులు ● పట్టనట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర సర్కారు సీలేరు: ప్రభుత్వ పాలన సక్రమంగా సాగాలంటే వివిధ శాఖల ఉద్యోగులు కీలకం.. అలాంటి వారు తమ న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చాలని నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు, కాంటాక్ట్ కార్మికులు, గ్రామ సచివాలయం, వైద్య ఆరోగ్యశాఖ.. ఇలా పలు శాఖల ఉద్యోగులంతా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ● రాష్ట్రంలో ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. జిల్లాలో పొల్లూరు, డొంకరాయి కలిపి 261, మాచ్‌ఖండ్ 175, సీలేరులో131 మంది ఉద్యోగులు తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ● విధులకు సంబంధం లేని సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కలిగించాలని గ్రామ సచివాలయ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 350 గ్రామ సచివాలయాల్లో సుమారు 3వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. సచివాలయంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఒకే బేసిక్‌తో పదోన్నతి కల్పిస్తూ పీఆర్సీ స్లాబ్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తు న్నారు. ఈ నెల 8నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ● హైడ్రో పవర్ ప్రాజెక్ట్టుల అనుమతులు రద్దు కోరుతూ సీపీఎం నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో అరకు, పాడేరు ప్రాంతాల్లోని చిట్టంవలసలో 900 మెగావాట్లు, పెదకోటలో 2400 మెగావాట్లు, గుజ్జలిలో 2400 మెగావాట్లు, ఎరవ్రరంలో 1800 మెగావాట్లు, సీలేరులో 900 మెగావాట్ల యూనిట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. జిల్లాలో ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తోంది. ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25 లోగా తమ డిమాండ్లు పరిష్కరించకుంటే 26 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు అందజేశారు. చాలా మంది వైద్యులు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ చేస్తున్నారని సకాలంలో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ పీజీ కోటాను తిరిగి పునరుద్ధరించాలని, ఎస్టీ ఏరియాల్లో పనిచేస్తున్న వారికి బేసిక్ పేపై 50 శాతం ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఎన్సీసీ క్యాడెట్ల ట్రెక్కింగ్
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో మంగళవారం ఏపీ, తెలంగాణకు చెందిన ఎన్సీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఎన్సీసీ ట్రెక్కింగ్ ఎక్స్ఫెడిషన్ – 2025 ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 525 మంది ఎన్సీసీ క్యాడెట్లు, అసోషియేట్ ఎన్సీసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్యాంప్ కమాండ్ 13వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ విశాఖపట్నం లెఫ్ట్‌నెంట్ కల్నల్ నీరజ్ కుమార్ మాట్లాడారు. క్యాడెట్లలో సాహస స్ఫూర్తి, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, గిరిజన సంస్కృతిపై జ్ఞానం పెంపొందిచడమే ఈ ట్రెక్కింగ్ యాత్ర లక్ష్యం అన్నారు. వారం రోజుల పాటు జరిగే ట్రెక్కింగ్‌ను సాంస్కృతిక అన్వేషణ, సమాజ నిశ్చితార్థంతో మిలితం చేస్తుందన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా ఆధారం
ప్రతీరోజు వ్యూ పాయింట్ వద్ద 40 మంది టీస్టా ళ్లు నిర్వహిస్తున్నాం. సీజన్లో ప్రతీ రోజు ఒక్కో స్టాల్లో రూ. 700 నుంచి రూ. 800 వరకు ఆదాయం వచ్చేది. గత నాలుగేళ్లుగా ఉపాధి పొందుతున్నాం. – బారికి డాలిమ్మ,గిరి మహిళ, మాడగడ థింసాతో ఆదాయం డప్పు వాయిద్యాలు ఆరుగురు, 21 మందితో థింసా నృత్యంవ్యూపాయింట్ వద్ద ప్రతీ రోజు ప్రదర్శిస్తాం. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చేస్తే రోజువారీ కూలి గిట్టుబాటు అయ్యేది. – పెలమాల బాబ్జి,డప్పు కళాకారుడు, మాడగడ -
వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ ప్రారంభం
బీచ్‌రోడ్డు: ఆశీలమెట్ట సంపత్ వినాయగర్ ఆలయ సమీపంలో వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్‌ను శ్రీకన్య ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎన్.వి.ఎస్.గురుమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వి–జ్యూయలరీ మార్ట్ భాగస్వాములు కోలా బాబురావు, కాకి గంగరాజు, పట్నాల శ్రీనివాసరావు, వూన వినీత్ మాట్లాడుతూ విమార్ట్ ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలను గ్రాము రూ.9,987 చొప్పున తరుగు 6.96 శాతం నుంచి పొందవచ్చన్నారు. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదని, జీఎస్టీని కస్టమర్ తరుపున తామే చెల్లిస్తామన్నారు. కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు. -
నాలుగేళ్లలో రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు
చింతపల్లి: మండలంలో నాలుగేళ్ల కాలంలో రూ. 6 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు నిర్వహించినట్టు ఎంపీపీ కోరాబు అనూషదేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్ తెలిపారు. తమ పదవీ కాలం నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారు బుధవారం కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని 17 పంచాయతీల పరిధిలో రూ. 3 కోట్ల మండల పరిషత్ నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలతో పాటు 10 బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తాజంగిలో రూ.15 లక్షల జిల్లా పరిషత్ చైర్మన్ నిధులతో రోడ్డు నిర్మించినట్టు చెప్పారు. జిల్లా పరిషత్ నిధులు రూ.3 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు జెడ్పీటీసీ బాలయ్యపడాల్ తెలిపారు. రూ.25 లక్షలతో జెడ్పీ అతిథి గృహం మరమ్మతు పనులు, రూ.40 లక్షలతో అంగన్వాడీలు భవనాలు, రూ.50 లక్షలతో బోరు నిర్మాణాలు చేపట్టినట్టు చెప్పారు. తన కృషితో చింతపల్లి ప్రజలకు ఎంతో అవసరమైన కల్యాణ మండపానికి అరకు పార్లమెంటు సభ్యురాలు తనూజరాణి రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీకే వీధీ ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి గణబాబు పాల్గొన్నారు. -
అన్నపూర్ణేశ్వరిగా దుర్గమ్మ
సాక్షి,పాడేరు: శరన్నవరాత్రులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అన్ని దేవతామూర్తుల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులు 3వరోజు బుధవారం దుర్గమ్మను కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గమ్మతల్లి, శ్రీమహాలక్ష్మి ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయాల్లో ఉచిత ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. పాడేరు మోదకొండమ్మతల్లి ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం దంపతులను ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయ ఆధ్యాత్మిక కమిటీ ప్రతినిధులు సత్కరించారు.ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, అలయ అర్చకుడు రామం, ఆలయ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి వెంకటరత్నం, ఇతర ప్రతినిధులు శివరాత్రి శ్రీనివాస్, కొట్టగుళ్లి రామారావు, సిద్దనాతి కొండలరావు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
పాడేరులో ఎస్ఐతో సహా 14 మందికి గాయాలు సాక్షి,పాడేరు: పిచ్చి కుక్క స్వైర విహారం చేసి పాడేరు ఎస్ఐతో సహా 14 మందిని గాయపరిచింది. పాడేరు నుంచి చింతలవీధి వెళ్లే ప్రధాన రోడ్డులో స్థానిక వైద్య కళాశాల వద్ద బుధవారం ఉదయం పాడేరు ఎస్ఐ గోవిందరావు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అక్కడే సంచరిస్తున్న పిచ్చికుక్క ఒక్కసారిగా ఎస్ఐపై దాడి చేసి గాయపరచడంతో సిబ్బంది భయాందోళన చెందారు.తీవ్రంగా గాయపడిన ఎస్ఐను జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు.అలాగే వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు సిబ్బందిపైన పిచ్చికుక్క దాడి చేసింది. అంతేకాకండా ఈ మార్గంలో -
జాతీయ ఫొటోగ్రఫీ ఆర్ట్ షోకేస్ నిర్వహణకు ఏర్పాట్లు
● వచ్చేనెల ఒకటి వరకు దరఖాస్తు గడువు ● అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మురళీ గంగాధరరావు అడ్డతీగల: జాతీయ ఫొటోగ్రఫీ ఆర్ట్ షోకేస్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.మురళీ గంగాధరరావు తెలిపారు. జస్టిస్ ఫర్ ఆల్ త్రోద లెన్స్ ఆఫ్ లీగల్ ఎయిడెడ్ అనే ఏకీకృత అంశంతో జాతీయ ఫొటోగ్రఫీ ఆర్ట్ షోకేస్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. న్యాయ సహాయ సేవల పరిధి ప్రభావాన్ని సృజనాత్మకంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉండి ఆయా రంగాల్లో ప్రతిభ కలిగిన వారి నుంచి ఫొటోలు, పెయింటింగులు, స్కెచ్‌లు అలాగే గరిష్టంగా ఒక నిమిషం నిడివి కలిగిన షార్ట్ వీడియోలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు అక్టోబర్ ఒకటో తేదీలోపు దరఖాస్తులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం, జిల్లా కోర్టు, రాజమహేంద్రవరం చిరునామాలో అందజేయాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అందిన కృతులను స్క్రీనింగ్ చేసి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు పంపుతామన్నారు. ఎంపికై న ఉత్తమ కృతులను జాతీయస్థాయి ప్రదర్శనకు పంపుతామని ఆయన పేర్కొన్నారు. -
రోడ్డు, తాగునీటి సమస్యలపై ఐటీడీఏ పీవోకు వినతి
కూనవరం: చినార్కూరు, కొండ్రాజుపేట పంచాయతీల్లో రోడ్డు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్కు ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్‌లు సున్నం అభిరామ్, కట్టం లక్ష్మి బుధవారం వినతిపత్రం అందజేశారు. తెల్లవారి గుంపు నుంచి శబరి కొత్తగూడెం వరకు గత ఏడాది చేపట్టిన రోడ్డు పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పంచాయతీల్లో జల్‌జీవన మిషన్ ద్వారా తాగునీటి సౌక ర్యం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందిన పలువురు రైతులకు అర్హత ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం అందడం లేదని తెలిపారు. సమస్యలపై ఐటీడీఏ పీవో సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. -
వచ్చేనెల 15 నాటికి భవన నిర్మాణాలు పూర్తి
డుంబ్రిగుడ: మండలంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను వచ్చేనెల 15 నాటికి పూర్తిచేసి, ఆయా శాఖలకు అప్పగించాలని ఇంజినీరింగ్ అధికారులను పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. నిర్మాణాల్లో ఉన్న భవనాలను బుధవారం ఆమె పరిశీలించారు. అరమ పంచాయతీలో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రంతో పాటు గోళంబో గ్రామంలో సబ్ సెంటర్, కమ్యూనిటీ భవనం, డుంబ్రిగుడలోని ఆశ్రమ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భవనం, కొర్ర పంచాయతీ అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్త్ సెంటర్ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని అధికారులకు ఆదేశించారు. భవనాల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించాలన్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఏఈ అభిషేక్, సీడీపీవో రాణి తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ -
అనారోగ్యంతో అంగన్వాడీ టీచర్ మృతి
ముంచంగిపుట్టు: మండలంలో పనసపుట్టు గ్రామ అంగన్వాడీ టీచర్ గంపరాయి చంద్రమౌళి(56) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత గంపరాయి బాబూరావు సతీమణి చంద్రమౌళి 30 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. మండల వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు , వైఎస్సార్సీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు రేగం చాణక్య,వైఎస్సార్సీపీ మండల నేతలు, సర్పంచులు,ఎంపీటీసీలు,వివిధ శాఖాల ఉద్యోగులు,అంగన్వాడీలు చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.ప్రభుత్వం చంద్రమౌళి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.అంగన్వాడీలు,నేతలు,ప్రజల మధ్య ముంచంగిపుట్టులో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆదివాసీలను జలసమాధి చేయొద్దు
● హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందం తక్షణమే రద్దు చేయాలి ● సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స డిమాండ్డుంబ్రిగుడ: ఆదివాసీలను జలసమాధి చేయవద్దని, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివాసీ అరణ్య గర్జన జీవు యాత్రను బుధవారం మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్లో నిర్వహించారు. అనంతరం కండ్రుం పంచాయతీ జోడిగుడ, జాకరవలస గ్రామాల ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీతో జీపు జాత నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిఒక్క గిరిజనుడు ఈనెల 27న జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.త్రినాథ్, ఎస్బీ పోతురాజు, మండల నాయకులు పి.సురేష్, సత్యనారాయణ, టి. సూర్యనారాయణ పాల్గొన్నారు. -
గంజాయి నిర్మూలన అందరి బాధ్యత
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: గంజాయి వినియోగించడం సమాజానికి చేటని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో పలుశాఖల అధికారులతో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాలకు అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. పోలీసు నిఘాతో పాటు ప్రతి చెక్‌పోస్టు వద్ద తనిఖీలను విస్తృతం చేయాలన్నారు.అన్నిశాఖలు ప్రణాళికలను రూపొందించుకుని గంజాయి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అన్ని విద్యాసంస్థల్లోను విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా గంజాయి వల్ల కలిగే అనర్థాలను సమగ్రంగా వివరించాలన్నారు. గంజాయి సాగుదారులు, సరఫరాదారులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి సాగు విడిచిపెట్టిన గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకుల రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణాదారుల స్థిర, చరాస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గంజాయి వ్యాపారులకు గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, పాడేరు డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ రామ్పడాల్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్ నందు, డీఆర్డీఏ పీడీ మురళీ, సీపీవో ప్రసాద్, ఎల్డీఎం మాతినాయుడు, జిల్లా ఉద్యానవన అఽధికారి బాలకర్ణ పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణపరిమితి పెంపు వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణపరిమితి పెంచాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్తపై సచివాలయాల స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు, రైతు సేవా కేంద్రాల అధికారులు సమన్వయంతో బ్యాంకింగ్ లావాదేవీలపై రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుజేస్తున్న పలు రుణాల పథకాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందిన భూములు, కాఫీ, మిరియం తోటల సాగుదారులకు రుణాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ కన్వీనర్ పి.సన్యాసిరాజా, ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి నవీన్, ఎల్డీఎం మాతునాయుడు, నాబార్డు డీడీఎం గౌరిశంకర్, డీఆర్డీఏ పీడీ మురళీ పాల్గొన్నారు. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుపై అవగాహన అవసరం
చింతపల్లి: గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలుపై సర్పంచ్‌లు,కార్యదర్శులు అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్ అన్నారు.బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుపై చింతపల్లి,జీకే వీధీ మండలాల పరిధిలో గల అన్ని పంచాయతీల సర్పంచ్‌లు,కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. మంచి ఆరోగ్యం,నాణ్యమైన విద్య,పారిశుధ్యం వంటి లక్ష్యాల సాధనపై ప్రతి ఒక్కరూ అవగాహ న కల్గిఉండాలన్నారు. జీకే వీధీ ఎంపీపీ బోయిన కుమారి,ఎంపీడీవో సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. -
పోర్టు ఇన్చార్జ్ చైర్మన్గాడా. అంగముత్తు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) చైర్మన్‌గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీపీఏ చైర్మన్‌గా ఉన్న డా.అంగముత్తు ఈ నెల 22న ముంబై పోర్టు చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అయ్యాక.. కొత్త చైర్మన్‌ని నియమించలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త చైర్మన్‌ని నియమించే వరకూ లేదా ఆరు నెలల కాలం వరకూ వీపీఏ చైర్మన్‌గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
జైల్‌ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్
ఆరిలోవ(విశాఖ): దేవి నవరాత్రులు సందర్భంగా మహిళలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆమె బుధవారం సందర్శించారు. జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లతో కలిసి మహిళా ఖైదీల బ్యారక్‌ను పరిశీలించారు. అక్కడ మహిళలతో సమావేశమై, పలు అంశాలపై అవగాహన కలిగించారు. వారికి పోషకాహారం అందించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. జైల్లోని బ్యారక్‌లను, ఖైదీలు పనిచేస్తున్న వివిధ పరిశ్రమలను పరిశీలించారు. అనంతరం జైల్ బయటకు వచ్చిన అమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నారీ పరివార్ అభియాన్‌లో భాగంగా ‘పోషణ్ మా’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జైల్లో మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. కారాగారంలో 80 మంది మహిళా ఖైదీలున్నారని, వారిలో సుమారు 50 మంది గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికినవారేనని పేర్కొన్నారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు చైన్నె, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారున్నట్లు వెల్లడించారు. మహిళలల్లో మంచిమార్పు తీసుకొచ్చి తిరిగి సమాజంలోకి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. -
అగ్రిసెట్‌లో ‘చింతపల్లి’ మెరుపులు
● రాష్ట్రస్థాయిలో తొలి నాలుగు ర్యాంకుల సాధన ● పలువురి అభినందన తర్రా రాంజీ కుంతూరు మురళీకృష్ణ పట్నాల శ్రీకావ్య ఎం. రాజ్‌కుమార్ చింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అగ్రిసెట్‌లో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విద్యనభ్యసించిన సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తొలి నాలుగు ర్యాంకులు సాధించారు. ఈ విషయాన్ని పరిశోధన స్థానం ఏడీఆర్/కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి బుధవారం తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన అగ్రిసెట్– 2025 పరీక్షలకు స్థానిక సేంద్రియ వ్యవసాయ కళాశాల నుంచి హాజరైన వారిలో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన తర్రా రాంజీ మొదటి ర్యాంకు సాధించాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గొట్టుపల్లి గ్రామానికి చెందిన కుంతూరు మురళీకృష్ణ రెండో ర్యాంకు, జి.మాడుగుల మండలం మహా దేవాపురం గ్రామానికి చెందిన మినుములు రాజ్‌కుమార్ మూడో ర్యాంకు, విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం చైతన్యనగర్‌కు చెందిన పట్నాల శ్రీకావ్య నాలుగో ర్యాంకు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరిని ప్రిన్సిపాల్ డాక్టర్ అళ్ల అప్పలస్వామి, అధ్యాపకులు అభినందించారు. -
రూ.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
గంగవరం: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.45లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు సోమవారం సాయంత్రం గంగవరం శివారులో ఎండపల్లి మార్గం నెమలిచెట్లు సెంటర్ వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో గుర్తించామన్నారు. ఎండపల్లి వైపు నుంచి వస్తున్న కారు, మోటార్ సైకిల్, మినీ వ్యాన్‌లో రవాణా చేస్తున్న 30 ప్లాస్టిక్ సంచుల్లో 920 గంజాయిని రాజవొమ్మంగి సీఐ గౌరీశంకర్ పర్యవేక్షణలో గంగవరం ఎస్ఐ బి.వెంకటేష్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారన్నారు. ఒడిశాలోని మల్కజిగిరి నుంచి ఐదుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాలకు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. మూడు వాహనాలను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. . ఈ సందర్భంగా ఆయన ఎస్ఐ వెంకటేష్, సీహెచ్ వీవీ మహర్షి రాంబాబు, పీసీలు సాయినాథ్, అశోక్, వీరబాబు, కొండబాబును అభినందించారు. పట్టుకున్న గంజాయికి తహసీల్దార్ శ్రీనివాసరావు, వీఆర్వో వెంకన్నదొర సమక్షంలో తూకం వేసినట్టు డీఎస్పీ తెలిపారు.ఐదుగురి అరెస్టు -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
సీలేరు: సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో జరిగిన హత్య కేసులో నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్టు సీఐ వరప్రసాద్ తెలిపారు. రెండు బృందాలతో గాలింపు జరిపి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని, విశాఖపట్నం జువైనెల్ హోంకు తరలించినట్టు చెప్పారు. మూడు నెలల కిందట సీలేరుకు చెందిన భగత్రామ్(32) బైక్ చోరీకి గురైంది. తన బైక్‌ను చింతపల్లి క్యాంప్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి అపహరించాడని భగత్రామ్ అనుమానం వ్యక్తం చేశాడు.ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగాయి. పోలీసు స్టేషన్లో దీనిపై భగత్రామ్ సమాచారం ఇచ్చాడు. ఆ కక్షతోనే 21వ తేదీ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో నీకు బైక్ ఇస్తానని చెప్పి భగత్‌రామ్‌ను జలాశయం వద్దకు తీసుకువెళ్లి హత్యచేసినట్టు నిందితుడు తెలిపాడని సీఐ చెప్పారు. బీరు బాటిల్‌తో ముందుగా తలపై కొట్టి, తరువాత అదే బాటిల్‌తో పలుచోట్ల పొడవడంతో భగత్రామ్ మృతిచెందినట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. భగత్రామ్ బైక్‌ను హత్యకేసు నిందితుడే చోరీ చేసినట్టు తమ విచారణలో బయటపడిందన్నారు. తండ్రి లేక పోవడంతో నిందితుడు చెడు వ్యసనాలకు బానిస అయ్యాడని, బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాడని తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో విశాఖపట్నంలోని జువైనెల్ హోమ్‌కు తరలించినట్టు సీఐ వరప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీలేరు ఎస్ఐ రవీంద్ర పాల్గొన్నారు.జువైనెల్ హోమ్‌కు తరలింపు -
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
ముంచంగిపుట్టు: పరిసరాల పరిశుభ్రతతోనే రోగలు దూరమవుతాయని సీఆర్పీఎఫ్ జి198 బెటాలియన్ ఇన్స్పెక్టర్ శరవణ కుమార్ అన్నారు.మండల కేంద్రం ముంచంగిపుట్టులో బుధవారం సీఆర్పీఎఫ్ జి198 బెటాలియన్ కమాండెంట్ రామ్ పాలట్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ శరవణ కుమార్ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రం,శిశు జనన నిరీక్షణ కేంద్రం,నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద స్వచ్ఛంత అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ పోలీసులు చెత్తను తొలగించి, జంగిల్ క్లియరన్స్ నిర్వహించారు. మురికి కాలువలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ జి198 బెటాలియన్ ఇన్స్పెక్టర్ శరవణ కుమార్ మాట్లాడుతూ ప్రజలంతా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యాధికారి ధరణి,సీఆర్పీఎఫ్ ఎస్ఐలు కృష్ణారావు,జైసి రావు,పలు శాఖాల అధికారులు,సీహెచ్‌సీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. -
స్వస్త్ నారీ సశక్త్ పరివార్‌తో మహిళలకు మేలు
హుకుంపేట: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌తో మహిళలకు మరింతగా వైద్య సేవలు అందుతాయని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వే శ్వరనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని పాడిపుట్టులో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు మహిళలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. స్థానిక వైద్యాధికారి భార్గవి శ్రీలత, ఆస్పత్రి సూపర్వైజర్ సాంబశివరావు, సర్పంచ్ సోమెలి సత్యవతి పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగులకు మంత్రి క్షమాపణ చెప్పాలి
పాడేరు రూరల్: సచివాలయ ఉద్యోగులను కించపరుస్తూ, అవహేళనగా మాట్లాడిన మంత్రి డోల వీరంజనేయస్వామి క్షమాపణలు చెప్పాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యా లయం వద్ద సచివాలయ ఉద్యోగులు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అల్లూరి జిల్లా జేఏసీ నాయకుడు లకే నానిపాత్రుడు మాట్లాడుతూ ఆరేళ్లుగా గ్రామ స్థాయిలో పనిచే స్తూ ప్రజలకు సేవలందిస్తున్న తమను కించపరుస్తూ మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులపై మంత్రి డోల వీరంజనేయస్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మండల జేఏసీ అధ్యక్షుడు సీహెచ్ అనిల్,కార్యదర్శి లక్ష్మీనాయుడు, కోశాధికారి నాగేంద్ర పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వైద్యసిబ్బంది ఆందోళన
● డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయం ముట్టడి చింతూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ డివిజన్లో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి పీహెచ్సీలో కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. అనంతరం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, మడివి నెహ్రూ, గుజ్జా సీతమ్మ, కరక అర్జున్, శ్రీనివాస్, రామకృష్ణ, ఆదిలక్ష్మి, భద్రకాళి, సీత, జయ, చంద్రమ్మ పాల్గొన్నారు. -
సమ్మగిరిలో కదంతొక్కిన గిరిజనం
● హైడ్రోపవర్ ప్రాజెక్టుల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ ● లేకుంటే పోరాటం కొనసాగిస్తాం ● సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్సయ్య హెచ్చరిక చింతపల్లి: హైడ్రోపవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్సయ్య హెచ్చరించారు. మంగళవారం అరణ్య గర్జన జీపు జాతా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మండలంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు కానున్న సమ్మగిరి ప్రాంతంలో పర్యటించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాపకింద నీరులా ఆదివాసీలను అడవులకు దూరంచేసే కుట్రకు సిద్ధమయ్యయన్నారు. చింతపల్లి–కొయ్యూరు మండలాల సరిహద్దులోని ఎర్రవరం ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు తీవ్రమైన పోరాటం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. గ్రామసభ, మండల, జిల్లా కమిటీల తీర్మానాలను పట్టించుకోకుండా ఫీజుబిలిటీ రిపోర్టు తయారు చేశారన్నారు. ఆదివాసీల జీవనోపాధి, సంస్కృతీ సంప్రదాయాలను కాలగర్భంలో కలిపేసేలా అడవులను నాశనం చేసేందుకు కుట్రపూరితంగా వ్యహరిస్తున్నాయని ఆరోపించారు. మన్యంలో ఈ హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో సుమారు పది వేల ఎకరాలు నాశనం కావడంతో పాటు 250 గ్రామాలు ఖాళీ అవుతాయన్నారు. అంతేకాకుండా 50 వేల మంది ఆదివాసీలు నిర్వాసితులుగా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు.సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ అడవి, భూమిపై హక్కు గిరిజనులకే ఉన్నప్పుడు ఆ భూమిని అమ్మే హక్కు ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బలమైన గిరిజన చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలకు చుట్టాలుగా మారిపోయాయని దుయ్యబెట్టారు.ఈ కార్యక్రమంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ గూడెపు రాజు, ఎంపీటీసీ మోహనరావు, మాజీ సర్పంచ్ బెన్నాస్వామి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, సీపీఎం నేతలు త్రినాథ్, ధర్మన్నపడాల్, సింహాద్రి, ఎర్రబొమ్మలు ఉప సర్పంచ్ సోమరాజు, గొందిపాకులు,ఎర్రబొమ్మలు పంచాయతీల పరిధిలోని గిరిజనులు పాల్గొన్నారు. -
గాయత్రీ మాత అలంకరణలో దుర్గమ్మ
సీలేరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం గాయత్రీ మాత అలంకరణలో సీలేరు,దారకొండ గ్రామాల్లో దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించారు. వనదుర్గ ఆలయంలో కె.శ్రీను దంపతులు, మణి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. నక్క జ్ఞానేశ్వర్ రావు అమ్మవారికి తొమ్మిది రోజులు నిత్య ప్రసాదాలను అందజేశారు. సీలేరు సర్పంచ్ దుర్జో అ మ్మవారి విగ్రహానికి ఆర్థిక సాయం అందజేశారు. జి.మాడుగుల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయ జంక్షన్ వద్ద అమ్మవారిని మంగళవారం గాయత్రీమాతగా అలంకరించారు. ఈ సందర్భంగా విజ్ఞాన భారతి ఇంగ్లిష్ మీడియం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, భక్తులు 108 సార్లు గాయత్రీమంత్ర జపం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్‌కుమార్, పాఠశాల కరస్పాండెంట్, సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, ఉపాధ్యాయులు కమలకుమారి, జోత్స్న, వాణి, ప్రమీల, చైతన్య, సమరసతా సేవ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీను,సాయిబాబు ఆలయ ధర్మకర్త కె.వెంకటరమణ,పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం నాయకుడు బాబూరావు పాల్గొన్నారు. ఎటపాక: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు మంగళవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తోటపల్లిలో జైమాత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, పూజలు చేశారు. గుండాలకాలనీ, చోడవరం గ్రామాల్లో కూడా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. -
బెల్టు దుకాణాలపై దాడి
● 95 మద్యం బాటిళ్లు స్వాధీనం ఎటపాక: మండలంలో వివిధ ప్రాంతాల్లో ఎకై ్స జ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తపట్నం గ్రామంలో చర్చి ఎదురుగా మద్యం అమ్ముతున్న ఓమహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లిపాకలో స్థానికుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నుంచి 45 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎకై ్సజ్ సీఐ విజయలక్ష్మి తెలిపారు. -
అతివేగానికి యువకుడి బలి
కొయ్యూరు: అతివేగం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన పాంగి అఖిల్ (20) కృష్ణదేవిపేట నుంచి కొయ్యూరు బైక్‌పై బయలుదేరాడు. అతివేగంతో వస్తున్న అతని బైక్ పిట్టాచలం దాటిన తరువాత మలుపువద్దకు వచ్చేసరికి అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొన్నాడు. తలకు తీవ్రంగా గాయమవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇలావుండగా మృతుడు అఖిల్ తండ్రి సుందర్రావు మంప పోలీసు స్టేషన్లో గత ఐదేళ్లుగా హోం గార్డుగా పనిచేస్తున్నారు. కుమారుడు ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఈ హృదయ విదారక దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే మృతి కుమారుడి మృతదేహం వద్ద బోరున విలపించిన తల్లిదండ్రులు -
విద్యుత్ సరఫరాలో లోపాలు లేకుండా చర్యలు
● విద్యుత్‌శాఖ డీఈ వేణుగోపాల్ ముంచంగిపుట్టు: విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్‌శాఖ డీఈ వేణుగోపాల్ అన్నా రు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్లో మాకవరం ఫీడర్‌కు చెందిన కొత్త బ్రేకర్లను మంగళవారం విద్యుత్‌శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.ఈ పనులను డీఈ వేణుగోపాల్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకవరం ఫీడర్లో బ్రేకర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ సరఫరాలో నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 2007లో ఏర్పాటు చేసిన బ్రేకర్లను ఇప్పటికీ వినియోగించడం వల్ల విద్యుత్ సరఫరాలో సమస్యలు వస్తుండేవని,ప్రసుత్తం ఏర్పాటు చేసిన ఆధునిక బ్రేకర్లు వల్ల మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఏడీ మురళీమోహన్,ఏఈ సురేష్ పాల్గొన్నారు. -
పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రంపచోడవరం: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోసు రమేష్బాబుదొర, ఎంపీటీసీ వంశీ కుంజం అన్నారు. ముసురుమిల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సాల్లో వారు మాట్లాడారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయాలను ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో స్టాక్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు సరస్వతి, సీతపల్లి ఆలయ మాజీ చైర్మన్ బొబ్బా శేఖర్, మహిళ పోలీస్ కృష్ణవేణి, రోషిణి తదితరులు పాల్గొన్నారు. -
రక్తదాన శిబిరాలతో మేలు
జిల్లా వ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లంతా రక్తదాన శిబిరాలతో ప్రజలకు ఎంతో మే లు చేస్తున్నారు. విద్యార్థులు కూడా రక్తదానం చేస్తూ తమ మానవత్వం చాటుకుంటున్నారు. రక్తం అవసరాలు జిల్లాలో అధికంగా ఉండడంతో విద్యార్థుల నుంచే సేకరిస్తున్నాం. ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులంతా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు. – జి.గౌరిశంకరరావు, ఎన్ఎస్ఎస్ పీవో, పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సామాజిక అంశాలపై దృష్టి అరకులోయ వంటి వెనుకబడిన ప్రాంతంలో 4 ఎన్ఎస్ఎస్ యూనిట్లు గిరిజనుల అభివృద్థి అజెండాగా అన్ని సామాజిక ఆంశాలపై దృష్టి పెట్టాయి. కళాశాలకు ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. – పి.విజయలక్ష్మి, ఎన్ఎస్ఎస్ పీవో, అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
సామాజిక సేవలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు
సాక్షి, పాడేరు : విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ యూనిట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. సమాజ అభివృద్ధికి ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎంతో శ్రమిస్తున్నారు. నిరక్షరాస్యతతో పాటు అభివృద్ధిలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు జాతీయ సేవా పథకం ఎంతో మేలు చేస్తుంది. ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 15 ఏళ్ల క్రితం పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 100మంది విద్యార్థులతో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ యూనిట్ నేడు జిల్లా వ్యాప్తంగా 25 కళాశాలలకు విస్తరించింది. 2500 మంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు సమాజ అభివృద్ధిలోను భాగస్వాములవుతున్నారు. ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు తమ కళాశాల పరిధిలోని పలు గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి యూనిట్‌కు అనుభవజ్ఞులైన అధ్యాపకుడు ఎన్ఎస్ఎస్ పీవోగా పనిచేస్తున్నారు. జిల్లాలో 25 ఎన్ఎస్ఎస్ యూనిట్లు జిల్లాలోని 22 మండలాలకు సంబంధించి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 27 ఎన్ఎస్ఎస్ యూనిట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి, పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4 యూనిట్లు, చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4, అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3, అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో 1, రంపచోడవరం డిగ్రీ కళాశాలలో 2, చింతూరు డిగ్రీ కళాశాలలో 2, కొయ్యూరు మండలం మర్రిపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2, పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల1, ఏపీఆర్1, సీలేరు జూనియర్ కళాశాల 1, పెదబయలు ఏపీఆర్ 1, హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 1, హుకుంపేట జ్ఞానప్రకాష్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 1 ఎన్ఎస్ఎస్ యూనిట్ పనిచేస్తుంది. ప్రాణదాతలుగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు రెడ్‌క్రాస్ సొసైటీకి అనుబంధంగా ఉన్న 25 ఎన్ఎస్ఎస్ యూనిట్ల విద్యార్థులు అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేస్తుండడంతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 45 రక్తదాన శిబిరాలను ఎన్ఎస్ఎస్ యూనిట్ల విద్యార్థులు నిర్వహించారు. 200 యూనిట్ల వరకు రక్తం సేకరించి జిల్లాలోని రోగులకు రక్తం అందుబాటులో ఉంచారు. గ్రామాల అభివృద్ధిపై అవగాహన శిబిరాలు ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ల విద్యార్థులంతా తాము దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహనతో పాటు వైద్యబృందాల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం అందించే పౌరసేవలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. తమ కళాశాలలతో పాటు దత్తత గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను ఈ ఏడాది విజయవంతంగా చేపట్టారు. విద్యార్థి దశలో ఉన్నత సేవలు 25 ఎన్ఎస్ఎస్ యూనిట్లు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు పచ్చదనం పర్యావరణం లక్ష్యం పరిశుభ్రత, ఆరోగ్యంపై గిరిజనులకు అవగాహన రక్తదాన శిబిరాలతో ప్రాణదాతలు -
హత్యకేసులో నిందితుడి ఇంటికి నిప్పు
సీలేరు: సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో జరిగిన హత్యకేసులో నిందితుడి ఇంటికి మృతుడి బంధువులు మంగళవారం నిప్పు పెట్టి, ధ్వంసం చేశారు. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల యువకుడు అదే గ్రామానికి చెందిన వంతల భగత్‌రామ్‌ను హత్యచేసిన విషయం తెలిసిందే. భగత్రామ్ మృతదేహానికి మంగళవారం చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పారు. మృతదేహాన్ని చూసి భార్యా పిల్లలు, బంధువులు భోరున విలపించారు. ఆగ్రహంతో ఉన్న మృతుడి బంధువులు దాడి చేస్తారనే భయంతో నిందితుడి కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న హతుడి బంధువులు... నిందితుడి ఇంటికి నిప్పుపెట్టి, ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ వరప్రసాద్, ఎస్ఐ రవీంద్ర గ్రామానికి వెళ్లి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని నచ్చ జెప్పారు. నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇదే గ్రామంలో మూడు నెలల వ్యవధిలో మూడు హత్యలు జరిగాయని, ఇది గ్రామానికి మంచిది కాదని, ఏమైనా గొడవలు ఉంటే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.గ్రామం నుంచి పరారైన కుటుంబ సభ్యులు -
గంజాయి రవాణా అడ్డుకట్టకు ఉమ్మడి వ్యూహం
● అంతర్–రాష్ట్ర సమన్వయ సమావేశంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సాక్షి, విశాఖపట్నం : ప్రాంతీయ భద్రత, శాంతిభద్రతలను పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసుల మధ్య జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్–రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు సరిహద్దు సమస్యలు, ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాపై చర్చించారు. గత కొన్నేళ్లుగా గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని, 2021–22లో 7,515 ఎకరాల నుంచి 2024–25లో 93 ఎకరాలకు తగ్గిందని విశాఖ రేంజ్ పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యలను వివరించారు. ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణాలో 377 కేసులు నమోదు చేసి, 22,207 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇరు రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం, సమాచార మార్పిడిని కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. కోరాపుట్ సౌత్ వెస్టర్న్ రేంజ్ డీఐజీ కన్వర్ విశా ల్ సింగ్, రాయగడ ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, కోరాపుట్ ఎస్పీ రోహిత్‌వర్మ, మల్కాన్‌గిరి ఎస్పీ వినోద్ పాటిల్, ఏఎస్సార్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. -
ఏకధాటిగా భారీ వర్షం
ముంచంగిపుట్టు: మండలంలో మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తునే ఉంది. దీంతో మండల కేంద్రం నుంచి పెదబయలు, కుమడ, జోలాపుట్టు, డుడుమ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయమయ్యాయి. చోటముఖిపుట్టు, రంగన్నకొండ వంతెనలపై వరదనీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. వరి పొలాలు నీటి మునిగాయి.మండలంలోని రండబయలు,బూసిపుట్టు పంచాయతీలకు వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. వాహనాలు బుదరలో కూరుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ముసురు వాతావరణం కారణంగా పలు గ్రామాల్లో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. సీలేరు: ఆంధ్ర,ఒడిశా సరిహద్దుల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములతో వర్షం పడింది. దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్డులో భారీగా వర్షం పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు ఈ వర్షం ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి గిరిబాబు తెలిపారు. -
జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సాక్షి,పాడేరు: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఐటీడీఏ పీవోలు, పలుశాఖల అధికారులతో నిర్వహించిన వీడి యో సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీఆర్ఎస్ పెండింగ్ వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రు ణ గ్రహీతల్లో మొండి బకాయిలు లక్ష్యంగా పెట్టుకుని వసూలు చేయాలన్నారు. పనికి ఆహార పథకం పనుల మంజూరుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చేపట్టిన పనుల్లో నాణ్యత ఉండాలన్నారు. ముప్పై వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాల అభివృద్ధిపై డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్‌శాఖలు బృందంగా ఏర్పడి ప్రణాళికలు సిద్ధం చేయా లని ఆదేశించారు. హర్‌ఘర్ జల్ జలజీవన్ మిషన్ తాగునీటి పథకాల పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఆటోడ్రైవర్ల సేవలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈసమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు. అలసత్వం ఉపేక్షించేది లేదు మ్యూటేషన్ పనులు వేగవంతం చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం -
ఆరోగ్యశ్రీ నిధుల చెల్లింపుల్లో చేతివాటం!
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి విడుదలైన నిధులకు సంబంధించి చెల్లింపుల్లో పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో సేవలందించిన వారికి మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నిధుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించనట్టుగా తెలుస్తోంది. ● స్థానిక ఏరియా ఆస్పత్రికి 2023 నుంచి 2025 మార్చి వరకు అందించిన ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి రూ. 52,21,714 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్, ఆప్తాల్మిక్ , ఈఎన్టీ, ఆర్ధోపెడిక్ , పిడియాట్రిక్ సర్జరీలకు సంబంధించిన నిధులు ఉన్నట్టు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ సేవలు అందించిన వారికి అంటే సర్జరీ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎఫ్ఎన్వో, ఎంఎన్‌వో ఇతర సేవలు అందించిన వారికి వీటిని చెల్లించాల్సి ఉంది. అయితే ఆస్పత్రి ఉన్నతాధికారికి అనుకూలంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఖాతాల్లో జమచేసి పక్కదారి పట్టించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో సేవలందించిన ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో పలుసార్లు ఆ ఉన్నతాధికారి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని సమాచారం. ● సర్జరీలకు అవసరమైన పరికరాలను రోగుల నుంచి కొనుగోలుపక్కదారికి అవకాశం లేదు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించా. ఆరోగ్యశ్రీ నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. చెల్లింపులు పారదర్శకంగా జరుగుతాయి. ప్రభుత్వం జీవోలు మార్చినప్పుడు చెల్లింపుల విధానం కూడా మారుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుంటా. – వి.సూర్యప్రకాష్, సూపరింటెండెంట్, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిరంపచోడవరంలో పథకం ప్రకారం పక్కదారి పట్టించారని విమర్శలు -
సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద శాశ్వత బేస్ క్యాంపు
చింతపల్లి: సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద అటవీ సిబ్బందితో శాశ్వత బేస్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు డీఎఫ్‌వో వై. నర్సింహరావు తెలిపా రు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గూడెంకొత్తవీధి మండలం పెదవలస రేంజి పరిధిలోని సిగనాపల్లి క్వారీలో ఎటువంటి రంగురాళ్ల తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తవ్వకాలు ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో చింతపల్లికి చెందిన వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అంతేకాకుండా వీరు ప్రతిరోజు తమ కార్యాలయంలో ఉదయం, సాయంత్రం సంతకాలు తీసుకుంటున్నామన్నారు. తవ్వకాలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల మేరకు మైదాన ప్రాంతం నర్సీపట్నానికి చెందిన ముగ్గురు, తునికి చెందిన ఇద్దరికి నోటీసులు జారీ చేశామన్నారు. చింతపల్లిలో గతంలో రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించిన వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు. క్వారీ ప్రాంతంలో శాశ్వతంగా ఐదుగురితో బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తమ సిబ్బందితో 24 గంటలు గస్తీ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఈ క్వారీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని గూడెంకొత్తవీధి తహసీల్దార్‌ను కోరామని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఈ సెక్షన్ అమల్లోకి వస్తుందన్నారు. హెచ్చరికలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో హెచ్చరించారు. 24 గంటలూ గస్తీ 144వ సెక్షన్ అమలుకు చర్యలు తవ్వకాలు ప్రోత్సహిస్తున్నారన్నఆరోపణలపై ఐదుగురికి నోటీసులు చింతపల్లి డీఎఫ్‌వో నర్సింహరావు -
బరిస్టా కాఫీ తయారీపైగిరి యువతకు శిక్షణ
● జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రోహిణి పాడేరు రూరల్: బరిస్టా కాఫీ తయారీపై గిరిజన నిరుద్యోగ యవతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి. రోహిణి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఇందుకు సంబంధించి అరకులోయ వైటీసీ కేంద్రంలో శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు.ఈ 27 వరకు ఇవి జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు ట్రైనర్ యతీష్గౌడ, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమాశంకర్, ఎస్ఐ గోపాల్‌రావు పాల్గొన్నారు. -
వెదురు పెంపకంతో మేలు
● డ్వామా ఏపీడీ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్ రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం సహకారంతో వెదురు పెంపకానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం కల్పిస్తున్నాయని డ్వామా ఏపీడీ తూతిక శ్రీనివాస్‌విశ్వనాథ్ అన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఉపాధి, వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి, ఉపాధి హమీ జాబ్‌కార్డు ఉన్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మారేడుమిల్లి మండలంలో సుమారు 300 ఎకరాల్లో వెయ్యి మంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా వెదురు పెంపకం చేపడతామన్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించాలని ఇప్పటికే కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఏపీవో మణికుమారి, ఏపీఎం డీఆర్డీఏ దుర్గాప్రసాద్, వెలుగు, ఉపాధిహామీ సిబ్బంది, పాల్గొన్నారు. -
మాడగడ వ్యూపాయింట్ వద్ద ఊయల తొలగింపు
● ఎకో టూరిజం ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేపట్టిన అటవీశాఖ అరకులోయ టౌన్: మండలంలోని ప్రముఖ సందర్శిత ప్రాంతమైన మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వద్ద గిరిజనులు కర్రలతో ఏర్పాటు చేసిన ఉయ్యాలను మంగళవారం అటవీ శాఖ అధికారులు తొలగించారు. గత మూడేళ్ల క్రితం మాడగడ గ్రామ గిరిజనులు వ్యూ పాయింట్ వద్ద పర్యాటకులను ఆకర్షించేలా కర్రలతో ఏర్పాటు చేశారు. దీనిపై వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉయ్యాలను తొలగించడం దారుణం అని పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు తెలిపారు. వ్యూ పాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్న తొలగించడం దారుణమన్నారు. గిరిజన కుటుంబాలు వ్యూ పాయింట్ వద్ద వచ్చే ఆదాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే, అటవీశాఖ అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. అటవీ శాఖ అధికారులు గిరిజనుల పొట్ట కొట్టవద్దని ఆయన పేర్కొన్నారు. -
విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ
చింతపల్లి: చింతపల్లి డిగ్రీ విద్యార్దులకు విజ్ఞాన విహార యాత్రలో బాగంగా విశాఖపట్నం రైల్వే ఈస్ట్ కోస్ట్ జోన్ అఽధికారులు టికెట్ కన్సలేషన్ ఫామ్స్ మంజూరు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ భారతి తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ కన్సోలేషన్ ఫామ్స్‌తో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా విద్యార్దులు విహార విజ్ఞాన యాత్రలు చేయవచ్చన్నారు.అదే విధంగా ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఎల్.వెంకటరామిరెడ్డి విద్యార్థుల పోటీ పరీక్షలకు ఉపయోగపడే రూ.30వేలు విలువైన పుస్తకాలను కళాశాలకు వితరణగా అందించినట్టు తెలిపారు.ఈ పుస్తకాలను కళాశాల గ్రంథాలయంలో భద్రపరచడం జరిగిందన్నారు. ఈ పుస్తకాలను వ వినియోగించుకొని పోటీ పరిక్షలకు సన్నద్దమై మంచి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు పోటీ పరిక్షలు పుస్తకాలను అందజేశారు. అద్యాపకులు రవీంద్రనాయక్, జగదీష్, రమణ, లీలాపావని ,కెజీయారాణి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ వల.. చిక్కితే విలవిల..!
సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకరు కాదు చాలా మంది సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు మోసపోతే, అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు మోసపోతున్నారు. అత్యాశతో ఉన్నవారిని పార్ట్‌టైం, పుల్టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం అంటూ అన్లైన్లో ఫేక్ లింక్‌లు పెట్టి వాటిని క్లిక్ చేసేలా ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలలో తలెత్తే సమస్యల పరిష్కారాల కోసం గూగుల్‌లో, యూట్యూబ్‌ల్లో సెర్చ్ చేసుకునేవారిని ఫేక్ వీడియోలను యూట్యూబ్‌ల్లో ఫోస్టు చేసి ట్రాప్ చేస్తారు. ఫేక్ యాప్‌లు, ఫేక్ లింక్‌ల ద్వారా డేటాని తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టారు... నర్సీపట్నంకు చెందిన ఒక వృద్దుడుకు సైబర్ మోసానికి గురయ్యాడు. ముంబై నుంచి పోలీసులమంటూ ఫోన్ చేసి ..నీ బ్యాంక్ ఖాతాలో అనాధరైజ్డ్‌గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయింది. తక్షణమే వాటిని రిటర్న్ కొట్టకపోతే నిన్ను అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్ల భయపెట్టారు. తక్షణమే నీ బ్యాంక్ ఖాతా వివరాలన్నీ చెప్పండి..చెక్ చేస్తాం. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ నలుగురు సైబర్నేరగాలు మాట్లాడారు. వారి మాటలు నమ్మి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.1 కోటి 43 లక్షల వరకూ తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్ హెల్ప్‌లైన్ (1930)కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ధర్యాప్తులో భాగంగా తక్షణమే ఆ సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. ఎవరైతే బెదిరించి తస్కరణకు పాల్పడ్డారో ఆ సైబర్నేరగాళ్లను కూడా 4గురును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు. ఆన్లైన్ ఉద్యోగం పేరుతో మోసం...అనకాపల్లి టౌన్లో గల గవరపాలెంకు చెందిన మణికంఠ అమెజాన్‌లో ఉద్యోగం కోసం ధరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 31న వాట్సాప్‌లో కంపెనీ పేరుతో ఒక లింక్ వచ్చింది. ఇది పార్టు టైమ్ ఉద్యోగమని.. ఇంటిలో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చనే చెప్పడంతో ముందుగా రూ.1,000తో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు. అనుమానంతోనే పోతే వెయ్యే కదా అని ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. ఆవిధంగా చేసిన మణి కంఠకు కొద్ది రోజుల్లోనే రూ.1,400 పంపించాడు. దీంతో పార్ట్‌టైమ్ ఉద్యోగం బావుందని నమ్మిన మణికంఠ అలా దపదఫాలుగా రూ.1.80 లక్షలు వరకూ వారికి పంపిస్తూనే ఉన్నాడు. అటునుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్ చేశారు. అచ్యుతాపురం కేంద్రంగా సైబర్డెన్... అచ్యుతాపురంలో ఒక అపార్ట్మెంట్లో సైబర్ డెన్‌ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కాల్ సెంటర్‌ను నడుపుతూ ప్రజల వ్యక్తిగత బ్యాంక్ వివరాలు మోసపూరితంగా సేకరించి, ఖాతాల్లోని డబ్బులను మాయం చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారిని కూడా టార్గెట్ చేసే ఆ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులను సీఐడీకి కూడా అప్పగించడం జరిగింది. ఇందులో సైబర్ నేరస్తులకు శిక్ష పడడమే కాకుండా..నిరపరాధులను కూడా రక్షించారు. 94 కేసుల్లో రూ.93.74 లక్షలు ఫ్రీజ్ జిల్లాలో జూలై 1న నుంచి నేటి వరకూ 94 సైబర్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ. 93,78,304 మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. అలాగే రూ.15,45,234 మొత్తాన్ని 17 కేసుల్లో బాధితులకు తిరిగి చెల్లించారు.సు‘రక్షి’తమైన డిజిటల్ లావాదేవీలు... ఎవరితో కూడా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్వర్డ్, యూపిఐ పిన్, ఓటీపీ, ఏటీఎం, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచింది. డిజిటల్ లావాదేవీలకు బార్కోడ్లు, క్యూఆర్ కోడ్లు స్కానింగ్ లేదా ఎంపిన్‌ని లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి. ఏదైనా ఫోన్‌కాల్, ఈ–మెయిల్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేయాలని వివరాలు అడిగినా చెప్పరాదు. ఒక వేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. హోం బ్యాంక్ శాఖను సంప్రదించాలి. ఈమెయిల్‌లు, ఎస్ఎంఎస్లలో యూఆర్ఎల్, డొమైన్ పేర్లను స్పెల్లింగ్ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఇవి ‘‘హెచ్‌టీటీపీఎస్’’తో ప్రారంభమవుతాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం అధికార వెబ్సైట్లనే ఉపయోగించాలి. ఏదైనా వెబ్సైట్, అప్లికేషన్లో మీ ఈమెయిల్‌ను యూజర్‌ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘పాస్వర్డ్’ అని పెట్టుకోవద్దు. జిల్లాలో గత ఆరేళ్లుగా సైబర్ కేసుల వివరాలు.. 2021లో 128 2022లో 217 2023లో 310 2024 జూన్ వరకూ 201 2024 జూన్ నుంచి నేటి వరకూ 94 కేసులు నమోదు -
పారదర్శకతతో సామాజిక తనిఖీలు
వై.రామవరం: మండలంలో ఉపాధి హామీ పనుల తనిఖీలను పారదర్శకతతో నిర్వహించాలని సామాజిక తనిఖీ బృందం ఎస్ఆర్పీ అత్యుత్ డీఆర్పీలకు, విలేజ్ సర్వే యర్లకు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉపాధి పనుల తనిఖీల నిమిత్తం ఎంపీడీవో బాలన్నదొర అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తనిఖీల సమన్వయ సమావేశంలో ఎస్ఆర్పీ అత్యుత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మండలంలో నిర్వహించిన 2,243 పనులకు సంబంధించి, రూ.11,50,69,685ల ఖర్చుపై సామాజిక తనిఖీ చేశామన్నారు. తనిఖీలను ప్రతీ ఒక్కరు పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ఏపీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టుతో తీరని నష్టం
డుంబ్రిగుడ: హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత గ్రామాలను వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం పర్యటించారు. కంకడకత్తుర్ గెడ్డపై హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే సహించేది లేదని పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ ప్రభుత్వనికి హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని కండ్రుమ్ పంచాయతీ కంకడకత్తుర్ సమీపంలో ఉన్న గ్రామస్తులతో మాట్లాడుతూ ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతం గెడ్డపై కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ఆలోచన విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని డిమాండ్ చేశారు. నవయుగ, ఆదాని కార్పొరేట్ కంపెనీలకు జిల్లాలోని 30 కేంద్రాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని జీవో నంబర్ 51 జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగానే మండలంలోని కంకడకత్తుర్ గెడ్డ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం చేపడితే కండ్రుమ్ పంచాయితీలోని ఒంబీ, దొరగుడ, సెందిరిగుడ, సర్రాయి, జోడిగుడ, జాకరవలస, కొర్రగుడ, నాగంసంపెంగిగుడ, కురిడి పంచాయితీలోని గదబగలుంగు, బల్యగు, పుట్టబంధ, నిమ్మగుడ, పెద్దచంపపుట్టు, బంధకోలని, పిత్తమరిగుడ, గోరాపుర్, ఒడిశాలోని కోరాపుట్ జిల్ల పాడువా బ్లాక్ చాటువా, తొలుడు, దొరగుడ, చాటువగేటు, కుంబిగుడ, అమ్హడ, బిల్లపుట్ట, బంక్బంజోడా గ్రామాలకు భారీగా నష్టం జరుగుతుందన్నారు. అంతేకాకుండా సుమారు 1156 కుటుంబాలు, 5 వేల మంది జనాభా, 3వేల ఎకరాల జిరాయితీ భూములతో పాటు వేల ఎకరాల్లో అటవీ భూములు, కాఫీ, బిరియాలతోటలు తదితరు మ్కొలతో పాటు వన్యప్రాణులు జలసమాధి అవుతాయన్నారు. అందువల్ల నిర్మాణ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీ శెట్టి ఆనందర్‌రావు, ఎంపీటీసీ రామరావు, సూపర్ ఎంపీటీసీలు పరశురామ్, మండల కార్యదర్శి మఠం శంకర్రావు, పోతంగి పంచాయితీ పార్టీ అధ్యక్షులు విజయదశమి, కొర్రగుడ గ్రామస్తులు తదితరలు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయె..
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఉపమాకలో గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి తిరుపతిలో మాదిరిగానే ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తిరుమల వెళ్లలేని వారు ఉపమాక వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 23న ఉదయం స్వామివారి ఉత్సవ కావిడను ఉపమాక పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ సమయంలో భక్తులు పసుపు కుంకుమలు, కొబ్బరి బొండాలు సమర్పించుకుంటారు. స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానంగా ఈ ఉత్సవ కావిడను ఊరేగిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. విష్వక్సేనులవారిని పల్లకిలో ఉంచి మత్స్యంగ్రహణం, పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది. రోజుకో వాహనంపై తీరువీధి సేవ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని రోజుకో వాహనంలో ఊరేగిస్తారు. 24వ తేదీ బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. రాత్రికి శేషతల్ప వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నిర్వహిస్తారు. 25న హంసవాహనంపై, 26న ఇత్తడి సప్పర వాహనంపై, రాత్రి పెద్దపల్లకిలో, 27న ఆంజనేయ, లక్క గరుడ వాహనాలపై, 28న సప్పర, రాజాధిరాజ వాహనాలపై తిరువీధి సేవ నిర్వహిస్తారు. 29న వసంతోత్సవం జరుగుతుంది. 30న పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవలు నిర్వహిస్తారు. అక్టోబరు 1న మృగవేట కార్యక్రమం జరుగుతుంది, సాయంత్రం గజవాహనంలో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి బంధుర సరస్సు వద్దకు తీసుకువస్తారు. ఉత్సవమూర్తులకు ధనుర్బాణాలకు పూజలు చేసిన తర్వాత గజవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. అక్టోబర్ 2న విజయదశమిని పురస్కరించుకుని ఆలయంలో నిత్యసేవాకాలం, హోమాలు నిర్వహిస్తారు. ఉదయం వినోదోత్సవం, సాయంత్రం శమీపూజ జరుగుతుంది. చివరిగా ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తులను ఉంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నాళాయిర సేవాకాలం, ద్వాదశ తిరువారాధన, నిత్యసేవాకాలం, ప్రసాద నివేదనలు మంత్రపుష్పాలు, తీర్థగోష్టి నిర్వహిస్తారు. పవళింపు సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. -
100 కేజీల గంజాయి పట్టివేత
కోటవురట్ల: మండలంలోని యండపల్లి వద్ద వంద కేజీల గంజాయి పట్టుబడింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. రెండు కార్లు, ఒక వ్యానును సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు యండపల్లిలో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేపట్టగా, రెండు కార్లలో నుంచి వ్యాన్‌లోకి గంజాయిని మారుస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అల్లూరి జిల్లాకు చెందిన ఎ1 నిందితుడు బిసోయ్ బాలరాజు, ఎ2 తారాడ లింగంనాయుడు, ఎ4 పాంగి అశోక్‌కుమార్ కలిసి గతంలో గంజాయి వ్యాపారం చేసేవారు. ఎ1పై 2018లో పెందుర్తి పోలీసు స్టేషన్లోను, ఎ2పై 2013లో త్రిటౌన్ పోలీసు స్టేషన్లోను, ఎ4పై 2018లో పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలోను గంజాయి కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎ8 నిందితుడు ఎ1, ఎ2లకు ఫోన్ చేసి గంజాయి పంపాలని కోరాడు. వారు నాలుగు మూటలుగా కట్టి రెండు కార్లలో ఎ3 నిందితుడు గొల్లోరి అనిల్‌కుమార్, ఎ5 కొర్రా శామ్యూల్‌లతో యండపల్లి వరకు పంపించి వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన ఐదుగురు నిందితులతోపాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఎ6 అజయ్, ఎ7 రాహుల్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వీరిని పట్టుకోవడంలో నక్కపల్లి సీఐ రామకృష్ణ సారధ్యంలో ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ గంగరాజు, హెచ్‌సీ చంద్రశేఖర్, పోలీసులు బి.కృష్ణ, ఆర్.వరం, హోంగార్డులు కె.మచ్చన్న, ఎల్.రమేష్, పి.సత్యనారాయణ ప్రతిభ చూపారని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రశంసించారు. -
ఇద్దరు విద్యార్థినుల దత్తత
అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు, వి.సునీత దత్తత తీసుకున్నారు. ఈ సందర్బంగా చలపతిరావు, వి.సునీత దంపతులు మాట్లాడుతూ కళాశాలకు చెందిన వనబసింగి పూజ బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతూ సికిల్‌సెల్ ఎనీమియాతో బాధపడుతుందని, కాలేజి ఫీజు కూడా చెల్లించలేని స్ధితిలో ఉందన్నారు. అదే విధంగా బికాం కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఫీజు జమచేయలేని పరిస్థితులో ఉన్న డుంబ్రిగుడ మండలం, సాగర పంచాయతీ బలియగుడ గ్రామానికి చెందిన పాంగి కవిత కూడా ఆ పరిస్థితిలో ఉంది. వారిని బంగారు కుటుంబంగా ప్రభుత్వం పీ–4 కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్నటుర్ట వారు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన రెండు కుటుంబాలను దత్తత తీసుకొని విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చిన ఇన్చార్జి ప్రిన్స్‌పాల్ దంపతులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పలువరు హర్షం వ్యక్తం చేశారు. -
పీజీఆర్ఎస్కు అర్జీల వెల్లువ
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ సమావేశం హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో గిరిజనులు అధిక సంఖ్యలో అర్జీలు అందజేశారు. ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, సబ్‌కలెక్టర్ శుభమ్నొఖ్వాల్ వాటిని స్వీకరించారు. రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయతీలోని ఉర్లాకులపాడును పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు అర్జీ అందజేశారు. మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీలోని అద్దరివలస, పుల్లంగి గ్రామాల మధ్య 800 మీటర్ల రోడ్డు నిర్మించాలని సర్పంచ్ వి.జార్జిబాబు కోరారు. రంపచోడవరం మండలం గుంజుగూడెం గ్రామంలో ఆరు కిలోమీటర్ల రోడ్డు పాడైయిందని కొత్త రోడ్డు నిర్మించాలని సర్పంచ్ అన్నిక పండమ్మ, కత్తుల లచ్చిరెడ్డి, కత్తుల మూర్తిరెడ్డిలు పీవోకు అర్జీ అందజేశారు. ఇదే మండలంలో ఇసుకపట్ల గ్రామంలో తాగునీటికి ట్యాంకు నిర్మించాలని విండెల సూర్యకుమార్, అన్నిక రామకృష్ణ, కడబాల విజయలక్ష్మి తదితరులు కోరారు. ఆదికర్మయోగి కార్యక్రమంలో వై.రామవరం మండలం సిరిమెట్ల పల్లి,వెదుర్లపల్లి గ్రామాలను భాగస్వామ్యం చేయాలని వైస్ ఎంపీపీ ముర్ల జోగిరెడ్డి, పల్లా లచ్చిరెడ్డి కోరారు. దేవీపట్నం మండలం డీఎన్ పాలెం నుంచి ములకలగూడెం గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని సర్పంచ్ మిర్తివాడ పోసిరెడ్డి అర్జీ అందజేశారు. ముసురుమిల్లి –పాముగండి, వెలగపల్లి– దొనలంక గ్రామాల మధ్యలో ఏడు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని కోసు లచ్చన్నదొర, కొండ్ల శివారెడ్డి, శ్రీనివాసులు పీవోకు అర్జీ అందజేశారు. మండలంలోని నల్గొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదని, ఆ సమస్యను పరిష్కారించాలని ఎంపీటీసీలతో కలిసి ఎంపీపీ బందం శ్రీదేవి అర్జీ అందజేశారు. ఈ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 98 అర్జీలు స్వీకరించినట్టు పీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీడీ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు. -
పంటకోత ప్రయోగాలతో అధిక దిగుబడులు
చింతపల్లి: మొక్కజొన్నలో పంటకోత ప్రయోగంతో రైతులు సాధించే దిగుబడులను అంచనా వేయవచ్చని జిల్లా సీనియర్ స్టాటస్టికల్ అధికారి ఎన్.డేవిడ్‌రాజు అన్నారు.సోమవారం చౌడుపల్లిలో రైతులు సాగుచేస్తున్న మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించి పంట కోత ప్రయోగాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు వేసుకున్న మొక్కజొన్నలో 5మీటర్లు పొడవు 5 మీటర్లు వెడల్పులో పంటను పరిశీలించగా 135 కంకులతో 26 కిలోలు దిగుబడి రాగా ఎకరాకు 4220 కిలోలు మొక్కజొన్న దిగుబడి సాధించినట్లు గుర్తించామన్నారు.ఈ పంటకోత ప్రయోగాలను మొక్కజొన్నతో పాటు వరి,చెరుకు,కందులు తదితర పంటలను కూడా ఈ పంటకోత ప్రయోగాలు చేపట్టి దిగుబ డులు అంచనా వేయడం జరుగుతుందన్నారు.ప్రతి ఏడాది ఈ పంటకోత ప్రయోగాలు చేయడం వలన రైతులు ఎంత దిగుబడి సాధిస్తున్నారన్నారు.ప్రకృతి వైపరీత్యాలు వలన ఎంత నష్టపోయారు అనే గణాంకాలను లెక్కించరడం జరుగుతుందన్నారు. పంటలు ద్వారా జరిగిన నష్టాలను లెక్కించి ప్రభుత్వానికి నివేదించడం ద్వారా రైతులకు పరిహారం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మండలాలు వారిగా గుర్తించిన ప్రాంతాలలో ఈ పంట కోత ప్రయోగా లను చేపట్టడం జరుగుతుందన్నారు. మండల వ్యవసాయ అధికారి టి.మధుసూదనరావు, ఏఎస్వో జి.రాంబాబు, ఎస్బీఐ బీమా సూపర్వైజర్ శివ, వీహెచ్ఏ శోభన్‌బాబు ,రైతు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
గోదాంలో మూలుగుతున్న 500 టన్నుల కాఫీ
చింతపల్లి: స్థానిక గిరిజన సహకార సంస్థ గోదాంలో ఐదు వందల టన్నుల కాఫీ గింజలు ఆరు నెలలుగా మూలుగుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అవి పాడైపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే జీసీసీకి భారీ ఎత్తున నష్టం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి డివిజన్ పరిధిలో గల చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల రైతుల నుంచి గత డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు చెర్రి కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేసింది. ఈ డివిజన్లో సేంద్రియేతర చెర్రి కాఫీని చింతపల్లి మండలంలో 19 వేల కిలోలు, జీకే వీధిలో 18,844 కిలోలు, కొయ్యూరులో 5,773 కిలోలను రైతుల నుంచి కొనుగోలు చేసి, వేలం ద్వారా పూర్తిగా విక్రయించింది. అదేవిధంగా ఈ మూడు మండలాల్లో సేంద్రియ కాఫీకి అధిక ధర ప్రకటించి, కొనుగోలు చేశారు. దానిలో భాగంగా చింతపల్లి మండలంలో 3,01,748 కిలోలు, జీకే వీధి మండలంలో 2,01,176 కిలోలను కొనుగోలు చేశారు. కిలోకు రూ.330 ధర చెల్లించారు. ప్రస్తుతం చింతపల్లిలో గొడౌన్లో 300 టన్నులు, జీకే వీధిలో 200 టన్నుల చెర్రీ కాఫీ గింజలు గత ఆరు నెలలుగా పడి ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.16.5 కోట్ల వరకూ ఉంటుంది. ఈ కాఫీ గింజలను వేలం పాట ద్వారా విక్రయించేందుకు వ్యాపారులను ఆహ్వానించినా ఆ ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కిలో రూ.280కి మించి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. సేంద్రియ పంటగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నా...ఇది నాన్ ఆర్గానిక్ పంటగా వ్యాపారులు అనుమానిస్తున్నారని సమాచారం. దీంతో అంత ధర పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకురావడం లేదని తెలిసింది.చింతపల్లి గోదాంలో నిల్వ ఉన్న చెర్రి కాఫీ బస్తాలు -
చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత
పాడేరు: చిత్తడి నేలలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెబ్‌ల్యాండ్స్ రూల్స్ 2017 ప్రకారం చిత్తడి నేలలను గుర్తించి, సరిహద్దులు నోటిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. రంపచోడవరం డివిజన్లో 71 వెబ్‌ల్యాండ్స్ గుర్తించినట్టు చెప్పారు. వాటిలో తాగునీరు, ఎకో కల్చర్, వ్యవసాయం, హార్టికల్చర్, ఫిషింగ్, రిక్రియేషన్, ఇరిగేషన్ ఉన్నాయో లేదో సర్వే చేసి రెండు రోజుల్లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సర్వే కోసం నియమించిన సిబ్బందికి వెబ్ల్యాండ్స్పై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో వర్చువల్ విధానంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, డీఎఫ్‌వో రవీంద్ర ధామా, జిల్లా రీసర్వే అధికారి దేవేంద్రుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్, జిల్లా హార్టికల్చర్ అధికారి బాలకర్ణ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు. 46 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా వచ్చే ఏడాది వన మహోత్సవంలో 46 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లక్ష్యం రెట్టింపు అయిందని చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో ఫారెస్ట్, విద్య, ఇంజినీరింగ్, డ్వామా , గ్రామ,వార్డు సచివాలయాల శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల డిమాండ్, అవసరం, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే మొక్కలను నివేదికలో పొందుపర్చాలన్నారు. ఐటీడీఏలు, మండలాల వారీగా మొక్కలను నాటడానికి సంబంధించిన డేటాను సిద్ధం చేయాలని ఆదేశించారు. గతంలో నాటిన మొక్కల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరిందా ? లేదా ? అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. గత ఏడాది డేటాను మేరీ లైఫ్ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి, నివేదికలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, శుభం నొక్వల్, పాడేరు డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఈవో బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష అధికారి స్వామి నాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ -
ఎకో టూరిజం ప్రాజెక్టు వద్దు
అరకులోయటౌన్: మండలంలోని మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ పంచాయతీ గ్రామ సభలో ఏకగీవ్రంగా తీర్మానించారు. సర్పంచ్ పడిబారికి జ్యోతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఫారెస్టు రేంజర్ కోటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు, పంచాయతీ పాలక వర్గ సభ్యులు, మాడగడ పంచాయతీ కేంద్రంలోని గిరిజనులతోపాటు వ్యూపాయింట్ పరిసరాల గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించగా దానిని గ్రామస్తులు వ్యతిరేకించారు. వ్యూపాయింట్‌ను యథాతధంగా కొనసాగించాలని, ఆ స్థలాన్ని జాతీయ ప్రజా ప్రయోజన స్థలంగా ప్రకటిస్తూ, స్థానికులే వ్యూపాయింట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ స్థలం అటవీ శాఖకు చెందిన రిజర్వ్ ఫారెస్ట్ స్థలమని చెప్పారు. వ్యూపాయింట్‌కు కొంత, పకనగుడ వన సంరక్షణ సమితి కొంత స్థలం కేటాయించినట్టు చెప్పారు. గిరిజనులకు అటవీ భూమిపై అవగాహన లేకపోవడంతో ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. అటవీశాఖ అధికారులకు సహకరించాలని, అటవీ శాఖ అధికారుల విధులకు భంగం కలిగించవద్దని రేంజర్ కోరారు. ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి బోగిరాజు, పీసా కమిటీ అధ్యక్షుడు మందియకేడి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
దేవీ వైభవం... భక్తుల తన్మయం
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. అమ్మవారి ప్రతిమల ప్రతిష్ట, భవానీ భక్తుల మాలధారణలు, ప్రత్యేక పూజలతో గ్రామాల్లో దసరా సందడి నెలకొంది. పలు ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలో కొలువు దీరిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అలౌకికానందంతో తన్మయత్వం పొందారు. విలీన మండలాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాడేరు: దసరా నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పాడేరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దుర్గాదేవి ఆలయం, గిరి కై లాస క్షేత్రంలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించి, దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా వందలాదిమంది భక్తులు భవానీ మాలధారణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాంలకరణ ఆకట్టుకుంది. ఆలయాల వద్ద భవానీ భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల పాటు అన్నసమారాధన నిర్వహిస్తామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఎటపాక: విలీన మండలాల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎటపాక మండలంలోని ఎటపాక, తోటపల్లి, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు తదితర గ్రామాల్లో మహిళలు, చిన్నారులు పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి తలపై పెట్టుకుని శరన్నవరాత్రి ఉత్సవ మండపాల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మలను ఓ చోట ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆట పాటలతో సందడి చేసి, పూజలు చేశారు. సోమవారం తోటపల్లి శ్రీఆదిత్య స్కూల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు దుర్గమ్మ వేషధారణలో పాల్గొనడం ఆకర్షణగా నిలిచింది. -
మూడు నెలల్లో మ్యూజియం పనులు పూర్తి
పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశంచింతపల్లి: స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. తాజంగిలో వద్ద రూ.35 కోట్లతో నిర్మిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను ఆమె సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈప్రాంతానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాతంత్య్ర సమరయోధులు మ్యూజియం పనులను పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రహారి నిర్మాణంలో సమస్యను రైతులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం రాజుబంద గ్రామంలో నిర్మించిన మల్టీపర్పస్ సామాజిక భవనాన్ని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలించి, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. లంబసింగిలో నిరుపయోగంగా ఉన్న ఐటీడీఏ అతిథి గృహాన్ని పర్యాటక సీజన్ నాటికి వినియోగంలోనికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం చింతపల్లిలో కాఫీ పల్పింగ్ యూనిట్‌ను పరిశీలించి, మాక్స్ సొసైటీ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే మాక్స్ సొసైటీ సభ్యులు, కాఫీ రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జి. డేవిడ్‌రాజు, టీసీఆర్ఎంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మందారాణి ఏఈ యాద కిషోర్, ట్రైకార్ సహాయకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్‌లో తప్పులు సరిచేసుకోండి
ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ రంపచోడవరం: ఆధార్ కార్డులో తప్పులు సరిచేసుకునేందుకు ఈ నెల 24న రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ తెలిపారు. సోమవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డులో పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు సవరించుకోవచ్చన్నారు. ఈ శిబిరం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు పనిచేస్తుందని చెప్పారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, తప్పులు సరిచేసుకోవాలని కోరారు. -
గర్భిణులు సకాలంలో వైద్యసేవలు పొందాలి
ఎమ్మెల్యే మత్స్యలింగం అరకులోయటౌన్: గర్భిణులు ఆస్పత్రిలో చేరి సకాలంలో వైద్య సేవలు పొందాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అరకులోయ ఏరియా ఆస్పత్రిలో సోమవారం స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం గర్భిణులు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మహిళలు క్యాన్సర్, రక్తహీనత తదితర సమస్యల బారిన పడకుండా ఉండాలంటే సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సీ్త్ర, శక్తివంతమైన కుటుంబం కోసం ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు. తరువాత ఆస్పత్రిలో ఎమ్మెల్యే కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు స్వాభి రామూర్తి, యువజన నాయకుడు రేగం చాణిక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్. రాము తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై కర్కశం
మహారాణిపేట/మద్దిలపాలెం(విశాఖ): వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు కదం తొక్కారు. భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సోమవారం ‘చలో కలెక్టరేట్’కార్యక్రమం చేపట్టారు. ఏయూ ప్రధాన ద్వారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన..ఘర్షణ..అరెస్టులు.. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న ఏయూ విద్యార్థులు, రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ర్యాలీకి, ధర్నాకు అనుమతులు లేవని, వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు మైక్‌ల్లో హెచ్చరించినా విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు కలిపి మొత్తం 26 మందిని అరెస్టు చేసి మహారాణిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై నేతల ఆగ్రహం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్.జె.నాయుడు మా ట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడా న్ని ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులపై భారం మోపుతోందని విమర్శించారు. ఏయూ ను గీతం ప్రైవేట్ యూనివర్సిటీకి దాసోహం చేస్తూ 46 పీజీ కోర్సులను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. ఏయూ కమిటీ కన్వీనర్ డి.వెంకటరమణ మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలను వర్సిటీలో అడుగుపెట్టనివ్వమని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కూటమి నేతలు ఏయూను తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అరెస్టులను ఖండించిన పరిరక్షణ కమిటీ విద్యార్థుల అరెస్టులను ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. అరెస్ట్‌ల సమయంలో పొన్నాడ ప్రగతి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని తీవ్రంగా గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఛాతీపై పిడిగుద్దులతో దాడి చేయడాన్ని, 26 మంది నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఖండించింది. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ ఏయూ అధ్యక్షురాలు ఎం.కుసుమాంజలి, జిల్లా నాయకులు పి.సాయి తేజ, ఎం.నరేష్ ఎం.శశికుమార్, ఆర్.నిఖిల్, పి.ప్రగతి, వినీల, మౌనిక, బి.భరత్, విద్యార్థులు తరుణ్, సునీల్, సోమేష్, సంజయ్, కౌశల్ తదితరులు పాల్గొన్నారు. 27న హైడ్రోపవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ర్యాలీ అరకులోయటౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా అరకులోయలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 27న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 51 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న ర్యాలీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలతోపాటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవీ.. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.అజయ్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.6,800 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెరిగిన మెస్ బిల్లులకు అనుగుణంగా స్కాలర్ షిప్‌ను ప్రతి విద్యార్థికి నెలకు రూ.3500కు పెంచాలని, వర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, నాన్–టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, వర్సిటీ హాస్టళ్లకు విద్యుత్ సరఫరాను కమర్షియల్ పరిధి నుంచి డొమెస్టిక్ పరిధిలోకి మార్చాలని, వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కేటాయించాలన్నారు. మేనేజ్మెంట్ కోటాను రద్దు చేసి 100 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని, బకాయిల పేరుతో సర్టిఫికెట్లు నిలిపివేయకుండా, గతంలో లాగా ‘నో డ్యూస్’విధానంలో మంజూరు చేయాలని, యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించి క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాష్ట్రవ్యాప్త కామన్ పీజీ సెట్‌ను రద్దు చేసి, వర్సిటీ పరిధిలోనే పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
సింహాచలం: సింహగిరిపై మంగళవారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం రామాయణ నవరాత్ర పారాయణం, సాయంత్రం సింహవల్లీ తాయారు, చతుర్భుజ తాయారు, సువర్ణ అమ్మవార్లకు తిరువీధి నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఆలయంలో శ్రీరామాయణ నవరాత్ర పారాయణ పఠనం, అమ్మవార్లకు తిరువీధి ఉంటుందని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. ఈ నెల 27న సింహవల్లీ తాయారు సన్నిధిలో వీరలక్ష్మీ ఆరాధనం, 29న మూలానక్షత్రం పురస్కరించుకుని ఆయుధపూజ(మూల పూజలు) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2న కొండదిగువ పూలతోటలో సాయంత్రం జమ్మివేట ఉత్సవం జరుగుతుందన్నారు. భక్తులంతా ఈ పూజల్లో పాల్గొని, తరించాల్సిందిగా కోరారు. 27న వీరలక్ష్మీ ఆరాధనం, 29న ఆయుధపూజ -
జలనిధికి కష్టకాలం
పాడైన రిటైనింగ్ వాల్ ముంచంగిపుట్టు: జిల్లాలోని మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించడంలో జోలాపుట్టు జలాశయం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి నీరు రెగ్యులర్‌గా డుడుమ జలాశయం ద్వారా మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి సరఫరా అవుతోంది. ఇదికాకుండా దిగువనున్న జలవిద్యుత్ కేంద్రాలకు అవసరమైనప్పుడల్లా నేరుగా బలిమెల జలాశయానికి పంపిస్తుంటారు. మాచ్‌ఖండ్ విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదల అయ్యే నీరు కూడా బలిమెలకు వెళ్తుంది. ఇక్కడి నుంచి గుంటవాడ జలాశయం ద్వారా అప్పర్ సీలేరు వద్ద 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ నుంచి ఆంధ్రా భాగస్వామ్యం మొదలై డొంకరాయి వద్ద 25 మెగావాట్లు, లోయర్ సీలేరు వద్ద 460 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం విడుదల అయిన నీరు గోదావరిలో కలుస్తుంది. దీనిని రబీలో డెల్టా సాగుకు వినియోగిస్తుంటారు. ఇలా కీలకమైన ప్రాజెక్ట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. 1955లో జోలాపుట్టు ప్రాజెక్ట్ నిర్మించి నేటికి 70 ఏళ్లు అవుతోంది. నిర్వహణలోపం వల్ల డ్యామ్‌పై యంత్రాలు తుప్పుపట్టాయి. నీటిని విడుదల చేసే మార్గంలో షాంప్ వాల్‌కు సంబంధించిన ఐరెన్ , నీటి విడుదల చేసే నాలుగు గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. అత్యవసర పరిస్థితిలో జలాశయ గేట్లు ఎత్తేటప్పుడు అధికారులకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. షాంప్ వాల్ మార్గంలో ఐరెన్ స్తంభాలు తుప్పు పట్టాయి. సిమెంటు దిమ్మల్లో కొన్ని పాడయ్యాయి. నీటిమట్టాన్ని కొలిచేందుకు వెళ్తున్న జలాశయ సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉంది. డ్యామ్ దిగువ భాగంలో పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటుచేసిన సెక్యూరిటీ హౌస్ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. చుట్టూ తుప్పులు అలుముకోవడంతో మూసుకుపోయింది. ప్రాజెక్ట్ డ్యామ్ నాచుపట్టి ఉంది. చాలా సంవత్సరాల క్రితం రంగులు వేశారు. అప్పటినుంచి పట్టించుకోలేదు. డ్యామ్‌పై విద్యుత్ స్తంభాలపై లైట్లు పగిలిపోయాయి. వీటిని కూడా ప్రాజెక్ట్ అధికారులు పునరుద్ధరించలేదు. రాత్రి వేళల్లో అరకొరగా కొన్ని మాత్రమే వెలుగుతున్నాయి. మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు చెందిన కాలువకు సుమారు 70ఏళ్లగా మరమ్మతులు చేయకపోవడం ఈ పరిస్థితి నెలకొంది. పవర్ గేట్లు పని చేయకపోతే వేసవి కాలంలో తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఏటా ప్రాజెక్ట్ నిర్వహణకు విడుదలయ్యే రూ.5 లక్షల నుంచి 10 లక్షల నిధులను నిర్వహణకు వినియోగిస్తే ప్రాజెక్ట్‌కు ముప్పు ప్రమాదం తప్పుతుందని పలువురు సూచిస్తున్నారు. జిల్లాలోని నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకు ఏడాది పొడవునా నీరు అందించడంలో కీలకమైన జోలాపుట్టు జలాశయ నిర్వహణపై ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దులో సుమారు 242 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ అతిపెద్దదిగా గుర్తింపు ఉంది. అయినప్పటికీ ప్రాజెక్ట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే మార్గంలో రిటైనింగ్ వాల్ ఇటీవల వరద నీటి ఉధృతికి కోతకు గురైంది. డుడుమ జలాశయం పవర్ గేట్లు సక్రమంగా పనిచేయడం లేదు. గత ఆగస్టు రెండో తేదీన ప్రాజెక్టు ఉన్నతాధికారులు పరిశీలనలో భాగంగా రెండు గేట్లను ఎత్తారు. ఆ తరువాత అవి మూసుకోలేదు. దీంతో నీటి ఉధృతికి పవర్‌కెనాల్‌కు చెందిన రిటైనింగ్ వాల్ సుమారు 15 అడుగుల మేర కోతకు గురైంది. దీంతో డుడుమ ప్రాజెక్ట్ మార్గం ద్వారా ప్రాజెక్ట్‌కు నీరు సరఫఱాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు చోట్ల కెనాల్ గోడలకు రంధ్రాలు ఏర్పడి, నీరు వృథాగా పోతోంది. -
మారుతుందా?
విశాఖ స్వరూపం మహారాణిపేట: జిల్లా సరిహద్దుల మార్పుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా, ఎస్.కోట అసెంబ్లీని పాక్షికంగా విశాఖ జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో జీవీఎంసీ పరిధి 89శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతం కేవలం 11 శాతం మాత్రమే ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాన్ని పెంచడం, అలాగే అవకాశం ఉన్న ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేయడం వంటి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పునర్విభజన అంశాలను తీసుకువచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలం ఇప్ప టికే విశాఖ జిల్లాలో ఉండగా, అదే నియోజకవర్గంలోని సబ్బవరం, పరవా డ మండలాలను కూడా విశాఖ జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై పరిశీలన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎస్.కోట విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో ఉన్నాయి. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, భీమిలి, గాజువాక. అయితే ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం విజయనగరం జిల్లాలో ఉంది. ఈ పరిస్థితి వల్ల ప్రజల పరామర్శలు, పర్యటనలు, ఇతర కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్లమెంట్ సభ్యులు భావిస్తున్నారు. అందుకే ఎస్.కోటను విశాఖ జిల్లాలో విలీనం చేయడంపై అధ్యయనం జరుగుతోంది. ఒకే ఎంపీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందనే దానిపై వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. జిల్లా భౌగోళిక స్వరూపంలో మార్పులు ఒకప్పుడు పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్నగా మారింది. గతంలో మైదాన, గిరిజన, పట్టణ ప్రాంతాలు విశాఖ జిల్లాలో భాగంగా ఉండేవి. జిల్లాల విభజన తర్వాత గ్రామీణ ప్రాంతం తగ్గి, గిరిజన ప్రాంతం పూర్తిగా లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలు తక్కువగా ఉన్న విశాఖ జిల్లాలో అదనపు ప్రాంతాలను కలిపితే ఎలా ఉంటుందనే దానిపై అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. ఈ చర్చలు విశాఖ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, కొన్ని ప్రాంతాలను ఆయా జిల్లాల్లో కలపడానికి కసరత్తు జరుగుతోంది. యాసిడ్ లారీని ఢీకొట్టిన బస్సు నక్కపల్లి: జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి తుని వైపు సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో వెళ్తున్న లారీ రిపేరు రావడంతో డ్రైవరు టోల్గేట్ సమీపంలో రోడ్డు మధ్యలో నిలిపివేశాడు. లారీలో యాసిడ్ ఉన్న విషయం తెలిసినప్పటికీ డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. లారీ పక్కన నిలబడి హెచ్చరించడం, అడ్డంగా ఏదైనా వస్తువులు సైతం పెట్టలేదు. లారీని పక్కన ఆపేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదే సమయంలో విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆగి ఉన్న యాసిడ్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదేవిధంగా యాసిడ్ లారీ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై ంది. దీంతో రహదారిపై రాకపోకలు సాగించేవారు చాలా భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వెళ్లి గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.జిల్లా పునర్విభజన కమిటీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. వాటిలో కొన్నింటిని సవరించడానికి కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. జిల్లాల సంఖ్యను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా ఈ ఉప సంఘం పరిశీలిస్తోంది. జిల్లాల విలీనం, తొలగింపు వంటి అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి బస్సు యాత్ర
అల్లిపురం (విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 14 నుంచి నవంబర్ 14 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నెల రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు తెలిపారు. ఆదివారం అల్లిపురం సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న రూ. 6400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3400కు పైగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శేఖర్, కోశాధికారి భవాని, సహాయ కార్యదర్శిలు కె.మౌనిక, హేమానందం, ఉపాధ్యక్షుడు కిరణ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అమ్మా నీవే శరణంటూ..
నేటి నుంచి శరన్నవరాత్రులు ● ఊరూరా విస్తృత ఏర్పాట్లుఅనకాపల్లి/మాడుగుల: దేవీ నవరాత్రుల సందడి మొదలవుతోంది. సోమవారం నుంచి అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులను అనుగ్రహించనున్నారు. ఆశ్వయుజ మాసం ప్రారంభం నాటి నుంచి విజయదశమి వరకు జరిగే ఈ వేడుకల కోసం జిల్లా అంతటా ఊరూరా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లిలోని గవరపాలెం నూకాంబిక అమ్మవారు, సత్యనారాయణపురం కొండపైన వెలసిన కనకదుర్గమ్మ, గవరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రానుండడంతో అధికారులు, ఆలయ వర్గాలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. నూకాంబిక అమ్మవారి బాలాలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలను దేవదాయ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి పర్యవేక్షించనున్నారు. అలనాటి మహారాజులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే నవరాత్రుల కోసం మాడుగుల ముస్తాబైంది. ఇక్కడి సివిల్ ఆర్టీసీ ఆటో మోటారు ఓనర్స్, వర్కర్స్ యూనియన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించడానికి నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది. -
భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
ముంచంగిపుట్టు : మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, గెడ్డలు పొండగంతో మారుమూల గ్రామాల గిరిజనులు రాకపోకలు స్తంభించాయి. లక్ష్మీపురం పంచాయితీ ఉబ్బెంగుల వాగు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల గిరిజనులు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల్లో పలు గ్రామాల్లో పంటపొలాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో నీట మునిగాయి. రాంపుట్టు గ్రామంలో కె.మంగరాజు, కె.భగవాన్, కె.బీష్నాధ్లకు చెందిన పంట పొలాల్లోకి వరద నీటితో మట్టి దిబ్బలు కొట్టుకు వచ్చి పంట పాడైంది. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో వరదనీరు వచ్చి చేరడంతో మత్స్యగెడ్డ పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతుంది. పొంగిపొర్లిన డ్రైనేజీలు డుంబ్రిగుడ : భారీ వర్షంతో ఆదివారం మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఇబ్బందులు తప్పడం లేదు. డ్రైనేజీలు పొంగి వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. అరకు, కించుమండ, గుంటసీమ, సొవ్వ తదితర పంచాయితీలలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. రాజవొమ్మంగిలో రెండో రోజు భారీ వర్షం రాజవొమ్మంగి : రాజవొమ్మంగిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 16.2 మి.మీ వర్షం కురిసినట్టు జిల్లా గణాంకాధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అప్పలరాజుపేటలో వట్టి గెడ్డ రిజర్వాయర్ భారీ వర్షం కారణంగా మరోసారి పొంగి ప్రవహిస్తోంది. ఈ కారణంగా పొలాలకు వెళ్లిన వారు పొర్లు మదుము దాటేందుకు గంటల తరబడి ఒడ్డునే వేచి ఉండాల్సివచ్చింది. పొంగుతున్న వాగులు, గెడ్డలు -
నేటి నుంచి దేవీపురంలో దసరా బ్రహ్మోత్సవాలు
సబ్బవరం (అనకాపల్లి): ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దేవీపురంలోని శ్రీసహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి ఆరాధన పీఠంలో దసరా బ్రహ్మోత్సవాలను ఈ నెల 22 నుండి వచ్చే నెల 7వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు గురుమాత అన్నపూర్ణమ్మ తెలిపారు. ప్రతిరోజు క్షీరాభిషేకం, కుంకుమార్చన, హోమం, మంత్ర జపం, పారాయణ, కళావాహన పూజలతో పాటు అలంకార సేవ, అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు దుర్గా సప్తశతి, లలితా సహస్ర నామావళి, ఖడ్గాది పంచదశ మాల–తిథి వారీగా స్తోత్ర పారాయణలు జరుగుతాయన్నారు. వచ్చే నెల 7న పౌర్ణమిని పురస్కరించుకుని సహస్రాక్షి దేవి అభిషేకం, దేవీ కల్యాణోత్సవం, ప్రతి రోజు ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. -
పత్రాలు సమర్పించకుంటే పశువులను గోశాలకు తరలిస్తాం
● తహసీల్దార్ త్రివేణి డుంబ్రిగుడ: మండలంలోని కొర్రాయి గ్రామ సమీపంలో శనివారం రాత్రి తరలిస్తుండగా పట్టుబడిన పశువులకు సంబంధించి పత్రాలు సమర్పించకుంటే సింహాచలంలోని గోశాలకు తరలిస్తామని తహసీల్దార్ త్రివేణి తెలిపారు. నాలుగు లారీల్లో 104 పశువులను తరలిస్తుండగా పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ శనివారం రాత్రి అడ్డుకోవడం తెలిసిందే. పశువులను, లారీలను తహసీల్దార్‌కు అప్పగించి, తదుపరి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్ స్వాధీనం చేసుకున్న పశువులను పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదివారం అప్పగించారు. పోలీసుల సహకారంతో విచారణ నిర్వహించారు. నివేదికను పీవో తిరుమణి శ్రీపూజకు సమర్పించినట్టు ఆమె తెలిపారు. పశువులకు దాణా అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఈ సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. వీఆర్వో సత్యనారాయణ, వీఏవో బాలకృష్ణ పాల్గొన్నారు. -
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
● మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తం ● నిలిచిపోయిన అంతర్రాష్ట్ర రాత్రిపూట బస్సు సర్వీసులు ముంచంగిపుట్టు: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మారుమూల లక్ష్మీపురం, కుమడ, భూసిపుట్టు, రంగబయలు పంచాయితీల నుంచి వచ్చే వాహనదారులను ప్రశ్నించారు. వారి లగేజి, బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.అనుమానితుల వివరాలు సేకరించి విడిచిపెట్టారు. జోలాపుట్ట, దోడిపుట్టు నైట్‌హాల్ట్ బస్సులను మండల కేంద్రానికి పరిమితం చేశారు. ప్రభుత్వ కార్యలయాల వద్ద పోలీసులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. సీలేరు: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా వలస సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా ఆదివారం సీలేరు, ధారకొండ వారపు సంతల్లో సీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీలేరు మెయిన్ బజార్లో ఎస్ఐ రవీంద్ర అనుమానిత వ్యక్తులను విచారించారు. వారి సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచిపెట్టారు. విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లే రాత్రిపూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. సాయంత్రం ఆరు గంటల తరువాత మారుమూల అటవీ ప్రాంతాల్లో బస్సులు తిరగకుండా ఇప్పటికే ఆదేశాలు అందాయి. దీంతో పాడేరు–సీలేరు, రాజమహేంద్రవరం– సీలేరు బస్సులు గడువుకు ముందే వచ్చాయి. -
ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
● నేడు అరకువ్యాలీ, రేపు చింతపల్లిలో నిర్వహణ ● డీసీహెచ్ఎస్ డాక్టర్ నీలవేణి చింతపల్లి: జిల్లాలోని ఏరియా ఆస్పత్రుతలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం. నీలవేణి తెలిపారు. ఆదివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. వచ్చేనెల రెండో తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో వైద్య శిబిరాలు జరుగుతాయన్నారు. ఈ నెల 22న అరకులోయ, 23న చింతపల్లి, 25న రంపచోడవరం ఏరియా ఆస్పత్రులు, 27న కూనవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటిలో ప్రత్యేక వైద్యనిపుణులు మహిళలకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు, క్షయ తదితర వాటికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పోషణ అభియాన్ సమతుల్య ఆహారం, తల్లీబిడ్డల సేవలు, వయోవృద్ధులు, ఆయుష్ సేవలతో పాటు కిషోర బాలికలకు అందించే ఆరోగ్య సేవలపై అవగాహన కల్పిస్తారని ఆమె పేర్కొన్నారు. . -
ఎకో టూరిజం ప్రాజెక్ట్ వద్దేవద్దు
● మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద గిరిజనుల నిరసన ● ఏకపక్షంగా ఎలా ఏర్పాటుచేస్తారనిఅటవీశాఖ తీరుపై ధ్వజం అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయనున్న ఎకో టూరిజం ప్రాజెక్టు వద్దంటూ మాడగడ గిరిజనులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక గిరిజనులతో కలిసి వ్యూపాయింట్ వద్ద మాట్లాడారు. పంచాయతీలో పీసా కమిటీ గ్రామ సభలు నిర్వహించకుండా అటవీశాఖ అధికారులు ఏకపక్షంగా ఎకో టూరిజం ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మాడగడ వ్యూ పాయింట్లో మాడగడ గ్రామ గిరిజనులతోపాటు పంచాయతీ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ జాతీయ సంపదగా గుర్తించి స్థానిక గిరిజనులు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు స్వామి, బి. లక్ష్మణ్, వాసు దేవరావు, మాజీ సర్పంచ్ పి. అర్జున్, పీసా కమిటీ కార్యదర్శి బి. సుమన్ పాల్గొన్నారు. -
600 మందికి వైద్యసేవలు
వంద కిలోల గంజాయి స్వాధీనం ● ఐదుగురి అరెస్టు హుకుంపేట: వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ సన్యాసినాయుడు తెలిపారు. మండలంలో కొంతిలి వైపు నుంచి వస్తున్న కారును ఆదివారం తనిఖీ చేయగా వంద కిలోల గంజాయి బయటపడిందన్నారు. ఒడిశా నుంచి హుకుంపేట మీదుగా బెంగళూరు తరలించే క్రమంలో పట్టుబడిందని ఆయన పేర్కొన్నారు. గంజాయితో పాటు కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశాకు చెందిన ఒకరు, అల్లూరి జిల్లాకు చెందిన ముగ్గురు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. రంపచోడవరం: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో సిరిగిందలపాడులో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ , క్యాంప్ ఇన్చార్జి స్వామి లోకమయనంద మహరాజ్‌లు రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. కార్పొరేట్ వైద్యులు కస్తూరి సుబ్రమణ్యం, శ్రీకృష్ణ పాతూరి, టీవీ సుబ్బారావు, పోతుల రామారావు, మణికంఠ, శ్రుతి తదితరులు, జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రి వైద్యులు 600 మందికి వైద్య సేవలు అందించారు. యోగానంద కంటి వైద్యశాల ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు భోజన సదుపాయం కల్పించారు. -
‘మధురవాడ’ బస్సు మొరాయింపు
● తరచూ ప్రయాణికుల ఇబ్బందులు ● పట్టించుకోని ఆర్టీసీ ఉన్నతాధికారులు ముంచంగిపుట్టు: విశాఖపట్నం మధురవాడ డిపోకు చెందిన జోలాపుట్టు నైట్ హాల్ట్ సర్వీసు తరచూ మొరాయిస్తోంది. ఆదివారం ఉదయం జోలాపుట్టు నుంచి మధురవాడ (విశాఖపట్నం) బయలుదేరిన ఈ సర్వీసు మార్గం మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరొక బస్సు కోసం గంటల తరబడి నిరీక్షించారు. కొంత మంది ప్రయాణికులు అత్యవసర పనులు ఉన్నందున ప్రైవేట్ వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకున్నారు. గత వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు బస్సు మొరాయించింది. ● గత సోమవారం మధురవాడ నుంచి జోలాపుట్టు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మ ధ్యాహ్నం 3 గంటలకు విశాఖ కాంప్లెక్స్ వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొరాయించడంతో మరొక బస్సును సాయంత్రం 6గంటలకు అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి బయలుదేరిన అదే సర్వీసు చోడవరం వచ్చేసరికి బస్సు హెడ్ లైట్లు పాడైపోయాయి. మరమ్మతులు తరువాత బయలు దేరిన బస్సు తెల్లవారు జామున 3గంటలకు జోలాపుట్టు వచ్చింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తిండి లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇలా తరచూ ఇబ్బందులు పడుతున్నా కండీషన్లో ఉన్న బస్సులను నడిపేలా డిపో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఈ ప్రాంత ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.