
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో వై.రామవరం శివారులో లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధానరహదారిలో సీఐ బి.నరసింహా మూర్తి ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవ రంలో జరిగిన సంతకు వచ్చివెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న అపరిచితులు, అనుమానితులపై నిఘా పెట్టారు. రికార్డులు, డ్రైవింగు లైసెన్సులు సక్రమంగా లేని వాహనాలపై యజమానులపై కేసులు నమోదు చేశారు.