
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
అరకులోయ టౌన్: అరకులోయ డిగ్రీ కళాశాలలో కోటి రూపాయలతో నిర్మించిన నూతన అదనపు భవనాన్ని సోమవారం గిరిజన సంక్షేమశాఖ,శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. మొదటగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.డిగ్రీ కళాశాల సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ప్రిన్సిపాల్ భరత్‌కుమార్ నాయక్ మంత్రిను కోరారు. దీనికి స్పందించిన మంత్రి పాత భవనాలకు మరమ్మతు చేస్తామని, లేనిపక్షంలో నూతన భవనా న్ని నిర్మిస్తామన్నారు. ఇంజనీరింగ్ అధికారులు పాత భవనాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో టీచర్ల కొరత ఉంటే ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు.పార్టీల అతీతంగా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కలెక్టర్ దినేష్‌కుమార్, జెసి, పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జ పివో అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఇంజనీరింగ్ ఇన్ చీప్ శ్రీనివాస,ఈఈ వేణుగోపాల్,ఏఈఈ అభిషేక్,జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్,విజయనగరం రీజన్ ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర తదితరులు పాల్గోన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని కించుమండ సంపంగి గెడ్డ వద్ద నిర్మించిన వంతెనను గిరిజన సంక్షేమశాఖ,శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి బుధవారం ప్రారంభించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఈ వంతెనుకు నిధులు మంజూరయ్యాయి.

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు