
అంబరాన్నంటిన సంబరాలు
● చింతపల్లిలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు
● ప్రత్యేక ఆకర్షణగా సాంస్క ృతిక
కార్యక్రమాలు
సీలేరు: నిన్నే నమ్ముకుని కొలిచాం... చల్లగా చూడమ్మా మారెమ్మ తల్లీ అంటూ అమ్మవారిని భక్తులు శరణు కోరారు. వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సీలేరులో మారెమ్మ తల్లి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ప్రధాన పండగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలలతో పాటు సమీప ఒడిశా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మండుటెండలో సైతం క్యూలో గంటల తరబడి వేచి ఉన్నారు. పసుపు,కుంకుమలు సమర్పించి, పూజలు నిర్వహించారు. మాలలు ధరించిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శక్తి వేషాలు, థింసా నృత్యాలు పండగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
● సీలేరు గ్రామ నివాసి అయిన కోటేశ్వరమ్మ కుమారుడు జి.వి.వి. సత్యనారాయణ దంపతులు 2,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీరం గోవిందు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఖమ్మంకు చెందిన నాగరాజు దేవర అనే భక్తుడు అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.
● మారెమ్మ తల్లి పండగకు వచ్చే భక్తులకు ముస్లింలు మజ్జిగ పంపిణీ చేశారు.ఆలయానికి వెళ్లే దారిలో రెగ్యులేటర్ డ్యాం వద్ద ఐదు డ్రమ్ముల మజ్జిగను పంపిణీ చేశారు. మైలపల్లి సత్తిబాబు ఆటో డ్రైవర్ మజ్జిగ పంపిణీ చేశారు.
● జెన్‌కో చీఫ్ ఇంజినీరు వాసుదేవరావు, సూపరింటెండింగ్‌ఽ ఇంజినీరు చంద్రశేఖర్ రెడ్డితో పాటు డొంకరాయి, మోతుగూడెంలకు చెందిన ఈఈ, ఏడీఈ,ఏఈలతో పాటు పూర్వ జెన్‌కో ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు.
● ఆర్టీసీ అధికారులు విజయనగరం, విశాఖపట్నం,శ్రీకాకుళం, నర్సీపట్నం నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపారు.
● మంగళవారం అమ్మవారికి చల్లనీటి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి పసుపు నీటితో గ్రామాన్ని శుద్ధి చేసి గరగను గంగలో నిమఽజ్జనం చేసి, ఉత్సవాలు ముగిస్తారు.
● బుధవారం మరుపూజ చేసి యథావిధిగా మళ్లీ పూజలను ప్రారంభిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ప్రధాన పండగ రోజు ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ రవీంద్రనాఽథ్ బందోబస్తు నిర్వహించారు.
ఘనంగా మారెమ్మ ప్రధాన పండగ
భారీగా తరలివచ్చిన భక్తులు

అంబరాన్నంటిన సంబరాలు

అంబరాన్నంటిన సంబరాలు

అంబరాన్నంటిన సంబరాలు