
గరిష్ట స్థాయికి చేరుకుంటున్న డిమాండ్
ఉమ్మడి విశాఖ సర్కిల్(అనకాపల్లి, అల్లూరి జిల్లాలు)లో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈపీడీసీఎల్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ సర్కిల్ పరిధిలో సగటు వినియోగం 24 నుంచి 25 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం 26 నుంచి 27 మిలియన్ యూనిట్లకు పైగా కరెంట్ ఖర్చవుతోంది. సరఫరాకు మించి వినియోగం ఉండటంతో అధికారులు లోటు భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లాల్లో లలితా త్రిపురసుందరీ ఫెర్రో అల్లాయిస్, అభిజిత్ ఫెర్రో అల్లాయిస్ వంటి భారీ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడంతో మూతపడ్డాయి. ఈ కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గింది లేదంటే.. 28 నుంచి 30 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.