
న్యూరోసర్జరీ విభాగానికి వైద్య పరికరాల అందజేత
డాబాగార్డెన్స్: కేజీహెచ్‌లోని న్యూరో సర్జరీ విభాగానికి రూ.8 లక్షల విలువ గల వైద్య పరికరాలను డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులు సుంకర ఆదిలక్ష్మి, సుబ్బలక్ష్మి, డాక్టర్ ఎస్‌జే బాలపరమేశ్వరరావు(న్యూరో సర్జన్), సుంకర రాజగోపాల్ సోమవారం విరాళంగా అందజేశారు. ఈ మేరకు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌జిత్‌రే, ఇతర న్యూరో సర్జరీ వైద్యులు పాల్గొన్నారు. ఈ వార్డుకు గత నెల 17వ తేదీన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు న్యూరోసర్జరీ వార్డుగా నామకరణం చేసిన విషయం విదితమే.