
పీజీఆర్‌ఎస్‌కు 65 అర్జీలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీలు 65 అర్జీలను స్వీకరించారు. రాజవొమ్మంగి మండలం ఉర్లలాకులపాడు గ్రామంలోని బండకొండ రిజర్వాయర్ ద్వారా 600 ఎకరాలకు సాగునీరందించే చెరువుకు మరమ్మతులు చేయించాలని పలువురు కోరారు. వై.రామవరం అప్పర్ పార్ట్‌లోని మంగంపాడులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆ గ్రామ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. మంగంపాడులో 64 మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయా లని సరంకోట అబ్బాయిరెడ్డి అర్జీ అందజేశారు. పెద్దూరు గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని, గ్రామంలో పాడైయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు అర్జీలు అందజేశారు. సమావేశంలో ఎస్‌డీసీ అంబేడ్కర్, డీడీ రుక్మాండ య్య, ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.