
బండరాళ్ల లారీలో మంటలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వెంకటాపురం నుంచి యలమంచిలి వెళ్లే మార్గంలో బండరాళ్లతో వెళుతున్న లారీ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. బుధవారం మధ్యాహ్నం ఈ మార్గంలో వెళుతున్న లారీ క్యాబిన్‌లో ముందు పొగలు వ్యాపించి, తర్వాత మంటలు రావడంతో డ్రైవర్, క్లీనర్లు దూకేశారు. దీంతో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ఈ వాహనంలో మంటలను చూసి ఆ సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వాహన సామర్థ్యానికి మించి భారీ లోడ్‌తో బండరాళ్లతో వెళ్లడం, వేడిని నియంత్రించాల్సిన యంత్రాలు వడగాడ్పులకు మంటల వ్యాప్తికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.