పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Published Tue, Apr 29 2025 7:01 AM | Last Updated on Tue, Apr 29 2025 7:01 AM

పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

చిరుధాన్యాలతో రవివర్మకు కళాంజలి

ఏయూక్యాంపస్‌: నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మెకా విజయ్‌కుమార్‌ భారతీయ చిత్రకళా దిగ్గజం రాజా రవివర్మ జయంతిని పురస్కరించుకుని అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. విజయ్‌కుమార్‌ చిరుధాన్యాలను ఉపయోగించి ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. ఇందుకోసం దాదాపు వారం రోజుల పాటు శ్రమించారు. సహజత్వం ఉట్టిపడేలా చిరుధాన్యాలతో చిత్రపటం రూపొందించిన.. రాజా రవివర్మకు ఘనమైన నివాళి అర్పించారు.

తాటిచెట్లపాలెం: సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధి మహబూబాబాద్‌ స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న 3వ లైన్‌ నిర్మాణం, పలు ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్ని రీ షెడ్యూల్‌ చేసినట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం సందీప్‌ తెలిపారు.

రద్దయిన రైళ్లు

● విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం(20805/06) ఏపీ ఎక్స్‌ప్రెస్‌ మే 27, 28, జూన్‌ 18, 19వ తేదీల్లోను, విశాఖపట్నం–హజరత్‌ నిజాముద్దీన్‌(12803) స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ మే 23, 26, జూన్‌ 16వ తేదీల్లోను, హజరత్‌ నిజాముద్దీన్‌–విశాఖపట్నం(12804) స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ మే 25, 28, జూన్‌ 18వ తేదీల్లో రద్దు చేశారు.

దారి మళ్లించిన రైళ్లు

● మే 22 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–లోకమాన్యతిలక్‌ టెర్మినస్‌–విశాఖపట్నం (18519/20) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లు, మే 27, 28వ తేదీల్లో షాలిమర్‌–హైదరాబాద్‌(18045)ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, మే 28, 29వ తేదీల్లో హైదరాబాద్‌–షాలిమర్‌(18046)ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, మే 27, 28వ తేదీల్లో చత్రపతి శివాజి టెర్మినస్‌ ముంబయి–భువనేశ్వర్‌–చత్రపతి శివాజి టెర్మినస్‌ ముంబయి (11019/20) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లు, మే 28న షాలిమర్‌–సికింద్రాబాద్‌(22849) ఎక్స్‌ప్రెస్‌లు వయా విజయవాడ–గుంటూరు–నల్గొండ–పగిడిపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

● మే 22, జూన్‌ 19వ తేదీల్లో విశాఖపట్నం–గాంధీదాం(20803) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, మే 25, జూన్‌ 22వ తేదీల్లో గాంధీదాం–విశాఖపట్నం(20804) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, మే 25, జూన్‌ 15వ తేదీల్లో పూరీ–ఓఖా(20819) ఎక్స్‌ప్రెస్‌, మే 28, జూన్‌ 18వ తేదీల్లో ఓఖా–పూరీ(20820) ఎక్స్‌ప్రెస్‌లు వయా లఖోలి–రాయ్‌పూర్‌–నాగ్‌పూర్‌–బద్నెరా మీదుగా రాకపోకలు సాగిస్తాయి

మహబూబాబాద్‌లో తాత్కాలికంగా

హాల్ట్‌ తొలగింపు : ఆధునీకీకరణ పనుల నిమిత్తం మహబూబాబాద్‌ స్టేషన్‌లో కింది రైళ్లకు ఆయా తేదీల్లో తాత్కాలికంగా హాల్ట్‌ను రద్దు చేశారు.

● మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–హైదరాబాద్‌ (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌, మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌(12861) ఎక్స్‌ప్రెస్‌, మే 24, 25, 26వ తేదీల్లో భువనేశ్వర్‌–చత్రపతి శివాజి టెర్మినస్‌ ముంబయి (11020) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, మే 24, 25, 26వ తేదీల్లో షాలిమర్‌–హైదరాబాద్‌(18045) ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఆయా తేదీల్లో మహబూబాబాద్‌లో ఆగవు.

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు

కంచరపాలెం : జిల్లాలోని వివిధ ప్రభుత్వ/ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో(ఐటీఐ) ప్రవేశాలకు మే 24లోగా iti.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలకు ఒక దరఖాస్తు సరిపోతుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఆర్‌ కార్డుకు సంబంధించిన అభ్యర్థులు ప్రత్యేక కేటగిరిలో దరఖాస్తు చేసుకుని వెరిఫికేషన్‌ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ(ఓల్డ్‌) కంచరపాలెం, ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌, ప్రభుత్వ ఐటీఐ(కొత్తది) గాజువాక, ప్రభుత్వ ఐటీఐ నరవలో వెరిఫికేషన్‌ చేయించుకోవాలని తెలిపారు.

37.5 కిలోల గంజాయి స్వాధీనం

తాటిచెట్లపాలెం: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 37.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి.. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్‌ ధనుంజయనాయుడు, దినేష్‌కుమార్‌ దాస్‌ తమ సిబ్బందితో కలిసి సోమవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందిన పి.బాబు, స్నేగా హేచ్‌ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వారు విశాఖపట్నం మీదుగా తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,87,500 విలువ గల 37.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.

పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

తాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌక ర్యార్థం పలు రైళ్లకు అదనంగా జనరల్‌, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లను తాత్కాలికంగా జతచేస్తున్నారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్‌–విశాఖపట్నం (18526/18525) ఎక్స్‌ప్రెస్‌కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్‌ సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌లను, విశాఖపట్నం–రాయ్‌పూర్‌–విశాఖపట్నం (58528/ 58527) పాసింజర్‌కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్‌ సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌ను జతచేస్తున్నారు. అలాగే విశాఖపట్నం–కోరాపుట్‌–విశాఖపట్నం (58538/58537)పాసింజర్‌కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్‌ సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌ను, విశాఖపట్నం–బ్రహ్మపూర్‌–విశాఖపట్నం (58532/58531)పాసింజర్‌కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్‌ సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌ను జతచేస్తున్నారు. విశాఖపట్నం–భువనేశ్వర్‌–విశాఖపట్నం (22820/ 22819) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్‌ సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌లను, విశాఖపట్నం–కోరాపుట్‌–విశాఖపట్నం(18512/18511) ఎక్స్‌ప్రెస్‌కు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లను జతచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement