
ఘాట్‌రోడ్డులో వ్యాన్ బోల్తా
ముంచంగిపుట్టు: మండలంలోని దొడిపుట్టు పంచాయతీ రాంపుట్టు గ్రామ సమీపంలో సోమవారం పనసకాయల లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.ఒడిశా రాష్ట్రం నందపూరు ప్రాంతానికి చెందిన పనసకాయల కొనుగోలుదారులు ఆంఽధ్రాలోని రాంపుట్టు వచ్చి పనసకాయలు కొనుగోలు చేసి ఒడిశాకు వెళ్తుండగా రాంపుట్టు సమీపంలో ఘాట్‌రోడ్డులో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనంలో ఏడుగురు కూలీలు ఉన్న ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.