
బీఎస్‌ఎన్‌ఎల్‌పై ఫిర్యాదు
కొయ్యూరు: బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు నాసిరకంగా ఉన్నాయని, వినియోగదారుల నుంచి ఆ సంస్థ ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ మంప మాజీ ఎంపీటీసీ సభ్యులు బి.శివరామరాజు, ఎస్.భాను, బి.బాబురావు, సత్య తదితరులు సోమవారం మంప ఎస్‌ఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు. సంస్థ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తామని తెలిపారు. మంపలో పది సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ సరిగా పనిచేయడం లేదని, దీంతో వినియోగదారులు నష్టపోతున్నారని తెలిపా రు. దీనిపై స్పందించిన ఎస్‌ఐ మాట్లాడుతూ సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి వినియోగదారుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతామన్నారు.