
గల్లంతైన యువకులు మృతి
సాక్షి,పాడేరు: అనంతగిరి మండలం మారుమూల జీనబాడు పంచాయతీలోని సరియా జలపాతంలో గల్లంతైన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. యువకులు గల్లంతైనట్టు ఫిర్యాదు అందడంతో సోమవారం ఉదయం తహసీల్దార్ మాణిక్యం, అరకు సీఐ హిమగిరి ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సరియా జలపాతానికి చేరుకున్నారు. యువకుల ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలించింది. ఉదయం 10గంటల సమయంలో విశాఖపట్నంలోని పూర్ణామార్కెట్ వద్ద పండావీధికి చెందిన ఇళ్ల వాసు(21), రెల్లివీధిలోని ఏవీఎన్ కళాశాల ప్రాంతానికి చెందిన వడ్డాది సత్య నరసింహమూర్తి(24) మృతదేహాలను బయటకు తీశారు. ఆదివారం మధ్యాహ్నం ఆరుగురు యువకులు కారులో సరియా జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. అయితే వీరిలో వాసు,నరసింహమూర్తి జలపాతంలో స్నానం చేస్తున్న సమయంలో దిగువున ఉన్న సేలయేరులోకి జారి పడి గల్లంతయ్యారు.ఈ సంఘటనపై అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.యువకుల మృతదేహాలను శవ పరీక్షకు కేజీహెచ్‌కు పంపారు.
సరియా జలపాతం నుంచి మృతదేహాలు వెలికితీత

గల్లంతైన యువకులు మృతి