కనుల పండువగాశ్రీవారి కల్యాణం
రంపచోడవరం: స్థానిక రంప వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం శ్రీవారి కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణాన్ని కనులారా తిలకించారు. అనంతరం భక్తుల సహాయంతో భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్.వి.సుధాకర్, ఈవో ఎన్.వి.ఎస్.ఎస్.మూర్తి, ఏఈవో రమణరాజు, దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ఉలవల లక్ష్మి, కారుకోడి పూజ, నల్లమిల్లి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అద్దంకి వెంకటేశ్వరరావుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


