
గ్రామ దేవతలను కోల్పోతున్నాం
పోలవరం ముంపుతో మా గ్రామదేవతలను కోల్పోతున్నాం. దేవతలను పూజిస్తే గ్రామానికి మంచి జరుగుతుందనే విశ్వాసంతో ప్రతిఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పునరావాస కేంద్రాల్లో గ్రామదేవతలను ప్రతిష్టించేందుకు చాలా సమయం పడుతుంది.
– సవలం సుబ్బయ్య, గ్రామపటేల్, చూటూరు, చింతూరు మండలం
ఊరు వీడాలంటే
భయంగా ఉంది
దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుని, కూలీనాలీ చేసుకుని వచ్చిన సొమ్ములతో జీవనం సాగిస్తున్నాం. ముంపులో భాగంగా గ్రామాలను వీడాలంటే ఎంతో భయంగా ఉంది. పునరావాస ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నాం.
– సవలం లచ్చమ్మ, చూటూరు,
చింతూరు మండలం
భవిష్యత్తు తలుచుకుంటే
ఆందోళనగా ఉంది
ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పిల్లల్ని చదివిస్తూ జీవనం సాగిస్తున్నాం. కొత్త ప్రాంతంలో మా భవిష్యత్తును తలుచుకుంటే ఆందోళనగా ఉంది. మరోసారి కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
– సవలం దారయ్య, మాజీ సర్పంచ్, చూటూరు, చింతూరు మండలం

గ్రామ దేవతలను కోల్పోతున్నాం

గ్రామ దేవతలను కోల్పోతున్నాం