సీలేరు కాంప్లెక్స్‌లో పవర్ సెక్టార్ అధికారి సుడిగాలి
సీలేరు: సీలేరు కాంప్లెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ అధికారి(ఏపీపీఎస్) ఎ.వి. సాంబశివరావు సుడిగాలి పర్యటన చేశారు. సీలేరు కాంప్లెక్స్‌లో పొల్లూరు, డొంకరాయి, మాచ్‌ఖండ్, సీలేరు జల విద్యుత్ కేంద్రాలను ఆది, సోమ వారాలు రెండు రోజుల పాటు స్థానిక జెన్‌కో అధికారులతో కలిసి పరిశీలించారు. జల విద్యు త్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంపై ఆరా తీశారు. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 2వ దశ నిర్మాణం పనులను పరిశీలించి, పలు అంశాలపై ఆరా తీశారు. సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు చేపట్టవలసి న అంశాలపై చర్చించారు. సీలేరు వద్ద పార్వతీనగర్‌లో నూతన పవర్ ప్రాజెక్టు ప్రదేశాన్ని, డంపింగ్ యార్డు, ఇంటెక్ డ్యాములను పరిశీలించారు.ఆయన వెంట సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీరు వాసుదేవరావు, ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి,ఈఈ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు.


