
మండల సమావేశానికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు ఫిర్
గంగవరం: మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు కఛ్చితంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరుకావాలని, గైర్హాజరైన వారిపై చర్యలకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ (బాబు) అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ (బాబు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి జరిగే మండల ప్రజా పరిషత్ సమావేశాలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటాకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సర్పంచ్‌లకు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలకు ప్రజా ప్రతినిధులందరికి అవమానం జరుగుతుందన్నారు
తీర్మానాలు తప్పనిసరి
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మంజూరులో పంచాయతీ తీర్మానాలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో అభివృద్ధి మౌలిక సౌకర్యాలు సమస్యలపై సమావేశంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలని ప్రజా ప్రతినిధులను ఆయన సూచించారు. గ్రామాల్లో పలు సమస్యలను సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. విద్యా, ఉపాధి హామీ, వ్యవసాయం, పశుసంవర్ధక గహ నిర్మాణ, వెలుగు, ఐసిడిఎస్ శాఖలు వారి చేపట్టిన కార్యక్రమాలును ఆయా శాఖల అధికారులు వివరించారు. ఉపాధి ఏపీవో ప్రకాష్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు వివరించారు ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బేబీరత్నం, వైస్ ఎంపీపీలు రామతులసి, కె.గంగాదేవి, కో–ఆప్షన్ సభ్యుడు ప్రభాకర్ రావు, ఎంపీటీసీ సభ్యులు పండా ఆదినారాయణ, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి, పద్మావతి, సర్పంచ్‌లు అక్కమ్మ, కామరాజు, మరిడమ్మ, రమణమ్మ, లక్ష్మీ, రామలక్ష్మి, శివ, వెంకటేశ్వర్లు, రాజమ్మ, శివ తదితరులు ఆయా గ్రామ పంచాయతీల్లో సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులు కొన్నింటిని పరిష్కరించారు. తహసీల్దార్ సీహెచ్. శ్రీనివాసరావు ఎంపీడీవో వై.లక్ష్మణరావు. ఐసీడీఎస్ సీడీపీవో పీహెచ్ లక్ష్మి, ఎంఈవో మల్లేశ్వరరావు, ఏవో విశ్వనాథ్, ఏపీఎంషణ్ముఖరావు, ఏపీవో ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు