
మలేరియా రహితసమాజం కోసం కృషి
● ఐటీడీఏ పీవో అపూర్వభరత్
చింతూరు: మలేరియా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో చింతూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చింతూరు డివిజన్‌లో గత ఏడాది 382 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 170 కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు దో మతెరలు వినియోగించాలని, మురుగునీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఎంపీడీవో రామకృష్ణ, డాక్టర్ నిఖిల్ పాల్గొన్నారు.