
ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్
రాజవొమ్మంగి: ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం , ఆదివాసీ జేఏసీ గిరిజన నిరుద్యోగులు , ఆదివాసీ ప్రజాప్రతినిధులు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం తక్షణం ఏజెన్సీ డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తు నినాదాలు చేశారు. నూరు శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తు బుధవారం జరుగాల్సిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తు సభను బహిష్కరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు. ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ గిరిజన సంఘం, పీసా కమిటీ సభ్యులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, వజ్రపు అప్పారావు, కోండ్ల సూరిబాబు, రామకృష్ణ, ప్రసాద్, తెడ్ల రాంబాబు, పెద్దిరాజు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరికి సభకు హాజరైన ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి, సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆందోళన కారులకు మద్దతు ప్రకటించి సభ నుంచి బయటకు వచ్చేశారు.