
ముత్యాలమ్మ ఉత్సవానికి ముహూర్తపు రాట
చింతపల్లి: మండల కేంద్రంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ ముత్యాలమ్మ తల్లి జాతర జరగనుంది. జాతరకు సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీ అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం వద్ద ముహుర్తపు రాట వేశారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్థలతో జరిగింది. ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్‌కుమార్, పసుపులేటి వినాయకరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనూషాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, భక్తులు పాల్గొన్నారు. జాతర విజయవంతానికి అందరూ అన్ని విధాలుగా సహకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. బేతాళుడు, జోగేశ్వరరావు, రమణమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు.