
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, తీవ్ర అన్యాయం చేశారు. అన్నదాత సుఖీభవ హామీని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. గత ఏడాది రైతులకు పెట్టుబడి సాయం అందజేయలేదు. ఈఏడాది కూడా పంపిణీ అనుమానంగానే ఉంది. గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితిని గమనించి సాయం అందజేయాలి.
– గబ్బాడ లక్ష్మయ్య,గిరిజన రైతు, కుజ్జెలి గ్రామం, పాడేరు మండలం
సాక్షి.పాడేరు: జిల్లాలో ఎక్కువ మంది రైతులు పేదలే. రెక్కాడితే గాని డొక్కాడని వారికి వ్యవసాయమే ఆధారం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉండేది. రైతుల సంక్షేమం లక్ష్యంగా అప్పటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పలు కార్యక్రమాలను అమలుచేశారు. 90 శాతం సబ్సిడీపై విత్తనాలతో పాటు ప్రతి ఏడాది రైతు భరోసా పథకంలో ఆర్థిక సాయం అందించడంతో ప్రతి గిరిజన రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేశారు. గత ప్రభు త్వం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌కు ముందుగానే ఆమోదం తెలపడంతో గత ఖరీఫ్ సమయంలో వరి,ఇతర వాణిజ్య పంటల విత్తనాలు సమకూరాయి. రైతు భరోసా పథకంలో మూడు విడతలుగా ఏడాదికి రూ.13,500 చొప్పున 1,69,264 మంది రైతులు ఏటా రూ.104 కోట్లు ఆర్థిక సాయం పొందారు.
ఉసూరుమంటున్న గిరిజన రైతులు
జిల్లాలోని గిరిజన రైతులు వ్యవసాయానికి పెట్టుబడి సాయం లేక ఉసూరుమంటున్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు సాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత ఆ విషయం విస్మరించారు. గత ఖరీఫ్‌లో పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేలు మాత్రమే దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. దీంతో అప్పులు చేసి, పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పనులకు గిరిజన రైతులు శ్రీకారం చుట్టారు. వర్షాలు కురుస్తుండడంతో దుక్కిపనులతో పాటు మెట్ట పంటలకు విత్తనాలు జల్లుతున్నారు. అయితే ఇంతవరకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదు.అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం కోసం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖరీఫ్‌లో ప్రతి గిరిజన రైతుకు పెట్టుబడికి కనీసం రూ.15వేలు అవసరం. ఆ సొమ్ములేక చాలా మంది రైతులు తమ పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఖరీఫ్‌కు దుక్కిపనులు చేస్తున్న గిరిజన రైతు
గత ఏడాదీ ఇబ్బందులు పడ్డా
గత ఖరీఫ్ సీజన్‌లోను వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బంది పడ్డాను.రైతు భరోసా ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిఏడాది రూ.13,500 సాయం అందించేది. వ్యవసాయ పెట్టుబడు లకు మంచి అదునులో ఈసొమ్ము ఉపయో గపడేది. పీఎం కిసాన్ యోజన రూ.2వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు. – బంగురు వాసుదేవ,
గిరిజన రైతు, గడి కించుమండ, హుకుంపేట మండలం
పశువులను అమ్ముకుంటున్నారు
పేద గిరిజన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.తిండి గింజలు,ఇతర వాణిజ్య పంటలు పండించుకుని జీవించే రైతులు వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు పశువులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కూడా రెండు దుక్కి పశువులను హుకుంపేట సంతలో అమ్ముకున్నాను. – రేంగ పండన్న,
గిరిజన రైతు, బొడ్డాపుట్టు, హుకుంపేట మండలం
ఆర్థిక ఇబ్బందుల్లో గిరి రైతులు
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు
గత ప్రభుత్వం హయాంలో 1,69,264 మందికి రైతు భరోసా
ఏటా రూ.104 కోట్ల ఆర్థిక సాయం
గత ఖరీఫ్ నుంచి కూటమి ప్రభుత్వ సాయం నిల్
ఈ ఏడాది కూడా సాయం ఊసేత్తని సర్కార్

కూటమి ప్రభుత్వం మోసం చేసింది

కూటమి ప్రభుత్వం మోసం చేసింది