
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి, పాడేరు: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో రెండు రోజుల క్రితం ప్రాణప్రతిష్ట జరిగిన లక్ష్మిదేవికి తొలి శుక్రవారంతో ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం లక్ష్మిదేవిని మహిళలంతా దర్శించుకుని కుంకుమార్చన పూజలు చేశారు. భజన కార్యక్రమాలతో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది.
నేడు ఆలయ వార్షికోత్సవం
పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ తొలి వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహచలంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. శనిత్రయోదశి పురస్కరించుకుని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. వైభవ వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద పూజలు జరుగుతాయన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొవాలని కోరారు.
సీలేరు: సీలేరులో మారెమ్మ ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన ఎం.కె.టి.ఎన్.వీ ప్రసాద్ , మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో సహస్రదీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయకమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఘనంగా అమ్మవారి గరగల ఊరేగింపు
చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లి ఉత్సవం ఘనంగా జరుగుతోంది. వేడుకలో భాగంగా రెండోరోజు సుర్లవంశీయుల ఇంటి వద్ద కొలువుతీరిన అమ్మవారి గరగలు, పాదుకలు, ఘటాలకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భాజభజంత్రీలు, డప్పుల చప్పుళ్ల మధ్య అమ్మవారి గరగలను ఊరేగింపుగా ఽఽఽశతకంపట్టు వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఎంపీపీ కోరాబు అనూషాదేవి, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్‌కుమార్, పసుపులేటి వినాయకరావు, సభ్యులు బేతాళుడులు గరగలను ఽశతకం పట్టువద్దకు తీసుకువచ్చారు. సుర్లవంశీయులు సుర్ల అప్పారావు. తిరుపతి పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో కుంకుమపూజలు
అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత