జిల్లా జడ్జి దృష్టికి న్యాయవాదుల సమస్యలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జి దృష్టికి న్యాయవాదుల సమస్యలు

Published Sun, Apr 27 2025 1:30 AM | Last Updated on Sun, Apr 27 2025 1:30 AM

జిల్లా జడ్జి దృష్టికి న్యాయవాదుల సమస్యలు

జిల్లా జడ్జి దృష్టికి న్యాయవాదుల సమస్యలు

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా 8వ అడిషనల్‌ జిల్లా జడ్జి చెన్నయ్య నాయుడు శనివారం రంపచోడవరంలోని ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును సందర్శించారు. జిల్లా జడ్జితో పాటు స్థానిక న్యాయమూర్తి పి.బాబు ఉన్నారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.రవిరామ్‌ భగవాన్‌ , ఉపాధ్యక్షురాలు కె.శివరంజని, సీనియర్‌ న్యాయవాదులు కె.ఎన్‌.వి.రమణ, డి.శ్రీధర్‌, తదితర న్యాయవాదులు జిల్లా జడ్జిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు స్థానిక న్యాయవాదుల సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement