Top Stories
ప్రధాన వార్తలు

వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
అనంతపురం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.వైఎస్ జగన్ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

నాగబాబు రాక.. పిఠాపురంలో మళ్లీ ఉద్రిక్తత
కాకినాడ, సాక్షి: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu) పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కాకరేపింది. వర్మ పేరిట ఆయనకు తెలుగు తమ్ముళ్లు మరోసారి షాక్ ఇచ్చారు. జై వర్మ(Jai Varma) నినాదాలతో నాగబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో పసుపు జెండాలతో టీడీపీ బలప్రదర్శనకు దిగగా.. జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలో తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కల్యాణ్‌ను గెలిపించారని టీడీపీలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్పీఎస్ఎన్ వర్మ మీద సానుభూతి ఏర్పడింది. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు మండిపడుతున్నారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయింది. దీని వెనక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వాళ్లలో బలంగా ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న గొల్లప్రోలులోనూ అన్నాక్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో రసాభాసా సృష్టించారు. తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్ధతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: వర్మ అవుట్.. ఇక పిఠాపురం జమీందార్‌గా కొణిదెల నాగబాబు

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కుట్ర.. ఢిల్లీకి ఏపీ సీఐడీ
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి.మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు.. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్‌అండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని జేఎల్ఎల్ ఇండియా (రెసిడెన్షియల్ సర్వీసెస్) ఎండీ శివ కృష్ణన్ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్‌ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
గెలుపు జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో జట్టు తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్ వేసింది.దిగ్వేశ్‌కి మరోసారి షాక్అదే విధంగా.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీకి ఐపీఎల్ పాలక మండలి మరోసారి షాకిచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మ్యాచ్ ఫీజులో యాభై శాతం మేర కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జతచేసింది.203 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో ఎల్ఎస్జీ- ముంబై (LSG vs MI) ఇండియన్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్రమ్ (53), ఆయుశ్ బదోని (30), డేవిడ్ మిల్లర్(27) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా ఐదు వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పన్నెండు పరుగుల తేడాతోఇక లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులకే పరిమితమైంది. నమన్ ధీర్ (24 బంతుల్లో 46), సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్) పోరాటం వృథాగా పోయింది. పన్నెండు పరుగుల తేడాతో లక్నో చేతిలో ముంబై ఓటమి పాలైంది.అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్‌లోకి అదనంగా ఓ ఫీల్డర్‌ను పిలవాల్సి వచ్చింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే రింగ్ బయట ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్‌కు జరిమానా కూడా పడింది.స్లో ఓవర్ రేటు ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందు వల్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు జరిమానా విధించడమైనది’’ అని ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. దిగ్వేశ్ సింగ్ రాఠీ విషయంలోనూ ఐపీఎల్ పాలక మండలి మరో ప్రకటన జారీ చేసింది. ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తున్నాం.మళ్లీ అదే తప్పుఆర్టికల్ 2.5లోని లెవల్ 1 తప్పిదానికి అతడు పాల్పడ్డాడు. ఈ సీజన్లో అతడు నిబంధనలు అతిక్రమించడం ఇది రెండోసారి. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ దిగ్వేశ్ రూల్స్ ఉల్లంఘించాడు. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు తాజాగా మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే, దిగ్వేశ్కు ఫైన్ వేయడానికి గల కారణం.. నమన్ వికెట్ తీసిన తర్వాత.. మరోసారి నోట్‌బుక్‌లో రాస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోవడం అని తెలుస్తోంది.నువ్విక మారవా? .. పాపం పంత్!కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో.. లక్నో జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే దిగ్వేశ్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి.. నమన్ ధీర్ రూపంలో కీలక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇలా మరోసారి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు దిగ్వేశ్‌పై.. ‘‘మారవా.. నువ్విక మారవా?’’ అంటూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు..బ్యాటర్‌గా విఫలమవుతున్న పంత్‌కు ఇలా సారథిగానూ ఎదురుదెబ్బ తగలడం పట్ల.. ‘పాపం పంత్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్ Just the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025

ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్ ఏమన్నారంటే..
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మార్కెట్ క్రాష్ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు. పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన.

హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి.

చంద్రబాబు కొత్త రాగం.. ఏప్రిల్ ఫూల్ జోక్ ఇదేనేమో!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్తపాట ఎత్తుకున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నొక్కిన బటన్లు అన్నీ తామిస్తున్న పెన్షన్‌తో సమానమని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ ఫూల్ జోక్ ఇదే కావచ్చు. ఏం చెబుతున్నానన్న దానితో నిమిత్తం లేకుండా చెప్పుకుంటూ పోవడమే ఆయన నైజంగా కనిపిస్తోంది ఇలాంటివి చూస్తూంటే. చంద్రబాబు తాలూకూ గొప్పలు ఇంకొన్నింటి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి.ఒక కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాలకు రూ.నాలుగు వేల చొప్పున ఇచ్చే పెన్షన్ల పంపిణీ చేయడానికి ఆయన లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అంతేకాదు.. ఈ నెల మొదటి తేదీన చంద్రబాబు పర్యటనలో మరో విచిత్రమూ కనిపించింది. తన సభకు రావాలని ఆయన దారిలో కనిపించిన వారినల్లా కోరుకున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రికి ఇలాంటి రికార్డు ఉండదేమో. ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లడం తప్పు కాదు కానీ పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు చిన్న, పెద్ద కార్యక్రమాలన్నింటికీ హెలికాఫ్టర్ వేసుకుని రాష్ట్రం అంతటా పర్యటించడం మాత్రం అంత హర్షణీయమైన విషయం కాదు.వృద్ధాప్య ఫించన్లున్ల పంపిణీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దశాబ్దాలుగా సాగుతున్న విషయమే. గత ఎన్నికల్లో ఇచ్చిన అనేకానేక హామీలను ఎగ్గొట్టిన బాబుగారు ఫించన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలైతే పెంచారు. అయితే, పెంచిన మొత్తాన్ని పంపిణీ చేసేందుకు నెల నెలా ముఖ్యమంత్రి వెళ్లడం ఏమిటో? హెలికాప్టర్ ఖర్చుతోపాటు సీఎం పర్యటన ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సూపర్ సిక్స్ ఎగ్గొట్టిన విషయాన్ని మరపించేందుకు ఇలా చేస్తున్నారేమో మరి!.వైఎస్ జగన్ హయాంలో వలంటీర్లు మాత్రమే ఫించన్లు పంపిణీ చేసేవారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రతినెల ఒకటవ తేదీన తెల్లవారుజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉండేది. జగన్‌కూ మంచి పేరు తెచ్చింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ముగిసేనాటికి ఫించన్ల మొత్తం రూ.రెండు వేలు ఉంటే, జగన్ ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ రూ.మూడు వేలకు తీసుకెళ్లారు. అది కూడా ఇంటివద్దే అందేది. అంతకుమునుపు మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ లేదా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన ఖర్మ వృద్ధులకు తప్పింది. ఇలాంటి సువ్యవస్థితమైన వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు చెడగొట్టాయి. జగన్‌కు మంచిపేరు రాకూడదన్న ఉక్రోశంతో వలంటరీ వ్యవస్థలపై అవాకులు చెవాకులు మాట్లాడారు.అయితే, జనం నుంచి వచ్చిన నిరసన చూసిన తరువాత మాటమార్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాటలోనే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లయితే ఇస్తున్నారు కానీ.. కొన్నిచోట్ల ఇది సరిగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా బాపట్ల జిల్లాలో చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిని నివ్వరపోయేలా చేస్తుంది. జగన్ ను ఉద్దేశించి గతంలో బటన్లు నొక్కేవారని, ఆ బటన్లు అన్నీ కలిపి తామిచ్చే ఫించన్లకే సమానం అని కొత్త అసత్యాన్ని సృష్టించారు. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలో ఇలా ఇవ్వడం లేదని తన గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్ టైమ్‌లో ఫించన్ల సంఖ్య 66 లక్షలకు చేరింది. ఇప్పుడు రెండు లక్షలు తగ్గింది.2019 వరకు చంద్రబాబు టైమ్‌లో అందిన ఫించన్లు సుమారు 44 లక్షల మందికే. ఇప్పుడు పెరిగిన పెన్షన్లు అన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారన్నమాట. అప్పట్లో బటన్లు నొక్కితే ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత తాను అంతకన్నా ఎక్కువ బటన్లు నొక్కుతానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేశారు. అయినా జగన్ కన్నా సంక్షేమానికి తానే ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి యత్నించారు. జగన్ టైమ్ కన్నా రూ.వెయ్యి ఎక్కువ ఇస్తే, ప్రభుత్వానికి అయ్యే అదనపు వ్యయం సుమారు 640 కోట్లే. మరి దీంతోనే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందించినట్లు ఎలా అవుతుంది?. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తామని ఇచ్చిన హామీ గురించి మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడరు.జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ.ఏభై వేల కోట్ల స్కీములకు అమలు చేశారు. చంద్రబాబు యథాప్రకారం వీటిపై అసత్యాలను ప్రచారం చేసి వచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అట. గత ప్రభుత్వం నుంచి పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీ కట్టాలట. ఇవి ఎంత నిజమో ఇప్పటికే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలియచేసింది. జగన్ టైమ్‌లో కరోనా రెండేళ్లు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించినా, ఏ నెలా జీతాలు ఆపలేదు. ఇప్పుడేమో జీతాలకు డబ్బులు లేవంటున్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయినప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. కానీ, 2024లో జగన్ ప్రభుత్వం తప్పుకునే నాటికి ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలున్నాయి. పోనీ, చంద్రబాబు చెప్పినట్లు పది లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నా, దానిలో ఆయన 2014-19 మధ్య చేసిన అప్పు ఎంత? 2024లో అధికారంలోకి వచ్చాక చేసిన అప్పు ఎంత? విభజన ద్వారా వచ్చిన అప్పు వాటా ఎంత? అన్నది చెప్పకుండా మొత్తం జగన్ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది చంద్రబాబే, బడ్జెట్లో అది ఆరున్నర లక్షల కోట్లేనని తేల్చిందీ చంద్రబాబు ప్రభుత్వమే. అయినా పది లక్షల కోట్ల అప్పు అని అబద్దాలు చెబుతున్నది ఆయనే. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటికే లక్ష ముప్పై వేల కోట్లకు పైగా అప్పు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబే. 14 లక్షల కోట్ల అప్పు ఉందంటూనే, తాను అధికారంలోకి వస్తే అప్పు చేయకుండా సంపద సృష్టించి పేదలకు స్కీములు అమలు చేస్తానని బొంకింది కూటమి పెద్దలే కదా!. ఇప్పుడేమో ఆరున్నొక్క రాగం ఆలపిస్తున్నది వారే. అంతేకాక అమరావతి రాజధానిని నిర్మించడం ద్వారా సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తానని ఈ విడత చెప్పారు. అంటే ఏమిటి దీని అర్ధం. ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయనని అనడమా?. అదే టైమ్ లో మేలో కొన్ని స్కీములు అమలు చేస్తామని అంటారు.ఈ సభకు అంతా రావాలని దారిలో కనిపించిన వారినల్లా కోరుతూ ముఖ్యమంత్రిగా ఆయన మరో సంప్రదాయం నెలకొల్పారు. ప్రజలు తన సభకు రావడం లేదనో, లేక వచ్చినా వెళ్లిపోతున్నారనో ఇలా దండోరా వేసినట్లుగా చెప్పి ఉండాలి. అలా వచ్చిన వారిలో ఒక యువకుడు తన అర్జీని ఇవ్వబోతే మాత్రం అతనిని వేరే రాజకీయ పార్టీ వ్యక్తి అని, అతని సంగతి తమ వాళ్లు చూసుకుంటారని బెదిరించడం ఏమిటో అర్థం కాదు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వ కాలం పూర్తి అయ్యే సరికి ప్రజలు ఇంకెన్ని అసత్యాలను వినాలో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

దురదృష్టవశాత్తు.. ‘50 వసంతాల మైక్రోసాఫ్ట్’పై బిల్‌గేట్స్ వీడియో
వాషింగ్టన్: టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కంపెనీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఆరంభ రోజుల్లో.. యవ్వనంలో ఉండగా దిగిన ఫొటోలను సరదాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తు.. నేను మళ్ళీ ఎప్పటికీ కూల్‌గా ఉండను. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో ఇది నేనే’’ అంటూ క్యాప్షన్ ఉంచారాయన. 1975 ఏప్రిల్ 4వ తేదీన న్యూ మెక్సికో అల్బుకెర్కీలో మైక్రోసాఫ్ట్‌ను చిన్ననాటి స్నేహితులైన బిల్ గేట్స్, పాల్ అలెన్‌లు స్థాపించారు. 1979లో కంపెనీ విస్తరణలో భాగంగా వాషింగ్టన్కు మార్చారు. ఆ తర్వాత గేట్స్, అలెన్‌తో పాటు స్టీవ్ బాల్మర్, సత్య నాదెళ్ల కంపెనీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) మైక్రోసాఫ్ట్‌కు 2000 సంవత్సరం దాకా గేట్స్ సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద రీతిలో.. మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి 2020 నుంచి ఆయన వైదొలిగారు. 1955 సియాటెల్‌లో జన్మించిన విలియమ్ హెన్సీ గేట్స్.. బాలమేధావిగా 13 ఏళ్ల వయసుకే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాసే స్థాయికి చేరాడు. అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించేందుకు హార్వార్డ్ నుంచి విద్యాభ్యాసం మధ్యలోనే ఆపేశారాయన. చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరూ ఎంఎస్-డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించి.. ఆపై దానిని విండోస్‌గా పేరు మార్చారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా.. మైక్రోసాఫ్ట్ తన వెబ్సైట్లో కొత్త పేజీలను లాంచ్ చేసింది. గత ఐదు దశాబ్దాలుగా సాగిన ప్రయాణాన్ని అందులో పదిలపరిచింది. కంపెనీ ఎదుగుదల, మైలు రాళ్లు, ఆవిష్కరణలను అందులో ఉంచింది. అలాగే.. రాబోయే 50 ఏళ్ల విజన్‌ను అందులో పొందుపరిచింది.

Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి. ఈ రోజున శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలను ఉత్సాహంగా జరుపు కుంటారు. శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేవి చలిమిడి, వడపప్పు పానకం. వేడిని తగ్గించి, శరీరానికి చలువనిచ్చే ఆరోగ్యకరమైన వంటకాలతోపాటు, చక్కెర పొంగలి, పాయసం లాటివాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేక నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.మండువేసవిలో వచ్చే పండుగ శ్రీరామనవమి ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వలన శరీరంలో ఉండే ఖనిజాలు (పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం) చెమట రూపంలో బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. బెల్లం పానకం తాగడం వలన తిరిగి ఈ ఖనిజాలను పొందవచ్చు. ఎండ తాపాన్ని తట్టుకునే శక్తిని బెల్లంలో ఉండే ఇనుము ఇస్తుంది. అంతేకాదు, వేసవిలో తగ్గుతూ పెరుగుతూ ఉండే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. అలాగే పెసరపప్ప కూడా శరీరానికి చలువనిస్తుంది. చలిమిడి కావాల్సినవి: బియ్యం, బెల్లం, కొబ్బరి తురుము, యాలకులు, నెయ్యి తయారీ: నానబెట్టిన ఉంచుకున్న తడి బియ్యాన్ని వడగట్టుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బియ్యపిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, చక్కర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలపాలి. అంతే చలిమిడి రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు– పదితయారి: పెసరపప్పును కడిగి పప్పు మునిగేటట్లు నీటిని పోసి నాననివ్వాలి. రెండు గంటల పాటు నానిన తర్వాత నీటిని వడపోసి కొబ్బరి పలుకులు కలపాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టే వడపప్పును ఇలాగే చేయాలి. రుచికోసం నానిన పెసరపప్పులో అరకప్పు మామిడి తురుము, చిటికెడు ఉప్పు కలిపిపోపు పెట్టుకోవచ్చు.పానకంకావలసినవి: బెల్లం – 100 గ్రా, మిరియాలు – పది ( పొడి చేయాలి), ఏలకులు - ఆరు (పొడిచేయాలి)తయారి: బెల్లంలో ఒక గ్లాసు నీటినిపోసి కరగనివ్వాలి. ఒక గంట తర్వాత బెల్లం నీటిని పలుచని తెల్లని వస్త్రంతో వడపోయాలి. వడపోసిన బెల్లం నీటిలో మిరియాల పొడి, ఏలకుల పొడి కలిపితే పానకం రెడీ. చక్కెర పొంగలి కావలసినవి: బియ్యం -కప్పు, శనగపప్పు -గుప్పెడు, పాలు-మూడు కప్పులు, చక్కెర - ఒకటిన్నర కప్పు, ఏలకులు -పది, (పొడి చేయాలి), జీడిపప్పు, కిస్మిస్– ఒక్కొక్కటి పది, నెయ్యి-మూడు టీ స్పూన్లుతయారి: ముందుగా బాణలిలో నెయ్యివేసి, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన ఉంచాలి. బియ్యం, శనగ పప్పు కడిగి అందులో పాలుపోసి, జీడిపప్పు వేయించగా మిగిలిన నేతిని కూడా బియ్యం -పాలలో వేసి ప్రెషర్ కుకర్‌లో ఉడికించాలి. కుకర్‌లో ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి పాయసం మిశ్రమంలో చక్కెర, ఏలకుల పొడి వేసి, చక్కెర కరిగే వరకు కలిపి జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసి మూత పెట్టాలి. పది నిమిషాలకు అన్నానికి తీపి బాగా పట్టి రుచిగా ఉంటుంది.
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
Chittoor: దళితులకు అవమానం.. కాళ్ల మీద పడి క్షమాపణలు కోరిన కలెక్టర్
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కుట్ర.. ఢిల్లీకి ఏపీ సీఐడీ
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
ప్రభుత్వాన్ని ప్రైవేటుకు ఇవ్వడం కుదరలేదు కానీ..
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు..
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైష్ణవి
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
సాక్షి కార్టూన్ 04-04-2025
వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం!
ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
‘మోదీ జీ.. ఇది మీ కారణంగానే సాధ్యమైంది: బీఆర్ఎస్ ఎంపీ
కొత్త రీచార్జ్ ప్లాన్: 2 నెలలు.. 251జీబీ..
డేట్ ఫిక్స్
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. పోలీసుల కీలక ఆదేశాలు
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్‌చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
మాధవన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో శివానీ రాజశేఖర్.. 'జి.డి. నాయుడు'పై సినిమా
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి
ఊరంతా చేపల కూరే...!
బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మరింత యంగ్‌గా ఉన్నానని రిజెక్ట్ చేశారు: బుట్టబొమ్మ
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
'భరోసా'.. మెల్లమెల్లగా!
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
ఏఐ కూడా ఊహించలేదుగా...
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా
H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
అప్పట్లో పంజాబ్.. ఇప్పుడు సన్‌రైజర్స్: సెహ్వాగ్ ఘాటు విమర్శలు
సీఎం నితీశ్ కుమార్‌కు బిగ్ షాక్
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. డిప్యూటీ సీఎంకు సీఎస్ రిపోర్ట్
బలైపోయిన అంజలి
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'30 ఏళ్లు గ్యాప్ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..రుచికరమైన జున్ను: ఎన్నో ప్రయోజనాలు
కేరళ సీఎం కుమార్తెకు షాకిచ్చిన కేంద్రం.. అదే జరిగితే పదేళ్ల జైలుశిక్ష!
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
వీర విధేయులతో ‘సిట్’
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
ఇంట గెలిచిన లక్నో
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రివ్యూ
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు
Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...
ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?
88 ఏళ్ల నాటి స్నాక్ బ్రాండ్..ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..!
20 ఏళ్ల కిందట విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్లో..: ఎస్పీ చరణ్
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
Chittoor: దళితులకు అవమానం.. కాళ్ల మీద పడి క్షమాపణలు కోరిన కలెక్టర్
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కుట్ర.. ఢిల్లీకి ఏపీ సీఐడీ
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
ప్రభుత్వాన్ని ప్రైవేటుకు ఇవ్వడం కుదరలేదు కానీ..
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు..
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైష్ణవి
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
సాక్షి కార్టూన్ 04-04-2025
వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం!
ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేసిన ప్రభుత్వం
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి
‘మోదీ జీ.. ఇది మీ కారణంగానే సాధ్యమైంది: బీఆర్ఎస్ ఎంపీ
కొత్త రీచార్జ్ ప్లాన్: 2 నెలలు.. 251జీబీ..
డేట్ ఫిక్స్
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. పోలీసుల కీలక ఆదేశాలు
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్‌చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
మాధవన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో శివానీ రాజశేఖర్.. 'జి.డి. నాయుడు'పై సినిమా
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి
ఊరంతా చేపల కూరే...!
బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మరింత యంగ్‌గా ఉన్నానని రిజెక్ట్ చేశారు: బుట్టబొమ్మ
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
'భరోసా'.. మెల్లమెల్లగా!
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
ఇంత చిన్న గడ్డివామా.. ఐతే పిల్లను ఇవ్వం!
ఏఐ కూడా ఊహించలేదుగా...
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా
H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
అప్పట్లో పంజాబ్.. ఇప్పుడు సన్‌రైజర్స్: సెహ్వాగ్ ఘాటు విమర్శలు
సీఎం నితీశ్ కుమార్‌కు బిగ్ షాక్
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. డిప్యూటీ సీఎంకు సీఎస్ రిపోర్ట్
బలైపోయిన అంజలి
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'30 ఏళ్లు గ్యాప్ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..రుచికరమైన జున్ను: ఎన్నో ప్రయోజనాలు
కేరళ సీఎం కుమార్తెకు షాకిచ్చిన కేంద్రం.. అదే జరిగితే పదేళ్ల జైలుశిక్ష!
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
వీర విధేయులతో ‘సిట్’
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
ఇంట గెలిచిన లక్నో
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రివ్యూ
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు
Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...
ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?
88 ఏళ్ల నాటి స్నాక్ బ్రాండ్..ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..!
20 ఏళ్ల కిందట విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్లో..: ఎస్పీ చరణ్
సినిమా

కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
‘‘నేను నటించిన ‘హృదయ కాలేయం’ విడుదలై పదకొండేళ్లయింది. ఇన్నేళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఈ నెల 25న ‘సోదరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి’’ అని సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) తెలిపారు. సాయి రాజేశ్ నీలం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హృదయ కాలేయం’. ఈ మూవీ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. 2014 ఏప్రిల్ 4న ఈ చిత్రం విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంపూర్ణేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నరసింహాచారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయ కాలేయం’తో సంపూర్ణేష్ బాబుగా మార్చిన సాయి రాజేశ్ అన్నకు రుణపడి ఉంటాను. ఈ మూవీ టైమ్‌లో డైరెక్టర్ రాజమౌళిగారు చేసిన ట్వీట్ వల్ల నాకెంతో గుర్తింపు దక్కింది. ‘హృదయ కాలేయం’ టైమ్‌లో సందీప్ కిషన్ అన్న, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజగార్లు ఎంతో సపోర్ట్ చేశారు. నా జీవన విధానానికి, ‘బిగ్ బాస్’ పరిస్థితికి సరిపోక ఆ షోలో ఉండలేకపోయాను. నా సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. కనీసం కారులో తిరగ్గలనా? అనుకున్న నన్ను విమానంలో తిరిగేలా చేశారు సాయి రాజేశ్ అన్న’’ అని తెలిపారు.

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?
ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ సారి డబుల్ మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాయిరే నాయిరే అనే సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను ఊర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Director #KalyanShankar sets the stage on fire with #JrNTR's 'Nairey Nairey'. pic.twitter.com/mixonqAiR7— Suresh PRO (@SureshPRO_) April 4, 2025

Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు.

'30 ఏళ్లు గ్యాప్ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్
సల్మాన్ ఖాన్ ఇటీవలే సికందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఊహించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు సల్లు భాయ్ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొన్నారు. అదే సమయంలో రష్మికతో సల్మాన్ ఏజ్ గ్యాప్‌పై పలువురు ప్రశ్నించారు. మీ కూతురి వయస్సున్న అమ్మాయితో ఎలా నటిస్తారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. దీనిపై సల్మాన్ సైతం స్పందించారు. ఆమెకు లేని ఇబ్బంది.. మీకు ఎందుకని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. భవిష్యత్తులో రష్మికకు పాప పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ ఖాన్ అన్నారు.తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా స్పందించారు. సినిమాల్లో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ అనేది సాధారణ విషయమన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమీషా పటేల్ మాట్లాడారు. అలాగే తనకు కూడా గదర్ చిత్రంలో సన్నీ డియోల్‌కు, నాకు దాదాపు 20 ఏళ్ల అంతరం ఉందని ఆమె గుర్తు చేశారు.అమీషా మాట్లాడుతూ..' గదర్-2 సినిమాలో నాకు సన్నీ డియోల్‌కు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అందుకే మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే సల్మాన్, రష్మిక జోడిని అభిమానులు ఇష్టపడుతున్నారు. నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో కలిసి పనిచేశానని' తెలిపింది.
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..
క్రీడలు

నిలబడలేని స్థితి నుంచి... మళ్లీ గన్ పట్టి...
రాహీ సర్నోబత్... భారత్ తరఫున షూటింగ్ ప్రపంచకప్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ. మొత్తంగా షూటింగ్ ప్రపంచ కప్‌లలో ఆమె ఖాతాలో 5 స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్యాలు... కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం ఆమె గెలుచుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం వరకు రాహీ భారత అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే 32 ఏళ్ల వయసులో ఆమె ఊహించని ఘటన రాహీ జీవితంలో చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల కోసం ఆమె సిద్ధమవుతోంది. అనూహ్యంగా ఆమె శరీరంలో కాస్త మార్పు కనిపించింది. కొంత నొప్పిగా అనిపించినా ఆ సమయంలో దానిని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. శరీరమంతా తట్టుకోలేనంత నొప్పితో విలవిల్లాడింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది. దాంతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. అన్నింటిలో అంతా బాగుందనే వచ్చింది. అసలు సమస్య ఏమిటనేది మాత్రం తేలలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా మారి అసలు పడుకోలేని పరిస్థితి. కూర్చొని మాత్రమే నిద్రపోవాల్సి వచ్చేది. చివరకు ఆమెకు ‘న్యూరోపతిక్ పెయిన్’ ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చారు. అయితే దీనికి ప్రత్యేక కారణం గానీ, ప్రత్యేక చికిత్స గానీ ఉండదని, ప్రతీ వ్యక్తికీ భిన్నమైన లక్షణాలు ఉంటాయని చెప్పడం రాహీలో ఆందోళనను మరింత పెంచింది. ‘కొన్ని నెలల పాటు రోజుకు 17–20 గంటలు కేవలం పడుకునేదాన్ని. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయేదాన్ని’ అని నాటి బాధాకర రోజులను రాహీ గుర్తు చేసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాహీ అదృష్టవశాత్తూ ఆరోగ్యం మెరుగవడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత నొప్పి పూర్తిగా తగ్గకపోయినా ఫిజియోథెరపీని మొదలు పెట్టారు. నిర్విరామంగా 20 నిమిషాలు పాటు టీవీ షో చూడటం కూడా ఆమె మొదటి ఎక్సర్సైజ్గా మారింది. మొదట్లో అది కూడా కష్టంగా అనిపించింది. అయితే ఫిజియోథెరపీతో నెమ్మదిగా పరిస్థితి మారి కొంత ఎక్కువ సమయం కూర్చోవడం మొదలు పెట్టింది. ఆ సమయంలో ఆమె ఆటలో పునరాగమనం గురించి అస్సలు ఆలోచించలేదు. అసలు జీవితం సాధారణంగా మారి ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునే పరిస్థితి మాత్రమే ఆమెది. కానీ రాహీ చివరకు కోలుకొని ఆపై ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టింది. అంతా చక్కబడటంతో సర్నోబత్ మళ్లీ గన్ పట్టుకొని షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సారి తనను తాను నిరూపించుకునేందుకో, పతకాలు గెలుచుకునేందుకో కాదు. తాను ఎలాంటి కఠిన పరిస్థితులను దాటి ధైర్యంగా నిలబడ్డానో, జీవితం ఇచ్చిన రెండో అవకాశాన్ని పట్టుదలగా ఎలా వాడుకున్నానో చూపించేందుకు రాహీ మళ్లీ ఆటలోకి అడుగు పెట్టింది. ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించడంతో ఆమె కొత్త జీవితం మొదలైంది. రియో, టోక్యో ఒలింపిక్స్‌లలో పాల్గొన్న రాహీ సర్నోబత్ ఇప్పుడు మరోసారి తన స్వప్నం ఒలింపిక్స్ పతకం కోసం సిద్ధమవుతోంది. అసలు లేవలేని పరిస్థితి నుంచి కోలుకొని మళ్లీ సత్తా చాటుతూ లాస్ ఏంజెలిస్ గేమ్స్ లక్ష్యంగా తన సన్నాహాలు చేస్తోంది. - సాక్షి క్రీడా విభాగం

బుమ్రా... మరికొన్ని రోజుల తర్వాతే...
ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు లభించేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటన నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. వేగంగా కోలుకుంటున్న బుమ్రా ఐపీఎల్లో కనీసం మరో రెండు మ్యాచ్‌లు ముంబై జట్టుకు దూరంగా ఉండనున్నాడు.బుమ్రాకు పూర్తిస్థాయి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత... బీసీసీఐ మెడికల్ టీమ్ బుమ్రా ఫిట్‌నెస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తేనే అతను ఐపీఎల్లో ఆడతాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని బుమ్రా భావిస్తున్నాడు. వచ్చే జూన్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో భారత్ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా పునరాగమనంపై తొందరపడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ముంబై తరఫున బుమ్రా ఆడలేకపోతుండటంతో... సత్యనారాయణ రాజు, విఘ్నేశ్, అశ్వని కుమార్లాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది

ఇంట గెలిచిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 204 పరుగులు... నమన్, సూర్యకుమార్ చెలరేగినప్పుడు గెలుపు సునాయాసం అనిపించింది... చివర్లో 2 ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్ పాండ్యా కొట్టగలడని అనిపించింది... కానీ లక్నో మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. 19వ ఓవర్లో శార్దుల్ 7 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పదునైన బౌలింగ్‌తో అవేశ్ ఖాన్ 9 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. నలుగురు లక్నో బౌలర్లు 40కి పైగా పరుగులు ఇవ్వగా... స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ 21 పరుగులే ఇవ్వడటం చివరకు ఫలితంపై ప్రభావం చూపించింది. అంతకుముందు మిచెల్ మార్ష్, మార్క్రమ్ బ్యాటింగ్‌తో 200 పరుగులు దాటిన లక్నో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. లక్నో: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి విజయం దక్కింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్నో 12 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, ఆయుష్ బదోని (19 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు. హార్దిక్ పాండ్యా (5/36) తన టి20 కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ధీర్ (24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. పంత్ విఫలం... లక్నోకు ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ శుభారంభం అందించారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే దీనిని ముంబై బృందం గుర్తించక అప్పీల్ చేయలేదు. దాంతో బతికిపోయిన మార్ష్ ఆ తర్వాత చెలరేగిపోయి బౌల్ట్ తర్వాతి ఓవర్లో 6, 4 కొట్టాడు. అనంతరం అశ్వని ఓవర్లో మార్ష్ వరుసగా 6, 4, 2, 2, 4, 4 బాదగా, వైడ్‌తో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 27 బంతుల్లో మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, పవర్‌ప్లేలో లక్నో 69 పరుగులు సాధించింది. ఎట్టకేలకు పుతూర్... మార్ష్‌ను వెనక్కి పంపించాడు. మార్ష్, మార్క్రమ్ తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ (12) ఎక్కువసేపు నిలబడలేకపోగా, రిషభ్ పంత్ (2) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ దశలో బదోని, మార్క్రమ్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. సాంట్నర్ ఓవర్లో బదోని వరుసగా 3 ఫోర్లు కొట్టగా, ఎట్టకేలకు 17వ ఓవర్లో మార్క్రమ్ అర్ధసెంచరీ (34 బంతుల్లో) పూర్తయింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 31 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో స్కోరు 200 దాటింది. సూర్య హాఫ్ సెంచరీ... ఛేదనలో ముంబై ఆరంభంలోనే జాక్స్ (5), రికెల్టన్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే నమన్, సూర్య భాగస్వామ్యంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా నమన్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4, 4 బాదాడు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రాఠీ బౌలింగ్‌లో నమన్ బౌల్డ్ కావడంతో 69 పరుగుల (35 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాతా జోరు సాగించిన సూర్య 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య అవుట్ కాగా...షాట్లు ఆడటంలో బాగా ఇబ్బంది పడిన తిలక్‌వర్మ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు) ‘రిటైర్డ్ అవుట్’గా తప్పుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎంతగా ప్రయత్నించినా ముంబైకి ఓటమి తప్పలేదు. 17వ, 18వ ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చినా... చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయడంలో ముంబై విఫలమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి అండ్ బి) పుతూర్ 60; మార్క్రమ్ (సి) బావా (బి) పాండ్యా 53; పూరన్ (సి) చహర్ (బి) పాండ్యా 12; పంత్ (సి) (సబ్) బాష్ (బి) పాండ్యా 2; బదోని (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; మిల్లర్ (సి) నమన్ (బి) పాండ్యా 27; సమద్ (సి) నమన్ (బి) బౌల్ట్ 4; శార్దుల్ (నాటౌట్) 5; ఆకాశ్‌దీప్ (సి) సాంట్నర్ (బి) పాండ్యా 0; అవేశ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–76, 2–91, 3–107, 4–158, 5–173, 6–182, 7–200, 8–200. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–1, దీపక్ చహర్ 2–0–23–0, అశ్వని కుమార్ 3–0–39–1, సాంట్నర్ 4–0–46–0, విఘ్నేశ్ పుతూర్ 4–0–31–1, హార్దిక్ పాండ్యా 4–0–36–5. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: జాక్స్ (సి) బిష్ణోయ్ (బి) ఆకాశ్‌దీప్ 5; రికెల్టన్ (సి) బిష్ణోయ్ (బి) శార్దుల్ 10; నమన్ ధీర్ (బి) రాఠీ 46; సూర్యకుమార్ (సి) సమద్ (బి) అవేశ్ 67; తిలక్‌వర్మ (రిటైర్డ్ అవుట్) 25; పాండ్యా (నాటౌట్) 28; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–11, 2–17, 3–86, 4–152, 5–180. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–40–1, ఆకాశ్‌దీప్ 4–0–46–1, అవేశ్ ఖాన్ 4–0–40–1, దిగ్వేశ్ రాఠీ 4–0–21–1, రవి బిష్ణోయ్ 4–0–40–0 రోహిత్ శర్మ దూరం ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ లక్నోతో మ్యాచ్‌లో ఆడలేదు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది. దాంతో అతను ఈ పోరు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ స్థానంలో రాజ్ బావాకు టీమ్ అవకాశం కల్పించింది. ఐపీఎల్లో నేడుచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్ X రాజస్తాన్‌వేదిక: ముల్లాన్‌పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

అవేష్ సూపర్ బౌలింగ్.. ఉత్కంఠపోరులో ముంబై ఓటమి
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్లో తొలి బంతినే హార్దిక్ పాండ్యా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత అవేష్ ఖాన్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆఖరి 5 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే అవేష్ ఇచ్చాడు.ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నమాన్ ధీర్(46) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖరిలో పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, దిగ్వేష్, శార్ధూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 5 వికెట్లతో చెలరేగగా.. విఘ్నేష్ పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.
బిజినెస్

ఈవీ ఇళ్లకు డిమాండ్.. ధరల పెరుగుదలా డబుల్!
ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ(రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్దస్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యువేషన్ అడ్వైజరీ హెడ్ ఏ.శంకర్ తెలిపారు.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవటమే అసలైన సవాల్. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్ ప్లేస్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది.

సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలు
అమెరికా విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని విభిన్న సెక్టార్లలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. అయితే భారతీయ తోలు(లెదర్) పరిశ్రమ యూఎస్‌కు తన ఎగుమతులను విస్తరించడానికి ఈ సుంకాలు ఎంతో అవకాశాన్ని కల్పించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో భారత్ 870 మిలియన్ డాలర్ల(సుమారు రూ.7,221 కోట్లు) విలువైన తోలు, తోలు ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇండియన్ లెదర్ వస్తువులకు అమెరికాలో ఉన్న మార్కెట్‌ను ఈ గణాంకాలు హైలైట్ చేస్తున్నాయి.ఈ విభాగంలో భారత్‌కు పోటీగా ఉన్న వియత్నాం, చైనా, కంబోడియా వంటి దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం ఈ అవకాశాన్ని ప్రేరేపించే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. భారత్‌పైనా యూఎస్ సుంకాలు ఉన్నప్పటికీ ఇక్కడి ఎగుమతులపై విధించిన సుంకాల కంటే కనీసం 20% అధిక సుంకాలను ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఇది భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, యూఎస్ మార్కెట్లో వారి పట్టును బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈఓ) మాజీ వైస్ ప్రెసిడెంట్, ఫరీదా గ్రూపు ఉన్నతాధికారి ఇస్రార్ అహ్మద్ మాట్టాడుతూ.. ‘తోలు పరిశ్రమ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారించాలి. తమ మార్కెట్ పరిధిని వైవిధ్యపరచుకోవడంపై ఆసక్తిగా ఉండాలి’ అన్నారు.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?పరిమిత సమయమే..?పోటీ దేశాలు అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన నిమ్మకుండిపోకుండా ఆ దేశంతో చర్చలు జరిపి తమ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో వృద్ధిని కొనసాగించడానికి ఈ టారిఫ్ ప్రయోజనం ఆరు నుంచి తొమ్మిది నెలలకు మించకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. భారతీయ తోలు పరిశ్రమ దాని బలమైన సరఫరా గొలుసును ఆసరాగా చేసుకుని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని చెబుతున్నారు.

అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం
ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతీకార చర్యలకు దిగడంతో అమెరికా మార్కెట్లు అల్లకల్లోలానికి గురయ్యాయి. 2020 తర్వాత భారీ పతనాన్ని చవిచూశాయి. ఎస్&పీ 500 సూచీ ఏకంగా 6 శాతం పడిపోయింది. ఇది మాంద్యం భయాలకు ఆజ్యం పోసింది. ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఆందోళనను తీవ్రతరం చేసింది.కోవిడ్-19 సంక్షోభం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటి పరిస్థితి తర్వాత వాల్ స్ట్రీట్ శుక్రవారం తీవ్ర తిరోగమనాన్ని ఎదుర్కొంది. ట్రంప్ టారిఫ్ పెంపునకు ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతులపై ప్రతీకార సుంకాలను ప్రకటించిడంతో ఎస్&పీ 500 సూచీ 6% పడిపోయింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన 2020 మార్చి తర్వాత ఎస్&పీ 500 సూచీ పనితీరుకు సంబంధించి అత్యంత చెత్త వారం ఇదే. ఇక డౌజోన్స్ 2,231 పాయింట్లు (5.5%) క్షీణించగా, నాస్డాక్ కూడా 5.8 శాతం పడిపోయింది.యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలు శుక్రవారం రికార్డు స్థాయిలో 26.79 బిలియన్ షేర్లను ట్రేడ్ చేశాయి. ఇది 2021 జనవరి 27 నాటి గరిష్ట స్థాయి 24.48 బిలియన్లను అధిగమించింది. నాస్డాక్ 962.82 పాయింట్లు క్షీణించి 15,587.79 వద్ద ముగిసింది. దాని డిసెంబర్ 16 నాటి రికార్డు ముగింపు గరిష్టం 20,173.89 నుండి 20 శాతానికి పైగా పడిపోయింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2,231.07 పాయింట్లు క్షీణించి 38,314.86 వద్దకు దిగజారింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఎస్&పీ 500 సూచీ 322.44 పాయింట్లు క్షీణించి 5,074.08 వద్దకు పడిపోయింది. 11 నెలల్లో ఇదే అత్యల్ప ముగింపు.అన్ని షేర్లకూ నష్టాలే..ఎస్&పీ 500 సూచీలో ఉన్న 500 కంపెనీల్లో 12 మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. ముడి చమురు ధర 2021 తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందనే ఆందోళనలతో ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలైన రాగి వంటి లోహాల ధరలు కూడా పడిపోయాయి.

ఆర్బీఐ గవర్నర్ సంతకంతో కొత్త నోట్లు
ముంబై: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం చేసిన మహాత్మాగాంధీ సిరీస్‌తో నూతన రూ.10, రూ.500 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా ప్రకటించింది. రూ.10, రూ.500 నోట్ల డిజైన్ గత సిరీస్ నోట్ల మాదిరే ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన రూ.10 నోట్లు అన్నీ చెల్లుతాయని పేర్కొంది. అలాగే, మహాత్మాగాంధీ చిత్రంలో గతంలో జారీ చేసిన రూ.500 నోట్ల చెల్లింపు కొనసాగుతుందని వెల్లడించింది. గవర్నర్ మల్హోత్రా సంతకం చేసిన కొత్త రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయనున్నట్టు ఆర్బీఐ గత నెలలో ప్రకటించడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ స్థానంలో మల్హోత్రా 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే.
ఫ్యామిలీ

నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్‌చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
నేటికి కూతురు అనంగానే భారంగానే భావిస్తున్నారు పలువురు. విద్యావంతులైన వాళ్లు సైతం ఇదేతీరులో ప్రవర్తించడం బాధకరం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతున్న 'ఆడపిల్ల' అనే వివక్ష విషయంలో మాత్రం మార్పు అంతంత మాత్రమే అనేది పలువురు సామజికవేత్తల వాదన. ఇలాంటి భావంతోనే ఓ తండ్రి నెలల పసికందు అని చూడకుండా కిటికిలోంచి విసిరేశాడు. సమయానికి పొరుగింటివాళ్లు స్పందించి కాపాడిన ఆ ప్రాణం..నేడు కనివినీ ఊహించని రీతిలో సంగీత విద్వాంసురాలిగా రాణించడమే కాదు రికార్డులు సృష్టిస్తోంది. ఆ అమ్మాయే నియాతి చెట్రాన్ష్. ఆమెకు కేవలం నెలల వయసులో ఆమె తండ్రి కర్కశంగా కూతురు కుటుంబానికి భారమని కిటికీలోంచి విసిరేశాడు. ఆ దుశ్చర్యకు ఆ చిన్నారి తల్లిప్రాణం తట్టుకోలేకపోయింది. తక్షణమే ఆ తల్లి కట్టుకున్న భర్తను వద్దనుకుని అన్నీతానై పెంచాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. తాను ఈ ప్రపంచం తీరు మార్చలేకపోవచ్చు కానీ తన కుమార్తెను మాత్రం కాపాడుకోగలను అనుకుంది. ఇక అలా ఆమె తన కూతురు నియాతికి అన్నీతానై ప్రేమగా పెంచుకుంటోంది. ఇక నియాతికి పెరిగేకొద్దీ సంగీతం పట్ల మక్కువ ఏర్పడటం మొదలైంది. ఆ ఇష్టమే ఆమెను జస్ట్ 12 ఏళ్లకే 42 వాయిద్యాలను వాయించే రేంజ్‌కి తీసుకొచ్చింది. ఆ ప్రతిభ ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా అనతి కాలంలోనే ఆమె పేరు, టాలెంట్ అందరికి తెలియడం మొదలైంది. దాంతో ఆ చిన్నారి తల్లి ఉద్యోగాన్ని వదిలి.. ఫ్రీలాన్స్ర్గా పనిచేస్తూ.. కుమార్తె అభిరుచిని కొనసాగించడంలో సహాయపడింది. ఆమె తల్లి ప్రోత్సహాంతో నియాతి జాతీయ అంతర్జాతీ సవేదికలపై ప్రదర్శనలు ఇస్తూ..రికార్డుల సృష్టించడం మొదలుపెట్టింది. అంతేగాదు కేవలం 65 సెకన్లలో 15 వాయిద్యాలపై మన జాతీయ గీతాన్ని వాయించి, ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించింది. ఇవేగాక 13 నిమిషాలకు పైగా కళ్ళకు గంతలు కట్టుకుని శివ తాండవమ్ను కూడా ప్రదర్శించింది.ఎలా ఈ రంగాన్ని ఎంచుకుందంటే..నియాతి ఆరునెలల వయసులో తల్లి ఇచ్చిన బొమ్మ కీబోర్డ్‌ను చాలా ఆసక్తికరంగా వాయించే ప్రయత్నం చేసేది. అంతేగాదు వంటగదిలోని పాత్రలను ఒక లయబద్ధంగా కొట్టేది. అలా ఐదేళ్లు వచ్చేసరికి లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో గ్రేడెడ్ పియానో పరీక్షలు రాసింది. ఉకులేలే, ఫ్లూట్, తబలా వంటి 16 విభిన్న వాయిద్యాలను వాయించడం నేర్చుకుంది. పైగా నియాతి తన తల్లే తనకు గొప్ప రోల్‌మోడల్ అని ఆమె అందించిన ప్రోత్సాహంతో పేరుప్రఖ్యాతలు తీసుకురావడం తన కర్తవ్యమని సగర్వంగా చెబుతోంది. నిశబ్దంగా ఉసురు తీయాలనుకున్న వారికి మనసుకు హత్తకునే మ్యూజిక్‌తో సమాధానమిస్తానంటోంది. (చదవండి: View this post on Instagram A post shared by The Better India (@thebetterindia)(చదవండి: రూ. 8 లక్షలు విలువ చేసే స్నాక్బ్రాండ్! ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..)

స్మార్ట్‌గా చెడగొడుతున్నాయ్..!
ఇప్పుడంతా గూగుల్ తల్లి మాయ.. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్తపుంతలు తొక్కుతున్న స్థితిలో మనం ఉన్నాం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా మన చేతిలో ఉంటోంది. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత వీటి ప్రభావానికిలోనై బానిసలవుతున్నారు. ఇప్పుడుగనుక తల్లిదండ్రులు మేల్కొనకపోతే భవిష్యత్‌లో పిల్లలు చెడుదారులు పట్టే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియోను ఓపెన్ చేస్తే చాలు ముందు వచ్చేది యాడ్స్. ఆ యాడ్స్ కూడా ఆశ్లీలంగా ఉంటాయి. ఆసక్తి కలిగించేలా థంబ్ నెయిల్ టైటిళ్లు ఉంటాయి. ఉదాహరణకు.. లవ్, ఫ్యాషన్, సెక్స్ గురించి మాట్లాడుకోవడం లేదా తెలుసుకోవడంలో తప్పేముంది. వెంటనే ఈ యాప్ డౌన్‌లోన్ చేసుకోండని ఒక యాడ్. మీకు గార్ల్ ఫ్రెండ్.. బాయ్‌ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా... ఒంటరిగా ఫీలవుతున్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.. ఇది మరో యాడ్. దారుణంగా థంబ్ నెయిల్యూట్యూబ్ వీడియోలో థంబ్ నెయిల్ టైటిల్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. వయస్సులో ఉన్నవాళ్లు ఈ వీడియోను ఒంటరిగా చూడండి. చిన్నపిల్లలకు దూరంగా ఉండి ఈ ఆడియోను వినండి. పెళ్లిలో శృంగారం పాత్ర ఎంటీ? ఇలా రకరకాలుగా పిల్లలను ఆకర్షించే విధంగా టైటిళ్లు పెడుతున్నారు. అవి చూసిన పిల్లలు తెలిసీ తెలియక ఈ వీడియో ఎంటి ఇలా ఉంది డాడీ అని ఒకరు. శృంగారం అంటే ఎంటీ మమ్మి ఒక పాప.. ఈ వీడియోలో చిన్న చిన్న బట్టలు వేసుకున్నారెంటమ్మా అని మరొకరి ప్రశ్న. ఇలా తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నా పిల్లల అల్లరిని తట్టుకోలేక స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. గతంలో వీడియో గేమ్స్‌కు ఎక్కువగా పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని గేమ్‌లు డౌన్‌లోన్ చేయడం లేదు. అయితే నేరుగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఓపెన్ చేసి వీడియో చూస్తుండు అని తల్లిదండ్రులు చెప్పి వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఆ వీడియో చూస్తూ ఉన్న సమయంలో మధ్య మధ్యలో ఆశ్లీల యాడ్స్ వస్తున్నాయి. వాటిని చూసిన పిల్లల ఆలోచనా సరళి మారిపోతోంది. యూట్యూబ్‌లో తల్లిదండ్రులు ఏ విధమైన వీడియో చూస్తున్నారో ఆ అంశాలకు అనుగుణంగానే ఆ తర్వాత వచ్చే వీడియోలు డిస్ప్లే అవుతుంటాయి. తండ్రి లేక తల్లి ఎలాంటి వీడియో చూస్తున్నారో అదే ఫోన్ పిల్లలు చూస్తుంటే అలాంటివే తిరిగి మీకు ముందుగా ఓపెన్ అవుతుంటాయి. యూట్యూబ్‌లోనే స్క్రోలింగ్ వీడియో చూసి ఏ వీడియోకి అయితే లైక్ కొడతామో అలాంటి రిలేటెడ్ వీడియోలే తిరిగి వస్తుంటాయి. ఇలా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు వస్తున్నాయి. తల్లిదండ్రులు తమ ఫోన్ పిల్లలకు ఇస్తున్నారంటే మీరు ఎలాంటి వీడియో చూస్తున్నారో వారికి కూడా అర్థమవుతుంది. వాటినే పిల్లలు చూసేలా మీరే పరోక్షంగా కారణం అవుతున్నారు. గమనించకపోతే అంతే సంగతులు.. ఇది ఇలా ఉంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హోమ్ వర్క్ ఇస్తున్నారు. ఇంటి వద్ద వర్క్ చేసేటప్పుడు అర్థం కాకపోతే తల్లిదండ్రులను అడగండి లేదా రేపు స్కూల్‌కు వచ్చిన తర్వాత ఆ వర్క్ చేయండని ఉపాధ్యాయులు చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయులు ఆ ప్రశ్న అర్థం కాకపోతే గూగుల్‌లో కొట్టండి లేదా యుట్యూబ్లో చూడండని చెప్తున్నారు. ఇళ్లకు వచ్చిన పిల్లలు మా సార్ ఫోన్లో చూసి ఈ లెక్కలు చేయమన్నాడని తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఇక ఫోన్ వాళ్ల చేతికి పోతుంది. ఆ విద్యార్థి లెక్కలు చేస్తున్నాడా... ఇకేమైనా చూస్తున్నాడా అనేది ఆ తల్లిదండ్రులకు అర్థం కాదు. ఇలా ఓ తండ్రి కుమారుడికి ఫోన్ ఇస్తే లెక్కలకు బదులు ఏమి చూస్తున్నాడో గమనించాడు. తరువాత ఉపాధ్యాయుని వద్దకు వెళ్లి మీరు పిల్లలకు ఫోన్లు చూసి వర్క్ చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. కానీ ఇలా అందరు పేరెంట్స్ అడగలేరు కదా. స్మార్ట్ ఫోన్లతో నష్టమే.. స్మార్ట్ ఫోన్లతో ఎంత మేలు ఉందో... అంతే చెడు కూడా ఉందని మానసిక వైద్య నిపుణులు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఫోన్లు లేని విద్యార్థులు ఉండడం లేదు. పదో తరగతికి వచ్చారంటే ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్మీడియట్ చదివే పిల్లలను కాలేజీలకు ఫోన్లు తీసుకురావద్దన్నా వినడం లేదు. కందుకూరులోని కళాశాల సంక్షేమ హాస్టళ్లలోని అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఈ ఫోన్ల వల్ల ఏ విద్యార్థి కూడా సమయానికి నిద్ర పోవడం లేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు ఓపెన్ చేసి చూస్తుంటే ఎప్పుడు ఆపుతారో కూడా తెలియని పరిస్థితి. దీని వల్లనే గాఢ నిద్ర లేక మానసికంగా యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రీడా మైదానాల్లో ఉండాల్సిన విద్యార్థులు ఫోన్లు పట్టుకొని చెట్ల కింద, రూమ్‌లలో ఉండిపోతున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల అవసరం ఉన్నప్పటికీ.. వాటి వినియోగంలో పరిపక్వతను, విజ్ఞతను పాటించాల్సిన అవసరం ఉంది. సామాజిక మధ్యమాలు, మొబైల్ గేమ్స్‌కు బదులు పిల్లలు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నారని మీ ఫోన్ పిల్లలకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ పి.పాపారావు, ఆల్ ఇండియా సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్మార్ట్ఫోన్లతో అనర్థాలు స్మార్ట్ఫోన్ల వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కళాశాలల్లో ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడే విద్యార్థులు కూడా వేల రూపాయల మొబైల్స్ వాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్ తరగతులు ఉంటాయి. కానీ ఎంత వరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. అది కాస్తా వీరే కార్యకలాపాలకు దారి తీస్తున్నాయి. కళాశాలలకు ఫోన్లు తీసుకురావడం నిషేధించేందుకు ప్రయత్నించాలి. – డాక్టర్ ఎం.రవికుమార్, టీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (చదవండి: రూ. 8 లక్షలు కోట్లు విలువ చేసే స్నాక్బ్రాండ్..! ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..)

88 ఏళ్ల నాటి స్నాక్ బ్రాండ్..ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..!
సరదాగా సాయంత్రం కాసిన్న వేరుశెనగపప్పులో, మరమరాలు తింటుంటే ఆ మజానే వేరు. అందులోనూ మన భారతీయులకు చిరుతిండి అంటే మహా ఇష్టం. ఎన్ని చిరుతిండి బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చినా..తన హవా చాటుతూ దూసుకుపోతున్న బ్రాండ్ ఏదంటే..ఠక్కున చెప్పేది హల్దిరామ్. నిన్న మొన్నటిది కాదు..ఏకంగా 88 ఏళ్ల నుంచి అశేష ప్రజల ఆధరణతో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించుకున్న స్నాక్ ఐటెం ఇది. మార్కెట్లో దీని టర్నోవర్ వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం. అలాంటి మన భారతీయ చిరుతిండి పెట్టుబడిదారుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే..విస్తుపోతారు. నిజమేనా అని నోరెళ్ల బెడతారు. అంతలా అందరి మనసును దోచుకున్న ఈ చిరుతిండి కథకమామీషు ఏంటో చూద్దామా..!.ప్రసిద్ధి చెందిన ఐకానిక్ స్నాకింగ్ బ్రాండ్లలో ఒకటిగా పేరుగాంచింది హల్దిరామ్ భుజియా చిరుతిండి. ప్రస్తుతం ఈ బ్రాండ్ దాదాపు వంద రకాల స్నాక్‌లను అందిస్తోంది. అందరూ మెచ్చిన రకం చిరుతిండి మాత్రం హల్దిరామ్ భుజియానే. దీనికి భారతదేశం అంతటానే గాదు విదేశాల్లో సైతం ఐకానిక్ బ్రాండ్‌గా ఉంది. ఈ బ్రాండ్ యజమాని తన అత్త నుంచి ఈ భుజియా రెసిపీని తెలుసుకున్నాడట. అయితే ప్రజాదరణ పొందడం కోస అత్త ట్రిక్ని ఉపయోగించేవాడట. దీనికి ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఆల్ఫా వేవ్‌లో రూ. 5600 కోట్ల వాటా ఉంది. అంతేగాదు దీనికి టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ పెట్టుబడిదారుడిగా మారడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ హల్దిరామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదండోయ్ ఈ విషయాన్ని స్వయంగా హల్దిరామ్ బ్రాండ్ ప్రతినిధే ఖరారు చేశారు. ప్రస్తుతం ఈబ్రాండ్ స్వీట్లు వంటి వాటిని కూడా అందించడంతో దీని విలువ ఏకంగా రూ. 8 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా. మొదలైందిలా..మెగాబ్రాండ్గా అవతరించిన ఈ హల్దీరామ్ ప్రస్థానం 1937లో జరిగింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఒక చిన్న స్వీట్లు, స్నాక్స్ దుకాణంగా ప్రారంభమైంది. ఆ దుకాణం యజమాని గంగా బిషన్ అగర్వాల్‌ని చుట్టపక్కల వాళ్లు ఆప్యాయంగా హల్దిరామ్ జీ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయనే ఈ హల్దిరామ్ బ్రాండ్ వ్యవస్థాపకుడు. ఆ తర్వాత కోలకతా, నాగపూర్, ఢిల్లీకి విస్తరించి..ఘన విజయాన్ని అందుకుంది. ఆబ్రాండ్ వ్యవస్థాపకుడు గగన్ బిషన్ అగర్వాల్ దూరదృష్టి, అంకితభావం, కృషిల కారణంగా చిరుతిండి సామ్రాజ్యంలో రాణిగా పేరుతెచ్చుకుంది. 1980ల ప్రాంతంలో హల్దిరామ్ పెద్ద మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు సాంప్రదాయ వంటకాలకు ఆధునిక తయారీ పద్ధతులను జోడించి రుచికరంగా తయారుచేయడంతో ఈబ్రాండ్ అతడి ఇంటి పేరుగా మారిపోయింది. ఇది పాపడ్లు నుంచి రెడీ టు ఈట్ మీల్స్, నామ్కీన్ల వరకు మార్కెట్లలో తన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించిన తర్వాత భారత్ తోపాటు విదేశాలలో కూడా గణనీయమైన ఉనికిని సంపాదించగలిగింది. అలాగే ఔత్సాహిక వ్యవస్థాపకులుకు ఓవ్యాపారాన్ని కాలనుగుణ మార్పులతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చాటిచెప్పి..స్ఫూర్తిగా నిలిచాడు.(చదవండి: సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?)

ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్‌ల ట్రెండ్‌నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్ డే రోజున డైమండ్ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్(ట్విటర్)లో షేర్ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించు కోవడం విశేషం.
ఫొటోలు


‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన ‘రెబా మోనికా జాన్’ (ఫొటోలు)


రష్మిక మందన్నా పుట్టినరోజు స్పెషల్.. ఎన్నో బర్త్డేనో తెలుసా (ఫోటోలు)


వేములవాడ ఆలయంలో వివాహం చేసుకున్న ట్రాన్స్ జెండర్స్, హిజ్రాలు (ఫొటోలు)


అదిరే టాటు..విశాఖకు వచ్చిన అమెరికన్లు (ఫొటోలు)


గ్రాండ్ ‘మ్యాడ్ స్క్వేర్’మూవీ సక్సెస్ మీట్..అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ఫొటోలు)


దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ ఫోటో షూట్.. (ఫోటోలు)


చైత్ర నవరాత్రి: పోచమ్మతల్లిని దర్శించుకున్న సమంత బెస్ట్ ఫ్రెండ్ (ఫోటోలు)


సిల్క్ చీరలో బెంగాలీ బ్యూటీలా అనసూయ (ఫొటోలు)


బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సురేఖావాణి కూతురు సుప్రీత..నెక్స్ట్ లెవల్ ఫోటోస్


కుమారుడితో సానియా మీర్జా.. కొత్త భార్యతో షోయబ్ మాలిక్ సెలబ్రేషన్స్ చూశారా? (ఫొటోలు)
అంతర్జాతీయం

ఇదిగో ‘ట్రంప్’కార్డు
వాషింగ్టన్: అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు తాలూకు కొత్త లుక్కును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. గురువారం ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ప్రయాణిస్తూ దాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇదేమిటో తెలుసా? గోల్డ్ కార్డు. ట్రంప్ కార్డు. ఐదు మిలియన్ డాలర్లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్‌కార్డు తొలి కొనుగోలుదారు ఎవరని మీడియా ప్రశ్నించగా, ‘నేనే’నంటూ అధ్యక్షుడు బదులిచ్చారు. కొత్త కార్డును రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ట్రంప్కార్డును పేరుకు తగ్గట్టే బంగారు రంగులో రూపొందించారు. కార్డులో ఎడమవైపు దాదాపుగా సగం మేరకు ట్రంప్ ఫొటో ఆక్రమించింది. ఆ పక్కనే చుట్టూ చుక్కల నడుమ ‘ద ట్రంప్ కార్డ్’ అని రాసుంది. కింద ట్రంప్ సంతకం, 5,000,000 సంఖ్య ఉన్నాయి. కార్డు విలువ 50 లక్షల డాలర్లని చెప్పేలా ఎడమవైపున పైన, కింద 5ఎం అని రాసుంది. విదేశీ సంపన్నులకు అమెరికాలో శాశ్వత నివాసానికి, అంతిమంగా పౌరసత్వానికి వీలు కల్పించేలా ఈ గోల్డ్‌కార్డును రూపొందించడం తెలిసిందే. ఈబీ–5 వీసా స్థానంలో కొద్దివారాల క్రితమే దాన్ని తీసుకొచ్చారు. ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి గోల్డ్ కార్డులు అమ్ముడైనట్టు అమెరికా ప్రకటించింది కూడా. తర్వాత దాని పేరును ట్రంప్ కార్డుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ల కోరిక మేరకే ఈ మార్పు చేసినట్టు ట్రంప్ చెప్పుకున్నారు.

చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: తమ దిగుమతులపై 34 శాతం టారిఫ్ విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వారు తప్పు చేశారంటూనే దాన్ని చైనా అమలు చేయలేదన్నారు. ఇంకా చైనా భయపడిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో చైనా విధించిన టారిఫ్ ల పై స్పందించారు ట్రంప్ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూఎస్ వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు చైనా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత చైనా ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనా వస్తువులపై అదనంగా 34 శాతం సుంకాలను అమెరికా విధించిన నేపథ్యంలో.. చైనా కూడా ప్రతీకార చర్యల్లో భాగంగా అంతే శాతాన్ని అమెరికా వస్తువులపై విధిస్తున్నట్లు ప్రకటించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల్గిన దేశాల మధ్య టారిఫ్ వార్..!చైనా నుంచి దిగుమతులపై అదనంగా విధించిన అదే 34 శాతం పన్నును ప్రస్తుతం చైనా.. తిరిగి అమెరికాపై సుంకాలుగా ప్రకటించడంతో ఇది చర్చకు దారి తీసింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కల్గిన ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణానికి దారితీసినట్లయ్యింది. అమెరికా, చైనాలు ఎవరికి వారే వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది టారిఫ్ లకే పరిమితం అవుతుందా.. లేక విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందా అనేది ప్రజల్లో తలెత్తున్న ప్రశ్న. అమెరికా విధిస్తున్న సుంకాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
బ్యాంకాక్: భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ.. ఆ తరహా వ్యాఖ్యలు మంచిది కాదంటూ సుతిమెత్తగా మందలించారు.‘భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాకు తెలిపారు.‘ ప్రజాస్వామ్యయుత, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారంతో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించిందని ప్రధాని మోదీ చెప్పినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో ఇరు దేశాలు ముందుకు సాగాలని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఇటువంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు అనవరసమని మోదీ సూచించారన్నారు. అక్రమంగా బోర్డర్లు దాటడం వంటి ఘటనలకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని, ప్రత్యేకంగా రాత్రి పూట బోర్డర్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందని మహ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేశారు మోదీ. బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లా చీప్ అడ్వైజర్ ను అడిగినట్లు మిస్రి పేర్కొన్నారు. ప్రధానంగా బంగ్లాలో ఉన్న మైనార్టీల రక్షణ గురించి, వారి హక్కుల గురించి ప్రధాని ఆరా తీశారన్నారు.భారత్ గురించి బంగ్లా చీఫ్ అడ్వైజర్ ఏమన్నారంటే.. చైనా పర్యటన సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. చైనాకు ఇది ఒక సువర్ణావకమన్నారు. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్ లో పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకోగా, దీనికి తాజాగా ప్రధాని మోదీ కౌంటర్ తో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.

ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ
బ్యాంకాక్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus)తో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు(BIMSTEC Summit) ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు.ఈ భేటీ సారాంశాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలియజేశారు. భేటీలో.. సుస్థిర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు. వాస్తవిక దృక్పథంతో సాగే సానుకూల, నిర్మాణాత్మక బంధాన్ని న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోందని యూనస్‌కు వెల్లడించారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు’’ అని మిస్రి వివరించారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనను యూనస్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తాజా భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉన్నారు.Profsssor Muhammad Yunus is presenting a photo to Prime Minister Narendra Modi during their bilateral meeting in Bangkok on Friday. The photo is about Prime Minister Narendra Modi presenting a gold medal to Professor Yunus at the 102nd Indian Science Congress on January 3, 2015 pic.twitter.com/lsikvMOWT4— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) April 4, 2025ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్ భారత ప్రధాని మోదీకి ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుగా బహూకరించారు. 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని ప్రొఫెసర్ యూనస్ అందుకొన్నారు. ఈ ఫొటోను తాజాగా ఆయన ప్రధానికి అందజేశారు... గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ సారథ్య బాధ్యతలు స్వీకరించారు యూనస్. అప్పటి నుంచి ఈ ఇరు దేశాల నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యలో ఈ ఇరువురి భేటీ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఇరు దేశాల మధ్య కొనసాగిన విమర్శల కారణంగా అది ఫలించలేదు. అయితే బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని స్వయంగా ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో బిమ్స్టెక్లో ఈ ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా యూనస్ నాలుగు రోజుల పర్యటన, ఆ పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటిని దరిమిలా ఈ ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.దేశవ్యాప్త ఆందోళనలతో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి.. భారత్‌కు ఆశ్రయం కింద వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయగా.. అది పూర్తిగా తమ దేశ వ్యవహారమంటూ బంగ్లాదేశ్ నొక్కి చెప్పింది. మరోవైపు.. చైనా పర్యటనలో యూనస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మండిపడగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది.
జాతీయం

‘ఎలక్టోరల్ బాండ్ల’ తీర్పుపై సమీక్షకు సుప్రీం నో
న్యూఢిల్లీ: 2018నాటి ఎలక్టోరల్ బాండ్ పథకం ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న రూ.16,518 కోట్లను జప్తు చేయాలన్న పిటిషన్లను తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఖేమ్ సింగ్ భాటి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన పెండింగ్ పిటిషన్లను సైతం తిరస్కరిస్తూ మార్చి 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం తెల్సిందే. ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు సారథ్యంలో విచారణ జరపాలని, ఆ నిధులను జప్తు చేయాలంటూ గతేడాది ఆగస్ట్‌లో భాటి సహా పలువురు వేసిన పిటిషన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి.

దళితులు, గిరిజనుల కోసం సబ్ ప్లాన్ తెచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ: దళితులు, గిరిజనుల కోసం గత యూపీఏ ప్రభుత్వం సబ్ ప్లాన్ తీసుకొచ్చిందని, దీని వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా వర్గాలకు తగిన ప్రయోజనాలు లభిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం దళిత, గిరిజనుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రముఖులను కలిసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్ ) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారితో కలిసిన చిత్రాన్ని రాహుల్ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇటీవల నేను దళిత, గిరిజన వర్గాలకు చెందిన పరిశోధకులు, సామాజిక కార్యకర్తలను కలిశాను. కేంద్ర బడ్జెట్లో కొంత భాగాన్ని దళితులు, గిరిజనులకు అందించేలా జాతీయ చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి చట్టం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలులో ఉంది. ఈ వర్గాలకు అక్కడ నిర్దిష్ట ప్రయోజనాలు లభించాయి. యూపీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దళితులు, ఆదివాసీల కోసం ‘సబ్ ప్లాన్‘తీసుకొచి్చంది. కానీ మోదీ ప్రభుత్వ హయాంలో ఇది బలహీనపడింది. బడ్జెట్లో చాలా తక్కువ భాగం ఈ వర్గాలకు చేరుతోంది. వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అనే అంశంపై ఇప్పుడు మనం ఆలోచించాలి. దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పథకాలకు బడ్జెట్లో న్యాయమైన వాటాను నిర్ధారించే జాతీయ చట్టం మనకు అవసరం’అని రాహుల్ పేర్కొన్నారు.

పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వక్ఫ్(సవరణ) బిల్లును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో శుక్రవారం దుమారం రేగింది. ఈ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగంపై దాడేనని, బిల్లును లోక్‌సభలో బుల్డోజ్ చేశారు అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ... సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్ట్టకరం, సభ గౌరవానికి విరుద్ధం అని పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా టారిఫ్‌లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత స్పీకర్ తన ముగింపు వ్యాఖ్యలను చదివారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో 173 మంది, కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో 169 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు ఆమోదించినట్లు, సభ ఉత్పాదకత 118 శాతానికి పెరిగినట్లు ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో రెండో సుదీర్ఘ భేటీ ఈ సెషన్లో రాజ్యసభ మొత్తంగా 119 గంటలపాటు పని చేసిందని, ఉత్పాదకత 119 శాతానికి పెరిగిందని ఎగువ సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. సభలో రికార్డు స్థాయిలో 49 మంది సభ్యులు ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారని వివరించారు. వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ గురువారం ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు విరామం లేకుండా సుదీర్ఘంగా సమావేశమైందని, ఇదొక రికార్డు అని అన్నారు. పార్లమెంటరీ రికార్డుల ప్రకారం.. రాజ్యసభలో ఇది రెండో సుదీర్ఘ భేటీ. మొదటి సుదీర్ఘ భేటీ 1981 సెప్టెంబర్ 18న జరిగింది. అప్పట్లోసభ మరుసటి రోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కొనసాగింది. అత్యవసర సేవల నిర్వహణ బిల్లు–1981పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉండగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ధ్రువీకరిస్తూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ఆమోదించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. మణిపూర్‌లో ఘర్షణకు తెరదించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన తెగల మధ్య సమావేశం త్వరలో జరగబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందన్నారు.

ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ద్వారకకు పాదయాత్ర చేపట్టారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన అనంత్ తన 30వ పుట్టినరోజును దేశంలోని పవిత్ర నగరాల్లో ఒకటైన ద్వారకలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి కాలినడకన చేరుకోనున్నారు. తమ పూర్వీకుల స్వస్థలమైన గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు 170 కి.మీ. మేర ఆయన పాదయాత్రగా వెళ్తున్నారు. మార్చి 29న అనంత్ పాదయాత్రను ప్రారంభించారు. రోజూ 20 కి.మీ. మేర 7 గంటల పాటు నడక సాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజుకు ముందు అనంత్ ద్వారకకు చేరుకుని ద్వారకాదీశుడి ఆశీస్సులు అందుకుంటారు. ఈ పాదయాత్రలో పలువురు ఆయనకు సంఘీభావంగా కొంతదూరం పాటు నడిచారు. ఈ సందర్భంగా కొంతమంది ద్వారకాదీశుడి చిత్రాలను అనంత్‌కు బహూకరించారు. అనంత్ పాదయాత్ర పొడవునా హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రం పఠిస్తూనే ఉన్నారు. కుషింగ్ సిండ్రోమ్ అనే అరుదైన హార్మోన్ల రుగ్మత, స్థూలకాయం, ఉబ్బసం తదితరాలతో బాధపడుతున్నా.. 170 కి. మీ. దూరం నడుస్తుండటం విశేషంగా నిలిచింది. సనాతన భక్తుడైన అనంత్.. బద్రీనాథ్, కేదార్నాథ్, కామాఖ్య, నాథ్‌ద్వారా, కాళీ ఘాట్ వంటి ప్రఖ్యాత ఆధ్మాత్మిక క్షేత్రాలను తరచూ సందర్శిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వన్‌తారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని కూడా అనంత్ అంబానీ నిర్మించడం తెలిసిందే. ప్రధాని మోదీ దాన్ని ఇటీవలే ప్రారంభించారు.
ఎన్ఆర్ఐ

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య
యశవంతపుర: కుటుంబ కలహాలకు ఓ కుటుంబమే కడతేరింది. ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలబురగి పట్టణం జీవర్గి రోడ్డులోని కెహెచ్బీకాలనీ అపార్ట్మెంట్లో బుధవారం జరిగింది. సంతోష్ కోరళ్లి(45) అనే వ్యక్తికి బీదర్‌కు చెందిన శృతి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈయన జెస్కాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మునిశ్(9), మూడు నెలల అనిశ్ అనే సంతానం ఉన్నారు. శృతి పుట్టింటికి వెళ్లే విషయంలో బుధవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్నిసంతోష్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా తనను పుట్టింటికి పంపకపోతే చావో రేవో తేల్చుకుంటానని శృతి పేర్కొంది. విచక్షణ కోల్పోయి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలబురగి నగర కమిషనర్ డాక్టర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు. మానసిక సమస్యలతో సంతోష్ ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కలబురగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు.

‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’
కరీంనగర్: వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఎవరికి ఆపద వచ్చినా సహకరించుకుంటారు.. సుఖదుఃఖాలనూ పంచుకుంటారు.. చివరకు మరణంలోనూ ఇద్దరూ కలిసే వెళ్లారు.. హృదయం ద్రవింపజేసిన ఈ ఘటన రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో మహమ్మద్ గౌస్(34), షేక్ ఇమ్రాన్(28) దుర్మరణం చెందారు. ఎస్సై శ్రావణ్‌కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రామగుండానికి చెందిన మహమ్మద్‌గౌస్ ఎన్టీపీసీలో జీమ్ ట్రైనర్. విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో వీసా దరఖాస్తు చేసేందుకు తన ఇంటిసమీపంలో ఉండే స్నేహితుడు, కారు డ్రైవర్ షేక్ ఇమ్రాన్‌తో కలిసి బంధువుల కారులో గురువారం ఉదయం హైదారాబాద్ వెళ్లారు. అక్కడ పనులు పూర్తిచేకుని రాత్రివేళ బయలు దేరారు. శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ చేరుకున్నారు. ఇక్కడి రాజీవ్ రాహదారిపై ఆగిఉన్న లారీని అదుపుతప్పి వెనకాల ఢీకొన్నారు. తీవ్రగాయాలైన ఇమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్గౌస్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మహమ్మద్ గౌస్ కారు నడుపుతుండగా ఇమ్రాన్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఆగిఉన్న లారీని ఢీకొట్టగా రెండు బెలూన్స్ తెరుకున్నాయి. అయినా, ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. గౌస్‌కు భార్య, పాప(4), బాబు(1.5) ఉన్నారు. ఇమ్రాన్‌కు ఇంకా పెళ్లికాలేదు. ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’ రామగుండం: ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు అవసరమైన వీసా పనిపూర్తయ్యింది.. నాలుగైదు రోజుల్లో వీసా వస్తుంది..’ అని తన తండ్రి పాషాతో ఫోన్లో మాట్లాడిన మహ్మద్ గౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహ్మద్ గౌస్ ఉరఫ్ నిసార్ బాడీబిల్డర్. స్థానికంగా పలు వ్యాపారాలు నిర్వహించినా నష్టాలు వచ్చాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ కారులో వెళ్లి వీసాకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసుకుని తండ్రి పాషాతో మాట్లాడారు. అంతలోనే సుల్తానాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే ప్రమాదంలో చనిపోయిన ఇమ్రాన్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల్లో నలుగురు స్నేహితులు.. పట్టణానికి చెందిన ఎండీ గౌస్, ఇమ్రాన్, షేక్ అఫ్సరొద్దీన్, సయ్యద్ ఇమ్రాన్ నలుగురూ మంచి స్నేహితులు. వీరిలో సయ్యద్ ఇమ్రాన్ గతేడాది అక్టోబర్ 8న అంతర్గాం గోదావరి నది ఒడ్డున స్నేహితులతో కలిసి విందు చేసుకునే క్రమంలో ప్రమాదవాశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. అదే ఏడాది డిసెంబర్ 24న షేఖ్ అఫ్సరొద్దీన్ ద్విచక్ర వాహనంపై రామగుండం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కరీంనగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నలుగురు మంచిస్నేహింతులు నా లుగు నెలల్లోనే కానరానికి లోకాలకు వెళ్లడం వారి కుటుంబాన్ని తీరని విషదం నింపినట్లయ్యింది. అంత్యక్రియలకు హాజరు రామగుండం: మృతుల అంత్యక్రియలు శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. వీటికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ హాజరయ్యారు. మృతుల కుటుంబీకులను పరామర్శించారు.

క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు
మేడ్చల్‌రూరల్: క్రికెట్ ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్‌ఈసీ కళాశాలతో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కళాశాల ఆవరణలోని గ్రౌండ్‌కు వెళ్లాడు. ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ గుండపోటు రావడంతో ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. తోటి విద్యార్థులు అతడిని సమీపంలోని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు వినయ్ ఖమ్మం జిల్లాకు చెందిన పేద విద్యార్థి .. తల్లిదండ్రులు రోజు కూలీ చేస్తూ తమ కుమారుడిని ఉన్నత చదువు చదివిస్తున్నట్లు తెలిసింది.

తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
అన్నానగర్: తల్లికి బదులు పరీక్షకు హాజరైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా గత 28వ తేదీ నుంచి 10వ తరగతి సాధారణ పరీక్ష జరుగుతోంది. నాగై వెలిప్పాలయం లోని నటరాజన్–దమయంతి పాఠశాలలో బుధవారం ఉదయం ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభం కాగానే ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందజేసి సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళ ముఖానికి మాస్క్ ధరించి ప్రత్యేకంగా కనిపించింది.అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ మాస్క్ తీయమని మహిళను అడిగాడు. అనంతరం అడ్మిట్ కార్డును పరిశీలించారు. ఆ సమయంలో అడ్మిట్ కార్డు పై పరీక్ష రాస్తున్న మహిళ ఫొటోను చూశారు. అయితే పరీక్ష గది ఇన్విజిలేటర్ వద్ద ఉన్న హాజరు రిజిస్టర్ లో వేరే వ్యక్తి ఫొటో ఉంది. ఇన్విజిలేటర్‌కు మహిళను పరీక్ష కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుబాషిణి, జిల్లా విద్యాశాఖాధికారి (స్పెషల్ ఎగ్జామినేషన్) ముత్తుచ్చామి, పరీక్షల నియంత్రణ సహాయ సంచాలకులకు సమాచారం అందించారు.ఈ సమాచారం మేరకు విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరీక్ష కేంద్రం వద్ద ఉన్న పోలీసులు వెళ్లి మహిళను విచారించారు. విచారణలో ఆమె నాగై వెలిప్పాలయానికి చెందిన సెల్వాంబికై (25) అని తేలింది. ఈమెకి పెళ్లి అయ్యిందని, తల్లి సుగంతి కోసం మాస్క్ వేసుకొని హాజరైనట్లు తెలిసింది. అదేవిధంగా 28న మాస్క్ ధరించి తమిళ సబ్జెక్ట్ పరీక్ష రాసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెని అరెస్టు చేశారు.
వీడియోలు


మేడ్చల్ సీఎంఆర్ కళాశాలలో విషాదం


KSR Live Show: ముస్లింలను మోసం చేసి.. షర్మిలతో డైవర్షన్ పాలిటిక్స్


కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం


శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల వీరంగం


బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్


కూటమి అరాచక పాలన.. దళిత ఎమ్మెల్యేపై నమ్మకం లేదు!


అధికారంలో ఉన్నా లేకున్నా జగన్ నామ స్మరణ


పరిటాల సునీత వ్యాఖ్యలను ఖండించిన మద్దెలచెర్వు సూరీ సతీమణి


ముస్లింలకు వెన్నుపోటు.. టీడీపీకి రాజీనామాలు


చంద్రబాబు కోసమే నీ ప్రెస్ మీట్ లు.. షర్మిలకు కౌంటర్