Guntur
-
పాఠశాల విద్యను కాపాడాలి
గుంటూరు వెస్ట్: పాఠశాల విద్యను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో డీఆర్వో షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12న విద్యా వ్యవస్థపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంచాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థి నిష్పత్తి 1:20 మాత్రమే ఉండాలని కోరారు. అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని విన్నవించారు. పదోన్నతులు, బదిలీలు వేర్వేరుగా నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్ హైస్కూల్స్‌లోని పోస్టులన్నీ అప్‌గ్రేడ్ చేసి టీచర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రజల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా కార్యదర్శులు ఎం.గోవిందు, కె.రంగారావు, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు. -
రెండు ఎకరాలు కొన్నా !
నాకు నాలుగు పశువులు ఉన్నాయి. వాటికి పచ్చి గడ్డి కొరతగా ఉండటంతో తెనాలి ప్రాంతం నుంచి గడ్డిని కొనుగోలు చేశా. రవాణా ఖర్చులతో కలిపి రూ. 23 వేల వరకు అయింది. ఏడాదికి సరిపోతుంది. ధర ఎక్కువైనా కొనుగోలు చేయక తప్పలేదు. –చిట్టా హనుమంతురెడ్డి, రేపూడి ప్రభుత్వమే సరఫరా చేయాలి పశువులకు మేత చాలా ఇబ్బందిగా ఉంది. గత సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా గడ్డి ధరలు ఆకాశాన్ని అంటాయి. మొదట్లో రెండు వేలు హెచ్చుగా ఉండి తరువాత కొద్దిగా ధర తగ్గింది. ప్రభుత్వం స్పందించి రైతులకు తక్కువ ధరకు అందజేయాలి. – బద్దూరి బలరామిరెడ్డి, రేపూడి ● -
నేటి నుంచి మిర్చి యార్డుకు వేసవి సెలవులు
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు మిర్చి ఎగుమతి, దిగుమతి, కొట్ల కార్మిక సంఘం, మిర్చి యార్డు కాపలా వర్కర్స్ యూనియన్, ది గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజంట్స్ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు ప్రస్తుత వేసవి సీజన్లో శనివారం నుంచి జూన్ 8వ తేదీ వరకు మిర్చి యార్డుకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డులో క్రయ విక్రయాలు జరపబడవన్నారు. జూన్ 9వ తేదీ నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో మిర్చి రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావద్దని సూచించారు. జూన్ 8వ తేదీ అర్ధ రాత్రి నుంచి రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావచ్చని ఆమె తెలిపారు. ముగిసిన సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ఆర్థో, ఈఎన్టీ తదితర విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు. ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారి ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. ఫైనల్ మెరిట్లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే గుంటూరు వైద్య కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వివరాలకు గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. సైనికుల కోసం ప్రత్యేక ప్రార్థనలు గుంటూరు మెడికల్: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట శివాలయంలో, జీ.టీ.రోడ్‌లోని మస్తానయ్య దర్గాలో, గన్హాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశానికి విజయం సిద్ధించాలని.. వీరమరణం పొందిన సైనికుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణ, నాయకులు సురేష్ కుమార్ జైన్, షేక్ రఫీ, మలిశెట్టి పవన్ కుమార్, రామకృష్ణ, పోకల పురుషోత్తం, శ్రీనివాస్, దేసు సత్యనారాయణ, దేవిశెట్టి బాబు రావు, మైలవరపు ప్రవీణ్, శనక్కాయల శివ, రామ హైమావతి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ట్రాఫిక్ నిలిచిపోయింది. కనకదుర్గ వారధిపై భారీలోడ్తో వెళుతున్న లారీ టైర్లు పగిలిపోయాయి. మార్చడానికి గంట పట్టడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఎండ వేడిమి తట్టుకోలేక పలువురు వాహనాలను వెనక్కు మరలించి వెళ్లిపోయారు. ట్రాఫిక్ పోలీసులు లారీ వద్దకు వెళ్లి టైర్లు మార్చేందుకు సహకరించారు. గంట అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వాహనాలు పూర్తిగా కదలడానికి మరో గంట పైగా పట్టింది. -
వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది
మంగళగిరి టౌన్: కూటమి నాయకుల్ని మెప్పించేందుకే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా ? అంటూ వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కల్పన, సోషల్ మీడియా యాక్టివిటీ కర్రి విజయ భాస్కర్, మహిళా కార్యకర్త కర్రి మహాలక్ష్మి, ఆమె కుమారుడు నిఖిల్‌ను తాడికొండ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి, ఉదయం 11 గంటలకు కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు నగర డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈనెల 25న చిన్నపిల్లలు గొడవ పడిన విషయాన్ని తీసుకువచ్చి, రాజకీయ ఒత్తిడితో కల్పన, మరికొందరిపై పోలీసుల తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. తెల్లవారుజామున 3 గంటలకు 30 పోలీసులు ఆమె నివాసంలోకి ప్రవేశించి అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో ఉదయం 6.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు. ఇలా పచ్చి అబద్ధాలు ఆడే పరిస్థితి, పోలీసులు దిగజారి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంబటి ప్రశ్నించారు. కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి ముద్దాయిలుగా ఉన్న నలుగురిని ప్రశ్నించగా, తెల్లవారుజామున 3.30 గంటలకు కి పోలీసులు వచ్చి తీసుకు వెళ్లారని చెప్పారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో రాడ్లు, కర్రలతో కొట్టినట్లు ఉందని, అటెంటు మర్డర్ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. కానీ ఎదుటి వారిపై ఎక్కడా గాయాలు గానీ, ఆసుపత్రిలో అడ్మిట్ కావడం గానీ, డాక్టర్ సర్టిఫికెట్లు గానీ పొందుపరచలేదని తెలిపారు. అయినా సరే న్యాయమూర్తి ముద్దాయిలను 14 రోజులు రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. హద్దులు మీరుతున్న పోలీసుల అరాచకాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఖాకీలు వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజం అక్రమ అరెస్ట్‌లకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు కల్పనతో పాటు మరో ముగ్గురికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని గుంటూరు నగర డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, తప్పుడు కేసులు పెట్టే వారిపై చర్యలు తీసుకునే విధంగా పార్టీ స్టాండ్ తీసుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ 25న పిల్లలను కొట్టిన ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా, తరువాతి రోజు జరిగిన గొడవను అప్పటిప్పుడే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం పలు అనుమానాలను రేకెత్తించే విధంగా ఉందని పేర్కొన్నారు. -
గుంటూరులో స్లీపర్ సెల్స్ సంచారం
కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.పాండురంగవిఠల్ గుంటూరు మెడికల్ : సరిహద్దులలో భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంతో పాటు అనేక పట్టణాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.పాండురంగవిఠల్ తెలిపారు. బీజేపీ గుంటూరు రూరల్ మండలం అత్యవసర సమావేశం శుక్రవారం అధ్యక్షుడు కంచర్ల రాజేష్ అధ్యక్షతన బ్రాడీపేటలోని కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాండురంగవిఠల్ మాట్లాడుతూ ప్రస్తుతం స్లీపర్‌సెల్స్ దేశం వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, గుంటూరు పట్టణంలోనూ వారు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలు సంచరిస్తున్నారని వార్తలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు వెంటనే దీనిపై విచారణ చేసి వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తీర్పులెప్పుడూ చట్టాలకు లోబడే ఉండాలి గుంటూరు లీగల్: జిల్లా కోర్టులోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలకు శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జూనియర్ సివిల్ న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమానికి ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి జి.చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు (పీడీఎం) న్యాయమూర్తి వి.దీప్తి, మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం.జగదీశ్వరి, రెండవ అదనపు జూనియర్ కోర్టు న్యాయమూర్తి డి.ధనరాజ్, నాల్గవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి, ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి మేరీ శారా ధనమ్మ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి చక్రపాణి న్యాయమూర్తుల విధివిధానాలను వివరించారు. తీర్పులు చేప్పేటప్పుడు అపోహలకు గురి కావద్దని తెలిపారు. అవి ఎప్పుడూ చట్టాలకు లోబడి ఉండాలని, పరిధిని దాటొద్దని సూచించారు. న్యాయవాదులను జూనియర్, సీనియర్ అంటూ చూడొద్దని, అంతా సమానమేనని తెలిపారు. కేసు చేసే విధానాన్ని బట్టి తీర్పు ఇవ్వాలని చెప్పారు.గుంటూరు కోర్టుకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉందని, ఇక్కడి న్యాయవాదులు మంచి నైపుణ్యత కలిగిన వారని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా కేసుల్లో నైపుణ్యాన్ని కనబరుస్తారని కొనియాడారు. గతంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఎం.శోభారాణి మరలా నాలుగవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా రావటం అభినందనీయమన్నారు. పలువురు నాయమూర్తులు మాట్లాడుతూ గుంటూరు కోర్టులలో పని చేయడానికి గర్వపడుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పని విధానంలో మార్పు రాకపోతే కఠిన చర్యలు
శానిటరీ ఇన్స్పెక్టర్పై మంత్రి మనోహర్ ఆగ్రహం తెనాలి అర్బన్: ‘‘ఉదయం 10గంటలు అయినా రోడ్లపై ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది.. ప్రతి రోజు ఉదయాన్నే చెత్త సేకరణ చేయాలని ఇప్పటికే ఆదేశించినా.. మీలో మార్పు రావడం లేదు.. మీరు ఇక మారారా ?’’ అంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం మరొకసారి ఈ ప్రాంతానికి వస్తానని.. ఆ లోపు కొత్తపేటలో వ్యర్థాలు కనిపించకూడదంటూ హెచ్చరించారు. కొత్తపేటలో శుక్రవారం ఆయన పర్యటించారు. రోడ్లపై చెత్త ఉండటాన్ని గమనించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. పని విధానంలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మహిళ మండలి భవనాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వచ్చే వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, ఏఈ సూరిబాబు, మంత్రి ఓఎస్డీ ఏసురత్నం, ఏసీపీ శివన్నారాయణ, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
బాలికల వసతి భవనానికి శంకుస్థాపన
వినుకొండ: పట్టణంలోని ఎన్ఎస్పీ స్థలంలో రూ. 2.50 కోట్లతో చేపట్టబోయే కస్తూర్బాగాంధీ బాలికల వసతి భవనం నిర్మాణానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వ అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ీపీఏనంటూ ఫోన్.. వ్యక్తిపై కేసు లక్ష్మీపురం: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పీఏని అంటూ నగరపాలక సంస్థ కమిషనర్‌కు, పలు విభాగాల అధికారులకు ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీఏ పంగులూరి పుల్లయ్య నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారు. గుంటూరులోని సాయినగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, వీధి లైట్లు వెలగడం లేదని, శానిటరీ వర్కర్లు రావడం లేదని ఆ వ్యక్తి ఫోన్ చేసి పేర్కొంటున్నాడు. మాచర్ల ఎమ్మెల్యే పీఏ పుల్లయ్య నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీఆర్ స్టేడియం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): రాష్ట్రంలోనే పలు ప్రత్యేకతలు ఉన్న బీఆర్ స్టేడియం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి స్పష్టం చేశారు. పాత గుంటూరులోని స్టేడియం ప్రహరీ గోడలకు శుక్రవారం తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్, డెప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేడియంలో కలియతిరిగి, అధికారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో క్రీడాకారులకు జీవితాలను ప్రసాదించిన స్టేడియం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. తొలి దశలో కాంపౌండ్ వాల్ సహా కొన్నింటికి రూ.1.60 కోట్లతో పనులు జరుగుతాయని తెలిపారు. తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సుమారు 18 ఎకరాల్లో స్టేడియం విస్తరించి ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఖేల్ ఇండియా, సీఎస్ఆర్ నిధులు, శాప్ ద్వారా స్టేడియం అభివృద్ధికి డీపీఆర్ తయారు చేయించామని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పిల్లలు చదువుల మీద ద్యాస కారణంగా పెద్దగా క్రీడలవైపు రావడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి అహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా మైదానాలు రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫుట్‌బాల్, స్కేటింగ్, క్రికెట్ వాలీబాల్, ఇండోర్ గేమ్స్ కు రూ.100 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఇదే క్రీడా మైదానంలో ఆడుకుని దాని అభివృద్ధికి అవకాశం రావడం గొప్ప అదృష్టంగా బావిస్తున్నానని నసీర్ అహ్మద్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరెడ్డి, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి రూ.1.60 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
పాఠశాల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయడం లేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు విమర్శించారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలతో ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మనుగడ కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 117ను మంత్రి నారా లోకేష్ రద్దు చేస్తానని చెప్పినా, దానిని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేసి మరింత గందరగోళం సృష్టిస్తుందని చెప్పారు. కేవలం 1, 2 తరగతులతో ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ధర్నాకు అధ్యక్షత వహించిన కె.బసవలింగారావు మాట్లాడుతూ బదిలీల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర, తెలుగు స్కూల్ అసిస్టెంట్స్ తప్పనిసరి చేస్తూ వారి స్థానంలో మరొక స్కూల్ అసిస్టెంట్‌ను తీసుకురావాలనుకోవడం అధికారుల నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులివ్వాలని కోరారు. అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు కోర్ట్ కేసులతో సంబంధం లేకుండా కోరుకున్న చోట ఉండేట్లు చూడాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీదా, ఎం.ఎన్ మూర్తి, ఎం. హనుమంతవవు, నాగశిన్నారాయణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు -
‘పచ్చ’ నేతలను మెప్పించేందుకే పోలీసులా?
● అప్రజాస్వామిక పోకడలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ● సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిలో అక్రమ సోదాలు ఇందులో భాగమేనంటున్న ప్రజాస్వామ్యవాదులు గృహ యోగంలో అవినీతి పర్వం సాక్షి, నరసరావుపేట: ప్రజల ‘సాక్షి’గా ప్రభుత్వ అసమర్థతను అక్షరంతో ప్రశ్నిస్తోన్న గొంతులకు కేసుల ఉచ్చు బిగిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర యజ్ఞం చేస్తోన్న జర్నలిస్టులపై అక్రమ కేసుల కత్తులు దూస్తున్నారు. ప్రజల కన్నీళ్లను పాఠకుల కళ్లకు కడుతుంటే ఓర్చుకోలేక నిప్పులు కక్కుతున్నారు. నాయకుడ్ని కేసులు వలయంలో బంధిస్తే వెనుక ఉన్న అక్షర సైన్యం డీలా పడుతుందనే భ్రమలో ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టాలకు ముసుగులు వేసి అక్షరాన్ని బంధించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన, ప్రజా కంఠక పాలనను ఎండ గట్టినందుకే ఈ అక్కసంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరంపర కొనసాగితే రాష్ట్రంలో ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుందన్న భయాన్ని వెలిబుచ్చుతున్నారు. దీనిని అంతా ముక్తకంఠంతో ఖండించి అడ్డుకోని పక్షంలో ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోతాయని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ వాదులు బలంగా తమ గొంతుకను వినిపిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది... ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పని చేసే సాక్షి, సాక్షి ఎడిటర్ పై ప్రభుత్వ దుందుడుకు చర్యను పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. లేకపోతే ప్రజా వ్యతిరేకతను మూటక ట్టుకుంటారు. – డాక్టర్ గోదా రమేష్ కుమార్, దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు.ప్రభుత్వంపై వార్తలు రాస్తున్నందుకే సోదాలు... అధికార పార్టీ, ప్రభుత్వంపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో పోలీసులను ఉపయోగించి అణచివేసేందుకు సర్కారు కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే సాక్షి ఎడిటర్ ఇంటిలో సోదాలు చేశారని అర్థమవుతుంది. ఏదైనా వార్త పరంగా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలి తప్ప దౌర్జన్యాలు సరికాదు. ఇటువంటి పోకడలను ప్రభుత్వం మానుకోవాలి. –షేక్ శిలార్ మసూద్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, నరసరావుపేట పత్రికా స్వేచ్ఛను హరించలేరు... ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంగా చెప్పుకునే మీడియాను నియంత్రించటమంటే ప్రజాస్వామ్యానికే ముప్పుగా భావించాలి. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సంపాదకులపై నిర్బంధాలు ఏమాత్రం సబబుకాదు. ఇటువంటి పోకడలతో పత్రికా స్వేచ్ఛను హరించలేరు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఏ ప్రభుత్వమైనా ఇది తెలుసుకోవాలి. – కాసా రాంబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి, నరసరావుపేట. విలేకరులపై అక్రమ కేసులు, కార్యాలయాలపై దాడులు ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులను జైలుకు పంపిన ప్రభుత్వం ప్రభుత్వ అసమర్థ పాలన, ప్రజాకంటక పాలనను ఎండగడుతుండటంతో అక్కసు ముక్త కంఠంతో అడ్డుకోని పక్షంలో ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు ముప్పు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రెండో రోజైన శుక్రవారం కూడా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జర్నలిస్టులు నిరసన గళం విప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడంపై రాష్ట్రవాప్తంగా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. శుక్రవారం చిలకలూరిపేటలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ పి.భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తే సహించబోమని అన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గురజాలలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. మాచర్ల నియోజకవర్గ విలేకరులు కూడా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలోనూ జర్నలిస్టులు నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాలలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మున్సిపల్ చైర్మన్‌గా మదార్ సాహెబ్ బాధ్యతల స్వీకరణ
మాచర్ల: పట్టణానికి నూతనంగా పురపాలక సంఘ చైర్మన్‌గా షేక్ మదార్ సాహెబ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11గంటలకు మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఐదు రోజుల కిందట వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మదార్ సాహెబ్‌ను చైర్మన్‌గా కౌన్సిల్ నిర్ణయించింది. అంతకుముందు ఇన్చార్జి మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరించిన పోలూరి నరసింహరావు పదవికి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో ఇన్చార్జిగా మదార్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ పూర్తి స్థాయిలో పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ తన చిరకాల వాంఛ అయిన మున్సిపల్ చైర్మన్ పదవి స్వీకరించటానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలూరి నరసింహారావు, టీడీపీ నియోజక వర్గ నాయకులు యెనుముల కేశవరెడ్డి, పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, మద్దిగపు వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు కలిసి పూలమాలలు వేసి సత్కరించారు. -
టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహం
పెదవడ్లపూడి(మంగళగిరి): మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అత్యుత్సాహంతో వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడి సద్దామ్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని పెదవడ్లపూడి కొత్తపాలెం రోడ్డు పక్కన దుకాణం నిర్మించుకుని చికెన్ షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అదే రోడ్డు పక్కన ఆక్రమించి టీడీపీ నాయకుడు కొత్తగా చికెన్ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. తన వ్యాపారం కోసం సద్దామ్ హుస్సేన్ దుకాణం తొలగించేందుకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీ నాయకుడు దుకాణంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని అధికారులు మాత్రం వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణంపై ఫిర్యాదుకు వెంటనే స్పందించారు. శుక్రవారం రాత్రి ఏసీపీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలను తీసుకెళ్లి దుకాణాన్ని వెంటనే తొలగించుకోవాలని సద్దామ్ హుస్సేన్‌ను ఆదేశించారు. లేనిపక్షంలో ధ్వంసం చేస్తామని బెదిరించి, అతడితోనే దుకాణాన్ని తొలగింపచేశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు నాలి మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని దుకాణాలు తొలగించాలని, వైఎస్సార్ సీపీ నాయకుడు దుకాణం ఒక్కటే ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించినా అధికారులు పట్టించుకోలేదు. దుకాణం తొలగించి టీడీపీ నాయకులను సంతృప్తి పరచడంపై సద్దామ్ హుస్సేన్‌తో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేత అదే రోడ్డులో టీడీపీ నాయకుల దుకాణాల జోలికి వెళ్లలేదు -
నర్సుల సేవలు వెలకట్టలేనివి
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుశృత హాలులో జరిగిన వేడుకల్లో సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆసుపత్రిలో నర్సుల సేవలు ఎంతో కీలకమని, రోగులు త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవడంలో వారి పాత్ర ప్రముఖమని తెలిపారు. ఆసుపత్రికి మూలస్తంభాలుగా నర్సింగ్ సిబ్బంది ఉంటారని, వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఏడాదిలోపు పదవీ విరమణ చేయనున్న హెడ్ నర్సులు రాజవర్ధని, రాజ్యలక్ష్మి, బాలమంజరి, గాయత్రి, శౌరి సంగీత, కృపమ్మలను సంఘం నేతలు సత్కరించారు. వీరితోపాటు గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్లు కిరణ్మయి, గంగమ్మ, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆవుల విజయ, రమాదేవి, నాంచారమ్మ, జయలక్ష్మిలను సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కోశాధికారి పారాబత్తిన హేమలత, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎం.ఆషాలత, పి.సునీత, పెనుమాక సుధారాణి, భూలక్ష్మి, గోగుల అరుణ పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025
ప్రజల గొంతులను నొక్కడానికే... ఇది ప్రజాస్వామ్యంపై దాడి. పోలీసు వ్యవస్థ ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుందనే దానికి ఉదాహరణ. సమాజంలో చెడును ప్రశ్నించగలిగే ఒక పత్రిక ఎడిటర్‌పై అనుచితంగా ప్రవర్తించి మీరు కూడా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందంటూ ముందస్తుగా సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటమే. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలే శాశ్వతమనే విషయం పోలీసులు తెలుసుకోవాలి. –షేక్ మౌలాలి, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు, నరసరావుపేట ఎడిటర్లపై దౌర్జన్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదం సెర్చ్ వారెంట్ లేకుండా ఒక పత్రిక ఎడిటర్ గృహంలో పోలీసు సోదాలు దౌర్జన్యంతో సమానం. ఇది మిగిలిన పత్రిక విలేకరుల ను భయపెట్టేందుకే. ఇటువంటివి జరిగినప్పుడు ప్రతి పత్రికకు చెందిన విలేకరులు అండగా ఉండాలి. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి. ఇదే పరంపర కొనసాగితే ప్రశ్నించే గొంతుకలు మూగబోతాయి. జర్నలిస్టులు నిబ్బరం కోల్పోకుండా తమ విధులను నిర్వహించాలి. –నల్లపాటి రామారావు , రాష్ట్ర నాయకులు, దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం), నరసరావుపేట. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్కసు పత్రికలు, అందులో పనిచేసే వారిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చలాంటివి. ఒక పార్టీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రభుత్వం మరోసారి రావొచ్చు. పోలీసులు నిత్యం అన్ని ప్రభుత్వాలలో పని చేయాల్సిన వ్యక్తులు. తమ వ్యవస్థను తామే దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపి వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడే ఉద్యమంలో అందరూ కలసి రావాలి. – డాక్టర్ కె.శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షులు, పల్నాడు జిల్లా. న్యూస్‌రీల్ -
తెలుగు సాహిత్యానికి అన్నమయ్య కృషి అసామాన్యం
గుంటూరు ఎడ్యుకేషన్: తెలుగు సాహిత్యం, సంగీతం, కవితా వికాసానికి తాళ్లపాక అన్నమాచార్యుల కృషి అసామాన్యమని గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారి హిమ శైలజ అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో శుక్రవారం అన్నమయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కీర్తనల రాష్ట్ర స్థాయి పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు తొలి వాగ్గేయకారునిగా 32 వేలకు పైగా కీర్తనలను స్వరపరిచి, తెలుగు భాషా వైభవానికి విశేష కృషి చేశారని కొనియాడారు. గొప్ప వైష్ణవ భక్తునిగా శ్రీ వేంకటేశ్వరస్వామిని సేవించి, స్వామివారి సాక్షాత్కారం పొందిన మహా భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు అని కీర్తించారు. భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు కృషి అమోఘమైనదని తెలిపారు. రామచంద్రరాజు మాట్లాడుతూ తెలుగు వారి లోగిళ్లలో అన్నమయ్య సంకీర్తనలు లేని రోజులు ఉండవని తెలిపారు. గొప్ప వాగ్గేయకారులైన క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వారితో పాటు నేటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారికి మార్గదర్శకులని పేర్కొన్నారు. సంగీత, సాహిత్య అంశాల్లో ప్రతిభ కలిగిన బాలబాలికలతో పాటు యువతీ, యువకులను సమాజానికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం – అన్నమయ్య ప్రాజెక్టు గాయకులు డాక్టర్ రాయదుర్గం శ్యాం కుమార్, తులసీబాయిల అన్నమయ్య సంకీర్తనల కచేరి ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మహిళా సంగీత సన్మండలి అధ్యక్షురాలు శేషు రాణి, ఇంటాక్ సభ్యులు సీతా రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ హేమాంబ, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణ ఉషశ్రీ పాల్గొన్నారు. -
ఎండు గడ్డి ధరకు రెక్కలు
ఫిరంగిపురం: ఈ ఏడాది ఎండుగడ్డి ధరలు అమాంతం పెరగడంతో పాడి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. మండలంలో పత్తి, మిర్చి ఎక్కువగా వేయడం , వరి తక్కువగా వేయడంతో కొరత ఏర్పడింది. దీంతో పొన్నూరు , తెనాలి, కొల్లూరు, కొల్లిపర, బాపట్ల ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకు వస్తున్నారు. అక్కడ ఎకరా గడ్డి ధర రూ.7 వేలు ఉంది. దాన్ని ట్రాక్టర్‌పై వేసినందుకు రూ.2 వేలు, రవాణా ఖర్చులు రూ.6వేలు కలిపి రూ.15వేలు అవుతోంది. పశువులకు ఏడాదికి సరిపడా వరిగడ్డి నిల్వ చేసుకోవాలంటే ఒక్కో దానికి సుమారు వంద మోపుల చొప్పున గడ్డి కావాలి. ఎకరాకు 80 కట్టలు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతులు రెండెకరాల గడ్డి కొనుగోలు చేయక తప్పడం లేదు. ట్రాక్టర్‌కు రెండు ఎకరాల గడ్డి అంటే సుమారు 160 కట్టలు దాకా వస్తాయి. రవాణాకు రూ.22వేలు వరకు రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మరో రెండు వేల రూపాయల వరకు బీపీటీ గడ్డికి చెల్లించాల్సి వస్తోంది. పాడి పైనే ఆధారం మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది పాడిపైనే ఆధార పడుతుంటారు. మండలంలోని 18 గ్రామాల్లో ఆవులు, గేదెలు సుమారు 9వేల పైచిలుకు ఉన్నాయి. వీటి పోషణ కోసం భారీగా ఎండుగడ్డి కొనుగోలు చేయాల్సి వస్తోంది. వేసవిలో పచ్చిగడ్డి తక్కువగా ఉండటంతో మరలా పంటలు వేసే వరకు పశువులకు ఎండు గడ్డి వేయక తప్పదు. వేసవిలో పచ్చిమేత లేక ఇప్పటికే పాల శాతం పడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధర చెల్లించి ఎండు గడ్డి తెచ్చుకుంటున్నారు. మరి కొందరు అంత ధర చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మొక్క జొన్న, గడ్డిజొన్న చొప్పను పశుగ్రాసంగా వేయడంతో పాల దిగుబడి పడిపోతోంది. ఎండు గడ్డి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ధరకు అందించాలని పలువురు పాడి రైతులు కోరుతున్నారు. ఎకరా రూ.7వేలు పశుగ్రాసం కొరత పాడి రైతుల ఇక్కట్లు -
ఈ నెల 13న కళ్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ద దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందారు. -
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
గుంటూరు మెడికల్: సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంపై విజయవాడ నగర సెంట్రల్ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ప్రవేశించి సెర్చ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) నేతలు ఖండించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు షేక్ నాగూల్‌మీరా మాట్లాడుతూ అవినీతి, అక్రమాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికారంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇవే దాడులు, ఇవే ఆంక్షలు, ఇలాంటి బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభం అయిన మీడియా పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిషన్ ఇన్చార్జి ఎం.తిరుమలరెడ్డి, యూనియన్ జిల్లా సెక్రటరీ కె.రాంబాబు, నగర గౌరవ అధ్యక్షుడు సత్య నారాయణశర్మ, అధ్యక్షుడు వి.కిరణ్‌కుమార్, సబ్ ఎడిటర్లు దివి రఘు, పి.శ్రీనివాసరావు, ఎన్.వెంకట్, బి.సురేష్‌బాబు, జర్నలిస్టులు మొండితోక శ్రీనివాసరావు, షరీఫ్, వీరయ్య, సురేంద్ర, పి.ప్రశాంత్, డి.ప్రకాష్, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, ఎం.కోటిరెడ్డి, రామ్‌గోపాలరెడ్డి పాల్గొన్నారు. దాడులు హేయమైన చర్య ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్. ధనంజయరెడ్డి ఇంటిలో పోలీసులు తనిఖీలు చేసిన తీరును ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూల్‌మీరా, ప్రధాన కార్యదర్శి కె.రాంబాబులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు సోదాలు చేయాలని భావించి ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి ఉండాలని సూచించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటిలో చొరబడిన తీరును ఖండించారు. ఇలాంటి ధోరణి భావ్యం కాదని తెలిపారు. -
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి
తెనాలి: ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలపై సాక్షి మీడియా తెనాలి ప్రతినిధులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. వహాబ్ రోడ్డులోని అజీమ్‌ఖాన్ వీధిలోని సాక్షి రీజనల్ సెంటర్ కార్యాలయం నుంచి సాయంత్రం ప్రదర్శనగా మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ దగ్గర్లోని వెటర్నరీ కాలనీలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంటుకు నగర సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకా ష్లు సిబ్బందితో పాటు అక్రమంగా ప్రవేశించినట్టు తెలిపారు. సెర్చ్ వారంట్, ఎలాంటి నోటీసు లేకుండా వచ్చి భయానక వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. గౌరవప్రదమైన పత్రికా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్.ధనుంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించటంతోపాటు సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో పోలీసులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఇది సాక్షి ఎడిటర్‌పై మాత్రమే జరిగిన దాడి కాదనీ, భవిష్యత్‌లో మొత్తం మీడియాపై ఇవే దాడులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాక్షి తెనాలి రీజనల్ సెంటర్ ఇన్చార్జి బి.ఎల్.నారాయణ, సాక్షి మీడియా విలేకరులు కేజే నవీన్, ఆలపాటి సుధీర్, తాడిబోయిన రామకృష్ణ, సాక్షి టీవీ ప్రతినిధి తోట శ్రీనివాసరావు, వేమూరు ఆర్సీ ఇన్చార్జి బుల్లయ్య, సర్కులేషన్ ఇన్చార్జి దాసు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావంగా స్థానిక పత్రిక సంపాదకుడు అడపా సంపత్రాయుడు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్, జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాన్ని కొనసాగిస్తూ, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:45గా చూపాలన్నారు. రేషనలైజేషన్‌లో జూనియర్, సీనియర్‌కు ఒకే నిబంధన ఉంచి, మాన్యూవల్ పద్ధతిలో కౌన్సెలింగ్ జరపడంతోపాటు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఎస్జీటీలు కచ్చితంగా ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ వేసవి సెలవులు ముగిసేలోపే బదిలీల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలన్నీ అప్డేట్గా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పొరపాట్లు ఉంటే తక్షణం సరిచేయాలని, అన్ని ఖాళీలను డిస్ప్లే చేసి పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షురాలు వై.నాగమణి, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కేదార్నాథ్, ప్రేమ్ కుమార్, చిన్నయ్య, గఫార్, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
చిరస్మరణీయుడు డాక్టర్ పట్టాభి
కొరిటెపాడు(గుంటూరు): స్వాతంత్ర సమరయోధునిగా, గాంధీజీ అనుంగు శిష్యుడిగా, స్వాతంత్య్రానికి పూర్వమే ఆంధ్రాబ్యాంక్‌తో పాటు అనేక ఆర్థిక, బీమా సంస్థలను స్థాపించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య బ్యాంకు ఉద్యోగులతో పాటు తెలుగు వారందరికీ చిరస్మరణీయులని యూనియన్ బ్యాంక్ రీజియన్ హెడ్ సయ్యద్ జవహర్ పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు, నరసరావుపేట రీజియన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కాలేజీ యూనియన్ బ్యాంక్ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన పట్టాభి కాంస్య విగ్రహాన్ని గురువారం రీజియన్ హెడ్ జవహర్‌తో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ విశ్రాంత అధికారులు, యూనియన్ నాయకులు ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి డాక్టర్ భోగరాజు అమర్ రహే.. లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జవహర్ మాట్లాడారు. డాక్టర్ భోగరాజు స్ఫూర్తితో రిటైరీస్, మహిళలు, విద్యార్థుల కోసం కొత్త పథకకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ ఎ.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంక్ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కె. హరిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ రిటైరీస్ సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి వి. వారణాసి మాట్లాడుతూ పారిశ్రామిక, రాజకీయ ఉద్దండులు ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, రాజగోపాల్ నాయుడు వంటి వారు పారిశ్రామికవేత్తలగా ఎదిగేందుకు సీతారామయ్య సహకరించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 11,500 మంది విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు కుటుంబాల కంటే సమాజ, దేశ సేవకు తొలి ప్రాధాన్యతనిస్తారని వివరించారు. ఈ సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.శ్రీనివాస్, విజయ బ్యాంక్ బ్యాంక్ మాజీ చైర్మన్ బి.ఎస్. రామారావు, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ అధ్యక్షులు బీబీవీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏబీఆర్‌ఈఏ వైస్ ప్రెసిడెంట్ ఎన్.గణేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై.కోటేశ్వరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ వై.హనుమంతరావు, నిరంజన్ కుమార్, సుబ్బారావు, శివాజీ, ప్రసన్నత బాబు, కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ రీజియన్ హెడ్ ఎస్. జవహర్ -
ఈదురుగాలులు, భారీ వర్షం
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు మంచాల(చేబ్రోలు): చేబ్రోలు మండల పరిధిలోని గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. మండల పరిధిలోని మంచాల గ్రామంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. మధ్యాహ్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మిగిలిన గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. మంచాల గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది రాత్రికి పునరుద్ధరించారు. ఈదురు గాలులకు మామిడి, సపోటా తోటలకు నష్టం చేకూరింది. కొత్తరెడ్డిపాలెం, వడ్లమూడి, శేకూరు, శలపాడు గ్రామాల్లోని మామిడి తోటలల్లోని కాయలు రాలిపోయాయి. మామిడి చెట్లు కొమ్మలు విరిగిపోవటంతో పండ్ల రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ప్రభుత్వ పరీక్షల విభాగ సైట్లో టెన్త్ షార్ట్ మెమోలు గుంటూరు ఎడ్యుకేషన్: గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల షార్ట్ మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు డౌన్లోడ్ చేసుకుని, వాటిపై సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మెమోల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు దొర్లితే రికార్డు ప్రకారం పరిశీలించి, అడ్మిషన్ రిజిస్టర్ కాపీ, మార్కుల మెమోను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ధ్రువీకరించుకుని, ఈనెల 25లోపు ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కార్యాలయానికి పంపాలని సూచించారు. తీరంలో ఇద్దరు యువతులు గల్లంతు కాపాడిన పోలీసులు బాపట్ల టౌన్: స్నానాలు చేస్తూ ఇద్దరు యువతులు సముద్రంలో మునిగిపోయిన ఘటన గురువారం సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గేశ్‌దేవి, నీషాలు గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్ బైపాస్, హనుమాన్ టెంపుల్ సమీపంలోని బుల్లెట్ స్పిన్నింగ్ మిల్లులో నివాసముంటున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యలంక బీచ్‌కి వచ్చారు. స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన ఆలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై కాపాడారు. ఇద్దరు ప్రాణాలు కాపాడిన కోస్టల్ సెక్యూరిటీ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్ఐ నాగశివారెడ్డి, ఏఎస్ఐ అమరేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌రావు, హోంగార్డు నారాయణలను ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. దివ్యాంగులకు డీఎస్సీ క్రాష్ కోర్సులో ఉచిత శిక్షణ నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలోని దివ్యాంగ అభ్యర్థులకు విజయవాడలో డీఎస్సీ క్రాష్ కోర్స్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఎంపీఎఫ్సీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40శాతం వికలాంగత్వం ఉన్నవారు అర్హులని తెలిపారు. టెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని, ఎంపికై న వారికి ప్రత్యేక బోధన పద్ధతుల్లో శిక్షణ, స్టడీ మెటీరియల్, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. -
ఆధారాలు సేకరణ పటిష్టంగా చేపట్టాలి
నగరంపాలెం: క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తే ఆయా కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేందుకు అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం జిల్లా పోలీస్ అధికారులకు ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ రమణమూర్తి అధ్యక్షత వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా నేరం జరిగితే, ముందుగా ఆధారాలు సేకరించాలని అన్నారు. సేకరించిన ఆధారాలు కూడా నేరాలకు దగ్గరగా, నేరస్తుల ఆచూకీ గుర్తించేలా ఉండాలన్నారు. ఇటువంటి వేళల్లో మెదడుకు పదునుపెట్టాలని చెప్పారు. అంతేగాక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. ఏ ఒక్క క్లూ దొరికిన నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే నేరస్తులు తప్పించుకునేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు. అనంతరం దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే మెళకువలను ఫోరెన్సిక్ నిపుణులు వివరించారు. సమావేశంలో ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులు ఎ.రీనాసూసన్, ఓ.సురేంద్రబాబు, సహాయ డైరెక్టర్లు వంశీకృష్ణ, సత్యరాజు, గుంటూరు జీజీహెచ్ నుండి వైద్యులు బి.నాగేంద్రప్రసాద్, ఫోరెన్సిక్ విభాగాధిపతి జాఫర్‌హుస్సేన్, సహాయ ఆచార్యులు, పీపీ కోటేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఏ ఒక్క క్లూ కూడా అశ్రద్ధ చేయవద్దు ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణపై చర్చావేదికలో ఎస్పీ -
ఎడిటర్ ఇంటిపై దాడి హేయమైన చర్య
బాపట్ల టౌన్: నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే పత్రికా సంస్థల ఎడిటర్ ఇళ్లపై ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా దాడులు చేయడం హేయమైన చర్యని బాపట్ల వర్కింగ్ జర్నలిస్ట్‌ల యూనియన్ సహాయ కార్యదర్శి కాగిత ప్రశాంత్‌రాజు తెలిపారు. సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి అపార్టుమెంట్లోకి పోలీసులు వెళ్లి తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించిన తీరుకు నిరసనగా గురువారం సాయంత్రం బాపట్లలోని జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి సీతారత్నానికి వినతిపత్రం అందజేశారు. ప్రశాంత్‌రాజు మాట్లాడుతూ కనీసం సెర్చ్ వారెంట్ అడిగినా చూపకుండా దురుసుగా ప్రవర్తించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని తెలిపారు. పత్రికా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్. ధనంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతోపాటు, సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. అవినీతి, అక్ర మాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికా రంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాపట్ల జర్నలిస్ట్ సంఘాల నాయకులు వేజెండ్ల శ్రీనివాసరావు, మురికిపూడి అంజయ్య, అంగిరేకుల కోటేశ్వరరావు, రాఘవేంద్రరావు, పరిశా వెంకట్, సృజన్‌పాల్, శీలం సాగర్, మార్పు ఆనంద్, అడే రవిజేత, జె. రవిరాజేష్ పాల్గొన్నారు. -
సైనిక స్కూల్‌గా శ్రీరామా రూరల్ హైస్కూల్
తెనాలి: కొల్లూ రు మండలం చిలు మూరులో గల శ్రీరామా రూరల్ హైస్కూలు ఇప్పుడు సైనిక్ స్కూలుగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ నుంచి అనుమతులు లభించాయి. హైస్కూలు ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామా రూరల్ అకాడమీ అధ్యక్షుడు కొలసాని తులసీ విష్ణుప్రసాద్ వివరాలను వెల్లడించారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి సైనిక్ స్కూల్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. భారతదేశంలో మొత్తం 33 సైనిక్ స్కూల్స్ పనిచేస్తుండగా, మన రాష్ట్రంలో కోరుకొండ, కలిగిరిలో నడుస్తున్నాయని గుర్తుచేశారు. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి దశలో 42 సైనిక్ స్కూల్స్‌కు, ఇప్పుడు మరో 33 సైనిక్ స్కూల్స్‌కు భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ అనుమతినివ్వగా, అందులో గుంటూరు జిల్లా నుంచి 76 ఏళ్లుగా నడుస్తున్న శ్రీరామా రూరల్ హైస్కూలు ఒకటి కావటం గర్వకారణమన్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 1987లో కంప్యూటర్ లాబ్, 2020 నుంచి సీబీఎస్ఈ, అటల్ టింకరింగ్ ల్యాబ్‌తో రోబోట్రిక్స్, డ్రోన్స్, త్రీడీ ప్రింటింగ్, స్క్రాచ్ కోడింగ్‌లో విద్యార్థులకు శిక్షణనిస్తున్నామని గుర్తుచేశారు. శ్రీరామా రూరల్ హైస్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ మాట్లాడుతూ ఉత్తమ విద్యతోపాటు దేశానికి అవసరమైన భావిభారత పౌరులను తీర్చిదిద్దే దిశగా తమ సైనిక్‌స్కూల్ పనిచేస్తుందని చెప్పారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025సాక్షికి పోరాటాలు కొత్త కాదు సాక్షికి పోరాటాలు కొత్త కాదు. ఎడిటర్ ఇంటిపై దాడిచేయడం తగదు. నచ్చని విషయాలు రాస్తే అణచివేయాలని చూస్తారా? రెండు నెలల క్రితం పుట్టిన సంస్థకు రూ.కోట్ల విలువైన భూముల ఇచ్చేసి, ఆ విషయాన్ని రాయొద్దంటే ఎలా? తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయాలి. ఇంటికి పోలీసులను పంపడం తగదు. ఎంత అణచివేయాలని చూస్తే. సాక్షి అంతగా పైకి లేస్తుంది. – పి.శ్రీనివాస్, అసోసియేట్ ఎడిటర్, సాక్షి దినపత్రిక పోలీసుల చొరబాటు హేయం ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలోకి పోలీసుల చొరబాటు హేయమైన చర్య. అకారణంగా ఇంట్లోకి పోలీసులు చొరబడటం సబబు కాదు. గౌరవ ప్రదమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లేటప్పుడు సెర్చ్ వారెంటు తీసుకోవాలి. మరోసారి ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.– చిలుకా చంద్రశేఖర్, ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సత్తెనపల్లిఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? మీడియా ఎడిటర్ ఇంటిపై దాడి దేశంలోనే ఇది ప్రప్రథమం. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అడిగే హక్కు ఎవరికీ లేదా? ఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? పది నెలల్లోనే రాజ్యాంగాన్ని తిరగరాసి రెడ్‌బుక్ అమలు చేస్తానంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది సాక్షి ఎడిటర్ ఇంటిపై మాత్రమే జరిగిన దాడి కాదు.. ప్రజాస్వాయ్యంపై జరిగిన దాడి. – బి.వి.రాఘవరెడ్డి, ఏపీ నెట్వర్క్ ఇన్చార్జి, సాక్షి దినపత్రిక 9న్యూస్‌రీల్ -
డబ్బు పంపకంలో తేడాలతో కోటేశ్వరరావు హత్య ?
మంగళగిరి: మండల పరిధిలోని కాజ, పెదవడ్లపూడిల మధ్య బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యకు నగదు పంపకంలో తేడాలే కారణమని సమాచారం. కోటేశ్వరరావుతో పాటు ఇద్దరు మహిళలు హిహిజ్రాలు వేషాలు ధరించి తెనాలి, దూర ప్రాంతాల్లో దుకాణాల ప్రారంభం, గృహ ప్రవేశాలకు వెళ్లి డబ్బులు అడుక్కుని జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెనాలికి చెందిన అన్నపురెడ్డి దిలీప్‌కు వీరిలోని మహిళ నర్మదతో పరిచయం ఏర్పడింది. మండలంలోని నవులూరు టిడ్కో ఇళ్లలో అద్దెకు నివసిస్తున్నారు. కోటేశ్వరరావు ఆడవారి దుస్తులు ధరించి హిజ్రా వేషధారణలో తిరుగుతుంటాడు. దుకాణాల వద్ద వచ్చిన ఆదాయం పంపకంలో కోటేశ్వరరావు, మహిళల మధ్య వివాదం నెలకొంది. బుధవారం రాత్రి కాజలో మద్యం తాగి కోటేశ్వరరావు పెదవడ్లపూడి డొంక రోడ్డులో వెళుతుండగా ఘర్షణ జరిగింది. అది పెద్దది కావడంతో దిలీప్‌తో పాటు ఇద్దరు మహిళలు కలిసి కోటేశ్వరరావును హత్య చేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. దిలీప్, నర్మదతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు -
‘సాక్షి ఎడిటర్ నివాసంలో సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలా?’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపైన చంద్రబాబు దుర్మార్గంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ నివాసంలో ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించడం చంద్రబాబు అధికార దుర్వినియోగంకు పరాకాష్టగా నిలుస్తోందని అన్నారు. వైఎస్ జగన్ వెంట ఉన్న వారిపై వేధింపుల్లో భాగంగా లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో వారిని భాగస్వాములుగా చూసే దారుణానికి చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్‌ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రజల గొంతుక సాక్షి పత్రికపైన కూడా దుర్మార్గమైన దాడికి చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గుచేటు. దేశంలో ఒకవైపు యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు దేశ రక్షణ బలగాలకు సంఘీభావంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదర్కోవడానికి సమాయత్తమవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు తన కుటిల రాజకీయ కుతంత్రాలను అమలు చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు.లేని లిక్కర్ స్కాంను సృష్టించి, అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దానిచుట్టూ కక్ష తీర్చుకునే దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో భాగంగా రోజుకు ఒకరిని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి… కొన్నాళ్లపాటు వారి ఆటలు చెల్లుతాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. అమావాస్య చీకట్లు ఎలా ఉంటాయో, వెలుగు కూడా దాని వెనుకకే ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిమీద, ఓఎస్డీగా పనిచేసిన ఒక నిజాయితీపరుడైన మాజీ ప్రభుత్వ ఉద్యోగి మీద చంద్రబాబు మొత్తం, బలాన్ని, బలగాన్ని ప్రయోగించడం సిగ్గు చేటు.అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. ఇది ఒక కుట్ర. దీనిలో అందరినీ భాగస్వాములను చేసి, వైయస్ జగన్ గారి చుట్టూ ఉన్న వారిని దీనిలో ఇరికించాలనే ఈ కక్ష సాధింపు చర్యలు. కక్షలు తీర్చుకోవడంలో చంద్రబాబు అన్ని లైన్లు క్రాస్ చేశాడు. తెలుగు పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న సాక్షి ఎడిటర్ మీద కూడా పోలీసులను చంద్రబాబు ప్రయోగించడం దుర్మార్గం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక పెద్ద పత్రిక సంపాదకుడ్ని టార్గెట్ చేయడం దారుణం.సాక్షి కథనాలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కూటమి పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశంకు ఎల్లో పత్రికల్లాగ సాక్షి పత్రిక డబ్బా కొట్టాలని అనుకోవడం వారి అవివేకం. సమాజం పట్ల, ప్రజలపట్ల తన బాధ్యతను సాక్షి నిర్వహిస్తోంది. అలా సాక్షి పత్రికను, సంపాదకుడ్ని, జర్నలిస్టులను భయపెట్టాలనుకోవడం వారి దురాశే అవుతుంది. ప్రజల పక్షాన ఎన్నికల హామీలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రజల అండ ఉన్నంత వరకూ సాక్షి పత్రికను ఎవ్వరూ ఏమీ చేయలేరు. గతంలో కూడా సాక్షిపైన ఇలాంటి కుట్రలే చేసి విఫలమయ్యారు. నీతీ, నిజాయితీగా పనిచేసే సాక్షి పత్రికా బృందాన్ని కూటమి ప్రభుత్వం తన బలంతో అణిచివేయాలని చూసినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. -
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం యూనిట్ విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం. -
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతోపాటు రామకుప్పం, రొద్దం మండల నేతలతో వైఎస్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎంపీపీల ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు.. పచ్చ గూండాల దాడులను ఎదుర్కొన్న వారిని వైఎస్ జగన్ అభినందించారు. అలాగే, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేస్తున్నారు. -
బైక్‌ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
పట్నంబజారు: బైక్‌ల చోరీల కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, లాలాపేట పీఎస్ ఎస్హెచ్ఓ శివప్రసాద్ వివరాలు వెల్లడించారు. గుంటూరు నగరం ఇజ్రాయిల్‌పేటకు చెందిన షేక్ సుభాని (ప్రస్తుతం చిలకలూరిపేటలో నివాసం), విజయవాడకు చెందిన పఠాన్ ఆవేజ్ఖాన్లు కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. ద్విచక్ర వాహనాల చోరీలు ఇటీవల అధికం కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కింగ్ హోటల్ సమీపంలోని దుకాణం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం విక్రయిస్తున్న సుభాని, ఆవేజ్ ఖాన్‌లను ఎస్ఐ విజయ్‌కుమార్ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారు. ఇద్దరూ గత ఏడాది నుంచి మారు తాళాలు తయారు చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. చోరీ చేసిన వాహనాలను ఆటోనగర్ ప్రాంతంలోని ఓ మెగా హాస్పిటల్ వెనుక భాగంలో దాచి ఓఎల్ఎక్స్లో విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడైందన్నారు. పక్కా సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని రూ. 8.50 లక్షల విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై 16 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లు కిరణ్, శంకర్లను అభినందించారు. -
వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శుల నియమాకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరిని పార్టీ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వజ్రాల జయరామిరెడ్డిని, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన దొంతిరెడ్డి అమర్రెడ్డిని మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
ముడిఖనిజం అక్రమ రవాణాపై ఫిర్యాదు
బొల్లాపల్లి: బండ్లమోటు మైనింగ్ నుంచి లెడ్, డోలమైట్ ముడి ఖనిజాలు అక్రమంగా తరలించి సమీపంలోని మాలపాడు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ వినుకొండ రేంజ్ అధికారి సి.మాధవరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు తనిఖీ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బండ్లమోటుకు చెందిన హిందుస్తాన్ లెడ్ జింక్ మైనింగ్ నుంచి ముడిఖనిజాలు ద్విచక్రవాహనంపై తరలించి సమీపంలోని మాలపాడు గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. 2002 అక్టోబరులో బండ్లమోటు మైనింగ్ మూతపడింది. అప్పట్లో వేల టన్నుల లెడ్, డోలమైట్, ముడి ఖనిజాల నిల్వలు బయట వదిలేశారు. ఇటీవల కాలంలో కొందరు ద్విచక్రవాహనాలపై అక్రమ మార్గంలో వీటిని తరలించి సమీపంలోని పొలంలో నిల్వ ఉంచారని స్థానికులు కొందరు మొబైల్ కెమెరాలో ఆ దృశ్యాలు తీసి జిల్లా ఫారెస్ట్ అధికారి, వినుకొండ రేంజ్ అధికారికి వాటిని పంపారు. ఈ మేరకు వినుకొండ రేంజ్ అధికారి గ్రామానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ విషయంపై వినుకొండ రేంజ్ అధికారిని వివరణ అడగ్గా స్థానికులు ఫొటోలు తీసి పంపారని, వారి ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించామన్నారు. తనిఖీలో ఆ ప్రదేశంలో ఎటువంటి ముడి ఖనిజ నిల్వలు వెలుగు చూడలేదని రేంజ్ అధికారి తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టామని ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని రేంజ్ అధికారి తెలిపారు. అయితే, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదని, తూతూమంత్రంగా, నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులెత్తేశారని స్థానికులు చెబుతున్నారు. తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు -
‘అల్లూరి’ సాహసం ఆదర్శనీయం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నగరంపాలెం: బ్రిటిష్ వారిపై ప్రథమంగా పోరాడి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి అల్లూరి సీతారామరాజు మార్గదర్శకునిగా నిలిచారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రజలపై బ్రిటిష్ వారు చేస్తున్న దురాగతాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలి అని అన్నారు. స్వాతంత్య్ర సమరానికి ఆద్యుడని చెప్పారు. స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటమే సరైన మార్గమని సీతారామరాజు భావించారని తెలిపారు. జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, సీఐలు అలహరి శ్రీనివాసరావు, ఆనంద్, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్ నివాళులర్పించారు. బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మహనీయుడు అల్లూరి గుంటూరు ఎడ్యుకేషన్: బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషు పాలకులను తరిమికొట్టడంలో అల్లూరి వీరోచిత పాత్ర పోషించారని తెలిపారు. అకౌంట్స్ అధికారి పి. శామ్యూల్‌పాల్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి వీరోచితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటంలో గిరిజనులను సమాయాత్తం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కూచిపూడి మోహన్‌రావు, ఏవో రత్నంబాబు, ఉద్యోగులు తోట ఉషాదేవి, నిర్మల భారతి పాల్గొన్నారు. మన్యం వీరుడికి ఘన నివాళి గుంటూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. నగర శివారుల్లోని లాంఫాం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వీసీ డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీదేవి అల్లూరి చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి. రామచంద్రరావు, అధికారులు, భోధన, భోదనేతర సిబ్బంది అల్లూరి చేసిన పోరాటాలు, నాయకత్వ లక్షణాలను కొనియాడారు. -
తొండపిలో పోలీసుల కార్డన్ సెర్చ్
తొండపి(ముప్పాళ్ళ): మండలంలోని తొండపి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ, ఫ్యాక్షన్ నేపఽథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా గృహాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటిని, దుకాణాలను సోదాలు చేశారు. పలు ఇళ్లలో మారణాయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు తమ దృిష్టి వచ్చిందని, అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 60 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎటువంటి పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, స్టేషన్ ఎస్హెచ్ఓ సుబ్బారావు, ముప్పాళ్ల ఎస్ఐ వి.సోమేశ్వరరావు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ మహిళలకు ఉచితంగా కుట్టు, కంప్యూటర్ శిక్షణ నరసరావుపేట ఈస్ట్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఎస్సీ మహిళలకు మూడు నెలల పాటు ఉచితంగా కుట్టు, కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ), ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎన్ఏసీ శిక్షణ కేంద్రంలో ఈ తరగతులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ సామాజిక మహిళలు ఆధార్, కుల ధ్రువీకరణ, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ లింక్ మొబైల్ ఫోన్‌తో ఎన్ఏసీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9394102075, 9985496190 నెంబర్లులో సంప్రదించాలని తెలిపారు. రెంటాలలో 22 గేదెల దొంగతనం రెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామంలో 22 గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామంలోని కటికల సంసోన్, పేరుపోగు ఇస్రాయేల్, కటికల యేసయ్య, చిలక మరియమ్మలకు చెందిన 22 గేదెలు ఏప్రిల్ 26న మేత కోసం పొలం వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కల గ్రామాలలో గాలించినా కనిపించపోవడంతో, ఎవరైనా దొంగిలించి ఉంటారని నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన గేదెల విలువ సుమారు రూ. 3.90 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.ఽ ధర్మకర్తల మండలికి దరఖాస్తు చేసుకోండి రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్దనున్న అతి పురాతన శైవక్షేత్రమైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నియామకం చేపడుతున్నామని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించి కమిషనర్ దేవదాయశాఖ గొల్లపూడి విజయవాడ వారు నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు . పూర్తిచేసిన దరఖాస్తును ఈ నెల 26 తేదీలోపు పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి నరసరావుపేట వారికి నేరుగా అందజేయాలని సూచించారు. దరఖాస్తుల కోసం దేవదాయ శాఖ సత్తెనపల్లి ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని ఆయన తెలిపారు. -
అది ఆత్మహత్య కాదు..!
యడ్లపాడు: మండలంలోని కొండవీడు రెవెన్యూ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనపై బుధవారం యడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ ఘటనలో దాసరిపాలెం గ్రామానికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి కొర్నెపాటి తేజ(19) కొండగట్టుపై నుంచి క్వారీనీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, తన కుమారుడిది ఆత్మహత్య కాదని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తేజ తండ్రి కొర్నెపాటి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మే 5వ తేదీ రాత్రి తేజ స్నేహితుడు కోటిరెడ్డితో కలిసి చౌడవరం శివారులోని ప్రైవేటు వసతి గృహంలో ఉన్న మిత్రుడి గదికి చదువుకోడానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం స్నేహితులు తండ్రి మహేష్ వద్దకు వచ్చి తేజ, కీర్తనలు ప్రేమలో ఉన్నారని, పెద్దల నిరాకరణతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. వారిద్దరూ చౌడవరం బాలకుటీర్ పాఠశాల వెనుక ఉన్న క్వారీ నీటి గుంటలో దూకారని చెప్పిన స్నేహితులు, కీర్తనను అప్పటికప్పుడు కాపాడినట్లు మహేష్‌కు చెప్పారు. అయితే, తేజ కనిపించకపోవడంతో తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని కుంట వద్ద తేజ చెప్పులు గుర్తించాడు. స్థానికుల సహాయంతో గుంటలో నీటిని తోడించగా మృతదేహం వెలికి తీశారు. ఈ సంఘటనపై తేజ తండ్రి కుమారుడి మృతిపై కీర్తనతో పాటు స్నేహితులు కోటిరెడ్డి, చందులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబానికి అప్పగించారు. నా కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపండి క్వారీ కుంటలో పడి మృతి చెందిన తేజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న యడ్లపాడు పోలీసులు -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి
వెల్దుర్తి: మండలంలోని బోదిలవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు అత్తులూరి హనుమంతరావుపై అదే గ్రామానికి చెందిన కంకనంపాటి పాపయ్య, మందలపు రాజేష్‌లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హనుమంతరావు పొలానికి వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంలో బస్టాండ్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు ఆయనపై రాళ్లు, కర్రలతో దాడి చేయటంతో గాయాలపాలయ్యాడు. బంధువులు హనుమంతరావును మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సరావుపేట వైద్యశాలకు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు నూజెండ్ల: పిచ్చికుక్క దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కమ్మవారిపాలెం యానాది కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై రాత్రి 12 గంటల సమయంలో ఓ పిచ్చికుక్క దాడి చేసింది. కాలనీకి చెందిన మల్లవరపు వెంకటేశ్వర్లు, మల్లవరపు అంకమ్మ, చలంచర్ల అప్పారావులను కరిచింది. 108 వాహనంలో బాధితులను నూజెండ్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. యాంటీరేబిస్ ఇంజక్షన్ ఇవ్వాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవటంతో అక్కడి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి వినుకొండ వైద్యశాలకు తరలించారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
నరసరావుపేటటౌన్: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 70 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎం.వి.చరణ్ తెలిపారు. బుధవారం స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాష్‌నగర్‌కు చెందిన వెల్లలచెరువు వెంకట శివరామకృష్ణ బల్లికురవ మండలం, గుంటుపల్లి గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో దైవదర్శనానికి వెళ్లాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకు వెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇంటివద్ద లభ్యమైన సీసీ పుటేజ్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, బందారం గ్రామానికి చెందిన దుద్దేలింగంగా గుర్తించామన్నారు. నిందితుడి కోసం గాలిస్తుండగా అతనితో పాటు మరో ముగ్గురు చోరీ సొత్తును పంచుకుని విక్రయించేందుకు వెళుతూ రైల్వే స్టేషన్ వద్ద పట్టుబడ్డారని తెలిపారు. నలుగురి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదు అవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ వంశీకృష్ణ, సిబ్బంది వీరాంజనేయులు, మురళికృష్ణలను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా కేసులు అతనికి సహకరించిన మరో ముగ్గురు అరెస్టు బంగారు ఆభరణాలు స్వాధీనం -
కేసులు ఎక్కువగా పరిష్కరించేందుకు సహకరించాలి
గుంటూరు లీగల్: జులైలో జరగబోవు లోక్ అదాలత్‌లో కేసులు ఎక్కువుగా పరిష్కరించేందుకు సహకరించాలని జిల్లా జడ్జి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ స్టేక్ హోల్డర్స్ , కంపెనీ న్యాయవాదులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా జడ్జి వివరించారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్ . శరత్‌బాబు, మూడవ అదనపు జిల్లా జడ్జి సీహెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, రెండవ అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై. సూర్యనారాయణలు ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్ ప్రతినిధులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీ రామ్ ట్రాన్స్‌పోర్టు, మార్గదర్శి చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్, చలపతి ఫైనాన్స్, కంపెనీ కౌన్సెల్స్ పాల్గొన్నారు . -
సిందూర్.. సెల్యూట్
గుంటూరు మెడికల్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. భారత మాతాకి జై.. జై జవాన్, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న భారతీయులకు ఈ విజయం అంకితమని తెలిపారు. పాక్‌కు సరైన గుణపాఠం చెప్పారని, ఇప్పటికై నా కవ్వింపు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ మన దేశ సైనిక బలగాల దృఢసంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ సైన్యానికి మద్దతుగా భారత ప్రజలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఖబడ్దార్ పాకిస్థాన్ మంగళగిరి: పెహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను వీరోచితంగా ధ్వంసం చేసిన సైన్యం శక్తి, సామర్థ్యాలకు దేశం గర్విస్తోందని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడిని స్వాగతించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైన్యానికి యావత్ దేశం అండగా నిలవాలని పిలుపునించారు. భారత్ మాతాకి జై..వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ఆపరేషన్ సిందూర్‌పై హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఏబీపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూర్ణిమ లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. సైన్యానికి మద్దతుగా సంఘీభావం గుంటూరు మెడికల్: బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఆ పార్టీ నేతలు బుధవారం జాతీయ జెండాలతో సంఘీభావం తెలిపారు. స్థానిక నాజ్ సెంటర్లోని వాజపేయి విగ్రహం వద్ద భారత దేశ సైన్యానికి మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్ మాట్లాడుతూ చర్యకి ప్రతి చర్య ఉంటుందని ప్రధాని మోదీ ముందే తెలిపారని, దానికి అనుగుణంగా ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టారని వివరించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కోరారు. భారతదేశంలో పాకిస్థాన్ పేర్లతో ఉన్న అన్నింటికీ భారతీయుల పేర్లు పెట్టాలని ప్రధానమంత్రిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, మండల అధ్యక్షుడు మలిశెట్టి పవన్ కుమార్, మైనారిటీ మోర్చా నాయకులు ఖుద్దూస్, రఫీ, సురేష్ కుమార్ జైన్, బజరంగ్ రామకృష్ణ, నాగేశ్వరావు, మండల నాయకులు పాల్గొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై జిల్లా ప్రజల ఆగ్రహం ఆపరేషన్ సిందూర్‌పై హర్షాతిరేకాలు కులమతాలకు అతీతంగా సైనికులకు వెన్నుదన్ను పాక్‌కు గుణపాఠం చెప్పాలని నినాదాలు -
శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
● త్వరగా నిర్మాణ పనులు పూర్తి ● కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నెహ్రూనగర్: అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరి సహకారంతో సాధ్యమైనంత త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం శంకర్ విలాస్ పునఃనిర్మాణ పనులకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్, నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లతో కలిసి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ విషయంలో కొన్ని అపోహాలు ఉన్నాయని..వాటిన్నింటిని తీరుస్తామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణంతో కొంత మేర ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నప్పటికీ సహకరించాలని ఆయన కోరారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ శంకర్‌విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా జీవనోపాధి దెబ్బతినే వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని తెలిపారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాల్ని నగరపాలక సంస్థ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నేతల అసంతృప్తి శంకర్ విలాస్ బ్రిడ్జి శంకుస్థాపనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావుకు ప్రాధాన్యత కల్పించక పోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిలాఫలకం వద్దకు బీజేపీ జిల్లా అధ్యక్షుడిని ఆహ్వానించకుండానే శంకుస్థాపన చేయడంపై మండిపడ్డారు. -
ప్రజలపై నీటి భారం మోపే కుట్ర !
● మేయర్ అధ్యక్షతన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం ● ప్రతి ఇంటికి నీటి మీటర్ ఏర్పాటు చేయాలి ● కమిషనర్‌ను చూసి ప్రజలు నవ్వుతున్నారు ● గుంటూరు నగర పశ్చిమ ఎమ్మెల్యే మాధవి వ్యాఖ్య ● నీటి మీటర్లను వ్యతిరేకించిన తూర్పు ఎమ్మెల్యే నసీర్ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోగా ప్రజల నడ్డి విరిచేందుకు అన్ని దారులు వెతుకుతోంది. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన బుధవారం నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రతి ఇంటికీ నీటి మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మద్దతు పలికారు. అయితే, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వ్యతిరేకించారు. తూర్పులో ఎక్కువ శాతం పేదలు నివసిస్తుంటారని, వారిపై భారం వేయవద్దని కోరారు. అవసరమైతే పశ్చిమ నియోజకవర్గంలో నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జ్యోతిర్మయి అపార్ట్మెంట్ అంశాన్ని సైడ్ చేసేందుకేనా? నగరంలో జ్యోతిర్మయి అపార్ట్‌మెంట్‌కు అనధికారికంగా నగరపాలక సంస్థ అధికారులు ఎనిమిది అంగుళాల వాటర్ పైపులైన్ కనెక్షన్ ఇచ్చారని, దీని వల్ల ఏడు వార్డులకు తాగునీరు సక్రమంగా అందడం లేదని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ సదరు అపార్ట్‌మెంట్‌కు తొలుత అనధికారికంగా కనెక్షన్ ఇచ్చారని, ఆ తరువాత అన్ని ఫీజులు కట్టించుకుని అధికారికం చేశామని తెలిపారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నగరంలో నీటి వృథా ఎక్కువ ఉందని, మీటర్లు పెడితే తగ్గించవచ్చని సూచించారు. దీనికి జ్యోతిర్మయి అపార్ట్మెంట్ అంశం నుంచి అందరి దృష్టి మర్చలేందుకు నీటి మీటర్ల ఏర్పాటును లేవనెత్తారని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పారు. కమిషనర్‌ను చూసి ప్రజలు నవ్వుతున్నారు నగర కమిషనర్ రోడ్ల వెంబడి తిరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సమస్యలకు పరిష్కారం దొరక్కపోవడంతో ప్రజలు నవ్వుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వీధి కుక్క దాడిలో ఓ చిన్నారి చనిపోయిన కొద్దిరోజుల తరువాత, పిచ్చి కుక్క ఒకేసారి 20 మందిపై దాడి చేసిందని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల ఉపయోగం లేదన్నారు. వీధి కుక్కల నియంత్రణకు గత రెండు సార్లు కౌన్సిల్లో మాట్లాడానని, అసెంబ్లీలో కూడా ప్రస్తావించినా అధికారుల నుంచి అశించిన స్థాయిలో సమాధానం రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడం లేదు కాబట్టే, ఒకే ప్రశ్న సభ్యులు రెండు, మూడు సార్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపారు. ఈసారి ఇదే విధంగా జరిగితే సంబంధిత అధికారిపై సస్పెన్షన్ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మాధవి కోరారు. -
సరస్వతీ నిలయం.. శిథిలం
అధ్వానస్థితిలో గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు ఎడ్యుకేషన్: నగరం నడిబొడ్డునున్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. శ్లాబ్ బీటలు వారి, పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి.1958లో స్థాపించిన గ్రంథాలయం దశాబ్దాల తరబడి పాఠకులకు విజ్ఞానాన్ని అందిస్తోంది. దశాబ్దాల కిందటి వార్తా పత్రికలను ఇక్కడ భద్రపరుస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో ఇక్కడి కాంపిటీటివ్ విభాగంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయాన్ని గడుపుతున్నారు. కొత్త పుస్తకాల జాడే లేదు పోటీ పరీక్షల విభాగంలో గత పదేళ్లుగా పుస్తకాల కొనుగోలు జాడ లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో పోటీ పరీక్షల శిక్షణార్థులకు అవసరమైన మేరకు పుస్తకాలు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పుస్తకాలను పంపిణీ చేసిన దాఖలాలు లేవు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రతి రోజూ 100 మందికి పైగా అభ్యర్థులు గ్రంథాలయంలోని పుస్తకాల పైనే ఆధారపడుతున్నారు. అవసరమైన సంఖ్యలో పుస్తకాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూ. 8 కోట్లతో నాలుగు అంతస్తుల నూతన గ్రంథాలయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్నెళ్ల కిందట ప్రభుత్వానికి పంపారు. ఇంత వరకు స్పందించక పోవడంతో పాఠకులు శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మౌలిక వసతులు కరువు మూలన పడిన ఇంటర్నెట్ విభాగం పాఠకులకు అవస్థలు ప్రతిపాదనలు పంపాం కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపాం. దాతల సహకారంతో పుస్తకాల కొరత లేకుండా చూస్తున్నాం. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు పని చేయడం లేదు. –ఎన్. వెంకటేశ్వరరావు, గ్రంథాలయాధికారి ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బంది గ్రూప్స్‌తో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. అయితే, ఇంటర్నెట్ విభాగం పనిచేయకపోవడంతో ఆన్లైన్లో సమాచారం పొందడం ఇబ్బందిగా ఉంది. – జి. లక్ష్మణరావు టాయిలెట్లు లేక అవస్థలు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో బయాలజీకి ప్రిపేరవుతున్నా. టాయిలెట్ల సదుపాయం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. రిఫరెన్స్ విభాగంలో శ్లాబు కింద పడుతుందేమోనని భయంగా ఉంది. – బి. అశోక్ మౌలిక వసతులు కరువు మహిళలకు మినహా, పురుషులకు టాయిలెట్ల సదుపాయం లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ మిషన్ అలంకారంగా మారింది. రన్నింగ్ వాటర్ సదుపాయం లేకపోవడంతో మున్సిపల్ వాటర్‌ను డ్రమ్ములో నిల్వచేసి, వాటర్ మిషన్‌లో పోస్తున్నారు. కాంపిటీటివ్ విభాగంలో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ విభాగం మూతపడింది. ఇంటర్నెట్ బిల్లులు చెల్లించకపోవడంతో మూసేశారు. ఫలితంగా ఇంటర్నెట్ విభాగంలోని 10 కంప్యూటర్లు మూలనపడ్డాయి. -
రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ బృందం
తెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో ఇటీవల నిర్మించిన పలు సీసీ రోడ్ల నాణ్యతను బుధవారం గుంటూరు నుంచి వచ్చిన క్వాలిటీ కంట్రోల్ సభ్యులు పరిశీలించారు. యడ్లలింగయ్య కాలనీలో–6, అమరావతి ప్లాట్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర, పూలే కాలనీ, చెంచుపేట రత్నశ్రీ పబ్లిక్ స్కూల్ దగ్గర, గంగానమ్మపేట శివాలయం వద్ద నిర్మించిన పలు రోడ్లను పరీశీలించి, వాటికి నాణ్యత పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ ఆకుల శ్రీనివాసరావు, ఏఈలు సూరిబాబు, సునీల్, జానీ బాషా పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్ పోటీలలో మదిర షానూన్ సత్తా మంగళగిరి: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో ఈనెల 6న జరిగిన ఏషియన్ జూనియర్ క్లాసిక్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొన్న మదిర షానూన్ 47 కేజీల విభాగంలో సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. తెనాలికి చెందిన షానూన్ అక్కడే ఉన్న క్విక్ ఫిట్నెస్ ఎరినాలో అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయి రేవతి వద్ద శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. పతకాలు సాధించిన షానూన్‌ను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలియజేశారు. తెనాలిలో సదరం క్యాంప్ పునఃప్రారంభం తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్‌ను నిర్వహించారు. ఆర్థో, ఈఎన్టీ, సైక్రాటిక్ విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాల్లో కూడా క్యాంప్ జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం మంగళగిరి టౌన్: స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం భగవత్ ప్రార్థన, ఆచార్య స్తోత్ర పాఠం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విగ్వరణం, రక్షా బంధనం, మృత్సంగృహణం, అంకురార్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామికి పంచామృత స్నపన, తిరుమంజనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయ ంత్రం రామలక్ష్మణస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. -
గుంటూరు
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పూజలు దాచేపల్లి: వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. గణపతిహోమం, శాంతిహోమం నిర్వహించి, లక్ష మల్లెల పూజలు జరిపించారు. కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు తెనాలిఅర్బన్: చెంచుపేట ఆర్పీఎం క్లబ్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు బుధవారం కొనసాగింది. మురుగు కాల్వలపై ఆక్రమణలను అధికారులు పూర్తిగా తొలగించారు. నేడు దేవాలయం ప్రతిష్టవేడుకలు శావల్యాపురం: కృష్ణాపురంలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బుధవారం విగ్రహాల జలాభిషే కం జరిగింది, గురువారం ప్రతిష్ట వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.9 -
పౌర రక్షణ.. సమర శిక్షణ
లక్ష్మీపురం: అత్యవసర పరిస్థితులు, యుద్ధ సమయాల్లో పౌరులు పాటించాల్సిన స్వీయ రక్షణ జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడానికి పోలీసులు గుంటూరు రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. డానికి పోలీసులు గుంటూరు రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎ.రమణమూర్తి, అదనపు ఎస్పీ (ఏఆర్) ఏ. హనుమంతు పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ యుద్ధ సమయాల్లో అప్రమత్తతతో అనర్థాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు. విపత్కర సమయాల్లో అత్యవసర సేవలకు సంబంధించి ఆయా శాఖల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారనే సందేశాన్ని కూడా ఈ పౌర రక్షణ మాక్ డ్రిల్ ద్వారా ఇచ్చినట్లు తెలిపారు.అదనపు ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రమాద హెచ్చరిక సైరన్ బట్టి ప్రత్యేక బలగాలు, సిబ్బంది సామాన్య పౌరుల మాదిరి స్వీయ రక్షణ కోసం అకస్మాత్తుగా కింద పడుకోవాలని సూచించారు. పెద్ద శబ్దాలను తట్టుకోవడానికి రెండు చేతులతో చెవులను మూసుకునీ, అటుఇటు కదలకుండా బోర్లా పడుకోవాలని సూచించారు. ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడం కోసం అత్యవసర వైద్య సేవల సిబ్బంది అంబులెన్స్‌లోకి తీసుకువెళ్లడం గురించి వివరించారు. బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగి ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు, దొరికిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వెస్ట్ డీఎస్పీ అరవింద్ , రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ , పోలీస్ బలగాల సిబ్బంది, పౌరులు ల్గొన్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ గుంటూరు రైల్వే స్టేషన్లో పోలీసుల మాక్ డ్రిల్ -
వైఎస్సార్సీపీలోకి పలువురు మాజీ ఉద్యోగ సంఘం నేతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి బి.ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీవోస్ సంఘం నాయకులు తోట సీతారామంజనేయులు తదితరులు పార్టీలో చేరారు. అనంతరం వారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తాం: నలమారు చంద్రశేఖర్ రెడ్డికూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు. తాజాగా ఉద్యోగ నాయకుల చేరికతో వైయస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం మరింత బలోపేతం అయ్యింది. అందరం కలిసికట్టుగా ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. వైయస్సార్సీపీని బలోపేతం చేయడం ద్వారా వైయస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తాం.వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవడమే లక్ష్యం: : బీవీ సుబ్బారావువైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనల్లో వచ్చిన మార్పులను ఆయనకు వివరించడం జరిగింది.ఉద్యోగులకిచ్చిన హామీలు నెరవేర్చాలి: బండి శ్రీనివాసరావుమాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మాట తప్పను, మడమ తిప్పను అని మాటల్లో కాకుండా తన ఐదేళ్ల సంక్షేమ పాలనతో నిరూపించుకున్న గొప్ప నాయకుడు జగన్. మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావించి పరిపాలన చేశారు. ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా ఉద్యోగులకు ఎన్నికల్లో ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేస్తున్నారు. పెన్షనర్లకు ఎన్‌క్యాష్ మెంట్ ఆఫ్ ఎర్రర్ లీవ్ బెనిఫిట్స్, రెగ్యులర్ ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవ్ బెనిఫిట్స్ అమలు కాలేదు. డీఏలు పెండింగ్‌లో ఉంచారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీలో చేరడం జరిగింది.జగన్ వస్తేనే మళ్లీ ఉద్యోగులకు మంచిరోజులు: ఉమామహేశ్వరరావు2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ తన సంక్షేమ పాలనతో గుప్తుల స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చారు. కరోనా విలయతాండవంతో ప్రపంచమంతా వణికిపోయినా సంక్షేమ పథకాలను ఆపకుండా రాష్ట్ర ప్రజలను తన కుటుంబంలా కాపాడుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేసినా ఆ డబ్బంతా ఏం చేసిందో అర్థంకాని పరిస్థితి. మోసపూరిత హామీలతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలే కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ వైయస్ జగన్ ను సీఎం చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి.ఉద్యోగుల సంక్షేమం కోసమే వైఎస్సార్సీపీలో చేరా: విజయసింహారెడ్డిఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం వైయస్సార్సీపీలో చేరడం జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయితేనే ఉద్యోగులకు మళ్లీ మంచిరోజులొస్తాయి. -
ఉగ్రవాద స్థావరాలు,శిబిరాలపై దాడి అనివార్య చర్య: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ..ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
నేడు అల్లూరి వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. అల్లూరి సీతారామరాజుకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అడవిబిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.… pic.twitter.com/iCLvQgElEG— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. -
భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
కూటమి ప్రైవేటు దోపిడీ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారుల నుంచి కూటమి నేతలు అనధికార వసూళ్లకు పాల్పడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు. స్ట్రీట్ వెండింగ్ పాలసీకి వ్యతిరేకంగా వీధి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇంత జరగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చింది ఒకచోట.. వసూలు అంతటా..! సండ్రీస్ మార్కెట్లో చెత్త ఆస్కారం లేకుండా పండ్లు దిగుమతులు చేసే వారి వద్ద నుంచి మాత్రమే ఆశీలు వసూలు చేసుకునే అవకాశం గత నెలలో కల్పించారు. అయితే ఇదే అదనుగా కూటమి నేతలు నగరం అంతా దొంగ టోకెన్లు ముద్రించి దర్జాగా వీధి వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ.48 చిల్లర లేదంటూ రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. చిరువ్యాపారులపై ప్రతాపం గుంటూరు నగరానికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు తట్ట బుట్టల్లో తాటి ముంజలు, బొప్పాయిలు, జామకాయలు, ఈత కాయలు, ఇతర పండ్లు అమ్ముకునేందుకు వస్తుంటారు. వీరి వద్ద నిబంధనల మేరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు. కానీ వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మేం అంత ఇచ్చుకోలేమని.. ఏదో దూర ప్రాంతం నుంచి పొట్టకూటి కోసం వస్తున్నామని వేడుకున్నప్పటికీ ప్రతి రోజు డబ్బులు కట్టాల్సిందే.. మేము పాట పాడుకున్నాం. లేకపోతే రేపటి నుంచి వ్యాపారం చేసుకోనివ్వం అంటూ వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. దీంతో చేసేదేమి లేక వారి అడిగినంత ఇచ్చేస్తున్నారు. రోజుకు రూ.10వేలుపైనే .. స్ట్రీట్ వెండింగ్ పాలసీపై కొంతమంది వెండర్స్ కోర్టును ఆశ్రయించడంతో గతంలో కమిషనర్‌గా పనిచేసిన కీర్తి చేకూరి ఈ టెండర్ ప్రక్రియ పాలసీపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేదాకా వీధి వ్యాపారుల వద్ద నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారు. 2023 నుంచి సండ్రీస్ మార్కెట్(నగరం అంతా) ఆశీలు వసూలు చేసే కార్యక్రమం రద్దయింది. కానీ కౌన్సిల్ తీర్మానానికి విరుద్దంగా టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు నగరం అంతా నలుగురు ప్రైవేట్ వ్యక్తులను పురమాయించి వీధి వ్యాపారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా రోజుకు రూ.10వేలుపైగానే, నెలకు రూ.3లక్షలకు పైగా కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది. స్ట్రీట్ వెండింగ్ పాలసీకి విరుద్ధంగా వీధి వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు పండ్లు దిగుమతి చేసేవారి వద్ద మాత్రమే వసూలు చేసుకునేందుకు హక్కు అయితే నగరమంతా తిరిగి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు రోజుకు ఒక్కో వ్యాపారి నుంచి రూ.50 వసూలు నెలకు రూ.3లక్షలకు పైగానే కూటమి నేతల జేబుల్లోకి అక్రమ సంపాదన పట్టించుకోని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసే హక్కు ఎవరికీ లేదు. వీధి వ్యాపారులు ఎవరికి కూడా రూపాయి కట్టాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకువచ్చి, ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – చల్లా ఓబులేసు, జీఎంసీ అదనపు కమిషనర్ -
ఏమీ సేతుము చంద్రా..?
గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్‌పేట, బ్రాడీపేట మీదుగా తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతూ వెళుతున్న శంకర్‌విలాస్ సెంటర్ ఆర్ఓబీకి ఘన చరిత్ర ఉంది. 1958లో నిర్మించిన ఈ ఆర్ఓబీ దశాబ్దాల తరబడి గుంటూరు ప్రజల ట్రాఫిక్ అవసరాలను తీర్చుతూ, రవాణాలో కీలకంగా మారింది. 67 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు లైన్లతో కూడిన ప్రస్తుత ఆర్ఓబీ స్థానంలో నాలుగు లైన్లుగా విస్తరించి నిర్మిస్తున్నామనే కారణం తప్ప, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలనే కనీస ఆలోచన, ముందు చూపు కూటమి ప్రభుత్వానికి కొరవడింది. సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా పూర్తిగా కేంద్ర నిధులపై ఆధారపడటం మినహా, గుంటూరు నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైసా నిధులు కేటాయించలేదు. 2017లో ప్రతిపాదనలు 2017లో గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్, అప్పటి ఆర్అండ్బీ మంత్రి అయ్యన్న పాత్రుడు శంకర్ విలాస్ బ్రిడ్జిని విస్తరించి, రూ.167 కోట్లతో లాడ్జి సెంటరు నుంచి హిందూ కాలేజీ జంక్షన్ వరకు మెగా ఫ్లైఓవర్ నిర్మిస్తామని, ముందుగా ఆర్యూబీ నిర్మిస్తామని ప్రకటించారు. ఇందు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశారు. ఐకానిక్ కలలు ఆవిరి నగరంలో పెరిగిన జనాభా, విస్తరిస్తున్న ప్రాంతాల దృష్ట్యా రోజుకు 50 వేల వాహనాల రవాణా బాధ్యతను మోస్తున్న బ్రిడ్జి స్థానంలో భవిష్యత్తులో వందేళ్ల అవసరాలు, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రజల ఆకాంక్షగా ఉంది. బ్రిడ్జికి ఇరువైపులా విద్యా, వైద్యం, వ్యాపార కేంద్రాలు గత 70 ఏళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా ఒక ఐకానిక్ నిర్మాణం జరగాలని ప్రజలు కోరుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఐకానిక్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన, డిజైను రూపకల్పన చేసి, నిర్మాణం చేపడతామని ప్రకటించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య రీత్యా ఈ రహదారిని ఆరులైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తేనే ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అందుకనే నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించి రెండు ఆర్యూబీ ఏర్పాటు చేసి ప్రజల అవసరాన్ని ఆకాంక్షలు తీరుస్తామని గతంలో ప్రకటించారు. ప్రస్తుత డిజైనుతో వాటిల్లే నష్టాలు 930 మీటర్లకు కుదించిన బ్రిడ్జి కోసం 120 అడుగుల విస్తీర్ణంతో రోడ్డు అవసరమని 1.5 కిలోమీటర్ల మేర విస్తరణ చేస్తున్నారు. 70 అడుగుల వెడల్పుతో 930 మీటర్ల నిడివితో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. నాలుగు లైన్ల బ్రిడ్జి మధ్యలో 3.36 అడుగుల డివైడర్ రానున్నది. ఆర్ఓబీ నిర్మాణానికి రెండు, మూడేళ్లు పట్టనుంది. ఇటీవల మూడు వంతెనల వద్ద అదనపు ట్రాక్ నిర్మాణానికి మూడు నెలల పాటు రహదారిని మూసి వేసిన సమయంలో ట్రాఫిక్ కష్టాలను చవి చూసిన ప్రజలకు శంకర్‌విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పేరుతో ప్రభుత్వం అదిపెద్ద షాక్ ఇవ్వనుంది. రెండు, మూడేళ్లపాటు గుంటూరు నగరంలో ట్రాఫిక్, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారనుంది. ఇన్ని సమస్యలతో ముడిపడి ఉన్న దృష్ట్యా, హడావుడిగా కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని శంకర్‌విలాస్ మెగాఫ్లై ఓవర్ సాధన జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై గత కొంత కాలంగా జేఏసీతో పాటు అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తూ, బుధవారం ఏసీ కళాశాల ఎదుట రూ.98 కోట్లతో ఆర్ఓబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ రూ.98 కోట్లతో సరి ప్రజల్లో అసంతృప్తి నగర ప్రజల రవాణా అవసరాలను తీర్చే మెగా ఫ్లై ఓవర్ ప్రాజెక్టును పక్కనపెట్టి, సాధారణ ఆర్వోబీని నిర్మించేందుకు హడావుడిగా చేస్తున్న పనులతో ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. బ్రిడ్జి అవసరాలను బట్టి నిధులా?., నిధుల కేటాయింపులను బట్టి బ్రిడ్జా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గతంలో ఇదే ప్రభుత్వానికి చెందిన ఎంపీ, మంత్రి ప్రతిపాదించిన రూ.167 కోట్ల ఐకానిక్ ఫ్లైఓవర్‌తో పాటు ఆరువైపులా ఆర్‌యూబీలు సైతం ఉన్న పరిస్థితుల్లో ఫ్లై ఓవర్‌ను కుదించడంతో ఒనగూరే లాభం కంటే నష్టమే అధికంగా ఉంది. రెండు కిలోమీటర్లకు పైగా పొడువు కలిగిన మెగా ఫ్లై ఓవర్‌తో ఇరువైపులా వ్యాపార, వర్తక, వైద్య, విద్యాలయాలకు అతి తక్కువ నష్టం వాటిల్లడంతో పాటు ఒకే పిల్లర్ ఉండటంతో పాటు ఇరువైపులా రెండు ఆర్‌యూబీలను నిర్మించడం వలన ఫ్లై ఓవర్ పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలత్తెకుండా ఉంటాయి. గుంటూరు ప్రజల చిరకాల వాంఛ అయిన మెగా ఫ్లై ఓవర్‌కు కూటమి ప్రభుత్వం మంగళం పలికింది. తూర్పు, పశ్చిమలను అనుసంధానం చేస్తూ ఎంతో కీలకమైన రవాణా వ్యవస్థ కలిగిన ఆర్ఓబీ స్థానంలో కొత్తగా మరొక ఆర్ఓబీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించిన పనులకు నేడు శంకుస్థాపన జరగనుంది. ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తు అవసరాలతో సంబంధం లేకుండా అరకొర నిధులతో సరిపెట్టేవిధంగా కూటమి నేతలు ముందుకెళుతుండడంపై అన్నివర్గాల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఆర్ఓబీని ఫ్లై ఓవర్‌గా మార్చి కట్టలేనివారు ఇక ఐకానిక్ బిల్డింగ్లు ఎలా కడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ‘సేతుబంధన్’ నిధులతో సరి శంకరవిలాస్ మెగా ఫ్లై ఓవర్ స్థానంలో సాధారణ ఆర్ఓబీ ఇదేమి చంద్రశేఖరా.. అంటూ ఎంపీపై నగర ప్రజల మండిపాటు 1958లో నిర్మితమైన ప్రస్తుత ఆర్ఓబీ ఆర్యూబీ లేకుండానే నిర్మాణం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం కేంద్రంతో పొత్తు ఉన్నా ఆర్ఓబీని మెగా ఫ్లై ఓవర్ గా మార్పు చేయించుకోలేని దుస్థితి మెగా ఫ్లై ఓవర్‌ను పక్కనపెట్టి రూ.98 కోట్లతో ఆర్ఓబీ నిర్మాణానికి హడావుడిగా ఏర్పాట్లు అందరూ వ్యతిరేకిస్తున్నా ముందుకు.. నేడు శంకుస్థాపన కేంద్ర ప్రభుత్వ సేతు బంధన్ పథకం ద్వారా రూ.98 కోట్ల నిధులు మంజూరుకావడంతో హడావుడిగా ఆర్ఓబీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా ఫ్లై ఓవర్‌కు బదులు సాధారణ ఆర్ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాగం తీసుకున్న చర్యలను నగరంలోని పన్ను చెల్లింపుదారులు, వ్యాపారస్తులు, మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
చలపతి ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్
మోతడక (తాడికొండ): మోతడక చలపతి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొగ్రామ్లకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ న్యూ ఢిల్లీ మూడు సంవత్సరాల కాల వ్యవధితో రెండోసారి అక్రిడిటేషన్ మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ వై.వి.ఆంజనేయులు తెలిపారు. ఎన్బీఏ ఇచ్చిన ఎక్స్‌ఫర్ట్ కంపెనీ ఫిబ్రవరి 15న కళాశాలను సందర్శించి వసతులు, పాటిస్తున్న విద్యా ప్రమాణాలు, జరుగుతున్న పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అధ్యాపకుల ప్రమా ణాలు, సంస్థలో పాటిస్తున్న విద్యాబోధన, తదితర వాటిని పరిశీలించి అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా కళాశాలకు అక్రిడిటేషన్ గుర్తింపు రావడంపై చైర్మన్ వై.వి.ఆంజనేయు లు, కార్యదర్శి వై.సుజిత్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగశ్రీనివాస్లు హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రా వడానికి కారకులైన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ ఫణికుమార్, డాక్టర్ పి.బాలమురళీకృష్ణ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జయకృష్ణ, పలు శాఖాధిపతులు పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025దుర్గగుడి ఈఓగా శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఈఓగా శీనా నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆయన బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. వైభవంగా బ్రహ్మోత్సవాలు పొన్నూరు: సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం పంచామృత స్నపన నిర్వహించారు. శిక్షణ తరగతులు పరిశీలన చుండూరు(వేమూరు): వలివేరు గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులను ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి సుబ్బురత్తమ్మ మంగళవారం పరిశీలించారు. 7 -
విద్యార్థినులకు జెడ్పీ చైర్పర్సన్ అభినందనలు
గుంటూరు ఎడ్యుకేషన్ : గత నెలలో విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో కొల్లిపర మండలం మున్నంగి జెడ్పీ హైస్కూల్ నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో అభినందించారు. 587 మార్కులు సాధించిన చుక్కా జీవన్, 583 మార్కులు పొందిన నలుకుర్తి సుచరిత, 580 సాధించిన మున్నంగి మహిమను అభినందించిన హెనీ క్రిస్టినా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు ఎంచుకున్న లక్ష్యంపై గురి పెట్టి, ఉన్నత చదువులు చదవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.అప్పారావుతోపాటు ఉపాధ్యాయులు పి. సాంబశివరావు, వి.నాగ వరప్రసాద్‌ను అభినందించారు. -
జర్నలిస్టులకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తాం
గుంటూరు మెడికల్: జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా లలితా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ తరుపున పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తామని గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటి హాస్పటల్ అధినేత, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్(ఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ చెప్పారు. ఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలిగా డాక్టర్ విజయ ఎన్నికై న సందర్భంగా మంగళవారం గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వీ సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కె.రాంబాబు, తదితరులు డాక్టర్ విజయను ఘనంగా సత్కరించి అభినందించారు. విజయ మాట్లాడుతూ జర్నలిజం వృత్తి ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని, ప్రజలు, వ్యవస్థలకు సంధానకర్తగా జర్నలిస్టు పని చేస్తారని తెలిపారు. వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకుని తమవంతు బాధ్యతగా లలిత హాస్పిటల్ తరపున ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా పూర్తిగా అండగా వుంటామని హామీ ఇచ్చారు. బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ తెలిపారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు లలితా హాస్పటల్ యాజమాన్యం చేస్తున్న ఉచిత వైద్యసేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగర అధ్యక్షడు వర్రె కిరణ్‌కుమార్, కార్యదర్శి కందా ఫణీంద్ర కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావు, శ్రీనివాసరావు, సుపర్ణ, చలపతిరావు, పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, జగన్మోహన్రెడ్డి, విద్యాధర మురళి, మార్కండేయులు, ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదు జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు హెచ్చరించారు. జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించకుండా, ప్రభుత్వ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. సోమవారం గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. హెల్త్ స్కీం కూడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న ఒంగోలులో యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఐఎస్ఐ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డాక్టర్ విజయకు సన్మానం -
తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు
తెనాలిఅర్బన్: ఇండియన్ తైక్వాండో వారు నిర్వహించిన ఫస్ట్ ఫెడరేషన్ కప్, కిడ్స్ చాంపియన్ షిప్ పోటీల్లో తెనాలి కెఎస్ఆర్ తైక్వాండో అకాడమికి చెందిన షణ్ముఖ అభిరామ్, లంకరాజు శిరీషలకు బంగారు పతకాలు, లంకరాజు శ్రీ శౌర్యకు వెండి పతకం లభించినట్లు కోచ్ కె.శ్రీనివాసరావు తెలిపారు. వీటిని మహారాష్ట్రంలో ఏప్రిల్ 25నుంచి మే ఒకటి వరకు నిర్వహించినట్లు చెప్పారు. పతకాలు సాధించిన విద్యార్థులను మంగళవారం అకాడమి ఆవరణలో అభినందించారు. కార్యక్రమంలో వీరవల్లి మురళి, కె.నాగభూషణం, టి.పోతురాజు, కె.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి: ‘‘ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది.. వారికి కష్టం అంటూ తెలియకుండా భర్తతో కలిసి కష్టపడుతూ గారాబంగా పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, పెద్దవారిని చేసింది. అందరికీ పెళ్లిల్లు చేసి.. జీవితాలు చక్కదిద్దింది. ఈక్రమంలో ముదిమి మీదపడింది.. భర్త కాలం చేశాడు.. పుట్టెడు దుఖఃలో ఉన్నా అండగా కొడుకులు ఉన్నారులే.. అంటూ సముదాయించుకుని, కుమారుల చెంతకు చేరింది. వారు కనీసం ఇళ్లల్లోకి రానివ్వలేదు సరికదా.. ముఖం పైనే తలుపులేశారు. పోనీలే.. వాళ్లకు తెలీదులే అనుకుంటూ వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని, కూలీనాలీ చేసుకుంటూ ఒంటరిగా బతకసాగింది. ఇంతలో విధి వక్రీకరించి, కాలు విరిగింది. తన పనులు తాను చేసుకోలేని దుస్థితిలో మంచానపడింది. ఇంటియజమానులు ఖాళీ చేయాల్సిందేనంటూ హుకూం జారీచేయగా, కొందరు సహృదయులు ఆమెను ఆటోలో కన్నకొడుకుల ఇళ్లకు తీసుకెళ్లారు. మంచానపడి దీనావస్థలో ఉన్న ఆ వృద్ధ తల్లిని చూసికూడా కరగలేదా పాషాణ హృదయాలు.. ఆమెకు మాకు ఏసంబంధం లేదంటూ.. మా ఇంటికి ఎందుకుతెచ్చారంటూ తెచ్చినవారిపై పోట్లాటకు దిగారు.’’ వివరాల్లోకి వెళితే పెదకాకాని మండలం నంబూరుకు చెందిన కొండవీటి మాణిక్యమ్మకు ముగ్గురు కుమారులు. భర్త మృతి చెందాడు. తాను పెంచి పోసించిన కుమారులు ఎవరు ఇంటిలోనికి రానివ్వకపోవడంతో మండలంలోని పెదవడ్లపూడి చేరుకుని తన రెక్కల కష్టం మీద బతుకుతుంది. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ప్రశాంతంగా నివసిస్తున్న మాణిక్యమ్మ ఇటీవల బాత్రూమ్లో కాలు జారిపడడంతో దెబ్బతగిలి నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో వంట కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమనడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాణిక్యమ్మ దుస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ ఆమెను ఆటోలో తీసుకుని పెదకాకానిలోని కుమారులు వద్దకు తీసుకెళ్లాడు. కుమారులు తమకు ఆమెకు, మాకు సంబంధం లేదని తెగేసి చెప్పడంతో వృద్ధురాలిని పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. -
కోర్టును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
పొన్నూరు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మంగళవారం పట్టణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. నూతనంగా నిర్మాణం చేపట్టాల్సిన కోర్టు భవనాలకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. ఆయనకు కోర్టు న్యాయమూర్తి ఏకా పవన్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాజీ సాహెబ్, సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పొందుగుల జయరాజు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తూమాటి రమేష్, ఏజీపీ ఎన్.శ్రీనివాస్, న్యాయవాదులు, గుమస్తాలు, సిబ్బంది పాల్గొన్నారు. జెడ్పీ బడ్జెట్‌ను ఆమోదించిన ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత మార్చి 31 నాటికే ఆమోదం పొందాల్సిన బడ్జెట్‌ను ఆమోదించలేకపోవడంతో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 199 సబ్ రూల్ 3 కింద బడ్జెట్ ఆమోదం కోసం జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గత నెలలో ప్రభుత్వానికి పంపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.643 కోట్ల ఆదాయంతో రూపొందించిన అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కె.శ్రీనివాస్ నెహ్రూనగర్: గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా కె.శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సర్వీసెస్ నుంచి డెప్యూటీ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బదిలీ చేశారు. గతంలో ఈడీగా పనిచేసిన పి.ప్రేమకుమారి ఉద్యోగ విరమణ చేయడంతో ఇన్చార్జి ఈడీగా దుర్గాబాయి బాధ్యతలు నిర్వహించారు. నూతన ఈడీగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. జిల్లాలో ఏఎస్ఐలు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్ల బదిలీలు నగరంపాలెం: జిల్లాలోని పోలీస్స్టేషన్ల్లో ఐదేళ్లు పూర్తయిన కానిస్టేబుళ్లు నుంచి ఏఎస్ఐలకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పర్యవేక్షించారు. 12 మంది ఏఎస్ఐలు, 27 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మరో 27 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించేందుకు అందుబాటులో ఉండాలని చెప్పారు.జిల్లా ఏఎస్పీ జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సీసీ ఆదిశేషు, జూనియర్ సహాయకులు పాల్గొన్నారు. రైల్వే అధికారులకు ఆహ్వానం లేదు లక్ష్మీపురం: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులకు ఎలాంటి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకపోవడంతో బుధవారం ఉదయం 9 గంటలకు కేంద్ర సహాయక మంత్రి పెమసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఆర్ఎం బుధవారం ఉదయం రేపల్లె రైల్వేస్టేషన్ తనిఖీలకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
నాలుగు లైన్లరహదారితో మేలు
గుంటూరు వెస్ట్: అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు నూతనంగా నిర్మించనున్న నాలుగు లైనుల (గ్రీన్ ఫీల్డ్) రోడ్డు నిర్మాణంతో ఎందరికో మేలు జరుగుతోందని బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో స్టేక్ హోల్డర్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఎంపీతోపాటు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్రవర్మ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రింగ్‌రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు 47.848 కిలోమీటర్లు నాలుగు లైనుల రోడ్డు నిర్మాణం వల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. ఆరు మాసాల్లో నిర్మాణ పనులకు అనుమతులు పొందిన తరువాత మరో 18 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళిలు మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, ఫిషరీస్, వ్యవసాయం, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి ఏవైనా అంశాలు ఉంటే పూర్తి వివరాలతో శుక్రవారం సాయంత్రంలోపు అందించాలని పేర్కొన్నారు. అధికారులు అందించిన వివరాలు క్రోడీకరించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ వారికి పంపుతామని వివరించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను నేషనల్ హైవే అథారిటీ అధికారులు వివరించారు. సమావేశంలో ఎన్‌హెచ్ ఏఐ పార్వతీశం, డీఆర్వో షేక్ ఖాజావలి, డీపీఓ నాగసాయికుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ -
నల్లచెరువులో ఎస్పీ పర్యటన
పట్నంబజారు: గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్‌కుమార్ మంగళవారం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోనీ నల్ల చెరువులో ప్రాంతంలో పర్యటించారు. లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్ అగ్రహారం, వాకింగ్ ట్రాక్ ప్రాంతం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, బొమ్మల సెంటర్, నల్లచెరువు, సంపత్ నగర్లో ప్రత్యేక బలగాలతో కాలినడకన పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతల అంశంపై స్థానికులను ఆరా తీశారు. నల్ల చెరువులో నివసించే మహిళలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు అన్నివేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, లాలాపేట సీఐ శివప్రసాద్, ఎస్బీ సీఐ ఏ.శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి లక్ష్మీపురం: బర్లీ పొగాకును నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని కౌలు రైతు సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో హరిబాబు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఈ సంవత్సరం 86 వేల ఎకరాలు బర్లీ పొగాకును రైతాంగం అనేక వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేశారన్నారు. గతంలో క్వింటా రూ. 18వేలకు కొనుగోలు చేయగా ఈ సంవత్సరం రూ.4వేలు మాత్రమే ధర పలికిందన్నారు. రైతాంగం అప్పులు చేసి పంట సాగు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి క్వింటా రూ.15 వేలకు కొనుగోలు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖామంత్రి, కంపెనీల అధికారులు వెంటనే స్పందించి పొగాకు కొనుగోలు చేయాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కార్మికులు, రైతాంగం, పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హర్థాళ్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు ఛానల్ పనులు ప్రారంభించాలని, నల్లమడ ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా బొట్ల రామకృష్ణ, నాగమల్లేశ్వరరావులు ఎన్నికయ్యారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ములకా శివ సాంబిరెడ్డి, పి కృష్ణ, అమ్మిరెడ్డి పాల్గొన్నారు. -
కౌలు రైతుల పరిస్థితి దయనీయం
లక్ష్మీపురం: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో కంజుల విఠల్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమ్యునిస్టు పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు కార్డులు అందక కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే పదుల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతులకు కౌలు కార్డులు, బ్యాంక్ రుణాలు, అకాల వర్షాలతో నష్టపోయినవారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 13న గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో కౌలురైతులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
చెరువు భూములపై బడాబాబుల కన్ను
తాడికొండ: తాడికొండ మండలం పాములపాడులో ఎస్సీలకు చెందిన చెరువు భూములు కారుచౌకగా కొట్టేసేందుకు బడా బాబులు రంగంలో దిగారు. రెండో దశలో పూలింగ్ జరుగుతుందనే ఊహాగానాలు వెలువడడంతోపాటు, కొన్ని గ్రామాల్లో నోటిఫికేషన్, గ్రామ సభలు ప్రారంభమైన నేపథ్యంలో కారుచౌకగా భూములు కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే పాములపాడులోని చెరువు పోరంబోకు సర్వే నంబరు 132లో 30.50 ఎకరాలపై మంగళవారం ప్రైవేటు సర్వేయర్లతో కొలతలు వేయించి దళితుల భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. ఎకరా రూ. 17లక్షల నుంచి రూ. 19 లక్షలు చొప్పున భూములు కొనుగోలు చేస్తాం, డీకే పట్టాలు ఉంటే తమకు అప్పజెప్పడంటూ అభయమిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. విజయవాడకు చెందిన ప్రైవేటు సర్వేయర్ల బృందం కొలతలు వేస్తుండటంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్ఓ సర్వే నిలుపుదల చేయించారు. విషయంపై ఆరా తీయగా, ఎవరో విజయవాడకు చెందిన వ్యక్తులు కొనుగోలు చేసేందుకు వచ్చారని, తమకు అంతకు మించి ఏమీ తెలియని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కో రైతు ఖాతాలోకి రూ. 11వేలు చొప్పున బయానా ఇచ్చి ఇప్పటికే భూములు స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పూలింగ్‌లో లాభపడేందుకే..! పాములపాడు, వరగాని, రావెల, గ్రామాల్లో సినీ హీరో నందమూరి బాలకృష్ణ, భార్య వసుంధర పేరిట భూములు కొనుగోళ్లు జరిగాయి. వీటితోపాటుగానే ఈ భూములు కూడా లోకేష్, బాలకృష్ణ అనుచరులు కొనుగోలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో చౌడు, బీడు, సాగుకు పనికి రాని భూములను రూ. 25లక్షల నుంచి రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏకంగా చెరువు భూముల మీద కన్ను పడింది. ఒకే ప్రాంతంలో 30 ఎకరాల భూమి దానికి కొంత పోరంబోకు, కలిపి సుమారు 40 ఎకరాల వరకు భూమి ఉంటుందని, అంచనా. పూలింగ్ ప్రక్రియలో లాభ పడేందుకే బడాబాబులు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ ధాని పూలింగ్‌లో సైతం లంక, అసైన్డ్ భూములు ఇదే రీతిలో కొనుగోలు చేసి బినామీ పేర్లతో పూలింగ్‌కు ఇచ్చి టీడీపీ మంత్రులు, అనుయాయులు భారీగా లబ్ధి పొందారు. ఇప్పుడు రెండో దశ పూలింగ్ అని, ఊహాగానాలు ప్రారంభం కావడంతో మళ్లీ పేదల భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. పాములపాడులో ఎస్సీలకు చెందిన చెరువు భూముల్లో ప్రైవేటు సర్వే లోకేష్, బాలకృష్ణలు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రచారం! రెండో దశ పూలింగ్‌లో లాభ పడేందుకే అంటున్న గ్రామస్తులు -
‘అవినీతే సిగ్గుపడేలా..కూటమి ప్రభుత్వం అవినీతి’
తాడేపల్లి : అవినీతే సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా, వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కాం చేస్తున్నారన్నారు.‘అన్ని వర్గాల మహిళలను మోసం చేస్తున్నారు. అప్పుల్లోనే కాదు, అవినీతిలోనూ రికార్డు సృష్టించారు. బాబు ష్యూరిటీ, అవినీతి గ్యారెంటీగా మారిపోయింది. NDA అంటే నారా దోపిడీ అలియెన్సుగా మారిందిమహిళ మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం. కొద్దిరోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదు? , జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర్నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారు.కాపు మహిళల కోసం జగన్ కాపునేస్తం తెచ్చారు. చంద్రబాబు కాపు మహిళలకు ఏం చేశారు? , ఇసుక, మట్టి, మద్యం, అమరావతి నిర్మాణాలు, ఉర్సా భూములు ఇలా ప్రతిదానిలోనూ స్కాం చేస్తున్నారు. కుట్టుమిషన్ల స్కీంని కమీషన్ల స్కాంగా మార్చారు. రూ.7,300 వేలు ఖర్చయ్యే దానికి రూ. 23 వేలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు?, రూ.157 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేశారు.మొబలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చి అవినీతికి రెడీ చేశారు. L1 కి ఐదు శాతం వర్కు ఇచ్చి L2, L3 కాంట్రాక్టరుకి 95% వర్కు ఇవ్వటం వెనుకే కుట్ర ఉంది.దానిపై ఏసీబి కేసు నమోదు చేసి, విచారణ జరపాలి. వెంటనే టెండర్ ని రద్దు చేయాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ వరుదు కళ్యాణి హెచ్చరించారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘27వ మైలురాయి’
తెనాలి: రూరల్ మండలం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీల్లో యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటిక ఉత్తమ ప్రదర్శన బహుమతిని అందుకుంది. ఇదే నాటికలో వైదేహి పాత్రలో నటించిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటి సురభి ప్రభావతి ఉత్తమ నటిగా, రాజన్న పాత్రధారి పవన్‌కుమార్ ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా, నాటిక రచయిత పీటీ మాధవ్ ఉత్తమ రచయిత బహుమతులను అందుకున్నారు. మూడురోజులపాటు జరిగిన నాటికల పోటీల్లో విజేతలకు చివరి రోజైన ఆదివారం రాత్రి బహుమతులను అందజేశారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారు ప్రదర్శించి ‘అ సత్యం’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు దక్కటం విశేషం. రఘుపతి పాత్రధారి వై.అనిల్‌కుమార్ ఉత్తమ ప్రతినాయకుడు, నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్‌కు, సంగీతాన్ని అందించిన పి.లీలామోహన్కు ఉత్తమ సంగీతం, ఉత్తమ లైటింగ్‌కు థామస్ బహుమతులను అందుకున్నారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికలో నటించిన గోవాడ వెంకట్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ‘మతమా మానవత్వమా’నాటికలో నటించిన కె.రాజేశ్వరికి ఉత్తమ క్యారెక్టర్ నటి బహుమతిరాగా, ‘మహాప్రస్థానం’లో సింహాద్రి పాత్రధారి బొర్రా నరేన్‌కు ఉత్తమ సహాయనటుడు బహుమతి లభించింది. ‘రుతువు లేని కాలం’లో నటించిన జి.సురేంద్రబాబుకు ఉత్తమ హాస్యనటుడు, ‘బ్రహ్మస్వరూపం’లో నటించిన ఎం.రత్నకుమారికి బెస్ట్ డైలాగ్ ఆర్టిస్ట్ బహుమతులు వచ్చాయి. ‘బ్రహ్మస్వరూపం’ నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని పీబీ కుమార్ అందుకున్నారు. న్యాయనిర్ణేతలుగా ఆంజనేయులు నాయుడు (పొన్నూరు), చలసాని కృష్ణప్రసాద్ (విశాఖపట్నం), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు) వ్యవహరించారు. నిర్వాహక సంస్థల బాధ్యులు గోపరాజు రమణ, గోపరాజు విజయ్, సుద్దపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఉత్తమ నటుడు గోవాడ వెంకట్ ఉత్తమ నటి సురభి ప్రభావతి -
పీజీఆర్ఎస్కు విధిగా హాజరుకావాలి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలు వినాల్సిన బాధ్యత అధికారులకు ఉందని తెలిపారు. కొందరు అఽధికారులు ఈ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పీజీఆర్ఎస్కు రావడం కుదరని అధికారులు నిర్దిష్టమైన కారణాన్ని చూపాలని ఆమె చెప్పారు. ప్రజలు కూడా తమ అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారుల్ని ఆమె ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని స్పష్టం చేశారు. అనంతరం వచ్చిన 197 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. అధికారులకుకలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశం నా పేరుతో అక్రమ అకౌంట్లు నేను 2004 నుంచి 2016 వరకు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేశా. కొంత కాలానికి యాజమాన్యం నాతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించి చెక్కులపై సంతకాలు చేయించుకుంది. ఆ తర్వాత యాక్సిస్, కరూర్ వైశ్యా బ్యాంకుల్లో రూ.4 కోట్లు టర్నోవర్‌తో పాటు నా పేరుతో రూ.2 కోట్లు రుణాన్ని తీసుకుంది. నాకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదు. నన్ను మోసం చేసి నా పేరుతో రుణాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి. –టి.ఎస్.ఎస్.ఏ.వి.ఎస్.ఆర్. స్వామి నాయుడు, గుంటూరు తోళ్ల వ్యాపారంతో నరకప్రాయం పాత గుంటూరులోని జామియానగర్ గొట్టాల రోడ్డులో కొందరు వ్యక్తులు పొట్టేళ్ల చర్మం ప్రాసెసింగ్ చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో చుట్టుపక్కల నివసించే వారికి నరకప్రాయంగా ఉంది. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయండి. –బి.ప్రసాద్, షేక్ రియాజ్, షేక్ వలి, గుంటూరు -
ఈపీఓఎస్‌లో ఎరువుల విక్రయాల నమోదు తప్పనిసరి
నగరంపాలెం: డీలర్లు విక్రయించిన ఎరువులను ఎప్పటికప్పుడు రైతుల ఆధార్ ద్వారా ఈపీఓఎస్ (అమ్మకం యంత్రాలు)లో నమోదు చేయాలని కమిషనర్ కార్యాలయ సంయుక్త వ్యవసా య సంచాలకులు వీడీవీ కృపాదాస్ ఆదేశించారు. పరదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ , కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా కలెక్టర్ బంగ్లా రోడ్డులోని కృషి భవన్లో సోమవారం జిల్లాలోని రిటైల్ ఎరువుల డీలర్లకు అమ్మకం యంత్రాలు ఉచితంగా పంపిణీ చేశాయి. కృపాదాస్ మాట్లాడుతూ ఈపీఓఎస్‌లో నమోదు కాకపోతే కేంద్రం నిర్వహించే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఏపీలో అధిక ఎరువుల నిల్వలు ఉన్నట్లు చూపుతాయని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి ఎరువులు సకాలంలో పంపిణీకావని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరదీప్ ఫాస్పేట్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు రూ.27 వేలు ఖరీదు చేసే 276 అమ్మకం యంత్రాలను రిటైల్ డీలర్లకు ఉచితంగా అందించాయని తెలిపారు. త్వరలో మరో 400 పంపిణీ చేయనున్నారని ఆయన వెల్లడించారు. 2015లో అందించిన యంత్రాల కంటే ఆధునాతనమైనవని, రైతుసేవలో వాటిని వినియోగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏలు తోటకూర శ్రీనివాసరావు, జయదేవ్‌రాజన్ (ఎరువులు), ఏపీ రాష్ట్ర ఎరువుల డీలర్ల సంఘం అధ్యక్షుడు వి.నాగిరెడ్డి, పీపీఎల్ ప్రతినిధులు పీవీ సుభాష్, షేక్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. -
ఘనంగా బగళాముఖి జయంతి పూజలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారి జయంతి పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలోని 108 కళాశాలలో మహిళలు సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి నిజరూప బగళాముఖి అలంకారం చేసి, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన స్వర్ణవర్ణపు సింహం విగ్రహాలను అమ్మవారి విగ్రహం ముందు ఇరువైపులా ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీక్షీరభావన్నారాయణస్వామి బాపట్ల: శ్రీక్షీరభావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ వాహనంపై స్వామి ఊరేగింపు జరిగింది. నవాహ్నిక దీక్ష పూర్వక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఊరేగింపు చేపట్టారు. భక్తులు టెంకాయలుకొట్టి పూజలు చేశారు. జీజీహెచ్ సిబ్బందికి మెమోలు అడిషనల్ డీఎంఈ ఆకస్మిక తనిఖీలు గుంటూరు జీజీహెచ్: గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గతంలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆషా సజనీపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించారు. అనంతరం ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్లో తనిఖీలు చేశారు. ఆపరేషన్ థియేటర్లో సక్రమంగా ఓటీ డ్రస్సులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్య సిబ్బంది, వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను ఆదేశించారు. మార్చురీ విభాగంలో తనిఖీలు చేశారు. లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మనోజ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తుండటంతో అతనిని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య విద్యార్థులకు మార్చురీ విభాగంలో క్లినికల్ తరగతులు నిర్వహించేందుకు వసతులు పరిశీలించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ విభాగంలో వైద్యులు, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ రిజిస్ట్రారు సుశీల తదితరులు ఉన్నారు. చైల్డ్ హోమ్‌కు పసికందు పొన్నూరు: మండలంలోని పచ్చల తాడిపర్రు గ్రామంలోని పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన పసికందుకు నిడుబ్రోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో సోమవారం మగ శిశువును వైద్యశాల డాక్టర్ ఫిరోజ్ ఖాన్ గుంటూరు చైల్డ్ హోమ్ నిర్వాహకులకు సీడీపీఓ వెంకట రమణ ఆధ్వర్యంలో అందజేశారు. తిరుపతమ్మ ఆలయానికి ట్రాక్టర్ ట్రక్కు బహూకరణ పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సోమవారం గ్రామానికే చెందిన కర్ల భాస్కరరావు, పద్మావతి దంపతుల కుమారులు కర్ల రామకృష్ణారావు, వసుంధర దంపతులు, కర్ల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు రూ.2.50లక్షల విలువైన ట్రాక్టర్ ట్రక్కును బహూకరించారు. గతంలో వీరు ఆలయానికి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్‌ను కూడా అందించారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలతో సత్కరించారు. -
పచ్చకొక్కులు
బియ్యం బొక్కుతున్న ఎమ్మెల్యే పీఏ దందా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనుచరుడు, పీఏగా ఉన్న వ్యక్తి ద్వారా ఈ దందా నడుస్తోంది. రేషన్ మాఫియాలో గతంలో ఉన్న వ్యక్తులు మేకల అనిల్, నాగేశ్వరరావు, సుబ్బారావు, శివ అనే వ్యక్తుల ద్వారా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయిస్తున్నాడు. వీరిలో అనిల్ కీలకంగా చెబుతున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దికాలం కిందట నెహ్రునగర్‌కు చెందిన సుబ్బారావుపై కేసు నమోదైంది. ఈ నాలుగు నెలల్లో పాత గుంటూరు, లాలాపేట స్టేషన్ల పరిధిలో కేసులే నమోదు కాలేదు. పూర్తిస్థాయిలో పోలీసులతో కూడా సత్సంబంధాలు ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరుడు సూచించిన వారికే బియ్యం, కందిపప్పు నెలవారీ అందజేస్తున్నట్లు సమాచారం. కార్డుదారులకు కిలోకు ఎనిమిది రూపాయల చొప్పున చెల్లించి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. రేషన్ మాఫియా నెలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకూ ఎమ్మెల్యేకు ముట్టచెబుతున్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే దందా నిరాటంకంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే బియ్యం అమ్మాలంటూ దుకాణదారులపై సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసీల్దార్ ఒత్తిళ్లు తేవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒప్పుకోని షాపులపై దాడులు చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. ఈ దందాపై ఓ డీలర్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారులు కూడా మామూళ్ల మత్తులో కూరుకుపోవడంతో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. సగానికి పైగానే అక్రమార్కుల చేతుల్లోకి... జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల పరిధిలో 5,99,511 రేషన్ కార్డులున్నాయి. 972 రేషన్ దుకాణాల నుంచి 353 ఎండీయూ వాహనాల ద్వారా నెలకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ప్రజలకు అధికారులు అందించాల్సి ఉంది. అయితే, ఈ మొత్తం బియ్యంలో దాదాపు సగానికి పైగానే అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యానికి రూ.43 వెచ్చిస్తోంది. కొందరు ఎండీయూ వాహనదారులు మాఫియాతో చేతులు కలిపారు. పేదల నుంచి కేజీ రూ.15 చొప్పున కొనుగోలు చేస్తూ అధిక మొత్తానికి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. అధికారులకు సైతం బెదిరింపులు గుంటూరు పట్టణ పరిధిలో కొందరు దళారులు కూటమి నేతల పేర్లు చెప్పి అధికారులను బెదిరిస్తున్నారు. వారి సాయంతోనే ఎండీయూ వాహనదారుల నుంచి అక్రమంగా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీనిపై గతంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. మూడు రోజుల ముందు నెహ్రూనగర్‌లోని ఒక ఎండీయూ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు కేసులు నమోదు చేయకుండా వదిలేశారు. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఇద్దరు వ్యక్తులు రేషన్ మాఫియాను నడిపిస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. వారికి కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. చుండూరులో నిల్వ పొన్నూరు నియోజకవర్గంలో రేషన్ అక్రమ రవాణా గుర్తు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నియోజకవర్గంలో నిల్వ చేయడం లేదు. ద్విచక్ర వాహనాల ద్వారా ఒకటి, రెండు క్వింటాలు చుండూరుకు తరలిస్తున్నారు. ఇటీవల పొన్నూరు పట్టణం కేంద్రంగా రేషన్ అక్రమ రవాణా చేసేందుకు రేషన్ మాఫియా మిల్లును ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే, రాజకీయ కారణాలతో అక్రమ రవాణా కార్యకలాపాలు కొనసాగలేదు. దీంతో చుండూరులోని మిల్లును కొన్ని మండలాలకు చెందిన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. పొన్నూరు, చేబ్రోలు మండలాల పరిధిలో పట్టుబడుతున్న బియ్యం ఎక్కువ సంఖ్యలో ఇతర మండలాలకు చెందినవిగా పోలీసులు గుర్తిస్తున్నారు. అవి చుండూరుకే వెళుతున్నట్లు సమాచారం. రేషన్ మాఫియాలో గుంటూరుకు చెందిన సుబ్బారావు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం నేత హత్యలో కూడా పొన్నూరుకు చెందిన రేషన్ మాఫియాను విచారించిన సంగతి తెలిసిందే. తెనాలిలోనూ మాఫియా తిష్ట తెనాలిలో రేషన్ అక్రమాలు సుధీర్, అశోక్ చౌదరి ఆధ్వర్యంలో సాగుతున్నాయి. సుధీర్ ఇక్కడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇటీవల మండలంలోని పెదరావూరు గ్రామానికి మకాం మార్చాడు. ఇక్కడ బియ్యం సేకరించి బాపట్ల జిల్లా చుండూరుకు పంపుతున్నాడు. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగి రేషన్ అక్రమార్కులతో చర్యలు జరుపుతున్నారు. నెల నెలా ఎంత ఇస్తారు? పోలీసులకు ఎంత? రెవెన్యూ అధికారులకు ఎంత ఇస్తారు ? అని సుమారు నెల రోజులుగా మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. పొన్నూరులో సుమారు ఏడేళ్లుగా ఒకే స్టేషనులో పని చేస్తున్న కానిస్టేబుల్.. డీఎస్పీ స్థాయి వ్యక్తి తనకు బాగా పరిచయం అని చెప్పి రేషన్ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడని పక్కా సమాచారం. ఏడేళ్లలో నల్లపాడు స్టేషన్లో మూడు నెలలు, తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల మూడు నెలలు మాత్రమే పని చేశాడు. ఉన్నతాధికారులకు రేషన్ అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇస్తుంటాడు. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా వారికే అమ్మాలంటూ డెప్యూటీ తహసీల్దార్ బెదిరింపులు ఇచ్చిన ధరకే కట్టుబడాలంటూ ఒత్తిళ్లు ఒప్పుకోని వారి షాపులపై దాడులు, బియ్యం పట్టివేత ఆఖరికి హత్య కేసుల్లో కూడా రేషన్ మాఫియా వీరయ్య చౌదరి కేసులో పొన్నూరు మాఫియా హస్తం మంగళగిరిలో రేషన్న్ బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. దళారులు కిలో రూ.12కి కొనుగోలుచేసి, మిల్లర్లకు రూ.25కి విక్రయిస్తున్నారు. మంగళగిరిలో గతంలో ఇంటింటికీ తిరిగి బియ్యం కొనుగోలు చేసి మధ్యలో ఉన్న దళారులకు అమ్మేవాళ్లు. ఇపుడు నేరుగా రేషన్ డీలర్లు రైస్ మిల్లులకు అమ్మేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ మాత్రం మొదట్లో ఒకటి రెండు మిల్లుల్లో హడావుడి చేసి తర్వాత మిన్నకున్నారు. కలెక్టర్‌కు డీలర్ మొర చౌటుపల్లి సునీల్ కుమార్ అనే ఎండీయూ వాహనదారుడు రేషన్ మాఫియాపై సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. బేగ్ అనే డెప్యూటీ తహసీల్దార్ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని, అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజాయతీగా సేవలందిస్తున్నప్పటికీ కొందరి మెప్పుకోసం డీటీ తనను టార్గెట్ చేశాడని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. ఈ సంఘటనను బట్టి రేషన్ మాఫియాకు అధికారులు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
ఈదురుగాలులు, వర్షంతో రైతులకు తీవ్ర నష్టం
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తాడేపల్లి రూరల్: నిన్నమొన్నటి వరకు అకాల వర్షాల కారణంగా ధాన్యం, మొక్కజొన్న, జొన్న రైతులు నష్టపోతే ప్రస్తుతం ఈదురుగాలులు, వర్షం వల్ల అరటి రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడు, అంజిరెడ్డి కాలనీ, 40 అడుగుల రోడ్డు ప్రాంతాల్లో ఈదురు గాలులకు పడిపోయిన అరటి తోటలను సోమవారం మంగళగిరి నియోజకవర్గ రైతు సంఘం నాయకులు రుక్మాంగరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈదురు గాలుల వల్ల మంగళగిరి నియోజకవర్గంలో అరటి రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. ఎకరానికి 200 నుంచి 300 చెట్ల వరకు పడిపోయాయని, గెలలు రాని చెట్లు సైతం కొన్నిచోట్ల కూలిపోయాయని చెప్పారు. ఇప్పటి వరకు నష్టాన్ని పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుంచి తాడేపల్లి తహసీల్దార్‌కు, హార్టికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడి జరిగిన నష్టాన్ని వివరించారు. పసుపు కల్లాల్లో ఎండబెట్టారని, అకాల వర్షం కారణంగా ఎర్రనల్లి ఏర్పడిందని, పసుపు రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తుమ్మ నారాయణ రెడ్డి, దొంతిరెడ్డి వీరారెడ్డి, మేకా ప్రసాద్ రెడ్డి, దొంతిరెడ్డి శివరామిరెడ్డి, భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి, పులగం సందీప్‌రెడ్డి, శ్రీనివాస్‌రాజు, మల్లేశ్వరరావు, బాలకోటయ్య, తిరుము, రాజ్‌మోహన్ పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో కుట్టు మిషన్ల స్కాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఎన్నో స్కాంలు జరిగాయని, తాజాగా బీసీ మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ పేరుతో రూ.150 కోట్ల స్కాం చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఆరోపించారు. బృందావన్ గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణ తరగతులు కూడా ప్రభుత్వ భవనాల్లో పార్టీ కార్యకర్తల ద్వారా నిర్వహిస్తోందని తెలిపారు. శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపుతున్నారని మండిపడ్డారు. బీసీ మహిళలంటే ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో ఈ విషయం ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాలరావు మాట్లాడుతూ కుట్టు శిక్షణ సమయం కూడా 360 గంటల నుంచి 130 గంటలకు కుదించారని తెలిపారు. రాష్ట్ర కుమ్మర శాలివాహన విభాగ అధ్యక్షుడు మండేపూడి పురుషోత్తం మాట్లాడుతూ కూటమి పాలనలో ముడుపులు ఇచ్చిన కంపెనీలకు కుట్టు మిషన్ల కాంట్రాక్ట్ అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. సమావేశంలో బీసీ సంఘ ముఖ్య నాయకులు తాడిబోయిన సుబ్బారావు, మయకుంట్ల రాయప్ప, దానబోయిన నాగేశ్వరరావు, కుక్కల రాంప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యోగాలు, రుణాల పేర్లతో మోసం
ఇటీవల శారదా కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచమయ్యారు. కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ అపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. విడతలు వారీగా రూ.1.90 లక్షలు చెల్లించాను. ఉద్యోగం వచ్చాక, మిగతా రూ.3 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేశారు. అయితే, నెలలు గడిచిన ఉద్యోగం ఊసెత్తలేదు. ఈలోగా ఇంటి రుణం ఇప్పిస్తానంటే వారిద్దరికీ రూ.3.30 లక్షలు చెల్లించా. బ్యాంక్ నుంచి రుణం మంజూరైనట్లు చెక్కు కూడా చూపించారుఉ. నాతో పాటు పలువురికి రుణాలు ఇప్పిస్తామని చెబితే వారు డబ్బు చెల్లించారు. ఇద్దరికీ సుమారు రూ. 12.30 లక్షలు చెల్లించాం. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదు. మిగతా వారు నన్ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సదరు వ్యక్తులను విచారించి న్యాయం చేయాలి. – జి.భూలక్ష్మి (దివ్యాంగురాలు), ఓర్సు పెద్దింటమ్మ, ఒకటో వీధి, ఐపీడీ కాలనీ -
ఎల్టీపీల పొట్టగొడుతున్న ప్రభుత్వం
లైసెన్స్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది నెలల కిందట నూతనంగా సెల్ఫ్ సర్టిఫికెట్ స్కీం –2025 నిబంధనలు తీసుకువచ్చి ఎల్టీపీ(లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్)ల పొట్టగొడుతోందని లైసెన్స్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. సతీష్ వాపోయారు. సోమవారం అరండల్‌పేటలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 300 చదరపు మీటర్లలోపు స్థలాలకు భవన నిర్మాణ అనుమతుల్లో తప్పులు జరిగితే అందుకు బాధ్యులుగా ప్లాన్ ఇచ్చిన ఎల్‌టీపీలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎస్సీఎస్ (సెల్ఫ్ సర్టిఫికెట్ స్కీం) ఉందని తెలిపారు. భవన నిర్మాణ సమయంలో డీవీయేషన్ చేసుకుని యజమాని ఇంటి నిర్మాణం చేపడితే దానికి ఎల్‌టీపీలను బాధ్యులుగా చేయడం సబబు కాదని పేర్కొన్నారు. బీఎన్ఎస్ చట్టం కింద చర్యలతో పాటు ఐదేళ్ల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పడం సమంజసం కాదని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధనలతో ఎల్టీపీలు గత కొద్ది నెలలుగా ప్లాన్లు దరఖాస్తు చేసే పరిస్థితి లేదని, కొద్ది నెలలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎస్సీఎస్ స్కీం కింద తెచ్చిన నిబంధనలను సడలించాలని ఆయన కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైనేనిలక్ష్మణ్, నగర చైర్మన్ పరమహంస, నగర అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్, నాగశ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. -
పోరుబాటలో ఉపాధ్యాయులు
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. సంఘ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు బ్రాడీపేటలోని పశ్చిమ తహసీల్దార్ కేంద్రం వద్ద సోమవారం గుంటూరు జోన్ కన్వీనర్ పి.నాగశివన్నారాయణ అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ 117 జీవో అమలుకు పూర్వ స్థితిలో ఉన్న పాఠశాల విద్యారంగాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు వెనక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకపోగా, అదనంగా 1,2 తరగతులను సైతం కలపడం తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మోసగించడమేనని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో విద్యాశాఖామంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఒకటి నుంచి ఐదు తరగతుల్ని ప్రాథమిక పాఠశాలలోను, 6 నుంచి 10 లేక 12 తరగతులు ఉన్నత పాఠశాలల్లో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో 44 మంది విద్యార్థులు మించితే రెండవ సెక్షన్ ఇవ్వాలని కోరారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు గ్రేడ్–2 హెచ్ఎం, పీఈటీ పోస్టును ఇచ్చి, పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. అసంబద్ధ నిర్ణయాలను కొనసాగిస్తే ఈనెల 9వ తేదీ అన్ని జిల్లా కలెకరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఈనెల 14వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు. గుంటూరుతో పాటు, పొన్నూరు, తెనాలి, మంగళగిరిలో నిరసన ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, కరువు భత్యం 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు ప్రకటించి, మొత్తం బకాయిలను విడుదల చేయాలని కోరారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో ఎం.ఎన్. మూర్తి, ఎస్.ఎస్.ఎన్. మూర్తి, లక్ష్మీనారాయణ, కె.రమేష్, దాస్, రమాదేవి, వెంకటేశ్వర్లు, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, కిశోర్ షా భారతి, విజయశ్రీ, భాస్కర్, కుటుంబరావు, బాలరాజు, సుబ్బారావు, జహంగీర్ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం -
జీజీహెచ్‌లో హిపో క్రేడ్స్ విగ్రహం
గుంటూరు మెడికల్: ఫాదర్ ఆఫ్ మెడిసిన్‌గా పిలువబడే హిపోక్రేడ్స్ విగ్రహాన్ని గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు సోమవారం విగ్రహాన్ని తెనాలి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ ప్రత్యేక శ్రద్ధతో విగ్రహాన్ని తయారు చేయించారు. ఓపీ విభాగంలో నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు వెళ్లే రహదారిలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎక్సలెంట్ ప్లేస్మెంట్ అవార్డు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నీరుకొండ(మంగళగిరి): నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎక్సెలెంట్ ప్లేస్మెంట్ అవార్డు లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసియా టుడే మీడియా సంస్థ 15వ అంతర్జాతీయ విద్యా సదస్సును ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించింది. ఇందులో 2023–24లో దేశవ్యాప్తంగా ప్లేస్మెంట్లో అగ్రస్థానం సాధించిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎక్సలెంట్ ప్లేస్మెంట్ అవార్డు వచ్చింది. సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రి రాజ్ భూషన్ చౌదరి అవార్డును యూనివర్సిటీ ప్రతినిధి వివేకానందకు అందజేసి అభినందనలు తెలిపారు. -
కాలువలకు మరమ్మతులు చేయించాలి
బాపట్ల: కృష్ణా పశ్చిమ కాలువ, దుగ్గిరాల డివిజన్, రేపల్లె డివిజన్లోని నీటి పారుదల కాలువలకు మరమ్మతులు చేయించాలని పలువురు రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీని కలిసి సోమవారం వినతిపత్రం అందించారు. అమృతలూరు, చెరుకుపల్లి, నగరం, భట్టిప్రోలు, వేమూరు మండలాల పరిధిలోని రైతులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కృష్ణ పశ్చిమ కాలువ, దుగ్గిరాల డివిజన్, రేపల్లె డివిజన్లోని నీటి పారుదల ఆధారిత భూములలో వరి పంట సాగు చేస్తున్నామని వివరించారు. రేపల్లె మెయిన్ డ్రెయిన్ (గంగోలు కాలువ) నుంచి 30 ఏళ్లుగా మురుగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని వివరించారు. ఈ ఏడాది(2024–25) ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రేపల్లె మెయిన్ డ్రెయిన్ పొంగి చెరుకుపల్లి మండలంలోని కనగాల, గూడవల్లి, నడింపల్లి, పొన్నపల్లి గ్రామాలలో, అమృతలూరు, భట్టిప్రోలు, వేమూరు, నగరం మండలంలోని కొన్ని గ్రామాలలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని వివరించారు. 2025–26 ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే కాలువను పూర్తిస్థాయిలో పూడిక తీసి, సామర్థ్యం పెంచి ముంపు నివారించాలని రైతులు కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మేక మహే ష్, గోగినేని బాలకోటేశ్వరరావు, గడ్డిపాటి రాఘవేంద్రరావు, కోట నాగ కోటి వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
మోసపోయాం.. ఆదుకోండి !
న్యాయం చేయాలని పోలీసులకు దివ్యాంగుల విన్నపం నగరంపాలెం: పోగొట్టుకున్న కారుని అప్పగించడం లేదని ఓ అంధుడు, ఉద్యోగం పేరుతో తనను ఇద్దరు వ్యక్తులు మోసగించారని మరో దివ్యాంగురాలు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల కార్యక్రమం (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల గోడు అలకించారు. ప్రజా ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. నిర్ణీతవేళల్లో ఫిర్యాదులు పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా పీజీఆర్ఎస్కు వచ్చిన బాధితులకు సిబ్బంది మజ్జిగ పంపిణీ చేశారు. -
కారు ఇప్పించాలి
నాలుగేళ్ల కిందట కారు కొనుగోలు చేశా. నా కొడుకు బాడుగలకు వెళ్లేవాడు. గతేడాది డిసెంబర్లో మృతి చెందారు. అయితే, అప్పటి నుంచి కారు కనిపించలేదు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. తుళ్లూరు మండలం రాయపూడిలో కారుని గుర్తించారు. గత ఎన్నికల్లో రాయపూడిలో ఓ టీడీపీ నేత అధీనంలో ఉందని తెలిసింది. గత నెల 18న స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కారు తీసుకు వచ్చారు. అవతలి వ్యక్తికి రూ.1.50 లక్షలు చెల్లించాలని చెబుతున్నారు. అయితే, తాను ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదు. అదిగాక ఓ వ్యక్తి వద్ద రూ.15 లక్షలు తీసుకున్నట్లు గత నెలలో కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. కారు ఇప్పించకపోగా తమపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక ఉన్న తమపై కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్లో మూడుసార్లు ఫిర్యాదు చేశా. అయినా, ఎవరూ పట్టించుకోవడంలేదు. అంధుడిని కావడంతో పోలీస్స్టేషన్ల చుట్టు తిరగలేకపోతున్నా. అవతలి వ్యక్తులు బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయాలి. – నాగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జూనియర్ సహాయకుడు, గుంటూరు మెడికల్ కళాశాల -
కనుల పండువగా అమ్మనాన్నల కల్యాణం
బాపట్ల టౌన్: మండలంలోని జిల్లేళ్లమూడి గ్రామంలో వేంచేసియున్న జగన్మాత మాతృశ్రీ అనసూయ మహాదేవి, బ్రహ్మాండం నాగేశ్వరరావుల కల్యాణ మహోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. విశ్వజననీ పరిషత్ కోశాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ అనసూయదేవి అందరి అమ్మగా, జిల్లేళ్లమూడి అమ్మగా లోక ప్రసిద్ధి చెందారన్నారు. జిల్లేళ్లమూడి గ్రామానికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా వారికి తృప్తిగా భోజనం పెట్టి కడుపునింపడం, ఆకలితో జిల్లెళ్లమూడి రావచ్చు కానీ, జిల్లేళ్లమూడి నుంచి ఆకలితో వెళ్లరాదనేది అమ్మ ఆశయమన్నారు. జిల్లేళ్లమూడి అమ్మ తొలినాళ్లల్లో వారి పతిదేవుల సంపాదనతోనే తమ దర్శనార్థం వస్తున్న వారందరికీ స్వయంగా అన్నం వండి, వడ్డించడం చేసేవారన్నారు. అనతి కాలంలో అమ్మ బిడ్డలందరి సమష్టి కృషితో జిల్లేళ్లమూడిలో అన్నపూర్ణాలయం ఏర్పడిందన్నారు. సంవత్సరమంతా నిత్యకల్యాణం, పచ్చతోరణం మాదిరి ఉంటుందన్నారు. అమ్మవారి కల్యాణమహోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మనాన్నలకు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయన్నారు. కల్యాణం అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నోరు మెదపరేం చంద్రబాబు!
సాక్షి,తాడేపల్లి: దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కూటమి సర్కార్ కనీవినీ ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. ఈ విద్యుత్ కొనుగోలుపై వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక యూనిట్‌ను రూ.2.49పైసలకే కొనుగోలు చేస్తే విషం చిమ్మిన మీరు ఇప్పుడు ఏకంగా రూ.4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు’అని ప్రశ్నించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వచ్చే 25 ఏళ్ల పాటు ఒక్క యూనిట్ విద్యుత్‌ను రూ.4.80కి కొనుగోలు చేయనుంది. ఈ ధర, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల కంటే రెండింతలు ఎక్కువ. దీని ప్రభావం రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడనుంది. అందుకే ఇది విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా నిలుస్తోంది. 'Axis' of Loot - 'Power'ed By Naidu-nomicsThe TDP-led coalition government has signed a power deal with Axis Energy to buy electricity at Rs 4.80 per unit for 25 years. This deal is almost double the rate of earlier agreements and will place a heavy burden on the people of… pic.twitter.com/UW7ueXBm97— YSR Congress Party (@YSRCParty) May 5, 2025మరి దీనిపై చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదు. ఈ ఒప్పందం ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చే, ప్రజలకు భారమయ్యే ప్రణాళికతో చేసిన కుట్ర అని ఆరోపిస్తూ ట్వీట్లో పేర్కొంది. -
సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు. -
రైతులకు బాసటగా వైఎస్సార్సీపీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్ జగన్ సూచించారు. -
వైభవంగా శ్రీభారతి మహోత్సవాలు
నగరంపాలెం: స్థానిక అరండల్‌పేట 4/2వ అడ్డరోడ్డులో కొలువైన శ్రీశృంగేరి శ్రీవిరుపాక్ష శ్రీపీఠంలో నిర్వహిస్తోన్న శ్రీ భారతి మహోత్సవాలు నాలుగో రోజుకి చేరాయి. శ్రీమహా కామేశ్వరి ధర్మ పరిపాలనా సంఘం ఆధ్వర్యంలో జరగ్గా, ఆదివారం నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పీఠాధిష్ఠాత్రి శ్రీ రాజ రాజేశ్వరి ప్రతాప భారతి పరదేవత అనుగ్రహంతో పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ గంభీరానంద భారతిస్వామిచే శ్రీశృంగేరి శ్రీవిరూపాక్ష శ్రీ పీఠానికి శ్రీపరశివానంద భారతిస్వామికి ఉత్తర పీఠాధిపతిగా పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శిష్యులకు తీర్థ ప్రసాద వినియోగం, అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. గంభీరానంద భారతి మహాస్వాములు అనుగ్రహ భాషణం చేఽశారు. సోమవారం కళ్యాణానంద భారతి మాంతాచార్య మహాస్వామి వారి జయంతి నిర్వహించనున్నారు. కార్యక్రమంలో హిందూ కళాశాల అధ్యక్షులు ఎఎస్వీఎస్ సోమయాజి, ఆడిటర్లు జి.శివరామకష్ణప్రసాద్, పరమహంస, హైకోర్టు న్యాయవాది కృష్ణప్రసాద్, నగర వైదిక ప్రముఖులు పాల్గొన్నారు. -
పల్టీ కొట్టిన టిప్పర్.. తప్పిన పెను ప్రమాదం
కారంచేడు: కాలువ కట్టమీద ప్రయాణించే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన టిప్పర్ లారీ కొమ్మమూరు కాలువ అంచుకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా పెను ప్రమాదం తప్పింది. వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారి 167/ఏ కి గ్రావెల్‌ను తరలిస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఆదివారం బోల్తా కొట్టింది. కారంచేడు నుంచి కుంకలమర్రు వైపు వెళ్లే రహదారి కొమ్మమూరు కాలువ కట్టమీదగా ఉంటుంది. ఈ కట్టమీద ప్రయాణించే సమయంలో ఎదురుగా మరో వాహనం రావడంతో రోడ్డు మార్జిన్ దిగిన టిప్పర్ లారీ అప్పటికే వర్ష కురిసి ఉండటంతో మార్జిన్ నానిపోయి మెత్తగా తయారైంది. దీంతో టిప్పర్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎన్హెచ్ఏఐకి చెందిన పొక్లెయిన్ ద్వారా వాహనాన్ని తీయించారు. -
కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడుస్తుంది
నమ్మకంగా మోసం చేశాడు.మనందరి జీవితాలు బాగుపడాలంటే లోన్లు తీసుకుందామంటూ మాతో పాటు పనికి వచ్చే రాజశేఖరరెడ్డి చెప్పాడు. మనం కూడా కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేద్దాం అంటూ మాయమాటలు చెప్పాడు. ముందుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని చెప్పి ఖాతా తెరవడానికి అవసరమైన రూ.10వేలు అతనే కట్టి, బ్యాంక్ ఖాతా పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఆరు నెలల తరువాత బ్యాంక్ వారు మీరు తాకట్టుపెట్టిన బంగారు రుణం సమయం అయిపోయింది. రిలీజ్ చేసుకోవాలంటూ నోటీసులు పంపిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖరరెడ్డిని అడిగితే మాట దాటవేస్తున్నాడు. – ఎస్కె సలీం, నులకపేట రోజూ తాపీపనికి వెళితేనే నా కుటుంబం గడుస్తుంది. రాజశేఖరరెడ్డి మాతోపాటు కూలిపనులు చేసుకునేవాడు. కొంచెం చదువుకుని ఉండడంతో మాకు మాయమాటలు చెప్పి లోన్లు వస్తాయని చెప్పి అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ పని చేశాడు. ఇప్పుడు ఎవరు బంగారం తాకట్టు పెట్టారని అడిగితే టెక్కి ప్రకాష్, మదన్ అని చెబుతున్నాడు. వారు మాకు ముఖ పరిచయం మాత్రమే. జరిగిన సంఘటనపై అధికారులను, మంత్రులను కలుద్దామని అనుకుంటున్నాం. నా పేరుమీద రూ.35 లక్షల బంగారం లోన్ తీసుకున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. – ఎస్కే మీరావలి, నులకపేట -
రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: మండల పరిధిలో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. గత కొంతకాలంగా రేషన్ అక్రమ దందా కొనసాగుతున్నప్పటికీ అడ్డుకట్ట వేయటంలో అధికారులు విఫలమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చేబ్రోలు మండలం మంచాల గ్రామ శివారులోని బ్రాహ్మణ కోడూరు అడ్డరోడ్డు ప్రాంతంలో లారీలో రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ డి.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా వేసి రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. ఏపీ 39 వీఈ 0256 నెంబరు గల మినీ లారీలో సుమారు వంద బస్తాల రేషన్ బియ్యంను తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాపట్లకు అక్రమ రవాణా చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించారు. రేషన్ బియ్యం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుంది.. దీనికి సూత్రధారి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. -
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి
కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం లక్ష్మీపురం: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి జగన్నాథం అన్నారు. గుంటూరు కొత్తపేటలోని కౌలురైతు సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందడంలేదని మండిపడ్డారు. గుర్తింపు కార్డులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మే 6వ తేదీన గుంటూరు మల్లయ్య లింగం భవన్లో ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో కౌలు రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి పాల్గొన్నారు. పాముకాటుతో మహిళా కూలీ మృతి బల్లికురవ: పొలంలో కూలీ పనులు చేస్తుండగా పాము కాటు వేయటంతో 30 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం ఓ మహిళాకూలీ మృతి చెందింది. అందిన సమాచారం ప్రకారం.. బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు పంచాయతీలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన గార్లపాటి మల్లేశ్వరి (52) కూలీనాలీ పనులు చేస్తూ భర్త కోటేశ్వరరావుకు చేదోడుగా నిలుస్తోంది. శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లగా పొలంలో పాము కాటు వేసింది. హుటాహుటిన తోటి కూలీలు వైద్యానికి చిలకలూరిపేటలోని ఓ ప్రవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం చనిపోయింది. మృతురాలికి భర్త, ఒ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే మల్లేశ్వరి.. పాము కాటుకు బలి కావడంతో కుటుంబ సభ్యులు, తోటి కూలీల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
మద్యం మత్తులో రోకలి బండతో దాడి
తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ యువకుడు మృతి దుగ్గిరాల: మద్యం మత్తులో రోకలిబండతో మోదడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మోరంపూడి గ్రామంలోని వైఎస్సార్ విగ్రహం కూడలి దగ్గర రఘునాథరావు(35), కూచిపూడి గోపి ఇరువురూ పూటుగా మద్యం సేవించారు. అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈక్రమంలో గోపి దగ్గరే ఉన్న ఇంటి నుంచి రోకలిబండ తీసుకువచ్చి రఘనాథ రావు తలపై గట్టిగా కొట్టాడు. దీంతో రఘునాథరావు కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న రఘనాథరావును చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ హాస్పటల్‌కి తరలించారు, అక్కడినుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. మృతుడికి భార్య దివ్య, వరుసగా 7, 5, 2 సంవత్సరాలు వయసున్న శాన్సీ, హిమాన్సీ, జస్వీ అనే కుమార్తెలు కలరు. దుగ్గిరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య లక్ష్మీపురం: బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సెకండ్ సెమిస్టర్ పరీక్షలకు సరిగ్గా చదవలేకపోయానని మార్కులు తక్కువ వస్తాయనే మనస్థాపంతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన ఆదివారం కుందుల రోడ్డులో చోటుచేసుకుంది. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణనగర్ వైట్ హౌస్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే కల్లూరి హరనాథ్‌బాబు గుంటూరు హౌసింగ్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఆయనకు ఇద్దరు ఆడ సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె ఇంధు మేఘన (20) ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో తృతీయ సంవత్సరం బీటెక్ చదువుతోంది. వారం రోజులుగా పాస్‌పోర్ట్ పనిమీద తిరుగుతూ సెకండ్ సెమిస్టర్‌కు పూర్తిగా సిద్ధం కాలేక పోయింది. ఈనేపథ్యంలో మనస్తాపం చెంది ఇంట్లో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పట్టాభిపురం ఎస్సై తరంగిణి ఘటనా ప్రదేశంలో ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. -
నకిలీల పాపం.. పేదలపై ప్రతాపం
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధిలోని కరూర్ వైశ్యాశ్యాంక్ శాఖ కార్యాలయం నుంచి పలువురు బంగారు రుణాలు తీసుకున్న వారికి నోటీసులు పంపించారు. ఆదివారం అదే బ్యాంక్‌పై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో బాధితులు ఆ వార్తను చూసి లబోదిబోమంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. కూలీనాలీ చేసుకునేవారం ఎక్కడ నుంచి అంత డబ్బు తీసుకువచ్చి కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క బ్యాంక్ అధికారులు అది నకిలీ బంగారం అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, మరోపక్క తాకట్టు పెట్టిన బంగారు రుణం సమయం అయిపోయింది.. వెంటనే డబ్బులు చెల్లించాలని లేకుంటే ఇళ్లు, వాకిళ్లు వేలం వేసి కేసులు పెడతామంటూ బ్యాంక్ సిబ్బంది బెదిరిస్తున్నట్లు కూలీలు వాపోతున్నారు. జరిగింది ఇదీ..! మంగళగిరికి చెందిన రాజశేఖరరెడ్డి అనే రోజువారీ తాపీకూలీ సంవత్సరం క్రితం తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన మిగతా తాపీ కూలీలతో పాటు కూలిపనులకు వచ్చాడు. కాలక్రమేణా కొంతమందితో స్నేహం చేసి మంగళగిరి కరూర్ వైశ్యాబ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే లోన్లు ఇస్తారంటూ ఖాతాలు తెరిపించాడు. అనంతరం వారికి తెలియకుండా బ్యాంక్‌లో వారి పేరిట నకిలీ బంగారం తాకట్టుపెట్టి రూ.లక్షల్లో రుణం తీసుకున్నాడు. ఈక్రమంలో వడ్డీలు, అసలు కట్టాలంటూ బ్యాంకు అధికారులు కూలీలకు నోటీసులు పంపించసాగారు. ఇదేంటని రాజశేఖరరెడ్డిని అడిగితే మొత్తం నేను చూసుకుంటాను, మీకేం ఇబ్బంది రాదంటూ కూలీలను మభ్యపెట్టాడు. విషయం బయట పడి రాజశేఖరరెడ్డిని నిలదీయగా, విజయవాడకు చెందిన ఫైనాన్షియర్ టెక్కి ప్రకాష్ చూసుకుంటాడు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నాడని కూలీలు తెలిపారు. అనంతరం తమ దగ్గరికి మంగళగిరికి చెందిన మదన్, రాజశేఖరరెడ్డి వచ్చి మమ్మల్ని బ్యాంకుకు తీసుకువెళ్లారని, మదన్(బ్యాంక్ జ్యూయలర్ అప్రైజర్)ను చూపించి ఇతనే మనకు రుణాలు ఇప్పించేది అని, లోన్ వచ్చిన తరువాత పర్సంటేజ్ తీసుకుంటామని మమ్మల్ని నమ్మించాడని, ఇప్పుడు బ్యాంకు నుంచి నోటీసులు వస్తుంటే ఏమీ మాట్లాడకుండా మాపై దౌర్జన్యం చేస్తున్నాడని కూలీలు వాపోయారు. నకిలీ బంగారమైతే ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? నకిలీ బంగారాన్ని నిజమైన బంగారంగా బ్యాంకు అధికారులు ఎలా తీసుకున్నారో వాళ్లు ముందు సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూలి పనులు చేసుకునే తమ దగ్గర అంత బంగారం ఎలా ఉంటుందని బ్యాంకు అధికారులు ఎందుకు ఆలోచించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. మేం ఒకవేళ ఎవరిదైనా బంగారం తీసుకువచ్చి తాకట్టు పెడితే అది నకిలీ బంగారం అని ఎందుకు చెప్పలేదంటూ నిలదీస్తున్నారు. ఇదే బ్యాంక్‌లో గత సంవత్సర కాలంలో రాజశేఖరరెడ్డితో పాటు మరికొంతమంది ఇలా నకిలీబంగారం తాకట్టు పెట్టి 45 మంది కూలి నాలీ చేసుకునేవారిచేత అకౌంట్ ఓపెన్ చేసి 147 బంగారు తాకట్టు ఖాతాలను తెరిచి తాకట్టు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అవినీతి కంపులో మంగళగిరి కరూర్ వైశ్యాబ్యాంక్ కూలిపనులు చేసుకునేవారితో ఖాతాలు నకిలీ బంగారు ఆభరణాలతో రూ.లక్షల్లో రుణాలు మేమెక్కడా తాకట్టు పెట్టలేదంటున్న బాధితులు కీలక పాత్ర పోషించిన వడ్డీ వ్యాపారి రాజశేఖరరెడ్డి బ్యాంక్ నుంచి నోటీసులు అందడంతో లబోదిబోమంటున్న కూలీలు -
సామాజిక సమస్యలను స్పృశించిన నాటికలు
తెనాలి: రూరల్ మండల గ్రామం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. చివరిరోజున డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్ జ్యోతిప్రజ్వలనతో ప్రదర్శలనలను ఆరంభించారు. తొలుత చైతన్య కళాస్రవంతి, ఉక్కునగరం, విశాఖపట్నం వారి ‘అ సత్యం’ నాటికను ప్రదర్శించారు. మనిషి సత్యం చెప్పినా అబద్ధం ఆడినా దానివెనుక ఏదొక భయమో? స్వార్థమో ఉంటుంది. దానివల్ల అతడికి మేలు జరగొచ్చు లేదా కీడు కలగొచ్చు. నిజానికి యదార్థమైనా ఒక చెడుకు దోహదపడితే అది అసత్యం...అబద్ధమైనా ఒక మంచికి తోడ్పడితే అది సత్యం...అనేదే నాటిక సారాంశం. సుధ మోదుగు కథను పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరించారు. పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. దర్శకుడు బాలాజీనాయక్తోపాటు పి.రామారావు, వై.అనిల్‌కుమార్, ఎం.వాసు, థౠమస్, ఎస్.మాధవి నటించారు. తదుపరి లలిత శ్రీ కళాసమితి, శ్రీకాకుళం వారి ‘మతమా...మానవత్వమా?’ నాటికను ప్రదర్శించారు. మతం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదనీ, మానవత్వమే శాశ్వతమని. మనిషికి మానవత్వమే ప్రధానమని, అదే నిలిచి వెలుగుతుందని సందేశాన్నిచ్చిందీ నాటిక. కంచర్ల సూర్యప్రకాశరావు రచనను ఎల్.రామలింగస్వామి దర్శకత్వంలో ప్రదర్శించారు. ప్రధాన పాత్రల్లో బోసుబాబు, కేతిరెడ్డి రాజేశ్వరి, గుత్తు రవిబాబు, ప్రసాదవవు, లక్ష్మణరావు, కామేశ్వరరావు నటించారు. చివరగా శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు వారి ‘జనరల్ బోగీలు’ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. సురభి ప్రభావతికి జీవితసాఫల్య పురస్కారం ఇదే వేదికపై యడ్లపాడు ‘వేదిక’ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు అధ్యక్షతన గోపరాజు బాలాత్రిపుర సుందరమ్మ జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటి సురభి ప్రభావతికి ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ చేతులమీదుగా ప్రదానం చేశారు. ప్రముఖ రూపశిల్పి ఎం.మదన్మోహన్ స్మారకంగా పసుమర్రుకు చెందిన రంగస్థల రూపశిల్పి పచ్చల శేషగిరిని సత్కరించారు. వివిధ కళాపరిషత్‌ల బాధ్యులు నూతలపాటి సాంబయ్య, వల్లూరు శివప్రసాద్, చాగంటి నాగేశ్వరరావు, కల్వకొలను అనంత్, గోగిశెట్టి వర్మ మాట్లాడారు. నిర్వాహక సంస్థల బాధ్యులు గోపరాజు రమణ, గోపరాజు విజయ్, సుద్దపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
ఎస్సీ వెల్ఫేర్‌లో ఇవి మామూళ్లే!
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా పరిషత్ సమీపంలోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. ఇక్కడి ఉన్నతోద్యోగులు కింది సిబ్బందిని జలగల్లా పీడిస్తున్నారు. ఏ పని చేయాలన్నా ఎంతో కొంత ముట్టచెబితేనే ఫైల్ ప్రాసెస్ అవుతుంది. లేకుంటే ఆ ఫైల్ అలాగే రోజులు, నెలల తరబడి పెండింగ్‌లో ఉంటుంది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారు అడిగినంత ఇచ్చుకోలేక, పనులు కాక ఇబ్బందులు పడుతున్నారు. ఇంక్రిమెంట్లు వేయాలంటే సమర్పించుకోవాల్సిందే...! ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, ఎస్ఆర్ ఎంట్రీలు, పే ఫిక్సేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బిల్లులు ఇలా అన్ని రకాల పనులకు ఒక రేటు ఫిక్స్ చేసి వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వినికిడి. ఉన్నతాధికారులు పట్టించుకోరే ? కార్యాలయంలో ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాలపై ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వెల్ఫేర్ శాఖకు రెగ్యులర్ డీడీ మధుసూధన్‌రావు గత కొద్ది నెలలుగా లాంగ్ లీవ్‌లో ఉండటంతో పాటు ప్రస్తుతం ఈ శాఖకు బాపట్ల ఎస్సీ వెల్ఫేర్ అధికారిని ఇన్ఛార్జ్ డీడీగా నియమించారు. కార్యాలయంలో జరిగే అన్ని విషయాలకు గతంలో ఇక్కడ పనిచేసిన డీడీ అండదండలు ఉన్నాయని క్లాస్–4 ఉద్యోగులు బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అవినీతికి కేరాఫ్‌గా ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం సిబ్బందిని జలగల్లా పీడిస్తున్న ఉన్నతోద్యోగులు పే స్కేల్స్, ఇంక్రిమెంట్లు వేయాలన్న ముడుపులు ఇచ్చుకోవాల్సిందే మామూళ్లు ఇచ్చుకుంటేనే ఫైల్ కదిలేది లబోదిబోమంటున్న ఉద్యోగులు నా దృష్టికి రాలేదుకార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన పనులు చేయాలంటే మామూళ్లు అడుగుతున్న విషయం నా దృష్టికి రాలేదు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. – రాజా దెబోరా, డిప్యూటీ డైరెక్టర్, ఎస్పీ వెల్ఫేర్ -
సర్దుమణిగిన వర్గపోరు!
● శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి కమిటీ ఇరు వర్గాలతో సమావేశమైన జిల్లా ఎస్పీ ● స్వయం ప్రకటిత పాలకవర్గం చెల్లదని స్పష్టీకరణ ● హైకోర్టులో వ్యాజ్యం వేసి, సర్వసభ్య సమావేశం ఎలా జరుపుతారని ప్రశ్న ● హైకోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఇరువర్గాలు కార్యకలాపాలు నిలిపివేయాలి ● తాత్కాలికంగా తటస్థులకు ఆలయ కార్యక్రమాల నిర్వహణ ● ఎస్పీ సూచనకు ఇరువర్గాల అంగీకారం శ్యాంప్రసాద్‌కు తాత్కాలిక బాధ్యతలు తెనాలి: శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ వివాదం సద్దుమణిగింది. దేవస్థానం కమిటీ, స్వయం ప్రకటిత పాలకవర్గం రెండూ తమ కార్యకలాపాలను నిలుపుదల చేశాయి. వివాదం హైకోర్టులో ఉన్నందున, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకునేలా అంగీకారం తెలియజేశారు. అప్పటివరకు అందరికీ సమ్మతమైన డబుల్‌హార్స్ మిపనగుళ్లు అధినేత మునగాల మోహన్శ్యాం ప్రసాద్ ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటారు. గుంటూరు జిల్లా ఎస్పీ సమక్షంలో ఆయన ఆదేశాలపై కుదిరిన ఒప్పందమిది. ఎస్పీ సూచనలకు ఇరువర్గాలు సమ్మతిని తెలియజేశాయి. జిల్లా ఎస్పీ నుంచి పిలుపు.. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ వివాదం, వరుస పరిణామాల నేపథ్యంలో ఆలయ కమిటీ ఆదివారం సర్వసభ్య సమావేశానికి సభ్యులకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం కమిటీ నేతలు మీడియాకు వెల్లడించారు. స్వయం ప్రకటిత పాలకవర్గం నేతలు సర్వసభ్య సమావేశం చెల్లదని, సభ్యులు ఎవరూ హాజరుకావొద్దని మీడియాకు చెప్పారు. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నుంచి ఇరువర్గాలకు పిలుపువచ్చింది. శనివారం రాత్రి ఏడున్నర గంటల తర్వాత అక్కడకు చేరుకున్నారు. ఎస్పీ సూచనపై ఆలయ కమిటీ నుంచి అయిదుగురు, స్వయం ప్రకటిత పాలకవర్గం నుంచి అయిదుగురు చొప్పున హాజరయ్యారు. అధికారులు మరో ఆరుగురు, న్యాయసలహాదారు సమావేశంలో పాల్గొన్నారు. ఇరువర్గాలను ప్రశ్నించిన ఎస్పీ ఆలయానికి చెందిన ఇరు వర్గాలకు జిల్లా ఎస్పీ క్లాస్ పీకారు. ముందుగా స్వయంప్రకటిత పాలకవర్గాన్ని ప్రశ్నించారు. గత నెల 13న జరగాల్సిన సర్వసభ్య సమావేశం రసాభాస కావటంతో పోలీసుల అనుమతితోనే వాయిదా వేసినట్టు గుర్తుచేశారు. ఆ ప్రకారం మరోసారి తేదీని నిర్ణయించి సభ్యులకు నోటీసులు జారీచేసి సమావేశం నిర్వహించాల్సి ఉందని గుర్తుచేశారు. అందుకు భిన్నంగా రెండురోజుల్లోనే 300 మందికి పైగా సంతకాలు తీసేసుకుని పాలకవర్గంగా ఎన్నికయ్యామంటే ఎలా చెల్లుతుందని ఎస్పీ ప్రశ్నించారు. మొత్తం 1100 వరకు గల సభ్యుల్లో 200 మంది వరకు మరణించి ఉంటారనుకుంటే మిగిలినవారిలో 600 మంది ఆలయ కమిటీ పక్షాన ఉన్నట్టా? అని కూడా ఎస్పీ ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. బైలా ప్రకారం జరగని ఎన్నిక ఎలా చెల్లుబాటవుతుందని ప్రశ్నిస్తూ, మళ్లీ ఆ పాలకవర్గం ప్రమాణస్వీకారానికి చట్టబద్ధత ఏముంటుందని కూడా అడిగారు. ● అదేవిధంగా స్వయంప్రకటిత పాలకవర్గం ఎన్నిక, ఇతర అంశాలపై హైకోర్టును ఆశ్రయించిన ఆలయ కమిటీ ఇప్పుడు సర్వసభ్య సమావేశం ఎలా జరుపుతుందని కూడా ఎస్పీ ప్రశ్నించారు. ఇదికూడా మరొక వివాదం అవుతుందన్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చేవరకు రెండు వర్గాలు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్పీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈలోగా జరగాల్సిన శ్రీవాసవీ అమ్మవారి జన్మదిన వేడుకల నిర్వహణకు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన తటస్టుల పేర్లను చెప్పమని ఎస్పీ చేసిన సూచనపై ఆలయ కమిటీ వర్గం ఆర్యవైశ్య ప్రముఖుడు నంబూరు వెంకట కృష్ణమూర్తి పేరును సూచింది. స్వయం ప్రకటిత పాలకవర్గం నేతలు పెండేల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావులు కృష్ణమూర్తి పేరుకు అభ్యంతరం తెలియజేశారు. దీంతో డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ పేరును చెప్పారు. ఇందుకు పెండేల వెంకట్రావు వర్గం అంగీకారం తెలియజేసింది. హైకోర్టు ఆదేశాలు వచ్చేవరకు మోహన్ శ్యాంప్రసాద్ ఆలయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని ఎస్పీ వెల్లడించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశం కొనసాగింది. ఇదిలావుంటే, ఆదివారం ఉదయం 10.30 గంటలకు సర్వసభ్య సమావేశానికి నోటీసులు అందుకున్న దేవస్థానం కమిటీ సభ్యులు వందలాదిమంది ఆలయ ప్రాంగణానికి వచ్చారు. అక్కడకు వచ్చాక సమావేశం లేదని తెలుసుకుని తిరుగుముఖం పట్టారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు ఆకి అచ్యుతరావు, వుప్పల వరదరాజులు, దేసు శ్రీనివాసరావు, కొణిజేటి గోపీకృష్ణ, మద్దాళి శేషాచలం తదితరులు జిల్లా ఎస్పీ సూచనలపై సర్వసభ్య సమావేశం నిర్వహించటం లేదని మీడియాకు వెల్లడించారు. అలాగే మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ పర్యవేక్షణలో అమ్మవారి జన్మదిన ఉత్సవాలు జరుగుతాయని చెబుతూ ఆర్యవైశ్యులు వర్గాలకతీతంగా సమష్టిగా పాల్గొని వేడుకలను జయప్రదం చేసి, అమ్మవారి ఆశీస్సులను పొందాలని కోరారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025సజావుగా నీట్7సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.90 అడుగుల వద్ద ఉంది. ఇది 138.3868 టీఎంసీలకు సమానం. ఆకట్టుకున్న నృత్యప్రదర్శన నగరంపాలెం: స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాట్య గురువులను సత్కరించారు. బల్లలు బహూకరణ పెదకాకాని: పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి తక్కెళ్లపాడుకు చెందిన కోటేశ్వరరావు, అరుణకుమారి దంపతులు స్టీల్ బల్లలు బహూకరించారు.● 97.71 శాతం హాజరు నమోదు ● పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) ఆదివారం పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా జరిగింది. గుంటూరు, తెనాలిలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల పరిధిలో 97.71 శాతం హాజరు నమోదైంది. నీట్‌కు దరఖాస్తు చేసిన 4,250 మంది విద్యార్థుల్లో 4,153 మంది హాజరయ్యారు. విద్యార్థులను విస్తృత రీతిలో తనిఖీ చేసిన తరువాతే కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష సజావుగా జరిగింది. విద్యార్థులను వెంట పెట్టుకుని తల్లిదండ్రులు ఉదయం 10 గంటల నుంచే కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలపై విధించిన ఆంక్షలతో పరీక్ష కేంద్రానికి చేరుకునే ముందుగానే విద్యార్థులు సంబంధిత వస్తువులను ఇంటి వద్దే తీసి వేసి వచ్చారు. నీట్ పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షణలో ప్రతి కేంద్రం పరిధిలో పరిశీలకులుగా నియమించిన తహసీల్దార్‌తో పాటు ఎన్టీఏ నుంచి నియమించిన మరొక పరిశీలకులు ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌ను సమన్వయం చేసుకుని పరీక్షను నిర్వహించారు.న్యూస్‌రీల్ -
మరణంలోనూ వీడని బంధం
● రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి ● ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ప్రమాదం ● గుంటూరు నుంచి తిరుమలకు మొక్కు తీర్చుకునేందుకు వెళుతుండగా ఘటన పెదకాకాని: 16వ నంబరు జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన ఇద్దరు తల్లీకొడుకులు మృతిచెందారు. ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. కొప్పురావూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తిరుమలశెట్టి కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లావణ్యను అమరావతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బూసి వినయేంద్రకు ఇచ్చి వివాహం చేశాడు. వారి రెండేళ్ల బాబు లోక్షిత్‌కు పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు గుంటూరు నుంచి తిరుపతికి కారులో బయలు దేరారు. వినయేంద్ర కారులో వారికి సైతం మొక్కు ఉండడంతో గుంటూరులో ఉంటున్న ఆర్ఎంపీ కృష్ణ పెద్ద అన్నయ్య కుమారుడు తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పావని(40), వారి చిన్నకుమారుడు చంద్రకౌశిక్(15)లు సైతం ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం సుమారు 4:30 గంటల సమయంలో ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ దాటిన తరువాత ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆగి ఉన్న లారీ వెనుక కారు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఒక్కసారిగా కారును ఢీ కొంది. ఈ ఘటనలో కారు ముందు ఉన్న లారీకి ఢీ కొన్న కంటైనర్ మధ్య నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో తిరుమలశెట్టి పావని, ఆమె కుమారుడు చంద్రకౌశిక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న బూసి లావణ్య, వినయేంద్రకు తీవ్రగాయాలు కాగా వారిలో వినయేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. వారి కుమారుడు రెండేళ్ల లోక్షిత్, మేనమామ తిరుమలశెట్టి వెంకటేశ్వరరావులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కొప్పురావూరులో విషాదం.. తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వెంకట హర్షవర్ధన్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు చంద్రకౌశిక్ గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 576 మార్కులు సాధించాడు. దీంతో తలనీలాలు సమర్పించేందుకు తిరుమల బయలు దేరాడు. వారు ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. తల్లీకుమారులు మృత్యువాత పడడంతో కొప్పురావూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆర్ఎంపీ కృష్ణ చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఇంటి ముందు వేసిన పందిరి కూడా తీయలేదు. ఇంతలోనే ఊహించని విషాదంతో ఆ కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. -
బీభత్సం.. అస్తవ్యస్తం
● తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో భీకర ఈదురుగాలులు ● పలుచోట్ల విరిగిన కరెంటు స్తంభాలు, తెగిన విద్యుత్ తీగలు ● గాల్లోకి ఎగిరిన హోర్డింగ్‌లు, ఇళ్ల పైకప్పులు ● నేలకొరిగిన చెట్లు ● విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ, రూరల్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు గాల్లోకి ఎగిరాయి. రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు నేలకు ఒరిగాయి. విద్యుత్ స్తంభాలు గాలి విరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నీడ కోసం ఏర్పాటు చేసిన ఐరన్ షె ల్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి 10 అడుగుల దూరం వరకు వెళ్లాయి. తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత జాతీయ రహదారి వెంబడి స్పెన్సర్ దగ్గర నుంచి ఉండవల్లి సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి తాత్కాలికంగా రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వర్షం తగ్గుముఖం పట్టిన తరువాత స్థానికులు ఆ చెట్లను తొలగించారు. రోడ్డు పక్కన పలు నివాసాలపై ఏర్పాటు హోర్డింగ్‌లు గాల్లోకి ఎగిరిపోయాయి. నులకపేట తెల్ల క్వారీ, మదరసా, ఎర్రక్వారీ ప్రాంతాల్లో చెట్లు విరిగి ఇళ్లపై పడి రేకులు పగిలిపోయాయి. ఉండవల్లి ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా గాల్లోకి ఎగిరి గోడలు కూలాయి. ఉండవల్లిలోని పుష్కరాల కాలనీలో గాలివాన బీభత్సానికి ఇంటి పైకప్పులు పైకి లేచిపోయాయి. సీతానగరంలో రెండు చోట్ల ఇంటి పైకప్పు గాల్లోకి ఎగిరాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాడేపల్లి పట్టణ రూరల్ పరిధిలో నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లు ఉండగా 25 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉండవల్లిలో 6 కేవీ ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. విద్యుత్‌శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదిక పనులు చేపట్టి సాయంత్రం 6 గంటలకల్లా పలుచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి డ్రైనేజీలు పొంగి మురుగునీరు ఇళ్లముందు వరకు వచ్చాయి. -
భావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాతసేవ, స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నపన జరిపారు. స్వామివారు పెండ్లికుమారుని అలంకరణలో దర్శనమిచ్చారు. సాయంత్రం నాదస్వర కచేరీ, వేద పఠనం, అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహం, రుత్విగ్వరణం, అంకురారోపణం, హోమం, బలిహరణం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పర్యవేక్షించారు. భగీరథ మహర్షికి ఘననివాళిగుంటూరు వెస్ట్: భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని భగీరథ మహర్షి కీర్తిని వివరించారు. నాయీ బ్రాహ్మణ సంక్షేమ, డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్, బీసీ సంక్షేమ శాఖాధికారి కె.మయూరి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయస్థాయి షూటింగ్లో ముఖేష్‌కు రెండు స్వర్ణాలు గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన షూటర్ ముఖేష్ నేలవల్లి రెండు బంగారు పతకాలు సాధించాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న 23వ కుమార్ సరేంద్ర సింగ్ మెమోరియల్ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం జరిగిన పోటీలో 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. ఇదే పోటీల్లో గత శుక్రవారం కూడా 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్‌లోనూ ముఖేష్ బంగారు పతకం సాధించాడు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆది దంపతులైన దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తుల తాకిడితో అంతరాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోగా, మహా మండపం వైపు నుంచి వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే లిఫ్టులో అనుమతించారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తడిసి ముద్దయ్యారు.. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు వర్షంతో తడిసి ముద్దయ్యారు. ఘాట్‌రోడ్డు మూసివేత.. ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ వర్షం కురవడంతో దుర్గగుడి ఘాట్‌రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కొండ రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉందని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు భావించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్‌రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. -
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ’కూటమి’ అడ్డదారులు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి నేతలు వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షం గొంతులను అణగదొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్‌కు భద్రతా సిబ్బందిని తగ్గించారు. పదిహేనేళ్ల క్రితం మూలాన పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారు. జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఉద్దేశపూర్వకంగా భద్రత కుదింపుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నుంచి కిందిస్థాయి వైఎస్సార్సీపీ కార్యకర్త వరకు ఎవర్నీ వదలకుండా కూటమి నాయకులు ప్రతీకార రాజకీయాలకు దిగుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలోనూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సార్సీ కమిటీ రివ్యూ కూడా చేయకుండా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కనీసం ఏసీ కూడా సరిగ్గా పనిచేయని వాహనాన్ని ప్రతిపక్ష నాయకుడికి కేటాయించి అవమానించారు.ఈ వాహనం ఇప్పటికే ఒకసారి రోడ్డు మీద సడెన్‌గా ఆగిపోయిన పరిస్థితి రాష్ట్ర ప్రజలంతా చూశారు. జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ కేటాయించడం లేదు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లినప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న హై ప్రొఫైల్ పర్సన్‌కి ఒక్క పోలీస్ అధికారి భద్రతను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం. వైఎస్ జగన్ రామగిరి మండలం పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలిప్యాడ్ దగ్గర సరైన భద్రత కల్పించకపోవడంతో విండ్ షీల్డ్ దెబ్బతిని బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 1100 మందిని మోహరించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 1100 మంది ఉన్నా కంట్రోల్ చేయలేని అధికారులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు.నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధనల ప్రకారం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 8 ఆర్మ్డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒకవేళ జనాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది వంద మీటర్ల వెలుపల సివిల్ ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా జనాల తాకిడి ఎక్కువైతే ఆ ప్రాంతాన్ని బట్టి పోలీసులను రౌండ్స్‌గా ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలన్నీ ప్రభుత్వం పాటించి ఉంటే హెలిప్యాడ్ వరకు జనాలు రాగలిగేవారా? పోలీసులకు సహకరించిన తోపుదుర్తిప్రభుత్వ వైఫల్యాలను, పోలీసుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆరోజు కార్యక్రమానికి హాజరైన వైయస్సార్సీపీ ముఖ్య నాయకుల మీద ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరుల మీద అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. జనం నవ్వుతారనే కనీస విచక్షణ కూడా లేకుండా తోపుదుర్తి సోదరులే ప్రజలను రెచ్చగొట్టి హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లారని నమ్మశక్యం కాని అక్రమ కేసులు పెట్టారు. ఆరోజు జనాన్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన డీఎస్పీ, తన హ్యాండ్ మైకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతికిచ్చారు.అభిమానులను కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన చేతుల్లోనే పెట్టారు. ఇదంతా చూసి కూడా జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులను మోహరించామని ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం అనిపించుకోదా? పైగా పోలీసులకు సహకరించి అభిమానులను కంట్రోల్ చేసిన తోపుదుర్తి మీద అభిమానులను రెచ్చగొట్టి పంపారని పోలీసులతోనే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ అక్రమ కేసుల మీద ఆయన న్యాయస్థానాల్లో పోరాడుతుంటే ఆయన తప్పించుకుని తిరుగుతున్నారంటూ ఆయన కోసం నియోజకవర్గంలోని వైయస్సార్సీపీ నాయకులను వేధిస్తున్నారు. వేకువజామున వారి ఇళ్లకు పోయి ఇబ్బందులు పెడుతున్నారు.అవినీతి అధికారుల భరతం పడతాం2019-24 మధ్య వైయస్సార్సీపీ పాలనలో నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పది నెలల్లో మళ్లీ పగలు ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. అమాయకులైన వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. కొంతమంది పొలీసులను అడ్డంపెట్టుకుని అంతరించిపోయిన రౌడీయిజాన్ని మళ్లీ తట్టిలేపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం.కూటమి నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వారి ప్రతీకార రాజకీయాలకు సహకరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో శిక్షను అనుభవించకతప్పదని గుర్తుంచుకోవాలి. ఏడాది పాలన పూర్తికాకుండానే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 2029లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం ఖాయం. ఇలాంటి అవినీతి అధికారుల భరతం పట్టడం ఖాయం. -
గుంటూరు లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం
గుంటూరు: లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్‌లు చేయటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థునులు చెబుతున్నారు. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.గత ఏడాది కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు.తెలంగాణలోని ఈ ఏడాది మార్చి నెలలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. -
నేడు భగీరథ మహర్షి జయంతి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు భగీరథ మహర్షి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు’ చెప్పారు.కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు.#BhagirathaMaharshiJayanthi pic.twitter.com/HUc3jwv16G— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2025 -
జీజీహెచ్‌లో స్టెప్‌డౌన్ ఐసీయూ ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో రూ.1.60 కోట్లతో నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూను శనివారం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది నెలల కాలంలో గుంటూరు జీజీహెచ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హెచ్‌డీఎస్ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్రప్రభు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చి నిలిచిపోయిన సర్వీస్ బ్లాక్ భవన నిర్మాణం చేపడుతున్నారన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ త్వరలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు ఆసుపత్రిలో ప్రారంభమవుతాయన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ జీజీహెచ్‌లో రేకుల షెడ్డులో స్టెప్‌డౌన్ ఐసీయూ నిర్మాణంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మంచి ప్లేస్‌లో ఐసీయూ నిర్మాణం చేపట్టాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర యశశ్వి రమణ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ స్టేట్ కమిటీ, భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు, భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్స్ సహాయ సహకారాలతో స్టెప్‌డౌన్ ఐసీయూ ప్రారంభించామన్నారు. విరాళాలు అందజేసిన దాతలు భాష్యం రామకృష్ణ, రెడ్‌క్రాస్ కోశాధికారి రామచంద్రరాజు, భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులను ముఖ్య అతిథులు సన్మానించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, డెప్యూటీ మేయర్ షేక్ సజిలా, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మేయర్ రవీంద్ర, ఎమ్మెల్సీల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. మీడియా ప్రతినిధులు ఈవిషయాన్ని ప్రశ్నించి చిత్రీకరిస్తుండగా, ఆసుపత్రి సిబ్బంది హడావుడిగా సభా ప్రారంభానికి ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ చిత్రపటాన్ని ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. -
ట్రెండ్
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025నయాపట్నంబజారు: శుభకార్యమైనా.. పెళ్లయినా.. ఏ మధుర స్మృతినైనా.. కెమెరాల్లో బంధించి.. ఆ సంతోష క్షణాలను అప్పుడప్పుడు చూసుకుంటాం. ఈ క్రమంలో ఫొటోగ్రఫీ ఆదరణ నాటికీ, నేటికీ చెక్కుచెదరనిది. ఇటీవల కాలంలో వివాహ తంతులో అత్యధిక ప్రాధాన్యంగా మారిపోయింది ప్రీవెడ్డింగ్ షూట్స్. ప్రీ వెడ్డింగ్.. పోస్ట్ వెడ్డింగ్.. సాంగ్ షూటింగ్ అంటూ కొత్త జంటలు హంగామా చేస్తున్నారు. ఓ మంచి లోకేషన్లో చిన్నపాటి సినిమాను తలపించేలా.. సెట్టింగ్‌లు.. యాక్షన్.. అంటూ టేకులు తీసుకుంటూ.. జంటలు మురిసిపోతున్నారు. ఇందులో పాటలు.. అదిరిపోయే సీన్లు.. వైరెటీ ఫోజుల్లో నూతన జంటలు కొత్త లుక్స్‌తో కనిపిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్ జిల్లాలో భారీగా ముందుకు సాగుతోంది. న్యూస్‌రీల్ జిల్లాలో పెరిగిన హంగామా అందమైన ప్రదేశాల్లో షూటింగ్‌లు ప్యాకేజీల పేరుతో ఆఫర్లు అత్యాధునిక కెమెరాలతో చిత్రీకరణ ఆధునిక కెమెరాలు.. డ్రోన్లు ప్రీ వెడ్డింగ్ షూట్‌ను ఆధునిక కెమెరాలతో ఓ మినీ సినిమాలా చిత్రీకరిస్తున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా చిత్రీకరించేందుకు హైడెన్సిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. క్వాలిటీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఒక షూట్ చేయడానికి కనీసం నలుగురు నుంచి ఆరుగురు కెమెరా మెన్లు పని చేయటంతో పాటు, డ్రోన్ కెమెరాల నుంచి అనేక రకాల లెన్స్‌లను వినియోగిస్తున్నారు.మూడు నిముషాల పాట, మంచి ఫొటోల చిత్రీకరణలకు మూడు రోజులపైగానే సమయం పడుతోంది. పూర్తి స్థాయి చిత్రీకరణను పాట, ఆల్బమ్ రూపంలోకి తీసుకు రావటానికి 10 రోజులపైనే పడుతోంది. ప్రీవెడ్డింగ్ షూట్‌పై ఆసక్తి పెరిగింది గతంలో కేవలం పెళ్లిళ్లకు సంబందించిన ఫొటోలు, వీడియోల చిత్రీకరణ మాత్రమే ఉండేది. ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్‌తో ఫొటోగ్రాఫర్లకు మంచి పనులు కూడా వస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు పెళ్లికి ముందే గిరాకీలు వస్తున్నాయి. మంచి నైపుణ్యం ఉన్న వారికి భలే డిమాండ్ ఉంది. అత్యాధునిక కెమెరాలనే షూట్‌కు అధికంగా వినియోగిస్తున్నారు. – అమర్నాథ్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి గతంలో పెళ్లికి ఫొటోలు, వీడియో తీయించుకోవాలంటే తెలిసిన ఫొటోగ్రాఫర్లకు చెప్పుకునేవాళ్లు. ప్రస్తుతం ఎస్ఈడీ తెరను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పెళ్లిలోనే ప్రీవెడ్డింగ్ వీడియోలు, ఫొటోలను వీక్షిస్తున్నారు. ప్రీవెడ్డింగ్ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌గా పెట్టేందుకు ఎక్కువ జంటలు క్రేజ్ చూపిస్తున్నాయి. కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా ఆల్బమ్, వీడియోలు అన్ని కలిపి ప్యాకేజీగా తీసుకుంటున్నారు. దీనికి రూ లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలు రకాల ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి. వివాహం ముందు.. తరువాత ఫొటోలు, వీడియోలు తీసేలా ప్యాకేజీలు ఉన్నాయి. గతంలో వివాహం అయ్యాక హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి. ఏయే ఆలయాలు సందర్శించాలి వంటి చర్చలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు నిశ్చితార్థం అయిన వెంటనే ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందమైన ప్రదేశంలో ఫొటో, వీడియో షూట్లు తీసేలా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నారు. సూర్యలంక, చీరాల, గుంటూరు మానస సరోవరం, కొండవీడు, నదీ తీర ప్రాంతాలు, ఉమ్మడి జిల్లాలోని రిసార్ట్స్, అంతగా రద్దీ లేని జాతీయ రహదారులు, పల్లె ప్రాంతాల్లోని పంటపొలాలను ఎంచుకుంటున్నారు. కొంత మంది పొగ మంచు, బీచ్‌ల కోసం చైన్నె, అరకు, పాండిచ్చేరి వంటి ప్రాంతాలకు వెళ్తుతున్నారు. కొబ్బరి తోటలు, చెరువులు, పచ్చదనం పరుచుకున్న కొండ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. -
12 నుంచి ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు
గుంటూరు ఎడ్యుకేషన్ : స్టూడెంట్ యూనియన్ ఆఫ్ నేషన్, కేవీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 21 వరకు ఐఏఎస్ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. శనివారం గుంటూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఐఏఎస్ ఫౌండేషన్ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 8, 9, 10వ తరగతులతో పాటు ఇంటర్ విద్యార్థులకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతాయని చెప్పారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ పరీక్షల పట్ల పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించి సివిల్స్ పై లక్ష్యాన్ని కలిగించడమే ముఖ్య లక్ష్యంగా తరగతులు ఉంటాయని చెప్పారు. 10 రోజులపాటు నిపుణులు క్లాసులు బోధిస్తారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీస్‌లకు ఎంపిక కావడం ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని విద్యార్థులకు వివరిస్తారని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తల్లిదండ్రులు 63094 81514, 79959 02645, 94948 08589 సెల్‌ఫోన్ నంబర్లలలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆశిష్, మనీష్, వివేక్, ప్రతిమ, హరిత, రాజు తదితరులు పాల్గొన్నారు. -
7న శంకర్‌విలాస్ ఆర్ఓబీ పనులకు శంకుస్థాపన
నెహ్రూనగర్: ఈ నెల 7వ తేదీన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన జరుగుతుందని, విస్తరణ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబీ రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ పరిశీలించారు. తొలుత ఆర్ఓబీ నిర్మాణ డిజైన్‌ను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన విస్తరణ పనులు, మార్కింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఆర్ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన చేస్తారన్నారు. శంకుస్థాపన జరిగే ప్రదేశం నిర్ణయం అనంతరం శిలాఫలకం ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతో చేయాలన్నారు. ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డీసీపీ సూరజ్ కుమార్, ఆర్అండ్బీ డీఈఈ చిన్నయ్య, ఏఈఈ సంజీవ కుమార్, ఏసీపీలు, పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ‘నీట్’ ఏర్పాట్లు పరిశీలన గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ పరీక్ష కేంద్రాలను శనివారం డీఆర్ఓ ఎన్ఎస్ ఖాజావలి, డీఈఓ సీవీ రేణుక పరిశీలించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన వారు విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చీఫ్ సూపరింటెండెంట్‌తో చర్చించారు. హెచ్ఎం షేక్ ఎండీ ఖాసిం ఉన్నారు. -
స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారు పురాతన సువర్ణాభరణాల అలంకరణతో స్వర్ణ ప్రకాశరూపిణిగా శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో స్వయంభూవై వెలసిన బగళాముఖి అమ్మవారి వార్షిక కొలుపులు(తిరునాళ్లు) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కొలుపులలో నాల్గవ రోజు అమ్మవారికి పురాతన బంగారు ఆభరణాలను అలంకరించారు. ముందుగా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.భాగ్యలక్ష్మి, ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి పర్యవేక్షణలో బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్ఐ ఎం.శివకుమార్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించగా ముఖ్య అతిథులు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, పురాతన బంగారు నగల పరిరక్షణ కమిటీ సభ్యులు, పంచాయతీ, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు చందోలు స్టేట్ బ్యాంకులో భద్రపరిచి ఉన్న అమ్మవారి పురాతన నగలను బ్యాంకు అధికారుల సమ్మతితో లాకరు నుంచి బయటకు తీసి భక్తుల జయజయ ధ్వానాల మధ్య బ్యాంకు నుంచి శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పురాతన బంగారు ఆభరణాలను అలంకరించారు. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వర్ణాభరణాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగుగొందుతున్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను అందుకున్నారు. అమ్మవారి ఆలయ ముఖమండపం నిర్మించేందుకు 2002 డిసెంబర్ నెలలో జరిపిన తవ్వకాలలో దొరికిన పురాతన బంగారు నగలను వార్షిక కొలుపులలో నాల్గవ రోజున మాత్రమే అలంకరించటంతో పురాతన బంగారు నగల అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు తండోప తండాలుగా ఆలయానికి తరలివచ్చారు. భక్తుల దర్శనం అనంతరం అదే రోజు సాయంత్రం తిరిగి బంగారు నగలను పోలీసు బందోబస్తుతో బ్యాంకుకు తీసుకువెళ్లి లాకరులో భద్రపరిచారు. -
ఒకే ఒక్కడు..మనోడే !
తెనాలి: దేవదాయశాఖ ఆస్తుల లీజు వేలంలో నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు 33 శాతం ఆదాయం పెరగాలి. లేదా పరస్పర చర్చలతో ఎంతో కొంత మొత్తం పెంచాలి. తెనాలిలో మాత్రం ఇందుకు భిన్నం. శ్రీకాకుమాను శంకరుని సత్రం పరిధిలోని శ్రీ సత్యనారాయణ టాకీస్ ఇందుకో ఉదాహరణ. ఈ థియేటర్ స్థలానికి 2010లో నెలకు అద్దె రూ.1.20 లక్షలు ఉంటే, ఇప్పటికి ఎంత ఆదాయం రావాలి. 2017లో రూ.71 వేలకు తగ్గిపోయింది. తర్వాత రూ.95 వేలకు పెరిగింది. గత ఏప్రిల్‌లో పోటీ కారణంగా రూ.1.28 లక్షలకు పెరిగింది. వేలంలో పాల్గొన్న వారికి కూటమి పార్టీ నేతల నుంచి ఫోన్లు లేకుంటే మరింత హెచ్చు మొత్తం వచ్చేదని చెబుతారు. తెలుగు దేశం పార్టీ అస్మదీయుడి హవా.. పాటదారుడు ఒకే ఒక్కడు...అది కూడా అధికార టీడీపీకి అస్మదీయుడు. అతడు కోరుకుంటే వేలం పాటలో అద్దె మొత్తాన్ని తగ్గిస్తారు. రూ.లక్షల్లో అద్దె బకాయిలు పడి డిఫాల్టరుగా మారతాడు. దేవదాయ శాఖ కోర్టుకు వెళ్లి డిక్రీ తెచ్చినా, ఆస్తి జప్తు చేసి బకాయిల జమకు మాత్రం పూనుకోరు. మళ్లీ జరిగే వేలంలో బినామీని అడ్డంపెట్టి లీజు హక్కులను దక్కించుకుంటారు. కాగితాలపై పేరు ఏదైనా ఫంక్షన్ హాలుగా నడుస్తున్న ఆ థియేటర్ స్థలంలో వ్యాపారం అతడిదేనని అందరికీ తెలుసు.గత నెలలో బహిరంగ వేలం జరిగేవరకు బినామీ పేరుతో కూడా 12 నెలల అద్దె బకాయి పడ్డాడు. బకాయిలుంటే వేలంలో పాల్గొనేందుకు అర్హత లేనందున, అప్పటికప్పుడు తీసుకొచ్చి జమచేశారు. వేలంలో ఆ స్థలం లీజుహక్కులు దక్కించుకోవాలని కొందరు పోటీపడ్డారు. కూటమి పార్టీల నేతల నుంచి ‘మనోడి’ కోసం ఫోన్లు వచ్చాయి. వారు విరమించుకున్నారు. ఆ పోటీ ఫలితంగానే నెల అద్దె మొత్తం రూ.1.28 లక్షల వరకు పెరగటం కొంతలో కొంత నయం అనిపించింది. నిబంధనల ప్రకారం పాటలో పాల్గొనేవారు రూ.5 లక్షల డిపాజిట్ చెల్లించాలి. ‘మనోడు’ ఆ రూల్‌ను బేఖాతరు చేసినా, దేవదాయ అధికారులు సరేనన్నారు. పాట అతడి పేరిట కొట్టేశారు. హెచ్చు పాటదారుడు అదేరోజు అరు నెలల అద్దెను ముందుగానే చెల్లించాలనేది మరొక రూలునూ ‘మనోడు’ బ్రేక్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఏదోలా డిపాజిట్ మొత్తం చెల్లించినా, పాట పూర్తయి పదిరోజులు గడిచినప్పటికీ ఆరు నెలల అద్దె డబ్బులు ఇప్పటికీ జమ చేయలేదు. లీజు హక్కుదారుడు.. అద్దె పెరగదు...ఖాళీ చేయడు డిఫాల్టర్ అయినా బినామీతో నిర్వహణ టీడీపీ నేతల అండతో కొనసాగింపు జీ హుజూర్ అంటున్న దేవదాయశాఖ వేలం సజావుగా జరిగితే పెరగనున్న ఆదాయం శ్రీ సత్యనారాయణ టాకీస్ స్థలానికి కలగని మోక్షం -
పెండింగ్ కేసులు పరిష్కారంఅయ్యేలా పనిచేయాలి
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల రేపల్లె: కేసులు పరిష్కరించి కక్షిదారులకు సత్వరమే న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు పనిచేయాలని సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల కోరారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ హాలులో శనివారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పెండింగ్ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో జూలై 7వ తేదీన జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులతోపాటు పరిష్కరించ దగ్గ కేసులను పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలని అన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి.దేవిసాయిశ్రావణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.గీతాభార్గవి, డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, సీఐ మల్లికార్జునరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గరికపాటి వెంకటగిరిధర్, డివిజన్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. మల్లేశ్వరస్వామి సేవలో అదనపు కమిషనర్ పెదకాకాని: రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనరు తెనాలి చంద్రకుమార్ దంపతులు శనివారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, ఆలయ అర్చకస్వాములు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాలతో అదనపు కమిషనరు దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణలు చేసిన వారు భ్రమరాంబమల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అదనపు కమిషనరు దంపతులకు ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు వేద ఆశ్వీరవచనం చేశారు. తెనాలి చంద్రకుమార్ దంపతులను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. వైభవంగా పునఃప్రతిష్టా మహోత్సవాలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలంలోని కేఆర్ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో పునఃప్రతిష్టా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు నిత్యపూజావిధులు, వాస్తుపూజ, బలిపర్యగ్నీకరణ విధులు, ప్రభాతబలి, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, జలాధివాసం, క్షీరాధివాసం, అదివాసహోమాలు జరిగాయి. భక్తులు బిందెలతో నీటిని తెచ్చి స్వయంగా విగ్రహాలకు అభిషేకం చేశారు. దేవస్థాన ఈఓ కె.సునీల్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. నేడు ఈత శిక్షణ శిబిరం ప్రారంభం తాడేపల్లి రూరల్: ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి వున్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు (మే 4వ తేదీ ఆదివారం) పిల్లల ఈత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ, కార్యదర్శి యార్లగడ్డ రమేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో వున్న స్విమ్మింగ్‌పూల్‌లో అసోసియేషన్ లైఫ్ చైర్మన్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, లైలా గ్రూప్ కంపెనీస్ అధినేత గోకరాజు ఆదిత్యవర్మలు పిల్లల ఈత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నారని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు. -
ఊరూరా.. నోరూర..!
ఆవకాయ...తెలుగువారి సంప్రదాయ ఊరగాయ పచ్చడి. ఆంధ్రా ఆవకాయ అంటే దేశంలోనే కాదు, విదేశాల్లో స్థిరపడినవారూ లొట్టలేస్తారు. అందులోనూ గుంటూరు కారంతో చేసిన ఆవకాయ పచ్చడి కాంబినేషనే వేరు. ‘ముద్దపప్పు, నెయ్యితో కలిపి ఆవకాయ పచ్చడి అన్నం అరచెయ్యంతా తీసుకుని ముద్ద చేసుకొని నోటిలో పెట్టుకుంటే...నా సామిరంగా ఆ కమ్మదనాన్ని మాటల్లో చెప్పలేం సుమా!’ ● పచ్చడి తయారీలో గృహిణులు బిజీ బిజీ ● ఆంధ్రులకు ఆవకాయకు విడదీయలేని బంధం ● గుంటూరు కారంతో ఆ రుచే వేరు ఇది ఆవకాయ సీజన్ ●తెనాలి: ప్రస్తుత వేసవి సీజనంటే మామిడికాయ విక్రయం నుంచి, పచ్చడి తయారీ వరకు అమ్మకందార్లు, ఇంటి ఇల్లాళ్లు బిజీగా ఉంటారు. ఇళ్లలోనే కాదు, బజారుల్లోనూ మామిడికాయలు, ధరవరలు, ఆవకాయ తయారీ ముచ్చట్లు వినిపిస్తూనే ఉంటాయి. ఆవకాయ పచ్చడి చేయటమంటేనే ఇంట్లో సందడి అన్నమాట. పెద్దవాళ్లు ముందుగా స్నానం చేశాకగాని పచ్చడి తయారీకి పూనుకొనేవారు కాదు. కుటుంబ సభ్యులు ఒకరు ముక్కలు తరిగితే, ఇంకొకరు మెంతిపిండి, ఆవపిండి కలపటం, ముక్కలు కలియదిప్పేందుకూ తలోచేయి వేస్తారు. పచ్చడి పూర్తయ్యాక పింగాణి జాడీలోకి సర్ది, దానికి శుభ్రమైన పొడిబట్టతో వాసిను కట్టేవారు. అలా నిల్వచేసిన పచ్చడి ఏడాదంతా తాజాగా ఉంటుంది. ఇక జాడీలోకి తీశాక బేసినులో మిగిలిన పచ్చడిలో అన్నం కలిపి ముద్దలుగా చేసి పెడుతుంటే పిల్లలతో సహా ఇంటిల్లపాదీ తినేవారు. ఇవన్నీ ఉమ్మడి కుటుంబాల జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. నేటి తీరిక లేని జీవితాల్లో వీటికి ఆస్కారం తక్కువైంది. ఆవకాయ పచ్చడికి రెడీమేడ్ మార్కెట్ పెరిగింది. స్థానిక పచ్చళ్ల తయారీదారులు కిలో రూ.300 వరకు అమ్మకాలు చేస్తున్నారు. వృత్తి జీవితంలో నిత్యం బిజీగా వుండే శ్రీరామా స్కూలు ప్రిన్సిపాల్ ఉమారాణి మాత్రం సొంతంగా పచ్చడి చేసుకుంటేనే తృప్తిగా ఉంటుందని, అందుకే శ్రమ అనుకోకుండా ఏటా ఆవకాయ చేస్తామని చెప్పారు. కాయ ఒక్కోటి రూ. 50 ఈసారి మామిడి సీజను గత వారం రోజులుగా ముమ్మరమైంది. సాధారణంగా చిన్న రసాలు, జలాలు, తెల్లగులాబి, ఎర్రగులాబి, నాటుకాయ రకాల మామిడికాయలను పచ్చిగా ఉన్నపుడు పచ్చడికి తీసుకుంటారు. కాయ ఒక్కోటి రూ.50 పలుకుతోంది. తెల్లగులాబీ రకానికి డిమాండ్ ఉంటుంది. వినియోగదారులు కాయ నాణ్యత, పులుపును పరిశీలించి పచ్చడికి ఎంచుకుంటారు. మార్కెట్ దగ్గరే కాయలు కడిగించుకుని, ముక్కలు కోయించుకుని తీసుకెళుతున్నారు. కొందరు డ్వాక్రా గ్రూపు సభ్యులు పచ్చళ్ల వ్యాపారంలో ఉన్నారు. స్థానికులే కాదు, హైదరాబాద్, సింగపూర్, అమెరికాలో ఉండే బంధువులు, తెలిసినవారు వారు చేసిన ఆవకాయను తీసుకెళుతుంటారు. ఇన్ని రకాలుగా ఆవకాయ పచ్చడి రుచిని ఆంధ్రులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. కోరిన సైజులో ముక్కలు.. రోజులు మారినా, వీలు కుదరకున్నా ఏదోలా ఆవకాయను సొంతంగా తయారు చేసుకోవాలని అనుకునే ఇల్లాళ్లూ లేకపోలేదు. వీరికోసమే అన్నట్టుగా ఇప్పుడు పచ్చడి మామిడి కోసేవారు ఎక్కడికక్కడ వచ్చేశారు. ప్రత్యేకమైన కత్తిపీటలతో కోరిన సైజులో ముక్కలను కొట్టి ఇస్తున్నారు. మామిడికాయల అమ్మకాలున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా చిన్న చిన్న స్టాల్స్ నడుపుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రస్తుత వేసవికి దాదాపు వెయ్యి మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. సైజును బట్టి ఒక్కో కాయకు రూ.3 నుంచి రూ.5 వరకు తీసుకుంటున్నారు. రోజుకు 300–500 కాయలు కోస్తామని ఈ వ్యాపారంలో ఉన్న వెంకటేశ్వరరావు చెప్పారు. -
సందేశాత్మకం.. ఉత్సాహభరితం
తెనాలి: రూరల్ మండల గ్రామం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం కొనసాగాయి. తాళ్లూరు శ్రీనివాసరావు కళాప్రాంగణంలో తొలుత తాళ్లూరు సురేష్ జ్యోతి ప్రజ్వలనతో రెండోరోజు ప్రదర్శలనలను ప్రారంభించారు. తొలుత విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటికను ప్రదర్శించారు. స్వేచ్ఛ అనేది విశృంఖలానికి దారితీయకూడదు. స్వేచ్ఛ హద్దు ఉంటేనే ముద్దుగా వుంటుంది... లేకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించిందీ నాటిక. పీఎస్ నారాయణ మూలకథకు పరమాత్ముని శివరాం నాటకీకరణ చేయగా, బీఎం రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో సురభి లలిత, సింధు, ఏపూరి శ్రీనివాస్, వెంకట్ గోవాడ నటించారు. ధైర్యం చెప్పే ‘బ్రహ్మ స్వరూపం’ రెండో ప్రదర్శనగా మైత్రీ కళానిలయం, విజయవాడ వారి ‘బ్రహ్మస్వరూపం’ నాటికను ఆడారు. కఠినమైన సందర్భాల్లో విధి విరోధిగా మారినపుడు మనం నిస్సహాయులుగా మిగిలిపోతున్నపుడు సాక్షాత్తూ ఆ బ్రహ్మస్వరూపం ఆవహించి ధర్మాన్ని చెబుతుందని ధైర్యం చెప్పిందీ నాటిక. స్నిగ్ధ రచించిన నాటికకు టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో టీవీ పురుషోత్తం, శ్యామ్, వీసీహెచ్‌కే ప్రసాద్, ఎం.రత్నకుమారి, ఆర్.రాజేశ్వరి నటించారు. చివరగా యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచించిన నాటికకు ఆర్.వాసు దర్శకత్వం వహించారు. రత్నకుమారికి జీవిత సాఫల్య పురస్కారం రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు అధ్యక్షతన జరిగిన సభలో ఒంగోలుకు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి ఎం.రత్నకుమారికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. గోపరాజు శివరామకృష్ణ, హనుమత్ శేఖర్, కుటుంబసభ్యుల చేతులమీదుగా ఈ గౌరవాన్ని అందజేశారు. విశాఖపట్నంకు చెందిన నటుడు, దర్శకుడు చలపాని శివప్రసాద్, కొల్లిపరలోని శ్రీకళానిలయం వ్యవస్థాపకుడు బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఇదే వేదికపై రాష్ట్రస్థాయి రచనల పోటీల విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. రంగస్థల ప్రముఖులు దేవిరెడ్డి రామకోటేశ్వరరావు, డీవీ చంద్రశేఖర్ (న్యూఢిల్లీ), పీవీత్యనారాయణ (గుడివాడ), గంటా ముత్యాలనాయుడు (కొంతేరు), పి.శివప్రసాద్ (గుంటూరు), వల్లూరు వరప్రసాద్, నల్లిబోయిన నాగేశ్వరరావు మాట్లాడారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. కొనసాగుతున్న ఆహ్వాన నాటిక పోటీలు -
నేడు రేపల్లె ప్యాసింజర్ రైళ్లు రద్దు
తెనాలిరూరల్: తెనాలి పట్టణంలోని మారీస్పేట మొండిగోడల వద్ద పినపాడు కాల్వపై వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో తెనాలి– రేపల్లె మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను ఆదివారం రద్దు చేసినట్టు తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్ టీవీ రమణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు–రేపల్లె (67249), రేపల్లె–గుంటూరు(67250), గుంటూరు–రేపల్లె(67223), రేపల్లె–గుంటూరు(67224), తెనాలి–రేపల్లె(67231), రేపల్లె–తెనాలి(67232), తెనాలి–రేపల్లె(67233), రేపల్లె–తెనాలి(67234) రైళ్లను రద్దు చేసినట్టు చెప్పారు. విజయవాడ–తెనాలి(67221) రైలును గుంటూరుకు మళ్లిస్తారని, సికింద్రాబాద్ నుంచి రేపల్లె(17645) వెళ్లే ప్యాసింజర్ రైలు గంట ఆలస్యంగా నడుస్తుందని తెలిపారు. -
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025 -
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
గుంటూరు
శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 20259ప్రసన్నాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం చిలకలూరిపేట: రజక కాలనీలోని ఈశాన్య ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.జూనియర్ సివిల్ జడ్జీలు బాధ్యతల స్వీకారం గుంటూరులీగల్: గుంటూరు జిల్లాకు బదిలీపై వచ్చిన పలువురు జూనియర్ సివిల్ న్యాయమూర్తులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో జరిగిన జూనియర్ సివిల్ జడ్జీ ల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లాకు పలు వురు వచ్చారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా వి.దీప్తి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా ఎం.జగదీశ్వరి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా దమ్మాలపాటి ధనురాజ్, నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా ఎం.శోభారాణి, ఆరో అదనపు జూనియర్ సివి ల్ జడ్జి కమ్ సీడీ సీఐడీ కోర్టు న్యాయమూర్తిగా మహమ్మద్ గౌస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తిగా బి.మేరీ సారా ధనమ్మ బాధ్యతలు స్వీకరించారు. గిరిజన పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నరసరావుపేట ఈస్ట్: పల్నాడు రోడ్డులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో (బాలురు) 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి (ఇంగ్లిష్ మీడియం) వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ గుమ్మడి వీరయ్య శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. 5వ తరగతిలో 40 సీట్లు ఉండగా వీటిలో 30 సీట్లు ఎస్టీలకు కేటాయించినట్టు తెలిపారు. మిగిలిన 10 సీట్లలో ఐదు సీట్లు ఎస్సీ, బీసీ 2, ఓసీ 1, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఒక సీటు కేటాయించారన్నారు. 6వ తరగతిలో 25, 7వ తరగతిలో 17, 8వ తరగతిలో 24, 9వ తరగతిలో 13 సీట్లు ఉన్నాయని, వాటిని ఎస్టీ సామాజిక వర్గం విద్యార్థులతో భర్తీ చేయనున్నట్టు వివరించారు. 5 నుంచి 9వ తరగతి వరకు మిగులు ఖాళీలను ఎస్టీ విద్యార్థులతోనే భర్తీ చేస్తామన్నారు. ఖాళీల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే జిల్లా ట్రైబల్ సంక్షేమశాఖ అధి కారుల సమక్షంలో ఈనెల 30వ తేదీన లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని వివరించారు. మంగళగిరి టౌన్: అమరావతి పునః ప్రారంభ సభ పేరిట రాష్ట్రం నలుమూలల నుంచి తరలించిన ప్రజలకు శుక్రవారం పట్టపగలే చుక్కలు కనిపించాయి. ప్రత్యేక బస్సుల్లో సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ఉదయాన్నే వారు బయలు దేరారు. మంగళగిరి ప్రాంతానికి చేరుకునే సరికి మధ్యాహ్నం అయ్యింది. కాజ టోల్గేట్ సమీపంలో దశావతారం దేవాలయం పక్కనే ఉన్న ఖాళీ ప్రాంగణంలో ట్రాన్సిట్ పాయింట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. భోజనం, అరటిపండ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇటుగా వచ్చిన రాయలసీమ జిల్లాల వారికి అవి సరిపోక ఇబ్బందులు పడ్డారు. సభా ప్రాంగణానికి వెళ్లేందుకు సరైన సూచికలు కనిపించలేదు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ట్రాన్సిట్ పాయింట్ ముందే కంతేరు అడ్డరోడ్డుకు కొన్ని వాహనాలు తరలించడంతో దూర ప్రాంతాల ప్రజలు భోజనం, తాగునీరు లేక అవస్థలు పడ్డారు. చాలామందికి భోజన సదుపాయం ఇక్కడ కాదని అధికారులు చెప్పడంతో ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది హోటళ్లను ఆశ్రయించారు. సభకు వెళ్లకుండానే వెనక్కి... టోల్‌గేటు నుంచి చినకాకాని వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వందలకొద్దీ బస్సులు ఒకేసారి టోల్‌గేటు వద్దకు రావడం, తర్వాత వరుసగా ఆహారం అందించే కేంద్రాల వద్ద ఆగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొంతమంది కూటమి నేతలు టోల్‌గేటు వద్దకు వచ్చే బస్సులను ఆపి ఎంతమంది వచ్చారో లెక్కించడంతో ట్రాఫిక్ జామ్‌కు మరో కారణమైంది. ఉదయం 11 గంటల నుంచి కాజ టోల్‌గేటు వద్ద ఈ పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం భోజనం చేసి సభా ప్రాంగణానికి బయలుదేరే సరికి ట్రాఫిక్ కొన్ని కిలోమీటర్ల మేర ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 3 గంటలు దాటినా మంగళగిరి నగరం కూడా దాటకపోవడంతో కార్యక్రమానికి అందుకోలేమని చాలా బస్సుల వారు వెనుదిరిగారు. టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోదావరి, కృష్ణా జిల్లాల బస్సు డ్రైవర్లు కూడా సభా ప్రాంగణానికి వెళ్లలేమని వెనుదిరగనున్నట్లు తెలిపారు. తెనాలి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరినా మంగళగిరి చేరుకోవడానికి సాయంత్రం 4 గంటలు అయిందని పలువురు మహిళలు పేర్కొన్నారు. న్యూస్‌రీల్ ప్రధాని సభకు అరకొరగా ఏర్పాట్లు దూరప్రాంతాల వారికి తప్పని కష్టాలు భోజనం, తాగునీరు దొరక్క అవస్థలు నానా ఇబ్బందులు పడిన మహిళలు గంటల తరబడి ట్రాఫిక్ జాంతో తంటాలు సమన్వయలోపంతో పట్టపగలే చుక్కలు -
‘నీట్’కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికై ఈనెల 4న జరగనున్న జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–2025)కు విస్తృత రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 4,250 మంది విద్యార్థులకు 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 తరువాత కేంద్రాల్లోనికి అనుమతించరు. నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్‌లో పొందుపర్చిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంది. విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు ● నీట్‌కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ ఆంక్షలు విధించింది. విద్యార్థినులు ముక్కు పుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజుల సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. ● చేతికి స్మార్ట్‌వాచీతో పాటు సాధారణ వాచీలను సైతం ధరించకూడదు. ● సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా కేంద్రాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. ● విద్యార్థులు జీన్స్ ఫ్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకుండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్‌గ్లాసెస్ ధరించకూడదు. ● బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎటువంటి వస్తులను తమ వెంట తీసుకురాకూడదు. విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి ● విద్యార్థులు ప్రింటవుట్ అడ్మిట్‌కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్‌పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్‌పై అతికించాల్సి ఉంది. దీంతో పాటు పోస్ట్‌కార్డ్ సైజు వైట్ బ్యాక్ గ్రౌండ్‌తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్‌కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్వజిలేటర్‌కు అందజేయాలని నియమావళిలో పొందుపర్చారు. ● ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డును తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను కేంద్రాల్లోనే ఇస్తారు. గుంటూరు జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు దరఖాస్తు చేసిన విద్యార్థులు 4,250 మంది ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతి మధ్యాహ్నం 1.30 గంటల తరువాత నో ఎంట్రీ విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలపై ఆంక్షలు అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్, పోస్ట్‌కార్డు సైజు ఫోటోలతోపాటు, ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి -
విజయకీలాద్రిపై తిరునక్షత్ర మహోత్సవం
తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలా ద్రి దివ్య క్షేత్రంపై శుక్రవారం తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళ శాసనాలతో 1008వ భగవద్రామానుజాచార్య స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా ఉదయం 9 గంటలకు అభిషేకం, సేవాకాలం, అర్చన కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు వాహన సేవ, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో కబడ్డీ క్యాంప్ వినుకొండ: శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డులోని విద్యావికాస్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్టు కోచ్ కోమటిగుంట శ్రీహరి తెలిపారు. ఈ క్యాంప్‌ను శుక్రవారం డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రజిత్‌యాదవ్, పీఈటీ రాధాకృష్ణమూర్తి, వినుకొండ జోన్ ప్రెసిడెంట్ గణప వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8008285430 నంబరులో సంప్రదించాలన్నారు. యతీశ్వరుల చిత్ర పటాలతో ప్రదర్శన కొల్లూరు: శంకర జయంతిని పురస్కరించుకుని ఆది శంకరాచార్యులు, రామచంద్రేంద్ర సరస్వ తి యతీశ్వరులు చిత్రపటాలతో కొల్లూరులో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. వేద పరీక్షలు, పండిత సన్మాన సభలు శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు కొల్లూరులోని శ్రీ పార్వతీ సంస్కృత పాఠశాలలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. కార్యక్రమాల నిర్వహణకు అధ్యక్ష, కార్య ద ర్శులుగా గబ్బిట శివరామకృష్ణప్రసాద్, తాడేప ల్లి వెంకటసింహాద్రిశాస్త్రి వ్యవహరిస్తారన్నారు. 7 నుంచి కళాపరిషత్ నాటిక పోటీలు పొన్నూరు: పొన్నూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ శత జయంతిని పురస్కరించుకుని 24వ తెలుగు రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు కళాపరిషత్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 వరకు నిడుబ్రోలు జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని డాక్టర్ నన్నపనేని జ్ఞానేంద్రనాఽథ్ కళావేదికపై పోటీలు జరుగుతాయన్నారు. ఎస్.ఆంజనేయులునాయుడు, ఎన్. రఘునాఽథ్, ఆకుల సాంబశివరావు, ఎం.విజయ్‌కుమార్ రెడ్డి, డాక్టర్.దేసిబాబు, మురళీకృష్ణ, జి.తాతారావు, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి అమరావతి: అమరేశ్వరుని దేవస్థానంలో శుక్రవారం ఆదిశంకరాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. శంకరాచార్య విగ్రహనికి ఆలయ అర్చకుడు శంకరమంచి రాజశేఖర శర్మ పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విశేషాలంకారం, ప్రత్యేక పూజలు చేసి బ్రాహ్మణులకు విసన కర్రలు, మామిడి పండ్లు పంపిణీ చేశారు. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్‌పై అక్రమ కేసు
పిడుగురాళ్ల: సోషల్ మీడియా యాక్టివిస్టు షేక్ మాబును అక్రమ కేసులో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడనే నెపంతోనే కూటమి నాయకులు పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2024 సెప్టెంబర్ 11న సోషల్ మీడియా యాక్టివిస్టు వెన్నా రాజశేఖర్‌రెడ్డి, మాబుని అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులు గురి చేశారు. ఈ సమయంలో మాబు తల్లిదండ్రులు హైకోర్టులో హెబిఎస్ కార్పస్ వేశారు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని కొంత కాలంగా వెన్నా రాజశేఖర్‌రెడ్డిని, మాబుని ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పిడుగురాళ్ల పోలీసులు ఈ క్రమంలోనే తిరిగి బైకు దొంగతనం చేశారన్న నెపంతో మాబుని బ్రాహ్మణపల్లిలోని సిమెంట్ షాపు వద్ద నుంచి కొట్టుకుంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వచ్చారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్నను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని, పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును మాబు తమ్ముడు జానీ ప్రశ్నించారు. దాంతో బైకు దొంగతనం కేసు సంబంధించి విచారణకు తీసుకొని వచ్చామని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనే కారణంతోనే ఈ అక్రమ కేసులు బనాయించి తన అన్న మాబును పోలీస్‌స్టేషన్‌కు తరలించారని జానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును సాక్షి వివరణ కొరగా మాబుతోపాటు అతని అన్న బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చినట్లు సీఐ తెలిపారు. -
భోజనానికి ఇబ్బంది పడ్డాం
ఎప్పుడో ఉదయాన్నే బయలుదేరాం. కాజ సమీపంలో ట్రాన్సిట్ పాయింట్ వద్ద భోజనం కోసం బస్సును ఆపారు. రాయలసీమ వారికి భోజనం వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు అప్పుడు చెప్పారు. సుమారు 25 మంది ఉండటంతో గంట తర్వాత భోజనం అందించారు. – కె.పద్మజ, కమలాపురం, కడప జిల్లా మా ప్రాంతం వారికి భోజన సదుపాయం ఇక్కడ కాదన్నారు. మీకు ఇస్తే మిగతా వాళ్లకి సరిపోవని, లెక్కప్రకారం భోజనాలు తీసుకొచ్చామని స్థానికంగా స్టాల్స్‌లో ఉన్న వారు చెప్పారు. తర్వాత ఓ అధికారి వద్దకు వెళ్లి అడగడంతో స్పందించారు. – ఎం.జగన్, కడప జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దూర ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు. మాకు బోయపాడు వద్ద భోజన సదుపాయం కల్పించామని చెప్పారు. కానీ అక్కడి నుంచే మేం వచ్చాం. ఒక్కరికి కూడా భోజనం అందలేదు. కాజ టోల్‌గేటు వద్ద వేరే బస్సులో అదనంగా ఉన్న భోజనం అందించారు. – వెంకట రాము, ఆత్మకూరు, అనంతపురం జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపం -
వరికూటి ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్ శాఖ
సాక్షి ప్రతినిధి,బాపట్ల: మద్యం బెల్టు షాపులపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు చేపట్టిన వినూత్న నిరసన ఫలితాన్నిచ్చింది. ఆయన చేపట్టిన ఆందోళనకు ఎకై ్సజ్ శాఖ స్పందించింది. శుక్రవారం వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో పలు మద్యం దుకాణాలను ఎకై ్సజ్ అధికారులు తనిఖీ చేశారు. పల్లెకోన గ్రామంలో మద్యం అమ్ముతున్న సుబ్బారావుని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రేపల్లె స్టేషన్ పరిధిలో 35 కేసులు, భట్టిప్రోలు మండలంలో 15 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏ గ్రామంలోనైనా బెల్టు షాపులు, పర్మిట్ రూములు నిర్వహిస్తే రేపల్లె ఎకై ్సజ్ పోలీసుస్టేషన్ ఫోన్ నంబర్ 9440902476 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెల్టుషాపులు నిరోధించే వరకూ ఉద్యమం – వరికూటి అశోక్‌బాబు వేమూరు నియోజకవర్గంలో బెల్టుషాపులతోపాటు పర్మిట్ రూములు నిరోధించేవరకూ ఉద్యమాన్ని నిర్వహిస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన సూపర్‌సిక్స్ పథకాలు కాకుండా ప్రజలకు మద్యం సరఫరా చేస్తోందన్నారు. వాడవాడలా మద్యం దుకాణాలు ఏర్పాటుతో ఆ మద్యం సేవించి పేదలు ఎస్సీ,ఎస్టీ,బలహీన వర్గాలు ఆర్థికంగా చితికి పోతున్నాయన్నారు. తక్షణం బెల్టుదుకాణాలు, పర్మిట్ రూములను నిలిపి వేయాలన్నారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అశోక్‌బాబు హెచ్చరించారు. మద్యం షాపుల్లో తనిఖీలు పలు బెల్టు షాపులపై కేసులు ఫిర్యాదు చేస్తే చర్యలకు సిద్ధమన్న ఎకై ్సజ్ పోలీసులు -
రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఇటువంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.కాగా, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద శుక్రవారంఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
అమరావతి రీలాంచ్.. పరువు కోసం బాబు సర్కార్ పాట్లు
సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్లైన్లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్‌తో చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు. -
వచ్చి తీరాల్సిందే..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న అమరావతి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా జన సమీకరణకు పడరాని పాట్లు పడుతోంది. గుంటూరు జిల్లాలోనే కార్యక్రమం జరుగుతున్నందున ఈ జిల్లా నుంచే భారీగా లక్షన్నర మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 1241 బస్సులు కేటాయించింది. 591 బస్సులు డ్వాక్రా మహిళలకు, 650 బస్సులు పార్టీ నాయకులకు అంటూ విభజన చేసింది. మొత్తం 691 గ్రామాల నుంచి 691 మంది సీసీలు 330 మంది వీఓఏల ద్వారా జన సమీకరణకు అధికారులు బస్సులను సిద్ధం చేశారు. ప్రతి గ్రూపు నుంచి సగం మంది అయినా.. గుంటూరు జిల్లా డీఆర్డీఏలో 20,683 డ్వాక్రా గ్రూపులకు 2,27,513 మంది సభ్యులు ఉన్నారు. మెప్మా గ్రూపులు 21,400 ఉండగా, 2,14,000 మంది సభ్యులు ఉన్నారు. గుంటూరు నగరం నుంచే 740 బస్సుల్లో జనాన్ని తరలించనున్నారు. ప్రతి గ్రూపు నుంచి కనీసం సగం మంది అయినా సభకు హాజరు కావాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు నగరం నుంచే 80 వేల మందిని సమీకరించాలని మెప్మా నుంచి గ్రూపులపై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తం జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకుండా 1.20 లక్షల మంది డ్వాక్రా మహిళలను తరలించాలని ఆర్పీలకు సూచించారు. తొలగిస్తామంటూ హెచ్చరికలు.. ఒక్కొక్క ఆర్పీ నాలుగు బస్సుల జనాన్ని సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 70 మంది ఆర్పీలు ఉండగా, 300 బస్సుల్లో జనాన్ని తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్పీలు టీడీపీ నాయకులతో సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. జనసమీకరణ చేయకుంటే తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకే జనాలను బస్సుల ఎక్కించి ఫొటోలు అప్లోడ్ చేయాలని, సభా ప్రాంగణానికి వెళ్లి కుర్చీల్లో కూర్చున్న తరువాత ఫొటోలు అప్లోడ్ చేయాలని సూచించారు. బస్సులో కూర్చునప్పుడే ఫొటో తీయాలని, టీడీపీ నాయకులతో కలిసి ఈ ఫొటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇక సభా ప్రాంగణానికి నల్ల దుస్తులు, నల్ల బుర్కాలు, ఇతర నల్ల వస్తువులతో రావద్దని ఆదేశించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇలా.. నియోజకవర్గం నుంచి 248 బస్సుల్లో తరలిస్తున్నా రు. వీఓఏలు 120 మందికి బాధ్యతలు అప్పగించారు. డీఆర్డీఏ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి జనాన్ని సభకు తరలించాలని సూచించారు. ఎమ్మెల్యే, నాయకులు ఏర్పాటు చేసే ఒక్కో బస్సు కు ఒక్కో వీఓఏను ఇన్చార్జిగా నియమించారు. ప్రధాని సభకు బస్సులు తరలడంతో ఖాళీగా కనిపిస్తున్న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆర్పీలకు బాధ్యతలు...12 గంటలకల్లా బస్‌లు ఎక్కించాలి ఆర్పీలతో అధికారులు, తెలుగుదేశం నాయకుల సమీక్షలు సమీకరణలో విఫలమైతేతొలగిస్తామంటూ బెదిరింపులు ప్రధాని సభకు రాజధాని ప్రాంతంలో ఇంటింటికి ఆహ్వానం గుంటూరు జిల్లాలోలక్షన్నర మంది తరలింపే లక్ష్యం సచివాలయ ఇంజినీరింగ్ ఉద్యోగులకు మంచినీటి పంపిణీ డ్యూటీలు పొన్నూరు డిపో నుంచి..పొన్నూరు నియోజకవర్గం నుంచి కనివిని ఎరుగని రీతిలో తరలి రావాలని ఎమ్మెల్యే నరేంద్ర పిలుపునిచ్చారు. పెరుగుతున్న భూముల ధరలను దృష్టిలో ఉంచుకొని సభను విజయవంతం చేయాలని ఆయన సన్నాహక సమావేశంలో కోరారు. పొన్నూరు డిపో నుంచి 16 ఆర్టీసీ బస్సులు, 70 ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. సచివాలయ సిబ్బందికి నీటి డ్యూటీ సచివాలయ ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేశారు. సచివాలయాలలో ఇంజినీరింగ్ సిబ్బందికి మంచినీటి సరఫరా డ్యూటీలు వేశారు. జన సమీకరణ భారం మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలపైనే పడింది. తమ నేత పేరును ఆహ్వాన పత్రికలో వేయలేదంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఉండటంతో వారు జనసమీకరణపై దృష్టి పెట్టడం లేదు. -
జూనియర్స్ విభాగం విజేత హైదరాబాద్ ఎడ్లజత
దాచేపల్లి: స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు బుధవారం రాత్రి హోరాహోరీగా జరిగాయి. జూనియర్స్ విభాగంలో జరిగిన ఈ పోటీలను గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రారంభించారు. పోటీలో హైదరాబాద్‌కి చెందిన డి.రోహన్భాబు ఎడ్ల జత 3,158 అడుగుల దూరం బండ లాగి విజేతగా నిలిచింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన అత్తోట శిరిష చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 2,772 అడుగుల దూరం బండలాగి రెండవ స్థానం, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన బుర్రిముక్కు కౌసల్యారెడ్డి ఎడ్ల జత 2,565 అడుగుల దూరం బండలాగి మూడో స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం లింగయపాలెంకి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత 2,398 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానం, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోట శిరిషచౌదరి, శివకృష్ణ చౌదరి, గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడుకి చెందిన దొడ్డంపూడి గణేష్ సంయుక్త ఎడ్ల జత 2,250 అడుగుల దూరం బండలాగి ఐదో స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం లింగాయపాలెంకి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్లజత 2వేల అడుగుల దూరం బండ లాగి ఆరో స్థానం, గుంటూరు పట్టణానికి చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్ల జత 1,774 అడుగులు దూరం బండలాగి ఏడవ స్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు నగదు, షీల్డ్స్ బహుకరించారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించగా కమిటీ సభ్యులు కొప్పుల గిరి, అనిశెట్టి శ్రీనివాసరావు, కానుకొల్లు ప్రశాంత్, మునగా నిమ్మయ్య తదితరులు పర్యవేక్షించారు. -
డివిజన్ పరిధిలో పళ్లు రైళ్లు రద్దు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడం జరిగిందని డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–తిరుపతి(07257) ఈనెల 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు, తిరుపతి–చర్లపల్లి(07258) రైలు ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే గుంటూరు– రేపల్లె(67249), రేపల్లె–గుంటూరు(67250) గుంటూరు–రేపల్లె(67223), రేపల్లె – గుంటూరు (67224), రేపల్లె–తెనాలి(67230), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె–తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233) రేపల్లె–గుంటూరు (67234)విజయవాడ–తెనాలి(67221) రైళ్లను ఈనెల 4వ తేదీన రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాల్సిందిగా తెలియజేశారు. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య పుసులూరు(కాకుమాను):అప్పుల బాధతో కౌలురైతు పురుగు మందుతాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు పెదనందిపాడు మండలం పుసులూరుకు చెందిన తమటం బసవయ్య గత కొంత కాలంగా పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది 20 ఎకరాలు తీసుకుని మిరప, మొక్కజొన్న, శనగ, పత్తి సాగు చేపట్టాడు. అన్ని పంటలు ఆశించిన స్థాయిలో పండకపోవడం, సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రోజు మదన పడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం భార్యను వెంటపెట్టకుని పొలం వద్దకు వెళ్లాడు. అనంతరం చిన్న ఫంక్షన్ ఉందని సాయంత్రానికి ఇంటికి వస్తానని చెప్పి గుంటూరు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా స్పందన లేకపోవంతో పంట పొలాల్లో వెతికారు. గురువారం ఉదయం పుసులూరు నుంచి కట్రపాడు వెళ్లే మార్గంలో ఓ పంట పొలంలో బసవయ్య నిర్జీవంగా పడి ఉన్నట్లు మృతుని భార్య తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. నరసరావుపేట రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు నరసరావుపేటటౌన్: కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నరసరావుపేట ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రైల్వేస్టేషన్, పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీచేశారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో పటిష్టవంతమైన భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ వి.శ్రీనివాసరావు నాయ క్ తెలిపారు. -
నిజాయితీ అధికారి సోమేపల్లి
లక్ష్మీపురం: నిజాయితీగల అధికారిగా ప్రభుత్వ సేవలు అందించటంతో పాటు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాన్ని ఏర్పరిచి పలువురు కవులు, రచయితలను గుర్తించి వెలుగులోనికి తెచ్చిన మహామనిషి సోమేపల్లి వెంకటసుబ్బయ్య అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేట సీపీఎం కార్యాలయం కొరటాల సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సోమేపల్లి వెంకటసుబ్బయ్య జయంతి, సాహిత్య పురస్కారాల ప్రదాన సభ ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ సభకు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ గ్రామీణ రైతాంగ ఈతిబాధలను తన రచనల ద్వారా సోమేపల్లి వ్యక్తీకరించారు అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కవిగా, కార్యకర్తగా రాష్ట్ర ప్రజలకు వెంకటసుబ్బయ్య ఎనలేని సేవలందించారన్నారు. తాడేపల్లి గూడెంలో అధికారిగా పేదలకు నివాస గృహాలు అందించిన సందర్భంగా అక్కడి పేదలు తమ కాలనీకి వెంకటసుబ్బయ్య కాలనీగా పేరు పెట్టుకున్నారని కొనియాడారు. తన ఊరుతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై కవిత్వం ద్వారా స్పందించే వారిని వివరించారు. డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు, గుళ్ళపల్లి సుబ్బారావు, కందిమళ్ల శివప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రెక్కలు వచ్చాయి రచయిత్రి సి.యమున, రాఘవరావు దంపతులను ఘనంగా సత్కరించి కథా పురస్కారం అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు ఎస్.ఎం.సుభాని, వశిష్ట సోమేపల్లి, తాటికోల పద్మావతి, దారి వేముల అనిల్ కుమార్, సోమేపల్లి వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ -
జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే
పిడుగురాళ్ల: జానపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తామని, నిర్మాణం చేపట్టే వరకు పోరాటాలు ఆగవని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ. 52 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. గత ఎన్నికల ముందు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంత వరకు ప్రారంభించలేదని అన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అధికార పార్టీకి అల్టిమెంట్ చేశామని, అయినా అధికార పార్టీ నాయకులు మొద్దు నిద్ర వీడలేదని విమర్శించారు. అందుకే జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం గత వైఎస్సార్ సీపీ హయాంలో మంజూరు చేసిన బ్రిడ్జిని ఎందుకు నిర్మించరూ, పూర్తి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించినా, ఎందుకు నిర్మించటం లేదని కోర్టులో ఫిల్ దాఖలు చేయటం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేస్తాం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు వంటివి చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ చింతా వెంకట రామారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యులు విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, రాష్ట్ర మాజీ ఆర్టీఐ మాజీ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు వీరభద్రుని రామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కత్తెరపు వాసుదేవరెడ్డి, కాండ్రగుంట శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కాసు మహేష్‌రెడ్డి గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి -
ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
తాడికొండ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమరావతికి విచ్చేస్తున్న సందర్భంగా వెలగపూడి, సచివాలయం ప్రాంతానికి దగ్గరలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పునఃప్రారంభం సభ’ ప్రాంగణాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం పరిశీలించారు. సభావేదిక, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అతిథులు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలు, సభాప్రాంగణంలో కూర్చునే వారందరికీ చేసిన ఏర్పాట్లు, సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, ఆహారం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సంబంధిత అధికారులను ఆయా అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రితో పాటు మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లి రవీంద్ర, పలు శాఖల అధికారులు ఉన్నారు. అమరావతి పునఃనిర్మాణం చారిత్రక ఘట్టం తెనాలి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో అమరావతి పునఃనిర్మాణం చారిత్రాత్మక ఘట్టం కానుందని రాష్ట్ర రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో జనసమీకరణలో భాగంగా గురువారం మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెనాలి వచ్చారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలగా గుర్తుచేశారు. రాజధాని పునఃనిర్మాణాన్ని యజ్ఞంలా చేపడుతున్న రాష్ట్రప్రభుత్వానికి ప్రజలందరి మద్దతు తెలియజేయాలని కోరారు. చంద్రబాబు నాయుడుకి రాజధాని, పోలవరం రెండు కళ్లుగా చెబుతూ, ఆ రెండింటి నిర్మాణం కోసం కేంద్రం ఆశీస్సులతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు శాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి -
ఉత్సాహంగా వేసవి విజ్ఞాన శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా నిర్వహించిన శిక్షణా తరగతుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథ పాలకురాలు కె.ఝాన్సీలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులకు కథలు చదవటం, కథలు వినడం, మ్యాథ్స్ క్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్, దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు రోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం, గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, పప్పెట్ మేకింగ్, పేపర్ క్రాఫ్ట్ నేర్చుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా గ్రంథాలయాల్లో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు పంపాలని సూచించారు. గ్రంథ పాలకులు కె.చిన్నపరెడ్డి, ఎన్.నాగిరెడ్డి, శాంతి భాయి, వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు గుంటూరు నర్సింగ్ కాలేజ్‌లో ఉచిత శిక్షణ గుటూరు మెడికల్: నర్సింగ్ సిబ్బంది గతంలో జర్మనీ వెళ్లాలంటే ఏం చేయాలో, ఎక్కడ శిక్షణ తీసుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి 22 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది డిసెంబర్ 11 నుంచి శిక్షణ ప్రారంభమైంది. శిక్షణలో జర్మన్ భాషలో ఏ1, ఏ2, బీ1, బీ2 స్థాయిలలో నైపుణ్యం సాధించాలి. ఇప్పటికే ఏ1, ఏ2, బీ1 పరీక్షలు పూర్తికాగా.. వారికి చైన్నెలో బీ2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్న్ లో మౌఖిక పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగానికి ఎంపికై నట్లు లెక్క. అలా ఎంపికై నా వారికి విమాన టికెట్లు, వీసా, ధ్రువపత్రాలు అన్నీ ఉచితంగా అందిస్తారు. వీరికి నెలకు రూ.2.7 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు జీతం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని జర్మనీ పంపేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందని గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుంటున్నవారు చెబుతున్నారు. విదేశాల్లో నర్సులుగా ఉద్యోగాల కోసం వెళ్లేందుకు ఇది సువర్ణ అవకాశం అంటున్నారు. కల్లంలోని మిర్చి చోరీ సుమారుగా 15 క్వింటాళ్ల మిర్చి మాయం మేడికొండూరు: రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట దిగుబడులను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లిన ఘటన మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. వెలనాటి శ్రీనివాసరావు అనే రైతు తన పొలంలో సుమారు 40 క్వింటాళ్ల మిరప పంటను కోసి కల్లాల్లో ఆరబోశాడు. ఎండిన మిర్చిని టిక్కీలలో నింపేందుకు ఒక రాశిగా చేశాడు. బుధవారం రాత్రి మిర్చి రాశిలోని సుమారు 15 క్వింటాళ్ల కాయలు దొంగలు టిక్కీలలో నింపుకొని వెళ్లినట్లు రైతు శ్రీనివాసరావు తెలిపారు. మిర్చి దొంగతనంపై మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు తెలిపారు. గతంలో ఇదే తరహాలో మండలంలోని డోకిపర్రు గ్రామంలో కల్లాల్లో ఉన్న మిర్చి దొంగతనం జరిగిందని రైతు తెలిపాడు. ఇప్పటికై నా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మిర్చి దొంగలను నియంత్రించాలని మండల రైతులు కోరుతున్నారు. గిరిజన పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం వినుకొండ: స్థానిక వినుకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల (బాలుర) నందు 2025–26 విద్యాసంవత్సరానికి తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వై. శివరామకృష్ణ తెలిపారు. 5వ తరగతిలో ఎస్టీ–30, ఎస్సీ–5, బీసీ–2, ఓసీ–1, పీహెచ్సీ–1, గిరిజన ప్రాంతీయ ఉద్యోగులు –1, బ్యాక్ లాగ్ పోస్టులు (ఎస్టీ విద్యార్థులకు మాత్రమే), 6వ తరగతిలో 21, 8వ తరగతిలో 6, 9వ తరగతిలో 9 కలవు. పూర్తి చేసిన దరఖాస్తులను మే నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పాఠశాల కార్యాలయంలో అందజేయాలన్నారు. -
రైల్వే ఎస్పీ తనిఖీ
లక్ష్మీపురం : ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి విచ్చేస్తున్న సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం రైల్వే ఎస్పీ రాహూల్‌దేవ్ తనిఖీలు చేపట్టారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐఆర్పీ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహూల్‌దేవ్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు, నక్సల్స్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో ఎస్పీ వెంట రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, రైల్వే లైన్స్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్సై ఎం.లక్ష్మీనారాయణ, యు.జ్యోతి, శ్రీనివాసరెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అన్నయ్య అని పిలుస్తూనే వివాహేతర సంబంధం
అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య తెనాలిరూరల్: కూలి పనులకు వెళ్లినప్పుడు పరిచయమైన వ్యక్తిని అందరి ముందు అన్నయ్య అని పిలుస్తూనే అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పథకం ప్రకారం భర్తను హత్య చేయించింది. త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్ బాబు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల్లోని ఆటో డ్రైవర్ గండికోట వెంకట మణి పృధ్విరాజ్ గత నెల 27 రాత్రి మల్లెపాడు ఎలగ్గుంట చెరువులో హత్యకు గురయ్యాడు. మృతుని తండ్రి అంకమ్మరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం బొల్లాపల్లికి చెందిన గోవిందు కోటేశ్వరరావు అలియాస్ కత్తి, మృతుడి భార్య గండికోట వెంకటలక్ష్మి అలియాస్ బుజ్జి, వెంగళాయపాలెంకు చెందిన గోవిందు ఉదయ కిరణ్, మరో 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. పృధ్విరాజ్‌కు ఐదేళ్ల కిందట వెంకటలక్ష్మితో వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో దంపతులిద్దరు తాపీ పని నిమిత్తం బెంగళూరు వెళ్లగా అక్కడ బొల్లాపల్లికి చెందిన గోవిందు కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు అనుమానం రాకుండా కోటేశ్వరరావును అన్నయ్య అంటూ అందరి ముందు మాట్లాడేది. వెంకటలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందని గమనించిన పృధ్వీరాజ్ భార్యను నిలదీశాడు. దీంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం గత నెల 27న కోటేశ్వరరావును తెనాలి పిలిపించింది. కోటేశ్వరరావు, అతని బాబాయి కొడుకు ఉదయ్ కిరణ్, మరో బాలుడు ముగ్గురు కలిసి పృధ్విరాజ్‌కు మద్యం తాగేందుకుకని ఫోన్ చేశారు. అతని ఆటోలోనే ముగ్గురు వెళ్లి మల్లెపాడులో మద్యం తాగారు. అనంతరం పృధ్విరాజ్పై కత్తి, రాళ్లతో దాడి చేసి హతమార్చి, అదే ఆటో తీసుకుని పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని గుర్తించిన అంకమ్మరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేయడంలో కానిస్టేబుళ్లు మురళి, బాబురావు, జయకర్ సహకరించినట్లు సీఐ వెల్లడించారు. హత్య కేసును త్వరితగతిన ఛేదించినందుకు జిల్లా ఎస్పీసతీష్కుమార్, డీఎస్పీ బి.జనార్ధనరావు తమను అభినందించినట్లు సీఐ తెలిపారు. -
పత్తి కట్టెల కింద నాగాభరణం
గుడిలో అపహరణకు గురై.. పొలంలో ప్రత్యక్షం ప్రత్తిపాడు: గుడిలో అపహరణకు గురైన స్వామివారి నాగాభరణం.. పత్తి పొలంలో పత్తి కట్టెల కింద ప్రత్యక్షమయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 3వ తేదీన ప్రత్తిపాడు మండలం పెద గొట్టిపాడులోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయ తలుపులకు వేసి ఉన్న ఇనుప కడ్డీలు వంచి గుడిలో ఉన్న నాలుగు కేజీల కాశీవిశ్వేశ్వరుని వెండి నాగాభరణంతో పాటు సుమారు నలభై గ్రాముల అమ్మవారి బంగారు తాళి బొట్టుతాడు, తాళిబొట్లు రెండు, ముక్కెర, బంగారు బొట్టు బిళ్ల, ఉత్సవమూర్తుల వెండి వస్తువులను దుండగులు అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గుడిలో చోరీకి గురైన నాగాభరణం ఓ పొలంలో దర్శనమిచ్చింది. గ్రామ శివారులోని ఓ పొలంలో గుట్టగా ఉన్న పత్తి కట్టెకు బుధవారం సాయంత్రం వ్యవసాయ పనుల్లో భాగంగా నిప్పు పెట్టారు. గురువారం ఉదయం రైతు పొలానికి వెళ్లి చూడగా పత్తి కట్టెల బూడిద మధ్య స్వామివారి నాగాభరణం కనిపించింది. షాక్‌కు గురైన రైతు విషయాన్ని గ్రామస్తులకు సమాచారమిచ్చారు. గ్రామస్తులు నాగాభరణాన్ని పరిశీలించి స్వామివారిదిగా గుర్తించి, ఆభరణాన్ని ఆలయానికి చేర్చారు. రెండు నెలల కిందట గుడిలో దొంగతనానికి పాల్పడిన ఆగంతకుడు నాగాభరణాన్ని దొంగిలించిన తరువాత పత్తి కట్టెల మధ్య దాచి ఉంచి పరారై ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. -
శ్రామికుల పక్షం వైఎస్సార్ సీపీ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): కార్మికుల కన్నీటి కష్టంలో నుంచి.. వారి హక్కుల సాధన కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికులకు సంబంధించిన న్యాయబద్ధమైన సమస్యల పరిష్కరించకపోవటం దారుణమని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ పేరులో ‘ఎస్’ అనే ఆంగ్ల అక్షరం శ్రామిక అని.. అలా పేరు పెట్టి శ్రామికులకు గుర్తింపునిచ్చిన ఘనత వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మేడేను కేవలం అలంకారప్రాయంగా కాకుండా కార్మిక, కర్షక సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించాలని హితవు పలికారు. పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్ మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్రతో పాటు అనేక పథకాల ద్వారా ప్రతి ఏటా రూ.75వేలు లబ్ధి చేకూరిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15వేలు ఇస్తామని నమ్మబలికి వంచించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో కార్మికులపై కేసులు నమోదు అధికంగా అవుతున్నాయన్నారు. మే డే వేడుకల్లో కార్మికులకు పెద్దపీట పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి జిల్లా కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు కార్మికులతో జెండా ఎగురవేయించిన మోదుగుల -
ఆడుదాం.. ఆరోగ్యంగా ఉందాం
గుంటూరు వెస్ట్ (క్రీడలు ): వేసవి అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. కారణం పాటశాలలకు సెలవులు. కొన్ని రోజులపాటు పుస్తకాలు, క్లాస్‌రూమ్స్ ఉండవు. ఆటలు, పాటలే ఆటవిడుపుగా సెలవులను గడిపేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం పట్టణంలో పలు ప్రాంతాల్లో మే 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు వేసవి క్రీడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తుంది. 30 రోజులపాటు సాగే శిక్షణా శిబిరంలో నిపుణులైన శిక్షకులు, సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో క్రికెట్, జిమ్నాస్టిక్స్, చెస్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, కరాటే, జూడో, షటిల్ బాక్సింగ్ ఇలా 23 క్రీడా విభాగాల్లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసారు. ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డబుల్ ఒలింపియన్ సత్తెగీత, ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్న ఎందరో క్రీడాకారులు వేసవి శిక్షణా శిబిరాల ద్వారానే వెలుగులోకి వచ్చారు. బీఆర్ స్టేడియంలో... స్థానిక బీఆర్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, టెన్నిస్, స్కేటింగ్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, కరాటే, జూడో లాంటి క్రీడల్లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసారు. వీటిలో టెన్నిస్‌కు రూ.500, బ్యాడ్మింటన్‌కు రూ.500, స్కేటింగ్‌కు రూ.300 వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని క్రీడలను ఉచితంగానే శిక్షణనిస్తారు. సమయం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో.. అథ్లెటిక్స్ లాంగ్ టెన్నిస్, షటిల్, స్కేటింగ్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, యోగా, చెస్‌లో శిక్షణ ఉంటుంది. స్విమ్మింగ్‌కు రూ.2200, అథ్లెటిక్స్‌కు రూ.1200, బ్యాడ్మింటన్, స్కేటింగ్‌లకు రూ.1600 చొప్పున ఒక్క నెలకు వసూలు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో శిక్షణనిస్తామని నిర్వహకులు చెబుతున్నారు. ప్రారంభమైన వేసవి క్రీడా సంబరం మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనలు కిటకిటలాడుతున్న క్రీడా మైదానాలు ఆరోగ్యం కోసం క్రీడలు తప్పనిసరంటున్న నిపుణులు తక్కువ ఖర్చుతోనే నేర్చుకునే సౌలభ్యం క్రీడలు జీవితంలో తప్పనిసరి ప్రస్తుత ఆధునిక సమాజంలో చిన్నారులను మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉంచడానికి క్రీడలు తప్పనిసరి. క్రీడా సాధనతో చిన్నారుల కండరాలు, నరాలు గట్టిపడతాయి. చక్కని హార్మోన్స్ విడుదలకు దోహదపడతాయి. క్రీడా సాధన చేసే పిల్లల భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉంటుంది. షుగర్, బీపీ, ఒత్తిడి దరిచేరవు. శారీరక శ్రమ లేకపోవడంతోనే బాల్యంలోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తితోపాటు చక్కని ఆరోగ్యం ఇచ్చేందుకు ప్రయత్నించాలి. – డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దాదాపు 2500 మంది చిన్నారులను 50 బ్యాచ్‌లుగా విడగొట్టి వారికి ఇష్టమైన క్రీడలో శిక్షణనిస్తున్నాం. కొన్ని క్రీడలకు నామమాత్రపు రుసుము వసూలు చేస్తుండగా, మరికొన్ని ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం. శిక్షణా శిబిరాల్లో ప్రతిభ కనబరచే వారిని ఎంపిక చేసి ప్రొఫెషనల్ స్థాయికి వచ్చే విధంగా తర్ఫీదునిస్తాం. చిన్నారుల ఆరోగ్య స్థితిగతుల బట్టి వారికి ఇష్టమైన క్రీడలోనే చేర్చాలి. పిల్లల శిక్షణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. శాప్ కూడా ప్రతి క్రీడ నిర్వహణకు రూ.7000 చొప్పున కేటాయించింది. ఎంతమంది పిల్లలు వచ్చినా శిక్షణనిస్తాం. – నరసింహారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి -
తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఉద్రిక్తత!
గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు ఆపేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణ అధికారుల చర్యతో.. పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది వారధిపై భారీ స్థాయిలో ధాన్యం లారీలు ఆగిపోయాయి. తమను అనుమతించాలంటూ బ్రిడ్జిపై అడ్డంగా లారీలు పెట్టి ఆంధ్రా లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రతిగా తెలంగాణ నుంచి వస్తున్న లారీలను సైతం వాళ్లు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో నాలుగు గంటలుకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాడపల్లి బ్రిడ్జి వద్ద ఐదు లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్ చేయడం, అందుకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పడమే ఈ మొత్తం పర్యవసనానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతలపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించాల్సి ఉంది. -
కులగణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: కులాల వారీగా జనగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ స్వాగతిస్తుందన్నారు పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్. కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా పోతిన పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే దీనిపై తీర్మానం చేశారని గుర్తుచేశారు. ‘అణగారిన వర్గాల అభివృద్ధికి ఈ కుల గణన ఎంతో మేలు చేస్తుంది. జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంతో మేలు చేశారు. కుల గణన కోసం ఆరుగురు అధికారుల తో కమిటీని కూడా జగన్ నియమించారు. దేశంలో కుల గణన చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అణగారిన వర్గాలకు అందించిన గొప్ప వ్యక్తి జగన్. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అందించడానికి మీ కులం, ప్రాంతం ఏంటి అని అడుగుతున్నారు’ అని పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
‘కుల గణన’ నిర్ణయంపై వైఎస్ జగన్ హర్షం
గుంటూరు, సాక్షి: జన గణనతో పాటే కుల గణన చేయాలన్న కేంద్రం నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. గురువారం తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే.. వైఎస్సార్సీపీ హయాంలో కుల గణనను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కుల గణన చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. 2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది ఇది కీలకమైన అడుగు అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.I welcome the Centre’s decision to conduct a caste-based census. Andhra Pradesh, under my leadership, took the lead by passing a resolution in November 2021 and conducting the country’s first BC caste-wise enumeration in January 2024 through village and ward secretariats. A…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2025ఇదీ చదవండి: కులగణనకు కేంద్రం ఓకే -
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మికులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు.#MayDay #InternationalLabourDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2025 -
మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాక్షస పాలనలో ఉన్నామని.. ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్సార్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొన్న వైనంపై కూడా ఆయన చర్చించారు. ‘‘ఇలాంటి రెడ్ బుక్ రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ... చంద్రబాబూ మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకోమని చంద్రబాబుకి కూడా చూపించి.. గొప్ప తెగువ చూపించారు’’ అని వైఎస్ జగన్ ప్రశంసించారు.‘‘మీ అందరి తెగువకు, విలువలు పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హేట్సాఫ్. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు, మన రాజకీయాలకు తేడా చాలా ఉంది. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘సత్యసాయి జిల్లా గాండ్ల పెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాలు ఉంటే.. ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఏడింట ఆరు మందిని గెలిపించారు. టీడీపీకి ఒక్కటే ఉంది. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీకే రావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనమంతా చూశాం. బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్ మెన్ లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. చివరికి మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్ కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే గెలిచినట్లు ప్రకటించుకున్నారు...ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా ఒక్కటిగా నిలబడ్డారు. మీ తెగువకు హేట్సాఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లు.. ఇక్కడ వైఎస్సార్సీపీ గుర్తు మీద ఏకంగా 26 మంది గెలిచారు. మరి అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లే గెలవాల్సి ఉండగా.. అక్కడ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలపబడ్డారు...ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు.. ఏ స్థాయిలో అంటే.. మనవాళ్లను బెదిరించి వాళ్ల పార్టీలోకి తీసుుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే చేయాలని సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు...రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం మున్సిపాల్టీ నిలిచింది. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో తెగువ చూపించిన నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్ చెప్పాలి. రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని వైఎస్సార్సీపీ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలడా అని ప్రశ్నిస్తున్నాను...ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ల ఆ తల్లుల అమ్ములు, ఆ ఇంట్లో నుంచి రైతన్నలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు మాకిచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారు. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం, కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారు...చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నోటి కాడ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేయడమే కాకుండా జగన్ ఇచ్చినవే కాకుండా అధికంగా ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు దగ్గర పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న మన హయాం నుంచి ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఉన్నత విద్య కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి మన హయాంలో ఉండేది. ప్రతి మూడు నెలలకు వారికి ఫీజులు మన హయాంలో చెల్లిస్తే.. నేడు చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి మన పాలనలో ఉండేది.ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యఆసరా లేదు. పేదవాడు నెట్ వర్క్ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే నిరాకరిస్తున్నారు. మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా... రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఇ- క్రాప్ కనబడకుండా పోయింది.ఆర్బీకేలు నీరుగార్చాడు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, అరటి, కంది, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు.మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఏ గ్రామంలో చూసినా ఇవాళ గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ఏ నియోజకవర్గంలో మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. పంచుకో, దోచుకో తినుకో నడుస్తోంది.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ... చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నాడు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశాడు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు.ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి...ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్నవిధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల... ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
లక్ష్యానికి చేరుకోని మార్కెటింగ్ శాఖ
కొరిటెపాడు(గుంటూరు): నిర్దేశిత లక్ష్యానికి చేరకుండానే మార్కెటింగ్ శాఖ చతికిలపడింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గుంటూరు జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీలు, 15 చెక్‌పోస్టుల ద్వారా రూ.133.69 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో 88.16 శాతంతో రూ.117.87 కోట్లు వసూలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.రాజబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పొన్నూరు మార్కెట్ యార్డు రూ.6.95 కోట్లకు గానూ 105.64 శాతంతో రూ.7.34 కోట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచింది. దుగ్గిరాల 104.06 శాతం, ప్రత్తిపాడు 102.16 శాతం, తెనాలి 101.67 శాతం సాధించి లక్ష్యాన్ని చేరుకున్నాయి. తాడికొండ మార్కెట్ యార్డు లక్ష్యం రూ.2.10 కోట్లు కాగా, 90.67 శాతంతో రూ.1.90 కోట్లకు పైగా వసూలు చేసి లక్ష్యానికి చేరువగా నిలిచిపోయింది. మిగిలిన వాటిలో గుంటూరు మార్కెట్ కమిటీ 85.74 శాతం, ఫిరంగిపురం 78.65 శాతం కాగా, ఆఖరి స్థానంలో మంగళగిరి మార్కెట్ కమిటీ 73.96 శాతంతో లక్ష్యానికి ఆమడదూరంలో ఆగిపోయింది. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా మార్కెటింగ్ శాఖకు రూ.146.31 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఏడీఎం తెలిపారు. ఇందులో అత్యధికంగా గుంటూరు మార్కెట్ కమిటీకి రూ.115 కోట్లు టార్గెట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెనాలి మార్కెట్ కమిటీకి రూ.7.65 కోట్లు, దుగ్గిరాల రూ.3.75 కోట్లు, పొన్నూరు రూ.8.38 కోట్లు, మంగళగిరి రూ.3.03 కోట్లు, ఫిరంగిపురం రూ.1.88 కోట్లు, తాడికొండ రూ.2.17 కోట్లు, ప్రత్తిపాడు మార్కెట్ కమిటీకి రూ.4.45 కోట్లు లక్ష్యం విధించినట్లు ఆయన వివరించారు.88.16 శాతంతో సరి -
విద్యారంగంలో అసంబద్ధ విధానాలపై ఆందోళన
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు నిరసనగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి ఆందోళన, పోరాటాలు చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవలింగారావు, మొహమ్మద్ ఖాలీద్ పేర్కొన్నారు. కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. 117 జీవోను రద్దు చేసి, పాఠశాల విద్యను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా పూర్వస్థితికి మార్చుతామని చెప్పిన ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులు కొనసాగించడమే కాకుండా కొన్నిచోట్ల ఒకటి నుంచి టెన్త్ వరకు తరగతులు నిర్వహిస్తామని చెప్పడం ఉపాధ్యాయ, విద్యార్థిలోకాన్ని మోసం చేయడమేనని విమర్శించారు. తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను తీసుకురావడం ద్వారా విద్యారంగాన్ని విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలకు ఈనెల 5న తేదీ పాత తాలుకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, మే 9న జిల్లా కేంద్రంలో ధర్నా, మే14 న విజయవాడలో రాష్ట్రస్థాయిలో ధర్నా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మొత్తం 12 డిమాండ్స్ పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్.ఎస్.ఎన్. మూర్తి, జి.దాస్, జిల్లా కౌన్సిలర్లు పి.శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వర్లు, గురుమూర్తి, జహంగీర్, షూకూర్, మాలకొండయ్య పాల్గొన్నారు. -
ధైర్యే సాహసే విజయం
జీవితం చాలా పెద్దది. అందులో మనం రాసే పరీక్ష ఎంతో చిన్నది. కేవలం ఒక్క పరిక్షకే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే పిరికితనం.సాధించాలన్న తపనతో జీవిత పరీక్ష నెగ్గాలి. నవమాసాలు మోసిన కన్నతల్లి.. బరువు బాధ్యత నెత్తికెత్తుకున్న తండ్రి గుండెలు పగిలి.. జీవితాంతం హృదయ భారాన్ని మోసేలా.. తనువు చాలించడం బాధాకరం. సాధించాలన్న తపన ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే మనోబలాన్ని ఇస్తుంది. తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా జీవితం ముగిసి పోదు. క్షణికావేశ నిర్ణయాలు మంచిది కాదు. నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగితే విజయం మన సొంతమవుతుంది. ● మనోవ్యధతో రాలుతున్న విద్యా కుసుమాలు ● ఫెయిల్ అయింది పరీక్షే.. జీవితం కాదు ● విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ● తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరం పట్నంబజారు: మిస్సైల్ రంగంలో భారతదేశ రూపురేఖలు తీర్చిదిద్దిన భారతరత్న అబ్దుల్ కలాం పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చేవి. అయినా పట్టుదలతో ముందడుగు వేయడంలో ఆయను గొప్ప శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఖ్యాతి చెందారు. భారతరత్నగా నిలిచారు. క్రికెట్ ప్రపంచంలో కీర్తించే సచిన్ టెండూల్కర్ పదో తరగతి తప్పిన విషయం స్వయంగా ఆయన చెప్పాడు. ఎంతో మంది విద్యావేత్తలు, గొప్ప వ్యక్తులు పరీక్షల్లో ఫెయిల్ అయిన తరువాతే.. జీవిత పరీక్షలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తల్లిదండ్రులకు కడుపుకోత పరీక్ష ఫెయిల్ అయ్యామని, అర్ధంతరంగా, క్షణికావేశంలో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చిన పరిస్థితులు ఎంతో బాధాకరం. ఒక్కటంటే ఒక్క నిమిషం మనసు నిబ్బరంగా చేసుకొని ప్రశాంతంగా ముందున్న భవిష్యత్తు, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. ● కొద్ది రోజుల కిందట ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. దుగ్గిరాల మండలం చినపాలెంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన చెన్ను అవినాష్, రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాననే బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● గుంటూరు లాలాపేటకు చెందిన కె. అభినవ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని, మనస్తాపంతో ఎవరికి చెప్పకుండా తాడేపల్లి రైల్వేస్టేషన్ దగ్గరకు వెళ్లాడు. సెల్‌టవర్ ఆధారంగా పోలీసులు విద్యార్థిని గుర్తించి రక్షించారు. ● నగరంలో తూర్పు నియోజకవర్గ పరిధిలో కూడా ఓ విద్యార్థిని కూడా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యయత్నం చేసే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన తల్లితండ్రులు కాపాడి, విషయం బయటకు పొక్కకుండా చూసుకోవడంతో ఎటువంటి కేసు నమోదు కాలేదు. ముందు ఎంతో జీవితం పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి ఇదే ఆఖరిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాస్, ఫెయిల్ అనేవి జీవితంలో అత్యంత సర్వసాధారణమైన విషయంగా భావించాలి. ఏ తప్పు వల్ల ఫెయిల్ అయ్యామనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఇకపై ఆ తప్పు జరగకుండా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. ఒత్తిడి నుంచి వేగంగా బయటపడేందుకు ప్రయ త్నించాలి. వెనకబడిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఉపాధ్యాయులు, సీనియర్లు, తల్లిదండ్రుల సలహాలు తీసుకుని ముందుకు సాగాలి. తల్లిదండ్రులే ధైర్యం చెప్పాలి లక్షలాది రూపాయలు పెట్టి చదివించాం.. ఫెయిల్ అయ్యాడనే భావనంతో కాకుండా.. పరిక్షల్లో తప్పిన విద్యార్ధులను తల్లిదండ్రులు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు సైతం ఎంతో ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి. చిరునవ్వుతో సప్లమెంటరీ రాద్దాంలే అని చెప్పే మాట ఎంతో మనోధైర్యాన్ని కల్పిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు ముభావంగా ఉన్నా, పరధ్యానంలో ఉన్నా వారిని ఒంటరిగా వదలిపెట్టొద్దు. ఫెయిల్ అవ్వడం వల్ల నష్టం లేదని ధైర్యాన్ని చెప్పారు. -
ఫెయిల్ అయితే ఓటమి కాదు
పరీక్ష ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. గెలుపోటములకు కుంగిపోవడం, మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం అంటే మనకి మనం ఓటమిని అంగీకరించటమే. ప్రపంచ కుబేరుల్లో ఎక్కువ మంది పెద్ద చదువులు చదివిన వారే లేరు. వారు చేసిందల్లా ఒకటే.. నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. మన సర్టిఫికెట్లు అర్హతగానే పరిగణించాలి. మార్కులు తక్కువ వచ్చాయనో, మనం కోరుకున్న కళాశాలలో సీటు దక్కలేదనో కుంగుబాటుకు గురవటం అనవసరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకున్న రోజు ప్రపంచంలో మనకన్నా గొప్పవారు ఎవరూ ఉండరు. –నీలి ఉమాజ్యోతి (మానసిక వ్యాధుల, విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్) -
సింహాచలం బాధిత కుటుంబాలకు YSRCP ఆర్థిక సాయం
గుంటూరు, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరోవైపు చంద్రంపాలెంలో బాధిత కుటుంబాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించిన ఓదార్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే సింహాచలం అప్పన్న ఆలయంలో ఏడుగురి ప్రాణాలు పోయేందుకు కారణమైందని మండిపడ్డారు.మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రేపు వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చ, పార్టీ బలోపేత చర్యల్లో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుసగా వైఎస్ జగన్ సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. రేపటి సమావేశానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వనించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నట్లు వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. -
నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారాయన.నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే ఓ కారు అదుపు తప్పిన ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో.. ఐదుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: నెల్లూరులో కారు బీభత్సం: ఘోర ప్రమాదం ఇలా.. -
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
సాక్షి,తాడేపల్లి: సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని.. దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు.‘‘తనను తాను నాస్తికుడిగా చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి వన్నీ చూసినప్పుడు ప్రత్యక్షంగా ప్రకృతి ప్రకోపిస్తోంది. 2014లో 40 ఆలయాలను కూలగొట్టించింది చంద్రబాబే.. అయినా చంద్రబాబు గొప్పవాడని బీజేపీ వెనకేసుకొస్తోంది. వైఎస్ జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారు. అది నచ్చక జగన్‌పై బురద చల్లారు. తన మనుషులతో ఆలయాలపై దాడులు చేయించి జగన్‌పై నెట్టేశారు. తిరుపతి లడ్డూని రాజకీయాలకు వాడుకుని మహాపాపం చేశారు. లడ్డూని అపవిత్రం చేయాలని చంద్రబాబు, పవన్ ఎంతో ప్రయత్నం చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు‘‘దేవుడు ఇలాంటి వన్నీ చూస్తూ ఉంటాడు. ఇన్నేళ్ల చరిత్రలో తిరుపతిలో తొక్కిసలాట ఏనాడైనా జరిగిందా?. గోదావరి పుష్కరాల తొక్కిసలాట.. తిరుపతి తొక్కిసలాట.. గోవుల మృతి ఇవన్నీ చంద్రబాబు సమయంలోనే జరుగుతాయి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు.. మా దోపిడీ మాకు ముఖ్యం అనేలా ఈ ప్రభుత్వ తీరు ఉంది. మూడు రోజుల క్రితం గోడకట్టడమేంటి?. ముందే కట్టొచ్చుకదా. వీళ్లలాంటి అవినీతి పరులకే పనులు అప్పగించారు.. అందుకే ఇలా జరిగింది’’ అని లక్ష్మీపార్వతి ఆరోపించారు.‘‘అర్హత లేని వాళ్లు అందలం ఎక్కితే ఇలాంటివే జరుగుతాయి. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలి. తిరుమతి తొక్కిసలాట విచారణ ఏమైంది?. చంద్రబాబు నీ జీవితం ఇంకెప్పుడూ మారదా?. నీ మార్గంలోనే నీ కొడుకును తీసుకెళ్లాలనుకుంటున్నావా?. ప్రజలు ఏమీ చేయలేనప్పుడు ప్రకృతి తిరగబడుతుంది. పవన్ సనాతన వేషాలు ఇప్పటికైనా మానుకో.. చంద్రబాబు అతని కొడుకు వంటి వాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు రక్షణ ఉండదు. ఎన్నికల ముందు చిన్న చిన్న రోడ్లలో మీటింగ్‌లు పెట్టి ప్రజల చావుకు కారణమయ్యారు. చంద్రబాబు అంటేనే మనుషులను చంపడమా?. ఈకుల, మత పిచ్చేంటి... చంద్రబాబు ఒక్కరోజైనా మనిషిగా బ్రతకండి. చంద్రబాబు,పవన్ అడుగుపెట్టిన నాటి నుంచి ఇలాంటి అపశ్రుతులే చోటుచేసుకుంటున్నాయి’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చేరుకున్నారు. సింహాచలం ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మృతిచెందిన ఉమామహేష్, శైలజ భౌతికాయాలకు నివాళులర్పించిన వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రంపాలెం బయల్దేరి వెళ్లారు,. తొలుత తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడ నుంచి చంద్రంపాలెం వెళ్లారు. -
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.