
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
ప్రస్తుత రాజకీయాలపై చర్చ, పార్టీ బలోపేత చర్యల్లో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుసగా వైఎస్ జగన్ సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. రేపటి సమావేశానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వనించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నట్లు వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.