LOCAL BODY
-
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నప్పలనాయుడు పేరు ఖరారు
-
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోటీ నుంచి టీడీపీ ఔట్
సాక్షి, విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం ముగిసింది. కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్‌గా షేక్ సఫి ఉల్లా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది.ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పోటీ నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. సరైన బలం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.మంగళవారం నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో అభ్యర్ధి పోటీపై విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని నిలబెట్టేందుకు పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అయితే అందుకు పార్టీ నేతలు ఒప్పుకోలేదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని ఎలా పెడతారని టీడీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించారు. కోట్లు రూపాయలు కుమ్మరించిన ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఇప్పటికే స్థానికేతరులతో టీడీపీ నిండిపోయిందన్న టీడీపీ నేతల అభిప్రాయంతో చంద్రబాబు అంగీకరించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నేటితో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసింది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. -
స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ ఇద్దరి పేర్లను అధిష్టానం ఆమోదం కోసం టీపీసీసీ వర్గాలు ఢిల్లీకి పంపించాయి. ఇక రంగారెడ్డి స్థానం నుంచి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో సోమవారం నిర్ణయం తీసుకుంటారనితెలిసింది. అధిష్టానం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత సోమవారం అందరి పేర్లను ప్రకటిస్తారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. -
విలీన మండలాలకు ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలంగాణ నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రెండు జెడ్పీటీసీ స్థానాలు, 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. వీటితోపాటు పెరవలి మండలం తీపర్రు ఎంపీటీసీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. వేలేరుపాడు, కుక్కునూరు జెడ్పీటీసీ స్థానాలకు, వేలేరుపాడులోని మేడిపల్లి, కాటుకూరు, నర్లవరం, తట్కూరుగొమ్ము, భూదేవిపేట, రేపాకగొమ్ము, రామవరం ఎంపీటీసీ స్థానాలకు, కుక్కునూరులోని అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు–1, కుక్కునూరు–2, దాచారం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 5న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 9న స్కూృట్నీ చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లను అభ్యర్థులు మరోసారి పరిశీలన కోసం 10న అప్పీల్ చేసుకోవచ్చు. 11న ఆప్పీళ్లపై విచారణ చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు విధించారు. 21న పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ రీ పోలింగ్ జరపాల్సి వస్తే 22న చేపడతారు. 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ .రమేష్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కుక్కునూరు రెవెన్యూ డివిజన్, పెరవలి మండలంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. -
ముగిసిన ‘స్థానిక’ పోలింగ్
-
స్థానికం ప్రశాంతం
ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ – మొత్తం ఓటర్లు 1,084.. ఓటేసింది 1,077 మంది – మొత్తం 99.35 శాతం పోలింగ్ – 20న ఓట్ల లెక్కింపు – గంటల తరబడి నిలబడిన ఓటర్లు – ఓటు వేసేందుకు ఇంత సేపు ఏంటంటూ అసహనం – పోలింగ్ కేంద్రంలో అధికార పార్టీ నేతలు – ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించని అధికారులు – నంద్యాల డివిజన్లో క్రాస్ ఓటింగ్ – ఆందోళన చెందుతున్న అధికార పార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం జరిగిన ఓటింగ్ ప్రశాతంగా ముగిసింది. మొత్తం 1,084 మంది ఓటర్లలో 1,077 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 7గురు వివిధ కారణాలతో ఓటింగ్‌లో పాల్గొనలేదు. మొత్తం మీద 99.35 శాతం పోలింగ్ జరిగింది. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఓటింగ్‌లో నంద్యాల, ఆదోని డివిజన్లో మొదట్లో భారీగా ప్రారంభం కాగా.. కర్నూలు రెవెన్యూ డివిజన్లో నెమ్మదిగా ప్రారంభమయ్యింది. అదేవిధంగా కర్నూలు రెవెన్యూ డివిజన్లో ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చింది. దీంతో ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఇంత సేపు క్యూలో నిల్చోవడం ఏమిటని ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒకానొక దశలో 11 గంటల ప్రాంతంలో క్యూలో నిల్చున్న ఓటరు.. రెండు గంటల పాటు వేచిచూసి ఓటు వేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఎండ వేడిమి భారీగా ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఓటింగ్ కేంద్రంలోకి అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అధికారులు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీ నుంచి అభ్యంతరం చెప్పిన తర్వాతే వారిని బయటకు పంపించారు. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని అధికార పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీలో తాము గెలుస్తున్నామనే ధీమా కనబడింది. అయితే, ఎవరి భవితవ్యం ఏమిటనే విషయం ఈ నెల 20న జరిగే ఓట్ల లెక్కింపులో బయటపడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఎవరిది గెలుపనే అంశం సూచనప్రాయంగా తెలిసే అవకాశం ఉంది. భయపెడుతున్న క్రాస్ ఓటింగ్ వాస్తవానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన మెజార్టీ ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అయితే అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి పలువురిని పార్టీ మార్పించారు. ఈ నేపథ్యంలో వీరు తమకు ఓటు వేస్తారా అనే అనుమానం అధికార పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా నంద్యాల డివిజన్లో భూమాకు చెందిన అనుచరులు తమ ప్రత్యర్థిగా ఉన్న శిల్పాకు ఓటు వేసేందుకు మొదటి నుంచీ నిరాకరించారు. దీంతో ఈ డివిజన్లో భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగిందని అధికారపార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అదేవిధంగా కర్నూలు డివిజన్లోని కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పార్టీ మారిన పలువురు ఓటర్లు కూడా తాము గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రుణం ఈసారి తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఓటింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. కర్నూలు డివిజన్‌లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆదోని రెవెన్యూ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పక్కా మెజారిటీ ఉంది. మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలుపు సూచనలు కనపడుతున్నాయి. అయితే, అధికారపార్టీ నేతలు మాత్రం.. ఎవరికి ఓటు వేసేది తెలుస్తుందని.. ఓటు వేయకపోతే సంగతి చూస్తామంటూ పలు చోట్ల బెదిరింపులకు దిగినట్టు సమాచారం. నేరుగా పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. అంటే అధికార పార్టీలో ఏ స్థాయిలో ఓటమి భయం ఉందో ఈ విషయం తేటతెల్లం చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇక ఓటింగ్ జరుగుతుండగా... అధికారపార్టీ నేతలు పలువురు పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడా అధికారులు మాత్రం నిలువరించే ప్రయత్నం చేయలేదు. అయితే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి అభ్యంతరం చెప్పడంతో పోలీసులు వారిని పంపించేశారు. డివిజన్ల వారీగా ఉన్న ఓట్లు, పోలైన ఓట్ల వివరాలు డివిజన్ ఉన్న ఓట్లు పోలైన ఓట్లు శాతం కర్నూలు 386 384 99.48 ఆదోని 391 389 99.48 నంద్యాల 307 304 99.02 మొత్తం 1,084 1,077 99.35 ఓటు వేయని వారు – భూమా నాగిరెడ్డి– ఎమ్మెల్యే, నంద్యాల (మరణించారు) – సుంకమ్మ– రామతీర్థం ఎంపీటీసీ (చనిపోయారు) – మస్తాన్ వలీ, చాగలమర్రి ఎంపీపీ (జైల్లో ఉన్నారు) – మహదేవమ్మ–కోవెలకుంట్ల ఎంపీటీసీ (చనిపోయారు) – పద్మావతమ్మ– బేతంచర్ల జెడ్పీటీసీ (విదేశాల్లో ఉన్నారు) – బుట్టా రంగయ్య– ఎమ్మిగనూరు మునిసిపాలిటీ వైస్‌చైర్మన్ (అనారోగ్యం) – మోహన్ రాజ్– మార్లమడికి ఎంపీటీసీ -
ఓటేసేందుకు సహాయకులు కావాలి
- మాకు చదువురాదు – దేశం నేతల ఆధ్వర్యంలో జేసీకి దరఖాస్తు చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు కర్నూలు(అగ్రికల్చర్): తమకు చదువురాదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సహాయకులను ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు సోమవారం తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి అయిన జేసీ హరికిరణ్‌ను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. శాసనమండలి లోకల్ అథారిటీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. అయితే నిరక్షరాస్యులు, అంధులు, బలహీనులు సహాయకుడిని నియమించుకొని ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇది అధికార పార్టీ నేతలకు కలసి వచ్చింది. ఓటర్లు నిజంగా తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో లేదో అనే భయంతో దగ్గరుండి సహాయకుల కోసం దరఖాస్తు చేయించడం గమనార్హం. దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు సోమవారమే కావడంతో చదువురాని వారితో పాటు అనుమానం ఉన్న వారికి సహాయకులను నియమింపచేసి వారి ద్వారా తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే లక్ష్యంతో దేశం నేతలు ఎంపీటీసీలను జేసీ కార్యాలయానికి తీసుకువచినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు మొన్నటి వరకు 1084 మంది ఉన్నారు. వీరిలో నంద్యాల ఎమ్మెల్యే మరణించడంతో ఓటర్ల సంఖ్య 1083కు తగ్గింది. ఇందులో ఎంపీటీసీ సభ్యులు 804 మంది ఉన్నారు. వీరిలోనే చాలామంది సహాయకుల కోసం కలెక్టరేట్‌కు వచ్చారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులో్ల 18 ఏళ్లు నిండిన వారిని సహాయకులుగా నియమిస్తారు. అయితే దేశం నేతలు కొంత మంది ఎంపీటీసీ కుటుంబ సభ్యులపై అనుమానంతో ఇతరులను సహాయకులుగా నియమించేందుకు దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. వీటిపై జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. -
నేడు ‘స్థానిక’ ఉప పోరు
మూడు సర్పంచ్, ఏడు వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ఖాళీ ఏర్పడిన మూడు సర్పంచ్, ఏడు వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జపరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. జిల్లాలో నాలుగు 4 సర్పంచ్, 24 వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో ఒక సర్పంచ్, 17 వార్డు స్థానాల ఎన్నిక ఏకగీవ్రమైంది. ఉప ఎన్నికలకు మొత్తం 29 ఈవీఎంలను, 95 మంది సిబ్బందిని ఎన్నికల సంఘం కేటాయించింది. వీరిలో 19 మంది పీఓలు, 57 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. మూడు సర్పంచ్ స్థానాలకు ఎనిమిదిమంది, ఏడు వార్డు స్థానాలకు 15 మంది, ఒక ఎంపీటీసీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపు ఈ నెల 10న ఉంటుంది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ డి.దివ్య శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్లోని డీఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రితో అధికారులు, సిబ్బంది పోలీస్ బందోబస్తుతో వెళ్ళారు. పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయించాలని ఎక్సైజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల రోజున ఆయా ప్రాంతాల్లో స్థానిక సెలవు దినం ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు తొలిసారిగా ఈవీఎంలు పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ దివ్య తెలిపారు. పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ నిర్వహించి క్లోజ్, రిజల్ట్ , క్లియర్ బటన్లు సరిచేసి ఏజెంట్లకు చూపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందితో చెప్పారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలన్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మండలం గ్రామం స్థానం వార్డు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– చింతకాని చింతకాని సర్పంచ్ – రఘునాధంపాలెం చిమ్మపూడి సర్పంచ్ – టేకులపల్లి బద్దుతండా సర్పంచ్ – బయ్యారం ఉప్పలపాడు వార్డు 1 వ బయ్యారం ఉప్పలపాడు వార్డు 9వ చండ్రుగొండ పెంట్ల వార్డు 2వ కొత్తగూడెం సుజాతనగర్ వార్డు 9వ ముదిగొండ అమ్మపేట వార్డు 7 వ సింగరేణి రేలకాయలపల్లి వార్డు 7 వ టేకులపల్లి టేకులపల్లి వార్డు 7 వ -
పాక్‌లో అల్లర్లు, 12 మంది మృతి
కరాచి: పాకిస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 12 మంది మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలోని 20 జిల్లాలలో ఆదివారం జరుగుతున్న మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ కార్యకర్తలు పరస్పరం ఆయుదాలతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పోలీస్ అధికారి మహమ్మద్ షా తెలిపారు. అల్లర్లకు కారణమైన 200 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కార్ స్పీడ్