
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
ఈ ఇద్దరి పేర్లను అధిష్టానం ఆమోదం కోసం టీపీసీసీ వర్గాలు ఢిల్లీకి పంపించాయి. ఇక రంగారెడ్డి స్థానం నుంచి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో సోమవారం నిర్ణయం తీసుకుంటారనితెలిసింది. అధిష్టానం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత సోమవారం అందరి పేర్లను ప్రకటిస్తారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment