
ఢిల్లీ: హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక, తాజాగా నిందితుడు హిమానీ హత్యకు గురైన రోజున ఆమె నివాసం సమీపంలో నుంచి సూటుకేసును తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
హర్యానాలో రోహ్‌తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో మార్చి ఒకటో తేదీన సూట్‌కేసులో హిమానీ నర్వాల్ మృతదేహం బయటపడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హిమానీ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం, హిమానీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు ఓ సూట్‌కేసును పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటల సమయంలో హిమానీ నివాసం సమీపం నుంచి అతడు వెళ్లడం గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అదే సూట్‌కేసులో ఆమె మృతదేహం ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో హిమానీ నర్వాల్ తన ఇంట్లోనే హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమెతో తనకు సన్నిహిత సంబంధం ఉందని నిందితుడు చెప్పుకొచ్చారు. అలాగే, తనను తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతోనే హత్య చేసినట్టు సచిన్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక, వారిద్దరు స్నేహితులని, నిందితుడికి ఇప్పటికే వివాహమైందని పోలీసులు తెలిపారు.
VIDEO | Himani Narwal murder case: CCTV footage - dated February 28, 2025 - shows accused Sachin carrying the black suitcase with the body stuffed in it, through a street. The CCTV visuals have been verified by the police.
Sachin - a "friend" of Congress worker Himani Narwal -… pic.twitter.com/f9qvKFR5rz— Press Trust of India (@PTI_News) March 3, 2025
Comments
Please login to add a commentAdd a comment