పాకిస్థాన్లో స్థానిక సంస్థల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 12 మంది మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కరాచి: పాకిస్థాన్లో స్థానిక సంస్థల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 12 మంది మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్లలోని 20 జిల్లాలలో ఆదివారం జరుగుతున్న మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ కార్యకర్తలు పరస్పరం ఆయుదాలతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పోలీస్ అధికారి మహమ్మద్ షా తెలిపారు. అల్లర్లకు కారణమైన 200 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.