karachi
-
CT 2025: ‘రూ. 739 కోట్ల నష్టం’.. పాక్ క్రికెట్ బోర్డు స్పందన ఇదే!
దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాక్.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి అంగీకరించాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్ సేనను అక్కడకు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు (PCB) వెనక్కి తగ్గింది.ఈ నేపథ్యంలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది. గ్రూప్ దశలో మూడు, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను అక్కడే పూర్తి చేసుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ పది మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధంకాగా.. వర్షం వల్ల కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే సజావుగా సాగాయి.రూ. 739 కోట్ల మేర నష్టం?ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ నేపథ్యంలో పీసీబీకి రూ. 739 కోట్ల మేర నష్టం వాటిల్లిందనే వార్తలు వచ్చాయి. అయితే, పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్ మిర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తజా ఈ వదంతులను ఖండించారు. ఐసీసీ ఈవెంట్ నిర్వహించడం ద్వారా తమకు ఎలాంటి నష్టం రాలేదని.. పైగా రూ. 100 కోట్ల మేర ఆదాయం చేకూరిందని చెప్పడం గమనార్హం.‘‘టోర్నమెంట్‌కు సంబంధించి అయిన ఖర్చు మొత్తాన్ని ఐసీసీ సమకూర్చింది. టికెట్ల అమ్మకం, ఇతర మార్గాల ద్వారా పీసీబీకి పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరింది’’ అని ఆమిర్ మిర్ స్పష్టం చేశాడు. తమ అంచనాలకు మించి రెవెన్యూ వచ్చిందని.. ఆడిట్ తర్వాత ఈ మొత్తం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి తమకు రూ. 300 కోట్ల మేర ఆదాయం చేకూరిందని పీసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆదాయంలో ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదైందని.. ప్రపంచంలో తాము ఇప్పుడు టాప్-3 సంపన్న బోర్డుల జాబితాలో చేరామని పేర్కొన్నాయి.అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐకాగా దాదాపు 19 వేల కోట్లకు పైగా రూపాయలతో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా కొనసాగుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా రూ. 689 కోట్లు, ఇంగ్లండ్ &వేల్స్ బోర్డు రూ. 513 కోట్ల మేర సంపదతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా.. రూ. 300 కోట్ల సంపద కలిగి ఉన్నామన్న చెపుతున్న పీసీబీ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. తాము టాప్-3లో ఉన్నామంటూ బోర్డు వర్గాలు వెల్లడించడం గమనార్హం.చాంపియన్‌గా టీమిండియాఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీల-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీ పడ్డాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. తొలి సెమీస్‌లో భారత్.. ఆసీస్‌ను.. రెండో సెమీస్‌లో న్యూజిలాండ్ ప్రొటిస్ జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దుబాయ్‌లో మార్చి 9న జరిగిన ఫైనల్లో టీమిండియా కివీస్ జట్టును ఓడించి చాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో రావల్పిండి, కరాచీ, లాహోర్ మైదానాలు చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ మెగా వన్డే ఈవెంట్ కోసం ఈ మూడు స్టేడియాలలో భారీ ఖర్చుతో పీసీబీ మరమతులు చేపట్టింది. అయితే, వర్షం కారణంగా రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్‌లు రద్దు కావడం.. అక్కడి డ్రైనేజీ వ్యవస్థ దుస్థితికి అద్దం పట్టాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేనపుడు ఇలాంటి మెగా టోర్నీలను నిర్వహిస్తామని పట్టుబట్టడం సరికాదంటూ పీసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి. చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా' -
నాకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ: స్టార్ క్రికెటర్ కామెంట్స్ వైరల్
సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(Rassie van der Dussen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి ఐసీసీ టోర్నీ కాబోతుందని పేర్కొన్నాడు. అయితే, తన రిటైర్మెంట్ అంశం గురించి ఇప్పుడే చెప్పలేనని.. ఇది మాత్రం వాస్తమని అన్నాడు.అఫ్గన్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకంకాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను ఎదుర్కొంది. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో డసెన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకంతో అదరగొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు.నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీతదుపరి సౌతాఫ్రికా ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రావల్పిండిలో బుధవారం జరగాల్సిన మ్యాచ్ రద్దై పోయింది. ఈ క్రమంలో మార్చి 1న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన డసెన్.. ‘‘నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అని కచ్చితంగా చెప్పగలను.ఇందుకోసం ముందుగా నేనేమీ ప్రణాళికలు రచించుకోలేదు. మేనేజ్మెంట్ కూడా నాపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. కానీ ఇదే నిజం. నా కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ప్రొటిస్ తరఫున క్రికెట్ ఆడటంమే నా ఏకైక లక్ష్యం. దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.ప్రొటిస్ తరఫున కొనసాగుతాచాలా మంది రిటైర్మెంట్ తర్వాత లీగ్ క్రికెట్ ఆడతావా? అని అడుగుతున్నారు. ఏమో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. కానీ లీగ్ క్రికెట్లో ఆడాలన్న తపన నాలో ఉంది. అయితే, ముందుగా చెప్పినట్లు సౌతాఫ్రికాకు ఆడటమే నా మొదటి ప్రాధాన్యం. ఒకవేళ ఇంకో సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే కచ్చితంగా ప్రొటిస్ తరఫున కొనసాగుతా’’ అని తన మనసులోని భావాలను పంచుకున్నాడు.కాగా 36 ఏళ్ల రాసీ వాన్ డెర్ డసెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టాడు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 18 టెస్టులు, 69 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 905, 2516, 1257 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి ఖాతాలో ఆరు శతకాలు ఉన్నాయి.చాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, తెంబా బావుమా (కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, హెన్రిచ్ క్లాసెన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.చదవండి: ‘ఏంటిది? నేను అవుటయ్యానా?’.. జాన్సన్ దెబ్బకు రహ్మనుల్లా బౌల్డ్ -
అందుకే ఓడిపోయాం.. ఆ ఇద్దరు మాత్రం అద్బుతం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఆరంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్.. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) జట్టు పరాజయంపై స్పందించాడు. కివీస్ జట్టు భారీ స్కోరు సాధిస్తుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు.తాము అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశామని.. అయితే, న్యూజిలాండ్ తమ కంటే గొప్పగా ఆడిందని రిజ్వాన్ ఓటమిని అంగీకరించాడు. ఏదేమైనా తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం తీవ్రంగా నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.శతకాలతో చెలరేగిన విల్ యంగ్, లాథమ్ఈ క్రమంలో కరాచీ వేదికగా ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో పాక్ న్యూజిలాండ్‌తో తలపడింది. నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో టాస్ గెలిచిన రిజ్వాన్ బృందం తొలుత బౌలింగ్ చేసింది. ఓపెనర్ డెవన్ కాన్వే(10)తో పాటు వన్‌డౌన్ స్టార్ కేన్ విలియమ్సన్(1), డారిల్ మిచెల్(10) త్వరగా పెవిలియన్‌కు పంపి శుభారంభం అందుకుంది.కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ విల్ యంగ్(Will Young- 107), వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్(118 నాటౌట్) పాక్ బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ ఇద్దరు అద్భుత శతకాలతో రాణించగా.. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్(39 బంతుల్లో 61) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు స్కోరు చేసింది.A quality knock! 💯#TomLatham brings up a stunning century, putting New Zealand firmly in command against the defending champions! 💪🏻FACT: Fifth time two batters have scored centuries in an innings in Champions Trophy!📺📱 Start watching FREE on JioHotstar:… pic.twitter.com/vAKzM0pW1Y— Star Sports (@StarSportsIndia) February 19, 2025 పాక్ బ్యాటర్ల వైఫల్యంఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 47.2 ఓవర్లకు కుప్పకూలింది. బాబర్ ఆజం(64), కుష్దిల్ షా(69) అర్ధ శతకాలు సాధించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 260 పరుగులకే ఆలౌట్ అయి.. అరవై పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు ఈ మేరు భారీ స్కోరు సాధిస్తామని మేము అస్సలు ఊహించలేదు. 260 పరుగుల వరకే కివీస్‌ను కట్టడి చేయగలమని భావించాం. మా పరిధి మేర అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేశాం. అయితే, వాళ్లు మాకంటే గొప్పగా ఆడి భారీ టార్గెట్ ఇచ్చారు.ఆ ఇద్దరికీ అదెలా సాధ్యమైందో!నిజానికి ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించలేదు. కానీ విల్ యంగ్, లాథమ్ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి.. సులువుగా పరుగులు రాబట్టేశారు. అయితే, ఆఖరి ఓవర్లలో మేము మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేశాం. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాం.ఇక బ్యాట్‌తోనూ మేము శుభారంభం అందుకోలేకపోయాము. ఫఖర్ జమాన్ గాయంపై కూడా పూర్తి సమాచారం ఇంకా లభించలేదు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో మా ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫలితం ఏదైనా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. మిగతా మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా ఆడే ప్రయత్నం చేస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రిజ్వాన్ 14 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి విలియం రూర్కీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో నాలుగుసార్లు తలపడగా.. అన్నిసార్లూ కివీస్ జట్టే విజయం సాధించడం విశేషం. ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో సెంచరీ వీరుడు టామ్ లాథమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్ -
Pak vs NZ: మెగా టోర్నీ షురూ.. టాస్ గెలిచిన పాక్.. తుదిజట్లు ఇవే
CT 2025 Pak vs NZ: ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు తెరలేచింది. పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ బుధవారం ఆరంభమైంది. ఆతిథ్య పాక్- న్యూజిలాండ్ జట్ల మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.అదే విధంగా.. తాము డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్నందున కాస్త ఒత్తిడి ఉన్న మాట వాస్తమేనన్న రిజ్వాన్.. అయితే, ఇటీవలి ముగిసిన త్రైపాక్షిక సిరీస్ మాదిరే దీనిని సాధారణ సిరీస్‌గా భావిస్తే ప్రెజర్ తగ్గుతుందన్నాడు. సొంతగడ్డపై ఆడటం సంతోషంగా ఉందని.. గాయం కారణంగా జట్టుకు దూరమైన హ్యారిస్ రవూఫ్ జట్టులోకి తిరిగి వచ్చాడని తెలిపాడు.కాగా ఈ చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో వన్డే ట్రై సిరీస్ ఆడింది. ఇందులో ఫైనల్‌కు చేరుకున్న పాక్.. ఆఖరి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. మెగా ఈవెంట్లో కివీస్‌దే పైచేయిఇక ఇప్పటి వరకు పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య 118 వన్డేలు జరుగగా.. పాకిస్తాన్ 61, న్యూజిలాండ్ 53 మ్యాచ్‌లు గెలిచాయి. ఒకటి టై కాగా.. మూడు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో కివీస్ జట్టే పాక్‌పై గెలుపొందడం విశేషం. ఇక 1998లో మొదలైన ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని వివిధ కారణాల వల్ల 2017 తర్వాత నిలిపివేశారు. అయితే, తాజాగా మరోసారి ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు.. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా సొంతగడ్డపై అతిపెద్ద క్రికెట్ పండుగను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. కరాచీ, రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్‌ల నేపథ్యంలో దాదాపు పన్నెండు వేల మంది పోలీసులను మోహరించేందుకు సిద్ధమైందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లతో పాటు 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1200 మంది ఉన్నతాధికారులు, 10,566 మంది కానిస్టేబుల్స్, 200కు పైగా మహిళా పోలీస్ ఆఫీసర్లు భద్రతా విభాగంలో భాగమైనట్లు తెలిపాయి. అంతేకాదు టోర్నీలో పాల్గొనే జట్లు, వీరాభిమానుల కోసం పీసీబీ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ -
Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు
కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్ వాయు కాలుష్యంతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్‌లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు.పాక్‌లోని లాహోర్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 1900ను దాటింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముల్తాన్‌లో కూడా ఏక్యూఐ 750 దాటింది. నాసాకు చెందిన మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్టర్ రేడియోమీటర్ ఉత్తర పాకిస్తాన్లో, ముఖ్యంగా లాహోర్, దాని పరిసరాలలో ఆకాశంలో వ్యాపించిన పొగమంచు చిత్రాలను షేర్ చేసింది.శీతాకాలం ప్రారంభమైనప్పటి నుండి అంటే నవంబర్ నుండి లాహోర్ ఆకాశంలో దట్టమైన పొగమంచు కనిపిస్తోందని, ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని నాసా తెలిపింది. లాహోర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. పాఠశాలలు మూసివేశారు. పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో లాహోర్‌లోని మాయో ఆసుపత్రిలో 4,000 మంది బాధితులు చేరారు. అలాగే జిన్నా ఆసుపత్రిలో 3,500 మంది, పిల్లల ఆసుపత్రిలో 2,000 మందికి పైగా రోగులు చేరారు.ఆస్తమా, హృద్రోగులు బయటకు వెళ్ల కూడదని వైద్యులు హెచ్చరించారు. వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ, నిర్మాణ స్థలాల నుంచి వెలువడుతున్న దుమ్ము మొదలైనవి లాహోర్‌లో వాయు కాలుష్యానికి కారణంగా నిలిచాయి. లాహోర్‌లో మూడు నెలల పాటు వివాహాలను నిషేధించారు. పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం -
ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి
కరాచీ: పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది.విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ స్థానిక టీవీ ఛానల్ జియోకు తెలిపారు. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని అన్నారు. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ-మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్‌తో కలుపుతుంది.డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. హోం మంత్రి, ఇన్స్పెక్టర్ జనరల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.ఇది కూడా చదవండి: అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ -
అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!
మన పురాణాల్లో ప్రతి దేవుడికి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, అష్టదిక్పాలకులతో సహా అక్కడక్కడ అరుదైన దేవాలయాలు ఉన్నాయి. కానీ వర్ష దేవుడికి ప్రత్యేకంగా ఆలయం ఉన్నట్లు విన్నారా..?. మహా అయితే వర్షాలు రావాలని యజ్జ యాగాదులు వంటిటి చేయడం చూశాం. కానీ ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఆరాధించడం గురించి విన్నారా..?. మరీ ఇది ఎక్కడుందంటే..?అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం ఇది. ఈ ఆలయం మనదేశంలో లేదు. పాకిస్తాన్‌లోని కరాచీ తీరంలోని మనోరా దీవిలో ఉంది. ఇక్కడి సింధీ ప్రజలు వరుణదేవుడిని భక్తిగా ‘ఝూలేలాల్’ పేరుతో కొలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలిపే ఆధారాలేవీ లేవు. సింధ్ రాష్ట్రంలోనిభిరియా పట్టణానికి చెందిన సేఠ్ హర్చంద్మల్ దయాల్ దాస్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ చేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తోంది.(చదవండి: ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!) -
పాక్‌లోక్రికెట్ మ్యాచ్.. ఎంట్రీ టిక్కెట్ రూ. 15 మాత్రమే
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియం వస్తారో లేదన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పట్టుకుంది. ఎందుకంటే ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఖాళీ స్టాండ్స్ మధ్య ఈ టీ20 లీగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ల ధరను భారీగా తగ్గించింది. రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టిక్కెట్ కనీస ధరగా పీకేఆర్ 200 (భారత కరెన్సీలో సుమారు రూ.60)గా నిర్ణయించిన పీసీసీ.. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగే రెండు టెస్టు ఎంట్రీ టిక్కెట్ పీకేఆర్ 50(భారత కరెన్సీలో రూ.15)గా ఫిక్స్ చేశారు.కాగా దశాబ్ద కాలంలో కరాచీ నేషనల్ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టిక్కెట్లను విక్రయించడం ఇదే మొదటి సారి. ఈ సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లు ఆగస్టు 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక తొలి టెస్టుకు గరిష్ట టిక్కెట్ ధరగా 60,000 కాగా.. కరాచీ టెస్టు అత్యధిక టిక్కెట్ ధర 83,000గా ఉంది. ఈ టిక్కెట్లు కొనుగొలు చేసిన వారికి పీసీబీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది. -
‘భారత్ చంద్రుడిపై అడుగు పెడితే.. మనం మాత్రం’
ఇస్లామాబాద్: భారత దేశం చంద్రుడి మీద అడుతుపెడుతుంటే.. కరాచీలో తెరిచి ఉన్న ముగురు కాలువలో పడి చిన్నారులు మృతి చెందిన వార్తలను పాక్ చూస్తోందని ఆ దేశ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా ప్రసంగించారు.‘‘కరాచీ పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక పక్క ప్రపం దేశాలు చంద్రుడిపైకి వెళ్తుంటే.. కరాచీ మాత్రం తెరిచిన ఉన్న మురుగు కాలువల్లో చిన్నారులు పడిపోయి మృతి చెందిన వార్తలతో నిలుస్తోంది. భారత్ చంద్రుడి అడుగుపెట్టిందన్న రెండు సెకండ్లకు కరాచీలో ఇటువంటి ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక.. కరాచీ స్వచ్ఛమైన నీరు దొరకటం లేదు.سید مصطفیٰ کمال نے ببانگ دہل کراچی کا مقدمہ پارلیمنٹ میں کھلے الفاظ میں پیش کیا۔ سنئے#Pakistan #Sindh #Karachi #MQMP #PTI #PPP #President #AsifAliZardari #Bilawal #MustafaKamal #Nation #NationalAssembly #Parliament pic.twitter.com/7B8wKPIYP7— Syed Mustafa Kamal (@KamalMQM) May 15, 2024మరోవైపు.. మొత్తం 2.6 కోట్ల మంది చిన్నారుల్లో 70 లక్షల మంది పిల్లలు అసలు పాఠశాలకు వెళ్లటం లేదు. కరాచీ పాకిస్తాన్‌కి ఆదాయం ఇచ్చే ఇంజన్ లాంటి నగరం. ఇక్కడ రెండు సముద్రపు పోర్టులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తం పాకిస్తాన్‌కి కరాచీ గేట్‌వే వంటిది. అటువంటి కరాచీ నగరంలోనే స్వచ్ఛమైన నీరు లభించటం లేదు. నీటి కోసం ట్యాంకర్ మాఫియా నడుస్తోంది’’ అని సయ్యద్ విమర్శలు చేశారు. సయ్యద్ చేసిన వ్యాఖ్యలు ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇక..పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్.. విస్తరించిన రుణ సౌకర్యంలో భాగంగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్(ఐఎంఎఫ్) వద్ద రుణం కోరుతోంది. -
కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!
మన భారతీయ ఫుడ్ స్టాల్ దాయాది దేశమైన పాక్‌లో ఉంటే ఎవ్వరికైనా గర్వంగా ఉంటుంది. మాటిమాటికీ ఏదో ఒక విషయమైన మనతో కాలుదువ్వే దేశంలో సగర్వంగా ఓ భారతీయురాలు ఫుడ్ స్టాల్ నడుపుతూ..అక్కడ పాకిస్తానీయులకు మన భారతీయ వంటకాలను రుచి చూపుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారత్‌కు చెందిన కవితా దీదీ ఈ ఫుడ్ స్టాల్‌ని నడుపుతున్నట్లు కనిపించిది. ఈ స్టాల్ శాకాహారం, మాంసాహారం రెండింటిని అందిస్తుంది. ఓ పాకిస్తానీ బ్లాగార్ ఆమె ఫుడ్ స్టాల్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఆమె ఫుడ్ స్టాల్ గురించి వివరించాడు. ఆ వీడియోలో అతడు కవిత ఆమె కుటుంబం అందిస్తున్న రుచికరమైన ఆహారాన్ని హైలెట్ చేశారు. ముంబైలో వడపావ్ ఫేమస్. ఇప్పుడూ కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని ఇష్టపడుతున్నారని కవిత చెబుతున్నారు. ఇక ఈ పాకిస్తాన్ బ్లాగర్ కూడా ఆ వంటకాన్ని రుచి చూసి మెచ్చుకున్నారు. ఇక్కడ కరాచీ ఆహార ప్రియులు తనను కవితా దీదీ అని అప్యాయంగా పిలుస్తారని కవితా ఆ వీడియో పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో తమ స్టాల్‌ని నడపమని చెప్పడంతో ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇతర దేశాల్లోని మతాల పట్ల కనబర్చిన గౌరవం అంకితభావానికి బ్లాగర్ ఖాన్ చాలా ఫిదా అయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం మా సోదరికి పాకిస్తానీయులందరూ మద్దతు ఇవ్వాలి అని రాశారు. మరొకరు పాక్‌లో భారతీయ వంటకానికి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karamat Khan (@karamatkhan_05) (చదవండి: వందేళ్లకు పైగా జీవించిన వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్‌తో యూస్ ఉండదట!) -
కరాచీలో పెరిగిన యాచకుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం!
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థల నుండి తీసుకున్న రుణాలతో పాక్ రోజులు నెట్టుకొస్తోంది. రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారింది. దేశంలోని నలుమూలల నుంచి నాలుగు లక్షలకు పైగా యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రంజాన్ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేర సంఘటనలు మరింతగా పెరిగాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంపై పాక్‌కు చెందిన జియో న్యూస్ ఛానల్ ఒక నివేదికను అందజేసింది. దానిలో కరాచీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ మాట్లాడుతూ, ఈద్, రంజాన్ సమయంలో పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి యాచకులు కరాచీకి వచ్చారని, వారి సంఖ్య సుమారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం కరాచీలో యాచకుల సంఖ్య పెరిగిందని, అలాగే నేరాల సంఖ్య కూడా పెరిగిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నగర అదనపు ఐజీ మాట్లాడుతూ పాత పద్ధతుల్లో నేరస్తులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇటీవలి కాలంలో నగరంలో చోటుచేసుకున్న పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదానికి గురైన పాక్ స్టార్ క్రికెటర్లు..
స్వదేశంలో వెస్టిండీస్‌తో వైట్ బాల్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్ మహిళ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమాలు కారు ప్రమాదానికి గురయ్యారు. కరాచీలోని పీసీబీ ట్రైనింగ్ క్యాంప్‌నకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వారిద్దరి స్వల్ప గాయాయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించామని, తదుపరి చికిత్స నిమిత్తం వారిని బోర్డు వైద్య బృందం సంరక్షణలో ఉంచామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలను పీసీబీ వెల్లడించలేదు. కాగా ఏప్రిల్ 18న వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన పాక్ ప్రిలిమనరీ జట్టులో బిస్మా మరూఫ్, గులాం ఫాతిమా భాగంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పీసీబీ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో చెమటోడ్చుతున్నారు. అయితే సరిగ్గా సిరీస్ ప్రారంభానికి రెండు వారాల ముందు స్టార్ క్రికెటర్లు గాయపడటం నిజంగా పాకిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఈ వైట్‌బాల్ సిరీస్‌లలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు విండీస్‌తో పాక్ ఆడనుంది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. BAD NEWS 🚨 Pakistan batter Bismah Maroof and leg spinner Ghulam Fatima suffered minor injuries after being involved in a car accident. They are currently under the care of the PCB medical team.#CricketTwitter pic.twitter.com/rZVlaCteu7 — Female Cricket (@imfemalecricket) April 6, 2024 -
పాకిస్తాన్ లీగ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 13 మందికి అస్వస్థత, ఒకరికి సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న షోయబ్ మాలిక్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్‌లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
గెలిచింది నేను కాదు, నాకొద్దీ సీటు
కరాచీ: ఎన్నికల పందేరంలో కోట్లు పంచైనా సరే ఓట్లు ఒడిసిపట్టాలనే నేతలున్న ఈ కాలంలో నువ్వే గెలిచావని ఎన్నికల సంఘం చెబుతున్నా ఒక పాకిస్తాన్ నేత ‘నాకు ఇలాంటి గెలుపు వద్దే వద్దు’ అని తెగేసి చెప్పారు. రిగ్గింగ్‌కు పాల్పడటం ద్వారా తనను గెలిపించారని, వాస్తవానికి విజేత వేరే ఉన్నారని కుండబద్దలు కొట్టారు. సంక్షుభిత పాకిస్తాన్లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలతోపాటు నాలుగు ప్రావిన్షియల్(అసెంబ్లీ) ఎన్నికలు జరిగాయి. వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో పీఎస్–129 నియోజకవర్గం నుంచి జామాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఉర్ రెహ్మాన్ పోటీకి నిలబడ్డారు. అవినీతి కేసుల్లో జైలుపాలైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేత, స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీ కూడా ఇదే స్థానంలో బరిలో నిల్చారు. సైఫ్‌కు 31,000 ఓట్లు రాగా, రెహ్మాన్‌కు 26,000 ఓట్లు పడ్డాయి. అయితే పీటీఐ నేతను ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. సైఫ్‌కు కేవలం 11,000 ఓట్లు పడ్డట్లు ఫలితాల్లో వచ్చేలా చేశారు. ఇదే ఫలితాలను పాక్ ఎలక్షన్ కమిషన్ అసలైనవిగా భావించి రెహా్మన్ను విజేతగా ప్రకటించింది. రిగ్గింగ్ విషయం తెల్సి రెహా్మన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా పత్రికా సమావేశం పెట్టిమరీ తన ధర్మాగ్రహాన్ని వ్యక్తంచేశారు. ‘‘ అన్యాయంగా నన్ను ఎవరైనా గెలిపించాలనుకుంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రజాతీర్పును గౌరవించాల్సిందే. విజేతనే గెలవనివ్వండి. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సిందే. అలాంటి వారికి ఎక్స్‌ట్రాలు అక్కర్లేదు. నేను ఈ గెలుపును స్వీకరించట్లేను. విజేతకే విజయం దక్కాలి’’ అని అన్నారు. రెహ్మాన్ నిజాయతీ చూసి అక్కడి వాళ్లు మెచ్చుకున్నారు. అయితే ఈ ఉదంతంపై పాక్ ఎన్నికల సంఘం మరోలా స్పందించింది. ‘‘ రిగ్గింగ్ అవాస్తవం. ఇలాంటి ఫిర్యాదులపై దృష్టి పెడతాం’’ అని పేర్కొంది. ఈ ఘటనపై త్వరలోనే స్పందిస్తామని పీటీఐ తెలిపింది. -
Dawood: చోటా షకీల్ కీలక ప్రకటన
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం(67) ఆరోగ్యంపై గత రెండు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. విష ప్రయోగం జరిగిందని, ఆరోగ్యం విషమించి చావుబతుకుల మధ్య కరాచీ ఆస్పత్రిలో ఉన్నాడని.. ఇలా ప్రచారాలు జరిగాయి. ఈలోపు దావూద్ దగ్గరి బంధువు, పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందద్ హౌజ్అరెస్ట్ కావడం, కాసేపటికే.. దావూద్ చనిపోయాడంటూ ఇంటర్నెట్లో పోస్టులు కనిపించాయి. దీనికి తోడు పాక్‌లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలగడంతో ఆ వార్తల్ని దాదాపుగా ధృవీకరించేసుకున్నాయి మన మీడియా సంస్థలు. అయితే.. నిన్న సాయంత్రం నుంచి దావూద్ చనిపోలేదంటూ పలు పాక్ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో దావూద్ అనుచరుడు, డీ-కంపెనీ వ్యవహారాలను చూసుకునే చోటా షకీల్ భారత్‌కు చెందిన ఓ మీడియా ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. దావూద్ ఇబ్రహీం ఆరోగ్య విషయంలో వస్తున్న కథనాల్ని చోటా షకీల్ ఖండించాడు. విషప్రయోగం జరిగిందన్న కథనాలతో పాటు దావూద్ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారాన్ని షకీల్ కొట్టిపారేశాడు. భాయ్ వెయ్యి శాతం ఫిట్‌గా ఉన్నాడు అంటూ ఓ భారతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటా షకీల్ చెప్పాడు. మరోవైపు నిఘా వర్గాలు సైతం దావూద్‌పై విష ప్రయోగం జరిగిందన్న ప్రచారాన్ని ఊహాగానంగా తేల్చేశాయి. ఐఎస్ఐ ఏజెంట్లు.. తన నమ్మకస్తుల భద్రతా వలయం నడుమ దావూద్ భద్రంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. అమెరికా దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ.. ఐఎస్ఐ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్‌గా, ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న దావూద్ ఇబ్రహీం.. కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. తాజాగా.. జాతీయ భద్రతా సంస్థ NIA విడుదల చేసిన ఛార్జిషీట్లో దావూద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఉన్నాయి. -
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమం!
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్‌ను సోమవారం పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట. అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. అతను మరో రెండు రోజుల పాటు ఆసత్రిలో ఉండి చికిత్స తీసుకొనున్నట్లు సమాచారం. పాక్ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మాఫియా డాన్ గురించి ఈ ఏడాది జనవరిలో అతని సోదరి ఆసక్తికర విషయాలు చెప్పింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్ కరాచీలోనే ఉంటున్నట్లు ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. చదవండి: ‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి -
బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో.. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. బతకడానికి దొంగతనాలకు, దోపిడీలకు సైతం తెగపడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో బక్రీద్ వేళ మేకలు, గొర్రెల దొంగతనాలు పెరిగిపోవడం.. అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో తెలియజేస్తోంది. జూన్ 29న బక్రీద్ కాగా.. పాక్ లో మేకలు, గొర్రెల వంటి జీవాలకు రక్షణ లేకుండా పోయింది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయం. అయితే మేకలు, గొర్రెల ధరలు అక్కడ ఆకాశాన్నంటుతుండడంతో.. చాలామంది దొంగతనాలకు మొగ్గుచూపుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోనూ ఈ కేసులు అడ్డగోలుగా నమోదు అయ్యాయట. గత ఐదు నెలలుగా అక్కడ మూడు నెల కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింధ్ సిటిజన్స్ పోలీస్ కమిటీ ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది కూడా. క్వెట్టాలోనూ ఈ తరహా కేసులు చాలానే నమోదు అయ్యాయి. మేతకు వెళ్లిన మంద నుంచి.. రిస్క్ చేసి వాహనాలపై తీసుకెళ్తున్నవాటిని.. ఆఖరికి దుకాణాలు పగలకొట్టి మరీ మూగజీవాలను ఎత్తుకెళ్తున్నారు. అంతేకాదు మందతో అమ్మడానికి వెళ్తున్న వాళ్లను సైతం బెదిరించి దొపిడీలకు పాల్పడుతున్నారట. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను ఎత్తుకెళ్లారు. అలాగే.. ట్రాలీలోకి ఎక్కేసి మరీ చోరీలకు పాల్పడుతున్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. Goat🐐 kidnapp!ng in "film style" in Pakistan😂😂 pic.twitter.com/5ZytmCi9sp — Bharat Ojha🗨 (@Bharatojha03) June 25, 2023 ఇదీ చదవండి: కొత్త చట్టంతో పాక్‌లో అడుగుపెట్టబోతున్నాడు! -
పాక్‌లో ఆహార పంపిణీలో మళ్లీ తొక్కిసలాట
కరాచీ: పాకిస్తాన్‌లోని రేవు నగరం కరాచీలో మరో విషాదం చోటుచేసుకుంది. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం ప్రజలకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండగా, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. భాధితుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. ఆహార పదార్థాల పంపిణీ జరుగతుండగా, కొందరు అక్కడే ఉన్న కరెంటు తీగపై కాలు వేశారని, దాంతో భయందోళనకు గురై ఒకరినొకరు తోసుకున్నారని, ఫలితంగా పక్కనే ఉన్న కాలువలో పలువురు పడిపోవడం, 11 మంది మరణించడం క్షణాల్లో జరిగిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గతవారం ప్రారంభించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇటీవలే గోధుమ పిండి పంపిణీలో తొక్కిసలాట జరిగి 11 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్లో హిందూ డాక్టర్ కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డెరెక్టర్, ప్రముఖ కంటి వైద్యుడు, హిందూ మతస్థుడైన డాక్టర్ బీర్బల్ జినానీని దుండుగులు గురువారం తుపాకీతో కాల్చి చంపారు. కరాచీ సమీపంలోని ల్యారీ ఎక్స్‌ప్రెస్ రహదారిపై కారులో వెళ్తుండగా దుండుగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పాకిస్తాన్లో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలో ఇది రెండో హత్య కావడం గమనార్హం. ఇటీవలే పాకిస్తాన్‌లోని హైదరాబాద్ పట్టణంలో హిందూ మతానికి చెందిన ధరమ్‌దేవ్ రాఠీ అనే వైద్యుడిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. -
ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. అయినా దక్కని ప్రాణం
ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న ఇండిగో విమానం ఏ320-271ఎన్లో గాల్లో ఉండగానే.. అందులోని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లీంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు. కరాచీ ఎయిర్‌పోర్టు కూడా ఇండిగో విమానం టేకాఫ్‌కు అనుమతించింది. అయితే అప్పటికే సదరు ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని నైజీరియాకి చెందిన 60 ఏళ్ల అబ్ధుల్లాగా అధికారులు గుర్తించారు. కరాచీలోని సివిల్ ఏవియేషన్ అధికారులు మాట్లాడుతూ..ప్రయాణికుడు విమానంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలెట్ మమ్మల్ని అభ్యర్థించాడు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసినా.. ఆ ప్రయాణికుడు చనిపోవడంతో మేము చాలా చింతిస్తున్నాం’ అని అన్నారు. కరాచీలోని అధికారులు అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి, మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. అప్పటి వరకు ఇండిగో విమానం కరాచీలోనే దాదాపు ఐదు గంటల వరకు నిలిపేశారు. ఇదిలా ఉండగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ తాజా ప్రకటనలో.. సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అలాగే ఇండిగో విమానం మృతి చెందిన ప్రయాణికుడితో తిరిగి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపింది. (చదవండి: టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..) -
తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకు పడ్డ ఆజం ఖాన్.. 42 బంతుల్లోనే..
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యువ బ్యాటర్ ఆజం ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230కి పైగా స్ట్రైక్‌రేటుతో 97 పరుగులు సాధించాడు. తద్వారా ఇస్లామాబాద్ యునైటెడ్ భారీ స్కోరు చేసి గెలుపొందడంలో ఆజం ఖాన్ సహాయపడ్డాడు. అద్భుత ఆట తీరుతో 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా పీఎస్ఎల్-2023లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్, క్వెటా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆరంభంలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ కోలిన్ మున్రో 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐమల్ ఖాన్ అతడిని తొందరగానే పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షాదాబ్ ఖాన్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆజంకు తోడుగా అసిఫ్ అలీ 42 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ 220 పరుగులు స్కోరు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయి ఈ మేర భారీ స్కోరు సాధించింది. రెండో స్థానానికి ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 19.1 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇస్లామాబాద్‌కు 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఇస్లామాబాద్ బౌలర్లు ఫజల్హక్ ఫారూకీ(అరంగేట్రం), హసన్ అలీ మూడేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, షాబాద్ ఖాన్ షాదాబ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఇస్లామాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 Epic finale to a sizzling innings 👏 #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/VVY81pWBiq — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
కోపంతో ఊగిపోయిన పాకిస్తాన్ దిగ్గజం.. సోఫాను తన్నుతూ! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ మరో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కరాచీ పరాజాయం పాలవ్వడంతో ఆ జట్టు ప్రెసిడెంట్, పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ తన సహానాన్ని కోల్పోయాడు. తమ జట్టు ఓటమిపాలైన వెంటనే అక్రమ్ తన ముందు ఉన్న సోఫాను బలంగా తన్నాడు. అతడి చర్య అక్కడ ఉన్న కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దీంతో కరాచీ కింగ్స్ మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సింది. ఇక ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన కరాచీ.. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజాయం పాలైంది. చదవండి: BGT 2023: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత HAHAHAHAHAH pic.twitter.com/6w727GIhRy — a. (@yoonosenadaa) February 22, 2023 -
ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..!
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో చికెన్ ధర ఆకాశన్నంటింది. కరాచీ సహా ఇతర నగరాల్లో కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలోనే ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ రేటు రికార్డు స్థాయిలో పెరగడానికి పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమే ప్రాధన కారణమని పాకిస్తాన్ మీడియా తెలిపింది. కోళ్ల ఫీడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని, అందుకే పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారని చెప్పింది. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర రూ.720గా ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండి, సహా ఇతర నగరాల్లో ఈ ధర రూ.700-705గా ఉంది. పాకిస్తాన్లో రెండో పాపులర్ సిటీ అయిన లాహోర్‌లో కేజీ చికెన్‌ను రూ.550-600 మధ్య విక్రయిస్తున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగుని ఈ ధరలు చూసి చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్లు పుష్కలంగా చికెన్‌ను తినలేకపోతున్నామని చెబుతున్నారు. విచారణ కోళ్లకు అందించే ఫీడ్‌కు కొరత ఎందుకు ఏర్పడిందనే విషయంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. చికెన్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. దాని సరఫరా గొలుసుకు ఏవైనా అంతరాయాలు ఏర్పడితే దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పాక్ మీడియా పేర్కొంది. చదవండి: టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు.. -
Pak Vs NZ: మెరిసిన హెన్రీ, ఎజాజ్.. కివీస్ భారీ స్కోరు
Pakistan vs New Zealand, 2nd Test- కరాచీ: టెయిలెండర్లు మ్యాట్ హెన్రీ (68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎజాజ్ పటేల్ (35; 4 ఫోర్లు) అసాధారణ పోరాటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 309/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 449 స్కోరు వద్ద ఆలౌటైంది. 345/9 స్కోరు వద్ద కివీస్ పతనం అంచున నిలిచింది. ఈ దశలో హెన్రీ, ఎజాజ్ ఆఖరి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఇమామ్ (74 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్), షకీల్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. కాగా.. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో పై చేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు? IPL 2023: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?! Abrar Ahmed finally ends the 10th-wicket stand. New Zealand are all out for 449 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/esH89R4AOd — Pakistan Cricket (@TheRealPCB) January 3, 2023 -
ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం (ఫొటోలు)
-
ఇట్లాగేనా ప్రవర్తించేది.. ఇదేం పద్ధతి! సీరియస్ అయిన బాబర్
Pakistan vs New Zealand, 1st Test- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆటతో పాటు విలేకరుల సమావేశంలో తన ప్రవర్తనతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంగ్లండ్ చేతిలో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాదిరి పాక్ కూడా దూకుడైన ఆట విధానం ఆరంభించాలని తాను బాబర్‌కు చెప్పినట్లు అప్పటి పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆఖరిదైన మూడో టెస్టులో ఓటమి తర్వాత ఈ విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా బాబర్ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫలితాన్ని బట్టే ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందంటూ పరోక్షంగా రమీజ్‌కు చురకలు అంటించాడు. అందరికీ సంతృప్తి కలిగేలా ఆడలేమంటూ తనను విమర్శిస్తూ ప్రశ్నలు అడిగిన వారికి బదులిచ్చాడు. తాజాగా న్యూజిలాండ్‌తో పాక్ మొదటి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో ప్రెస్ మీట్లో బాబర్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ గురించి మాట్లాడిన తర్వాత వెళ్లిపోయేందుకు బాబర్ సిద్ధం కాగా.. ఓ జర్నలిస్టు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడున్న వారు మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు’’ అని పాక్ సారథి తీరుపై అసహనం ప్రదర్శించారు. ఒక్క విజయం కూడా లేకుండానే దీంతో బాబర్‌కు కోపమొచ్చింది. సీరియస్ అటువైపుగా ఓ లుక్కు ఇచ్చాడు. ఇంతలో మీడియా మేనేజర్ జోక్యం చేసుకుని మైక్రోఫోన్ ఆఫ్ చేసి మీటింగ్ ముగించాడు. కాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పాక్ డ్రాతో గట్టెక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీ(161)తో మెరవగా.. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ ద్విశతకం సాధించాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో సొంతగడ్డపై ఒక్క టెస్టు విజయం కూడా లేకుండానే బాబర్ ఈ ఏడాది ముగించాడు. ఓవరాల్‌గా తొమ్మిదింట ఒక టెస్టు గెలిచాడు. చదవండి: ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు Pakistan captain Babar Azam's press conference at the end of the first Test.#PAKvNZ | #TayyariKiwiHai https://t.co/clFdocY85Z — Pakistan Cricket (@TheRealPCB) December 30, 2022 -
ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె పెళ్లి.. హాజరైన షాహిన్ ఆఫ్రిది
Shahid Afridi Daughter Marriage: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిది ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతడి పెద్ద కుమార్తె అక్సాకు నసీర్ నాసిర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కరాచీలో శుక్రవారం అత్యంత సన్నిహితుల నడుమ నిఖా జరిగింది. ఇక ఈ పెళ్లిలో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కాబోయే మామ షాహిద్‌తో కలిసి తోడల్లుడి వెనుకాల నిల్చుని వేడుకను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షాహిన్ వివాహం ఎప్పుడంటే! షాహిద్ ఆఫ్రిది రెండో కుమార్తె అన్షా ఆఫ్రిదితో షాహిన్ పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. కాగా పెద్ద కూతురు అక్సా వివామైన తర్వాత అన్షాకు పెళ్లి చేయాలని షాహిద్ కుటుంబం నిర్ణయించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 3న షాహిన్- అన్షా పెళ్లికి ముహూర్తం ఖరారు చేసింది. వాళ్లు అడిగారు.. ఓకే అన్నా కాగా తన కుమార్తెతో షాహిన్ నిఖా జరిపించే విషయమై అతడి కుటుంబం తమను సంప్రదించిందని షాహిద్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా పాక్ ప్రధాన పేసర్‌గా షాహిన్ ఎదగగా.. షాహిద్ ఇటీవలే పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా ఎన్నికయ్యాడు. ఇలా మామా- అల్లుడు పాకిస్తాన్ క్రికెట్లో కీలక సభ్యులుగా మారారు. ఇదిలా ఉంటే షాహిద్ ఆఫ్రిదికి ఐదుగురు ఆడపిల్లలు సంతానం అన్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం అతడికి ఐదోసారి ఆడబిడ్డ జన్మించింది. కూతుళ్లతో షాహిద్ ఆఫ్రిది చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ Shahid Afridi daughter Aqsa's Nikah in Karachi @SAfridiOfficial @iShaheenAfridi pic.twitter.com/Zd6USavkeB — ٰImran Siddique (@imransiddique89) December 30, 2022 -
Pak Vs NZ: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్ అలా బతికిపోయింది!
Pak Vs NZ 1st Test Day 5- కరాచీ: చివరి సెషన్లో వెలుతురు మందగించడంతో ఉత్కంఠభరిత ముగింపు లభిస్తుందనుకున్న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ‘డ్రా’ అయింది. పాక్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 7.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. పాక్ అలా బతికిపోయింది! ఓపెనర్ బ్రాస్‌వెల్ 3 పరుగులకే పెవిలియన్ చేరినా.. డెవాన్ కాన్వే (16 బంతుల్లో 18 పరుగులు) పర్వాలేదనిపించాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన టామ్ లాథమ్(24 బంతుల్లో 35 పరుగులు) జోరు ప్రదర్శించాడు. ఈ దశలో వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపి వేశారు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అంతకుముందు పాక్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 8 వికెట్లకు 311 పరుగులవద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిజానికి కాన్వే, లాథమ్ విజృంభిస్తే గనుక.. పాక్ విసిరిన లక్ష్యాన్ని కివీస్ ఛేదించేదే! అయితే వెలుతురులేమి కారణంగా పాక్ అలా బతికిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన పర్యాటక కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ మ్యాచ్ డ్రా అయిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం సాహసోపేత నిర్ణయమే. నిజానికి మేము ఫలితం రాబట్టాలని ఆశించాం. కానీ వెలుతురు సరిగ్గా లేదు. మా ఐదో బౌలర్ సల్మాన్‌కు రెండు రోజులుగా ఆరోగ్యం బాగా లేదు. అయినప్పటికీ మా బౌలింగ్ విభాగంలో ఉన్న సౌద్, వసీం జూనియర్ రాణించారు. సానుకూల దృక్పథంతో ఆడారు’’ అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు స్కోర్లు: పాక్- 438 & 311/8 డిక్లేర్డ్ న్యూజిలాండ్- 612/9 డిక్లేర్డ్ & 61/1 చదవండి: క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు 🎥 A quick recap of the fifth day's action from the final Test of the year 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/06LDoouD1O — Pakistan Cricket (@TheRealPCB) December 30, 2022 -
Pak Vs Nz: పాక్ గడ్డపై సెంచరీ.. విలియమ్సన్ అరుదైన రికార్డు
Pak Vs Nz 1st Test Day 3 Highlights- కరాచీ: పాకిస్తాన్‌తో మొదటి టెస్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ శతకం సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి.. మొత్తంగా 222 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కెరీర్లో 25వ సెంచరీ చేసిన విలియమ్సన్... 722 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తొలి బ్యాటర్‌గా అదే విధంగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈలలో శతకం సాధించిన తొలి ఆసియాయేతర బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఇక కేన్ మామతో పాటు.. టామ్ లాథమ్ (191 బంతుల్లో 113; 10 ఫోర్లు) కూడా సెంచరీ నమోదు చేయడంతో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 440 పరుగులు చేసింది. ఫలితంగా 2 పరుగుల ఆధిక్యం అందుకుంది. డెవాన్ కాన్వే (176 బంతుల్లో 92; 14 ఫోర్లు) శతకం చేజార్చుకోగా... బ్లన్‌డెల్ (47), మిచెల్ (42) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆట ముగిసే సమయానికి విలియమ్సన్తో పాటు ఇష్ సోధి (1 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. చదవండి: Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్! IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు! Kane Williamson brings up his 25th Test hundred 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/wwRMYLvt7u — Pakistan Cricket (@TheRealPCB) December 28, 2022 -
Pak Vs NZ: బాబర్ ఆజం అజేయ శతకం, సత్తా చాటిన సర్ఫరాజ్
Pakistan vs New Zealand, 1st Test Day 1: సొంతగడ్డపై ఇటీవలే ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టుకు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మెరుగైన ఆరంభం లభించింది. సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (277 బంతుల్లో 161 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించగా, దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (153 బంతుల్లో ) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్‌కు టెస్టుల్లో ఇది 9వ సెంచరీ. ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 110/4 కాగా...ఐదో వికెట్‌కు 196 పరుగులు జోడించి బాబర్, సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్, ఎజాజ్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా వైస్ కెప్టెన్ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్ అహ్మద్‌కు తుది జట్టులో చోటు ఇవ్వడంపై చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిదిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఈ మేరకు విలువైన ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటడం విశేషం. చదవండి: IPL 2023: అన్న త్యాగం వల్లే ఇలా కోటీశ్వరుడిగా.. నాన్నను మిస్ అవుతున్నా! వాళ్లతో కలిసి ఆడతా Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే Pak VS NZ: కివీస్‌తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి Performing on his Test return 🙌 🗣️ @SarfarazA_54 opens up about his comeback and the remarkable partnership with @babarazam258 #PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/GdhPg8drZP — Pakistan Cricket (@TheRealPCB) December 26, 2022 -
మంటల్లో బస్సు.. వరద బాధితుల సజీవ దహనం
కరాచీ: పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా వరద బాధితులుగా నిర్ధారణ అయ్యింది. సింధ్ ప్రావిన్స్ కరాచీ-హైదరాబాద్-జామ్‌షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9 మోటర్‌వేపై ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో పది మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ సెక్రెటరీ సిరాజ్ ఖ్వాసిం వెల్లడించారు. దాదూ జిల్లాకు చెందిన వరద బాధితులకు వేరే చోట తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో వాళ్లను తిరిగి స్వస్థలానికి ప్రైవేట్ బస్సులో తీసుకొస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
పాకిస్తాన్లో చైనీయులే టార్గెట్‌గా కాల్పులు.. డ్రాగన్ వార్నింగ్ తప్పదా?
దాయాది దేశం పాకిస్తాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసుప్రతిలోకి చొరబడిన ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో ఒక చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కరాచీ నగరంలోని డెంటల్ క్లినిక్‌లోని ఆంగతకుడు రోగిలా నటిస్తూ ప్రవేశించాడు. అనంతరం, గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు(ఓ మహిళ) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రోనిల్‌డి రైమండ్ చావ్, మార్గ్రేడ్ మరియు రిచర్డ్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా స్పందించారు. కాల్పుల ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనీయులపై దాడులు ఎక్కువయయ్యాయి. కాగా, ఏప్రిల్‌లో కరాచీ యూనివర్సిటీలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దళ సభ్యురాలు తనను తాను పేల్చివేసుకున్న ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఇక, ఈ దాడి తామే చేశామంటూ.. బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. దీంతో, పాక్తిసాన్కు వార్నింగ్ ఇచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది. #Karachi: Firing on Dental Clinic in Saddar area, One #Chinese Citizen killed while 2 others including a woman have got injured. pic.twitter.com/eEqsRISDTS — Drakshaan Baloch (@IsmailBaloch88) September 28, 2022 -
Eng Vs Pak: పాక్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ కెప్టెన్‌గా మొయిన్ అలీ.. కారణమిదే!
England Tour Of Pakistan 2022: పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ టూర్‌కు దూరమయ్యాడు. హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు పిక్కల్లో గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో పాక్ పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ మొయిన్ అలీ.. బట్లర్ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ పాక్‌లో పర్యటించనుంది. టెస్టు సిరీస్ సైతం.. 2005 తర్వాత సెప్టెంబరులో తొలిసారిగా పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 2 వరకు టీ20 సిరీస్ ఆడనుంది. మొదటి ఆరు మ్యాచ్‌లు కరాచీ వేదికగా జరుగనుండగా.. ఆఖరి టీ20కి లాహోర్ వేదిక కానుంది. ఈ టూర్ ముగిసిన తర్వాత డిసెంబరులో మరోసారి టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ మరోసారి పాక్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు టెస్టులు ఆడనుంది. రావల్పిండి, ముల్తాన్, కరాచీలలో డిసెంబరు 1 నుంచి 21 వరకు ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ జరుగనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జాకిర్ ఖాన్ ధ్రువీకరించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో మొయిన్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: Rishabh Pant: జట్టులో పంత్‌కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు! Hardik Pandya: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన హార్దిక్.. కెరీర్ బెస్ట్... ఏకంగా.. -
అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...
కరాచి: పాకిస్తాన్ ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అన్న కనికరం లేకుండా కొట్టి కొందపడేసి బూట్లతో తన్ని దారుణంగా ప్రవర్తించాడు ఒక సెక్యూరిటి గార్డు. పోలీసులు తెలపిన కథనం ప్రకారం....పాకిస్తాన్‌లోని కరాచీలో నోమన్ గ్రాండ్ సిటీ అనే అపార్టమెంట్స్ గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉంది. సనా అనే ఒక ఐదు నెలల గర్భిణి ఆ ఆపార్టమెంట్స్ లోనే పనిమనిషిగా పనిచేస్తోంది. ఐతే ఆమె తన కొడుకు సోహిల్ తన కోసం ఆహారం తీసుకువచ్చాడని తనని లోపలికి అనుమతించాల్సిందిగా ఆ ఆపార్టమెంట్ సెక్యూరిటీ గార్డుని వేడుకుంది. ఐతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్ నాసిర్, అదిల్ ఖాన్, మహ్మద్ ఖలీల్ లోపలకి రావడాని అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఆ సెక్యూరిటీ గార్డు కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తిరిగి లేచేందుకు ప్రయత్నించే లోపే బూట్లతో ముఖం పై తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్ప్రుహ కోల్పోయింది. ఈ సంఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడ్డంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఆ గార్డు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఆ గార్డు పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా. (చదవండి: కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..) -
కరాచీలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఐతే స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని విమానయాన సంస్థ పేర్కొంది. అంతేకాదు ప్రయాణీకులను దుబాయ్‌కి తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ విమానాన్ని కరాచీకి పంపుతున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఐతే అసాధారణంగా ఇంధనం తగ్గుతున్నట్లుగా ఇండికేటర్‌ని చూపించడంతో, పైలట్లు ఇంధనం లీకేజ్ అవుతుందన్న అనుమానంతో విమానాన్ని దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంధనం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది. (చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి) -
ప్రవక్త వివాదం: శాంసంగ్ క్షమాపణలు
ఇస్లామాబాద్: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ చేష్టలతో పాకిస్థాన్‌పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్ కంపెనీ దిగొచ్చింది. ఇస్లాంను, మొహమ్మద్ ప్రవక్తను కించపరిచిందన్న ఆరోపణలపై ఎట్టకేలకు పాకిస్థాన్‌కు క్షమాపణలు తెలియజేసింది శాంసంగ్. బ్లాస్ఫెమీ(దైవదూషణ)కి పాల్పడడంతో శాంసంగ్ కంపెనీపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో.. అంతర్గత దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు కొరియన్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మతపరమైన భావాలపై తటస్థతను కొనసాగిస్తుందని ట్విటర్లో ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. శుక్రవారం కరాచీలోని స్టార్ సిటీ మాల్లో ఇన్స్టాల్ చేసిన ఓ వైఫై డివైజ్ మూలంగా ఈ రచ్చ షురూ అయ్యింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో.. మాల్ దగ్గరికి చేరుకుని కొందరు నిరసనలకు దిగారు. అదే సమయంలో శాంసంగ్ తీసుకొచ్చిన ఓ క్యూఆర్ కోడ్ ప్రవక్తను కించపరిచేదిగా ఉందంటూ గొడవ మరింత ముదిరింది. శాంసంగ్ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. రెచ్చిపోయి మాల్ బయట విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. Protest against alleged blasphemy of a WiFi device in Karachi. Mob gathered after a WiFi device installed in Star City Mall, allegedly posted blasphemous comments. Protesters vandalised Samsung billboards accusing the company of blasphemy. Police detained 27 Samsung employees. pic.twitter.com/3R8UYbScqa — Naila Inayat (@nailainayat) July 1, 2022 Samsung Pakistan - Press Release July 1st, 2022. pic.twitter.com/IVSpAkH8Lm — Samsung Pakistan (@SamsungPakistan) July 1, 2022 విషయం తెలిసి మాల్‌కు చేరుకున్న పోలీసులు.. 27 మంది శాంసంగ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తెహ్రీక్-ఈ-లబ్బాయిక్ పాకిస్థాన్ గ్రూప్ సభ్యులని నిర్ధారించిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్ మాత్రం చేయలేదు. పాక్‌లో దైవదూషణను అక్కడి చట్టం తీవ్ర నేరంగా భావిస్తుంది. కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా.. ఒక్కోసారి మరణ శిక్ష కూడా అమలు చేస్తారు. కిందటి ఏడాది డిసెంబర్లో ఇస్లాంను కించపరిచిన నేరానికి.. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి సియాల్కోట్లో మూక హత్యకు గురయ్యాడు. చదవండి: నూపుర్‌శర్మ దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే! -
Pakistan: పాకిస్తానీల అరాచకం.. ఆలయంలో విగ్రహాలు ధ్వంసం
Hindu Temple Vandalised in Karachi: దాయాది దేశం పాకిస్తాన్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఇండస్ నది సమీపంలో ఉన్న ఓ చరిత్రాత్మక ఆలయాన్ని పాకిస్తానీలు ధ్వంసం చేసిన ఘటన మరువకముందే మరో ఆలయం ధ్వంసమైంది. వివరాల ప్రకారం.. కరాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు బైక్స్‌పై వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. ఆలయ ధ్వంసం ఘటనతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు చెలరేగినట్లు ఓ పత్రిక తెలిపింది. ఇక, ఆలయ ధ్వంసం ఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. ఇక, పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. పాకిస్తాన్లో ఆలయాలపై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఎన్నో చారిత్రాత్మక ఆలయాలపై దాడులు జరిగాయి. గతేడాది అక్టోబర్‌లో కోట్రీ ప్రాంతంలోని ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు. Once again #MinoritiesTargeted in #Pakistan. ncident of vandalism against places of worship of the #Hindu community in #Pakistan, the statues of deities at Shri Mari Maata in #Karachi’s Korangi area is attacked.#AntiPakistanARY #BabarAzam𓃵 #DuaZehra #MandirVandalised #TeJran pic.twitter.com/YYSChPdFke — Anu Radha (@anu_financial) June 9, 2022 -
పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం.. ‘మోదీ పట్టుకుంటారా ?’
ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్ సంబంధిన అన్ని విభాగాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని దావూద్ సోదరి హాసీనా పార్కర్ కుమారుడు అలిశా పార్కర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం పార్కర్‌ను విచారించే క్రమంలో దావూద్ పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడని అతడు తెలిపాడు. దీంతో దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఇక, ఈడీ విచారణ సందర్భంగా పార్కర్.. ‘‘నేను పుట్టుక ముందే తన మామ(దావూద్ ఇబ్రహీం) ముంబై వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు భారత్‌ను వదిలి.. పాకిస్తాన్లో ఉంటున్నట్టు మా బంధువుల ద్వారా తెలిసింది. అయితే, ఇంతకు ముందు కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు దావూర్ భార్య మెహ్జబీన్.. తన భార్య ఆయేషా, తన సోదరితో మాట్లాడింది.’’ అని చెప్పినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దీంతో దావూద్.. పాకిస్తాన్లో ఉన్నాడని రుజువైంది. ఈడీ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత.. దావూద్ ఇబ్రహాంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే డిమాండ్ చేశారు. In a big revelation, Haseena Parkar's son Alishah has told the Enforcement Directorate that underworld don Dawood Ibrahim is living in Pakistan's Karachi. Read more: https://t.co/TJtKSCm0ow#DawoodIbrahim pic.twitter.com/9bs8EW4xmT — TIMES NOW (@TimesNow) May 24, 2022 అంతకుముందు.. మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా.. కోర్టు ఈడీ కస్టడీ విధించింది. దీంతో నవాబ్ మాలిక్ వ్యవహారంలో బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకోవాలని ప్రధాని మోదీకి ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. Central Govt should take action on it. Till now the location was not known but now if the location is clear then the Central govt should take it seriously and take the action: Maharashtra Home Minister Dilip Walse Patil on Dawood Ibrahim pic.twitter.com/V56OvHK6pI — ANI (@ANI) May 24, 2022 ఇది కూడా చదవండి: బీజేపీకి దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్ -
చైనీయులే లక్ష్యంగా మహిళ ఆత్మాహుతి దాడి.. బస్సు దగ్గరకు రాగానే..
పాకిస్థాన్‌లోని ప్రధాన నగరం కరాచీ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. కరాచీ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్కు సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై పాకిస్థాన్ వేర్పాటువాద గ్రూపుకు చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ మిషన్‌ను తొలిసారిగా మహిళా మిలిటెంట్ నిర్వహించారని అధికారులు తెలిపారు. చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్థానికులకు చైనా భాషను నేర్పుతుంటారు. దీంతో చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బుర్ఖా ధరించి ఇన్స్టిట్యూట్ గేట్ వద్ద నిల్చున్న ఓ మహిళ.. వ్యాన్ దగ్గరకు రాగానే తనను తాను బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంష్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆత్మాహుతి దాడికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు పేలుడు ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. BREAKING 🇵🇰 Pakistan🇵🇰 : Warning Graphic Content ‼️ ♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university ♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh — Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022 -
పాక్‌లో ఉగ్ర దాడులు.. 8 మంది సైనికుల మృతి
కరాచి: పాకిస్తాన్‌లోని ఉత్తర వజీరిస్తాన్‌లో రెండు ఉగ్రవాద దాడుల్లో ఎనిమిది మంది సైనికులు మరణించారు. గిరిజన జిల్లా దతఖేల్‌లో భద్రతా బలగాల వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు, రాకెట్ గన్లతో మెరుపు దాడి చేసి ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారు. జిల్లాలోని ఇషామ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కాల్పుల్లో మరో సైనికుడు చనిపోయాడు. చదవండి: Russia-Ukraine war: మాస్క్వా మునిగింది -
ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం.. పాకిస్తాన్లో అత్యవసర ల్యాండింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసరంగా పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యింది. ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానంలో పొగలు రావడంతో కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానం కార్గో విభాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా పాకిస్తానలోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, సోమవారం తెల్లవారుజామున 3.20కి ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 5.30 గంటలకు కరాచీలో ల్యాండ్ అయింది. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే విమానంలో ప్రయాణిస్తున్న 283 మందిని మరో విమానంలో దోహాకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. విమానంలో పొగలు రావడంపై సదరు ఖతార్ ఎయిర్వేస్ సంస్థ స్పందించింది. ఈ సమస్య తలెత్తడంపై దర్యాప్తు చేపట్టినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో మిగతా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. -
29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 పరుగులు.. అయినా!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ బోణీ కొట్టింది. కరాచీ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ధేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని పెషావర్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెషావర్ విజయంలో హుస్సేన్ తలత్(52), షోయాబ్ మాలిక్(48) పరుగులతో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఓపెనర్లు ఎహ్సాన్ అలీ, విల్ స్మెడ్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా విల్ స్మెడ్ సెంచరీ తృటిలో మిస్సయ్యాడు. స్మెడ్ కేవలం 62 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అదే విధంగా మరో ఓపెనర్ ఎహ్సాన్ అలీ 46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. వీరిద్దిరి తుఫాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గ్లాడియేటర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పెషావర్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాదిర్ , సామీన్ గుల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 97 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన విల్ స్మెడ్‌కి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు Will Smeed smashing it on #PSL2022 debut for @TeamQuetta!! Currently 64* from 43 balls including this MONSTER six! 🔥🔥🔥#HBLPSL #HBLPSL7 #WeAreSomerset pic.twitter.com/BTcD7d6KjC — Somerset Cricket 🏏 (@SomersetCCC) January 28, 2022 -
పాకిస్తాన్: కరాచీలో భారీ పేలుడు.. 10 మంది మృతి, 13 మందికి గాయాలు
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ పైపలైన్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ ప్రైవేటు బ్యాంకు భవనం భారీగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఇప్పటివరకు 10మంది మృతి చెందగా, 13 మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ధ్వంసమైన భవన శిథిలాల కింద పలువురు చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
ప్రపంచ రికార్డు సాధించిన పాకిస్తాన్.. ఏకైక జట్టుగా!
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సాధించింది. టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. సోమవారం కరాచీ వేదికగా వెస్టిండీస్‌తో జరగిన తొలి టీ20లో విజయం సాధించిన పాకిస్తాన్.. 18 విజయాలతో ఈ ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. కాగా చివరి 11 టీ20ల్లో 10 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ విజయం సాధించింది. 2021 ఏడాదిలో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడిన పాక్.. 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 6 మ్యాచ్‌ల్లో ఓటమి, మరో మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. కాగా జట్టు విజయాల్లో కెప్టెన్ బాబర్ ఆజాం, మహమ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 ఏడాదిలో వీరిద్దరూ 1208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2021లో బాబర్ 853 పరుగులు సాధించగా, రిజ్వాన్ 1201 పరుగులు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో అద్బుతంగా రాణించిన పాకిస్తాన్.. అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Virat Kohli: టెస్టులకు రోహిత్ దూరం.. వన్డే సిరీస్ నుంచి కోహ్లి అవుట్.. అసలేం జరుగుతోంది? The Pakistani pacer YORKER! The latest exponent! 🔥🔥🔥 pic.twitter.com/ebcALFbfEN — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 -
పాకిస్తాన్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
ఇస్లామాబాద్ : కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా పంజా విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన ప్రకారం ఇప్పటి వరకు 63 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. తాజాగా పాకిస్తాన్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.. కరాచీకి చెందిన 57 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సిఒసి) సోమవారం నిర్ధారించింది. అయితే ఒమిక్రాన్ సోకిన మహిళ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోన్నట్లు గుర్తించారు. చదవండి: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక కరాచీకి చెందిన ఒమిక్రాన్ బాధితురాలు ఆగాఖాన్ యూనివర్శిటీ కరోనా లక్షణాలతో గతవారం ఆస్పత్రిలో చేరగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇస్లామాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. బాధితురాలు ప్రస్తుతం ఇంటివద్దనే క్షేమంగా ఉందని, అన్ని పనులు చేసుకుంటోందని ఆస్పత్రి ప్రకటించింది. చదవండి: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం -
కరాచీ జైలు నుండి 20 మంది భారత జాలర్ల విడుదల
-
కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!
కరాచి: పాకిస్తాన్‌లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు ప్రబలుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇది డెంగ్యూ జ్వరం మాదిరిగానే రోగుల్లో ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాల తగ్గిపోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాము డెంగ్యూ కోసం పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయని డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ అన్నారు. (చదవండి: వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!) పైగా నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, హేమాటో-పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు కూడా కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని ధృవీకరించారు. అయితే ఈ వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది కానీ ఇది డెంగ్యూ జ్వరం కాదని పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ముహమ్మద్ జోహైబ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా 45 కొత్త డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్ఓ) పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీజన్లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో) -
వైరల్ వీడియో: రెస్టారెంట్లో గొడవ.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడిగినందుకు..
కరోనా వైరస్ వాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించడం కొన్నిచోట్ల తప్పనిసరి అయిపోయింది. అయితే కొంతమంది ఆ సర్టిఫికేట్ చూపి తమ పనులను చేసుకుంటున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్లో కరోనా వాక్సినేషన్ సర్టిఫికేట్ చూపమన్నందుకు ఓ మహిళా కస్టమర్ రెస్టారెంట్ సిబ్బందిపై అరుస్తూ.. కోపంతో ఊగిపోయారు. ఈ ఘటన కరాచీలోని ఓక్రా టెస్ట్ కిచెన్ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. ఓ మహిళ కస్టమర్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది బాధ్యతగా కరోనా వైరస్ టీకా ధ్రువపత్రాన్ని చూపాలని ఆమెను కోరారు. దీంతో ఆమె ఒక్కసారిగా కోపంతో ఊగుపోతూ.. తనను సర్టిఫికేట్ ఆడుగుతారా? అన్నట్లు సిబ్బందిపై అరిచి గొడవకు దిగింది. ఇది ప్రభుత్వం విధించిన తప్పనిసరి నిబంధన అని సిబ్బంది ఎంత చెప్పినా ఆమె పట్టించుకోలేదు. తాను ఓ సామాజిక కార్యకర్తను అని చెబుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఒమర్ ఆర్ ఖురైషి అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఆ మహిళా కస్టమర్ ప్రవర్తించిన తీరుపై కామెంట్లు చేస్తున్నారు. Female customer at Okra Test Kitchen in Karachi gets angry when asked by staff to show vaccination certificate - which is now a legal requirement in Pakistan for service by a restaurant Says she’s a “human rights activist” as she exits the place pic.twitter.com/xp9nM9hqaR — omar r quraishi (@omar_quraishi) October 7, 2021 -
పాక్‌లో రోడ్డు ప్రమాదం.. 23 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులోని 23 మంది మరణించారు. వాధ్ నుంచి దాదు వైపు వేగంగా వెళ్తున్న బస్సు ఖుజ్దార్ జిల్లాలోని ఖోరి వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. ఘటనాస్థలంలోనే 15 మంది మరణించారు. గాయపడిన 30 మందిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా మరో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 23కు చేరింది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. చదవండి: తలవంచిన ఎల్‌చాపో భార్య.. నవ్వుతూ శిక్షకు సిద్ధం -
అత్యవసర మళ్లింపు.. ఫలితం లేకపోయింది: ఇండిగో
న్యూఢిల్లీ: షార్జా నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో ఎయిర్‌లైన్ విమానాన్ని అత్యవసర పరిస్థితుల నిమిత్తం కరాచీకి మళ్లీంచారు. ఫైట్ 6E 1412 మంగళవారం షార్జా నుంచి లక్కోకు బయలుదేరింది. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్ అస్వస్థతకు గురికావడంతో అత్యవసర వైద్య పరీక్షల నిమిత్తం ప్లైట్‌ను కరాచీకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు ఎయిర్‌పోర్టు వైద్యులు ధృవీకరించారని ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడిచింది. అయితే ప్యాసింజర్ వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అరంగేట్రంలోనే ‘5’ వికెట్లు పడగొట్టాడు!
కరాచి: పాకిస్తాన్ అరంగేట్ర క్రికెటర్ నౌమన్ అలీ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. అదే విధంగా అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన పాకిస్తాన్ నాలుగవ స్పిన్నర్‌గా ఘనతకెక్కాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ అతడి ప్రతిభను కొనియాడుతూ ఓ వీడియోను షేర్ చేసింది. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో భాగంగా నౌమన్ అలీ ఈ రికార్డు నమోదు చేశాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి విజయంపై జట్టులో ఆశలు రేకెత్తించాడు. కాగా కరాచిలో మంగళవారం ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగలకు ఆలౌట్ అయ్యింది.(చదవండి: బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?) ప్రొటీస్ క్రికెటర్ డీన్ ఎల్గర్ అర్ధ సెంచరీతో రాణించగా... యాసిర్ షా 3, నౌమన్ అలీ, షాహిన్ ఆఫ్రిది చెరో 2 వికెట్లు తీశారు. ఇక పాక్ 378 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించగా, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మర్క్రం, బవుమా(ఎల్బీడబ్ల్యూ), జార్జ్ లిండే, రబడ, నోట్జేలను పెవిలియన్‌కు చేర్చి నౌమన్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 7 వికెట్లు తీశాడు. ఇక లంచ్‌బ్రేక్ సమయానికి పాకిస్తాన్ విజయానికి 66 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం పాక్ క్రికెటర్లు అబిద్ అలీ, ఇమ్రాన్ బట్ క్రీజులో ఉన్నారు. A sharp take 👏#PAKvSApic.twitter.com/bbUvhLVLGg — ICC (@ICC) January 29, 2021 Well bowled Nauman Ali 👏👏👏👏👏 Watch #PAKvSA Live: https://t.co/ZYzysLIXs4#HarHaalMainCricket #BackTheBoysInGreen pic.twitter.com/qYgpz4lNDu — Pakistan Cricket (@TheRealPCB) January 29, 2021 -
'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు'
కరాచీ : పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది.శనివారం మీడియా సమావేశంలో సదరు మహిళ బాబర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి : రానున్న రోజుల్లో స్మిత్‌తో టీమిండియాకు కష్టమే) 'బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాక నన్ను కొట్టి.. శారీరకంగా హింసకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని మహిళ పేర్కొంది. So this lady has made accusations against Babar Azam "he promised to marry me, he got me pregnant, he beat me up, he threatened me and he used me" Video courtesy 24NewsHD pic.twitter.com/PTkvdM4WW2 — Saj Sadiq (@Saj_PakPassion) November 28, 2020 అయితే మహిళ చేసిన ఆరోపణలపై బాబార్ అజమ్ స్పందించలేదు.మహిళ చెప్పినదాంట్లో నిజమెంత అనేది పక్కనబడితే.. బాబర్‌పై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పేరు సంపాదించడానికి ఇలాంటి పనికిరాని ఆరోపణలు చేస్తుందని బాబర్ అభిమానులు మండిపడుతున్నారు. మహిళ చేసిన ఆరోపణలపై పాక్ క్రికెట్ బోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. (చదవండి : తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్) కాగా కొద్ది రోజుల క్రితమే బాబర్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో కివీస్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు అక్కడికి చేరుకుంది. కరోనా నేపథ్యంలో వారు ప్రస్తుతం 14 రోజుల ఐసోలేషన్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న కివీస్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు ప్రారంభం కానుంది. అయితే తాజాగా పాక్ టీమ్‌లో ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మిగతా ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌కే పరిమితం అయ్యారు. -
పాకిస్తాన్లో అంతర్యుద్ధం?
కరాచీ: ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుండగా మరోపక్క ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఆర్మీకి, పాక్ పోలీసులకు మధ్య గొడవలు పెరిగి కాల్పులకు దారితీశాయి. ఇంటర్నేషనల్ హెరాల్డ్ తన తాజా ట్వీట్లో పాక్‌లో సివిల్ వార్ ఆరంభమైందని వ్యాఖ్యానించింది. కరాచీలో సింధ్ పోలీసులకు, పాక్ ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పది మంది పోలీసులు మరణించినట్లు ఇంటర్నేషనల్ హెరాల్డ్ నివేదించింది. సింధ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్ అహ్మద్ మహర్‌ను ఆర్మీ నిర్బంధించడంతో గొడవ మొదలైందని సమాచారం. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు మహ్మద్ సఫ్దార్ను అరెస్టు వ్యవహారంలో మహర్‌ను నిర్బంధించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనలపై పాక్ ప్రధాని, ప్రభుత్వం స్పందించలేదు. సఫ్దార్ అరెస్ట్ కోసం.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇటీవల ఏర్పాటు చేసిన పీడీఎం వేదికపై నవాజ్ షరీఫ్ కూతురు మరియం, ఆమె భర్త సఫ్దార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీకి నచ్చని ‘ఓటుకు విలువ ఇవ్వండి’ అని సఫ్దార్ నినాదాలు చేశారని, దీంతో కేసు నమోదైందని తెలిసింది. ఈ కేసులోనే సఫ్దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే సఫ్దార్ను అరెస్ట్‌చేసేలా పోలీసులకు ఉత్వర్వులు ఇవ్వాలని సింధ్ పోలీస్ ఐజీపీ మహర్‌పై సైన్యం ఒత్తిడి చేసిందని, అందుకోసం ఆయనను సైన్యం నిర్బంధించిందని సింధ్ మాజీ గవర్నర్ మహ్మద్ జుబేర్ ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి అయిన మహర్ నిర్బంధం విషయం తెల్సి ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారని సమాచారం. ఈ సందర్భంగా సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగాయని, పది మంది పోలీసులు మరణించారని తెలుస్తోంది. సైన్యం కాల్పులకు నిరసనగా ఏఐజీ ఇమ్రాన్‌సహా సీనియర్ పోలీసు అధికారులు విధులను బహిష్కరించి సెలవు తీసుకున్నారు. అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మహర్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. 10 రోజులదాకా సెలవు కోసం దరఖాస్తు చేసుకోరాదని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ గొడవకు కారణమైన అంశాలపై విచారణ జరపాలని ఆర్మీ చీఫ్ జనరల్ కమార్‌జావెద్ బజ్వా ఆదేశించారు. నిరసనల్లో భారత జెండా ఇటీవల పాక్‌లో జరిగిన భారీ నిరసనల్లో భారత జాతీయజెండాలు చేతబూనారని బుధవారం ట్విట్టర్లో కొంతమంది పోస్ట్‌లు పెట్టారు. వేలాది మంది జనం గుమికూడిన ఈ ఫొటోల్లో కొందరి చేతిలో మువ్వన్నెల జెండాలున్నాయి. పాక్‌కు చెందిన పాకిస్తాన్ అవామీ తెహ్రీక్ పార్టీ జెండాలో అవే రంగులుంటాయని, అవి ఆ జెండాలని కొందరు స్పందించారు. పాక్‌లో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆహార కొరత వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ గద్దె దిగాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆందోళనలను అణిచివేస్తోంది. -
కరాచీలో భారీ పేలుడు : ముగ్గురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని కరాచీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. నాలుగంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 15 మంది గాయపడ్డారు. కరాచీ యూనివర్సిటీ మస్కాన్ గేటు ఎదురుగా ఉన్న భవనంలో ఈ భారీ పేలుడు సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని, మృతులను ఆస్పత్రికి తరలించారని డాన్ పత్రిక పేర్కొంది. పేలుడుకు కారణం ఏంటనేది వెల్లడికాకపోయినా సిలిండర్ పేలడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. భవనం రెండో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా కరాచీలో మంగళవారం షిరిన్ జిన్నా కాలనీలోసి బస్ టెర్మినల్‌లో బాంబు పేలడంతో ఐదుగురు గాయపడిన ఉదంతం మరువకముందే ఈ భారీ పేలుడు వెలుగుచూసింది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ అవన్ అరెస్ట్‌కు కరాచీ పోలీసులపై ఒత్తిడి పెంచేందుకు సింధ్ పోలీస్ చీఫ్‌ను పాక్ సేనలు కిడ్నాప్ చేశాయనే వదంతులపై ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా విచారణకు ఆదేశించిన క్రమంలో బాంబు పేలుళ్లు జరగడం గమనార్హం. చదవండి : కశ్మీర్ విధ్వంసానికి పాక్ పన్నాగం -
బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. ఐజీ డాక్టర్ అఫ్తాబ్ పఠాన్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి కరాచీకి 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 13 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా.. మరో ఐదుగురి పరస్థితి విషమంగా ఉంది. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాలిపోయిన బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహన వేగం అధికంగా ఉండటంతో బోల్తా కొట్టిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారని' పోలీసులు వెల్లడించారు. -
సమాధానం చెప్పాల్సిన పని లేదు: చోటా షకీల్
ఇస్లాంబాద్: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో నివసిస్తున్నాడన్న వార్తలను పాకిస్తాన్ ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ బుధవారం ఖండించారు. కరాచీలో ఒక ఖరీదైన భవనంలో ఉన్నాడని భారత మీడియా చూపించిందని ఈ విషయంలో పూర్తి బాధ్యత దానిదే అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో సహా తాము ఏ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తూ ఉంటాయని, వాటన్నింటికి తాము బాధ్యత వహించబోమని తెలిపాడు. సామాజిక మాధ్యమాలలో విలువైన బంగ్లాలలో ఉంటూ, ఖరీదైన కార్లలలో తిరుగుతారని ఏవేవో రాస్తారని వాటన్నింటికి మేం ఎలా బాధ్యత వహిస్తామని చోటా షకిల్ ప్రశ్నించాడు. 1993 ముంబై పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ చాలా సంవత్సరాల పాటు ఖండించింది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నట్లు పాక్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చదవండి: పాక్‌లోనే దావూద్..! -
మళ్లీ మాట మార్చిన పాకిస్తాన్
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం విషయంలోదాయాది దేశం పాకిస్తాన్ మరోసారి మాట మార్చింది. దావుద్ కరాచీలో ఉన్నట్లు అంగీకరించి, అతన్ని టెర్రరిస్టుల జాబితాలో చేర్చిన పాక్.. వెంటనే యూటర్న్ తీసుకొని,ఇబ్రహీం కరాచీలో లేడని, అతనికి తమ దేశంలో ప్రవేశం లేదని ప్రకటించింది. భారత్ మీడియా కావాలనే దావుద్ తమ దేశంలో ఉన్నట్లు అంగీకరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించింది. ప్యారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) జూన్ 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు... తాజాగా పాకిస్తాన్ 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, దాని అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావుద్ ఇబ్రహీంను పేరుకూడా ఉంది. దావుద్ ఇబ్రహీంతో పాటు జమాతుద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చింది. వీరి స్థిర, చరస్తులను సీజ్ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు తెలియజేస్తూ రెండు నోటిఫికేషన్ల విడుదల చేసింది. గ్రే లిస్ట్‌లో దావుద్‌ను చేర్చడంతో మాఫియా డాన్ తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ అంగీకరించినట్లయ్యింది. అయితే లిస్ట్ ప్రకటించిన కొన్ని గంటలకే దాయాది దేశం మాట మార్చింది. దావూద్ తమ దేశంలో ఉన్నారని అంగీకరించినట్లు భారత్ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఆరోపించింది. దావుద్‌కు తమదేశంలో చోటు లేదని పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అది కొత్త నోటిఫికేషన్ ఏం కాదని, ఈ నోటిఫికేషన్ ద్వారా పాక్ ఎలాంటి కొత్త ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. (చదవండి : దావూద్ గుట్టువిప్పిన పాకిస్తాన్) ఆగస్టు 18న జారీ అయిన ఒక నోటిఫికేషన్ గురించి స్థానిక విలేకరులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి మాట్లాడుతూ.. పాకిస్తాన్ 2020 ఆస్టు 18న జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్) చాలా పక్కా సమాచారంతో ఉందని, ఇంతకు ముందు జారీ చేసిన ఎస్ఆర్ఓను కూడా ఒక ప్రక్రియ ప్రకారమే ఇచ్చామని తెలిపారు. అందుకే నిషేధిత జాబితా, నిషేధిత చర్యల్లో ఎలాంటి మార్పులూ ఉండవని స్పష్టం చేశారు. ‘ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో తాలిబాన్, ఐఎస్, అల్‌ఖైదాల ప్రస్తుత స్థితిని చూపించడానికి 2020 ఆగస్టు 18న రెండు సంయుక్త ఎస్ఆర్ఓలు జారీ చేశాం. అప్పుడప్పుడూ ఈ ఎస్ఆర్ఓలు విడుదల అవుతుంటాయి. అలాగే, చట్టపరమైన అవసరాలు, అంతర్జాతీయ బాధ్యతల ప్రకారం విదేశాంగ శాఖ ఈ ఎస్ఆర్ఓలను ప్రచురిస్తుంది. కానీ భారత్ మీడియా మాత్రం ఈ రిపోర్ట్ ద్వారా పాకిస్తాన్ ఏవో కొత్త ఆంక్షలు విధించిందని కథనాలు నడిపిస్తుంది. అది సరికాదు. ఈ ఎస్ఆర్ఓను చూపిస్తూ మా దేశంలో కొందరు ఉన్నట్లు(దావూద్) పాకిస్తాన్ అంగీకరించిందని భారత మీడియాలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అవి నిరాధారం, కల్పితం’అని జాహిద్ చౌధరి పేర్కొన్నారు. -
దావూద్ గుట్టువిప్పిన పాకిస్తాన్
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్టు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆ దేశం తాజాగా ప్రకటించిన టెర్రరిస్టుల జాబితాలో ఆయన పేరును కూడా పొందుపరిచింది. తమ గడ్డపై ఉగ్రవాదులను గుర్తిస్తూ పాకిస్థాన్ ఓ జాబితాను విడుదల చేసింది. కరుడుగట్టిన నేరగాళ్లు హాఫిజ్ సయీద్, మొహమ్మద్ అజర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన 88 మంది వివాదాస్పద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై వీరందరి మీద ఆంక్షలు విధించనుంది. బ్యాంక్ ఖాతాలను కూడా స్థంభింపచేయనుంది. ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్థాన్ ఈ జాబితానును శనివారం విడుదల చేసింది. దీంతో ఉగ్రవాద కార్యక్రమాలను ఊపిరి పోస్తున్న దావూద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఉగ్రవాద గ్రూపులపై, నాయకులపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నామని, స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, వారి బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఇదంతా ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించడానికేనా అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, 1993 ముంబై పేలుళ్ల కేసులో కీలక సూత్రదారిగా ఉన్న దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. -
ఇది నిజంగా హైదరాబాద్‌లో జరిగిందా?
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న బిల్‌బోర్డు అమాంతం ఊడిపడి వాహనదారులపై పడింది. ఈ ప్రమాదంలో వేర్వేరు బైకులపై వస్తున్న ఇద్దరు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇది హైదరాబాద్‌లో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భయంకర ఘటన మెహదీపట్నంలో జరిగిందంటూ ఓ ఫేస్బుక్ యూజర్ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో అనేకమంది ఈ వీడియోను హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదం అంటూ షేర్ చేస్తున్నారు. (లాప్టాప్ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..) అయితే ఈ వార్తలో నిజం లేదు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిందని తేలింది. ఆగస్టు 6న కరాచీలోని మెట్రోపోల్ హోటల్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని 'ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఆ నగరంలోని బిల్‌బోర్డులను తొలగించాలని కరాచీ కమిషనర్ కార్యాలయం అధికారులను ఆదేశించింది. మరోవైపు తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సైతం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ఈ వీడియో హైదరాబాద్‌లో జరగలేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. (నదిలో లక్ష లింగాలు: నిజమేనా?) వాస్తవం: ఈ భయానక ప్రమాదం హైదరాబాద్‌లో చోటు చేసుకోలేదు. -
పాకిస్తాన్ స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రదాడి
కరాచీ : పాకిస్తాన్‌లోని స్టాక్‌మార్కెట్‌పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు, ముగ్గరు ఉగ్రవాదులు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. సోమవారం ఉదయం కరాచీలోని స్టాక్‌మార్కెట్ భవనంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడితో అప్రమత్తమమైన భద్రతా బలగాలు ప్రతిదాడిచేసి ముగ్గుర్ని హతమార్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలోని సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. దాడిలో పలువురికి గాయాలైనట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులేనని పేర్కొంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో బ్యాంకులు, పలు ప్రయివేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సైనిక, అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!
ఇస్లామాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) గురించి చర్చల్లో మునిగి పైలట్, కో- పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే 97 మంది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 విమానం కుప్పకూలిన ఘటనలో ఎటువంటి సాంకేతిక లోపం చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. పైలట్లు, అధికారుల తప్పిదం వల్లే ఘోర ప్రమాదం సంభవించిందని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పార్లమెంటుకు ఆయన నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘నిజానికి విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదు. 100 శాతం ఫిట్‌గా ఉంది. కెప్టెన్, పైలట్ కూడా అనుభవం కలవారు. (‘పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు.. చుట్టూ మంటలు’) అదే విధంగా విమానం నడిపేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. కానీ వారి మెదడులో కరోనా గురించిన భయాలు నిండిపోయాయి. దాని గురించి చర్చిస్తూ విమాన గమనంపై దృష్టి సారించలేకపోయారు. అందుకే వారితో పాటు ఇతర కుటుంబాలు నష్టపోయాయి’’అని పేర్కొన్నారు. అదే విధంగా.. పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల సూచనలు పట్టించుకోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ల్యాండింగ్ విషయంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ‘నేను చూసుకుంటానులే’ అని వ్యాఖ్యానించిన పైలట్.. అనంతరం మళ్లీ కరోనా గురించి మాట్లాడటం మొదలుపెట్టాడని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డైందని వెల్లడించారు. కాగా మే 22న పాకిస్తాన్లో కరాచిలో జనావాసాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.(‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’) -
మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోవిడ్–19 దెబ్బ గట్టిగా తగిలింది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... ఇప్పుడు మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్‌గా తేలారు. దీంతో కరోనా బారిన పడిన ఆటగాళ్ల సంఖ్య పదికి చేరింది. తాజాగా ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్లకు కరోనా వచ్చినట్లు బయటపడింది. ఈ ఏడుగురు ఆటగాళ్లు కూడా ఫలితాలు వచ్చేవరకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఎసింప్టమిక్‌గానే కనిపించారు. షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్ తదితరుల పరీక్షా ఫలితాలు కూడా రావాల్సి ఉంది. సోమవారం షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్లకు పాజిటివ్ ఫలితం వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం 29 మందితో భారీ జట్టును పాక్ ప్రకటించగా... ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించింది. పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్ గైర్హాజరులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, మూసా ఖాన్, మొహమ్మన్ నవాజ్‌లను ఎంపిక చేసిన పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది. జూన్ 25న పాక్ ఆటగాళ్లకు తర్వాతి దశ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. -
వైరల్: మనసు మార్చుకున్న దొంగలు!
దొంగలు ఎప్పుడైనా ఏం చేస్తారు. మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. వినకపోతే చితగ్గొట్టి మరీ విలువైన వస్తువుల్ని కొల్లగుడుతుంటారు. అయితే, పాకిస్తాన్‌లోని కరాచీలో మాత్రం ఓ ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గర దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు. దాంతోపాటు అతనికి ఓ హగ్ కూడా ఇచ్చి వెళ్లిపోయారు. వివరాలు.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌ను బెదిరించి అతని మనీ పర్స్, ఇతర విలువైన వస్తువులు లాక్కున్నారు. బైక్ ఎక్కి అక్కడి నుంచి ఉడాయిద్దామనుకున్నారు. కానీ, అంతలోనే మనసు మార్చుకుని... సదరు డెలివరీ బాయ్‌కి ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశారు. ఇంతకూ వారి మనసు మారడానికి కారణమేంటో తెలుసా? దొంగలు తన వద్ద నున్న సొమ్ములను తీస్కుకుంటున్నప్పుడు సదరు డెలివరీ బాయ్ నిశ్చేష్టుడయ్యాడు. ఏమీ చేయలేక, వారిపై తిరగబడలేక ఏడుస్తూ ఉండిపోయాడు. దాంతో ఆ దొంగలు వస్తువుల్ని తిరిగి ఇచ్చేశారు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. నిముషం నిడివి గల ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అయింది. దొంగల్లో కూడా మానవత్వం దాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘వీళ్లు మామూలు దొంగలు కాదు. మనసు దోచుయున్న మంచి దొంగలు’ అని మరికొందరు పేర్కొన్నారు. (చదవండి: గాల్వన్ లోయ మాదే : చైనా) -
పైలట్ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం
కరాచి : గత మే 22న పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 ఎయిర్‌బస్ విమానం ఇంజిన్లు సహకరించకపోవడంతో పైలట్ అర్థంతరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 97 మంది దుర్మరణం చెందగా, ఇదరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా దీనిపై పాకిస్తాన్ ఏవియేషన్ అధికారులు పీఐఏకు మరోసారి నివేదికను అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలను పట్టించుకోకుండానే ప్రయాణీకులతో వెళుతున్న ఎ320 ఎయిర్‌బస్ విమానాన్ని పైలట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు తెలిపారు. కేవలం పైలట్ తప్పిదం వల్లే ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుందని ఏవియేషన్ అధికారులు మరోసారి తేల్చి చెప్పారు.(కుప్పకూలిన పాక్ విమానం) 'ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు' అంటూ పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ)కు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.(పాక్‌కు సాయం ఆపేయండి.. అమెరికాకు విజ్ఞప్తి!) పీఐఏ జనరల్ మేనేజర్ అబ్దుల్లా హఫీజ్ ఖాన్ రాయిటర్స్‌తో స్పందిస్తూ.. ' అవును, మాకు లేఖ వచ్చింది, వారు దానిని డాక్యుమెంట్ చేస్తున్నారు. విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా బాక్స్‌ను ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ వైమానిక ఏజెన్సీ బీఏ డీకోడ్ చేస్తోందని' పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను జూన్ 22 న పార్లమెంటుకు అందజేస్తామని పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. -
‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’
కరాచీ: రెండు రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు. (‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) తర్వాత విమానాశ్రయానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం ఎత్తు 3 వేల అడుగుల ఎత్తులో ఉండాలల్సింది. కానీ అప్పుడు విమానం 7 వేల అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు మరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కానీ పైలెట్ మాత్రం ఏం పర్వాలేదని.. తాను హ్యాండిల్ చేయగలనని చెప్పాడు. సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) ఇచ్చిన నివేదిక ప్రకారం పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిసస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పాకిస్తాన్ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు) ఇంధనం అయిపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ప్రచారం అవుతున్న వార్తల్ని కొట్టి పారేశారు. అంతేకాక విమానంలో సరిపడా ఇంధనం ఉందని అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న ఇంధనంతో దాదాపు 2.34 గంటల పాటు ప్రయాణించగలదని.. కానీ ప్రమాద సమయానికి కేవలం 1.30 గంటలపాటే ప్రయాణించిందని అధికారులు తెలిపారు. (ఆ విమానంలో లేను : నటి) -
‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’
‘‘నా చుట్టూ అంతా మంటలు, విపరీతమైన పొగ. విమానం నలుదిక్కుల నుంచి ఏడుపులు. మంటల్లో చిక్కుకున్న పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు. అగ్నికీలలే తప్ప మనుషులెవరూ కనిపించలేదు. నొప్పితో విలవిల్లాడుతున్న వారి గొంతులు మాత్రమే వినిపించాయి’’ అంటూ కరాచీ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇంజనీర్ మహ్మద్ జుబేర్ తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలు పంచుకున్నాడు. చావు అంచుల దాకా వెళ్లిన జుబేర్ ప్రస్తుతం కరాచీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. సీటు బెల్టు తొలగించి.. వెలుతురు కనిపిస్తున్న చోటు వైపుగా నడిచి.. 10 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. విమానాన్ని కిందకు దించే క్రమంలో ఏవో ఆటంకాలు ఎదురయ్యాయని.. దాంతో మరోసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పైలట్ చెప్పాడని.. అంతలోనే నేలకు తగిలి విమానం క్రాష్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. (భయానకం: ఆకాశం నుంచి మృతదేహాలు?) కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాసాల్లో ప్రయాణికుల విమానం కుప్పకూలిన విషయం విదితమే. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో ప్రమాద సమయంలో మొత్తం 99 మంది ఉన్నారు. ఇక బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్, ఇంజనీర్ జుబేర్‌తో పాటు మరో వ్యక్తి మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. కాగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చిన కొన్ని క్షణాల్లోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇక ఇప్పటి వరకు ఘటనాస్థలి నుంచి 82 మృతదేహాలను వెలికితీసినట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.(కుప్పకూలిన పాక్ విమానం) -
భయానకం: ఆకాశం నుంచి మృతదేహాలు?
కరాచీ: రాజు అమ్జద్ అనే వ్యక్తి కరాచీలో తన కారులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి తన కారుపై ఓ మృతదేహం పడింది. దీంతో ఒక్కసారిగా రాజా షాక్‌కు గురై కారు నుంచి బయటకి వచ్చి పరుగులు తీశాడు. ఓ కుటుంబం రంజాన్ పండగ దగ్గరకి వస్తుండటంతో వారి ఇంటి డాబాపై పిండి పదార్ధాలు చేసుకుంటున్నారు. ఇంతలో రెండు మృతదేహాలు వారి ఇంటి డాబాపై పడ్డాయి. దీంతో భయానికి గురైన వారు ఇంట్లోకి పరుగులు తీశారు. కొద్దిసేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు ఈ మృతదేహాలు ఎక్కడివి? ఆకాశం నుంచి ఊడిపడుతున్నాయి అని? కానీ తర్వాత అర్థమైంది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఓ విమానం కరాచీలోని జనావాస ప్రాంతాల్లో కుప్పకూలిందని. విమానం కుప్పకూలిన ధాటికి మృతదేహాలు గాల్లోకి ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించి ఎంతో భయానకంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈద్ సమయంలో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం చాలా బాధకరమని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విమానంలో 99 మంది ప్రయాణిస్తున్నారని, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. మిగతావాటి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్ అధికారులను ఆదేశించారు. కాగా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంతకీ ఏమైందంటే? లాహోర్ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. -
కుప్పకూలిన విమానం..57 మంది మృతి
-
కుప్పకూలిన పాక్ విమానం
కరాచీ: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాస ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరోనా లాక్డౌన్ అనంతరం పాకిస్తాన్లో గతవారమే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునఃప్రారంభించారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య లాహోర్ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్ అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఆర్మీని జనరల్ బజ్వా ఆదేశించారు. విమానం కూలిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను స్థానిక వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. ధ్వంసమైన ఇళ్లలో నుంచి పలు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు, సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సిబ్బంది తెలిపారు. అలాగే, పలువురు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామన్నారు. కనీసం 25 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. కాగా, విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయంలో అధికారులు వేర్వేరు రకాలైన సమాచారం ఇచ్చారు. అయితే, 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ వెల్లడించారు. మధ్నాహ్నం 2.37 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు నిలిచిపోయాయని హఫీజ్ తెలిపారు. సాంకేతిక సమస్య ఏర్పడిందన్న పైలట్ సజ్జాద్ గుల్‌తో.. ల్యాండింగ్‌కు రెండు రన్వేలు సిద్ధంగా ఉన్నాయని కంట్రోల్ టవర్ అధికారులు చెప్పారని పీఐఏ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు. కూలే ముందు విమానం రెక్కల్లో నుంచి మంటలు వచ్చాయని, ఆ తరువాత క్షణాల్లోనే అది ఇళ్లపై కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. -
పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం
-
తీరని విషాదం : ముగ్గురు మృత్యుంజయులు
కరాచీ : కరాచీ విమాన ప్రమాదంలో మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్న తరుణంలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారన్న భారీ ఊరట నిస్తోంది. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్, ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ యూనిట్ సీఈవో ఖాలిద్ షెర్డిల్ క్షేమంగా బయడపడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. అలాగే అమర్ రషీద్ అనే మరో యువకుడు కూడా ఈ ప్రమాదంనుంచి బయటపడడం మిరాకిల్. ఈ విషయాన్ని రషీద్ బంధువులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు) పాకిస్తాన్ జియో న్యూస్ ప్రకారం, ప్రాణాలతో బయటపడిన వారిలో జాఫర్ మసూద్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం స్థలంనుంచి ఇప్పటికి 34 మృతదేహాలను వెలికితీయగా, వీరిలో ఇద్దరు పైలట్ల మృతదేహాలను గుర్తించారు. ఇంకా 24 న్యూస్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు అన్సార్ నఖ్వీ ఈ ప్రమాదంలో అసువులు బాసారు. వీరితో పాటు స్థానికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.సెకండ్ లెఫ్టినెంట్ హమ్జా యూసుఫ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. పరేడ్ ముగిసిన తరువాత హంజా మొదటిసారి ఈద్ పర్వదినం సందర్భంగా ఇంటికి వెళుతున్నారు. (ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?) హమ్జా యూసఫ్ మృతులు (స్థానికి మీడియా సమాచారం ఆధారంగా) -
కుప్పకూలడానికి ముందు..భయంకరమైన క్షణాలు
-
కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు
కరాచీలో దిగడానికి ప్రయత్నిస్తూ కుప్పకూలిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఆఖరి నిమిషంలో చోటు చేసుకున్న కాక్‌పిట్ సంభాషణల వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానం పైలట్లలో ఒకరు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్లో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్‌రాకపోకలను గమనించే ప్రసిద్ధ వెబ్సైట్ లైవ్ఏటీసీ.నెట్ పోస్ట్ చేసిన ఆడియో క్లిప్‌లో ఆఖరి నిమిషంలో పైలట్ రెండు ఇంజిన్లు చెడిపోయాయంటూ ఆందోళన చెందారు. తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామనేందుకు సంకేతంగా "మేడే, మేడే, మేడే" అనే సందేశాన్నిచ్చారు. రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయే కొన్ని క్షణాల ముందు ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా ఇబ్బంది ఏర్పడిందని పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన ఏటీసీ రెండు రన్ వేలు సిద్దంగా ఉన్నాయని చెప్పినా, పైలట్ (ఎ) గో-రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్. ఖాన్ తెలిపారు. సంభాషణ ఇలా ఉంది పీకే8303 పైలట్: అప్రోచ్ ఏటీసీ: జీ సర్ పైలట్: మేం ఎడమవైపు తిరగాలా? ఏటీసీ: ఒకే (ధృవీకరణ) పైలట్: మేం డైరెక్టుగా వెళుతున్నాం. రెండు ఇంజన్లను కోల్పోయాము. ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్ (గేర్-అప్ ల్యాండింగ్) చేస్తున్నారని నిర్ధారించండి? పైలట్: వినిపించడంలేదు. ఏటీసీ: ల్యాండింగ్ కోసం 2- 5 రన్‌వే అందుబాటులో ఉంది పైలట్: రోజర్ పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్తాన్ 8303 ఏటీసీ: పాకిస్తాన్ 8303, రోజర్ సర్. రెండు రన్వేలు అందుబాటులో ఉన్నాయి. అంతే ఇక్కడితో ఆడియో కట్ అయిపోయింది. కొద్దిసేపటి తరువాత, విమానాశ్రయానికి సమీపంలోని జనావాసప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తప్పా మిగిలిన అందరూ చనిపోయి వుంటారని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారం ప్రకారం ముందు టవర్ ను ఢీకొట్టిన విమానం, తరువాత జనావాసాలపై కూలిపోయింది. చదవండి : ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు? -
విమాన ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?
కరాచీ: తీవ్ర విషాదాన్ని నింపిన పాకిస్తాన్ విమాన ప్రమాదంలో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అనేది పాకిస్తాక్‌కు చెందిన బ్యాంక్. ఇది లాహోర్‌లో ఉంది. అటు ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ ట్వీట్ చేశారు. (పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం) Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured. — Narendra Modi (@narendramodi) May 22, 2020 పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు వెంటనే రంగంలోకి సహాయక చర్యల్ని చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన విమాన ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సిబ్బందితోపాటు 99 మంది ప్రయాణికులు మొత్తం 106 మంది బతికి వుండే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్లో లాక్డౌన్ ఆంక్షలతో ఈద్ కారణంగా ప్రత్యేక పీఏఐ ఎయిర్‌బస్ ఎ 320 విమానం లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరింది. ల్యాండిగ్‌కు ఒక నిమిషం ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్రవారం మధ్యాహ్నం కరాచీ విమానాశ్రయానికి అర కిలోమీటర్ దూరంలో జనసాంద్రత గల జిన్నా గార్డెన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. కాగా, 2016 డిసెంబరు 7 తరవాత పాకిస్తాన్లో చోటు చేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ (ఫైల్ ఫోటో) Shocked & saddened by the PIA crash. Am in touch with PIA CEO Arshad Malik, who has left for Karachi & with the rescue & relief teams on ground as this is the priority right now. Immediate inquiry will be instituted. Prayers & condolences go to families of the deceased. — Imran Khan (@ImranKhanPTI) May 22, 2020 -
పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం
-
కుప్పకూలిన విమానం : 100 మంది..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లాహోర్ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ- ఏ320)కు చెందిన విమానం కుప్పకూలింది. కరాచీ ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమాన ప్రమాద ప్రాణనష్టంపై స్పష్టత రాలేదు. కరాచీలోని మహ్మద్ ఆలీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని పాక్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిందని, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయని తెలిపింది. ఇక ప్రజలు నివశిస్తున్న ప్రదేశంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండచ్చని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఆదేశ ఆర్మీ వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగ్రాతులను సమీపంలో జిన్నా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఓవైపు దేశంలో కరోనా వైరస్‌తో జనజీవనం అస్థవ్యస్థమవుతుండగా తాజాగా విమాన ప్రమాదం ఆ దేశ వాసులను తీవ్రంగా కలచివేస్తోంది. -
అప్పుడే బెయిల్, అంతలోనే దొంగతనం
కరాచీ: ఓ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అతను కోర్టుకు కృతజ్ఞత తెలుపుదామనుకున్నాడో ఏమో కానీ వెంటనే కోర్టు ఆవరణలో ఉన్న ఓ బైకును ఎత్తుకెళ్లాడు. ఈ వింతైన ఘటన పాకిస్తాన్లో జరిగింది. కరాచీలోని సింధ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.. తాజాగా అతను విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యాడు. ఈ కేసులో పలు మార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు ఇన్నిరోజులు జైల్లో ఉన్నా అతని వక్రబుద్ధి మాత్రం అలాగే ఉంది. (అనస్థీషియా వైద్యుడి వీరంగం) బెయిల్ వచ్చినందుకు సంతోషపడటం మాని కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న బైకును ఎత్తుకెళ్లిపోయాడు. దీన్ని గమనించిన పోలీసులు అతడిని వెంబడించి అరెస్టు చేశారు. ఈ దృష్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవగా ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'బెయిల్ ఇచ్చినందుకు కోర్టుకు ఆ విధంగా కృతజ్ఞతలు తెలిపాడం'టూ నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ఈ దొంగోడు ఈ జన్మలో మారడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆ దేశ రాజధాని కరాచీలో ప్రతి రోజు 90 బైకులు చోరీకి గురవుతాయని సిటిజన్ పోలీస్ లియాసిగ్ కమిటీ వెల్లడించింది. (యువకుడి తల నరికి.. కుడి చేతి వేళ్లను..) -
ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయాడు!
కరాచీ: ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనలతో బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్ క్రికెట్లో తాజాగా మరో అలజడి రేగింది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాలతో సతమవుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఓ అధికారి డగౌట్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో తీవ్ర దుమారం రేపింది. తాజా పీఎస్ఎల్లో భాగంగా కరాచీ కింగ్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ అధికారి ఒకరు మొబైల్ ఫోన్‌ను డగౌట్‌లోకి తీసుకొచ్చారు. అదే క్రమంలో ఫోన్లో మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో దుమారం రేగింది. దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. లీగ్ ప్రారంభమైన రెండో రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ పెద్దల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్‌కు మరొకసారి మచ్చను తెచ్చిపెట్టింది. (ఇక్కడ చదవండి: ‘జీవితకాల నిషేధం విధించండి’) అసలు ఆ అధికారి ఎవరు, ఎందుకు ఫోన్ తీసుకొచ్చి నిబంధనల్ని ఉల్లఘించాడని కాసేపు తలలు పట్టుకున్నారు. దీనిపై అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డగౌట్లో ఫోన్లో మాట్లాడటాన్ని ఐసీసీ ఎప్పట్నుంచి అనుమతిస్తుందంటూ జోక్‌లు పేల్చుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నిబంధనల ప్రకారం డగౌట్లో ఆటగాళ్లు కానీ అధికారులు కానీ మొబైల్ ఫోన్లను వాడకూడదు. ఇది నిబంధనలకు వ్యతిరేకం. కేవలం వాకీ టాకీలను మాత్రమే అనుమతిస్తారు. డగౌట్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లతో సంభాషించడానికి వాకీ టాకీలను వినియోగిస్తారు. మరి మాజీ అధికారి డగౌట్‌లోకి మొబైల్ ఫోన్ తీసుకురావడం ఏమటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కరాచీ కింగ్స్ మేనేజర్ ఫైజల్ మీర్జా వివరణ ఇస్తూ.. జట్టు మేనేజర్‌గా పని చేసిన తారిక్ వాసీ ఇలా ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నాలుగ వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా, పెషావర్ జట్టు 191 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. -
కరాచీలో విషాదం.. నలుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. విష వాయువులు పీల్చి నలుగురు మృతి చెందగా.. 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు... కరాచీలోని కేమరీ పోర్టు నుంచి ఆదివారం రాత్రి ఓ కార్గో షిప్ కూరగాయల లోడ్‌తో ఒడ్డుకు వచ్చింది. ఈ క్రమంలో జాక్సన్ మార్కెట్ నుంచి పోర్టుకు చేరుకున్న కొంతమంది వ్యక్తులు షిప్ నుంచి కూరగాయల కంటెనర్లను దించేందుకు ప్రయత్నించారు. అన్లోడ్ చేస్తున్న సమయంలో ఓ కంటెనర్ నుంచి విష వాయువులు వెలువడటంతో వారంతా స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విష వాయువు పీల్చిన కారణంగా నలుగురు వ్యక్తులు మరణించినట్లు వెల్లడించారు. ఇంకో 15 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని.. పాకిస్తానీ నేవీ అధికారుల నుంచి కార్గో షిప్‌నకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. చదవండి: పాక్‌లో టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం ‘ముందు ఉగ్రమూకను ఖాళీ చేయించండి’ -
కొద్దిసేపట్లో పెళ్లి..వధువు కిడ్నాప్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో హిందు మహిళలకు రక్షణ కరువైంది. పెళ్లి పందిట్లో నుంచి ఓ హిందూ వధువును అపహరించుకుని వెళ్లి, మత మార్పిడి చేసి, ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన సంచలనం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మాటియారి జిల్లాలోని హాలా పట్టణంలో 24 ఏళ్ల హిందు యువతి భారతి బాయ్‌ను ముస్లిం యువకుడు, కొందరు రౌడీలతో కలిసి పోలీసుల సహకారంతో పెళ్లి మండపం నుంచి ఎత్తికెళ్లాడు. అనంతరం ఆమెకు బలవంతంగా ఇస్లాం మతాన్ని స్వీకరింపచేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనపై భారతి తండ్రి కిషోర్ దాస్ మాట్లాడుతూ..తమ కుమార్తెకి మతియారా జిల్లా చెందిన వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించామని..కానీ అంతలోనే తమ కూతురిని షారుఖ్ గుల్ అనే ముస్లిం యువకుడు పోలీసుల సహకారంతో కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భారతిని బుష్రాగా పేరు మార్చిన సర్టిఫికేట్‌ను ముఫ్తీ అబూబకర్ సయీద్ఉర్ రెహమాన్ అందజేసినట్లు తెలిసింది. కాగా జాతీయ గుర్తింపు కార్డులో భారతి హాలా నగరానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటుండగా..కానీ తాత్కాలిక చిరునామాలో మాత్రం కరాచీ నగరం గుల్షాన్ ఇక్బాల్‌లో ఉంటున్నట్లు ఉంది. తమ కుమార్తెని నెల ముందే షారుక్ గుల్ మత మార్పిడి చేశాడని భారతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ షారుక్ గుల్ మాత్రం తనకు బుష్రాతో వివాహం అయిందని..హిందు వ్యక్తితో తన భార్య భారతికి ఆమె తల్లి దండ్రులు వివాహం జరిపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సింధు ప్రావిన్స్‌లోని హలాలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హిందు మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కల్పిస్తానన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
లేచిన శవం.. జనం పరుగోపరుగు
కరాచీ: మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో కదలికలు ఏర్పడినట్లు వార్తలు రావడం సహజం. అనేకసార్లు ఈ తరహా వార్తలు మనం వింటూ వచ్చాం. డాక్టర్లు సరిగ్గా పరీక్షించకుండా రోగి మృతిచెందినట్లు ద్రువీకరించడమే ఇలాంటి వార్తలకు కారణంగా మనం భావించవచ్చు. తాజాగా ఇలాంటి సంఘటనే పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను అబ్బాసీ షాహిద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్నివిధాలుగా వైద్యులు చికిత్సనందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రషీదా మృతిచెందినట్లు ఆమె కుటుంబసభ్యులకు మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. తదనంతరం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా రషీదా బీబీ మృతదేహానికి శవాల గదిలో స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా రషీదా లేచి నిలబడింది. దీంతో స్నానం చేయిస్తున్న మహిళ, ఆ గదిలో ఉన్నవారు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. వారు జరిగిన విషయాన్ని రషీదా కుటుంబసభ్యులకు చెప్పడంతో అంతా షాకయ్యారు. డాక్టర్లు వచ్చి ఆమె పల్స్ చెక్ చేసి ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంత్యక్రియల సమయంలో శవం లేచి నిలబడిందనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ఇక ఆపండి చాలు: షోయబ్ అక్తర్
కరాచీ: తాను క్రికెట్ ఆడిన సమయంలో సహచర క్రికెటర్ దానిష్ కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ పాక్తిసాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. అక్తర్ వ్యాఖ్యలకు భారత్‌లోని పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలవగా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జావెద్ మియాందాద్ మొదలుకొని ఇంజమాముల్ హక్, మహ్మద్ యూసఫ్, షాహిద్ అఫ్రిదిలు అక్తర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. దానిష్ కనేరియా హిందూ అనే కారణంగా ఎవరూ అవమానించలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆ వివక్ష భారత్‌లో లేదా అంటూ కూడా అక్తర్‌ను నిలదీశారు. ఇది పెద్ద వివాదంగా మారడంతో అక్తర్ వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. తాను ఏ సందర్భంలో, ఎందుకోసం అన్నానో ముందు తెలుసుకోవాలన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బాధ్యత వహిస్తూ అందుకు సమాధానం కూడా ఇవ్వాల్సి ఉందన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మొత్తంగా మత వివక్ష ఉందని తాను అనలేదని, కేవలం ఒకరో, ఇద్దరో కనేరియాను హిందూ అనే కారణంగా చిన్నచూపు చూసేవారని మాత్రమే తాను పేర్కొనట్లు అక్తర్ తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ మొత్తం పాకిస్తాన్ క్రికెట్లోనే మత వివక్ష ఉందనే విధంగా తాను అన్నట్లు ఆపాదించడం తగదన్నాడు. ‘నేను రెండు రోజులుగా చూస్తున్నా. నా చుట్టూ పెద్ద వివాదాన్ని సృష్టించారు. దాన్ని నేను విన్నాను.. చూశాను కూడా. అది నాకు క్లియర్‌గా అర్థమైంది. అందుకోసమే మరొకసారి మాట్లాడుతున్నా. ఇక విమర్శలు ఆపుతారనే యూట్యూబ్ ద్వారా వివరణ ఇస్తున్నా. నేను యూట్యూబ్ చానల్‌ను ఆరంభించడానికి కారణమే క్రికెట్ టాక్ ద్వారా కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే కాదు.. మన సమాజంలో అభివృద్ధికి సంబంధించి కూడా చెబుతూ ఉంటా. పాక్ క్రికెట్ కల్చర్‌లో ఒక రాయబడలేని ఒప్పందం ఏదైనా ఉందంటే అది మనం ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనే సంగతి. కాకపోతే కొంతమందిలో అలా గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో సంశయం కనబడుతోంది. ఇది మన జట్టు కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా కాదు.. వివక్ష చూపెట్టారని నేను చెప్పింది.. ఒకరో-ఇద్దరో క్రికెటర్ల గురించి మాత్రమే చెప్పా. ఆ బ్లాక్ షీప్స్ ప్రతీ చోట ఉండవచ్చు. అది పాకిస్తానా, ఇండియానా, ఇంగ్లండా, ఐర్లాండా అనేది సమస్య కాదు. దీనికి ఇక్కడితోనైనా ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని అక్తర్ పేర్కొన్నాడు. -
ఆ భేటీ.. నా హృదయాన్ని తాకింది!
కరాచీ: భారత క్రికెట్ జట్టుకు తన దూకుడైన ఆటతో విదేశీ గడ్డపై ఎలా విజయాలు సాధించాలో నేర్పిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సక్సెస్ అవుతాడని పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు ఈ మేరకు తనకు గతంలో గంగూలీతో జరిగిన ఓ భేటీని ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు. తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆప్యాయంగా గంగూలీ పలకరించిన తీరు తన హృదయాన్ని తాకిందని ముస్తాక్ పేర్కొన్నాడు. కేవలం గంగూలీ తనతో 48 నిమిషాల పాటు మంచి-చెడు మాట్లాడిన తీరు ఇప్పటికీ తన మదిలో ఉండిపోయిందన్నాడు. రెండు మోకాళ్లకు ఆపరేషన్ అయి కోలుకుంటున్న తన వద్దకు సౌరవ్ గంగూలీ వచ్చి పరామర్శించడం అతడి గొప్ప హృదయానికి నిదర్శనమన్నాడు. ‘2005-06లో ఇది జరిగింది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా భారత జట్టు ససెక్స్‌తో మూడు రోజుల మ్యాచ్ ఆడుతోంది. ఆ మ్యాచ్‌కు గంగూలీ దూరంగా ఉన్నాడు. అప్పట్లో రెండు మోకాళ్లకు ఆపరేషన్ అయి నేను డిప్రెషన్లో ఉన్నా. క్రికెట్లో పునరాగమనం కోసం వేచి చూస్తుండగా.. బాల్కనీలో ఉన్న గంగూలీ ససెక్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి చాయ్ తాగాం. ఎలా ఉన్నావు.. గాయం మానిందా.. కుటుంబం ఎలా ఉందని అడిగాడు. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. ఆ 40 నిమిషాల భేటీలో గంగూలీ అప్యాయంగా పలకరించాడు. ఇది ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ సక్సెస్ అవుతాడు’ అని ముస్తాక్ ఒక యూట్యూబ్ వీడియోలో తెలిపాడు. -
నసీమ్ షా సరికొత్త రికార్డు
కరాచీ: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన పాకిస్తాన్ చెలరేగిపోయి బౌలింగ్ వేసింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. నసీమ్ షా దెబ్బకు లంకేయులు తమ రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయ్యారు. చివరి మూడు వికెట్లలో రెండు వికెట్లను నసీమ్ షా సాధించడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. కాగా, ఈ క్రమంలోనే నసీమ్ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ఆదివారం ఆటలో చివరి బంతికి దిల్రువాన్ పెరీరాను ఔట్ చేసిన నసీమ్.. ఈ రోజు ఆటలో తొలి బంతికే లసిత్ ఎంబల్దెనియాను పెవిలియన్‌కు పంపాడు. దాంతో హ్యాట్రిక్ సాధించే అవకాశం నసీమ్‌కు వచ్చింది. కాగా, దాన్ని సాధించడంలో నసీమ్ విఫలమైనప్పటికీ, మరొక ఓవర్లో విశ్వ ఫెర్నాండో ఔట్ చేసి ఐదు వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌ను 555/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. షాన్ మసూద్, అబిద్ అలీ, అజహర్ అలీ, బాబర్ అజామ్‌లు సెంచరీలతో మెరిశారు. ఇక శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. -
విజయం దిశగా పాకిస్తాన్
కరాచీ: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో చివరి రోజు మరో మూడు వికెట్లు తీస్తే పాకిస్తాన్ విజయం ఖాయమవుతుంది. 476 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్ ఒశాడ ఫెర్నాండో అజేయ శతకం (102 బ్యాటింగ్; 13 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 395/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 131 ఓవర్లలో 3 వికెట్లకు 555 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ అజహర్ అలీ (118; 13 ఫోర్లు), బాబర్ ఆజమ్ (100 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) శతకాలతో చెలరేగారు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పాక్ తరఫున టాప్–4 బ్యాట్స్‌మెన్ సెంచరీలు (ఆబిద్, మసూద్) చేయడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టుల్లో ఈ ఘనత నమోదవ్వడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో భారత్ (2007లో ఢాకాలో బంగ్లాదేశ్‌పై; దినేశ్ కార్తీక్, వసీమ్ జాఫర్, ద్రవిడ్, సచిన్ సెంచరీలు) ఈ ఘనతను సాధించింది. -
పట్టుబిగించిన పాక్
కరాచి: లేటు వయసు (32 ఏళ్లు)లో టెస్టు అరంగేట్రం చేసిన పాకిస్తాన్ ఓపెనర్ ఆబిద్ అలీ మళ్లీ అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన తన అరంగేట్రం టెస్టులో శతకంతో కదంతొక్కిన అతను... తాజాగా రెండో టెస్టులోనూ సెంచరీ (281 బంతుల్లో 174; 21 ఫోర్లు, సిక్స్)తో ఆకట్టుకున్నాడు. దాంతో ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా ఆబిద్ చరిత్రకెక్కెడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు. అరంగేట్రం చేసిన వన్డే, టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా ఆబిద్ అలీ ఇప్పటికే తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. ఆబిద్‌కు మరో ఓపెనర్ షాన్ మసూద్ శతకం (198 బంతుల్లో 135; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా తోడవడంతో పాకిస్తాన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 104 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 395 పరుగులు చేసింది. దీంతో 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అజహర్ అలీ (57 బ్యాటింగ్; 4 ఫోర్లు), బాబర్ ఆజమ్ (22 బ్యాటింగ్; ఫోర్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 57/0తో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఓపెనర్లు ఆబిద్, మసూద్ శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 278 పరుగులు జోడించారు. పాకిస్తాన్‌కు టెస్టుల్లో తొలి వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అమీర్ సోహైల్– ఇజాజ్ అహ్మద్ (1997) జోడీ ఇదే గ్రౌండ్లో వెస్టిండీస్‌పై నెలకొలి్పన 298 పరుగుల భాగస్వామ్యం తొలి స్థానంలో ఉంది. -
శ్రీలంక 271 ఆలౌట్
కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకకు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 64/3తో ఆట కొనసాగించిన లంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (74) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, దిల్రువాన్ పెరీరా (48) రాణించాడు. పాక్ యువ పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది 77 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, మరో పేసర్ అబ్బాస్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. ఆబిద్ అలీ (32 బ్యాటింగ్), షాన్ మసూద్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. -
పదేళ్ల తర్వాత పాకిస్తాన్లో..
కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి పలు దేశాలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా అక్కడికి పంపించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు శ్రీకారం చుట్టిన తర్వాత ఆ దేశంలో కాస్త మార్పు కనిపిస్తోంది. పాక్‌లో పీఎస్ఎల్లో ఆడటానికి పలువురు విదేశీ క్రికెటర్లు ఆసక్తి కనబరచడం ఒకటైతే, కొన్ని రోజుల క్రితం శ్రీలంక కూడా టీ20 సిరీస్ ఆడటానికి పాక్‌లో పర్యటించింది. అయితే ఈ పర్యటనకు శ్రీలంక స్టార్, సీనియర్ క్రికెటర్లు దాదాపు పది మంది దూరమైనప్పటికీ ‘జూనియర్ జట్టు’నే అక్కడికి పంపించీ మరీ ఎస్ఎల్సీ తమ ఒప్పందాన్ని కొనసాగించింది. కాగా, పాకిస్తాన్లో టెస్టు సిరీస్ జరిగి దాదాపు పదేళ్లు అవుతుంది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను పాకిస్తాన్లో ఆడించాలన్న పీసీబీ కోరిక పరోక్షంగా ఇన్నాళ్లకు నెరవేరింది. తాజాగా పాక్‌లో టెస్టు సిరీస్ ఆడటానికి శ్రీలంక సమాయత్తమైంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా పాక్‌లో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. దాంతో పాక్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇరు జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరుగనుంది. -
కరాచీ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
ఇస్లామాబాద్ : బాలాకోట్ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పట్టుబడిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను పాకిస్తాన్ వైమానిక దళ కేంద్ర స్థానమైన కరాచీలోని మ్యూజియంలో పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పాక్ జర్నలిస్టు అన్వర్ లోధీ శనివారం అర్ధరాత్రి తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అభినందన్ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే బొమ్మను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో అన్వర్ వెల్లడించలేదు. అంతేకాక, అభినందన్ బొమ్మ చేతిలో టీ కప్పు పెడితే ఇంకా బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించారు. -
‘సెంచరీ పూర్తికాకుండా కుట్ర చేశారు!’
కరాచీ: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఓ అవమానకరమైన సంఘటను ఎదుర్కొంది. కరాచీ వేదికగా పాక్-శ్రీలంక మధ్య మంగళవారం రాత్రి రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. పదేళ్ల తరువాత పాక్ గడ్డపై మ్యాచ్ ఆడుతుండటం విశేషం. అయితే శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పలుమార్లు ఫ్లడ్‌లైట్లు మొరాయించాయి. దీంతో పలుమార్లు ఆటకు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో స్టేడియంలో పవర్ కట్ అయ్యిందంటూ నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు. సిటి ఆఫ్ లైట్స్‌గా పేరొందిన కరాచీలో కూడా విద్యుత్ సమస్య ఉందంటూ మరికొంత మంది సెటైర్ వేశారు. లంక ఆటగాడు షేహాన్ జయసూర్య సరిగ్గా 96 పరుగుల వద్ద అవుట్ కావడంతో.. ఫ్లడ్‌లైట్ల కుట్ర కారణంగానే అతను తొలి సెంచరీ కోల్పోయాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ పరిణామం లంక ఆటగాళ్లని తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. 2009లో ఆటగాళ్లపై దాడి అనంతరం తొలిసారి వన్డే సిరీస్ జరుగుతుండంతో పాక్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. -
పాక్ గడ్డపై ‘దాదా’ మీసం మెలేసే!
కరాచీ: దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైన చోట.. సౌరవ్ గంగూలీ ప్రతీ ఒక్క టీమిండియా అభిమాని గర్వించేలా చేశాడు. అవమానాలు ఎదురైన చోటే.. మ్యాచ్ గెలిచి ప్రతీ ఒక్క టీమిండియా అభిమాని కాలర్ ఎగరేసేలా చేశాడు దాదా. ఆ ఉద్విగ్న క్షణాలకు నేటికి 22 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజున కరాచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో గంగూలీ(89), వినోద్ కాంబ్లి(53) రాణించడంతో భారత్ 4 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని అందుకుంది. ఇరుదేశాల మధ్య రాజకీయ సంక్షోభం కారణంగా 1989-90 తర్వాత 1997లో తొలిసారి పాక్‌లో టీమిండియా పర్యటించింది. పాక్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్-పాక్‌ల మూడు వన్డేల సిరీస్‌ను ఇరుదేశాల బోర్డు ఏర్పాటు చేశాయి. అయితే తొలి వన్డే సజావుగా సాగినప్పటికీ.. రెండో వన్డే యద్దవాతావరణాన్ని తలపించింది. మ్యాచ్ మధ్యలో భారత అభిమానులు, క్రికెటర్లే లక్ష్యంగా కొందరు ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు. దీంతో మ్యాచ్‌కు నాలుగు సార్లు అంతరాయం కలిగింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఓడిపోతే దానికి మించి అవమానం మరొకటి ఉండదు. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో సౌరవ్ గంగూలీ తన అసాధరణ ఆటతో గొప్ప విజయాన్ని అందించి యావత్ భారత్ అభిమానులు తలెత్తుకునేలా చేశాడు. పలుమార్లు అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారత్ ముందు 266 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అయితే కీలక బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్(21) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కాంబ్లితో కలిసి గంగూలీ నిర్ణయాత్మకమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ అపూర్వ ఘట్టం జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గంగూలీ అభిమానులు మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక గంగూలీ పాక్ గడ్డపై మరోసారి మీసం మేలేసాడంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. క్లిష్ట సమయాల్లో గంగూలీ ప్రదర్శించే తెగువ అనిర్వచనీయమని మరికొందరు ప్రశంసిస్తున్నారు. -
ఇది ఎప్పుడైనా విన్నారా?: ఐసీసీ
కరాచీ: పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి వన్డే భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కల్గించడం ఆ మ్యాచ్ రద్దయ్యింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 29(ఆదివారం) రెండో వన్డే జరగాల్సి ఉండగా, దాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసింది పీసీబీ. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే అంచనాతో ఆ మ్యాచ్‌ను సోమవారం(సెప్టెంబర్30) నాటికి జరిపింది. అయితే వర్షం కురుస్తుందనే సూచనతో మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేయడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన దైన శైలిలో చమత్కరించింది. ‘ఇలా వర్షం కారణంగా ఒకే వేదికలో జరగాల్సిన ఒక గేమ్ రెండో రోజులు వర్షార్పణం అవుతుందనే విషయాన్ని ఎప్పుడైనా విన్నారా’ అంటూ ట్వీట్ చేసింది. ప్రధానంగా సెప్టెంబర్ 28, 29 తేదీల్లో సైతం వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవుతుందనే విషయాన్ని పీసీబీ ఊహించడాన్ని ఐసీసీ వ్యంగ్యంగానే ప్రశ్నించినట్లే కనబడుతుంది. శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు వన్డేలూ కరాచీ వేదికగా జరగాల్సి ఉంది. శుక్రవారం తొలి వన్డే, ఆదివారం రెండో వన్డే జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్ షెడ్యూల్లో మార్పులు చేసింది పీసీబీ. The second ODI between Pakistan and Sri Lanka at Karachi has been rescheduled from Sunday 29 September to Monday 30 September due to the rain which washed out the first ODI. Have you ever heard of rain so heavy it washes out a game two days away?!https://t.co/ZTIhgcJc1O — ICC (@ICC) September 28, 2019 -
హిందూ విద్యార్ధిని మృతిపై పాక్‌లో భగ్గుమన్న నిరసనలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతంలో హిందూ వైద్య విద్యార్ధిని నమ్రితా చందాని అనుమానాస్పద మృతిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు కరాచీ వీధుల్లో ఆందోళన చేపట్టారు.లర్కానాలోని బబీ అసిఫా డెంటల్ కాలేజీలోని తన హాస్టల్ గదిలో నమ్రితా అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడిఉన్నారు. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని బాధితురాలి సోదరుడు డాక్టర్ విశాల్ సుందర్ పేర్కొన్నారు. లోపలి నుంచి తాళం వేసిన తన గదిలో మంచంపై పడిఉన్న నమిత్రా చందాని మెడకు తాడు బిగించి ఉంది. ఆమె గదికి తాళం వేసి ఉండటంతో సహ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్లో ఇటీవల మైనారిటీలపై దాడులు పెరుగుతున్న క్రమంలో హిందూ విద్యార్ధిని అనుమానాస్పద మృతి చోటుచేసుకోవడం గమనార్హం. -
పాల ధర 140.. పెట్రోల్ కన్నా ఎక్కువ!
కరాచీ: మొహర్రం పర్వదినం సందర్భంగా పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో పాల ధరలు ఆకాశాన్నంటాయి. కరాచీ, సింధు ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో లీటరు పాలకు ఏకంగా రూ. 140 వరకు వసూలు చేశారు. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర కన్నా మించి పాల ధరలు పెరిగిపోవడం గమనార్హం. రెండ్రోజుల కిందట పాక్‌లో లీటరు పెట్రోల్‌కు రూ. 113, లీటరు డీజిల్‌కు రూ. 91 ధర ఉంది. సింధ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో లీటరు పాలకు రూ. 140 వరకు ధర పలికింది. పాలకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడటంతో కరాచీలో రూ. 120 నుంచి 140కి లీటరు పాలు అమ్మినట్టు ఒక దుకాణదారుడు వెల్లడించినట్టు పాక్ మీడియా తెలిపింది. మొహర్రం సందర్భంగా జరిగే ఊరేగింపులో పాల్గొనేవారికి సబీల్స్ (స్టాల్స్) ఏర్పాటుచేసి.. ఉచితంగా పాలు, పళ్లరసాలు, తాగునీరు అందిస్తారు. ఇలా సబీల్స్ కోసం పెద్ద ఎత్తున పాల డిమాండ్ ఏర్పడటంతో కరాచీలో పాల ధరలు అమాంతం చుక్కలనంటాయి. పాల ధర నియంత్రణకు కరాచీ కమిషనర్ ఇఫ్తీకార్ షాల్వానీ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ధరలు ఆకాశాన్నంటినా ఆయన పట్టించుకోలేదని పలు పాక్ పత్రికలు పేర్కొన్నాయి. ఇక,కమిషనర్ కార్యాలయంలోనే లీటరు పాలను రూ. 94లకు అమ్మడం గమనార్హం. -
ముషారఫ్ ఇంట్లో మికా సింగ్.. నెటిజన్ల ఆగ్రహం
కరాచీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేశాక భారత్, పాక్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడమేగాక పాక్‌లో బాలీవుడ్ సినిమాలపై నిషేదం విధించింది. కాగా, పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ పాల్గొన్నారు. ఆయన పాటలు పాడుతుండగా పలువురు హుషారుగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పాకిస్తాన్‌లోని చాలామందికి నచ్చలేదు. దీంతో ఇరుదేశాల నెటిజన్లు ఈ వీడియోపై ట్విటర్లో యుద్ధం చేసుకుంటున్నారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్టు నైలా ఇనాయత్.. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘జనరల్ పర్వేజ్ ముషారఫ్ బందువుల ఫంక్షన్లో ఓ భారత సింగర్ ప్రదర్శన ఇచ్చారు. సంతోషం.. అదే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో ఇది జరిగి ఉంటే?.. అంటూ ప్రశ్నించారు. అలాగే ఓ పాకిస్తానీ ట్వీట్ చేస్తూ.. ‘ఒక పక్క ఇండియా చేతిలో కశ్మీర్ పతనం అవుతోంది. మరో పక్క కరాచీలో భారత కళాకారుడు ప్రదర్శనలు ఇస్తున్నాడు. నయా పాకిస్తాన్ అంటే ఇదేనేమో!’ అని కామెంట్ చేశారు. ‘బాలీవుడ్ సినిమాలు బ్యాన్ చేశారు. భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపేశారు. పాక్ గగనతలంలో భారత విమానాల రాకపోకలను నిషేధించారు. సరే.. విమానాలు రద్దు అయితే, వీసాలు ఇవ్వకుంటే వాళ్లు ఎలా పాక్ వచ్చారు. ఎందుకంటే ఈ నయా పాకిస్తాన్ ఓ షేమ్ పాకిస్తాన్’ అని ఆ నెటిజన్ మండిపడ్డాడు. దీనిపై భారత నెటిజన్లు స్పందిస్తూ.. ‘రాజకీయం వేరు.. కళలు వేరు.. కళలకు హద్దులు లేవు’ అని పేర్కొంటున్నారు. -
న్యూస్ యాంకర్ దారుణ హత్య
కరాచీ : వ్యక్తిగత తగాదాలకు ఓ న్యూస్ యాంకర్ బలయ్యాడు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరాచీకి చెందిన మురీద్ అబ్బాస్ అనే వ్యక్తి బోల్ న్యూస్ అనే ఛానల్లో పనిచేస్తున్నాడు. ఇతడికి అదేప్రాంతానికి చెందిన అతిఫ్ జమాన్‌తో వ్యక్తిగత తాగాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అబ్బాస్‌పై అతిఫ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అబ్బాస్‌ను చంపాలని నిశ్చయించుకున్నాడు. మంగళవారం సాయంత్రం ఖయాబన్-ఈ-బుఖారి ఏరియాలోని ఓ కేఫ్‌లో ఉన్న అబ్బాస్‌పై.. అబ్బాస్ స్నేహితుడు ఖైజర్ హయాత్‌పై అతిఫ్ గన్నుతో కాల్పులు జరిపి, అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడి వారు గాయపడిన స్నేహితులిద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఛాతి, పొట్టకింద బుల్లెట్లు దూసుకుపోయిన కారణంగా అబ్బాస్ చికిత్స పొందుతూ మరణించగా ఖైజర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా అతిఫ్ కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేయటానికి ఇంటికి వెళ్లారు. దీంతో పోలీసులను చూసి భయాందోళనకు గురైన అతిఫ్ గన్నుతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించటం గమనార్హం. దీనిపై ఐజీపీ(సింధ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఖలీమ్ ఇమామ్ మాట్లాడుతూ.. హత్య జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని ఆధారాలు సేకరించటానికి ఫోరెన్సిక్ దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేసుకు సంబంధించిన నివేదిక అందజేయాలని కోరారు. -
పాకిస్తాన్‌లోనే అండర్ వరల్డ్ డాన్
న్యూఢిల్లీ : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకుంటున్నట్లు ఆధారాలు లభించాయి. దావూద్ పాక్‌లోనే ఉన్నాడన్న భారత్ ఆరోపణలను దాయాది దేశం పదే పదే ఖండించినప్పటికీ, అతడు పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్నట్లు జీ-న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. గత 25 ఏళ్లుగా పరారీలో ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు, డి-కంపెనీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్న జబీర్ మోతీవాలాను దావూద్ కలిసినట్లుగా ఉన్న ఫోటోలు లభించినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను జీ న్యూస్ విడుదల చేసింది. ఇందులో క్లీన్‌షేవ్‌లో ఉన్న దావూద్‌ను మనం చూడవచ్చు. నిజానికి అతడు మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చినా.. ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం ప్రకారం... మోతీవాలా కరాచీలోని దావూద్ ఇళ్లు క్లిఫ్టన్ హౌస్ పక్కనే నివసిస్తున్నాడు. అతను దావూద్ భార్య మెహజబిన్, అతని కుమారుడు మొయిన్ నవాజ్‌లతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు.కాగా వ్యాపారవేత్త ముసుగులో మోతీవాలా దోపిడీలకు పాల్పడటంతో పాటుగా.. హెరాయిన్ స్మగ్లింగ్ చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఎఫ్‌బీఐ అతడిని అరెస్టు చేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ స్కాట్లాండ్ యార్డ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతీవాలా కేవలం వ్యాపారవేత్త మాత్రమేనని, అతడిని అమెరికా ప్రభుత్వానికి అప్పగించలేమని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో దావూద్‌తో కలిసి అతడు కరాచీలో ఉన్నట్లుగా వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో దావూద్ ఉనికి గురించి మోతీవాలా ఇప్పటికే వెల్లడించినట్లు ఎఫ్‌బీఐ సంస్థ తెలిపింది.మోతీవాలా దావూద్ కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి గనుక అతడి వద్ద డి-కంపెనీ డాన్ గురించి అతని దగ్గర చాలా కీలకమైన సమాచారం ఉంటుందనే నేపథ్యంలో .. డి-కంపెనీ కార్యకలాపాలపై ఎఫ్‌బీఐని సంప్రదించడానికి భారత ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి. కాగా ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రకారం.. ‘మోతీవాలా 10సంవత్సరాలుగా యూకే వీసాతో అక్కడ ఉంటున్నాడు. ఇది 2028తో ముగియనుంది. అయితే గత కొన్ని నెలలుగా అతడు తనతో పాటు కుటుంబ సభ్యులకు ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్ కంపెనీలో 2 మిలియన్ డాలర్లు జమ చేశాడు’ అని వెల్లడైంది. అయితే దావూద్‌కు పరోక్షంగా సహకరిస్తున్న పాకిస్తాన్.. మోతీవాలాను కాపాడేందుకు యత్నిస్తోంది. మోతీవాలాపై ఎఫ్‌బీఐ మోపిన అభియోగాలను లండన్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనం. మోతీవాలా ఒక గౌరవ వ్యాపారవేత్త అని, అతడికి డి-కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ హైకమిషన్ పేర్కొంది. అంతేగాక ఈ మేరకు యూకే వెస్ట్‌మినిస్టర్ కోర్టులో న్యాయమూర్తికి లేఖ ఇచ్చింది. ఈ విషయాలన్నీ నిశితంగా పరిశీలించినట్లైతే మోతీవాలా అరెస్టుతో దావూద్ ఆచూకీ బహిర్గతం అవుతుందని పాక్ ఎంతగా వణికిపోతుందో అర్థమవుతోంది. ఇక మోతీవాలా ఆచూకీ కనుగొనేందుకు ఎఫ్‌బీఐ అతడితో హెరాయిన్ ఒప్పందం కుదుర్చుకుని ట్రాప్ చేసిన సంగతి తెలిసిందే. దావూద్, మోతీవాల వ్యవహారాలకు సంబంధించి ఇన్ని ఆధారాలు లభించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం వారిని వెనకేసుకురావడం చూస్తుంటే ఉగ్రవాదుల పట్ల దాయాది దేశం వైఖరేంటో స్పష్టంగా తెలుస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాకిస్తాన్లో భారత జాలర్ల అరెస్ట్
కరాచీ : తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ 34 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసింది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన భారత జాలర్లతో పాటు ఆరు బోట్లను సీజ్ చేశామని మారిటైమ్ సెక్యూరిటీ ప్రతినిధి వెల్లడించారు. జాలర్లను స్ధానిక డాక్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. వారి జ్యుడిషయల్ రిమాండ్ కోసం మేజిస్ర్టేట్ ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ భారత జాలర్లను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ .ఏడాది జనవరిలో ఐదుగురు గుజరాత్ బోట్స్‌మెన్‌లను అరెస్ట్ చేసిన పాక్ అధికారులు వారిని జైలులో ఉంచారు. కాగా గత నెలలో కరాచీలోని లంధి, మలిర్ జైళ్ల నుంచి పాక్ ప్రభుత్వం 250 మందికి పైగా భారత జాలర్లను విడుదల చేసింది. మరోవైపు నాలుగు విడతలుగా 360 మంది భారత జాలర్లను విడుదల చేస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో వెల్లడించింది. -
పాక్‌లో మన కరెన్సీ ప్రింటింగ్!
భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపుతున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ.. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో దొరికిన కరెన్సీ అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాక్‌లోని బలూచిస్తాన్ లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ‘భారత్ పవర్ ప్రెస్’ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ముద్రితమైన నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నా.. అసలు నోట్లపై ఉండే కొన్ని భద్రతా ప్రమాణాలను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. – సాక్షి, హైదరాబాద్ రూటు మార్చి భారత్‌కు.. క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్సిల్స్ ద్వారా పలు మార్గాల్లో భారత్‌కు వస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలకు తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జలమార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకుల పేరుతో వచ్చేవి. కొన్నాళ్లుగా ఈ మా ర్గం ద్వారా తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణీ చేయిస్తోంది. క్వాలిటీతో పాటే పెరిగిన కమీషన్ కరాచీ నుంచి మాల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడి రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఇటీవల ఏజెంట్లకు ఇచ్చే ఈ కమీషన్ పెరిగింది. నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలో కమీషన్ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు, మాల్దాకు చెందిన బబ్లూ రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చే నిధులను పాకిస్తాన్ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలు ఉన్నాయి. చిక్కిన గౌస్.. పరారీలో బబ్లూ.. బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్ నుంచి పలు మార్గాల్లో హైదరాబాద్‌కు తెప్పించి చెలామణీ చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేశాడు. బబ్లూ గౌస్‌తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. బబ్లూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు గమనించుకోవాలి.. 1. సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటుకు ముందు వైపు మధ్యలో కుడివైపుగా నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. దీనికి కుడివైపున నోటు లోపలకు, బయటకు కనిపిస్తూ చిన్న పట్టీ ఉంటుంది. సిల్వర్ బ్రోమైడ్తో తయారయ్యే దీనిపై ఆర్బీఐ అంటూ ఆంగ్లం, హిందీ భాషల్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీపై ఆర్బీఐ మార్క్ ఉన్నా.. ఈ థ్రెడ్ సిల్వర్ కోటెడ్ అయి ఉండి, ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుంది. 2. బ్లీడ్ లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే రూ.2 వేల కరెన్సీ నోటుకు కుడి, ఎడమ వైపుల్లో పైభాగంలో కొన్ని గీతలు ఉంటాయి. బ్లీడ్ లైన్స్‌గా పిలిచే ఇవి కాస్త ఎత్తుగా, ఒక్కో వైపు ఏడు చొప్పున ఉంటాయి. సాధారణ నోటును చేతితో తడిమితే ఇవి తగులుతాయి. నకిలీ నోట్లలో ఈ ఫీచర్‌ను కాపీ చేయడం సాధ్యం కాదు. నకిలీ నోట్లపై కూడా లైన్లు ఉన్నా అవి చేతికి తగిలేలా పైకి ఉండవు. 3. వాటర్ మార్క్ కరెన్సీ నోటుకు ముందు భాగంలో కుడి వైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది. పైకి కనిపించని విధంగా గాంధీ బొమ్మ ఉంటుంది. దీనికి పక్కగా ఆ నోటు విలువ వేసి ఉంటుంది. ఈ వాటర్ మార్కును వెలుతురులో పెట్టిచూస్తే అందులోనూ గాంధీజీ ఫొటో కనిపిస్తుంటుంది. దాదాపు సగం ప్రాంతానికి సరిపోతూ ఉంటుంది. నకిలీ నోట్లలోనూ ఈ వాటర్‌మార్క్‌లో గాంధీజీ ఫొటో ఉన్నా.. దాని చుట్టూ ఖాళీ ఎక్కువగా ఉంటుంది. -
కరాచీ బేకరీపై పుల్వామా దాడి ఎఫెక్ట్
బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్రవాదన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత సినీ ఇండస్ట్రీ కూడా పాక్ కళాకారులపై నిషేధం విధించింది. చివరికి నదీ జలాలను కూడా ఆపేశారు. ఇక పాక్ వ్యక్తులను, పేర్లను, అనుకూలమైన వారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (బుద్ధి చూపించుకున్న పాక్) తాజాగా పుల్వామా దాడి ప్రభావం కరాచీ బేకరీపై పడింది. బేకరీ పేరులో పాకిస్తాన్‌కు చెందిన పట్టణం ‘కరాచీ’ ఉందంటూ ఆ బేకరీ ముందు పలువురు ఆందోళనలు చేశారు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ క్రమంలో తాము పాకిస్తాన్‌కు చెందిన వాళ్లం కాదని భారతీయలమే అంటే బేకరీ యాజమాన్యం ఆందోళనాకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఎంత చెప్పిన వినకపోవడంతో బేకరీ పేరులోని కరాచీ కనపడకుండా క్లాత్‌తో కప్పివేశారు. అంతేకాకుండా బేకరీపై మువ్వన్నెల జెండా కూడా ఎగిరేశారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. (పాక్‌ను తప్పించడం సాధ్యం కాదు) 1953లో హైదరాబాద్ వేదికగా కరాచీ బేకరీ దేశ విభజన సమయంలో ఖాన్ చంద్ రమణి అనే వ్యక్తి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 1953లో ఆయన హైదరాబాద్ వేదికగా కరాచీ బేకరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధిపొందినది. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కరాచీ పేరుని పాకిస్తాన్‌తో లింక్ చేయడం పట్ల వ్యాపారులు విస్మయం చెందుతున్నారు. కరాచీ పేరుకి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబందం లేదని వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (పాక్‌తో భారత్ ఆడకుంటే నష్టమేనా?) -
పాక్‌లో ఉగ్ర బీభత్సం
కరాచీ/బీజింగ్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలోని చైనా కాన్సులేట్‌పై శుక్రవారం దాడికి దిగిన సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులను అక్కడి భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు.. మొత్తం నలుగురు మరణించగా చైనాకు చెందిన కాపలాదారుడు గాయపడ్డారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి పెను విధ్వంసం సృష్టించడమే ఆ ఉగ్రవాదుల లక్ష్యమని తెలుస్తోంది. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద ఆయుధాలతోపాటు ఆహార పదార్థాలు, ఔషధాలు ఉండటంతో చైనీయులను బందీలుగా చేసుకోవడం వారి ప్రణాళికలో భాగమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దాడి తమ పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)కు, బలూచిస్తాన్‌లో చైనా సైనిక కార్యకలాపాల విస్తరణకు తాము వ్యతిరేకమని బీఎల్ఏ గతంలో పేర్కొంది. దాడి నేపథ్యంలో పాక్‌లో సీపీఈసీ కోసం పనిచేస్తున్న వేలాది మంది చైనీయులకు రక్షణ పెంచాలని పాక్‌ను చైనా కోరింది. గేటు బయటే భద్రతా దళాలు ముగ్గురు ముష్కరులను అంతమొందించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. గ్రెనేడ్లు, ఏకే–47 తుపాకులతో.. కరాచీలోని ఖరీదైన, ప్రముఖ ప్రాంతం క్లిఫ్టన్ ఏరియాలో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రముఖులు కూడా నివాసం ఉంటారు. వివిధ దేశాల కాన్సులేట్లు/రాయబార కార్యాలయాలతోపాటు కరాచీలో పేరుగాంచిన పాఠశాలలు, రెస్టారెంట్లు ఇక్కడే ఉంటాయి. మొత్తం 9 హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే–47 తుపాకులు, భారీ సంఖ్యలో బుల్లెట్లు, తుపాకీ మేగజీన్లు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు ఓ వాహనంలో చైనా కాన్సులేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వాహనం నుంచి దిగి, కాన్సులేట్ బయట ఉన్న సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఇద్దరు పోలీసులతోపాటు అక్కడ ఉన్న ఓ బాలుడు, అతని తండ్రి కూడా ఈ కాల్పుల్లో చనిపోయారు. అనంతరం కాన్సులేట్ గేటు వైపుకు ఉగ్రవాదులు వస్తుండగా కార్యాలయం వద్ద ఉన్న ప్రజలు, సిబ్బందిని వెంటనే భద్రతా దళాలు లోపలకు పంపించి తలుపులు మూశాయి. తర్వాత పారామిలిటరీ దళాలు ఉగ్రవాదాలపై కాల్పులు ప్రారంభించి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం మృతదేహాల వద్ద తనిఖీలు చేయగా భారీ సంఖ్యలో ఆయుధాలు, ఆహార పదార్థాలు, ఔషధాలు లభించాయి. చనిపోయిన ఉగ్రవాదులు తమ వారేనని బీఎల్ఏ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ‘చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. తమ ప్రాణాలను అర్పించి ఉగ్రవాదుల విజయాన్ని అడ్డుకున్న భద్రతా సిబ్బంది ధైర్యానికి నా సెల్యూట్’ అని ఖాన్ ట్వీట్ చేశారు. మార్కెట్లో ఆత్మాహుతి దాడి... 32 మంది మృతి పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్క్వా ప్రావిన్సులో ఉగ్రవాదులు శుక్రవారం రెచ్చిపోయారు. ఒరక్జై గిరిజన జిల్లాలో షియాల పవిత్రస్థలమైన ఇమామ్బర్ఘా వద్ద రద్దీగా ఉన్న జుమ్మా మార్కెట్ లక్ష్యంగా ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సిక్కు వ్యాపారస్తులు సహా 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నిదుస్తులు కొనేందుకు ప్రజలు శుక్రవారం భారీగా మార్కెట్‌కు చేరుకున్నవేళ ఈ దాడి చోటుచేసుకుంది. ఈ విషయమై జిల్లా డీసీపీ ఖలీద్ ఇక్బాల్ మాట్లాడుతూ..‘మార్కెట్లో కూరగాయలున్న ఓ బైక్‌కు బాంబును అమర్చిన ఉగ్రవాది రిమోట్ కంట్రోల్ సాయంతో వాహనాన్ని పేల్చివేశాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిక్కు వ్యాపారులు సహా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది షియాలే ఉన్నారు’ అని తెలిపారు. ఉగ్రవాదుల్ని అణచివేస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. దాడిని ఎదిరించిన ధీర వనిత సుహాయ్ సింధ్ ప్రావిన్సుకు చెందిన ఆ అధికారిణి పూర్తి పేరు సుహాయ్ అజీజ్ తాల్పూర్. నాణ్యమైన విద్య కోసం ఆమెను చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే సంప్రదాయాలను ధిక్కరిస్తున్నారంటూ వారి బంధువులు ఆమె కుటుంబంతో మాట్లాడటం మానేశారు. ఈ వెలివేతతో ఆమె కుటుంబం వేరే ఊరికి వలసవెళ్లింది. బీకాం పూర్తి చేసిన ఆమె 2013లో పాక్ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ ఉద్యోగ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి పోలీసు శాఖలో ఉన్నతాధికారిణిగా ఉద్యోగం పొందింది. కాన్సులేట్‌పై దాడిని అడ్డుకున్న భద్రతా దళాల బృందానికి ఆమె నాయకత్వం వహించింది. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టి ధీర వనితగా నిలిచింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
ఆ రెస్టారెంట్లో కుళ్లిన మాంసంతో వంటకాలు!
ఇస్లామాబాద్ : కరాచీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత ఇద్దరు మృతి చెందిన ఘటన పాకిస్తాన్లో కలకలం రేపింది. సదరు అరిజొనా గ్రిల్ రెస్టారెంట్‌పై అధికారులు జరిపిన దాడుల్లో కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015లోనే గడువుతీరిన ప్యాకేజ్డ్ మాంసాన్ని, పానీయాలను దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ వెల్లడించింది. కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ప్రాంతంలోని ఈ రెస్టారెంట్ తమ కస్టమర్లకు పాచిపోయిన మాంసాన్ని వడ్డించిందని, అధికారుల దాడుల్లో 80 కిలోల కుళ్లిపోయిన మాంసం బయటపడిందని సింధ్ ఫుడ్ అథారిటీ డైరెక్టర్ అబ్రార్ షేక్ తెలిపారు. హోటల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఇటీవల అధికారులు ఈ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేసినట్టు డాన్ కథనం వెల్లడించింది. ఈ రెస్టారెంట్లో ఆహారం తీసుకున్న ఇద్దరు మైనర్ల మృతికి కారణం వెల్లడికాకున్నా ఫుడ్ పాయిజన్‌తోనే వీరు మృత్యువాత పడ్డారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు హోటల్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
కరాచీ బేకరీ స్వీట్స్‌లో పురుగులు
సాక్షి, హైదరాబాద్: పండుగ రోజు షాకింగ్ న్యూస్. దీపావళి అంటేనే స్వీట్స్‌కు ప్రత్యేకం. బిజీబిజీ గందరగోళ జీవితంలో పండుగలకు, పబ్బాలకు స్వీట్ షాప్‌లు, బేకరీలపైనే ఆధారపడటం నగరవాసులకు తప్పనిసరి. అందులోనూ పేరున్న షాపులను ఎంచుకోవడం కూడా పరిపాటి. అయితే అలాంటి పెద్ద పేరున్న కంపెనీల్లోనే చెడిపోయిన, అనారోగ్యకరమైన పదార్థాలను వినియోగదారులకు అంటగడితే.. వినియోగదారుల పరిస్థితి బెంబేలే. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే హైదరాబాద్ కస్టమర్‌కు ఎదురైంది. అతి పెద్ద పేరున్న కరాచీ బేకరిలో. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కరాచీ బేకరీనుంచి దీపక్ అనే వినియోగదారుడు చాకొలెట్ స్వీట్లు కొనుగోలు చేశారు. తీరా ఇంటికెళ్లి పరిశీలిస్తే...పురుగులు పలకరించాయి. దీంతో దీపక్ ఫ్రెండ్ దోనితా జోష్ ట్విటర్లో పోస్ట్ చేశారు. హ్యాపీ వార్మీ దివాలీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమీషనర్ హరిచందన ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. కలుషితమైన స్వీట్లు ఇచ్చినట్టుగా తేలిందనీ, నిబంధనలను ఉల్లంఘించినందుకు బేకరీ యజమానికి 25వేలరూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా హైదరాబాద్ 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐకానిక్ కరాచీ బేకరీ అంటే హైదరాబాదీయులకు ఎనలేని నమ్మకం. కానీ ఇదే ఆరోపణలతో, నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 2014లో, బంజారా హిల్స్ బేకరీ ఔట్‌లెట్‌ను అధికారులు మూసివేయడం గమనార్హం. అలాగే కేవలం రెండు నెలల క్రితం, హైదరాబాదులోని ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఐకియా షోరూంలోని రెస్టారెంట్ బిర్యానీలో గొంగళి పురుగు కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. Happy wormy Diwali from @KarachiBakery Found these worms in at least 4 chocolate pieces. They even move... Not sure how many batches are even impacted by this 😞@GHMCOnline pic.twitter.com/nwK7So1Z8y — Donita Jose (@DonitaJose) November 6, 2018 #TeamGHMC Penalty imposed & samples of the same collected pic.twitter.com/I38tOIbhRa — Musharraf Faruqui (@musharraf_ias) November 6, 2018 -
ఆటో డ్రైవర్ అకౌంట్లో రూ.300 కోట్లు!
కరాచీ : ఆయన ఓ ఆటో డ్రైవర్ కానీ ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేంటీ అన్ని కోట్ల రూపాయలు ఉండి ఆటో తోలాల్సిన అవసమేముంది అనుకుంటున్నారా..? అంత డబ్బు తన దగ్గర ఉందని ఆయనకే తెలియదు పాపం. దర్యాప్తు సంస్థ అధికారులు నుంచి ఫోన్‌కాల్ రావడంతో అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. పాకిస్తాన్‌లోని కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. రషీద్‌ను తమ కార్యాలయానికి పిలిపించిన ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) ఈ విషయంపై ఆరా తీసింది. అయితే, తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని ఆ డ్రైవర్ అంటున్నాడు. విచారణ అనంతరం రషీద్ మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను ఎఫ్ఐఏ కార్యాలయానికి రమ్మంటే వెళ్లాను. నేను చాలా భయపడిపోయాను. అధికారులు నా అకౌంట్ వివరాలు చూపెడుతూ దాని ద్వారా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు.అది విని ఆశ్చర్యానికి గురయ్యాను. నేను 2005లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేశాను. ఆ సమయంలో బ్యాంకు ఖాతా తెరిచాను. నా జీతం డబ్బులు అందులో వేసేవారు. కొద్ది నెలల తర్వాత నేను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాను. నా జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. ఇప్పటికీ నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నా ఖాతాను ఎవరో ఉపయోగించుకుని లావాదేవీలు జరిపారు. ఈ విషయాలన్నింటినీ అధికారులకు చెప్పాను’ అని రషీద్ తెలిపారు. కాగా, కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్లో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కరాచీలో ఉన్న ఓటిఫిన్ సెంటర్ యనమానీ అకౌంట్లో ఆయనకు తెలియకుండానే రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ లావాదేవీలు ఎవరు జరిపారనే అంశంపై ఎఫ్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. -
వైరల్ ఫోటో ; మండిపడుతోన్న నెటిజన్లు
ఇస్లామాబాద్ : గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటో చూసిన జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే ఒక ఎద్దును క్రేన్ సాయంతో మూడంతుస్తుల భవనం మీద నుంచి కిందకు దించుతున్నారు. ప్రమాదంలో ఉన్న దాన్ని కాపాడటం కోసం కిందకు దించుతున్నారనుకుంటే పోరపాటే. ఎందుకంటే వారు ఆ ఎద్దును త్యాగం(వధించడం) కోసం తీసుకోస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఒకరు తీసిన ఈ ఫోటో గురించే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. వివరాల ప్రకారం మరికొద్దిరోజుల్లో ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ అల్ అధా/బక్రీద్ పండుగ సందర్భంగా కరాచీకి చెందిన ఒక వర్తకుడు తన ఎద్దును స్థానిక పశువుల సంతలో అమ్మాలనుకున్నాడు. అందుకోసం తన మూడంతుస్తుల బిల్డింగ్ మేడ మీద ఉన్న ఎద్దును క్రేన్ సాయంతో కిందకు దించుతున్నాడు. అందులో భాగంగా ఎద్దును తాళ్లతో బంధించాడు. దాని మూతిని కూడా తాడుతో కట్టి క్రేన్‌తో కిందకు దించాడు. అంతేకాక దాని కొమ్ములకు పాకిస్తాన్ జెండాలను కట్టాడు. ఈ ఫోటో చూసిన జంతు ప్రేమికులు.. ‘క్రూరమైన చర్య’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘నువ్వు శాఖాహారివి కాబట్టే జంతు సంరక్షణ అంటూ మాట్లాడుతున్నావు. అయితే నీ మాటలను ఎవరూ పట్టించుకోరు. జీవహింస అంటూ కూర్చుంటే ఇంత రుచికరమైన మాంసం ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈద్ అల్ అధా/ బక్రీద్‌ను ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ రోజే ఇబ్రహీం ప్రవక్త తన కుమారిన్ని బలి ఇవ్వడానికి సిద్దపడ్డారు. అందుకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ నెల 22న బక్రీద్‌ను జరుపుకోనున్నారు. -
స్టెప్పులేసి అక్కడున్న వారిని అలరించాడు
-
చిందులతో చించేశాడు.. వైరల్
ఒక్క ఫోటో లేదా ఒక్క వీడియో చాలూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోడానికి. పాకిస్థాన్‌కు చెందిన ఓ కుర్రాడు కూడా ఇప్పుడు అలాంటి పనే చేసి హాట్ టాపిక్‌గా మారిపోయాడు. 6.8 మిలియన్‌పైగా వ్యూవ్స్‌తో ఆ వీడియో దూసుకుపోతోంది. అతను చేసిన పని అలాంటిది మరి... కరాచీలోని హైపర్స్టార్ మాల్.. మెహ్రోజ్ బైగ్ అనే విద్యార్థి ఫార్మల్ వేర్లో అక్కడికొచ్చాడు. ఇంతలో పంజాబీ సెన్సేషన్ హిట్ సాంగ్ ‘లాంగ్ లాచీ’ ప్లే అయ్యింది. అంతే బైగ్.. స్టెప్పులేసి అక్కడున్న వారిని అలరించాడు. అతని డాన్సులకు ముగ్దుడైపోయిన ఓ పెద్దాయన కూడా బైగ్తో జత కలిశాడు. లయబద్ధంగా ఎక్స్ప్రెషన్లతోసహా బైగ్ ఇచ్చిన మూమెంట్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. మెహ్రోజ్ వీడియో ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. కొత్తేంకాదు.. మెహ్రోజ్ బైగ్‌కు ఇదేం కొత్త కాదు. అయితే అతనికి ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది. గతంలో తీస్మార్ ఖాన్ చిత్రంలోని షీలాకీ జవానీ పాటకు కత్రినా టైపులోనే ఈ కుర్రాడు స్టెప్పులేసి ఆకట్టుకున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. అంతేకాదు అతనికి 1700 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్ కూడా ఒకటి ఉంది. -
స్టన్నింగ్ బంతులతో బిత్తరపోయారు
సాక్షి, స్పోర్ట్స్ : పాకిస్థాన్ జట్టు మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది బంతితో తన సత్తా చాటాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాళ్లను తన లెగ్ స్పిన్‌తో బెంబేలెత్తించాడు. అద్భుత బంతులతో మూడు కీలక వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం దుబాయ్‌లో ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కరాచీ జట్టు 188 పరుగులు సాధించింది. తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముల్తాన్ జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అఫ్రీది బౌలింగ్‌తో బరిలోకి దిగాక మ్యాచ్ సమీకరణాలు మొత్తం మారిపోయాయి. పోలార్డ్, షోయబ్ మాలిక్, సైఫ్ బాబర్ వంటి కీలక బ్యాట్స్ మన్లను పెవీలియన్‌కు చేర్చాడు. ముఖ్యంగా పోలార్డ్.. అఫ్రీది వేసిన బంతి స్వింగ్ అయి వికెట్లను తాకటంతో ఆశ్చర్యపోయాడు. అఫ్రీది నాలుగు ఓవర్లలో(ఒక మెయిడెన్) కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి సుల్తాన్స్ జట్టు దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ దఫా పీఎస్ఎల్ లో అఫ్రీది బ్యాటింగ్ కన్నా బౌలింగ్ తోనే రాణిస్తుండటం విశేషం. అఫ్రీది క్షమాపణలు... ఆల్ రౌండర్ సైఫ్ బాదర్ ను అవుట్ చేశాక అఫ్రీది కాస్త దురుసుతనం ప్రదర్శించాడు. అనుచిత వ్యాఖ్యలు చేయటంతో సోషల్ మీడియాలో ఈ సీనియర్ ఆటగాడి తీరుపై విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ బాదర్ ఈ వీడియోకు స్పందిస్తూ... ఇప్పటికీ నువ్వంటే ఇష్టం షాహిద్ భాయ్ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో బాదర్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు అఫ్రీది ప్రకటించటంతో వివాదానికి తెర పడింది. One of the best balls of the Pakistan Super League. Shahid Afridi to Kieron Pollard #PSL2018 #KKvMS pic.twitter.com/HtYI3BjMeC — Saj Sadiq (@Saj_PakPassion) 10 March 2018 Shahid Afridi's send off to young Saif Badar. There's a lot of discussion going around regarding it, What's your thought on it..? #MSvKK #KKvMS pic.twitter.com/WV4fEoaeEs — Saad IU/LQ 🇵🇰 (@SaadAwais22) 10 March 2018 -
ఈయన మన గాంధీ తాత కాదు..
కరాచీ : మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంటారు. అయితే ఈ ఫొటో చూస్తే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తోంది. ఈ ఫొటోలో ఉన్నది మన జాతిపిత మహాత్మా గాంధీ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఈయన గాంధీని పోలిన ఓ పాకిస్థాన్ వృద్ధుడంటా.. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన అసిమ్ రజాక్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ‘భారత జాతిపిత కరాచీ మొబైల్ మార్కెట్లో కన్పించాడని’ ట్వీట్ చేశాడు. తలపై టోపీ, వంటిపై దుస్తులు తప్ప ముఖం, అద్దాలు చూస్తే ఈ పెద్దాయన అచ్చం గాంధీలా ఉన్నాడు కదా.! అయితే ఇది నిజంగా కరాచీ వ్యక్తికి చెందినదా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. #MahatamaGandhi found in Karachi Mobile Market ;) #Gandhi #Indians #KulbhushanJadhav pic.twitter.com/pSIm68M8JV — ASIM RAZZAQ (@asimnoori) December 25, 2017 -
డీ గ్యాంగ్‌లో సంక్షోభం
ఇస్లామాబాద్ : ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితులు.. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న చోటా షకీల్ కొన్నాళ్లుగా కరాచీలో ప్రత్యేకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విబేధాల వల్ల దావూద్‌ను చోటా షకీల్ కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని చీకటి సామ్రాజ్యంలో గుసగులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు ఒక రిపోర్ట్ ద్వారా బయటకు తెలిసింది. వీరిద్దరూ విడిపోతే భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించలేమని ఐఎస్ఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు మూడు దశాబ్దాలుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చోటా షకీల్ అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దావూద్ కుడి భుజంగా చోటాషకీల్ను డీ గ్యాంగ్ పిలుచుకుంటారు. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం వల్ల ఇద్దరి మధ్య విభేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. డీ గ్యాంగ్ నిర్వహణలో అనీస్ జోక్యం పెరిగిపోవడంతో చోటా షకీల్ దావూద్‌తో విభేధించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో చోటా షకీల్ తాజాగా తూర్పు ఆసియా దేశాల్లోని ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఇదిలాఉండగా.. చోటా షకీల్-దావూద్ ఇబ్రహీం మధ్య తిరిగి సయోధ్య నెలకొల్పేందుకు ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. డీ గ్యాంగ్ సహకారం వల్ల అప్పట్లో ముంబై వరుస బాంబు పేలుళ్లు పాకిస్తాన్ తెగబడింది. ఈ నేపథ్యంలోనే వారిని కలిపేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
అమృత్సర్-లాహోర్ మధ్య వ్యాపారం ఉండకూడదా?!
సాక్షి, అమృత్సర్ : పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమృత్సర్-లాహోర్ మధ్య వ్యాపార సంబంధాలపై సిద్ధూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పో సందర్భంగా.. సిద్ధూ కేంద్రప్రభుత్వం విమర్శలకు దిగారు. సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై-కరాచీ మధ్య ట్రేడ్ పార్టనర్ షిప్ ఉన్నపుడు లాహోర్-అమృత్సర్ మధ్య ఉంటే తప్పేంటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోకు పాకిస్తాన్ వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకే పంజాబ్ ఎక్స్పో 12 సార్లు జరగ్గా.. పాకిస్తాన్ వ్యాపరవేత్తలు ఇందులో పాల్గొనకపోవడం వరుసగా రెండో ఏడాది అని ఆయన గుర్తు చేశారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోకు పాకిస్తాన్ వ్యాపారులను అనుమతివ్వడానికి ఎటవంటి ప్రత్యేక కారణాలు లేకపోయినా.. కేంద్రం మాత్రం మొండి వైఖరిని అనుసరించిందని అన్నారు. అమృత్‌సర్‌లో రాయి విసిరితే.. లాహోర్ పడుతుంది...అంత దగ్గరగా ఉండే ఈ నగరాల మధ్య వ్యాపారాన్ని కేంద్రం అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. -
బేకరీ నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్, అబిడ్స్ : నగరంలో పేరుగాంచిన ఓ బేకరీ నిర్లక్ష్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీహెచ్ఎంసీ ఫుడ్ విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించే బేకరీలు, హోటళ్లలో నాణ్యతతో పాటు కనీసం ప్యాకింగ్ తేదీలను కూడా సక్రమంగా ముద్రించడంలేదు. ఇందుకు ఉదాహరణే బుధవారం ఎంజే మార్కెట్ సమీపంలోని ఓబేకరీ నిర్వాకం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బిల్క్‌బ్రెడ్‌పై ముందుగా ప్యాకింగ్ తేదీని 05–10–2017 అని ప్రచురించి బేకరీ యాజమాన్యం పప్పులో కాలేసింది. ఇలా ఒకరోజు ముందుగా ఎలా తేదీని ప్యాకెట్‌పై ఎలా వేస్తారని వాట్సాప్, ఫేస్బుక్లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ కేసు నమోదయ్యేనా... బహిరంగంగా నిర్లక్ష్యంగా వహించిన బేకరీ యాజమాన్యం జీహెచ్ఎంసీ ఫుడ్ అధికారులుగానీ, పోలీసులుగానీ ఏ మేరకు కేసు నమోదు చేస్తారో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై బేగంబజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. -
ఏ తల్లిదండ్రులు ఇలా చంపరేమో!
కరాచీ : పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించుకొని పారిపోయి వివాహం చేసుకుందామనుకున్న ఓ యువజంట(అమ్మాయికి 15, అబ్బాయికి 17)ను ఇరు కుటుంబాల సభ్యులు కళ్లముందే అతి దారుణంగా చంపేశారు. కుటుంబం పరువు తీశారని కళ్లెర్రజేస్తూ వారిద్దరిని నులక మంచానికి కట్టిపడేసి కరెంట్ షాక్ పెట్టి చంపారు. ఈ దృశ్యాన్ని ఊరంతా కూడా తిలకిస్తూ ఏ మాత్రం మానవత్వం లేనివారిగా వ్యవహరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వారిని పట్టి బందించి తీసుకొచ్చాక ఆ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపే జిర్గా అనే కులపెద్దల సంఘం సమావేశం ఏర్పాటుచేసింది. వారిద్దరు కుల పరువు తీశారని వారిని మంచానికి కట్టిపడేసి చంపేయాలని ఆదేశించడంతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తూ రెండు కుటుంబాల ముందే మంచానికి కట్టిపడేసి కరెంట్ షాక్ పెట్టి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాలకు చెందిన వారిని, కుల పెద్దలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. తొలి రోజు అమ్మాయిని, రెండో రోజు అబ్బాయిని ఇలా చంపి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ జంట తల్లిదండ్రులు ఒక ఒప్పందానికి వచ్చినా జిర్గా సంఘం అంగీకరించకపోవడంతో ఈ పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. జిర్గా సంఘం ప్రభుత్వ చట్టాలకంటే కఠినంగా పనిచేస్తుందని, ఆ ప్రజలు కూడా చట్టాలకంటే జిర్గా పెద్దల మాటలే పట్టించుకుంటారని తెలిపారు. ప్రతి ఏటా పరువు హత్యల్లో 500మంది పాకిస్థాన్ మహిళలు బలవుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి. -
పిక్నిక్ నిమిత్తం వెళ్లారు.. కానీ !
కరాచీ: వ్యాన్‌లో ఉన్న సీఎన్జీ సిలిండర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరాచీలో ఆదివారం జరిగింది. కరాచీలోని గార్డెన్ ఏరియాకు చెందిన సలీం, మహమ్మద్ అలీలు కుటుంబంతో కలిసి హక్స్బే ప్రాంతానికి పిక్నిక్ నిమిత్తం వెళ్లారు. వీరు వెళ్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాను వెనుక వైపు మంటలు చెలరేగి అకస్మాత్తుగా పేలింది. లోపల ఉన్నవారు బయటకు వచ్చేలోపే అగ్నికి ఆహుతి అయ్యారు. రెస్క్యూటీం హుటాహుటిన చేరుకుని నలుగురిని రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృత్యుల్లో ముగ్గురు మగవారు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. -
శత్రు దేశంలో కోహ్లీ; వైరల్ వీడియో
కరాచీ: భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాడ్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఆడుతుండగా, ‘కోహ్లీ పాకిస్తాన్లో ఉన్నాడంటూ’ సోషల్ మీడియాలో కలకలం రేగింది. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన ఓ వ్యక్తి అచ్చం కోహ్లీని పోలిఉండటంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ప్రస్తుతం ‘పాకిస్తాన్ కోహ్లీ’గా నెటిజన్లు పిలుస్తోన్న ఆ వ్యక్తి కరాచీలోని ఓ పిజ్జా సెంటర్లో పనిచేస్తున్నాడు. పేరు.. షహీద్-ఎ-మిలత్. తనపని తాను చేసుకుంటున్న షహీద్‌ను వీడియోతీసి ‘జస్ట్ పాకిస్తానీ థింగ్స్’ ఫేస్బుక్ పేజీలో అప్‌లోడ్‌చేశారు. కోహ్లీ అంటే పాకిస్తాన్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ‘శత్రు దేశంలో కోహ్లీ..’ అంటూ భారత అభిమానులు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుత చాంపియన్స ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ సెమీస్‌లోకి అడుగుపెట్టాయి. జూన్ 14న పాక్-ఇంగ్లాడ్‌తో తలపడనుండగా, జూన్ 15న ఇండియా- బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ దాయాది జట్లే గెలిస్తే ఆదివారం జరగనున్న ఫైనల్స్ మరింత రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహంలేదు. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను భారీ తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్ చేరిన చైనా యుద్ధ నౌకలు
కరాచీ: చైనా, పాకిస్తాన్ల మధ్య సద్భావన పెంపుదల, నేవీ సిబ్బందికి అవగాహన కల్పించే ఉద్దేశంతో మూడు చైనా యుద్ధ నౌకలు చాంగ్ చున్, జింగ్ ఝౌ, చ్యౌ హులు కరాచీ తీరానికి చేరుకున్నాయి. ఇవి నాలుగు రోజులపాటు ఇక్కడ ఉంటాయి. రెండు దేశాలు, వాటి ప్రజల మధ్య పరస్పర నమ్మకం పెంపొందడానికి ఈ నౌకాయాత్ర ఉపయోగపడుతుందని చైనా నేవి అధికారి పేర్కొన్నారు. రెండు దేశాల నౌకాదళాల మధ్య సహకారం, సమాచార పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శాంతిని కాపాడేందుకు ఈ నౌకాయాత్ర దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పాక్‌లోని ప్రధాన ఓడరేవుల్లో కరాచీ ఒకటి కాగా రెండోది గ్వదర్ నౌకాశ్రయం. బలూచిస్తాన్‌లోని గ్వదర్ నౌకాశ్రయం ఇంకా నిర్మాణదశలో ఉంది. చైనా సాయంతో పాక్ దీనిని నిర్మిస్తోంది. చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌లో ఈ పోర్టు నిర్మాణం ఓ భాగం. -
‘ఈ ఒక్క నగరం బాగుంటే పాక్ బాగున్నట్లే’
కరాచీ: పాకిస్థాన్ ప్రశాంతంగా ఉంటే ముందు కరాచీ శాంతంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా అన్నారు. పాక్‌లో సుస్థిరత్వం నెలకొనాలన్నా, శాంతియుత పరిస్థితులు ఏర్పడాలన్న కరాచీనే కీలకం అని ఆయన చెప్పారు. ఆదివారం కరాచీలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన ఆయన కరాచీలో ప్రస్తుతం భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అలాగే, సాంఘిక వ్యతిరేక శక్తులను ఏరివేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న రద్దుల్ ఫసద్ ఆపరేషన్ గురించి విశ్లేషించారు. ఈ సందర్భంగా కరాచీలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు సహకరిస్తున్న పాక్ రేంజర్లకు, ఆర్మీకి ధన్యవాదాలు చెప్పారు. కరాచీలో పూర్తిగా సాధారణ పరిస్ధితులు వచ్చే వరకు ఇలాగే పనిచేయాలంటూ సూచించారు. కరాచీ ద్వారానే పాక్‌లో సుస్థిరత సాధించేందుకు వీలవుతుందని మరోసారి స్పష్టం చేశారు. -
అల్‌ఖైదా చీఫ్ @పాక్
-
నేను పాకిస్థాన్‌లో జన్మించినా.. : అద్వానీ
మౌంట్ అబు (రాజస్థాన్): పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించానని, అయితే క్రమశిక్షణను, విద్యను ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకున్నానని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ అన్నారు. జీవితంలో ఎప్పుడూ తప్పులు చేయకూడదని ఆర్ఎస్ఎస్ నుంచే నేర్చుకున్నానని, అలాగే అంకితభావం, నిబద్ధతతో దేశాన్ని అభివృద్ధి చేయడం గురించి తెలుసుకున్నానని చెప్పారు. ఆదివారం రాజస్థాన్‌లోని మౌంట్ అబులో జరిగిన బ్రహ్మకుమారీల 80వ వార్షిక వేడుకల్లో అద్వానీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అద్వానీతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 1927 నవంబర్ 8న పాకిస్థాన్‌లోని కరాచీలో అద్వానీ జన్మించారు. కాగా దేశ విభజన తర్వాత పాక్‌లో మత ఘర్షణలు జరిగిన సమయంలో అద్వానీ కుటుంబం భారత్‌కు వచ్చింది. -
పాకిస్ధాన్లో గాయత్రి మంత్రం పఠనం
-
పట్టపగలే దౌత్యవేత కాల్చివేత!
కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో పట్టపగలే అఫ్గానిస్థాన్ దౌత్యవేతను కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కరాచీలో ఉన్న అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయంలో థర్డ్ సెక్రటరీగా పనిచేస్తున్న జకీ అదూను సోమవారం ప్రైవేటు గార్డు కాల్చిచంపాడు. వెంటనే నిందితుడైన గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత గొడవలతోనే హయాతుల్లా అనే గార్డు దౌత్యవేతను కాల్చిచంపినట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ హత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి షకిబ్ ఇస్మాయిల్ తెలిపారు. దౌత్యవేత్తను చంపిన గార్డు కూడా అఫ్గాన్ పౌరుడేనని తెలిపారు. ఇది ఉగ్రవాద ఘటన అయి ఉండకపోవచ్చునని, ప్రస్తుతం అఫ్ఘాన్ దౌత్యకార్యాలయం వద్ద పరిస్థితి అదుపులో ఉందని స్థానిక డీఐజీ తెలిపారు. -
హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి లగ్జరీ లైఫ్
హైదరాబాద్: ఓ వైపు దిల్ సుఖ్ నగర్ పేలుళ్లను అమలు చేసిన ఇండియన్ మొజాహిద్దీన్(ఐఎమ్) ఉగ్రవాది యాసిన్ బత్కల్ ను జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) అరెస్టు చేసి ఆఖరి తీర్పుకు కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతుండగా.. మరో వైపు పేలుళ్ల సూత్రధారి, ఐఎమ్ సహవ్యవస్ధాపకుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రియాజ్ బత్కల్ కరాచీలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలోని భవనంలో పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నీడన రాజభోగాలు అనుభవిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో పేలుళ్లు చేసినందుకుగాను ఐఎస్ఐ పెద్ద ఎత్తున డబ్బును రియాజ్ బత్కల్ కు ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల చార్జిషీటులో రియాజ్ బత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ బత్కల్ లకు ఐఎస్ఐ ఆశ్రయం ఇస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. ఐఎస్ఐకు సాయం చేస్తానని రియాజ్ ఒప్పుకోవడంతోనే ఐఎమ్ లో చీలిక వచ్చిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. మాజీ ఐఎమ్ నేత షఫీ అర్మర్ రియాజ్ తో విభేదించి ఐఎస్ లేదా అల్ ఖైదా సంస్ధ పుట్టుకురావడానికి కారణమయ్యాడని చెప్పారు. రియాజ్ వద్ద పాకిస్తాన్ పాస్ పోర్టు కూడా ఉన్నట్లు తెలిసింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కోసం హవాలా మార్గం ద్వారా ఒకసారి రూ.1.25లక్షలు, మరోసారి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెస్ట్ టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ.75 వేలు యాసిన్ బత్కల్ కు రియాజ్ పంపినట్లు చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సాగుతున్న కార్యకలాపాలను అడ్డుకునేందుకు రియాజ్ బత్కల్ పేలుళ్ల కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. పేలుళ్ల కోసం అసదుల్లా అక్తర్ అలియస్ హద్దీ, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్ లను యాసిన్ బత్కల్ కు పరిచయం చేసి దిల్ సుఖ్ నగర్ తో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చేయాలని పథకం రచించాడు. పేలుళ్లకు ఒకరోజు ముందు వ్యుహం సఫలీకృతం కావాలని దేవుడిని ప్రార్ధించాలని రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ ను కోరినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లకు తొలుత పిక్రిక్ యాసిడ్ ను ఉపయోగించాలని యాసిన్ భావించాడని కానీ, సహచరుల సలహాలతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. పేలుళ్లలో 50 ఇంప్రొవైజ్ డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ)లను ఉపయోగించినట్లు చెప్పారు. పేలుళ్లు పూర్తయ్యేవరకూ యాహు మెసేంజర్ ద్వారా రియాజ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నట్లు వెల్లడించారు. -
హోటల్లో అగ్నిప్రమాదం: క్రికెటర్లకు గాయాలు!
ఇస్లామాబాద్:కరాచీలోని స్టార్ హోటల్ సోమవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా, 75 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు మహిళలున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిలో అత్యధిక శాతం మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రీజెంట్ ప్లాజా స్టార్ హోటల్లో ఆకస్మికంగా ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం జరిగింది. హోటల్ గ్రౌండ్ ఫోర్లో ఉన్న వంట గదిలో తొలుత మంటలు వ్యాపించి అవి హోటల్ కు చుట్టుముట్టాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దేశవాళీ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్ ఒకరు అక్కడ బస చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న బౌలర్ యాసిమ్ ముర్తాజా ప్రమాదం నుంచి తప్పించుకునే యత్నంలో రెండో ఫ్లోర్ నుంచి కిందికి దూకేశాడు. దాంతో అతని చీలిమండకు తీవ్రమైన గాయమైనట్లు డాక్టర్లు తెలిపారు. మరొక క్రికెటర్ కరామాత్ అలీ అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు తెలిపారు. కాగా, అంతర్జాతీయ క్రికెటర్ షోయబ్ మస్జూద్ ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు యూబీఎల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ నదీమ్ ఖాన్ తెలిపారు. ఈ తరహాలో పాక్ లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పలువురు మండిపడుతున్నారు. -
ఘోర రైలు ప్రమాదం: 15 మంది మృతి
-
ఘోర రైలు ప్రమాదం..
కరాచి: పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గడ్డాఫి పట్టణం లంధి ప్రాంతంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తప్పుడు సిగ్నల్ కారణంగా ఫరీద్ ఎక్స్‌ప్రెస్, జకారియా ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో జకారియా ఎక్స్‌ప్రెస్ మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని సహాయక బృందాలు సమీపంలోని జిన్నా, అబ్బాసీ ఆసుపత్రులకు తరలించాయి. సెప్టెంబర్‌లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 150 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
పాక్ లో దీపావళి జరుపుకున్న బాలీవుడ్ నటి
ముంబై: కశ్మీర్ లోని ఉడీ స్థావరంపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ నటీనటులను మనదేశంలోని సినిమాల్లో నటించకుండా నిషేధం విధించారు. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో కరణ్ జోహర్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అవరోధాలు ఎదురయ్యాయి. ఈ సినిమా పాకిస్థాన్ లో విడుదల కాలేదు. ఇన్ని ఉద్రిక్తతల నడుమ బాలీవుడ్ నటి, దర్శకనిర్మాత పూజాభట్ పాకిస్థాన్ వెళ్లారు. అంతేకాదు దీపావళి పండుగను కరాచీలో జరుపుకుని తిరిగివచ్చారు. గాయకుడు అలీ అజమాత్ ఆహ్వానం మేరకు అతిథిగా పాకిస్థాన్ వెళ్లారు. కరాచీకి వెళ్లిరావడం తనకెంతో సంతోషానిచ్చిందని పూజాభట్ పేర్కొన్నారు. గతంలోనూ పలుమార్లు పాకిస్థాన్ వెళ్చొచ్చానని వెల్లడించింది. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పూజాభట్ పాక్ పర్యటన బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. -
భారత్‌కు విమాన సర్వీసులు ఆపేసింది..
కరాచీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి విమాన సర్వీసులను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) రద్దు చేసింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. ఉడీ ఉగ్రదాడుల ప్రభావం విమాన సర్వీసులపైనా పడింది. దీనిపై పీఐఏ శనివారం ఓ ప్రకటన చేసింది. లాహోర్-ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు యాథాతథంగా కొనసాగుతున్నాయని పీఐఏ అధికారి తెలిపారు. గత మూడు, నాలుగు వారాలుగా కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, దీంతో ఆ మార్గాల్లో నడిచే విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే రద్దు చేసిన మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వేరే రూట్లలో నడిచే విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అలాగే భారత్ నుంచి కరాచీ వచ్చే ప్రయాణికులు ఢిల్లీ, ముంబైలోని పీఐఎ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. కాగా భారత్ నుంచి పాకిస్తాన్‌ను నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసులు లేవు. పాక్ ఇంటర్నరేషనల్ ఎయిర్‌లైన్స్ ద్వారానే ఇరు దేశాల మధ్య రాకపోకలు కొనసాగేవి. ఢిల్లీ-కరాచీ, ఢిల్లీ-లాహోర్, ముంబై-కరాచీల మధ్య అయిదు విమానాలు నడిచేవి. పీఐఏ నిర్ణయంతో శనివారం నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. -
ఆర్మీ చీఫ్‌కు మద్దతుగా 'రాజకీయ' పోస్టర్లు
కరాచి: సైనిక తిరుబాట్లు సహజంగా చోటుచేసుకునే పాకిస్థాన్ లో చరిత్ర రిపీట్ అవుతుందా? ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తిరుగుబాటుకు నేతృత్వం వహించి దేశపాలనను చేతుల్లోకి తీసుకుంటారా? అనే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం చెప్పలేం కానీ అక్కడి పరిస్థితులు ఈ ఊహగానాలను సమర్థించేలా ఉన్నాయి. మరో ఏడాదిలో ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ కాబోతున్న రహీల్ ను పొగుడుతూ 'మూవ్ ఆన్ పాకిస్థాన్' పార్టీ దేశంలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటుచేసింది. రహీల్ ఫొటోలతోపాటు 'ఇతరులు వద్దు.. స్వచ్ఛమైన పాకిస్థానీయే కావాలి' అని ఉర్దూలో రాసి ఉన్న పోస్టర్లు కరాచి తోపాటు పలు నగరాల్లో దర్శనమిచ్చాయి. సోమవారం అక్కడి వార్తా సంస్థలన్నీ దీనిపై వార్తలు రాశాయి. గతంలోనూ ఇలాంటి పోస్టర్లు ఏర్పాటుచేసినప్పుడు 'మూవ్ ఆన్ పాకిస్థాన్' పార్టీ అధ్యక్షుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశంఉంది. అయితే ప్రోద్బలంతోనే ఆ పార్టీ ఇలాంటి చర్చలకు పాల్పడుతుందని సమాచారం. మరో సైనిక తిరుగుబాటు! పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం లక్షిత దాడుల(సర్జికల్ స్ట్రైక్స్) అనంతరం ఏదోఒక ప్రతీకార చర్యకు పాల్పడాలని అక్కడి రాజకీయ నాయకత్వం లోలోపల ఆశిస్తోంది. అయితే సైన్యాధ్యక్షుడు జనరల్ రహీల్ మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా(భారత్ కు నష్టం చేసే దిశగా) ఎలాంటి తొందరపాటును ప్రదర్శించలేదు. భారత్ తో నిత్యం జగడాలాడేకంటే స్వదేశాన్ని నాశనం చేస్తోన్న తాలిబన్ ఉగ్రవాదులను అణిచివేయడానికే పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ప్రాధాన్యం ఇచ్చారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఆర్మీకి శిక్షణ ఇప్పించారు. జవాన్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు విస్తృతంగా పర్యటించారు. తద్వారా సైనికుల అభిమానాన్ని చురగొన్నారు. ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ లో ఉద్రిక్తతలు పెరగకుండా.. లష్కరే తాయిబా, జైష్ ఎ మొహమ్మద్ లాంటి ఉగ్రసంస్థల అధినేతలను సున్నితంగా కట్టడిచేయగలిగారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం రక్షణ కల్పిస్తోందని ప్రపంచదేశాలు అంటున్నా.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కనీసం ఆ ఉగ్రనాయకులను కొన్నాళ్లు మాట్లాడనీయకుండా ఉంచడగలడంలో రహీల్ చాకచక్యంగా వ్యవహరించారని కొందరి వాదన. ఒకవేళ సైనిక తిరుగుబాటు జరిగి రహీల్ పరిపాలన పగ్గాలు చేపడితే బలూచీలు కూడా ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉంది. రహీల్ జన్మస్థలం కూడా బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాయే కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇటు సైన్యం మద్దతు, అటు ప్రజల మద్దతు ఉన్న ఆయనకు రాజకీయ పక్షాలు కూడా సహకరిస్తాయని కొందరి అభిప్రాయం. -
పాక్ నుంచి కసబ్ గ్యాంగ్ ఎలా వెళ్లింది..?
లాహోర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్ధావరాలపై భారత సైన్యం వ్యూహాత్మక దాడులు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత.. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటూ పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల ఒత్తిడి.. తదితర అంశాల నడుమ 26/11 ముంబై దాడుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకొనబోతోంది. విచారణను ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తోన్న పాక్.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలోనైనా ఈ కేసుకు సహేతుకమైన ముగింపు పలుకుతుందనే ఆశాభావం లేనప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ముంబై దాడుల విచారణ నిమిత్తం పాక్ (ఇస్లామాబాద్) యాంటీ టెర్రరిస్టు కోర్టు (ఏటీసీ) ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి న్యాయ కమిషన్ గురువారం (అక్టోబర్ 6న) కరాచీ పోర్టుకు వెళ్లనుంది. లష్కరే తాయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ సహా 10 మంది కరాచీ పోర్టు నుంచి ముంబైకి వెళ్లేందుకు వినియోగించిన 'అల్ ఫౌజ్' బోటును న్యాయ కమిషన్ పరిశీలించనుంది. ఆ తర్వాత కసబ్ గ్యాంగ్ పాక్ నుంచి ముంబైకి ఎలా వెళ్లిందో తగిన సాక్ష్యాధారాలు జోడించి కోర్టుకు సమర్పించనుంది. కసబ్, అతని అనుచరులు కరాచీ పోర్టులో సంచరించినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులను సైతం న్యాయ కమిషన్ ప్రశ్నించనుంది. ఉగ్రవాదులు వినయోగించిన మూడు బోట్లను అధికారులు కరాచీ షిప్ యార్డులో భద్రపర్చారు. ఏటీసీ కోర్టు జడ్జి నేతృత్వంలోని న్యాయ కమిషన్ లో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ), రక్షణ శాఖల అధికారులేకాక కొందరు న్యాయాధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. కసబ్ గ్యాంగ్ ముంబైకి ఎలా వచ్చిందంటే.. పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రకారం.. (ముంబై దాడులకు సంబందించిన కొన్ని ఫొటోలు)ముంబైలో మారణహోమం సృష్టించాలనే లక్ష్యంతో 2006, నవంబర్ 23న లష్కరే తాయిబాకు చెందిన 10 మంది సుశిక్షిత ఉగ్రవాదులు ఏకే 47 రైఫిళ్లు, ఇతర మారణాయుధాలతో కరాచీ పోర్టు నుంచి మూడు బోట్ల ద్వారా భారత జలాల్లోకి ప్రవేశించారు(వీటిలో అల్ ఫౌజా అనే బోటును తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్నారు). మార్గం మధ్యలో చేపల వేటకు వినియోగించే మరో బోటును స్వాదీనం చేసుకుని, అందులోని నలుగురిని హతమార్చారు. బోటు నడిపే వ్యక్తిని బంధించి తమను ముంబై తీరానికి తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారు. తీరా తీరాన్ని చేరాక ఆ వ్యక్తిని కూడా చంపేసి నవంబర్ 26నదక్షిణ ముంబైలోకి అడుగుపెట్టారు. మొత్తం ఎనిమిది చోట్ల విధ్వంసం సృస్టించిన ఉగ్రవాదులు 172 మందిని పొట్టనపెట్టుకున్నారు. మరో 300 మందిని గాయపర్చారు. ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒక్కడే పోలీసులకు చిక్కగా, మిగతా తొమ్మిది మందిని ఎన్ఎస్ జీ కమాండోలు మట్టుపెట్టారు. భారత్ సమర్పించిన ఆధారాలుతోపాటు అమెరికా,ఇతర అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు పాకిస్థాన్ ఎట్టకేలకు ముంబై దాడుల కేసు విచారణను ప్రారంభించింది. ముంబై దాడుల సూత్రధారి లష్కరే తాయిబా ఆపరేషన్స్ చీఫ్ జకీఉర్ రహమాన్ లఖ్వీ తోపాటు మరో ఆరుగురిని నిందితులుగా చేర్చి, అరెస్టు చేసింది. కాగా లఖ్వీ మాత్రం కొద్దిరోజులకే బెయిల్ పై విడుదలయ్యాడు. మళ్లీ అరెస్టయ్యి గత ఏడాది జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవ్వరికీ కనిపించకుండాపోయాడు. ప్రస్తుతం లఖ్వీ గుర్తుతెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నాడని సమాచారం. ఎనిమిదేళ్లుగా సాగుతోన్న విచారణలో ప్రాసిక్యూషన్ పలు నివేదికలను సమర్పిస్తున్నప్పటికీ, సరైన సాక్ష్యాధారాలు లేనందున పాక్ కోర్టులు వాటిని కొట్టిపారేస్తూనేఉన్నాయి. ఈ బోటు పరిశీలన కూడా అలాంటిదే అవుతుందా లేదా వేచిచూడాలి. -
భారత నకిలీ కరెన్సీ కోసం పాక్ ప్రత్యేక ప్రెస్
భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపిస్తున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దీనికోసం ప్రత్యేకంగా పవర్ప్రెస్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం పాతబస్తీలో దొరికిన కరెన్సీ సైతం అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘భారత్ పవర్ ప్రెస్’లో ముద్రితమవుతున్న ఈ నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నప్పటికీ... మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. రూటు మార్చి భారత్‌కు సరఫరా... క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్‌కు పంపిస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలను తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జల మార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకులు ఇలా అనేక పేర్లతో ఈ కన్సైన్మెంట్స్ వచ్చేవి. గడిచిన కొన్నేళ్ళుగా ఈ మార్గంలో తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ తన రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణి చేయిస్తోంది. క్వాలిటీతో పాటే పెరిగిన ‘కమీషన్’... నకిలీ కరెన్సీ డంప్ చేసి చెలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఏళ్ళుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు మాల్దాకు చెందిన బబ్లూ 1:2 రేష్యోలో (రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు) ఇచ్చినట్లు వెల్లడైంది. పంథా మార్చిన పోలీసులు... సాధారణంగా నకిలీ కరెన్సీ కేసుల్ని పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 489 కింద నమోదు చేస్తారు. గౌస్ ఇప్పటికి తొమ్మిదిసార్లు చిక్కగా... ఇదే సెక్షన్ కింద కేసు నమోదు కావడంతో బెయిల్‌పై బయటకు వచ్చి మళ్ళీ దందా ప్రారంభించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు తొలిసారిగా నకిలీ కరెన్సీ కేసును అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద నమోదు చేశారు. దీంతో ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి మార్గం సుగమమైంది. ఇకపై ఈ తరహా కేసుల్ని ఈ చట్ట ప్రకారమే నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే ఇలా నమోదు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న కరెన్సీని విలేకరుల సమావేశంలో బయటకు ప్రదర్శించకూడదు. మరోపక్క 48 గంటల్లో కోర్టు ద్వారా నకిలీ కరెన్సీని మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న భారత పవర్ ప్రెస్‌కు పంపి పరీక్షలు చేయించారు. అక్కడి అధికారులు గరిష్టంగా 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు ఆ సన్నాహాలు ప్రారంభించారు. -
దావూద్ జాడలు
తరచుగా మీడియా కథనాల్లో తప్ప బహిరంగంగా కనబడని దావూద్ ఇబ్రహీం మరోసారి వార్త అయ్యాడు. పాకిస్తాన్లో అతని నివాసాలుగా పేర్కొంటూ మన దేశం అందజేసిన తొమ్మిది చిరునామాల్లో ఆరు సరైనవేనని ఐక్యరాజ్యసమితి కమిటీ దాదాపుగా నిర్ధారించింది. మూడు చిరునామాలు మాత్రమే సరైనవి కాదని చెప్పడం ద్వారా మిగిలిన ఆరింటినీ అది ధ్రువీకరించినట్టయింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిగా, అంతక్రితం నేర ప్రపంచ రారాజుగా పేరు మోసిన దావూద్‌కు పాక్ ఆశ్రయమిస్తున్నదని మన దేశం ఎప్పటినుంచో ఆరోపిస్తున్నది. పాకిస్తాన్ మాత్రం దాన్ని తోసిపుచ్చుతోంది. ఆధారాలివ్వాలని సవాల్ చేస్తోంది. ఇప్పుడు సమితి కమిటీ తాజా నిర్ణయం వచ్చాక కూడా దాని బుకాయింపు ధోరణిలో మార్పేమీ లేదు. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి ఆ కమిటీ తీసు కోబోయే చర్యలవల్ల దావూద్లాంటివారికి ఆశ్రయమివ్వడం పాకిస్తాన్‌కు కష్టమవు తుంది. ఆ కమిటీ జాబితా కెక్కిన వ్యక్తులనూ, సంస్థలనూ అదుపు చేయడం... వారి ఆస్తులను, బ్యాంకు ఖాతాలనూ స్వాధీనం చేసుకోవడం, పరారీ కాకుండా చూడటం సభ్య దేశాల బాధ్యత అవుతుంది. ఆ పనే జరిగితే పాకిస్తాన్‌కు ఊపి రాడని స్థితి ఏర్పడుతుంది. దావూద్‌పై ఇప్పటికే మన దేశం రెడ్ కార్నర్ నోటీసు జారీచేయించింది. 2000 సంవత్సరం నుంచి అమల్లోకొచ్చిన నేరస్తుల అప్పగింత ఒప్పందం, ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జరిపిన పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఉగ్రవాదులను అప్పగించడంలో తోడ్పాటునందిస్తోంది. తమ నిఘా వర్గాలిచ్చే సమాచారాన్ని మన దేశంతో పంచుకుంటున్నది. ఈ చర్యల వల్ల దావూద్ కార్యకలాపాలకు పరిమితులు ఏర్పడ్డాయి. అయితే అవి పూర్తిగా ఆగిపోలేదు. పేరుకే రహస్య జీవనంగానీ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో నాలుగు గోడల మధ్యా గుట్టుగా ఏమీ బతకడం లేదు. అమెరికాలో 2001లో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత పాక్ దాటి వెళ్లకపోయి ఉండొచ్చుగానీ అంతక్రితం అతను నేరుగా వేర్వేరు దేశాల్లో తన కార్యకలాపాలు సాగించేవాడు. ప్రస్తుతం కరాచీలో కూర్చుని గల్ఫ్ దేశాల్లోని స్థిరాస్తి వ్యాపారాలను చక్కబెడుతున్నాడు. మాదక ద్రవ్యాలు, మ్యాచ్ ఫిక్సింగ్‌లు, మన దేశంలోకి దొంగ కరెన్సీ తరలింపు వగైరా వ్యాపారాలు... వాటి ద్వారా దావూద్ వెనకేసుకునే కోట్లాది డాలర్లు పాక్ ప్రభుత్వానికి తెలియనివి కాదు. అతను కరాచీలోనే ఉంటున్నా ఇబ్బందులు తలెత్తుతాయనుకున్నప్పుడు పాక్–అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతానికి తరలించడం మామూలే. ఎక్కడున్నా శాసించ డమెలాగో అతనికి తెలుసు. తనకు ఆశ్రయమిస్తున్న ఐఎస్ఐకి వివిధ దేశాల్లోని తన ఏజెంట్ల ద్వారా అందే సమాచారాన్ని చేరేయడం, తన అక్రమార్జనలో వాటా లివ్వడం, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు సహకరించడం దావూద్ విధి. మన దేశాన్ని చికాకు పరచడంలో, నష్టం కలగజేయడంలో తోడ్పాటు నందిస్తున్నాడు గనుక పాకిస్తాన్ పాలకులకు అతను ఆప్తుడయ్యాడు. అతని గురించి పైకి ఏం చెప్పినా దావూద్ ఆచూకీ, ఆనుపానుల గురించి ఎప్పుడో ఒకప్పుడు నిర్ధారణ కాక తప్పదని పాక్ పాలకులకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితే తలెత్తితే అతన్ని ఎలా వదిలించుకోవాలన్న విషయంలో కూడా వారికి తగిన అవగాహనే ఉండొచ్చు. అగ్రరాజ్యం అమెరికా దావూద్‌ను ఒక సమస్యగా, ముప్పుగా పరిగణించనంత కాలం... అతనికి గానీ, అతని వల్ల పాక్ పాలకులకు గానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యం. దావూద్ గురించి తనకేమీ తెలియనట్టు అమెరికా నటిస్తున్నా ప్రస్తుతం ఆ దేశంలోనే జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ దావూద్ గురించి, అతని కార్యకలాపాల గురించి ఇప్పటికే వారికి కావలసినంత సమాచారం అందించాడు. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం తనకు మాత్రమే ఉన్న హక్కని, అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని అమెరికా నియమం పెట్టుకున్నట్టు కనబడుతోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరుడు మన దేశాన్ని సందర్శించినప్పుడు వెలువడిన సంయుక్త ప్రకటనలో ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబా, హక్కానీ నెట్ వర్క్‌లతోపాటు దావూద్ ముఠా ప్రస్తావన కూడా ఉంది. ఇలాంటి ఉగ్రవాద సంస్థలను అణచడానికి సమష్టిగా కృషి చేయాలన్న సంక ల్పాన్ని ఇరుదేశాలూ వ్యక్తంచేశాయి.అయినా దావూద్ విషయంలో అటు నుంచి అందుతున్న సహకారం పెద్దగా లేదు. అయితే దావూద్లాంటివారు తలెత్తడానికీ, ఎదగడానికీ.. కొరకరాని కొయ్యగా మారడానికి మన దేశంలో ఇప్పటికీ పుష్కలంగా అవకాశాలున్నాయని నిన్న మొన్నటి నయీం ఉదంతం నిరూపించింది. దావూద్ ఇబ్రహీం ఇక్కడే పుట్టి పెరిగాడు. ముంబై మహానగరాన్ని అడ్డాగా చేసుకుని 1986 వరకూ దేశం లోనే ఉన్నాడు. అప్పట్లో రాజకీయ నాయకులతో, ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక వ్యక్తులతో, సినీ పరిశ్రమ పెద్దలతో చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు. తమ కక్షలు తీర్చుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించుకోవడానికి వీరందరికీ పని కొచ్చాడు. ఎప్పుడైనా పైనుంచి ఒత్తిళ్లు వస్తే... అరెస్టు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడితే ముందుగా సమాచారమిచ్చి అతను తప్పించుకు పోవ డానికి అన్నివిధాలా తోడ్పడింది వీరే. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిగా వెల్లడైన తర్వాత వీరిలో చాలామంది తమకు ఎప్పుడూ అతనితో సంబంధ బాంధవ్యాలు లేవన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. చిత్రమేమంటే... దావూద్ కార్యకలాపాలు ముంబైలో ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి కమిటీ తీసుకున్న చర్యతో దావూద్ విషయంలో కొంత ముందడుగు పడినట్టయింది. ప్రపంచానికి పాక్ నిజస్వరూపాన్ని చాటడానికి ఇలాంటి పరిణామాలు నిస్సందేహంగా దోహదపడతాయి. అయితే అంతకన్నా ముందు మన దేశంలో మరింత మంది దావూద్‌లు తలెత్తకుండా చూసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పాలకులు గుర్తించాలి. -
ఐసీయూలో డాక్టర్ అనుమానాస్పద మృతి
కరాచీ: తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఓ యువ డాక్టర్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది. శుక్రవారం సర్జికల్ ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్ అనిల్ కుమార్(32) ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తలుపులు పగులగొట్టి చూశారు. చైర్లో కూర్చుని కనిపించిన డాక్టర్‌ను దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అతడు అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నయీముద్దీన్ మాట్లాడుతూ.. డాక్టర్ మృతిపై అనుమానాలున్నాయన్నారు. డాక్టర్ మృతిచెందిన ప్రదేశంలో ఓ సిరంజిని గుర్తించామని, డాక్టర్ చేతికి బ్యాండేజీ సైతం ఉందని తెలిపారు. ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిరంజిని కెమికల్ లేబొరేటరీకి పంపించి పరీక్షిస్తున్నారు. గత వారం ఓ హిందూ వ్యాపారిని నిరసనకారులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. -
ఆ జర్నలిస్టు హిందూ అని తెలియడంతో...
కరాచీ: సాక్షాత్తూ పాకిస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీలో ఓ హిందూ జర్నలిస్టు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాడు. అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్ (పీపీపీ) వార్తాసంస్థలో సీనియర్ రిపోర్టర్‌గా సాహిబ్ ఖాన్ ఓడ్ పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఆయన హిందూ మతానికి చెందిన వారని తెలియడంతో ఆయన పట్ల ముస్లిం సహోద్యోగులు వివక్ష చూపడం మొదలుపెట్టారు. తాము వాడుతున్న తాగునీటి గ్లాసును, ఇతర పాత్రలను ఆయన తాకకుండా అంటరానితనాన్ని పాటిస్తున్నారు. దాదు జిల్లాకు చెందిన ఓడ్‌ను ఇస్లామాబాద్‌లో ఏపీపీ రిపోర్టర్‌గా నియమించారు. ఆ వెంటనే హైదరాబాద్‌కు బదిలీ చేశారు. గత ఏప్రిల్‌లో మరోసారి బదిలీపై కరాచీ పంపించారు. సాహిబ్ ఓడ్ కొడుకు రాజ్‌కుమార్ ఓసారి వార్తాసంస్థ కార్యాలయానికి రావడంతో ఆయన హిందువు అన్న విషయం మిగతా ఉద్యోగులకు తెలిసిపోయింది. అప్పటినుంచి ఆయనపై రకరకాలుగా వివక్ష చూపుతున్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ పత్రిక తెలిపింది. తన పేరులో ఖాన్ అని ఉండటంతో మొదట తాను ముస్లిం అని సహోద్యుగులు భావించి స్నేహంగా మెదిలారని, తాను హిందువు అని తేలడంతో పరిస్థితి మారిపోయిందని ఆయన తెలిపారు. అందరూ తాగే గ్లాసును, ఇతర పాత్రలను వాడొద్దని బ్యూరో చీఫ్ తనకు చెప్పారని, ఇప్పుడు రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందు సందర్భంగా అందరితో కలిసి భోజనం చేయనివ్వడం లేదని, అంతేకాకుండా ఇంటినుంచి సొంతంగా గ్లాసు, ప్లేటు తెచ్చుకుంటేనే ఆఫీసులో భోజనం చేయనిస్తామని పై ఉద్యోగులు తేల్చిచెప్పారని, దీంతో గత్యంతరం లేక తానే గ్లాసు, ప్లేటు తెచ్చుకుంటున్నానని ఆయన తన దీనగాథను తెలిపారు. కాగా, సాహిబ్‌కు ఫ్లూ జ్వరం ఉండటం వల్లే ఆయనను సొంతంగా గ్లాసు, ప్లేటు తెచ్చుకోమని చెప్పామని, ఇందులో అంటరానితనం ఏమీ లేదంటూ కరాచీ బ్యూరో చీఫ్ పర్వేజ్ అస్లాం ఈ అంశాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. -
పాక్‌లో చీఫ్ జస్టిస్ కుమారుడు కిడ్నాప్
కరాచీ: పాకిస్థాన్‌లో ఓ చీఫ్ జస్టిస్ కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కోర్టు పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన అతడిని ఆయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. సింద్ ప్రావిన్స్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమారుడు ఓవయిస్ సజ్జాద్ షా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం కోర్టు పనులు ముగించుకొని పోష్ క్లిఫ్టాన్ ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన నలుగురు దుండగులు ఎత్తుకెళ్లారు. ఓ పచ్చ ఆకుపచ్చ నెంబర్ ప్లేట్ గల తెల్లకారులో వారు ఆయనను ఎత్తుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లో ఆకుపచ్చ నెంబర్ ప్లేట్లు ప్రభుత్వ వాహనాలకు మాత్రమే కేటాయిస్తారు. క్లిఫ్టాన్లోని తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన ఒవయిస్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడని, ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. -
దావూద్ చిరునామా ఇదే!!
పాకిస్థాన్ దక్షిణ కరాచీలోని క్లిఫ్టన్ నైబర్‌హుడ్ అత్యంత విలాసవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సింధ్ మాజీ ముఖ్యమంత్రి ముస్తఫా జాతోయ్ నివాసముంటున్నారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టోకి కూడా ఇక్కడో పెద్ద బంగ్లా ఉంది. పాక్‌లోని ప్రముఖులు నివసించే ప్రాంతంగా పేరొందిన ఇదే ప్రదేశంలో ఓ కరుడుగట్టిన నేరగాడు కూడా యథేచ్ఛగా నివసిస్తున్నాడు. 1993లో బొంబాయిలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి.. 257 మందిని పొట్టనబెట్టుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నివాసముంటున్నది ఇక్కడే. ఇతంటి విలాసవంతమైన ప్రాంతంలో ఓ భారీ భవంతిలో నిర్భయంగా బతుకున్నాడు దావూద్. అతన్ని పట్టుకొని.. భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ గత 23 ఏళ్లలో లెక్కలేని ప్రయత్నాలు చేసింది. అతడు పాక్‌లోనే ఉన్నాడని భారత్ ఎన్ని ఆధారాలు చూపినా.. దాయాది దేశం మా దగ్గర లేడని బొంకేది. తాజాగా ఓ ఆంగ్ల మీడియా దావూద్ సంచలన స్టింగ్ ఆపరేషన్ జరిపింది. క్లిఫ్టన్లో ఉన్న దావూద్ ఇంటి చిరునామాను సాధించింది. డీ 13, బ్లాక్ 4, క్లిఫ్టన్, కరాచీ చిరునామాలో అతడు ఉంటున్నట్టు కనుగొన్నది. దావూద్ ఇంటి సమీపంలోని భవంతులపై నుంచి విహంగ విక్షణం ద్వారా అతని ఇంటి ఫొటోలను, అతని ఇంటి పరిసరాల ఫొటోలను ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వాహకులు తీశారు. దావూద్ బంగ్లాకు సమీపంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, దావూద్ భవంతి ఉన్న విలాసవంతమైన ప్రాంతం ఫొటోను క్లిక్ మనిపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేస్తూనే ఈ ఆధారాలను కూడా పాక్ ప్రభుత్వం తిరస్కరించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. -
విద్యార్థుల రక్షణ కోసం స్మార్ట్ యాప్
ఇస్లామాబాద్: విద్యాసంస్థల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకోవడం, అమాయక చిన్నారులు మృతిచెందడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి కదా. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు సరికొత్త యాప్ ను రూపొందించారు. పాకిస్తాన్ లోని కరాచీలో శనివారం నూతన అప్లికేషన్ ను ఆవిష్కరించారు. సింధ్ రేంజర్స్ అనే సంస్థ ఈ యాప్ వివరాలను వెల్లడించింది. రేంజర్స్ స్కూల్ కాలేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా దాదాపు 3 వేల విద్యాసంస్థలు తమ వివరాలను ఇందులో రిజిస్టర్ చేసుకునే వెసలుబాటు ఉంది. దీంతో అత్యవసర సమయాల్లో ఈ యాప్ బటన్ నొక్కితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారికి ఫోన్ సందేశం రూపంలో సమాచారం అందుతుంది. వీరితో పాటు వింగ్ కమాండర్, సెక్టర్ కమాండర్, జోన్ ఉన్నతాధికారికి సమాచారం అందుతుందని సింధ్ రేంజర్స్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే యాప్ ను షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, మీడియా సంస్థలను ఈ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. వాట్సాప్ ద్వారా కరాచీ ప్రజలు వీడియోలు, ఫొటోలు పంపి నేరాలను అరికట్టేందుకు గత నెలలో పారామిలిటరీ బలగాలు ఓ యాప్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అదేబాటలో తాజాగా కరాచీలో ఈ యాప్ కు సింధ్ రేంజర్స్ శ్రీకారం చుట్టింది. -
దావూద్ పరిస్థితి విషమం!
కరాచీ: మాఫియా డాన్, ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం చావుబతుకుల్లో ఉన్నాడా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స చేస్తున్న వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పేశారట.కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు. సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల దావూద్ కాళ్లలోని రక్తసరఫరాలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయని, కాళ్లకు ఆక్సిజన్ అందక కణజాలం కుళ్లిపోతోందని తేల్చారు. గ్యాంగ్రీన్ వల్ల ఉత్పత్తయ్యే విషపదార్థాలు శరీరమంతా కూడా వ్యాపించే అవకాశముందంటున్నారు. కాళ్లు తీసేయడం తప్ప ప్రస్తుతం వేరే ప్రత్యామ్నాయం లేదని వైద్యులు భావిస్తున్నారట. ఐఎస్ఐ రక్షణ కింద ఉన్న దావూద్‌ను కరాచీ నుంచి తరలించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ దావూద్ పాక్‌లో చనిపోతే అతన్ని రప్పించేందుకు భారత్ చేస్తున్న కృషి వృథా అయినట్లే. -
దావూద్ ఇప్పుడెలా ఉంటాడో తెలుసా?
వెలుగులోకి వచ్చిన కొత్త ఫొటో ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న కరుడుగట్టిన నేరగాడు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎలా ఉంటాడు? 60 ఏళ్ల అతడు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? గుర్తుపట్టలేనంతగా మారిపోయాడా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన అతని ఫొటో ఒకటి అదేమీ జరుగలేదని వెల్లడిస్తున్నది. 1993లో ముంబై వరుస పేలుళ్ల అనంతరం దావూద్ దిగిన ఫొటో ఒకటి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ముంబై పేలుళ్లకు పాల్పడి.. ఆ తర్వాత భారత్ నుంచి పారిపోయిన దావూద్ ప్రస్తుతం పాక్‌లో గడుపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల కిందట కరాచీ వెళ్లిన భారత జర్నలిస్టు వివేక్ అగర్వాల్.. అక్కడ దావూద్ ఫొటో తీశాడు. అప్పట్లో మొయిన్ ప్యాలెస్ లో ఉండే దావూద్ ఆ తర్వాత మకాం మార్చాడు. ఈ ఫొటోలో దావూద్ నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తాపైజామా ధరించి ఉన్నాడు. మీసం తొలగించి క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్న అతడు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదని ఈ ఫొటో స్పష్టం చేస్తున్నది. ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఫొటోలు కొన్నింటినీ భారత్ గత ఏడాది ఆగస్టు 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లోని కరాచీలో దావూద్ యథేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్ చెప్తుండగా.. పాక్ మాత్రం తమ గడ్డపై దావూద్ లేనేలేడని వాదిస్తున్నది. -
అక్కడికి వెళితే ప్రేమలో పడతారు!
'ప్రేమలో పడలాంటే ఒకచోటికి వెళ్లాలా? చాలాచోట్ల చాలారకాలుగా ప్రేమలో పడొచ్చు తెల్సా..' అంటారేమో! అయితే ఫొటోలో కనిపిస్తున్న చోటికి వెళితే మాత్రం తప్పక విశ్వప్రేమ పుట్టుకొస్తుంది. అది ఎలాగంటే.. ఆ ఊరిపేరు ముబారక్. దాదాపు 40 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన అరేబియా సముద్రంలో.. ప్రత్యేకమైన తీరగ్రాం అది. మూడొంతుల భూగోళాన్ని ఆక్రమించిన జలరాశుల్లో భూతద్దం పెట్టివెదికితేగానీ దొరకని ఆకుపచ్చ సముద్రపు తాబేళ్లకు ముబారక్ తీరం శాశ్వత చిరునామా. అరుదైన బల్లిజాతులకూ ఆవాలం. ఇక సాయంసంధ్యల్లోనైతే ప్రకృతికాంత తన అందమంతటినీ కట్టకట్టుకొచ్చి ఇక్కడ కుమ్మరించిందా! అన్నంత రమణీయంగా ఉంటుంది. ఆ అందాలతో ప్రేమలోపడి, ముచ్చట్లుపెట్టి, విరహంతో తిరిగిస్తుంటే.. అదిగో, అప్పుడు కనిపిస్తారు మనుషులు. అంతటి ప్రాకృతిక సౌందర్యాన్ని ప్రపంచానికి పంచే ముబారక్ లో మనుషుల పరిస్థితి.. 'నాంపల్లి స్టేషన్ కాడి రాజలింగు' లాంటిది. కడు దయనీయం. ఉందామంటే ఇల్లూలేదు, తిందామంటే తిండీ లేదు, దాహం వేస్తే నీళ్లూ లేవు, రోగం వస్తే మందూ లేదు. అంతెందుకు ఆ ఊరికిపోయే దారి కూడా అంతా మట్టిమయం. అప్పుడు మళ్లీ మనలో ప్రేమ మొదలవుతుంది. ఈ సారిమాత్రం ప్రకృతిమీదకాదు సాటి మనిషి మీద. ఇంకా చెప్పాలంటే మన దాయాది మీద! ముబారక్.. కరాచీ మెట్రోపాలిటన్ లో భాగం. కరాచీ నగరం నడిబొడ్డునుంచి కేవలం 30 కిలోమీటర్ల ప్రయాణం. అభివృద్ధికి మాత్రం 200 ఏళ్ల దూరం! అక్కడ నివసించేవాళ్లంతా బెలూచీ గిరిజనులే. వందల ఏళ్ల నుంచే సముద్రంలో చేపలుపట్టే జాలర్లుగా స్థిరపడిపోయారు. దేశవిభజన తర్వాత రెండు మూడు దశాబద్ధాలవరకూ అక్కడి జీవనం సాఫిగానే సాగేది. చేపల మార్కెట్ బాగా నడిచేది. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆధునిక వేటపద్ధతులు నేర్చుకోలేకపోయారు ముబారక్ జాలర్లు. విదేశీ పెట్టుబడులుగానీ, బడాబాబులకుగానీ.. ముబారక్ ను బాగా ఆదాయమిచ్చే ప్రాంతంగా గుర్తించలేదు. ఇలా తమ రేవులోకి పెద్ద కంపెనీలు రాకపోవడం బడుగు జీవులైన జాలర్లకు పైకి మంచిచేసినట్లనిపించినా, వాస్తవానికి తీవ్రనష్టం చేసింది. కరాచీ నుంచి వారానికి రెండు సార్లోచ్చే మంచినీళ్ల ట్యాంకర్లు, వారానికి ఒకసారొచ్చే కూరగాయల బండితోనే సరిపెట్టుకోవాలి ఆ 10 వేల జనాబా. ఒక ట్యాంకర్ నీళ్ల ఖరీదు రూ. 1500. పేరుకు ఒక గుడిసెలో వైద్యశాల ఉంది. కానీ అందులో కాటన్ కు కూడా దిక్కుండదు. జలుబొచ్చినా, జబ్బుచేసినా కరాచీ నగరానికి పరుగెత్తాల్సిందే. కరెంటు పోల్స్, వాటిమధ్య తీగలూ ఉంటాయి కానీ కరెంటే ఉండదు. ఇప్పటివరకు ఆ గ్రామానికి విద్యుత్ సరఫరాలేదు. వంట చేసుకునేందుకు కట్టెలపొయ్యే దిక్కు. అదికూడా మోపు కట్టెలు రూ. 150కి తక్కువ దొరకదు. 'ఇంత దరిద్రపుగొట్టు జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారయ్యా?' అని అడిగితే ముబారక్ వాసులు చెప్పేది ఒకటే మాట.. 'మేం మా గ్రామాన్ని ప్రేమిస్తాం. సౌకర్యాలు ఉన్నా, లేకున్నా ఇక్కడే చస్తాం. ఇక్కడికొస్తే మీక్కూడా మాపై ప్రేమ కలుగుతుంది. కానీ మా పాలకులకే అది కలగట్లేదు. చూద్దాం.. అల్లా ఎప్పటికైనా కరుణించకపోడా..' అని. -
పాక్ లో 100 మంది ఉగ్రవాదుల అరెస్ట్
కరాచీ: పెషావర్ సైనిక స్కూల్ పై దాడి అనంతరం ఉగ్రవాదాన్ని అంతమొందిస్తానని ప్రతినబూనిన పాకిస్థాన్ బుధవారం 100 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ జైలు విధ్వంసం కుట్ర, కరాచీలోని మెహ్రం ఎయిర్ బేస్, జిన్నా ఎయిర్ పోర్టులపై దాడులు, కమ్రాలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి చొరబాటు తదితర కుట్రల్లో పాలుపంచుకున్న ఉగ్రవాదుల అరెస్ట్ ఉగ్రవ్యతిరేక పోరులో కీలక ఘట్టమని, అరెస్టయిన వారిలో అల్- కాయిదా, లష్కరే జంగ్వి, తెహ్రీక్ ఏ తాలిబన్ తదితర సంస్థలకు చెందినవారని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెప్టినెంట్ జనరల్ ఆసిమ్ సలేమ్ బజ్వా తెలిపారు. భారత్ భద్రతా బలగాలకు పట్టుబడి, '1999 కందహార్ హైజాక్' ఉదంతంలో అనూహ్యంగా విడుదలైన అహ్మద్ ఒమర్ సయ్యద్.. ఆ తర్వాతి కాలంలో అల్ కాయిదా చీఫ్ గా ఎదిగాడు. ప్రస్తుతం మరణశిక్షగు గురైన అతను సంధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. గతేడాది ఫిబ్రవరిలో జైలును ధ్వంసం చేసి ఒమర్ ను తమతో తీసుకెళ్లాలని ఉగ్రవాదులు కుట్రపన్నారు. అయితే పోలీసులుల అప్రమత్తతతో ఉగ్రవాదుల వ్యూహం బెడిసికొట్టింది. కరాచీ ఆపరేషన్ గా నామకరణం చేసిన ఉగ్రవాదుల పట్టివేత ఆపరేషన్ లో ఇప్పటివరకు 12 వేల మందిని అరెస్టు చేశామని, 7 వేలకు పైగా దాడులు నిర్వహించామని సలేమ్ బజ్వా పేర్కొన్నారు. -
నలుగురు పోలీసులను కాల్చి చంపారు
కరాచీ: పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పెట్రేగిపోయారు. నలుగురు పోలీసులను దారుణంగా కాల్చిచంపారు. బాలోచిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాలిబన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బైక్‌లపై వచ్చి అనూహ్యంగా ఓ పోలీసు మొబైల్ వ్యాన్‌పై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యత వహిస్తూ తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ మీడియాకు ఈమెయిల్ విడుదల చేసింది. బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇదే నెలలో ఇదే చోట ఆత్మాహుతి దాడి జరపగా ముగ్గురు సామాన్యులతోపాటు 12మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు -
సోషల్ మీడియాలో తాజా సంచలనం
-
సోషల్ మీడియాలో తాజా సంచలనం
ప్రపంచవ్యాప్తంగా సినీనటులకుండే క్రేజ్, సోషల్ మీడియాలో వాళ్ల ప్రభావం బోలెడంత! అయితే వాళ్లలో కొందరు మాత్రమే.. సినిమా ప్రమోషన్లకో, వ్యక్తిగత పాపులారిటీకో కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తుంటారు. పాకిస్థానీ నటుడు అహసాన్ ఖాన్ లాగా. రెండు రోజుల కిందట కరాచీలోని డిఫెన్స్ మార్కెట్ ప్రాంతానికి వెళ్లిన ఖాన్‌కు ఓ వృద్ధుడు తారసపడ్డాడు. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డంతో యాచకుడిలా కనిపించిన అతనికి అంతోఇంతో ఇవ్వబోయాడట ఖాన్. 'డబ్బులొద్దు. ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి' అని ఆ వృద్ధుడు ఇంగ్లీష్ లో అడిగేసరికి ఖాన్ డంగైపోయాడట! వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి ముసలాయను ఇంటర్వ్యూచేశాడు. స్వచ్ఛమైన బ్రిటిష్ ఇంగ్లీష్, మధ్యమధ్యలో హాస్యోక్తులు, అక్కడక్కడా హిందీ షాయరీలతో సాగిన ఇంటర్వ్యూను హీరో ఖాన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనం సృష్టించింది. కారు ప్రమాదంలో భార్య సహా ఏడుగురు పిల్లల్ని పోగొట్టుకున్న ఆ లాహోర్ వృద్ధుణ్ని అన్నదమ్ములు మోసం చేసి ఇంటి నుంచి గెంటేశారట. దిక్కుతోచని స్థితిలో కరాచీకి వచ్చి, అక్కడే ఓ ఇంటి వసారాలో ఉంటున్నాడట. కంప్యూటర్లు తప్ప మిగతా ఏపనైనా సరే ఇట్టే చేసేస్తానన్న వృద్ధుడి మాటలకు ఫిదా అయిన వేల మంది నెటిజన్లు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. పాక్ లో పేరుమోసిన 'ఆమ్ టెక్ సిస్టమ్స్' అనే సాఫ్ట్ వేర్ కంపెనీ అయితే ఏకంగా ఓ క్వార్టర్స్ ఇచ్చిమరీ పనిలో పెంట్టుకుంటానని ప్రకటించింది. ఇలా పేరున్న నటుడి ఫేస్ బుక్ పోస్ట్ తో అనాథ వృద్ధుడి ఆకాంక్ష నెరవేరింది. 'బీయింగ్ హ్యుమన్' బ్రాండ్ అంబాసిడర్ కాకున్నా మీ హ్యుమానిటీ ప్రశంసనీయం' అంటూ అహసాన్ ఖాన్ ను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. -
కరాచీలో చైనా డెంటిస్టుల 'మిస్సింగ్' మిస్టరీ
లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ నుంచి గుండుపిన్నుల వరకు వేలాది వస్తువుల్ని చీప్ రేట్ కే అందించడం చైనా బజార్ల ప్రత్యేకతని తెలిసిందే. వస్తు సేవలలాగే కొన్ని దేశాల్లో విస్తరించిన చైనీస్ వైద్య సేవలు కూడా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. పాకిస్థాన్ అరేబియా తీర నగరం కరాచీలోనూ చైనీస్ డెంటిస్టుల సేవలకు అమోఘమైన పేరుంది. కరాచీని ఆనుకుని ఉన్న సదార్ పట్టణంలోనైతే ఏకంగా ఏడెనిమిది వీధుల్లో చైనీస్ డెంటల్ హాస్పిటల్స్ కొలువుదీరి ఉంటాయి. చక్కటి పలువరుసతో కూడిన పెద్ద పెద్ద బొమ్మలు, వాటిపై 'ఇలాంటి పలువరుస మీకూ కావాలంటే వెంటనే లోనికి రండి' అనే ప్రకటనలు కనిపిస్తాయి. అయితే కొద్ది రోజులుగా సదార్ లోని చైనీస్ క్లినిక్ ల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది! దంత వైద్యంతోపాటు నాలుగు చైనా పలుకులూ వినొచ్చనుకుని ఆ ఆసుపత్రులకు వెళ్లే రోగులు.. లోపల చైనీస్ డాక్టర్లు కనిపించకపోవడంతో కంగారు పడుతున్నారు. విషయం మీడియాకు తెలిసి ఆరా తీయగా.. సదార్ లోని 80కిపైగా చైనీస్ డెంటల్ క్లినిక్స్ లో అలసు చైనీస్ డాక్లర్లు లేనేలేరు! కానీ, బయట బోర్డుల మీద మాత్రం డాక్టర్ హు, డాక్టర్ లీ, డాక్టర్ హాన్.. అనే పేర్లు యథావిథిగా కనిపిస్తున్నాయి. వాళ్లపేరుతో లోకల్ డాక్టర్లేమైనా మోసాలకు పాల్పడుతున్నారా అంటే అదీ లేదు. చైనీస్ డెంటిస్టుల మాదిరే తక్కువ డబ్బులు తీసుకునే పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇంతకీ చైనీస్ డాక్టర్లంతా ఏమైనట్లు? కరాచీ నగరవాసులు ప్రస్తుతం చర్చించుకుంటున్నది ఈ మిస్సింగ్ మిస్టరీ గురించే! వైద్యం ద్వారా ఉపాధి వెతుక్కుంటూ 1940ల్లో పదుల సంఖ్యలో చైనీస్ దంతవైద్యులు కరాచీకి వచ్చారు. అప్పటికింకా దంతవైద్య సేవలు అందుబాటులోలేని కరాచీలో చైనీస్ డెంటిస్టులకు మంచి ఆదరణ లభించింది. నగరంతోపాటే వారూ విస్తరించారు. నూతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పంటివైద్యం కోసం జనం చైనీస్ క్లినిక్ లకే వెళ్తున్నారు. కారణం చైనీస్ వైద్యం తక్కకువ ధరకు అందుబాటులో ఉండటమని వేరే చెప్పనక్కర్లేదు. ఇక డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ విషయానికి వస్తే.. పాకిస్థాన్ లో సెటిలైన వేలాది మంది చైనీయుల్లో అత్యధికులు సొంతగడ్డకు తిరిగి వెళ్లిపోగా, అక్కడే ఉండిపోయిన మరి కొద్ది మంది తమ పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్నారు. తొలితరం చైనీస్ డెంటిస్టులకు అప్పట్లో లభించని ఎన్నెన్నో అవకాశాలు రెండో తరం వారికి అందుబాటులోకి రావడంతో వారు కూడా విదేశాల బాటపట్టారు. కరాచీ, సదార్ సిటీల్లోని క్లినిక్ లన్న చైనీస్ డెంటిస్టుల్లో చాలా మంది ప్రస్తుతం కెనడా, అమెరికా, ఇంగ్లాండ్ లకు వలస వెళ్లారు. పోతూపోతూ తమ క్లినిక్ లను స్థానిక డాక్టర్లకు అప్పగించి వెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్నది పాకిస్థానీ డాక్టర్లే అయినప్పటికీ క్లినిక్ లు నడిచేది మాత్రం చైనీస్ బ్రాండ్ ఇమేజ్ తోనే. మరి చైనా డాక్టర్లు ఏరి? అని పేషెంట్లెవరైనా ప్రశ్నిస్తే.. 'ప్రస్తుతం వారు ఫ్యామిలీస్ తో కలిసి టూర్ కు వెళ్లారు త్వరలోనే తిరిగిస్తారు' అని బదులిస్తున్నారు లోకల్ డాక్టర్లు! -
పాకిస్తాన్ మహిళలకోసం 'గాల్స్ ఎట్ డాబాస్'!
అనాదిగా నెలకొన్న దురాచార, పురుషాధిక్య సమాజం నుంచీ ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ మహిళలు బయటకు వస్తున్నారు. వివక్షత, వేధింపులు, హింసలకు గురయ్యే నేపథ్యం నుంచి... గౌరవంగా, హక్కుగా, స్వేచ్ఛగా బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. పురుషుడు తోడులేనిదే బయటకు రాని పరిస్థితి నుంచీ... ఒంటరిగా, ధైర్యంగా తిరిగే స్థాయికి చేరారు. మహిళల్లో అటువంటి మార్పే ధ్యేయంగా ఏర్పాటు చేసిన 'గాల్స్ ఎట్ డాబాస్' అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పాకిస్తాన్ లోని బహిరంగ ప్రదేశాల్లో.. పురుషులు తోడు లేకుండా మహిళలు పబ్లిక్ ప్లేస్ లో ఒంటరిగాగాని, సమూహంతోగాని స్వేచ్ఛగా, ఆనందంగా గడిపే క్షణాల ఫొటోలను పోస్ట్ చేయమంటూ ప్రారంభించిన ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. భారత మహిళల 'వై లాయ్ టర్' ఉద్యమానికి స్పందిచిన కరాచీ జర్నలిస్ట్ సదియా ఖత్రి.. పాకిస్తాన్ మహిళల్లోనూ అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. 'గాల్స్ ఎట్ డాబాస్' పేరిట ఉద్యమానికి నాంది పలికింది. భారత నగరాల్లోని మహిళలను . 'వై లాయ్ టర్' ఎలా ప్రోత్సహించిందో తెలుసుకొని, భారతీయ నిర్వాహకులతో కలిసి పాకిస్తాన్ లో ఉద్యమం తెచ్చేందుకు నిర్ణయించింది. 'వై లాయ్ టర్' ద్వారా మహిళలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, కచ్చితంగా మాట్లాడగల్గుతున్నారని... భారతదేశంలో జరిగిన ప్రచారాన్నే పాకిస్తాన్ కు పరిచయం చేయాలని ప్రతిన బూనింది. కరాచి, ఇస్లామాబాద్, లాహోర్లతోపాటు అనేక పాకిస్తానీ నరగాల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. పాకిస్తానీ మహిళలు తమ ఇళ్ళనుంచి బయటకు వచ్చి... సమావేశాల్లో పాల్గొని, ఎటువంటి ఆందోళనా లేకుండా సమయం గడపడంతో ఖత్రి ప్రయత్నం కొంతవరకూ సఫలమైంది. పాకిస్తాన్ లో పబ్లిక్ ప్లేస్ లు మహిళలకు నరక కూపాలుగా ఉన్నాయని, రోడ్లపై 25 మంది పురుషులకు ఒక్క మహిళ కనిపించడం కష్టమని, ఈ నిష్పత్తి ఇలా ఉంటే ఇక మహిళలు హాయిగా వీధుల్లో తిరగడం కనిపించే అవకాశమే లేదని ఖత్రి అంటుంది. ఎటువంటి అవసరం ఉన్నా పురుషుడు తోడు లేనిదే బయటకు వెళ్ళలేని పరిస్థితి అక్కడి మహిళలదని, అత్యవసర పరిస్థితుల్లోనూ ఒకరికోసం వేచి చూడాల్సిందేనని అంటుంది. 'వై లాయ్ టర్' స్ఫూర్తిగా పాకిస్తానీ మహిళల్లో స్ఫూర్తిని రగిల్చేందుకు ఖత్రి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లను వినియోగించుకొని మహిళలు తమ అభిప్రాయాలను హాయిగా వెలిబుచ్చేందుకు వేదికలుగా మార్చింది. తోడు లేకుండా బయటకు రాలేని నిస్సహాయ స్థితి నుంచి వారు స్వేచ్ఛా ప్రపంచంలో విహరించేట్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పురాతన దురాచారాల లోతుల్లో పాతుకుపోయిన భావాలనుంచి అక్కడి మహిళలను బయటకు తేవడం కొంత కష్టమే అయినా... పదిమంది సభ్యులు కలిగిన 'గాల్స్ ఎట్ డాబాస్' టీమ్.. సోషల్ మీడియాద్వారా అవగాహన కల్పిస్తూ మహిళల్లో మార్పుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఉద్యమాన్నికేవలం సోషల్ మీడియా ద్వారా నడపడం కష్టమేనంటున్న టీమ్... కనీసం విలువలు, హక్కుల గురించైనా తెలిపేందుకు ఇదో ప్రమాదంలేని, ఉచిత మార్గమని భావిస్తోంది. అయితే ప్రస్తుతం మహిళలను అగౌరవంగా, అతి హేయంగా చూస్తున్న సమాజంలో ఉన్నామని, కనీసం ఓ డాబా వద్ద చాయ్ తాగేందుకు, పబ్లిక్ ప్లేస్ లో ఆనందంగా గడిపేందుకు అవకాశం లేకుండా ఉందని ఖత్రి అంటోంది. హక్కులు, స్వేచ్ఛపై పాకిస్తానీ మహిళల్లో అవగాహనకు తమ ప్రయత్నం కొంత మాత్రమైనా సహకరిస్తుందని ఖత్రి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
'నన్ను ఫేస్బుక్లో ఫ్రెండ్‌గా చేర్చుకోరా ప్లీజ్'
న్యూఢిల్లీ: సాధారణంగా ఫేస్బుక్ గురించిన చర్చ పట్టణాల నుంచి పల్లెల్లోకి.. పక్కా మాస్ భాషలో చెప్పాలంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు చర్చ జరగని చోటు లేదు. దీని గురించిన ఆలోచన రాగానే తనకు ఒక ఫేస్ బుక్ ఖాతా ఉంటే బావుంటుందనిపించి ఎంతోమంది ఫేస్ బుక్ ఖాతాను తెరుస్తారు. అయితే, తెరిచేంత వరకు ఒక బాధైతే తెరిచిన తర్వాత మరొక బాధ. తనకు ఎవరూ ఫ్రెండ్స్ రావడం లేదే, తనను ఎవరూ ఫ్రెండ్ గా చేర్చుకోవడం లేదే.. తాను పెట్టిన అంశానికి, ఫొటోకు లైక్ లు కొట్టడం లేదే, కామెంట్ లు పెట్టడం లేదే అంటూ మనసులో కొంత ఆందోళన ఉండే ఉంటుంది. ఈ క్రమంలో అసలు ఆ ఖాతాను గాలికొదిలేసేవారు చాలామందే ఉన్నారు. కానీ, పాకిస్థాన్ లో కరాచీకి చెందిన రెహాన్ అల్లవాలా అనే వ్యక్తి మాత్రం అలా కాదు. కాస్త భిన్నంగా ఆలోచించాడు. ఎలాగైనా తనకు ఫేస్ బుక్ లో లక్షల్లో స్నేహితులు ఉండాలని కోరుకున్నాడు. బాగా ఆలోచించి 'నన్ను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా చేర్చుకోరా' అంటూ రహదారిపక్కనే పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటుచేశాడు. అందులో తన ఫొటోను, ఫేస్ బుక్ ఖాతా వివరాలను అందులో పెట్టి తనను ఫాలో అవ్వాల్సిందిగా, స్నేహితుడిగా చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. తనకు లక్షల్లో స్నేహితులను పొందాలని ఉందని చెప్పాడు.