Pakistan Becomes First Side to Win 18 T20Is in a Calendar Year After Win Against West Indies - Sakshi
Sakshi News home page

PAK Vs WI: ప్రపంచ రికార్డు సాధించిన పాకిస్తాన్‌.. ఏకైక జట్టుగా!

Published Tue, Dec 14 2021 2:03 PM | Last Updated on Tue, Dec 14 2021 5:19 PM

Pakistan becomes first team to record most wins in a calendar year - Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్‌ ప్రపంచ రికార్డు సాధించింది. టీ20ల్లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన తొలి జట్టుగా పాక్‌ నిలిచింది. సోమవారం కరాచీ వేదికగా వెస్టిండీస్‌తో జరగిన తొలి టీ20లో విజయం సాధించిన పాకిస్తాన్‌.. 18 విజయాలతో ఈ ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. కాగా చివరి 11 టీ20ల్లో 10 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ విజయం సాధించింది. 2021 ఏడాదిలో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడిన పాక్‌.. 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 6 మ్యాచ్‌ల్లో ఓటమి, మరో మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

కాగా జట్టు విజయాల్లో కెప్టెన్‌ బాబర్‌ ఆజాం, మహమ్మద్‌ రిజ్వాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 ఏడాదిలో వీరిద్దరూ 1208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2021లో  బాబర్‌ 853 పరుగులు సాధించగా, రిజ్వాన్‌ 1201 పరుగులు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2021లో అద్బుతంగా రాణించిన పాకిస్తాన్‌.. అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

చదవండి: Rohit Sharma- Virat Kohli: టెస్టులకు రోహిత్‌ దూరం.. వన్డే సిరీస్‌ నుంచి కోహ్లి అవుట్‌.. అసలేం జరుగుతోంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement