t20 matches
-
నలుగురికి తొలిసారి చోటు
ముంబై: ఈనెల 28 నుంచి ముంబైలో ఆ్రస్టేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్లు సైకా ఇషాక్ (బెంగాల్), మన్నత్ కశ్యప్ (పంజాబ్), ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (కర్ణాటక), మీడియం పేస్ బౌలర్ టిటాస్ సాధు (బెంగాల్)లకు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు లభించింది. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన 21 ఏళ్ల శ్రేయాంక, 28 ఏళ్ల సైకా ఇషాక్ మూడు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టి ఆకట్టుకున్నారు. మన్నత్, టిటాస్ సాధు ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఆ్రస్టేలియాతో మూడు వన్డేలు డిసెంబర్ 28, 30, జనవరి 2న వాంఖెడె స్టేడియంలో... మూడు టి20 మ్యాచ్‌లు జనవరి 5, 7, 9 తేదీల్లో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు సిరీస్‌లలో భారత జట్లకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరిస్తారు. వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన 16 మంది బృందంలో రెండు మార్పులతో టి20 జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో ఉన్న స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ స్థానాల్లో టి20 జట్టులో కనిక అహూజా, మిన్ను మణి వచ్చారు. భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుక సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్. -
తొలి టి20.. భారత్ ముంగిట అరుదైన రికార్డు; పాక్ మనకంటే ముందే?
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకుంది. టెస్టు సిరీస్‌ను 1-0తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20 సిరీస్‌పై కన్నేసింది. రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాలు ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తొలి టి20లో తలపడనుంది. ఐపీఎల్లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లు విండీస్‌తో టి20 సిరీస్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే జైశ్వాల్ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక గిల్, ఇషాన్ కిషన్‌లు వన్డే సిరీస్‌లో అద్బుతంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీలతో మెరిశాడు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఫినిషర్స్‌గా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు తమ వంతు పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. టి20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఇంతకముందు పాకిస్తాన్ మాత్రమే ఈ మార్క్‌ను దాటింది. ఓవరాల్‌గా పాకిస్తాన్ 223 టి20 మ్యాచ్‌లు ఆడింది. దీంతో తొలి టి20 మొదలవ్వగానే ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఈ రికార్డును అందుకోనుండడం విశేషం. కాగా ఇప్పటివరకు 199 టి20 మ్యాచ్‌లాడిన టీమిండియా 127 విజయాలు, 63 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Ishan- Gill: వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! -
Ind Vs SA 1st T20: మిల్లర్, డసెన్ విధ్వంసం.. భారత్ ఓటమి
న్యూఢిల్లీ: టి20ల్లో భారత్ జైత్రయాత్ర ముగిసింది. వరుసగా 13వ విజయం సాధించేందుకు ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా... అనుభవం లేని బౌలింగ్‌తో భారత్ తేలిపోయింది. గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్‌డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు. 200కుపైగా పరుగులు చేశాక భారత్ ఓడటం ఇదే తొలిసారి కాగా...దక్షిణాఫ్రికా టి20ల్లో ఇదే అత్యధిక ఛేదన. రెండో టి20 ఆదివారం కటక్‌లో జరుగుతుంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ అర్ధ శతకం భారత్ తొలి 5 ఓవర్లలో 36/0 స్కోరే చేసింది. ఈ సాదాసీదా స్కోరు తర్వాతి 5 ఓవర్లలో పూర్తిగా మారింది. ఓపెనర్లు కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (15 బంతుల్లో 23, 3 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పారు. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో గైక్వాడ్ సిక్స్, కిషన్ 2 ఫోర్లు బాదాడు. భారత్ స్కోరు 50 దాటింది. పార్నెల్ ఓవర్లోనూ భారీ సిక్సర్ బాదిన రుతురాజ్ మరో షాట్‌కు యత్నించి బవుమా చేతికి చిక్కాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) క్రీజులోకి రాగా... 8, 9, 10వ ఓవర్లలో ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు దంచేయడంతో జట్టు స్కోరు 100 దాటింది. అయ్యర్ బ్యాట్ ఝళిపిస్తున్న దశలో కేశవ్ వేసిన 11వ ఓవర్లో సఫారీ వికెట్ కీపర్ డికాక్ సులువైన స్టంపింగ్‌ను మిస్ చేశాడు. సిక్సర్‌తో కిషన్ (37 బంతుల్లో; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని తర్వాతి బంతిని గాల్లోకి లేపగా అది మిడ్వికెట్లో ముగ్గురు ఫీల్డర్ల మధ్యలో నేలపాలైంది. ధాటిగా ఆడిన పంత్, పాండ్యా ఇషాన్, అయ్యర్ 6.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. కేశవ్ మహరాజ్ వేసిన 13వ ఓవర్లో కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుసగా 2 సిక్సర్లు, 2 బౌండరీలతో 20 పరుగులు పిండాడు. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి రివ్యూతో బయటపడ్డాడు. కానీ ఆఖరి బంతికి మళ్లీ షాట్ ఆడి లాంగాన్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే శ్రేయస్ జోరుకు ప్రిటోరియస్ బ్రేకులేశాడు. అయితే ఆఖరి 4 ఓవర్లలో కెప్టెన్ పంత్, హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా బౌలర్లకు ముచ్చెమటలు తప్పలేదు. 17వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ బౌండరీతో పంత్ 18 పరుగులు రాబట్టగా, 18వ ఓవర్లో హార్దిక్ 4, 6తో 13 పరుగులు వచ్చాయి. మళ్లీ పాండ్యా సిక్స్, ఫోర్‌తో 19 ఓవర్లోనే భారత్ 200 పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో పంత్ అవుటవ్వగా, పాండ్యా సిక్సర్‌తో మరో 9 పరుగులు జతయ్యాయి. మిల్లర్, డసెన్ మెరుపు ఫిఫ్టీలతో... భారీ లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే కెప్టెన్ బవుమా (10) వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో 3 సిక్సర్లతో చెలరేగిన ప్రిటోరియస్ (13 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్సర్లు)ను తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ బౌల్డ్ చేశాడు. కాసేపటికి ఓపెనర్ డికాక్ (22)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చడంతో భారత్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది. కానీ తర్వాత వచ్చిన మిల్లర్, డసెన్ భారీ షాట్లతో కొండంత లక్ష్యాన్ని కరిగించడంతో ఆ ఉత్సాహం కాస్తా నీరుగారింది. మిల్లర్ 22 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. హర్షల్ వేసిన 17వ ఓవర్లో డసెన్ 6, 6, 4, 0, 6, 0తో 22 పరుగులు పిండేశాడు. దీంతో 37 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అతని ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. 36 బంతుల్లో 78 పరుగుల అసాధ్యమైన సమీకరణాన్ని ఇద్దరు మెరుపులతో మార్చేశారు. వారి బ్యాటింగ్ వేగానికి భారత పేసర్లు అడ్డుకట్ట వేయలేకపోవడంతో 200 పైచిలుకు పరుగులు చేసినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. 29 పరుగుల వద్ద వాన్ డెర్ డసెన్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ వదిలేయడం కూడా దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ఆ తర్వాత డసెన్ మరో 46 పరుగులు సాధించాడు. దినేశ్ కార్తీక్ నాడు–నేడు భారత్ తమ తొలి టి20 మ్యాచ్‌ను 2006లో ఆడింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్ భారత్‌కు 160వది...నాటి తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. జూన్ 1న 37వ పుట్టిన రోజు జరుపుకున్న కార్తీక్ ఒక్కడే అప్పటి బ్యాచ్‌నుంచి ఇంకా రిటైర్ కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) కేశవ్ 76; రుతురాజ్ (సి) బవుమా (బి) పార్నెల్ 23; అయ్యర్ (బి) ప్రిటోరియస్ 36; పంత్ (సి) వాన్‌డెర్ డసెన్ (బి) నోర్జే 29; పాండ్యా నాటౌట్ 31; దినేశ్ కార్తీక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–57, 2–137, 3–156, 4–202. బౌలింగ్: కేశవ్ 3–0–43–1, రబడ 4–0–35–0, నోర్జే 4–0–36–1, పార్నెల్ 4–0–32–1, షమ్సీ 2–0–27–0, ప్రిటోరియస్ 3–0–35–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ఇషాన్ (బి) అక్షర్ 22; బవుమా (సి) పంత్ (బి) భువనేశ్వర్ 10; ప్రిటోరియస్ (బి) హర్షల్ 29; వాన్‌డెర్ డసెన్ నాటౌట్ 75; మిల్లర్ నాటౌట్ 64; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–22, 2–61, 3–81. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–43–1, అవేశ్ 4–0–35–0, చహల్ 2.1–0–26–0, పాండ్యా 1–0–18–0, హర్షల్ 4–0–43–1; అక్షర్ 4–0–40–1. That's that from the 1st T20I. South Africa win by 7 wickets and go 1-0 up in the 5 match series.#TeamIndia will look to bounce back in the 2nd T20I. Scorecard - https://t.co/YOoyTQmu1p #INDvSA @Paytm pic.twitter.com/1raHnQf4rm — BCCI (@BCCI) June 9, 2022 -
ప్రపంచ రికార్డు సాధించిన పాకిస్తాన్.. ఏకైక జట్టుగా!
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సాధించింది. టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. సోమవారం కరాచీ వేదికగా వెస్టిండీస్‌తో జరగిన తొలి టీ20లో విజయం సాధించిన పాకిస్తాన్.. 18 విజయాలతో ఈ ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. కాగా చివరి 11 టీ20ల్లో 10 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ విజయం సాధించింది. 2021 ఏడాదిలో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడిన పాక్.. 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 6 మ్యాచ్‌ల్లో ఓటమి, మరో మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. కాగా జట్టు విజయాల్లో కెప్టెన్ బాబర్ ఆజాం, మహమ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 ఏడాదిలో వీరిద్దరూ 1208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2021లో బాబర్ 853 పరుగులు సాధించగా, రిజ్వాన్ 1201 పరుగులు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో అద్బుతంగా రాణించిన పాకిస్తాన్.. అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Virat Kohli: టెస్టులకు రోహిత్ దూరం.. వన్డే సిరీస్ నుంచి కోహ్లి అవుట్.. అసలేం జరుగుతోంది? The Pakistani pacer YORKER! The latest exponent! 🔥🔥🔥 pic.twitter.com/ebcALFbfEN — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 -
బంగ్లాదేశ్ పర్యటనకు ఆస్ట్రేలియా.. జట్టు ఇదే!
ఢాకా: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆసీస్ 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ధృవీకరించారు. ఇక 2017 తర్వాత మెదటిసారిగా ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ప్రస్తుతం వెస్ట్ఇండీస్ పర్యటనలో ఉన్న ఆసీస్ నేరుగా బంగ్లాదేశ్ చేరుకోనుంది. ఢాకాలో కఠిన నిబంధనల మధ్య 3 రోజులు పాటు క్వారంటైన్లో ఉండునుంది. మరోవైపు జింబావ్వే పర్యటనలో ఉన్న బంగ్లా జట్టు ఈ నెల 29న స్వదేశానికి చేరుకోనుంది. ఈ సీరిస్ లో భాగంగా మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఢాకా వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఆడుతున్న జట్టును కొనసాగించనుంది. ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, వెస్ అగర్, జాసన్ బెహ్రిండోర్ఫ్, అలెక్స్ కారీ, డాన్ క్రిస్టియన్, జోష్ హాజిల్‌వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, అష్టన్ టర్నర్, ఆండ్రూ టై , మాథ్యూ వేడ్ (వైస్ కెప్టెన్), ఆడమ్ జాంపా. -
ఇంగ్లండ్‌దే టి20 సిరీస్
మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 2–1తో సొంతం చేసుకుంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ (57 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 35 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ జట్టు 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ జేసన్ రాయ్ (36 బంతుల్లో 64; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మలాన్ (31; 2 ఫోర్లు), మోర్గాన్ (12 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. పాక్ స్పిన్నర్ హఫీజ్ 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. -
సారథ్యంపై ఎక్కువగా ఆలోచించను: రోహిత్
న్యూఢిల్లీ: సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని... అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లికి పొట్టి ఫార్మాట్లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్ ఓపెనర్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. బంగ్లాతో టి20ల కోసం పగ్గాలు చేపట్టిన ఈ ఓపెనర్ ఇది ముణ్నాళ్ల ముచ్చటైనా... తనకెలాంటి బాధలేదని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలని చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తనను లాగొద్దని... జట్టుకు అవసరమైన ప్రతీసారి నాయకత్వం వహించేందుకు సిద్ధమేనన్నాడు. మీడియాతో రోహిత్ మాట్లాడుతూ ‘కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదు. కెప్టెన్‌గా ఒక మ్యాచ్ అయినా వంద మ్యాచ్‌లయినా... అదో గౌరవం. ఆట నేర్చుకునేటపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుంటాం. నేను కెప్టెన్‌గా ఇంతకుముందు వ్యవహరించాను. ఆ అనుభవాన్ని అస్వాదిస్తున్నాను. ఇది ఎన్నాళ్లుంటుందోనన్న బెంగలేదు. కొన్నాళ్లే అన్న బాధ లేదు’ అని అన్నాడు. -
హైదరాబాద్‌లో వన్డే, వైజాగ్‌లో టి20
న్యూఢిల్లీ: వచ్చే నెలలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఫిబ్రవరి 24నుంచి 13 మార్చి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 టి20 మ్యాచ్‌లు, 5 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను గురువారం అధికారికంగా ప్రకటించారు. వన్డే ప్రపంచ కప్‌కు ముందు ఈ పోరు జరుగుతుండటంతో ఇరు జట్లు కూడా తమ వరల్డ్ కప్ టీమ్‌ల ఎంపిక, సన్నాహకాల కోసం వన్డే సిరీస్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. షెడ్యూల్లో భాగంగా ఫిబ్రవరి 27న విశాఖపట్నంలో రెండో టి20 మ్యాచ్... మార్చి 2న హైదరాబాద్‌లో తొలి వన్డే జరుగుతాయి. -
టీ20లోనూ ఆర్థిక సూత్రాలు
ఏటా ఐపీఎల్ కోట్లాది మంది క్రికెట్ ప్రియులకు ఎంతో వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అటువంటిది. అయితే, టి20 మ్యాచ్‌లు వినోదంతోపాటు, రంగరించిన ఆర్థిక సూత్రాలను కూడా తెలియజేస్తాయి. ఆటలో భాగంగా అనుసరించే ఎన్నో విధానాలను పెట్టుబడులకు అన్వయించడం ద్వారా నిర్ణీత కాలంలో లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే మనీ మ్యాచ్‌లో విజయం సాధించడం సులభమే. ఆరంభం నుంచే... టి20 మ్యాచ్‌లో తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ చివరి బంతి వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించడం ద్వారానే పెద్ద స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇదే సూత్రం పెట్టుబడులకు వర్తిస్తుంది. జీవితంలో ఆర్జన మొదలైన తర్వాత సాధ్యమైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. దానివల్ల దీర్ఘకాలంలో ఎన్నో రెట్లు ప్రతిఫలాలు అందుకోవచ్చు. రిటైర్మెంట్ నాటికి పెద్ద నిధి సమకూరుతుంది. పిచ్ పరిశీలన (గ్రౌండ్ చెకింగ్).. ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు టాస్ వేసే ముందు మైదానంలోని పిచ్‌ను పరిశీలించడం తెలిసిందే. దీని ద్వారా పిచ్ పరిస్థితి ఎలా ఉంది, టాస్ గెలిస్తే, ఓడితే ఏది ఎంచుకోవాలన్న అంచనాకు రాగలరు. ఇదే మాదిరిగా పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా ఏవి కొనుగోలు చేయాలి, ఏవి విక్రయించాలన్నది తెలుసుకోవచ్చు. లక్ష్యానికి కట్టుబడి ఉండటం ఆటలో ఎన్ని అవరోధాలు ఎదురైనా జట్టు సభ్యుల పోరాటం చివరి బంతి వరకూ కొనసాగాల్సిందే. ఒకటి రెండు బంతులు, ఓవర్లు ఫలితాలను తారు మారు చేయగలవు. అలాగే, పెట్టుబడులకు సంబంధించి కూడా మార్కెట్లలో ఆటుపోట్లు, కరెక్షన్లకు భయపడిపోకుండా లక్ష్యం మేరకు పెట్టుబడులను కొనసాగిస్తూ వెళ్లాలి. అప్పుడే అనుకున్న మేర సంపద సృష్టి సాధ్యమవుతుంది. ప్రణాళిక ప్రతీ మ్యాచ్‌లో మధ్యలో కాస్తంత విరామం ఉంటుంది. ఆ సమయంలో జట్లు తమ వ్యూహంపై చర్చించుకోవడం జరుగుతుంది. మిగిలి ఉన్న ఆట సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇందులో నిర్ణయం తీసుకుంటారు. అలాగే, పెట్టుబడి పెట్టే ముందు కూడా ఆర్థిక సలహాదారునితో ఓ సారి చర్చించి తగిన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో అవసరం. రిస్క్‌తోనే రాబడులు ఆటలో ప్రతీ బంతిని డిఫెన్స్‌తో ఆడితే కుదరదు. మధ్య మధ్యలో వీలునుబట్టి సిక్సర్, ఫోర్ కొట్టడం ద్వారానే అధిక స్కోరు సాధ్యమవుతుంది. అలాగే, పెట్టుబడులకు సంబంధించి కొంత మేర రిస్క్ ఉన్నాగానీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. దాంతో అధిక రాబడులు ఆర్జించొచ్చు. మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు పెట్టుబడుల ద్వారా లక్ష్యాలను సులభంగా చేసుకోవచ్చు. వైవిధ్యం .. టి20 మ్యాచ్‌లో పెద్ద స్కోరు సాధించాలన్నా, ప్రత్యర్థి జట్టును అధిక స్కోరు చేయకుండా కట్టడి చేసి విజయం సాధించాలన్నా అందుకు జట్టులో సమన్వయంతోపాటు వైవిధ్యం ఉండాలి. మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు, వికెట్ కీపర్ ఇలా అందరితోనే చక్కని జట్టు సమకూరుతుంది. అప్పుడే లక్ష్య సాధన సులభమవుతుంది. అలాగే, పెట్టుబడుల్లోనూ వైవిధ్యం అవసరం. భిన్న రకాల సాధనాలను ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇలా అన్నింటి మిశ్రమం ఉండాలి. ఈక్విటీలు మాత్రమేకాదు, డెట్‌లో కొంత, బంగారం, రియల్టీల్లోనూ పెట్టుబడులను వర్గీకరించుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకుని మెరుగైన రాబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. స్థిరత్వం... క్రికెట్ ఆట కొనసాగుతున్నంత సేపు స్టేడియంలో వీక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. వీక్షకుల కామెంట్లను పాజిటివ్‌గా తీసుకుంటే ఆటగాళ్లు మరింత మెరుగ్గా ఆడగలరు. అనుభవం కలిగిన ఆటగాళ్లు వీటిని పట్టించుకోకుండా ఆటపై, లక్ష్యంపైనే దృష్టి సారిస్తుంటారు. అలాగే, ఓ ఇన్వెస్టర్‌గా మార్కెట్ల ర్యాలీలు, కరెక్షన్ సమయాల్లో ప్రతికూల వార్తలకు కలత చెందకూడదు. అవి ఆయా సమయాల్లో స్వల్పకాలం పాటు వినిపించేవి మాత్రమే. వీటిని పట్టించుకోకుండా ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం వల్ల మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యూహాలు బౌలర్ అయినా, బ్యాట్స్‌మన్ అయినా ఇతరుల స్ట్రాటజీ ఏంటన్నది తెలుసుకోవడం అవసరం. అప్పుడే వారు తమ లక్ష్య సాధనకు పదును పెట్టగలరు. పెట్టుబడులకు దీన్ని అన్వయించి చూస్తే.. తగిన పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల విధానాలను తెలుసుకునేందుకు మంచి ఆర్థిక సలహాదారు ఎంపిక అన్నది కీలకం. ఆటకు మాదిరే పెట్టుబడులకూ వ్యూహం ఉండాలి. అప్పుడే వాటిపై ప్రతిఫలాన్ని పొందగలరు. పనితీరు విశ్లేషణ ప్రతీ ఆటగాడికి సంబంధించి జట్టు కెప్టెన్ విశ్లేషణ చేయడం సహజం. అప్పుడే జట్టులో మార్పు, చేర్పుల ద్వారా మంచి సమతూకంతో కూడిన జట్టు నిర్మాణం సాధ్యమవుతుంది. రాణించలేకపోతున్న వారిని తప్పించడం, ప్రతిభ కలిగిన వారికి అవకాశం ఇవ్వడం, పిచ్ తగ్గట్టుగా జట్టులో మార్పులు చేయడం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. అలాగే, మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం అదే పనిగా నష్టాల్లోనే ప్రయాణిస్తుంటే, రాబడులను ఇవ్వలేకపోతుంటే ఆ పథకం నుంచి వైదొలగడం చేయాల్సి ఉంటుంది. మరో మంచి పథకాన్ని పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకోవాలి. -
కోహ్లి ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే
న్యూఢిల్లీ : తీరిక లేని మ్యాచ్‌లతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, బిజీ షెడ్యూల్‌పై పునరాలోచించాలని ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ప్రతిపాదనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్( ఎఫ్టీపీ) మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గించారు. 2019 నుంచి 2023 మధ్య 390 రోజులు ఆడాల్సి ఉండగా ఈ సంఖ్యను 306 రోజులకు తగ్గించారు. ఈ ప్రణాళికలో 2021 చాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లను లెక్కించలేదు. ఈ టోర్నీల్లో టీమిండియా ఆడే మ్యాచ్‌లను కలిపినా ఈ సంఖ్య 350కు మించదు. అయితే ప్రస్తుత ఎఫ్టీపీతో పోలిస్తే 2019-2023 ఎఫ్టీపీ ప్రకారం టీమిండియా మూడు రెట్లు ఎక్కువగా టీ20లు ఆడనుందని సమాచారం. ఈ మధ్యకాలంలో భారత్ 50 శాతం మ్యాచ్‌లను పెద్ద జట్లైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడింది. ఈ అన్ని జట్లతో లాంగ్ ఫార్మట్ సిరీస్‌లు ఎక్కువగా ఆడింది. దీంతో ఎక్కువ రోజులు ఆడాల్సి రావడంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. వచ్చే ఎఫ్టీపీలో టెస్టు, వన్డేలను తగ్గిస్తే మ్యాచ్‌లు ఆడే రోజులు తగ్గుతాయని, అలాగే మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ ప్రత్యామ్నాయంగా టీ20ల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది. -
సెలక్ట్ చేయకున్నా గౌరవిస్తా: రహానే
సాక్షి, ముంబై: తనను జట్టులోకి ఎంపిక చేయకుండా సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని టీమిండియా ఓపెనర్ అజింక్యా రహానే తెలిపారు. ఇక ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న రహానేకు టీ20 తుదిజట్టులో చోటు దక్కలేదు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 7 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయానంతరం ప్రకటించిన టీ20 జట్టు 15 మంది సభ్యుల్లో రహానే పేరు ప్రకటించలేదు. శిఖర్ ధావన్ జట్టులోకి రాగా రహానేకు ఉద్వాసన పలికారు. దీనిపై రహానే ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘ టీం మేనేజ్మెంట్, సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా. ఆటగాళ్ల మధ్య పోటీ మంచి ప్రదర్శనకు కారణమవుతోంది. ఈ పోటీని ప్రతిసారి ఆస్వాదిస్తాను. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనర్‌గా రాణించడం చాల సంతోషాన్నిచ్చింది. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఫామ్‌ను కొనసాగించడం సంతృప్తినిచ్చింది. ఈ సిరీస్‌లో వరుసగా సాధించిన హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలిచాల్సింది. రోహిత్‌తో జట్టకు మంచి శుభారంభాన్ని అందించా. వచ్చే సిరీస్‌లలో నాకు అవకాశం లభిస్తే ఈ హాఫ్ సెంచరీలను శతకాలుగా మలుస్తా. ఇక జట్టు ప్రదర్శన గర్వించదగ్గ విషయం. మా లక్ష్యం ఒకటే 2019 వరల్డ్‌కప్. ఆ దిశగా ముందుకు సాగుతున్నామని’ రహానే పేర్కొన్నారు. టీ20 జట్టులో ధావన్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తిక్‌లకు చోటు దక్కింది. -
ప్రతిసారీ పైచేయే!
భారత్, పాకిస్తాన్ల మధ్య ఇప్పటివరకూ ఏడు టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఆరుసార్లు గెలిస్తే పాక్ ఒక్కటి నెగ్గింది. అయితే వన్డే ప్రపంచకప్ తరహాలోనే టి20 ప్రపంచకప్‌లలోనూ భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ దాయాదిని చిత్తుచేసింది. మరోసారి ఈ రెండు దేశాల మధ్య రేపు (శనివారం) మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... టి20 ప్రపంచకప్‌లలో భారత్, పాక్ పోరులను ఒకసారి గుర్తు చేసుకుందాం. బౌల్ ‘అవుట్’ - 13 సెప్టెంబర్, 2007 (డర్బన్) మొదటి టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉతప్ప (50), ధోని (33) రాణించడంతో భారత్ 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. అనంతరం పాక్ 7 వికెట్లకు సరిగ్గా 141 పరుగులే చేసింది. దీంతో ఫలితం కోసం బౌల్ అవుట్ పద్దతిని అనుసరించారు. దీనిని ఆటగాళ్లకు వివరించడం కూడా అప్పట్లో అంపైర్లకు పెద్ద పరీక్షలా మారింది. ముగ్గురు భారత బౌలర్లు హర్భజన్, సెహ్వాగ్, ఉతప్ప నేరుగా బౌలింగ్ చేసి స్టంప్స్‌ను పడగొట్టగా... పాక్ తరఫున అరాఫత్, గుల్, ఆఫ్రిది విఫలమయ్యారు. దాంతో 3-0తో చిరస్మరణీయ విజయం భారత్ సొంతమైంది. కెప్టెన్‌గా ధోని కెరీర్లో ఇదే మొదటి విజయం కావడం విశేషం. టి20ల్లో కొత్త అధ్యాయం -24 సెప్టెంబర్, 2007 (జొహన్నెస్‌బర్గ్) భారత్, పాక్ ఓ ప్రపంచకప్ మ్యాచ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కూడా అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. గంభీర్ (75)కి రోహిత్ (30 నాటౌట్) అండగా నిలిచాడు. 2 వికెట్లు కోల్పోయినా 33 బంతుల్లో 53 పరుగులు చేసి పాక్ జోరుగా దూసుకుపోయింది. ఈ దశలో నజీర్‌ను ఉతప్ప అద్భుతంగా రనౌట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఒత్తిడిలో పడి పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా (43) జట్టును గెలిపించేలా కనిపించాడు. చివరి 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో జోగీందర్ బౌలింగ్‌లో మిస్బా కొట్టిన స్కూప్ షాట్ టి20 క్రికెట్‌కు కొత్త అధ్యాయం సృష్టించింది. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌తో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. పూర్తిగా ఏకపక్షం - 30 సెప్టెంబర్, 2012 (కొలంబో) శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో భారత్ పూర్తి సాధికారతతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 2 బంతులు మిగిలి ఉండగా 128 పరుగులకే ఆలౌటైంది. బాలాజీ 3 వికెట్లు తీశాడు. అనంతరం విరాట్ కోహ్లి (78 నాటౌట్) దూకుడుతో మూడు ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లకు 129 పరుగులు చేసి భారత్ ఏకపక్ష విజయం సాధించింది. మరోసారీ అలవోకగా... -21 మార్చి, 2014 (మిర్పూర్) బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో ఎక్కడా కనీస పోటీ కూడా కనిపించకుండా పాక్‌పై భారత్ మరోసారి అలవోకగా గెలిచింది. ముందుగా పాక్ 7 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపు సొంతం చేసుకుంది. 2 కీలక వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. -
మనింట్లో ధనాధన్ పండుగ
గత నెల రోజు లుగా భారత జట్టు ఆడుతున్న టి20 మ్యాచ్‌లు, సాధిస్తున్న విజ యాలతో సంబరపడిపోతున్నాం. కానీ వాటన్నింటిని మించిన పోరాటం మన దగ్గర ప్రారంభం కాబోతోంది. టి20 ప్రపంచ సమరానికి భారత్ ఈసారి ఆతిథ్యం ఇస్తోంది. రేపటి నుంచి (మంగళవారం) ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఎనిమిది దేశాలు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడతాయి. రెండు గ్రూప్‌ల్లో విజేతలుగా నిలిచిన జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇక అసలు టోర్నీలో 8 ప్రధాన జట్లతో పాటు ఈ రెండు జట్లు కూడా ఆడతాయి. దేశవ్యాప్తంగా ఏడు వేదికల్లో జరిగే ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 2007లో టి20 ప్రపంచకప్ తొలిసారి జరిగినప్పుడు ఈ ఫార్మాట్ చాలామందికి కొత్త. కానీ భారత్ ఆ టైటిల్ గెలవడంతో ఐపీఎల్ రూపంలో ప్రపంచం అబ్బురపడేలా టి20 లీగ్ వచ్చింది. దీంతో క్రికెట్ దిశ, దశ మారిపోయాయి. ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇంతకాలం ప్రతి ఏటా ఐపీఎల్‌తో అంతులేని వినోదాన్ని అందుకుంటున్న భారత అభిమానులు ఈ ఏడాది ఐపీఎల్ కంటే ముందే ప్రపంచకప్ పండుగను ఆస్వాదించవచ్చు. తొలిసారి 2007లో టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు 4 టోర్నీల్లో ఆడినా ఒక్కసారి మళ్లీ కప్‌ను అందుకోలేదు. తొలిసారి సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌ను సాధించి... ధోనిసేన మరోసారి ము వ్వన్నెలను రెపరెపలాడించాలనేది కోట్లాది భారత అభిమానుల ఆశ, ఆకాంక్ష. ఇక రేపటి నుంచి ఈట్ క్రికెట్... స్లీప్ క్రికెట్...! -
టి-20 క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్
వాషింగ్టన్: అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడం కోసం దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ తదితరులు టి-20 మ్యాచ్‌లు ఆడనున్నారు. నవంబర్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 7న న్యూయార్క్‌లో, 11న హోస్టన్‌లో, 14న లాస్ ఏంజిలెస్‌లో బేస్‌బాల్ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సచిన్, వార్న్, వసీం అక్రమ్, బ్రియన్ లారా, కలిస్, మైకేల్ వాన్, మహేల జయవర్ధనే సహా దాదాపు 25 మంది దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటారు. -
వైజాగ్‌లో శ్రీలంకతో టి20
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ్యాచ్ కోల్‌కతా : ఈ ఏడాది చివర్లో భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ టూర్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 4 టెస్టులు (అహ్మదాబాద్, ఢిల్లీ, నాగపూర్, బెంగళూరు), 5 వన్డేలు (చెన్నై, కాన్పూర్, ఇండోర్/గ్వాలియర్, రాజ్‌కోట్, ముంబై), 3 టి20 మ్యాచ్‌లు (కోల్‌కతా, మొహాలి, ధర్మశాల) జరగనున్నాయి. దీంతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై శ్రీలంకతో కూడా భారత్ 3 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఒక మ్యాచ్‌ను విశాఖపట్నంకు కేటాయించారు. మరో రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, పుణేలలో జరుగుతాయి. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించి ఇంకా తేదీలు ప్రకటించలేదు. -
రెండో దశ చర్చలు జరుగుతాయి
భారత్, పాక్ సిరీస్‌పై బోర్డు కార్యదర్శి ఠాకూర్ చండీగఢ్ : భారత, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ కోసం రెండో విడత చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇటీవల పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాతో సమావేశమయ్యారు. ఈ డిసెంబర్లో భారత్‌తో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో బోర్డు నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఈనేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్ గురించి బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రానున్న కొన్ని రోజుల్లో కానీ వారాల్లో కానీ సిరీస్‌పై రెండో విడత చర్చలు జరిగే అవకాశాలున్నాయి. సిరీస్ జరిగేది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే కొన్ని చానెల్స్ ద్వారా వచ్చిన కథనాలు ఆధారం చేసుకుని పాక్‌తో మ్యాచ్‌ల గురించి ఇప్పటికే పార్లమెంట్లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు బోర్డుల మధ్య చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా పాక్‌తో జరిగే మ్యాచ్‌ల విషయంలో ఎలాంటి ఆలోచన చేయలేదు. అయితే అంతకన్నా ముందు ఇరు బోర్డులు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఎఫ్టీపీ ప్రకారం డిసెంబర్లో పాక్ ఈ సిరీస్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్ జరిగే అవకాశాలుంటే ఎక్కడ జరపాలనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఠాకూర్ తెలిపారు. పాక్‌తో సిరీస్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే టెన్ స్పోర్ట్స్ విషయంలో చర్చించాల్సింది బీసీసీఐ, పీసీబీ అని ఆయన స్పష్టం చేశారు. ‘చిన్న పట్టణాల్లోనూ టెస్టులు’ టెస్టు మ్యాచ్‌లకు మరింత ఆదరణ తెచ్చేందుకు వీటిని చిన్న స్థాయి పట్టణాల్లోనూ నిర్వహించే ఆలోచన ఉందని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
ఐపీఎల్లో ఆడిస్తానని మోసం.. మహిళ అరెస్టు
ఐపీఎల్లో ఆడిస్తానంటూ మోసం చేసిన 43 ఏళ్ల మహిళను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తిరువనంతపురానికి చెందిన నజారత్ షహాబుద్దీన్ అనే ఈమెపై కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అలువా పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తిరువనంతపురంలోని ఎస్హెచ్ఏ క్లబ్బుకు నజారత్, ఆమె సోదరుడు అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల మొదట్లో ఐపీఎల్ సెలక్షన్ ట్రయల్స్ కూడా నిర్వహించి, ఏకంగా 13 మంది అబ్బాయిలను ఎంపిక కూడా చేసేశారు. తర్వాత ఈ నెలాఖరులో జైపూర్ తీసుకెళ్లి మ్యాచ్‌లు ఆడిస్తామని, అందులో వారి ఆటతీరును బట్టి వాళ్లు భారత టి20 జట్టుకు ఎంపికవుతారని ఆమె చెప్పినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఆహారం, ప్రయాణాలు, జెర్సీ, బ్యాట్ల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 25 వేల వంతున ఆమె వసూలు చేసింది. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వారు పోలీసుకేసులు పెట్టారు. జైపూర్‌లోని జాతీయ టి20 క్రికెట్ ఫెడరేషన్‌కు తాను రాష్ట్ర సమన్వయకర్తనంటూ ఆమె పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చింది.