వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ్యాచ్
కోల్‌కతా : ఈ ఏడాది చివర్లో భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ టూర్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 4 టెస్టులు (అహ్మదాబాద్, ఢిల్లీ, నాగపూర్, బెంగళూరు), 5 వన్డేలు (చెన్నై, కాన్పూర్, ఇండోర్/గ్వాలియర్, రాజ్‌కోట్, ముంబై), 3 టి20 మ్యాచ్‌లు (కోల్‌కతా, మొహాలి, ధర్మశాల) జరగనున్నాయి. దీంతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై శ్రీలంకతో కూడా భారత్ 3 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఒక మ్యాచ్‌ను విశాఖపట్నంకు కేటాయించారు. మరో రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, పుణేలలో జరుగుతాయి. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించి ఇంకా తేదీలు ప్రకటించలేదు.
వైజాగ్‌లో శ్రీలంకతో టి20
Published Mon, May 25 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement