భారత్, పాక్ సిరీస్‌పై బోర్డు కార్యదర్శి ఠాకూర్
చండీగఢ్ : భారత, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ కోసం రెండో విడత చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇటీవల పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాతో సమావేశమయ్యారు. ఈ డిసెంబర్‌లో భారత్‌తో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో బోర్డు నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఈనేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్ గురించి బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
రానున్న కొన్ని రోజుల్లో కానీ వారాల్లో కానీ సిరీస్‌పై రెండో విడత చర్చలు జరిగే అవకాశాలున్నాయి. సిరీస్ జరిగేది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే కొన్ని చానెల్స్ ద్వారా వచ్చిన కథనాలు ఆధారం చేసుకుని పాక్‌తో మ్యాచ్‌ల గురించి ఇప్పటికే పార్లమెంట్‌లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు బోర్డుల మధ్య చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా పాక్‌తో జరిగే మ్యాచ్‌ల విషయంలో ఎలాంటి ఆలోచన చేయలేదు.
అయితే అంతకన్నా ముందు ఇరు బోర్డులు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఎఫ్‌టీపీ ప్రకారం డిసెంబర్‌లో పాక్ ఈ సిరీస్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్ జరిగే అవకాశాలుంటే ఎక్కడ జరపాలనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఠాకూర్ తెలిపారు. పాక్‌తో సిరీస్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే టెన్ స్పోర్ట్స్ విషయంలో చర్చించాల్సింది బీసీసీఐ, పీసీబీ అని ఆయన స్పష్టం చేశారు.
‘చిన్న పట్టణాల్లోనూ టెస్టులు’
టెస్టు మ్యాచ్‌లకు మరింత ఆదరణ తెచ్చేందుకు వీటిని చిన్న స్థాయి పట్టణాల్లోనూ నిర్వహించే ఆలోచన ఉందని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
రెండో దశ చర్చలు జరుగుతాయి
Published Fri, May 15 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement
Advertisement