Australia Confirmed T20 Tour Of Bangladesh In August - Sakshi
Sakshi News home page

Australia Tour Of Bangladesh: ఆసీస్‌ జట్టు ఇదే!

Published Thu, Jul 22 2021 6:20 PM | Last Updated on Thu, Jul 22 2021 7:24 PM

Australia Confirmed T20 Tour Of Bangladesh In August - Sakshi

ఫైల్‌ ఫోటో

ఢాకా: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆసీస్‌ 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ ఆగస్టు 3న  ప్రారంభం కానున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ధృవీకరించారు. ఇక 2017 తర్వాత మెదటిసారిగా ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ప్రస్తుతం వెస్ట్‌ఇండీస్‌ పర్యటనలో ఉన్న ఆసీస్‌ నేరుగా బంగ్లాదేశ్ చేరుకోనుంది.

ఢాకాలో కఠిన నిబంధనల మధ్య 3 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండునుంది. మరోవైపు జింబావ్వే పర్యటనలో ఉన్న బంగ్లా జట్టు ఈ నెల 29న స్వదేశానికి చేరుకోనుంది. ఈ సీరిస్‌ లో భాగంగా మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఢాకా వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఆడుతున్న జట్టును కొనసాగించనుంది.

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, వెస్ అగర్, జాసన్ బెహ్రిండోర్ఫ్, అలెక్స్ కారీ, డాన్ క్రిస్టియన్, జోష్ హాజిల్‌వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, అష్టన్ టర్నర్, ఆండ్రూ టై , మాథ్యూ వేడ్ (వైస్ కెప్టెన్), ఆడమ్ జాంపా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement