Bangaladesh
-
‘ఆయన దయవల్లే బతికున్నాను’
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చే ముందు తనని, తన చెల్లెలు షేక్ రెహానాను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. గతేడాది ఆగస్టు నెలలో ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అవమానకర రీతిలో తన సోదరితో కలిసి దేశాన్ని వీడారు. అయితే, నాడు దేశాన్ని వీడే సమయంలో జరిగిన ఘటనను తాజాగా షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. తన బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజీలో షేక్ హసీనా ఆడియో ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. ఆ ఆడియో ప్రసంగంలో ‘రెహానా,నేను కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో మేం మరణం అంచునుంచి తప్పించుకున్నాము’ అని ఆడియో ప్రసంగంలో తెలిపారు. ఆ ఆడియోలో తనను చంపేందుకు వివిధ సమయాల్లో కుట్రలు పన్నారని షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. అందుకు ఆగస్టు 21న జరిగిన హత్యల నుండి, కోటాలిపారాలో జరిగిన భారీ బాంబు నుండి బయటపడటమే నిదర్శనమన్నారు.అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడం సాధ్యమయ్యేది కాదు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరే చూశారు. అయితే, నేనింకా సజీవంగా ఉన్నానంటే అల్లా దయే. నేను నా దేశంలో ఎందుకు లేకపోయానా? అని ఇప్పటికీ బాధపడుతున్నాను.కట్టుబట్టలతో బంగ్లాదేశ్‌ను వీడాను’ అంటూ భావోద్వేగంగా కన్నీరు పెట్టుకున్నారు.పలు మార్లు హత్యాయత్నంషేక్ హసీనా పలు మార్లు హత్యహత్నం నుంచి తప్పించుకున్నారు. ఆగస్ట్ 21, 2004న బంగాబంధు అవెన్యూలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. షేక్ హసీనాతో పాటు 500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాటు పలు మార్లు హసీనాపై హత్యయత్నం జరగడంతో హసీనా భారీ మొత్తంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40ఏళ్లలో ఇదే తొలిసారి -
చిన్మయ్ కృష్ణదాస్‌కు దక్కని ఊరట
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చట్టోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. గురువారం కోర్టులో జరిగిన విచారణకు కృష్ణదాస్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన తరఫున 11 మంది లాయర్లు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ నిర్ణయం తీసుకున్నారు. కృష్టదాస్ను గత ఏడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు -
చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు.. తాజాగా
ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్‌పై పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. తాజాగా చిన్మయ్‌తో పాటు ఆయన వందలాది మంది అనుచరులపై కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ఓ మతపరమైన సంస్థ కార్యకర్త చిన్మయ్ కృష్ణదాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, ఆ దాడిలో తన చేయి, తలకు తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నాటి నుంచి చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వెలుగులోకి వచ్చిన బంగ్లాదేశ్ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అంతకు ముందు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ నేపథ్యంలో పలు ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనపై నవంబర్ 27న కొత్వాలి పోలిస్ స్టేషన్లో మూడు కేసులు, డిసెంబర్ 3న రంగం సినిమా థియేటర్ సమీపంలో పలువురు ఓ పార్టీ కార్యకర్తలు, ఇస్కాన్ సభ్యులు తమపై దాడి చేయడంతో స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. -
చిన్మయ్ కృష్ణదాస్‌తో మాకు సంబంధం లేదు: ఇస్కాన్
ఢాకా : బంగ్లాదేశ్ ఇస్కాన్ పరిణామాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహారంపై బంగ్లాదేశ్ ఇస్కాన్ స్పందించింది.చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై బంగ్లాదేశ్ ఇస్కాన్ జనరల్ సెక్రటరీ చారు చంద్రదాస్ స్పందించారు. చిన్మయ్‌తో, ఆయన చేసిన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. గతంలోనే చిన్మయ్‌ను మా సంస్థ నుంచి తొలగించాం’ అని అన్నారు. గతంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని సంస్థాగత కార్యకలాపాల నుండి, పదవుల నుండి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును తొలగించినట్లు చెప్పారు. న్యాయవాది మరణంపై జరుగుతున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. న్యాయ వాది మరణం, దేశంలో కొనసాగుతున్న నిరసనలతో బంగ్లాదేశ్ ఇస్కాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇస్కాన్ మతపరమైన, ఘర్షణ కార్యకలాపాలలో పాల్గొనలేదని, ఐక్యత సామరస్యాన్ని పెంపొందించడంలో మాత్రమే పాల్గొంటుందని ఆయన అన్నారు. #Bangladesh | Chinmoy Krishna Das Brahmachari does not belong to us: #ISKCONBangladesh The organization would not shoulder any responsibility over his statements and speech: Charu Chandra Das Brahmachari, General Secretary, #ISKCON Bangladesh@DhakaPrasar #ChinmoyKrishnaDas… pic.twitter.com/cuaR5SRc6V— All India Radio News (@airnewsalerts) November 28, 2024 -
బంగ్లా: అవామీ లీగ్ ర్యాలీ.. ఢాకాలో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్‌లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్‌లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్‌లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం -
పాకిస్తాన్ కు ఘోర అవమానం.. రెచ్చిపోయిన బంగ్లాదేశ్
-
యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్‌కప్..!?
బంగ్లాదేశ్‌లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల దృష్ట్యా పొట్టి ప్రపంచకప్ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ప్రత్నామ్నాయ అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా భారత్‌లో నిర్వహించాల్సిందిగా బీసీసీఐని ఐసీసీ అభ్యర్ధించింది. కానీ అందుకు బీసీసీఐ నో చెప్పింది. ఈ టోర్నీలో జరిగే ఆక్టోబర్‌లో భారత్‌లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ ఆఫర్‌ను బీసీసీఐ తిరస్కరించింది.అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని ఇప్పటికే ఐసీసీకి యూఏఈ క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు జింబాబ్వే క్రికెట్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో రెండు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లను జింబాబ్వే విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వాలని జింబాబ్వే యోచిస్తోంది.కాగా ఆగస్టు 20 జరగనున్న బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని ఐసీసీని అడిగినట్లు వినికిడి. ఇక షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. -
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం.. ప్రధానిగా ముహమ్మద్ యూనస్!
ఢాకా : బంగ్లాదేశ్‌లో అత్యంత నాటకీయ పరిణామాల నడుమ 15 ఏళ్ల పాటు ప్రధానిగా దేశాన్ని ఏలిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 40 నిమిషాల వ్యవధిలో బంగ్లాదేశ్ నుంచి సైనికుల సహాయంతో భారత్‌కు వచ్చారు. అయితే ఈ సంక్షోభంతో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తరుణంలో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.Nobel laureate and founder of Grameen Bank, Professor Muhammad Yunus speaks candidly with @ThePrintIndia about Sheikh Hasina’s resignation as Bangladesh's PM and what’s next for the nation. He calls it the “2nd liberation” for Bangladesh. Watch the interview to understand this… pic.twitter.com/BiKYboAQC6— ProtectYunus (@ProtectYunus) August 5, 2024సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, విద్యార్ధుల ఉద్యమానికి కీలకంగా వ్యవహరించిన సమన్వయకర్త నహిద్ ఇస్లాం, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించిన యూనస్‌తో ఇప్పటికే చర్చించినట్లు ప్రకటించారు. మరోవైపు నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోయిన బంగ్లాదేశ్‌ను గాడిన పెట్టేందుకు ఆ దేశ రాష్ట్రపతి మహ్మద్ షహబుద్దీన్ రంగంలోకి దిగారు.ప్రతి పక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చీఫ్ ఖలేదా జియాను విడుదల చేసేలా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అధికారులు ఉదయం 6 గంటలకు కర్ఫ్యూను ఎత్తివేసిన తర్వాత మంగళవారం వ్యాపారాలు తిరిగి తెరవాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, ఆర్మీ చీఫ్, వాకర్ ఉజ్-జమాన్ ఈ ఎన్నికల ముందే షహబుద్దీన్‌తో సంప్రదించి కొత్త మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే అంశంపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రతి మరణానికి న్యాయం జరుగుతుందని, సైన్యంపై విశ్వాసం ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును స్వాగతించిన అమెరికా ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా, ఆ తర్వాత దేశం నుంచి నిష్క్రమణపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లెర్ స్పందించారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని,ఆందోళనలను విరమించుకోవాలని కోరారు. బంగ్లాదేశ్ ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు తాత్కాలిక ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు.US Welcomes New Bangladeshi Govt & Asks to Refrain from "More Violence" - Job Done?US State Dept. spox Matthew Miller has weighed in on Monday's chaotic events in Dhakar.Washington gave its usual catchphrase, "We are monitoring the situation carefully." pic.twitter.com/2a7T3iIBdw— Geopolitical Kid (@Geopoliticalkid) August 6, 2024 బంగ్లాదేశ్‌కు శ్రీలంక మద్దతు బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభంపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. కష్టకాలంలో ఉన్న బంగ్లాదేశ్‌కు శ్రీలంక అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య బలమైన స్నేహం ఉందని అన్నారు. Our hearts are with the people of #Bangladesh during these incredibly challenging times. The recent events have led to significant unrest and, tragically, the loss of many lives. We extend our deepest sympathies to the families of those affected and to all who are suffering…— M U M Ali Sabry (@alisabrypc) August 5, 2024సురక్షితంగా భారత్ సరిహద్దు ప్రాంతాలు ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా తరువాత బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య, బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ సోమవారం హామీ ఇచ్చారు, ప్రజలు భయాందోళన చెందవద్దని కోరారు.బంగ్లాదేశ్ నుండి అనధికార ప్రవేశాన్ని నిరోధించడానికి దేశం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ ఉద్ఘాటించారు. సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. భయాందోళనలు అవసరం లేదు. పుకార్ల నమ్మొద్దని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేయొద్దు.. పశ్చిమ బెంగాల్ పోలీసుల హెచ్చరికపొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రంలో రెచ్చగొట్టేలా వ్యవహరించడం, సంబంధిత వీడియోలు షేర్ చేస్తే ఉపేక్షించేది లేదని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వదంతులను ఉపేక్షించవద్దని, రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయడం మానుకోవాలని, ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా రియాద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన అనంతరం రియాద్ తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ సుదీర్ఘ కాలం పాటు బంగ్లా క్రికెట్‌కు తన సేవలను అందించాడు. మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు. మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. గతంలో బంగ్లా దేశ్ టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా మహ్మదుల్లా పనిచేశాడు. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అతడి సారథ్యంలోని బంగ్లా జట్టు ఫైనల్‌కు చేరింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8 రౌండ్లో నిష్కమ్రించింది. సూపర్ 8 లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బంగ్లా జట్టు ఓటమి పాలైంది. -
‘నేనలిగా!’.. ప్రధానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలకబూనారు. తనని సంప్రదించకుండా తమ రాష్ట్రం గుండా ప్రవహించే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు ఇచ్చేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మూడు పేజీల లేఖ రాశారు. ఇకపై నీటి పంపిణీల విషయంలో బంగ్లాదేశ్‌తో కేంద్రం జరిపే ముఖ్య సమావేశాలకు తమకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. మూడవసారి ప్రధానిగా మోదీ బాధ్యతులు స్వీకరించే సమయంలో భారత్‌కు తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరయ్యారు. ఆ తర్వాత భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల భేటీలో తీస్తా సహా నదీ జలాల పంపిణీపై రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.సిక్కింలో పుట్టిన తీస్తానది భారత్‌లో దాదాపూ 320 కిలోమీటర్లు ప్రవహించాకా.. బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. అయితే తీస్తా నదీ జలాల పంపకం భారత్-బంగ్లాల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్-బంగ్లాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అవి కొలిక్కి రావడం లేదు. అందుకు పశ్చిమ బెంగాల్ కారణమని తెలుస్తోంది. ఒక్క తీస్తానే కాదు..రెండు దేశాల మధ్య దాదాపూ 53 (తీస్తా నదిని కలుపుకుని 54) నదీ జలాల పంపంకంపై ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కనీసం సూత్ర ప్రాయంగానైనా ఒప్పందం చేసుకోవాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. అయితే తీస్తా నదిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందంటూ పశ్చిమ బెంగాల్ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. తీస్తా నది నీటి పంపకాల వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ రాష్ట్ర సీఎం దీదీ ఆరోపిస్తున్నారు. 2011లోనే నాటి సీఎం మమతా బెనర్జీ ఇదే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు తరలించడంపై అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం ఆగిపోయింది. తాజాగా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా మోదీతో జరిపిన చర్చల్లో తీస్తా నది పంపిణీ ఒప్పందం జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇదే అంశంపై దీదీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదు’ అని మోదీకి రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలంటే మాకు గౌరవం. వారి క్షేమం కోరుకుంటాం. కానీ భారత్-బంగ్లాదేశ్ ఫార్కా నీటి ఒప్పందం పశ్చిమ బెంగాల్ ప్రమేయం లేకుండా జరిగింది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న మేం ఎట్టి పరిస్థితుల్లో నీటి పంపిణీ విషయంలో రాజీ పడబోమని దీదీ తెలిపారు. -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో హేమలత(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మంధాన(33),హర్‌ప్రీత్ కౌర్(30) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుల్తానా ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ఱీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా రెండు వికట్లు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో రితూ మోనీ(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.చదవండి: టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..? -
సెమీస్‌లో భారత్‌ను ఓడించి.. కట్‌చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్‌గా
అండర్-19 ఆసియాకప్ 2023 ఛాంపియన్స్‌గా బంగ్లాదేశ్ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. తొలిసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్(60), అరిఫుల్ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్ ఆహ్మద్ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్ రెహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా... ఇక్భాల్, షేక్ ఫవీజ్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. చదవండి: IND VS SA 1st ODI: ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను సాధించిన కేఎల్ రాహుల్ -
మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!
మనుషులకు విధించినట్లు జంతువులకు కూడా జైలు శిక్షలు విధిస్తారని విన్నారా?. ఔను! ఇది నిజం. ఇక్కడొక దేశం మేకలకు అలానే శిక్ష విధించి వార్తల్లో నిలిచింది. ఏం తప్పు చేశాయని అంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాకవ్వుతారు. ఇదేం విడ్డూరం రా బాబు..! అనుకోకండి. ఇలాంటివి అక్కడ మాములేనట. పాపం ఆ మేకలు ఒకటి రెండు రోజులు కాదు ..ఏకంగా ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించాయి. వివరాల్లోకెళ్తే..ఈ వింత ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. షహరియార్ సచిబ్ రాజీబ్‌కి చెందిన తొమ్మిది మేకులడిసెంబర్ 6, 2022న స్మశాన వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అరెస్టు చేశారు అధికారులు. అలా అప్పటి నుంచి బారిసాల్‌లో బార్ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉండిపోయాయి. వాటి యజమాని వాటిని విడుదల చేసేందుకు పలు విధాల యత్నించి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవలే ఎన్నికైన బరిషల్ సిటీ కార్పొరేషన్ మేయర్‌ని సంప్రదించి తన గోడును చెప్పుకున్నాడు. దీంతో ఆయన చొరవ కారణంగా బంగ్లాదేశ్ అడ్మనిస్ట్రేటివ్ అదికారులు రాజీబ్‌కు తొమ్మిది మేకలను విడుదల చేసి తిరిగి అప్పగించారు. దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బంధిఖానా నుంచి విముక్తి పొందాయి ఆ తొమ్మిది మేకలు. ఇలా జంతువులకు శిక్ష విధించిన ఘటన మొదటిది కాదు. రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కోమి ప్రావిన్స్‌లో సిక్టివ్కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్లు, గాడ్జెట్లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎనిమిది గాడిదలు లక్షలు విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పడేశారు. Nine goats freed after one year in jail for eating grass in Barishal graveyard!#Bangladesh #barishal https://t.co/8vLLSSOgRf — UNB - United News of Bangladesh (@unbnewsroom) November 24, 2023 (చదవండి: ఆ లాటరీ టికెట్ వెయిటర్ జీవితాన్ని తలకిందులు చేసి చిక్కుల్లో పడేసింది!) (మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానెల్‌పై క్లిక్ చేయండి) -
శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(90), షకీబుల్ హసన్(82) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. బంగ్లా బౌలర్లలో మధుషంక మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ, మాథ్యూస్ రెండు వికెట్లు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో అసలంక(108) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నిస్సాంక(41), సమరవిక్రమ(41) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: #Timed Out: కనీవినీ ఎరుగని రీతిలో! మాథ్యూస్‌ను చూసి నవ్వుకున్న షకీబ్.. అలా అనుకున్న వాళ్లదే తప్పు! -
బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి
బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది మృతిచెందారు. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలోని ఖైరబ్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. కిషోర్ గంజ్ రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొనటంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఢాకా వెళుతున్న గోథూళి ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును బలంగా ఢీకొన్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు అంటున్నారు. ప్రమాదంలో కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని, వాటిలో ప్రయాణికులు చిక్కుకుపోయారని, ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటన నేపధ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వంద మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు తరలివచ్చాయని, స్థానికుల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను వెల్లడించగలమని అధికారులు చెబుతున్నారు. రైలులో సురక్షితంగా ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హమాస్ చెర నుంచి మరో ఇద్దరు బందీల విడుదల! -
‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు!
మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో డెంగ్యూ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో డెంగ్యూ బారిన పడి 1000 మందికి పైగా మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అల్ జజీరా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్‌లో 2023లో డెంగ్యూ జ్వరం కారణంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. 2023 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్ వరకు) కనీసం 1,017 మంది మరణించారని నివేదిక పేర్కొంది. దాదాపు 2,09,000 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. బంగ్లాదేశ్‌లోని పలు ఆసుపత్రులు డెంగ్యూ బాధితులతో నిండిపోయాయి. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? -
వన్డే ప్రపంచకప్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి ఆ జట్టు స్టార్ఆటగాడు తమీమ్ ఇక్భాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో జరిగే ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు సారధిగా స్టార్ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ధృవీకరించింది. అదే విధంగా ఈ రెండు మెగా ఈవెంట్లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు. "ఆసియా కప్, ప్రపంచకప్‌లో మా జట్టు కెప్టెన్‌గా షకీబ్‌ను నియమించాము. రేపు(ఆగస్టు 12)న ఈ రెండు ఈవెంట్లకు మా జట్టును ప్రకటిస్తాము. సెలక్టర్లు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు" అని విలేకురల సమావేశంలో నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. కాగా షకీబ్ ప్రస్తుతం టీ20ల్లో బంగ్లా జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు 2011లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బంగ్లా కెప్టెన్‌గా షకీబ్ అల్ హసనే వ్యవహరించాడు. ఇక ఆసియాకప్-2023లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. అదే విధంగా ఆక్టోబర్ 7న ఆఫ్గానిస్తాన్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని బంగ్లా ప్రారంభించనుంది. చదవండి: CPL 2023: అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు -
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. కెప్టెన్సీకి తమీమ్ ఇక్బాల్ గుడ్‌బై!
ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లా జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తమీమ్ ఇక్భాల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్, క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్‌లతో చర్చలు జరిపిన తర్వాత తమీమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తమీమ్ తెలిపాడు. "నేను బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా. ఇకపై ఒక ఆటగాడిపై నా ఆటపై దృష్టిసారిస్తాను. అవకాశం వచ్చినప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను" అని విలేకురల సమావేశంలో తమీమ్ పేర్కొన్నాడు. కాగా వెన్ను గాయం, ఫామ్ లేమితో బాధపడుతున్న ఇక్బాల్.. ఆసియాకప్-2023కు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. అతడు తిరిగి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డేలకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లా నూతన సారథిగా లిట్టన్ దాస్‌ను ఎంపిక చేయాలని బీసీబీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యంతో తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. ఇక కేవలం ఆటగాడిగా మాత్రమే తమీమ్ కొనసాగనున్నాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: IPL 2024: ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ -
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే?
ఆఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్బతమైన ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. కాగా బంగ్లాదేశ్‌పై ఆఫ్గాన్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఛటోగ్రామ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అయితే బంగ్లాను ఏకంగా 142 పరుగుల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది. ఈ సిరీస్‌లో ఆఖరి వన్డే ఛటోగ్రామ్ వేదికగా మంగళవారం జరగనుంది. ఇక బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపై చిత్తు చేసిన ఆఫ్గాన్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియాపై చోప్రా విమర్శలు గుప్పించాడు. కాగా గత డిసెంబర్లో జరిగిన వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఆ సమయంలో భారత జట్టుపై విమర్శల వర్షం కురిసింది. ఇక తాజాగా ఇదే విషయాన్ని చోప్రా మరోసారి తన యూట్యూబ్‌లో ఛానల్లో చర్చించాడు. "బంగ్లాదేశ్‌కు వారి స్వదేశంలోనే ఆఫ్ఘనిస్థాన్ చుక్కలు చూపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ఎగరేసుకుపోయింది. ఆఫ్గాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా వారి స్పిన్నర్లు గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. స్పిన్నర్లు నిలకడగా రాణిస్తారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాటింగ్ పరంగా దుమ్మురేపుతున్నారు. ఆఫ్గాన్ తమ ఉపఖండ పరిస్ధితులకు బాగా అలవాటు పడింది. కాబట్టి ఈ ఏడాది భారత్ వేదికగా ప్రపంచకప్‌లో కూడా ఆఫ్గాన్ జట్టు నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఆఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేస్తే.. అది వారికే ప్రమాదం" అని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక టీమిండియా గురించి మాట్లాడుతూ.. "ఇదే బంగ్లాదేశ్‌లో భారత జట్టు మాత్రం సిరీస్‌ను కోల్పోయింది. అయితే కీలక మ్యాచ్‌లో రోహిత్ గాయ పడటంతో సిరీస్ కోల్పోయిందన్న విషయం మర్చిపోకూడదు. కానీ మూడో వన్డేలో మాత్రం ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. అయితే గెలవాల్సిన సిరీస్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది అని చోప్రా చెప్పుకొచ్చాడు. చదవండి: ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే? -
టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్‌తో
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను బుక్కీలు సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీన్ క్రిక్‌ఈన్‌ఫో వెల్లడించింది. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తిరష్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేసినట్లు ఈఎస్పీన్ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణను బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ విడుదల చేసినట్లు ఈఎస్పీన్ తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుక్కీలకు ఆమెకు మరో మరో బంగ్లా ప్లేయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగంకు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే మా క్రికెటర్లకు ఫిక్సర్లు సంప్రదిస్తే.. వారికి ఏమో చేయాలో బాగా తెలుసు. ఈవెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్‌కు తెలుసు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుందని"ఈఎస్పీన్‌తో పేర్కొన్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. చదవండి: T20 WC: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం -
Asia Cup 2022: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ ఆల్ హసన్..
బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్ వ్యవహరించనున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. కాగా జింబాబ్వే పర్యటనకు ముందు బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహ్మదుల్లా తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా వికెట్ కీపర్ నూరల్ హసన్‌ను బీసిబీ నియమించింది. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో నూరల్ హసన్ చేతి వేలికి గాయమైంది. అనంతరం అతడికి సింగపూర్‌లో సర్జరీ నిర్వహించారు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనున్నట్లు బీసిబీ వైద్య బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు త్వరలో జరగనున్న ఆసియాకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షకీబ్‌ను తమ కెప్టెన్‌గా నియమిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా షకీబ్ అల్ హసన్ 'బెట్విన్నర్ న్యూస్’ అనే బెట్టింగ్ సంస్థతో ఒప్పందం కుదర్చుకుని వివాదంలో చిక్కున్నాడు. ఈ క్రమంలో ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని షకీబ్‌ను బంగ్లా క్రికెట్ బోర్డు హెచ్చరించింది. దీంతో అతడు వెనుక్కి తగ్గి ఒప్పందం రద్దు చేసుకున్నాడు. దీంతో అతడిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చదవండి: IND vs PAK: మ్యాచ్‌కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్ -
బంగ్లాదేశ్‌కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కాపాడకోలేకపోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో జింబాబ్వే కైవసం చేసుకుంది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికందర్ రజా, కెప్టెన్ చక్‌బావ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా (80), కెప్టెన్ తమీమ్(50), అఫీఫ్ హుస్సేన్(41) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు, మాధేవేరే రెండు, న్యాచి, చివంగా తలా వికెట్ సాధించారు. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రజా, చక్‌బావ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను జింబాబ్వే వైపు మలుపు తిప్పింది. అనంతరం జింబాబ్వే కెప్టెన్ చక్‌బావ 75 బంతుల్లో 102 పరుగులు చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఔటైనప్పటికీ రజా(127 బంతుల్లో 117పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జింబాబ్వేకు మరుపురాని విజయాన్ని అందించాడు. రజా, చక్‌బావ అద్భుమైన ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా రజాకు ఈ సిరీస్‌లో ఇదే వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. తొలి వన్డేలో కూడా జింబాబ్వే విజయంలో రజా తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం హరారే వేదికగా జరగనుంది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
జింబాబ్వేపై తొలి వన్డేలో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హారారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా లిటన్ దాస్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్ట్ హార్ట్‌గా వెనుదిరగాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాలు సమయం పట్టనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ క్రమంలో లిటన్ దాస్ ఆసియాకప్-2022కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్- జింబాబ్వే మధ్య రెండో వన్డే హారారే వేదికగా ఆదివారం(ఆగస్టు7)న జరగనుంది. లిటన్ దాస్ స్థానంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో తుది జట్టలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తొలి వన్డే విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్ రౌండర్ సికందర్ రజా(135), ఇనోసెంట్ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తమీమ్ ఇక్భాల్(62), లిటన్ దాస్(81),అనముల్ హాక్(73) పరుగులతో రాణించారు. అనంతరం 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలోనే చేధించింది. చదవండి: ZIM vs BAN: పూర్వ వైభవం దిశగా అడుగులేస్తుందా..! -
అది వేసుకుని వచ్చాడని సినిమా టికెట్ ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్...ఐతే
ఇటీవల చిన్న పెద్ద అంతా బయటకు వస్తే కచ్చితం ఫ్యాంట్ షర్టు లేదా షార్ట్స్ వంటి ఇతర ఫ్యాషెన్ డ్రెస్‌లను ధరంచడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ట్రెండ్ కూడా అదే. ఐతే ఎవరైన సంప్రదాయబద్ధమైన డ్రస్‌లు వేసుకుంటే నోరెళ్లబెట్టడమే కాకుండా రావద్దంటూ నిరాకరిస్తున్నారు. ఏదో చేయరాని నేరం చేసినట్లు చూడటం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక బంగ్లాదేశ్ వ్యక్తి సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినందుకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పించుకుని తగిన గౌరవాన్ని పొందాడు బంగ్లాదేశ్‌లోని సమాన్ అలీ సర్కార్ అనే వృద్ధుడు మల్టీప్లెక్స్ థియేటర్‌కి లుంగీతో వచ్చాడు. అతను బంగ్లదేశ్ రాజధాని సోనీ స్క్వేర్ బ్రాంచ్‌లో ఉన్న మల్టీపెక్స్ థియేటర్లో 'పురాణ్' అనే ప్రముఖ సినిమాను వీక్షించేందుకు వచ్చాడు. ఐతే థియోటర్ వాళ్లు అతని వేషధారణ చూసి సినిమా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం కాస్త సోషల్ మాధ్యమంలో పెద్ద దూమారం రేపింది. దురదృష్టవశాత్తు సదరు మల్టీప్లెక్స్ పై వ్యతిరేక భావన ఏర్పడటమే గాకుండా నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మల్టీప్లెక్స్ థియేటర్ వెంటనే అప్రమత్తమై సరిచేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం జరిగిన దానికి వివరణ ఇస్తూ...సదరు వ్యక్తి సమాన్ అలీని, అతని కుటుంబాన్ని సినిమా చూసేందుకు థియోటర్‌కి ఆహ్వానించడమే కాకుండా వారితో తీసుకన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడొచ్చు అని, థియేటర్‌కి ఇలానే రావాలనే పాలసీ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు రెడీ అయ్యి రావచ్చు అని సదరు థియేటర్ యజమాన్యం వివరణ ఇచ్చుకుంది. (చదవండి: తప్పులు సరిదిద్దుకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా) -
మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన అఖరి వన్డేలో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్ దాటికి 178 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్లలో తైజుల్ 5 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్,ముస్తఫిజుర్ రెహ్మన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ పూరన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 179 పరుగులతో లక్క్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్(50), తమీమ్(34) పరుగులతో రాణించారు. అదే విధంగా విండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక అంతకుముందు టెస్టు,టీ 20 సిరీస్‌లను విండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Tamim Iqbal: టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్.. -
అనగనగా ఘనమైన యూ ట్యూబ్ విలేజ్.. కలర్‌ఫుల్ వంటల పండుగ!
‘యూ ట్యూబా, అదేమిటి?’ అని అడిగినవాళ్లే ఇప్పుడు తమ వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ‘దీన్ని ఎలా ఉపయోగిస్తారు?’ అని కెమెరాను చూస్తూ అమాయకంగా అడిగిన వాళ్లే ఆ కెమెరాను ఆపరేట్ చేస్తూ ‘సూపర్’ అనిపించుకుంటున్నారు. ‘చిన్న ఊరు’గా ఒకప్పుడు ఆ ఊరికి చిన్నపేరే ఉంది. ఇప్పుడు మాత్రం ‘యూట్యూబ్ విలేజ్’గా పెద్దపేరు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామ మహిళలు... పచ్చటిపంట పొలాలు పలకరింపుగా నవ్వుతున్నాయి. పిల్లలు గోలగోలగా ఆడుకుంటున్నారు. సుమారు పదిహేనుమంది మహిళలు వంటపనుల్లో నిమగ్నమయ్యారు. మగవాళ్లు వారికి సహాయపడుతున్నారు. అంతా సందడి సందడిగా ఉంది. అలా అని అది పెళ్లికి సంబంధించిన విందు కార్యక్రమం కాదు. జస్ట్... యూట్యూబ్ షూటింగ్! బంగ్లాదేశ్‌లోని కుష్తియ జిల్లాలోని షిములియ గ్రామం ‘యూట్యూబ్ విలేజ్’గా ఫేమస్ అయింది. ఈ గ్రామ నేపథ్యంగా ఘుమఘుమలాడే బిర్యానీ వంటకాల తయారీ నుంచి చేపలను సులభంగా ఎలా పట్టాలి?... వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ‘యూట్యూబ్ విలేజ్’ నుంచి తెలుసుకోవచ్చు. షూట్ పూర్తయిన తరువాత వేడివేడి వంటకాలను పేదలకు పంచుతారు. కెమెరా హ్యాండిల్ చేయడం, ఎడిటింగ్, షూట్, డైరెక్షన్... మొదలైన విషయాలను శ్రద్ధగా నేర్చుకున్న షిములియ గ్రామ మహిళలు తమ వంటల వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి, పేదల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... మీర్పూర్లో ఐటీ కంపెనీ నడిపే లిటన్ అలి స్వగ్రామం షిములియ. ఊరికి వచ్చినప్పుడల్లా తన చేతిలో ఉన్న కెమెరాతో చేపలమార్కెట్ సందడి, పిల్లకాలువలు, పెద్దచెరువు అందాలు, చేతివృత్తుల పనితనం, గొర్రెల కాపరి పాడే పాట... ఇలా రకరకాల దృశ్యాలను వీడియోలో బంధించి ‘ఎరౌండ్ మీ బీడి’ పేరుతో యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేసేవాడు. ఆ సమయంలోనే ‘ఎరౌండ్ మీ బీడి’ని ఉపాధికి ఉపయోగపడే ఛానల్‌గా మార్చాలని రంగంలోకి దిగాడు అలి. మొదట్లో ఎలా ఉండేదోగానీ మహిళలు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయిన తరువాత సీన్ మారిపోయింది. వారు తమ నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలతో ‘యూట్యూబ్ విలేజ్’ను ఎక్కడికో తీసుకువెళ్లారు. దీంతో షిములియ పేరు ‘యూట్యూబ్ విలేజ్’గా మారిపోయింది. ‘ఎప్పుడోగానీ ఊరంతా ఒకచోట కలుసుకునే అవకాశం ఉండదు. అయితే ఛానల్ పుణ్యమా అని అందరం తరచు ఒకచోట కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఊరంతా కలిసి విందు చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. సంతోషాలు పంచుకోవడమే కాదు సమస్యల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం’ అంటుంది 38 సంవత్సరాల మహేర. ‘మా వంటల రుచులతో ప్రపంచంతో మాట్లాడే అవకాశం దొరికింది’ అంటుంది రియా. కంటెంట్ సక్సెస్ కావడం ఒక ఎత్తయితే, ఆ సక్సెస్‌ను నిలుపుకోవడం మరో ఎత్తు. ఎప్పటికప్పుడు విభిన్నమైన ఎపిసోడ్స్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను భుజాన వేసుకొన్న గ్రామ మహిళలు కాలగర్భంలో కలిసిపోయిన అరుదైన, రుచికరమైన వంటకాలను బయటికి తీస్తున్నారు. దీంతోపాటు కొత్త వంటకాలను సృష్టిస్తున్నారు. ‘యూట్యూబ్ విలేజ్’ అనేది బిజినెస్ మోడల్‌గా మారడమే కాదు ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇస్తుంది. ఇప్పుడు మనదేశంతో సహా పాకిస్థాన్, ఇండోనేషియా... మొదలైన దేశాల్లో ‘యూట్యూబ్ విలేజ్’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. చదవండి👉🏾ఆమె వస్తే... పెళ్లి ఆగాల్సిందే -
శ్రీలంకతో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్‌కు గుడ్ న్యూస్..!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఊరట లభించింది. కరోనా బారిన పడిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో మే 15న ఛటోగ్రామ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మే9 న అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత షకీబ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు ఐషోలేషన్‌లో ఉన్నాడు. అయితే అతడికి తాజాగా నిర్వహించిన పరీక్షలలో నెగిటివ్‌గా తేలింది. ఇక షకీబ్ చివర సారిగా 2021లో పాకిస్తాన్‌పై ఆడాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు వ్యక్తిగత కారణాలతో షకీబ్ దూరమయ్యాడు. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఛటోగ్రామ్ వేదికగా మే 15 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు: మోమినుల్ హక్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్ ఖాన్, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ కుమార్ దాస్, యాసిర్ అలీ చౌదరి, తైజుల్ ఇస్లాం, మెహెదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్ చౌద్యుల్, ఎబాడోత్ హుస్సేన్ చౌదుల్, హసన్ సోహన్, రెజౌర్ రెహమాన్ రాజా, షోహిదుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం చదవండి: Ben Stokes: వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ .. వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్!
మహిళల వన్డే ప్రపంచకప్-2022లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో వన్డేల్లో పాకిస్తాన్‌పై తొలి విజయం సాధించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఇక పాకిస్తాన్ ఈ మెగా టోర్నమెంట్లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు మాత్రమే చేయగల్గింది. పాకిస్తాన్ బ్యాటర్లలో సిద్రా అమీన్ ఆద్భుతమైన సెంచరీ సాధించనప్పటికీ ఫలితం లేక పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో ఫాహిమా ఖాటాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రుమానా అహ్మద్ రెండు, ఆలాం ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకుమందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఫర్గానా హాక్(71), నిగర్ సుల్తానా(46) పరుగులతో రాణించారు. కాగా వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో అఖరి స్ధానంలో పాక్ నిలిచింది. ఇక పాకిస్తాన్ సెమీస్‌కు చేరడం కష్టమే అని చెప్పుకోవాలి. చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్ -
టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా!
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే ప్రపంచ రికార్ఢు సృష్టించాడు. ఆడిన మొదటి ఐదు టెస్టుల్లో వరుసగా 50 ప్లస్ స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా కాన్వే నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆర్దసెంచరీ సాధించిన కాన్వే ఈ ఘనతను నమోదు చేశాడు. కాన్వే ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడగా, మొత్తం 5 టెస్టుల్లో 50 పైగా పరుగులు సాధించాడు. దీంట్లో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో 99 పరుగులు చేసిన కాన్వే తన మూడో సెంచరీకు ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఇక తన అరంగేట్రం చేసిన తొలి టెస్ట్‌లోనే ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించి కాన్వే.. సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అదే విధంగా టెస్టు ఛాంఫియన్‌షిప్ ఫైనల్లోనూ భారత్‌పై 54 పరుగులతో కాన్వే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు న్యూజిలాండ్ పూర్తి అధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 349 పరుగులు సాధించింది. లాథమ్ 186 పరుగులు సాధించి డబుల్ సెంచరీకు చెరువలో ఉండగా, కాన్వే 99 పరుగులు చేసి సెంచరీకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. చదవండి: SA vs IND: 'పంత్‌ని కొద్ది రోజులు పక్కన పెట్టండి.. అప్పుడే తెలిసి వస్తుంది' -
ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్!
న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26 ఓవర్లో కేవలం ఒక బంతికే 7పరుగులును బంగ్లాదేశ్ ఫీల్డర్లు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన ఎబాడోట్ హొస్సేన్ బౌలింగ్‌లో అఖరి బంతిను విల్ యంగ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుంది. కాగా స్లిప్‌లో ఉన్న లిటన్ దాస్ క్యాచ్‌ను వదిలివేయడంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. ఇంతలో న్యూజిలాండ్ బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టారు. అయితే ఫీల్డర్ బౌలర్ ఎండ్ వైపు త్రో చేయగా, బౌలర్ ఆ బంతిని ఆపలేకపోవడంతో ఫోర్ బౌండరీకు వెళ్లింది. దీంతో ఓవర్‌త్రో రూపంలో మరో 4 పరుగులు రావడంతో.. అంపైర్ మెత్తంగా ఏడు పరుగులు ఇచ్చాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ అద్భుతంగా ఆడుతంది. తొలి వికెట్‌కు ఓపెనర్లు లాథమ్, యంగ్ 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 349 పరుగులు సాధించింది. లాథమ్ 186 పరుగులు సాధించి డబుల్ సెంచరీకు చెరువలో ఉండగా, కాన్వే 99 పరుగులు చేసి సెంచరీకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. చదవండి: WI vs IRE: 4 ఫోర్లు, 4 సిక్స్‌లు.. పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ .. Meanwhile, across the Tasman Sea... ⛴️ Chaos in the field for Bangladesh as Will Young scores a seven (yes, you read that correctly!) 😅#NZvBAN | BT Sport 3 HD pic.twitter.com/fvrD1xmNDd — Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022 -
న్యూజిలాండ్‌పై చెలరేగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. బౌలర్లకు చుక్కలే
మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడుతోంది ఈ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజుకూడా బంగ్లాదేశ్ పూర్తి అధిపత్యం చలాయించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మోమినుల్ హక్(88), వికెట్ కీపర్ లిటన్ దాస్(86) పరుగులతో రాణించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 73 పరుగులు అధిక్యంలోఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ మూడేసి వికెట్లు తీశారు. ఇక న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఇది ప్రతి ఆటగాడి కల! -
న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్..
మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రెండో రోజు బంగ్లాదేశ్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ముందుగా బంగ్లాదేశ్ బౌలర్లు 70 పరుగుల వ్యవధిలో న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటర్లు నిలకడగా రాణించారు. ఫలితంగా ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 67 ఓవర్లలో 2 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్ మహముదుల్ హసన్ జాయ్ (70 బ్యాటింగ్; 7 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ నజ్మూల్ హొసెన్ షాంతో (64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 258/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ మూడేసి వికెట్లు తీశారు. చదవండి: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు -
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌కు బిగ్‌షాక్!
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ను తర్వాత సిరీస్ నుంచే తప్పించారు. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఇది బాధ కలిగించేదే అయినా స్వదేశంలో జరిగే సిరీస్‌లో తమ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌కు చోటు లేదని, ఘనతలను బట్టి కాకుండా టీమ్ అవసరాలను బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. కాగా, ముంబై వేదికగా భారత్‌తో జరిగిన టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సిరీస్‌కు కెప్టెన్ విలియమ్సన్కు సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. అతడి స్ధానంలో టామ్ లాథమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (సి), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వారం), రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, డెవాన్ కాన్వే చదవండి: Ashwin-Steve Smith: 'స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్ చేశా' -
అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్ సాధించిన పాక్ కెప్టెన్.. వీడియో వైరల్
Babar Azam bowls for first time in international cricket, hen picks up a wicket: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి వికెట్ సాధించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు బాబర్ బౌలింగ్ చేశాడు. బంగ్లా రెండో ఇన్నింగ్స్ 76 ఓవర్ బౌలింగ్ వేసిన బాబర్.. మెహది హసన్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో బాబర్ బౌలింగ్ చేయడం ఇదే తొలి సారి. అంతకు మందు బాబర్ లిస్ట్ -ఏ కేరిర్‌లో 12 వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. దీంతో దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను పాకిస్తాన్ వైట్‌వాష్ చేసింది. చదవండి: టీమిండియా 29 ఏళ్ల దాహం తీరేనా.. దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయంపై ప్రోమో అదుర్స్ Babar Azam's first international wicket and match changing moment ❤️#PakvsBan #PAKvBAN #BabarAzampic.twitter.com/uak8Oq8Iy9 — Muhammad Noman (@nomanedits) December 8, 2021 -
బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Pakistan beat Bangladesh by an innings and 8 runs: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 2-0తేడాతో సిరీస్‌ను పాకిస్తాన్ వైట్‌వాష్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 87 పరుగులకే బంగ్లాదేశ్ కుప్పకూలింది. ఫాలో ఆన్ ఆడిన బంగ్లాదేశ్ 205 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా పాకిస్తాన్.. ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో సజిద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా, షాహీన్ ఆఫ్రిది 2వికెట్లు సాధించాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో తొలిసారి బౌలింగ్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఈ టెస్ట్‌లో వర్షం కారణంగా రెండో రోజు, మూడో రోజు ఆట పూర్తిగా రద్దుకావడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 300-4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అదే విధంగా తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాను పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఖాన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు సాజిద్ ఖాన్ కు దక్కగా, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌కు అబిడ్ ఆలీ ఎంపికయ్యాడు. చదవండి: ICC Test Rankings: బౌలర్‌గా,ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అశ్విన్.. నెం2.. -
PAK Vs BAN: బ్యాటింగ్ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావా బాబర్!
Babar Azam bowls for the first time in international cricket: ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ రెండో టెస్ట్‌లో అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బౌలింగ్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో బాబర్ బౌలింగ్ చేయడం ఇదే తొలి సారి. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్ బౌలింగ్ చేసిన బాబర్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా బాబర్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ తైజుల్ ఇస్లాం క్యాచ్‌ను స్లిప్ ఫీల్డర్ జారవేయడంతో తృటిలో తొలి వికెట్‌ను చేజార్చుకున్నాడు. కాగా బాబర్ లిస్ట్ -ఏ కేరిర్‌లో 12 వికెట్లు సాధించాడు. ఇక బాబర్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి బాబర్..నీకు బౌలింగ్ కూడా వచ్చా? అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ విజయానికి చేరువలో ఉంది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 300-4 వద్ద డిక్లేర్ చేయగా, బంగ్లాదేశ్ కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ సాజిద్ ఖాన్ ఒక్కడే 8 వికెట్లు పడగొట్టాడు. కాగా ఫాలోఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ తడబడుతుంది. చదవండి: India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్.. నలుగురు ఆటగాళ్లు దూరం! వాళ్లిద్దరికీ బంపర్ ఆఫర్! Babar Azam's 1st Over of his International Cricket Career. Babar Azam So Beautiful Bowling@babarazam258 #PAKvBAN #Pakistan #CricketTwitter pic.twitter.com/h9U6nqhSAS — School Education Department & Government of Pak (@SedCorners) December 8, 2021 -
మాథ్యూ వేడ్ పేరుతో పాక్ బౌలర్‌ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్
Fans Distract Shaheen Afridi With Matthew Wade Chants: బంగ్లాదేశ్- పాకిస్తాన్ తొలి టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌండరీలైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు మాథ్యూ వేడ్ అంటూ పదే పదే హేళన చేశారు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2021 సెమీఫైనల్లో భాగంగా షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో వేడ్.. వరుసగా మూడు సిక్సర్లు బాది ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్‌కు చేరిన ఆరోన్ ఫించ్ బృందం ఏకంగా విజేతగా నిలిచింది. ఇక బంగ్లా- పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలి టెస్ట్‌లో అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్రిది ఏకాగ్రతను దెబ్బ తీయడానికి బంగ్లా అభిమానులు ప్రయత్నం చేశారు. అందుకే మాథ్యూ వేడ్ పేరును పదే పదే జపం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022 Auction: రాహుల్, రషీద్ ఖాన్‌ను లాక్కొన్నారు.. పంజాబ్, హైదరాబాద్ లబోదిబో! You troll Shaheen ??? He makes sure to give it back 🤛 5fer loading ... pic.twitter.com/6r1vcSyaTN — CricMadness (@CricMady) November 28, 2021 -
ఏంటి బాబర్ ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా..
Mehidy Hasans peach of a delivery to clean up Babar Azam: ఛాటోగ్రామ్ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా వికెట్ నష్టపోకుండా 140 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ 7 వికెట్లు సాధించి పాక్ పతనాన్ని సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఔటైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెహది హసన్ వేసిన అద్బుత డెలివరీకి ఆజాం వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 72 ఓవర్లో మెహది హసన్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీకి బాబర్ ఢిపెన్స్ ఆడడానికి ప్రయత్నించగా.. అయితే బంతి టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను తాకింది. దీంతో ఒక్క సారిగా బాబర్ ఆశ్చర్యానికి గురై పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం బాబర్ ఔట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెట్‌జన్ స్పందిస్తూ.. 'ఏంటి బాబర్ ఇది ఏమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా .. ఇది ఇంటర్నేషల్ క్రికెట్' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... Athar Ali Khan is super excited after seeing Babar out by Mehdi ,🤪#PakvsBan pic.twitter.com/pwaAURCIF4 — Jawad Ahmad (@Jawadspeaks_) November 28, 2021 -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు...
చిట్టగాంగ్: బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట మూడో రోజు బౌలర్లు చెలరేగడంతో ఆదివారం ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. దాంతో ఇరు జట్లను గెలుపు ఊరిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 39 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (12 బ్యాటింగ్; 1 ఫోర్), యాసిర్ అలీ (8 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 145/0తో ఆటను ఆరంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 115.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ను తైజుల్ ఇస్లామ్ (7/116) దెబ్బ తీశాడు. మూడో రోజు తొలి ఓవర్లోనే అతడు అబ్దుల్లా షఫీక్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (0) వికెట్లను తీశాడు. ఓవర్‌నైట్ బ్యాటర్ ఆబిద్ అలీ (133; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీని పూర్తి చేశాడు. ఆబిద్ అలీని కూడా తైజుల్ అవుట్ చేయడంతో పాకిస్తాన్ పతనం ఆరంభమైంది. చదవండి: IND Vs NZ 1st Test: విజయం ఊరిస్తోంది! -
Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి..
Ban Vs Pak: Pakistan fielder engage in synchronized fielding during first Test Against Bangladesh: ఛాటోగ్రామ్ వేదికగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 95 ఓవర్ వేసిన హసన్ అలీ బౌలింగ్‌లో మెహదీ హసన్ కవర్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే ఫీల్డర్లు ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్ బంతిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకేసారి పరిగెత్తడంతో పాటు యాదృచ్చికంగా ఒకేసారి డైవ్ కూడా చేశారు. చివరకు బంతిని దొరకబుచ్చుకున్నారు. దీంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా, షహీన్ ఆఫ్రిది, ఆస్రఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. మిడిలార్డర్ మిడిలార్డర్ విఫలం అయినప్పటికీ, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం 206 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (114),ముష్ఫికర్(91), మెహది హసన్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IND Vs NZ: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. Synchronised fielding. LIVE COMMS: 👉https://t.co/KryaHg4P9S👈#BANvsPAK|#PAKvsBAN pic.twitter.com/RrJwXHCsXj — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 27, 2021 -
బంగ్లాతో పాక్ టెస్టు... మ్యాచ్ ఆరంభానికి ముందు భూకంపం..
Earthquake hits Chattogram ahead of opening Test: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్26) ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఛటోగ్రామ్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత మ్యాచ్ నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అనుకున్న సమయానికే మ్యాచ్ ప్రారంభమైంది. కాగా టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ ఆతిథ్య బంగ్లాదేశ్‌ను వైట్ వాష్(0-3) చేసింది. దీంతో కనీసం టెస్ట్ సిరీస్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. మరో వైపు బంగ్లా టీ20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న బంగ్లాదేశ్ 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్‌గానే! -
ఆసియా ఆర్చరీలో గోల్డ్‌మెడల్ సాధించిన ఆంధ్రా అమ్మాయి..
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. మహిళల కాంపౌండ్ విభాగంలో గురువారం జరిగిన ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్ యూహ్యూన్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. తొలి నాలుగు సెట్లు పూర్తయ్యేసరికి సురేఖ 118–116తో యూహ్యూన్‌పై రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి సెట్లోని మూడు బాణాలకు సురేఖ వరుసగా 10, 9, 9 పాయింట్లు స్కోరు చేయగా... యూహ్యూన్ 10, 9, 10 స్కోరు చేసింది. ఫలితంగా సురేఖ పాయింట్ తేడాతో గెలుపొంది స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఆఖర్లో కొరియా కోచ్ మ్యాచ్ జడ్జితో వాదనకు దిగాడు. యూహ్యూన్ వేసిన ఐదో సెట్ రెండో బాణం 10 పాయింట్ల సర్కిల్ గీతకు మిల్లీ మీటర్ తేడాతో బయటి వైపు గుచ్చుకుంది. దీనికి జడ్జి 9 పాయింట్లు కేటాయించగా... 10 పాయింట్లు ఇవ్వాల్సిందిగా కొరియా కోచ్ కాసేపు వాదించాడు. బాణాన్ని పలు మార్లు పరిశీలించిన జడ్జి... దానికి 9 పాయింట్లనే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో సురేఖకు గెలుపు ఖాయమైంది. పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ రజతాన్ని సాధించాడు. ఫైనల్లో అతడు 148–149తో కిమ్ జోంగ్‌హూ (కొరియా) చేతిలో ఓడాడు. కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ– రిషభ్ యాదవ్ (భారత్) జంట 154–155తో కిమ్ యున్హీ–చోయ్ యాంగ్‌హీ (కొరియా) ద్వయం చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. చదవండి: IND vs NZ: రెండో టి20ని వాయిదా వేయండి.. హైకోర్టులో పిల్ దాఖలు -
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ మిక్స్డ్ ఫైనల్లో సురేఖ జంట..
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంపౌడ్ మిక్స్డ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ-రిషభ్ యాదవ్ (భారత్) జంట 156-154తో రొక్సానా-ఖిరిస్టిచ్ (కజకిస్తాన్) జోడీపై గెలిచింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రియాలతో కూడిన భారత జట్టు 220-227తో ఇరాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Indonesia Masters Open: సింధు శుభారంభం.. -
పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్...
Shakib Al Hasan set to miss Pakistan T20Is due to hamstring injury: పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. నవంబర్19న మీర్పూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా మెకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ మద్య నుంచి షకీబ్ అల్ హసన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నమెంట్లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబరించింది. రెండు సార్లు 100 పరుగుల లోపు ఆలౌటై ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. చదవండి: Jasprit Bumrah: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన బుమ్రా... -
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన ఆడమ్ జంపా...
Adam zampa Creates Record In T20 World Cup: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డును సాధించాడు. ఆస్ట్రేలియా తరుపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. టి20 ప్రపంచకప్-2021 సూపర్ 12లో భాగంగా నవంబర్4న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించి ఈ ఘనత అందుకున్నాడు. అంతకముందు 2016 టి20 ప్రపంచకప్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్ పాకిస్తాన్‌పై 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాము: స్కాట్లాండ్ కెప్టెన్ -
టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా
Australia Creates Record In T20 Worldcup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. నవంబర్ 4న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 82 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ టార్గెట్‌ను ఫినిష్ చేసింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో 90 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన శ్రీలంక మొదటి స్ధానంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ధాటికి కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు సాధించగా, మ్యాక్స్‌వెల్ ఒక్క వికెట్ పడగొట్టాడు. స్కోర్లు: బంగ్లాదేశ్- 73 (15) ఆస్ట్రేలియా-78/2 (6.2) చదవండి: T20 WC 2021 AUS Vs BAN: ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం T20 WC 2021 Ind Vs Afg: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20ల్లో బంగ్లాదేశ్ చెత్త రికార్డు..
Bangladesh: టి20 క్రికెట్లో బంగ్లాదేశ్ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. టి20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు సార్లు వంద పరుగుల లోపు ఆలౌటైన తొలి జట్టు గా బంగ్లాదేశ్ నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2021లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కేవలం 84 పరుగులకే కూప్పకూలిన బంగ్లాదేశ్ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. అంతకముందు న్యూజిలాండ్‌తో రెండు సార్లు బంగ్లాదేశ్ కేవలం 76 పరుగలకే ఆలౌటైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 85 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు.. సఫారి పేసర్లు రబాడ(3/20), నోర్జే(3/8), ప్రిటోరియస్(1/11) నిప్పులు చెరగడంతో 84 పరుగులకే కుప్పకూలింది. చదవండి: వాళ్లకు ఐపీఎల్ ఆడితే చాలు.. అంతర్జాతీయ క్రికెట్ వద్దు: పాక్ మాజీ కెప్టెన్ -
T20WorldCup2021 : బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ విజయం
-
WI Vs BAN: ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం..
ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం.. చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. అఖరి ఓవర్లో 13 పరుగుల కావల్సిన నేపథ్యంలో బౌలింగ్ చేసిన రస్సెల్ 9 పరుగలే ఇచ్చి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలింగ్‌లో రస్సెల్, బ్రావో, హోసేన్, రవి రాంపాల్, హోల్డర్ చెరో వికెట్ సాధించారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో మహ్మదుల్లా(31), లిటన్ దాస్(44) పరుగులు చేశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. వెస్టిండీస్ 30 పరగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోస్టన్ చేజ్, పూరన్ వెస్టిండీస్ జట్టును అదుకున్నారు. ఆఖర్లో పూరన్, జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపించడంతో విండీస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. విండీస్ బ్యాటింగ్‌లో చేజ్(39),పూరన్(40)పరుగులు సాధించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం,ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. రహీమ్(8) ఔట్ లక్ష్య ఛేదనలో వరుస క్రమంలో బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది. అకేల్ హోసేన్ బౌలింగ్‌లో 17 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ పెవిలియన్‌కు చేరగా, రవి రాంపాల్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్() క్లీన్ బౌల్డ్‌య్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహ్మదుల్లా(7), లిటన్ దాస్(34) పరుగులతో ఉన్నారు. ఇంకా బంగ్లాదేశ్ విజయానికి 30 బంతుల్లో 44 పరుగులు కావాలి. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. నయీమ్(17) ఔట్ 17 పరుగులు చేసిన మహ్మద్ నయీమ్‌ను జాసన్ హోల్డర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 10 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సౌమ్య సర్కార్(13), లిటన్ దాస్(15) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. షకీబ్(9) ఔట్ 143 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షకీబ్, రస్సెల్ బౌలింగ్‌లో హాల్డర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ నయీమ్(16), లిటన్ దాస్(2) పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ టార్గెట్ 143 పరుగులు.. బంగ్లాదేశతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ 30 పరగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోస్టన్ చేజ్, పూరన్ వెస్టిండీస్ జట్టును అదుకున్నారు. ఆఖర్లో పూరన్, జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపించడంతో విండీస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. విండీస్ బ్యాటింగ్‌లో చేజ్(39),పూరన్(40)పరుగులు సాధించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం,ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. పూరన్(40) ఔట్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పూరన్ రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాసేపు సిక్సర్లు, ఫోర్లతో పూరన్ అలరించాడు. 22 బంతుల్లో 40 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం వీండిస్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్..హెట్‌మైర్(9) ఔట్ సమయం:16:30 బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. మెహిది హసన్ బౌలింగ్‌లో హెట్‌మైర్ సౌమ్యా సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలయన్‌కు చేరాడు. ప్రస్తుతం వీండిస్ 11 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్(24), పొలార్డ్(4) పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. గేల్(4) ఔట్ సమయం:16:03..టీ20 ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ మరో సారి నిరాశపర్చాడు. కేవలం 4 పరుగలుకే మెహిది హసన్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం వీండిస్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్(5), షిమ్రోన్ హెట్‌మైర్ (8)పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. లూయిస్(6) ఔట్ సమయం:15:43..బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లూయిస్(6) రూపంలో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం వీండిస్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి17 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్(5), క్రిస్ గేల్ (4)పరుగులతో ఆడుతున్నారు. షార్జా: టి20 ప్రపంచకప్2021లో భాగంగా సూపర్ 12 గ్రూప్1లో నేడు వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఇరుజట్లు వరుస ఓటమిలతో ఇప్పటికే సెమీఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకున్నాయి. ఇక ముఖాముఖి ఇరుజట్లు టి20ల్లో 11 సార్లు తలపడగా..6 సార్లు వెస్టిండీస్.. 5 సార్లు బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), సౌమ్యా సర్కార్, మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం,టాస్కిన్ అహ్మద్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వెస్టిండీస్: రోస్టన్ చేజ్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, షిమ్రోన్ హెట్‌మైర్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ (కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, జాసన్ హోల్డర్, రవి రాంపాల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్ -
రషీద్ సూపర్ డైవింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే
Adil Rashid takes spectacular diving catch: టి20 ప్రపంచకప్2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ అద్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో.. షకీబ్ అల్ హసన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది కాస్త మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. అయితే షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ను అందకున్నాడు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇనస్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే.. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SL Vs BAN: ఆటగాళ్ల మాటల యుద్దం.. కొట్టుకున్నంత పనిచేశారు
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లహీరు కుమార నోరుజారాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. ఐదో బంతికి లిటన్‌దాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ క్రమంలో లిటన్ దాస్ వైపు చూస్తూ లహీరు కుమార మాటలు తూటాలు పేల్చాడు. ఈ క్రమంలో లిటన్ దాస్ కూడా తానేం తక్కువ తినలేదన్నట్లుగా అతనితో వాదనకు దిగాడు. దీంతో ఇద్దరు క్రికెటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలగజేసుకుని సర్దిచెపే ప్రయత్నం చేశారు. అయితే అంతకుముందు కూడా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 4 వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. అఖరి బంతిని మహ్మద్ నయీమ్ ఢిపిన్స్ ఆడాడు. కానీ.. ఆ బంతిని అందుకున్న కుమార.. రనౌట్ కోసం వేగంగా నయీమ్పైకి విసిరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నీర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చదవండి: IND Vs PAK: అందుకే జట్టులో మాలిక్‌కు చోటు.. అసలు కారణం చెప్పిన పాక్ కెప్టెన్ pic.twitter.com/zhEtXaTVAA — pant shirt fc (@pant_fc) October 24, 2021 -
చెలరేగిన లాథమ్ ..చివరి టీ20లో కివీస్ గెలుపు
ఢాకా: ఢాకా వేదికగా జరిగిన ఐదో టీ20లోబంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 27 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించింది. కివిస్‌లో టామ్ లాథమ్(50) ఆర్ధసెంచరీతో చెలరేగగా, ఓపెనర్ ఫిన్ ఆలిన్ (41) రాణించాడు. అనంతరం 162 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లో 8వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. బంగ్లాదేశ్‌లో ఆరిఫ్ హూస్సేన్(49) తప్ప బంగ్లా బ్యాట్సమన్లు ఎవరూ కివీస్ బౌలర్ల ధాటికి నిలదొక్కలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లో ఎజాజ్ పటేల్,కుగ్గలిన్ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, కోల్ మెక్ కొన్చి, రచిన్ రవింద్ర ,బెన్ సీర్స్ చెరో వికెట్ సాధించారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో బంగ్లా జట్టు కైవసం చేసుకుంది. చదవండి: SL Vs SA: ఓపెనర్‌గా వచ్చి నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు -
తాలిబన్ల పాలనలో అఫ్గన్ తొలి క్రికెట్ సిరీస్ ఇదే!
ఢాకా: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ముస్లిం షరియత్ చట్టాల ప్రకారం పాలన కూడా సాగిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, అఫ్గన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోమంటూ తాలిబన్లు ఇటీవల స్పష్టమైన హామీనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్గన్ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక తొలిసారిగా ఆ దేశ అండర్ -19 జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ అండర్ -19 జట్టుతో ఐదు వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ ఆడనునుంది. మొదటి విడతగా ఎనిమిది మంది ఆటగాళ్ల బృందం ఢాకా కు చేరుకుంది. మిగిలిన ఆటగాళ్లు మరో రెండు విడతలుగా అక్కడకు చేరుకుంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రబీద్ ఇమామ్ తాజాగా వెల్లడించారు. అఫ్ఘన్ ఆటగాళ్లు ఢాకా వచ్చిన వెంటనే సిల్హెట్‌కు వెళ్లిపోయారని ఇమామ్ చెప్పారు. 2020, ఫిబ్రవరిలో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బంగ్లా అండర్ 19 టీమ్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. చదవండి: South africa vs Sri lanka: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు -
టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ దూరం
ఢాకా: వచ్చే నెలలో ఒమన్, యూఏఈలలో జరిగే టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో తాను పాల్గొనడంలేదని బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా గత ఐదు నెలలుగా తమీమ్ ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా సీరిస్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మార్గదర్శకాల ప్రకారం, సెప్టెంబర్ 10 లోపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలి. కొన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమీమ్ ఇక్బాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. టి20 ప్రపంచ కప్ జట్టులో నేను ఉండాలని అనుకోవడం లేదని..నా స్థానంలో ఎవరు వచ్చినా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌గా తమీమ్ పేరిట రికార్డు ఉంది. ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్‌లు ఆడి 1,701 పరుగులు చేశాడు. కాగా బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో సూపర్12 కు అర్హత సాధించడానికి గ్రూప్ B లో స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ తో తలపడనుంది. చదవండి: పాల్ స్టిర్లింగ్ మెరుపు సెంచరీ.. ఐర్లాండ్ ఘనవిజయం -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు..
ఢాకా: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు టి20 ఫార్మాట్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఢాకాలో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ (2/10), ముస్తఫిజుర్ (3/13), నాసుమ్ అహ్మద్ (2/5), సైఫుద్దీన్ (2/7) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. టి20ల్లో న్యూజిలాండ్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు. కాగా ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ జట్టు 10 మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. చదవండి: Shaheen Afridi: కెరీర్లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు What a start for Bangladesh! New Zealand are 18/4 after the Powerplay 👀 Who will help them rebuild?#BANvNZ | https://t.co/4Bvg9arZLr pic.twitter.com/tMPt3JnFY8 — ICC (@ICC) September 1, 2021 Bangladesh registered their first T20I victory over New Zealand after defeating the visitors by seven wickets in the opening match.#BANvNZ report 👇 — ICC (@ICC) September 1, 2021 -
బంగ్లాదేశ్ పర్యటనకు ఆస్ట్రేలియా.. జట్టు ఇదే!
ఢాకా: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆసీస్ 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ధృవీకరించారు. ఇక 2017 తర్వాత మెదటిసారిగా ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ప్రస్తుతం వెస్ట్ఇండీస్ పర్యటనలో ఉన్న ఆసీస్ నేరుగా బంగ్లాదేశ్ చేరుకోనుంది. ఢాకాలో కఠిన నిబంధనల మధ్య 3 రోజులు పాటు క్వారంటైన్లో ఉండునుంది. మరోవైపు జింబావ్వే పర్యటనలో ఉన్న బంగ్లా జట్టు ఈ నెల 29న స్వదేశానికి చేరుకోనుంది. ఈ సీరిస్ లో భాగంగా మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఢాకా వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఆడుతున్న జట్టును కొనసాగించనుంది. ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, వెస్ అగర్, జాసన్ బెహ్రిండోర్ఫ్, అలెక్స్ కారీ, డాన్ క్రిస్టియన్, జోష్ హాజిల్‌వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, అష్టన్ టర్నర్, ఆండ్రూ టై , మాథ్యూ వేడ్ (వైస్ కెప్టెన్), ఆడమ్ జాంపా. -
సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే?
కోల్‌కతా: ప్రేమకు హద్దులు, సరిహద్దులు అంటూ ఉండవు. ఎవరినైనా.. ఎక్కడివారినైనా ప్రేమించొచ్చు. ప్రేమ పుట్టడమే అలస్యం.. ప్రేమించిన అమ్మాయి కోసం దేశాలు దాటి వెళ్లడానికి కూడా సిద్దం అవుతున్నారు కొందరు యువకులు. కొన్ని కొన్ని సార్లు ప్రేమ కోసం అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నారు. ఇటువంటి సంఘటనే భారత్-బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని బల్లావ్‌పూర్ గ్రామానికి చెందిన జైకాంతో చంద్రరాయ్ (24)కు ఫేస్బుక్లో బంగ్లాదేశ్‌కు చెందిన పరిణితి అనే అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఓ బ్రోకర్ సాయంతో మార్చి 8న సరిహద్దు దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. జూన్ 10వ తేదీన ప్రేయసి పరిణితిని వివాహమాడాడు. ఆ తర్వాత జూన్ 25వ తేదీ వరకు ఇద్దరూ కలిసి అక్కడే ఉన్నారు. జూన్ 26న చంద్రరాయ్ తన భార్యతో కలిసి సొంతూరుకి బయలుదేరాడు. అయితే, బోర్డర్ దాటించేందుకు ఈ సారి కూడా రాజు మండల్ అనే బ్రోకర్ సాయం తీసుకున్నాడు. బోర్డర్ దాటించినందుకు అతడికి 10వేలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ జంట అక్రమంగా సరిహద్దు దాటుతున్నట్టు బీఎస్ఎఫ్ బలగాలకు పక్కా సమాచారం అందింది. వెంటనే ఆప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు ఆ జంటను అదుపులోకి తీసుకున్నాయి. బీఎస్ఎఫ్ విచారణలో అబ్బాయిది పశ్చిమ బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తెలింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో వీరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వీరికి సరిహద్దు దాటేందకు సాయం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్‌లో ఈ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్‌కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్) -
ఫైనల్లో యువ భారత్
ఢాకా: కుర్రాళ్ల బౌలింగ్ ప్రదర్శనతో అనూహ్యంగా భారత జట్టు ఆసియాకప్ అండర్–19 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్‌లో మోహిత్ జాంగ్రా (3/25), సిద్ధార్థ్ దేశాయ్ (3/35), హర్‡్ష త్యాగి (2/29) అద్భుతంగా రాణించడంతో సెమీస్‌లో భారత్ 2 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొదట భారత్ 49.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (37), అనుజ్ (35), సమీర్ (36), ఆయుశ్ బదోని (28) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లామ్ 3, మృత్యుంజయ్ చౌదరి, రిషద్, తౌహిద్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 46.2 ఓవర్లలో 170 పరుగుల వద్ద ఆలౌటైంది. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా... షమీమ్ (59), అక్బర్ అలీ (45)ల పోరాటంతో కాసేపు గెలుపుదారిలో నడిచింది. అయితే స్పిన్నర్ త్యాగి 139 స్కోరు వద్ద అక్బర్‌ను, 147 పరుగుల వద్ద మృత్యుంజయ్ (2)ను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పేశాడు. షమీమ్‌ను అజయ్ ఔట్ చేయడంతో బంగ్లాకు ఓటమి ఖాయమైంది. చివరి ఐదు వికెట్లను బంగ్లాదేశ్ 31 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. -
ఆసీస్‌కు ఊరట
బంగ్లాదేశ్‌పై విజయం ఆతిథ్య జట్టుకు పూర్తి నిరాశ రాణించిన ఫించ్, వార్నర్ సాక్షి, ఢాకా: స్థాయికి తగ్గ ఆటతీరును క నబరచలేక అన్ని పెద్ద జట్ల చేతిలో ఓడి సెమీస్‌కు దూరమైన ఆస్ట్రేలియా జట్టు... బలహీనమైన ఆతిథ్య బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో ఊరట పొందింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహిస్తున్న బంగ్లాదేశ్... ఆట పరంగా మాత్రం పూర్తి నిరాశతోనే టోర్నీని ముగించింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు సాధించింది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్ రెండు, స్టార్క్, బొలింజర్, వాట్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు 17.3 ఓవర్లలో మూడు వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఫించ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... వైట్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), బెయిలీ (7 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్‌కు రెండు, తస్కిన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.