టీ20ల్లో బంగ్లాదేశ్‌ చెత్త రికార్డు.. | Bangladesh is the first Full Member side to be bowled out for under 100 Thrice in a Calendar year | Sakshi
Sakshi News home page

Bangladesh: టీ20ల్లో బంగ్లాదేశ్‌ చెత్త రికార్డు..

Published Tue, Nov 2 2021 6:29 PM | Last Updated on Tue, Nov 2 2021 7:25 PM

Bangladesh is the first Full Member side to be bowled out for under 100 Thrice in a Calendar year - Sakshi

Bangladesh: టి20 క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది.  టి20ల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు సార్లు వంద పరుగుల లోపు ఆలౌటైన తొలి జట్టు గా బంగ్లాదేశ్‌ నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కేవలం 84 పరుగులకే కూప్పకూలిన బంగ్లాదేశ్‌ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. అంతకముందు న్యూజిలాండ్‌తో రెండు సార్లు బంగ్లాదేశ్‌ కేవలం 76 పరుగలకే ఆలౌటైంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 85 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు..  సఫారి పేసర్లు రబాడ(3/20), నోర్జే(3/8), ప్రిటోరియస్‌(1/11) నిప్పులు చెరగడంతో  84 పరుగులకే కుప్పకూలింది.  

చదవండి: వాళ్లకు ఐపీఎల్‌ ఆడితే చాలు.. అంతర్జాతీయ క్రికెట్ వద్దు: పాక్‌ మాజీ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement