T20 World Cup 2021
-
వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ: మహ్మద్ రిజ్వాన్
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన అనంతరం పాకిస్తాన్ స్టార్ ఓపెనర్, వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రిజ్వాన్ మాట్లాడింది టీమిండియాను ఉద్దేశించి. స్కై స్పోర్ట్స్ ఛానల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్‌తో రిజ్వాన్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌కప్-2021లో టీమిండియాపై విజయం తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవాన్ని సైతం పక్కకు పెట్టిన రిజ్వాన్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరల్డ్‌కప్‌లో భారత్‌పై విజయం సాధించిన నాటి నుంచి స్వదేశంలో తనకు మర్యాద విపరీతంగా పెరిగిపోయిందని, తాను షాపింగ్‌కు ఎక్కడికి వెళ్లినా షాప్ యజమానులు తన వద్ద డబ్బులు తీసుకోవట్లేదని తెలిపాడు. ఇండియాను ఓడించావు.. అది చాలు, మాకు డబ్బులు వద్దు.. నీకు అన్నీ ఫ్రీ అంటూ షాప్కీపర్లు తెగ మెహమాట పెట్టేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తానైతే టీమిండియాపై గెలుపును ఓ సాధారణ గెలుపులానే భావించానని, స్వదేశానికి వెళ్లాక ఆ గెలుపు ప్రత్యేకతేంటో తనకు తెలిసి వచ్చిందని అన్నాడు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్), బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో తమ జట్టును గెలిపించుకున్నాడు. -
Team India: ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జోరు.. మెగా టోర్నీల్లో బేజారు
రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి భారత జట్టు.. ఆడిన ప్రతి సిరీస్‌లోనూ జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. అయితే, మెగా టోర్నీల విషయానికి వస్తే మాత్రం టీమిండియా తేలిపోతుంది. ఒత్తిడి వల్లనో లేక కీలక ఆటగాళ్లు సమయానికి (కీలక టోర్నీలకు) అందుబాటులో లేకపోవడం వల్లనో.. కారణం ఏదైనా పెద్ద టోర్నీల్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్‌లపై లుక్కేస్తే.. స్వదేశంలో వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0)లను క్లీన్ స్వీప్ చేసింది. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆతర్వాత కరీబియన్ గడ్డపై 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో, ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్ విజయాలు సాధించింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా.. ఈ ఏడాది టీమిండియా ఆడిన 8 సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించి, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే, టీమిండియా ఈ జోరును మెగా ఈవెంట్లలో మాత్రం చూపలేకపోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్లలో జరిగిన ఆసియా కప్‌లో సూపర్-4లోనే నిష్క్రమణ, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి.. ఇలా ఈ ఏడాది ఆడిన రెండు మేజర్ టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆసియా కప్‌లో అయితే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో దారుణ పరాభావాలు (సూపర్-4) ఎదుర్కొని ముప్పేట దాడిని ఎదుర్కొంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే పరిస్థితి ఏదురైంది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే పాక్ చేతుల్లో ఓడి సూపర్-4కు కూడా అర్హత సాధించలేక పోయింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం, సెమీస్‌కు వచ్చే సరికి ఆగిపోయింది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. -
ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం.. సెలక్టర్ల వల్లేనంటూ!
Kevin O Brien: ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఆట నుంచి వైదొలుగుదామని భావించినప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనను సెలక్టర్లు పక్కనపెట్టారన్న 38 ఏళ్ల కెవిన్.. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మంగళవారం సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అందరికీ ధన్యవాదాలు! ‘‘ఐర్లాండ్ జట్టుకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో పనిచేసిన కోచ్‌లు.. సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించిన అడీ బిరెల్, ఫిల్ సిమ్మన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. క్రికెటర్‌గా నా ప్రయాణంలో వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న నా భార్య రూత్ అనీకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ కెవిన్ తన నోట్లో పేర్కొన్నాడు. 2006లో ఎంట్రీ ఇచ్చి! కాగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ 2006లో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌తో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. టెస్టు క్రికెట్లో ఐర్లాండ్ జట్టు అసోసియేట్ మెంబర్షిప్ పొందడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. ఇక 2008లో టీ20 ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చి.. మొత్తంగా 109 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది అక్టోబరు(వరల్డ్‌కప్)లో కెవిన్ తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిమిత ఓవర్ల జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో కెవిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. టెస్టుల్లో.. ఇదిలా ఉంటే.. 2018లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన కెవిన్.. 2019లో లార్డ్స్ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంగా మూడు టెస్టులాడిన అతడు 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 118. వన్డేల్లో ఇలా వన్డేల విషయానికొస్తే.. 152 మ్యాచ్‌లు ఆడి 3619 పరుగులు(అత్యధిక స్కోరు 142) చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఒక సెంచరీ(124 పరుగులు) నమోదు చేశాడు. కెవిన్ తన కెరీర్లో మొత్తం నాలుగు శతకాలు(టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి) బాదాడు. బౌలర్‌గా అరుదైన ఘనత ఇక రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన కెవిన్.. వన్డేల్లో 114 వికెట్లు తన ఖాతాలో వేసుకుని.. ఐర్లాండ్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీలో వేగవంతమైన సెంచరీ(50 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం.. మొత్తంగా 113 పరుగులు) సాధించిన బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. 2011 ప్రపంచకప్ సందర్భంగా బెంగళూరులో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. చదవండి: Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే.. Thanks ☘️ pic.twitter.com/E4335nE8ls — Kevin O'Brien (@KevinOBrien113) August 16, 2022 -
Ind Vs Pak: అతడు ఫామ్‌లోకి వస్తే మనకు ఓటమి తప్పదు: పాక్‌కు సల్మాన్ వార్నింగ్
Asia Cup 2022 India Vs Pakistan: ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆ మరుసటి రోజే క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఇక మ్యాచ్‌లో గెలిచి టీ20 ప్రపంచకప్-2021లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ప్రస్తుతం రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తూ జోరు మీదున్న తీరు చూస్తే గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు, యువ ఆటగాళ్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఫామ్‌లో ఉండటం సహా.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వస్తే భారత్‌ను ఆపడం ఎవరితరం కాదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా ఇదే మాట అంటున్నాడు. రొటేషన్ పాలసీతో భారత్ తమ ఆటగాళ్లందరినీ పరీక్షిస్తూ బెంచ్‌ను పటిష్టం చేసుకుంటోందని కొనియాడాడు. అదే విధంగా విరాట్ కోహ్లి విజృంభిస్తే పాకిస్తాన్‌కు కష్టాలు తప్పవని బాబర్ ఆజం బృందాన్ని హెచ్చరించాడు. మంచి పరిణామం! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా సల్మాన్ బట్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘భారత జట్టులో రొటేషన్ పాలసీ అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయినట్లుగా అనిపిస్తోంది. ప్రతీ సిరీస్‌లోనూ వాళ్లు వేర్వేరు ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నారు. సీనియర్లకు తగినంత విశ్రాంతినిస్తూ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. విభిన్న కాంబినేషన్లతో ముందుకు వస్తున్నారు. నిజానికి ప్రస్తుతం వాళ్ల బెంచ్ స్ట్రెంత్ కారణంగా సెలక్షన్ తలనొప్పిగా మారుతోంది. ఇది మంచి పరిణామమే. కోహ్లి గనుక ఫామ్‌లోకి వస్తే! ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే... అతడు ఎంతటి అనువజ్ఞుడో, అతని శక్తి సామర్థ్యాలేమిటో అందరికీ తెలుసు. కోహ్లి వీలైనంత తొందరగా ఫామ్‌లోకి వస్తే బాగుంటుందని ఇండియా భావిస్తోంది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చాలా మంది భారత ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చిన తీరును మనం చూశాం. ఒకవేళ కోహ్లి గనుక తిరిగి పుంజుకుంటే.. కచ్చితంగా అతడు పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారతాడు’’ అని సల్మాన్ బట్ పాకిస్తాన్ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్తాన్‌పై కోహ్లి అర్ధ శతకం(57)తో రాణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్(39) మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయకపోవడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేయడం భారత బౌలర్లకు సాధ్యం కాకపోవడంతో పది వికెట్ల తేడాతో కనీవిని ఎరుగని రీతిలో ఐసీసీ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. చదవండి: India Tour Of Zimbabwe: స్టార్ ఆల్‌రౌండర్ దూరం..! WI VS NZ 3rd T20: ఎట్టకేలకు ఓ విజయం.. వైట్‌వాష్ అవమానాన్ని తప్పించుకున్న విండీస్ టీమిండియా పటిష్టమైన జట్టే కావొచ్చు.. ధీటుగా పోటీ ఇస్తాం..! #ViratKohli has started the practice for #AsiaCup 2022 at BKC Complex Mumbai.pic.twitter.com/KkhgGWGYti — Lakshya Lark (@lakshyalark) August 11, 2022 Cometh the hour, cometh the man!🙌 Do you remember this crucial knock that helped #TeamIndia complete a tricky chase? Look forward to more such knocks from #KingKohli in the greatest rivalry! #BelieveInBlue | #AsiaCup | #INDvPAK: Aug 28, 6PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/UtZJnVh9v4 — Star Sports (@StarSportsIndia) August 12, 2022 -
T20 WC 2021: రిజ్వాన్‌కు ఆ నిషేధిత మెడిసిన్ ఇచ్చాం: పీసీబీ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
ICC T20 World Cup 2021 Semi Final PAK Vs AUS: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అదరగొట్టిన పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డాక్టర్ నజీబుల్లా సుమ్రొ సంచలన విషయాలు వెల్లడించాడు. వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో అనారోగ్యం బారిన పడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కోలుకునేందుకు నిషేధిత పదార్థాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా యూఏఈ వేదికగా సాగిన ఐసీసీ పొట్టి ఫార్మాట్ ఈవెంట్లో పాకిస్తాన్ అజేయ రికార్డును కొనసాగిస్తూ సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు రిజ్వాన్ తీవ్ర చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ఐసీయూలో చికిత్స పొందిన అతడు అనూహ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడమే కాదు.. 52 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు. PC: Shoaib Akhtar Instagram అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలగేరడంతో పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూలు.. ఆపై ఫైనల్ చేరి.. అక్కడ న్యూజిలాండ్‌ను ఓడించి తొలిసారి ట్రోఫీ గెలిచారు. ఇదిలా ఉంటే.. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక మైదానంలో దిగాడంటూ అప్పట్లో రిజ్వాన్‌పై ప్రశంసలు కురిశాయి. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే రిజ్వాన్‌కు ఆట పట్ల ఉన్న అంకితభావం, దేశం కోసం ఆడాలన్న తపన చూసి గర్వపడుతున్నానంటూ పేర్కొన్నాడు. మిగతా పాక్ క్రికెటర్లు సైతం అతడిని ప్రశంసించారు. అయితే, ఈ ఘటన గురించి రిజ్వాన్‌కు చికిత్స అందించిన డాక్టర్ నజీబుల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు.. ‘‘నువ్వు అసలు శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు కోలుకోవాలంటే నీకు ఇంజెక్ట్ చేయాల్సిన మెడిసన్ గురించి ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆ మెడిసిన్ అథ్లెట్లు వాడటం నిషేధం. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకు కచ్చితంగా ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలి’’ అని రిజ్వాన్‌తో ఇంటర్వ్యూలో నజీబుల్లా వ్యాఖ్యానించాడు. కాగా నజీబుల్లా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. చదవండి👉🏾MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని చదవండి👉🏾IPL 2022: ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం"
టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నటరాజన్ అద్భుతంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2021లో నటరాజన్ సేవలను భారత్ కచ్చితంగా కోల్పోయింది అని రవిశాస్త్రి తెలిపాడు. గత ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నటరాజన్ మోకాలికి గాయమైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు నటరాజన్ దూరమయ్యాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి ఐపీఎల్లో అడుగుపెట్టాడు. "టీ20 ప్రపంచకప్‌లో నటరాజన్ సేవలను కోల్పోయాం. అతడు ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా జట్టులో ఉండేవాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో నటరాజన్ గాయపడ్డాడు. అతడు స్పెషలిస్ట్ డెత్ బౌలర్, యార్కర్లను అద్భుతంగా వేయగలడు. అతడు తన పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్ప తిప్పలు పెడతాడు. నేను అతడిని ఎంపిక చేసిన ప్రతి మ్యాచ్‌లోను భారత్ విజయం సాధించింది. అతడి అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోను భారత్ విజయం సాధించింది. అదే విధంగా అతడి టెస్టు అరంగేట్రంలోను టీమిండియా గెలిపొందింది. నటరాజన్ నెట్ బౌలర్ నుంచి ఈ స్థాయికి ఎదగడం నిజంగా గర్వించ దగ్గ విషయం" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే! -
Bharat Pe: ఇదెక్కడి లొల్లిరా నాయనా ? ఇంతలా దిగజారి పోయారు !
ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీగా మొదలై యూనికార్న్‌గా ఎదిగి ఎంతోమంది ఔత్సాహిక ఎంట్రప్యూనర్లకు స్ఫూర్తిని ఇచ్చింది భారత్‌పే. కానీ ఇప్పుడు బోర్డు సభ్యలు మధ్య చెలరేగిన గొడవలతో ఆ కంపెనీ ప్రతిష్ట మసకబారుతోంది. దిగజారుడు విమర్శలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కంపెనీని సొమ్ముతు ఇష్టారీతగా ఖర్చు చేయడంతో పాటు అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నాడనే ఆరోపణలతో భారత్‌పే ఫౌండర్లలో ఒక్కడైన అశ్నీర్ గ్రోవర్‌ను ఇటీవల కంపెనీ నుంచి బయటకు పంపారు. అప్పటి నుంచి అశ్నీర్‌గ్రోవర్‌పై ఏదో ఆరోపణ వస్తూనే ఉంది. దానికి అతను కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న కంపెనీ డబ్బులను ఇష్టారీతిగా ఖర్చు పెడుతూ పది కోట్ల రూపాయల విలువైన డైనింగ్ టేబుల్ కొనుగోలు చేశాడనే ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి మంచి మరో చిల్లర ఆరోపణలు అతనిపై వచ్చాయి. క్రికెట్ టోర్నీని వదల్లేదు 2021 అక్టోబరు, నవంబరులో టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీకి భారత్‌పే గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో టోర్నీ నిర్వాహకులు తమ పార్టనర్లకు ప్రతీ మ్యాచ్‌కి 700ల వరకు ఉచిత్ పాస్‌లు అందించారు. అయితే గ్లోబప్ పార్టనర్‌గా భారత్‌పేకు దక్కిన పాసులను అశ్నీర్‌గ్రోవర్ అమ్ముకుని కోట్లు సంపాదించాడనే మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఫ్రీ పాసుల అమ్మకం? ప్రతీ పాసుని కనీసం 750 దిర్హాం (ఇండియన్ కరెన్సీలో రూ.15,000)లకు అమ్ముకున్నాడని, వీఐపీ పాస్‌ల ధర అయితే చెప్పలేమని కొందరు మాజీ ఉద్యోగులు చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. పేరుకే భారత్ పే ఉద్యోగులకు కొన్ని జనరల్ స్టాండ్లకు సంబంధించిన పాస్‌లు అందాయని మిగిలనవి అశ్నీర్ అమ్ముకున్నాడనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. What BharatPe Board thinks I am doing at ICC World Cup “10 ka 2, 10 ka 2, 10 ka 2 - aye sahab mangta hai kya ticket black mein ?!” What I am actually doing is ensuring Suhail Sameer and @sumeetsingh29 don’t drink silly the hospitality section dry. Kuchh nahi mila to kuchh bhi !!! pic.twitter.com/jI7vmWDECx — Ashneer Grover (@Ashneer_Grover) March 16, 2022 కపట నాటకాలు ఆపండి క్రికెట్ టోర్నమెంట్ పాసులు అమ్ముకున్నట్టు తనపై వస్తున ఆరోపణలపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. భారత్‌పే చేస్తున్న ప్రచారాన్ని బట్టి నేను స్టేడియం దగ్గరర పది ఇవరై పది ఇవరై అంటూ పాసులు అమ్ముకున్నానా? ఎందుకీ చిల్లర ఆరోపణలు ? కపటత్వాన్ని ఇకనైనా ఆపండి అంటూ భారత్‌పే బోర్డుకు సూచించాడు. ఈ మేరకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ స్టాండ్‌లో తాను ఉన్నప్పటి ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు అశ్నీర్ గ్రోవర్. Just tell us whether or not we keep invested on BharatPe? Many small investors invested because of you. — Raj (@Raj_Chen) March 17, 2022 మీకు బాధ్యత లేదా బోర్డులో తలెత్తిన లుకలుకలతో గత మూడు నెలలుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనిపై భారత్‌పేలో ఇన్వెస్ట్ చేసిన ముదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో మా డబ్బులు ఇన్వెస్ట్ చేశాం. అది మరిచి మీరు వ్యక్తిగత దూషణలతో కంపెనీ ప్రతిష్ట దిగజార్చుతున్నారు. బాధ్యతగా వ్యవహరించండి అంటూ సూచిస్తున్నారు. చదవండి: భారత్‌పే వ్యవహారాలపై జీఎస్టీ దర్యాప్తు -
'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు'
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మెగాటోర్నీలో పాక్‌పై తమకున్న ఘనమైన రికార్డును టీమిండియా కోల్పోయింది. పాక్‌తో జరిగిన మ్యాచ్ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో షమీ 3.5 ఓవర్లు బౌల్ చేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఓటమికి భారత ప్రధాన పేసర్ మహ్మద్ షమీయే కారణమంటూ కొందరు గిట్టనివాళ్లు అప్పట్లో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడని.. అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షమీపై జరిగిన దాడిని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు ఖండించారు. తాజాగా షమీ తనపై చేసిన విమర్శలపై ఎట్టకేలకు మౌనం వీడాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన ఇంటర్య్వూలో షమీ మాట్లాడాడు. ''మంచి ప్రదర్శన చేస్తే హీరో అంటారు.. ఒక్క మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన వస్తే జీరో అంటారు. ఇలా ఒక ఆటగాడిని హీరోగా పరిగణించి ఆ తర్వాత అదే ఆటగాడిపై దురుసుగా ప్రవర్తిసే.. కచ్చితంగా వాళ్లు భారతీయులు మాత్రం కాదు. వాళ్లు మన దేశానికి చెందినవారే కానప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎన్ని చెప్పినా నా దృష్టిలో అవి పనికిరానివే. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. అంతేకాదు ఎవరైనా నా గురించి బాధ కలిగించే మాటలు మాట్లాడితే.. అతను నాకు లేదా భారత జట్టుకు అభిమాని కానేకాదు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో నాకు తెలుసు. భారతదేశం అంటే ఏమిటో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం. దేశం కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి ట్రోల్స్‌ను అస్సలు పట్టించుకోము'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరపున మహ్మద్ షమీ 57 టెస్టుల్లో 209 వికెట్లు.. 79 వన్డేల్లో 148 వికెట్లు.. టి20ల్లో 18 వికెట్లు తీశాడు. చదవండి: కెప్టెన్‌గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్ Ashton Agar: నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడు.. పాక్ పర్యటనకు ముందు బెదిరింపులు -
'ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను'
ఎంతో మంది యువ క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదర్శ ప్రాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోని యువ ఆటగాళ్లకి జట్టుతో సంబంధం లేకుండా విలువైన సూచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ధోనిను కలవడంతో తన కల సాకరమైంది అని పాకిస్తాన్ యువ సంచలనం షానవాజ్ దహానీ తెలిపాడు. ధోని తనకు విలువైన సూచనలు చేశాడాని అతడు చెప్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్- భారత్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మెంటార్‌గా వ్యవహరిస్తున్న ధోనిను దహానీ కలిశాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను కలవాలనే కోరికను కూడా అతడు వెల్లడించాడు. తంలో న్యూజిలాండ్ మాజీ స్పీడ్‌స్టర్ షేన్ బాండ్‌ని ఫాలో అయ్యేవాడిని అని, ప్రస్తుతం ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఆర్చర్‌ను అనుసరిస్తున్నాని దహానీ పేర్కొన్నాడు. దహానీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సూల్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో దహానీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ముల్తాన్ సుల్తాన్ ఫైనల్‌కు చేరడంలో దహానీ కీలక పాత్ర పోషించాడు. "నేను న్యూజిలాండ్ స్టార్ బౌలర్ షేన్ బాండ్‌ను ఫాలో అయ్యే వాడిని. అతడు లాగే ఫాస్ట్ బౌలర్ కావాలి అని అనుకున్నాను. కానీ అతడు రిటైర్మెంట్ తర్వాత, నేను ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ని అనుసరించడం ప్రారంభించాను. త్వరలో ఆర్చర్‌ను కలవాలనేది నా కోరిక. ఇక మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గరించి చెప్పాలంటే నాకు చాలా సమయం పడుతుంది. అతడిని కలవడం నా కల నెరవెరింది. ఇప్పటికి అతడిని కలిసిన ఆ క్షణం మర్చిపోలేను. ఎందుకంటే జీవితం గురించి, పెద్దలను గౌరవించడం గురించి ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఊపయోగపడ్డాయి. క్రికెట్లో మంచి, చెడు రోజులు వస్తాయని, వాటిని స్వీకరించాలని ధోని చెప్పాడు. అటువంటి సమయంలో కేవలం ఆటపై దృష్టి సారించాలి అని అతడు చెప్పాడు" అని దహానీ క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Emma Raducanu: వెంబడించి, వేధించాడు.. చాలా భయపడ్డా..! నిషేదాజ్ఞ జారీ! -
'ఐదేళ్లలో ఒక్కసారి కూడా చోటు కోల్పోలేదు.. ఆరోజు మాత్రం'
టి20 ప్రపంచకప్ 2021కు తనను ఎంపిక చేయకపోవడం చాలా బాధ కలిగించిందని టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ పేర్కొన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా జట్టులో చహల్ చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సమయంలో ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌తో చహల్ మాట్లాడాడు. ''టి20 ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించే రోజు అది. ఉదయం 9:30 గంటల సమయంలో జట్టును ప్రకటిస్తామన్నారు. కానీ కాస్త లేట్ అయింది. అప్పటివరకు నా పేరు జట్టులో ఉంటుందని బాగా నమ్మాను. కానీ లిస్ట్ బయటికి వచ్చాకా గట్టిషాక్ తగిలింది. దీంతో కొన్ని నిమిషాల పాటు ఎవరితో ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. కొద్దిసేపటి తర్వాత నా భార్య విషయం ప్రస్తావించింది. లిస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపాను. ఆరోజు రాత్రి ఏమి తినకుండా ఆలోచిస్తూ కూర్చుండిపోయా. అంతకముందు ఐదేళ్లలో ఒక్కసారి కూడా టీమిండియాలో చోటు కోల్పోలేదు.. ఎందుకిలా అని ఆలోచించాను'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: PSL 2022: ఔటయ్యాడని తెగ ఫీలైపోయింది.. ఆరా తీస్తే ఇక ఐపీఎల్ మెగావేలం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక టీమిండియాకు మరో 5-6 సంవత్సరాల పాటు ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. కాగా ఐపీఎల్లో ఆర్బీకీ ఆడిన చహల్‌ను ఆ జట్టు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న వేలంలో చహల్‌ను ఏ జట్టు సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్లో చహల్ 114 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు తీశాడు. కాగా టి20 ప్రపంచకప్‌లో చహల్ స్థానంలో రాహుల్ చహర్‌ను ఎంపిచేశారు. ఇక టీమిండియా టి20 ప్రపంచకప్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్.. తర్వాతి మ్యాచ్‌లను గెలిచినప్పటికి సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. చదవండి: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరమంటున్న భారత మాజీ బౌలర్ -
క్యాచ్ డ్రాప్ చేశా.. ఏడ్చాను.. రెండ్రోజులు నిద్రపోలేదు.. నా భార్య కంగారుపడింది..
టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో సూపర్ 12 దశలో అద్భుత విజయాలు సాధించిన పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన బాబర్ ఆజమ్ బృందం... రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా మార్కస్ స్టొయినిస్(40 పరుగులు), మాథ్యూ వేడ్(41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించారు. ఇక షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను... హసన్ అలీ మిస్ చేయగా.. దొరికిన లైఫ్‌ను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే కంగారూలను గెలిపించాడు. దీంతో హసన్ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. అతడి భార్యను ఉద్దేశించి కూడా కొంతమంది నీచపు కామెంట్లు చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన హసన్ అలీ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు. క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడిన అతడు... ‘‘నా కెరీర్లో అది అత్యంత కఠిన సమయం. ఆ మ్యాచ్ ఫలితాన్ని అస్సలు మర్చిపోలేకపోయాను. ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోని విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా. ఆ రోజు మ్యాచ్ తర్వాత రెండు రోజుల పాటు నేను నిద్రపోలేదు. ఏడ్చాను. నా భార్య చాలా కంగారుపడింది. టెన్షన్‌కు గురైంది. నేను ఏమైపోతానో అని భయపడింది. నేను మాత్రం డ్రాప్ చేసిన ఆ క్యాచ్ గురించే తీవ్రంగా ఆలోచించేవాడిని. ప్రతిసారి ఆ విషయమే గుర్తుకు వచ్చేది. అయితే, బంగ్లాదేశ్ పర్యటనకు పయనమైన తర్వాత నాలో కాస్త మార్పు వచ్చింది. చేదు ఘటనను మర్చిపోయి ముందుకు సాగాలని నాకు నేనే నచ్చజెప్పుకొన్నాను’’ అని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో సహచర ఆటగాళ్లు ముఖ్యంగా షోయబ్ భాయ్ తనకు అండగా నిలిచాడన్న హసన్ అలీ... నువ్వు టైగర్ అంటూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడని గుర్తు చేసుకున్నాడు. తాను ఏడుస్తుంటే షాహిన్ కూడా ఏడ్చాడని అంతా కలిసి తమను ఓదార్చారని పేర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో అభిమానులు సైతం తనకు మద్దతుగా నిలబడ్డారని, వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పాకిస్తాన్‌పై విజయంతో ఫైనల్లో ప్రవేశించిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీద గెలుపొంది తొలిసారి టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: Sourav Ganguly: మొన్న కోహ్లిని అలా.. ఇప్పుడు ఇలా.. మరో వివాదంలో గంగూలీ.. సిగ్గుపడండి.. ఎందుకిలా? పాపం కెప్టెన్, కోచ్! -
చిన్ని తండ్రికి స్వాగతం... క్రికెటర్ భావోద్వేగం
ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ తండ్రయ్యాడు. అతడి భార్య ఎల్లీ మూరే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన జేసన్ రాయ్... భార్యా బిడ్డలకు కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. కొడుకుకు ఎలోసీ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు... ‘‘జనవరి 5, 2022న జననం. కుటుంబంలోకి స్వాగతం చిన్ని తండ్రీ... నాకు చాలా గర్వంగా ఉంది. కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయింది’’ అని భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి రాయ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2017 అక్టోబరులో రాయ్ తన గర్ల్‌ఫ్రెండ్ ఎల్లీని వివాహమాడి జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. 2019లో ఈ జంటకు కూతురు ఎవర్లీ జన్మించగా.. ఇప్పుడు కుమారుడు పుట్టాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా జేసన్ రాయ్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్-2021 సీజన్లో జేసన్ రాయ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! View this post on Instagram A post shared by Jason Roy (@jasonroy20) -
టీమిండియాకు షాకివ్వడమే గతేడాదికి అత్యుత్తమం.. పాక్ కెప్టెన్
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియాను ఓడించడమే గతేడాదికి అత్యుత్తమమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు. తాజాగా పాక్ క్రికెట్ బోర్డు పోడ్కాస్ట్తో మాట్లాడుతూ.. బాబర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. దుబాయ్ వేదికగా గతేడాది అక్టోబర్ 24న జరిగిన హై ఓల్టేజీ పోరులో కోహ్లి సేనపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం చిరస్మరణీయమని అన్నాడు. ప్రపంచకప్ టోర్నీల్లో(టీ20, వన్డే) టీమిండియాను తొలిసారిగా ఓడించడం ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందని తెలిపాడు. కాగా, భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2021 వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కోహ్లి(49 బంతుల్లో 57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం పాక్ ఓపెనర్లు బాబార్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ చెలరేగడంతో పాక్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో టీమిండియా ప్రపంచకప్ సెమీస్ బెర్తును సంక్లిష్టం చేసుకోగా.. గ్రూప్ స్టేజీలో అజేయ జట్టుగా నిలిచిన పాక్ సెమీస్‌లో ఆసీస్ చేతిలో చతికిలబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: అతి త్వరలో అతన్ని టీమిండియా నుంచి సాగనంపడం ఖాయం..! -
3 ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్‌కోచ్
Justin Langer: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియాకు మరోసారి మహర్దశ నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2021 ట్రోఫీ గెలిచి కొత్త చాంపియన్‌గా అవతరించింది ఆసీస్. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై తొలి రెండు టెస్టులలో ఏకపక్ష విజయం సాధించి.. సిరీస్ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. వీటన్నింటిలో హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాల్ టాంపరింగ్(దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో) ఉదంతం తర్వాత ఆ అప్రదిష్టను చెరిపేసుకునేలా ఆట తీరుతో విమర్శకులకు సమాధానాలు ఇచ్చేలా జట్టును ప్రోత్సహించాడు. విజయాల బాట పట్టించి చాంపియన్‌గా నిలిపాడు. ఇక రానున్న రెండేళ్ల పాటు కంగారూలు బిజీబిజీగా గడుపనున్న సంగతి తెలిసిందే. అంతేగాక పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2022 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023 వరల్డ్‌కప్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన జస్టిన్ లాంగర్ మూడు ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘‘వేరే ఆలోచనకు తావే లేదు. అవును.. నేను మూడు ఫార్మాట్లలో కొనసాగుతాను. గత నాలుగేళ్లుగా మా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. హెడ్‌కోచ్‌గా నా పనిని నేను ప్రేమిస్తున్నాను. మావాళ్లు చాలా బాగా ఆడుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వారితో మమేకం కావడం నాకు ఎంతో సంతోషం. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నా’’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు. 2022, 2023 ప్రపంచకప్‌లతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నాడు. కాంట్రాక్ట్ పొడిగించాలనుకుంటున్నట్లు పరోక్షంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... IPL 2022- SRH: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ -
Ravichandran Ashwin: రిటైర్మెంట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన అశ్విన్
Ravichandran Ashwin Emotional Comments: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన విషయాలు వెల్లడించాడు. చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచన వచ్చిందని.. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారన్నాడు. 2018-2020 మధ్య కాలంలో అశూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. గాయాల బెడద.. వన్డేలు, టీ20లలో చోటు దక్కక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ విషయాల గురించి తాజాగా అశ్విన్ మాట్లాడాడు. ‘‘కారణాలెన్నో... రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాను. నా పట్ల.. నా గాయాల పట్ల చాలా మంది కఠినంగా వ్యవహరించినట్లు అనిపించేది. నన్ను సపోర్టు చేసేవాళ్లు ఎందుకు లేరు? జట్టుకు ఎన్నో విజయాలు అందించాను కదా! అయినా నాకే ఎందుకిలా? నిజానికి ఎదుటి వ్యక్తి సాయం ఆశించే వ్యక్తిని కాను నేను. కానీ... నా బాధను సహానుభూతి చెందేవాళ్లు ఉంటే ఎంతో బాగుంటుంది కదా! నా బాధను పంచుకునే క్రమంలో నేను తలవాల్చడానికి ఒక భుజం ఉంటే ఎంతో బాగుండు అనిపించేది. 2018 ఇంగ్లండ్ సిరీస్.. సౌతాంప్టన్ టెస్టు తర్వాత.. మళ్లీ ఆస్ట్రేలియాలో అడిలైడ్ టెస్టు... గడ్డు పరిస్థితులు. అలాంటి సమయంలో నా భార్య నాకు మద్దతుగా నిలబడింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో తప్పక పునరాగమనం చేస్తావంటూ మా నాన్న ప్రోత్సహించారు. తాను చనిపోయేలోపు ఈ ఒక్క కోరిక నెరవేరుతుందని చెప్పారు. అంత నమ్మకం ఆయనకు’’అని అశ్విన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీతో పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు అశూ. అదే విధంగా స్వదేశంలో ఇటీవల ముగిసన న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరుదైన రికార్డులు నమోదు చేశాడు. చదవండి: Ashes Series 3rd Test: ఆసీస్ యూటర్న్...15 కాదు.. 16.. స్కాట్ బోలాండ్ ఎంట్రీ! -
Babar Azam: టాస్కు ముందు కోహ్లితో ఏం మాట్లాడానో ఎన్నటికీ బయటపెట్టను!
T20 WC: Babar Azam Said He Will Not Reveal About Conversation With Kohli: టీ20 వరల్డ్‌కప్-2021 ఆసియా జట్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల పరిస్థితి ఎలా ఉన్నా... టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా... సెమీస్ వరకు చేరిన పాకిస్తాన్‌కు కూడా నిరాశ తప్పలేదు. అయితే, పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ కారణంగా క్రికెట్ ప్రేమికులకు రసవత్తర మ్యాచ్ చూసే అవకాశం మాత్రం దక్కింది. దాయాదులు భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య చాన్నాళ్ల తర్వాత జరిగిన పోరులో విజయం ఎవరిదైనా... ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరి పట్ల ఒకరు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి సహా మెంటార్ ధోని పాక్ ఆటగాళ్లతో ముచ్చటించిన తీరు క్రీడాస్ఫూర్తిని చాటింది. అయితే, యూఏఈలో విజయానికి కీలకంగా మారిన టాస్ వేయడానికి ముందు ఇరు జట్ల సారథులు కోహ్లి, బాబర్ ఆజం ఏం మాట్లాడుకున్నారా అన్న విషయం గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. PC: ICC చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్ ఇదే విషయం గురించి తాజాగా బాబర్‌ను ప్రశ్నించగా.. ‘‘మేమేం చర్చించుకున్నామో ఎప్పటికీ బయటపెట్టను.. బహిరంగంగా అందరి ముందు ఆ విషయం గురించి మాట్లాడను’’ అని సామా టీవీతో అతడు వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో.. ‘‘సరేలే చెప్పకపోతే చెప్పకపోయావ్.. ఏదైతేనేం... కప్ గెలవలేకపోయారు... ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా అక్టోబరు 24న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం బృందం.. కోహ్లి సేనను ఓడించిన సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుపై విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ మెగా టోర్నీలో బాబర్ ఆజమ్... ఆరు ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసి సత్తా చాటాడు. చదవండి: Max Verstappen: ఆఖరి బంతికి సిక్స్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం! View this post on Instagram A post shared by ICC (@icc) -
నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం.. ‘కోహ్లి సేన’పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు
Sourav Ganguly: India Poorest In Last 5 Years 15 Percent Ability T20 WC 2021: ‘‘నిజాయితీగా చెప్పాలంటే 2017, 2019లో టీమిండియా బాగానే ఆడింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా పాకిస్తాన్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది. అప్పుడు నేను కామెంటేటర్‌గా ఉన్నాను. ఇక 2019.. ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్... మా జట్టు చాలా బాగా ఆడింది. కానీ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడటంతో రెండు నెలల శ్రమ తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు కాస్త నిరాశకు లోనయ్యాను. అయితే, ఈసారి మాత్రం మరీ పేలవమైన ప్రదర్శన.. అన్ని ఓటముల్లోకెల్లా గత నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం’’ అని టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో కోహ్లి సేన ఆట తీరు పూర్తిగా నిరాశపరిచిందని పేర్కొన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఆరంభ మ్యాచ్‌లలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా సెమీస్ కూడా చేరలేక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ ఆడటంపై ఉన్న శ్రద్ధ దేశం కోసం ఆడటంలో లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లి సేన తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించలేదంటూ దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ... భారత జట్టు పేలవ ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏం జరిగిందో తెలియదు కానీ.. వరల్డ్‌కప్‌లో మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారని అనిపించలేదు. ఇలాంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఒకసారి గనుక నిరాశకు లోనై ఆగిపోతే ముందుకు సాగడం కష్టం. నాకు తెలిసి మా జట్టు కనీసం వాళ్లకున్న శక్తిసామర్థ్యాల్లో కనీసం 15 శాతం కూడా ఉపయోగించుకున్నట్లు అనిపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించనున్న నేపథ్యంలో.. గత అనుభవాల గురించి గుణపాఠం నేర్చుకుని మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ వరల్డ్‌కప్‌లో తమ జట్టు ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిందని పునరుద్ఘాటించాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ 2021 ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా... రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చేపట్టాడు. చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే Here’s @SGanguly99 on the T20 World Cup and India’s performance- what went wrong and the way ahead. @BCCI will be discussing it at the AGM today. @RevSportz more in the evening. Can we expect a WIPL announcement soon? Will it be a reality? Sourav on WIPL. pic.twitter.com/Hsubx3TymP — Boria Majumdar (@BoriaMajumdar) December 4, 2021 -
రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో బాబర్‌కి నేనే చెప్పా...
I told Babar Azam how to get Rohit Sharma out: టీ20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో సెమిస్కు దూసుకొచ్చిన పాకిస్తాన్.. సెమిఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి చెంది ఘోర పరభవాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది అద్బుతమైన స్పెల్‌తో భారత్‌ను దెబ్బతీశాడు. కాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను అద్భుతమైన డెలివరీతో ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. అయితే రోహిత్ శర్మ ఔట్ పై బీబీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా ప్రస్తుతం స్పందించాడు. రోహిత్ శర్మ వికెట్ పొందడానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కి విలువైన సూచనలు చేసినట్లు అతడు తెలిపాడు. “ప్రపంచ కప్ కోసం యూఏఈ బయలుదేరే ముందు బాబర్ ఆజం, చీఫ్ సెలెక్టర్‌తో వచ్చి నన్ను కలిశారు. టీమిండియాకు వ్యతిరేకంగా మీ ప్రణాళికలు ఏమిటి అని అడిగాను. దానికి బదులుగా మేము వాళ్ల ఆట తీరుపై విశ్లేషణ చేసుకున్నాము, పక్క ప్రణాళికలో మేము వెళ్లుతున్నాము అని బాబర్ సమాధానం చెప్పాడు. కానీ భారత్ కూడా మనల్ని ఓడించడానికి పక్క ప్రణాళికలు రచిస్తోందని నేను హెచ్చరించాను" అని రమీజ్ రాజా తెలిపాడు. “రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో అప్పుడే బాబర్‌కు నేను చెప్పాను. షాహీన్ అఫ్రిదిని షార్ట్ లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టి బౌలింగ్ చేయమని అని నేను చెప్పాను. కేవలం స్లో మీడియంలో ఇన్‌స్వింగింగ్ యార్కర్‌ని బౌల్ చేయమన్నాను. ఆ ఓవర్లో అతడికి ఒక్క సింగిల్ కూడా ఇవ్వవద్దు. అతడిని ఓవర్ మొత్తం స్ట్రైక్లోనే ఉంచితే, మీరు రోహిత్‌ను సులభంగా ఔట్ చేయవచ్చు" అని చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు. చదవండి: IND Vs NZ: ఔటైన కోపంలో కోహ్లి ఏం చేశాడంటే.. వీడియో వైరల్ -
T20 WC: పసికూన నమీబియా.. టీమిండియాతో సమానంగా...
T20 World Cup 2021: Do You Know India Get As Much Money As Namibia: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగిసి రెండు వారాలు కావొస్తున్నా మెగా ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు ఇప్పటికీ అభిమానుల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలంగా అందన్ని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా... ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలుత పాకిస్తాన్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లలో ఓడి కనీసం సెమీస్ చేరకుండానే కోహ్లి సేన వెనుదిరగడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అదే సమయంలో ఈ మెగా టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన నమీబియా... ఏకంగా రౌండ్ 12కు చేరడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు... పసికూన నమీబియా.. అత్యంత సంపన్న బోర్డుకు చెందిన టీమిండియాతో సమానంగా ప్రైజ్ మనీ గెలుచుకుంది తెలుసా! ప్రైజ్ మనీ 1.42 కోట్లు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా నిర్వహించిన సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించిన జట్లకు 52 లక్షల రూపాయాలతో పాటు టోర్నీలో విజయాల ఆధారంగా అదనంగా ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కింది. ఇక గ్రూపు-2లో ఉన్న భారత్.. పాకిస్తాన్, కివీస్ చేతిలో ఓడినా.. అఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ 12కు నేరుగా అర్హత సాధించిన కోహ్లి సేనకు 52 లక్షల రూపాయలు సహా... మూడు విజయాలకు గానూ 90 లక్షలు... అంటే మొత్తంగా 1.42 కోట్ల రూపాయలు ముట్టాయి. నమీబియా సైతం టీమిండియా మాదిరిగానే 1.42 కోట్లు దక్కించుకుంది. స్కాట్లాండ్కు కూడా కోటి నలభై రెండు లక్షలు గెలుచుకుంది. ఈ రెండు జట్లు సూపర్ 12లో భారీ స్థాయిలో రాణించకపోయినా... క్వాలిఫైయర్స్‌లో విజయాలు సాధించినందుకు ఈ మొత్తం అందుకున్నాయి. మరి.. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు అయిన టీమిండియా.. మెగా ఈవెంట్లో ఈ చిన్న జట్ల మాదిరిగానే అదే స్థాయి ప్రైజ్ మనీ గెలుచుకోవడం గమనార్హం. టీ20 వరల్డ్‌కప్-2022 ఎప్పుడంటే! ఈ ఏడాది చాంపియన్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్-2022 ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు 16 నుంచి పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. నవంబరు 13న ఫైనల్ నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2021 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ సహా ఇండియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సూపర్ 12 దశకు నేరుగా అర్హత సాధించాయి. నమీబియా, స్కాట్లాండ్, రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్, మాజీ చాంపియన్ శ్రీలంక క్వాలిఫయర్స్ ఆడనున్నాయి. ఇక ఈ ఏడాది టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా సారథి కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో రన్నరప్ న్యూజిలాండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి భారత్ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఇలాగే విజయపరంపర కొనసాగించడమే గాక.. 2022 వరల్డ్‌కప్ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: IPL 2022 Mega Auction: ఎటూ తేల్చుకోలేకపోతున్న సన్‌రైజర్స్.. రషీద్ ఖాన్‌కు గుడ్‌బై.. అదే జరిగితే! -
భారత్–పాక్ మ్యాచ్ బ్లాక్‌బస్టర్ వ్యూస్.. టీ20 హిస్టరీలోనే అత్యధికం..
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ టీవీ ప్రేక్షకుల వీక్షణపరంగా రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను టెలివిజన్ ద్వారా 16 కోట్ల 70 లక్షల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ప్రకటించింది. టి20 క్రికెట్ చరిత్రలో ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించిందని... 2016 టి20 ప్రపంచకప్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకుల సంఖ్యను ఇది దాటిందని ఐసీసీ పేర్కొంది. చదవండి: IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ -
Rohit Sharma: అశ్విన్‌పై రోహిత్ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్ ఆప్షన్..
Rohit Sharma Praise Ashwin Comeback in T20Is Always Attacking Option: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా పర్యటన, స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లలో అద్బుతంగా ఆకట్టుకున్నాడు అశ్. అయితే, ఇంగ్లండ్ టూర్లో మాత్రం అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా అశ్విన్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో సెలక్టర్లు స్థానం కల్పించారు. దీంతో.. దాదాపు నాలుగేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్... మెగా టోర్నీలో 5.25 ఎకానమీతో ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు ఈ తమిళనాడు స్పిన్నర్. వచ్చిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్న అశ్విన్ తొలి టీ20లో 2, రెండో టీ20లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి తన విలువేమిటో నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘అటాకింగ్ చేయాలనుకున్న సమయాల్లో కెప్టెన్‌కు అశూ బెస్ట్ ఆప్షన్. అశ్విన్ లాంటి బౌలర్ జట్టులో ఉన్నట్లయితే... మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లోనే ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడానికి, వికెట్లు పడగొట్టడానికి వీలు అవుతుంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అశ్విన్ పునరాగమనం ఎంతో సంతోషంగా ఉందన్న రోహిత్ శర్మ... తన అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మూడో టీ20లో భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఈ విజయం అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు రెస్ట్ ఇచ్చారు. చదవండి: Lendi Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..? -
భారత అభిమానుల కోరిక నెరవేరే ఛాన్స్! మరోసారి పాక్‌తో మ్యాచ్.. ఎప్పుడంటే?
India Clash With Pakistan In 2022, Check Complete Details: దాయాదుల పోరు అంటే క్రికెట్ ఆభిమానులకు పెద్ద పండగే. ఇరు జట్లు మధ్య పోరు కోసం భారత అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి టీమిండియా ఘోర పరాభవం పొందింది. దీంతో పాక్‌పైన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే భారత్-పాక్ దేశాల నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇప్పటిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో క్రికెట్ అభిమానులు ఐసీసీ ఈవెంట్లు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్‌లు మరో సారి తలపడనున్నాయి. దీనికి శ్రీలంక వేదిక కానుంది. 2020లో జరగాల్సిన ఆసియాకప్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో 2022లో ఆసియా కప్‌కు శ్రీలంక అతిథ్యం ఇవ్వబోతుంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్ ఈసారి టీ20 ఫార్మట్‌లో జరగనుంది. అదే విధంగా 2022లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్లోను ఇరు దేశాలు తలపడే అవకాశం ఉంది. మొత్తంమీద వచ్చే ఏడాది భారత ఆభిమానులకు పండగే అనే చెప్పాలి. చదవండి: T20 WC 2021: ఫైనల్‌కు ముందు రాత్రంతా.. గాయంతో బాధపడినా గానీ.. -
ఫైనల్‌కు ముందు రాత్రంతా.. గాయంతో బాధపడినా గానీ..
Matthew Wade Spoke About Situation 24 Hours Before Played T20 World Cup 2021 Final With an Injury: టీ20 ప్రపంచకప్-2021ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టు ఫైనల్ చేరడంలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కీలక పాత్ర పోషించాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో మాథ్యూ వేడ్ గాయంతో బరిలోకి దిగినట్లు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని వేడ్ స్వయంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. "ఫైనల్‌కు ముందు రోజు రాత్రి నేను కొంచెం ఆందోళన చెందాను. ఎందకంటే ఆరోజు నేను ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆ రాత్రంతా మేల్కొని ఉన్నాను. మ్యాచ్ రోజు నాకు కొంత ఊపశమనం లభించడంతో నేను ఆడగలిగాను. ఒక వేళ మ్యాచ్ రోజు నా నొప్పి తగ్గకపోయింటే జట్టుకు దూరంగా ఉండేవాడిని, ఎందుకంటే నా వల్ల జట్టకు ఎటువంటి నష్టం జరగకూడదు" అని వేడ్ పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు మాథ్యూ వేడ్ ఫిట్నెస్ గురించి ఆందోళన చెందినట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా తెలిపాడు. స్కానింగ్ లకు కూడా తీసుకెళ్లినట్లు అతడు చెప్పాడు. కానీ స్కానింగ్ రిపోర్ట్‌లను కూడా వేడ్ చూడలేదు అని ఫించ్ పేర్కొన్నాడు. గాయంతో బాధపడతున్నప్పటకీ టోర్నమెంట్‌లోని అత్యంత కీలకమైన మ్యాచ్‌లో వేడ్ ఆడినందుకు గర్విస్తున్నానని ఫించ్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో వేడ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. వికెట్ కీపర్‌గా ఆ జట్టుకు సేవలు అందించాడు. చదవండి: వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్.. కారణం ఏంటంటే! -
Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా!
Virat Kohli in latest Social Media post Goes Viral: కరోనా నేపథ్యంలో ఐపీఎల్ మొదలు టీ20 ప్రపంచకప్ వరకు సుదీర్ఘ కాలంపాటు బయో బబుల్‌లో గడిపారు చాలా మంది క్రికెటర్లు. ఇక టీమిండియా ఆటగాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సిరీస్‌లు, ఐపీఎల్ రెండు అంచెలు, పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీ.. ఇలా బిజీబిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో బయో బబుల్‌లో జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే పలుమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత వెంటనే న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ ఉన్నప్పటికీ కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని భావించింది బీసీసీఐ. కోహ్లితో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు కూడా ఇప్పుడు రెస్ట్ మూడ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోకు యాడ్ చేసిన ఎమోజీ చర్చనీయాంశమైంది. విమానంలో కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్న ఫొటోలు పంచుకున్న కోహ్లి.. కనుగుడ్డును పోలిన ఎమోజీ జత చేయడం విశేషం. దీంతో.. కోహ్లి పోస్టు వెనుక అర్థం ఏమిటా అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెదికేస్తున్నారు. దిష్టి తగిలింది..! టర్కీ సంప్రదాయంలో.. దిష్టి తగలకుండా.. చెడు దృష్టి, దుష్టశక్తి నీడ మన మీద పడకుండా ఉండేందుకు కనుగుడ్డు ఆకారంలో ఉండే ఆభరణాన్ని ధరిస్తారట. మెడలో వేసుకునే గొలుసుకు లాకెట్‌గా లేదంటే బ్రాస్‌లెట్‌కు దీన్ని జతచేసి వేసుకుంటారట. అయితే ప్రాక్టికల్‌గా కనిపించే కోహ్లి... ఇలా ఈ ఆభరణాన్ని ప్రతిబింబించే ఎమోజీ జతచేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోహ్లి ఇలాంటివి నమ్ముతాడా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న కోహ్లి ఆశ నెరవేరలేదన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాల నేపథ్యంలో టీమిండియా కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. దీంతో కోహ్లి కెప్టెన్సీపై పలువురు విశ్లేషకులు పెదవి విరిచారు కూడా. ఈ నేపథ్యంలోనే తనకు దిష్టి తగిలిందన్ననందు వల్లే ఇలా జరిగిందని.. అందుకే దాని నుంచి తనను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కోహ్లి ఈ ఎమోజీని షేర్ చేశాడని తమకు తోచినట్లుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న సిరీస్ బుధవారం(నవంబరు 17) నుంచి ఆరంభం కానుంది. చదవండి: Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్ కావడమే ఎంతో సంతోషం! Ind Vs Nz 2021: ‘బ్యాటర్’గా విరాట్ కోహ్లి... టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే! 🧿 pic.twitter.com/ycfRJF8KbE — Virat Kohli (@imVkohli) November 17, 2021 -
బాబర్ అజమ్ నెంబర్‌వన్.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు
No Indian Batter Ranks In Top Five ICC Batting Rankings.. టి20 ప్రపంచకప్ 2021 ముగిసిన అనంతరం ఐసీసీ బుధవారం టి20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో ఒక్క టీమిండియా బ్యాటర్ కూడా లేడు. ఇక బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ విభాగంలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. చదవండి: Ind Vs Nz 2021: ‘బ్యాటర్’గా విరాట్ కోహ్లి... టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే! బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 839 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలాన్ 805 పాయింట్లతో రెండో స్థానంలో.. ఎయిడెన్ మార్క్రమ్ 796 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 747 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 742 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ ఒకస్థానం దిగజారి ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన వనిందు హసరంగ 797 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంసీ 784 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ 265 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. షకీబ్ అల్ హసన్ (260 పాయింట్లు), లియామ్ లివింగ్‌స్టోన్(179 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Massive gains for star performers of the #T20WorldCup 📈 More on all the changes in the @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is 👉 https://t.co/DFstAKi06Y pic.twitter.com/QOsGIMYNUw — ICC (@ICC) November 17, 2021 -
బస్ డ్రైవర్‌ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్.. వీడియో వైరల్
Trent Boult Hugs Bus Driver.. టి20 ప్రపంచకప్‌ను అందుకోవడంలో విఫలమైన న్యూజిలాండ్ చివరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైన కివీస్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. తాజాగా ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్ ముగించుకొని టీమిండియా పర్యటనకు దుబాయ్ నుంచి భారత్‌కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు ఎయిర్పోర్ట్ వరకు బస్‌లో వచ్చింది. న్యూజిలాండ్ జట్టును తీసుకొచ్చిన బస్ డ్రైవర్ సంతోష్ బౌల్ట్‌ను కలవాలని భావించాడు. అడిగిందే తడవుగా బౌల్ట్ ఆ బస్ డ్రైవర్‌తో సెల్ఫీ దిగి ఆ తర్వాత అతన్ని హగ్ చేసుకొని సంతోషపరిచాడు. చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టి20.. వెంకటేశ్ అయ్యర్‌పై ద్రవిడ్ దృష్టి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియాతో మూడు టి20లు.. రెండు టెస్టులు ఆడనుంది. కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి రానున్నాడు. నవంబర్ 17న ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. Finishing up at the @T20WorldCup with a hug from our bus driver Santhosh. Next stop Jaipur! #T20WorldCup #INDvNZ pic.twitter.com/BdHPCHyzrX — BLACKCAPS (@BLACKCAPS) November 15, 2021 -
న్యూజిలాండ్‌తో టీ-20 సిరీస్‌కు సిద్ధమైన భారత్
-
T20 WC: నా కెప్టెన్ బాబర్ ఆజమ్.. బెస్ట్ ప్లేయింగ్ జట్టు ఇదే: ఆకాశ్ చోప్రా
T20 World Cup 2021 Aakash Chopra Picks His Best Playing Xi of the Tournament, No Chance Indian Players: టీ20 ప్రపంచకప్-2021లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓటమితో ప్రయాణాన్ని ప్రారంభించిన టీమిండియా కనీసం సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కీలక పోరులో కోహ్లి సేనను ఓడించి... న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరగా.. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా మాత్రం.. అఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా వంటి జట్లపై విజయాలతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత బ్యాటర్లు, బౌలర్లు ఈ మెగా టోర్నీలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించిన ఐసీసీ.. వీరిలో ఒక్క టీమిండియా ప్లేయర్‌కు కూడా అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. ఇక భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం తన జట్టులో ఒక్కరంటే ఒక్క టీమిండియా ఆటగాడికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సూపర్ 12 రౌండ్లో ఐదింటికి ఐదు గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న ఆకాశ్ చోప్రా.. అతడు మూడోస్థానంలో మెరుగ్గా ఆడగలడని పేర్కొన్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్, ఓపెనర్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్, మరో ఓపెనర్‌గా చాంపియన్ ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ పేరును ప్రకటించాడు. అదే విధంగా శ్రీలంక సంచలనం చరిత్ అసలంకకు నాలుగో స్థానంలో చోటిచ్చాడు. మొయిన్ అలీ, డేవిడ్ వీజ్ను ఆల్రౌండర్లుగా ఎంచుకున్నాడు. ఇక తన జట్టులో నలుగురు బౌలర్లకు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. ఆడం జంపాను ఈ టోర్నీలో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్‌గా అభివర్ణించాడు. ఆకాశ్ చోప్రా బెస్ట్ టీ20 వరల్డ్‌కప్ ప్లేయింగ్ జట్టు ఇదే జోస్ బట్లర్(వికెట్ కీపర్- ఇంగ్లండ్), డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్(కెప్టెన్- పాకిస్తాన్), చరిత్ అసలంక(శ్రీలంక), ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా), మొయిన్ అలీ(ఇంగ్లండ్), డేవిడ్ వీజ్(నమీబియా), ఆడం జంపా(ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్), జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), అన్రిచ్ నోర్ట్జే(దక్షిణాఫ్రికా). చదవండి: IND vs NZ T20I Series 2021: భారత్‌తో టీ20 సిరీస్ ముందు కివీస్‌కు షాక్.. తప్పుకొన్న విలియమ్సన్.. ఎందుకంటే.. Tournament done and dusted. Time to quickly pick the best team of this T20 World Cup. Who all make the cut? Who miss out narrowly? Let's find out on this episode of Betway Cricket Chaupaal:https://t.co/hXgQweNANY pic.twitter.com/bVCnxgSCnV — Aakash Chopra (@cricketaakash) November 16, 2021 -
Shoaib Akhtar: ఏంటది అసహ్యంగా.. అబ్బో సెమీస్‌లో పాక్‌ను ఓడించినందుకేనా అక్కసు!
Shoaib Akhtar On Australia Way of Celebration Little Disgusting Netizens Troll Him: టి20 ప్రపంచకప్-2021 విజేతగా నిలిచిన ఆరోన్ ఫించ్ బృందం సంబరాలు చేసుకున్న తీరుపై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసహ్యకరంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం అవసరమా అంటూ సెటైర్లు వేశాడు. కాగా పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆరుసార్లు నిరాశకు గురైన ఆస్ట్రేలియా ఎట్టకేలకు ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచి తమ కలను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంగారూ జట్టు పట్టపగ్గాల్లేని ఆనందడోలికల్లో మునిగితేలింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న పొట్టి కప్ చేతులకందడంతో ఆటగాళ్లు తెగ సంబరాలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్‌కు చేరగానే క్రికెటర్లు టిన్‌లలోని బీరును కాలి బూట్లలో పోసుకొని గుటకేశారు. ఆల్‌రౌండర్ స్టొయినిస్ కాలికి ఉన్న బూట్ విడిచి దాన్ని కడిగాకా బీరు పోసుకొని తాగాడు. కెప్టెన్ ఫించ్ అదేపని చేశాడు. తర్వాత వేడ్ సహా కొందరు సహచరులు ఇలా బూట్లలో బీరు తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసిన షోయబ్ అక్తర్.. ‘‘అసలు మీరేం చేశారు? వీళ్లు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు కాస్త అసహ్యంగా ఉంది కదా’’ అని కామెంట్ చేశాడు. ఈ క్రమంలో పాక్ ఫ్యాన్స్.. ‘‘కొంచెం కాదు.. చాలా జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ అక్తర్‌కు మద్దతు పలుకుతున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘ఇది వారి సంప్రదాయంలో భాగం. ముందు ఆ విషయం తెలుసుకోండి. తెలియకపోతే ఊరుకోండి. అయినా, సెమీస్‌లో మిమ్మల్ని ఓడించినందుకేనా ఈ అక్కసు’’ అని అక్తర్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సూపర్ 12 రౌండ్లో ఐదింటికి ఐదు గెలిచి కప్ కొట్టాలన్న ఆశతో ఉన్న బాబర్ ఆజమ్ బృందానికి షాక్ తగిలింది. తుది పోరుకు అర్హత సాధించిన ఆసీస్.. న్యూజిలాండ్‌ను ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. షూయీ సంప్రదాయం ఇలా బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగటం మనకు జుగుప్సాకరంగా ఉన్నా ఆస్ట్రేలియాలో ఇలాంటి సంబరాలు సాధారణమే! అన్నట్లు దీనికో పేరు కూడా ఉంది. షూలో పోసుకు తాగడాన్ని ‘షూయి’ అంటారు. విశ్వవిజేతగా నిలవడంతో కంగారూ క్రికెటర్లు అలా షూయి వేడుక చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫార్ములావన్ డ్రైవర్ రికియార్డో 2016లో జర్మన్ గ్రాండ్‌ప్రిలో పోడియం ఫినిష్ చేయగానే తొలిసారి షాంపేన్ బూట్లో పోసుకొని తాగాడు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! A little disgusting way of celebrating no?? pic.twitter.com/H96vMlabC8 — Shoaib Akhtar (@shoaib100mph) November 15, 2021 -
Ind Vs Nz: కెప్టెన్‌గా హిట్‌మ్యాన్.. టీ20 వరల్డ్‌కప్ రన్నరప్‌తో సిరీస్.. నెట్స్‌లో..
Ind Vs Nz T20 Series: Team India Players Practice Session Jaipur: ఆదివారం టి20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు రెండు రోజుల వ్యవధిలో మళ్లీ మైదానంలోకి దిగనుంది. భారత్‌తో జరిగే మూడు టి20 మ్యాచ్‌లు, రెండు టెస్టుల కోసం న్యూజిలాండ్ జట్టు సోమవారం సాయంత్రం దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో జైపూర్‌కు చేరుకుంది. దుబాయ్‌లో ‘బయో బబుల్’ నుంచి నేరుగా ఇక్కడకు చేరుకోవడంతో న్యూజిలాండ్ క్రికెటర్లకు క్వారంటైన్ విధించడంలేదు. ప్రొటోకాల్ ప్రకారం కివీస్ ఆటగాళ్లందరికీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు... కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సిద్ధమవుతోంది. భారత టి20 జట్టు సభ్యులు సోమవారం రాత్రి జైపూర్‌లో ముమ్మరంగా సాధన చేశారు. కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించారు. మరోవైపు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు అజింక్య రహానే, పుజారా ముంబైలో ఏర్పాటు చేసిన నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. శుబ్‌మన్ గిల్, మయాంక్ కూడా నెట్స్‌లో శ్రమించారు. తొలి టెస్టు ఈ నెల 25 నుంచి కాన్పూర్‌లో, రెండో టెస్టు డిసెంబర్ 3 నుంచి ముంబైలో జరుగుతుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్: ►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్. ►రెండో టీ20- నవంబరు 19, రాంచి. ►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా. ►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్. ►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! Warming up. #Jaipur #SMSstadium @BCCI pic.twitter.com/QnBYcvOWau — Mandakini (@mandakini_) November 15, 2021 New roles 👌 New challenges 👊 New beginnings 👍 Energies were high yesterday on Day 1 at the office for #TeamIndia T20I captain @ImRo45 & Head Coach Rahul Dravid. 👏 👏#INDvNZ pic.twitter.com/a8zlwCREhl — BCCI (@BCCI) November 16, 2021 -
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్!
Hardik Pandya’s watches worth Rs 5 crore seized at airport: టీ20 ప్రపంచకప్-2021లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. పాండ్యా వద్ద గల అత్యంత ఖరీదైన వాచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వాచ్‌ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు. ఏబీపీ లైవ్ కథనం ప్రకారం... నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. సదరు వాచీలకు సంబంధించిన ఇన్వాయిస్లు పాండ్యా చూపకపోవడంతో ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడిని ఆపిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన బ్రాండ్లు.. హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం... ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్‌తో రూపొందించబడింది. 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్లెట్ కూడా ఉంటుంది. అంతేకాదు కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్‌ను తయారు చేసి ఇస్తారు. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచె ప్రారంభానికి ముందుకు హార్దిక్ పాండ్యా ఈ వాచీని ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Venkatesh Iyer: ఆ ఇంగ్లండ్ ఆల్రౌండర్లా.. టీమిండియాకు నేను ఆడాలి అనుకుంటున్నా.. -
ఆ అవార్డు వార్నర్‌కు ఎలా ఇస్తారు..? మా వాడు ఉన్నాడుగా: షోయబ్ అక్తర్
Shoaib Akhtar Comments On Man Of The tournament Award T20 World Cup 2021: అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎట్టకేలకు కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్-2021లో (నవంబర్ 14)న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో చారిత్రాత్మక విజయం సాధించిన.. ఆస్ట్రేలియా తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఈ విజయంలో ఆజట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఒక్క ఫైనల్లోనే కాకుండా.. వార్నర్ టోర్నీ అంతటా అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా డేవిడ్ వార్నర్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. అయితే డేవిడ్ వార్నర్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక చేయడంపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అక్తర్.. "ఇది అసలు సరైన నిర్ణయం కాదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ బాబర్ ఆజమ్ కు ఇస్తారాని ఎదురు చూశాను. ఇదైతే కచ్చితంగా అన్యాయమే "అంటూ ట్వీట్ చేశాడు. ఎందుకంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం కూడా అద్బుతంగా రాణించాడు. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లలో 303 పరుగులు చేసిన బాబర్ ఆజాం.. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. మరోవైపు వార్నర్.. ఏడు ఇన్నింగ్స్‌లలో 289 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బాబర్‌కు అవార్డు ఇవ్వకుండా వార్నర్‌కు ఎలా ఇచ్చారాని ఐసీసీపై అక్తర్ మండి పడ్డాడు. చదవండి: T20 World Cup 2021: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్! ఒక్కరంటే ఒక్కరికీ కూడా నో ఛాన్స్ Was really looking forward to see @babarazam258 becoming Man of the Tournament. Unfair decision for sure. — Shoaib Akhtar (@shoaib100mph) November 14, 2021 -
టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్! కెప్టెన్‌గా బాబర్‌కు అవకాశం
ICC announces best XI of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021లో ఆదివారం(నవంబర్ 14)న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐసీసీ 11 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జట్టులో ఆరు దేశాల జట్లకు చెందిన ఆటగాళ్లకు స్ధానం దక్కింది. అదే విధంగా టీమిండియాలో ఒక్క ఆటగాడికి కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్, సెమీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, పాకిస్తాన్, అధేవిదంగా శ్రీలంక,దక్షిణాఫ్రికా చెందిన ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ జట్టుకు బాబర్ అజాంను కెప్టెన్‌గా సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది . ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ విద్వంసకర ఆటగాడు జోస్ బట్లర్‌కు ఓపెనర్లుగా చోటు దక్కింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంకు మూడో స్ధానంలో, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంకకు నాలుగో స్ధానంలో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్.. ఐదో స్ధానంలో చోటు దక్కించకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో ఇంగ్లండ్ ఆటగాడు మోయిన్ ఆలీ, శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగాకు స్ధానం దక్కింది. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపాను ఎంపిక చేశారు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్,అన్రిచ్ నోర్ట్జే చోటు దక్కింది. ఇక 12వ ప్లేయర్‌గా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని తీసుకుంది. కాగా ఈ జట్టును బిషప్ (కన్వీనర్), నటాలీ జర్మనోస్, షేన్ వాట్సన్, లారెన్స్ లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా), జోస్ బట్లర్(ఇంగ్లండ్, వికెట్ కీపర్), బాబర్ అజాం(పాకిస్తాన్, కెప్టెన్), చరిత అసలంక(శ్రీలంక),మారక్రమ్(దక్షిణాఫ్రికా),మోయిన్ అలీ(ఇంగ్లండ్), హసరంగా(శ్రీలంక),ఆడం జంపా,(ఆస్ట్రేలియా),జోష్ హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా),ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్) అన్రిచ్ నోర్ట్జే( దక్షిణాఫ్రికా) చదవండి: David Warner: ఫామ్‌లో లేడు.. ముసలోడు.. నెమ్మదిగా ఆడతాడు.. కంగ్రాట్స్.. -
వార్నరా! ఫామ్‌లో లేడు.. ముసలోడు.. కంగ్రాట్స్..
T20 WC David Warner: Candice Warner Dig At Critics Out of Form Old Slow Congrats: యూఏఈలో మ్యాచ్‌ల నుంచి తప్పించడమే కాదు, మైదానానికి కూడా రాకుండా ఆ ఆటగాడిని హోటల్ గదికే పరిమితం చేసింది ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. ఎస్ఆర్హెచ్కు తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌గా.. స్టార్ బ్యాటర్‌గా.. పిచ్‌పై ఆడాల్సిన వాడు ‘ఎక్స్ట్రా’ తరహాలో చప్పట్లు కొడుతూ డ్రింక్స్ అందించడం సగటు క్రికెట్ అభిమానిని ఆవేదనకు గురి చేసింది. ఆ కసిలోంచి పుట్టిన ఆటనే కావచ్చు, తానేంటో చూపించాలనే పట్టుదల కావచ్చు... నెల రోజులు తిరిగేసరికి టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తానేంటో నిరూపించుకున్నాడు. కీలకమైన సమయంలో జాతీయ జట్టు చిరస్మరణీయ విజయంలో తన వంతు పాత్ర పోషించి... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించే ఈ ప్రస్తావన. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన ఆసీస్ ఈసారి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంలో వార్నర్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 289 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 89 నాటౌట్. ఇది వర్తమానం. కానీ.. ఐపీఎల్లో వార్నర్ ప్రదర్శన, ఫ్రాంఛైజీ అతడిని పక్కన పెట్టిన విధానం చూసి అనేక మంది అతడిని విమర్శించారు. అసలు అతడికి ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కుతుందా లేదోనంటూ కామెంట్లు చేశారు. కానీ... టోర్నీ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. కచ్చితంగా వార్నర్ ఓపెనర్‌గా మైదానంలోకి వస్తాడని చెప్పాడు. సారథి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు వార్నర్. ఈ నేపథ్యంలో వార్నర్ సతీమణి కాండిస్ వార్నర్ తన భర్తను విమర్శించిన వారికి అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘ఫామ్‌లో లేడు... ముసలివాడు... నెమ్మదిగా ఆడతాడు! కంగ్రాట్స్ డేవిడ్ వార్నర్’’ అంటూ విమర్శకులకు తన భర్త సాధించిన విజయంతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ ఫొటోను షేర్ చేశారు. చదవండి: T20 WC 2021- Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. కానీ వార్నర్ మాత్రం.. చాలా గర్వంగా ఉంది.. Out of form, too old and slow! 😳🤣 congratulations @davidwarner31 pic.twitter.com/Ljf25miQiM — Candice Warner (@CandiceWarner31) November 14, 2021 -
T20 WC 2021 Winner: ఆసీస్ ఆటగాళ్ల సంబరం.. ఫొటోలు వైరల్
T20 WC 2021 Winner Australia Celebrate Maiden T20 WC Triumph Photo Highlights: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. నవంబరు 14 నాటి ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి మొట్టమొదటి సారి టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి ఫైనల్‌కు చేరిన కివీస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో మాక్స్వెల్ ఫోర్ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది. ఇక ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా జట్టుగా ఆరోన్ ఫించ్ బృందం నిలిచింది. దీంతో ఆసీస్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ట్రోఫీని ముద్దాడుతూ.. షూలో డ్రింక్స్ తాగుతూ కంగారూలు తమ చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదించారు. ఫైనల్ హీరోలు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ను అభినందిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC 2021 Winner: మ్యాచ్ చూడలేదా అమిత్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
T20 WC 2021 Winner Australia: Amit Mishra Getting Trolled Why Deletes Tweet: టీమిండియా వెటరన్ ప్లేయర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘‘అయ్యో.. ఇదేంటి అమిత్ మ్యాచ్ చూడలేదా ఏంటి?’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నవంబరు 14న దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇన్నాళ్లు ఊరిస్తున్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సైతం... విజేతను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే, అక్కడే అమిత్ పప్పులో కాలేశాడు. ‘‘వరల్డ్‌కప్ గెలిచిన బ్లాక్‌కాప్స్‌కు శుభాకాంక్షలు. సమష్టి విజయం. చాలా బాగా ఆడారు’’ అని ట్వీటాడు. విన్నర్ ఆసీస్‌కు బదులు న్యూజిలాండ్‌కు విషెస్ చెప్పాడు. ఇంకేం ఉంది.. అమిత్ మిశ్రా ‘తప్పిదాన్ని’ గుర్తించిన నెటిజన్లు ఫన్నీగా అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో.. అమిత్ మిశ్రా తన ట్వీట్‌ను డెలిట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ హాండిల్ స్థానంలో ఆసీస్‌ను రీప్లేస్ చేసి అభినందనలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. స్కోర్లు: న్యూజిలాండ్- 172/4 (20) ఆస్ట్రేలియా- 173/2 (18.5) చదవండి: Kane Williamson: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్.. మనసులు గెలిచారు! -
T20 World Cup: మార్టిన్ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు?
Martin Crowe Dream Of ICC Trophy: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో.. 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా అందరీ చేత కన్నీళ్లు పెట్టించాడు. ‘మరో మ్యాచ్ చూసేందుకు నా జీవితం ఇక అనుమతించకపోవచ్చు. కానీ బతికేందుకు ఈ జ్ఞాపకాలు చాలు. రోజంతా కన్నీళ్లను మాత్రం బయటకు కనిపించనీయను’ అని అన్న మాటలు క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. ఆ ఏడాది జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు మార్టిన్ క్రో. తన సారథ్యంలో తమ జట్టు సాధించలేని వరల్డ్‌కప్‌ను కివీస్ కైవసం చేసుకుంటుందని మార్టిన్ ఎంతగానో ఆశించాడు. కానీ మార్టిన్ క్రోకు నిరాశే ఎదురైంది. ఆ పోరులో న్యూజిలాండ్ ఘోర వైఫల్యంతో తొలిసారి వరల్డ్‌కప్ సాధించాలన్న కల తీరలేదు. ఆ తర్వాత ఏడాదికి మార్టిన్ క్రో కన్నుమూయగా, ఆపై న్యూజిలాండ్ రెండుసార్లు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. ఒకటి వన్డే వరల్డ్‌కప్‌లో(2019) అయితే, మరొకటి టీ20 వరల్డ్‌కప్(2021)లో కివీస్ తుదిపోరుకు అర్హత సాధించింది. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ రూపంలో కివీస్‌ను దురదృష్టం వెంటాడంతో రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసిన పరిస్థితులు అప్పట్లో వివాదంగా మారాయి. కానీ ఐసీసీ నిబంధనలు అప్పటికి అలానే ఉండటంతో కివీస్ చేసేది ఏమీ లేకపోయింది. క్రికెట్ ప్రేమికులు మాత్రం పాపం.. న్యూజిలాండ్ అనుకోవాల్సి వచ్చింది. మరి ఆ దేశం క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఎంతో ఎదురుచూసిన మార్టిన్ క్రో..అప్పటికి కన్నుమూసి నాలుగేళ్ల అయ్యింది. ఒకవేళ కివీస్ వరల్డ్‌కప్ గెలిస్తే ‘మనం వరల్డ్‌కప్ గెలిచాం.. ఒకసారి మేల్కొని మా చేతిలో ఉన్న ట్రోఫీని చూడు మార్టిన్ బ్రో’ అని కివీస్ ప్లేయర్లు గట్టిగా అరిచే చెప్పేవాళ్లు. చదవండి: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్.. మనసులు గెలిచారు! ఎందుకంటే ఏదొక రోజు తాము వరల్డ్‌కప్ గెలిచి మార్టిన్‌ను మేల్కొపు తామని మార్టిన్ మరణానంతరం ఒక కివీస్ క్రికెటర్ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ప్రస్తుతం స్వర్గంలో చిన్న నిద్ర తీసుకుంటున్న మార్టిన్.. తాము వరల్డ్‌కప్ గెలిస్తే కచ్చితంగా మేల్కొంటాడని చెప్పుకొచ్చాడు. తను జీవించినంత కాలం క్రికెటే శ్వాసగా బ్రతికిన మార్టిన్.. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీకు చేరిన న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో అంచనాలు లేకుండా దిగిన కివీస్.. లీగ్ దశలో అజేయంగా నిలిచి సెమీస్‌కు చేరింది. కానీ సెమీస్‌లో పాక్ రూపంలో కివీస్‌ను దురదృష్టం వెంటాడింది. కానీ మార్టిన్ మాత్రం 456 పరుగులతో ఆ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ద వరల్డ్‌కప్ గెలిచాడు. ఆ వరల్డ్‌కప్‌ను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కివీస్‌కు కొత్త కళ తెచ్చిన క్రికెటర్ సుమారు పదుమూడేళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు(17) కూడా సుదీర్ఘ కాలం అతని పేరిటే కొనసాగింది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు. (చదవండి :ఆసీస్‌కు అందిన ద్రాక్ష) కివీస్‌ను ఎంతో ఉన్నత శిఖరాల్లో నిలబెట్టిన మార్టిన్ క్రో కల ఇంకా అలానే ఉండిపోయింది. ఆ దేశం వరల్డ్‌కప్ సాధించాలనే ఆయన కలకు ఇప్పటికీ ముగింపు లభించలేదు. ఆసీస్ చేతిలో ఓటమి పాలు కావడంతో అయ్యో కివీస్ ఇంకెప్పుడు వరల్డ్‌కప్ సాధిస్తారని అనుకోవడం అభిమానుల వంతైంది. అటు వన్డే వరల్డ్‌కప్, ఇటు టీ20 వరల్డ్‌కప్‌ను ఇప్పటికీ సాధించకపోవడమే సగటు క్రికెట్ అభిమానికి ఇంకా నిరాశగానే ఉంది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్(2సార్లు), శ్రీలంక, ఆస్ట్రేలియాలు టీ20 వరల్డ్‌కప్‌లు సాధించినా ఈ బ్లాక్ క్యాప్స్ మాత్రం.. ఇంకా బ్లాక్ హార్స్‌గా ఉండటం క్రికెట్ అభిమానులకు మింగుడు పడని అంశం. -
Kane Williamson: పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. పర్లేదు.. నువ్వు హీరోవే!
Kane Williamson Interrupts Reporter During Press Conference Video Goes Viral: మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచి చరిత్ర లిఖించిన న్యూజిలాండ్‌కు టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో మాత్రం నిరాశే మిగిలింది. ఆఖరి మెట్టు చేరే వరకు అద్భుత పోరాటపటిమ ప్రదర్శన కనబరిచిన కివీస్‌కు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు. ముఖ్యంగా మంచు ప్రభావం చూపే దుబాయ్ పిచ్‌పై మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలవగానే న్యూజిలాండ్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. అయితే, ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు మార్టిన్ గఫ్టిల్(28), డారిల్ మిచెల్(11) త్వరగానే పెవిలియన్ చేరినా.. కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి అద్బుత ప్రదర్శన కనబరిచాడు. కివీస్ మెరుగైన స్కోరు (172) నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ... ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్(53), మిచెల్ మార్ష్(77) తమ సూపర్ ఇన్నింగ్స్‌తో కివీస్ ఆశలను అడియాసలు చేశారు. దీంతో మొదటిసారి పొట్టి ఫార్మాట్ విజేతగా నిలవాలన్న కేన్ విలియమ్సన్ బృందానికి భంగపాటు తప్పలేదు. కాగా ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం కివీస్ జట్టుకిది మూడోసారి. 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ... 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది న్యూజిలాండ్. ఈ నేపథ్యంలో.. ఆసీస్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ముద్దాడటం.. అందుకు సంబంధించిన సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన తరుణంలో విలియమ్సన్ మీడియాతో మాట్లాడటం చూసిన అభిమానుల గుండెలు తరుక్కుపోయాయి. మరోవైపు.. ‘‘చిరకాల కోరిక నెరవేరింది.. విముక్తి లభించింది’’ అంటూ ఆసీస్ ఆటగాళ్లు పాటలు పాడుతున్న వేళ.. కివీస్ దురదృష్టాన్ని వెక్కిరించేలా ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘మూడు వరల్డ్‌కప్ టోర్నీల్లో ఫైనల్లో ఓడిపోవడం ఎలా అనిపిస్తోంది’’ అని రిపోర్టర్ అడుగగా.. విలియమ్సన్ ఏమాత్రం తడబడకుండా.. ‘మరి చాంపియన్‌షిప్ ఫైనల్ సంగతేమిటి’’ అని కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. గెలుపు- ఓటములు సహజం. ఈ టోర్నీ ఆసాంతం మా ప్రదర్శన పట్ల నేనెంతో గర్వపడుతున్నా. విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా ఎంతో బాగా ఆడింది. వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో! వాళ్ల ఆట అత్యద్భుతం. అద్భుతమైన ఆటగాళ్లు జట్టును చాంపియన్‌గా నిలిపారు’’ అంటూ హుందాగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో... ‘‘మరేం పర్లేదు విలియమ్సన్. మీరు మీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇప్పుడు కాకుంటే.. ఇంకోసారి.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్నావు. హుందాగా వ్యవహరించావు. దురదృష్టం గురించి మాట్లాడేవాళ్లకు చాలా బాగా బదులిచ్చావు. ఓడినా మనసులు గెలిచారు మీరు. నువ్వు హీరోవే’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: T20 WC 2021 Winner Australia: డ్రెస్సింగ్ రూంలో సెలబ్రేషన్స్.. షూలో డ్రింక్స్ తాగుతూ సంబరాలు.. అరె ఏంట్రా ఇది! -
ఆస్ట్రేలియా అసలైన ఛాంపియన్
-
T20 WC Winner Australia: షూలో డ్రింక్స్ తాగుతూ సంబరాలు.. అరె ఏంట్రా ఇది!
T20 WC 2021 Winner Australia: Players Drink From Shoes Celebrations Video Viral: ఆస్ట్రేలియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ అందించిన ఆరోన్ ఫించ్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. నవంబరు 14న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న ఆసీస్ జట్టు చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగారూలు.. కివీస్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపుబాట పట్టించారు. ఇక చారిత్రాత్మక, చిరస్మరణీయ విజయం సాధించిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూంలో వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది ఫించ్ టీమ్. బూట్ల(షూ)లో డ్రింక్స్ నింపుకుని వాటిని తాగుతూ ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. సెమీస్ హీరోలు మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్ షూ విప్పేసి అందులో డ్రింక్స్ నింపుకుని తాగుతూ ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అరె ఏంట్రా ఇది.. షూతో డ్రింక్స్ తాగటం... మీరు సూపర్.. వరల్డ్‌కప్ గెలిచారు కదా... మీ ఇష్టం కానీయండి.. కానీయండి’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా షూలో డ్రింక్స్ తాగటం ఆస్ట్రేలియన్ల సంప్రదాయాల్లో ఒకటి. అదృష్టం వరించినప్పుడు సంతోషంతో లేదంటే.. ఏవైనా కఠిన శిక్షల బారిన పడినపుడు ఇలా చేయడం వారికి అలవాటు. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. How's your Monday going? 😅#T20WorldCup pic.twitter.com/Fdaf0rxUiV — ICC (@ICC) November 15, 2021 -
ముగ్గురూ క్రికెటర్లే.. 34 ఏళ్ల క్రితం అద్భుతం చేసిన తండ్రి.. ఇప్పుడు కొడుకు కూడా
T20 World Cup 2021 Final: Mitchell Marsh Repeats His Father's Geoff Marsh World Cup Winner 34 Years Record: ఆస్ట్రేలియాకు తీరని కలగా ఉన్న టీ20 ప్రపంచకప్ ఎట్టకేలకు కంగూరూల సొంతమైంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మొదటిసారి టైటిల్‌ను గెలిచింది. ఐదు సిరీస్ పరాజయాల నుంచి చాంపియన్‌గా నిలిచి ఆరోన్ ఫించ్ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంది. ముఖ్యంగా ఫైనల్లో స్టార్ ఓపెపర్ డేవిడ్ వార్నర్ (53 పరుగులు), మిచెల్ మార్ష్(77) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 34 ఏళ్ల క్రితం తండ్రి.. ప్రధానంగా మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆసీస్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, 34 ఏళ్ల క్రితం మార్ష్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తొలిసారిగా విజేతగా నిలవడంలో కీలకంగా వ్యహరించాడు. ప్రపంచకప్-1987 టోర్నీలో మొత్తంగా 428 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాదు... రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌గా మారిన జెఫ్ మార్ష్... ఆసీస్ 1999లో తమ రెండో టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తండ్రిలాగే కొడుకు తండ్రి జెఫ్ మార్ష్ అడుగుజాడల్లోనే నడిచాడు మిచెల్ మార్ష్(mitchell marsh). గత ఆరు పర్యాయాలుగా అందని ద్రాక్షగా ఆసీస్‌ను ఊరిస్తున్న టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో మార్ష్ మొత్తంగా.. ఐదు ఇన్నింగ్స్‌లో మార్ష్ 185 పరుగులతో రాణించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జెఫ్ మార్ష్ మరో తనయుడు, మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ సైతం క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఇలా కుటుంబమంతా ఆసీస్ జట్టులో చోటు సంపాదించడమే కాకుండా పలు కీలక సమయాల్లో విజయాలు అందించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. -
David Warner: ఐదు సిరీస్ పరాజయాల నుంచి.. చాంపియన్‌గా.. వార్నర్, మార్ష్ ఇంకా..
David Warner Mitchell Marsh Heroics Australia Become Champion: కొద్ది రోజుల క్రితం ఇదే యూఏఈలో ఐపీఎల్-2021 రెండో అంచె సందర్భంగా ‘అవమానాలకు’ డేవిడ్ వార్నర్(David Warner) తానేంటో నిరూపించుకున్నాడు. నెల రోజులు తిరిగేసరికి ఏకంగా వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. సరైన సమయంలో తన జాతీయ జట్టు తరఫున సత్తా చాటి తొలి టైటిల్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. తన విలువను చాటుకున్నాడు. ఇక పరిమిత ఓవర్ల కోసం రెండేళ్ల క్రితం టెస్టులను వదిలి పెట్టిన మిచెల్ మార్ష్(Mitchell Marsh)ను ఇప్పటి వరకు ‘బిట్స్ అండ్ పీసెస్’ తరహాలో ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తూ వచ్చిన ఆసీస్ కొన్నాళ్ల క్రితమే ప్రధాన బ్యాట్స్‌మన్ పాత్రను ఇస్తూ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. టోర్నీలో ఏకంగా 147 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించిన తనపై ఉంచిన నమ్మకాన్నిమార్ష్ నిలబెట్టాడు. అతను ఆడని ఒకే ఒక మ్యాచ్‌లోనే ఆసీస్ ఓడిందంటే మార్ష్ భాగస్వామ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. ఫైనల్లో విజయం వైపు నడిపించిన వీరిద్దరే కాకుండా కీలక సమయాల్లో ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలు ఆసీస్‌ను ముందంజంలో నిలిపాయి. సరిగ్గా చెప్పాలంటే ఎలాంటి ప్రత్యర్థి, వేదిక ఎదురైనా ఏ సమయంలోనూ వెనకడుగు వేయని ఒకనాటి దుర్భేద్యమైన ఆస్ట్రేలియాను గుర్తుకు తెస్తూ ఈ బృందం సత్తా చాటింది. T20 World Cup 2021 Winner Australia: టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా ఆడిన గత ఐదు టి20 సిరీస్‌లు చూస్తే... ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా ఐదు సిరీస్ పరాజయాలు... కానీ అసలు సమయంలో తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడంతో ఆసీస్ ఒక్కసారిగా ఎగసింది. సెమీఫైనల్లో వేడ్, స్టొయినిస్ హీరోలుగా నిలిస్తే బౌలింగ్‌లో హాజల్‌వుడ్, జంపా స్టార్లుగా నిలిచారు. ముఖ్యంగా ఇతర లెగ్‌స్పిన్నర్లతో పోలిస్తే జంపా ఇంతగా సూపర్ సక్సెస్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆరుకంటే తక్కువ ఎకానమీ (5.81)తో అతను 13 వికెట్లు తీసి ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేశాడు. హాజల్‌వుడ్ కూడా పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషిస్తూ 11 వికెట్లతో చెలరేగాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో టైటిల్ సాధించడంలో భాగంగా ఉన్న హాజల్‌వుడ్ అదే అనుభవాన్ని ఇక్కడా ఉపయోగించాడు. కెప్టెన్ ఫించ్ మినహా (7 మ్యాచ్‌లలో 2 డకౌట్లు సహా 135 పరుగులు) మిగతా వారంతా ఏదో ఒక దశలో తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ఆసీస్‌కు విజయాన్ని అందించింది. అయితేనేమి... ఆసీస్‌కు ప్రపంచకప్ అందించిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్లవంటి దిగ్గజాల సరసన ఫించ్ చోటు దక్కించుకున్నాడు. తొలి టి20 ప్రపంచకప్ సమయంలో ఆస్ట్రేలియా అద్భుత ఫామ్‌లో ఉంది. వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత ఇది కూడా వారిదే అనిపించింది. అయితే అనూహ్యంగా సెమీ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన టీమ్‌కు ఆ తర్వాత ఐదు ప్రయత్నాల్లోనూ టైటిల్ దక్కలేదు. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదంటూ ఆసీస్ మాజీ ఆటగాళ్లు పదే పదే చెబుతూ వచ్చారు. బిగ్‌బాష్ లీగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిన తర్వాత, కొత్త టి20 స్టార్లు వెలుగులోకి వచ్చినా కంగారూల సమస్య తీరలేదు. గత రెండు సార్లు (2014, 2016) టీమ్ కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది. అంచనాలు లేకపోవడమే పెద్ద బలం అన్నట్లుగా ఈసారి బరిలోకి దిగిన జట్టు చివరకు సాధించి చూపించింది. భారత్ చేతిలో వార్మప్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాతైతే ఆ టీమ్‌పై ఎవరికీ నమ్మకం కూడా లేకుండా పోయింది. అయితే మ్యాచ్ మ్యాచ్‌కూ తమ ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగింది. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడినా దాని ప్రభావం రన్‌రేట్‌పై పడకుండా తర్వాతి మ్యాచ్‌లలో చెలరేగడంతో సెమీస్ బెర్తు దక్కింది. ఈ అవకాశాన్ని వదలరాదనే పట్టుదల ప్రదర్శించిన టీమ్ చివరకు జగజ్జేతగా నిలవగలిగింది. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. -
T20 WC 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే..
T20 World Cup 2021: Prize Money won by each participating team in the tournament: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుగా నీరాజనాలు అందుకున్నా.. తీరని లోటుగా ఉన్న పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుని కలను నిజం చేసుకుంది. ఇక న్యూజిలాండ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం న్యూజిలాండ్ జట్టుకిది మూడోసారి. కివీస్ 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ... 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్-2021 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం. ఆసీస్‌కు ఎంతంటే... ►ఈ మెగా ఈవెంట్లో మొత్తం ప్రైజ్‌మనీ- 5.6 మిలియన్ డాలర్లు(42 కోట్ల రూపాయలు). ►ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 16 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 91 లక్షలు). ►ఇక సూపర్ 12 దశలో భాగంగా లీగ్ మ్యాచ్‌లలో ఐదింటికి నాలుగు గెలిచిన ఆరోన్ ఫించ్ బృందానికి చాంపియప్గా అందుకున్న ఈ మొత్తంతో పాటు రూ. 1.2 కోట్ల మేర అదనంగా ముట్టింది. మొత్తంగా ఆసీస్‌కు దక్కిన ప్రైజ్ మనీ 13.1 కోట్ల రూపాయలు. ►రన్నరప్ న్యూజిలాండ్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 95 లక్షలు). సూపర్ 12 రౌండ్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన కివీస్‌కు కూడా 1.2 కోట్ల రూపాయలు ఇందుకు అదనంగా లభించాయి. సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే.. ►గ్రూపు-1 నుంచి ఇంగ్లండ్, గ్రూపు-2 నుంచి పాకిస్తాన్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 3 కోట్ల రూపాయలు. ►ఇక సూపర్ 12లో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్‌కు అదనంగా దక్కిన మొత్తం 4.5 కోట్ల రూపాయలు. ►అదే విధంగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్‌కు దక్కిన మొత్తం... 4.2 కోట్ల రూపాయలు. సూపర్ 12 దశకు అర్హత సాధించిన జట్లకు.. ►టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా తొలిసారిగా నిర్వహించిన సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించిన జట్లకు 52 లక్షల రూపాయాలతో పాటు విజయాల ఆధారంగా అదనంగా ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల మేర అందింది. ►ఉదాహరణకు.. టీమిండియాకు ఈ మెగా ఈవెంట్లో దక్కిన మొత్తం... 1.42 కోట్ల రూపాయలు. సూపర్ 12 చేరినందుకు రూ. 52 లక్షలు.. అదే విధంగా మూడు మ్యాచ్‌లు గెలిచినందుకు ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల చొప్పున 90 లక్షల రూపాయలు దక్కుతాయి. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన జట్లకు ఇలా.. ►పపువా న్యూగినియా, నమీబియా తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అయితే, సూపర్ 12 అర్హత సాధించే క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నమీబియా, స్కాట్లాండ్ ముందుకు వెళ్లగా... ఒమన్, పపువా న్యూగినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్.. ఆ ఘనత సాధించలేకపోయాయి. ►ఈ క్రమంలో ఈ నాలుగింటిలో ఒక్కో జట్టుకు... అర్హత సాధించినందుకు రూ. 30 లక్షలు.. ఒక్కో విజయానికి 30 లక్షల చొప్పున అందాయి. ►ఉదాహరణకు.. శ్రీలంక క్వాలిఫైయర్స్ ఆడి.. సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో దసున షనక బృందానికి మొత్తంగా 2.02 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఎలాగంటే.. సూపర్ 12 దశకు క్వాలిఫై అయినందుకు 52 లక్షలు, అందులో రెండు విజయాలకు 60 లక్షలు.. ఇక క్వాలిఫైయర్స్‌లో మూడింట గెలిచినందుకు 90 లక్షల రూపాయలు.. మొత్తంగా రూ. 2.02 కోట్లు. చదవండి: T20 WC 2021- Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. కానీ వార్నర్ మాత్రం.. చాలా గర్వంగా ఉంది.. -
Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. చాలా గర్వంగా ఉంది..
T20 WC 2021 Winner Australia: Aaron Finch Comments On David Warner Adam Zampa: ‘‘చాలా గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా తొలి జట్టుగా మేము నిలిచాం. టైటిల్ సాధించడం అంత తేలికైన విషయం కాదు అని మాకు తెలుసు. వ్యక్తిగతంగా, సమష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం’’ అని టీ20 వరల్డ్‌కప్-2021 చాంపియన్ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసీస్‌కు ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ టైటిల్ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు. నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. డేవిడ్ వార్నర్(38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్ మార్ష్(50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవగా.. మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం కెప్టెన్ ఫించ్ మాట్లాడుతూ.. వార్నర్, ఆడం జంపా, మార్ష్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘తన పని అయిపోయిందంటూ చాలా మంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే వార్నర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం జంపా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. మార్ష్ ఈరోజు అద్భుతంగా ఆడాడు. వేడ్ గాయం కారణంగా ఇబ్బంది పడగా స్టొయినిస్ తన పనిని పూర్తి చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. స్కోర్లు: న్యూజిలాండ్- 172/4 (20) ఆస్ట్రేలియా- 173/2 (18.5) -
T20 WC Final: వావ్.. మిచెల్ మార్ష్ అరుదైన రికార్డు.. కేన్ మామ, వార్నర్ భాయ్ కూడా!
T20 WC 2021 Winner Australia: Mitchell Marsh Kane Williamson Warner Rare Record In Final: టీ20 వరల్డ్‌కప్ కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి సారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీ-2021 కైవసం చేసుకుని సత్తా చాటింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్ మార్ష్(50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మార్ష్ తక్కువ బంతుల్లోనే.. ఇక నవంబరు 14 నాటి ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మార్ష్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విలియమ్సన్ 32 బంతులు, వార్నర్ 34 బంతుల్లో ఈ రికార్డు సాధించారు. అంతకుముందు 2014లో ఇండియాతో ఫైనల్లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(33), 2016లో వెస్టిండీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(33) ఈ ఘనత అందుకున్నారు. ఇక ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: అంచనాలు లేకుండా బరిలోకి.. స్విచ్‌హిట్‌తో మ్యాక్సీ విన్నింగ్ షాట్ -
అంచనాలు లేకుండా బరిలోకి.. స్విచ్‌హిట్‌తో మ్యాక్సీ విన్నింగ్ షాట్
Maxwell Swith Hit Winning Shot Became Viral.. టి20 ప్రపంచకప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్లో రారాజుగా ఉన్న ఆస్ట్రేలియాకు పొట్టి ఫార్మాట్ అంతగా కలిసిరాలేదు. 2007 తొలి టి20 ప్రపంచకప్ నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 2010 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరినప్పటికి ఇంగ్లండ్ చేతిలో పరాభవం ఎదురైంది. తాజా ప్రపంచకప్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్ ఏకంగా కప్‌ను ఎగురేసుకుపోయింది. ఇక మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ మెరుపులతో సులువుగానే లక్ష్యం దిశగా నడిచింది. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్ స్విచ్‌హిట్‌తో విన్నింగ్ షాట్ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించడం హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
T20 World Cup 2021 Winner Australia: ఆసీస్‌కు అందిన ద్రాక్ష
సాక్షి క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాలు శాసించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. వన్డే క్రికెట్లో ఐదుసార్లు జగజ్జేతగా నిలిచినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టి20 క్రికెట్ ప్రస్తావన రాగానే ఇంతకాలం ఆస్ట్రేలియా గురించి చెప్పే ఒకే ఒక్క మాట ఇది... ఆస్ట్రేలియా టీమ్ గురించి ఇకపై అలాంటి మాటకు అవకాశమే లేదు. 2007 నుంచి తొలి టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న కంగారూలు ఎట్టకేలకు 14 ఏళ్ల ‘జైలు గోడలను’ బద్దలు కొట్టారు. టి20 ప్రపంచకప్‌లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచి ఇంతకాలంగా అందని ట్రోఫీని తమ ఖాతాలో వేసుకొని సగర్వంగా నిలిచారు. టోర్నీ ఆరంభానికి ముందు ఎలాంటి అంచనాలు లేని, ఫేవరెట్ అంటూ ఎవరూ చెప్పని జట్టు చివరకు చాంపియన్ తరహా ఆటతో సత్తా చాటింది. నాకౌట్ మ్యాచ్‌లలో కనిపించే ఒత్తిడి, ఆందోళన తమ దరికి రావని చాటి చెబుతూ అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను అందుకుంది. సెమీస్‌లో సూపర్ ఆటతో పాక్‌ను చిత్తు చేసిన టీమ్ తుది పోరులోనూ అదే స్థాయిని ప్రదర్శించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ముందుగా ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన ఆసీస్... ఛేదనలో ఎక్కడా తడబడలేదు. బౌలింగ్‌లో హాజల్‌వుడ్ అదరగొట్టగా... బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్, వార్నర్ ద్వయం చెలరేగింది. మెల్బోర్న్లో సోమవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయం అవుతుండగా, తమ అభిమానులకు తీపి వార్త అందించింది. పాపం న్యూజిలాండ్... ఫైనల్ మ్యాచ్ ఫలితం చూసిన తర్వాత ఇలా స్పందించని క్రికెట్ అభిమాని ఉండడేమో! 2019 వన్డే ప్రపంచకప్‌లో కూడా ఫైనల్ చేరి ‘బౌండరీ కౌంట్’తో గుండె పగిలిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఓడి విషాదంలో మునిగింది. 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఆసీస్ చేతిలోనే ఓటమి పాలైన టీమ్... గత రెండేళ్ల వ్యవధిలో రెండు మెగా టోర్నీ తుది సమరాల్లోనూ దురదృష్టవశాత్తూ తలవంచింది. అసలు సమయంలో చెలరేగిన కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లోనే 85 పరుగులు చేసి చుక్కానిలా జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం కివీస్‌ను దెబ్బ తీసింది. చివరకు మరోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. T20 World Cup 2021 Winner Australia: టి20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి తొలిసారి ఈ ఫార్మాట్లో వరల్డ్ టైటిల్ అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్‡్ష (50 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. బౌలర్ల జోరు... భారీ స్కోరు సాధించేందుకు శుభారంభం చేయాల్సిన న్యూజిలాండ్ పవర్‌ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. 6 ఓవర్లలో 32 పరుగులే చేయగలిగిన ఆ జట్టు డరైల్ మిచెల్ (8 బంతుల్లో 11; సిక్స్) వికెట్ కోల్పోయింది. ముఖ్యంగా పేసర్ హాజల్‌వుడ్ ప్రత్యర్థిని కట్టి పడేశాడు. తన 3 ఓవర్ల స్పెల్‌లో అతను 14 ‘డాట్’ బంతులు వేయడం విశేషం. ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. విలియమ్సన్ బాగా నెమ్మదిగా ఆడగా, గప్టిల్ (35 బంతుల్లో 28; 3 ఫోర్లు) కూడా పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 57 మాత్రమే! 6 ఓవర్లలో 79 పరుగులు... విరామం తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటికి 21 బంతులు ఆడిన విలియమ్సన్ 21 పరుగులతో ఉన్నాడు. స్టార్క్ వేసిన 11వ ఓవర్ నాలుగో బంతికి విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను హాజల్‌వుడ్ వదిలేశాడు. ఆ బంతికి ఫోర్ రాగా, తర్వాతి రెండు బంతులను కూడా కేన్ బౌండరీకి పంపించాడు. మరుసటి ఓవర్లో గప్టిల్ అవుటైనా... మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. జంపా ఓవర్లో ఫిలిప్స్ (17 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) ఒక సిక్స్, ఫోర్ కొట్టగా... స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లో విలియమ్సన్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 0, 4, 4 కొట్టడం విశేషం. 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన విలియమ్సన్... ఒక్క స్టార్క్ బౌలింగ్‌లోనే 12 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 39 పరుగులు రాబట్టాడు. అయితే కీలక సమయంలో విలియమ్సన్‌ను అవుట్ చేయడంతో పాటు చివరి నాలుగు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... కివీస్‌ను కొంత వరకు కట్టడి చేయడంలో సఫలమైంది. భారీ భాగస్వామ్యం... ఫామ్‌లో లేని కెప్టెన్ ఫించ్ (5) మరోసారి నిరాశపరుస్తూ ఆరంభంలోనే నిష్క్రమించడంతో ఆసీస్ ఛేదన మొదలైంది. అయితే వార్నర్, మార్ష్ భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. మిల్నే ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4తో తన ఖాతా తెరిచిన మార్ష్ చివరి వరకు అదే జోరును కొనసాగించగా, సెమీస్ తరహాలో మళ్లీ మెరుపు ప్రదర్శనతో వార్నర్ దూసుకుపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులు కాగా... సోధి ఓవర్లో వార్నర్ కొట్టిన 2 ఫోర్లు, సిక్స్‌తో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 82 పరుగులకు చేరింది. కివీస్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేకపోయారు.ఎంతో నమ్ముకున్న స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోధి కూడా పేలవంగా బౌలింగ్ చేయడంతో కంగారూలకు ఎదురు లేకుండా పోయింది. ఆసీస్ దూసుకుపోతున్న సమయంలో లక్ష్యానికి 66 పరుగుల దూరంలో వార్నర్‌ను బౌల్డ్ చేసి బౌల్ట్ కొంత ఆశలు రేపాడు. అయితే నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాక్సీ అండతో మరింత చెలరేగిన మార్ష్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడిన మార్ష్ , మ్యాక్స్‌వెల్ 39 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సౌతీ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని రివర్స్ స్వీప్‌తో మ్యాక్స్‌వెల్ బౌండరీకి తరలించడంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఆనందం వెల్లువెత్తింది. ఇది చాలా పెద్ద విజయం. టి20 ప్రపంచకప్ నెగ్గిన తొలి ఆసీస్ జట్టు మాదే కావడం గర్వంగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌పై సాధించిన విజయం కీలక మలుపు. టీమ్ ప్రదర్శనతో పాటు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు ఈ గెలుపును అందించాయి. కొన్నాళ్ల క్రితం వార్నర్‌ను కొందరు లెక్కలోకి తీసుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. నా దృష్టిలో జంపా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. –ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్ మేం సాధించిన స్కోరు సరిపోతుందని అనుకున్నాం. కానీ ఆసీస్ అద్భుతంగా ఆడి ఛేదించింది. ఈ రోజు మాకు కలిసి రాలేదు. అయితే మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నాం. విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది. ఎంతో బాగా ఆడి ఎన్నో అంచనాలతో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి కొంత బాధ సహజం. –విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్ స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) స్టొయినిస్ (బి) జంపా 28; మిచెల్ (సి) వేడ్ (బి) హాజల్‌వుడ్ 11; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 85; ఫిలిప్స్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హాజల్‌వుడ్ 18; నీషమ్ (నాటౌట్) 13, సీఫెర్ట్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–28; 2–76; 3–144; 4–148. బౌలింగ్: స్టార్క్ 4–0–60–0; హాజల్‌వుడ్ 4–0–16–3; మ్యాక్స్‌వెల్ 3–0–28–0; కమిన్స్ 4–0–27–0; జంపా 4–0–26–1; మిచెల్ మార్‡్ష 1–0–11–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) బౌల్ట్ 53; ఫించ్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 5; మార్‡్ష (నాటౌట్) 77; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–15; 2–107. బౌలింగ్: బౌల్ట్ 4–0–18–2; సౌతీ 3.5–0–43–0; మిల్నే 4–0–30–0; సోధి 3–0–40–0; సాన్‌ట్నర్ 3–0–23–0; నీషమ్ 1–0–15–0. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ట్రోఫీతో వార్నర్, విలియమ్సన్ మ్యాక్స్‌వెల్‌తో మిచెల్ మార్ష్ సంబరం -
4,4,6,0,4,4.. కేన్ మామానా మజాకా
Kane Williamson Smash Mitchell Starc 22 Runs In Single Over.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 45 బంతుల్లో 10 ఫోర్లు.. మూడు సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ఎప్పుడు కూల్‌గా కనిపించే కేన్‌మామ ఫైనల్లో తొలిసారి తన శైలికి విరుద్ధంగా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు విలియమ్సన్ చుక్కలే చూపించాడు. వరుసగా 4,4,6,0,4,4 బాది 22 పరుగులు పిండుకుకొని విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం కేన్ మామ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: T20 WC 2021 Final: సంగక్కర తర్వాత కేన్ విలియమ్సన్ మాత్రమే -
సంగక్కర తర్వాత కేన్ విలియమ్సన్ మాత్రమే
Kane Williamson 2nd Captain To Score Half Century T20 WC Finals.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. కీలకమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన విలియమ్సన్ టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇక విలియమ్సన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. -
T20 WC 2021 Final: ఎడమ పక్కన నిల్చున్న కెప్టెన్‌దే ట్రోఫీ
Team Captain Who Stands Title Left Side Won Final Match.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ విషయం పక్కనపెడితే ఫైనల్లో తలపడనున్న జట్ల కెప్టెన్లలో ఎవరైతే ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చుంటారో వారిదే విజయం అని జోస్యం చెబుతున్నారు. వినడానికి సిల్లీగా ఉన్నా చరిత్ర మాత్రం ఇదే చెబుతుంది. వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలాంటి మేజర్ ఐసీసీ టోర్నీల్లో చాలా సందర్భాల్లో ఇది చోటుచేసుకుంది. ఒకసారి వాటిని పరీశిలిద్దాం. చదవండి: David Warner: రెండు సిక్సర్లు.. 30 పరుగులు; వార్నర్ ముంగిట అరుదైన రికార్డు ► 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ టీమిండియా, శ్రీలంక మధ్య జరిగింది. అక్కడ ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ధోనికి విజయం వరించింది. ► 2015 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చును మైకెల్ క్లార్క్ విజయం అందుకున్నాడు. ► 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ తలపడ్డాయి. ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న డారెన్ సామి టైటిల్ అందుకున్నాడు. ► 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పాకిస్తాన్, టీమిండియా మధ్య జరిగింది. ట్రోఫీకి ఎడమపక్కన నిల్చున్న సర్ఫరాజ్ అహ్మద్ విజేతగా నిలిచాడు. చదవండి: T20 WC 2021: 'దుబాయ్' చేజింగ్ కింగ్; టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం ► 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ఇయాన్ మోర్గాన్‌ను విజయం వరించింది. ► 2021లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న కేన్ విలియమ్సన్ విజయం సాధించాడు. A team captain who stands at the left side of the trophy have won the final. Exception -2014.#AUSvsNZ pic.twitter.com/IZJoa4EV3X — Akshat Om (@AkshatOM3) November 13, 2021 -
AUS vs NZ: మార్ష్ విధ్వంసం.. టి20 ప్రపంచకప్ 2021 విజేత ఆస్ట్రేలియా
సమయం: 23:00.. టి20 ప్రపంచకప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. మిచెల్ మార్ష్ (46 బంతుల్లో 78 పరుగులు, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)మరోసారి మెరవడంతో ఆసీస్ సులువుగానే విజయం సాధించింది. మిచెల్ మార్ష్ మెరుపులు.. 16 ఓవర్లలో 149/2 మిచెల్ మార్ష్ 39 బంతుల్లో 69 పరుగులతో మెరుపులు మెరిపిస్తుండడంతో ఆసీస్ విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 149 పరుగుల చేసింది. మ్యాక్స్‌వెల్ 10 బంతుల్లో 21 పరుగులతో సహకరిస్తున్నాడు. వార్నర్ అర్థశతకం.. 11 ఓవర్లలో 97/1 డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వార్నర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు మిచెల్ మార్ష్ కూడా 26 బంతుల్లో 40 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. సమయం: 22:02.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(42) మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫించ్ ఔటైన అనంతరం వార్నర్ దూకుడు చూపిస్తుండడంతో ఆసీస్ స్కోరుబోర్డు పరుగుపెడుతుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఫించ్(5) ఔట్.. 6 ఓవర్లలో ఆస్ట్రేలియా 43/1 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్(5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. వార్నర్ 19, మిచెల్ మార్ష్ 17 పరుగులతో ఆడుతున్నారు. విలియమ్సన్ విధ్వంసం.. 20 ఓవర్లలో కివీస్ 172/4 కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(85 పరుగులు, 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి 57/1 గా ఉన్న న్యూజిలాండ్ స్కోరు 16 ఓవర్లలో 132 పరుగులకు చేరింది. 6 ఓవర్లలో 75 పరుగులు సాధించిందంటే అదంతా కేన్ విలియమ్సన్ మాయే అని చెప్పొచ్చు. ఇక స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో 4,4,6,0,4,4తో విలియమ్సన్ విశ్వరూపం చూపించాడు. కేన్ విలియమ్సన్(85) ఔట్.. న్యూజిలాండ్ 149/4 దూకుడుగా ఆడుతున్న కేన్ విలియమ్సన్(85) హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.. అయితే ఈ న్యూజిలాండ్ కెప్టెన్ తన శైలికి విరుద్ధంగా దూకుడుగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 48 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. అంతకముందు అతనికి సహకరిస్తున్న గ్లెన్ ఫిలిప్స్(18) హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మూడో వికెట్ కోల్పోయింది. కేన్ మామ ఫిఫ్టీ.. న్యూజిలాండ్ 13 ఓవర్లలో 97/2 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో కేన్ విలియమ్సన్ అర్థసెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్ జంపా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్లలో న్యూజిలాండ్ 57/1 సమయం: 20:13.. 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ వెనుదిరిగిన తర్వాత గప్టిల్(27), విలియమ్సన్(17)లు ఆచితూచి ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ సమయం: 19:50.. డారిల్ మిచెల్(11) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ ఐదో బంతికి షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. గప్టిల్ 16, విలియమ్సన్ 0 పరుగులతో ఆడుతున్నారు. సమయం: 19:39.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 10, మిచెల్ 3 పరుగులతో ఆడుతున్నారు. దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మహాసంగ్రామం మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ అనుహ్య విజయం సాధించింది. మరో వైపు రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై అద్బుత విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే ఈ రెండు జట్లలో ఏది విజయం సాధించిన.. ఈసారి ట్రోఫిని కొత్త జట్టు ముద్దాడబోతోంది. కాగా ఈ రెండు జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. దీంతో టైటిల్ ఫేవరేట్ ఏ జట్టు అనేది అంచనా వేయడం కష్టమే. కాగా టీ20ల్లో 14 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ముఖా ముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్ ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ -
రెండు సిక్సర్లు.. 30 పరుగులు; వార్నర్ ముంగిట అరుదైన రికార్డు
David Warner Waiting For 2 Milestones Vs NZ Final T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒక టి20 ప్రపంచకప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు వార్నర్ కేవలం 30 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 236 పరుగులు సాధించాడు. కివీస్‌తో జరగనున్న ఫైనల్లో 30 పరుగులు చేస్తే వార్నర్ అరుదైన ఘనత అందుకుంటాడు. ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ చేసిన 265 పరుగులే ఆ జట్టు తరపున అత్యధిక స్కోరుగా ఉంది. ఆ తర్వాత షేన్ వాట్సన్ 2012 టి20 ప్రపంచకప్‌లో 249 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ టి20 ప్రపంచకప్‌లో దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల్లో వార్నర్ ఇప్పటివరకు 14 సిక్స్‌ర్లు కొట్టాడు. మరో రెండు సిక్స్‌లు కొడితే షాహిద్ అఫ్రిదిని(15 సిక్సర్లు) దాటి తొలి స్థానంలో నిలవనున్నాడు. చదవండి: T20 WC 2021: 'దుబాయ్' చేజింగ్ కింగ్; టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం -
'దుబాయ్' చేజింగ్ కింగ్.. 12లో 10సార్లు గెలుపే
Toss Winning Team Won T20 World Cup 2021 Title.. టి20 ప్రపంచకప్ 2021 ఆఖరి అంకానికి చేరుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు మరికొద్ది గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మ్యాచ్ పరంగా చూస్తే ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ దానికి మించి టాస్ మరింత ఫెవరెట్‌గా మారింది. దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటే సగం విజయం సాధించినట్టే. చదవండి: 'యువీ నువ్వుంటే బాగుండేది'': కోహ్లి.. అనుష్క రియాక్షన్ వైరల్ ఈ టి20 ప్రపంచకప్‌లో దుబాయ్ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌లు ఇదే రుజువు చేస్తున్నాయి. ఇక్కడ జరిగిన 12 మ్యాచ్‌ల్లో మొదట బౌలింగ్ చేసిన జట్లు 11 సార్లు విజయం సాధించగా.. ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. ఇక టాస్ గెలిచిన జట్లు 10 సార్లు విజయం అందుకోగా.. రెండుసార్లు మాత్రమే ఓటమి పాలయ్యాయి. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ సహా మొత్తం 44 మ్యాచ్‌లు జరగ్గా.. 29 సార్లు టాస్ గెలిచిన జట్లు విజయం సాధించడం విశేషం. విన్నింగ్ శాతం 65.9% ఉంది. ఇంకో విషయమేంటంటే దుబాయ్ వేదికగా రాత్రి జరిగిన తొమ్మిది మ్యాచ్‌లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. రాత్రి మ్యాచ్‌ల్లో చేజింగ్ సమయంలో మంచు ప్రభావం ఉండడంతో 9 మ్యాచ్‌ల్లో బౌలర్లు కేవలం ఎనిమిది వికెట్లే పడగొట్టగలిగారు. ఈ ప్రపంచకప్ మాత్రమే కాదు 2014, 2016లోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం.. లేదా చేజింగ్ టీమ్‌లే విశ్వవిజేతలుగా నిలవడం విశేషం. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్లో టాస్ ఎవరు గెలిస్తే వాళ్లు బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో. చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే Now for the main event 💥 New Zealand and Australia are in the final… and they’re ready 💪 Are you? https://t.co/VISgYpY6QE#T20WorldCup pic.twitter.com/p5nH9o5VxR — ICC (@ICC) November 13, 2021 -
డెవాన్ కాన్వే స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్‌కు చోటు..
Daryl Mitchell to replace Devon Conway: టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కీవిస్ మూడు టీ20లు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. అయితే భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ఆజట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే టీ20 ప్రపంచకప్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ మెగా టోర్నెమెంట్ ఫైనల్‌కు, భారత పర్యటనకు దూరమయ్యాడు. దీంతో గాయపడిన కాన్వే స్ధానంలో ఆజట్టు ఆల్ రౌండర్ డారిల్ మిచెల్‌ను భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇక ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో డారిల్ మిచెల్ కీలకమైన పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్-2021లో కివీస్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా నవంబర్17న జైపూర్ వేదికగా జరగనున్న తొలి టీ0 మ్యాచ్‌తో న్యూజిలాండ్ పర్యటన ప్రారంభంకానుంది. చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు... -
ఆ జట్టే టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్: సునీల్ గావస్కర్
Sunil Gavaskar picks his favourite team to lift famous trophy: టీ20 ప్రపంచకప్2021లో తుది పోరుకు సమయం అసన్నమైంది. టీ20 ప్రపంచకప్ విజేత ఎవరో అనేది మరి కొద్ది గంట్లో తేలిపోనుంది. ఆదివారం(నవంబర్14) దుబాయ్ వేదికగా జరగనున్న ఈ తుది సమరంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే విజేత ఎవరన్నది భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అంచనా వేశాడు. ఐసీసీ ఈవెంట్ల నాకౌట్ రౌండ్లలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉన్న నేపథ్యంలో ఆ జట్టే టైటిల్ ఫేవరేట్ అని అభిప్రాయపడ్డాడు. "ఐసీసీ ఈవెంట్ నాకౌట్ దశలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. వాళ్లకు ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ జట్టు కీలక మ్యాచ్‌ల్లో ఓడిన సందర్బాలు కంటే గెలిచిన సందర్బాలే ఎక్కువ. వాళ్లు తమదైన రోజున ప్రత్యర్ధి జట్టును చిత్తుగా ఓడించగలరు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలి సారి టీ20 ప్రపంచకప్ ట్రోఫిని ఆస్ట్రేలియన్లు కైవసం చేసుకుంటారు" అని గావస్కర్ పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021: టైటిల్ రేసులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే? -
‘తొలి టైటిల్’ అందుకునేందుకు... ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఢీ
ఐదు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచినా కూడా... ఆరు ప్రయత్నాల్లోనూ టి20 ప్రపంచకప్‌లో చాంపియన్ కాలేకపోయిన జట్టు ఒకవైపు... రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ ఒక్కసారి కూడా విశ్వ విజేత హోదాలో నిలవలేకపోయిన టీమ్ మరోవైపు... ఒకరిది పాత వైభవం నిలబెట్టుకునే ప్రయత్నం... మరొకరికి కొత్త చరిత్ర సృష్టించే అవకాశం... 44 ఆసక్తికర సమరాల తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. తొలిసారి టి20ల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు అటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ ‘సై’ అంటున్నాయి. బలమైన బ్యాటింగ్‌ను నమ్ముకున్న కంగారూ టీమ్... వైవిధ్యమైన బౌలింగ్‌తో సత్తా చాటిన న్యూజిలాండ్ మధ్య నేడు జరిగే ఫైనల్ పోరులో పైచేయి సాధించి ‘తొలి టైటిల్’ ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం. T20 World Cup 2021 Final Aus Vs NZ: ‘ట్రాన్స్ టాస్మన్ ’ దేశాల మధ్య మరోసారి అతి పెద్ద క్రీడా సమరానికి సమయం వచ్చేసింది. నేడు జరిగే టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్లు చెరో నాలుగు విజయాలు, దాదాపు ఒకే తరహా రన్‌రేట్‌తో ముందంజ వేశాయి. ఆపై టోర్నీ ఫేవరెట్లు ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించి తుది పోరుకు అర్హత సాధించాయి. ప్రపంచకప్ ఫైనల్ వరకు చూస్తే 2015 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఇరు జట్లు చివరిసారిగా తలపడగా, ఆసీస్ ఏకపక్ష విజయం సాధించింది. అయితే ఈసారి హోరాహోరీ సమరానికి అవకాశం ఉంది. మార్పుల్లేకుండా... పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా సాధించిన గెలుపును బట్టి చూస్తే టీమ్‌లో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. ఐపీఎల్లో వైఫల్యం, అవమానకర నిష్క్రమణ తర్వాత ప్రపంచకప్‌లో కీలక సమయాల్లో వార్నర్ చెలరేగిన తీరు అతని స్థాయిని చూపించింది. మరోసారి అతను ఇదే జోరు సాగిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు. అయితే కెప్టెన్ ఫించ్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు టోర్నీలో 119 పరుగులే చేసిన ఫించ్ కనీసం ఫైనల్లోనైనా చెలరేగాల్సి ఉంది. మిచెల్ మార్‡్ష, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్లతోపాటు గత మ్యాచ్ హీరో మాథ్యూ వేడ్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. స్టీవ్ స్మిత్ అద్భుతాలు చేయకపోయినా... ఈ టీమ్‌లో అతని పాత్ర ఎంతో కీలకం. ముగ్గురు పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉండగా... స్పిన్నర్ ఆడమ్ జంపా ఇప్పటికే టోర్నీలో తనదైన ముద్ర వేశాడు. ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థుల ఆట కట్టించిన అతను ఆరు మ్యాచ్‌లలో ఐదుసార్లు గరిష్టంగా 22 పరుగులే ఇచ్చాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష రెండు రంగాల్లోనూ ఆకట్టుకోగా, మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఐదో బౌలర్ కోటా కూడా పూర్తి చేసే అవకాశం ఉండటం ఆసీస్‌కు సానుకూలాంశం. ప్రత్యర్థిపై గత రికార్డు, నాకౌట్ మ్యాచ్‌లలో చెలరేగే తత్వం కలిసిన ఆసీస్ తమ స్థాయికి తగినట్లుగా ఆడితే టైటిల్ గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. సీఫెర్ట్‌కు చోటు... ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ అదే స్ఫూర్తిని మరో మ్యాచ్‌లోనూ ప్రదర్శించాల్సి ఉంది. డరైల్ మిచెల్, గప్టిల్ శుభారంభం అందిస్తే తర్వాతి బ్యాట్స్‌మెన్ దానిని కొనసాగించగలరు. దూకుడుగా ఆడగల కాన్వే గాయంతో ఫైనల్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. అతని స్థానంలో టిమ్ సీఫెర్ట్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే కాన్వేతో పోలిస్తే బ్యాటింగ్‌లో సీఫెర్ట్ కాస్త బలహీనం. మరోవైపు ఆసీస్ సారథి ఫించ్ తరహాలో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ కూడా పేలవ బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. టోర్నీలో అతను 131 పరుగులే చేశాడు. ధాటిగా ఆడగలడని భావించిన ఫిలిప్స్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఆరో స్థానంలో నీషమ్ రూపంలో సరైన వ్యక్తి ఉండటం కివీస్ బలం. అతని బ్యాటింగ్ పదునేమిటో సెమీస్‌లో కనిపించింది. బౌలింగ్‌లోనూ నీషమ్ రాణిస్తే 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేదు జ్ఞాపకాలను చెరిపేయగలడు! టోర్నీలో కివీస్‌ను ఫైనల్ వరకు చేర్చడంలో బౌలర్లదే కీలక పాత్ర. పేస్ బౌలర్ బౌల్ట్ ఎప్పటిలాగే సత్తా చాటగా, టిమ్ సౌతీ కూడా టోర్నీలో ఆరుకంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడం విశేషం. ఆసీస్‌తో పోలిస్తే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు ఇష్ సోధి, సాన్‌ట్నర్ మరింత ప్రభావం చూపించగలరు. జూన్ నెలలో వరల్డ్ టెస్టు చాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్... ఇక్కడా గెలిస్తే అది అరుదైన ఘనత అవుతుంది. తుది జట్లు (అంచనా) ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, మార్ష్, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, జంపా న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మిచెల్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, సాన్‌ట్నర్, మిల్నే, సౌతీ, సోధి, బౌల్ట్ చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు... -
టైటిల్ రేసులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే?
Final Australia vs New Zealand Match Prediction : టీ20 ప్రపంచకప్-2021 తుది ఘట్టానికి చేరుకుంది. ఆదివారం(నవంబర్14) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తుది పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లుఅమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నమెంట్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ అనుహ్య విజయం సాధించింది. మరో వైపు రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై అద్బుత విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే ఈ రెండు జట్లలో ఏది విజయం సాధించిన.. ఈసారి ట్రోఫిని కొత్త జట్టు ముద్దాడబోతోంది. కాగా ఈ రెండు జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. దీంతో టైటిల్ ఫేవరేట్ ఏ జట్టు అనేది అంచనా వేయడం కష్టమే. కాగా ఇరు జట్ల బలాబలాలు చూస్తే.. ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్ ఆద్బుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసిశ్చో అంశం. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వస్తున్న మిచెల్ మార్ష్ కూడా ఆద్బుతంగా రాణిస్తున్నాడు. ఇక 'మిడిలార్డర్లో స్టొయినిస్, వేడ్‌ల రూపంలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేవేయగల హిట్టర్లు ఉన్నారు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవర పెడుతున్నది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్ వంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లు ఈ జట్టులో ఉన్నారు. మరో వైపు స్పిన్నర్ అడమ్ జంపా ఆద్బుతంగా రాణిస్తున్నాడు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. ఈ జట్టు కూడా బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. అయితే ఈ కీలక పోరుకు ముందు స్టార్ బ్యాటర్ కాన్వే దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాగా ఆ జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, డారిల్ మిచెల్ ఈ టోర్నమెంట్లో ఆద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆజట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా తనదైన రోజున చెలరేగి ఆడగలడు. మిడిలార్డర్లో గ్లెన్ ఫిలిప్స్, నీషమ్ వంటి హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ స్పెషలిస్ట్ టీ20 బౌలర్లతో పటిష్టంగా ఉంది. కాగా టీ20ల్లో 14 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ముఖా ముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు... -
క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు...
Matthew Wade Beat Testicular Cancer at 16 Worked as Carpenter: మాథ్యూ వేడ్.. ఈ పేరు క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీ20 ప్రపంచకప్-2021లో సెమీ ఫైనల్లో షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లో వరుసుగా మూడు సిక్సర్లు బాది పాకిస్తాన్ ఫైనల్ ఆశలు గల్లంతు చేసిన కంగారూ బ్యాటర్. తన సంచలన ఇన్నింగ్స్ తో వేడ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. ఇప్పటికీ పాకిస్తానీ అభిమానులు ఈ ఓటమిని జీర్ణీంచుకోలేకపోతున్నారు. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఈ ఆసీస్ హీరో.. తన నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్‌ను జయించిన మృత్యుంజయుడు వేడ్. అతను ఒక స్టార్ క్రికెటర్ గానే మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ పొట్టకూటి కోసం కార్పెంటర్‌గా, ప్లంబర్‌గా వేడ్ పని చేశాడనే విషయం మీకు తెలుసా? ఆసీస్‌కు వేడ్ అనూహ్య విజయాన్ని అందించిన నేపథ్యంలో అతనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 16 ఏళ్ల వయసులో క్యాన్సర్.. మాథ్యూ వేడ్‌కు అప్పుడు 16 ఏళ్లు.. ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆడుతుండగా అతడు గజ్జ గాయానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. ఒక భయంకర వార్త అతనికి తెలుస్తుంది. అదే అతడు క్యాన్సర్ బారిన పడ్డాడని. తర్వాత కీమోథెరపీతో చికిత్స పోందుతూనే తన శిక్షణను కొనసాగించాడు. ఈ మాటలు స్వయానా అతడే సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కొన్నాళ్లు ప్లంబర్‌గా... క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నప్పడు అతడి క్రీడా జీవితం ప్రశ్నార్థకంలో పడింది. ఈ క్రమంలో ప్లంబర్‌గా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్లు ప్లంబర్‌గా పని చేశాడు. అయితే చికిత్స సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నానని, జుట్టు లేకుండా తొటి వాళ్లతో తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డానని వేడ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. వర్ణాంధత్వం.. మాథ్యూ వేడ్‌కు వర్ణాంధత్వం కూడా ఒక సమస్యగా ఉండేది. ముఖ్యంగా పింక్ బాల్‌తో డే అండ్ నైట్ క్రికెట్లో వర్ణాంధత్వం వల్ల అనేక సమస్యలను అతడు ఎదుర్కొన్నాడు. "కొన్ని సమయాల్లో బంతి ఎలా వస్తుందో చూడడానికి కొంచెం కష్టంగానే ఉండేది..అదే విధంగా ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ ఓపెనర్ క్రిస్ రోజర్స్ కూడా వర్ణాంధత్వంతో బాధపడ్డాడు. దీంతో 2014లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పింక్-బాల్ మ్యాచ్ నుంచి రోజర్స్ వైదొలిగాడు "అని వేడ్ చెప్పుకొచ్చాడు. కార్పెంటర్‌గా.. ఫామ్ లేమి కారణంగా 2018లో అతడు జాతీయ జట్టుకు దూరమైనప్పడు కార్పెంటర్‌గా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ తీసుకున్నాడు. 9-10 నెలలు తన ఇంటిలోనే కార్పెంటర్‌గా పనిచేశాడు. దీనిపై స్పందించిన వేడ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను జట్టుకు దూరమైనా చాలా విషయాలు నేర్చుకోవడం వైపు అడుగులు వేశాను. నేను వారానికి మూడు రోజులు కార్పెంటర్‌గా పని చేసాను, మిగితా రోజులు నా ఫ్యామిలితో గడిపాను. అయితే, నా క్రికెట్ జీవితాన్ని కొంత కాలం పాటు కోల్పోయాను. కార్పెంటర్‌గా పనిచేయడంతో సాధారణ జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకున్నాను. గుంతలు తవ్వడం, బోరింగ్ కాంక్రీట్ వంటి పనుల్లో ప్రజలు ఎంత కష్టపడతున్నారో చూశాను. నేను ప్రస్తుతం క్రికెట్ ఫీల్డ్‌లో ఉన్నానడంలో ఇవన్నీ కీలకమైన పాత్ర పోషించాయి’ అని వేడ్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అతడి కెరీర్ వెనుక జూలియా మాథ్యూ వేడ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం వెనుక అతడి భార్య జూలియా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. యాషెస్ సిరీస్‌కు ముందు అతడిని ఆస్ట్రేలియా- ఎ జట్టుకు ఎంపిక చేశారు. అయితే అదే సమయంలో అతడి భార్య గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో తన భార్య జూలియాకు ఫోన్ చేసి.. నాకు ఈ పర్యటనకు వెళ్లడం ఇష్టం లేదని సెలెక్టర్లకు తెలియజేస్తానని అతడు చెప్పాడు. కానీ అతడి భార్య దానికి భిన్నంగా స్పందించింది. మీరు తప్పనిసరిగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలని, ఎందుకంటే మీ స్ధానంలో వేరొకరిని ఎంపిక చేస్తారు. మీరు ఈ అవకాశం కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇంత కష్టపడి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం చాలా బాధకరమైన విషయమని వేడ్‌కు ఆమె సర్దిచెప్పింది. ఆమె ఇచ్చిన పోత్సాహంతో వేడ్ ఆస్ట్రేలియా-ఎ తరపున ఇంగ్లండ్ బయల్దేరి వెళ్లాడు. తదనంతరం మెరుగ్గా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన సక్సెస్ వెనుక భార్య జూలియా పాత్ర మరువలేనిదని చాలా ఇంటర్వ్యూల్లో వేడ్ పేర్కొన్నాడు. చదవండి: 'కోహ్లి అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా తప్పుకుంటే మంచిది'.. లేదంటే: అఫ్రిది -
'కోహ్లి అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా తప్పుకుంటే మంచిది'.. లేదంటే..
Shahid Afridi Comments on Virat Kholi: టీ20 ప్రపంచకప్- 2021లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత భారత టీ20 కెప్టన్సీ భాధ్యతల నుంచి తప్పకున్న విరాట్ కోహ్లిపై.. పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి బ్యాటర్‌గా రాణించాలంటే అన్నిఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవాలని అతడు సూచించాడు. కోహ్లి వారసుడిగా రోహిత్ శర్మను నియమించినందుకు బీసీసీఐని అఫ్రిది ప్రశంసించాడు. "భారత క్రికెట్‌కు కోహ్లి విలువైన ఆస్తి అని నేను భావిస్తున్నాను. అయితే అతడు ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా తప్పుకుంటే ఉత్తమం అని నేను భావిస్తున్నాను. ఇక రోహిత్ విషయానికి వస్తే.. "నేనుఐపీఎల్ లో (డెక్కన్ ఛార్జర్స్ తరఫున) రోహిత్‌తో ఏడాది పాటు ఆడాను. అతడు అత్యుత్తమ ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా దూకుడుగా ఆడగలడు లేదంటే క్లిష్ట పరిస్థితుల్లో నిలకడగా ఆడతాడు. అతడి షాట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. అంతకు మించి ఆటగాళ్లకు మంచి నాయకుడిగా ఉండగల ఆర్హత రోహిత్‌కు ఉంది అని ఆఫ్రిది పేర్కొన్నాడు. చదవండి: టి20 ప్రపంచకప్ 2021: విజేత ఎవరో చెప్పిన పీటర్సన్ -
'యువీ నువ్వుంటే బాగుండేది'': కోహ్లి.. అనుష్క రియాక్షన్ వైరల్
టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ సేవలు ఎప్పటికి మరిచిపోము. తొలి టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం ఎప్పుడు మరిచిపోలేము. అంతేకాదు టీమిండియా తొలి టి20 ప్రపంచకప్‌ను ఎగురేసుకుపోవడంలో యువీ పాత్ర మరువలేనిది. వీటితో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించడంలోనూ యువరాజ్ ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారీన పడి కోలుకున్న అతను క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: T20 WC 2021: కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్ తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా సూపర్ 12 దశలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అభిమాని ఒకరు.. యువరాజ్ ఉంటే బాగుండేదని..టీమిండియా మరోసారి ఫైనల్ కు వెళ్లేదని.. కోహ్లి యువీ కోసం ఆలోచిస్తున్నట్లుగా ఒక ఫోటోను షేర్ చేశాడు. దీనిని యువరాజ్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. కోహ్లి యువరాజ్ గురించి ఆలోచిస్తుంటే.. పక్కనే ఉన్న అనుష్క కోహ్లి కచ్చితంగా నన్ను కాదని వేరే అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నాడనుకొని ఊహిస్తుంది.. ఇదే సమయంలో కోహ్లి మాత్రం.. అరె యార్.. యువీ ఈ సమయంలో నువ్వు ఉంటే మిడిలార్డర్ మరింత స్ట్రాంగ్‌గా ఉండేది. యువీ నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. తాజాగా యువీ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక యువీ తన 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 హాఫ్ సెంచరీలు, టి20ల్లో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: T20 Wc 2021: హమ్మయ్య.. మొత్తానికి గంభీర్ కల నెరవేరింది -
రిజ్వాన్ కోలుకోవడంలో భారత డాక్టర్ కీలక పాత్ర... కృతజ్ఞతగా ఏమి ఇచ్చాడంటే..
Indian doctor who treated Mohammad Rizwan: టీ20 ప్రపంచకప్-2021లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. టోర్నీ లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే గురువారం (నవంబర్-11)న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా రెండు రోజులు ఐసీయూలో గడిపిన రిజ్వాన్ .. నేరుగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రిజ్వాన్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన రిజ్వాన్ త్వరగా కోలుకోవడంలో ఓ భారతీయ డాక్టర్ పాత్ర ఉంది. దుబాయ్‌లోని మెడెరో ఆసుపత్రిలో పల్మోనాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షహీర్ సైనాలాబ్దీన్.. రిజ్వాన్‌కు రెండు రోజులు పాటు వైద్యం అందించాడు. ముజే ఖేల్నా హై, టీమ్ కె సాత్ రెహనా హై (నేను జట్టుతో ఆడాలనుకుంటున్నాను, నేను జట్టులో ఎలాగైనా ఉండాలి) అని రిజ్వాన్ వైద్యులతో చెప్పాడంట. "రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్ కు గురైయ్యాడు. సెమీఫైనల్‌కు ముందు కోలుకోవడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే చెస్ట్ ఇన్ఫెక్షన్తో బాధ పడతున్నవారు ఎవరైనా కోలుకోవడానికి సాధారణంగా 5-7 రోజులు పడుతుంది. కానీ రిజ్వాన్ ఇంత త్వరగా కోలుకోవడం నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. రిజ్వాన్ ధైర్యంగా, దృడ సంకల్పంతో ఉన్నాడు. క్రీడాకారుడిగా అతడి శారీరక దృఢత్వం, పట్టుదల రిజ్వాన్ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అతడు 35 గంటలు ఐసీయూలో ఉన్నాడు”అని డాక్టర్ సైనాలాబ్దీన్ పేర్కొన్నాడు. కాగా తాను ఇంత త్వరగా కోలుకోవడానికి కారణమైన కృతజ్ఞతగా డాక్టర్ సైనాలాబ్దీన్కు తాను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని మహ్మద్ రిజ్వాన్ అందచేశాడు. చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే -
టి20 ప్రపంచకప్ 2021: విజేత ఎవరో చెప్పిన పీటర్సన్
Kevin Pieterson Predicts Winner Of T20 World Cup 2021: టి20 ప్రపంచకప్ 2021 విజేతపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుందని.. కచ్చితంగా కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయమై పీటర్సన్ తన బ్లాగ్‌లో ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే ''న్యూజిలాండ్ ప్రస్తుతం అన్ని విభాగాల్లో(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) బలంగా కనిపిస్తోంది. కానీ ఆస్ట్రేలియానే నా ఫెవరెట్. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు ఫైనల్లో ఎదురుపడినప్పుడు ఆస్ట్రేలియా దుమ్మురేపిందని చరిత్ర చెబుతుంది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జరిగింది ఇదే. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరితే బలంగా తయారవుతోంది.. అది ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిగా మారుతోంది. ఈ ఆదివారం ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌ను ఎత్తడం ఖాయం. ఇక డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉండడం న్యూజిలాండ్‌కు ప్రమాదం. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున తీవ్రంగా నిరాశపరిచిన వార్నర్ అక్కడ మరిచిపోయిన ఫామ్‌ను..కోపాన్ని ఈ టి20 ప్రపంచకప్‌లో చూపిస్తున్నాడు. అతనికి తోడూ గత మ్యాచ్‌లో వేడ్, స్టోయినిస్‌లు అద్భుతం చేసి చూపించారు.ఆస్ట్రలియా జట్టు పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఏలారు. తాజాగా టి20 ప్రపంచకప్‌ను గెలిస్తే ఇకపై టి20ల్లోనూ తమ బలాన్ని చూపించే అవకాశం ఉంది'' అంటూ తెలిపాడు. చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు -
T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే
Tim Seifert Replace Devon Conway For T20 WC 2021 Final.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్‌కు గాయం కారణంగా స్టార్ బ్యాట్స్‌మన్ డెవన్ కాన్వే దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్ స్టీఫెర్ట్ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగనున్న టి20 సిరీస్‌కు కూడా స్టీఫెర్ట్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. ఇక టిమ్ స్టీఫెర్ట్ న్యూజిలాండ్ తరపున 36 టి20ల్లో 703 పరుగులు చేశాడు. చదవండి: T20 WC 2021: కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్ ఇక నవంబర్10న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమిఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కొంత అసహనానికి గురైన కాన్వే.. చేతితో బ్యాట్‌ను గట్టిగా గుద్దాడు. దీంతో అతడి కుడి చేతి ఎముక విరిగింది. దీంతో విచిత్రరీతిలో కాన్వే టి20 ప్రపంచకప్ నుంచి దూరమవ్వాల్సి వచ్చింది. చదవండి: Marnus Labuschagne: పక్కకు పోతుందని వదిలేశాడు.. మైండ్‌బ్లాక్; లబుషేన్ అద్భుతం -
కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్
Wasim Jaffer tweets a funny meme on Kohli and Kane Williamson.. టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఫన్నీ ట్రోల్ చేశాడు. '' ఆసీస్‌తో ఫైనల్ కోసం కోహ్లికి కేన్‌మామకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు. దీనికి విలియమ్సన్ థ్యాంక్స్.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా'' అన్నట్లుగా ఫోట్ షేర్ చేయడం వైరల్‌గా మారింది. ఈ ప్రపంచకప్‌లో టాస్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన జట్లే ఎక్కువగా విజయాలు నమోదు చేశాయి. అయితే కోహ్లికి మాత్రం టాస్ కలిసి రాలేదు. న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ల్లో కోహ్లి టాస్ ఓడిపోవడం పెద్ద దెబ్బ. రెండు వరుస ఓటములు మనను సెమీఫైనల్‌కు దూరం చేశాయి. ఆ తర్వాత భారీ విజయాలు సాధించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ కీలకంగా మారనుంది. చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ... ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి న్యూజిలాండ్.. పాకిస్తాన్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టాయి. ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఈ రెండు జట్లలో ఏది గెలిచినా టి20 ప్రపంచకప్‌లో కొత్త విజేతను చూస్తాం. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కివీస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. '' ఈ ప్రపంచకప్‌లో టాస్ కీలకంగా మారింది. సాధారణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు.. కానీ ఇక్కడ మాత్రం టాస్ విన్ మ్యాచ్స్ లాగా తయారైంది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో అటు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇటు ఆసీస్ ఆరోన్ ఫించ్ ఇద్దరు టాస్ గెలిచి సగం మ్యాచ్ గెలిచారు. కానీ ఇది ప్రతీసారి జరగకపోవచ్చు. ఇక ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరిన సందర్భాల్లో ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుంది. కానీ న్యూజిలాండ్ తక్కువ అంచనా వేస్తే ఆసీస్‌కు ప్రమాదం. మొత్తానికి మ్యాచ్ మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Daryl Mitchell-Marcus Stoinis: 12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా 😅 #AUSvNZ #T20WorldCup pic.twitter.com/y1nRlWVQrD — Wasim Jaffer (@WasimJaffer14) November 13, 2021 -
Adam Zampa: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ...
T20 World Cup 2021- Adam Zampa Says He Has Always Been Underestimated: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడం జంపా. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆసీస్‌ను సెమీ ఫైనల్ చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదు పాకిస్తాన్‌తో కీలకమైన సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీసి ఆసీస్ తుదిపోరుకు అర్హత సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఆడేందుకు ఆడం జంపా సన్నద్ధమవుతున్నాడు. అయితే, ఈ మెగా ఈవెంట్లో ఆస్ట్రేలియాకు కీలకంగా మారి సత్తా చాటుతున్న ఆడం జంపా.. తనను ఎల్లప్పుడూ తక్కువగానే అంచనా వేస్తానని అంటున్నాడు. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన తాను స్థానిక టీనేజర్లకు బౌలింగ్ చేస్తూ ప్రాక్టీసు చేశానని తెలిపాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెప్పుడూ అండర్‌ఎస్టిమేట్ చేస్తారనుకుంటాను. పదిహేను, పదహారేళ్ల కుర్రాడిగా ఉన్ననాటి నుంచి... నా కంటే మెరుగ్గా బౌలింగ్ చేయగల వాళ్లు ఉన్నారని భావిస్తా. అంతెంతుకు ఈ టోర్నమెంట్ తర్వాత కూడా... మరో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనూ ఇలాగే జరుగుతుంది. తద్వారా నన్ను నేను మరింత మెరుగుపరచుకోగలను’’ అని జంపా చెప్పుకొచ్చాడు. ఇక తన బలాలు, బలహీనతలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి టీ20 వరల్డ్‌కప్‌లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సెమీస్ హీరో మార్కస్ స్టొయినిస్ ఆడం జంపా గురించి చెబుతూ... అతడిని అత్యంత నిజాయితీ గల ఆటగాడిగా అభివర్ణించాడు. పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. కాగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన జంపా.. కీలకమైన బాబర్ ఆజమ్ వికెట్ తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు.. టీమిండియాను ఓడిస్తేనే -
పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు
New Zeland May Not Become No1 In T20s After Winning T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో నవంబర్ 14న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ సూపర్ ఫామ్‌లో ఉంది. ఎంతలా అంటే అటు వన్డేల్లో.. ఇటు టెస్టుల్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇక టి20ల్లో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ టి20ల్లోనూ నెంబర్ వన్ అయితే అన్ని ఫార్మాట్లలోనూ ఏకకాలంలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా కొత్త రికార్డు సృష్టిస్తుంది. అయితే పాపం న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ కొట్టినప్పటికీ నెంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం కష్టమే. చదవండి: Daryl Mitchell-Marcus Stoinis: 12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు ప్రస్తుతం ఇంగ్లండ్ 278 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 264 పాయింట్లతో టీమిండియా రెండో స్థానం.. 263 పాయింట్లతో పాకిస్తాన్ మూడోస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ 258 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఫైనల్లో ఓడించినప్పటికి 20 పాయింట్లు రావడం కష్టమే. కివీస్ కంటే ముందు టీమిండియా, పాకిస్తాన్‌లు ఉన్నాయి. ఒకవేళ విశ్వవిజేతగా నిలిస్తే కివీస్ వాటిని అధిగమించి రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. అయితే కివీస్ టి20ల్లో నెంబర్‌వన్ కావాలంటే టీమిండియాతో జరగనున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ గెలవాలని ఆశిస్తున్న భారత అభిమానులు.. టీమిండియాతో జరిగే టి20 సిరీస్‌లో మాత్రం కివీస్ ఓడిపోవాలని కోరుకోవడం విశేషం. ఇక నవంబర్ 17 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ జరగనుంది. చదవండి: Virender Sehwag: హసన్ అలీని తప్పుబడుతున్నారు.. మరి అఫ్రిది చేసిందేంటి -
12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా
Daryl Mitchell, Marcus Stoinis Played Same Team Before 12 Years.. టి20 ప్రపంచకప్ 2021 తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 14న జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టగా.. అటు ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడించి తుది సమరానికి సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ డారిల్ మిచెల్ హీరోగా నిలిస్తే.. ఇటు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో వేడ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్కస్ స్టోయినిస్ అంతే ప్రముఖపాత్ర పోషించాడు. చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. మిచెల్, స్టోయినిస్‌లు ఇద్దరు 12 ఏళ్ల క్రితం ఒక టోర్నీలో కలిసి ఆడారు. కలిసి ఆడడమే కాదు.. ఏకంగా కప్‌ను కూడా అందించారు. విషయంలోకి వెళితే 2009లో మిచెల్, స్టోయినిస్‌లు ప్రీమియర్‌షిప్ క్రికెట్ టోర్నీలో స్కార్బరో అనే టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. సెమీఫైనల్లో స్టోయినిస్ (189 పరుగులు ) సూపర్ శతకంతో మెరవడంతో స్కార్బరో ఫైనల్‌కు చేరింది. ఇక బేస్వాటర్-మోర్లీతో జరిగిన ఫైనల్లో డారిల్ మిచెల్ అనూహ్యంగా బౌలింగ్‌లో మెరిశాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. అలా ఈ ఇద్దరు కలసి స్కార్బరో కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా మిచెల్, స్టోయినిస్‌లు టి20 ప్రపంచకప్ ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడనుండడం ఆసక్తికరంగా మారింది. చదవండి: Gautam Gambhir: అనూహ్యంగా సిక్స్ కొట్టిన వార్నర్.. ‘అలా చేయడం నిజంగా సిగ్గు చేటు’ -
అభిమానులను ఉర్రూతలూగించిన సెమి ఫైనల్స్
-
హసన్ అలీని తప్పుబడుతున్నారు.. మరి అఫ్రిది చేసిందేంటి
Virender Sehwag Slams Pakistan Fans Criticize Hasan Ali.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్‌లో హసన్ అలీ హీరో నుంచి జీరో అయ్యాడు. మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన హసన్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లతో వేడ్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు. అలా జట్టు ఓటమికి హసన్ అలీనే కారణమంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి తోడూ మ్యాచ్ అనంతరం బాబర్ అజమ్ మాట్లాడుతూ.. '' హసన్ అలీ క్యాచ్ జారవిడవడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్'' అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో హసన్ అలీ పాకిస్తాన్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆసక్తి కలిగించింది. దీంతో హసన్ అలీకి పలువురు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు పెరుగుతూ వస్తుంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ ఓటమికి హసన్ అలీని తప్పుబట్టడంపై ఫేస్బుక్ వేదికగా స్పందించాడు. చదవండి: T20 World Cup 2021: మొన్న షమీ, కోహ్లి.. ఇప్పుడు హసన్ అలీ ''ఒక జట్టు కీలక మ్యాచ్‌లో ఓడిపోతే విమర్శలు రావడం సహజం. కానీ ఒక్క వ్యక్తినే తప్పుబడుతూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి చెందడం వెనుక హసన్ అలీ ఒక్కడే కారణం కాదు. అతను మాథ్యూ వేడ్ క్యాచ్‌ను డ్రాప్ చేసి ఉండొచ్చు.. మరి షాహిన్ అఫ్రిదిని తప్పుబట్టరా.. అతను పొదుపుగా బౌలింగ్ చేసి సిక్సర్లు ఇవ్వకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇక్కడ పాక్ అభిమానులు ఒకే కోణంలో ఆలోచిస్తూ అసలు విషయాన్ని వదిలేసి హసన్ అలీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. మొన్న న్యూజిలాండ్‌కు డారిల్ మిచెల్ ఎలాగో.. నిన్న మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ అలాగే కనిపించాడు. అతను జట్టును ఎలా ఫైనల్ చేర్చాడో.. వేడ్ కూడా అలానే చేర్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు -
ఆమె భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సానియా మీర్జాపై నెటిజన్ల ఆగ్రహం
Sania Mirza Faces Backlash on Twitter For Supporting Pakistan: టీ20 ప్రపంచకప్2021లో పాకిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ టోర్నమెంట్లో ఒక్క ఓటమి కూడా ఎరగని పాకిస్తాన్.. ఆస్ట్రేలియాతో గురువారం( నవంబర్11) జరిగిన రెండో సెమీఫైనల్లో అనుహ్యంగా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని సపోర్ట్ చేయడానికి స్టేడియం వెళ్లిన సానియా మీర్జాపై నెటజన్లు మండిపడుతున్నారు. ఆమె భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేయాలని, అంతేగాక ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (ఉపా) కేసు పెట్టి దేశ పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు చప్పట్లు కొడుతూ మద్దతు పలికింది. కాగా..సానియా మీర్జా వివాదాలకు గురి కావటం..ట్రోలింగ్ కు గురి కావటం కూడా కొత్తేమీ కాదు. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లోను షోయబ్ మాలిక్ సిక్సర్లు కొడుతుంటే..స్టాండ్స్‌లో కూర్చుని సానియా మీర్జా చప్పట్లు కొడుతూ కనిపించింది. అప్పుడు కూడా ఆమె ట్రోల్స్‌కు గురైంది. మరో వైపు పాక్ పేసర్ హసన్ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. చదవండి: అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..! -
రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన వీవీఎస్ లక్ష్మణ్..
VVS Laxman lauds Mohammad Rizwan for playing semi final clash: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గురువారం(నవంబర్11)న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసినప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్రశంసించాడు. ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణగా రిజ్వాన్‌ను అతడు అభివర్ణించాడు. తన ఆరోగ్యం కంటే తన జాతీయ జట్టుకు ఆడటానికి రిజ్వాన్ ఎక్కువ ప్రాధన్యత ఇచ్చాడు అని లక్ష్మణ్ కొనియాడాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లూ కారణంగా వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ... ‘‘నవంబరు 9న మహ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు’’ అని తెలిపాడు. అయితే జట్టులోకి వచ్చిన మహ్మద్ రిజ్వాన్.. రెండో సెమిఫైనల్లో 67 పరుగులు చేసి పాకిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. "ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణ రిజ్వాన్. ఈ మ్యాచ్‌లో తన జట్టు గెలిచి ఉండకపోవచ్చు. కానీ రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న రిజ్వాన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు అతడి నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవలసినది చాలా ఉంది'అని ట్విటర్ లో లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. చదవండి: IND vs NZ Test Series: కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు -
రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
Many Similarities In Two Semi Finals Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నవంబర్ 11న జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు రోజు(నవంబర్ 10) న్యూజిలాండ్ సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి.. దిగి పటిష్ట ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది సమరానికి అర్హత సాధించింది. అయితే, 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సెమీ ఫైనల్స్‌లో కొన్ని ఆసక్తికర పోలికలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు మ్యాచ్‌లు రెండు వేర్వేరు నగరాల్లో జరిగినా.. అందులో చాలా విషయాలు యాదృచ్ఛికంగా ఒకేలా ఉన్నాయి. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో ఆసీస్ ఇదే మార్జిన్(5 వికెట్ల తేడా)తో పాక్‌పై విజయం సాధించింది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ ఓ ఓవర్ ముందుగా లక్ష్యాన్ని(167 పరుగులు) ఛేదించగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా కూడా పాక్‌పై ఇదే తరహా(19 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది)లో విజయం సాధించింది. రెండు సెమీ ఫైనల్స్‌లో కివీస్, ఆసీస్ జట్లు చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు మ్యాచ్‌ల్లో కివీస్, ఆసీస్ జట్లకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా.. మరో ఓవర్ మిగిలుండగానే ఇరు జట్లు టార్గెట్‌ను చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్ 14న జరిగే తుది సమరంలో ఆసీస్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు. చదవండి: T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు -
హమ్మయ్య.. మొత్తానికి గంభీర్ కల నెరవేరింది
Guatam Gambhir Prediction Successfull First Time.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే మ్యాచ్‌కు ముందు మాజీ ఆటగాళ్లు ఎవరు ఫెవరెట్ అని చెప్పడం చూస్తుంటాం. కొన్నిసార్లు వారి అంచనాలు నిజమైతే.. మరికొన్నిసార్లు తప్పాయి. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేసిన ప్రతీసారి అతనికి ఎదురుదెబ్బే తగిలింది. చదవండి: ఆ క్యాచ్ వదిలేయడం మా కొంప ముంచింది.. ఒక్క చిన్న తప్పు టీమిండియా- పాకిస్తాన్, న్యూజిలాండ్- టీమిండియా, పాకిస్తాన్-న్యూజిలాండ్, ఇక తొలి సెమీఫైనల్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్.. ఇలా ఏది చూసుకున్నా అతను గెలుస్తుందని చెప్పిన ప్రతీ టీమ్ ఓడిపోతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం గంభీర్ కల నెరవేరింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తుందని.. ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని గంభీర్ అంచనా వేశాడు. అతను అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో అభిమానులు గంభీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మొత్తానికి గంభీర్ అనుకున్నది సాధించాడు.. ఆర్య సినిమాలో బన్నీ క్లైమాక్స్‌లో తన లవ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది కోక్ బాటిల్లో రాయి వేసి పరీక్షించినట్టుగా గంభీర్‌లా మార్పింగ్ చేసి పెట్టిన ఫోటో తెగ వైరల్ అవుతుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: వార్నరా మజాకా.. డెడ్ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు -
Aus Vs Pak: అందుకే వార్నర్ రివ్యూకు వెళ్లలేదు: మాథ్యూ వేడ్
Matthew Wade Explains Why Warner Didn't Review His Dismissal Against Pakistan: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ అద్భుతమే చేశారు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్లో వరుసగా 40, 41 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా 19వ ఓవర్లో వేడ్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. ఒకవేళ వేడ్ గనుక మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించే అవకాశం తృటిలో మిస్ చేసుకున్నాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే, వార్నర్ అవుట్ అయిన విధానం.. అందునా అతడు రివ్యూకు వెళ్లకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ అవుటైన తర్వాత 49 పరుగులతో క్రీజులో ఉన్న వార్నర్.. షాబాద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేయగా.. కీపర్ రిజ్వాన్ చేతిలో పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ అప్పీల్‌కు వెళ్లగా అంపైర్ అవుట్‌గా తేల్చాడు. కానీ.. అల్ట్రాఎడ్జ్‌లో మాత్రం బ్యాట్‌కు బంతి ఎక్కడా తగలినట్లు కనిపించలేదు. దీంతో వార్నర్ రివ్యూకు వెళ్లకుండా తప్పుచేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వేడ్ మాట్లాడుతూ... ‘‘ఈ విషయం గురించి మాట్లాడుకునేందుకు ఎక్కువగా సమయం దొరకలేదు. వార్నర్ కూడా కాన్ఫిడెంట్‌గా లేడు. తన బ్యాట్ బంతిని తాకిందో లేదో అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే, నాన్ స్ట్రైక్‌లో ఉన్న గ్లెన్ (మాక్స్వెల్) మాత్రం శబ్దం విన్నాడట. అయితే, తను కూడా ఎటూ చెప్పలేకపోయాడు. అది నిజంగా కఠిన సమయం’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: AUS Vs NZ: ఆసీస్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. ఇక కష్టమే -
T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు
Hasan Ali Trolled For Dropping Matthew Wade Catch: టీ20 ప్రపంచకప్-2021 సూపర్-12లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి, అజేయ జట్టుగా సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్‌కు నవంబర్ 10న ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో శృంగ భంగమైంది. పాక్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కూడా ఆఖరి వరకు పాక్‌కు తిరుగులేదనిపించినా.. హసన్ అలీ చేసిన ఒకే ఒక్క పొరపాటు పాక్ కొంపముంచింది. షాహీన్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ జారవిడిచాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదిన వేడ్.. మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. #Pakistan lost due to bad efforts by #HasanAli(@RealHa55an) on the field. He not only led #BabarAzam down but whole of Pakistan. it smells #fixing because he married an #Indian Samiya Arzoo.#T20WorldCup #PAKVSAUS #shaheenafridi #ImranKhan pic.twitter.com/4aszB900ZR — Rizwan Ahmad (@Rizwan_2Ahmad) November 12, 2021 ఈ నేపథ్యంలో హసన్ అలీ.. గతంలో(పాక్ చేతిలో భారత్ ఓడిన సందర్భంగా) టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ షమీ, విరాట్ కోహ్లిల మాదరే దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ట్రోలింగ్ మరింత శృతి మించిపోయింది. పాక్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ అభిమానులు.. భారతీయురాలైన హసన్ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. Well done RAW Agent Samiya Arzoo👏👏 #HasanAli pic.twitter.com/d6fDAMrUo7 — AgentVinod (@AgentVinod03) November 11, 2021 మరోవైపు, హసన్ ఆలీ కీలక సమయంలో క్యాచ్ డ్రాప్ చేయడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని స్వయానా పాక్ కెప్టెనే అభిప్రాయపడడంతో జట్టు సభ్యులెవరూ అతనికి మద్దతుగా నిలిచే ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే, హసన్ అలీపై జరుగుతున్న ఈ ఆన్లైన్ దాడిని భారత నెటిజన్లు మాత్రం ఖండిస్తున్నారు. హసన్ ఆలీకి భరోసా ఇస్తూ ‘IND stand with Hasan Ali’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా, భారత్‌కు చెందిన సమీయా అర్జోని హసన్ అలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమీయా అర్జోతో పాటు సెమీస్‌లో ఒక్క పరుగుకే ఔటైన షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాను సైతం పాక్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. Pakistani fans waiting for Hassan Ali back home #PAKvAUS pic.twitter.com/NgcavqXcVq — Farzan Tufail 🇵🇸 (@Farzantufail786) November 11, 2021 చదవండి: ఆసీస్‌తో కీలకపోరుకు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. ఫైనల్లో ఇక కష్టమే -
T20 World Cup: బిల్డప్ ఎక్కడికి పోయింది బాస్!
దుబాయ్: ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో మ్యాచ్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచింది షాహిన్ అఫ్రిది. భారత్‌ను ఆదిలోనే కోలుకోలేని దెబ్బకొట్టడంతో షాహిన్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఎక్కడ చూసినా షాహిన్.. షాహిన్. ఇది హోరు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కూడా షాహిన్ అఫ్రిది ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. మనోడు కూడా ఎక్కడా తగ్గేది లే అన్నట్లు వరుసగా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చుకుంటూ పోయాడు. అది చూసిన భారత ఫ్యాన్స్ బిల్డప్ కాస్త ఎక్కువైందనే చమత్కరించుకున్నారు. ఇప్పుడు ఆ బిల్డప్ ఎక్కడికో పోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కావాలా షాహిన్ ఆటోగ్రాఫ్‌లు అంటూ జోక్స్ వేస్తున్నారు. ఇందుకు కారణం ఆసీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచే. అది కూడా కేవలం ఒక్క ఓవర్‌తోనే అప్పటివరకూ హీరోగా నిలిచిన షాహిన్.. విలన్ అయిపోయాడు. పొగిడిన నోళ్లే.. ఏమి బౌలింగ్ అంటూ నోరు పారేసుకున్నారు. హీరోగారి బిల్డప్ ఎక్కడికి పోయిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన షాహిన్.. 31 పరుగులిచ్చి 3 మూడు వికెట్లు తీశాడు. అవి కూడా రోహిత్, రాహుల్, కోహ్లిలు వికెట్లు కావడంతో షాహిన్ పేరు మార్మోగిపోయింది. మరి ఆసీస్‌తో మ్యాచ్‌లో షాహిన్ బౌలింగ్ గణాంకాలు బాగానే ఉన్నాయి. నాలుగు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చిన వికెట్ మాత్రమే తీశాడు. తన ఆఖరి ఓవర్(మ్యాచ్‌కు చివరి ఓవర్) ముందు వరకూ 13 పరుగులే ఇచ్చాడు షాహిన్. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ మాథ్యూవేడ్..షాహిన్ వేసిన ఆఖరి ఓవర్ మూడో బంతికి బతికి బయటపడటంతో ఆపై మ్యాచ్ స్వరూపమే మారింది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఏమిటో మరొకసారి నిజం చేశాడు వేడ్. ఆసీస్‌కు ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయిన తరుణంలో వేడ్ వరుసగా కొట్టిన సిక్స్‌లు మ్యాచ్ స్థితిని మొత్తం మార్చేశాయి. షాహిన్ వేయడం వేడ్ సిక్సర్ల మోత మోగించడం చకచకా జరిగిపోయాయి. అసలు ఏమౌతుందో తెలుసుకునే లోపే మ్యాచ్ ముగిసి కంగారులు ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయం కాగా, పాక్ ఆటగాళ్లు తలపై చేతులు పెట్టుకుని గ్రౌండ్లో కూలబడిపోయారు. పాకిస్తాన్‌ను సెమీ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన అఫ్రిదిని సెమీస్ తర్వాత ఏమనాలో ఆ జట్టుకు అంతుబట్టలేదు. అభిమానులు మాత్రం షాహిన్‌ను ఆడేసుకుంటున్నారు. ఏం బాస్.. మొత్తం మీద సెమీస్‌కు చేరడానికి, సెమీస్ నుంచి వైదొలగడానికి కారణం అయ్యావ్.. ఏం చేస్తాం.. టైమ్ బాలేనట్లు ఉంది.. నెక్స్టైమ్ బెటర్ లక్ అంటూ ఆటపట్టిస్తున్నారు. చదవండి: T20 World Cup 2021: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా -
AUS Vs NZ: ఆసీస్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. ఇక కష్టమే!
New Zealands Devon Conway Out Of T20 World Cup Final: టీ20 ప్రపంచకప్- 2021 తుది ఘట్టానికి చేరుకుంది. నవంబర్-14న దుబాయ్ వేదికగా ఫైనల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కాగా ఆస్ట్రేలియాతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ కీలక పోరుకు దూరమయ్యాడు. నవంబర్10న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమిఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కొంత అసహనానికి గురైన కాన్వే.. చేతితో బ్యాట్‌ను గట్టిగా గుద్దాడు. దీంతో అతడి కుడి చేతి ఎముక విరిగింది. దీంతో కాన్వే ఆస్ట్రేలియాతో ఫైనల్, భారత పర్యటనకు దూరమయ్యాడు. దీనిపై స్పందించిన న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లడూతూ.. కాన్వే ఫైనల్మ్యాచ్కు అందు బాటులో లేకపోవడంపై నేను చాలా నిరాశ చెందుతున్నాను. ఆదే విధంగా కాన్వే కూడా ఫైనల్లో ఆడకపోవడంపై చాలా భాదపడుతున్నాడు. కాన్వే ఎప్పుడూ న్యూజిలాండ్ తరపున ఆడటాన్ని గౌరవంగా భావిస్తాడు. ఈ సమయంలో మేము అందరం అతడి వెంటే ఉంటాం. కాన్వే ఒక అద్బుతమైన ఆటగాడు, అతడు ఔటయ్యాక అలా చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించకుకోవలసి వచ్చింది. కాన్వే త్వరగా కోలుకుని జట్టులో తిరిగి చేరాలని నేను కోరుకుంటున్నాను అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021 Final: ఇంటర్వెల్ వరకు ఫేవరెట్లు.. ఆఖర్లో ప్రేక్షకులు మరి..అంతేగా అంతేగా!! -
వార్నరా మజాకా.. డెడ్ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు, ఏకంగా 9 పరుగులు రాబట్టాడు
Warner Hits Six To A Dead Ball Bowled By Mohammad Hafeez: రసవత్తరంగా సాగిన టీ20 ప్రపంచకప్-2021 రెండో సెమీ ఫైనల్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు ), మార్కస్ స్టోయినిస్(31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆసీస్.. నవంబర్ 14న జరిగే తుది సమరంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు. pic.twitter.com/anZk8VjP3X — Shaun (@ShaunakCric) November 11, 2021 ఇదిలా ఉంటే, పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ బౌల్ చేసిన మహ్మద్ హఫీజ్.. తొలి బంతిని డెడ్ బాల్‌గా విసిరాడు. రెండు సార్లు బౌన్స్ అయిన ఈ బంతిని వార్నర్ భారీ సిక్సర్‌గా మలిచడంతో అందరూ అవాక్కయ్యారు. ఇది చూసి షాక్‌లో ఉండిపోయిన బాబర్ సేనకు అంపైర్ మరో షాకిచ్చాడు. ఈ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించగా, ఆసీస్‌కు ఫ్రీ హిట్ లభించింది. అయితే, ఆ తర్వాత బంతిని హాఫీజ్ కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో వార్నర్ దెబ్బకు ఒకే బంతికి 9 పరుగులు వచ్చాయి. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. చదవండి: Aus Vs Pak: ఛాతిలో ఇన్ఫెక్షన్.. రెండు రోజులు ఐసీయూలో.. రిజ్వాన్‌పై ప్రశంసలు -
T20 WC 2021 Final: ఇంటర్వెల్ వరకు ఫేవరెట్లు.. ఆఖర్లో ప్రేక్షకులు.. నేల మీదకు రండి!
T20 World Cup 2021: Wasim Jaffer Shares Funny Memes About Final Goes Viral: పాకిస్తాన్‌పై మెరుపు ఇన్నింగ్స్‌తో అద్భుత విజయం సాధించి టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్‌కు దూసుకువెళ్లింది ఆస్ట్రేలియా. గ్రూపు-2లో ఐదుకు ఐదు మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా నిలిచిన బాబర్ ఆజమ్ బృందాన్ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్ గెలుపునకు ఒక అడుగు దూరంలో నిలిచింది. నవంబరు 11 నాటి రెండో సెమీ ఫైనల్లో మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఫైనల్‌కు చేర్చారు. మరోవైపు.. తొలి సెమీ ఫైనల్లో భాగంగా గ్రూపు-1 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించి తుదిపోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మోర్గాన్ బృందంపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా పొట్టి ఫార్మాట్ ఫైనల్‌కు చేరి తమ కలను నెరవేర్చుకుంది. ఇలా ఇరు గ్రూపుల టాపర్లకు కివీస్, ఆస్ట్రేలియాలు షాకిచ్చి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. అదిరిపోయే మీమ్‌తో ఇంగ్లండ్, పాకిస్తాన్‌కు కౌంటర్ వేశాడు. దీవానా మస్తానా(తెలుగులో అల్లరి నరేశ్- శర్వానంద్ సినిమా నువ్వా నేనా) క్లైమాక్స్‌ను ప్రతిబింబించే ఫొటోను షేర్ చేసిన వసీం జాఫర్... ‘‘ఐసీసీ ఈవెంట్లలో ఈ వరల్డ్‌కప్ దీవానా మస్తానాలా మారింది. ఇంటర్వెల్ వరకు ఫేవరెట్లుగా ఉన్న వాళ్లు... ఆఖర్లో ప్రేక్షకులుగా మిగిలిపోతారు మరి’’ అంటూ కామెంట్ చేశాడు. కాగా దీవానా మస్తానా సినిమాలో అనిల్ కపూర్, గోవిందా జూహీ చావ్లాతో స్నేహం చేస్తూ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. అయితే, వాళ్లతో కేవలం ఫ్రెండ్షిప్ వరకే పరిమితమైన హీరోయిన్.. ఆఖరికి సల్మాన్ ఖాన్‌ను పరిచయం చేసి.. అతడితో తన పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టాల్సిందిగా కోరుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి ఫేవరెట్లుగా భావించిన ఇంగ్లండ్, పాకిస్తాన్‌ను ఉద్దేశించి... ఈ సీన్‌కు అన్వయిస్తూ వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. రెండో సెమీ ఫైనల్ ఫలితాన్ని ఉద్దేశించి.. ‘‘ఇప్పటికే నేల మీదకు దిగి వస్తారా’’ అంటూ పాకిస్తాన్ జట్టు గురించి కామెంట్లు చేస్తున్నారు. This World Cup has been the 'Deewana Mastana' of ICC events 😂 The favourites at intermission ended up as spectators for climax 😛#AUSvPAK #AusvNZ #T20WorldCup pic.twitter.com/PdUhcXM5lA — Wasim Jaffer (@WasimJaffer14) November 12, 2021 -
Aus Vs Pak: ఛాతిలో ఇన్ఫెక్షన్.. రెండు రోజులు ఐసీయూలో.. రిజ్వాన్‌పై ప్రశంసలు
Shoaib Akhtar Praises Mohammad Rizwan For Playing T20 Semis With Severe Chest Infection: పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నా.. దేశం కోసం ఆడటం గొప్ప విషయం అన్నాడు. రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న వ్యక్తి.. మైదానంలోకి వచ్చి అద్భుత ప్రదర్శన కనబరిచిన తీరు అతడిపై గౌరవాన్ని మరింత పెంచిందని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనారోగ్య కారణాల దృష్ట్యా వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రిజ్వాన్ ఫ్లూ కారణంగా బాధ పడుతున్నాడన్న విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ... ‘‘నవంబరు 9న మహ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు’’ అని తెలిపాడు. ఇక దుబాయ్ వేదికగా ఆసీస్‌తో మ్యాచ్‌లో రిజ్వాన్ అందుబాటులోకి రావడమే కాదు.. 67 పరుగులతో రాణించి పాకిస్తాన్ మంచి స్కోరు(176) సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అనుకున్నారంతా! కానీ.. షోయబ్ అక్తర్ షేర్ చేసిన ఓ ఫొటో మాత్రం 29 ఏళ్ల రిజ్వాన్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఆస్పత్రి బెడ్‌పై ఎంతటి దీన స్థితిలో ఉన్నాడోనన్న విషయాన్ని కళ్లకు కట్టింది. ‘‘ఈరోజు ఈ వ్యక్తి దేశం కోసం ఆడటమే కాదు.. అత్యుత్తమంగా రాణించాడంటే మనం ఊహించగలమా! గత రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు! రిజ్వాన్ పట్ల గౌరవభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది’’ అని అక్తర్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు అభిమానులు రిజ్వాన్ అంకితభావంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ ఫొటో నిజమేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నాకు. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: Pakistan Defeat Reasons: ఆ క్యాచ్ వదిలేయడం మా కొంప ముంచింది.. ఒక్క చిన్న తప్పు.. భారీ మూల్యం View this post on Instagram A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar) Mohammad Rizwan spent 2 nights in ICU 😳😳pic.twitter.com/6kaNl0Bmrn — Thakur (@hassam_sajjad) November 11, 2021