
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో సెమీస్ అవకాశాలు కోల్పోయిన తర్వాత భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజేతగా నిలిచి టోర్నీని ముగించింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గింది. ముందుగా నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (3/16), అశ్విన్ (3/20) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 136 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 56; 7 ఫోర్, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. గ్రూప్–2లో భారత జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి, రెండింటిలో ఓడి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
కోహ్లి నాయకత్వం ముగిసె...
ప్రపంచకప్ తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పిన విరాట్ కోహ్లికి భారత సారథిగా ఇదే చివరి మ్యాచ్. భారత్ జట్టుకు కోహ్లి 50 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహ రించాడు. కోహ్లి సారథ్యంలో భారత్ 30 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌లు ‘టై’ కాగా, మరో రెండు రద్దయ్యాయి. మరోవైపు కోచింగ్ బృందం సభ్యులు రవిశాస్త్రి, భరత్ అరుణ్, శ్రీధర్‌లకు కూడా ఇదే ఆఖరి టోర్నీ.
స్కోరు వివరాలు
నమీబియా ఇన్నింగ్స్: బార్డ్ (ఎల్బీ) (బి) జడేజా 21; లింగన్ (సి) షమీ (బి) బుమ్రా 14; విలియమ్స్ (స్టంప్డ్) రిషభ్ పంత్ (బి) జడేజా 0; ఎరాస్మస్ (సి) రిషభ్ పంత్ (బి) అశ్విన్ 12; ఈటన్ (సి) రోహిత్ శర్మ (బి) అశ్విన్ 5; వీస్ (సి) రోహిత్ శర్మ (బి) బుమ్రా 26; స్మిత్ (సి) రోహిత్ శర్మ (బి) జడేజా 9; గ్రీన్ (బి) అశ్విన్ 0; ఫ్రైలింక్ (నాటౌట్) 15; ట్రంపుల్‌మాన్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–39, 4–47, 5–72, 6–93, 7–94; 8–117.
బౌలింగ్: మొహమ్మద్ షమీ 4–0–39–0, బుమ్రా 4–0–19–2, అశ్విన్ 4–0–20–3, రవీంద్ర జడేజా 4–0–16–3, రాహుల్ చహర్ 4–0–30–0.
భారత్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 54; రోహిత్ శర్మ (సి) గ్రీన్ (బి) ఫ్రైలింక్ 56; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 136. వికెట్ల పతనం: 1–86. బౌలింగ్: ట్రంపుల్‌మాన్ 3–0–26–0, వీస్ 2–0–18–0, స్కాల్ట్ 1–0–11–0, స్మిత్ 2–0–17–0, ఫ్రైలింక్ 2–0–19–1, ఈటన్ 4–0–31–0, లింగెన్ 1.2–0–13–0.
Comments
Please login to add a commentAdd a comment