KL Rahul Hails Virat Kohli As Great Leader.. టీమిండియా టి20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంపై ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. నమీబియాతో మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్ కోహ్లి నాయకత్వం గురించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషన్‌ల్‌గా రాసుకొచ్చాడు. '' ఈ ప్రపంచకప్‌లో మేం విఫలమయ్యాం.. అది కాస్త బాధ కలిగించింది. కానీ ఇక్కడ ఓడిపోవడం వల్ల చాలా నేర్చుకున్నాం. ఫ్యాన్స్ భావోద్వేగాలు ఎలా ఉంటాయో చూశాం.. మీ కోపానికి.. అభిమానానికి ధన్యవాదాలు. మేము మంచి క్రికెటర్లుగా ఎదగడంలో కోచ్‌గా రవిశాస్త్రి పాత్ర కీలకం.. ఒక కోచ్‌గా మమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు. ఇక విరాట్ కోహ్లి టి20 ప్రపంచకప్ సాధించడంలో ఫెయిల్ అయ్యిండొచ్చు.. కానీ నాయకుడిగా అతను విఫలం కాలేదు. కెప్టెన్సీ అనే పదానికి కోహ్లి ఒక ఉదాహరణ.. కెప్టెన్‌గా మమ్మల్ని ఎన్నోసార్లు ముందుండి నడిపించాడు. నా దృష్టిలో కెప్టెన్ అంటే కోహ్లినే..'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: IND vs NZ 2021: టి20 కెప్టెన్‌గా రోహిత్ .. తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్!?
ఇక టి20 కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ వన్డే, టెస్టుల్లో మాత్రం కోహ్లినే సారధిగా ఉంటాడు. అయితే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు మాత్రం కోహ్లి దూరంగా ఉండే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు తొలి టెస్టుకు కూడా దూరంగా ఉండాలని భావిస్తే కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ తొలి టెస్టుకు నాయకత్వం వహిస్తాడంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే టీమిండియాకు టెస్టుల్లో అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక న్యూజిలాండ్.. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 17, 19, 21వ తేదీల్లో టీమిండియాతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఇరుజట్ల మధ్య నవంబర్ 25-29 వరకు కాన్పూర్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.
చదవండి: Sehwag: కెప్టెన్‌గా రోహిత్ సరే.. వైస్ కెప్టెన్‌గా రాహుల్, పంత్‌ల కంటే అతనైతేనే బెటర్..!
Comments
Please login to add a commentAdd a comment