
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇవాళ 29వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్‌కు ఆటగాళ్లు సహా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక టి20 ప్రపంచకప్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. పాండ్యా తన పుట్టినరోజును టీమిండియా సభ్యుల సమక్షంలో జరుపుకున్నాడు.
ఇక బర్త్‌డే బాయ్‌తో కలిసి విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లు ఆస్ట్రేలియాని పెర్త్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యాలతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక టీమిండియా ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు వేడుకలపై స్పందించాడు. ''ఈరోజు నాకు స్పెషల్ డే. ఫ్యామిలీ మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. కానీ జట్టు సభ్యులు నా పుట్టినరోజును ఒక వేడుకలా చేసినందుకు కృతజ్ఞతలు. వారితో కలిసి ఇలా పెర్త్ వీధుల్లో చక్కర్లు కొట్టడం ఆనందం కలిగిస్తోంది'' అంటూ పేర్కొన్నాడు.
ఇక కోహ్లి పాండ్యా, కేఎల్ రాహెల్‌తో దిగిన ఫోటోనే కాకుండా మరొక ఫోటో కూడా షేర్ చేశాడు. ఆల్‌రౌండర్ దీపక్ హుడా, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్‌లతో కలిసి ఉన్న ఫోటోను కూడా కోహ్లి పంచుకున్నాడు. ''డే ఆఫ్ విత్ మై బాయ్స్(Boys)'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది.
The Indian trio in Perth. pic.twitter.com/20IfAawQ4f
— Johns. (@CricCrazyJohns) October 11, 2022
Birthday celebration of Hardik Pandya. pic.twitter.com/xLtZWUquDa
— Johns. (@CricCrazyJohns) October 11, 2022