Virat Kohli T20 Captaincy End With No T20 Wc Title.. టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి కోరిక తీరలేదు. టి20 ప్రపంచకప్ 2021 ముగిసిన తర్వాత కోహ్లి టి20 కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా కోహ్లికి ఇదే చివరిది కావడంతో ఎలాగైనా కప్ కొట్టాలని భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే టి20 కెప్టెన్‌గా కోహ్లి కథ ముగిసిపోయింది. బ్యాట్స్‌మన్‌గా సూపర్ సక్సెస్ అందుకున్న కోహ్లి కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ నుంచి మొదలుకొని.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్.. తాజాగా టి20 ప్రపంచకప్ వరకు కోహ్లికి కెప్టెన్‌గా కలిసిరాలేదనే చెప్పాలి.
చదవండి: Team India: ముందే గెలిస్తే బాగుండేది.. అయిపోయిందిగా
ఓవరాల్‌గా కోహ్లి టి20ల్లో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమిండియా 31 మ్యాచ్‌లు గెలిచి 16 ఓడిపోయింది. 63.27 శాతంతో కెప్టెన్‌గా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లికి ఎందుకో ఐసీసీ ఫార్మాట్‌లో మాత్రం దురదృష్టమే ఎదురవుతూ వస్తోంది. ఇక వన్డే, టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న కోహ్లి 2023 వన్డే వరల్డ్‌కప్ అయినా సాధిస్తాడా అనేది ప్రశార్నర్థకమే. ఎందుకంటే వన్డే కెప్టెన్సీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని.. రోహిత్‌కు వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి.. కోహ్లిని కేవలం టెస్టు కెప్టెన్‌గా పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.
ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఓడిపోవడంతో టీమిండియా సెమీస్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. సోమవారం నమీబియాతో జరగనున్న మ్యాచ్ కోహ్లికి టి20 కెప్టెన్‌గా ఆఖరిది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో దారుణ పరాభవాలు చూడడం టీమిండియా సెమీస్ అవకాశాలు దెబ్బతీసింది. కానీ ఆ తర్వాత అఫ్గాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలతో టీమిండియా ఆశలు రేపింది. అయితే కివీస్ టీమిండియా ఆశలపై నీళ్లు చల్లుతూ అఫ్గాన్‌పై కూల్‌గా విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
చదవండి: AFG Vs NZ: చేతులెత్తేసిన అఫ్గాన్.. టీమిండియా ఇంటికి
Comments
Please login to add a commentAdd a comment