Captaincy
-
శ్రీలంక కెప్టెన్సీకి హసరంగ రాజీనామా
కొలంబో: శ్రీలంక టి20 క్రికెట్ జట్టు కెపె్టన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్ స్పిన్నర్ హసరంగ ప్రకటించాడు. శ్రీలంక క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వివరించాడు. హసరంగ రాజీనామా నేపథ్యంలో ఈ నెలాఖరులో స్వదేశంలో భారత జట్టుతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో శ్రీలంక కొత్త కెపె్టన్ ఆధ్వర్యంలో ఆడుతుంది. గత నెలలో వెస్టిండీస్–అమెరికాలలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో హసరంగ నేతృత్వంలో ఆడిన శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేయగా, కోచ్ బాటనే కెపె్టన్ అనుసరించాడు. -
కెప్టెన్సీకి ధోని గుడ్‌బై సీఎస్కే కొత్త సారథిగా రుతురాజ్
చెన్నై: ‘కొత్త సీజన్లో కొత్త ‘పాత్ర’ పోషించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’... మార్చి 4న సోషల్ మీడియాలో ధోని పెట్టిన పోస్ట్ ఇది! ఆ కొత్త పాత్ర ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోయారు. కానీ మార్చి 21కి వచ్చేసరికే అదేంటో ధోని చూపించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. కెపె్టన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా అతను ఈ సీజన్ బరిలోకి దిగనున్నాడు. ధోని స్థానంలో జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. 42 ఏళ్ల ధోని 2008లో ఐపీఎల్ తొలి ఏడాది నుంచి చెన్నై కెపె్టన్‌గా వ్యవహరించాడు. మధ్యలో రెండేళ్లు జట్టు నిషేధానికి గురి కాగా... 2022 సీజన్లో రవీంద్ర జడేజా కెపె్టన్ అయ్యాడు. అయితే 8 మ్యాచ్‌ల తర్వాత తనవల్ల కాదంటూ జడేజా తప్పుకోవడంతో సీజన్ మధ్యలో మళ్లీ ధోని పగ్గాలు చేపట్టాడు. ఐపీఎల్లో అతను మొత్తం 212 మ్యాచ్‌లలో కెపె్టన్‌గా వ్యవహరించగా... 128 మ్యాచ్‌ల్లో గెలిచి, 82 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై 5సార్లు చాంపియన్ కావడంతో పాటు మరో 5సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో 23 చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అతను 2 టైటిల్స్ అందించాడు. 2023లో టైటిల్ గెలిచాక అదే ధోని ఆఖరి సీజన్ అనిపించింది. కెప్టెన్సీ కాకుండా ఆటగాడిగా అతని ప్రభావం దాదాపు శూన్యంగా మారింది. కానీ మోకాలి ఆపరేషన్ తర్వాత అతను మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అనుభవం లేకపోయినా... మహారాష్ట్రకు చెందిన రుతురాజ్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు. సీనియర్ స్థాయిలో కేవలం 16 టి20 మ్యాచుల్లోనే అతను కెపె్టన్‌గా వ్యవహరించి 10 విజయాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు అతనే కెపె్టన్. అయితే ఓపెనర్ రూపంలో భారీగా పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో అతను కీలకంగా మారాడు. 2020 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న రుతురాజ్ 52 మ్యాచ్‌లలో 135.52 స్ట్రయిక్‌రేట్‌తో 1797 పరుగులు సాధించాడు. రుతురాజ్ భారత్ తరఫున 6 వన్డేలు, 19 టి20లు ఆడాడు. 2022లో జడేజాను అనూహ్యంగా కెపె్టన్ చేయడంతో సమస్య వచ్చిందని, కానీ ఈసారి మార్పుకు తాము ముందే సిద్ధమయ్యామని సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించింది. -
‘రోహిత్ బ్యాటర్‌గా రాణించాలని కెప్టెన్సీ తప్పించాం’
ఐపీఎల్లో రోహిత్ శర్మ యథేచ్ఛగా పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ వివరించాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ జట్టు కోసం తప్పలేదు. రోహిత్ గత రెండు సీజన్లుగా జట్టును సమర్థంగా నడిపించాడు. ఇందులో సందేహం లేదు. కానీ పరుగులు చేయడంలో వెనుకబడ్డాడు. ఇప్పుడు అతను ఏ ఒత్తిడి లేకుండా తనకిష్టమైన ఓపెనింగ్ పాత్రలో మెరిపించేందుకు మా నిర్ణయం దోహదం చేస్తుంది’ అని బౌచర్ అన్నాడు. -
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం?
BBL 2024- Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పటికే జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మాక్సీ మెల్బోర్న్ స్టార్స్ నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు సీజన్లలో కెప్టెన్‌గా అదరగొట్టిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు పర్యాయాల్లో తొలుత మెల్బోర్న్ రెనెగేడ్స్.. తర్వాత సిడ్నీ సిక్సర్స్ చేతిలో మెల్బోర్న్ స్టార్స్ ఓడిపోయింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడి టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతర ఎడిషన్లలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన స్టార్స్.. బీబీఎల్ 12 సీజన్లో కెప్టెన్ మాక్స్వెల్ సేవలు కోల్పోయింది. కాలు విరిగిన కారణంగా మాక్సీ గతేడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా జరుగుతున్న పదమూడో ఎడిషన్‌తో తిరిగి జట్టుతో చేరాడు. ఈ క్రమంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 243 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. మాక్సీ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన మెల్బోర్న్ స్టార్స్.. తర్వాత కోలుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత పాత కథే పునరావృతమైంది. మరుసటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ఫైనల్ చేరే అవకాశాలు చేజార్చుకుంది మెల్బోర్న్ స్టార్స్. తద్వారా పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా నిరాశచెందిన మాక్స్వెల్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. కాగా ఐదేళ్లపాటు మెల్బోర్న్ స్టార్స్ సారథిగా కొనసాగిన గ్లెన్ మాక్స్వెల్.. 35 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అదే విధంగా అతడి ఖాతాలో 31 ఓటములు కూడా ఉన్నాయి. కాగా మాక్సీ స్టార్స్‌తో కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకోవాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడితో మరో రెండేళ్లు బంధం కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీబీఎల్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ఫైర్..!
-
'కమిన్స్ వస్తే బాగుండు'.. నాలుగో టెస్టుకు కూడా కెప్టెన్‌గా స్మిత్
టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫుల్ జోష్‌లో ఉంది. కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల రిత్యా స్వదేశానికి వెళ్లిపోవడంతో స్టీవ్ స్మిత్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్ సారధ్యంలో ఇండోర్‌లో ఆసీస్ తన ప్రదర్శనతో అదరగొట్టింది. టీమిండియా బ్యాటర్లను తమ స్పిన్ ఉచ్చులో బిగించి ముప్పతిప్పలు పెట్టింది. ఇక ఒకప్పుడు కెప్టెన్‌గా సక్సెస్ అయిన స్మిత్ తాజా విజయంతో మరోసారి తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. అయితే అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు కూడా స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. స్వదేశానికి వెళ్లిన పాట్ కమిన్స్ గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకవేళ కమిన్స్ తిరిగిరాకపోతే మాత్రం మరోసారి స్మిత్ జట్టును నడిపించనున్నాడు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. ''స్వదేశానికి వెళ్లిన కమిన్స్ ఇప్పటికే తిరిగి రాలేదు. అతని కుటుంబం ప్రస్తుతం సమస్యలో ఉంది. దానికోసమే అతను వెళ్లాడు. నాలుగో టెస్టు ప్రారంభం అయ్యేలోగా తిరిగి వస్తాడని అనుకుంటున్నాం.'' అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. అయితే మూడో టెస్టు విజయం అనంతరం స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నా టైం అయిపోయింది. మూడో టెస్టు వరకు మాత్రమే నేను జట్టు కెప్టెన్‌ను. ఇప్పడు ఇది పాట్ కమిన్స్ జట్టు. అతను లేని వారంలో జట్టు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. కానీ మ్యాచ్‌లో మా ప్రదర్శనతో దానిని అధిగమించాం. అతను తిరిగి వస్తాడని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరగనున్న నాలుగో టెస్టుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆస్ట్రేలియా మూడోటెస్టు విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. మ్యాచ్ గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడినా లేదా డ్రా చేసుకున్నా ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. చదవండి: 'చిన్నప్పుడు నువ్వు పెద్ద టార్చ్‌బేరర్..' కంటతడి పెట్టిన సానియా మీర్జా -
సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!?
ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇక ఈ సీజన్ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి చివరిది కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ధోని నేరుగా ప్రస్తావించనప్పటికి పరిస్థితి మాత్రం అలానే కనిపిస్తోంది. అయితే ధోనికి ఐపీఎల్ 15వ సీజన్ చివరిదని భావిస్తున్న అభిమానులకు మరొక షాకింగ్ న్యూస్. ధోని ఈ సీజన్లో కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగాలనుకుంటున్నట్లు సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలను వేరొకరికి అప్పజెప్పాలని ధోని అనుకుంటున్నాడు. మరి ధోని ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడో తెలుసా.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. ప్రస్తుతం స్టోక్స్ ఇంగ్లండ్‌కు టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని సారధ్యంలో ఇంగ్లీష్ జట్టుకు ఎదురులేకుండా పోయింది. దూకుడైన నిర్ణయాలు తీసుకుంటూ సంచలన విజయాలు సాధిస్తుంది. గతేడాది జరిగిన వేలంలో స్టోక్స్‌కు భారీ ధర పలికింది. అతడిని దక్కించుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. చివరకు రూ.16.25 కోట్లకు సీఎస్కే ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. అయితే స్టోక్స్ ఐర్లాండ్‌తో టెస్టు, యాషెస్ సిరీస్ కోసం టోర్నీ మధ్యలోనే వైదొలుగుతానని గతంలోనే పేర్కొన్నాడు. కానీ మనసు మార్చుకున్న స్టోక్స్ తాను ఐపీఎల్ 16వ సీజన్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ధోని తన మనసులోని మాటను బయటపెట్టినట్లు సమాచారం. స్టోక్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని.. తాను ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానంటూ సీఎస్కేకు వెల్లడించినట్లు తెలిసింది. ధోని నిర్ణయాన్ని సీఎస్కే ఏకీభవించాల్సిందే. ఎందుకంటే ధోని ముందు నుంచి సీఎస్కేలోనే కొనసాగుతున్నాడు. జట్టును నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. గతేడాది కూడా ధోని కెప్టెన్ బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆల్‌రౌండర్ జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే జడ్డూ కెప్టెన్సీ ఒత్తిడిలో పడిపోయి ఆటపై దృష్టి పెట్టలేకపోయాడు. దీనికి తోడు సీఎస్కేను వరుస ఓటములు పలకరించాయి. దీంతో జడేజా సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే మరోసారి ధోనినే ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న ధోని కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈసారి మాత్రం తాను ఆటగాడిగా మాత్రమే కొనసాగాలనుకుంటున్నాడు. బహుశా ఆఖరి సీజన్ అని ధోని భావిస్తున్నాడు కాబట్టే బ్యాటర్‌గా రాణించాలనుకుంటున్నాడని అభిమానులు పేర్కొన్నారు. అయితే ధోనికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చిన సీఎస్కే ఒక కండీషన్ పెట్టింది. ఒకవేళ సీఎస్కే ఫైనల్ చేరిన తర్వాత స్టోక్స్ స్వదేశానికి వెళ్లిపోతే జట్టును నడపించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ధోని కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ధోని కెప్టెన్‌గా కొనసాగుతాడా లేక కేవలం ఆటగాడిగానా అనేది ఐపీఎల్ ప్రారంభమయితే కానీ తెలియదు. చదవండి: ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర.. ధోని సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్ -
IND Vs ENG: రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఫైర్.. ఐపీఎల్ కెప్టెన్ అంటూ..
అడిలైడ్: ప్రపంచకప్ టీ20 సెమీఫైనల్లో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్ జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ పరాజయం చెందడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Pic 1: Rohit Sharma as India's captain Pic2: Rohit Sharma as MI captain #INDvsENG #INDvENG #Captaincy pic.twitter.com/pu4gA5L0Q9 — The Lost Guy (@TheLostGuy_) November 10, 2022 ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ ఐపీఎల్లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు. We missed you today 💔💔#INDvsENG#captaincy#MSDhoni pic.twitter.com/IoLs3SoCKq — Nadeem khan (@Nadeemlam) November 10, 2022 అదే సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తలచుకుంటున్నారు. అందరి కంటే ‘మిస్టర్ కూల్’ బెటరంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో #captaincy హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీమిండియా కెప్టెన్సీని స్వచ్చందంగా రోహిత్ వదులుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు. #INDvsENG Today every Indian feel this.. 🥺🥺#dhonikohli#MSDhoni#dhoni #captaincy #T20Iworldcup2022 pic.twitter.com/FqENEwq32a — Dashrath Dhaker Sukhwara (@Dashrath6537) November 10, 2022 ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లిని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆట పట్ల అతడి అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని గట్టిగా చెబుతున్నారు. బౌలింగ్ బలంగా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిందని కొంతమంది పేర్కొంటున్నారు. (క్లిక్: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే!) Every Indian cricket fan RN#T20Iworldcup2022 #captaincy#T20WorldCup 🙂 pic.twitter.com/Qh08CPnHvC — Vamshi Gandla (@Vamshi4uuu) November 10, 2022 If Rohit Sharma have some shame left within him, he will quit his #captaincy today itself. pic.twitter.com/q72LO2VrLS — Akshat (@AkshatOM10) November 10, 2022 -
ఆఫ్గన్ ఓటమి.. కెప్టెన్సీ పదవికి మహ్మద్ నబీ రాజీనామా
టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి మహ్మద్ నబీ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని నబీ శుక్రవారం స్వయంగా తన ట్విటర్లో పేర్కొన్నాడు. ''మా టి20 వరల్డ్‌కప్ ప్రయాణం నేటితో ముగిసింది. ప్రపంచకప్‌లో మాకు వచ్చిన ఫలితాలు మాకు కానీ, మా మద్దతు దారులకు కానీ నచ్చలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఒక సంవత్సరం నుంచి మా జట్టు సన్నద్ధత కెప్టెన్ కోరుకునే స్థాయికి లేదా పెద్ద టోర్నమెంట్‌కు అవసరమైన స్థాయిలో లేదు. పైగా, గత కొన్ని పర్యటనలలో జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ, నేను ఒకే పేజీలో లేము. ఇది జట్టు బ్యాలెన్స్‌పై ప్రభావాన్ని చూపింది. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంలో ఇదే సరైన సమయమని భావించా. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్కు తెలిపాను.కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి ఒక ఆటగాడిగా మాత్రం కంటిన్యూ అవుతాను. ఇన్నాళ్లు కెప్టెన్‌గా మద్దతు ఇచ్చిన జట్టు సహచరులతో పాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు దెబ్బతిన్నప్పటికి మాపై అభిమానంతో మైదానాలకు వచ్చిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నిజంగా మాకు చాలా ముఖ్యమైనది. లవ్ యూ అఫ్గానిస్తాన్ ''అంటూ ముగించాడు. ఇక మహ్మద్ నబీ కెప్టెన్‌గా ఎంపికయ్యాకా అఫ్గానిస్తాన్ గోల్డెన్ డేస్ చూసింది. అతని హహాంలోనే ఆఫ్గన్ జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి వచ్చింది. 2017లో ఆఫ్గన్ టెస్టు హోదా కూడా పొందింది. మొత్తంగా మహ్మద్ నబీ అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా 28 వన్డేలు, 35 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/oSpzXxMFGB — Mohammad Nabi (@MohammadNabi007) November 4, 2022 -
జడ్డూనే తప్పుకున్నాడా.. బలవంతంగా తప్పించారా?!
సీఎస్కే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపి రవీంద్ర జడేజా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో సీఎస్కే మేనేజ్మెంట్ జడేజాను కెప్టెన్‌గా నియమించింది. జడేజా కూడా కెప్టెన్సీ బాధ్యతలను సంతోషంగా తీసుకున్నాడు. ధోని పేరును నిలబెడతానని.. అతని నాయకత్వంలో నాలుగు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన సీఎస్కేను ఇకపై విజయవంతంగా నడిపిస్తానని.. అందుకు జట్టు సహకారం ఎంతో అవసరమని, ధోని లాంటి వ్యక్తి తోడుగా ఉండడం.. మేనేజ్మెంట్ నాపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని జడేజా గొప్పలకు పోయాడు. అయితే సరిగ్గా నాలుగు వారాలు తిరిగేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఈ సీజన్లో సీఎస్కే పెద్దగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన జడేజా ఆల్‌రౌండర్‌గాను నిరాశపరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏది చూసుకున్నా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్న జడేజా ఈ సీజన్లో 8 మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లో 121.73 స్ట్రయిక్ రేట్, 22.40 సగటుతో 112 పరుగులు మాత్రమే చేయగా... 42.60 సగటు, 8.19 ఎకానమీతో 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ ప్రభావం జడేజాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకునేలా చేసింది. Courtesy: IPL Twitter కెప్టెన్సీ భారం తనవల్ల కాదని.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే నాయకత్వ బాధ్యతలను ధోనికి అప్పగిస్తున్నట్లు జడ్డూ ప్రకటించాడు. కానీ ఇందులో వాస్తవమెంత అనేది ఆసక్తికరంగా మారింది. నిజంగా జడ్డూ స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా.. లేక మేనేజ్మెంట్ ఒత్తిడి చేయడంతో బలవంతంగా తప్పుకున్నాడా అనేది ప్రశ్నార్థకం. జట్టును సరిగ్గా నడిపించలేకపోతున్నాడనే అతన్ని కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించారని ఒక వర్గం అభిమానులు అభిప్రాయపడ్డారు. ధోని వారసత్వాన్ని నిలబెట్టడమనేది చిన్న విషయం కాదు. అతడు సారథిగా లేని చెన్నైని నడిపించడం కూడా ఆషామాషీ కాదు. కానీ మరీ సగం సీజన్లో ఇలా కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడంపై ప్రధానంగా జట్టు మేనేజ్మెంట్ ఒత్తిడి కారణమని తెలుస్తోంది. జడేజా లో లోపించింది అతడి ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు.. మేనేజ్మెంట్ అతడి మీద పెట్టుకున్న నమ్మకం. వరుసగా పరాజయాల బాట పట్టడంతో సీఎస్కే యాజమాన్యానికి సీన్ అర్థమైంది. ధోని వారసుడు కచ్చితంగా జడ్డూ అయితే కాదన్నది వాళ్లు ఓ ప్రాథమిక నిర్ధారణ కు వచ్చారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న సీఎస్కే.. ప్లేఆఫ్స్ కు చేరాలంటే తర్వాత జరుగబోయే 6 మ్యాచులను నెగ్గాల్సి ఉంది. అది కష్టమే..? అయినా జట్టు మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. జడ్డూ నుంచి సారథ్య బాధ్యతలను వీలైనంత త్వరగా ధోనికి అప్పజెప్పి నష్టాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే జడేజాను బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేసింది. Courtesy: IPL Twitter జడేజా నుంచి తిరిగి నాయకత్వ పగ్గాలు ధోని చేతికి వచ్చాయి. మరి ధోని మ్యాజిక్ తో సీఎస్కే ప్లేఆఫ్స్ చేరుతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి. ఇక ఆట మీద దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ అనూహ్య నిర్ణయం వల్ల అతనికి పెద్దగా ఒరిగేదేం లేదు.ఎందుకంటే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కే ప్లేఆఫ్ చేరాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంకో విషయమేంటంటే.. ధోనికి ఇదే చివరి సీజన్ అని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఒక్క సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను ధోని కెప్టెన్‌గా ఎలాగూ జట్టును నడిపిస్తాడు. కానీ వచ్చే సీజన్‌కు ధోని వారసుడి కోసం చెన్నై మళ్లీ జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో జట్టుగా కూడా సీఎస్కే విఫలమవుతూ వచ్చింది. గతేడాది ఓపెనర్ గా సూపర్ సక్సెస్ అయిన రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక ధోని గ్యాంగ్‌గా ముద్రపడ్డ అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీలు అడపా దడపా రాణించిందే తప్ప మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేదు. ఇక బౌలింగ్ లో డ్వేన్ బ్రావో తప్ప మిగిలిన వాళ్లెవరిలోనూ నిలకడ లేదు. వీటన్నింటికీ మించి వేలంలో చెన్నై దక్కించుకున్న రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లేకపోవడం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇది సీఎస్కే జట్టును మానసికంగా బాగా దెబ్బతీసింది. చదవండి: IPL 2022: జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్కే కొత్త కెప్టెన్ ఎవరంటే? Chahal- SuryaKumar: అంపైర్ ఔటివ్వలేదని అలిగాడు.. బుజ్జగించిన సూర్యకుమార్ -
జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్కే కొత్త కెప్టెన్ ఎవరంటే?
సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఐపీఎల్ 2022 సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.ఆ బాధ్యతలను ఎంఎస్ ధోనికి అప్పగిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని సీఎస్కే తన ట్విటర్లో ప్రకటించింది. దీంతో సీఎస్కే ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు ధోని కెప్టెన్సీ వహించనున్నాడు. ఇక సీజన్లో సీఎస్కే 8 మ్యాచ్‌లాడి రెండు గెలిచి.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ అవకాశాలు కష్టమే అయినప్పటికి ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలిస్తే సీఎస్కేకు అవకాశం ఉంటుంది. మరి గతంలో ధోని నాయకత్వంలోనే సీఎస్కే నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.కాగా సీజన్ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడంతో జడేజాను కెప్టెన్‌గా నియమించారు. కానీ కెప్టెన్సీ భారాన్ని జడేజా మోయలేకపోయాడని అర్థమవుతుంది. కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో జడ్డూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ తనవల్ల కాదంటూ ధోనికే ఆ బాధ్యతలు అప్పగించాడు. అయితే ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 📢 Official announcement! Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja — Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022 Ravi Jadeja hand over the captaincy of CSK to MS Dhoni. — Johns. (@CricCrazyJohns) April 30, 2022 -
'బాబుపై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా ఉంది.. తొలగిస్తే ఆడతాడేమో!'
ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన మయాంక్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. హార్ధిక్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన మయాంక్ మిడ్‌వికెట్ మీదుగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న రషీద్ ఖాన్ సులువుగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో మయాంక్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు తాజా దానితో కలిపి పంజాబ్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా మయాంక్ వరుసగా 32, 1, 4, 5 పరుగులు చేశాడు. దీంతో కెప్టెన్సీ ప్రభావం అతన్ని దెబ్బతీస్తుందా అని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ''మయాంక్‌పై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా పడింది. ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. నాలుగు మ్యాచ్‌లు కలిపి 42 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా వస్తున్న మయాంక్‌కు ఇది సరిపోదు. గత సీజన్లో కనిపించిన మయాంక్ ఇప్పుడు కనబడడం లేదు. ఇలాగే ఉంటే అతను ఆటను మరిచిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించండి.. అప్పుడైనా ఆడతాడేమో'' అంటూ పేర్కొన్నాడు. కాగా గత సీజన్లో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉండడంతో మయాంక్ యథేచ్చగా బ్యాట్ ఝులిపించాడు. ఈసారి ధావన్‌కు కెప్టెన్సీ ఇస్తారనుకుంటే పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ మాత్రం మయాంక్‌పై నమ్మకంతో అతనికే పగ్గాలు అప్పజెప్పింది. చదవండి: IPL 2022: 'ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు!' మయాంక్ అగర్వాల్ ఔట్ వీడియో కోసం క్లిక్ చేయండి -
కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!
మరొక రోజులో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరలేవనుంది. ఇంతకముందు ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. దీంతో రెండు గ్రూఫులుగా విడదీసి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటికి అదనంగా కొత్త రూల్స్, 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతితో ఈసారి ఐపీఎల్ కన్నుల పండువగా జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఐపీఎల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి నలుగురు కొత్త కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -సాక్షి, వెబ్‌డెస్క్ వారే రవీంద్ర జడేజా,మయాంక్ అగర్వాల్, డుప్లెసిస్, హార్దిక్ పాండ్యా. వీరందరికి కెప్టెన్సీ కొత్తే. కత్తిమీద సాములాంటి కెప్టెన్సీని ఎలా డీల్ చేస్తారో.. వీరిలో ఎవరు కెప్టెన్‌గా మెయిడెన్ టైటిల్ కొట్టనున్నారో వేచిచూద్దాం. దానికి ముందు ఈ నలుగురి గురించి ఒకసారి తెలుసుకుందాం. రవీంద్ర జడేజా(సీఎస్కే కెప్టెన్) ఎంఎస్ ధోని అనూహ్య నిర్ణయంతో రవీంద్ర జడేజా ఆఖరి నిమిషంలో కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోని తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ధోనియే స్వయంగా ఆ బాధ్యతను జడేజాకు అప్పగించాడని.. ఇకపై జడ్డూనే జట్టును ముందుండి నడిపిస్తాడని సీఎస్కే ట్వీట్ చేసింది. అయితే జడేజాకు కెప్టెన్‌గా అనుభవం లేదు. తన 13 ఏళ్ల కెరీర్లో జడేజా ఏనాడు ఒక్క మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించలేదు. మరి అనుభవం లేని జడేజా సీఎస్కే ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. పైగా లీగ్ ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా సీఎస్కేకు పేరు ఉంది. ఇక ఐపీఎల్లో ధోని కెప్టెన్సీ రికార్డు అమోఘం. లీగ్ చరిత్రలోనే ఒక జట్టను అత్యధిక సార్లు ఫైనల్ తీసుకెళ్లిన కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. మరి అతని వారసత్వాన్ని జడేజా కొనసాగిస్తాడా.. లేక ఒక సీజన్‌కే కెప్టెన్‌గా పరిమితమవుతాడా అనేది చూడాలి. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో పెద్దన్న పాత్ర పోషించడం గ్యారంటీ. జడేజాకు సహాయం చేయడంలో ముందుంటాడు. ఈ విషయాన్ని జడేజా కూడా చెప్పాడు. ధోని భయ్యా నాకు ఒక లిగసీని సెట్ చేశాడు.. దానిని నేను ముందుకు తీసుకెళ్లాలి. కెప్టెన్సీ అనేది నాకు పెద్ద బాధ్యత.. కానీ ధోని భయ్యా ఉన్నాడుగా పర్లేదు అని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో జడేజా ప్రస్థానం రాజస్తాన్ రాయల్స్‌తో మొదలైనప్పటికి ఎక్కువకాలం ఆడింది మాత్రం సీఎస్కేకే. 2012 నుంచి సీఎస్కేలో ఉన్న జడేజా ఇప్పటివరకు ఐపీఎల్లో 200 మ్యాచ్‌లాడి 2386 పరుగులు చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్(ఆర్సీబీ కెప్టెన్) ఐపీఎల్లో అత్యంత దురదృష్టమైన జట్టుగా ఆర్సీబీకి పేరుంది. ప్రతీసారి మంచి అంచనాలతో బరిలోకి దిగే ఆర్సీబీ అసలు ఆటలో బోల్తా కొడుతుంది. పేపర్‌పై బలంగా కనిపించే ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ మెట్టుపై జారిపడింది. అలాంటి ఆర్సీబీకి కోహ్లి వెన్నుముక అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని లాగే కోహ్లి కూడా ఆరంభం నుంచి ఆర్సీబీ తరపునే ఆడాడు. 2013లో ఆర్సీబీ కెప్టెన్ అయిన కోహ్లి 9 ఏళ్ల పాటు జట్టును నడిపించాడు. ఈ తొమ్మిదేళ్లలో కోహ్లి నాయకత్వంలో ఆర్సీబీ ఒకసారి ఫైనల్ చేరుకోగా.. మరో మూడుసార్లు ప్లేఆఫ్ వరకు వచ్చింది. మిగతా ఐదుసార్లు లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే 2021 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే కోహ్లి తాను కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు.. వచ్చే సీజన్ నుంచి ఆటగాడిగా మాత్రమే ఉంటానని పేర్కొన్నాడు. దీంతో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. మెగావేలం ముగిసిన తర్వాత దినేష్ కార్తిక్, మ్యాక్స్‌వెల్ పేర్లు బాగా వినిపించినప్పటికి.. అనూహ్యంగా డుప్లెసిస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్ గెలవని ఆర్సీబీపై తీవ్ర ఒత్తిడి ఉంది. మరి ఆ ఒత్తిడిని డుప్లెసిస్ అధిగమించి ఆర్సీబీని విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్లో ధోని సారధ్యంలో సీఎస్కేకు ఆడిన డుప్లెసిస్ మంచి ప్రదర్శన కనబరిచాడు. పలుమార్లు తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎంత పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే పేరు ఐపీఎల్‌లోనూ దక్కించుకున్నాడు. ఇకపోతే డుప్లెసిస్‌కు కెప్టెన్సీ ఐపీఎల్లో కొత్త కావొచ్చు.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతను సౌతాఫ్రికాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇది అతనికి కలిసొచ్చే అంశం. తన హయాంలో సౌతాఫ్రికా కొన్ని మేజర్ సిరీస్‌ల్లో విజయాలు అందుకుంది. మరి అదే జోరును డుప్లెసిస్ ఐపీఎల్‌లోనూ కనబరుస్తాడని ఆశిద్దాం. ఆర్సీబీకి తొలి టైటిల్ అందించే కెప్టెన్‌గా డుప్లెసిస్ నిలుస్తాడేమో చూద్దాం. ఇక ఐపీఎల్లో డుప్లెసిస్ 100 మ్యాచ్‌ల్లో 2935 పరుగులు సాధించాడు. మయాంక్ అగర్వాల్(పంజాబ్ కింగ్స్ కెప్టెన్) ఐపీఎల్లో ఇంతవరకు టైటిల్ గెలవని మరో జట్టు పంజాబ్ కింగ్స్(గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్). ఎన్నోసార్లు కెప్టెన్లు మారినా జట్టు తలరాత మాత్రం మారలేదు. లీగ్ చరిత్రలో 2008లో ప్లే ఆఫ్, 2014 ఫైనల్ మినహా పంజాబ్ ఎప్పుడు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. గతేడాది సీజన్లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కేఎల్ రాహుల్ ఈసారి కొత్తగా వచ్చిన లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వెళ్లడంతో పంజాబ్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. కొన్నేళ్లుగా పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న మయాంక్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదగాడు. గత సీజన్లో మంచి ప్రదర్శన కనబరిచిన మయాంక్‌ను రూ. 12 కోట్లతో రిటైన్ చేసుకుంది. అతనిపై నమ్మకంతో ధావన్‌ను కాదని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంలో ధావన్ కూడా మయాంక్‌కే ఓటు వేశాడు. తనకంటే మయాంక్ సమర్ధుడని తెలిపాడు. అయితే మయాంక్‌కు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం పెద్దగా లేదు. మరి కొత్త కెప్టెన్‌గా మయాంక్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మయాంక్ ఐపీఎల్ కెరీర్ పరిశీలిస్తే.. 100 మ్యాచ్‌ల్లో 2131 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా(గుజరాత్ టైటాన్స్) అదృష్టం కొద్ది కెప్టెన్ అయిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా మాత్రమే. మెగావేలానికి ముందే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ హార్దిక్‌పై నమ్మకముంచి రూ. 15 కోట్లకు రిటైన్ చేసుకుంది. అసలు ఫామ్‌లో లేని ఆటగాడు ఇలా ఒక జట్టుకు కెప్టెన్ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. ముంబై ఇండియన్స్‌లో కొన్నేళ్ల పాటు కీలక ఆటగాడిగా ఉన్న పాండ్యా గతేడాది నుంచి సరైన ఫామ్‌లో లేడు. ఆల్‌రౌండర్ ట్యాగ్‌తో టి20 ప్రపంచకప్ ఆడినప్పటికి దారుణంగా నిరాశపరిచాడు. దీంతో టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి క్రికెట్ ఆడని హార్దిక్ కెప్టెన్‌గా నేరుగా ఐపీఎల్ ద్వారానే గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. అసలే దూకుడుకు మారుపేరుగా ఉండే హార్దిక్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు ఒక్క ఫార్మాట్లో కెప్టెన్ పాండ్యాకు అనుభవం లేదు. ఇక ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా 92 మ్యాచ్‌లాడి 1476 పరుగులతో పాటు బౌలింగ్‌లో 42 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ కర్ణ్ శర్మ.. అతను అడుగుపెడితే టైటిల్ నెగ్గాల్సిందే..! IPL 2022: చెలరేగిన డుప్లెసిస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..! -
ధోని ఎందుకీ నిర్ణయం.. కెప్టెన్‌గా ముగిస్తే బాగుండేది!
ఐపీఎల్ 2022 ప్రారంభానికి రెండో రోజుల ముందు టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని బాంబు పేల్చాడు. సీఎస్కే నాలుగుసార్లు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ధోని తాజాగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ధోని స్థానంలో జడేజా సీఎస్కేను నడిపించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం తన ట్విటర్లో ప్రకటించింది. అయితే ధోని ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగూ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి తలైవా కెప్టెన్‌గానే ఐపీఎల్‌ను ముగిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. టైటిల్ గెలిచినా.. గెలవకపోయినా ధోని కెప్టెన్‌గా ఉంటూనే సీఎస్కే యాక్టివ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ధోని ఈ సీజన్లో కేవలం ఆటగాడిగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాడని.. అందుకే జడేజాకు కెప్టెన్సీ ఇవ్వాలని ముందే అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టే.. ఐపీఎల్ మెగావేలానికి ముందు ధోనితో పాటు జడేజా, రుతురాజ్‌లను సీఎస్కే రిటైన్ చేసుకుంది. అయితే ధోని తనకు రూ. 15 కోట్లు వ్యర్థమని.. తన కంటే జడేజాకు ఎక్కువ ప్రైజ్ ఇవ్వడం శ్రేయస్కరమని స్వయంగా పేర్కొన్నాడు. దీంతో జడేజాకు రూ. 16 కోట్లు పెట్టి సీఎస్కే రిటైన్ చేసుకుంది. అలాగే ధోనికి కూడా రూ.12 కోట్లు పెట్టి తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. దీంతో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం కాదని దీన్నిబట్టే అర్థమవుతుంది. ఇక ధోని కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి.. సీఎస్కేలో ఆటగాడిగా.. అటు మెంటార్‌గా తన సలహాలు మాత్రం వస్తూనే ఉంటాయి. జడేజా ప్రత్యక్షంగా కెప్టెన్ అయినప్పటికి.. పరోక్షంగా మాత్రం ధోనినే నడిపిస్తాడనేది అందరికి తెలిసిన సత్యం. మరోవైపు జడేజా కూడా 2012 నుంచి సీఎస్కేతో పాటే ఉన్నాడు. ధోనికి అత్యంత నమ్మకమైన ఆటగాళ్లలో రైనా తర్వాత జడేజానే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఏరికోరి కెప్టెన్సీని అతడికే అప్పగించాడు. ఇక ఆరంభం నుంచి సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. నాలుగుసార్లు జట్టును చాంపియన్‌గా నిలపడంతో పాటు ఒక జట్టును ఎక్కువసార్లు ఫైనల్స్, ప్లే ఆఫ్ వరకు తీసుకెళ్లిన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో ధోని సారధ్యంలో సీఎస్కే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఇక మార్చి 26న కేకేఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరలేవనుంది. చదవండి: IPL 2022: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్సీకి గుడ్ బై.. కొత్త సారథి ఎవరంటే! 📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja — Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022 -
కెప్టెన్సీ విషయంలో నాన్చుడేంది.. అర్థం కాని ఆర్సీబీ వైఖరి
ఐపీఎల్ 15వ సీజన్‌కు ఇంకా 25 రోజులే మిగిలి ఉంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ మే 29 వరకు జరగనుంది. కాగా ఆర్సీబీ ఇంతవరకు జట్టు కెప్టెన్ ఎవరనేది ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అన్ని జట్లు తమ కెప్టెన్ ఎవరనేది దాదాపు ప్రకటించేశాయి. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి తదుపరి కెప్టెన్సీ ఎవరనే దానిపై ఆర్సీబీ నాన్చుతూనే వస్తుంది. మెగావేలానికి ముందు ఆర్సీబీ కోహ్లితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకుంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆర్సీబీ స్పందించలేదు. ఆ తర్వాత జరిగిన మెగావేలంలో ఆర్సీబీ డుప్లెసిస్, దినేష్ కార్తిక్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డుప్లెసిస్, దినేష్ కార్తిక్‌లకు గతంలో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. దీంతో ఈ ఇద్దరిలో ఆర్సీబీ ఎవరో ఒకరిని కెప్టెన్ చేస్తుందని అంతా భావించారు. ఈ విషయంలోనూ ఆర్సీబీ తన నిర్ణయాన్ని వెల్లడించకపోవడంతో అసలు ఫ్రాంచైజీ వైఖరి ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇక పాకిస్తాన్‌తో సిరీస్ ఉండడంతో మ్యాక్స్‌వెల్ ఆరంభ పోటీలకు దూరంగా ఉండనున్నాడు. దీంతో మ్యాక్సీ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్లే. ఇక కార్తిక్, డుప్లెసిస్‌లలో ఎవరో ఒకరు ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీసారి ఐపీఎల్లో మంచి అంచనాలతో బరిలోకి దిగే ఆర్సీబీ బరిలోకి దిగాకా నిరాశపరుస్తుంది. మరి ఈసారైనా ఐపీఎల్ కప్పు కొడుతుందో లేక మరోసారి చతికిలపడుతుందో చూడాలి. చదవండి: Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్ IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం -
ధావన్ కాదంట.. మయాంక్‌కే అవకాశం
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ అని ఊహాగానాలు వస్తున్నప్పటికి.. మయాంక్ అగర్వాల్‌వైపే ఫ్రాంచైజీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వేలానికి ముందే మయాంక్ అగర్వాల్‌తో(రూ.12 కోట్లు) పాటు అర్ష్‌దీప్ సింగ్(రూ. 4 కోట్లు)ను రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ మిగతా జట్టును మొత్తం రిలీజ్ చేసింది. గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈసారి వేలంలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ నడిచింది. ఇటీవలే ముగిసిన మెగావేలంలో శిఖర్ ధావన్‌ను రూ. 9.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ధావన్‌తో పాటు కగిసో రబాడ, జానీ బెయిర్ స్టో, రాహుల్ చహర్, లియామ్ లివింగ్ స్టోన్, షారుక్ ఖాన్ లాంటి పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ పేరు తప్ప మరో ఆటగాడు కనిపించలేదు. అయితే రిటైన్ చేసుకున్న మయాంక్‌కు కెప్టెన్సీ అప్పగించి వైస్ కెప్టెన్ బాధ్యతలు ధావన్‌కు అప్పగిస్తే ఎలా ఉంటుందనే యోచన చేసింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో మయాంక్‌కు కెప్టెన్సీ కట్టబెట్టనున్నారు. ఈ విషయాన్ని ఈ వారాంతంలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 2014లో ఫైనల్ మినహా మళ్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది లేదు. గత మూడు సీజన్ల నుంచి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కాగా ఈసారి సీజన్‌ను మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. చదవండి: 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? IND W- NZ W: హమ్మయ్య.. మొత్తానికి గెలిచింది -
‘ఆటగాడిగా ఎంతో చేయగలను’ కెప్టెన్సీ లేకపోవడంపై కోహ్లి వ్యాఖ్య
న్యూఢిల్లీ: అధికారికంగా తనకు కెప్టెన్ హోదా లేకపోయినా... జట్టు కోసం పని చేసేందుకు దాని అవసరం లేదని మాజీ సారథి విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ కాకపోయినా ఒక బ్యాటర్ గా, సీనియర్ ప్లేయర్‌గా తాను కీలక బాధ్యత పోషిస్తానని అన్నాడు. ఇకపై బ్యాటర్‌గా తాను మరిన్ని గొప్ప ప్రదర్శనలతో టీమిండియాకు విజయాలు అందిస్తానని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్సీ గురించి నేను ఇలా చేశానేమిటి అని చాలా మంది అనుకొని ఉండవచ్చు. అయితే నా దృష్టిలో ప్రతీదానికి సమయం ఉంటుంది. దాని గురించి మనకు తెలిసుండాలి. ఇక్కడి వరకు మన బాధ్యత పూర్తయినట్లుగా భావించి ముందుకు వెళ్లాలి. ఇకపై ఒక బ్యాటర్‌గా నేను జట్టుకు ఇంకా చాలా చేస్తానేమో. నాయకుడిలాగే ముందుండి నడిపించాలంటే కెప్టెనే కానవసరం లేదు’ అని ఈ స్టార్ బ్యాటర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎమ్మెస్ ధోని కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాడని... అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అలాంటి భావన ఏమీ రాకుండా అన్ని అంశాల్లో భాగమవుతూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవాడని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ‘అతడి నుంచి నేను కెప్టెన్సీ తీసుకోవడమనేది సహజ పరిణామమని, ఇది భారత జట్టుకు భవిష్యత్తులో మేలు చేస్తుందని ధోని భావించాడు. పరిస్థితులను అర్థం చేసుకొని సరైన సమయంలో తప్పుకోవడం కూడా నాయకత్వ లక్షణమే. అప్పటి వరకు ఒకేలా ఉన్న వాతావరణంలో కొంత మార్పు జరిగితే మంచిదే కదా. కొత్త తరహా ఆలోచనలతో కొత్తగా ఏదైనా చేయవచ్చు కూడా. ఎలాంటి బాధ్యతలకైనా సిద్ధంగా ఉండాలి’ అని కోహ్లి అన్నాడు. -
కోహ్లికి షోకాజ్ నోటీసులు.. స్పందించిన గంగూలీ
No Plan To Show Cause Virat Kohli Says Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలనుకున్నానని జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇవాళ స్పందించాడు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశాడు. అసలు కోహ్లికి నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనే తనకు లేదని వివరణ ఇచ్చాడు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై బీసీసీఐ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు, అతన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అడ్డుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై గంగూలీ స్పందించడంతో ప్రచారానికి తెరపడింది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. దీనిపై అప్పట్లో పెద్ద రాద్దాంతమే జరిగింది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లిని వారించామని బీసీసీఐ.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని కోహ్లి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాతావరణాన్ని హీటెక్కించారు. దీంతో కోహ్లి- బీసీసీఐ మధ్య పెద్ద అగాదం ఏర్పడిందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి.. టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో ఈ వార్తలు నిజమేనని బహిరంగ చర్చ కూడా సాగింది. ఇదే సమయంలో గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ! -
అప్పట్లో సచిన్, ఇప్పుడు కోహ్లి.. ఇద్దరినీ ఒకేలా..!
Kohli And Sachin Similarities: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లిల మధ్య చాలా పోలికలు ఉన్న విషయం తెలిసిందే. కెరీర్‌ను ఒకే విధంగా నిర్మించుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య పరుగులు, శతకాలు, రికార్డుల విషయంలోనే కాకుండా మరో ఆసక్తికర విషయంలోనూ పోలిక ఉంది. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆ అంశం తెరపైకి వచ్చింది. గతంలో(1997) సచిన్‌ను సారధ్య బాధ్యతల నుంచి అవమానకర రీతిలో ఎలా తొలగించారో.. అచ్చం అలానే కోహ్లి విషయంలోనూ జరిగింది. నాడు సచిన్‌కు సైతం చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. ఇప్పుడు కోహ్లి విషయంలోనూ అలానే చేసింది. తనను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్న విషయాన్ని బీసీసీఐ ముందస్తుగా చెప్పలేదని, మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవడం చాలా బాధించిందని, అవమానకర రీతిలో తనను తప్పించడం కలచి వేసిందని సచిన్ తన జీవిత చరిత్ర 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో ప్రస్తావించగా.. తాజాగా కోహ్లి ప్రెస్‌మీట్ పెట్టి బీసీసీఐ తన పట్ల వ్యవహరించిన తీరును ఎండగట్టాడు. ఇదిలా ఉంటే, భారత జట్టు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఈ ఇద్దరు లెజెండ్స్‌ను అవమానకర రీతిలో కెప్టెన్సీ నుంచి తొలగించడానికి గల ప్రధాన కారణం వారికున్న స్టార్ డమ్యేనని సగటు క్రికెట్ అభిమాని అభిప్రాయపడుతున్నాడు. వీరి క్రేజ్.. బీసీసీఐకి మించి ఉండడం వల్లే అలా జరిగి ఉండవచ్చని గుసగుసలాడుకుంటున్నారు. వారి రేంజ్‌ను తగ్గించడానికి బీసీసీఐ ఇలా అవమానించడం సరికాదని అంటున్నారు. కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్న విషయాన్ని బీసీసీఐ కేవలం గంటన్నర ముందే తనతో చెప్పిందని కోహ్లి నిన్నటి ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఆ జట్టుకు వన్డే, టెస్ట్ కెప్టెన్ ఒకరే.. మరి కోహ్లి విషయంలో ఎందుకు కుదరదు..? -
Rohit-Virat: ఆట కంటే ఆటగాళ్లెవరూ గొప్ప కాదు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Anurag Thakur Comments On Rohit And Virat Equation: టీమిండియా కెప్టెన్ల(విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ) వ్యవహారంపై సోషల్‌మీడియా వేదికగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆట కంటే ఆటగాళ్లు గొప్పవాళ్లేమీ కాదంటూ రోహిత్, విరాట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిత్ అయినా విరాట్ అయినా బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవించి, దానికి కట్టుబడి ఉండాలన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. కాగా, టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ ప్రకటించిన అనంతరం రోహిత్, విరాట్ల మధ్య గ్యాప్‌పై సోషల్‌మీడియాలో రకారకాల కథనాలు ప్రచారమయ్యాయి. అయితే, ఈ విషయమై తాజాగా విరాట్ స్పందించాడు. రోహిత్‌తో తనకెటువంటి విభేదాలూ లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ సారధ్యంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమంటూ ప్రకటించాడు. అయితే, ఈ సందర్భంగా కోహ్లి మరో బాంబ్ పేల్చాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేముందు బీసీసీఐ బాస్ గంగూలీ తనను సంప్రదించాడన్న వార్తలు అవాస్తవమని, వన్డే కెప్టెన్సీ తొలగింపుపై చివరి నిమిషంలో నాకు సమాచారమిచ్చారని, ఈ విషయంలో బీసీసీఐ తనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని మరో చర్చకు తావిచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Virat Kohli: గంగూలీపై కోహ్లి సంచలన వ్యాఖ్యలు.. నేను వన్డే కెప్టెన్ కాదని చెప్పారు! -
బ్రేక్ తీసుకోవచ్చు.. కానీ.. ! రోహిత్, కోహ్లిలపై విరుచుకుపడ్డ భారత మాజీ కెప్టెన్
Mohammad Azharuddin Slams Virat And Rohit: టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లి(టెస్ట్), రోహిత్ శర్మ(పరిమిత ఓవర్ల ఫార్మాట్)లు వివిధ కారణాల చేత దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడంపై టీమిండియా మాజీ సారధి మహ్మద్ అజహారుద్దీన్ స్పంచించాడు. ట్విటర్ వేదికగా కోహ్లి, రోహిత్‌లపై విరుచుకుపడ్డాడు. జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారిద్దరికి హితవు పలికాడు. Virat Kohli has informed that he's not available for the ODI series & Rohit Sharma is unavailable fr d upcoming test. There is no harm in takin a break but d timing has to be better. This just substantiates speculation abt d rift. Neither wil be giving up d other form of cricket. — Mohammed Azharuddin (@azharflicks) December 14, 2021 ఈగోలకు పోయి, ఒకరి సారధ్యంలో మరొకరు ఆడేందుకు సుముఖంగా లేరన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని, కీలక సిరీస్‌లకు ముందు ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరికాదని అజహర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో బ్రేక్ తీసుకోవడం తప్పేమీ కాదని, పంతాలకు పోయి జట్టు పరువును బజారుకీడ్చడమే సరికాదని అసహనం వ్యక్తం చేశాడు. కాగా, టీమిండియా కెప్టెన్సీ వివాదంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో గాయం కారణంగా రోహిత్, కూతురు పుట్టినరోజును కారణంగా చూపి కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై కోహ్లి, రోహిత్ అభిమానుల మధ్య సోషల్‌మీడియా వేదికగా చిన్న సైజ్ యుద్ధమే నడుస్తుంది. చదవండి: యాషెస్ సిరీస్‌లో తెలంగాణ బిడ్డ.. -
ధోని తర్వాత సీఎస్కేకు కెప్టెన్ అయ్యేది ఆ ఆటగాడే!
CSK Next Captain Ruturaj Gaikwad After MS Dhoni: రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ సెంచరీలు బాదిన రుతురాజ్.. అటు కెప్టెన్‌గానూ మహారాష్ట్రను విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే ఫ్యాన్స్ రుతురాజ్ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ ధోని తర్వాత కెప్టెన్‌గా రుతురాజ్ సరైనోడని అభిప్రాయపడుతున్నారు. చదవండి: రుతురాజ్ హ్యాట్రిక్ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర ''రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ధోని బాయ్ తర్వాత సీఎస్కేకు రుతురాజ్ కెప్టెన్ అయితే బాగుంటుంది.. మహారాష్ట్రను విజయవంతంగా నడుపుతున్న రుతురాజ్.. సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తే అదే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. సౌతాఫ్రికా టూర్‌కు రుతురాజ్‌ను ఎంపికచేస్తే చూడాలనుంది'' అంటూ కామెంట్స్ చేశారు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 136, 154*, 124 పరుగులు చేసి 435 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 16 మ్యాచ్‌లాడిన రుతురాజ్ 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలవడంతో సీఎస్కే నాలుగో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ Wake Up ✅ Pad Up ✅ R🦁AR ✅ RUTeen Status: 💯#VijayHazareTrophy #WhistlePodu 💛 pic.twitter.com/HirbDAhDEm — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) December 11, 2021 RUTU RAAJ.!#WhistlePodu #Yellove 🦁💛 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) December 11, 2021 Want to see Ruturaj Gaikwad in the SA tour.!He has been sensational since the IPL.!And excited to see him open the innings with Rohit atleast one innings.! — Deep Point (@ittzz_spidey) December 11, 2021 -
గంగూలీని ఎలా గద్దె దించారో.. కోహ్లిని కూడా అదే తరహాలో..
ముంబై: టీ20 ప్రపంచ కప్-2021 తర్వాత టీమిండియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లినే స్వచ్ఛందంగా తప్పుకోగా, తాజాగా కోహ్లిని టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడన్న కారణం చూపిస్తూ బీసీసీఐ అవమానకర రీతిలో కోహ్లిపై వేటు వేసింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తరువాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని బీసీసీఐ కోహ్లిని కోరినప్పటికీ.. అతను పెడచెవిన పెట్టాడు. దీంతో గతంలో గంగూలీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించిన తరహాలోనే కోహ్లిపై కూడా బలవంతపు వేటు వేసింది. వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లికి ఘనమైన రికార్డే ఉన్నప్పటికీ.. బీసీసీఐ వీటిని పరిగణలోకి తీసుకోకుండా అతన్ని తప్పించింది. 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని కూడా ఇదే తరహాలో తప్పించింది. గంగూలీ అప్పట్లో కెప్టెన్‌గా సక్సెస్ అయినా, బ్యాట్స్‌మెన్‌గా దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు అదే గంగూలీ బీసీసీఐ బాస్ హోదాలో ఉండి కెప్టెన్సీ నుంచి కోహ్లిని అవమానకర రీతిలో తప్పించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. చదవండి: ODI Captain: కోహ్లికి షాక్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. బీసీసీఐ అధికారిక ప్రకటన -
బిగ్‌బాస్-5: శ్రీరామ్ పిచ్చి ప్రశ్నలు.. బాత్రూమ్లో వెక్కివెక్కి ఏడ్చిన కాజల్
Bigg Boss 5 Telugu 12 Week Captaincy Contender Task: బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరి కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ‘నియంత మాటే శాసనం’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో నియంత సింహాసనం ఏర్పాటు చేశారు. సైరన్ మోగిన ప్రతిసారి ఆ సింహాసనంలో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్ వరకు వాళ్లు సేఫ్ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరి ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది. సన్నీకి హ్యాండిచ్చిన సిరి తొలి రౌండ్లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో నియంత సిరిని మినహాయించి మిగిలిన ఇంటి సభ్యులకు ఒక చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో హుక్స్‌కి వేలాదదీయబడిన క్యాప్‌లను చేతితో తాకకుండా తలకు ధరించి.. పక్కనే ఉన్న హుక్స్‌కి పెట్టాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంత దగ్గరకు వెళ్లి తమ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న సిరి.. అందరు ఊహించినట్లే సన్నీని తొలగించి రవిని సేవ్ చేసింది. దీంతో బాగా హర్ట్ అయిన సన్నీ.. ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారని, ఫస్ట్ రౌండ్లోనే డిస్ క్వాలిఫై అయినందుకు బాధగా ఉందని షణ్ముఖ్ దగ్గర వాపోయాడు. బాత్రూమ్లో వెక్కివెక్కి ఏడ్చిన కాజల్ ఇక రెండో రౌండ్లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. దీంతో మిగిలిన ఆరుగురికి మరో చాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. కాళ్లకి చెప్పులు ధరించి ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో మానస్ అందరికంటే ఎత్తులు చెప్పులు అతికించగా.. రవి, కాజల్ తక్కువ ఎత్తులు చెప్పులు అతికించి నియంత శ్రీరామ్‌ని ఎదుర్కొన్నారు. అయితే నియంతగా ఉన్న శ్రీరామ్ కాజల్‌ని నెక్స్ట్ రౌండ్‌కి పంపడానికి ఇష్టపడలేదు. ‘నేను ఇంతవరకు కెప్టెన్ కాలేదు. ఇదే నాకు చివరి చాన్స్.. ఇప్పుడు నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా’అని రిక్వెస్ట్ చేసినప్పటికీ... ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి డిస్క్వాలిపై చేశాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్.. ‘ఈ తొక్కలో డిస్కషన్స్ ఎందుకు రవికి ఇస్తానని ముందే చెప్పొచ్చుగా’అంటూ శ్రీరామ్‌పై సీరియస్ అయింది. కెప్టెన్ అయ్యే చివరి అవకాశం లేకుండా పోయిదంటూ.. బాత్ రూంలోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చింది. ప్రియాంక వెళ్లి ఆమెను ఓదార్చింది. ఇక మూడో రౌండ్లో రవి నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిన సభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా తలపై ఆరెంజ్‌లను పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి కొంచెం దూరంలో ఉన్న బుట్టలో వేయాలి. ఈ టాస్క్‌లో మానస్, షణ్ముఖ్ చివరి స్థానాల్లో నిలిచి నియంత రవిని ఎదుర్కొన్నారు. ఇరు వాదనలు విన్న రవి.. అందరు ఊహించినట్లే షణ్ముఖ్‌ని సేవ్ చేశాడు. నాలుగో రౌండ్లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. మిగిలిన ఇంటి సభ్యులకు వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇచ్చారు. ఈ చాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంతను ఎదుర్కొన్నారు. ఇక్కడ ప్రియాంక చాలా తెలివిగా వ్యవహరించి శ్రీరామ్‌ని డిస్ క్వాలిఫై చేసింది. శ్రీరామ్ కూడా కెప్టెన్సీ టాస్క్ నుంచి వైదొలగడంతో కాజల్ పండగ చేసుకుంది. ఐదో రౌండ్లో భాగంగా.. నియంత సింహాసనంపై ఒకేసారి సిరి, ప్రియాంక కూర్చున్నారు. అయితే సిరి కంటే ముందుగా ప్రియాంకే కుర్చుదంటూ.. సిరిని కాదని పింకీకే అవకాశం ఇచ్చాడు. దీంతో సిరి చాలా ఎమోషనల్ అయింది. ఫస్ట్ నేనే కూర్చున్న వాళ్లు అబద్దాలు చెబుతున్నారంటే ఏడ్చేసింది. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏడుస్తారా? గేమ్ ఆడు.. నువ్ ఇంత వీక్ అయితే నా ఫ్రెండ్‌గా ఉండకు అని చెబుతూ సిరిని హెచ్చరించాడు షణ్ణ్ముఖ్. ప్రియాంకను గెలిపించాలని ఉంటే గెలిపించుకోండి కానీ.. అన్ ఫెయిర్ గేమ్ ఆడొద్దని వార్నింగ్ ఇచ్చింది సిరి. మరి బిగ్‌బాస్ హౌస్‌లో చివరి కెప్టెన్ ఎవరు అయ్యారో బుధవారం నాటి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
మిగిలిన ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్‌గా గుడ్‌బై చెప్పే అవకాశం!
Ravi Shastri Reveals Virat Kohli Might Give Up Captaincy Other Formats.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. త్వరలోనే వన్డే, టెస్టుల్లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కోహ్లి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. '' గత ఐదేళ్లలో కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంది. కేవలం తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో మానసిక ఒత్తిడిని అధిగమించాలని కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చు. ఇక పరిమిత ఓవర్ల విషయంలోనూ కోహ్లి ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంతకముందు కూడా క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ వదులుకున్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు.'' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోహ్లి న్యూజిలాండ్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత జరగనున్న తొలి టెస్టులో కూడా ఆడడం లేదు. దీంతో కోహ్లి గైర్హాజరీలో రహానే తొలి టెస్టుకు నాయకత్వం వహించనున్నాడు. చదవండి: కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియాకు కప్ లేదు.. బాధగా ఉంది -
రోహిత్‌కు రెస్ట్.. రహానేకు కెప్టెన్సీ!
Ajinkya Rahane May Lead Team India In Test Series.. టి20 ప్రపంచకప్ 2021లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ టోర్నీ పూర్తవ్వగానే టీమిండియాతో సిరీస్ ఆడనుంది. అలా ప్రపంచకప్ ఫైనల్ ముగస్తుందో లేదో.. నవంబర్ 17 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ మొదలుకానుంది. టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్ తీసుకోనున్నాడు. దీంతో తొలి టెస్టు బాధ్యతలు రోహిత్‌కే ఇస్తారని వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రహానే విఫలం కావడంతో రోహిత్‌వైపే మొగ్గుచూపినట్లు తెలిసింది. చదవండి: Rohit Sharma: టీ20కి ఓకే.. మరి టెస్టు కెప్టెన్‌గా రోహిత్ లేదంటే రహానే? బీసీసీఐ మల్లగుల్లాలు! కానీ ఆ వార్తల్లో నిజం లేదని.. తాజాగా అందిన సమాచారం ప్రకారం రోహిత్ శర్మకు న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. వరుస సిరీస్‌లతో రోహిత్ అలసటకు గురికాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. రోహిత్‌తో పాటు షమీ, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌లకు కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ స్థానంలో తొలి టెస్టుకు అజింక్యా రహానేకే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ తొలి టెస్టు తర్వాత కూడా కోహ్లి రాకపోతే మాత్రం రహానేకు కివీస్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయి కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పాలనే ప్రతిపాధన కూడా బీసీసీఐకి ఉన్నట్లు సమాచారం. గతేడాది ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లి తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రావడంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రహానే జట్టును విజయపథంలో నడిపించాడు. ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి చారిత్రక టెస్టు సిరీస్‌ను గెలడంలో కెప్టెన్‌గా రహానే కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పటికైతే ఈ విషయంపై స్పష్టత లేకపోయినప్పటికి వచ్చే శుక్రవారం టెస్టు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తొలి టెస్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. టి20 సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య నవంబర్ 25-29 వరకు కాన్పూర్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది. చదవండి: T20 WC 2021: ఐదు లక్షణాలు పక్కాగా.. ఈసారి న్యూజిలాండ్‌దే కప్ -
ఫెయిలయ్యుండొచ్చు.. కానీ కెప్టెన్ అంటే కోహ్లినే
KL Rahul Hails Virat Kohli As Great Leader.. టీమిండియా టి20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంపై ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. నమీబియాతో మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్ కోహ్లి నాయకత్వం గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషన్‌ల్‌గా రాసుకొచ్చాడు. '' ఈ ప్రపంచకప్‌లో మేం విఫలమయ్యాం.. అది కాస్త బాధ కలిగించింది. కానీ ఇక్కడ ఓడిపోవడం వల్ల చాలా నేర్చుకున్నాం. ఫ్యాన్స్ భావోద్వేగాలు ఎలా ఉంటాయో చూశాం.. మీ కోపానికి.. అభిమానానికి ధన్యవాదాలు. మేము మంచి క్రికెటర్లుగా ఎదగడంలో కోచ్‌గా రవిశాస్త్రి పాత్ర కీలకం.. ఒక కోచ్‌గా మమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు. ఇక విరాట్ కోహ్లి టి20 ప్రపంచకప్ సాధించడంలో ఫెయిల్ అయ్యిండొచ్చు.. కానీ నాయకుడిగా అతను విఫలం కాలేదు. కెప్టెన్సీ అనే పదానికి కోహ్లి ఒక ఉదాహరణ.. కెప్టెన్‌గా మమ్మల్ని ఎన్నోసార్లు ముందుండి నడిపించాడు. నా దృష్టిలో కెప్టెన్ అంటే కోహ్లినే..'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs NZ 2021: టి20 కెప్టెన్‌గా రోహిత్ .. తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్!? ఇక టి20 కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ వన్డే, టెస్టుల్లో మాత్రం కోహ్లినే సారధిగా ఉంటాడు. అయితే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు మాత్రం కోహ్లి దూరంగా ఉండే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు తొలి టెస్టుకు కూడా దూరంగా ఉండాలని భావిస్తే కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ తొలి టెస్టుకు నాయకత్వం వహిస్తాడంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే టీమిండియాకు టెస్టుల్లో అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక న్యూజిలాండ్.. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 17, 19, 21వ తేదీల్లో టీమిండియాతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఇరుజట్ల మధ్య నవంబర్ 25-29 వరకు కాన్పూర్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది. చదవండి: Sehwag: కెప్టెన్‌గా రోహిత్ సరే.. వైస్ కెప్టెన్‌గా రాహుల్, పంత్‌ల కంటే అతనైతేనే బెటర్..! View this post on Instagram A post shared by KL Rahul👑 (@rahulkl) -
అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి
Everyone Cant Be MS Dhoni, Give Rishabh Pant Some Time Says Ashish Nehra : ఐపీఎల్-2021 సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి తన జట్టును ఫైనల్‌కు చేర్చేందుకు విఫలయత్నం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్‌కు టీమిండియా మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా మద్దతు పలికాడు. సారధిగా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే పంత్ తనను తాను నిరూపించుకున్నాడని, 2007 టీ20 ప్రపంచకప్‌లో ధోని టీమిండియాను విజేతగా నిలిపినట్లుగా పంత్ కూడా తన జట్టును ఛాంపియన్‌గా నిలపాలని ఆశించడం అత్యాశే అవుతుందని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత ఈ ఏడాది ఢిల్లీ సారధ్య బాధ్యతలను భుజానికెత్తుకున్న పంత్.. సీనియర్లు, జూనియర్లతో సమతూకం కలిగిన జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని, అతనికి నిలదొక్కుకునేందుకు మరికాస్త సమయమిచ్చి, వచ్చే సీజన్లో కూడా కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించాడు. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు మినహా పంత్ సారధ్య బాధ్యతలకు వంద శాతం న్యాయం చేశాడని, అతన్ని కెప్టెన్‌గా కొనసాగించాలా వద్దా అన్నది అనవసరమైన రాద్దాంతమని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా పంత్‌కు వీలైనన్ని అవకాశాలు కల్పించాలని, అది వ్యక్తిగతంగా అతనికి, జట్టుకు ఉపయోగకరమని ఈ ఢిల్లీ ఆటగాడు పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్లో లీగ్ దశ వరకు టేబుల్ టాపర్‌గా నిలిచిన డీసీ జట్టు క్వాలిఫైయర్స్‌లో చెన్నై, కేకేఆర్ జట్ల చేతిలో వరుస ఓటములతో ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. చదవండి: సీనియర్లకు రెస్ట్.. టీమిండియాలోకి ఐపీఎల్ హీరోస్..! -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ
Virat Kohli RCB Captain As Last IPL 2021... ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కథ ముగిసింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని కోహ్లి భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్‌గా వైదొలిగాడు. వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. గతేడాది సీజన్(ఐపీఎల్ 2020)లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిన ఆర్సీబీకీ ఈ సీజన్లో కేకేఆర్ షాక్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ టైటిల్ లేకుండానే ఒక జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం Courtesy: IPL Twitter 2013 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. అతని కెప్టెన్‌గా పని చేసిన కాలంలో ఆర్సీబీ ఒకసారి రన్నరఫ్(2016 ఐపీఎల్ సీజన్), మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. కెప్టెన్‌గా ఆర్సీబీకి టైటిల్ అందించడంలో విఫలమయ్యాడేమో కానీ బ్యాట్స్‌మన్‌గా మాత్రం ఎప్పుడు విఫలం కాలేదు. ఆర్సీబీ కెప్టెన్‌గా ఐపీఎల్ 2021 సీజన్ చివరిదని.. ఇకపై ఆ జట్టుకు ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని సెకండ్‌ఫేజ్ ఆరంభంలోనే ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ టీమ్ ఎలాగైనా కోహ్లికి కప్ అందించి ఘనమైన వీడ్కోలు పలకాలని భావించింది. అందుకు తగ్గట్టుగానే లీగ్ దశలో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా మంచి ప్రదర్శన కనబరిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే ప్లేఆఫ్స్ దశలో తమకు అలవాటైన ఒత్తిడిని అధిగమించడంలో ఆర్సీబీ మరోసారి విఫలమైంది. Final post match presentation of Virat Kohli as a #RCB captain. pic.twitter.com/B5IBGkXsFa — Johns. (@CricCrazyJohns) October 11, 2021 Virat Kohli led RCB for the final time today. The end of an era ♥️#RCBvKKR | #IPL2021 pic.twitter.com/Eo88SqLrF7 — ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2021 -
ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..!
Ravi Shastri Advised Kohli To Quit Captaincy From Two Formats: టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి, ఐపీఎల్-2021 తర్వాత ఆర్సీబీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన విరాట్ కోహ్లి క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే ఓ కీలక సలహా ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఆ సలహాను అప్పట్లో అంతగా పట్టించుకోని కోహ్లి.. ఆలస్యంగా తేరుకుని కోచ్ సలహాలోని ఓ భాగాన్ని మాత్రమే అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ కోహ్లికి రవిశాస్త్రి ఇచ్చిన ఆ సలహా ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరింపించిన అనంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. కెప్టెన్ కోహ్లికి ఓ కీలక సూచన చేశాడు. బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించేందుకు వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాలని, టెస్ట్ క్రికెట్లో మాత్రం సారధిగా కొనసాగాలని సలహా ఇచ్చాడు. అప్పటికే అడపాదడపా ఫామ్‌తో నెట్టుకొస్తున్న కోహ్లి మంచి కోరే రవిశాస్త్రి ఈ సలహా ఇచ్చాడట. అయితే, రవిశాస్త్రి మాటలను పెడచెవిన పెట్టిన కోహ్లి కేవలం టీ20 కెప్టెన్సీకి మాత్రమే గుడ్‌బై చెబుతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి.. కోహ్లికి ఇచ్చిన సలహాపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కోచ్ సలహా మేరకు కోహ్లి ఈ పనిని ఆర్నెళ్ల క్రితమే చేసుంటే.. ఆటతీరు మరింత మెరుగ్గా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లికి కెప్టెన్సీపై ఇంకా యావ తగ్గలేదని, అందుకే కోచ్ చెప్పినా వినకుండా వన్డే సారధ్య బాధ్యతలను అట్టిపెట్టుకున్నాడని మరికొందరు చురకలంటిస్తున్నారు. చదవండి: ‘కివీస్ జట్టుకు బెదిరింపులు భారత్ కుట్రే’... పాక్ మంత్రి సంచలన ఆరోపణ -
కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..!
Kohli Could Be Removed From RCB Captaincy: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు తారాస్థాయికి చేరాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమైన కోహ్లిపై పేరు చెప్పడినికి ఇష్టపడని ఓ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరో రెండు, మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి చెత్త ప్రదర్శన ఇలాగే కొనసాగితే.. అతను తప్పుకోవడం కాదు.. జట్టు యాజమాన్యమే అతన్ని తప్పించే ఆస్కారముందంటూ వ్యాఖ్యానించాడు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దినేశ్ కార్తీక్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. కోహ్లి ప్రదర్శన ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభానికి ముందు కోహ్లి ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ ఐపీఎల్ సీజనే ఆర్సీబీ కెప్టెన్‌గా తనకు ఆఖరిదని వెల్లడించాడు. అంతకు కొద్దిరోజుల ముందే టీమిండియా టీ20 బాధ్యతల(టీ20 ప్రపంచకప్ తర్వాత) నుంచి కూడా తప్పుకోనున్నట్లు కోహ్లి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నటరాజన్‌కు కరోనా.. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఓ గుడ్ న్యూస్ -
కెప్టెన్సీ విషయంలో హిట్ వికెట్ అయిన కోహ్లీ
-
Virat Kohli: ఐపీఎల్ కెప్టెన్సీపై కోహ్లి కీలక నిర్ణయం
Virat Kohli Sted Down As IPL Captain.. అబుదాబి: గత గురువారం... ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ముగిశాక భారత టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన విరాట్ కోహ్లి... ఆదివారం మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్–14వ సీజన్ ముగిశాక తాను సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు పగ్గాలు వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆర్సీబీ అధికారిక ట్విటర్ ఖాతాలో కోహ్లి వీడియో సందేశం విడుదల చేశాడు. ‘ఆర్సీబీ కెప్టెన్ హోదాలో నాకిదే చివరి ఐపీఎల్ సీజన్. గతంలో చెప్పినట్టుగా ఐపీఎల్లో చివరి మ్యాచ్ ఆడినంత కాలం ప్లేయర్‌గా బెంగళూరు జట్టు తరఫున మాత్రమే బరిలోకి దిగుతాను. మరో ఐపీఎల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఇంతకాలం నాపై నమ్మకం ఉంచి, నన్ను ప్రోత్సహించి, మద్దతుగా నిలిచిన ఆర్సీబీ యాజమాన్యానికి, కోచ్‌లకు, సహచర ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. చదవండి: Suresh Raina Wicket: అయ్యో రైనా.. వికెట్‌తో పాటు బ్యాట్‌ను విరగొట్టుకున్నాడు ►ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి కోహ్లి ఆర్సీబీ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 2011లో నాటి కెప్టెన్ వెటోరి గాయపడటంతో కొన్ని మ్యాచ్‌ల్లో కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2013 సీజన్ నుంచి పూర్తి స్థాయిలో బెంగళూరు జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ►కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ జట్టు 132 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడింది. 60 విజయాలు, 65 పరాజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ►కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2015లో మూడో స్థానంలో, 2016లో రన్నరప్‌గా... 2020లో నాలుగో స్థానంలో నిలిచింది. Virat Kohli to step down from RCB captaincy after #IPL2021 “This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM — Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021 -
Virat Kohli: దటీజ్ కోహ్లి
క్రికెట్లో ఒక ఆటగాడి శైలిని.. మరో ఆటగాడితో పోల్చి చూసే వ్యవహారం సహజం. కానీ, ఏ ఆటగాడి ప్రత్యేకత ఆ ఆటగాడికే ఉంటుంది కదా!. అలాగే టీమిండియా టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లిని దిగ్గజాలతో పోల్చాలని ప్రయత్నించడం కష్టంతో కూడిన వ్యవహారమే. కోహ్లి అగ్రెసివ్ ఆటిట్యూడ్‌తో పాటు ఆటనూ ఇష్టపడే యంగ్ జనరేషన్‌కి.. అతని పట్ల ఉన్న అభిమానం ఎంతైనా ప్రత్యేకమే!. Virat Kohli Brand Value Without T20 Captaincy?: వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో రకరరకాల చర్చలు.. కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరి కోహ్లి గనుక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. అతని బ్రాండ్‌కు వచ్చే నష్టమేమైనా ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు. రకరకాల బ్రాండ్లు.. కోట్లలో వ్యాపారం కేవలం కోహ్లి బ్రాండ్‌నే నమ్ముకుని నడుస్తున్నాయి. అందుకు ప్రతిగా పారితోషకం సైతం కోహ్లికి భారీగానే ముట్టజెప్పుతున్నారు. మరి క్రికెట్ వ్యూయర్షిప్ను శాసిస్తూ.. ఊహకందని రీతిలో బిజినెస్ చేస్తున్న పొట్టిఫార్మట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటే.. అది ప్రచారాలపై, కోహ్లి ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టవా?. అసలు ఆ ఆలోచననే దరి చేరనీయట్లేదట సదరు కంపెనీలు. ఫామ్కొస్తే కేకే.. ఇంతకీ ‘కోహ్లి బ్రాండ్’ అంటే ఏంటో చూద్దాం. క్రికెట్లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కోహ్లి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు. ఎమ్ఆర్ఎఫ్, అమెరికన్ టూరిస్టర్, పూమా, వోలిని, అడీ, ఉబెర్ ఇండియా, రాయల్ ఛాలెంజ్.. ఇలా బోలెడు బ్రాండ్స్‌కు ఎండోర్సింగ్ చేస్తున్నాడు కోహ్లి. అయితే ప్రధాన బ్రాండ్లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం.. కేవలం స్టార్ ఆటగాడు అని మాత్రమే కాదు.. జనాల్లో కోహ్లికి ఉన్న యాక్సెప్టెన్సీ కూడా. మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర.. ఇలా వేదిక ఏదైనాసరే కోహ్లికి విపరీతమైన జనాదరణ ఉంది. ఇది కోహ్లి పర్ఫార్మెన్స్తో ఏమాత్రం సంబంధంలేని వ్యవహారమని చెప్తున్నారు ఇండిపెండెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ రితేస్ నాథ్. అందుకని కెప్టెన్సీ నుంచి వైదొలిగినా కోహ్లి బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదని భావిస్తున్నారాయన. ఒకవేళ విమర్శల సంగతే తీసుకున్నా.. కోహ్లి గనుక ఒక్కసారి ఫామ్ పుంజుకుంటే.. అన్నీ మరిచిపోతారని, అప్పుడు మరింత పుంజుకుని బ్రాండ్ వాల్యూ రెట్టింపు అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారాయన. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్ నాలుగేళ్లపాటు ఎలాగైతే రాణించాడో.. బ్రాండ్ మార్కెట్లో మళ్లీ పుంజుకున్నాడో కోహ్లి విషయంలోనూ అలాగే జరగొచ్చని, అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని అంచనా వేస్తున్నారాయన. కోహ్లి.. కనిపిస్తే చాలు కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్లకు సంబంధించి చేసే ఒక్క పోస్ట్‌కి కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఇది 80 లక్షల రూపాయల దాకా ఉండేది. ఎండోర్స్మెంట్ కోసం ఒక్కో బ్రాండ్‌కి ఏడాదికి ఏడు కోట్లపైనే ఛార్జ్ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు ఐదు కోట్లు ఉండేది. ప్రస్తుతం కోహ్లి తర్వాత రోహిత్ శర్మ 3 కోట్ల దాకా అందుకుంటున్నాడు. అజింక్య రహానే, కేఎల్ రాహుల్ లాంటివాళ్లు కోటి నుంచి కోటిన్నర మధ్య తీసుకుంటున్నారు. ఈ లెక్కన బ్రాండ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా.. కోహ్లితో పోటీపడే క్రికెట్ ప్లేయర్ ఎవరూ లేకపోవడం విశేషం. కోహ్లి గత కొంతకాలంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ.. బ్రాండ్లు వెనక్కి పోకపోవడమే ఇందుకు మరో ఉదాహరణ. రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కోహ్లిని విమర్శించే వ్యతిరేక వర్గం కూడా.. కోహ్లి బ్రాండ్ విషయానికొచ్చేసరికి సైలెంట్ అయిపోతోందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంటున్నారు. అలా తన ఇమేజ్‌తో ప్రత్యర్థుల నోళ్లు సైతం మూయించగల కెపాసిటీ కోహ్లిది. అలాంటిది ప్లేయర్‌గా పర్ఫార్మెన్స్ కనబరిస్తే.. కోహ్లి బ్రాండ్ దూసుకుపోతుందని చెప్తున్నారు సలిల్. ‘‘కోహ్లి అప్పీయరెన్స్‌కు జనాలు బాగా అలవాటు పడ్డారు. యూత్ అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఆస్వాదిస్తుంది. అసలు క్రికెట్ జెర్సీలో అతని రూపం చాలు.. ప్రచారానికి. అందుకే సీనియర్లకు, క్రికెట్ దిగ్గజాలకు సైతం దక్కని బ్రాండ్ ఇమేజ్.. కోహ్లి పేరిట నడుస్తోంది ఇప్పుడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) చదవండి: కెప్టెన్‌గా రోహిత్ కంటే అతనే బెటర్! -
టి20లకు సారథ్యం వహించను: కోహ్లి
భారత క్రికెట్లో కీలక పరిణామం. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లి టి20 కెపె్టన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ప్రపంచకప్ తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకే అంటూ కోహ్లి చెప్పుకున్నా... రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పెరుగుతున్న డిమాండ్లు సహా ఇతర అంశాలు కూడా అతనిపై ప్రభావం చూపించి ఉండవచ్చు. అన్నింటిని మించి టి20 వరల్డ్‌కప్ తర్వాత తప్పుకునేట్లయితే టోర్నీకి ముందు అలాంటి ప్రకటన చేయడం మాత్రం అనూహ్యం. ముంబై: సోమవారం... టి20 ఫార్మాట్ కెపె్టన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నట్లు మీడియాలో వార్తలు. దీనిని ఖండించిన బీసీసీఐ ప్రతినిధులు... సారథిగా కోహ్లినే కొనసాగుతాడని, అసలు భారత క్రికెట్లో వేర్వేరు కెప్టెన్ల పద్ధతి పని చేయదని స్పష్టీకరణ! గురువారం... టి20 వరల్డ్‌కప్ తర్వాత కెపె్టన్‌గా ఉండనని కోహ్లి మనసులో మాటను వెల్లడించగా, గత ఆరు నెలలుగా దీనిపై తాము చర్చిస్తున్నామని బోర్డు ప్రకటన! మొత్తంగా సారథి హోదాలో తన తొలి టి20 ప్రపంచకప్ తర్వాత ఆ బాధ్యతల నుంచే దూరమయ్యేందుకు విరాట్ నిర్ణయించుకున్నాడు. ధోని రాజీనామాతో జనవరి 26, 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లి కెపె్టన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు. చదవండి: అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని సరైన నిర్ణయమేనా! కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు భారత్ 67 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ 45 మ్యాచ్‌లే ఆడాడు. కాబట్టి పని భారం అనలేం! కోహ్లి స్థాయి ఆటగాడు ఇకపై ఏడాదికి 10–12 మ్యాచ్‌లలో నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటే పెద్ద తేడా ఏముంటుంది. 45 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే 27 గెలిచి, 14 ఓడిపోగా, మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఇది మెరుగైన రికార్డే. పైగా ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో టి20 సిరీస్‌లు గెలిచిన ఏకైక ఆసియా కెపె్టన్‌గా ఘనత. కాబట్టి కెపె్టన్‌గా విఫలమయ్యాడని చెప్పలేం! 2017 నుంచి ఓవరాల్‌గా చూస్తే టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో (1,502) ఉన్నాడు. ఎంతో మంది రోహిత్ అద్భుతం అని చెబుతున్నా... ఈ కాలంలో రోహిత్‌తో పోలిస్తే 5 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి కూడా అతనికంటే (1,500) రెండు పరుగులు ఎక్కువే చేశాడు. అంటే సారథ్యంలోనూ బ్యాట్స్‌మన్‌గా సూపర్ సక్సెస్! మరి తప్పుకోవడానికి బలమైన కారణం ఏమిటి? పైగా భారత జట్టు నాయకత్వానికి సంబంధించి ఆరు నెలలుగా తమ మధ్య చర్చలు సాగుతున్నాయని జై షా చెప్పడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇదేమీ కోహ్లి అనూహ్య నిర్ణయం కాదని అనిపిస్తోంది. గణాంకాల లోతుల్లోకి వెళ్లకుండా సగటు అభిమాని కోణంలో చూస్తే టి20లకు రోహిత్ సరైన కెప్టెన్ అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. చదవండి: టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్! ముఖ్యం గా ఐపీఎల్ ప్రదర్శన ఇద్దరి మధ్య నాయకత్వ అంతరాన్ని బాగా చూపించింది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిస్తే... 2011 సీజన్ నుంచి కెప్టెన్‌గా ఉన్నా కోహ్లి ఒక్కసారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. దాంతో భారత జట్టు టి20 మ్యాచ్‌లు ఆడిన ప్రతీ సందర్భంలో పోలిక మొదలైంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ కెప్టెన్సీలో 19 మ్యాచ్‌లు ఆడిన భారత్ 15 గెలిచి, 4 ఓడింది. అతని సారథ్యానికి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో మరింత చర్చలకు అవకాశం ఇవ్వకుండా కెపె్టన్సీ విషయంలో కొంత ఉపశమనం పొందాలని కోహ్లి భావించి ఉంటాడు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రకటన సమయం మాత్రం సరైంది కాదు. గెలిచినా, ఓడినా వరల్డ్‌కప్ తర్వాతే దీని గురించి చెప్పి ఉంటే మెరుగ్గా ఉండేది! భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం కూడా వహించే అదృష్టం నాకు దక్కింది. సారథిగా ఉన్న నాకు ఈ ప్రయాణంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, కోచ్‌లతో పాటు జట్టు గెలవాలని కోరుకున్న ప్రతీ భారతీయుడికి నా కృతజ్ఞతలు. గత 8–9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతూ 5–6 ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాపై తీవ్ర పనిభారం ఉంది. దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించేందుకు నాకు కొంత ఉపశమనం అవసరం. సారథిగా జట్టుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన నేను, ఇకపై టి20 బ్యాట్స్‌మన్‌గా కూడా అదే తరహాలో శ్రమిస్తాను. ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది. మున్ముందూ భారత జట్టుకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. –కోహ్లి -
ఢిల్లీ పగ్గాలు పంత్‌కే.. శ్రేయస్‌కు భంగపాటు
దుబాయ్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్‌ను సారధ్య బాధ్యతల్లో యధావిధిగా కొనసాగించాలని ఢిల్లీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి జరిగే ఐపీఎల్ మలి దశ మ్యాచ్‌లకు పంత్‌ను తప్పించి, శ్రేయస్ అయ్యర్‌కు తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో డీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. భుజం గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించి ప్రయోగం చేయదలచుకోలేదని ప్రకటించింది. ప్రస్తుతం శ్రేయస్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఆటగాడిగా జట్టుకు సేవలందిస్తాడని స్పష్టం చేసింది. కాగా, గాయం కారణంగా భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ మొదటి దశ మ్యాచ్‌లకు శ్రేయస్ దూరం కావడంతో పంత్ డీసీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. పంత్ సారధ్యంలో డీసీ తొలి దశ మ్యాచ్‌లలో వరుస విజయాలు(8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గత రెండున్నర సీజన్లుగా డీసీ జట్టును శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ముందుండి నడిపించాడు. అతని సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్‌కు కూడా చేరింది. ఇదిలా ఉంటే, డీసీ జట్టు ఐపీఎల్ సెకెండ్ లెగ్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 22న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. చదవండి: అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాం..పాక్ కెప్టెన్ ధీమా -
కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు
న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా పగ్గాలు తనకే ఇస్తారని భావించానని సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అయితే, సెలెక్టర్లు ధోనీ పేరు తెరపైకి తేవడంతో తాను కూడా అదే సరైన నిర్ణయంగా భావించానని ఆయన తెలిపాడు. ధోనీ కెప్టెన్ అయ్యాక అతనికి పూర్తిగా మద్దతిచ్చానని చెప్పుకొచ్చాడు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ.. 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని, దీంతో టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు సీనియర్లందరూ అయిష్టత చూపారని, ఆ సమయంలో నేను కెప్టెన్సీ రేసులో ముందున్నాని గుర్తు చేసుకున్నాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి సీనియర్ల గైర్హాజరీలో తనకే కెప్టెన్సీ వస్తుందని అందరూ భావించారని, అయితే సెలక్టర్లు సడెన్‌గా ధోనీ పేరును తెరపైకి తేవడం, అతను టీమిండియా పగ్గాలు చేపట్టడం చకాచకా జరిగిపోయాయని తెలిపాడు. అయితే, ఆ విషయాన్ని తాను అప్పుడే వదిలేశానని, కెప్టెన్ ఎవరైనా సరే ఆటగాడిగా తాను రాణించడమే ముఖ్యమని భావించానని పేర్కొన్నాడు. కాగా, ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన యువీ 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆ క్రమంలో అతను 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ యువీ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉంటే, 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత, పెద్దగా అంచనాలు లేని యువ భారత జట్టు ధోనీ నేతృత్వంలో తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌ను ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ అంచనాలకు మించి రాణించి, రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ విజయం తర్వాత భారత క్రికెట్లో ధోనీకి తిరుగు లేకుండా పోయింది. నాటి నుంచి ధోనీ, యువీ ఇద్దరూ టీమిండియాలో కీలక సభ్యులుగా ఎదుగుతూ భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేశారు. ఈ క్రమంలో వారు భారత్‌ను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. చదవండి: 'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు.. -
వారి నుంచి వచ్చిన సందేశాలు ఎన్నటికీ మరువలేనివి..
ముంబై: రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికైన వెంటనే తనను అభినందిస్తూ టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనిలు పంపిన సందేశాలు ఎన్నటికీ మరువలేనని ఆర్ఆర్ నూతన సారధి సంజూ సాంసన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అత్యున్నత శిఖరాలను అదిరోహించిన వారు.. తనకు అభినందనలు తెలపడంతో ఆనందం పట్టలేకపోయానని వెల్లడించాడు. ఆర్ఆర్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం తన అదృష్టమని, తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యానికి జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సంగక్కరతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని వెల్లడించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం అంతగా అనుభవంలేని తనకు సంగక్కర లాంటి భాగస్వామి దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ తొలి ఎడిషన్(2008)లో ఛాంపియన్‌గా అవతరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆతరువాత మళ్లీ అదృష్టం కలిసిరాలేదు. మధ్యలో రెండేళ్లు నిషేధానికీ గురై క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమైన ఆ జట్టు.. చాలామంది విదేశీ, స్వదేశీ సీనియర్లను ప్రయత్నించినా టైటిల్ మాత్రం అందని దాక్షాలానే మిగిలింది. అయితే, ఈ సీజన్ వేలానికి ముందు స్టీవ్ స్మిత్‌ను వదిలించుకున్న ఆర్ఆర్ జట్టు సంజు సాంసన్ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అతనికి మద్దతుగా నిలిచేందుకు క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర్‌ను నియమించుకుంది. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: బయో బబుల్ కష్టమే.. అయినా భారత క్రికెటర్లు తట్టుకోగలరు -
'నేను కెప్టెన్ అవుతానని అస్సలు ఊహించలేదు'
ముంబై: ఐపీఎల్ మొదటి సీజన్లో విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 13 సీజన్లలో రాయల్స్‌కు కెప్టెన్లు మారినా ఆ జట్టు తలరాత మాత్రం మారలేదు. కాగా గతేడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో దారుణ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా విఫలమైన స్టీవ్ స్మిత్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసిన రాయల్స్ సంజూ శాంసన్‌కు పగ్గాలు అప్పజెప్పింది. రాజస్తాన్ రాయల్స్ గతేడాది జట్టుగా విఫలమైనా సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్లు కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. కాగా కష్టకాలంలో రాయల్స్ కెప్టెన్‌గా ఎంపికైన శాంసన్ ముందు సవాళ్లు చాలానే ఉన్నాయి. జట్టును సమన్వయంతో నడిపిస్తూనే.. బెన్ స్టోక్స్, బట్లర్, ఆర్చర్ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడనుండడం.. టైటిల్ సాధించాలనే కల అతనికి సవాల్‌గా మారనుంది.తాజాగా ఐపీఎల్ 14వ సీజన్‌కు సిద్ధమవుతున్న రాజస్తాన్ రాయల్స్ గురించి కొత్త కెప్టెన్ సంజూ శాంసన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చదవండి: రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి 'కెప్టెన్‌గా రాజస్తాన్ రాయల్స్‌ను నడిపించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలనే దానిపై మనుసులో చాలా ఆలోచనలు ఉన్నా.. దానిని ఆచరణలో పెట్టడం కాస్త కష్టమే అయినా ప్రయత్నిస్తా. ఈ బాధ్యతలతో మాత్రం సంతోషంగా ఉన్నా. నిజాయితీగా చెప్పాలంటే నేను రాయల్స్‌కు కెప్టెన్ అవుతానని గతేడాది చివరి వరకు అస్సలు ఊహించలేదు. మా జట్టు మేనేజర్ మనోజ్ బాద్లే నా దగ్గరకు వచ్చి.. నీ మీద మాకు నమ్మకం ఉంది...నువ్వు కెప్టెన్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉండని చెప్పాడు. కాగా రాయల్స్ కొత్త డైరెక్టర్ కమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కుమార సంగక్కరతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. అంతర్జాతీయ వికెట్ కీపర్‌గా శ్రీలంకకు సేవలు అందించిన సంగక్కర లాంటి లెజెండ్‌తో కలిసి పనిచేయడమే గాక.. కెప్టెన్సీ లక్షణాలతో పాటు.. వికెట్ కీపింగ్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 12న ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. చదవండి: ఆటగాడికి కరోనా.. ఆర్సీబీలో కలవరం ఐపీఎల్ చరిత్రలో ఈ వికెట్ కీపర్లు ప్రత్యేకం -
కెప్టెన్సీపై ఉహాగానాలకు చెక్ పెట్టండి: రహానే
చెన్నై: కోహ్లీ కెప్టెన్సీపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఓ విలేకరికి టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే చురకలంటించాడు. మీకు కావాల్సిన మసాలా వార్తలు ఇక్కడ దొరకవని స్పష్టం చేశాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ.. జట్టు మొత్తానికి కోహ్లీ కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉందని, అతనే తమ కెప్టెన్‌గా కొనసాగుతాడని, ఇకనైనా కెప్టెన్సీపై ఉహాగానాలకు చెక్ పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తన బ్యాటింగ్ వైఫల్యంపై జింక్స్ మాట్లాడుతూ.. గత వైఫల్యాలను బేరీజు వేసుకొని, రెండో టెస్ట్‌కు అన్ని విధాల సన్నద్దమయ్యానన్నాడు. రేపటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లో స్పిన్నర్లు చెలరేగుతారని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలి టెస్ట్‌లో ఎదురైన పరాభావాన్ని మరిచిపోయి, తదుపరి టెస్ట్‌లో సర్వ శక్తులు ఒడ్డి విజయం కోసం కృషి చేస్తామన్నాడు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రేపు ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ఇటీవల కాలంలో రహానే మెల్బోర్న్ టెస్ట్ సెంచరీ మినహా గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 4, 22, 24, 37, 1, 0 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా రాణించినా, బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శలు గుప్పించారు. -
‘అదే జరిగితే కెప్టెన్‌గా కోహ్లి కెరీర్ ముగిసినట్లే’
న్యూఢిల్లీ: పర్యాటక ఇంగ్లండ్ జట్టు చేతిలో టీమిండియాకు జరిగిన ఘోర పరాభవానికి బాధ్యున్ని చేస్తూ.. భారత జట్టు సారధి విరాట్ కోహ్లీపై ముప్పేట దాడి మొదలైంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో జట్టు సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో(2019/2020లో న్యూజిలాండ్ చేతిలో రెండు టెస్టులు, ఇటీవల ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఓటమి) ఓటమి పాలు కావడంతో అతని కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ ఇంగ్లండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 13 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరగబోయే రెండో టెస్టులో భారత జట్టు ఓటమి పాలైతే, కెప్టెన్‌గా కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనని పనేసర్ విమర్శించారు. కోహ్లీ గైర్హాజరీలో(గత ఆసీస్ పర్యటనలో) టీమిండియాను అత్యంత సమర్ధవంతంగా ముందుండి నడిపించిన అజింక్య రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించాలన్న డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కోహ్లీ నిస్సందేహంగా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అతని సారధ్యంలో భారత జట్టు దారుణంగా విఫలం కావడానికి కోహ్లీనే నైతిక బాధ్యత వహించాలని పనేసర్ డిమాండ్ చేశాడు. ఓవైపు సహచరుడు రహానే కెప్టెన్‌గా సక్సెస్ అవుతుండటంతో కోహ్లీ ఒత్తిడిలో కూరుకుపోయాడని అతను వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు బదులు షాదాబ్ నదీమ్‌ను ఎంపిక చేయడాన్ని పనేసర్ తప్పుపట్టాడు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను క్లిష్టం చేసుకోగా, టీమిండియాపై విజయంతో పర్యాటక ఇంగ్లండ్ జట్టు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు మార్గం సుగమమం చేసుకోవడంతో పాటు సొంత గడ్డపై టీమిండియా 14 వరుస విజయాల జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. -
ఈ సారథ్యం నాకొద్దు
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ (డీకే) ఐపీఎల్–13 సీజన్ మధ్యలో అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే అతనీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2018 నుంచి కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ కెప్టెన్సీకి బైబై చెబుతూనే నూతన సారథిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్‌ను నియమించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరాడు. అతను కోరినట్లే కోల్‌కతా ఫ్రాంచైజీ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్ సారథ్యంలోనే ఇంగ్లండ్ విశ్వవిజేత అయ్యింది. ‘బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు... జట్టుకు మరెంతో చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కార్తీక్ చెప్పినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతని నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని, అయినాసరే తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని టీమ్ సీఈఓ వెంకీ మైసూర్ తెలి పారు. ‘జట్టు గురించే ఆలోచించే కార్తీక్‌లాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. ఈ సీజన్లో కార్తీక్, మోర్గాన్ కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే మోర్గాన్ సారథిగానూ విజయవంతం కావాలి. ఈ తాజా మార్పువల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆశిస్తున్నాం. రెండేళ్లుగా జట్టును నడిపించిన కార్తీక్‌కు అభినందనలు’ అని ఆయన తెలిపారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇంగ్లండ్ క్రికెటర్ ఓ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడు కావడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఇంగ్లండ్‌కే చెందిన కెవిన్ పీటర్సన్ 17 మ్యాచ్‌ల్లో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరు మ్యాచ్‌ల్లో... 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు 11 మ్యాచ్‌ల్లో పీటర్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
‘అందుకే సచిన్ గొప్ప సారథి కాలేదు’
హైదరాబాద్: అత్యధిక పరుగులు, వంద సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్ అనుభవం, యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగల సమర్థుడు, క్లిష్ట సమయాల్లో జట్టు సమైక్యతను కాపాడిన ఘనుడు ఇలా అనేక ప్రశంసలు, ఘనతలు అందుకున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గొప్ప సారథినని మాత్రం నిరూపించుకోలేకపోయాడు. అతడి కెరీర్లో ఏదైనా చిన్న అసంతృప్తి ఉందంటే అది కెప్టెన్సీనే. ఆటగాడిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్న సచిన్ నాయకుడిగా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడంటూ కొందరు బహిరంగంగానే విమర్శించారు. అయితే సారథిగా సచిన్ ఎక్కడ విఫలమయ్యాడో మాజీ క్రికెటర్, ప్రపంచకప్-1983 గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్‌లాల్ తాజాగా వివరించాడు. (‘2007లోనే రిటైర్మెంట్కు సచిన్ ప్లాన్’) ‘సచిన్ గొప్ప సారథి కాదనే వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం ఏకీభవించను. బాధ్యత గల సారథిగా అతడు తన వ్యక్తిగత ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కానీ మిగతా పది మంది ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. మంచి ప్రదర్శన చేయాలని వారిపై ఒత్తిడి తేలేదు. అయితే ఆ సమయంలో వారు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే సచిన్ కూడా గొప్ప సారథి అయ్యుండే వాడు. క్రికెట్లో కెప్టెన్ ఒక్కడే రాణిస్తే విజయాలు సాధించలేము. ఆ ఒక్కడితో పాటు మిగతా పది మంది బాధ్యతాయుతంగా ఆడితేనే విజయం సాధిస్తాం. దీన్ని సమన్వయం చేయడం కష్టమే. కొని సార్లు సహచర ఆటగాళ్లతో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో సచిన్ కాస్త వెనకపడ్డాడు. గొప్ప సారథి కాలేకపోయాడు’ అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు. (ఆ వార్తలను నమ్మకండి : ఆఫ్రిది) 1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్ గల బోర్డర్-గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును ముందుండి నడిపించాడు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయాడు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం. -
‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’
హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసిర్ హుస్సెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అనేక జట్లు మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలనే ఫార్ములా పాటిస్తున్నాయని పేర్కొన్న హుస్సెన్ ఆ ఫార్ములా భారత్‌కు వర్తించదని అన్నారు. ఎందుకుంటే ప్రస్తుత సారథి కోహ్లికి కెప్టెన్సీ పంచుకోవడం ఇష్టముండదని అభిప్రాయపడ్డాడు. కోహ్లి చాలా గంభీరమైన వ్యక్తి అని, తన బాధ్యతలను మరొకరితో పంచుకునేందుకు ఇష్టపడడని తెలిపాడు. అయితే ఇంగ్లండ్ విషయంలో ఇలా కుదరదని, మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉంటారని గుర్తుచేశాడు. ఇక ఫార్మట్కొక కోచ్ ఉండాలనే కొత్త ప్రతిపాదనను నాసిర్ హుస్సెన్ తెరపైకి తీసుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రెవర్ బెయిలీస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయవంతం అయ్యాడని కానీ టెస్టు క్రికెట్లో అంతగా సక్సెస్ కాలేదని అభిప్రాయపడ్డాడు. బెయిలీస్ శిక్షణలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ విజయం సాధించిందని కానీ టెస్టుల్లో ఘోరంగా విఫలమైందన్నాడు. ఈ కారణంగానే మూడు ఫార్మట్లకు వేర్వేరు కోచ్‌లు ఉంటే బాగుంటుందని హుస్సెన్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్ని ఫార్మట్లలో అత్యుత్తమ కోచింగ్ ఇస్తున్నాడని, అతడి శిక్షణలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని నాసిర్ హుస్సెన్ ప్రశంసించాడు. చదవండి: ‘అర్జున’కు బుమ్రా, ధావన్! ‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’ -
మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
మెల్బోర్న్ : ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ సరైన వ్యక్తి కాదంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల మీడియా సమావేశంలో మైకేల్ క్లార్క్ పాల్గొనగా.. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను మళ్లీ నియమించాలంటారా? అని ఒక విలేకరి ప్రశ్నించాడు. 'ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది కెప్టెన్లు అవసరం లేదు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్ ఉండడం కన్నా.. మూడు ఫార్మాట్లకూ కలిపి ఒకే కెప్టెన్ ఉండటం మంచిది' అని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్ తర్వాత కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. (భార్యకు విడాకులు.. భరణంగా రూ.285 కోట్లు!) 'పాట్ కమిన్స్ ఆటను బాగా అర్ధం చేసుకుంటాడు. అతను ఓపెనింగ్ బౌలర్ మాత్రమే గాక బ్యాటింగ్ కూడా చేయగలడు. మైదానంలోనూ కమిన్స్ చాలా చురుకుగా ఉంటాడు. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటి పరిస్థితుల్లో ఆసీస్ జట్టుకు ఉత్తమ కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్.. అది నేనూ ఒప్పుకుంటా.. కానీ కెప్టెన్సీ చేయడానికి సరైన వ్యక్తి మాత్రం కాదనుకుంటున్నా. ఇక టిమ్ పైన్ ఇప్పటికే కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైన్ వీడ్కోలు చెప్పేవరకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కొనసాగే హక్కు అతనికి ఉంది. టిమ్ ఇప్పుడు 35 ఏళ్లు ఉన్నాడు. ఈ వేసవి తర్వాత అతను వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నా. హోమ్ సిరీస్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే టిమ్ పైన్ వీడ్కోలు పలకడానికి అదే అనువైన సమయం అంటూ' మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. (మైకేల్ క్లార్క్ భావోద్వేగ సందేశం) కాగా బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిషేధం కారణంగా స్మిత్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. దీంతో పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్ట్ ఫార్మాట్‌కు టిమ్ పైన్ కెప్టెన్లుగా ఉన్నారు. స్మిత్ పునరాగమనం చేసి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆసీస్ మాజీలు మళ్లీ స్మిత్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్న తరుణంలో క్లార్క్ మాత్రం స్మిత్ కెప్టెన్‌గా సరైన వ్యక్తి కాదంటూ తేల్చి చెప్పాడు.(జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం) -
కోహ్లి కెప్టెన్సీపై యువీ కూడా..
ముంబై : ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి సారథ్యంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సారథిగా కోహ్లి అన్‌ఫిట్ అంటూ కొందరు బహిరంగంగా విమర్శించారు. మరికొందరు కోహ్లి కెప్టెన్సీని కేవలం టెస్టులకే పరిమితం చేయాలని సూచించారు. అయితే వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా అదరగొట్టడంతో.. కోహ్లికి కాస్త ఉపశమనం లభించింది అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా మరోసారి నిరుత్సాహపరిచింది. దీంతో కోహ్లి కెప్టెన్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కోహ్లి కెప్టెన్సీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి వర్క్‌లోడ్ ఎక్కువైందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే కెప్టెన్సీ నుంచి తప్పిస్తే బెటర్ అని అభిప్రాయపడ్డాడు. ‘విరాట్ కోహ్లి బెస్ట్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడికి వర్క్‌లోడ్ ఎక్కువైందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే.. కేవలం టెస్టు సారథ్య బాధ్యతలకు పరిమితం చేయాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథిగా రోహిత్ శర్మను నియమిస్తే బెటర్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ రోహిత్ సారథ్యంలోనే అనేక విజయాలను అందుకుంది. అతడిపై పూర్తి విశ్వాసం ఉంది. కెప్టెన్‌గా విజయవంతం అవుతాడనే నమ్మకం ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి జట్లు కూడా మూడు ఫార్మట్లకు ఒక్కరినే కెప్టెన్‌గా నియమించడంలేదు. దీనిపై మేనేజ్మెంట్ ఆలోచించాలి. అయితే అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి.. కోహ్లి సారథిగా విఫలమయ్యాడని అనుకుంటే పొరపాటే. కేవలం వర్క్‌లోడ్ ఎక్కువైందనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశాను. రోహిత్ శర్మను టెస్టుల్లో ఓపెనర్‌గా ఎప్పుడు ప్రయోగించాల్సింది. ఆలస్యం చేశారు. అయితే ఒకటి, రెండు టెస్టులతో ఓ ఆటగాడిపై అంచనా వేయలేం. కనీసం పది టెస్టులైన ఆడే అవకాశం ఇవ్వాలి. ఆలా అయితే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం దక్కుతుంది. అప్పుడు ఆటగాడి సత్తా ఏంటో తెలుస్తుంది. రోహిత్‌కు కూడా కనీసం 6 టెస్టులైనా ఆడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే రోహిత్ టెస్టు ప్రతిభ బయటపడుతుంది. ఇక కేఎల్ రాహుల్‌కు అనేక అవకాశాలు దక్కాయి. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మంచి ప్రతిభ గల ప్లేయర్. త్వరలోనే తిరిగి టీమిండియాలోకి వచ్చి చేరుతాడని ఆశిస్తున్నా’అంటూ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. -
విరాట్ కోహ్లి గొప్ప కెప్టెనేం కాదు!
హైదరాబాద్: మ్యాచ్ మ్యాచ్‌కు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ క్రికెట్లో సరికొత్త అధ్యయాన్ని టీమిండియా సారథి విరాట్ కోహ్లి లిఖిస్తున్న విషయం తెలిసిందే. ఆటగాడిగా, సారథిగా అపురూప విజయాలును సాధిస్తున్న కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఎన్డీటీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ.. ‘ప్రస్తుత బ్యాట్స్మన్లలో విరాట్ కోహ్లికి నేను వీరాభిమానిని. ప్రస్తుత క్రికెట్లో అతడే అత్యుత్తమం. కానీ కోహ్లి నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ధోని నుంచి నాయకత్వ లక్షణాల గురించి కోహ్లి చాలానే నేర్చుకోవాలి. ఎంఎస్ ధోనిలా మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే కోహ్లి ఇంకాస్త పరిణితి చెందాలి. నా దృష్టిలో ధోనినే అత్యుత్తమ సారథి. ధోని కూల్ కెప్టెన్సీ, మైదనంలో తీసుకునే నిర్ణయాలకు ఫిదా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఆఫ్రిది ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం కోహ్లి సేన ఆస్ట్రేలియాపై గెలవడమనేది వారి చేతుల్లోనే ఉందన్నాడు. పొరపాట్లకు ఆస్కారమివ్వకుండా ఆడితే టీమిండియా సులువుగా గెలుస్తుందన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా బలంగా ఉందన్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ జట్లలో అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు టీమిండియానేనని ప్రశంసించాడు. ఆసీస్ బౌన్సీ పిచ్‌లకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, కాస్త జాగ్రత్తగా ఆడితే సులువుగా పరుగులు రాబట్టవచ్చాన్నాడు. -
రోహిత్ వారి సరసన చేరేనా?
టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మన్, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజర్.. ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని.. నిలకడలేని బ్యాట్స్‌మెన్.. అనుభవం లేని యువ ఆటగాళ్లు.. టీమిండియా ఏ ఇతర జట్టుపై ఓడిపోయినా అభిమానులు తట్టుకుంటారు కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఓడితే మాత్రం జీర్ణించుకోలేరు. ఇన్ని ప్రతికూల సవాళ్ల మధ్య ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. సెలక్టర్లు కోహ్లికి విశ్రాంతిని ఇచ్చినప్పుడల్లా రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇప్పటివరకు సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెడుతూ కెప్టెన్‌గా తనకు తాను నిరూపించుకున్నాడు. కానీ ఆసియా కప్‌లో అసలైన సవాలు రోహిత్ ముందుంది. ఆటగాళ్లకు ‘పరీక్షా’సమయం 2019 ప్రపంచకప్ దృష్ట్యా సెలక్టర్లు ఆటగాళ్లను ఈ టోర్నీలో పరీక్షించనున్నారు. విరాట్ కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ బలాన్ని అంచనావేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, మనీష్ పాండే సామర్థ్యంపై ఒక అంచనాకు రానుంది. ఇక గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన కేదార్ జాదవ్, భువనేశ్వర్‌లు ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. సీనియర్ ఆటగాడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్న విషయమూ ఈ టోర్నీ ద్వారా స్పష్టమవుతుంది. కొత్త లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ టీమిండియాకు అదనపు బలమవుతాడా అనేది కూడా తేలనుంది. ఆటగాళ్లను పరీక్షిస్తునే తనకు తాను రోహిత్ శర్మ ప్రూవ్ చేసుకోవాలి. ఆసియా కప్‌లో టీమిండియాదే ఆదిపత్యం ఆసియా కప్‌ను టీమిండియా ఆరు సార్లు ముద్దాడింది. కపిల్‌దేవ్, దిలీప్ వెంగ్ సర్కార్, అజారుద్దీన్, ఎంఎస్ ధోనిలు ఆసియా కప్‌ను టీమిండియాకు అందించిన విజయవంతమైన సారథులు. అజారుద్దీన్, ఎంఎస్ ధోనిల నాయకత్వంలో రెండేసి సార్లు ఈ మెగా టోర్నీని భారత జట్టు గెలుచుకుంది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న మరో సారి టైటిల్ నిలబెట్టుకుంటుందా? ఆసియా కప్‌ను అందించిన దిగ్గజ సారథుల సరసన రోహిత్ శర్మ చేరుతాడా? అంటూ ప్రస్తుతం క్రీడా విశ్లేషకులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. కెప్టెన్‌గా విజయవంతం రోహిత్ కెప్టెన్సీ సత్తా గురించి ఐపీఎల్‌లోనే అందరికీ అర్థమైంది. అందుకే సెలక్టర్లు కూడా ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ వైపే మొగ్గుచూపుతున్నారు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా మూడు వన్లేల్లో రెండు, తొమ్మిది టీ20ల్లో ఎనిమిది మ్యాచ్‌లు గెలుపొందింది. కీలక నిదహాస్ ట్రోఫీ కూడా ఈ ఓపెనర్ సారథ్యంలోనే టీమిండియా గెలుపొందింది. ఇక సారథ్య బాధ్యతల్లోనూ రోహిత్ బ్యాటింగ్‌లో చెలరేగుతున్నాడు. వన్డేల్లో మరోసారి డబుల్ సెంచరీ, టీ20లో టీమిండియా తరుపున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది నాయకుడిగా ఉన్నప్పుడే. -
కెప్టెన్సీ అందుకే వదులుకున్నా: ధోని
సాక్షి, స్పోర్ట్స్: క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి సముచిత స్థానం ఉంటుంది. సారథిగా, ఆటగాడిగా ఎన్నొ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కూల్ కెప్టెన్సీతో, బెస్ట్ ఫినిషింగ్‌తో జట్టుకు ఎన్ని చిరస్మరణీయ విజయాలు అంధించాడు. 2014 మెల్బోర్న్ టెస్టు అనంతరం లాంగ్ ఫార్మట్ క్రికెట్ నుంచి తప్పుకున్న ఈ రాంచీ డైనమెట్.. హఠాత్తుగా 2017లో వన్డే, టీ20 క్రికెట్ ఫార్మట్ల సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే అప్పట్లో తీసుకున్న సంచలన నిర్ణయంపై ధోని తాజాగా స్పందించాడు. ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లికి బాధ్యతలు ఆగమేఘాల మీద అప్పజెప్పింది కాదని మిస్టర్ కూల్ వివరించాడు. ‘2019 ప్రపంచ కప్‌కు బలమైన జట్టును తయారు చేసుకోవడానికి కొత్త కెప్టెన్‌కు సమయం కావాలి. ముందు సారథిగా అతను కుదురుకోవాలి. ఆ తర్వాత తన వ్యూహాలకనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాడు. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను సరైన సమయంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాను’ అంటూ ధోని పేర్కొన్నాడు. గతంలో కూడా ధోని ముందు చూపు నిర్ణయాలు భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసాయని, నిజమైన నాయకుడి లక్షణాలు ధోనిలో ఉన్నాయని నెటిజన్లు మాజీ సారథిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
కోహ్లి కెప్టెన్సీలో తొలిసారి
లీడ్స్: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయింది. విరాట్ కోహ్లి సారథ్యంలో అప్రతిహత విజయాలతో దూసుకపోతున్న టీమిండియా జోరుకు వన్డేల్లో ‘నంబర్‌వన్’ జట్టు ఇంగ్లండ్ కళ్లెం వేసింది. కోహ్లి కెప్టెన్సీలో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. 2013, 14లలో జింబాబ్వే, శ్రీలంకలతో వన్డే సిరీస్‌లకు తాత్కాలిక కెప్టెన్‌గా వహించి టీమిండియాను కోహ్లి గెలిపించాడు. అనంతరం 2017లో ధోని నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు విరాట్ కోహ్లి చేపట్టాడు. కొత్త నాయకుడి సారథ్యంలో టీమిండియా వరుసగా ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకుంది. కాగా, ఈ విజయపరంపరకు ఇంగ్లండ్ బ్రేక్ వేసింది. ఈ ఓటమితో 30 నెలల తర్వాత తొలిసారి టీమిండియా దైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. చివరిసారిగా(2016లో) ఆస్ట్రేలియా 4-1తో టీమిండియాపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ రికార్డులు.. టీమిండియాతో జరిగిన సిరీస్‌ను గెలవడంతో స్వదేశంలో ఇంగ్లండ్ వరుసగా ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా సిరీస్‌లు గెలవడం 2010-12 అనంతరం ఇదే తొలిసారి. ఇక వన్డేల్లో ఇంగ్లండ్ తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా జోయ్ రూట్(13) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు ట్రెస్కోథిక్(12) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. -
కెప్టెన్సీలో కోహ్లి ఫిఫ్టీ.. విజయాలెన్ని?
నాటింగ్‌హామ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్.. కెప్టెన్‌గా కోహ్లికి 50వ వన్డే మ్యాచ్. దీంతో ఈ ఫీట్ అందుకున్న 7వ భారత బ్యాట్స్‌మన్‌గా ఈ 29 ఏళ్ల ఆటగాడు గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక 50 మ్యాచ్‌ల్లో 39 విజయాలందించి.. తొలి 50 వన్డేలకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించి ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 41 విజయాలతో ప్రథమస్థానంలో ఉండగా, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ ల్యూయిడ్ 40 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాది జనవరిలో మహేంద్రసింగ్ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కోహ్లికి ఆ అవకాశం దక్కిన విషయం తెలిసిందే. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
అశ్విన్‌ను టీమిండియా కెప్టెన్ చెయ్యండి
సాక్షి, ముంబై: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీంకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంచి సక్సెస్ రేటుతో సమర్థవంతంగా జట్టును నడిపిస్తూ పంజాబ్‌ను ప్లే ఆఫ్‌కి చేరువలో నిలిపాడు. ఈ నేపథ్యంలో అశ్విని శక్తిసామర్థ్యాలను ఓ అంచనా వేసిన ఆసీస్ మాజీ ప్లేయర్ జోయ్ దావ్స్.. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు . టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ అయిన జోయ్ దావ్స్ ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ... ‘అశ్విన్ చాలా గొప్ప ఆటగాడు. మైదానంలో అతని మేధస్సు అద్భుతంగా పని చేస్తుంటుంది. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బౌలర్లకు అతనిచ్చే స్వేచ్ఛ ఏ కెప్టెన్‌లోనూ కనిపించలేదు. అందుకే పంజాబ్ టీం బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పైగా డేవిడ్ మిల్లర్, యువీ, ఫించ్‌లను పక్కనపెట్టాలన్న అతని నిర్ణయాలు బాగా పనిచేశాయి. అన్నింటికి మించి గేల్ బ్యాటింగ్ అశ్విన్‌కు కలిసొచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అతను సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తాడన్న నమ్మకం ఉంది. అతన్ని టీమిండియా కెప్టెన్ చేస్తే మంచిదన్నది నా అభిప్రాయం’ అని దావ్స్ తెలిపారు. ఇక కొత్తరకం బంతులు సంధించాలన్న అశ్విన్ ఆరాటం.. భవిష్యత్తులో అతన్ని మరింత గొప్ప ఆటగాడిగా మలుస్తుందని దావ్స్ అన్నారు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ లైనప్ అంత పటిష్టంగా లేదని, భువీ, బుమ్రాలను మాత్రమే నమ్ముకుంటే సరిపోదని ఆయన చెప్పారు. టెస్ట్ క్రికెట్లోనే రాణిస్తున్న షమీ, ఉమేశ్ యాదవ్‌లు వన్డేలో కూడా సత్తా చాటగలరన్న నమ్మకం తనకుందని, వరల్డ్ కప్ కోసం వారిని సిద్ధం చేయాల్సిన అవసరం టీమ్ మేనేజ్మెంట్కు ఉందని దావ్స్ పేర్కొన్నారు. కాగా, దావ్స్ 2012-2014 మధ్య టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. -
ఆ విషయంలో ధోని సలహా తీసుకునేవాడిని: సచిన్
‘సచిన్ టెండుల్కర్’...పరిచయం అక్కరలేని పేరు. ఆటతోనే కాక వ్యక్తిత్వంతోను క్రికెట్ చరిత్రలో ధృవతారగా నిలిచాడు. ప్రపంచానికి దిగ్గజ క్రికెటర్ అయితే భారతీయులకు మాత్రం ‘క్రికెట్ దేవుడు’. ఈ మాస్టర్ బ్లాస్టర్ 2013లోనే అన్ని తరహాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికి, నేటికి అభిమానుల దృష్టిలో దైవంగానే పూజింపబడుతున్నాడు. సచిన్ ఈ మధ్యే ఒక చాట్ షోలో పాల్గొని, పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా మరోసారి తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. మైదానంలో ఉన్నప్పుడు ధోనిని అడిగి ఫీల్డింగ్ పోజిషన్‌కు సంబంధించిన సలహాలు, సూచనలను తీసుకునేవాడినని తెలిపారు. ఫీల్డింగ్ పోజిషన్ గురించి తన అభిప్రాయలను ధోనితో చెప్పి, వాటి గురించి అతని అభిప్రాయాన్ని తెలుసుకునేవాడినని అన్నారు. ఈ విషయాల గురించి ధోనితో చర్చిస్తున్న సందర్భంలోనే తనకు ధోనిలో జట్టును నడిపించే సామర్థ్యం ఉన్నట్టు అర్థమైదన్నారు. అందుకే తాను ధోనిని కెప్టెన్‌గా సూచించానన్నారు. అలానే వెస్టిండీస్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ఆ మ్యాచ్‌ను చూడడానికి తొలిసారి తన అమ్మగారు స్టేడియానికి వచ్చారని తెలిపారు. ఆ సమయంలో ధోని తనను హడిల్ నుంచి దూరంగా ఉండమని కోరాడని, తనకు వీడ్కోలు ఇవ్వడానికి వారు ఏదో ప్లాన్ చేస్తున్నారనే విషయం తనకు అర్థమైందన్నారు. ఆ క్షణంలో తాను చాలా భావోద్వేగానికి గురయ్యానన్నారు. కుటుంబ సభ్యులను చూస్తూ తాను ఆట మీద సరిగ్గా దృష్టి పెట్టలేనని అందుకే వారిని మ్యాచ్ చూడటానికి రమ్మని ఆహ్వానించనన్నారు. ఒక వేళ వారు వచ్చిన తనకు కనిపించకుండా ఉండమని చెప్తానన్నారు. 2003 - 04లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్‌ను చూడటానికి తన భార్య అంజలి వచ్చిందని, ఆ సమయంలో తాను మొదటి బంతికే అవుటయ్యానని తెలిపారు. దాంతో అంజలి వెంటనే స్టేడియం నుంచి వెళ్లిపోయిందన్నారు. మళ్లీ తన చివరి మ్యాచ్‌ను చూడటానికే వచ్చిందని, మధ్యలో ఎప్పుడు తన మ్యాచ్‌లు చూడటానికి రాలేదని తెలిపారు. -
కెప్టెన్సీ వల్ల అతను రాటుదేలాడు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా నియమించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ దేశ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. గత ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచిన పంజాబ్ జట్టు ఈసారి అనూహ్యంగా సారథిగా మాక్స్‌వెల్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా క్రికెటర్ హషిం ఆమ్లాను, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను పక్కనబెట్టి మరీ మాక్స్‌వెల్‌కు కెప్టెన్సీ ఇచ్చింది. అతని సారథ్యంలో పంజాబ్ జట్టు శుభారంభాన్ని చేసింది. వరుసగా రెండు విజయాలు సాధించింది. ఛేజింగ్ విజయాలైన ఈ రెండు మ్యాచ్‌లలోనూ 44, 43 పరుగులు చేసిన మాక్స్వెల్.. ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ స్పందిస్తూ.. కెప్టెన్సీ మాక్స్‌వెల్‌ను రాటుదేల్చినట్టుందని, అతను తనలోని ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘అతన్ని కెప్టెన్‌ను చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, అతనికీ అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఇది అతనిలోని ఉత్తమ ప్రతిభను వెలికితీస్తున్నదని భావిస్తున్నా. ఐపీఎల్ క్రికెట్లో అతను కొనేళ్ల కిందట అంత బాగా రాణించలేదు. కానీ గత ఏడాది నుంచి అతను బాగా ఆడుతున్నాడు’ అని పాంటింగ్ అన్నాడు. ఇటీవల ఇండియాతో జరిగిన టెస్టులో తొలి సెంచరీని మాక్స్వెల్ సాధించాడని, అతను మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నానని పాంటింగ్ చెప్పాడు. -
'మూడింటికీ' ఒక్కడు చాలు
మహేంద్ర సింగ్ ధోని మనసు విప్పాడు. దాదాపు రెండేళ్ల క్రితం టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో, ఇటీవల వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు కూడా తన నిర్ణయాలతో అందరికీ షాక్ ఇచ్చిన అతను, ఇప్పుడు ఆ విషయాల్లో తన అంతరంగాన్ని బయట పెట్టాడు. రెండు సందర్భాల్లోనూ సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వకుండా ఏకవాక్య ప్రకటనతోనే సరిపెట్టిన ధోని, నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి తన ఆలోచనలు పంచుకున్నాడు. పుణే: భారత వన్డే, టి20 జట్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడం అనూహ్య నిర్ణయం ఏమీ కాదు. దాదాపు ఏడాది క్రితమే అతని మనసులో ఈ ఆలోచన వచ్చింది. అయితే మైదానంలో తాను తీసుకునే నిర్ణయాలలాగే దీని గురించి కూడా తీవ్ర మేధోమథనం చేసిన తర్వాతే అతను నిర్ణయం తీసుకున్నాడు. పరిస్థితులు ఆశించిన విధంగా అంతా అనుకూలంగా మారిన తర్వాత తన అవసరం లేదని భావించి బాధ్యతల భారం దించుకున్నాడు. ఈ విషయాలన్నీ ధోని స్వయంగా వెల్లడించాడు. ఇక ముందు తాను ఇచ్చే వంద సలహాలను కూడా తిరస్కరించే హక్కు కోహ్లికి ఉందన్న ధోని, శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాల్లోని విశేషాలు అతని మాటల్లోనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై... 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసినప్పుడే నేను దానిని ఆఖరిదిగా భావించాను. అయితే వేర్వేరు కారణాలతో మరి కొన్ని సిరీస్‌లకు కూడా కెప్టెన్‌గా కొనసాగాను. ఆ తర్వాతే నేను కెప్టెన్‌గా ఉండదల్చుకోలేదని చాలా ముందుగానే బీసీసీఐకి చెప్పాను. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు అనే విధానాన్ని నేను నమ్మను. మన దేశంలో అది పనికి రాదు. నేను టెస్టుల నుంచి రిటైర్ అయిన సమయంలోనే దీనిపై నాకు స్పష్టత ఉంది. ఏ జట్టుకైనా నాయకుడంటే ఒక్కడే ఉండాలి. విరాట్ కోసమే ఆగాను... పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు సరైన సమయం కోసం ఆగాను. 2014 డిసెంబర్లో కోహ్లి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నప్పుడే నా మనసులో ఆలోచన వచ్చేసింది. టెస్టుల్లో విరాట్ పని సులువయ్యే వరకు ఎదురు చూశాను. వరుస మ్యాచ్‌లలో విజయాలతో అతను కుదురుకున్నాడు. ఇది నేను తప్పుకునేందుకు తగిన సమయం. నా నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు మన జట్టులో మంచి ప్రతిభతో పాటు అనుభవం కూడా వచ్చేసింది. ఎంతో ఒత్తిడిలో కూడా అంతా బాగా ఆడుతున్నారు. ఈ జట్టుతో కోహ్లి నాకంటే ఎక్కువ విజయాలు సాధిస్తాడు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ చరిత్రను మార్చగల సామర్థ్యం ఈ జట్టుకు ఉంది. నేను చాంపియన్స్ ట్రోఫీ వరకు ఉన్నా పెద్ద తేడా రాదు. అదే కోహ్లి అయితే ఇప్పటి నుంచి టోర్నీ వరకు జట్టును నడిపి విజేతగా నిలపగలడు. కోహ్లితో సంబంధాలపై... మా ఇద్దరి మధ్య మంచి ఆత్మీయత ఉంది. అవకాశం దొరికిన ప్రతీసారి మరింత మెరుగు పడేందుకు, మరింత ఎక్కువ సమర్థంగా తన ఆటను ప్రదర్శించేందుకు తాపత్రయ పడే వ్యక్తిత్వం అతనిది. అదే అతనిలో గొప్ప విషయం. మేమిద్దరం చాలా ఎక్కువగా మాట్లాడుకుంటాం. క్రికెట్‌పరంగా, ఆలోచనాపరంగా అతను ఎంతో ఎదిగాడు. ఇంకా ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు. ఇక ముందు కూడా అతనికి అండగా నిలుస్తాను. మున్ముందు జట్టులో సభ్యుడిగా... ఏ జట్టులోనైనా వికెట్ కీపర్ అంటే మరో మాట లేకుండా వైస్ కెప్టెన్లాంటివాడే. కెప్టెన్ ఆలోచనల ప్రకారం అతడికి ఏం అవసరమో చూసి అందుకు సహకరిస్తాను. కెప్టెన్‌గా మైదానంలో ఫీల్డింగ్ ఏర్పాటు చేసే సమయంలో కోహ్లి ఆలోచనలు ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పటికే నేను అతనితో చర్చిం చాను కూడా. దీనిని నేను దృష్టిలో పెట్టుకుంటాను. అతడిని గందరగోళ పెట్టకుండా 100 సలహాలైనా ఇస్తాను. వాటన్నింటినీ తిరస్కరించే అధికారం అతనికుంది. ఎందుకంటే చివరకు అన్నింటికీ అతనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం చేసినా భారత జట్టుకు మేలు చేయడం ముఖ్యం. నాలుగో స్థానంలో ఆడటంపై... నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టు కోసం నేను అదనపు బాధ్యత తీసుకోవాలని భావించి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. నాలుగో స్థానంలో ఆడటానికే నేను ప్రాధాన్యతనిస్తా. కానీ మరెవరైనా అక్కడ నాకంటే బాగా ఆడుతూ, జట్టుకు ఉపయోగపడితే మంచిదే. జట్టు అవసరాలను బట్టే నేను ఆడతాను. వ్యక్తుల కంటే టీమ్ ముఖ్యం. టెస్టుల నుంచి తప్పుకోవడంపై... సిరీస్ మధ్యలోనే నేను రిటైర్ కావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే లోతుగా ఆలోచిస్తే అది మంచి నిర్ణయం. ఎందుకంటే నేను ఒక టెస్టు అదనంగా ఆడితే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ అక్కడే జట్టుతో ఉన్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ఆస్ట్రేలియా గడ్డపై మరో టెస్టులో బరిలోకి దిగడం ఎంతో ఉపకరిస్తుంది. మున్ముందు అతనే జట్టులో ఉంటాడు కాబట్టి విదేశీ పర్యటనల్లో ఈ అనుభవం పనికొస్తుంది. విరాట్ కెప్టెన్సీ గురించి కూడా ఇదే తరహాలో భావించాను. కెప్టెన్సీ ప్రయాణంపై... జీవితంలో ఫలానాది చేయలేకపోయాననే బాధ నాకు ఏ విషయంలోనూ లేదు. జట్టులో నాకంటే సీనియర్లతో కలిసి పని చేశాను. జూనియర్లతో కూడా మంచి ఫలితాలు సాధించాను. అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించిన సమయంలో సహజంగానే దృఢంగా మారతాం. ఈ ప్రయాణంలో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. దీని గురించి ఆలోచించినప్పుడల్లా నా మొహంపై చిరునవ్వు పూస్తుంది. కష్ట సమయంలో లేదా ఆనందంగా ఉన్నప్పుడు కూడా అన్నింటినీ ఒకే తరహాలో స్వీకరించాను. కెప్టెన్‌గా పని చేసిన శైలిపై... తన జట్టులోకి ఆటగాళ్ల సామర్థ్యం ఏమిటో తెలిసి ఉండటమే కెప్టెన్ ప్రధాన బాధ్యత. నాయకుడు వాస్తవికంగా ఆలోచించాలి. నిజాయితీగా ఉండాలి. ఒక్కో వ్యక్తి నుంచి వేర్వేరుగా ఎలా పని రాబట్టాలో, ఏది జట్టుకు పనికొస్తుందో గుర్తించాలి. ఆ ఆటగాడు వంద శాతం శ్రమించేలా ప్రోత్సహించాలి. కొందరిని మామూలు మాటలతో చెబితే, మరికొందరితో గట్టిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొందరికి కళ్లతో అలా సైగ చేస్తే చాలు. కొన్నిసార్లు వరుసగా విఫలమైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచాల్సి వస్తుంది. కీలకమైన మ్యాచ్‌లలో జట్టును గెలిపించే ఆటగాడిని గుర్తించడం అవసరం. -
కరుణ్ నాయర్‌కు చాన్స్!
ధావన్ తిరిగి వచ్చే అవకాశం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు నేడు వన్డే, టి20 జట్ల ప్రకటన ముంబై: మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీనుంచి తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విరాట్ కోహ్లి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం లాంఛనంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్ కోసం జట్టును ప్రకటించనున్న సెలక్టర్లు కెప్టెన్‌గా కోహ్లి పేరును ప్రకటిస్తారు. జట్టు ఎంపిక సమయంలో కోహ్లి కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఆటగాడిగా ధోని తన స్థానం నిలబెట్టుకోవడంపై కూడా ఎలాంటి సందేహాలు లేవు. భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 15న తొలి వన్డే కాగా, ఫిబ్రవరి 1న చివరి టి20తో సిరీస్ ముగుస్తుంది. అశ్విన్‌కు విశ్రాంతి! భారత జట్టు న్యూజిలాండ్‌తో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్, షమీ, జడేజా దూరంగా ఉన్నారు. వీరిలో షమీ ప్రస్తుతం గాయంనుంచి కోలుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో కీలకమైన టెస్టుల సిరీస్ కోసం అశ్విన్‌కు మళ్లీ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే టెస్టుల తర్వాత తగినంత విశ్రాంతి లభించడంతో జడేజా మాత్రం తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడిని తీసుకోకపోతే రంజీ సీజన్లో అత్యధిక వికెట్లతో (56) సత్తా చాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ పేరు కూడా ఎంపిక కోసం వినిపిస్తోంది. వైజాగ్‌లో జరిగిన తన ఆఖరి వన్డేలో చెలరేగిన మిశ్రాకు చోటు ఖాయం. పేస్ బౌలింగ్‌పరంగా కూడా కొత్త ప్రయోగాలకు ఆస్కారం ఏమీ లేదు. బుమ్రా, ఉమేశ్‌లు జట్టులో స్థానం నిలబెట్టుకుంటారు. అయితే షమీ, ధావల్ కూడా గాయాలబారిన పడటంతో ఇషాంత్‌కు మళ్లీ వన్డేలు ఆడే అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్‌లో ఇంకా రోహిత్ శర్మ, రహానే కోలుకోలేదు. కాబట్టి చెన్నై టెస్టులో ట్రిపుల్‌తో దుమ్ము రేపిన కరుణ్ నాయర్ వన్డే జట్టులోకీ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో అతను జింబాబ్వేతో మ్యాచ్ ఆడాడు. కివీస్‌తో సిరీస్ ఆడని కేఎల్ రాహుల్ పునరాగమనం చేస్తాడు. జయంత్ యాదవ్ కూడా తన స్థానం నిలబెట్టుకోనున్నాడు. మరో వైపు రెండో ఓపెనర్‌గా పూర్తి ఫిట్‌గా ఉంటే శిఖర్ ధావన్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. రైనా పేరును కేవలం టి20ల కోసం పరిశీలించవచ్చని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మన జట్టు ఇటీవల చెలరేగుతున్న తీరు చూస్తే ఇరు జట్ల ఎంపికలో కూడా పెద్దగా సంచలనాలు ఏమీ ఉండకపోవచ్చు. -
మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం
-
‘మంచు’ కరిగింది...
సాక్షి క్రీడా విభాగం ‘అవసరమైతే దూసుకొస్తున్న ట్రక్కు ఎదురుగా నిలబడగల జట్టు నాకు కావాలి’... కెప్టెన్ అయిన కొత్తలోనే ధోని నోటి నుంచి వచ్చిన పదునైన మాట ఇది. కొండనైనా ఢీకొట్టేందుకు సిద్ధమనే తత్వం అతనిది. జట్టు ప్రయోజనాల ముందు ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతలు, సీనియార్టీలు అతనికి పట్టవు. టీమ్‌కు పనికి రారు అనుకుంటే ‘ఆ ముగ్గురు’ తనకు అవసరం లేదంటూ కరాఖండిగా చెప్పగల మొనగాడు ధోని. గొప్ప నేపథ్యం లేదు, పెద్దల అండదండలూ లేవు. కానీ అతను నాయకుడిగా భారత క్రికెట్‌ను శాసించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ చెలరేగిపోతున్నాడు, బౌలర్లు చేతులెత్తేశారు...అయితే ఏంటి ఆ ముఖంలో ఎక్కడైనా ఆందోళన కనిపించిందా! నరాలు తెగే ఉత్కంఠ, మైదానంలో వేలాది మంది ప్రేక్షకులు... తన ఒక్క నిర్ణయం ఫలితం మార్చేస్తుంది, జీవిత కాలం అది చేదు జ్ఞాపకంలా వెంటాడే ప్రమాదం ఉంది. కానీ అతను భయపడలేదు! నాయకుడు అంటే మైదానంలో హడావిడి చేస్తూ కేకలు పెట్టడం కాదు, ‘మిస్టర్ కూల్’లా చల్లగా ఉంటూ కూడా నిర్ణయాలు తీసుకోవచ్చనేది ధోని వచ్చాకే క్రికెట్ ప్రపంచం తెలుసుకుంది. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్‌తో ఓపెనింగ్ చేయించే సాహసం చేసినా, జోగీందర్ శర్మతో చివరి ఓవర్ వేయించే వ్యూహం రచించినా... అది ఆటగాళ్లపై అతను ఉంచిన నమ్మకం. ఒక్కసారి తాను ఆటగాడిని నమ్మితే ఫలితం రాబట్టే వరకు ఆ ఆటగాడికి అండగా నిలవడం ధోని నైజం. అది రోహిత్ శర్మ కావచ్చు, సురేశ్ రైనా కావచ్చు. కావాల్సిన జట్టు కోసం సెలక్టర్లనే ఎదిరించిన సమయంలో అతనిలో ఒక నియంత కనిపించాడు. కానీ తాను ఏం చేసినా ఫలితాల కోసమే అంటూ చేసి చూపించగలడం ఎమ్మెస్కే చెల్లింది. తనకే సాధ్యమైన శైలి, సంప్రదాయ విరుద్ధమైన ఆలోచనలు, వ్యూహాలు ధోనిని స్పెషల్ కెప్టెన్‌గా మార్చేశాయి. సీనియర్ స్థాయిలో పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా... కుర్రాళ్ల ఆట టి20లో తొలిసారి 2007 ప్రపంచకప్‌తో నాయకుడిగా తొలి అడుగు వేసిన ధోని, ఆ తర్వాత ఇంతింతై వటుడింతై తారాపథానికి చేరుకున్నాడు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ, వెల కట్టలేని విజయాలు అందించిన అత్యుత్తమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ సాధించి మూడు ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఇక 2008లో ఆస్ట్రేలియా గడ్డపై అదే జట్టును వరుసగా రెండు ఫైనల్స్‌లో ఓడించి సాధించిన ముక్కోణపు టోర్నీ విజయం క్రెడిట్ పూర్తిగా ధోనికే దక్కుతుంది. ఇక కేవలం అతని నాయకత్వ ప్రతిభతోనే సొంతం అయిన మ్యాచ్‌లకైతే లెక్కే లేదు. ఎన్ని విజయాలు సాధించినా, వేడుకల్లో అతను ముందు కనిపించడు. సహచరుల సంబరాల్లోనే తన ఆనందం వెతుక్కునే తత్వం ధోని వ్యక్తిత్వాన్ని కూడా గొప్పగా చూపిస్తుంది. 90 టెస్టుల తర్వాత ఆట ముగించాడు, 199 వన్డేలకు నాయకత్వానికి గుడ్‌బై చెప్పాడు. గణాంకాలను, రికార్డులను పట్టించుకోని నిస్వార్థం ధోని స్పెషల్. ఎన్నో మధుర జ్ఞాపకాలు... ఎన్నో ఉద్వేగ భరిత క్షణాలు ధోని కెప్టెన్‌గా మనకు అందించాడు. అతను నాయకత్వం వహించిన తొలి టి20 మ్యాచ్, తొలి వన్డే మ్యాచ్‌లలో వర్షం కారణంగా ఫలితమే రాలేదు. కానీ ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు భారత అభిమానులమంతా అతను అందించిన విజయాల వానలో తడిసి ముద్దయ్యాం! -
'లీడర్' వెడలె...
► వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని ► బీసీసీఐకి సమాచారమిచ్చిన మహి ► ఆటగాడిగా అందుబాటులో భారత క్రికెట్ చరిత్రలో మహా నాయకుడి శకం ముగిసింది. మైదానంలో అందరినీ ఆశ్చర్యపరిచే తన వ్యూహాలలాగే మహేంద్ర సింగ్ ధోని మరోసారి అంచనాలకు అందకుండా వ్యవహరించాడు. ‘కెప్టెన్ ఇలా కూడా ఉంటాడా’ అనిపించిన క్షణాల నుంచి ‘ఇలా కూడా ఉండవచ్చు’ అని చూపిస్తూనే ఇలాగే ఉండాలి అంటూ నిరూపించిన మహేంద్రుడు తన బాధ్యతను ముగించాడు. లీడర్ హోదాలో అన్నగా, అండగా ఎందరో కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మహి, తన కర్తవ్యం పూర్తయిందనిపించాడు. ‘ముందుండి నడిపించే’ భారాన్ని మాత్రం తొలగించుకొని వికెట్ల ముందు, వెనకా మరోసారి తనలోని పాత ధోనిని ప్రదర్శించేందుకు మాత్రం సిద్ధమంటూ ధనాధన్ నిర్ణయం తీసుకున్నాడు. ముంబై: భారత క్రికెట్ జట్టు వన్డే, టి20 జట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్ర సింగ్ ధోని ప్రకటించాడు. జట్టు కెప్టెన్‌గా ఇకపై కొనసాగబోనని అతను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సమాచారం అందించాడు. అయితే ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఆటగాడిగా మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. ఈ వివరాలు బుధవారం బీసీసీఐ ప్రకటించింది. ‘అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని అందించిన సేవలకు ప్రతీ భారత క్రికెట్ అభిమాని, బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అతని నాయకత్వంలో భారత జట్టు అత్యున్నత స్థాయికి చేరింది. అతని ఘనతలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి’ అని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి వ్యాఖ్యానించారు. 2014 డిసెంబర్లో టెస్టు కెప్టెన్సీతో పాటు ఆ ఫార్మాట్‌కే గుడ్‌బై చెప్పిన ధోని, ఇప్పుడు పూర్తిగా టీమిండియా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లయింది. ధోని భారత్‌కు 199 వన్డేల్లో, 72 టి20 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఎందుకీ నిర్ణయం? తాను కెప్టెన్‌గా వ్యవహరించిన కాలంలో నాయకత్వ వైఫల్యాలపై విమర్శలు, ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకుంటాడనే ప్రశ్నలు ఎదుర్కోవడం ధోనికి కొత్త కాదు. కోహ్లి టెస్టుల్లో తిరుగులేని లీడర్‌గా ఎదిగిన గత రెండేళ్లలో అది మరింత ఎక్కువైంది. టెస్టుల్లో లేకపోవడం వల్ల జట్టుతో కొనసాగడంలో చాలా విరామం వస్తోంది. ఫలితంగా ఇప్పుడు ఉన్న ఆటగాళ్లంతా ఒకరకంగా ‘కోహ్లి జట్టు’గా మారిపోయారు. ధోని తప్పుకొని కోహ్లిని కెప్టెన్ చేయాలనే డిమాండ్ మళ్లీ మొదలైంది. వీటిని పట్టించుకోకుండా ధోని తన పని తాను చేసుకుంటూ పోయాడు. అయితే టెస్టు టీమ్ అద్భుతాలు చేసిన వెంటనే వన్డేల్లో వచ్చిన సాధారణ ఫలితాలు వద్దన్నా పోలికను తెచ్చి ఎమ్మెస్‌పై ఒత్తిడి పెంచాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా బోర్డు పెద్దలలో అతని నాయకత్వ ప్రతిభపై ఎవరికీ సందేహాలు లేవు. కాబట్టి వెంటనే అవమానకరంగా తొలగిస్తారనే సంకేతాలు కూడా ఏమీ లేవు. రాబోయే కొన్ని సిరీస్‌ల ఫలితాలు ఎలా ఉన్నా కనీసం ఈ ఏడాది జూన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకు అయినా అతను కొనసాగుతాడని అంతా భావించారు. ఆ తర్వాత మాత్రమే 2019 వన్డే వరల్డ్ కప్ కోసం వచ్చే రెండేళ్ల కాలంలో కోహ్లి నేతృత్వంలో జట్టు సిద్ధమవుతుందని అనుకున్నారు. కానీ ధోని మాత్రం మరోలా ఆలోచించాడు. తాను తప్పుకునే సమయం ఆసన్నమైందని భావించాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ కప్ కోసం సన్నాహకం 2017లో ఇంగ్లండ్ నుంచి మొదలు కావాలని కూడా అతను అనుకొని ఉంటాడు. అందుకే తనను తప్పించే అవకాశం ఇవ్వకుండా తనంతట తానుగా నిష్క్రమించాడు. ఆటగాడిగా ఎంతకాలం? టెస్టుల్లో కెప్టెన్‌గానే ఆట ముగించిన ధోని పరిమిత ఓవర్లలో మాత్రం మరొకరి నాయకత్వంలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతని ఫిట్నెస్, దూకుడైన బ్యాటింగ్, తెలివైన వికెట్ కీపింగ్ కలిపి చూస్తే ఈ రెండు ఫార్మాట్లలో కచ్చితంగా అతని అవసరం ఉందనిపిస్తుంది. తన ఆఖరి వన్డే సిరీస్‌లో అతను మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాబట్టి ప్రస్తుతం ఆటగాడిగా ధోని స్థానానికి ఢోకా లేదు. ముఖ్యంగా ఇటీవల తాను నిర్ణయించుకున్న విధంగా నాలుగో స్థానంలో పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఆడాలని అతను ఆశిస్తున్నాడు. గత ఏడాది టి20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలు చూస్తే 2019 వరకు కూడా కొనసాగే ఉద్దేశం ఉందని అర్థమైంది. కానీ ఎంత ఫిట్‌గా ఉన్నా... కొత్త కుర్రాళ్లతో వచ్చే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టిన జట్టులో అతను తన స్థానం కాపాడుకోవాలంటే అద్భుతాలు చేయాల్సిందే. ఈ ఏడాది జులైలో చాంపియన్స్ ట్రోఫీ ముగిసే సమయానికి 36 ఏళ్లు పూర్తయ్యే మహి కొనసాగడంపై మరోసారి ‘స్కానింగ్’ జరగడం మాత్రం ఖాయం! ► ‘ధోనికి శుభాకాంక్షలు. భారత్‌కు రెండు (టి20, వన్డే) ప్రపంచకప్‌లు అందించాడు. నేను చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో మహి ఒకడు. అతని నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలి’ – సచిన్ టెండూల్కర్ ►‘అతని అంకితభావం మనందరికి తెలుసు. ఉన్నతమైన ఆలోచనలతో జట్టును నడిపించాడు. ఇపుడు కెప్టెన్సీపై కూడా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నా’ – సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ -
కోహ్లి, ధోనిలను పోల్చకండి: కిర్‌స్టెన్
కెప్టెన్సీ విషయంలో ధోని, కోహ్లిలను పోల్చవద్దని భారత జట్టు మాజీ కోచ్ కిర్‌స్టెన్ సూచించారు. ఇద్దరూ భిన్నమైన వ్యక్తులని, ఆలోచనా ధోరణి కూడా వేరుగా ఉంటుందని, ఎవరికి వారే గొప్ప కెప్టెన్ అంటూ ప్రశంసించారు. ‘కెప్టెన్‌గా ధోని సహచరులకు ఆదర్శంగా నిలుస్తాడు. కోహ్లి జట్టులో స్ఫూర్తిని పెంచుతాడు. ఇద్దరూ గొప్ప నాయకులే’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కిర్‌స్టెన్ రాజస్తాన్ క్రికెట్ అకాడమీలో పది రోజుల పాటు ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. -
నా కెప్టెన్సీలో వారు సహకరించలేదు!
శ్రీలంక జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన పది నెలల కాలంలో సీనియర్ ఆటగాళ్లనుంచి తనకు తగిన సహకారం లభించలేదని తిలకరత్నే దిల్షాన్ వ్యాఖ్యానించాడు. తాను లార్డ్స్‌లో అద్భుత ఇన్నింగ్స ఆడిన తర్వాత వేలికి గాయమైందని, ఆ సమయంలో బాధ్యత తీసుకునేందుకు జయవర్ధనే, సంగక్కర నిరాకరించారని అతను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత కెప్టెన్ మాథ్యూస్ అయితే తన కెప్టెన్సీ సమయంలో గాయం సాకుతో చాలా తక్కువ సార్లు మాత్రమే బౌలింగ్ చేయడం ఫలితాలపై ప్రభావం చూపించిందని దిల్షాన్ విమర్శించాడు. తనను కెప్టెన్సీనుంచి తొలగించిన తీరుతో కలత చెందినా... ఆ ప్రభావం కనపడకుండా బాగా ఆడానని అతను అన్నాడు. -
నా కెప్టెన్సీపై ‘పిల్’ వేయాల్సిందే!
మెల్బోర్న్: కెప్టెన్‌గా తన పనితీరును అంచనా వేసేందుకు ఇక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాలేమోనని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. వరుస పరాజయాలతో ధోని నాయకత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో అతను ఈ మాట అన్నాడు. ‘నా ప్రదర్శనను నేను సమీక్షిస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అవుతుంది. కాబట్టి ఒక ‘పిల్’ దాఖలు చేసి నా కెప్టెన్సీ పనితీరును విశ్లేషించాలి’ అని అతను చెప్పాడు. బౌలింగ్‌లో అనుభవం లేకపోవడమే జట్టు ఓటమికి కారణమని కెప్టెన్ అభిప్రాయ పడ్డాడు. ఇషాంత్ సీనియర్ అయినా వన్డేల్లో పెద్దగా అనుభవం లేదని... ఉమేశ్ రెగ్యులర్ సభ్యుడు కాకపోగా, మిగతా వాళ్లంతా కొత్త కుర్రాళ్లేనని కెప్టెన్ గుర్తు చేశాడు. నాయకుడి స్థానంలో ఎవరున్నా జట్టు లోపాలు సరిదిద్దడం ముఖ్యమన్న ధోని, ఫీల్డింగ్ వైఫల్యం కూడా మూడో వన్డేలో ఓటమికి కారణమన్నాడు. ఆల్‌రౌండర్‌గా వారి నైపుణ్యం పరిశీలించేందుకే గుర్కీరత్, రిషి ధావన్‌లకు అవకాశం ఇచ్చామని, వారు ఆకట్టుకున్నారని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లిపై ప్రశంసలు: విరాట్ కోహ్లిని చిన్న వయసు నుంచి చూస్తున్నానని, అతను కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతమని ధోని ప్రశంసించాడు. ‘అతను ఇన్నేళ్లలో తన నైపుణ్యం మెరుగుపర్చుకుంటూ నిలకడగా ఆడాడు. భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి ఒకడు. కోహ్లి టాపార్డర్‌లో పనికొస్తాడని గుర్తించడం నేను చేసిన మంచి పని. ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. భవిష్యత్తులో సుదీర్ఘ కాలం పాటు భారత జట్టును ముందుకు నడిపించగల సత్తా అతనిలో ఉంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. -
'కెప్టెన్సీ తీసుకుని తప్పు చేశా'
కరాచీ: కెప్టెన్సీ తీసుకోవడం తన కెరీర్లో చేసిన తప్పని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అన్నాడు. 2007 ప్రపంచ కప్ అనంతరం పాక్ కెప్టెన్‌గా షోయబ్‌ను కెప్టెన్‌గా నియమించారు. జట్టు పగ్గాలు స్వీకరించకుంటే తన కెరీర్ మెరుగ్గా ఉండేదని పెదవి విరిచాడు. అయితే తాను స్వార్థంగా ఆలోచించకపోవడం వల్లే కెప్టెన్ బాధ్యతలు చేపట్టానని షోయబ్ చెప్పాడు. తాను కెప్టెన్ అయినపుడు యువకుడినని, దీంతో కొందరు సీనియర్ ఆటగాళ్లుతో సరిగా వ్యవహరించేవారు కాదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 2007 ప్రపంచ కప్‌లో పాక్ ఘోరంగా విఫలమైంది. అప్పటి పాక్ కోచ్ బాబ్ ఊమర్ హోటల్లో మరణించాడు. అనంతరం అప్పటి కెప్టెన్ ఇంజమామ్ పాక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షోయబ్ పాక్‌కు సారథ్యం వహించాడు. అయితే షోయబ్ ప్రస్తుతం ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. -
ధోని కెప్టెన్సీ వదులుకుంటున్నాడా...?