![నా కెప్టెన్సీలో వారు సహకరించలేదు! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81472499944_625x300.jpg.webp?itok=igTEyQ4-)
నా కెప్టెన్సీలో వారు సహకరించలేదు!
శ్రీలంక జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన పది నెలల కాలంలో సీనియర్ ఆటగాళ్లనుంచి తనకు తగిన సహకారం లభించలేదని తిలకరత్నే దిల్షాన్ వ్యాఖ్యానించాడు. తాను లార్డ్స్‌లో అద్భుత ఇన్నింగ్‌స ఆడిన తర్వాత వేలికి గాయమైందని, ఆ సమయంలో బాధ్యత తీసుకునేందుకు జయవర్ధనే, సంగక్కర నిరాకరించారని అతను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత కెప్టెన్ మాథ్యూస్ అయితే తన కెప్టెన్సీ సమయంలో గాయం సాకుతో చాలా తక్కువ సార్లు మాత్రమే బౌలింగ్ చేయడం ఫలితాలపై ప్రభావం చూపించిందని దిల్షాన్ విమర్శించాడు. తనను కెప్టెన్సీనుంచి తొలగించిన తీరుతో కలత చెందినా... ఆ ప్రభావం కనపడకుండా బాగా ఆడానని అతను అన్నాడు.