'ఆ షాట్ ఆడేందుకు ఎప్పుడూ భయపడను' | my son has started playing Dilscoop better than me | Sakshi
Sakshi News home page

'ఆ షాట్ ఆడేందుకు ఎప్పుడూ భయపడను'

Published Wed, Mar 9 2016 7:16 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

'ఆ షాట్ ఆడేందుకు ఎప్పుడూ భయపడను'

'ఆ షాట్ ఆడేందుకు ఎప్పుడూ భయపడను'

ముంబై:  ఫెవరెట్ షాట్ దిల్ స్కూప్ ను తనకంటే చాలా బాగా తన కుమారుడు ఆడగలడని శ్రీలంక వెటరన్ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ వ్యాఖ్యానించాడు. తాను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని... దిల్ స్కూప్ ఆడేందుకు భయపడేది లేదని పేర్కొన్నాడు.  తమ జట్టు ఓడిపోయిన ప్రతిసారీ జట్టు చెప్పే సాకులపై దిల్షాన్ మండిపడ్డాడు. దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే రిటైరవ్వడం తమకు ప్రతికూలంగా మారుతుందని తమ జట్టు ఆటగాళ్లు చెప్పడం తగదని సూచించాడు. లంక జట్టులో యువరక్తం ఉరకలెత్తుతుందన్నాడు.

 

సిరీస్, ఏదైనా పెద్ద మ్యాచ్ ఓడితే ఆ ఆటగాళ్లను ఇందులోకి లాగడం మంచిది కాదంటున్నాడు. గతంలోనూ విధ్వంసక ఆటగాడు సనత్ జయసూర్య, అరవింద డి సిల్వా రిటైర్మెంట్ తర్వాత లంక త్వరగా మెరుగు పడిందని గుర్తుచేశాడు. తన ఫామ్ పై అనుమానాలు అక్కర్లేదని, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని విధ్వంసక బ్యాట్స్ మన్ దిల్షాన్ చెప్పాడు. యువ ఆటగాళ్లు శ్రీలంక జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని, వారు అద్భుతాన్ని చేస్తారని అభిప్రాయపడ్డాడు. ఎలాగైనా సరే కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే లేని లోటును యువ ఆటగాళ్లు తీర్చాలని కొత్త ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement