Tillakaratne Dilshan
-
లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
రెండు మనుసుల కలయికతో.. ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే ఆ బంధం నాలుగుకాలాల పాటు వర్ధిల్లుతుంది. భాగస్వాములలో ఏ ఒక్కరు పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ‘మూడో వ్యక్తి’ని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించిన పార్ట్నర్ను మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నె దిల్షాన్, ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే, దిల్షాన్ తమ భార్యలు.. తమతో బంధంలో కొనసాగుతూనే.. తమ స్నేహితులతోనే అనుబంధం పెనవేసుకోవడం భరించలేకపోయారు. వారితో బంధానికి వీడ్కోలు పలికి కొత్త జీవితం మొదలుపెట్టి ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా గడుపుతున్నారు. వారి జీవితాల్లో ఏం జరిగిందంటే.. స్నేహం ముసుగులో వెన్నుపోటు చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు దినేశ్ కార్తిక్. డీకే సహచర క్రికెటర్, ఫ్రెండ్ అయిన మురళీ విజయ్‌తో బంధం కొనసాగించింది. వారిద్దరి రహస్య రిలేషన్షిప్ తెలుసుకున్న దినేశ్ గుండె ముక్కలైంది. దీంతో 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో నికిత ఎంచక్కా మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మరోవైపు.. స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ రూపంలో రెండోసారి ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ప్రస్తుతం కవలలు(ఇద్దరు కుమారులు) సంతానం. దిల్షాన్ది ఇంచుమించు ఇదే పరిస్థితి లంక లెజండరీ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ నిలంక వితంగే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె దిల్షాన్ ఓపెనింగ్ పార్ట్నర్ ఉపుల్ తరంగతో అనుబంధం పెంచుకుందట. ఈ క్రమంలో దిల్షాన్‌తో విడాకులు తీసుకున్న నిలంక.. ఆ తర్వాత ఉపుల్ను పెళ్లాడింది. నిజానికి నిలంక, ఉపుల్ మధ్య అతి చనువే దిల్షాన్‌తో ఆమె విడిపోవడానికి కారణమని గతంలో వార్తలు వచ్చాయి. భార్య మంజులతో దిల్షాన్ ఇక నిలంక- దిల్షాన్లకు ఒక కుమారుడు సంతానం కాగా.. భరణం, కుమారుడి సంరక్షణ కోసం నిలంక.. దిల్షాన్‌ను కోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పురాగా అతడు కొడుకుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నటి మంజుల థిలినిని పెళ్లాడిన దిల్షాన్‌కు మరో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. బ్రెట్ లీ మాజీ భార్య సైతం ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా భార్యా బాధితుడే అంటారు. ఆటతో బిజీగా ఉండే లీతో తన జీవితం సంతోషంగా లేదని భావించిన అతడి భార్య.. రగ్బీ ప్లేయర్‌ను పెళ్లాడినట్లు సిడ్నీ హెరాల్డ్ గతంలో వెల్లడించింది. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు! -
తరంగ విధ్వంసం.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్ నిలిచింది. దోహా వేదికగా జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో ఆసియా లయన్స్ చిత్తు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్.. కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా బ్యాటర్లలో ఓపెనర్లు ఉపుల్ తరంగ(28 బంతుల్లో 57 పరుగులు), తిలకరత్నే దిల్షాన్(58) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. తరంగ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం మిస్బా-ఉల్-హక్(9), మహమ్మద్ హఫీజ్(9) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. వరల్డ్ జెయింట్స్ బ్యాటర్లలో జాక్వెస్ కల్లిస్(54 బంతుల్లో 78 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రాస్ టేలర్(32) పరుగులతో రాణించాడు. ఆసియా బౌలర్లలో స్పిన్నర్ రజాక్ రెండు వికెట్లు సాధించగా.. పెరీరా ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: Indian Wells: ‘నంబర్‌వన్’ అల్కరాజ్.. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సొంతం -
IND VS SA: ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 30) జరుగుతున్న కీలక సమరంలో టీమిండియా కెప్టెన రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ వ్యక్తిగతంగా విఫలమైనా వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో 36వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్.. ఈ మెగా ఈవెంట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ పేరిట ఉండేది. తిలకరత్నే టీ20 వరల్డ్‌కప్‌ల్లో మొత్తం 35 మ్యాచ్‌లు ఆడగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ అతని రికార్డును అధిగమించాడు. 2007 నుంచి వరుసగా ఎనిమిది వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొన్న రోహిత్.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్‌తో కలిసి ఈ అరుదైన ఘనతను సంయుక్తంగా పంచుకున్నాడు. ఇక పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో రోహిత్, దిల్షన్ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (34), డ్వేన్ బ్రావో (34), షాహిద్ అఫ్రిది (34), డేవిడ్ వార్నర్ (32) ఉన్నారు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సహా టాపార్డర్ మొత్తం విఫలం కావడంతో టీమిండియా 49 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, సూర్యకుమార్ మరోసారి ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. మెరుపు అర్ధశతకంతో (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 68 పరుగులు) టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. సూర్యకుమార్ మినహా జట్టు మొత్తం దారుణంగా విఫలమైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్ 3, నోర్జే ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అర్షదీప్ బౌలింగ్‌లో డికాక్ (1), రొస్సో (0) ఔటయ్యారు. -
మరీ ఇంత బద్దకమా.. ఒక్క దానితో పోయేది!
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంక లెజెండ్స్ 70 పరుగులతో విజయం సాధించింది. తిలకరత్నే దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.ఈ విషయం పక్కనబెడితే.. బంగ్లాదేశ్ ఫీల్డర్ బద్దకానికి ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బంతి దొరికితే త్రో వేయాల్సింది పోయి అలాగే నిల్చుండిపోవడం జట్టుకు నష్టం చేకూర్చింది. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కేవలం ఒక్క పరుగు రావాల్సిన చోట నాలుగు పరుగులు తీయడం ఆసక్తి కలిగించింది. లంక లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ లెజెండ్స్ బౌలర్ వేసిన బంతిని లంక బ్యాటర్ స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి గాల్లోకి లేచింది. కీపర్ క్యాచ్ అందుకునే క్రమంలో మిస్ అవడంతో అతని కాలికి బంతి తగిలి ముందుకు వెళ్లింది. ఈలోగా అక్కడికి థర్డ్‌మన్ ఫీల్డర్ వచ్చాడు. బంతిని అందుకున్నప్పటికి త్రో వేయలేదు. అప్పటికే లంక లెజెండ్స్ రెండు పరుగులు పూర్తి చేశారు. త్రో వేయకపోవడంతో మూడో పరుగుకు యత్నించారు. ఫీల్డర్ టెన్షన్లో సరిగ్గా త్రో వేయలేకపోయాడు. అలా బంతి మరోసారి మిస్ అయింది. దీంతో లంక బ్యాటర్లు మరో పరుగు పూర్తి చేశారు. అలా ఒక్క పరుగు పోయి నాలుగు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటికే రోడ్‌సేప్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. మొదటి సెమీఫైనల్(సెప్టెంబర్ 28న)లో శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్(సెప్టెంబర్ 29న) పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. Oh they ran four 😃 TM Dilshan & Mahela Udawatte during the legends game vs Bangladesh pic.twitter.com/GQbcOilJ1n — Nibraz Ramzan (@nibraz88cricket) September 28, 2022 చదవండి: సునీల్ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం -
దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. తుషార్ ఇమ్రాన్ 52 పరుగులు చేయగా.. అబుల్ హసన్ 29 పరుగులు చేశాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా లెజెండ్స్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. లంక లెజెండ్స్ బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్ మూడు వికెట్లు తీయగా.. అసేలా గుణరత్నే 2, సనత్ జయసూర్య, దమ్మిక ప్రసాద్‌లు చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక లెజెండ్స్‌కు ఓపెనర్లు ఉదావట్టే 43, సనత్ జయసూర్య 37 పరుగులతో శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ 51 పరుగులతో రాణించగా.. చమర సిల్వా 34 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. బంగ్లా లెజెండ్స్ బౌలర్లలో హొస్సేన్, షరీఫ్, కబీర్, రజాక్, ఎలిస్ సన్నీ తలా ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో అర్థసెంచరీ, బౌలింగ్‌లో మూడు వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ దిల్షాన్‌ను ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఇప్పటికే శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్(సెప్టెంబర్ 28న)లో శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్(సెప్టెంబర్ 29న) పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. చదవండి: 178 పరుగులకే ఆలౌట్.. సిరీస్ క్లీన్‌స్వీప్; సంజూ కెప్టెన్సీ అదరహో -
మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు
తొలిసారి నిర్వహించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ విజేతగా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆసియా లయన్స్ గట్టిపోటీ ఇచ్చినప్పటికి పరాజయం పాలైంది. ఆట సంగతి ఎలా ఉన్నా.. మాజీ క్రికెటర్లంతా ఒక దగ్గరికి చేరి టోర్నీ ఆడడం అభిమానులకు మాత్రం సంతోషాన్ని పంచింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ బౌలర్ మోర్నీ మోర్కెల్ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. 37 ఏళ్ల మోర్కెల్ మంచి ఫాస్ట్ బౌలర్ అన్న సంగతి తెలిసిందే. ప్రొటీస్‌కు క్రికెట్ ఆడిన రోజుల్లో ఎన్నోసార్లు వేగవంతమైన బంతులు విసిరాడు. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లో తిలకరత్నే దిల్షాన్‌కు వేసిన ఒక బంతి గంటకు 138 కిమీవేగంతో వెళ్లింది. మంచి పేస్‌తో.. బౌన్స్‌తో వచ్చిన బంతిని దిల్షాన్ ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే బంతి విసిరిన తర్వాత పట్టుతప్పిన మోర్కెల్ క్రీజులోనే కిందపడ్డాడు. అతను పడ్డ విధానం చూసి గాయమైందనే అనుకున్నారు. కానీ అదృష్టం బాగుండడంతో మోర్కెల్‌కు ఎలాంటి గాయం కాలేదు. ఇదే మ్యాచ్‌లో తన సోదరుడు అల్బీ మోర్కెల్ మూడు వికెట్లతో రాణించాడు. కాగా మోర్నీ మోర్కెల్ దిల్షాన్‌ను తన తర్వాతి ఓవర్లో స్లో డెలివరీ వేసి బోల్తా కొట్టించాడు. pic.twitter.com/RYsGz7ju8t — Sports Hustle (@SportsHustle3) January 29, 2022 -
‘షాన్’ దార్ ఇన్నింగ్స్ ముగిసింది
సాక్షి క్రీడావిభాగం : బ్రాడ్మన్నుంచి సచిన్ దాకా ఎంతో మంది దిగ్గజాలు తమ అద్భుత ఆటతో క్రికెట్‌ను పరిపూర్ణం చేశారు. కానీ తన పేరుతోనే ఒక షాట్‌కు క్రికెట్లో సుస్థిర స్థానం కల్పించడం మాత్రం అసాధారణం. అది తిలకరత్నే దిల్షాన్‌కు మాత్రమే సొంతమైన ఘనత. తలను కాస్త వంచి, ఒక మోకాలుపై కూర్చుంటూ పేసర్ వేసిన గుడ్ లెంగ్త బంతిని సరిగ్గా వికెట్ కీపర్ తల మీదుగా పంపించడం దిల్షాన్‌కే చెల్లింది. 2009 టి20 ప్రపంచకప్‌లో తొలిసారి అతను ఈ షాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతకు ముందే మారిలియర్ ఇలా కొట్టేవాడని కొందరు చెప్పినా... ఇప్పుడు అందరూ ఆడుతున్న స్కూప్‌కు మాత్రం తానే ఆద్యుడినని అతను గర్వంగా చెప్పుకుంటాడు. అందుకే క్రికెట్ ప్రపంచం కూడా దీనిని గుర్తించి ‘దిల్‌స్కూప్’ అని పేరు పెట్టేసింది. బెస్ట్ ఆల్‌రౌండర్ దిల్షాన్ అంటే ఆ ఒక్క షాట్ మాత్రమే కాదు. పరిపూర్ణమైన క్రికెటర్. బ్యాట్స్‌మన్, బౌలర్, అద్భుత ఫీల్డర్, అవసరమైన సమయాన చక్కటి వికెట్ కీపర్... ఇలా అన్ని పాత్రలను సమర్థంగా పోషించిన అతను సుదీర్ఘ కాలం పాటు శ్రీలంక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అరుదైన ఆటగాళ్లలో అతనూ ఒకడు. ఆరంభంలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్స్పిన్నర్గానే అందరికీ తెలిసిన దిల్షాన్ ఓపెనింగ్‌కు మారటంతో ఒక్కసారిగా మారిపోయాడు. దూకుడైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 2009లో మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా అవకాశం వచ్చాక చెలరేగిపోయాడు. ముఖ్యంగా జయసూర్య రిటైర్మెంట్ తర్వాత ఆ లోటు కనిపించకుండా ఆడాడు. కెప్టెన్‌గా ఉంటూ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకై క ఆటగాడు అతనే. జయవర్ధనే, సంగక్కరలతో పోలిస్తే చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకోకపోరుునా, లంక క్రికెట్‌పై దిల్షాన్ తనదైన ముద్ర వేశాడు. కొన్ని మెరుపులు ఇటీవలి వరకు వన్డేల్లో రికార్డుగా ఉన్న 443 పరుగుల మ్యాచ్ (నెదర్లాండ్‌సపై)లో 78 బంతుల్లో 117 నాటౌట్, 2009లో బంగ్లాదేశ్‌తో టెస్టులో రెండు ఇన్నింగ్‌సలలోనూ సెంచరీలు, 2009 టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 57 బంతుల్లో 96 పరుగులు, టెస్టుల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగి (కివీస్‌పై) 72 బంతుల్లో 92 పరుగులు చేయడం, భారత్‌పై రాజ్‌కోట్‌లో 415 పరుగుల లక్షాన్ని అందుకునే ప్రయత్నంలో చేసిన 124 బంతుల్లో 160 పరుగులు, 2011లో లార్డ్స్ టెస్టులో చేతికి గాయంతో పోరాడుతూ చేసిన 193 పరుగుల ఇన్నింగ్స... దిల్షాన్ కెరీర్లో గుర్తుండిపోయే మ్యాచ్‌లు. వీటన్నింటికి తోడు గత వన్డే వరల్డ్ కప్‌లో 140 కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మిషెల్ జాన్సన్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు అలవోకగా కొట్టడం ఎవరు మరచిపోగలరు! -
నా కెప్టెన్సీలో వారు సహకరించలేదు!
శ్రీలంక జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన పది నెలల కాలంలో సీనియర్ ఆటగాళ్లనుంచి తనకు తగిన సహకారం లభించలేదని తిలకరత్నే దిల్షాన్ వ్యాఖ్యానించాడు. తాను లార్డ్స్‌లో అద్భుత ఇన్నింగ్స ఆడిన తర్వాత వేలికి గాయమైందని, ఆ సమయంలో బాధ్యత తీసుకునేందుకు జయవర్ధనే, సంగక్కర నిరాకరించారని అతను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత కెప్టెన్ మాథ్యూస్ అయితే తన కెప్టెన్సీ సమయంలో గాయం సాకుతో చాలా తక్కువ సార్లు మాత్రమే బౌలింగ్ చేయడం ఫలితాలపై ప్రభావం చూపించిందని దిల్షాన్ విమర్శించాడు. తనను కెప్టెన్సీనుంచి తొలగించిన తీరుతో కలత చెందినా... ఆ ప్రభావం కనపడకుండా బాగా ఆడానని అతను అన్నాడు. -
దిల్షాన్ చివరి ఆటలో శ్రీలంక పరాజయం
దంబుల్లా: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ వన్డే కెరీర్‌ను ఓటమితో ముగించేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారమిక్కడ జరిగిన మూడో వన్డేలో లంక రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 49.2 ఓవర్లలో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. చండిమల్ (130 బంతుల్లో 102; 7 ఫోర్లు) శతక్కొట్టాడు. రిటైర్మెంట్ క్రికెటర్ దిల్షాన్ 42 పరుగులు చేశాడు, ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, స్టార్క్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి గెలిచింది. బెయిలీ (99 బంతుల్లో 70; 5 ఫోర్లు), వేడ్ (46) రాణించారు. మిగిలిన వారిలో హెడ్ 36, ఫించ్ 30 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్, అపొన్సో, పెరిరా తలా 2 వికెట్లు తీశారు. బుధవారం నాలుగో వన్డే కూడా ఇక్కడే జరగనుంది. 39 ఏళ్ల దిల్షాన్ 330 వన్డేలు ఆడి 10,290 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి. -
'ఇదే నా చివరి క్రికెట్ సిరీస్'
-
ఆటకు దిల్షాన్ టాటా
ఆస్ట్రేలియాతోనే ఆఖరి వన్డే, టి20లు మూడేళ్ల క్రితమే టెస్టులకు వీడ్కోలు కొలంబో: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఇదివరకే టెస్టు కెరీర్‌కు బైబై చెప్పిన 39 ఏళ్ల లంక బ్యాట్స్‌మన్ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించినట్లు లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తెలిపింది. దంబుల్లాలో ఆస్ట్రేలియాతో ఈ నెల 28న జరిగే మూడే వన్డేనే అతని కెరీర్లో ఆఖరి 50 ఓవర్ల మ్యాచ్. నాలుగు, ఐదు వన్డేలు ఆడడు. అనంతరం వచ్చే నెల 6, 9 తేదీల్లో ఆస్ట్రేలియాతో రెండు టి20మ్యాచ్‌లు జరుగుతాయి. 9న జరిగే రెండో టి20తో దిల్షాన్ 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగియనుంది. 1999లో జింబాబ్వేలో లంక పర్యటనతో అతను టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఆదివారం అతను ఆడే చివరి వన్డే తన కెరీర్లో 330వ మ్యాచ్. ఇప్పటివరకు 302 ఇన్నింగ్స్‌లలో దిల్షాన్ 39.26 సగటుతో 10, 248 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 47 అర్ధసెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 161 నాటౌట్. తన ఆఫ్ బ్రేక్ బౌలింగ్‌తో వన్డేల్లో 106 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక టి20 కెరీర్లో 78 మ్యాచ్‌ల్లో 77 ఇన్నింగ్స్‌లాడిన దిల్షాన్ 28.98 సగటుతో 1884 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 13 అర్ధసెంచరీలు సాధించాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. మూడేళ్ల క్రితం 2013లో టెస్టుల నుంచి తప్పుకున్న ఈ లంక ఓపెనర్ 87 మ్యాచ్‌లాడాడు. 145 ఇన్నింగ్స్‌లో 40.98 సగటుతో 5492 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 193 కాగా మొత్తం 16 సెంచరీలు, 23 అర్ధసెంచరీలు సాధించాడు. -
'ఇదే నా చివరి క్రికెట్ సిరీస్'
కొలంబో:స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ వీడ్కోలు తీసుకోనున్నాడు. ఈ సిరీస్ తరువాత మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు దిల్షాన్ తాజాగా ప్రకటించాడు. ఇప్పటికే సుదీర్ఘ క్రికెట్ ఆడిన తనకు ఆసీస్ సిరీసే చివరదని పేర్కొన్నాడు. 2013లో టెస్టులకు దూరమైన దిల్షాన్.. ఆసీస్‌తో జరుగుతున్న ఐదు వన్డే సిరీస్‌లో సభ్యుడు. అయితే ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో దిల్షాన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి వన్డేలో 22 పరుగులు చేయగా, రెండో వన్డేలో 10 పరుగులు చేశాడు. 1999లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన దిల్షాన్ ఇప్పటివరకూ 329 వన్డేలు ఆడాడు.ఇందులో 22 సెంచరీలు,47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో దిల్షాన్ అత్యధిక స్కోరు 161 కాగా,యావరేజ్ 39. 26, స్ట్రైక్ రేట్ 86.34గా ఉంది. ఇక బౌలింగ్ లో 106 వికెట్లు పడగొట్టాడు. -
'ఆ షాట్ ఆడేందుకు ఎప్పుడూ భయపడను'
ముంబై: ఫెవరెట్ షాట్ దిల్ స్కూప్ ను తనకంటే చాలా బాగా తన కుమారుడు ఆడగలడని శ్రీలంక వెటరన్ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ వ్యాఖ్యానించాడు. తాను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని... దిల్ స్కూప్ ఆడేందుకు భయపడేది లేదని పేర్కొన్నాడు. తమ జట్టు ఓడిపోయిన ప్రతిసారీ జట్టు చెప్పే సాకులపై దిల్షాన్ మండిపడ్డాడు. దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే రిటైరవ్వడం తమకు ప్రతికూలంగా మారుతుందని తమ జట్టు ఆటగాళ్లు చెప్పడం తగదని సూచించాడు. లంక జట్టులో యువరక్తం ఉరకలెత్తుతుందన్నాడు. సిరీస్, ఏదైనా పెద్ద మ్యాచ్ ఓడితే ఆ ఆటగాళ్లను ఇందులోకి లాగడం మంచిది కాదంటున్నాడు. గతంలోనూ విధ్వంసక ఆటగాడు సనత్ జయసూర్య, అరవింద డి సిల్వా రిటైర్మెంట్ తర్వాత లంక త్వరగా మెరుగు పడిందని గుర్తుచేశాడు. తన ఫామ్ పై అనుమానాలు అక్కర్లేదని, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని విధ్వంసక బ్యాట్స్ మన్ దిల్షాన్ చెప్పాడు. యువ ఆటగాళ్లు శ్రీలంక జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని, వారు అద్భుతాన్ని చేస్తారని అభిప్రాయపడ్డాడు. ఎలాగైనా సరే కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే లేని లోటును యువ ఆటగాళ్లు తీర్చాలని కొత్త ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపాడు. -
శ్రీవారి సేవలో దిల్షాన్...
సాక్షి,తిరుమల: శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత దిల్షాన్ ఆలయానికి వచ్చారు. -
టెస్టులకు దిల్షాన్ గుడ్‌బై
కొలంబో: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ‘జింబాబ్వేతో టెస్టు సిరీస్ తర్వాత టెస్టులకు వీడ్కోలు చెబుదామనుకున్నాను. కానీ ఆ సిరీస్ వాయిదా పడింది. నా స్థానంలో మరో యువ ఆటగాడిని తయారు చేయడానికి బోర్డుకు అవకాశం ఉండాలనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను’ అని దిల్షాన్ ఒక ప్రకటనలో తెలిపాడు. వన్డేల్లో మాత్రం 2015 ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నాడు. 14 ఏళ్ల టెస్టు కెరీర్లో 87 మ్యాచ్‌ల్లో 5492 పరుగులు చేసిన దిల్షాన్... 39 వికెట్లు కూడా తీశాడు. 16 సెంచరీలు చేశాడు.