Twenty20 worldCup
-
'ఆ షాట్ ఆడేందుకు ఎప్పుడూ భయపడను'
ముంబై: ఫెవరెట్ షాట్ దిల్ స్కూప్ ను తనకంటే చాలా బాగా తన కుమారుడు ఆడగలడని శ్రీలంక వెటరన్ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్ వ్యాఖ్యానించాడు. తాను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని... దిల్ స్కూప్ ఆడేందుకు భయపడేది లేదని పేర్కొన్నాడు. తమ జట్టు ఓడిపోయిన ప్రతిసారీ జట్టు చెప్పే సాకులపై దిల్షాన్ మండిపడ్డాడు. దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే రిటైరవ్వడం తమకు ప్రతికూలంగా మారుతుందని తమ జట్టు ఆటగాళ్లు చెప్పడం తగదని సూచించాడు. లంక జట్టులో యువరక్తం ఉరకలెత్తుతుందన్నాడు. సిరీస్, ఏదైనా పెద్ద మ్యాచ్ ఓడితే ఆ ఆటగాళ్లను ఇందులోకి లాగడం మంచిది కాదంటున్నాడు. గతంలోనూ విధ్వంసక ఆటగాడు సనత్ జయసూర్య, అరవింద డి సిల్వా రిటైర్మెంట్ తర్వాత లంక త్వరగా మెరుగు పడిందని గుర్తుచేశాడు. తన ఫామ్ పై అనుమానాలు అక్కర్లేదని, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని విధ్వంసక బ్యాట్స్ మన్ దిల్షాన్ చెప్పాడు. యువ ఆటగాళ్లు శ్రీలంక జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని, వారు అద్భుతాన్ని చేస్తారని అభిప్రాయపడ్డాడు. ఎలాగైనా సరే కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే లేని లోటును యువ ఆటగాళ్లు తీర్చాలని కొత్త ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపాడు. -
'మా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది'
ముంబై: ఇంగ్లండ్ టీమ్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉందని ఆ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ వ్యాఖ్యానించాడు. జో రూట్, బట్లర్, ఇయాన్ మోర్గాన్, స్టోక్స్, హేల్స్ లతో కూడిన తమ బ్యాటింగ్ ఆర్డర్ మరింత ధృఢంగా తయారైందని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మరో విదేశీ క్రికెటర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. తనకు కూడా ఐపీఎల్ టోర్నీలో ఆడాలని ఉందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ పేర్కొన్నాడు. కొద్దిరోజుల్లో ఐసీపీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో నేడు మొయిన్ అలీ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భారత బౌలర్లపై ప్రశంసలు ఏదో ఓ రోజు తాను తప్పకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలోని ఓ జట్టులో సభ్యుడిని అవుతానని చెప్పాడు. ఐపీఎల్ ఆడితే టాప్ స్పిన్నర్స్, ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకునే అవకాశం దొరికి తన ఆటతీరు మెరుగు చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. తమ జట్టు ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక జట్లతో కలిసి గ్రూప్-1 లో ఉందన్నాడు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బంతులు వేయడంలో చాలా వైవిధ్యం చూపిస్తారని వారిని ప్రశంసించాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో వారిద్దరూ భారత జట్టుకు ఎంతో ప్రయోజనమని మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు.